ఎల్పీజీ సబ్సిడీ వదులుకున్న వారు కోటి
న్యూఢిల్లీ: వంట గ్యాస్ సబ్సిడీ వదులుకున్న వినియోగదారుల సంఖ్య కోటి దాటిందని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. వంట చెరకుపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వం కొత్త గ్యాస్ కనెక్షన్ ఇచ్చే వెసులబాటు కలుగుతుంది.
ప్రస్తుతం మొత్తం 15.34 కోట్ల కనెక్షన్లకు సబ్సిడీ అందిస్తున్నారు. స్తోమత కలిగిన వారు సబ్సిడీని స్వచ్ఛందంగా విరమించుకోవాలని ప్రధాని మోదీ పోయిన ఏడాది మార్చి 27న పిలుపిచ్చిన సంగతి తెలిసిందే.