హార్ట్‌ బ్రేకింగ్‌ వీడియో​: బ్రతికుండగానే మహిళలను మట్టిలో పూడ్చేయత్నం! | Truck Dumps Gravel On 2 Women At Madhya Pradesh Rewa Over Protesting Road Construction | Sakshi
Sakshi News home page

హార్ట్‌ బ్రేకింగ్‌ వీడియో​: బ్రతికుండగానే మహిళలను మట్టిలో పూడ్చేయత్నం!

Jul 21 2024 9:20 PM | Updated on Jul 22 2024 11:02 AM

Truck Dumps Gravel On Women At Madhya Pradesh Rewa

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బ్రతికుండగానే ఇద్దరు మహిళలను మట్టిలో పూడ్చేసి చంపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కొందరు సదరు మహిళలను రక్షించారు. అయితే, ఈ ఘటనకు భూవివాదమే కారణమని తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. రేవా జిల్లాలోని హినౌతాలో కొందరు వ్యక్తులు ఓ ట్రక్కులో మట్టిని తీసుకువచ్చి ఇద్దరు మహిళను పూడ్చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే, మన్‌గావా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, రోడ్డు నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ కొందరు మహిళలు నిరసనలకు దిగారు.

 

 

ఈ సందర్భంగా రోడ్డు వేస్తున్న భూమిని తాము తీజుకు తీసుకున్నామని ఆందోళన చేపట్టారు. వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నేలపై బైఠాయించిన ఇద్దరు మహిళలను పట్టించుకోని ట్రక్కు డ్రైవర్‌.. అందులోని మట్టిని వారిపై పారపోశాడు. అప్పటికే వాళ్ల నడుము వరకు మట్టి పూడుకుపోయింది. దాంతో అప్రమత్తమైన స్థానికులు వారిద్దరిని రక్షించి, స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను భోపాల్‌ కాంగ్రెస్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బీజేపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం  చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement