Rewa
-
హార్ట్ బ్రేకింగ్ వీడియో: బ్రతికుండగానే మహిళలను మట్టిలో పూడ్చేయత్నం!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బ్రతికుండగానే ఇద్దరు మహిళలను మట్టిలో పూడ్చేసి చంపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కొందరు సదరు మహిళలను రక్షించారు. అయితే, ఈ ఘటనకు భూవివాదమే కారణమని తెలుస్తోంది.వివరాల ప్రకారం.. రేవా జిల్లాలోని హినౌతాలో కొందరు వ్యక్తులు ఓ ట్రక్కులో మట్టిని తీసుకువచ్చి ఇద్దరు మహిళను పూడ్చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే, మన్‌గావా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, రోడ్డు నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ కొందరు మహిళలు నిరసనలకు దిగారు. The result of 20 years of misgovernance by BJP is that goons have flourished in every district. This viral video is from village Mangava in Rewa district of Madhya Pradesh, in which women were forced to commit murder by some goons. And an attempt was made to take his life.… pic.twitter.com/2oF1KnhwI7— Bhopal Congress (@Bhopalinc) July 21, 2024 ఈ సందర్భంగా రోడ్డు వేస్తున్న భూమిని తాము తీజుకు తీసుకున్నామని ఆందోళన చేపట్టారు. వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నేలపై బైఠాయించిన ఇద్దరు మహిళలను పట్టించుకోని ట్రక్కు డ్రైవర్.. అందులోని మట్టిని వారిపై పారపోశాడు. అప్పటికే వాళ్ల నడుము వరకు మట్టి పూడుకుపోయింది. దాంతో అప్రమత్తమైన స్థానికులు వారిద్దరిని రక్షించి, స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను భోపాల్ కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బీజేపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అయోధ్యకు అతిపెద్ద నగారా.. ప్రత్యేకతలివే!
ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను మధ్యప్రదేశ్‌లోని రేవాలో తయారు చేశారు. దీనిని అయోధ్యలోని రామమందిరానికి తరలించనున్నారు. గత 40 ఏళ్లుగా ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున రేవాలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. గత శివరాత్రినాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎంబ్రాయిడరీ కళాకృతిని తయారు చేశారు. అలాగే 5,100 కిలోల మహాప్రసాదాన్ని తయారు చేశారు. ఈసారి ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను తయారు చేశారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. అదిమొదలు ప్రపంచం నలుమూలల నుంచి అయోధ్యకు వివిధ కానుకలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలోనే అయోధ్యకు కానుకగా పంపేందుకు రేవాలో ఆరు అడుగుల ఎత్తు , 11×11 వ్యాసం కలిగిన అతిపెద్ద నగారాను తయారు చేశారు. దీనిని మార్చి 12 నాటికి అయోధ్యకు తరలించనున్నారు. దీనిని మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా రేవా నగర వీధుల్లో ఊరేగించారు. ఈ నగారాను పరీక్షించేందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం రేవాకు వచ్చింది. వారి పరిశీలన అనంతరం ఈ నగరాను రికార్డులలో నమోదు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగారా ఇదేనని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత డాక్టర్ ఏకే జైన్ తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం
భోపాల్: మధ్యప్రదేశ్ రేవాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. తెలంగాణ హైదరాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్ గోరఖ్‌పూర్ వెళ్తున్న ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక మధ్యప్రదేశ్ రేవాలోని సుహాగీ పహారీ వద్ద వేగంగా వెళ్తున్న బస్సు.. ఓ లారీ కంటెయినర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 40 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. లారీ కంటెయినర్ వేగంగా వెళ్తున్న క్రమంలో.. ముందు వెళ్తున్న మరో ట్రక్‌ను ఢీకొట్టింది. ఈలోపు లారీ కంటెయినర్ డ్రైవర్ సడన్ బ్రేకులు వేయడంతో.. వెనుక వేగంగా వస్తున్న బస్సు బలంగా ఢీ కొట్టి.. కంటెయినర్లోకి దూసుకెళ్లి ఉంటుందని ప్రమాదంపై ప్రాథమిక అంచనాకి వచ్చారు రేవా కలెక్టర్ మనోజ్ పుష్ఫ. ప్రయాణికులందరూ యూపీ వాసులుగా, వలస కూలీలుగా రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ ధృవీకరించారు. పండుగ కోసం వాళ్లంతా స్వస్థలాలకు వెళ్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వాళ్లలో 20 మందిని ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారాయన. Madhya Pradesh | 14 dead, 40 injured in a collision between a bus and trolley near Suhagi Hills in Rewa. The bus was going from Hyderabad to Gorakhpur. All people on the bus are reportedly residents of Uttar Pradesh. pic.twitter.com/cwN2MUCB7O — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 22, 2022 It seems that the trolley truck had an accident with the truck in front of it and when the driver applied brakes, the bus behind it rammed into it. Police-admn and local people are here. Rescue operations were done. Injured have been sent to hospital: Manoj Pushp, Rewa Collector pic.twitter.com/6BcEeeYzSb — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 22, 2022 -
Viral Video: విద్యార్థిని చితకబాదిన టీచర్.. గొంతునొక్కుతూ, జుట్టుపట్టుకుని..
-
విద్యార్థిని చితకబాదిన టీచర్.. గొంతునొక్కుతూ, జుట్టుపట్టుకుని..
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్.. బుద్దిలేకుండా ప్రవర్తించాడు. ఓ విద్యార్ధిని అత్యంత దారుణంగా చితకబాదాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. నేలపై పడుకోబెట్టి పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీచర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. కాగా, ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, రేవాలోని ఖజుమా కాలాలోని హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. సదరు విద్యార్థిపై ఉపాధ్యాయుడు సందీప్ భారతి దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు. ఈ క్రమంలో విద్యార్థి.. టీచర్ దెబ్బలకు తాకలేక విలవిల్లాడిపోయాడు. ఒకానొక సమయంలో ఎదురుతిరిగే ప్రయత్నం కూడా చేశాడు. అయితే, కొట్టడం ఆపివేసిన కాసేపటికి విద్యార్థి కింద నుంచిపైకి లేవడంతో అతడి దుస్తులకు బురద అంటుకోవడం వీడియోలో చూడవచ్చు. ఇక, విద్యార్థి లేచి ముందుకు వెళ్తున్న క్రమంలో టీచర్ మరోసారి అతడిని చితకబాదాడు. మెడపట్టుకుని ముందకు నెట్టివేశాడు. ఇదంతా చూస్తున్న మిగతా టీచర్లు, విద్యార్థులు మాత్రం టీచర్‌ను అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయకపోవడం గమనార్హం. కాగా, ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో విద్యార్థి తల్లిదండ్రులతో సంప్రదించిన తర్వాత టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. పూర్తి విచారణ జరిపిన అనంతరం.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. MP: दरिंदा शिक्षक की बेरहमी से छात्र की पिटाई का वीडियो वायरल, रीवा जिले के गुढ़ तहसील क्षेत्र अंतर्गत खजुहा हायर सेकेंडरी विद्यालय का मामला, विद्यालय में कक्षा 8 में अध्ययनरत है छात्र। @KashifKakvi @IG_Rewa @SP_Rewa @CMMadhyaPradesh @KavitaPandeyINC @theobclive @obcricha pic.twitter.com/oWKTbpnrjX — ओबीसी महासभा मध्यप्रदेश (@OBC_MP) September 29, 2022 -
భారతీయులు గర్వపడేలా చేసిన సచిన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?
దేశానికి పతకాలను అందించి భారతీయులను గర్వపడేలా చేసిన క్రీడాకారులు నేడు అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి కనీస సాయం కూడా అందకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. స్పెషల్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన సీతా సాహు సమోసాలు అమ్ముకుంటున్న ఘటనను మరవకముందే మరో వార్త అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. నేషనల్ చాంపియన్(పారా అథ్లెట్) సచిన్ సాహు.. జీవనోపాధి కోసం ఐస్‌క్రీమ్ బండి నడుపుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సచిన్.. ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగిన 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించాడు. ఈ రేసును సచిన్ 1.17 సెకన్లలో పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వం తనకు ఎలాంటి సాయం అందకపోవడంతో తాను ఇలా ఐస్‌క్రీమ్స్ అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. సచిన్ 2015 నుండి 2019 వరకు క్రికెట్ ఆడాడు. కానీ, దివ్యాండైన కారణంగా క్రికెట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అనంతరం.. గ్వాలియర్ అథ్లెటిక్స్ కోచ్ బీకే ధవన్ సాయంతో పారా అథ్లెట్‌గా మారాడు. అనంతరం కాంస్య పతకం సాధించాడు. Madhya Pradesh | Para-athlete Sachin Sahu sells ice cream in Rewa to make ends meet "Despite lack of facilities, I won a bronze medal in 400m race in 20th National Para-Athletics Championship. I appeal to the government to support me to play further," he said pic.twitter.com/bH53zzwdcf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 6, 2022 -
దారుణం: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్ బిగించి..
భోపాల్: బంధువుల అమ్మాయిని వేధించారని ఓ యువకుడిపై కొందరు దారుణంగా ప్రవర్తించారు. మెడకు బెల్ట్ బిగించి గొడ్డును లాక్కెళ్లినట్లు లాక్కెళ్లారు. లాక్కెళ్తూనే తీవ్రంగా దాడి చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో భయోత్పాతం కలిగిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రేవా జిల్లాలో బల్దావ్ జాదవ్ (28) ఓ యువతిని వేధించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ అమ్మాయి తరఫు వారు బల్దావ్‌ను ముగ్గురు వెంట పట్టుకుని వచ్చారు. నిర్మానుష్య ప్రాంతంలో అతడి మెడకు బెల్ట్ కట్టేశారు. చదవండి: యువతకు గుడ్‌న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే.. ఒకరు బెల్ట్‌తో బల్దావ్‌ను పట్టుకుని నిల్చుని ఉండగా మరొకరు కర్రలతో దాడి చేస్తున్నాడు. ఇంకొకరు ఆ దృశ్యాలను వీడియో తీస్తున్నాడు. విచక్షణా రహితంగా జాదవ్‌పై దాడి చేశారు. తీవ్ర రక్తగాయాలైనా కూడా కొట్టారు. తర్వాత బెల్ట్ తీసి పెద్ద కర్రలతో దాడి చేశారు. ఇంకోసారి వెంటపడతావా? అని ప్రశ్నించగా ‘లేదు.. ఇంకోసారి’ రాను అంటూ ఆ యువకుడు రోదిస్తూనే చెబుతున్నాడు. అతడిని హెచ్చరించి పంపించివేశారు. దాదాపు మూడు నిమిషాల పాటు చిత్రహింసలు పెట్టారు. దానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. చదవండి: డ్రగ్స్ వార్.. మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా స్వీకరణ ఈ వీడియో చూసిన పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురు పరారయ్యారని అదనపు సూపరింటెండెంట్ పోలీస్ శివ్‌కుమార్ వర్మ తెలిపారు. ఆ వీడియో 8-10 రోజుల కిందటదని చెప్పారు. వారెవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
మన రెవాలో ‘చైనా’
న్యూఢిల్లీ: ఇండియాలో ఏర్పాటు చేసిన పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో ఒకటైన రెవాను భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఇది 750 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయగలదు. దీన్ని మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పడిన రెవా ఆల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం తన వంతుగా 138 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. (ఢిల్లీలో కట్టడిపై మోదీ ప్రశంస) చైనా తయారీ పరికరాలు మొత్తం 1500 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ పార్కులో ప్రతి 500 హెక్టార్లకు ఒక సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ఉంది. ఈ మూడు యూనిట్లను చైనా నుంచి వచ్చిన పరికరాలతో మహీంద్రా రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆరిన్సన్ క్లీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఏసీఎమ్ఈ జైపూర్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేశాయి. ఒక్కో యూనిట్ 250 మెగావాట్ల చొప్పున 750 మెగావాట్లను ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచబ్యాంకు గ్రూపునకు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టులో 2,800 కోట్ల పెట్టుబడి పెట్టింది. గ్రీన్ కారిడార్ కింద పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 220/400కెవి అంతరాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా వినియోగదారులకు కరెంటును చేరుస్తారు. తగ్గనున్న ఉద్గారాలు ఈ సోలార్ పార్కు ద్వారా ఏటా దేశంలో 15 లక్షల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. అందరూ అంటున్నట్లు రెవా సోలార్ పార్కు ఆసియాలో అతిపెద్దది కాదు. కానీ, దేశంలో ఉన్న పెద్ద ప్లాంటుల్లో ఇది కూడా ఒకటి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన భద్లా సోలార్ ప్రాజెక్టు 2,245 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయగలదు. కర్ణాటక పావగడ సోలార్ పార్కు సామర్ధ్యం 2,050 మెగావాట్లు. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన న్యూ ఎనర్జీ ఫైనాన్స్ ప్రకారం రెవా కంటే తొమ్మిది పెద్ద సోలార్ పార్కులు ఉన్నాయి. రెవా కరెంటు ఎవరు కొంటారు? రకరకాల కస్టమర్లకు కరెంటు సరఫరా చేయనున్న తొలి భారతీయ సోలార్ పవర్ ప్లాంటు ఇదే. మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఈ పార్కులో ఉత్పత్తి అయ్యే 76 శాతం కరెంటును తీసుకుంటుంది. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్‌కి కూడా ఇక్కడి నుంచి కరెంటు అందుతుంది. -
స్వచ్ఛం.. సురక్షితం.. కచ్చితం
రేవా: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ విద్యుదుత్పత్తిలోనూ స్వావలంబన సాధించడం కీలకమైన విషయమని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో 750 మెగావాట్ల భారీ సౌరవిద్యుత్తు ప్లాంట్‌ను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు రంగంలో స్వావలంబనకు సౌరశక్తి ఎంతో తోడ్పడుతుందన్నారు. సౌరశక్తి స్వచ్ఛమైంది మాత్రమే కాకుండా.. కచ్చితంగా అందుబాటులో ఉండేదని, సురక్షితమైంది కూడా అని అన్నారు. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద వనరుగా సౌరశక్తి అవతరించనుందని తెలిపారు. సౌర విద్యుత్తు విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రమైన రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్‌తోపాటు ఢిల్లీ మెట్రో రైల్వేకూ విద్యుత్తు అందిస్తుందని అన్నారు. ప్రపంచమిప్పుడు పర్యావరణాన్ని కాపాడుకోవాలా? లేక ఆర్థిక వ్యవస్థనా? అన్న ద్వైదీభావంలో కొట్టుమిట్టాడుతోందని, అయితే స్వచ్ఛభారత్, ఉజ్వల, సీఎన్జీ, విద్యుత్ ఆధారిత రవాణా వ్యవస్థల ద్వారా భారత్ ఈ రెండూ పరస్పర ప్రయోజనకరమని చాటిందని అన్నారు. ప్రపంచం మొత్తమ్మీద అందుబాటులో ఉండే, పర్యావరణాన్ని కలుషితం చేయకపోగా మెరుగుపడేందుకు సాయపడే, ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగపడే సూర్యుడు స్వావలంబనకూ కీలకమని అన్నారు. ఇందుకోసం దేశం సోలార్ ప్యానెళ్లతోపాటు బ్యాటరీలు, ఇతర పరికరాలను సొంతంగా ఉత్పత్తి చేయాలని, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరారు. మధ్యప్రదేశ్‌లోని రేవా నర్మదా నది, తెల్లపులి కోసం చాలా ప్రసిద్ధి చెందిందని, ఇకపై ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రంగానూ ఖ్యాతి గడిస్తుందని అన్నారు. రేవా తరహాలోనే భారీ సోలార్ ప్లాంట్లను షాజాపూర్, నీమచ్, ఛత్తర్‌పూర్‌లలోనూ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, ఓంకారేశ్వర్ సమీపంలో తేలియాడే సోలార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆప్ ఇండియా సంయుక్తంగా 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ భారీ సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. -
బుద్ధిలేదా.. ఆ ముసుగు ఎందుకు..!
కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపే క్రమంలో టీవీ నటి, రేవా రాకుమారి మోహనా కుమారి సింగ్ షేర్ చేసిన ఫొటో ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మోహనా సింగ్‌కు ఇటీవలే వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రాజ్‌పూత్ కుటుంబానికి చెందిన సుయేష్ రావత్‌ను ఆమె పెళ్లాడారు. ఇరు కుటుంబాల సమక్షంలో వారి పెళ్లి అంగరంగా వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తన పుట్టింటి, అత్తింటి వారితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన మోహన... ‘ రేవా, రావత్ కుటుంబం నుంచి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేమ, శాంతి, ఐక్యతను వ్యాప్తి చేయండి. సంతోషంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచానికి, మన దేశానికి కూడా’ అంటూ విషెస్ తెలిపారు. ఈ క్రమంలో మోహన పోస్టుపై స్పందించిన ఓ నెటిజన్.. మీ ముఖంపై ముసుగు ఎందుకు ఉందంటూ ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా...‘ఎందుకంటే వీళ్లు పితృస్వామ్య వ్యవస్థ పెట్టిన ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. చదువుకున్నా వీళ్లకు బుద్ధి మాత్రం పెరగలేదు అంటూ మరో నెటిజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన మోహన..‘ క్రిస్టియన్లు కూడా పెళ్లి సమయంలో మేలి ముసుగు కప్పుకుంటారు. ముస్లిం కూడా ఇలాగే చేస్తారు. అయితే వాళ్లందరూ చదువురాని వాళ్లే అంటారా! ఇది రాజ్‌పూత్ వంశస్తుల ఆచారం. వివాహ సమయంలో ఇలా ముసుగు ధరించడం సంప్రదాయం. ఇలా చేయమని నన్నెవరూ బలవంతపెట్టలేదు. నా ఇష్టపూర్వకంగా ఈ పనిచేశా’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక మోహన భర్త సుయేష్ సైతం.. ‘పబ్లిసిటీ కోసం పాకులాడే వాళ్లు ఇలాంటి చెత్త కామెంట్లు చేస్తారు’ అంటూ సదరు నెటిజన్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా డాన్స్ ఇండియా డాన్స్ షోతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మోహనా.. ఓ ప్రముఖ హిందీ చానెల్లో ప్రసారమయ్యే సీరియల్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రేవా రాజవంశానికి చెందిన ఆమె వివాహం అక్టోబరులో జరిగింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. View this post on Instagram Wish you all a Happy New Year from the Rewa and Rawat Family with a message to spread Love , Peace , feeling of Unity , Happiness and good health to the World and our Country. 🌸🍁 #fromustoyou A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Jan 1, 2020 at 2:49am PST -
ఘోర రోడ్డు ప్రమాదం: పదిమంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుకనుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు సిద్ధి నుంచి రేవాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నంది. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సమయంతో సహాయ చర్యలను చేపట్టారు. కాగా ప్రమాదానికి బస్సు అతివేగమే కారణమని తెలుస్తోంది. -
రవీంద్ర జడేజాకు పుత్రికోత్సాహం
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అయ్యాడు. అతని భార్య రీవా జడేజా గురువారం రాజ్‌కోట్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జడేజా కుటుంబ సభ్యులు తెలిపారు. రీవా సోలంకి, జడేజాలకు గత ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. ప్రస్తుతం జడేజా ఇంగ్లండ్‌లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్నాడు. రైనా ట్వీటర్లో జడేజా దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ అధికారిక ట్వీటర్ ఖాతాలో జడేజాకు శుభాకాంక్షలు తెలిపింది. -
15 రోజులు బంధించి.. ఇద్దరు అమ్మాయిలపై గ్యాంగ్ రేప్
ఖాండ్వా: అమ్మాయిలపై జరుగుతున్న ఉన్మాద ఆగడాలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో మరో ఘోరం చోటు చేసుకుంది. రేవా ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను 15 రోజుల క్రితం నిర్బంధించి పలు నగరాల్లో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం ఇంట్లోంచి పారిపోయి, బస్సులో వస్తున్న ఇద్దరు అమ్మాయిలకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వారిని హోషాన్బాద్కు తీసుకెళ్లాడు. అక్కడినుంచి భోపాల్, జబల్పూర్ రేవా లాంటి చోట్ల దాచిపెట్టి , తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. నాలుగు నగరాల్లో పదిహేను రోజులు ఇరవైమంది వ్యక్తులు నరకం చూపించారు. అయితే దుండగులు చివరిసారి నిర్బంధించిన ఇంటికి తాళం వేయడం మర్చిపోయిన సంగతిని గమనించిన అమ్మాయిలిద్దరూ అక్కడినుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిల సమాచారంతో జిల్లాలోని కొన్ని అనుమానిత ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నిందితుల్లో ఒకడ్ని గుర్తించినట్టు సమాచారం. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ ఎంఎస్ సికార్వార్ తెలిపారు. అనుమానిత ప్రదేశాలకు పోలీసు టీంలను పంపించామని.. తొందర్లోనే నిందితులను పట్టుకుంటామన్నారు. -
రేవాలో రాజ్‌కపూర్ ఆడిటోరియం!
బాలీవుడ్ షోమ్యాన్ రాజ్‌కపూర్ పేరిట మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో ఆడిటోరియం నిర్మాణం జరగనుంది. రాజ్‌కపూర్ జ్ఞాపకార్థం త్వరలోనే ఇక్కడ ప్రపంచస్థాయి ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నట్లు మధ్యప్రదేశ్ పౌరసంబంధాల శాఖ మంత్రి రాజీవ్ శుక్లా ప్రకటించారు. రాజ్‌కపూర్ మామగారు అప్పట్లో రేవా రేంజ్ ఐజీగా పనిచేసేవారని ఆయన గుర్తు చేశారు. రాజ్‌కపూర్‌కు ఈ నగరంతో గల అనుబంధానికి గుర్తుగా ఆడిటోరియం నిర్మించనున్నామని చెప్పారు.