తాగిన మైకంలో ఓ పోలీసు కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. పీకాల దాకా మద్యం సేవించి నడిరోడ్డుపై పట్టపగలే హల్‌చల్ చేశాడు. తాను రోడ్డుపై ఉన్న విషయం కూడా తెలియని స్థితిలో షర్ట్, ప్యాంట్ రెండూ తీసేసి.. చుట్టుపక్కల వాళ్లపై విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని పోలీసు స్టేషన్‌లో సుశీల్ మాండవి అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, సుశీల్‌కు మద్యం సేవించే అలవాటు ఉండటంతో ఇప్పటికే పలుమార్లు ఫుల్‌గా మందుకొట్టి పోలీసుల అధికారుల దృష్టిలో పడటంతో వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సుశీల్ శుక్రవారం సాయంత్రం ఫుల్‌గా మద్యం సేవించి నడిరోడ్డుమీద హల్‌చల్ చేశాడు.
తాగిన మైకంలో రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ.. ఒంటిపై ఉన్న పోలీస్ యూనిఫాం తీసేశాడు. షర్ట్, ప్యాంట్ రెండూ తీసేసి, చుట్టుపక్కల వాళ్లపై విసిరేశాడు. ఈ విషయంలో చుట్టుపక్కల వాళ్లు అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. మద్యం మత్తులో వారితోనే వాగ్వాదానికి దిగాడు. కాగా, అక్కడున్న వారు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో సుశీల్‌పై చర్యలకు దిగారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ సుశీల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సుశీల్ మద్యం తాగి వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. కాగా, అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment