Vidhan Sabha
-
కర్ణాటక: విధాన సభను గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఎందుకంటే!
బెంగళూరు: కర్ణాటక ప్రజలు అధికార బీజేపీకి షాక్కిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు విధాన సౌధ ప్రాంగణాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారు. బీజేపీ అవినీతి పాలన అంతమైంది కాబట్టే తాము ఈ కార్యక్రమం చేపట్టామని కార్యకర్తలు తెలిపారు. విధాన సభను శుద్ది చేయాల్సిన అవసరం ఉంది ఇదిలా ఉండగా కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ గతంలో విధానసౌధ (అసెంబ్లీ)ని గోమూత్రంతో శుభ్రపరచాల్సి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ హయాంలో అవినీతితో అసెంబ్లీ కలుషితమైందని శివకుమార్ ఆరోపిస్తూ.. శుద్ధి చేసేందుకు తన వద్ద ఆవు మూత్రం కూడా ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, పలు స్కామ్‌ల వివరాలతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో వీటిని హైలైట్ చేసింది. వీటితో పాటు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, కాంగ్రెస్ అధికార బీజేపీ ప్రభుత్వం చేసిన వివిధ ‘స్కామ్‌లను’ ఎత్తి చూపుతూ ద్విభాషా ‘అవినీతి రేటు కార్డు’ను రూపొందించింది. ‘అవినీతి రేటు కార్డు’ను ఇంగ్లీషు, కన్నడ భాషల్లో విడుదల చేసింది. ‘అవినీతి కార్డులో సీఎం ఖరీదు రూ.2,500 కోట్లు, మంత్రి పదవి ఖరీదు రూ.500 కోట్లకు బేరం పెట్టినట్లు కాంగ్రెస్ విమర్శించడంతో పాటు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదని ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వమని.. ఇక కాంట్రాక్టులకు 40 శాతం, కొవిడ్-19 సరఫరాలకు 75 శాతం వరకూ బీజేపీ నేతలు కమీషన్లు వసూలు చేశారని విమర్శలు గుప్పించింది. చదవండి: అందుకే రద్దు.. మళ్లీ చలామణిలోకి రూ.1000 నోట్లు? ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ -
మద్యం తాగే వయసు 21 ఏళ్లకు కుదింపు! ఆ రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధం..
Legal Drinking Age Around The World హర్యానా: రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ చట్టాన్ని తాజాగా సవరించింది. తాజా చట్ట సవరణ ప్రకారం మద్యపానం చేయడానికి, కొనడానికి కనీస వయస్సును 25 నుంచి 21కి తగ్గించింది. ఈ మేరకు డిసెంబర్ 22 (బుధవారం)న విధానసభలో వయోపరిమితి మార్పు సవరణ బిల్లుకు ఆమోదం పొందింది. అర్ధాంతరంగా వయసును తగ్గండానికి గల కారణాలను వివరిస్తూ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమల్లో ఉన్న పరిమితులను ఉదాహరించింది. ఆ వివరాలు ఇలా.. ఐఏఆర్డీ 2020 సేకరించిన సమాచారం మేరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లీగల్ డ్రింకింగ్ ఏజ్ ఈ విధంగా ఉంది.. ►ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కువైట్, లిబియా ఆల్కహాల్, సౌదీ అరేబియా అమ్మడం, కొనడం, వాడటం ఇక్కడ పూర్తిగా నిషేధం. ►ఆస్ట్రేలియా: 18 ఏళ్లు నిండిన వారు మద్యం కొనుగోలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పెద్దలతో కలిసి మద్యం సేవించడానికి ఇక్కడ అనుమతి ఉంటుంది. ►బంగ్లాదేశ్: నార్కొటిక్స్ కంట్రోల్ శాఖ అనుమతి ఉంటే తప్ప, అన్ని వయసుల వారు మద్యపానం చేయడం నిషేధమిక్కడ. కేవలం ముస్లీంలు మాత్రమే వైద్య కారణాల రిత్యా మద్యం సేవిస్తారు. ►కెనడా: పెద్దల పర్యవేక్షణలో మైనర్లు మద్యంపానం చేయడానికి అనుమతి ఉంటుంది. ►ఈజిప్టు: 18 ఏళ్లు, ఆపై వయసువారు ఎవరైనా మద్యం అమ్మవచ్చు, కొనొచ్చు, తాగొచ్చు. చదవండి: వీడి దుంపదెగా! ఎంత చలి పుడితేమాత్రం ఇన్ని సెగలా? ►జర్మనీ: 16 ఏళ్లవారు బీరు, వైన్, 18 ఏళ్లవారు స్పరిట్స్ సేవించడానికి అనుమతి ఉంటుంది. ఐతే బార్లు, నైట్‌క్లబ్బుల్లో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారికి అనుమతి లేదు. ►మలేషియా: ముస్లింలకు మద్యం అమ్మడం నిషేధం. ముస్లిమేతరులకు మద్యం అమ్మకానికి చట్టపరమైన వయస్సు 21 సంవత్సరాలు. ►శ్రీలంక: 21 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది. ►యూఏఈ: షార్జాలో మద్యపానం నిషేధించబడింది. ఇతర ప్రదేశాల్లోనైతే వయోపరిమితి 21 సంవత్సరాలు. ►అమెరికా: ఆల్కహాల్ సేవించడానికి చట్టపరమైన వయస్సు 21 సంవత్సరాలు. ►యూకే: 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్లు పెద్దలతో కలిసి మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది. ఐతే కొనుగోలు చేయడం చట్ట విరుద్దం. మనదేశంలోనైతే ఇలా.. ►గోవా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, సిక్కిం, పుదుచ్చేరిలలో మద్యం కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. ►బీహార్, గుజరాత్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ మరియు లక్షద్వీప్‌లతో సహా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. ►ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, జమ్మూ అండ్ కశ్మీర్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒరిస్సా (ఒడిశా), రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో 21 సంవత్సరాలు, హర్యానా, మేఘాలయ, పంజాబ్, ఢిల్లీలో 25గా ఉంది. ఐతే ప్రస్తుత చట్ట సవరణ బిల్లు ద్వారా అది 21 సంవత్సరాలుగా మార్చబడింది. కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో మద్యపాన దుఖాణాలు, పార్టీలపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!! -
‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి వ్యాప్తి దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందనుకున్న కోవిడ్.. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ పంజా విసురుతోంది. 54 ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర దేశంలోనే రెండో స్థానంలో ఉంది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పది మందికి కోవిడ్ నిర్ధారణ అవ్వడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానునున్నాయి. ఈ క్రమంలో సమావేశాలకు ముందు దాదాపు 3,500 మందికి ఆర్టీపీసీఆర్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి: ఒమిక్రాన్ అప్డేట్స్.. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు.. వీరిలో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ సోకిన వారిలో ఎనిమిది మంది పోలీసులతోపాటు ఇద్దరు అసెంబ్లీ సిబ్బంది ఉన్నారు. అయితే ఏ జర్నలిస్ట్ గానీ, ఎమ్మెల్యేల గానీ కోవిడ్ బారిన పడలేదు. కాగా పది కరోనా కేసులు వెలుగుచూడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత పటిష్టంగా వైద్య పరీక్షలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాటు చేయనున్నారు. చదవండి: ఎన్నికల సంస్కరణలకు రాజ్యసభలోనూ ఆమోదం స్పీకర్ రేసులో సంగ్రామ్ థోపటే మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత నానా పటోలే అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి స్పీకర్ స్థానం ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మహావికాస్ ఆఘాడి కూటమి ఒప్పందంలో భాగంగా స్పీకర్ పదవిని కాంగ్రెస్‌కే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ పార్టీ నేత, భోర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంగ్రామ్ థోపటే స్పీకర్ రేసులో ఉన్నారు. మరోవైపు, నిన్న మొన్నటి వరకు స్పీకర్ ఎన్నిక గురించి నోరు విప్పని బీజేపీ.. ఇప్పుడు తమ అభ్యర్థిని కూడా స్పీకర్ ఎన్నిక బరిలో దింపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ప్రకటన చేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే, రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది ఎమ్మెల్యేలుండగా, అందులో మహావికాస్ ఆఘాడి కూటమికి చెందినవారు 170 మంది ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు 106 మంది ఉన్నారు. ఈ క్రమంలో సంఖ్యా బలం దృష్ట్యా చూస్తే స్పీకర్ పదవి మహావికాస్ ఆఘాడి కూటమికి చెందిన అభ్యర్థికే దక్కే అవకాశమే కనిపిస్తోంది. -
‘మహా’ స్పీకర్ ఎన్నిక నుంచి తప్పుకున్న బీజేపీ
ముంబై: మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవికి బీజేపీ అభ్యర్థి కిషన్ కథోర్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా కథోర్‌ను నామినేట్ చేశామని.. అయితే స్పీకర్ ఎన్నికలో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకూడదనే సంప్రదాయాన్ని పాటిస్తూ తమ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. అధికార పార్టీ సభ్యులు తమను పోటీ నుంచి విరమించుకోవాలని, స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించాలని కోరారని ఆయన అన్నారు. దీనిపై తాము సానుకూలంగా స్పందించామని ఆయన చెప్పారు. దీంతో ఈ ఉదయం సమావేశమైన అసెంబ్లీలో, ప్రోటెమ్ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్, నానా పటోలే ఎన్నిక ఏకగ్రీవమైందని ప్రకటించారు. కాగా.. విదర్భ ప్రాంతం నుంచి వచ్చిన నానా పటోలే, మోదీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన తొలి నేతల్లో ఒకరు. ఆయన కాంగ్రెస్ లో చేరి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై పోటీ చేసి ఓడిపోయారు. ఆపై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి, ఇప్పుడు స్పీకర్ గా మారారు. చదవండి: తల్లిదండ్రులను గుర్తు చేసుకోవడం నేరమా: ఉద్ధవ్ రాజ్యాంగ ఉల్లంఘనే: బీజేపీ అంతకుముందు అసెంబ్లీలో సంభవించిన పరిణామాలు రాజ్యాంగ విరుద్ధమంటూ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన కాళిదాస్ కొలాంబ్కర్ స్థానంలో ఎన్సీపీ నేత దిలీప్ వల్సే పాటిల్‌ను నియమించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరం తెలిపారు. అసెంబ్లీలో బలాబలాలు.. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యుల్లో అతిపెద్ద పార్టీ బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యుల బలముంది. నవంబర్ 28వ తేదీన శివాజీ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎంగా ఉద్ధవ్, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. చదవండి: మహా బలపరీక్ష: అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్ -
విధానసౌధలో బీజేపీ ఆందోళన
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు బుధవారం రంగంలోకి దిగారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు విధానసౌధ(అసెంబ్లీ) ముందు ఆందోళనకు దిగారు. గాంధీజీ విగ్రహం ముందు బైఠాయించిన నేతలు, కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాలని నినాదాలు ఇచ్చారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బుధవారం నాటికి 16 మంది కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో వాటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. దీంతో అన్ని అంశాలను పరిశీలించాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ జవాబిచ్చారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ నిర్ణయం తీసుకున్నా, బలపరీక్షకు ఆదేశించినా బీజేపీ శిరసావహిస్తుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ 9 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో వీరంతా గురువారం మరోసారి రాజీనామాలను సమర్పించారు. మెజారిటీ కోల్పోయారు: యడ్యూరప్ప ‘ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఆలస్యం చేయకుండా ఆమోదిస్తే జూలై 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు కూడా జరగవు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముంది. కాబట్టి సీఎం కుమారస్వామి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని తన పదవికి రాజీనామా చేస్తే మంచిది’ అని యడ్యూరప్ప హితవు పలికారు. మరోవైపు స్పీకర్ రమేశ్ కుమార్‌తో బుధవారం సమావేశమైన బీజేపీ ప్రతినిధి బృందం.. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి తాజాగా ఇద్దరు కాంగ్రెస్ నేతలు షాకిచ్చారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి నాగరాజ్, ఎమ్మెల్యే సుధాకర్‌లు బుధవారం స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో అధికార కూటమి నుంచి రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్య 16(13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు)కు చేరుకుంది. రాజీనామా చేసేందుకు స్పీకర్ ఆఫీస్‌కు వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్‌ను కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నిర్బంధించారు. విధానసౌధ మూడో అంతస్తులో మంత్రి కేజే జార్జ్ కార్యాలయంలోకి సుధాకర్‌ను లాకెళ్లి కూర్చోబెట్టారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న సిద్దరామయ్య మంత్రి పదవి ఇస్తామనీ, రాజీనామా చేయవద్దని కోరారు. అయితే తనకు నమ్మకం పోయిందనీ, రాజీనామా చేస్తున్నానని సుధాకర్ స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. మరోవైపు సుధాకర్ భార్య వజూభాయ్‌వాలాకు ఫోన్ చేయడంతో వెంటనే ఎమ్మెల్యేలను తన దగ్గరకు తీసుకురావాలని నగర కమిషనర్‌ను గవర్నర్ ఆదేశించారు. దీంతో కమిషనర్ స్వయంగా ఎమ్మెల్యేను రాజ్‌భవన్‌కు తీసుకురావడంతో వ్యవహారం సద్దుమణిగింది. అన్ని హద్దులు దాటేశారు: కుమారస్వామి బీజేపీ అన్ని చట్టాల ఉల్లంఘన విషయంలో అన్ని హద్దులు దాటేసిందని కుమారస్వామి విమర్శించారు. బీజేపీ రాజకీయం చేస్తోందా? లేక వక్రబుద్ధి ప్రదర్శిస్తోందా? అని నిలదీశారు. మంత్రి శివకుమార్‌కు రక్షణ కల్పించాల్సిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందన్నారు. -
అప్పుడు మోదీ తరహాలోనే.. ఇప్పుడు యెడ్డీ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి యడ్యూరప్ప విధానసౌధకు వచ్చారు. ఈ సందర్భంగా విధానసౌధలోకి అడుగుపెట్టే సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. విధానసౌధ మెట్లను చేతులతో తాకి.. ప్రమాణం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత 2014 మేలో పార్లమెంటులో అడుగుపెట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఇదే తరహాలో పార్లమెంటు మెట్లకు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటును దేవాలయంగా అభివర్ణిస్తూ.. పార్లమెంటు మెట్లను ఆయన మొక్కారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా విధానసౌధను ‘ప్రజాస్వామ్య దేవాలయం’గా అభివర్ణిస్తూ.. సభ మెట్లను మొక్కారు. -
పోలీస్ స్టేషన్ కు డిగ్గీరాజా
భోపాల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ భోపాల్ పోలీసుల ముందు హాజరుకానున్నారు. మధ్యప్రదేశ్ విధాన సభ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో భాగంగా చేపడుతున్న విచారణలో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన గురువారం పోలీసుల వద్దకు వెళుతున్నారు. జహంగిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. 1993 నుంచి 2003 మధ్యకాలంలో ఈ కుంభకోణం చేసుకుంది. ఆ సమయంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జహంగిరాబాద్ పోలీసులు దిగ్విజయ్ సింగ్‌పై, నాటి స్పీకర్ శ్రీనివాస్ తివారీ, ఇతర వ్యక్తులపై విధాన సభకోసం జరిగిన రిక్రూట్ మెంట్లో మోసం, కుట్ర, నకిలీ, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేసులు నమోదు చేశారు. -
చక్కెర ధరలపై విపక్షం వాకౌట్
సమగ్ర ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ నాగపూర్: చక్కెర ధరలు నానాటికీ పడిపోతుండడంపై ఏకమైన ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. మంగళవారం విధానసభ నుంచి వాకౌట్ చేశాయి. ఇందుకు సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లోనూ సమగ్ర ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే సహకార శాఖ మంత్రి చంద్రకాంత్పాటిల్ ఇచ్చిన సమాధానం అసంతృప్తి చెందిన కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు చంద్రకాంత్పాటిల్ సభనుద్దేశించి మాట్లాడుతూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి తీసుకుపోతానన్నారు. ఆయనతో చర్చిస్తానన్నారు. అంతేకాకుండా త్వరలో అఖిలపక్షంతో కలసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్‌పవార్ మాట్లాడుతూ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ (ఎఫ్ఆర్పీ) విధానం అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని అనేకమంది చక్కెర కర్మాగారం యజమానులు నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. వారిపై క్రిమినల్ అభియోగాలను మోపాలని డిమాండ్ చేశారు. చివరికి రాష్ట్రమంత్రులకు సైతం చక్కెర కర్మాగారాలు ఉన్నాయని, ఈ కర్మాగారాలు కలిగిన వారిలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే, రెవె న్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే, సభాపతి హరిభావ్ బాగ్డే తదితరులు ఉన్నారన్నారు. దీంతో సభలోనే ఉన్న మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే స్పందించారు. ఎఫ్ఆర్పీ కింద రైతాంగానికి చక్కెరకు తగినంత ధర ఇవ్వడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదన్నారు. అయితే ఆ సమయంలో బాగ్డే, ఖడ్సేలు సభలో లేరు. మాజీ స్పీకర్ దిలీప్‌వాల్సే పాటిల్ మాట్లాడుతూ దిగుమతులు, ఎగుమతుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానం వల్లనే చక్కెర రైతాంగానికి గిట్టుబాటు ధర లభించడం లేదని ఆరోపించారు. చక్కెర రైతులు సంక్షోభంలో చిక్కుకుపోయారని, అందువల్ల వారికి అండదండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేకపోతే రుణం తీసుకోవాలని సూచించారు. త్వరలో రెండు ఫొరెన్సిక్ లేబొరేటరీలు నాగపూర్: రాష్ర్టంలో రెండు ప్రాంతీయ ఫొరెన్సిక్ లేబొరేటరీలు ఏర్పాటు కానున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం మంగళవారం విధానసభలో వెల్లడించింది. ఒకటి మరాఠ్వాడాలోని కొల్హాపూర్‌లోనూ, మరొకటి నాందేడ్‌లోనూ ఏర్పాటు చేయనుంది. కొల్హాపూర్‌లో ఏర్పాటయ్యే ఫొరెన్సిక్ లేబొరేటరీ... సాంగ్లి, కొల్హాపూర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు, ఇక నాందేడ్‌లో ఏర్పాటు కానున్న ఫొరెన్సిక్ లేబొరేటరీ పర్భణి, నాందేడ్, హింగోళి, లాతూర్ జిల్లాలకు సేవలందించనుంది. ఫొరెన్సిక్ లేబొరేటరీల ఏర్పాటుకోసం ప్రభుత్వం రూ. 27 కోట్ల మేర నిధులను కేటాయించింది. కొత్తగా వంద మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. నేరాలు జరిగిన సమయంలో ఈ లేబొరేటరీలు శాస్త్రీయ విశ్లేషణ ద్వారా ఆధారాలను సేకరిస్తాయి. న్యాయస్థానాల్లో కేసు విచారణకు వచ్చిన సందర్భంలో ఈ లేబొరేటరీలు అందించే నివేదికలే అత్యంత కీలకం. ఈ ఫొరెన్సిక్ లేబొరేటరీల్లో అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటివల్ల నేరనిర్ధారణ త్వరగా జరుగుతుంది. దీంతో దోషులకు శరవేగంగా శిక్ష పడుతుంది. ప్రస్తుతం ఫొరెన్సిక్ లేబొరేటరీ డెరైక్టరేట్ ముంబైలో ఉంది. దీనికి అనుబంధంగా నాగపూర్, పుణే, ఔరంగాబాద్ , నాసిక్, అమరావతిలలో ఫొరెన్సిక్ లేబొరేటరీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అయితే పెండింగ్‌లో ఉన్న నేరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ప్రభుత్వం కొత్తగా మరో రెండు ప్రాంతీయ ఫొరెన్సిక్ లేబొరేటరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
వచ్చే ఎన్నికల్లో 14-15 స్థానాల్లో పోటీ చేస్తాం
ముంబై : వచ్చే శాసనసభ ఎన్నికల్లో 14 లేదా 15 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో తమ పార్టీకి గుర్తింపు ఉందని, అందువల్ల 12 స్థానాల్లో విజయం సాధించగలమనే ధీమా తమకు ఉందని అన్నారు. 20 స్థానాలను కేటాయించాలంటూ శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమికి ఓ వినతిపత్రం సమర్పించామన్నారు. కనీసం 14 నుంచి 15 స్థానాలను తమకు కేటాయిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. నరేంద్ర మోడీ వంద రోజుల పరిపాలన అద్భుతంగా ఉందన్నారు. గత ప్రభుత్వ పాలన కంటే మోడీ పాలన ఎంతో మెరుగ్గా ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు కేంద్రం శాయశక్తులా కృషి చేస్తోందన్నారు.