భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో రెండు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. రత్లామ్ పట్టణంలో ఆదివారం ఉదయం రత్లామ్-అంబేద్కర్ నగర్ డెమూ మార్గంలో వెళ్తున్న ఓ లోకల్ ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో రత్లామ్ స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రీతమ్ నగర్ స్టేషన్‌కు ట్రైన్ చేరుకోగానే ఆ రైల్లో మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన రైలు లోకో పైలెట్‌లు, స్టేషన్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పి వేశారని పశ్చిమ రైల్వే రత్లాం డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్‌ఓ) ఖేమ్‌రాజ్ మీనా తెలిపారు.
అయితే, రైలు జనరేటర్ కార్‌లో ముందుగా మంటలు చెలరేగాయని, ఆ తర్వాత బోగీ అంతటికి విస్తరించాయని అధికారులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్‌లు రైలును ఆపేయడంతో పెను ముప్పు తప్పిందని, మంటలు ప్రయాణికుల బోగీలకు వ్యాపించకుండా ఆగిపోయాయని అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. కాగా, లోకల్ రైలులోని ప్రయాణీకులను అంబేద్కర్ నగర్ స్టేషన్‌కు మరో రైలులో చేర్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | Madhya Pradesh: Fire broke out in the generator car of Ratlam-Dr Ambedkar Nagar Demu train at Pritam Nagar station in Ratlam earlier this morning. The fire was later extinguished. No injuries or casualties reported. pic.twitter.com/hrT3GRGhby
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 23, 2023
Comments
Please login to add a commentAdd a comment