largest
-
కృత్రిమ దీవిలో అతిపెద్ద విమానాశ్రయం!
చైనా ప్రభుత్వం సముద్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. కృత్రిమ దీవిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. లియోనింగ్ ప్రావిన్స్‌లోని డాలియన్ నగరాన్ని ఆనుకుని ఉన్న సముద్రాన్ని పూడ్చి ఏకంగా ఓ సరికొత్త దీవిని నిర్మిస్తోంది. ఇక్కడే మొత్తం 20.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘డాలియన్ జి¯Œ జౌవాన్’ పేరుతో అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి, ఏటా 5 లక్షలకు పైగా విమానాలు, 8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో పనిచేయనుంది. ఇందులో నాలుగు అతిపెద్ద రన్ వేలు, 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాసెంజర్ టెర్మినల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని అంచనా. ఈ నిర్మాణం పూర్తయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా కొనసాగుతున్న హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (12.48 చ.కి.మీ) రెండో స్థానానికి పడిపోతుంది. అయితే, ఈ రెండు విమానాశ్రయాలు కూడా కృత్రిమ దీవుల్లో ఏర్పాటైనవే కావడం విశేషం. ఈ విమానాశ్రయాన్ని 2035 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. -
ఐదేళ్లకు జాతర.. లక్షల జీవాలకు పాతర.. నేపాల్‌లో ఘోరం
పొరుగు దేశం నేపాల్‌లో ఐదేళ్లకోమారు లక్షలాది మూగ జీవాలు బలి అవుతున్నాయి. ఈ అత్యంత ఘోరమైన చర్య బారా జిల్లాలోని గఢీమయీ దేవి జాతరలో చోటుచేసుకుంటుంది. ఈ జాతరలో 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకూ మూగ జీవాలను బలిఇస్తుంటారు. అయితే ఈసారి భారత సశాస్త్ర సీమ బల్, స్థానిక యంత్రాంగం మూగజీవాలను రక్షించేందుకు నిరంతరం శ్రమించింది.డిసెంబరు 2న ప్రారంభమైన ఈ జాతర 15 రోజుల పాటు జరిగింది. జాతరలో డిసెంబర్ 8, 9 తేదీల్లో అంటే రెండు రోజుల్లోనే 4,200 గేదెలను బలి ఇచ్చినట్లు సమాచారం. అయితే అధికారుల చొరవకారణంగా 750 జంతువులు బలి బారినపడకుండా తప్పించుకున్నాయి. వీటిలో గేదెలు, గొర్రెలు, మేకలు ఇతర జంతువులు ఉన్నాయి. ఈ జంతువులను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వన్యప్రాణి పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు.నేపాల్‌లోని గఢీమయీ ఆలయంలో ఈ జాతరను డిసెంబర్ 2వ తేదీన నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ జాతర డిసెంబర్ 15 వరకు కొనసాగింది. డిసెంబరు 8వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించిన జనం లెక్కకుమించిన రీతిలో జంతువులను, పక్షులను బలి ఇచ్చారు. ఈ రక్తపాత సంప్రదాయానికి స్థానికుల మూఢనమ్మకాలే కారణంగా నిలుస్తున్నాయి.265 ఏళ్లుగా గఢీమయీ ఉత్సవం జరుగుతోంది. 2019లో జంతుబలిని నిలిపివేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రపంచంలోనే అత్యధిక జంతుబలులు ఈ జాతర సమయంలోనే జరుగుతాయని అంటారు. గఢీమయీ జాతర అతిపెద్ద సామూహిక బలి కర్మగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. ఇక్కడ మొదటగా వారణాసిలోని దోమ్రాజ్ నుంచి 5,100 జంతువులను తీసుకువచ్చి బలి ఇస్తారు. జాతర జరిగే రోజుల్లో రోజుకు ఐదు లక్షలాది మంది భక్తులు వస్తుంటారని అంచనా.నేపాల్‌తో పాటు భూటాన్, బంగ్లాదేశ్, భారత్ సహా పలు దేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు ఈ జాతరకు తరలివస్తుంటారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇటువంటి జంతు బలులను నిషేధించారు. నేపాల్‌లో జరిగే ఈ జాతరను వ్యతిరేకిస్తూ భారతదేశం కూడా తన గొంతు కలిపింది. 2019లో నేపాల్ సుప్రీంకోర్టు ఈ జంతుబలిని వెంటనే నిషేధించడానికి నిరాకరించింది. అయితే జంతుబలిని క్రమంగా తగ్గించాలని ఆదేశించింది. ఇది మత విశ్వాసాలకు సంబంధించినదని, ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని కోర్టు పేర్కొంది.ఇది కూడా చదవండి: Vijay Diwas: ‘చనిపోయానని ఇంటికి టెలిగ్రాం పంపారు’: నాటి సైనికుని అనుభవం.. -
చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!
చైనాలో భారీ బంగారు నిక్షేపం బయటపడింది. సుమారు 1,000 మెట్రిక్ టన్నుల అత్యంత నాణ్యమైన ఖనిజం ఉన్నట్లు భావిస్తున్న ఈ బంగారు నిక్షేపాన్ని సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న పింగ్జియాంగ్ కౌంటీలో కనుగొన్నట్లు జియోలాజికల్ బ్యూరో ఆఫ్ హునాన్ ప్రావిన్స్ ధ్రవీకరించింది.చైనీస్ స్టేట్ మీడియా ప్రకారం.. ఈ నిక్షేపంలోని బంగారు అంచనా విలువ 600 బిలియన్ యువాన్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 6,91,473 కోట్లు. ఇది దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ మైన్‌లో లభించిన 930 మెట్రిక్ టన్నులను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వగా ఉండవచ్చు.ఈ నిక్షేపం వెలికితీతకు మైనింగ్ కార్మికులు, యంత్రాంగం తీవ్రంగా కష్టపడ్డారు. ప్రాథమిక అన్వేషణలో 2 కిలోమీటర్ల లోతులో 300 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉన్న 40 బంగారు సొరంగాలు సిరలు బయటపడ్డాయి. అధునాతన 3డీ మోడలింగ్ టెక్నాలజీని వినియోగించి మరింత ఎక్కువ లోతుకు వెళ్లి నిక్షేపాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు.మైనింగ్ టెక్నాలజీ ప్రకారం.. చైనాలో ఈ బంగారు నిక్షేపం బయటపడటానికి ముందు ప్రపంచంలోని అతిపెద్ద బంగారు నిక్షేపాలు ఇవే..1. సౌత్ డీప్ గోల్డ్ మైన్ - సౌత్ ఆఫ్రికా 2. గ్రాస్బర్గ్ గోల్డ్ మైన్ - ఇండోనేషియా 3. ఒలింపియాడా గోల్డ్ మైన్ - రష్యా 4. లిహిర్ గోల్డ్ మైన్ - పాపువా న్యూ గినియా 5. నోర్టే అబియర్టో గోల్డ్ మైన్ - చిలీ 6. కార్లిన్ ట్రెండ్ గోల్డ్ మైన్ - యూఎస్ఏ 7. బోడింగ్టన్ గోల్డ్ మైన్ - వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8. ఎంపోనెంగ్ గోల్డ్ మైన్ - సౌత్ ఆఫ్రికా 9. ప్యూబ్లో వీజో గోల్డ్ మైన్ - డొమినికన్ రిపబ్లిక్ 10. కోర్టెజ్ గోల్డ్ మైన్ - యూఎస్ఏ -
ఆసియాలో అతిపెద్ద ఛత్ ఘాట్ ఇదే..
పూర్వాంచల్: ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్లతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో ఛత్ పండుగ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోగల పూర్వాంచల్‌లో ఉన్న ఛత్ ఘాట్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. అర్పా నది ఒడ్డున నిర్మించిన ఈ ఛత్ ఘాట్ ఆసియాలోనే అతిపెద్ద ఛత్ ఘాట్‌గా పేరొందింది. ఈ ఘాట్ మొత్తం పొడవు సుమారు ఒక కిలోమీటర్లు ఉంటుంది. ఛత్ పూజలు నిర్వహించేందుకు ఈ ఘాట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.ఈ ఏడాది 50 వేల మందికి పైగా ఛత్వర్తీలు ఈ ఛత్ ఘాట్‌లో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం ఉంది. వీరితో పాటు లక్షల సంఖ్యలో వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి తరలిరానున్నారు. ఛత్ పండుగ సందర్భంగా అర్పా నది ఒడ్డును అందంగా అలంకరించారు. భద్రత దృష్ట్యా పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఈ ఘాట్‌ను జిల్లా యంత్రాంగం, భోజ్‌పురి సొసైటీ కొన్నేళ్ల క్రితమే నిర్మించింది. ప్రతి ఏటా ఛత్ పూజ సందర్భంగా ఇక్కడకు వేలాది మంది భక్తులు తరలివచ్చి, సూర్య భగవానుని ఆరాధిస్తారు. గత 24 సంవత్సరాలుగా భోజ్‌పురి కమ్యూనిటీ ప్రజలు ఈ ఘాట్‌ను ప్రార్థనా స్థలంగా ఉపయోగిస్తున్నారు. ఛత్ పూజలు జరిగే సమయంలో భక్తులు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పిస్తారు. భక్తులు నదిలో నిలబడి పూజలు చేస్తారు. ఇక్కడ జరిగే ఛత్ పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.ఇది కూడా చదవండి: పండగల్లో రూ. లక్ష కోట్ల వస్తువులు కొనేశారు -
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌లో భారీ ఆర్డర్
దేశంలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్న ఏఎం గ్రీన్ సంస్థ ఇందులో భాగంగా ఎలక్ట్రోలైజర్ల కోసం కోసం జాన్ కాకెరిల్ హైడ్రోజన్ కంపెనీతో భారీ ఒప్పందం చేసుకుంది. ఇది దేశంలోనే అత్యంత భారీ ఎలక్ట్రోలైజర్ ఆర్డర్.1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో ఉత్పత్తి చేసే తొలి మిలియన్-టన్నుల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంట్‌లో ఏర్పాటు చేస్తున్న దీని కోసం ఏఎం గ్రీన్ గత ఆగస్ట్‌లో తుది పెట్టుబడి నిర్ణయాన్ని (FID) సాధించింది. ఈ ప్లాంట్ 2026 ద్వితీయార్థంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. రెండు దశల్లో సరఫరా అయ్యే 1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి గ్రీన్ అమ్మోనియాగా మారుస్తారు.ఒప్పందంలో భాగంగా జాన్ కాకెరిల్ హైడ్రోజన్ సంస్థ మొదటి దశలో 640 మెగా వాట్ల సామర్థ్యం గల అధునాతన ఒత్తిడితో కూడిన ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్లను సరఫరా చేస్తుంది. అలాగే ఇరు సంస్థలు కాకినాడలో దేశపు అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని (ఏటా 2 గిగావాట్ల ఉత్పత్తి) అభివృద్ధి చేయనున్నాయి. తద్వారా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యానికి దోహదపడనున్నాయి. ఈ ప్లాంట్ రెండో దశలొ 640మెగా వాట్ల ఎలక్ట్రోలైజర్లను ఏఎం గ్రీన్ కాకినాడ ప్రాజెక్టుకు సరఫరా చేస్తుంది. ఏఎం గ్రీన్ గురించి.. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్కో గ్రూప్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ఏఎం గ్రీన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ఇంధన మార్పిడి పరిష్కారాలను అందించే దేశంలోని ప్రముఖ సంస్థలలో ఒకటి. ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో సరికొత్త సాంకేతికతలు, మార్గాలను అన్వేషించడంలో కృషి చేస్తోంది. -
ప్రపంచంలోనే పే....ద్ద కెమెరా!
ఏకంగా 3,200 మెగాపిక్సెల్స్. సామర్థ్యం. 5.5 అడుగుల ఎత్తు, ఏకంగా 12.25 అడుగల పొడవుతో పెద్ద సైజు కారును తలపించే పరిమాణం. దాదాపు 2,800 కిలోల బరువు! 320–1,050 ఎన్ఎం వేవ్‌లెంగ్త్ రేంజ్. ఒక్కో ఇమేజ్ కవరేజీ పరిధిలోకి కనీసం 40 పూర్ణ చంద్రులు పట్టేంత ఏరియా! ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా తాలూకు విశేషాల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంతకీ ఇది ఎక్కడుందంటారా? చిలీలో రూపుదిద్దుకుంటున్న వెరా రూబిన్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేస్తున్న సరికొత్త టెలిస్కోప్‌లో. రాజధాని శాంటియాగోకు 500 కి.మీ. దూరంలోని సెరో పాచ్న్ పర్వత శిఖరంపై 2015 నుంచీ నిర్మాణంలో ఉన్న ఈ అబ్జర్వేటరీ త్వరలో ప్రారంభం కానుంది. అందులోని ఈ అతి పెద్ద కెమెరా ప్రతి మూడు రోజులకోసారి రాత్రివేళ దాని కంటికి కని్పంచినంత మేరకూ ఆకాశాన్ని ఫొటోల్లో బంధించనుంది. అలా అంతరిక్ష శాస్త్రవేత్తలకు పదేళ్లపాటు రోజుకు కనీసం వెయ్యి చొప్పున ఫొటోలను అందుబాటులోకి తెస్తుంది! అంటే రోజుకు 20 టెరాబైట్ల డేటాను అందజేస్తుంది. ఇది ఒక యూజర్ నెట్‌ఫ్లిక్స్‌లో సగటున మూడేళ్లపాటు చూసే ప్రోగ్సామ్స్, లేదా స్పాటిఫైలో ఏకంగా 50 ఏళ్ల పాటు వినే పాటల డేటాకు సమానం! ఈ క్రమంలో మనకిప్పటిదాకా తెలియని ఏకంగా 1,700 కోట్ల కొత్త నక్షత్రాలను, 2,000 కోట్ల నక్షత్ర మండలాలను ఈ కెమెరా వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు. దీన్ని లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ (ఎల్ఎస్ఎస్టీ) కెమెరాగా పిలుస్తున్నారు. అంతేగాక అంతరిక్షంలో సంభవించే చిన్నా పెద్దా మార్పులకు సంబంధించి ప్రతి రాత్రీ ఏకంగా కోటి అలెర్టులను కూడా ఈ టెలిస్కోప్ పంపనుందట కూడా! ‘‘ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. వెరా రూబిన్ అబ్జర్వేటరీ మున్ముందు మరెన్నో ఘనకార్యాలు చేయనుంది’’ అని ఆ సంస్థ ఆస్ట్రానమిస్టు క్లేర్ హిగ్స్ చెబుతున్నారు. కృష్ణపదార్థం (డార్క్ మ్యా టర్), కృష్ణ శక్తి (డార్క్ ఎనర్జీ) వంటి పలు మిస్టరీలను ఛేదించడంలో కూడా కీలకపాత్ర పోషించే చాన్సుందన్నారు. ఈ టెలిస్కోప్‌కు 2016లో మరణించిన అమెరికా అంతరిక్ష శాస్త్రజు్ఞడు వెరా రూబిన్ పేరు పెట్టారు. ఇది ఏడాది లోపులో అందుబాటులోకి వస్తుందని అంచనా.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏకశిలా నిర్మితమైన కైలాసాలయం
ఒకే రాతితో చెక్కిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి కైలాసాలయం. దీనిని కైలాసం అని కూడా అంటారు. కొండను పై నుంచి తొలిచి ఏకశిలతో నిర్మించిన ఈ అతి పెద్ద దేవాలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కనిపిస్తుంది. ఎల్లోరాలో ఉన్న గుహాలయాలలో ఇది ఒకటి. 276 అడుగుల పోడవు, 154 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 400,000 టన్నుల శిలలను వందల సంవత్సరాలుగా తవ్వించారని అంచనా. ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహాలయాలలో ఇది ఒకటి. ఆలయ గోడలపై లభించిన ఉలి జాడల ఆధారంగా మూడు రకాల ఉలులను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో మూడు అంతస్తులు కలిగి ఉంది. ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాలలో కైలాస దేవాలయం ఒకటి. ఇది 16వ గుహ. దీనిని 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం. స్థలపురాణం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసేవరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. వెంటనే ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కోకసా అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చె΄్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుకుని వచ్చారు. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు.శిల్పరీతిఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు అంతస్తుల గోపురం ఉంది. ప్రవేశ ద్వారం వైపున శైవులు, వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం నుంచి రెండు అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి. ఉత్తరం, దక్షిణ ప్రాంగణంలోని రాయిల మీద పెద్ద ఏనుగు నిలుచుని ఘీంకరిస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రకూట రాజులు తమ గజ దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి, ఏనుగులను తమకు ఇష్టమైన జంతువులలో ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో గజ శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని సూచిస్తుంది. ప్రధాన ఆలయంలో లోపల గోడపైన కమలంపై ఆసీనురాలై ఉన్న గజలక్ష్మి ప్రతిమ దర్శనమిస్తుంది. ఆ ప్రతిమ వెనుక నాలుగు ఏనుగులు ఉన్నాయి. రెండు పెద్ద ఏనుగులలో ప్రతి ఒక్కటి పై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి పైన తొండంతో నీటిని అభిషేకిస్తున్నట్లు, రెండు చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుంచి కుండలను నింపుతున్నట్లు చిత్రీకరించబడ్డాయి. శిఖరం దాని కింద అంతస్తునుండి 96 అడుగుల ఎత్తులో ఉంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాళ గది ఉంది, ఇది ఒక పెద్ద సభ–మండపం (స్తంభాల హాలు) తో కలిసి ఉంటుంది. దీనికి పక్కల అర్ధమండపం, ముందు భాగంలో అగ్రమండపం ఉన్నాయి. నంది–మండపం, గోపురం, పూజా మందిర అగ్ర–మండ΄ానికి మధ్య ఉంది, మూడు భాగాలను ఏకరాతి దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణ మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాల వరుసలు ఉన్నాయి. కొండ పక్కన ఉన్న ప్రదక్షిణ మార్గ ఆలయ ్ర΄ాంగణంలో ఐదు వేరు వేరు దేవాలయాలు ఉన్నాయి, ఆలయ నిర్మాణంలో రెండు వేర్వేరు 45 అడుగుల ఎత్తయిన విజయ స్తంభాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజ స్తంభం వెనుక వెలుపలి గోడపై మహాభారతం, రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణమూర్తి త్రిమితీయ శిల్పం వలన ఈ ఆలయానికి ‘కైలాస‘ అని పేరు వచ్చింది. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. ఒక మండపం నుంచి మరొక మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం, స్థలం క్రమేపీ తగ్గుతూ ΄ోతుంది. వెలుతురు కూడా తగ్గిపోతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అనేక పర్యాయాలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. -
ప్రపంచంలో అతి పెద్ద ఇన్డోర్ స్కీయింగ్ పార్క్
సినిమాల్లో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో స్కీయింగ్ చూస్తాం. మంచు మీద స్కీస్ బిగించుకుని చాలా వేగంగా దూకుతూ ముందుకెళతారు. స్కీయింగ్‌లో మాగ్జిమమ్ ఎంత స్పీడ్‌గా వెళ్లవచ్చో తెలుసా? గంటకు 250 కిలోమీటర్లు. అవును. పారిస్‌లో సిమోన్ బిల్లీ అనే స్కియర్ ఈ ఘనత సాధించాడు. మన దేశంలో జనవరి నుంచి మార్చి మధ్యలో కశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో స్కీయింగ్ చేసేంత మంచు ఉంటుంది. ఆ సీజన్లో టూరిస్ట్‌లు వెళ్లి స్కీయింగ్ చేస్తారు. ఆ సీజన్ తర్వాత ఊరికే కూచోవాల్సిందే. అయితే చైనా వాళ్లు సంవత్సరం పోడుగునా స్కీయింగ్ చేయొచ్చు కదా అనుకున్నారు. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్ స్కీయింగ్ పార్క్‌లో ఇటీవల షాంఘైలో ప్రాంరంభించారు. దీని పేరు ‘ఎల్ స్నో స్కీయింగ్ థీమ్ రిసార్ట్’.90 వేల చదరపు మీటర్లలోస్కీయింగ్ చాలా దూరం వరకూ చేయాల్సిన స్పోర్ట్. ఔట్‌డోర్ అయితే మంచు మైదానం ఉంటుంది. కాని ఇండోర్‌లో అంటే కష్టమే. అయినా సరే చైనావాళ్లు 90 వేల చదరపు మీటర్ల పార్క్‌లో కృత్రిమ మంచు మైదానం సృష్టించారు. ఇందుకోసం 72 కూలింగ్ మిషీన్లు 33 స్నోమేకింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. అంటే ఎప్పుడూ లోపలి ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువే ఉంటుంది.సహజమైన మంచు లేకచైనాలోని ఉత్త ప్రాతంలో మంచు కొండలు ఉన్నాయి. చైనీయులు అక్కడ స్కీయింగ్ చేయడానికి వెళతారు. అయితే సహజమైన మంచు మైదానాల్లో ప్రమాదాలు ఎక్కువ. పైగా గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు పలుచబడుతోంది. అందువల్ల చైనీయులు తమకో స్కీయింగ్ ΄ార్క్ కావాలని కోరుకున్నారు. వారి ఆలోచనలకు తగినట్టుగా ఇప్పుడు పార్క్ తయారైంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉండటానికి గదులు షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. నగరంలో ఉంటూనే మంచు ప్రాంతానికి వెళ్లివచ్చిన అనుభూతిని పోందవచ్చు. పిల్లలు ఈ పార్క్ గురించి విన్న వెంటనే వెళ్దామని అంటున్నారట. మనం వెళ్లలేం. ఇక్కడ ఫొటోలు చూడటమే. -
Michael D Patra: 2031 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత్ 2031 నాటికి ప్రంపచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ డి పాత్ర పేర్కొన్నారు. 2060 నాటికి ప్రంపచ నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. కాకపోతే ఈ దిశగా కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. కారి్మక ఉత్పాదకత, మౌలిక వసతులు, జీడీపీలో తయారీ రంగం వాటాను పెంచడం, ఆర్థిక వ్యవస్థను పర్యావరణం అనుకూలంగా మార్చడం తదితర సవాళ్లను ప్రస్తావించారు. ముస్సోరిలో ఐఏఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో భాగంగా పాత్ర మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏటా 9.6 శాతం చొప్పున దశాబ్ద కాలం పాటు వృద్ధిని సాధిస్తే దిగువ మధ్యాదాయ ఉచ్చు నుంచి బయట పడి, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించొచ్చని చెప్పారు. ‘‘4516–14005 డాలర్ల తలసరి ఆదాయ స్థాయి అన్నది మధ్యాదాయ దేశం హోదాకు సంబంధించినది. ఇది దాటితేనే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ హోదాకు చేరుకుంటాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపునకు తలసరి ఆదాయ పరిమితి 34,000 డాలర్లకు చేరుకోవచ్చు’’అని పాత్ర పేర్కొన్నారు. కరెన్సీల విలువలు అస్థిరంగా ఉన్నాయంటూ.. దేశాల మధ్య పోలికకు ఇవి తగినవి కాదని పాత్ర అభిప్రాయపడ్డారు. దీనికి ప్రత్యామ్నాయ కొలమానం ‘కొనుగోలు శక్తి సమానత’ (పీపీపీ) అని చెప్పారు. ఆర్థిక సహాకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పీపీపీ ప్రకారం భారత్ 2048 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది చెప్పడం గమనార్హం. -
వామ్మో! ఇంతపెద్ద నీటితొట్టెనా!?
ప్రపంచంలోనే అతిపెద్ద నీటితొట్టెను నిర్మించేందుకు జపాన్ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నీటితొట్టె నిర్మాణం కోసం ఏకంగా ఒక కొండను తొలచడానికి సిద్ధపడింది. ఏకంగా 26 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ఈ నీటితొట్టె నిర్మాణానికి 400 మిలియన్ పౌండ్లు (రూ.4,191 కోట్లు) ఖర్చు చేయనుంది. విశ్వం ఆవిర్భావంలో కీలకమైన సూక్షా్మతి సూక్ష్మకణాలైన న్యూట్రినోలను కనుగొనే లక్ష్యంతో జపాన్ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా ఈ భారీ నీటితొట్టె నిర్మాణాన్ని చేపడుతోంది. ‘న్యూట్రినో’లను కనుగొనడానికి ఈ తొట్టె అడుగున 40 వేల ఆటమ్ డిటెక్టర్లను అమర్చనుంది. న్యూట్రినోలు పరమాణవుల కంటే సూక్షా్మతి సూక్ష్మంగా ఉంటాయి. వీటిని గుర్తించడం చాలా కష్టం. ఇవి అంతరిక్షంలో సంచరిస్తుంటాయి. ఇతర పదార్థాలతో ప్రభావితం కాకుండా ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సులువుగా చేరుకుంటాయి.ఇవి జీవుల శరీరాల్లోనూ కోట్ల సంఖ్యలో కదలాడుతూ ఉంటాయి. న్యూట్రినోల స్వభావాన్ని కూలంకషంగా అర్థం చేసుకోగలిగితే, విశ్వం గురించి ఇప్పటి వరకు ఉన్న ఆలోచనా ధోరణిలో మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రయోగానికి ఇరవై ఒక్క దేశాలు అండదండలు అందిస్తున్నాయి. ఈ నీటితొట్టె ఎత్తు 80 మీటర్లు, వెడల్పు 70 మీటర్లు. అంటే, దీనిలో ఏకంగా ఒక బోయింగ్–747 విమానం నిలువునా పట్టేస్తుందన్న మాట.అబుదాబిలోని ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆక్వేరియం ‘సీ వరల్డ్’తో పోల్చుకుంటే, జపాన్ నిర్మిస్తున్న ఈ నీటితొట్టె పరిమాణం నాలుగున్నర రెట్లు ఎక్కువ. న్యూట్రినోల పరిశీలన కోసం హిడా నగరానికి చేరువలో ఉన్న కొండను తొలిచి చేపడుతున్న ఈ నీటితొట్టె నిర్మాణం 2026 నాటికి పూర్తవుతుందని చెబుతున్నారు. న్యూట్రినోల పరిశీలన, ఇతర ప్రయోగాలను 2027 నుంచి ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు.ఇవి చదవండి: నిజమే..! ఇది ముక్కుసూటి రహదారే..!! సుమారు.. -
అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!
పాములకు సంబంధించిన వివిధ జాతులు, అతిపెద్ద పాములు గురించి విన్నాం. తాజాగా శాస్త్రవేత్తలు గుజరాత్లో అది పెద్ద పాము ఉనికికి సంబంధించిన శిలాజాన్ని గుర్తించారు. ఆ శిలాజంలో పాము వెన్నుపూస డైనోసర్ టీ రెక్స్(వెన్నుపూస) కంటే పొడవుగా ఉండే అతి పెద్ద పాము అవశేషాలని తెలిపారు. నిజానికి 2005ల ఐఐటీ రూర్కీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పాముని కనుగొనడం జరిగింది. అయితే ఇటీవలే దాన్ని ఒక పెద్ద పాముగా నిర్థారించారు. దీనికి "వాసుకి ఇండికస్" అని పేరు పెట్టారు. పరిశోధనలో ఈ పాములో దాదాపు 27 వెనుపూసలు ఉన్నట్లు గుర్తించారు. అదిపెద్ద కొడచిలువ వలే కనిపించిందని, విషపూరితమైనది కాదని అన్నారు. ఈ పాము పొడవు సుమారు 50 అడుగులు ఉంటుందని అంచనా వేశారు. దీని బరువు సుమారు టన్ను ఉంటుందని చెబుతున్నారు. ఈ వాసుకి మెల్లగా కదిలే ఆకస్మిక ప్రెడేటర్‌గా అభివర్ణించారు. ఈ పాము చిత్తడి నేలలో నివిశించిందని ఐఐటీ రూర్కిలోని పాలియోంటాలిజీ పరిశోధకుడు దేబిజిత్ దత్తా అన్నారు. ఈ జాతుల మూలాలను అన్వేషించే క్రమంలో ఈ పాము శిలాజానికి శివుడితో సంబంధం ఉందని, అందువల్ల దీనికి వాసుకి అని పేరు పెట్టామని చెప్పారు. ఈ భూమ్మీద ఇప్పటిదాకా అత్యంత పెద్ద పాముగా పేరుగాంచిన కొలంబోకి చెందిన టైటానోబావా పాముకి సరిసమానమైనదని అన్నారు. ఇక ఈ టైటానోబావా 43 అడుగుల పొడవుతో దాదాపు టన్నుకు పైగా బరువుతో ఉంది. ఇక్కడ ఈ వాసుకిమ పాము శరీర పొడవుని టైటానోబోవాతో పోల్చగా, టైటానోబోవా వెన్నుపూస వాసుకి కంటే కొంచెం పెద్దదిగా ఉంది. అంటే ఇక్కడ టైటానోబోవా కంటే వాసుకి సన్నగా ఉందా లేదా భారీగా ఉండేదా అనేద? చెప్పలేమని అన్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఈ శిలాజం పొడిగ, ధూళిగా ఉన్న ప్రాంతంలో గుర్తించినప్పటికీ ఈ వాసుకి పాము సంచరించేటప్పుడు ఆ ప్రాంతంలోని భూమి చిత్తడిగా ఉందని శాస్త్రవేత్తలు అన్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణ పాముల పరిమాణ పరంగా ఎలా ఉండేవి, కాలక్రమంలో ఎలా మారాయి? ప్రపంచవ్యాప్తంగా ఈ జాతులు ఎలా విస్తరించాయి అనే దానిపై పూర్తి అవగాహన అందిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, ఇంతవరకు జీవించి ఉన్న అతిపెద్ద పాముగా ఆసియాలోని రెటిక్యులేటెడ్ అనే కొండ చిలువ(33 అడుగులు పొడవు)తో ఉంది. (చదవండి: రూ. 1500 చెల్లించి మరీ చెట్లను హగ్ చేసుకోవడమా?) -
అయోధ్యకు అతిపెద్ద నగారా.. ప్రత్యేకతలివే!
ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను మధ్యప్రదేశ్‌లోని రేవాలో తయారు చేశారు. దీనిని అయోధ్యలోని రామమందిరానికి తరలించనున్నారు. గత 40 ఏళ్లుగా ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున రేవాలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. గత శివరాత్రినాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎంబ్రాయిడరీ కళాకృతిని తయారు చేశారు. అలాగే 5,100 కిలోల మహాప్రసాదాన్ని తయారు చేశారు. ఈసారి ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను తయారు చేశారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. అదిమొదలు ప్రపంచం నలుమూలల నుంచి అయోధ్యకు వివిధ కానుకలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలోనే అయోధ్యకు కానుకగా పంపేందుకు రేవాలో ఆరు అడుగుల ఎత్తు , 11×11 వ్యాసం కలిగిన అతిపెద్ద నగారాను తయారు చేశారు. దీనిని మార్చి 12 నాటికి అయోధ్యకు తరలించనున్నారు. దీనిని మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా రేవా నగర వీధుల్లో ఊరేగించారు. ఈ నగారాను పరీక్షించేందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం రేవాకు వచ్చింది. వారి పరిశీలన అనంతరం ఈ నగరాను రికార్డులలో నమోదు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగారా ఇదేనని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత డాక్టర్ ఏకే జైన్ తెలిపారు. -
విదేశాల్లో ‘మినీ ఇండియా’లు?
భారత్‌కు వెలుపల అత్యధిక భారతీయ జనాభా కలిగిన దేశాలు ఏవో మీకు తెలుసా? మారిషస్, యూకే, యూఏఈ, సింగపూర్‌తో సహా పలు దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కొన్ని దేశాల్లో ‘మినీ ఇండియా’లు కూడా ఉన్నాయి. ఇక్కడ భారతీయుల ఇళ్లను సులభంగా గుర్తించవచ్చు. అవి ఏఏ దేశాలో ఇప్పుడు తెలుసుకుందాం. మారిషస్ మారిషస్‌లో 70శాతం జనాభా భారతీయులని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సాంస్కృతికరంగ స్వర్గధామం. ఇక్కడ భారతీయ ఆహార ఖజానా విరివిగా కనిపిస్తుంది. ఇది విదేశాల్లో స్థిరపడాలనుకున్న భారతీయుల ఉత్తమ ఎంపిక అని అంటారు. యూకే భారతదేశం- యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. యూకేలో కనిపించే భారతీయ రెస్టారెంట్లు, దుకాణాలు దీనికి తార్కాణంగా నిలుస్తాయి. యూకేలో భారత సంస్కృతి కనిపిస్తుంది. యూకేలోని కొన్ని ప్రాంతాలు.. మనం భారత్‌లోనే ఉన్నామా అని అనిపించేలా ఉంటాయి. యూకేలోనూ భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్‌లో ఎక్కడికి వెళ్లినా భారతీయులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇక్కడ ఉంటే ఇండియాలో ఉన్నట్టేనని చాలామంది అంటుంటారు. యూఏఈ మొత్తం జనాభాలో భారతీయులు 42 శాతం ఉన్నారు. సౌదీ అరేబియా సౌదీ అరేబియాలోని మొత్తం జనాభాలో 10 శాతం నుంచి 13 శాతం వరకూ భారతీయులు ఉన్నారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశంగా సౌదీ అరేబియా గుర్తింపు పొందింది. కెనడా మెరుగైన ఉద్యోగావకాశాలు, ఉన్నత జీవన ప్రమాణాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తదితర అదనపు ప్రయోజనాలు భారతీయులను కెనడావైపు మళ్లేలా చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం కెనడాలో గణనీయ సంఖ్యలో భారతీయులున్నారు. ఒమన్ ఒమన్ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయులు దాదాపు 20 శాతం ఉన్నారు. 2023 నాటికి ఒమన్‌లో దాదాపు తొమ్మది లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఒమన్‌లోని భారతీయులు అక్కడి సాంస్కృతిక వైభవానికి తోడ్పాటునందిస్తున్నారు. సింగపూర్ 2023లో సింగపూర్‌లో భారతీయుల జనాభా ఏడు లక్షలు. సింగపూర్ ప్రభుత్వం ‘లిటిల్ ఇండియా’ ప్రాంత అభివృద్ధికి చేయూతనందిస్తోంది. సింగపూర్ సాంస్కృతిక వైభవానికి అక్కడి భారతీయులు తోడ్పాటునందిస్తున్నారు. అమెరికా అమెరికాలో అత్యధిక సంఖ్యలో భారతీయులున్నారు. ప్రపంచంలో తమది రెండవ అతిపెద్ద భారతీయ ప్రవాసులు కలిగిన దేశమని యునైటెడ్ స్టేట్స్ పేర్కొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కెరీర్‌ను మెరుగుపరుచుకోవడంలో పాటు పలు వ్యాపారాలు చేపడుతున్నారు. -
అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు
అనకొండనే ప్రపంచంలో అతిపెద్ద పాము జాతి అని అనుకున్నాం. అదే జాతికి చెందిని మరో జాతి అనకొండను ఈ క్వెడార్‌లో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఎన్నో ఏళ్లుగా ఈ అనకొండకు సంబంధించి మరో జాతి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. శాస్త్రవేత్తల ఊహను నిజం చేస్తే మరో జాతి అనకొండ వాళ్ల కంటపడింది. ఇది 26 అడుగుల మరియు 200 కిలోల మేర బరువుంది. ఈ మేరకు శాస్త్రవేత్త విల్ స్మిత్‌ల బృందం రానున్న నాట్ జియాఓ సిరిస్ పోల్ టు పోల్ కోసం ఫోటో షూట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ క్కెడార్లోని అమెజాన్ నది అడుగు భాగంలో ఫోటోలు చిత్రిస్తుండగా ఈ అనకొండ కెమెరాకు చిక్కింది. ఆ సరికొత్త అనకొండను చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు ఇది ఇప్పటి వరకు చూసిన అనకొండ జాతులకు చెందిందా కాదా అనే దిశగా పరిశోధనలు చేశారు. దీన్ని చూసి ఇంతకుముందు కనిపెట్టిన ఆకుపచ్చ అనుకొండకు చెందిన మరోక జాతి ఏమో అనుకున్నారు. కానీ పరిశోధనలో వేర్వేరు జాతికి చెందినదని తేలింది. ఆక్కుపచ్చలో ఉండే అనకొండ జాతి ఎక్కువగా బ్రెటిజల్ , పెరూ, బొలీవియా, ఫ్రెంచ్ గయానాలలో నివశిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన ఈ కొత్తజాతి అనకొండ తొమ్మిది దక్షిణ అమెరికా దేశాలలో బోవా గ్రూప్ సేకరించిన మిగతా అనకొండాల రక్తం, కణజాల నమూనాలతో సరిపోలలేదన్నారు. ఇది అనకొండలో కొత్త జాతిని నిర్థారించారు. దీనికి జెయింట్ అనకొండగా నామకరణం చేశారు. ఈ అనకొండ మరింత ప్రమాదకరమైనదని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. The world's largest snake has been discovered in the Amazon Rainforest: The Northern Green Anaconda measures 26 feet long and weighs 440 lbs - and its head is the same size as a human's. pic.twitter.com/XlaDk0qVYt — Denn Dunham (@DennD68) February 21, 2024 (చదవండి: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..! మరో టార్జాన్, మోగ్లీ లాంటి కథ!) -
ప్రపంచ నగరిగా అయోధ్య
సాక్షి, హైదరాబాద్: అయోధ్య.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపొందిన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ఆ ఆధ్యాత్మిక నగరి ముస్తాబైంది. సోమవారం జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పలు దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చారిత్రక కూడళ్లలో భారీ తెరలు ఏర్పాటు చేసి మరీ ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఈ ఘనత ఇక్కడికే పరిమితం కాకుండా.. అయోధ్యను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రూ.85 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొత్త రామాలయ నిర్మాణ ప్రారంభానికి ముందు అయోధ్యకు నిత్యం సగటున 2వేల మంది భక్తులు వచ్చేవారు. పనులు ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 50 వేలకు చేరింది. జనవరి ఒకటిన 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో దర్శనాలు మొదలయ్యాక నిత్యం లక్ష మంది వరకు వస్తారని.. క్రమంగా 3 లక్షల వరకు పెరగవచ్చని అంచనా. ఇప్పుడు ఇరుకుగా ఉన్న అయోధ్య అంత తాకిడిని తట్టుకోలేదని తేల్చిన ప్రభుత్వ యంత్రాంగం.. 2031 లక్ష్యంగా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ దీక్షు కుక్రేజా ఆధ్వర్యంలో దీనిపై విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు. ప్రపంచస్థాయి నగరంగా అయోధ్యను రూపొందించటమే తమ లక్ష్యమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు కూడా. నగరాన్ని భారీగా విస్తరించి.. కొత్త మాస్టర్ ప్లాన్‌లో అయోధ్య పట్టణం, దానికి జంటగా ఉన్న ఫైజాబాద్‌తోపాటు సమీపంలోని దాదాపు 26 గ్రామాలను చేర్చి.. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆధునిక అయోధ్యను తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా 1,200 ఎకరాల్లో రూ.2,200 కోట్ల వ్యయంతో న్యూఅయోధ్య పేరుతో భారీ టౌన్షిప్ పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. ఇది సరయూ నది కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. అందులో ఇటీవల హోటల్ కోసం ఓ ప్లాట్‌ను వేలం వేయగా చదరపు మీటరుకు రూ.1,09,000 చొప్పున ధర పలకడం గమనార్హం. ఇలాంటి మరికొన్ని టౌన్‌షిప్‌లకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ► అయోధ్య పాత పట్టణంలో ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులు ప్రారంభించారు. ప్రధాన రోడ్లను వెడల్పు చేస్తున్నారు. రామాలయానికి దారితీసే మూడు ప్రధాన మార్గాలను ఇప్పటికే విస్తరించారు. రూ.33 కోట్లతో ఓ మల్టీలెవల్ పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ► పట్టణంలో డీజిల్ ఆటోలకు బదులు 250 ఎలక్ట్రిక్ ఆటోలు తిప్పుతున్నారు. విమానాశ్రయం నుంచి పట్టణానికి, ఆలయం వద్దకు తిప్పేందుకు 250 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేశారు. వాటి సంఖ్యను 500కు పెంచబోతున్నారు. ► అయోధ్య పట్టణం నుంచి వెలువడే మురికినీరు సరయూ నదిలోకి చేరుతోంది. దాన్ని పూర్తిగా నిరోధించి, మురికి నీటి శుద్ధికోసం ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీల)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎస్టీపీ అందుబాటులోకి రాగా.. మరో రెండింటి పనులు జరుగుతున్నాయి. సోలార్ సిటీగా అయోధ్య అయోధ్యలో సౌర విద్యుత్ వి్రస్తృత వినియోగం కోసం ఐదేళ్ల కాలపరిమితితో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల రూఫ్ టాప్‌పై సౌర ఫలకాలను అమరుస్తున్నారు. వీటితో 8.5 మెగావాట్ల విద్యుత్ సమకూరనుంది. ఇక సరయూ నది తీరంలో 40మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఎనీ్టపీసీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 10 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ► అయోధ్య శివార్లలో సరయూ తీరం వెంట 12.90 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత నిడివిలో సోలార్ లైట్లు ఉండటం రికార్డు అని, దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కనుందని యూపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. ► సౌర ఫలకాలతో కూడిన ‘సోలార్ ట్రీ’లను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. 1 కేవీ సామర్థ్యం ఉన్నవి 40.. 2.5 కేవీ సామర్థ్యం ఉన్నవి 18 సిద్ధమవుతున్నాయి. తాగునీటి కియోస్‌్కలు, మొబైల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లు ఈ విద్యుత్‌తోనే పనిచేయనున్నాయి. ► సరయూ నదిలో సౌర విద్యుత్‌తో పనిచేసే పవర్ బోట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్లాస్టిక్ నుంచి ఇంధనం అయోధ్యలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాహనాల ఇంధనంగా మార్చే రీసైక్లింగ్ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌తో కుదిరిన ఒప్పందం మేరకు బెంగుళూరుకు చెందిన సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ఏటా 7,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఇంధనంగా మార్చగలదు. ఉత్తర భారతంలో ఈ తరహా అతిపెద్ద ప్లాంటు ఇదే కానుంది. విస్తృతంగా వసతి సౌకర్యాలు అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున హోటల్ పరిశ్రమ కూడా విస్తృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఫైవ్‌స్టార్ హోటళ్లను నిర్వహిస్తున్న ఓ పెద్ద సంస్థ 120 గదులతో ఒకటి, 100 గదులతో మరోటి చొప్పున రెండు స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు, భోజన వసతి ఇళ్లను నిర్వహించే మరో కంపెనీ.. వెయ్యి గదులతో కూడిన 50 హోటళ్లను, భోజన నివాసాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని సంస్థలు 1,100 గదులతో కూడిన హోటళ్లను నిర్మించనున్నాయి. దేశవ్యాప్తంగా ఆకాశహరŠామ్యలు నిర్మిస్తున్న బడా సంస్థ 51 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో లగ్జరీ విల్లాలు, సాధారణ ఇళ్లు, హోటళ్లను నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంది. -
అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం!
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్‌ను రూపొందించారు. ఉల్లిపాయలు,ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్‌ని తీర్చిదిద్దారు. పట్నాయక్ తనదైన శైలిలో ప్రజలకు సందేశం ఇచ్చారు. శాంతాక్లాజ్ సైకత శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతోపాటు ఈ భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ భారీ సైకత శిల్పం తయారీకి రెండు టన్నుల ఉల్లిని వినియోగించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో విభిన్న శిల్పాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటానని పట్నాయక్ చెప్పారు. ఈసారి ఉల్లిపాయలు, ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్‌ని తయారుచేశానని తెలిపారు. ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘వాజపాయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు? Our World's biggest Onion and Sand installation of #SantaClaus. Set a New World record. The Chief Editor Sushma Narvekar and Senior Adjudicator Sanjay Narvekar of World Record Book of India declared it as a new world record and they presented me official certificate and a medal… pic.twitter.com/IzseZTpVsn — Sudarsan Pattnaik (@sudarsansand) December 25, 2023 -
80 వేల కిలోల గంటను బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
రాజస్థాన్‌లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానిని బిగిస్తున్న సమయంలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఇంజినీరుతో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోటా జిల్లా యంత్రాంగం, రివర్ ఫ్రంట్ అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్‌లోని కోటాలోని చంబల్ నది ఒడ్డున 80 వేల కిలోల బరువున్న గంటను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గంట చేసే శబ్దం 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఈ గంట ప్రపంచంలోనే అతిపెద్ద గంటగా గుర్తింపు పొందింది. ఈ గంట ఐదువేల సంవత్సరాల వరకు నిలిచివుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ గంటను రివర్ ఫ్రంట్‌కు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారు. ఈ గంటను నిర్దేశిత స్థానంలో అమరుస్తుండగా ఇంజనీర్ దేవేంద్ర ఆర్య, మరో కార్మికుడు 35 అడుగుల ఎత్తునుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవేంద్ర కన్నుమూశారని వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
ప్రపంచంలోనే అతిపెద్ద కోట!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోట. ఈ కోట పాకిస్తాన్‌లోని సింద్ ప్రావిన్స్‌లో ఉంది. దీని పేరు రాణికోట. పదిహేడో శతాబ్దంలో సింద్ ప్రాంతాన్ని పరిపాలించిన తాల్పూర్ వంశ పాలకులు ఈ కోటను జమ్షోరో జిల్లా సన్ పట్టణంలో నిర్మించారు. ఈ కోట గోడ చుట్టుకొలత ఏకంగా 32 కిలోమీటర్లు. తాల్పూర్ వంశ పాలకులు ఈ కోటను 1812లో మరింత పటిష్ఠంగా పునర్నిర్మించారు. పునర్నిర్మాణం కోసం అప్పట్లో వారు 12 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కోట గోడ చుట్టూ బురుజులను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. వీటిలో మూడు పెద్దబురుజులను అర్ధచంద్రాకారంలో నిర్మించారు. మెలికలు మెలికలుగా కనిపించే ఈ కోట నిర్మాణం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. పంతొమ్మిదో శతాబ్దిలో బ్రిటిష్ సేనలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత దీని పరిరక్షణ కోసం చర్యలు ప్రారంభించింది. యూనెస్కో 1993లో దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. (చదవండి: క్రీస్తూ పూర్వం నాటి పురాతన కట్టడాలకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీతో ప్రాణం పోస్తే...) -
Swaminarayan Akshardham: భారత్ వెలుపల అతిపెద్ద దేవాలయం
రాబిన్స్‌విల్లె: భారత్ వెలుపల నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో అక్టోబర్ 8వ తేదీన ప్రారంభం కానుంది. న్యూజెర్సీ రాష్ట్రంలోని రాబిన్స్‌విల్లె పట్టణంలో బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షర్‌ధామ్‌గా పిలుచుకునే ఈ గుడి రూపుదిద్దుకుంది. అమెరికా వ్యాప్తంగా తరలివచ్చిన 12 వేల మంది కార్యకర్తలు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. 183 ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణానికి 2011 నుంచి 2023 వరకు సుమారు 12 ఏళ్లు పట్టింది. సుమారు 10 వేల విగ్రహాలను ఇందులో వాడారు. కంబోడియాలోని 12వ శతాబ్ధం నాటి అంగ్కోర్ వాట్ హిందూ ఆలయం తర్వాత బహుశా ఇదే అతిపెద్దదని అంటున్నారు. ఆలయాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు తరలివస్తున్నారు. -
హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ.. రూ.3,000 కోట్లతో భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగ సంస్థ హానర్ ప్రైమ్ హౌజింగ్ హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును ఆవిష్కరించింది. హానర్ సిగ్నాటిస్ పేరుతో హైటెక్‌సిటీ–కూకట్పల్లి మార్గంలో ఐడీఎల్ రోడ్డులో రూ.3,000 కోట్లతో ఈ భారీ నిర్మాణానికి సంస్థ శ్రీకారం చుట్టింది. 27.5 ఎకరాల్లో ఒక్కొక్కటి 25 అంతస్తుల్లో 18 టవర్లు రానున్నాయి. మొత్తం 3,266 అపార్ట్మెంట్లను నిర్మిస్తారు. హానర్ సిగ్నాటిస్ ఇప్పటికే సుమారు 1,300 బుకింగ్స్ నమోదు చేసింది. రెరాకు సమర్పించిన ప్రణాళిక ప్రకారం 9 టవర్లతో కూడిన తొలి దశ ప్రాజెక్టు 2026 డిసెంబరుకల్లా పూర్తి కావాల్సి ఉంది. గడువు కంటే ముందుగా తొలి దశ పూర్తి చేస్తామని ప్రమోటర్–డైరెక్టర్ బాలు చౌదరి వెల్లడించారు. ప్రమోటర్–డైరెక్టర్లు పి.వెంకటేశ్వర్లు, స్వప్న కుమార్, రాజమౌళితో కలిసి ప్రాజెక్టు విశేషాలను గురువారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ధర రూ.3 కోట్ల వరకు.. ఒక్కో అపార్ట్మెంట్ 1,695–3,815 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3, 3.5, 4 బీహెచ్‌కే ఆఫర్ చేస్తారు. ధర రూ.1.25 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంది. 4 బీహెచ్‌కే అల్ట్రా ప్రీమియం అపార్ట్మెంట్స్ కోసం ప్రత్యేకంగా నాలుగు టవర్లు ఏర్పాటు చేస్తారు. 1.31 లక్షల చ.అ.విస్తీర్ణంలో రెండు క్లబ్ హౌజులు ఉంటాయి. వీటిలో 20,000 చ.అ.విస్తీర్ణంలో జిమ్ నెలకొల్పుతారు. రెండు స్విమ్మింగ్ పూల్స్, సూపర్ మార్కెట్, క్లినిక్, అలాగే లాకర్ సౌకర్యంతో బ్యాంక్ వంటివి రానున్నాయి. ఈవీ చార్జింగ్ స్టేషన్, 5 ఎకరాల పార్క్ అదనపు ఆకర్షణ. స్కూల్ బస్‌లు వచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా రోడ్డు నిర్మిస్తారు. ఐజీబీసీ నుంచి ఈ ప్రాజెక్టు ప్రీ–సర్టిఫైడ్ గోల్డ్ ధ్రువీకరణ అందుకుంది. మరో కోటి చ.అ. విస్తీర్ణంలో.. హానర్ ప్రైమ్ హౌజింగ్ హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు ప్రాజెక్టులను 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి చేసింది. మూడవ ప్రాజెక్టు హానర్ రిచ్మాంట్లో భాగంగా 28.4 ఎకరాల్లో 12 లక్షల చ.అ. విస్తీర్ణంలో విల్లాలు నిర్మాణంలో ఉన్నాయి. నాల్గవ ప్రాజెక్టు అయిన హానర్ సిగ్నాటిస్ 78 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటవుతోంది. రానున్న రోజుల్లో మరో ఒక కోటి చ.అ.విస్తీర్ణం జోడించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. నాణ్యత, అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ రియల్టీ రంగంలో టాప్–10లో నిలవాలన్న లక్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెట్టినట్టు సంస్థ తెలిపింది. -
అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు!
World Biggest Palace Istana Nurul Iman: ఇప్పటి వరకు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాల జాబితాలో 'యాంటిలియా' ఉన్న విషయం తెలిసిందే. ఈ భవనం కంటే కూడా ఇంకా ఖరీదైన.. విశాలమైన & విలాసవంతమైన ప్యాలెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇస్తానా నూరుల్ ఇమాన్.. నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం 'ఇస్తాన నూరుల్ ఇమాన్'. ఇది ఇండోనేషియాకు సమీపంలో ఉన్న చిన్న దేశం బ్రూనైలో ఉంది. దీని యజమాని బ్రూనై సుల్తాన్ 'హసనల్ బొల్కియ'. ఈయన ఆ దేశ ప్రధాన మంత్రి కావడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. నిజానికి బోల్కియా దేశానికి సుల్తాన్‌గా పట్టాభిషేకం చేసినప్పటి నుంచి చాలా దశాబ్దాలుగా ఆ రాజప్రసాదంలో నివసిస్తున్నారు. ఇది కేవలం అంబానీ యాంటిలియాకి మాత్రమే కాదు భారతదేశంలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కంటే కూడా చాలా పెద్దది. దీని విస్తీర్ణం సుమారు 2.15 మిలియన్ చదరపు అడుగుల వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు.. ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్.. అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ భావనాన్ని 'ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్' (The Light Of Faith) అని కూడా పిలుస్తారు. ఇందులో చాలాభాగం తెలుపు రంగులో, గోపురాలు బంగారు రంగులో ఉంటాయి. అంతే కాకుండా ప్యాలెస్ గోపురం 22 క్యారెట్ బంగారంతో ఉన్నట్లు సమాచారం. ఇందులోని పైకప్పులు బ్రూనై ఇస్లామిక్ సంస్కృతి & మలయ్ సంప్రదాయాల ప్రకారం నిర్మించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. ఇస్తాన నూరుల్ ఇమాన్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతి పెద్ద భవనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఈ భవన నిర్మాణానికి అయిన ఖర్చు అంచనా ప్రకారం రూ. 2,550 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. హస్సనల్ బోల్కియా ఇందులో చాలా సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. వీరి వద్ద 7000 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 41,600 కోట్లు. ఇదీ చదవండి: అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు ఇస్తాన నూరుల్ ఇమాన్ 1,788 గదులను కలిగి ఉన్నట్లు, ఇందులో 257 బాత్రూమ్లు, 5,000 మంది అతిథులకు సరిపోయే హాల్, ఐదు స్విమ్మింగ్ పూల్స్, హెలిప్యాడ్ వంటి మరెన్నో సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవనం కూడా అని చెబుతారు. -
అయ్యయ్యో..దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది
Ain Dubai (Dubai Eye) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాలు, రికార్డ్-బ్రేకింగ్ ల్యాండ్‌మార్క్ నిర్మాణాలకు పుట్టినిల్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ముఖ్యంగా గ్లామ్-హబ్ దుబాయ్పర్యాటకులను ఆకర్షించే అతిపెద్ద ఫెర్రిస్ వీల్ ఐన్ దుబాయ్ (దుబాయ్ఐ) అర్థాంతరంగా నిలిచిపోయింది. దుబాయ్‌లో రెండేళ్ల కిందట (అక్టోబర్ 21, 2021) అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జెయింట్ వీల్ హఠాత్తుగా ఆగిపోవడం చర్చకు దారితీసింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!) దుబాయ్ అంటే ఆకాశహర్మ్యాలు, షాపింగ్ మాల్స్ షాపింగ్, లగ్జరీ హోటల్స్ తోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గుర్తొస్తాయి. వీటన్నింటికి మించి అట్టహాసంగా ప్రారంభమై పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రిస్ వీల్. ఈ అతిపెద్ద జెయింట్ వీల్ మొరాయిస్తోంది. ప్రస్తుతం ఎల్ఈడీ ఫిక్చర్లు మాత్రమే పనిచేస్తున్నాయట. ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్ స్వయంగా ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఐన్ దుబాయ్ తెరుచుకోదని వెల్లడించింది. గత కొద్ది నెలలుగా జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి శరవేగంగా పనిచేస్తున్నామని ప్రకటించింది. దుబాయ్ ఐని ఎపుడు తిరిగి ప్రారంభించేదీ అధికారికంగా వెల్లడించలేదు. (లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!) దుబాయ్ పర్యాటక శాఖ ప్రకారం పుట్టినల్లు దుబాయ్ ఐ 250 మీటర్ల (825 అడుగులు) uత్తులో ఉంది. . ప్రపంచంలోనే అతిపెద్దది. లండన్ ఐ కంటే దాదాపు రెండు రెట్లు ఎత్తు. అంతర్జాతీయ కంపెనీల కన్సార్టియం నిర్మించిన దుబాయ్ఐ, బ్లూవాటర్స్లో ఉంది. ఈఫిల్ టవర్ కంటేఎక్కువ ఉక్కుతో తయారు చేయబడినజెయింట్ వీల్, నామమాత్రంగానే మిగిలిపోవడం పర్యాటక ప్రియులను నిరాశపరుస్తోంది. -
రూ.1,600 కోట్లతో ‘మాండలీజ్ చాక్లెట్స్’ విస్తరణ
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ సంస్థ మాండలీజ్ రాష్ట్రంలో భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. శ్రీసిటీలో ఇప్పటికే రూ.2,078 కోట్లతో 133 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ ఏర్పాటు చేసిన మాండలీజ్.. ఆ యూనిట్లోనే రూ.1,600 కోట్లతో విస్తరణ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ విస్తరణ ద్వారా 57 వేల చదరపు మీటర్ల మేర అభివృద్ధి చేయనున్నామని, తద్వారా ఏటా 2.20 లక్షల టన్నుల కోకోను వినియోగించుకునే సామర్థ్యం వస్తుందని మాండలీజ్ ఇండియా సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ మానేపల్లి తెలిపారు. కొత్తగా మూడు ఉత్పత్తి లైన్లు విస్తరణలో భాగంగా కొత్తగా మూడు ఉత్పత్తి లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 400 మంది పనిచేస్తుండగా.. విస్తరణ తర్వాత ఉపాధి లభించే వారి సంఖ్య 973కు చేరనుంది. అలాగే.. ఈ యూనిట్ ద్వారా 18 వేల మంది కోకో రైతులకు ప్రయోజనం లభించనుందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మూడు సంవత్సరాల్లో ఈ విస్తరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ సందర్భంగా వెంకట్ మానేపల్లి మాట్లాడుతూ.. ‘భారతదేశంలో 75 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థగా మా వృద్ధికి అనుగుణంగా దేశంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించటం పట్ల సంతోషంగా ఉన్నాం. కీలకమైన శ్రీ సిటీ తయారీ యూనిట్ కార్యకలాపాలను విస్తరిస్తూ పెట్టుబడులు పెట్టడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో మరిన్ని విజయాలను నమోదు చేస్తాం’ అని పేర్కొన్నారు. మాండలీజ్ శ్రీసిటీ యూనిట్ ద్వారా క్యాడ్బరీ, బార్నొవిటీ, ఓరియో వంటి బ్రాండ్స్‌కు చెందిన చాక్లెట్లు, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను అందిస్తోంది. -
ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.. మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా..?
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం పెంటగాన్‌పై ఉన్న రికార్డ్ ప్రస్తుతం మారిపోనుంది. ఇప్పుడు ఆ వేదిక ఇక గుజరాత్‌లోని సూరత్ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద భవనం డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌ను సూరత్‌లో నిర్మించారు. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇది తొమ్మిది ధీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. దాని ఫ్లోర్ 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఈ ట్రేడింగ్ భవనాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇదీ చదవండి: విపక్షాల భేటీకి దీటుగా.. 38 పార్టీలతో ఎన్డీఏ కూటమి సమావేశం.. -
ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్‌లోనే.. యజమాని ఈయనే..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం భారత్‌లోనే ఉందన్న విషయం మీకు తెలుసా? గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా ప్రాంతంలో ఉంది. బరోడా గైక్వాడ్స్ యాజమాన్యంలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ (Laxmi Vilas Palace) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం. ఇది ఇంగ్లండ్ రాజ కుటుంబీల నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే చాలా రెట్లు పెద్దది. 500 ఎకరాల విస్తీర్ణం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ బరోడా రాజ కుటుంబానికి చెందిన నివాసం. ఈ ప్యాలెస్ 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 19వ శతాబ్దపు ఇండో-సార్సెనిక్ కాలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఇదే అతి పెద్దది. ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది. ఆకట్టుకునే కళాకృతులు గుజరాత్‌లోని ఈ రాజ యుగం నాటి ప్యాలెస్‌లో విస్తృతమైన ఇంటీరియర్ డిజైన్లు ఆకట్టుకుంటాయి. మొజాయిక్లు, షాన్డిలియర్లు, కళాకృతులు, ఆయుధాలు, కళాకృతులు ఆకర్షిస్తాయి. అప్పటి బరోడా మహారాజు ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మను ప్రత్యేకంగా నియమించి పెయింటింగ్‌లు వేయించారు. విశాలమైన పార్క్ లాంటి మైదానాలు ఇందులో ఉన్నాయి. ఇందులో గోల్ఫ్ కోర్స్ కూడా ఉండటం విశేషం. ఈయనే యజమాని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యజమాని హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ ( HRH Samarjitsinh Gaekwad). రంజిత్‌సిన్హ్ ప్రతాప్‌సిన్హ్ గైక్వాడ్, శుభంగినీరాజేల ఏకైక కుమారుడు. 1967 ఏప్రిల్ 25న జన్మించిన ఈయన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నారు. సమర్జిత్సిన్హ్ తన తండ్రి మరణం తర్వాత 2012లో మహారాజుగా పట్టాభిషక్తుడయ్యారు. ఈ వేడుక లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో 2012 జూన్ 22న అట్టహాసంగా జరిగింది. 2013లో తన మామ సంగ్రామ్‌సింగ్ గైక్వాడ్‌తో పాత వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకుని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌కు యజమాని అయ్యారు. రూ. 20,000 కోట్లకు పైగా ఆస్తి సంక్రమించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో 17 దేవాలయాలను నిర్వహించే దేవాలయాల ట్రస్టు సమర్జిత్సిన్హ్ ఆధీనంలో ఉంది. 2014లో బీజేపీలో చేరిన ఈయన 2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. సమర్జిత్సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.