Shanghai
-
చైనాను పగబట్టిన ప్రకృతి.. భీకర తుపాన్‌తో అతలాకుతలం
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనాలో బెబింకా తుపాన్ బీభత్సం సృష్టించింది. బెబింకా కేటగిరీ-1 తుఫాను కావడంతో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక, గత 75 ఏళ్లలో ఇంత ప్రమాదకరమైన తుపాను చైనాను తాకలేదు. తుపాన్ కారణంగా చైనా వాతావరణ శాఖ షాంఘైలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.కాగా, చైనా వాణిజ్య కేంద్రంగా పరిగణించబడే షాంఘైలో తుపాన్ భారీ బీభత్సం సృష్టించింది. బెబింకా తుపాన్ తాకినప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాన్ కారణంగా జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. చైనాలో ఇంత పెద్ద తుపాను రావడం 75 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ తరహా శక్తివంతమైన తుపాన్1949లో వచ్చింది. Today, the biggest typhoon in 75 years landed in Shanghai. pic.twitter.com/giZ85iiJl2— Sharing Travel (@TripInChina) September 16, 2024 🇨🇳#China #September16Category 1 Typhoon Bebinka in Suzhou, Jiangsu Province‼️🌀Wind speed at the epicenter was 120 km/h (33 m/s) with gusts up to 151 km/h (42 m/s)#TyphoonBebinca #weatherstation pic.twitter.com/G0Uy0ix0Cd— Irene (@irene_makarenko) September 16, 2024 Salute to his confidence#TyphoonBebinca #bebinca #typhoon #shanghai #China #collapse pic.twitter.com/xsAqefUGWd— Chaudhary Parvez (@ChaudharyParvez) September 17, 2024 తుపాను ప్రభావంతో షాంఘైలో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను కారణంగా షాంఘై, జెజియాంగ్, జినుహా నగరాల్లో లెవెల్-3 హెచ్చరిక జారీ చేయగా అను ప్రావిన్సులో లెవెల్-4 హెచ్చరిక జారీ చేశారు. తుపాను దెబ్బకు షాంఘై నగరంలోని రెండు ఎయిర్‌పోర్టుల నుంచి ఆదివారం సాయంత్రం నుంచి 1400 విమానాలు రద్దయ్యాయి. నగరం నుంచి బయల్దేరాల్సిన 570 ప్యాసింజర్ రైళ్లను క్యాంసిల్ చేశారు. కాగా, సోమవారం సాయంత్రానికి వర్షాలు, గాలులు తీవ్రమవుతాయని చైనా వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో 4,14,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. Perfect example as to why you shouldn’t be out during the storm.Take a look at some of these videos of the damage #TyphoonBebinca did to #Shanghai #China! #wx #wxtwitter #tropicswx #typhoon #bebincapic.twitter.com/1S0Ee3KC9C— Chaudhary Parvez (@ChaudharyParvez) September 17, 2024రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖతుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. చైనా వాతావరణ శాఖ షాంఘైలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెస్క్యూ చర్యల నిమిత్తం సహాయక సిబ్బందిని భారీగా మోహరించింది. అత్యవసర సమయంలో ప్రజలు ఉండటానికి సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. షాంఘై నుంచి దూరంగా ఉన్న అన్ని నౌకలు ఓడరేవుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, చైనాలోని దక్షిణ ప్రాంతం నిరంతరం ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతూనే ఉంది. గత వారమే యాగి తుపాను హెనాన్ ప్రావీన్సును తాకగా ఆస్తి నష్టం వాటిల్లింది. 🇨🇳🌪📹 — Reports on Mainland Chinese social media indicate that Shanghai was struck by the strongest typhoon since 1949 today.#Typhoon #Shanghai #China pic.twitter.com/enJWcxCxt8— Popsicle Protector OSNIT (@PopsicleProtect) September 16, 2024ఇది కూడా చదవండి: లంచ్ బ్రేక్‌లో లవ్వు!.. రష్యన్లకు పుతిన్ కొత్త సూచన -
షాంఘైలో ‘బెబింకా’ బీభత్సం..స్తంభించిన జనజీవనం
షాంఘై: చైనా ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన షాంఘై నగరాన్ని బెబింకా తుపాను బెంబేలెత్తిస్తోంది. సోమవారం(సెప్టెంబర్16) ఉదయం బెబింకా తుపాను షాంఘై నగరాన్ని తాకింది. తుపాను నగరాన్ని తాకినప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో జన జీవనం స్తంభించింది. షాంఘై నగరాన్ని తుపాన్లు తాకడం చాలా అరుదు. నగరాన్ని ఇంత పెద్ద తుపాను తాకడం 75 ఏళ్లలో ఇదే తొలిసారి.తుపాను ప్రభావంతో షాంఘైలో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను కారణంగా షాంఘై, జెజియాంగ్, జినుహా నగరాల్లో లెవెల్ 3 హెచ్చరిక జారీ చేయగా అను ప్రావిన్సులో లెవెల్ 4 హెచ్చరిక జారీ చేశారు. తుపాను దెబ్బకు షాంఘై నగరంలోని రెండు ఎయిర్‌పోర్టుల నుంచి ఆదివారం సాయంత్రం నుంచి 1400 విమానాలు రద్దయ్యాయి. నగరం నుంచి బయల్దేరాల్సిన 570 ప్యాసింజర్ రైళ్లను క్యాంసిల్ చేశారు. కాగా, సోమవారం సాయంత్రానికి వర్షాలు, గాలులు తీవ్రమవుతాయని చైనా వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, ఇటీవలే చైనాలో యాగీ తుపాను ప్రభావంతో భారీగా ఆస్తి,ప్రాణ నష్టాలు సంభవించాయి. ఇదీ చదవండి.. యూరప్‌లో వరద విలయం -
ప్రపంచంలో అతి పెద్ద ఇన్డోర్ స్కీయింగ్ పార్క్
సినిమాల్లో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో స్కీయింగ్ చూస్తాం. మంచు మీద స్కీస్ బిగించుకుని చాలా వేగంగా దూకుతూ ముందుకెళతారు. స్కీయింగ్‌లో మాగ్జిమమ్ ఎంత స్పీడ్‌గా వెళ్లవచ్చో తెలుసా? గంటకు 250 కిలోమీటర్లు. అవును. పారిస్‌లో సిమోన్ బిల్లీ అనే స్కియర్ ఈ ఘనత సాధించాడు. మన దేశంలో జనవరి నుంచి మార్చి మధ్యలో కశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో స్కీయింగ్ చేసేంత మంచు ఉంటుంది. ఆ సీజన్లో టూరిస్ట్‌లు వెళ్లి స్కీయింగ్ చేస్తారు. ఆ సీజన్ తర్వాత ఊరికే కూచోవాల్సిందే. అయితే చైనా వాళ్లు సంవత్సరం పోడుగునా స్కీయింగ్ చేయొచ్చు కదా అనుకున్నారు. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్ స్కీయింగ్ పార్క్‌లో ఇటీవల షాంఘైలో ప్రాంరంభించారు. దీని పేరు ‘ఎల్ స్నో స్కీయింగ్ థీమ్ రిసార్ట్’.90 వేల చదరపు మీటర్లలోస్కీయింగ్ చాలా దూరం వరకూ చేయాల్సిన స్పోర్ట్. ఔట్‌డోర్ అయితే మంచు మైదానం ఉంటుంది. కాని ఇండోర్‌లో అంటే కష్టమే. అయినా సరే చైనావాళ్లు 90 వేల చదరపు మీటర్ల పార్క్‌లో కృత్రిమ మంచు మైదానం సృష్టించారు. ఇందుకోసం 72 కూలింగ్ మిషీన్లు 33 స్నోమేకింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. అంటే ఎప్పుడూ లోపలి ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువే ఉంటుంది.సహజమైన మంచు లేకచైనాలోని ఉత్త ప్రాతంలో మంచు కొండలు ఉన్నాయి. చైనీయులు అక్కడ స్కీయింగ్ చేయడానికి వెళతారు. అయితే సహజమైన మంచు మైదానాల్లో ప్రమాదాలు ఎక్కువ. పైగా గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు పలుచబడుతోంది. అందువల్ల చైనీయులు తమకో స్కీయింగ్ ΄ార్క్ కావాలని కోరుకున్నారు. వారి ఆలోచనలకు తగినట్టుగా ఇప్పుడు పార్క్ తయారైంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉండటానికి గదులు షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. నగరంలో ఉంటూనే మంచు ప్రాంతానికి వెళ్లివచ్చిన అనుభూతిని పోందవచ్చు. పిల్లలు ఈ పార్క్ గురించి విన్న వెంటనే వెళ్దామని అంటున్నారట. మనం వెళ్లలేం. ఇక్కడ ఫొటోలు చూడటమే. -
చైనాలోకి అదానీ అడుగు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ చైనాలోకి అడుగుపెట్టింది. సప్లయ్ చైన్ సొల్యూషన్లు, ప్రాజెక్టు నిర్వహణ సేవలను ఆఫర్ చేసేందుకు వీలుగా ఓ సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే తన సబ్సిడరీ కంపెనీ అదానీ గ్లోబల్ పీటీఈ (ఏజీపీటీఈ) షాంఘై కేంద్రంగా ‘అదానీ ఎనర్జీ రీసోర్సెస్ (షాంఘై) కో’ (ఏఈఆర్సీఎల్)ను ఏర్పాటు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కంపెనీల చట్టం కింద ఏఈఆర్సీఎల్ను సెపె్టంబర్ 2న ఏర్పాటు చేశామని, ఇది ఇంకా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉందని తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌లు, మైనింగ్, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం, నీటి ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ తదితర రంగాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కెన్యాలోని నైరోబీలో జోమో కెన్యట్టా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి గాను ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు కూడా నిర్వహిస్తోంది. ఇది సఫలమైతే ఆ సంస్థకు భారత్ వెలుపల ఇది మొదటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. -
రన్నరప్‌గా బోపన్న జోడీ.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
షాంఘై: ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోరీ్నలో బోపన్న–ఎబ్డెన్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 7–5, 2–6, 7–10తో గ్రానోలెర్స్ (స్పెయిన్)–జెబలాస్ (అర్జెంటీనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–ఎబ్డెన్‌లకు 2,31,660 డాలర్ల (రూ. కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు... టైటిల్ నెగ్గిన గ్రానోలెర్స్–జెబలాస్లకు 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా ఫలితంతో బోపన్న –ఎబ్డెన్ జోడీ టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. షాంఘై మాస్టర్స్ టోర్నీ విజేత హుర్కాజ్ పోలాండ్ టెన్నిస్ స్టార్ హుబెర్ట్ హుర్కాజ్ తన కెరీర్లో రెండో మాస్టర్స్ సిరీస్ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో హుర్కాజ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 17వ ర్యాంకర్ హుర్కాజ్ 6–3, 3–6, 7–6 (10/8)తో ఏడో ర్యాంకర్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై గెలిచాడు. విజేత హుర్కాజ్‌కు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 52 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
40 సెకన్లకు ఓ కారు తయారీ.. ఎక్కడో తెలుసా?
ప్రపంచ మార్కెట్లో టెస్లా సంస్థకు చెందిన వాహనాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కంపెనీ త్వరలో భారతదేశంలో కూడా అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే చైనాలోని షాంఘైలో ఉన్న టెస్లా ఫ్యాక్టరీలో 40 సెకన్లకు ఒక ఈవీ తయారవుతుందని తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో ప్రతి 40 సెకన్లకు ఒక ఏకక్ట్రిక్ కారు తయారవుతుందని, దీనికి సంబంధించిన ఒక ట్విటర్ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఇందులో కంపెనీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ప్రొడక్టివిటీ వంటి వాటికి సంబంధించినవి చూడవచ్చు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి టెస్లా కంపెనీకి అమెరికాలో ఒక మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అమెరికా బయట చైనాలో మాత్రమే ఫ్యాక్టరీ ఉన్నట్లు సమాచారం. ఇక్కడ సంస్థ కేవలం రెండు మోడల్స్‌ని మాత్రమే తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండూ కూడా చౌకైన కార్లుగా పరిగణిస్తారు. ఇప్పటికే కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ అనేక సార్లు సిబ్బందిని చాలా సార్లు మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. #Didyouknow that at #Shanghai's #Tesla Gigafactory, they can produce a #car in less than 40 seconds? 🤔Curious to see how they achieve such speed? Let's dive into the working environment!@Tesla @Tesla_Asia pic.twitter.com/FWXe7TxGYq — Shanghai Let's meet (@ShLetsMeet) July 25, 2023 -
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాలు
-
చైనాలో దయనీయ పరిస్థితులు.. బెడ్స్ లేక నేలపైనే రోగులకు చికిత్స
బీజింగ్: చైనాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. లక్షల మందికి సోకుతూ వేగంగా విస్తరిస్తోంది. జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసిన క్రమంలో పరిస్థితులు దారుణంగా మారాయి. వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దగ్గు, దమ్ము, శ్వాసకోస సంబంధిత సమస్యలతో వయోవృద్ధులు ఆసుపత్రులకు పరుగులుపెడుతున్నారు. బెడ్లు సరిపోకపోవడంతో హాలులోనే నెలపైనే చికిత్స అందిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. చైనాలోని ప్రధాన నగరం షాంఘైలోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితులు దయనీయంగా కనిపిస్తున్నాయి. బెడ్లు నిండిపోవడంతో కోవిడ్ బాధితులకు హాల్లోనే చికిత్సలు అందిస్తున్నారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతూ హార్ట్ మానిటర్స్, ఆక్సిజన్ ట్యాకులతో ఉన్న రోగుల దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. షాంఘైలోని ఓ ఆసుపత్రి హాల్లోనే రోగులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు ఇదీ చదవండి: బీజింగ్‌లో కోవిడ్ బీభత్సం -
షాకింగ్.. చైనాలోని ఆ నగరంలో 70% మందికి కరోనా!
కరోనా పుట్టినిల్లుగా భావించే చైనాలో మహమ్మారి విలయతాండం చేస్తోంది. డిసెంబర్లో జీరో కోవిడ్ పాలసీని ఎత్తేవేసినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతోపాటు మరణాలు కూడా భారీ స్థాయిలో సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు కరోనా లెక్కలు బయటకు చెప్పకపోవడంతో డ్రాగన్ దేశంలో పరిస్థితి ఊహలకు అందకుండా మారింది. లండన్‌కు చెందిన ఎనలిటిక్స్ సంస్థ ఎయిర్ఫినిటీ నివేదిక ప్రకారం డిసెంబర్ మొదటి 20 రోజుల్లో చైనాలో 250 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా చైనాలోని షాంఘై నగరంలోని జనాభాలో దాదాపు 70 శాతం మందికి పైగా ఇప్పటికే కోవిడ్ సోకి ఉంటుందని సీనియర్ వైద్యులు పేర్కొన్నారు. షాంఘైలోని హాస్పిటళ్లు కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయని తెలిపారు. రుయిజిన్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్, షాంఘై కోవిడ్ అడ్వైజరీ ప్యానెల్ నిపుణుడు చెన్ ఎర్జన్ దీనిపై మాట్లాడుతూ.. షాంఘైలో ఉన్న 2.5 కోట్ల మంది ప్రజల్లో.. చాలా మందికి వైరస్ సోకి ఉంటుందన్నారు. ఈ నగరంలో ప్రస్తుతం వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, జనాభాలో 70 శాతం మందికి కోవిడ్ సోకి ఉంటుందని తెలిపారు. గత ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే అది 20 నుంచి 30 శాతం అధికంగా ఉంటుందన్నారు. రుయిజిన్ హాస్పిటల్లో ప్రతి రోజు 1600 ఎమర్జెన్సీ అడ్మిషన్లు జరుగుతున్నాయని, అందులో 80 శాతం కోవిడ్ కేసులేనని పేర్కొన్నారు.చెప్రతి రోజు హాస్పిటల్‌కు వంద అంబులెన్సులు వస్తున్నట్లు చెన్ ఎర్జన్ తెలిపారు. 65 ఏళ్లు దాటిన వారంతా ఎమర్జెన్సీ విభాగంలో జాయిన్ అవుతున్నట్లు చెప్పారు. కాగా బీజింగ్, తియాంజిన్, చాంగ్కింగ్, గాంగ్జూ లాంటి నగరాల్లో ఇప్పటికే కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు. అంతేగాక ఈ ఏడాది ఆరంభంలో కరోనా ఇన్ఫెక్షన్లు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు చైనాలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌తోపాటు అమెరికా, దక్షిణ కొరియా, ఇటలీ, యూకే, ఫ్రాన్స్, జపాన్ తైవాన్ వంటి పలు దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి కోవిడ్ పరీక్షలను విధించాయి.అయితే చైనా ప్రయాణికులపై ఇతర దేశాలు విధించిన ఆంక్షలను బీజింగ్ తీవ్రంగా స్పందించింది. దీనికి ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చదవండి: చైనా.. ఇప్పటికైనా కరోనా అసలు లెక్కలు చెప్పు..! -
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత
బీజింగ్: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్(96) బుధవారం కన్నుమూశారు. లుకేమియాతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. అంతర్గత అవయవాలు పూర్తిగా పనిచేయకుండా పోవడం వల్ల షాంఘైలో బుధవారం మధ్యాహ్నం 12.13 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆయన మృతిని ప్రకటిస్తూ కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ చైన్, పార్లమెంట్, మంత్రివర్గం, ఆర్మీ జారీ చేసిన ఓ లేఖను ప్రచురించింది. ‘పార్టీకి, సైన్యానికి, చైనా జాతికి జియాంగ్ జెమిన్ మరణం తీరని లోటు. ఆయన మరణం మాకు తీవ్ర వేదనను మిగిల్చింది. జెమిన్ మంచి వ్యూహకర్త, గొప్ప దౌత్యవేత్త, పార్టీ అత్యున్నత నాయకుడు.’ అని లేఖలో పేర్కొన్నారు. జెమిన్ మృతితో సంతాప దినంగా ప్రకటించారు. చైనా జాతీయ పతాకాన్ని అవనంత చేయనున్నట్లు సీసీటీవి పేర్కొంది. 1989లో తియానాన్మెన్ స్క్వేర్ ఘటన తర్వాత డెంగ్ షావోపింగ్ నుంచి జియాంగ్ జెమిన్ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటికే అంతర్జాతీయంగా చైనా పరపతి దెబ్బతిన్నది. దానిని తిరిగి గాడినపెట్టిన ఘనత జియాంగ్ జెమిన్‌కే చెందుతుంది. హాంకాంగ్‌పై పట్టు సాధించటం, 2008 ఒలింపిక్స్ బిడ్‌ను గెలుచుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామి కావడం వంటి కీలక పరిణామాలు ఆయన హయాంలోనే జరిగాయి. ఇదీ చదవండి: చీటింగ్ చేస్తున్నాడనే అనుమానం.. ప్రియుడి ఇంటిని తగలెట్టిన ప్రేయసి -
చైనాలో ఉక్కుపాదం!
బీజింగ్: చైనాలో జీరో కొవిడ్ పాలసీపై దేశవ్యాప్తంగా తీవ్ర రూపు దాల్చిన ఆందోళనలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న తీరుతో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉలిక్కిపడింది. వాటిని తక్షణం కట్టడి చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగింది. నిరసనలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులను పోలీసులు భారీ సంఖ్యలో అరెస్టు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తక్షణం డిలీట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. లేదంటే నిర్బంధం తప్పదంటూ బెదిరిస్తున్నారు. ఆదివారం షాంఘైలో నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్టు ఎడ్ లారెన్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సందర్భంగా ఆయన్ను విచక్షణారహితంగా కొట్టడంతో పాటు తన్నారని బీబీసీ ఆరోపించింది. కొద్ది గంటల నిర్బంధం అనంతరం వదిలేశారు. ఆయన్ను పోలీసులు హింసించడం అవాస్తవమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లీ జియాన్ అన్నారు. తమ జీరో కోవిడ్ విధానం సరైందంటూ సమర్థించుకున్నారు. మీడియా చెబుతున్న స్థాయిలో నిరనసలు జరగడం లేదంటూనే, ‘‘జనాల్లో కాస్తంత వ్యతిరేకత ఉండొచ్చు. అందుకే క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్టుగా జీరో కొవిడ్ విధానంలో మార్పులు తెస్తున్నాం’’ అని అంగీకరించారు. మరోవైపు కరోనా ఆంక్షలపై దేశమంతటా జనాగ్రహం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్, దేశంలో అతి పెద్ద నగరం షాంఘైతో పాటు పలు నగరాల్లో ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ వీధుల్లోకి వచ్చి ఆంక్షలపై గళమెత్తుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై అణచివేత చర్యలకు దిగొద్దని చైనాకు ఐక్యరాజ్యసమితి హితవు పలికింది. వారి హక్కులను గౌరవించాలని సూచించింది. మళ్లీ 40 వేల కేసులు మరోవైపు సోమవారం చైనాలో 39,452 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బీజింగ్‌లో వరుసగా ఐదో రోజూ 4,000 కేసులొచ్చాయి. లాక్డౌన్లు, సరకు రవాణా ఆంక్షల కారణంగా ప్రస్తుతం 41.2 కోట్ల మంది ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నట్లు బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనావేసింది. వైట్ పేపర్ రివల్యూషన్ దేశంలో తమకు ఏ మాత్రమూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవని చెప్పేందుకు చైనా యువత, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు ప్రతీకాత్మకంగా తెల్ల కాగితాలను ప్రదర్శిస్తున్నారు. ‘వైట్ పేపర్ రివల్యూషన్’ పేరుతో ఇది దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. అలెక్స్ డిమినార్‌ను ఓడించి 122 ఏళ్ల డేవిస్‌కప్ చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్ అందించాడు. 2019లో కెనడా ఫైనల్‌కు చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. -
తిరగబడ్డ చైనా.. మితిమీరిన ఆంక్షలపై కన్నెర్రజేసిన జనం..
బీజింగ్: చైనా తిరగబడింది. కరోనా కట్టడి పేరుతో జిన్‌పింగ్ సర్కారు విధించిన మితిమీరిన ఆంక్షలపై జనం కన్నెర్రజేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వీధుల్లోకి వెల్లువెత్తుతూ నిరసనలకు దిగుతున్నారు. స్వేచ్ఛ కావాలంటూ నింగినంటేలా నినదిస్తున్నారు. పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)కి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ తక్షణం తప్పుకోవాలంటూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు! చిన్నపాటి నిరసనలను కూడా ఉక్కుపాదంతో అణచేసే డ్రాగన్ దేశంలో అత్యంత అరుదుగా కనిపించే ఈ మూకుమ్మడి జనాగ్రహ జ్వాలలను ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షిస్తోంది. జనాందోళనలకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. వాటితో సోషల్ సైట్లన్నీ హోరెత్తుతున్నాయి. పలుచోట్ల యువతీ యువకులు నేరుగా పోలీసులతోనే బాహాబాహీ తలపడుతున్నారు! దేశవ్యాప్తంగా యూనివర్సిటీల క్యాంపస్‌లన్నీ నిరసన కేంద్రాలుగా మారుతున్నాయి. స్టూడెంట్లు కూడా భారీగా రోడ్లెక్కుతున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు తదితర అడ్డంకులన్నింటినీ బద్దలు కొడుతూ కదం తొక్కుతున్నారు. నిరసనకారులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తున్నా ఆందోళనలు నెమ్మదించడం లేదు. మతిలేని లాక్డౌన్ నిబంధనలను ఎత్తేయాలన్న డిమాండ్ దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది. నిరసనల ధాటికి పలుచోట్ల ప్రభుత్వమే వెనక్కు తగ్గుతుండటం విశేషం! జిన్జియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుంఖిలో కఠిన లాక్డౌన్ ఆంక్షల వల్ల ఫ్లాట్లలో బందీలుగా మారిన వారిలో పది మంది అమాయకులు అగ్నిప్రమాదానికి నిస్సహాయంగా బలయ్యారన్న వార్తలు అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నాయి! దీనిపై వెల్లువెత్తిన జనాగ్రహానికి వెరచి ఉరుంఖిలోనే గాక రాజధాని బీజింగ్‌తో పాటు పలుచోట్ల లాక్డౌన్ ఆంక్షలను సడలించాల్సి వచ్చింది!! జీరో కోవిడ్ విధానంపై జనం నుంచి ఇంతటి ప్రతిఘటన ఎదురవుతుందని ప్రభుత్వం ఊహించలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలే పార్టీ నియమావళిని సవరించి మరీ వరుసగా మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికైన జిన్‌పింగ్‌కు ఈ ఉదంతం అగ్నిపరీక్షగా మారింది. మరోవైపు కరోనా కల్లోలం కూడా చైనాలో నానాటికీ పెరుగుతూనే వస్తోంది. ఆదివారం 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి!! మార్మోగుతున్న షాంఘై కరోనా నేపథ్యంలో మూడేళ్లుగా ఏదో ఒక రూపంలో చైనాలో ఆంక్షలు కొనసాగుతూనే వస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా మళ్లీ జీరో కొవిడ్ విధానం అమలవుతోంది. దీనిపై కొంతకాలంగా జనంలో పెల్లుబుకుతున్న వ్యతిరేకత రెండు రోజులుగా కట్టలు తెంచుకుంటోంది. అతి పెద్ద నగరమైన షాంఘై ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకొచ్చి నిరసన ప్రదర్శనలకు దిగారు. సీపీసీకి, జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం మారాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘‘షాంఘైలో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలను కల్లో కూడా ఊహించలేం! అలాంటిది ఇంత భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడం, అధ్యక్షుడు దిగిపోవాలంటూ బాహాటంగా నినాదాలు చేయడం నమ్మశక్యంగా లేదు. ఇది మా జీవితకాలంలో ఎన్నడూ చూడనిది’’ అంటూ స్వయానా నిరసనకారులే ఆశ్చర్యానందాలకు లోనవుతున్నారు. బీజింగ్‌లోని ప్రతిష్టాత్మక సిన్‌గువా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ సెన్సార్షిప్కుకు వ్యతిరేకంగా తెల్ల కాగితాలను ప్రదర్శిస్తూ ప్రతీకాత్మకంగా నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఉరుంఖిలో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం చేతుల్లో ఏళ్లుగా తీవ్ర అణచివేతకు గురవుతున్న ఉయ్గర్ ముస్లింలు భారీగా పాల్గొంటున్నారు! అపార్ట్మెంట్లో మరణమృదంగం కరోనా ఆంక్షలున్న చోట్ల ఇళ్లలోంచి జనం బయటికి రాకుండా అధికారులు బయటినుంచి తాళాలు వేసి సీల్ చేస్తున్నారు! ఈ చర్య జిన్జియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుంఖిలో పది మంది ఉసురు తీసింది. గురువారం ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఫ్లాట్లలో ఉన్న పది మంది ఎటూ తప్పించుకోలేక పొగకు ఉక్కిరిబిక్కిరై నిస్సహాయంగా చనిపోయారు. దీనిపై జనం తీవ్రంగా ఆగ్రహించారు. వేలాదిగా వీధులకెక్కి ప్రదర్శనలకు దిగారు. తీవ్ర పదజాలంతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. దాంతో ఆంక్షలను అధికారులు కాస్త సడలించారు. మితిమీరిన ఆంక్షలే వారి ఉసురు తీశాయన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించినా స్థానిక అధికారులు మాత్రం ఈ ఘటనకు క్షమాపణ చెప్పడం విశేషం! నెలల తరబడి కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ఇళ్లకు పరిమితం కావాల్సి రావడంతో పిచ్చెక్కిపోతోందని జనం వాపోతున్నారు. చదవండి: Ju Ae: కిమ్ వారసురాలు ఆమే? -
COVID-19 Vaccine: నోటి ద్వారా కరోనా టీకా.. ప్రపంచంలో ఇదే మొదటిది
బీజింగ్: సూది(సిరంజీ)తో అవసరం లేకుండా నోటి ద్వారా తీసుకొనే కోవిడ్–19 టీకా చైనాలోని షాంఘై నగరంలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ తరహా టీకా ప్రపంచంలో ఇదే మొదటిదని చెబుతున్నారు. టీకా తీసుకున్న తర్వాత 5 సెకండ్ల పాటు శ్వాస పీల్చుకోవడం ఆపేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ 20 సెకండ్లో పూర్తవుతుంది. ఈ టీకా తీసుకుంటే ఒక కప్పు టీ తాగినట్లే ఉందని షాంఘై వాసి ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇన్హేలర్ లాగా నోటి ద్వారా తీసుకొనే ఈ టీకాను బూస్టర్ డోసుగా ఉచితంగా ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సూదితో కంటే ఇది సులభంగా అందజేయవచ్చన్నారు. -
జిన్‌పింగ్ పుతిన్, మోదీని కలుస్తారా? నిరాకరించిన చైనా !
బీజింగ్: ఈ వారంలోనే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎన్సీఓ) ప్రాంతీయ భద్రతా బ్లాక్ సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు సంబంధించిన ప్రణాళికా విషయాలు గురించి వెళ్లడించడానికి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఈ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 15 నుంచి ఉజ్బెకిస్తాన్‌లో జరగనుంది. బీజింగ్ ప్రధాన కార్యాలయంలో ఈ సదస్సు చైనా, భారత్, పాకిస్తాన్ దేశాల తోపాటు మధ్య ఆసియా దేశాలు కజికిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ వంటి దేశాలతో నిర్వహిస్తోంది. అందులో భాగంగానే చైనా అద్యక్షుడు జిన్‌పింగ్ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలలో పర్యటించనున్నారు. కరోనా మహమ్మారి తదనంతర ఇదే అతని తొలి విదేశీ పర్యటన. ఈ సదస్సు సందర్భంగా నాయకులు గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న సంస్థ కార్యకలాపాలను సమీక్షించడమే కాకుండా బహుపాక్షిక సహకారం గురించి చర్చించాలని భావిస్తున్నారు. ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సదస్సులో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: మాస్క్ థరించండి అన్నందుకు...కాల్చి చంపేశాడు) -
హఠాత్తుగా ‘కదిలిన’ పురాతన భవనం: వీడియో వైరల్!
ఏదైన భవనం కదలడం గురించి విన్నామా!. లేదుకదా అదికూడా కేవలం టీవీల్లో ఏదైన గ్రాఫిక్ మాయాజాలంతో జరిగి ఉండోచ్చు. అంతేగానీ ఒక పెద్ద భవనం కదలడం అన్నది అసాధ్యం. నమశక్యం గానీ నిజం. కానీ అవన్నంటిని కొట్టిపారేసేలా ఔను! భవనాలు కదులుతాయి అని కచ్చితంగా అంటాం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి. అసలు భవనం కదలడం ఏంటి? అదేలా సాధ్యం అనే కదా! అసలు విషయం ఏంటంటే.....చైనాలోని షాంఘైలో వందేళ్ల పురాతన భవనం కదిలింది. అది కూడా వందేళ్ల నాటి పురాతన భవనం కదలడం ఏంటీ? అనే కదా!. ఇది పురాతనమైన భవనం కావడంతో చైనా ప్రభుత్వానికి కూల్చడం ఇష్టం లేదు. పైగా ఆ ప్రాంతంలో ఉండటం కూడా ఇష్టం లేదటా. అందుకే ఏకంగా ఆ భవనాన్నే ఉన్నపళంగా కదిలించాలనుకుంది. పైగా ఆ భవనం బరువు సుమారు మూడు వేల టన్నుల బరువు. కదల్చడం అంత సులభమేమి కాదు. అందుకని చైనా ప్రభుత్వం భారీ యంత్రాల సాయంతో ఆ ప్రదేశం నుంచి ఆ భవనాన్ని కదిలించి మరో ప్రదేశంలో యథాతధంగా ఉంచింది. ఏదో బొమ్మ ఇల్లుని మార్చినట్లుగా సునాయాసంగా మార్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక చైనా మహిళ 'శతాబ్దాల నాటి ఇల్లు పరిగెడుతోంది' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 3,800-ton century-old building slowly "walking" in Shanghaipic.twitter.com/fCeTbKpR7M — Zhang Meifang张美芳 (@CGMeifangZhang) July 10, 2022 (చదవండి: చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాథ్ ఫోటోలు... ఉద్యోగం కోల్పోయిన మున్సిపాలిటీ ఉద్యోగి) -
డ్రాగన్ కంట్రీకి దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. కొత్తగా సబ్‌వేరియంట్ కలకలం
షాంఘై: కరోనాను కట్టడి చేసేందుకు 'జీరో పాలసీ' పేరుతో లాక్డౌన్ సహా అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం డ్రాగన్ కంట్రీకి తలనొప్పులు తెస్తోంది. తాజాగా షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో జులై 8న ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు నగర హెల్త్ కమిషన్ డిప్యూటీ డెరెక్టర్ జావో డాండన్ వెల్లడించారు. రెండు నెలల అనంతరం షాంఘై నగరంలో జూన్ మొదటివారంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. అయితే కొత్త కేసులు వెలుగుచూసిన ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో స్థానికంగా వ్యాప్తి చెందుతున్న కేసుల సంఖ్య పెరిగినట్లు జావో వివరించారు. దీంతో షాంఘైలో నివాసముండే వారికి జులై 12-14 మధ్య రెండు రౌండ్ల కరోనా పరీక్షలు నిర్వహించిననున్నట్లు చెప్పారు. విదేశాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ BA.5 రకాన్ని చైనాలో తొలిసారి మే 13న షాంఘై నగరంలో గుర్తించారు. ఉగాండ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో ఇది బయటపడింది. ఇప్పుడు అందులోనే సబ్వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. చైనాలో ఇప్పటివరకు మొత్తం 2,26,610 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 5,226 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడినవారిలో 2,20,380 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,004 యాక్టివ్ కేసులున్నాయి. -
హమ్మయ్యా! అని రిలాక్స్ అవుతున్న చైనా!
Zero Covid Cases: చైనాలో కరోనా మహమ్మారి ఫోర్త్‌వేవ్ విరుచుకుపడింది. గత కొన్ని నెలలుగా అనుహ్యంగా పెరుగుతున్న కేసులు చూసి తలలు పట్టుకున్నారు చైనా అధికారులు. అందులోనూ కరోనా పుట్టినిల్లు అయిన చైనా ఆది నుంచి జీరో కోవిడ్ విధానం అంటూ ప్రగల్పాలు పలికి నిలబెట్టుకోనేందుకు నానాతంటాలు పడింది. కఠినమైన ఆంక్షలతో ప్రజలను నిర్బంధించి తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత తోపాటు ప్రపంచ దేశాల విమర్శలను ఎదుర్కొంది. ఏదీ ఏమైనా జీరో కోవిడ్ పాలసీని వదిలేదే లేదంటూ... ఆంక్షలు విధించి తన పంతం నెగ్గించుకుంది. ఒక్కపక్క దేశ ఆర్థికస్థితి ప్రమాదకరంలో ఉన్నా సరే అధికంగా డబ్బు ఖర్చుపెట్టి మరీ సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించింది. గత ఏప్రిల్ నుంచి కేసులు తగ్గినట్లు తగ్గి అనుహ్యంగా కొన్ని నగరాల్లో వేగంగా పుంజుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. షాంఘై, బీజింగ్ వంటి పారిశ్రామిక నగరాల్లోనే కేసులు పెరగడంతో ఒకనోక దశలో ఏవిధంగా నియత్రించాలో తెలియక చేతులెత్తేసే స్థితికి చేరుకుంది. ప్రజలు కూడా వరుస లాక్డౌన్లతో విసిగిపోయి తీవ్ర అసహనస్థితికి లోనయ్యారు. అయినా చైనా వీటన్నింటిని లెక్క చేయకుండా ప్రజా ఆరోగ్య ప్రయోజాల కోసం జోరో కోవిడ్ పాలసీనే అవలంభిస్తానంటూ పట్టుపట్టి మరీ మరిన్ని ఆంక్షలను విధించింది. ఎట్టకేలకు విజయాన్ని సాధించింది చైనా. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు జీరో అని నివేదికలు పేర్కొన్నాయి. దీంతో చైనా ప్రస్తుతం కొన్ని ఆంక్షలను సడలించింది. గానీ బహిరంగ ప్రదేశాల్లో తిరగాలంటే మాత్రం... ఆరోగ్య స్థితిని ట్రాక్ చేసే మొబైల్ యాప్‌లో గ్రీన్ కోడ్‌ను చూపించాలి. ప్రతి మూడు రోజులోకోసారి కరోనా పరీక్షలు తప్పనసరి అని, పైగా మూడు సంవత్సరాలకు పైబడిన పిల్లలు సైతం పరీక్షలు చేయించుకోవాల్సిందేనని చైనా నొక్కి చెప్పింది. (చదవండి: జీరో కోవిడ్ వ్యూహం తెచ్చిన తంటా...) -
ఎలన్ మస్క్ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్!
ఎస్. ఎలక్ట్రిక్ కార్ల దిగజం టెస్లాకు చెందిన టెక్సాస్, బెర్లిన్ కార్ల ఫ్యాక్టరీలతో బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మే31న అస్ట్రిన్లోని టెస్లా అఫీషియల్ రికగ్నైజ్డ్ క్లబ్ టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ ఎలన్ మస్క్‌తో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ ఇంటర్వ్యూని మూడు విభాగాలుగా విడుదల చేయగా..అందులో మస్క్ బిలియన్ డాలర్లను ఏ విధంగా నష్టపోతున్నట్లు తెలిపారు. బెర్లిన్,ఆస్టిన్ ఫ్యాక్టరీల్లో బిలియన్ డాలర్ల మనీ వేడేకెక్కుతుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే మంటల్లో డబ్బు కాలిపోతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు టెస్లా టెక్సాస్ ఫ్యాక్టరీ తన కొత్త "4680" బ్యాటరీల ఉత్పత్తిని పెంచడంలో ఎదురవుతున్న సవాళ్ల కారణంగా కొద్ది మొత్తంలో కార్లను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. ఇక ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం ఎక్కువగా వినియోగించే సాంప్రదాయ 2170 బ్యాటరీలు చైనా పోర్ట్‌లో ఇరుక్కుపోయాయని మస్క్ చెప్పారు. కొంపముంచిన చైనా ఎలన్ మస్క్ బిలియన్ డాలర్లు నష్టపోవడానికి పరోక్షంగా చైనానే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే డ్రాగన్ కంట్రీలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా లాక్ డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల కార్యకలాపాలు ఎక్కువగా నిర్వహించే షాంఘైలో సైతం షట్‌డౌన్ కొనసాగుతుంది.ఇతర సంస్థలతో పాటు షాంఘైలో టెస్లా కార్ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆ ప్రభావం టెస్లా షాంఘై ఫ్యాక్టరీతో పాటు కాలిఫోర్నియా ప్లాంట్‌పై పడింది. ఎందుకంటే? టెస్లా కార్ల విడిభాగాలు కొన్ని చైనాలో తయారవుతాయి. వాటిని చైనా నుంచి కాలిఫోర్నియా ప్లాంట్‌కు రవాణా చేస్తారు. అలా ఇంపోర్ట్ అయిన విడిభాగాలతో టెస్లా కార్లను తయారు చేస్తుంది. ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లిస్తాం. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సప్లయ్ చైన్ సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. మేం ఇంకా ఆ సమస్య నుంచి బయట పడలేదని ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ వాపోయారు. ఇన్ని సమస్యలతో సంస్థలు దివాళా తీయకుండా కార్ల తయారీని ఎలా కొనసాగించాలి. ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. తప్పేం లేదు ఇక ఇటీవల ఎలన్ మస్క్ టెస్లా ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న పళంగా 10శాతం మంది ఉద్యోగుల్ని ఎలా తొలగిస్తారంటూ పలువురు మస్క్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో టెస్లా భారీగా నష్టపోతుందని, అందుకు గల కారణాల్ని వివరించడంతో నెటిజన్లు మస్క్‌కు అండగా నిలుస్తున్నారు. ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు సబబేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ఉద్యోగుల తొలగింపు..మరింత దూకుడుగా ఎలన్ మస్క్! -
కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు...ఒకరు మృతి
Chemical Plant Explosion: చైనా రాజధాని షాంఘైలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిన్షాన్ జిల్లాలో సినోపెక్ షాంఘైలో పెట్రోకెమికల్ ప్లాంట్‌లో శనివారం తెల్లవారుజామున పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆకాశమంత ఎత్తులో మంటలు వ్యాపించి.... దట్టమైన పొగతో కమ్మేసింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ బ్యూరో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అసలే గత కొంత కాలంగా కరోనా కారణంగా వరుస లాక్‌డౌన్‌తో ఈ ప్లాంట్‌ని మూసేశారు. చాలా రోజుల తర్వాత ఈ ప్లాంట్‌ని తిరిగి ప్రారంభించినప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు . అయితే స్థానికుల మాత్రం భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని, పైగా ఆరు కిలోమీటర్లు దూరంలోని నివాసితుల కూడా వినిపించిందని చెప్పారన్నారు. ఆ పేలుడు ధాటికి సమీపంలో అపార్ట్మెంట్లో తలుపులు సైతం కదిలిపోయాయని అధికారులు తెలిపారు. షాంఘై పట్టణం మంతా దట్టమైన పోగతో నిండిపోయిందని, ప్రమాదాలను నియంత్రించే మానిటరింగ్ డేటా.. గాలి నాణ్యతను సాధారణ స్థితికి తీసుకువచ్చిందని చెప్పారు. అంతేకాదు ఘటనా స్థలంలో 500 మందికి పైగా రెస్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారని అధికారులు వెల్లడించారు. (చదవండి: బ్లాక్ లిస్ట్ నుంచి పాక్ బయటపడనుందా?) -
చైనాకి ఝలక్ ఇచ్చిన ఎలాన్ మస్క్ !
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా, దాని యజమాని ఎలాన్‌మస్క్ చైనాకు ఝలక్ ఇచ్చారు. చెప్పాపెట్టకుండా చైనాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను రద్దు చేసి పారేశారు. టెస్లా వంటి పెద్ద కంపెనీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం కార్పొరేట్ వరల్డ్‌లో చర్చనీయాంశంగా మారింది. షాంగై ఈవెంట్స్ టెస్లా కంపెనీకి అమెరికా వెలుపల జర్మనీ, చైనాలలోనే కార్ల తయారీకి సంబంధించి గిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో చైనాలోని షాంగైలో ఉన్న ఫ్యాక్టరీ అతి పెద్దది. టెస్లా ఉత్పత్తులు సగం ఇక్కడే తయారవుతుండగా లాభాల్లో నాలుగో వంతు ఈ ఫ్యాక్టరీ అందిస్తోంది. వ్యూహాత్మకంగా షాంగై ఫ్యాక్టరీ టెస్లాకు ఎంతో కీలకం. అందువల్ల ఇక్కడ క్రమం తప్పకుండా టెస్లా తరఫున ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు ఎలాన్‌మస్క్. ఉన్నపళంగా రద్దు సేల్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సప్లై చెయిన్ విభాగాల్లో నియమాకాల కోసం వరుసగా ఈవెంట్స్ చైనాలో నిర్వహించాలని టెస్లా నిర్ణయించింది. ఈ మేరకు 2022 జూన్ 16, 23, 30 తేదీలను ఎంపిక చేశారు. ఈ మేరకు చైనాలో విస్త్రృతంగా ప్రచారం చేశారు. టెస్లా కంపెనీలో ఉద్యోగాల కోసం అక్కడి యువత సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో జూన్ 9న మరో ప్రకటన వెలువడింది. అందులో జూన్‌లో నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్ట్టుగా పేర్కొన్నారు. ఇందుకు గల కారణాలను ఎక్కడా వివరించలేదు. కారణం అదేనా ఇటీవల ఎలాన్ మస్క్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలకాలని ఉద్యోగులకు పిలుపు నిచ్చాడు. ఎవరైనా వర్క్ ఫ్రం హోం కావాలని అనుకుంటూ కంపెనీని వీడి వెళ్లవచ్చంటూ ఎగ్జిట్ గేట్ చూపించాడు. అంతేకాదు టెస్లాలో కొన్ని చోట్ల అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారంటు కామెంట్ చేశారు. దీంతో చైనాలోని షాంగై గిగా ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారనే భావన టెస్లా బాస్ ఉండటం వల్లే ఈవెంట్స్ క్యాన్సెల్ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఇలా చేస్తే.. మరోవైపు చైనాలో కరోనా కేసులు అదుపులోకి రాకపోవడం కూడా కారణం అయి ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో అక్కడ ఈవెంట్స్ నిర్వహించి రిస్క్ తీసుకోవడం ఎందుకనే భావన టెస్లాలో ఉందంటున్నారు. కానీ టెస్లా వంటి పెద్ద కంపెనీ అకస్మాత్తుగా ఈవెంట్స్ రద్దు చేయడం అనేది చైనా బ్రాండ్ ఇమేజ్‌కి కొంత మేర డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. చదవండి: Elon Musk: ఈలాన్ మస్క్ మరో సంచలనం: షాక్‌లో ఉద్యోగులు -
టెస్లాకి షాకిచ్చిన షాంఘై!
ఎన్నో ఆశలతో చైనాలో టెస్లా కార్ల తయారీ కర్మాగారం స్థాపించిన ఈలాన్ మస్క్‌కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సప్లై చెయిన్ సమస్యలతో షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీ మరోసారి మూత పడినట్టు సమాచారం. నెల రోజుల వ్యవధిలో టెస్లా ఫ్యాక్టరీ మూత పడటం ఇది రెండోసారి. ఏషియా మార్కెట్‌పై కన్నెసిన ఈలాన్ మస్క్ వ్యూహాత్మక భాగస్వామిగా చైనాను ఎంచుకున్నాడు. షాంఘై సమీపంలో బిలియన్ డాలర్లు వెచ్చింది టెస్లా గిగా ఫ్యాక్టరీని నిర్మించాడు. ఇక్కడి నుంచి జపాన్, ఇండియా, ఇతర ఏషియా దేశాలకు ఎలక్ట్రిక్ కార్లు సప్లై చేయాలని భావించాడు. అయితే చైనాలో తయారైన వస్తువుల దిగుమతిపై భారీ సుంకాలు విధిస్తోంది ఇండియా. దీంతో ప్రపంచంలో రెండో పెద్ద మార్కెటైన ఇండియా విషయంలో ఈలాన్ మస్క్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఓ వైపు మార్కెటింగ్ సమస్యలు చుట్టుముట్టగా షాంఘైలో కరోనా కేసులు పెరిగిపోవడం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. మార్చి చివరి నుంచి షాంఘైలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో అక్కడ లాక్డౌన్ అమలు చేసింది డ్రాగన్ ప్రభుత్వం. దీంతో టెస్లా కార్ల కర్మాగారం మూత పడక తప్పని పరిస్థితి నెలకొంది. 22 రోజుల పాటు ఈ గిగా ఫ్యాక్టరీ షట్‌డవున్ అయ్యింది. షాంఘైలో కొంత మేర పరిస్థితులు చక్కబడటంతో 2022 ఏప్రిల్ 19 తిరిగి ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు. అయితే కరోనా దెబ్బతో కఠిన లాక్డౌన్ అమలు చేయడంతో చైనాలో సప్లై వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. కార్ల తయారీలో ఉపయోగించే అనేక ముడి వస్తువల లభ్యత తగ్గిపోయింది. దీంతో ఫ్యాక్టరీ తెరిచినా కార్లు ఉత్పత్తి చేసే పరిస్థితి లేక పోవడంతో మే 9న మరోసారి కర్మాగారానికి తాళం వేసింది టెస్లా. అయితే ఈ మూసివేతపై టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: ఈలాన్‌మస్క్.. అసలు విషయం ఎప్పుడో చెప్పు? -
కరోనా కట్టడి.. జింగ్‌పిన్ తీవ్ర హెచ్చరికలు
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. ఒక్క చైనా మాత్రమే కరోనా కట్టడికి జీరో కొవిడ్ పాలసీని అనుసరిస్తోంది. అయితే.. ఆ అనుసరించే విధానం మరీ ఆరాచకంగా ఉండకపోవడమే సొంత పౌరుల నుంచే వ్యతిరేకతకు కారణం అవుతోంది. లాక్‌డౌన్‌తో నరకం అనుభవిస్తున్న వాళ్లు విజ్ఞప్తులు చేస్తున్నా.. కనికరించే ప్రసక్తే లేదంటున్నాడు చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్. బలవంతపు లాక్డౌన్లను చైనా ప్రజలు భరించలేకపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ.. కొద్దిపాటి కేసులకే లాక్డౌన్, అదీ కఠినంగా విధించడం, సామూహిక కరోనా టెస్టుల పేరిట భౌతిక దాడులకు పాల్పడుతుండడం, ఐసోలేషన్ పేరిట జంతువుల కంటే హీనంగా మనుషులతో ప్రవర్తించడం లాంటి చేష్టలపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ ఆగ్రహానికి తోడు ఆహార, మందుల కొరత వాళ్లను వేధిస్తోంది. షాంగై వాసుల లాక్డౌన్ కష్టాలే అందుకు నిదర్శనం. ఈ తరుణంలో.. లాక్డౌన్ పరిణామాలపై ప్రశ్నిస్తే కఠిన శిక్షలు అమలు చేయాలని చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం కమ్యూనిస్ట్ పార్టీ ‘సుప్రీం పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ’ సమావేశం జరిగింది. తమ దేశంలో కరోనా కట్టడికి ఏ విధానాలైతే మేలు చేస్తాయో వాటిని, అవి ప్రజలను ఇబ్బంది పెట్టినా పర్వాలేదని.. అంతిమంగా డైనమిక్ జీరో కొవిడ్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది కరోనా విజృంభణ పరిస్థితులు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ తొలిసారి, అదీ ఒక కీలక సమావేశంలో ప్రసంగించడం విశేషం. ‘‘కఠిన నిర్ణయాలనేది సహజంగానే మన పార్టీతత్వం . కరోనా కట్టడికి తీసుకునే నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటున్నాయి. వుహాన్‌లో ఏ తరహాలో కరోనాపై పోరాడి గెల్చాం.. అలాగే షాంగైలోనూ గెలిచి తీరతాం. జీరో కొవిడ్ పాలసీని తప్పుబట్టే వాళ్లను, పార్టీ విధానాలను వ్యతిరేకించే వాళ్లను కఠినంగా శిక్షించండి. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టించండి’’ అని జింగ్‌పిన్ ప్రసంగించినట్లు సీఎన్ఎన్ ఓ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇప్పటిదాకా రాజధాని బీజింగ్‌లో 500కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో.. ఎక్కడ షాంగై తరహా లాక్డౌన్ అమలు చేస్తారో అని హడలి పోతున్నారు అక్కడి ప్రజలు. చదవండి: చైనాలో కరోనా కట్టడి పేరిట వికృత చేష్టలు -
చైనా వికృత చర్యలు! బలవంతంగా కరోనా పరీక్షలు వీడియో వైరల్
woman pinned down by a man for a Covid test: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కరోనా విజృభిస్తుంది. ఇప్పటికే లాక్డౌన్ వంటి పలు ఆంక్షలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది చైనా. అదీగాక వరుస లాక్డౌన్లతో విసుగుపోయిన ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. మరోవైపు అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడంతో చైనా ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. అంతేగాదు ప్రజలు నివాసాల నుంచి బయటకు రాకుండా కట్టుదిటమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనా అధికారులు ప్రజలకు బలవంతంగా కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. పైగా చైనా ప్రభుత్వ పేద ప్రజలను పరీక్షల పేరుతో ఎలా ఇబ్బందిపెడుతోంది వంటి వీడియోలు సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి అక్కడ ప్రజలు కరోనా కంటే లాక్డౌన్ అంటేనే హడలిపోతున్నారు. కరోనా తగ్గిందనుకునే దశలో మళ్లీ విరుచుకుపడటంతో చైనా ప్రభుత్వం మళ్లీ ఆంక్షల కొరడా విధించింది. ఇప్పటికే పలు రెస్టారెంట్లు, కార్యాలయాలు మూసివేయడంతో ప్రజలు ఆర్థిక సంక్షోభంతో సతమతమతున్నారు. అంతేగాదు చైనా కూడా కరోనాని కట్టడి చేసే దిశగా ప్రజలకు మూడోరౌండ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలు, టీనేజర్ల నుంచి వృద్ధుల దాకా ఎవర్నీ విడిచిపెట్టకుండా బలవంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. 这个强行检测姿势应该让全世界看一看🤬😡 pic.twitter.com/PUwnfCXF4t — 浩哥i✝️i🇺🇸iA2 (@S7i5FV0JOz6sV3A) April 27, 2022 Chinese government forcing grandma take a mandatory Covid test pic.twitter.com/tD1aZCdj6v — Songpinganq (@songpinganq) March 19, 2022 (చదవండి: 'వర్క్ ఫ్రమ్ హోమ్'లో కరోనా, హర్షానంద స్వామి ఏం చెప్పారంటే!) -
కరోనా వైరస్ ఉధృతి: షాంఘైలో ఒక్క రోజే 51 మంది మృతి
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. బీజింగ్‌లో ప్రముఖులుండే చయోయంగ్ ప్రాంతంలో కరోనా కేసులు పదుల్లో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఇక్కడి 35 లక్షల మందికి మూడు విడతల్లో నిర్థారణ పరీక్షలు ప్రారంభించింది. బీజింగ్‌లో ఆదివారం బయటపడిన 14 కేసుల్లో 11 చయోయంగ్ జిల్లాలోనివేనని అధికారులు తెలిపారు. షాంఘైలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధికంగా మరో 51 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో, ఇక్కడ కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 138కి చేరుకుంది. షాంఘైలో కొత్తగా 2,472 కేసులు నిర్థారణయ్యాయి. చైనా ప్రధాన భూభాగంలో ఆదివారం ఒక్క రోజే మరో 20,190 కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. -
చైనాలో కరోనా ఉధృతి...మళ్లీ అమలవుతున్న జీరో కోవిడ్ పాలసీ
గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసులు అనూహ్యంగా నమోదవుతున్నాయి. కరోనా పుట్టినిల్లు అయినా చైనాని ఈ కొత్త కేసుల ఉధృతితో అతలాకుతులం చేస్తోంది. దీంతో చైనా కూడా కరోనా కట్టడి దిశగా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ చైనా ఆర్థిక నగరమైన షాంఘైలో ఊహించని విధంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క శనివారమే సుమారు 21,796 కేసులు నమోదవ్వగా, 39 మరణాలు సంభవించాయి. అంతేకాదు చైనాలో పరిస్థితి చాలా భయనకంగా ఉందని, చైనాలో కొన్ని ప్రాంతాల్లో కరోనాకి సంబంధించిన కొత్త కేసులు వెలుగు చూశాయని బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ పాంగ్ జింగ్‌హువో తెలిపారు. పైగా చైనాలో దేశవ్యాప్తంగా 29,531 మంది కరోనాకి సంబంధించిన చికిత్స పొందుతున్నారని నివేదిక పేర్కొంది. ఓమిక్రాన్ వైరస్ ఆవిర్భావం తర్వాత గత నెల చివరిలో లాక్డౌన్ తదనంతరం నుంచి నగరంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 87కి చేరుకుంది. దీంతో 2019 డిసెంబర్లో వుహాన్‌లో మొదటిసారిగా కరోనా ఉద్భవించినప్పటి నుంచి చైనాలో సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 4,725కు పెరిగింది. కరోనా కట్టడిలో భాగంగా మెటల్ కంచెలు చైనా స్థానిక ప్రభుత్వాలు ఈ కరోనా కట్టడిలో భాగంగా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న ప్రాంతాల్లోని వీధుల్లో మెటల్ కంచెలు ఏర్పాటు చేశారు. చిన్న చిన్న వీధులు, అపార్ట్మెంట్ కాప్లెక్స్‌లో ప్రజలు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేసులు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో కూడా ఈ మెటల్ కంచెలు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రజలు లాక్డౌన్ ఆంక్షలతో విసిగిపోయి ఆగ్రహంతో వీటిని ధ్వంసం చేస్తున్నారు. చైనా అమలు చేస్తున్న ఈ కఠినమైన ఆంక్షల కారణంగా ప్రజలు నిత్వావసర వస్తువులు కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా సకాలంలో తగిన వైద్యం పొందలేక నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాదు చైనా వాసులు కొంతమంది ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. షాంఘైలో అమలవుతున్న సరికొత్త జీరో కోవిడ్ పాలసీ షాంఘై ఒక సరికొత్త జీరో కోవిడ్ పాలసీ విధానాన్ని అమలు చేస్తోంది. నమోదవుతున్న కరోనా కేసుల ప్రమాద తీవ్రత ఆధారంగా మూడు వర్గాలుగా విభజించింది. మొదటి వర్గం వారు కఠినతరమైన కోవిడ్ ఆంక్షలు ఎదుర్కొనక తప్పదు. రెండో వర్గం వారు కొద్దిపాటి ఆంక్షలను ఎదుర్కొంటారు. మూడో వర్గం వారికి ఆంక్షలు వర్తించవు, పైగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు అనుమతి కూడా ఉంటుంది. చైనా అధికారులుకే కాకుండా ప్రజలకు కూడా ఈ లాక్డౌన్ ఆంక్షలు పాటించడం ఒక సవాలుగా మారింది. మాకు ఆహారం పంపండి అంటూ నిర్బంధంలో ఉన్నవారి ఆకలి కేకలతో హోరెత్తిపోతుంటే మరొకవైపు అధికారులు కరోనా కట్టడికై లాక్‌డౌన్‌కి సంబంధించిన సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు తలమునకలవుతున్నారు. (చదవండి: చైనాకు గట్టి షాకిచ్చిన భారత్) -
ఢిల్లీలో వెయ్యి కరోనా కేసులు
న్యూఢ్లిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. వరసగా మూడో రోజు 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,451 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 14,241కి చేరాయి. 54 మంది మరణించారు. ఢిల్లీలో ఒక్క రోజే 1,042 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. ఢిల్లీలో స్కూళ్లో ప్రత్యేక క్వారంటైన్ గదులు సిద్ధం చేశారు. విద్యార్థులు లంచ్ బాక్స్‌లను షేర్ చేసుకోద్దని సూచించారు. మరోవైపు తమిళనాడునూ కరోనా వణికిస్తోంది. ఐఐటీ మద్రాసులో 30 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. శుక్రవారం 700 మందికి పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు తమిళనాడు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. స్వల్ప లక్ష్యణాలు ఉన్న విద్యార్థులను కళాశాల ప్రాంగణంలోనే హోం క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు. క్యాంపస్‌లోని 19 హాస్టళ్లలో కరోనా నిర్మూలన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఢిల్లీ, తమిళనాడుల్లో శుక్రవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను మళ్లీ తప్పనిసరి చేశారు. లేదంటే రూ.500 జరిమానా తప్పదని ప్రభుత్వాలు హెచ్చరించాయి. షాంఘైలో లాక్డౌన్ పొడిగింపు బీజింగ్: చైనాలోని షాంఘైలో కరోనా కలకలం కొనసాగుతోంది. దాంతో కోవిడ్ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 26 దాకా పొడిగించారు. నాలుగు వారాలుగా లాక్డౌన్ అమలు చేస్తూ కఠినమైన ఆంక్షలు విధిస్తుండటంతో అక్కడ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొనడం తెలిసిందే. చైనాలో గురువారం 2,119 కేసులు నమోదయ్యాయి. వాటిలో 1,931 షాంఘైలో వెలుగు చూశాయి. 11 మంది మరణించారు. దాంతో తాజా వేవ్ మృతుల సంఖ్య 36కి చేరింది. -
చైనాలో ఇప్పుడు భయం కరోనా కోసం కాదట!
కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ రెండేళ్లలో ఏనాడూ లేనంతగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది డ్రాగన్ కంట్రీ. ఒకవైపు కేసులు వెల్లువెత్తుతుంటే.. మరోవైపు ప్రజలకు వైద్యం, నిత్యావసరాలు అందడంలో జాప్యం జరుగుతోంది. ఇందుకు కఠోరమైన లాక్డౌన్ కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపిక నశిస్తున్న ప్రజలు.. అధికారులపై ఎదురుదాడులకు తెగపడుతున్నారు, నిరసనలకు దిగుతున్నారు. అయినా జింగ్‌పిన్ ప్రభుత్వం మాత్రం తగ్గట్లేదు. జీరో టోలరెన్స్ పేరిట జనాలను మానసికంగా హింసిస్తోంది చైనా ప్రభుత్వం ఇప్పుడు. వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడం, కరోనాను ఎదుర్కొగలిగే పరిస్థితులు ఉన్నా కూడా ‘స్టే హోం.. స్టే సేఫ్’ పాలసీకే మొగ్గు చూపిస్తోంది. దీనిపై వైద్య నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది జిన్‌పింగ్ ప్రభుత్వం. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలెన్నో కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ చర్యలన్నీ తాత్కాలికమని, కేసుల కట్టడికి ఈ స్ట్రాటజీ ఉపయోగపడుతుందని మొండిగా వాదిస్తోంది. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది లాక్డౌన్లో చిక్కుకుపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగరమైన షాంఘైతో పాటు పలు ప్రధాన నగరాల్లోనూ కఠినమైన లాక్డౌన్ అమలు అవుతోంది. వైద్య సిబ్బంది, డెలివరీ బాయ్స్, ఎమర్జెన్సీ స్టాఫ్ తప్ప.. ఎవరూ బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈ క్రమంలో నిత్యావసరాలు, మందులు దొరక్క జనాలు ఆర్తనాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ.. సడలింపులకు ప్రభుత్వం నో అంటోంది. షాంఘై చుట్టుపక్కల నగర వాసుల్లో ఇప్పుడు లాక్డౌన్ ఫియర్ మొదలైంది. రెండువారాల పాటు అధికారులు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. తమ దగ్గరా షాంఘై తరహా పరిస్థితులు పునరావృతం అవుతుందని వణికిపోతున్నారు. ఇప్పటికే కొందరు ఎమర్జెన్సీ పాసులతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అధికారులు మాత్రం అనుమతులు ఇచ్చేదే లేదని తెగేసి చెప్తున్నారు. షాంగ్జి ప్రావిన్స్ రాజధాని జియాన్ నగరం ఇదివరకే లాక్డౌన్ అక్కడి ప్రజలకు చీకట్లు మిగల్చగా.. తాజాగా మరోసారి లాక్డౌన్ ప్రకటించడంతో వణికిపోతున్నారు. ఇక అధికారులు మాత్రం ఇది తాత్కాలిక చర్యలు మాత్రమేనని, వైరస్ కట్టడికి ప్రజలు కొంతకాలం ఓపిక పట్టాలని చెప్తున్నారు. అయినా ప్రజల్లో మాత్రం మనోధైర్యం నిండడం లేదు. షాంఘై పరిస్థితులను కళ్లారా చూడడంతో కరోనా కంటే లాక్డౌన్ పేరు వింటేనే వణికిపోతున్నారు. This is how people walk their dog during #Covid19 #lockdown 😆 pic.twitter.com/RWOtzYCBQm — Clumsybear0129 (@clumsybear0129) March 29, 2022 షాంఘైలో ఉన్నత కుటుంబాలు తప్ప మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు నిరసనలు హోరెత్తుతున్నాయి. బారికేడ్లను బద్ధలు కొట్టి మరీ ఆహారం కోసం పరుగులు తీస్తున్నారు అక్కడి జనాలు. వైద్యం అందక ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అంతేకాదు.. నిరసనలను నియంత్రించలేక పోలీసులు దాడులు చేస్తున్న ఘటనలు, మూగజీవాల అవసరాల కోసం బయటకు తీసుకొస్తే.. వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. Protest against lockdown in Shanghai. "We want to eat. We want to go to work. We have the right to know!"#chinalockdown #lockdown #Shanghai pic.twitter.com/I9DARcC06V — Eitan Waxman (@EitanWaxman) March 27, 2022 చదవండి: కరోనా కారణంగా చైనాలో విపత్కర పరిస్థితులు.. వీడియో వైరల్ -
చైనాలో మరో 3,472 పాజిటివ్ కేసులు
బీజింగ్: చైనాలో గురువారం ఒక్కరోజే 3,472 కరోనా కేసులు నమోదయ్యాయి. లక్షణాల్లేని కేసులు మరో 20,782 బయటపడ్డాయి. పాజిటివ్ కేసుల్లో 3,200, లక్షణాల్లేని వాటిలో 19,872 షాంఘైలోనే నమోదయ్యాయి! కరోనా కట్టడికి షాంఘైలో 15 రోజులుగా కఠిన లాక్డౌన్ అమలవుతుండటం తెలిసిందే. ఇళ్ల నుంచి బయటికొచ్చే వీల్లేక, ఆహారం, అత్యవసర ఔషధాలు కూడా దొరక్క కోట్లాది మంది గగ్గోలు పెడుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం భారీగా పెంచింది. -
చైనాలో భయానక పరిస్థితులు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
బీజింగ్: కరోనా వైరస్ కారణంగా డ్రాగన్ దేశం చైనాలో భయానక వాతావరణం నెలకొంది. చైనాలోని అతిపెద్ద నగరం షాంఘైలో పరిస్థితులు భయానకంగా మారాయి. జీరో కోవిడ్ విధానంలో భాగంగా అమలవుతున్న కఠిన ఆంక్షలతో జనం ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకుండాపోతోంది. దీంతో, షాంఘై ప్రజలు తిరగబడుతున్నారు. వివరాల ప్రకారం.. కరోనా వైరస్ కారణంగా షాంఘైలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పేషెంట్లు లొంగిపోవాలని పోలీసులు చేసిన ఆదేశాలు షాంఘైలో ఘర్షణకు దారి తీశాయి. పీపీఈ కిట్ ధరించి ఓ వీధికి వచ్చిన పోలీసులు.. అక్కడ ఉన్న నివాసితుల ఇండ్లను సరెండర్ చేయాలని కోరారు. ఆ సమయంలో పోలీసులను స్థానికులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరోనా బాధితులను ఆ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లలో పెట్టేందుకు పోలీసులు ముందస్తుగా కాంపౌండ్‌ను ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ.. తమ కాంపౌండ్‌ను క్వారెంటైన్ కేంద్రంగా మారుస్తున్నారని ఆరోపించింది. దీంతో తమ ఆహారం దొరకకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. INSANE: The CCP is cracking down hard to enforce quarantine orders in Shanghai This video is wild pic.twitter.com/EjiXm5qwO4 — Drew Hernandez (@DrewHLive) April 14, 2022 ఇదిలా ఉండగా.. కరోనా బారిన పడిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టిచంపుతున్నారు. ఇటువంటి దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రుల్లో అరకొర వసతులు, చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోవడం కంటే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆక్రందనలు చేస్తున్నా రు. జైలుకెళ్తే అయినా కడుపు నిండుతుందనే ఆశతో తమను అరెస్ట్ చేయండంటూ పోలీసులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. -
COVID-19: షాంఘైలో ఆకలికేకలు
షాంఘై: చైనాలోని అతిపెద్ద నగరం షాంఘైలో పరిస్థితులు భయానకంగా మారాయి. జీరో కోవిడ్ విధానంలో భాగంగా అమలవుతున్న కఠిన ఆంక్షలతో జనం ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకుండాపోతోంది. దీంతో, ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోవడం కంటే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆక్రందనలు చేస్తున్నా రు. జైలుకెళ్తే అయినా కడుపు నిండుతుందనే ఆశతో తమను అరెస్ట్ చేయండంటూ పోలీసులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. కరోనా బారిన పడిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టిచంపుతున్నారు. ఇటువంటి దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రుల్లో అరకొర వసతులు, చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దారుణాలకు సంబంధించిన వీడియోలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తొలగిస్తూ జాగ్రత్తపడుతోంది. షాంఘైలో భారీగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటంతో మార్చి28వ తేదీ నుంచి కఠినాతి కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. దీంతో, నిత్యావసర వస్తువులు లభించక, ఆహారం దొరక్క షాంఘైలోని లక్షలాది మంది ప్రజలు అల్లాడుతు న్నారు. ఇళ్లలోని బాల్కనీలు, కిటికీల్లోంచి అరుపులు, పాటలతో నిరసనలు తెలుపుతున్నారు. ‘కడుపు నింపుకునేందుకు మా వద్ద ఏమీలేదు. మమ్మల్ని కాపాడండి. ఆకలితో బతకడం కష్టంగా ఉంది...’అంటూ అధికారులను వేడుకుంటున్న ట్లున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కోకొల్లలు కనిపిస్తున్నాయి. అధికారులు సరఫరా చేస్తున్న ఆహార వస్తువులు చాలక మార్కెట్లను లూటీ చేస్తున్న ఘటనలు కూడా ఇటీవల చోటుచేసుకున్నాయి. మూగ జీవులపై పాశవికం కరోనా బాధితుల ఇళ్లలో ఉండే పెంపుడు జీవులను అధికారులు వదలడం లేదని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టి చంపుతున్నారని చెబుతున్నట్లున్న వీడియోలను జనం సోషల్ మీడియాలో పెడుతున్నారు. షాంఘైలోని పుడోంగ్‌లో ఓ పెంపుడు కుక్కను ఆరోగ్య కార్యకర్త పారతో కొట్టి చంపుతున్న వీడియోను ఇటీవల సీఎన్ఎన్ వెలుగులోకి తెచ్చింది. ఇదే కాకుండా, క్వారంటైన్లో ఉన్న బాధితుల ఇళ్ల తాళాలను పగులగొట్టి మరీ వారి పెంపుడు జంతువులను చంపేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆత్మహత్య శరణ్యం అంటూ.. లాక్డౌన్ వేళ ఆకలిచావు కంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ టియాంజిన్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యతో కలిసి అపార్టుమెంట్ కిటికీలో నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చైనాలోనే అత్యంత ధనిక నగరం షాంఘై జనాభా 2.60 కోట్లు కాగా, అక్షరాస్యత 97%. ప్రముఖ పర్యాటక ప్రాంతం డిస్నీల్యాండ్ కూడా ఇక్కడుంది. ఇన్ని ఉన్నా ప్రజలు ఆకలితో ఆత్మహత్యలకు పాల్పడటం, మూగజీవాలను కొట్టి చంపడం వంటి దారుణాలు చోటుచేసుకోవడంపై పాలకులు ఆలోచించాలని అమెరికాలోని మీడియా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. -
‘చావమంటారా?’.. కరోనా పుట్టినింట హాహాకారాలు
లాక్‌డౌన్‌ను భరించడానికి ప్రజలకు ఓ ఓపిక అంటూ ఉంటుంది. కరోనా తొలినాళ్లలో లాక్‌డౌన్‌తో భారత్ ఎలాంటి పరిస్థితి ఎదుర్కుందో చూశాం. అయితే కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం ప్రజలు పట్టుమని పది, పదిహేను రోజులు కూడా భరించలేకపోతున్నారు. కారణం.. అత్యంత కఠినమైన లాక్డౌన్ అక్కడ అమలు అవుతోంది కాబట్టి. జీరో టోలరెన్స్ పేరిట చైనా అనుసరిస్తున్న వైఖరిపై తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య పేషెంట్లను కంటెయినర్లలో ఉంచి మానవ హక్కుల సంఘాల నుంచి సైతం విమర్శలు ఎదుర్కొంది డ్రాగన్ క్రంటీ. ఇప్పుడు దేశంలోనే.. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంగైను లాక్‌డౌన్‌తో దిగ్భంధించి.. జనజీవనాన్ని అగమ్య గోచరంగా తయారు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దాదాపు మూడు కోట్ల దాకా జనాభా ఉన్న షాంగై నగరం లాక్డౌన్ కట్టడిలో ఉండిపోయింది. ఇంటికే పరిమితమైన జనాలు.. పిచ్చెక్కిపోయి కిటికీలు, బాల్కనీల గుండా ఆర్తనాదాలు పెడుతున్నారు. ట్విటర్, ఇన్‌స్టా, ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. చివరకు ఆకలి చావులు, ఆత్మహత్యల లాంటి విషాదాలే మిగులుతాయని నిపుణులు వాపోతున్నారు. Residents in #Shanghai screaming from high rise apartments after 7 straight days of the city lockdown. The narrator worries that there will be major problems. (in Shanghainese dialect—he predicts people can’t hold out much longer—he implies tragedy).pic.twitter.com/jsQt6IdQNh — Eric Feigl-Ding (@DrEricDing) April 10, 2022 యావో మింగ్ లె, యావో సీ(చావు బతుకుల) మధ్య ఉన్నమంటూ అపార్ట్మెంట్ల నుంచి కేకలు పెడుతున్నారు కొందరు. నిత్యావసరాలు దొరక్క.. ఆకలితో అలమటించిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అయితే 2019లో తొలి కరోనా కేసు వుహాన్ నుంచి వెలుగు చూశాక.. ఈ స్థాయిలో చైనా కరోనా కేసుల్ని ఎదుర్కొవడం ఇదే ప్రథమం. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియెంట్ (బీఏ.2) బ్రేకింగ్‌పాయింట్‌ను దాటేయడంతోనే కరోనా కేసులు వెల్లువెత్తుతున్నాయి అక్కడ. ఒక్క ఆదివారమే ఇక్కడ 25 వేల కేసులు నమోదు అయ్యాయట!. రికార్డు స్థాయిలో టెస్టుల వల్లే ఈ ఫలితం కనిపిస్తోంది. ఈ తరుణంలో.. మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను ముందుకు తీసుకెళ్లాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు సాయంలో కాస్త ఆలస్యమైనప్పటికీ.. సాయం మాత్రం అందుతూనే ఉందని అధికారులు అంటున్నారు. BREAKING—China’s grip on BA2. At least 23 cities in China on full or partial lockdown—cities with over 193 million residents. Food shortages throughout even Shanghai. Doctors and nurses also exhausted—this doctor collapsed, and was carried off by patients at an isolation center. pic.twitter.com/raJlRNEezC — Eric Feigl-Ding (@DrEricDing) April 9, 2022 నిత్యం జనాలతో సందడిగా ఉండే షాంగై నగరం.. ఇప్పుడు ఎడారి వాతావరణంను తలపిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, డెలివరీ బాయ్స్, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు(అదీ అత్యవసరం అయితే తప్ప) ఇతరులకు బయట తిరిగేందుకు అనుమతి ఇవ్వడం లేదు. వైరస్ కట్టడికి జనాలు సహకరించాలని, ఏదైనా తేడా జరిగితే అమెరికా, ఇటలీ, బ్రిటన్ లాంటి పరిస్థితులు తప్పవని, కాబట్టి కష్టమైన కొంచెం సహకరించాలని ప్రజలను కోరుతున్నారు అక్కడి వైద్యాధికారులు. అయితే కేసులు ఎక్కువగా వస్తున్నా.. ప్రజావ్యతిరేక నిరసనల దృష్ట్యా మంగళవారం నుంచి కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సంబంధిత వార్త: కరోనా కోరల్లో చైనా.. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలు -
కిటికీలన్నా తెరుచుకుంటాం మహాప్రభో!
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందని, జీరో కోవిడ్ విధానం పేరిట చైనా అనుసరిస్తున్న నమూనా షాంఘై నగర ప్రజల ప్రాణాలమీదకు వచ్చింది. ఒకపక్క ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా కంట్రోల్ కాకపోవడంతో నగరంలో ఆంక్షలు సడలించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో కలుగుల్లో చిట్టెలుకల్లా మాడిపోతున్నాం మహాప్రభో అని ప్రజలు మూకుమ్మడి విజ్ఞాపనలు చేస్తున్నారు. చాలా అపార్ట్మెంట్లలో నీళ్లు, ఆహారం వంటి నిత్యావసరాలకు తీవ్రమైన కొరత ఏర్పడినట్లు కథనాలు వస్తున్నాయి. అయినా బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో చాలామంది తమ తమ బాల్కనీల్లో, కిటికీల వద్ద మనసు సాంత్వన పడేదాకా ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫీలైన ప్రభుత్వం ‘స్వాతంత్య్రం కోసం మీ ఆత్మలు పడే తపనను నియంత్రించుకోండి’ అని హెచ్చరించింది. దీంతో మనసారా ఏడ్చే అవకాశమూ ఇవ్వరా, కిటికీల్లో కుమిలే ఛాన్సు లేదా అంటూ ఇంట్లోనే గొల్లుమంటున్నారు షాంఘై వాసులు. డ్రోన్ పడగ నీడలో.. నగరంలో ప్రభుత్వ ఆంక్షలు సైన్స్ ఫిక్షన్ మూవీని తలపిస్తున్నాయి. పొరపాటున బాల్కనీల్లో, కిటికీల్లో ఎవరైనా తల బయటపెట్టగానే ‘కంట్రోల్ ద సోల్ డిజైర్ ఫర్ ఫ్రీడం అండ్ డోంట్ ఓపెన్ విండో’ అని బ్యానర్లున్న డ్రోన్లు ముఖం ముందు ప్రత్యక్షమవుతున్నాయని ప్రజలు సోషల్ మీడియాలో వాపోతున్నారు. ప్రభుత్వం మరీ నిర్భంధంగా వ్యవహరిస్తుండడంతో షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి తిరుగుబాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయినా పెద్ద పెద్ద ప్రజాందోళనలనే లెక్కచేయని చైనా ప్రభుత్వానికి ఈ చిన్నపాటి తిరుగుబాట్లు ఏపాటి అంటున్నారు ప్రజలు. ప్రభుత్వ నిర్బంధానికి తోడు ప్రజలకు కరోనా టెస్టులు తలనొప్పిగా మారాయి. సింగిల్ టెస్ట్ అని, డబుల్ టెస్టులని ప్రభుత్వం ఎడాపెడా ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తోంది. మరి ఎంతమంది రోగులు తేలారో, వారేమయ్యారో, మిగిలినవారి పరిస్థితేంటో ఎవరికీ తెలీదు! ఎక్కడైనా కరోనా పాజిటివ్ అని తేలితే చాలు, చిన్నా పెద్దా అని తేడా లేకుండా తీసుకుపోయి క్వారంటైన్ కేంద్రంలో పారేస్తున్నారు. కొన్నిచోట్ల చిన్న పిల్లలను సైతం తల్లిదండ్రుల దగ్గర్నుంచి లాక్కెళ్లి క్వారైంటైన్ పాలుచేశారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజాగా ఫ్యామిలీ క్వారంటైన్ అమలు చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
చైనాను కలవరపెడుతున్న కరోనా.. జిన్ పింగ్ సంచలన నిర్ణయం
బీజింగ్: చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం చైనా సర్కార్‌ను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఇక, ఆదివారం ఒక్కరోజే 13 వేల కేసులు వెలుగు చూశాయి. అయితే, రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ట కేసులుగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం నమోదైన పాజిటివ్ కేసుల్లో 70 శాతం కేసులు షాంఘైలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. తాజాగా ఈశాన్య చైనాలోని బయో చెంగ్, షాంఘైలోనూ లాక్‌డైన్ విధించారు. అయితే, వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ మరణాలు మాత్రం సంభవించలేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. కాగా, రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘైలో భారీ స్థాయిలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న 26 మిలియన్ల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక్కడ టెస్టుల కోసం చైనా మిలిటరీని, వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలను షాంఘైకి పంపింది. ఇటీవల ఆర్మీ, నేవీ, జాయింట్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఫోర్స్‌ల నుండి రిక్రూట్ అయిన 2,000 మందికి పైగా వైద్య సిబ్బందిని షాంఘైకి పంపినట్లు సాయుధ దళాల వార్తాపత్రిక నివేదించింది. దీంతో వీరందరూ షాంఘైలో ఉన్న ప్రజలకు టెస్టులు నిర్వహించనున్నారు. China has sent the military and thousands of healthcare workers into Shanghai to help carry out COVID-19 tests for all of its 26 million residents as cases continued to rise on Monday. https://t.co/VbbmOE2OvY — SBS News (@SBSNews) April 4, 2022 -
China Corona: ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలు
కరోనా పుట్టుకకు చైనానే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఆరంభంలో వైరస్ విజృంభించినా.. అంతే వేగంగా వైరస్‌ను అదుపు చేసింది. అయితే రెండేళ్ల పాటు ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతుంటే.. చైనా మాత్రం జీరో టోలరెన్స్ పేరిట హడావిడి చేసింది. ఈ తరుణంలో ప్రపంచాన్ని నివ్వెరపరస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అక్కడ. షాంగై.. రెండున్నర కోట్ల జనాభా ఉన్న మహానగరం. అధిక జనసాంద్రతతో పాటు ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే ప్రాంతాల్లో ఒకటి. అలాంటి నగరం మూగబోయింది. మనుషులు, పశువులు రోడ్డెక్కడం లేదు. కఠిన లాక్‌డౌన్‌తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నిత్యావసరాలు, ఆస్పత్రి సేవలు సకాలంలో దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిరసనల గళం వీలైన రీతిలో వినిపిస్తున్నారు. రోబోలతో వీధుల వెంట కరోనా జాగ్రత్తలు చెప్పిస్తున్నారు. Behold… the abandoned streets of the most populace city on Earth, Shanghai, in the strictest pandemic lockdown the world has ever seen. Normally these streets are shoulder-to-shoulder crowded. Eeerie. pic.twitter.com/HGdvK6NLOD — Eric Feigl-Ding (@DrEricDing) April 1, 2022 ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది చైనా ఇప్పుడు. సోమవారం నుంచి షాంగైలో ఇది మొదలైంది. షాంగైలో ప్రతి నలుగురిలో ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయట. ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తుండడంతో.. ఇంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. This is how people walk their dog during #Covid19 #lockdown 😆 pic.twitter.com/RWOtzYCBQm — Clumsybear0129 (@clumsybear0129) March 29, 2022 కుక్కల ఓనర్లు వాటికి తాళ్లు కట్టి కిందకి దించి.. కాలకృత్యాలు తీర్చడం, ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్‌కు సరుకుల రవాణా తాళ్ల సాయంతో చేయడం, చెత్తను విసిరేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, స్మార్ట్ ఫోన్లలోనే ముఖ్యమైన పనులు, ప్రజల కోసం డ్రోన్ల సాయం.. ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ. Protest against lockdown in Shanghai. "We want to eat. We want to go to work. We have the right to know!"#chinalockdown #lockdown #Shanghai pic.twitter.com/I9DARcC06V — Eitan Waxman (@EitanWaxman) March 27, 2022 కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. ఆఖరికి విధుల్లోనూ పోలీసులు భాగం కావడం లేదంటే పరిస్థితి తీవ్రత అర్థంచేసుకోవచ్చు. రోబోలతోనే పాట్రోలింగ్ చేయిస్తున్నారు. నిశబ్దమైన రోడ్ల మీద అప్పుడప్పుడు ఆంబులెన్స్ సౌండ్ తప్ప మరేమీ వినిపించడం లేదు. వెరసి.. షాంగై ఇప్పుడు ఘోస్ట్ టౌన్‌ను తలపిస్తోంది. Full Lockdown in Shanghai, this is how they broadcast announcements. Robot Dog + Speakers#Shanghai #COVID #Lockdown pic.twitter.com/5kJdLrnL8p — Jay in Shanghai 🇨🇳 (@JayinShanghai) March 29, 2022 Breaking: Shanghai authorities are using drones to aid the #covid #lockdown in #Pudong #Shanghai. Skynet isn't enough for them. pic.twitter.com/GJS1g7xofw — Harvey JI-Campaigner of Toilet Revolution (@JiPrisoner) March 29, 2022 -
చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ దశల వారిగా లాక్డౌన్
China to Start Phased Lockdown: చైనా కొత్త కరోనా వేరియంట్‌కి సంబంధించిన కేసులు అనుహ్యంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలేని విధంగా చైనాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చైనా అమలు చేసిన జీరో కోవిడ్ టోలరెన్స్ విధానాన్ని పటాపంచల్ చేస్తూ మరీ విజృంభిస్తోంది. అంతేగాదు పరిస్థితిని వారంలోగా అదుపులోకి తీసుకొస్తామని చైనా అధికారులు కూడా ప్రకటించారు. కానీ చైనాలోని పరిస్థితి చూస్తే ఇప్పడప్పుడే అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు. దీంతో చైనా దశలవారిగా లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఇంతవరకు చైనా దేశవ్యాప్తంగా సుమారు 13 ప్రధాన నగరాల్లో పూర్తిగా లాక్డౌన్ విధించిన సంగతి విదితమే. పైగా అతిపెద్ద నగరం షాంఘైలో కొద్ది మొత్తంలో ఆంక్షల సడలింపుతో లాక్డౌన్ విధించింది. కానీ ఇప్పడూ షాంఘైలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా దశాలవారిగా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. అంతేకాదు 17 మిలియన్లకు పైగా జనాభా ఉన్న షాంఘైటోని షెన్జెన్ నగరంలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా పూర్తిగా మూసివేసింది. పైగా ఇక్కడ కరోనా మొదటి వేవ్ మాదిరిగా వేగంగా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు ఈ షెన్ జెన్ నగరంలో పరిస్థితిని అదుపులో తెచ్చే విషయమై చైనా మూడు రౌండ్ల కోవిడ్-19 పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. ఈ మేరకు ఉద్యోగులను ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేసింది కూడా. అంతేకాదు రోజు వారీ అవసరాలకు మాత్రమే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది కూడా. (చదవండి: రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రధానంగా ఆ దేశాల్లోనే..) -
ప్రపంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే!
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను కలిగిన నగరంగా చైనాలోని షాంఘై అవతరించింది. తాజాగా రెండు డ్రైవర్‌లెస్ మెట్రో లైన్లు.. లైన్14, ఫేజ్ వన్ ఆఫ్ లైన్18ను ప్రారంభించడంతో ప్రపంచంలో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా నిలిచింది. షాంఘై మెట్రో నెట్వర్క్ ప్రత్యేకతలు.. తాజాగా కొత్త మెట్రో లైన్ల ప్రారంభోత్సవంతో షాంఘై సబ్వే నెట్వర్క్ 831కిలో మీటర్ల పొడవు విస్తరించింది. అదేవిధంగా ఆటోమేటిక్ లేదా డ్రైవర్‌లెస్ మెట్రో లైన్ల సంఖ్య 5కు చేరింది. పలు మెట్రో మార్గాలకు అనధికారిక మారుపేర్లు ప్రచారంలో ఉన్నాయి. లైన్10ను ‘గోల్డెన్ లైన్’గా స్థానికులు పిలుస్తారు. ఇది యుయువాన్ గార్డెన్, జింటియాండి, ఈస్ట్ నాన్జింగ్ రోడ్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల గుండా ప్రయాణిస్తుంది. లైన్6 గులాబీ రంగులో ఉన్నందున ‘హలో కిట్టి లేన్’ అని ప్రయాణికులు పిలుచుకుంటారు. షాంఘై మెట్రో నెట్‌వర్క్‌లో 508 స్టేషన్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్ మెట్రో నెట్వర్క్.. రెండో అతిపెద్ద సబ్వే వ్యవస్థను కలిగి ఉంది. బీజింగ్ మెట్రో ట్రాక్ పొడవు 780కిలో మీటర్లు విస్తరించింది. 2021లో సుమారు 53 కిలోమీటర్ల లైన్లను నిర్మించారు. బీజింగ్ డైలీ నివేదికల ప్రకారం.. బీజింగ్ మెట్రో నెట్‌వర్క్‌లో 450 స్టేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మెట్రో ప్రయాణానికి అన్ని సౌకర్యాలు కల్పించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కరోనా విజృంభణ: స్కూల్స్ బంద్.. విమానాలు రద్దు
బీజింగ్: చైనాలో తాజాగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం వందలకొద్ది విమానాలను రద్దు చేయడం, పాఠశాలలను మూసివేయడం వంటి కఠిన ఆంక్షలను విధించింది. అంతేకాదు చైనా దేశవ్యాప్తంగా సార్స్-కోవీ-2కి సంబంధించిన సాముహిక పరీక్షను కూడావేగవంతం చేయనుంది. అయితే ఇతర దేశాలు మాదిరిగా కాకుండా చైనా మాత్రం ఇంకా లాక్‌డౌన్‌ని కొనసాగించడమే కాక పొరుగుదేశాలతో ఉన్న సరహద్దులను కూడా మూసివేసిన సంగతి తెలిసిందే. (చదవండి: తింగరోడు.. లైవ్ టెలికాస్టింగ్‌లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..) క్రాస్ ప్రావిన్షియల్ పర్యటనలో ఉన్న ఏడుగురు వృద్ధ బృందానికి నిర్వహించిన కోవిడ్ -19 పరీక్షలో కేసులు వెలుగు చూశాయి. పైగా ఈ వృద్ధ బృందం జియాన్, గన్సు ప్రావిన్స్, మంగోలియాకు వెళ్లే ముందు షాంఘైని కూడా సందర్శించారు. దీంతో బీజిగ్తో సహా కనీసం ఐదు ప్రావీన్స్లు కరోనా ప్రభావం ఉండోచ్చని చైనా ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు గత కొన్ని రోజులగా ఉత్తర వాయువ్య ప్రాంతాల నుంచి కొత్త కేసులు నమోదవుతున్నట్లు కూడా చైనా గుర్తించింది. అయితే చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ గురువారం నాటికి తాజాగా 13 కోవిడ్ -19 కేసులు నమోదైనట్లు పేర్కొంది. (చదవండి: అందుకే ఇంగ్లండ్ నుంచి వస్తున్నారు) -
మూగజీవాల రక్షకుడు.. 8వేల కుక్కలను కాపాడిన భిక్షువు..
ఈయన పేరు హి జియాంగ్. చైనా షాంఘై నగరంలోని పురాతన బౌద్ధ మఠంలో ప్రధాన భిక్షువు. అంతే కాదు.. చైనాలో మూగజీవాలకు ఈయన దేవుడు. ఆయన చేతుల్లో ఉన్న కుక్కపిల్ల రోడ్డుపై దొరికినదే. దానిని సంరక్షించి, అమెరికాలోని ఓ వ్యక్తికి దత్తత ఇచ్చారు. ఆయనే స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చి దానిని సాగనంపారు. ఆ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. జంతువులంటే ఆయనకి అంత ప్రీతి. 51 ఏళ్ల జియాంగ్ చైనాలోని వేలాది మూగ జీవాలకు సంరక్షకుడు. ఇందుకోసం తన మఠంలోనే మూగ జీవాల సంరక్షణాలయం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ రకాల జంతువులను, పక్షులను, వీధి శునకాలు వేలాదిగా ఉన్నాయి. శునకాలే 8 వేలు ఉన్నాయి. ఆయనే స్వయంగా వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఒక్కోసారి పశువైద్యుడి అవతారం ఎత్తి ఆ మూగ జీవాలకు వ్యాక్సిన్లు కూడా వేస్తుంటారు. ఇన్ని వేల మూగజీవాలను సంరక్షించడం ప్రపంచంలోనే చాలా అరుదు. చదవండి: స్నేక్ అటెంప్ట్ మర్డర్ అంటే ఇదేనేమో? మొదట్లో ఆయన ప్రమాదాల్లో గాయపడ్డ మూగజీవాలకు వైద్య చికిత్స చేయించేవారు. 1994 నుంచి వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రెండేళ్ల క్రితం చైనాలో సుమారు 5 కోట్ల మూగ జీవాలు వీధుల్లో ఉన్నాయని అంచనా. వీటి సంఖ్య ఏటా పెరుగుతోంది. ‘‘చైనా ప్రజలకు ఆదాయం పెరిగింది కానీ, మూగజీవాలను పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. అందుకే వారు తమ పెంపుడు జంతువులను వీధుల్లో వదిలేస్తున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలకు కొత్త జీవితం షాంఘై పోలీసులు ఇటీవల ఇరుకుగా ఉన్న బోనుల్లో కొన్ని వీధి కుక్కలను బంధించి ఉంచారు. వాటిలో 20 వరకూ పిల్లలు కూడా ఉన్నాయి. ఈ విషయం జియాంగ్ చెవిన పడింది. వెంటనే ఆయన అక్కడకు చేరుకున్నారు. పోలీసులతో మాట్లాడారు. కొద్ది సమయంలో ఆ శునకాలకు బోనుల నుంచి విముక్తి లభించింది. వాటిని తీసుకుని జియాంగ్ తన సంరక్షణాలయానికి చేరుకున్నారు. ఆ శునకాల్లో గాయపడ్డ వాటికి, జబ్బుతో ఇబ్బంది పడ్డవాటికి సపర్యలు చేశారు. ప్రేమగా లాలించారు. వాటిని రక్షించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. జీవుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. ‘‘నేను వాటిని రక్షించక పోతే.. అవి చనిపోయి ఉండేవి’’ అని జియాంగ్ చెబుతారు. అప్పు చేసి ఆహారం కుక్కలతో పాటు పిల్లులు, కోళ్లు, బాతులు, నెమళ్లు కూడా జియాంగ్ మఠంలో ఆశ్రయం పొందుతున్నాయి. వీటన్నిటికీ ఆహారం పెట్టాలంటే ఓ భిక్షువుకు తలకు మించిన భారమే అవుతుంది. ఏటా వీటి ఆహారానికి సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చవుతోందట. ప్రభుత్వం నుంచి ఆయనకు ఏమాత్రం సహకారం అందదు. చందాలతోనూ, అప్పులతోనూ ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. అయితే ఇకపై అప్పు పుట్టే పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఆయన ఇతర దేశాల్లోని సంరక్షకుల వద్దకు, దత్తత తీసుకునే వారికి ఆ శునకాలను ఆయన ఇచ్చేస్తున్నారు. ఇంగ్లీషు తెలిసిన తన వాలంటీర్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలకు సుమారు 300 కుక్కలను పంపారు. అలా పంపడం తనకు ఇష్టం లేదని, అయితే వాటికి కొత్త జీవితాలను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నానని ఆయన తెలిపారు. ఏదొక రోజు వెళ్లి వాటిని చూసి వస్తానని చెబుతున్నారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
17న ‘షాంఘై’ భేటీలో మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ: తజకిస్తాన్ రాజధాని దుషాంబేలో 17న ప్రారంభంకానున్న వార్షిక షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ(వర్చువల్) పద్ధతిలో ప్రసంగించనున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నేరుగా దుషాంబేకు వెళ్లి అక్కడ జరుగుతున్న ఎస్సీవో సదస్సులో పాల్గొని భారత అభిప్రాయాలను పంచుకోనున్నారు. అఫ్గాన్ సంక్షోభం కారణంగా తలెత్తే పరిణామాలపై సదస్సులో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రహ్మాన్ అధ్యక్షత ప్రారంభమయ్యే 21వ ఎస్సీవో సదస్సులో సభ్య దేశాల అగ్రనేతలు నేరుగా, వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారు. భారత ప్రతినిధి బృందం తరఫున ప్రధాని మోదీ సదస్సు ప్లీనరీ సెషన్లో ప్రసంగించనున్నారు’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈసారి సమావేశాల్లో ఎస్సీవో సభ్య దేశాల నేతలు, పరిశీలక దేశాలు, ఎస్సీవో ప్రధాన కార్యదర్శి, ఎస్సీవో ప్రాంత ఉగ్రవ్యతిరేక విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్య అతిథులు పాల్గొననున్నారు. వర్చువల్ పద్ధతిలో సదస్సు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎస్సీవోలో పూర్తి స్థాయి సభ్య దేశం హోదా సంపాదించాక భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది నాలుగోసారి. ‘ఎస్సీవో 20వ వార్షికోత్సవం సందర్భంగా గత రెండు దశాబ్దాల్లో సాధించిన ప్రగతిపై సమీక్ష జరిగే అవకాశముంది. భవిష్యత్తులో దేశాల సహకారంపైనా చర్చ జరగొచ్చు’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరాన్, తజకిస్తాన్, ముఖ్య దేశాల విదేశాంగ మంత్రులతో జై శంకర్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. చైనా, రష్యా, పాక్ విదేశాంగ మంత్రులు సదస్సుకు హాజరుకానున్నారు. నాటో తరహాలో ఎనిమిది దేశాల కూటమిగా ఎస్సీవో ఆవిర్భవించింది. 2017 నుంచి భారత్, పాక్‌లు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు సంయుక్తంగా 2001లో షాంఘైలో ఎస్సీవోను స్థాపించారు. భద్రతాపరమైన అంతర్జాతీయ సహకారం కోసం ఎస్సీవోతో, రక్షణ అంశాల్లో ఉమ్మడి పోరు కోసం యాంటీ–టెర్రరిజం స్ట్రక్చర్(ర్యాట్స్)లతో భారత్ కలిసి పనిచేస్తోంది. ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ చర్చ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. భారత్–ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మ భాగస్వామ్యంలో పురోగతిపై నేతలిద్దరూ చర్చించారు. ‘త్వరలో జరగబోయే ‘క్వాడ్’ సదస్సు గురించీ చర్చించాము’ అని ఆ తర్వాత మోదీ ట్వీట్‌చేశారు. -
అంతర్జాతీయంగా మరో గుర్తింపు సాధించిన ‘ఆకాశమే నీ హద్దురా’
సూర్య హీరోగా నటించిన ‘శూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) చిత్రానికి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఎస్ఐఎఫ్ఐ)లో ప్రదర్శితం కానుంది. ఈ చిత్రోత్సవాలు ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20 వరకు జరగనున్నాయి. పనోరమ విభాగంలో ‘శూరరై పోట్రు’ చిత్రం ఎంపికయింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని సుధ కొంగర తెరకెక్కించారు. ఆల్రెడీ 93వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌కు పరిశీలించిన చిత్రాల్లో ‘శూరరై పోట్రు’ ఉన్న విషయం తెలిసిందే. అయితే నామినేషన్ దక్కలేదు. మరో ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్‌కు కూడా ఈ చిత్రం వెళ్లింది. ఇప్పుడు షాంఘై చలన చిత్రోత్సవాలకు వెళ్లడం ఈ చిత్రానికి దక్కిన మరో గౌరవంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే... మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ కూడా ప్రదర్శనకు ఎంపికైంది. కొత్తగా పెళ్లయిన యువతి అత్తింటివాళ్లు, భర్తకు తగ్గట్టుగా ఒదిగిపోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు–తమిళ భాషల్లో కన్నన్ దర్శకత్వంలో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించనున్నారు. . @Suriya_offl - #SudhaKongara 's Blockbuster #AakaasamNeeHaddhuRa Enters Panorama Section Of Shanghai International Film Festival 2021. 🔥#PraiseTheBrave #SooraraiPottru @rajsekarpandian @Aparnabala2 @gvprakash @2D_ENTPVTLTD #Suriya #Suriya40 pic.twitter.com/JHy2TW7Aa8 — Telugu Film Producers Council (@tfpcin) May 13, 2021 చదవండి: సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం -
ఈనెలలో జోనల్ స్థాయి నైపుణ్య పోటీలు
సాక్షి, అమరావతి: చైనాలోని షాంఘై నగరంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ), స్కిల్ ఇండియా సంస్థల సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) నైపుణ్య పోటీలను నిర్వహించనుంది. ఏప్రిల్ మూడు, నాలుగు వారాల్లో మొత్తం 11 విభాగాల్లో ఈ పోటీలు జరపాలని నిర్ణయించింది. రోబోటిక్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఇండస్ట్రీ 4.0, మెకట్రానిక్స్ విభాగాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు 1996 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలి. మిగతా విభాగాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు 1999 జనవరి 1వ తర్వాత జన్మించి ఉండాలి. ఆసక్తి ఉన్నవారు ఈనెల 10లోపు www.apssdc.in లోగానీ.. http:// engineering. apssdc. in/ worldskillsap/ లోగానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఈ పోటీలకు నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ డీవీ రామకోటిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్య పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాలకు ఏపీఎస్ఎస్డీసీ టోల్ ఫ్రీ నంబర్ 18004252422లో సంప్రదించవచ్చు. సెప్టెంబర్‌లో జాతీయస్థాయి పోటీలు కాగా, నైపుణ్య పోటీల్లో పాల్గొనేందుకు రిజస్ట్రేషన్ చేసుకున్న వారందరినీ విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నంలో జరిగే జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని మే మొదటి వారంలో జరిగే రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలకు ఎంపిక చేస్తారు. ఇక మెకట్రానిక్స్ జ్యువెలరీ, ఐటీ నెట్వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, ప్రొటోటైప్ మోడలింగ్, ప్లాస్టిక్ డై ఇంజనీరింగ్ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు నేరుగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని సౌత్‌జోన్ పోటీలకు ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ కనబరిచిన వారిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని షాంఘై నగరంలో నిర్వహించే ప్రపంచస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహకంతోపాటు మెడల్, సర్టిఫికెట్లు అందజేస్తారు. -
ప్రత్యేక విమానంలో వారికి నో ఎంట్రీ!
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం భారత్ నుంచి చైనా వెళ్లేందుకు దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు సహా పలువురు భారతీయులను విమానంలోకి చైనా అనుమతించలేదు. జూన్ 21న భారత్ నుంచి షాంఘై వెళ్లిన ప్రత్యేక విమానంలో ఇద్దరు భారతీయులకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చైనా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు భారతీయులకు కరోనా సోకడంతో వారిని స్వదేశానికి తరలించేందుకు భారత్ నుంచి ఖాళీ ప్రత్యేక విమానాన్ని పంపేందుకు చైనా అధికారులు అనుమతించారు. ఇక గ్వాంజు నగరం నుంచి 86 మంది భారతీయులతో వందే భారత్ మిషన్ మూడో దశలో భాగంగా భారత్‌కు బయలుదేరింది. జూన్ 21న షాంఘైకు చేరుకున్న విమానం కూడా చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకే వెళ్లింది. ప్రత్యేక విమానాల్లో దౌత్య పాస్‌పోర్టులు కలిగిన భారతీయులను సైతం చైనా అనుమతించకపోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విమానాల పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. కాగా భారత్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జూన్ 29న గ్వాంజు నగరానికి వచ్చే విమానంలో ప్రయాణీకులను అనుమతించరాదని ఇరు దేశాలు నిర్ణయించాయని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : వందే భారత్ మిషన్ : ఆ విమానాలకు బ్రేక్? -
చైనాలో థియేటర్స్ ప్రారంభం
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌ను మూసివేశారు. సినిమాలు వాయిదా పడ్డాయి. థియేటర్స్ కళ తప్పాయి. అయితే చైనాలో థియేటర్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు. షాంఘై నగరంలోని థియేటర్స్‌లో శనివారం, నుంచి సినిమాలు ప్రదర్శిస్తున్నారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుడిని లోపలికి అనుమతించాలని, ఏ ఇద్దరూ పక్క పక్కనే కూర్చోకుండా సీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందట. ప్రస్తుతానికి పాత సినిమాలనే ప్రదర్శిస్తున్నారు. కొత్త సినిమాలు విడుదల కావడానికి మరికొంచెం సమయం పట్టేలా ఉంది. -
‘కరోనా’కు ఒక్క రోజులో వంద మంది మృతి
బీజింగ్ : చైనాలో కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు తాము తీసుకుంటున్న చర్యలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయని, వైరస్ వ్యాపించే వేగం తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని చైనా వైద్యాధికారులు శనివారం నాడు సగౌరవంగా చెప్పుకున్నారు. అయితే 24 గంటల్లోనే వారి అంచనాలు తారుమారయ్యాయి. ఒక్క ఆదివారం నాడు 24 గంటల్లోనే చైనాలో 97 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ఇతర దేశాల్లో మరో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య చైనాలో 908కి, రోగుల సంఖ్య 3,062కు చేరుకుంది. 27 మంది విదేశీయులకు కూడా వైరస్ సోకినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. చైనాలో ఒక్క ఆదివారం నాడే మృతుల సంఖ్య 15 శాతం పెరగడం అటూ చైనాకు, ఇటు ప్రపంచ దేశాలకు ఆందోళనకరమైన విషయం. చైనా ప్రజల్లో ఎక్కువ మంది కొత్త సంవత్సర సెలవులను ముగించుకొని తిరిగి విధుల్లో చేరడం వల్ల కరోనావైరస్ మృతుల సంఖ్య పెరగి ఉంటుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి పరిశీలిస్తే ఆదివారం నాడు షాంఘై, బీజింగ్ నగరాల రోడ్లు రద్దీగా కనిపించాయి. ప్రజలు ఇప్పటికీ ఆఫీసుల్లోకి రావడానికి భయపడుతున్నందున తమ సభ్యులైన కంపెనీలు సిబ్బందిని ఇంటి నుంచి పనిచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయని షాంఘైలోని పారిశ్రామిక మండలి సోమవారం వెల్లడించింది. కరోనావైరస్ బయట పడిన వుహాన్ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ నిర్మానుష్యంగానే ఉన్నాయి. ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని అధికారులు విధించిన ఆదేశాలు ఆ ప్రాంతంలో ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. (చదవండి: ‘సార్స్’ను మించిన కరోనా) -
మా ఊరిని చూపించాలనుంది
‘‘కెమెరా, చక్కటి కథనం చాలు అద్భుతాలు సృష్టించడానికి’’ అంటారు సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు. ఇంతకీ ఎవరీ వేణు అంటే షాంగై ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ అందుకున్న తొలి భారతీయ కెమెరామేన్. అనుభవం ఒక్క సినిమానే. అదీ గారో భాషలో తీసిన మేఘాలయ సినిమా. రాజయ్యపల్లి, వరంగల్‌లో పుట్టిన వేణు ఆచార్యకి పదో తరగతి నుంచి కెమెరామేన్ అవాలనే కోరిక ఉండేది. ‘‘చిన్నప్పటి నుంచే నాకు డ్రాయింగ్ మీద ఆసక్తి ఉండేది. గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పను కానీ నాకు ఆర్ట్స్ మీద ఆసక్తి ఉందని అర్థమైంది. ఓసారి హైదరాబాద్ జెయన్‌టీయూ నుంచి కొందరు స్టూడెంట్స్ మా ఊరు వచ్చారు. ఆసక్తి ఉంటే ఆర్ట్స్ కాలేజీలో చేరి సినిమాటోగ్రాఫర్ కావచ్చని సలహా ఇచ్చారు. అలాగే చేశాను’’ అని బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ షాంగై ఫిల్మ్‌ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 15 నామినేషన్లలో ‘మా.అమా’ అనే చిత్రానికి వేణు ఈ అవార్డు పొందారు. ‘‘మేఘాలయా చూడటానికి అద్భుతంగా ఉంటుంది. కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏం మా సినిమాలో లేవు. కేవలం 8 లక్షల్లో సినిమా తీశాం. డోమ్నిక్ సంగ్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అందరూ కెమెరాకు కొత్తవాళ్లే కావడం విశేషం. ఇంతకుముందు ‘జెర్సీ’ సినిమాకు సెకండ్ యూనిట్ కెమెరామేన్‌గా కూడా చేశాను. త్వరలోనే దర్శకత్వం కూడా చేయాలని, మా ఊరిని, అక్కడి ప్రజలను చూపించాలనుంది. అవార్డు తీసుకొని ఇంటికి వెళ్లగానే అమ్మ చిన్నగా నవ్వి ఇంతకీ తిన్నావా? అని అడిగింది. జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అనిపించింది నాకు’’ అన్నారు వేణు. -
మోదీ విదేశీ పర్యటనలు ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం చేయబోయే విదేశీ పర్యటనలు కూడా దాదాపు ఖరారయ్యాయి. తొలి పర్యటనగా మాల్దీవులకు వెళ్లనున్న ఆయన ఈ ఏడాది ఇద్దరు అగ్రదేశాల అధినేతలను కలవనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో మోదీ రెండుసార్లు ద్వైపాక్షిక భేటీలో పాల్గొనే అవకాశముందని సమాచారం. సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకానున్న మోదీ.. ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందే జూన్ 28, 29న జపాన్‌లో జరగబోయే జి20 సదస్సులోనూ వీరిద్దరూ సమావేశం కానున్నారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అక్టోబరులో భారత పర్యటనకు రానున్నట్లు సమాచారం. అక్టోబరు 11న మోదీతో జిన్‌పింగ్ అనధికారిక భేటీలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. దీనికంటే ముందే జూన్ 13,14న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యే మోదీ.. జిన్‌పింగ్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. -
‘ఆడి క్యూ7, ఏ4’ నూతన ఎడిషన్లు
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’.. తాజాగా తన ఎస్యూవీ క్యూ7, సెడాన్ ఏ4 మోడళ్లలో ‘లైఫ్ స్టైయిల్’ పేరుతో నూతన వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆడి క్యూ7 లైఫ్ స్టైయిల్ ఎడిషన్ ధర 75.82 లక్షల రూపాయిలు కాగా, ఏ4 లైఫ్ స్టైయిల్ ఎడిషన్ ధర 43.09 లక్షల రూపాయిలుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆడి ఇండియా హెడ్ రహిల్ అన్సారి మాట్లాడుతూ.. ‘ఏ6 మోడల్‌కు లైఫ్ స్టైయిల్ పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేశాక మా వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. నూతన వేరియంట్లకు బలమైన డిమాండ్ దక్కింది. ఈ ప్రేరణతో తాజాగా మరో రెండు నూతన వేరియంట్లను విడుదలచేశాం’ అని అన్నారు. -
తల్లి ఎదుటే కోపంతో బ్రిడ్జ్‌పై నుంచి దూకి..
షాంగై : కన్నతల్లి ముందే ఓ యువకుడు బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైనాలో బుధవారం చోటుచేసుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్పరిణామానికి షాకైన ఆ తల్లి బ్రిడ్జ్‌పైనే కుప్పకూలి ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. దీనికి సబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాలు.. కారులో షాంగై బ్రిడ్జ్ మీదుగు వెలుతున్నసమయంలో తల్లికి తన 17 ఏళ్ల కుమారిడికి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ యువకుడు కారు లోంచి దిగి బ్రిడ్జ్‌పై నుంచి దూకేశాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. -
కన్నతల్లి ముందే ఓ యువకుడు ఆత్మహత్య
-
షాంఘై రోడ్డు ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి
సాక్షి, పుట్టపర్తి/అనంతపురం : బతుకుదెరువుకోసం విదేశాలకు వెళ్లిన జిల్లావాసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన చైనాలోని షాంఘైలో జరిగింది. వివరాలు.. కొత్తచెరువు మండలంలోని తిప్పబట్లపల్లికి చెందిన కోలాటి తిప్పన్న, వెంగమ్మ కుమారుడు కిశోర్ పొట్టకూటి కోసం కొంతకాలం క్రితం చైనా వలస వెళ్లాడు. అక్కడ షాంఘైలోని రెస్టారెంట్లో పనిచేస్తున్న కిశోర్ పనిముగించుకొని ఇంటికి చేరుతుండగా అతని వాహనం డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన కిశోర్ ప్రాణాలు విడిచాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వాళ్లకు ఏదైనా సాధ్యమే!
షాంఘై: మనసుంటే మార్గముంటుందనే దానికి నిదర్శనమిది. ఏదో కొత్తగా చేయాలనే తపన, గట్టి సంకల్పం ముందు అన్ని ఆటంకాలు బలాదూర్ అయ్యాయి. సాదారణంగా మనం ఏదైనా మూలనపడ్డ క్వారీని చూసి, దీనిని ఏం చేయలేం ఇక దీని పని అంతే అని చూసి వెళతాం. ఆ క్వారీని నిరుపయోగం వదిలేస్తాం. కానీ మనం క్వారీనే వదిలేయటం లేదు. ఎంతో విలువైన స్థలాన్ని వృదాగా వదిలేస్తున్నాం. అది కొంత మంది ఇంజనీర్లకు నచ్చలేదు. అందుకే కళ్లు చెదిరే రీతిలో భవంతిని నిర్మించించి లోకానికి చూపించారు. మార్గ నిర్దేశం చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి తొలి కట్టడంగా పేరు గడించేలా చేశారు. అద్భుత కట్టడాలకు నిలయమైన చైనా మరో నమ్మశక్యం కాని భవంతిని నిర్మించి ఔరా అనిపించింది. సెంట్రల్ షాంఘైకు అతి దగ్గరలో మూలనపడ్డ క్వారీలో హోటల్‌ను నిర్మించి అందరి చూపు అటువైపు తిప్పేలా చేశారు చైనా ఇంజనీర్లు. మూలనపడ్డ పెద్ద క్వారీలో ఏకంగా 17 అంతస్థుల హోటల్‌ను నిర్మించింది. 290 అడుగుల లోతు గల క్వారీలో నీరు చేరకుండా చీఫ్ ఇంజనీర్లు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 336 గదులతో భవనాన్ని నిర్మించారు. అందులోనూ ఈ హోటల్‌ను సాదాసీదాగా నిర్మించలేదు. రిలాక్స్ కావడానికి పార్క్, స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫాల్ వంటి అన్ని వసతులను కల్పించారు. దీంతో ఇలాంటి ప్రాజెక్ట్‌కు సరితూగే నిర్మాణమే ప్రపంచంలో లేదని చైనా తేల్చిచెప్పేసింది. ఇక దీని కోసం చైనా ప్రభుత్వం 288 మిలియన్ డాలర్లను ఖర్చుచేసింది. 2013లో దీని నిర్మాణం చేపట్టినప్పటికీ ఆ ఏడాదే భారీ వర్షాల కారణంగా సమీపంలోని నది ఉప్పొంగి ఈ క్వారీలోకి నీళ్లు చేరడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. నీటి మట్టం తగ్గిన తర్వాత మరలా నిర్మాణానికి పూనుకున్నారు. ఇక భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు ఇంజనీర్లు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక క్వారీలో నీటి మట్టం ఎప్పుడూ ఒకేలా ఉంచేందుకు ప్రత్యేకంగా పంప్ హౌజ్‌ను ఏర్పాటుచేశారు. సెంట్రల్ షాంఘై నుంచి గంట ప్రయాణం చేస్తు ఈ హోటల్‌కు చేరుకోవచ్చు. ఇక ఇన్ని జాగ్రత్తలతో, అన్ని హంగులతో నిర్మితమైన ఈ హోటల్లో ఓ గది బుక్ చేసుకోవాలంటే రోజుకు 490 డాలర్ల ఖర్చవుతుంది. -
చైనా చేరుకున్న ప్రధాని మోదీ
బీజింగ్ : షాంఘై సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకు చేరుకున్నారు. చైనాలోని క్వింగ్దాలో రెండు రోజులపాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) 18వ సమావేశంలో ఎస్సీఓ దేశాల ప్రతినిధులంతా పాల్గొననున్నారు. ఎస్సీఓ దేశాల(చైనా, భారత్, పాకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, కిర్జిస్తాన్, ఉజ్బెకిస్తాన్)కు సంబంధించిన వివిధ అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. పాక్ తీరుపై చర్చించనున్న భారత్ షాంఘై సదస్సులో భాగంగా ఉగ్రవాద దాడులను అరికట్టేందుకు ఎస్సీఓ దేశాలు అవలంబించాల్సిన విధానాల గురించి భారత్ పలు సూచనలు చేయనుంది. అంతేకాకుండా ఎస్సీఓ దేశాల మధ్య సరిహద్దు సమస్యలు సహా పలు అంశాల పరిష్కారంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. సదస్సులో భాగంగా జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్న మోదీ.. ముఖ్యంగా ఇస్లామాబాద్ కేంద్రంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న అంశాన్ని లేవనెత్తనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదొక మంచి అవకాశం... చైనాకు బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన మోదీ...గతేడాది ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందడం సంతోషంగా ఉందన్నారు. ఎస్సీఓ దేశాలతో ఉన్న స్నేహబంధాన్ని భారత్ ఆస్వాదిస్తోందని తెలిపారు. ఉగ్రవాదం, వేర్పాటువాదాలకు వ్యతిరేకంగా ఎస్సీఓ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు షాంఘై అజెండా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. క్వింగ్దా సదస్సులో జరిగే చర్చల అనంతరం ఎస్సీఓ దేశాలతో భారత్ బంధం మరింత బలోపేతం అవుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
షాంగై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పేరంబు
తమిళసినిమా: పేరంబు చిత్రం షాంగై అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, అంజలి జంటగా నటిం చిన ద్విభాషా (తమిళం, మలయాళం) చిత్రం పెరంబు. తరమణి చిత్రం తరువాత వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీఎల్.తేనప్పన్ నిర్మించారు. ఈ చిత్రం జనవరిలో జరిగిన 47వ రోటర్‌డమ్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది. ప్రపంచంలోని వివిధ భాషలకు చెందిన 187 చిత్రాల్లో ఎంపికైన 20 చిత్రాల్లో ప్రేక్షకుల విభాగంలో అవార్డుకు ఎంపికైన ఏకైక చిత్రం పేరంబు. అదేవిధంగా నెట్పాక్ అవార్డును గెలు చుకున్న పేరంబు చిత్రం జూన్ 16 నుంచి 25వ తేదీ వరకూ చైనాలోని షాంగై నగరంలో జరగనున్న 21వ షాంగై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శంపబడనుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ ప్రదర్శన తరువాత విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల వర్గం తెలిపారు. -
చైనాలో వ్యాన్ బీభత్సం
-
చైనాలో సంక్రాంతి సంబరాలు
షాంఘై : చైనాలోని షాంఘైలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు అసోసియేషన్ అఫ్ చైనా (టాక్) ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తెలుగువారంతా ఒకచోట చేరి సంబరాలు జరుపుకొన్నారు. షాంఘై లోని ఎంబసి క్లబ్ లో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు ఇండియన్ అసోసియేషన్ అఫ్ చైనా ప్రెసిడెంట్ రాజ్ కుమార్ ఖోసా ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నారులపై భోగిపళ్లు పోశారు. అనంతరం ఫ్యాన్సీడ్రెస్ పోటీలు, గాలి పటాల పోటీలు, కబడ్డీ పోటీలు నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలతో ఆద్యంతం సంక్రాంతి వేడుకలు ఉల్లాసంగా సాగాయి. తెలుగువారందరూ కలుసుకోవడమే పెద్ద పండుగ అని సాయిరాం క్రోవి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. పలువురు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు వారి సందేశాలను, శుభాకాంక్షలను వీడియో రూపం లో తెలియజేశారు. -
మొబైల్ చూస్తూ కాలు పోగొట్టుకుంది!
-
మొబైల్ చూస్తూ కాలు పోగొట్టుకుంది!
షాంఘై : స్మార్ట్ ఫోన్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. చేతిలో ఫోన్ ఉటే చాలు.. పక్కన ఏం జరుగుతోందన్న విషయాన్ని కూడా జనాలు గమనించడం లేదు. స్మార్ట్ మాయలో కొట్టుకుతున్న కుర్రకారు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనే చైనాలోని షాంఘైలో జరిగింది. స్మార్ట్ ఫోన్ మాయలో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోక.. చివరకు అత్యంత దారుణ స్థితిలో కాలును కోల్పోయింది. షాంఘైలోని ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న 28 ఏళ్ల యువతి ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్ దగ్గరకు వచ్చింది. అంతలోనే స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ.. అడుగులు ముందుకు వేసింది. మొబైల్ చూసుకుంటూనే... లిఫ్ట్‌లోపలకు అడుగులు వేసింది. అయితే అప్పటికే లిఫ్ట్ డోర్లు మూసుకుపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించని యువతి అలాగే లోపలకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె ఒక కాలు బయట ఉండగానే లిఫ్ట్ వేగంగా కదిలింది. లిఫ్ట్ వేగం అందుకోవడంతో.. ఆమె కాలు.. అక్కడే పచ్చడి అయిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవడంతో.. వెలుగులోకి వచ్చింది. -
చైనా చారిత్రక గుడిని కదిలిస్తున్నారు
సాక్షి, బీజింగ్: మరో అరుదైన ప్రయత్నానికి చైనా వేదిక కాబోతుంది. సాధారణంగా ఒక ఇంటిని మరో స్థానంలోకి క్రేన్ ల సాయంతో తీసుకెళ్లటం లాంటివి చూస్తూ ఉంటాం. కానీ, ఓ పురాతన ఆలయాన్ని కాస్త ముందుకు కదిలించేందుకు (రీ లోకేషన్) చైనా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. షాంగైలోని ప్రసిద్ధ యూఫో ఆలయాన్ని 30.66 మీటర్లు స్థాన చలనం చేసేందుకు సిద్ధం అయ్యారు. 1882 లో నిర్మితమైన ఈ బౌద్ధ ఆలయంను భద్రతా, విస్తరణ తదితర కారణాల వల్ల కదిలించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. 18 మీటర్ల ఎత్తైన ఈ ఆలయాన్ని ఉత్తరం వైపుగా గుడిని కదిలించటంతోపాటు ఎత్తు పరంగా 1.06 మీటర్లు పెంచటం లాంటి మరమ్మత్తు పనులు కూడా చేయబోతున్నారంట. ముందుగా హాల్ ను పునాది నుంచి వేరు చేసి ఓ వేదికపై తీసుకొస్తారు. ఆపై ట్రాక్ ల ద్వారా ముందుకు కదిలిస్తారు. హాల్ ఉన్న స్థానంలో మరో కట్టడం నిర్మించబోతున్నారంట. మూడు బౌధ్ద ప్రధాన విగ్రహాలకు కూడా స్థాన చలనం ఉండబోతుంది. తొలి ప్రయత్నంలో భాగంగా ఆదివారం 90 సెంటీమీటర్లు కదిలించామని, వారంలోగా పనులన్నీ పూర్తి చేస్తామని ఇంజనీర్ లు వెల్లడించారు. షాంగై పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా విరజిల్లుతున్న ఆ ఆలయాన్ని విస్తరించటం ద్వారా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుంటుందని టూరిజం శాఖ భావిస్తోంది. సాలీనా సుమారు 2 మిలియన్, పవిత్ర దినాల్లో లక్ష దాకా ప్రజలు సందర్శిస్తారని యూఫో ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. -
ఆంటీగ్యాంగ్ పట్టివేత..
షాంఘై: రుణ గ్రహీతల వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్న ఆంటీగ్యాంగ్ ఆట కట్టింది. అప్పులు తీసుకుని చెల్లించని వారి నుంచి వసూలుకు బండబూతులు తిట్టడం, వారి బట్టలూడదీయటం వంటి చర్యలకు పాల్పడుతున్న మహిళలను చైనా పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హునాన్ ప్రావిన్స్ షాంక్వి సిటీలో దాదాపు 30 మంది సభ్యులున్న ఈ ముఠాను ఆంటీగ్యాంగ్గా పిలుస్తుంటారు. పదేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్న వీరి వయస్సు కూడా 50 ఏళ్లకు అటూఇటూగానే ఉంటుంది. బడా నిర్మాణ సంస్థలకు ఈ ముఠా అప్పులు వసూలు చేసి పెడుతుంది. అప్పులు వసూలు చేసేందుకు వీరు పాల్పడుతున్న చర్యలు చాలా పాశవికంగా ఉంటాయి. చెప్పిన సమయానికి డబ్బు ఇవ్వని రుణ గ్రహీతల ఇళ్ల వద్దకు వెళ్లి మైక్‌లు అందుకుని తిట్ల పురాణం మొదలెడతారు. లేకుంటే మొహంపై ఉమ్మేస్తారు. పని అయిందా సరే..కాకుంటే..? అప్పు తీసుకున్న వ్యక్తి మహిళ అయితే వాళ్ల దుస్తులు చించేస్తారు. అదే పురుషుడు అయితే తమ దుస్తులే చించేసుకుని అరిచి కేకలు పెడతారు. ఆ దెబ్బతో ఎంత మొండి బకాయి అయినా వసూలు కావాల్సిందే. అయితే, వీరి వ్యవహారం మితిమీరింది. వీరిపై ఫిర్యాదులు అందుకున్న అధికారులు.. నాలుగేళ్ల పాటు దర్యాప్తు చేపట్టి అందరిని కటకటాల వెనక్కు నెట్టేశారు. నేరం రుజువు కావటంతో ఆంటీగ్యాంగ్‌లోని 14 మందికి 11 ఏళ్ల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయి. రోజుకు 30 డాలర్లతో పాటు భోజనం ఫీజుగా తీసుకునే ఈ ముఠాలోని మహిళలు ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదని పోలీసులు వివరించారు. ఈ ముఠాకు అధినేత్రి గవో యున్ అనే అంధురాలు కావటం గమనార్హం. -
జానెడంత స్థలంలో బోలెడంత పంట
వ్యవసాయంలో విపరీతమైన కష్టాలున్నాయి.. లాభాలు అంతంతమాత్రమే.. నిజమే. అయితే ఇది నేలను నమ్ముకుని చేసే వ్యవసాయం. ఇప్పుడు ట్రెండ్ మారిపోతోంది. నిటారు సాగు (వర్టికల్ ఫార్మింగ్)కు ఆదరణ పెరిగిపోతోంది. జానెడంత స్థలంలోనే బోలెడంత పంట పండించేందుకు ఇదే మేలని ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశం చైనా కూడా బలంగా నమ్ముతోంది. రుజువు కావాలా? పక్క ఫొటోల్లో ఉన్నది అదే. వంద హెక్టార్లు అంటే... సుమారుగా 250 ఎకరాల విస్తీర్ణం ఉన్న భవంతులు కొన్ని కట్టేసి వాటిల్లోని ప్రతి అంతస్తులోనూ వ్యవసాయం చేయాలని అనుకుంటోంది అక్కడి ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న షాంఘై నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి, సిటీ సెంటర్‌కు మధ్యలో ఈ ప్రాజెక్టు రాబోతోంది. ‘ద సున్ఖ్వివావ్ అర్బన్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్’ పేరుతో సిద్ధమవుతున్న ఈ నిటారు సాగు క్షేత్రం ద్వారా కనీసం 2.4 కోట్ల మందికి సరిపడా ఆహార ఉత్పత్తులు అందుతాయని అంచనా. మట్టి అవసరం లేని హైడ్రోపానిక్స్, చేపల వంటి జలచరాల సాయంతో మొక్కలకు కావాల్సిన నైట్రోజన్‌ను అందించే ఆక్వాపానిక్స్ వంటి అత్యాధునిక సాగు పద్ధతులన్నీ ఇందులో ఉంటాయి. ఒక భవనంలో సముద్రపు నాచును పెంచితే ఇంకో దాంట్లో పండ్లు, కాయగూరలు పండిస్తారు. పక్కనే ప్రవహించే నదిపై తేలియాడే గ్రీన్హౌస్లూ ఉంటాయి. వీటితోపాటు భవనాల గోడలను కూడా రకరకాల ఆకుకూరల సాగుకు వాడుకుంతారు. ససాకీ అనే అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు పెద్దస్థాయిలో ఆహారాన్ని అందించేందుకు మాత్రమే కాకుండా ఆధునిక సాగు పద్ధతులను ప్రజలకు నేర్పించేందుకూ ఉపయోగపడుతుందని అంచనా. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సైన్స్ మ్యూజియమ్, ఆక్వాపానిక్స్ టెక్నాలజీ ప్రదర్శన, అతిథులు కూడా సాగులో పాల్గొనేందుకు వీలు కల్పించే గ్రీన్హౌస్ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. షాంఘై నగర వాసులు ఆహార పదార్థాల కోసం గ్రామాలపై ఆధారపడటం తగ్గితే అంతమేరకు తమ ఎగుమతులను పెంచుకోవచ్చునని చైనా ప్రభుత్వం అంచనా. బాగానే ఉంది ఐడియా! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
టక టకా.. ఇటుకపై ఇటుక
ఇదంతా హైటెక్ కాలం. అన్ని పనులూ ఆటోమెటిక్‌గా, మన ప్రమేయం లేకుండా జరిగిపోవాలి. జరుగుతున్నాయి కూడా. అయితే ఇటుకపై ఇటుక పేర్చి... ఓ గోడకట్టాలంటే మాత్రం ఇప్పటికీ తాపీ మేస్త్రీ కావాల్సిందే. ‘మరేం పర్లేదు, ఈ పరిస్థితి ఇంకెన్నో రోజులు కాదులెండి’ అంటోంది ఆర్చీ యూనియన్ అనే చైనీస్ ఆర్కిటెక్చర్ సంస్థ. తాము ఇప్పటికే ఒకడుగు ముందుకేసి ఓ రోబోతో వంపులతో కూడిన అందమైన గోడను కట్టేశామని అంటోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆ రోబో నిర్మిత గోడే. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ రోబో ఇల్లు కట్టడం కోసం ఇలా ప్రత్యేకంగా తయారు కాలేదు. కార్ల ఫ్యాక్టరీలో వాడే యంత్రానికే డిజిటల్ మార్పులు చేసి దీనిని సిద్ధం చేశారు. కాకపోతే కారు విడిభాగాలను గుర్తించేందుకు ఉద్దేశించిన సాఫ్ట్‌వేర్‌ను మార్చి.. రకరకాల ఆకారాల్లో ఉండే ఇటుకలను గుర్తించేలా చేశారు. ఇంతకీ ఈ భవనం ఎక్కడిదో చెప్పలేదు కదూ.. షాంఘైలో ఉంది. దీని పేరు ‘చీ షీ’. ప్రదర్శనలు గట్రా నిర్వహించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. అసలేం జరిగిందంటే, చాలాకాలంగా ఉన్న భవనం స్థానంలో కొత్తది కట్టాలని ‘చీ షీ’ సొసైటీ నిర్ణయించింది. అయితే పాత ఇంటికి వాడిన ఇటుకలను వృథా చేయకూడదని... పాత జ్ఞాపకాలకు గుర్తుగా వాటిని కొత్త భవనంలో వాడాలని ఓ షరతు పెట్టింది. అందుకు ఓకే అంది ఆర్చి యూనియన్. ఐదేళ్లు కష్టపడి కార్ల రోబోను కాస్తా ఇటుకలు పేర్చే రోబోగా మార్చింది. ఒకసారి రోబోను నిర్దిష్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన తరువాత మిగిలినదంతా ఆటోమెటిక్‌గా జరిగిపోయింది. అప్పటికే అందించిన డిజిటల్ ప్లాన్ ఆధారంగా రెండు వారాల్లో గోడ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇదే పని తాపీ మేస్త్రీ చేయాలంటే అసలు సాధ్యం కాదని, ఎందుకంటే చిన్నసైజులో ఉండే ఇటుకలను ఈ ఆకృతిలో పేర్చడం అంత సులువుకాదని ఆర్చీ యూనియన్ అంటోంది. ఆ మధ్య ఇల్లు మొత్తాన్ని ఒక రోజులో కట్టేసిన రోబో గురించి మీరు ‘వావ్ఫ్యాక్టర్’లో చదివారు కదా... అందులో ఇటుకల ప్రస్తావన అస్సలు లేదు. గుర్తుకు తెచ్చుకోండి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
2017లో టేకాఫ్... 2016లో ల్యాండింగ్!!
యునైటెడ్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులు న్యూ ఇయర్ రోజు వినూత్న అనుభూతిని పొందారు. తాము ప్రయాణించిన విమానం 2017లో బయలుదేరి చేరుకోవాల్సిన ప్రదేశాన్ని 2016లో చేరింది. ఇక వారి అనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. న్యూ ఇయర్ రోజు అది చేద్దాం.. ఇప్పటి నుంచి ఇలా ఉందాం అని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఆ రోజు తమకు ఎదురైన మంచి అనుభూతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కొత్త ఏడాది బయలుదేరి పాత ఏడాదిలో అడుగుపెట్టడం విమాన ప్రయాణికులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ విమాన జర్నీకి సంబంధించి ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఆ వివరాల ప్రకారం.. యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం యూఏ890 (బోయింగ్ 787-909) విమానం 2017 జనవరి 1వ తేదీన వేకువజామున చైనాలోని షాంఘైలో బయలుదేరింది. ఆ బోయింగ్ విమానం 2016 డిసెంబర్ 31న రాత్రి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకుంది. ఇది ఎలా సాధ్యమంటే.. ఈ రెండు ప్రాంతాల మధ్య టైమ్ వ్యత్యాసం దాదాపు 16 గంటలు. శాంఘై నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లడానికి దాదాపు 11 గంటల 5 నిమిషాలు పడుతుంది. టైమ్ వ్యత్యాసం గమనించినట్లయితే ఇది సాధ్యపడుతుందని చెప్పవచ్చు. ఎలా అంటే ఉదాహరణకు షాంఘైలో 2017 జనవరి 1న టైమ్ మధ్యాహ్నం 12 గంటలు అనుకుంటే.. సరిగ్గా అదే సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలో టైమ్ 2016 డిసెంబర్ 31 రాత్రి 8 గంటలు ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారి విపరీతంగా షేర్ అవుతోంది. ఏ సమయానికి షాంఘై నుంచి బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుందన్న వివరాలు ఆ పోస్ట్ లో పేర్కొనలేదు. -
ఎంతపని చేశావు పెళ్లికొడుకా!
షాంఘై: కాబోయే భార్యను ఇంప్రెస్ చేద్దామని ఓ పెళ్లికొడుకు చేసిన ప్రయత్నం సామాన్యుల పాలిట శాపంగా మారింది. పోలీసులు తిట్లు తినే, అధికారుల ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి దాపురించింది. చైనీస్ మహానగరం షాంఘైలోని నాన్ యువాన్ రోడ్డు మామూలుగానే రద్దీగా ఉంటుంది. ఆ రోడ్డు పక్క సందులోని ఓ ఇంట్లో ఓ యువతి నివసిస్తోంది. బాగా డబ్బులున్న యువకిణ్ని ఆమె ప్రేమించింది. పెద్దల అంగీకారంతో జులై 24న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబోయే పెళ్లానికి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న పెళ్లికొడుకు ఆమెను వివాహ వేదిక దగ్గరికి తీసుకుపోయేందుకు కారులో కాకుండా హెలికాప్టర్ లో వచ్చాడు. అప్పుడు మొదలయ్యాయి జనం కష్టాలు! సరాసరి రోడ్డు మధ్యలో హెలికాప్టర్ ను ల్యాండ్ చేసి, దాదాపు గంట సేపు(పెళ్లి కూతురు రెడీ అయ్యేంతవరకు) అక్కడే నిలిపారు. ఐదు, దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడే నిలిచిపోయిన వందలాది వాహనదారులు ఏం జరుగుతుందో అర్థంకాక ఇబ్బంది పడ్డారు. తీరా విషయం తెలిశాక పోలీసులను తిట్టిపోసి, సంబంధిత అధికారులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో అనుమతి ఉన్నప్పటికీ, రద్దీగా ఉండే రోడ్లపై హెలికాప్టర్లు ల్యాండ్ చేయడం నేరమని ఏవియేషన్ అధికారులు అంటున్నారు. -
బట్టల్లేకుండా టాటూ ప్రదర్శనలు చేస్తూ..
షాంఘై: సాధారణంగా పచ్చబొట్టంటే(టాటూ) ఈతరం యువతకు మహా సరదా. పూర్వపు రోజుల్లో పచ్చబొట్లయితే జీవితాంతం ఉండేది కానీ.. ఇప్పుడు టాటూలు మాత్రం తాత్కలికమే. గతంలో అయితే.. ఏ నుదుటిపైనో ఒక చిన్నచుక్కలాగ.. అరచేతిలో చందమామలాగ.. లేదంటే చేతిపై తమకు ఇష్టం వచ్చిన వారిపేరునో వేసుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. టాటూ అంటే తమ శరీరంలోని ఏ భాగంపైనైనా వేయించుకునేవారున్నారు. ఎలాంటి బొమ్మలనైనా టాటూగా వేసుకునేవారున్నారు. అసలు టాటూ అంటే పడిచచ్చేవాళ్లు ఎందరో.. మరి అలాంటి వారంతా ఒకే చోట చేరి తమ దుస్తులన్నీ విప్పేసి టాటూ ప్రదర్శన నిర్వహిస్తే.. అవును చైనాలో ఇది జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా టాటూలను బాగా ఇష్టపడే వారందరు ఐదురోజులపాటు షాంఘైలోని ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ కార్యక్రమానికి హాజరై టాటూల ప్రదర్శన చేశారు. ఒక్క నూలుపోగు కూడా లేకుండా ఒంటినిండా టాటూలు వేయించుకొని రాంప్ వాక్‌లు చేశారు. చిన్న పిల్లలు కూడా టాటూ ప్రదర్శనలకు హాజరయ్యారు. మహిళలు కూడా తమ దేహమంతా కూడా టాటూలు వేయించుకొని అర్ధనగ్నం ప్రదర్శనలతో ర్యాంప్ వాక్ లు చేస్తూ హడావుడి చేశారు. అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే ఈ షోలకు జనాలు కుప్పలుగా హాజరై ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. -
రెండు విమానాలు ఢీకొంటే అంతే మరి!
చైనా: సాధారణంగా మనం కారు రివర్స్‌లో పెడుతున్నా.. లేదా బ్రేక్ ఆగక ముందు వెళ్లే వాహనానికి మెల్లగా తాటించిన గబాళ్లు మని శబ్దం రావడంతోపాటు రెండు వాహనాలకు భారీ సొట్టలు పడతాయి.. అలాంటిది రెండు విమానాలు ఒక దానికి మరొకటి తాగిలితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదే ఘటన షాంఘైలోని హంకియో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ రెండు విమానాలు కూడా చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్యాసింజర్ విమానాలే. ఒక విమానం తన ప్రయాణం ముగించుకుని సురక్షితంగా దిగి టర్మినల్ వద్దకు వస్తుండగా మరో విమానం ప్రయాణీకులను ఎక్కించుకుని బయలుదేరేందుకు రన్ వే వైపు కదిలేందుకు సిద్ధమై కదిలింది. ఇంతలో పెద్ద శబ్ధం.. చూస్తూండగానే వాటి రెక్కలు ఒకదానికి మరొకటి తగిలి అందులో ఓ విమానం రెక్క అమాంతం సగానికి పైగా చీలిపోయింది. ఏంజరుగుతుందా అని రెండు విమానాల్లో ప్రయాణీకులు అదిరిపడ్డారు. వెంటనే వాటిని పైలెట్లు ఆపేశారు. రెండు విమానాల్లోని ప్రయాణీకులను దించివేసి ఎయిర్ పోర్టుకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. కొంత ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన ఎలా జరిగిందో విచారించేందుకు అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. -
చైనా యాంకర్లలో గుబులు
షాంఘై: చైనాలో టీవీ న్యూస్ యాంకర్లకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎందుకంటే ఓ రోబో హుషారుగా వార్తలు చదువుతూ వారి ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. షాంఘై డ్రాగన్ టీవీ యాజమాన్యం తమ కార్యక్రమాల ప్రసారానికి మామూలు యాంకర్లకు బదులుగా రోబో యాంకర్లను వినియోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 'సియావోఐస్' అనే రోబోతో వార్తలు చదివిస్తోంది. వాతావరణ విశేషాలతో ప్రసారమయ్యే బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో మంగళవారం నుంచి 'సియావోఐస్' తడుముకోకుండా వార్తలు చదువుతుండటంతో వీక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానీ, నిజానికి ఈ విషయంలో చైనా కంటే జపాన్ రెండడుగులు ముందే ఉంది. ఇంతకుముందే జపాన్ రోబో న్యూస్ రీడర్లను ప్రవేశపెట్టి, వాటితో పనిచేయించింది కూడా. ఈ చైనా రోబోకు మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీని అందించింది. భాషతో పాటు సహజమైన భావోద్వేగాలను సైతం ఈ రోబో చక్కగా పలికిస్తోందట. దాని మధురమైన గొంతు సైతం వీక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. వార్తలు చదవటంలో రోబో విజయవంతంగా రంగప్రవేశం చేయటంతో అక్కడి ఉద్యోగులకు గుబులు మొదలైంది. అయితే సాధారణ యాంకర్ల స్థానాన్ని పూర్తిగా రోబోలతో భర్తీ చేయబోమని షాంఘై మీడియా గ్రూప్ చెబుతుండటంతో వారు కొంత ఊరట చెందుతున్నారు. -
వీర్యదానంతో ఫ్రీగా ఐఫోన్!
షాంఘై: యాపిల్ తాజా ఐఫోన్ ను దక్కించుకునేందకు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రియులు పోటీ పడుతున్నారు. చైనాలో ఈ పిచ్చి పీక్ స్టేజీకి చేరింది. ఐఫోన్ 6ఎస్ కోసం ఇద్దరు చైనీయులు ఏకంగా తమ కిడ్నీలను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. బేరం బెడిసి కొట్టడంతో వారు వెనక్కు తగ్గారు. షాంఘైలోని రెండు స్పెర్మ్ బ్యాంకులు మరో అడుగు ముందుకు వేసి యువతకు గాలం వేశాయి. 'వీర్యం దానం చేయండి.. ఐఫోన్ పట్టుకెళ్లండి' అంటూ 'యాపిల్' ప్రియులను ఊరిస్తున్నాయి. ఇందుకోసం ఒక ప్రకటన కూడా ఇచ్చాయి. 'ఐఫోన్ 6 ఎస్ దక్కించుకునేందుకు కిడ్నీలు అమ్మాల్సిన పనిలేదు. జస్ట్ వీర్యం దానం చేస్తే చాలు ఐఫోన్ మీ సొంతమవుతుంద'ని ఎడ్వర్టైజ్ మెంట్ ఇచ్చాయి. అయితే వీర్యం దానం చేయడానికి కొన్ని అర్హతలు నిర్దేశించింది. చైనా గుర్తింపు కార్డు, కాలేజీ డిగ్రీతో పాటు తప్పనిసరిగా 165 సెంటీమీటర్ల ఎత్తు కలిగివుండాలి. ఎటువంటి జన్యుపరమైన వ్యాధులు ఉండరాదు. 17 మిల్లీలీటర్ల వీర్యం దానం చేస్తే సుమారు రూ. 60 వేలు ఇస్తామని స్పెర్మ్ బ్యాంకులు ప్రకటించాయి. ఒక్కరు ఎన్నిసార్లైనా దానం చేయొచ్చు. అయితే ఒకసారి దానం చేసిన తర్వాత 48 రోజుల గ్యాప్ తీసుకోవాలని నిబంధన పెట్టింది. వీర్యం దానం చేసేందుకు ఎంతమంది ముందుకు వచ్చారనేది త్వరలోనే తెలుస్తుంది. -
కొనసాగుతున్న కేసీఆర్ చైనా పర్యటన
షాంఘై: చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన 8వ రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం సీఎం కేసీఆర్ బృందం షెంజెన్ నగరానికి చేరుకుంది. అక్కడ ఇండస్ట్రియల్ హైటెక్ పార్కును కేసీఆర్ సందర్శిస్తారు. అనంతరం సాయంత్రానికి చైనా నుంచి హాంకాంగ్ చేరుకోనున్నారు. -
షాంఘై చేరుకున్న కేసీఆర్ బృందం
-
షాంఘై చేరుకున్న కేసీఆర్ బృందం
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చైనా పర్యటన మూడోరోజు కొనసాగుతోంది. గురువారం కేసీఆర్ బృందం డెలియన్ నుంచి షాంఘై చేరుకుంది. ఈ సందర్భంగా షాంఘైలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కేసీఆర్ బృందం సందర్శించనుంది. అలాగే ఇవాళ సాయంత్రం పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడుల పెట్టాల్సింది కేసీఆర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ విందు ఇవ్వనున్నారు. కాగా తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా కేసీఆర్ చైనా పర్యటన జరుగుతోంది. -
గాలిలో విమానం... ఊపిరి బిగపట్టిన ప్రయాణికులు
సింగపూర్: గగనతలంలో ప్రయాణిస్తున్న విమానంలోని రెండు ఇంజిన్లలో విద్యుత్ సరఫరా ఆకస్మాత్తుగా ఆగిపోతే.. పరిస్థితి ఎలా ఉంటుంది. పైలట్లు కంగారు పడతారు. ప్రయాణికులు ముచ్చెమట్లు పడతాయి. అసలే గాల్లో ఉన్న ప్రాణాలు అటునుంచి అటే ఎగిరిపోతాయి. సరిగ్గా అలాంటి పరిస్థితే గత శనివారం సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న 194 మందికి ఎదురైంది. ఇక వివరాల్లోకి వెళ్లితే 182 మంది ప్రయాణికులు ... 12 మంది సిబ్బంది మొత్తం 194 మందితో ఎస్క్యూ 836 సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం సింగపూర్ నుంచి చైనాలోని షాంఘై బయలుదేరింది. విమానం బయలుదేరిన దాదాపు 3.5 గంటల అనంతరం 39 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంలోని రెండు ఇంజన్లల్లో తత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ విషయం తెలిసిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంతలో పైలట్లు వెంటనే అప్రమత్తమై... విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో వారు సఫలీకృతులయ్యారు. దీంతో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 10.56 గంటలకు షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఆ తర్వాత విమాన ఇంజన్లను ఎయిర్ పోర్ట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి లోపం లేదని ఉన్నతాధికారులు నిర్థారించారు. ఈ ఘటనపై సింగపూర్ ఎయిర్ లైన్స్ సమీక్ష సమావేశం నిర్వహించింది. -
చైనాలో ఐసీఐసీఐ బ్యాంకు తొలి శాఖ ఆరంభం
షాంఘై: ఇరు దేశాలలోని వ్యాపారవేత్తలకు ఉపయుక్తంగా ఉండటం కోసం ప్రైవేట్ బ్యాంకుల అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంకు చైనాలోని షాంఘైలో తన తొలి శాఖను శనివారం ఏర్పాటుచేసింది. ఆ శాఖను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ శాఖ కార్పొరేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్, ట్రెజరీ వంటి పలు సేవలను అందించనుంది. బ్యాంకు నూతన శాఖ ప్రారంభోత్సవంలో మోదీతో పాటు ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఇరు దేశాల సీనియర్ అధికారులు, వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య వాణిజ్య వృద్ధిలో, పెట్టుబడుల పెరుగుదలలో తమ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుం దని చందా కొచ్చర్ అన్నారు. తమ బ్యాంకు చైనాలో భార త్‌కు చెందిన జాయింట్ వెంచర్ల అభివృద్ధికి సాయపడుతుందని చెప్పారు. అలాగే భారత్‌లో మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టే చైనా కంపెనీలకు తోడ్పాటునందిస్తుందని తెలిపారు. -
ఉమ్మడిగా కొత్త శిఖరాలు
భారత్, చైనాలు పేదరికాన్ని రూపుమాపితే ప్రపంచానికి మేలు: మోదీ షాంఘైలో గాంధేయ, భారతీయ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని ఉగ్రవాదం, భూతాపం సవాళ్లకు గాంధీ బోధనల్లో పరిష్కారాలు ఉన్నాయి ఏడాదిగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నా ఏటా ఐదుగురు చైనీయులు భారత్‌లో పర్యటించేలా భారతీయులు చూడాలి షాంఘైలో భారతీయులతో సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు చైనాలో ముగిసిన మోదీ పర్యటన.. మంగోలియాలో పర్యటన షురూ షాంఘై: చైనా, భారత్‌లు పేదరికాన్ని తొలగించేందుకు ఉమ్మడిగా కొత్త అభివృద్ధి శిఖరాలను అందుకోవాలని.. ప్రపంచంలోని మూడో వంతు జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉన్నందున.. ఇది ప్రపంచానికి ప్రయోజనం కలిగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. షాంఘైలోని ఫుదాన్ విశ్వవిద్యాలయంలో గాంధేయ, భారతీయ అధ్యయన కేంద్రాన్ని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆయన హిందీలో ప్రసంగించారు. భారత్, చైనాలకు చారిత్రక, నాగరిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు.. ఉగ్రవాదం, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) సమస్యలకు పరిష్కారాలు మహాత్మా గాంధీ బోధనల్లో ఉన్నాయన్నారు. భారత్, చైనాలు ఉమ్మడిగా బుద్ధుని సిద్ధాంతాన్ని, మహాత్మా గాంధీ పరిశోధనలను మేళవించి కొత్త అభివృద్ధి శిఖరాలకు చేరటం ద్వారా.. మానవజాతి సంక్షేమానికి కట్టుబడి ఉండే ఒక వ్యవస్థను ప్రపంచానికి అందించవచ్చని పేర్కొన్నారు. అన్ని వైపుల నుంచి జ్ఞానం రావాలన్నది భారతదేశపు ప్రాథమిక సిద్ధాంతమని మోదీ చెప్పారు. ‘‘జ్ఞానానికి తూర్పు, పడమర లేవు. అది ప్రపంచవ్యాప్తం. ఎటువంటి జ్ఞానమైనా మానవజాతికి ప్రయోజనం కలిగిస్తుంది. ఫలితాల గురించి ఆలోచించకుండా పనిచేస్తూ ఉండాలని భగవద్గీత చెప్తుంది’’ అని ఆయన ఉటంకించారు. చైనా యాత్రికుడు హ్యూయన్సాంగ్ భారత పర్యటనను ప్రస్తావిస్తూ.. రెండు దేశాల చరిత్రను చూస్తే భారత్, చైనాలు రెండూ జ్ఞానం సముపార్జించాలన్న తపన ఉన్న దేశాలేనన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రాతిపదికన సంబంధాలు ప్రస్తుత పరిస్థితులకు ప్రయోజనం కలిగిస్తే.. జ్ఞానం ప్రాతిపదికన సంబంధాలు యుగాల తరబడి ప్రయోజనాన్ని ఇస్తాయని చెప్పారు. అలుపెరుగకుండా పనిచేస్తున్నందుకే విమర్శలు: అలుపెరుగకుండా కృషి చేస్తున్నందుకే తనపై విమర్శలు చేస్తున్నారని.. అలా పనిచేయటం నేరమైతే దానిని తాను కొనసాగిస్తానని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. తాను తరచుగా విదేశీ పర్యటనలు చేయటంపై ప్రతిపక్షాల విమర్శల పట్ల ఆయన పై విధంగా స్పందించారు. శనివారం షాంఘైలో భారతీయుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘‘మోదీ ఎన్నో దేశాలకు ఎందుకు ప్రయాణిస్తున్నారని జనం అడుగుతున్నారు... మనం తక్కువ పని చేస్తే విమర్శలు సాధారణం.. మనం నిద్రపోతుంటే విమర్శలు సాధారణం.. కానీ.. నా దురదృష్టమేమిటంటే, నేను ఎక్కువ పని చేస్తున్నందుకు విమర్శిస్తున్నారు’’ అని అన్నారు. ‘‘సరిగ్గా నిరుడు ఇదే రోజున (మే 16వ తేదీన) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ రోజు నేను మూడు హామీలు ఇచ్చాను. అలుపెరుగకుండా పనిచేస్తానని, అనుభవం లేనందున నేర్చుకుంటానని, దురుద్దేశంతో ఏ పొరపాటూ చేయనని చెప్పాను. ఆ మూడు హామీలనూ నేను నెరవేర్చాను. గత ఏడాదిగా నేను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. పగలూ, రాత్రీ పనిచేశాను. నేను ఏదైనా సెలవుపై వెళ్లానా?’’ అని వ్యాఖ్యానిస్తూ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల 56 రోజుల పాటు‘సెలవు’పై వెళ్లటాన్ని పరోక్షం గా ఎద్దేవా చేశారు. గత 30 ఏళ్లలో జరిగిన పనినంతటినీ తన తొలి ఏడాదిలోనే చేయటం ప్రారంభింనం దున ప్రపంచం తనను ఎక్కువగా నమ్ముతోందని పేర్కొన్నారు. చైనాలో తన మూడు రోజుల పర్యటన రానున్న కాలంలో ప్రయోజనాలు కల్పించేందుకు పునాదులు వేసిందన్నారు. చైనా అధ్యక్షుడు బీజింగ్ వెలుపల ఎవరైనా విదేశీ నేతను ఆహ్వానించటం ఇదే తొలిసారి అని మోదీ పేర్కొన్నారు. ఇది 125 కోట్ల మంది భారతీయులకు లభించిన ఆహ్వానమని అభివర్ణించారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో తన స్నేహం ‘ప్లస్ వన్’ అని అభివర్ణించారు. ఆయనతో తనకు సన్నిహిత స్నేహం ఉందన్నారు. చైనా, భారత్‌లు భుజం భుజం కలిపి నడవాలన్నారు. చైనా ప్రజలకు భారత్ పట్ల ఆసక్తి ఉందంటూ.. చైనాలో నివసిస్తున్న భారతీయులు ప్రతియేటా ఐదుగురు చైనీయులు భారత్‌ను సందర్శించేలా ఒప్పించాలని సూచించారు. ఇది భారత్‌ను చైనా అర్థం చేసుకునేందుకు.. భారత్‌లో పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని చెప్పారు. షాంఘైలో మోదీకి శాకాహార విందు షాంఘైలో పాలక కమ్యూనిస్టు పార్టీ చీఫ్ హాన్ ఝెంగ్ శనివారం ప్రధాని మోదీకి మధ్యాహ్న విందు ఇచ్చారు. ఈ విందులో షాంఘైలో ప్రత్యేకమైన శాకాహార వంటకాలు, అన్నం వడ్డించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాస్‌స్వరూప్ ట్విటర్ ద్వారా తెలిపారు. మంగోలియా చేరుకున్న మోదీ ప్రధాని మోదీ చైనాలో మూడు రోజుల పర్యటన శనివారం ముగిసింది. ఆయన షాంఘై నుంచి నేరుగా మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్ చేరుకున్నారు. ఈ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఈ దేశంలో రెండు రోజులు మోదీ పర్యటించనున్నారు. -
షాంఘై తరహాలో ఏపీ నూతన రాజధాని
హైదరాబాద్: చైనాలోని షాంఘై తరహాలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరాన్ని నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 1991 నాటి నుంచి చైనా 68 రెట్లు పెరిగిందని తెలిపారు. ప్రపంచంలో ప్రముఖ నౌకాశ్రయాల్లో నాలుగు చైనాలోనే ఉన్నాయని... అలాగే ప్రపంచంలో 60 శాతం సెల్ ఫోన్లు చైనాలోనే తయారువుతున్నాయని చంద్రబాబు చెప్పారు. భారత్‌తో సంబంధాలకు చైనా ఉత్సాహాం చూపిస్తుందని అన్నారు. షాంఘైలో రైల్వే స్టేషన్ ఎయిర్‌పోర్ట్‌ల తరహాలో ఉన్నాయన్నారు. ఏపీ రాజధాని ప్రాంతానికి ప్రపంచస్థాయి పరిశ్రమలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి పరిశ్రమలు రావాలని చంద్రబాబు ఆకాక్షించారు. గంటకు 450 కి.మీ వేగంతో నడిచే రైల్వే ట్రాక్ చైనా ఉందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైల్వే ట్రాక్‌ను చైనీయులు 10 ఏళ్లలో నిర్మించారని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే నెలలో ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
నూతన సంవత్సర వేడుకల్లో విషాదం
-
కూపన్స్ కోసం ఎగబడి ప్రాణాలు కోల్పోయారు!
చైనా: నూతన సంవత్సరం వేడుకలు చైనాలో విషాదం నింపడానికి ప్రధాన కారణం డాలర్ బిల్లు కూపన్సేనట. డాలర్ బిల్లు కోసం ఎగబడటంతోనే ఈ దారుణం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. షాంఘై పట్టణంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా లక్షల్లో జనాలు ఓ రివర్ ఫ్రంట్ బండ్ మైదానం వద్ద గుమికూడిన సందర్భంగా అక్కడ ఉన్న బిల్డింగ్ మూడో అంతస్థు నుంచి యూఎస్ డాలర్లతో సమానమైన కూపన్స్ ను విసరడంతోనే తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. గతరాత్రి 11.35 గంటలకు ఈ దుర్ఘటనలో 35 మంది మృతి చెందగా, అధిక సంఖ్యలో గాయపడ్డారు. న్యూఇయర్ వేడుకలకు షాంఘై పట్టణంలోని రివర్ ఫ్రంట్ బండ్ కు అత్యధిక ప్రాముఖ్యత ఉంది. కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా చేసుకునే క్రమంలో మూడు లక్షలకు మందికి పైగా ప్రజలు ఇక్కడకు హాజరు కావడం.. ఆపై తొక్కిసలాట జరగడం చైనాలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
నూతన సంవత్సర వేడుకల్లో విషాదం
బీజింగ్ : చైనాలో నూతన సంవత్సర వేడుకలు విషాదాన్ని నింపాయి. షాంఘై పట్టణంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 35మంది మృతి చెందగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా లక్షల్లో జనాలు ఓ మైదానం వద్ద గుమికూడిన సందర్భంగా గతరాత్రి 11.35 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఊహించని రీతిలో ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలకు హాజరు అయినట్లు తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కన్యత్వానికి రూ.3.5 లక్షల ఖరీదు
బూటకపు వాగ్దానాలతో తన కన్యత్వాన్ని దోచుకున్న ప్రియుడిపై ఓ చైనా మహిళ దావా వేసింది. తన కన్యత్వ హక్కుకు భంగం కలిగించాడంటూ కోర్టుకు ఎక్కింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆమెకు 5 వేల డాలర్ల(సుమారు రూ.3.5 లక్షలు) పరిహారం ఇప్పించిందని షాంఘై మీడియా పేర్కొంది. లీ అనే వ్యక్తి తన వివాహ విషయాన్ని దాచిపెట్టి షిన్ అనే మహిళతో డేటింగ్ చేశాడు. షిన్ ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వస్వాన్ని దోచుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడు. దీంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. తనను మానసికంగా, ఆరోగ్యపరంగా కుంగదీసినందుకు లీ నుంచి 81 వేల డాలర్లు పరిహారం ఇప్పించాలని షిన్ దావా వేసింది. మగువ మానాన్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందంటూ కోర్టు ఆమెకు 5 వేల డాలర్ల పరిహారం ఇప్పించింది. ఆమె డిమాండ్ చేసిన మొత్తం చాలా ఎక్కువని న్యాయస్థానం అభిప్రాయపడింది. శీలాపహరణ స్త్రీ ఆరోగ్యాన్ని, స్వేచ్ఛను, ప్రతిష్టను దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది. -
బ్రిక్స్ బ్యాంక్‌కు ఆరేళ్లు భారత్ సారథ్యం
ఫోర్టలేజా (బ్రెజిల్): బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకుకు మొదటి ఆరు సంవత్సరాలు భారత్ అధ్యక్షత వహించనుంది. రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం కానున్న ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం షాంఘై (చైనా)లో ఉంటుంది. భారత్ తర్వాత బ్రెజిల్, రష్యాలు ఐదేళ్ల చొప్పున సారథ్యం వహిస్తాయని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. పాశ్చాత్య దేశాలు పెత్తనం చెలాయిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు బ్యాంకును నెలకొల్పాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాల సదస్సు మంగళవారం నిర్ణయించిన సంగతి విదితమే. బ్యాంకుతో పాటు 10 వేల కోట్ల డాలర్లతో ఏర్పాటు చేయనున్న కరెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ)తో బ్రిక్స్ దేశాలు స్వల్పకాలిక లిక్విడిటీ ఒత్తిడులను తట్టుకోగలుగుతాయి. ఇండియా మినహా బ్రిక్స్ సభ్య దేశాల పార్లమెంట్లు సీఆర్ఏకు ఆమోదముద్ర వేయడానికి ఆరు నెలలు గడువుందని అధికార వర్గాలు తెలిపాయి. సీఆర్ఏకు అవసరమైన నిధుల్లో భాగంగా చైనా అత్యధికంగా 4,100 కోట్ల డాలర్లు, ఇండియా, రష్యా, బ్రెజిల్‌లు 1,800 కోట్ల డాలర్ల చొప్పున, దక్షిణ ఆఫ్రికా 500 కోట్ల డాలర్లు అందించనున్నాయి. రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చర్చించిన డెవలప్మెంట్ బ్యాంక్ ఇపుడు వాస్తవరూపం దాల్చిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలతో పాటు ఇతర వర్థమాన దేశాలకు సైతం ఈ బ్యాంకు సహకరిస్తుందని తెలిపారు. పారిశ్రామిక రంగం హర్షం...: బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటుతో సభ్యదేశాల మధ్య ఆర్థిక సహకారం వృద్ధిచెందుతుందని భారతీయ పారిశ్రామికరంగం హర్షం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలను అధిగమించడానికి, మౌలిక సౌకర్యాల వృద్ధికి బ్యాంకు దోహదపడుతుందని పేర్కొంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చరిత్రాత్మకమని ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ్ బిర్లా అభివర్ణించారు. బ్యాంకు ఏర్పాటు ఇండియా సాధించిన విజయమని అన్నారు. వర్థమాన ఆర్థిక వ్యవస్థల పురోగతికి భారీగా నిధులు అవసరమనీ, 10 వేల కోట్ల డాలర్ల కంటే మరిన్ని రెట్ల నిధుల సమీకరణ మార్గాలను బ్యాంకు అన్వేషించాలని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది సదస్సు రష్యాలో.. వచ్చే సంవత్సరం బ్రిక్స్ ఏడో సదస్సును రష్యాలోని ఊఫా నగరంలో నిర్వహించనున్నారు. సదస్సు నిర్వహణకు ముందుకొచ్చిన రష్యాను భారత్, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికాలు అభినందించాయి. -
పెళ్లిళ్ల మార్కెట్..
శని, ఆదివారాల్లో ఊర్లలో సంతలు పెట్టడం అలవాటే.. అయితే.. ఇదే రోజుల్లో చైనాలోని షాంగైలోని పీపుల్స్ పార్క్ వద్దకు వెళితే.. అక్కడ మనకు పెళ్లిళ్ల సంత కనిపిస్తుంది! ఇలా వేలాది సంఖ్యలో కాగితాలు వేలాడదీసి కనిపిస్తాయి. పెళ్లి కావాల్సిన అమ్మాయి లేదా అబ్బాయి బయోడేటాలు ఈ కాగితాల్లోనే ఉంటాయి. వారి వయసు, ఎత్తు, రాశి, ఆదాయం, ఫోన్ నంబర్, తమకు కారు లేదా అపార్ట్మెంట్ ఉందా? వంటి వివరాలన్నీ ఇందులో రాసి ఉంటాయి. అమ్మాయిలు లేదా అబ్బాయిల తాలూకు తల్లిదండ్రులు, బంధువులు ఈ మ్యారేజీ మార్కెట్‌కు వచ్చి.. కాగితాల్లో వివరాలు చూసుకుంటూ పోతారు. తగిన వారు లభిస్తే.. అందులో ఉన్న ఫోన్ నంబర్‌ను సంప్రదిస్తారు. తర్వాత షరా మామూలే.. ఇరు కుటుంబాల వారు కలవడం.. మాట్లాడుకోవడం.. పీపీపీ.. డుండుండుం అంటూ పెళ్లి బాజాలు మోగడం వంటివి చకచకా జరిగిపోతాయి. -
హస్తినకు వరద గండం..
న్యూఢిల్లీ: యమునానదిలో వరద మైదానాలు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఢిల్లీ నగరానికి భారీ వరద గండం పొంచి ఉందని పలువురు పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇటీవల యూఎన్ ప్యానెల్ నివేదికలో సైతం ప్రపంచంలోనే అధిక వరద ముప్పు ఉన్న మూడు నగరాల్లో ఢిల్లీ కూడా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. టోక్యో, షాంఘైలకు కూడా ఇటువంటి ప్రమాదమే పొంచి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. గత సోమవారం విడుదలైన ‘వాతావరణ మార్పుల నివేదిక-2014, ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు’లో పర్యావరణ నిపుణులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరద ముప్పు నుంచి తప్పించుకోవాలంటే డ్యాంలు, కాలువలు ఏర్పాటుచేసే బదులు వరద మైదానాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 2070 కల్లా ఆసియా ఖండంలోని ఢాకా, గౌంగ్ఝూ, హో ఛి మిన్హ్ సిటీ, షాంఘై, బ్యాంకాక్, రంగూన్, హాయ్‌పాంగ్ నగరాలతో పాటు ముంబై, కోల్‌కతాలకు సైతం తీర ప్రాంత వరద ముంపు ప్రమాదం పొంచి ఉందని అందులో పేర్కొన్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఢిల్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని నివేదికలో వెల్లడించారు. యూఎన్ ఐపీసీసీ నివేదికలో ఢిల్లీ పర్యావరణ సమస్యలపై ప్రస్తావించడం ఇదే మొదటిసారి. నగరంలో వరదలు వచ్చే అవకాశంపైనే ప్రధానంగా ఈ నివేదికలో చర్చించారు. నగరంలో యము నా వరద మైదానాల అక్రమ వినియోగం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ నగరంలోకి ప్రవేశించేం దుకు ముందే యమునానది నీటిని వ్యవసాయం, తాగునీటి అవసరాల నిమిత్తం మళ్లిస్తున్నారు. ‘ మా అంచనాల ప్రకారం.. పల్లా నుంచి జైత్పూర్ వరకు ఉన్న వరద మైదానాల్లో 30 శాతం ఇప్పటికే వేరే అవసరాలకు కేటాయించేశారు. ఇక్కడ నిర్మించిన అక్షరధామం, బాట్లా హౌస్, మెట్రో స్టేషన్లు, ఇతర శాశ్వత నిర్మాణాలను ఇక్కడి నుంచి తరలించడం సాధ్యం కాదు. ఒక్క టీడీసీ మిల్లేనియం బస్‌డిపో నిర్మాణ ప్రతిపాదనను మాత్రం ఆపేయవచ్చు. వజీరాబాద్ నుంచి ఓఖ్లా వరకు గల పలు వరద మైదానాల్లో చాలావరకు ఇప్పటికే ఆక్రమణకు గురయినట్లు మా సర్వేలో తేలింది..’ అని యమునా జియే అభియాన్‌కు చెంది న మనోజ్ మిశ్రా వివరించారు. ఇదిలా ఉండగా నగరంలో వాతావరణ మార్పులపై కూడా ఐపీసీసీ దృష్టి పెట్టింది. నగరంలో 1970 నుంచి ఇప్పటివరకు పాలెం వాతావరణ కేంద్రంలో ప్రతి యేటా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలపై ఢిల్లీ ఐఐటీ సర్వే చేసింది. సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చి చూసింది. ‘1968లో సఫ్దర్ జంగ్‌తో పోలిస్తే పాలెం ఎడారిలా ఉండేది. ఈ రెండింటి మధ్య ప్రతి ఏడాది వాతావరణంలో వస్తున్న మార్పులను గమనించి నగరీకరణ వల్ల ఉష్ణోగ్రతల్లో ఎలా మార్పులు సంభవిస్తాయో క్రోడీకరించాం. 1980 వరకు ఈ రెండు ప్రాంతాల సరాసరి కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు లేవు. అయితే 2000 సంవత్సరం వచ్చేసరికి పాలెంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం మొదలయ్యాయి. నగరీకరణ వల్లే ఈ మార్పు సంభవించిందని మా అధ్యయనంలో తేలింది..’ అని ఐపీసీసీ రిపోర్ట్ తయారుచేసిన వారిలో ఒకరైన ఐఐటీ ప్రొఫెసర్ మంజు మోహన్ వివరించారు. ఆమె అధ్యయనం ప్రకారం పాలెంలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో అప్పటికంటే ఇప్పుడు ఒక డిగ్రీ ఎక్కువగా నమోదవుతోంది. కాగా, ఈ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల నగరాల్లో వేడిమి సంబంధిత సమస్యలు పెరుగుతాయని సదరు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. -
ఖేల్ ఖతం...
షాంఘై: మరో అంతర్జాతీయ టోర్నీ... మరో వైఫల్యం... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ఈ ఏడాది ఏ టోర్నీ కలిసి రావడంలేదు. ఈ సంవత్సరంలో తాను పాల్గొన్న ఏ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయిన సైనా... అదే ఆనవాయితీని చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలోనూ కొనసాగించి ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆరో సీడ్ సైనా 21-16, 15-21, 17-21తో సున్ యూ (చైనా) చేతిలో ఓడిపోయింది. సైనాతోపాటు అరుంధతి పంతవానె, పారుపల్లి కశ్యప్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయారు. దాంతో ఈ మెగా టోర్నీలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. అరుంధతి 13-21, 10-21తో మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూడగా... పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో కశ్యప్ 11-21, 12-21తో కెంటో మొమొటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ప్రపంచ 32వ ర్యాంకర్ సున్ యూతో కెరీర్లో తొలిసారి ఆడిన సైనా తొలి గేమ్‌ను నెగ్గినా ఆ తర్వాత తడబడింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా నెట్‌వద్ద 40 పాయింట్లు సంపాదించింది. అయితే కీలకదశల్లో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. రెండో గేమ్‌లోనైతే స్కోరు 5-5 వద్ద సమంగా ఉన్నపుడు ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా 11 పాయింట్లు ప్రత్యర్థికి సమర్పించుకొని 5-16తో వెనుకబడిపోయింది. ఆ తర్వాత సైనా కోలుకొని వరుసగా ఆరు పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. కీలకమైన మూడో గేమ్‌లో సైనా 8-15తో వెనుకబడిన దశలో పుంజుకొని వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి స్కోరును 15-15తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ రెండేసి పాయింట్లు స్కోరు చేశారు. ఈ దశలో సున్ యూ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మొమొటాతో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ అరగంటలో చేతులెత్తేశాడు. మొమొటా స్మాష్‌లతో హడలెత్తించి ఏకంగా 38 పాయింట్లు స్కోరు చేశాడు. సైనా, కశ్యప్ తదితరులు ఈనెల 19 నుంచి 24 వరకు జరిగే హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో బరిలోకి దిగుతారు. -
సైనా శుభారంభం
షాంఘై: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం పరితపిస్తున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ సైనా 21-14, 21-19తో నజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచింది. 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా స్మాష్‌ల ద్వారా 11 పాయింట్లు... నెట్‌వద్ద 19 పాయింట్లు సంపాదించింది. తొలి గేమ్‌లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిన ఈ హైదరాబాద్ అమ్మాయికి రెండో గేమ్‌లో గట్టి ప్రతిఘటన ఎదురైంది. రెండుసార్లు వెనుకబడ్డప్పటికీ వెంటనే తేరుకున్న సైనా గేమ్‌ను దక్కించుకొని రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. మరోవైపు భారత్‌కే చెందిన అరుంధతి పంతవానె కెరీర్లో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. తొలి రౌండ్లో అరుంధతి 21-14, 21-18తో ప్రపంచ 14వ ర్యాంకర్ ఎరికో హిరోస్ (జపాన్)ను బోల్తా కొట్టించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పారుపల్లి కశ్యప్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ బూన్సక్ పొన్సానా (థాయ్‌లాండ్)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ 22-20, 21-15తో నెగ్గాడు. కెరీర్లో పొన్సానాపై కశ్యప్‌కిది నాలుగో విజయం కావడం విశేషం. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ తొలి గేమ్ చివర్లో 18-20తో వెనుకబడ్డాడు. అయితే అనూహ్యంగా పుంజుకొని వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం ఈ హైదరాబాద్ ప్లేయర్ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆనంద్ పవార్ (భారత్) 21-18, 10-21, 11-21తో టకూమా ఉయెదా (జపాన్) చేతిలో; అజయ్ జయరామ్ (భారత్) 18-21, 19-21తో వాన్ హో సన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయారు. డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 14-21, 6-21తో వ్లాదిమిర్ ఇవనోవ్-ఇవాన్ సొజోనోవ్ (రష్యా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. గురువారం జరిగే రెండో రౌండ్లో సున్ యు (చైనా)తో సైనా; యిహాన్ వాంగ్ (చైనా)తో అరుంధతి; కెంటో మొమొటా (జపాన్)తో కశ్యప్ పోటీపడతారు. -
షాంఘైలో ప్రమాదం: 15 మంది దుర్మరణం
చైనాలోని షాంఘై నగరంలో వెంగ్స్ కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రియల్ కంపెనీలోని రిఫ్రిజరేషన్ యూనిట్లో ఈ రోజు ఉదయం ద్రవ అమోనియా గ్యాస్ విడుదలై 15 మంది కార్మికులు మరణించారని ఉన్నతాధికారులు శనివారం ఇక్కడ వెల్లడించారు. మరో 26 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఆరుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.