చైనాను పగబట్టిన ప్రకృతి.. భీకర తుపాన్‌తో అతలాకుతలం | Typhoon Bebinca makes landfall in Shanghai | Sakshi
Sakshi News home page

చైనాను పగబట్టిన ప్రకృతి.. భీకర తుపాన్‌తో అతలాకుతలం

Published Tue, Sep 17 2024 9:14 AM | Last Updated on Tue, Sep 17 2024 1:38 PM

Typhoon Bebinca makes landfall in Shanghai

బీజింగ్‌: డ్రాగన్‌ కంట్రీ చైనాలో బెబింకా తుపాన్‌ బీభత్సం సృష్టించింది. బెబింకా కేటగిరీ-1 తుఫాను కావడంతో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక, గత 75 ఏళ్లలో ఇంత ప్రమాదకరమైన తుపాను చైనాను తాకలేదు. తుపాన్‌ కారణంగా చైనా వాతావరణ శాఖ షాంఘైలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.

కాగా, చైనా వాణిజ్య కేంద్రంగా పరిగణించబడే షాంఘైలో తుపాన్‌ భారీ బీభత్సం సృష్టించింది. బెబింకా తుపాన్‌  తాకినప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాన్‌ కారణంగా జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. చైనాలో ఇంత పెద్ద తుపాను రావడం 75 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ తరహా శక్తివంతమైన తుపాన్‌1949లో వచ్చింది.

 

 

 

 

 

తుపాను ప్రభావంతో షాంఘైలో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను కారణంగా షాంఘై, జెజియాంగ్‌, జినుహా నగరాల్లో లెవెల్‌-3 హెచ్చరిక జారీ చేయగా అను ప్రావిన్సులో లెవెల్‌-4 హెచ్చరిక జారీ చేశారు. తుపాను దెబ్బకు షాంఘై నగరంలోని రెండు ఎయిర్‌పోర్టుల నుంచి ఆదివారం సాయంత్రం నుంచి 1400 విమానాలు రద్దయ్యాయి. నగరం నుంచి బయల్దేరాల్సిన 570 ప్యాసింజర్‌ రైళ్లను క్యాంసిల్‌ చేశారు. కాగా, సోమవారం సాయంత్రానికి వర్షాలు, గాలులు తీవ్రమవుతాయని చైనా వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో 4,14,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. చైనా వాతావరణ శాఖ షాంఘైలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెస్క్యూ చర్యల నిమిత్తం సహాయక సిబ్బందిని భారీగా మోహరించింది. అత్యవసర సమయంలో ప్రజలు ఉండటానికి సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. షాంఘై నుంచి దూరంగా ఉన్న అన్ని నౌకలు ఓడరేవుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, చైనాలోని దక్షిణ ప్రాంతం నిరంతరం ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతూనే ఉంది. గత వారమే యాగి తుపాను హెనాన్‌ ప్రావీన్సును తాకగా ఆస్తి నష్టం వాటిల్లింది.

 

ఇది కూడా చదవండి: లంచ్‌ బ్రేక్‌లో లవ్వు!.. రష్యన్లకు పుతిన్‌ కొత్త సూచన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement