సినిమాల్లో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో స్కీయింగ్ చూస్తాం. మంచు మీద స్కీస్ బిగించుకుని చాలా వేగంగా దూకుతూ ముందుకెళతారు. స్కీయింగ్‌లో మాగ్జిమమ్ ఎంత స్పీడ్‌గా వెళ్లవచ్చో తెలుసా? గంటకు 250 కిలోమీటర్లు. అవును. పారిస్‌లో సిమోన్ బిల్లీ అనే స్కియర్ ఈ ఘనత సాధించాడు. మన దేశంలో జనవరి నుంచి మార్చి మధ్యలో కశ్మీర్‌లో, హిమాచల్ ప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో స్కీయింగ్ చేసేంత మంచు ఉంటుంది. ఆ సీజన్‌లో టూరిస్ట్‌లు వెళ్లి స్కీయింగ్ చేస్తారు. ఆ సీజన్ తర్వాత ఊరికే కూచోవాల్సిందే. అయితే చైనా వాళ్లు సంవత్సరం పోడుగునా స్కీయింగ్ చేయొచ్చు కదా అనుకున్నారు. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్ స్కీయింగ్ పార్క్‌లో ఇటీవల షాంఘైలో ప్రాంరంభించారు. దీని పేరు ‘ఎల్ స్నో స్కీయింగ్ థీమ్ రిసార్ట్’.
90 వేల చదరపు మీటర్లలో
స్కీయింగ్ చాలా దూరం వరకూ చేయాల్సిన స్పోర్ట్. ఔట్‌డోర్ అయితే మంచు మైదానం ఉంటుంది. కాని ఇండోర్‌లో అంటే కష్టమే. అయినా సరే చైనావాళ్లు 90 వేల చదరపు మీటర్ల పార్క్‌లో కృత్రిమ మంచు మైదానం సృష్టించారు. ఇందుకోసం 72 కూలింగ్ మిషీన్లు 33 స్నోమేకింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. అంటే ఎప్పుడూ లోపలి ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువే ఉంటుంది.
సహజమైన మంచు లేక
చైనాలోని ఉత్త ప్రాతంలో మంచు కొండలు ఉన్నాయి. చైనీయులు అక్కడ స్కీయింగ్ చేయడానికి వెళతారు. అయితే సహజమైన మంచు మైదానాల్లో ప్రమాదాలు ఎక్కువ. పైగా గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు పలుచబడుతోంది. అందువల్ల చైనీయులు తమకో స్కీయింగ్ ΄ార్క్ కావాలని కోరుకున్నారు. వారి ఆలోచనలకు తగినట్టుగా ఇప్పుడు పార్క్ తయారైంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉండటానికి గదులు షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. నగరంలో ఉంటూనే మంచు ప్రాంతానికి వెళ్లివచ్చిన అనుభూతిని పోందవచ్చు. పిల్లలు ఈ పార్క్ గురించి విన్న వెంటనే వెళ్దామని అంటున్నారట. మనం వెళ్లలేం. ఇక్కడ ఫొటోలు చూడటమే.
Comments
Please login to add a commentAdd a comment