షాంఘై: చైనా ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన షాంఘై నగరాన్ని బెబింకా తుపాను బెంబేలెత్తిస్తోంది. సోమవారం(సెప్టెంబర్16) ఉదయం బెబింకా తుపాను షాంఘై నగరాన్ని తాకింది. తుపాను నగరాన్ని తాకినప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో జన జీవనం స్తంభించింది. షాంఘై నగరాన్ని తుపాన్లు తాకడం చాలా అరుదు. నగరాన్ని ఇంత పెద్ద తుపాను తాకడం 75 ఏళ్లలో ఇదే తొలిసారి.
తుపాను ప్రభావంతో షాంఘైలో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను కారణంగా షాంఘై, జెజియాంగ్, జినుహా నగరాల్లో లెవెల్ 3 హెచ్చరిక జారీ చేయగా అను ప్రావిన్సులో లెవెల్ 4 హెచ్చరిక జారీ చేశారు. తుపాను దెబ్బకు షాంఘై నగరంలోని రెండు ఎయిర్‌పోర్టుల నుంచి ఆదివారం సాయంత్రం నుంచి 1400 విమానాలు రద్దయ్యాయి. నగరం నుంచి బయల్దేరాల్సిన 570 ప్యాసింజర్ రైళ్లను క్యాంసిల్ చేశారు. కాగా, సోమవారం సాయంత్రానికి వర్షాలు, గాలులు తీవ్రమవుతాయని చైనా వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, ఇటీవలే చైనాలో యాగీ తుపాను ప్రభావంతో భారీగా ఆస్తి,ప్రాణ నష్టాలు సంభవించాయి.
ఇదీ చదవండి.. యూరప్‌లో వరద విలయం
Comments
Please login to add a commentAdd a comment