Madya pradesh
-
నలుగురిని కంటే రూ.లక్ష బహుమతి: పరశురాం బోర్డు
భోపాల్:మధ్యప్రదేశ్(MadhyaPradesh)లో పరశురామ్ కల్యాణ్ బోర్డు(Parashuram Kalyan Board) ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. తమ సామాజికవర్గాన్ని పెంచుకునేందుకు బ్రాహ్మణులు ఎక్కువ మంది పిల్లలను కనాలిని పిలుపునిచ్చింది. సోమవారం(జనవరి13) జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం లేదని,ఈ మధ్య యువత ఒక బిడ్డతో సరిపెడుతున్నారన్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారిందన్నారు. భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు. అందుకే కనీసం నలుగురు సంతానం ఉండాలని పిలుపునిచ్చారు.నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరఫున రూ.లక్ష నజరానా అందిస్తామని ప్రకటించారు.తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందని రాజోరియా స్పష్టం చేశారు.రాజోరియా చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఇంటి నుంచే కుంభమేళా స్నానం..ఎలాగంటే.. -
అడవిలో ఇన్నోవా కారు.. గోల్డ్ బిస్కెట్స్, కరెన్సీ నోట్లు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఉన్న అటవీ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 40 కోట్ల విలువైన బంగారం, 10 కోట్ల నగదు దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బంగారం దొరికిన కారును గ్వాలియర్‌కు చెందిన చేతన్ గౌర్‌కు చెందినది గుర్తించారు.వివరాల ప్రకారం..భోపాల్ శివారులోని మెండోరి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన ఇన్నోవా వాహనం నుంచి సుమారు రూ.40 కోట్ల విలువైన 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ, ఆ రాష్ట్ర లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గురువారం రాత్రి అధికారులకు సమాచారం అందింది. దీంతో, అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీ ప్రాంతానికి 30 వాహనాల్లో 100 మంది పోలీసులు చేరుకుని ఇన్నోవాను చుట్టుముట్టారు.అనంతరం.. ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో భారీ మొత్తంలో బంగారం, రూ.10కోట్ల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక, వాహనం గ్వాలియర్ వాసి చేతన్ గౌర్‌కు చెందినదిగా గుర్తించారు. చేతన్ గౌర్.. ఆర్టీవో ఆఫీసులో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మకు అత్యంత సన్నిహితుడు. ఇక, ఈ బంగారం, నగదు ఎవరిదనే విషయమై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.#WATCH | Madhya Pradesh | In a joint action by Bhopal Police and Income Tax, 52 kg of gold and bundles of money were found in an abandoned car in Bhopal during an IT raid. The car was found abandoned in the jungle of Mendori in the Ratibad area. Police and Income Tax are trying… pic.twitter.com/7KOoJ4AZBJ— ANI (@ANI) December 20, 2024అయితే, అక్రమ ఆస్తుల కేసుల్లో భోపాల్‌కు చెందిన మాజీ కానిస్టేబుల్ శర్మ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయన ఇళ్లపై అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఈ సోదాల్లో కోటి రూపాయలకు పైగా నగదు, కిలోన్నర బంగారం, వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తుల పత్రాలను అధికారులు గుర్తించారు. ఆయనకు చెందిన 10 లాకర్లు, 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వివరాల పత్రాలను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు రోజులుగా భోపాల్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన వ్యక్తులే టార్గెట్‌గా సోదాలు కొనసాగుతున్నాయి. -
నీ దొంగ ఏడుపు ఆపు.. నన్ను ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నావు కదూ!
నీ దొంగ ఏడుపు ఆపు.. నన్ను ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నావు కదూ! -
స్కూలుకు ఆలస్యంగా వచ్చాడని కొట్టినందుకు.. హెడ్మాస్టర్ను కాల్చి చంపాడు!
ఛతర్పూర్: స్కూలుకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థి(17)ని దండించడమే ఆ హెడ్ మాస్టర్ పాలిట శాపమైంది. పగబట్టిన విద్యార్థి బాత్రూంలోకి వెళ్తున్న హెడ్ మాస్టర్‌ను వెంబడించి వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపాడు. హెడ్ మాస్టర్ ద్విచక్ర వాహనంపై పరారైన అతడిని పోలీసులు పట్టుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా ధమోరా ప్రభుత్వ హయ్యార్ సెకండరీ స్కూల్లో చోటుచేసుకుంది. ధిలాపూర్ గ్రామంలోని ధమోరా స్కూల్లో చదువుకునే ఓ విద్యార్థి తరచూ ఆలస్యంగా క్లాసులకు వస్తుంటాడు. శుక్రవారం కూడా ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయుడు సురేంద్ర కుమార్ సక్సేనా(55) నిందితుడిని, మరో విద్యార్థిని కొట్టారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్కూల్ ఆవరణలోని బాత్ రూంకి వెళ్తుండగా సక్సేనాను నిందితుడు అనుసరించాడు. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీని సక్సేనా తలకు గురిపెట్టి కాల్చాడు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు సక్సేనాకు చెందిన ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. తుపాకీ శబ్దం విని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కి పడ్డారు. ఉపాధ్యాయులు వచ్చి చూడగా సక్సేనా రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యూపీ సరిహద్దులకు సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. హత్యకు వాడిన తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తరచూ స్కూలుకు ఆలస్యంగా వస్తుంటాడని, సరిగ్గా చదువుకునేవాడు కాదని, ఉపాధ్యాయుల మాటలను లక్ష్య పెట్టే వాడు కాదని దర్యాప్తులో తేలింది. ‘అతనొక్కడే కాల్పులు జరిపాడు. అతడొక్కడే నిందితుడనేది స్పష్టమైంది. మరో విద్యార్థి అఘాయిత్యాన్ని ఆపేందుకు మాత్రమే బాత్రూం వద్దకు వచ్చాడు. అనంతరం అతడు ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత అతడు భయంతో ఎటో వెళ్లిపోయాడు. నిందితుడిచ్చిన సమాచారం మేరకు తుపాకీ సమకూర్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నాం’అని ఎస్పీ ఆగమ్ జైన్ చెప్పారు. -
వీడియో: కేంద్రమంత్రి సింధియాకు తప్పిన ప్రమాదం.. పోలీసులకు గాయాలు!
భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు తృటిలో ప్రమాదం తప్పింది. తేనెటీగల దాడి నుంచి సింధియాను భదత్రా సిబ్బంది రక్షించారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న పోలీసులు, పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది. కేంద్ర మంత్రి సింధియా శనివారం శివపురి పర్యటనకు బయలుదేరారు. అక్కడ డ్రెడ్జింగ్ మిషన్‌ను ప్రారంభించేందుకు శివపురిలోని సరస్సు సెయిలింగ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో యంత్రానికి పంతులు పూజలు చేసే క్రమంలో అగర్బత్తిని వెలిగించారు. దీంతో, పొగలు రావడంతో సెయిలింగ్ క్లబ్‌లోని తేనెటీగలు ఒక్కసారిగా లేచి దాడి చేయడం ప్రారంభించాయి.ఈ సమయంలో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సింధియా కష్టం మీద కాపాడారు. సింధియా తలపైకి తేనెటీగలు రావడంతో ఎలాగోలా రక్షించి కారు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చాలా మంది నేతలు, పార్టీ మద్దతుదారులు, పోలీసులపై తేనేటీగలు దాడి చేశాయి. అనంతరం, గాయపడిని వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. #WATCH | Swarm Of Bees Attack Minister Jyotiraditya Scindia In Shivpuri, Several Injured#MadhyaPradesh #MPNews #Jyotiradityascindia pic.twitter.com/Ls23wLa1GU— Free Press Madhya Pradesh (@FreePressMP) November 30, 2024 -
రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి సుమారు 1,814 కోట్ల విలువైన భారీ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటీఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఢిల్లీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్, వాటి తయారికి ఉపయోగించే ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారని గుజరాత్ హోం సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.Kudos to Gujarat ATS and NCB (Ops), Delhi, for a massive win in the fight against drugs!Recently, they raided a factory in Bhopal and seized MD and materials used to manufacture MD, with a staggering total value of ₹1814 crores!This achievement showcases the tireless efforts… pic.twitter.com/BANCZJDSsA— Harsh Sanghavi (@sanghaviharsh) October 6, 2024‘‘డ్రగ్స్‌పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్ , ఎన్సీబీ, ఢిల్లీ అధికారులకు అభినందనలు.వీరు భోపాల్‌లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి, ఎండీ, ఎండీ డ్రగ్స్ తయారీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ రూ. 1814 కోట్లు ఉంటుందని అంచనా. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. సమాజ ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి ప్రయత్నం చాలా కీలకం. చట్టాన్ని అమలు చేసే సంస్థల అంకితభావం నిజంగా అభినందయం. భారతదేశాన్ని సురక్షితమైన, ఆరోగ్యకరమైన దేశంగా మార్చే వారి మిషన్‌కు మద్దతునిస్తూనే ఉందాం’’ అని అన్నారు.చదవండి: ఆపరేషన్ తోడేలు సక్సెస్.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు -
Madhya Pradesh: ఆర్మీ అధికారులపై దుండగుల దాడి.. ఒకరిపై అత్యాచారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి మరో ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా దాడిచేశారు. దోపిడీ చేయడానికి వచ్చిన దుండగులు.. వారిపై దాడి చేసి ఓ మహిళా అధికారిణిపై అత్యాచారం చేసినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ తీసుకుంటున్న అధికారులు మంగళవారం జామ్‌లోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో మహిళలతో కలిసి బయటకు వెళ్లారు. అకస్మాత్తుగా ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులు కర్రలతో వారిని చుట్టుముట్టారు. ట్రైనీ ఆఫీసర్లు, మహిళల డబ్బు, వస్తువులను దోచుకునే ముందు వారిపై దాడి చేశారు. ఒక మహిళను, మరో ఆర్వీ అధికారిని బందీలుగా పట్టుకుని.. మిగతా ఇద్దరు రూ.10 లక్షల ఇవ్వాలని అలాఅయితే వారివద్ద ఉన్న అధికారులను వదిపెడతామని డిమాండ్ చేశారు. ట్రైనింగ్ సెంటర్ వెళ్లిన యువ అధికారులు మోవ్ ఆర్మీ కాలేజీ అధికారులు, పోలీసులకు సమాచారం అధించారు. దీంతో పోలీసులను అప్రమత్తమై.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావటాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన నలుగురినీ వైద్య పరీక్షల నిమిత్తం మోవ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు అధికారులు గాయపడినట్లు డాక్టర్లు తెలిపారు. అదేవిధంగా వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు తెలిసిందని బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.చదవండి: ప్రజ్వల్‌కు చీర చిక్కు -
Madhya pradesh: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్-జబల్పూర్ (సోమనాథ్) ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఎక్స్‌ప్రెస్ ఇండోర్ నుండి జబల్పూర్కు వస్తున్న క్రమంలో జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున 5. 40 గంటలకు జబల్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉండడంతో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.#WATCH | Two coaches of Indore- Jabalpur Overnight Express derailed in Jabalpur, Madhya Pradesh. No casualties/injuries reported. More details awaited pic.twitter.com/A8y0nqoD0r— ANI (@ANI) September 7, 2024 రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులందరినీ హడావుడిగా రైలు ఎక్కించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
వెల్లుల్లి కూరగాయ లేదా సుగంధ ద్రవ్యమా? హైకోర్టు ఏం చెప్పిందంటే..
వెల్లుల్లి మసాలాకు చెందిందా, కూరగాయనా అనే సందేహం ఎప్పుడైనా వచ్చింది. కానీ అది పెద్ద చర్చనీయాంశంగా మారి సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. చివరికి హైకోర్టు తీర్పుతో ఆ న్యాయ పోరాటానికి తెరపడింది. వంటగదికి మసాలాకు చెందిన ఈ వెల్లుల్లి విషయంలో హైకోర్టు ఏం పేర్కొంది?. అసలు ఏం జరిగింది అంటే..భారతీయ వంటకాలలో ప్రధానమైన వెల్లుల్లి మధ్యప్రదేశ్‌లో కూరగాయ? లేదా మసాలాకు చెందిందా? అనే వర్గీకరణపై సుదీర్ఘ న్యాయపోరాటానికి కారణమయ్యింది. ఈ వివాదాన్ని ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు పరిష్కరించింది. ఇది రైతులు, వ్యాపారుల పై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం కారణంగా ఈ వివాదం మొదలయ్యింది. ఇది వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా వర్గీకరించింది. నిర్దిష్ట మార్కెట్లలో దాని అమ్మేలా పరిమితం చేసింది. ఇది రైతులను మరింత సమస్యల్లోకి నెట్టేసింది. వారు వ్యవసాయ మార్కెట్లలో అమ్ముకునే వీలులేక ఇబ్బందులు పడేవారు. దీంతో 2007లో మాంద్‌సౌర్‌కు చెందిన ఒక వెల్లుల్లి వ్యాపారి ఈ వర్గీకరణను సవాలు చేస్తూ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో వెల్లుల్లిని విక్రయించడానికి అనుమతి కోరడం జరిగింది. పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, మండి బోర్డు మొదట్లో వెల్లుల్లి విక్రయానికి కొంత వెసులుబాటు కల్పించింది. ఐతే ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే వెల్లుల్లి విక్రయించాలని మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశించారో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అసంతృప్తి చెందిన వ్యాపారులు హైకోర్టుని ఆశ్రయించగా చివరికి రైతులకు అనుకూలంగా తీర్పునిస్తూ..వెల్లులిని ఏ మార్కెట్లో అయినా విక్రయించేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు డబుల్ బెంచ్ సమర్థించింది, వెల్లుల్లి వ్యవసాయ ఉత్పత్తి హోదాను పునరుద్ఘాటించింది. అయితే, పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ధర్మాసనం దీన్ని తోసిపుచ్చి మరీ వ్యవసాయ లేదా కూరగాయల మార్కెట్లలో వెల్లుల్లిని విక్రయించడానికి రైతులకు వెసులుబాటును మంజూరు చేసింది. అంతలా వివాదం రేకెత్తించిన ఈ వెల్లుల్లితో చేసే వంటకాలేంటో చూద్దామా..వెల్లుల్లి చట్నీఇది ప్రధానంగా వెల్లుల్లి, ఎర్ర మిరపకాయలు, మసాలా దినుసుల మిశ్రమంతో తయారుచేసే ఘాటైన చట్నీ. వెల్లుల్లిని చూర్ణం చేసి, ఆపై మిరపకాయలతో కలిపి పేస్ట్ తయారు చేస్తారు. ఇది తరచుగా చింతపండు, నిమ్మరసం లేదా వెనిగర్‌తో కలిపి పుల్లటి రుచితో ఉంటుంది. ఈ చట్నీని సాధారణంగా పకోరాలు లేదా సమోసాల వంటి స్నాక్స్‌తో పాటుగా వడ్డిస్తారు.వెల్లుల్లి సూప్వెల్లుల్లి సూప్ అనేది ఓదార్పునిచ్చే సువాసనగల వంటకం. దీనిని తరచుగా వెల్లుల్లి రెబ్బలను వివిధ రకాల కూరగాయలు లేదా చికెన్ ఉడకబెట్టిన పులుసుతో మరిగించి తయారు చేస్తారు. రెసిపీని సిద్ధం చేయడానికి, వెల్లుల్లిని ముందుగా వేయించి, ఆపై ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి పదార్థాలతో కలుపుతారు. ఈ వేడెక్కడం సుగంధ సూప్ చల్లని సీజన్లో రోజులో ఏ సమయంలోనైనా ఆస్వాదించడానికి అనువైనది.వెల్లుల్లి ఊరగాయవెల్లుల్లి ఊరగాయ అనేది ఆవాల నూనె, సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో మొత్తం వెల్లుల్లి రెబ్బలను మెరినేట్ చేయడం ద్వారా తయారు చేయబడిన స్పైసీ ఊరగాయ. కొన్నిసార్లు వెనిగర్ లేదా నిమ్మరసం కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి, లవంగాల చూర్ణం కూడా జోడిస్తారు. ఇది అన్నం, రోటీ లేదా పరాఠాల్లో బాగుటుంది. వెల్లుల్లి బ్రెడ్గార్లిక్ బ్రెడ్ అనేది రొట్టెతో కూడిన ఒక ప్రియమైన ఆకలి లేదా సైడ్ డిష్. వెన్న, మెత్తగా తరిగిన వెల్లుల్లి, పార్స్లీ వంటి మూలికల మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో బయట మంచిగా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండేలా బ్రెడ్‌ని కాల్చుతారు. గార్లిక్ బ్రెడ్ సాధారణంగా పాస్తా లేదా సూప్‌లతో వడ్డిస్తారు.(చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!) -
మధ్యప్రదేశ్‌లో కూలిపోయిన ట్రైనీ విమానం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ట్రైనీ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. రెండు సీట్లున్న సెస్నా 152 విమానం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కూలిపోయింది. సుమారు 40 నిమిషాల పాటు గాలిలో ఉన్న విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా కూలిపోయినట్లు గుణ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ దిలీప్ రాజోరియా వెల్లడించారు. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి. గాయపడిన పైలట్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే టెస్టింగ్, నిర్వహణ కోసం కొన్ని రోజుల క్రితం పలు విమానాలు ఇక్కడికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. విమానం కూలిపోవటంపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.#MadhyaPradesh Two pilots injured as trainer aircraft crashes in MP's Guna: Two pilots on board suffered injuries; the plane arrived a few days back for testing and maintenance https://t.co/7StFTBL0bV pic.twitter.com/4rM6CiFFq3— Global Voters (@global_voters) August 11, 2024 -
విషాదం.. దేవాలయంలో గోడకూలి 9 మంది చిన్నారుల మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ దేవాలయం గోడ కూలిన ఘటనలో మృతి చెందిన పిల్లల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఆదివారం ఉదయం సాగర్ జిల్లాలోని షాపూర్ అనే ప్రాంతంలో హర్దౌల్ బాబా (Hardaul Baba) ఆలయంలో మతపరమైన వేడుకలు జరిగే సమయంలో గోడ కూలి తొమ్మిది మంది మరణించారు. శిధిలాల కింద చిక్కుకున్న భక్తుల ప్రాణాలు కాపాడారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ క్షత గాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. Madhya Pradesh | 9 children died after being buried under the debris of a wall in Sagar. Some children are injured, and they are under treatment. All the debris has been removed from the site of the incident: Deepak Arya, Collector, Sagar(Source - DIPR) pic.twitter.com/saKV2RKADv— ANI (@ANI) August 4, 2024దేవాలయంలో జరిగిన ఈ విషాదంపై సమాచారం అందుకున్న సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య సందర్శించారు. గాయపడ్డ బాధితుల్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితులకు వెంటనే వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. -
ఈ వీడియోని చూసి ‘ముఖ్యమంత్రి గారు సిగ్గుతో తలదించుకోండి’
తన పొలంలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళలల్ని బ్రతికుండగానే నడుం లోతు పూడ్చిపెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం (ఎంపీ) రీవా జిల్లాలో దారుణం జరిగింది. ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ అధికార తృణముల్ కాంగ్రెస్ బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.Aayi NDA ki yeh sarkar Laayi mahilaon pe teen guna atyaacharAtrocities against women have become an epidemic under BJP-backed lawlessness.In MP's Rewa, two women were nearly buried alive for opposing road construction. CM @DrMohanYadav51 should hang his head in shame! pic.twitter.com/9vqsmgCwjr— All India Trinamool Congress (@AITCofficial) July 22, 2024 బీజేపీ పాలిత రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. వారికి రక్షణ లేకుండా పోయింది. తన పొలంలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చి పెట్టారు. ఈ వీడియో చూసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సిగ్గుతో తలదించుకోండి అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.మరోవైపు మహిళలపై జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు రీవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. మంగవా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా జోరోట్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు. బాధితులు మమతా పాండే,ఆశా పాండేలు అధికారులు రోడ్డు వేయడాన్ని వ్యతిరేకించారని, దీంతో ఆగ్రహానికి గురైన ట్రక్ డ్రైవర్ పాక్షికంగా ఎర్రటి మట్టితో పూడ్చాడని ఏఎస్పీ వివేక్ లాల్ తెలిపారు.ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ‘రీవా జిల్లాలో మహిళలపై జరిగిన దాడి నా దృష్టికి వచ్చింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల్ని ఆదేశించాం. మహిళలపై దాడి కుటుంబకలహాలే కారణం. అందులో ఓ నిందితుడ్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు’అని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. -
హార్ట్ బ్రేకింగ్ వీడియో: బ్రతికుండగానే మహిళలను మట్టిలో పూడ్చేయత్నం!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బ్రతికుండగానే ఇద్దరు మహిళలను మట్టిలో పూడ్చేసి చంపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కొందరు సదరు మహిళలను రక్షించారు. అయితే, ఈ ఘటనకు భూవివాదమే కారణమని తెలుస్తోంది.వివరాల ప్రకారం.. రేవా జిల్లాలోని హినౌతాలో కొందరు వ్యక్తులు ఓ ట్రక్కులో మట్టిని తీసుకువచ్చి ఇద్దరు మహిళను పూడ్చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే, మన్‌గావా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, రోడ్డు నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ కొందరు మహిళలు నిరసనలకు దిగారు. The result of 20 years of misgovernance by BJP is that goons have flourished in every district. This viral video is from village Mangava in Rewa district of Madhya Pradesh, in which women were forced to commit murder by some goons. And an attempt was made to take his life.… pic.twitter.com/2oF1KnhwI7— Bhopal Congress (@Bhopalinc) July 21, 2024 ఈ సందర్భంగా రోడ్డు వేస్తున్న భూమిని తాము తీజుకు తీసుకున్నామని ఆందోళన చేపట్టారు. వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నేలపై బైఠాయించిన ఇద్దరు మహిళలను పట్టించుకోని ట్రక్కు డ్రైవర్.. అందులోని మట్టిని వారిపై పారపోశాడు. అప్పటికే వాళ్ల నడుము వరకు మట్టి పూడుకుపోయింది. దాంతో అప్రమత్తమైన స్థానికులు వారిద్దరిని రక్షించి, స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను భోపాల్ కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బీజేపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘డిగ్రీలతో ఉపయోగం లేదు.. పంక్చర్ షాప్ తెరవండి’
భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య విద్యార్థులను ఉద్దేశించి విచిత్రమైన వ్యాఖ్యాలు చేశారు. ఆయన సోమవారం గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు చదవటం వల్ల ఏం రాదు.. డబ్బులు సంపాదించాలంటే విద్యార్థులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకొవాలని సూచించారు.‘మేము ఇవాళ పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ప్రారంభించాం. నేను అందరికీ ఒక్కటే మాట చెప్పదల్చుకున్నా.. దానిని మీరు గుర్తు పెట్టుకోండి. కాలేజీలో డిగ్రీలతో ఏం రాదు. దాని బదులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకోండి. కనీసం దాని వల్ల రోజువారిగా డబ్బులు సంపాదించుకోవచ్చు’ అని అన్నారు.डिग्री से कुछ नहीं होने वाला, पंक्चर की दुकान खोल लेना" गुना से BJP विधायक पन्नालाल शाक्य ने कहा #Guna | Pannalal Shakya | #PannalalShakya pic.twitter.com/j3u7w4HvQ7— Deshhit News (@deshhit_news) July 15, 2024 ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని వర్చువల్‌గా ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
భోజ్‌శాల కాంప్లెక్స్: ప్రభుత్వం చేతికి ఏఎస్ఐ రిపోర్టు
భోపాల్: హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల(కమల్ మౌలా మాస్క్) కాంప్లెక్స్‌లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే చేపట్టింది. తాజాగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్టును సోమవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది.సర్వే రిపోర్టు ప్రకారం.. సిల్వర్, కాపర్, అల్యూమినియం, స్టీల్‌తో తయారు చేయబడ్డ 31 నాణేలను గుర్తించారు. ఈ నాణేలు ఇండో-సస్సానియన్ (10-11వ శతాబ్దం), ఢిల్లీ సుల్తానేట్ (13-14వ శతాబ్దం), మాల్వా సుల్తానేట్ (15-16వ శతాబ్దం), మొఘల్ (16-18వ శతాబ్దం), ధార్ రాష్ట్రం (19వ శతాబ్దం), బ్రిటిష్(19-20వ శతాబ్దం)వారికి చెందినవిగా పేర్కొంది. మొత్తం 94 శిల్పాలు, శిల్పాల శకలాలు, నిర్మాణాలు బయటపడినట్లు పేర్కొంది.బయటపడిన ఈ శిల్పాలు బసాల్ట్, పాలరాయి, మృదువైన రాయి, ఇసుకరాయి, సున్నపురాయితో తయారు చేయబడినట్లు తెలిపింది. ఈ శిల్పాలు హిందూ దేవుళ్లు వినాయకుడు, బ్రహ్మ, నరసింహ, భైరవలో పాటు పలు జంతువులు, మానవుల రూపంలో ఉన్నాయి. వాటితో పాటు సింహం, ఎనుగులు, గుర్రాలు, కుక్క, కోతి, పాము, తాబేలు, పక్షులతో కూడిన శిల్పాలను గుర్తించినట్లు తెలియజేసింది. పలు శాసనాలపై సంస్కృతం, ప్రాకృత భాష రాసి ఉన్నట్లు పేర్కొంది. వాటిపై విద్యావ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు జరిగినట్లు సూచిస్తున్నాయి. మరోవైపు.. భోజ్ రాజు హాయాంలో అక్కడి విద్యాకేంద్రం ఉన్నట్లు ఏఎస్ఐ రిపోర్టు సూచిస్తోంది.మార్చి 11న భోపాల్ హైకోర్టు భోజ్‌శాలలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. మధ్య యుగానికి సంబంధించిన భోజ్‌శాల కాంప్లెక్స్ సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు, కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు.ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు పూర్తి సర్వే రిపోర్టును జూలై 15వరకు సమర్పించాలని ఏఎస్ఐని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు జూలై 22కు వాయిదా వేసింది. -
బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి
భోపాల్: దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య బీజేపీ పార్టీలో చేరారు. కాగా, రోహిత్ ఆర్య అనేక కేసుల్లో తీర్పులను వెల్లడించారు. ఆయన ఇచ్చిన తీర్పులపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.వివరాల ప్రకారం.. రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్ర శర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కాగా, పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక, 2013 సెప్టెంబరు 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రోహిత్ ఆర్య నియమితులయ్యారు. 2015 మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన ఆయన అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. జస్టిస్ రోహిత్ ఆర్య వెల్లడించిన కొన్ని తీర్పులు వివాదాస్పదం కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. 2020లో మహిళ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తికి జస్టిస్ రోహిత్ ఆర్య బెయిల్ మంజూరు చేశారు. రక్షా బంధన్ రోజున బాధిత మహిళకు రాఖీ కట్టాలని, ఆమెకు రక్షణ కల్పించేలా నిందితుడు హామీ ఇవ్వాలని షరతు విధించారు. అయితే ఈ తీర్పు వివాదస్పదం కావడంతో సుప్రీంకోర్టు రద్దు చేసింది.అలాగే, 2021లో ఇండోర్‌లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ హాస్యనటులు మునావర్ ఫరూకీ, నలిన్ యాదవ్‌లకు బెయిల్ నిరాకరించారు. అయితే హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఫరూఖీకి బెయిల్ మంజూరు చేసింది. -
‘శివరాజ్ సింగ్ భారీ గెలుపుతో.. ఢిల్లీ మొత్తం తలవంచింది’
భోపాల్: లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రి, కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌పై గెలుపుతో ఢిల్లీ మొత్తం తలవంచిందని కార్తికేయ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారం బుధ్నీ అసెంబ్లీ స్థానంలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఢిల్లీ నుంచి వచ్చాను. అయతే మన నేత(శివరాజ్ సింగ్ చౌహన్) ఒక ముఖ్యమంత్రిగా చాలా పాపులర్. అయిన ఇప్పుడు సీఎం కాకున్నా మరింత పాపుల్ అయ్యారు. మన నేత భారీ విజయం సాధించారు. దీంతో ఢిల్లీ మొత్తం ప్రస్తుతం మన నేత ముందు తలవంచంది. ఢిల్లీ మొత్తానికి ఆయనేంటో తెలుసు. అదేవిధంగా ఆయనకు గుర్తింపు, గౌరవం ఇస్తుంది. ఒక్క ఢిల్లీనే కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన్ను గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నేతల జాబితాలో శివరాజ్‌సింగ్ ఒకరుగా నిలుస్తారు’అని తండ్రిపై ప్రశంసలు కురిపించారు.లోక్‌సభ ఎన్నికల విదిశ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన మాజీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ 8.20 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో ఆయన కేంద్ర కేబినెట్లో చోటుదక్కించుకొని వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక.. తన తండ్రిపై కార్తికేయ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కార్తికేయ సింగ్ వ్యాఖ్యలతో ఢిల్లీకి అసమ్మతి భయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.‘కేంద్ర మంత్రి కుమారుడు (యువరాజు) కార్తికేయ ఢిల్లీ భయంతో ఉందని ఉంటున్నారు. ఇది 100 శాతం నిజం. ఎందుకంటే దేశం భయంతో ఉన్న ఓ నియంతను నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో వ్యక్తం అవుతున్న అసమ్మతి స్వరం. రెబెల్ అవుతున్న పెద్ద నేతలు. సంకీర్ణ ప్రభుత్వ సమన్వయం. ప్రభుత్వానికి మద్దతు తగ్గటం వల్ల భయంతో అధికార పీఠం కదులుతోంది’అని జితూ పట్వారీ అన్నారు. మరోవైపు.. శివరాజ్ సింగ్ కేంద్రమంత్రి కావటంతో బుధ్నీ అసెంబ్లీ నియోజకర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. -
అత్తను దారుణంగా చంపిన కోడలికి మరణ శిక్ష
భోపాల్: కోడళ్లను వేధించే అత్తల గురించి అందరం వింటుంటాం. సమాజంలో ఇది మామూలే. అయితే మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలోని అట్రాలా గ్రామంలో ఓ కోడలు అత్తను అతి దారుణంగా చంపింది. కొడవలితో ఒక్కసారి కాదు ఏకంగా 95సార్లు నరికి నరికి చంపింది. ఈ కేసు విచారించిన రెవా జిల్లా కోర్టు బుధవారం(జూన్12) మరణ శిక్ష విధించింది. 2022 జులై12న కోడలు కంచన్ చేతిలో అత్త సరోజ్కోల్ హత్యకు గురైంది. అత్త సరోజ్కోల్ హత్యకు మామ వాల్మీకికోల్ దగ్గరుండి కోడలిని పురిగొల్పినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కానీ ఆధారాలు లేక వాల్మీకి కోల్‌ను కోర్టు విడుదల చేసింది. -
రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..!
ఓ సాధారణ రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్ అయ్యి తన సొంత రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తుంటే ఆ ఆనందం మాటలకందనిది. చిన్నప్పుడూ అందరిలా సాధారణంగా చదివే అమ్మాయి అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందింది. ఇంటర్ ఫెయిల్ అవ్వడంతోనే ఆమె లైఫ్ టర్న్ తిరిగింది. ఆ ఓటమి ఆమెలో కసిని పెంచి ఈ స్థాయికి చేరుకునేలా చేసింది. ఆమె విజయగాథ ఏంటంటే..ఆమె పేరు ప్రియాల్ యాదవ్. ఇండోర్‌కి చెందిన వ్యవసాయం కుటుంబ నేపథ్యం. తండ్రి రైతు, తల్లి గృహిణి. ఆమె చిన్నప్పుడూ అందిదిలా సాధారణ విద్యార్థే. బాగా చదివే విద్యార్థి మాత్రం కాదు. ఏదో పరీక్షల ముందు చదివి పాసైపోయామా.. అన్నట్లుగానే చదివేది. అయితే ఇంటర్మీడియెట్‌లో దారుణంగా ఫెయిల్ అయిపోవడం ఆమెను బాగా డిప్రెషన్‌కు గురి చేసింది. అదే ఆమెను బాగా కష్టపడి చదివేలా చేసింది. ఆ వైఫల్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరావృతం కాకూడదని గట్టిగా నియించుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినా.. ప్రియాల్ తన తోటి వాళ్లందరూ డిగ్రీ వరకు చదవుకుని పెళ్లిళ్లు చేసేసుకుని వెళ్లిపోయినా..తాను మాత్రం బాగా చదివి ఆఫీసర్ స్థాయిలో ఉండే ఉద్యోగ్నాన్ని పొందాలని ప్రగాఢంగా కోరుకుంది.అందుకే మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ (ఎంపీపీఎస్సీ) పరీక్షలో ఒకటి, రెండుసార్లు కాదు ఏకంగా మూడుసార్లు పాసయ్యింది. 2019లో తొలిసారిగా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్(ఎంపీపీఎస్సీ) రాసినప్పుడూ..జిల్లా రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత 2020లో రెండో ప్రయత్నంలో 34వ ర్యాంక్‌ను సాధించి సహకార శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఇక చివరి ప్రయత్నంలో తన ర్యాంకు మరింత మెరుగుపడింది. ఏకంగా ఆరో ర్యాంకు సాధించి.. తన సొంత రాష్ట్రానికే డిప్యూటి కలెక్టర్ నియమితురాలయ్యింది. తనను ఆ ఓటమి నీడలా వెంటాడి భయపెట్టిందని, అది మళ్లీ జీవితంలో అస్సలు రాకూడదన్న కసి ఈ స్థాయికి వచ్చేలా చేసిందని చెప్పుకొచ్చింది ప్రియాల్. అక్కడితో ఆమె విజయం ఆగిపోలేదు..ఐఏఎస్ కావలన్నది ఆమె తదుపరి లక్ష్యం. ప్రియాల్ యాదవ్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) పరీక్షలలో విజయం సాధించి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంపై దృష్టిసారించింది. తాను డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తూనే ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతానని అంటోంది ప్రియాల్. ప్రస్తుతం ఆమె ఇండోర్ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తుంది. విజయానికి ముగింపు లేదు అనడానికి ప్రియాల్ ఒక ఉదాహరణ కదూ. ఓటమితో కుంగిపోకుండా..దాన్నే తన కెరీర్‌ని మంచిగా నిర్మించుకోవడానికి పునిదిగా చేసుకుని సక్సెస్‌కి మారుపేరుగా నిలిచింది. అందరి చేత శెభాష్ ప్రియాల్ అని అనిపించుకుంది. (చదవండి: ప్రపంచంలో ఎన్ని రకాల బంగాళా దుంపలు ఉన్నాయో తెలుసా..!) -
జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ..పాపం..! ఇలా వర్క్ట్లు..
ఓ దొంగ జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. ఏదో పట్టుకుపోదామనుకుని వచ్చి ఇలా దొరికిపోతానని ఊహించని దొంగను యజమాని ఏం చేశాడో వింటే షాకవ్వుతారు. పట్టుబడిన ఆ దొంగకు జిమ్ యజమాని ఎవ్వరూ ఊహించని ఓ శిక్ష వేసి మరీ పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ ఆ జిమ్ యజమాని ఏం చేశాడంటే..ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ దొంగ జిమ్ సెంటర్లోకి వెళ్లి చోరీ చేయాలని అనుకున్నాడు. అక్కడ ఉన్న షట్టర్‌ని ఏదో విధంగా ఓపెన్ చేసి లోపలకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లో ఉన్న జిమ్ యజమానికి అర్థరాత్రి హఠాత్తుగా మెలుకువ వచ్చి ఫోన్ చెక్ చేసుకుంటాడు. జిమ్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా..అక్కడ ఓ దొంగ పచార్లు కొడుతున్నట్లు కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా జిమ్‌కి వెళ్లి ఆ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు యజమాని. దీంతో భయాందోళనకు గురైన దొంగ ఏం చేయాలో తోచక బిత్తరచూపులు చూశాడు. అయితే ఆ జిమ యజమాని దొంగని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తమంటూ శిక్ష విధించి మరీ పోలీసులకు అప్పగించాడు. పాపం దొంగలించడానికి వచ్చి ఇలా వర్క్ట్లు చేసి మరీ జైలుకి వెళ్తానని ఊహించి ఉండడు కదా..!. ఇలాంటి ఫన్నీ ఘటనే గతవారం ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది. ఓ దొంగ దొంగతనం చేయడానికి చవ్చి ఏసీ ఆన్ చేసుకుని మరీ నేలపై ప్రశాంతగా నిద్రపోయాడు. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ పోలీసులు ఉండటంతో కంగుతిన్నాడు. అతడు మద్యం మత్తులో ఉండటంతో ఇలా నిద్రపోయాడని పోలీసులు చెప్పారు. (చదవండి: ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్! ఏంటీ స్వీట్ ప్రాముఖ్యత) -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం మహీంద్రా ఎస్యూవీను ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ జిల్లాలోని ఇండోర్-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నట్టు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. #NewsWithR #MadhyaPradesh: Eight people killed and one injured in road accident.According to Additional Superintendent of Police (ASP) Rupesh Kumar Dwivedi, a jeep collided with an unidentified vehicle near Ghatabillod on the Indore-Ahmedabad National Highway.@MPPoliceDeptt pic.twitter.com/x994AFzsiq— Ravi Rana (@RaviRRana) May 16, 2024 ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే, ప్రమాదం జరిగిన అనంతరం గుర్తు తెలియని వాహనం డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడని చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుండగా.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, సదరు వాహనం గునా అనే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. -
కాంగ్రెస్ అంతిమ దశకు చేరుకుంది: జ్యోతిరాదిత్య సింధియా
భోపాల్: కాంగ్రెస్ పార్టీ అంతిమ దశకు చేరుకుందని కేంద్రమంత్రి, ‘గుణ’ బీజేపీ ఎంపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా విర్శించారు. సైద్ధాంతికంగానూ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుంటోందని ఆయన శనివారం పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్నిస్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కొంతమందికి టికెట్లు ఇచ్చినా నామినేషన్ల తరువాత ఉపసంహరించుకునేలా చేస్తున్నారు. వాస్తవానికి ఆ పార్టీతో ఉండాలని ఎవరూ అనుకోవడమూ లేదు’’ అని ఆయన విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ పార్టీలో నేతలకు సముచిత గౌరవ మర్యాదలు ఉండవు అని కూడా ఆయన కుండబద్ధలు కొట్టారు. దేశంలో అత్యాయిక పరిస్థితిని విధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవడం మేలని అన్నారు. భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న విమర్శిలను తిప్పికొడుతూ అది ఏ పార్టీతోనూ సాధ్యం కాని విషయమని అన్నారు.కాంగ్రెస్‌పార్టీలో చాలాకాలం కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా 2020లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరచిన 15 నెలలకు సింధియా.. 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చేరారు. ఫలితంగా కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. -
మహిళపై కస్సుమన్న కేంద్రమంత్రి భార్య.. వెల్లువెత్తిన విమర్శలు
సమస్య చెబుతున్న గ్రామీణ మహిళపై కస్సుమన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భార్య ప్రియదర్శినీ రాజే సింధియా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. గ్రామీణ మహిళ పట్ల ఆమె ప్రవర్తినపై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్య ప్రదేశ్‌లోని గుణ-శివపురి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రియదర్శిని తన భర్త విజయం కోసం కుమారుడితో కలిసి గ్రామ గ్రామాలు తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియదర్శిని రాజే ఖుజ్రీ గ్రామానికి వెళ్లగా అక్కడ కొందరు మహిళలు గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను లేవనెత్తారు. దీంతో ఆమె సమస్యలను రాసి తమకివ్వలని చెప్పారు. ఇంతలో ఓ మహిళ “నువ్వే రాసుకో” అంది. అది విన్న ప్రయదర్శిని రాజే ఆగ్రహానికి గురై, "మీరు రాసి నాకు ఇవ్వండి, మీ పని చేయడం నా పని కాదు" అంటూ చిరాకుపడ్డారు.ఖుజ్రీ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, మహిళలు ప్రయదర్శిని సింధియాను ఆశ్రయించారు. గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదని ఆ గ్రామ మహిళలు వాపోతున్నారు. ఈ సమయంలో, ఒక మహిళ, "మేడమ్, మీరు దయచేసి ఒకసారి ఇక్కడికి రండి. ఇక్కడ నీటి కోసం ఒక ట్యాంక్ ఉంది, కానీ అందులో నీరు లేదు" అంటూ తెలియజేసింది. -
ఆర్బీఐ మాజీ గవర్నర్‌కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..!
ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్ డిగ్రీలు చేశాడు. అతడి వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నతాధికారులగా పనిచేస్తున్నారు. అతడి పేరు మీద వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినా వాటన్నింటికి కాదని కరెంటు సౌకర్యం కూడా లేనో ఓ మారుమూల ప్రాంతానికి వచ్చి గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అర్పించాడు. అత్యంత సాదాసీదాగా జీవితం గడుపుతాడు. ప్రజల సేవ పరమావధిగా భావించే మహోన్నత వ్యక్తి ప్రోఫెసర్ అలోక్ సాగర్. అతడెవరూ? అతని నేపథ్యం ఏంటంటే.. అలోక్ సాగర్ ఐఐటీ ఢిల్లీ గ్య్రాడ్యేయేట్, ఎన్నో మాస్టర్స్ డిట్రీలు చేసిన వ్యక్తి. పైగా యూఎస్ఏలోని టెక్సాస్‌లో హ్యూస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ కూడా చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆయన కొన్నాళ్లు ఐఐటీ ఢిల్లీలో మాజీ ప్రోఫెసర్‌గా పనిచేశారు అలోక్ సాగర్. అంతేగాదు ఐఐటీ ఢిల్లీలో ప్రోఫెసర్‌గా పాఠాలు బోధిస్తున్నప్పుడూ అలోక్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాడు. ఏమయ్యిందో ఏమో సడెన్‌గా ప్రోఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి అలోక్ మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలోని కోచాము గ్రామానికి వచ్చి నివశించడం ప్రారంభించారు. ఆ గ్రామంలో సరైన రోడ్డు సదుపాయాలు, కరెంట్ సౌకర్యం వంటివి ఏమీలేవు. అయినప్పటికీ అక్కడే ఉండి స్థానిక గిరిజనుల మాండలికాన్ని నేర్చుకున్నారు. వారి జీవన విధానాన్ని స్వీకరించారు. గిరిజనులు ప్రకృతితో మంచి సంబంధం కలిగి ఉన్నవారని ప్రగాఢంగా నమ్ముతారు అలోక్. అందుకోసమే ఆయన గత 26 ఏళ్లుగా పేద గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితమిచ్చారు. అంతేగాదు ప్రొఫెసర్ అలోక్ పేరుమీద ఢిల్లీలో కోట్ల ఆస్తులున్నా వాటన్నింటి త్యజించి గిరిజనుల కోసం పాటు పడ్డారు. ఆయన తల్లి మిరాండా హౌస్ డిల్లీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ తండ్రి ఇండియన్ రెవెన్నయూ సర్వీస్ అధికారి, తమ్ముడు ఐఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. అంతటి ఉన్నత కుటుంబ నేపథ్యం, ఉన్నత విద్యావంతుడు అయ్యి ఉండి గిరిజనుల కోసం అని ఓ పూరింటిలో జీవించడం, కేవలం మూడు కుర్తాలతో ఉండటం అంత ఈజీ కాదు. చాలామంది ఉన్నత విద్యావంతులు సేవ చేస్తామంటూరు గానీ ఇలా వారి జీవన విధానం స్వీకరించి మరీ సంక్షేమం కోసం పాటుపడరు. కానీ అలోక్ అలా కాదు గిరిజన జీవన విధానానికి దగ్గరగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పాటుపడ్డారు. అంతేగాదు ఆ గ్రామంలో పయనించేందుకు కూడా ఓ సాదారణ సైకిల్‌నే వినియోగిస్తారు. అలాగే పర్యావరణానికి తోడ్పడేందుకు దాదాపు 50 వేలకు పైగా చెట్లను నాటారు. దీంతోపాటు గ్రామాభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొంటూ పొరుగు గ్రామాలకు మంచి మొక్కల విత్తనాలను పంపిణీ చేసేందుకు సుమారు 60 కిలోమీట్లరు సైకిల్‌పై ప్రయాణించి మరీ ఇస్తారు. ఆయన చాలామంది డిగ్రీలు చేసి స్టేటస్ చూపించుకోవడం, ఆస్తులు సంపాదించే పనిలోనే ఉన్నారు. సమాజ సేవ కోసం తమ వంతుగా ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించడం లేదని ఆశోక్ బాధగా అన్నారు. ఇక ఆయాన దాదాపు 78 విభిన్న భాషల్లో అలవోకగా మాట్లాడగలరు. ఆయన చేస్తున్న సమాజ సేవ చూసి ఆ జిల్లా అధికారులు, గ్రామాధికారులు నాయకుడిగా ఎదగాలనుకుంటున్నాడేమోనన్న భయంతో ఈ ఊరి వదిలి వెళ్లిపోమనడంతో..ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. తన వివరాలు చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయాయి. ఈ విషయం వార్తల్లో హైలెట్ అయ్యింది కూడా. చివరికి ఆయన చెప్పిందంతా నిజమేనని తేలింది. ఐఐటీ ప్రొఫెసర్ స్థాయి అయ్యి ఉండి కూడా కించెత్తు నామోషి లేకుండా ఓ మారుమూల ప్రాంతంలోని గిరిజనుల కోసం పాటుపడటం వారితో కలిసి జీవించడం నిజంగా గ్రేట్ కదూ. ఇలా మరెవ్వరూ చేయరేమో.!గిరిజనుల సంక్షేమం కోసం వచ్చిన 'శ్రీమంతడు' ప్రొఫెసర్ అలోక్ సాగర్..! One of the most inspirational man one will ever come across. Prof Alok Sagar ji is an IIT Delhi graduate, masters & Phd from Houston & an ex IIT professor. However, these esteemed credentials held no meaning for him, as he discovered his true calling in one of the most remote… pic.twitter.com/OiRknPcjc7 — VVS Laxman (@VVSLaxman281) April 12, 2024 (చదవండి: ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదా? పరిశోధన ఏం చెబుతోందంటే.!.) -
‘చాలాకాలం సహజీవనం చేసి, పెళ్లి చేసుకోకున్నా భరణం ఇవ్వాల్సిందే’
భోపాల్: వివాహం, భరణం అంశంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పురుషుడితో చాలాకాలంపాటు సహజీవనం చేసిన మహిళ.. విడిపోయిన సమయంలో భరణం పొందేందుకు అర్హురాలని తెలిపింది. చట్టబద్దంగా ఇరువురు వివాహం చేసుకోకపోయినా ఇది వర్తిస్తుందని పేర్కొంది. గతంలో సహజీవనం చేసిన భాగస్వామికి భరణం ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మహిళకు నెలసరి భత్యం కింద 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. వివరాలు .. శైలేష్ బోప్చే(38), అనితా బోప్చే (48) అనే మహిళతో కొంతకాలం సహజీవనం చేశారు. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది. బాలాఘాట్‌కి చెందిన శైలేష్ బోప్చే.. సదరు మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యగా చెప్పుకుంటున్న మహిళ, ఆలయంలో వివాహం చేసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని బోప్చే కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని.. సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని బోప్చే తరుపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన బెంచ్ మహిళ కొంత కాలం సదరు వ్యక్తితో కలిసి జీవించిందనే వివరాలను గుర్తించింది. దీంతో ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు వెల్లడించింది. తనతో నివసించిన మహిళకు నెలవారీ భత్యం రూ.1,500 చెల్లించాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఉతర్వులను శైలేష్ బాప్చే హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియాతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టి.. ఆమెకు నెలసరి భత్యం కింద రూ. 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.