Legal Drinking Age Around The World హర్యానా: రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ చట్టాన్ని తాజాగా సవరించింది. తాజా చట్ట సవరణ ప్రకారం మద్యపానం చేయడానికి, కొనడానికి కనీస వయస్సును 25 నుంచి 21కి తగ్గించింది. ఈ మేరకు డిసెంబర్ 22 (బుధవారం)న విధానసభలో వయోపరిమితి మార్పు సవరణ బిల్లుకు ఆమోదం పొందింది. అర్ధాంతరంగా వయసును తగ్గండానికి గల కారణాలను వివరిస్తూ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమల్లో ఉన్న పరిమితులను ఉదాహరించింది. ఆ వివరాలు ఇలా..
ఐఏఆర్డీ 2020 సేకరించిన సమాచారం మేరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లీగల్ డ్రింకింగ్ ఏజ్ ఈ విధంగా ఉంది..
►ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కువైట్, లిబియా ఆల్కహాల్, సౌదీ అరేబియా అమ్మడం, కొనడం, వాడటం ఇక్కడ పూర్తిగా నిషేధం.
►ఆస్ట్రేలియా: 18 ఏళ్లు నిండిన వారు మద్యం కొనుగోలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పెద్దలతో కలిసి మద్యం సేవించడానికి ఇక్కడ అనుమతి ఉంటుంది.
►బంగ్లాదేశ్: నార్కొటిక్స్ కంట్రోల్ శాఖ అనుమతి ఉంటే తప్ప, అన్ని వయసుల వారు మద్యపానం చేయడం నిషేధమిక్కడ. కేవలం ముస్లీంలు మాత్రమే వైద్య కారణాల రిత్యా మద్యం సేవిస్తారు.
►కెనడా: పెద్దల పర్యవేక్షణలో మైనర్లు మద్యంపానం చేయడానికి అనుమతి ఉంటుంది.
►ఈజిప్టు: 18 ఏళ్లు, ఆపై వయసువారు ఎవరైనా మద్యం అమ్మవచ్చు, కొనొచ్చు, తాగొచ్చు.
చదవండి: వీడి దుంపదెగా! ఎంత చలి పుడితేమాత్రం ఇన్ని సెగలా?
►జర్మనీ: 16 ఏళ్లవారు బీరు, వైన్, 18 ఏళ్లవారు స్పరిట్స్ సేవించడానికి అనుమతి ఉంటుంది. ఐతే బార్‌లు, నైట్‌క్లబ్బుల్లో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారికి అనుమతి లేదు.
►మలేషియా: ముస్లింలకు మద్యం అమ్మడం నిషేధం. ముస్లిమేతరులకు మద్యం అమ్మకానికి చట్టపరమైన వయస్సు 21 సంవత్సరాలు.
►శ్రీలంక: 21 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది.
►యూఏఈ: షార్జాలో మద్యపానం నిషేధించబడింది. ఇతర ప్రదేశాల్లోనైతే వయోపరిమితి 21 సంవత్సరాలు.
►అమెరికా: ఆల్కహాల్ సేవించడానికి చట్టపరమైన వయస్సు 21 సంవత్సరాలు.
►యూకే: 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్లు పెద్దలతో కలిసి మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది. ఐతే కొనుగోలు చేయడం చట్ట విరుద్దం.
మనదేశంలోనైతే ఇలా..
►గోవా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, సిక్కిం, పుదుచ్చేరిలలో మద్యం కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు.
►బీహార్, గుజరాత్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ మరియు లక్షద్వీప్‌లతో సహా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి.
►ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, జమ్మూ అండ్ కశ్మీర్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒరిస్సా (ఒడిశా), రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో 21 సంవత్సరాలు, హర్యానా, మేఘాలయ, పంజాబ్, ఢిల్లీలో 25గా ఉంది. ఐతే ప్రస్తుత చట్ట సవరణ బిల్లు ద్వారా అది 21 సంవత్సరాలుగా మార్చబడింది.
కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో మద్యపాన దుఖాణాలు, పార్టీలపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!!
Comments
Please login to add a commentAdd a comment