ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను మధ్యప్రదేశ్‌లోని రేవాలో తయారు చేశారు. దీనిని అయోధ్యలోని రామమందిరానికి తరలించనున్నారు. గత 40 ఏళ్లుగా ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున రేవాలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.
గత శివరాత్రినాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎంబ్రాయిడరీ కళాకృతిని తయారు చేశారు. అలాగే 5,100 కిలోల మహాప్రసాదాన్ని తయారు చేశారు. ఈసారి ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను తయారు చేశారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. అదిమొదలు ప్రపంచం నలుమూలల నుంచి అయోధ్యకు వివిధ కానుకలు అందుతున్నాయి.
ఈ నేపధ్యంలోనే అయోధ్యకు కానుకగా పంపేందుకు రేవాలో ఆరు అడుగుల ఎత్తు , 11×11 వ్యాసం కలిగిన అతిపెద్ద నగారాను తయారు చేశారు. దీనిని మార్చి 12 నాటికి అయోధ్యకు తరలించనున్నారు. దీనిని మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా రేవా నగర వీధుల్లో ఊరేగించారు. ఈ నగారాను పరీక్షించేందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం రేవాకు వచ్చింది. వారి పరిశీలన అనంతరం ఈ నగరాను రికార్డులలో నమోదు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగారా ఇదేనని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత డాక్టర్ ఏకే జైన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment