రవీంద్ర జడేజాకు పుత్రికోత్సాహం
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అయ్యాడు. అతని భార్య రీవా జడేజా గురువారం రాజ్‌కోట్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జడేజా కుటుంబ సభ్యులు తెలిపారు. రీవా సోలంకి, జడేజాలకు గత ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది.
ప్రస్తుతం జడేజా ఇంగ్లండ్‌లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్నాడు. రైనా ట్వీటర్‌లో జడేజా దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ అధికారిక ట్వీటర్ ఖాతాలో జడేజాకు శుభాకాంక్షలు తెలిపింది.