బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలోని భూభాగాలను తాము వదులుకోబోమని, అదేసమయంలో అంతర్జాతీయంగా కల్లోల పరిస్థితులను సృష్టించే ఉద్దేశం తమకు లేదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చైనాలో ఉన్న అమెరికా రక్షణ మంత్రి మాటిస్‌తో జిన్‌పింగ్ సమావేశమయ్యారు. దక్షిణ చైనా సముద్రంలో ఆగ్నేయాసియా దేశాల సమీపంలోని చిన్న దీవులను ఆక్రమించడం, వాటిలో ఆధునిక ఆయుధ సంపత్తిని మోహరించడాన్ని భేటీ సందర్భంగా జిన్‌పింగ్ సమర్ధించుకున్నారు. ‘మేం పటిష్ట సామ్యవాద దేశాన్ని నిర్మించుకోవాల్సి ఉంది. శాంతి పూర్వక అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. వలస, విస్తరణ వాదాలను కోరుకోవటం లేదు. అంతర్జాతీయంగా అలజడులను సృష్టించాలనుకోవటం లేద. పూర్వీకులు మాకిచ్చిన భూభాగాలపై మాకు హక్కుంది. ఆ భూభాగాల్లో ఒక్క అంగుళం కూడా వదలం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment