చైనాలో కొత్త ట్రెండ్, ఫేక్ మెటర్నిటీ ఫోటో షూట్
మండిపడుతున్న నెటిజన్లు
ప్రస్తుతం మెటర్నిటీ ఫోటోషూట్ ట్రెండింగ్‌లో ఉంది. మాతృత్వ అనుభూతులను అందంగా, పదిలంగా దాచుకోవాలనే లక్ష్యంతో ఇది పాపులర్ అయింది. కానీ చైనాలో ప్రెగ్నెన్సీ ఫోటోలకు సంబంధించి ఒక నయా ట్రెండ్ విమర్శలకు తావిస్తోంది. చైనాలో ఒంటరి మహిళలు ఇప్పుడు నకిలీ బేబీ బంప్, మెటర్నీటి ఫోటోషూట్‌లకు సోషల్‌మీడియాను ముంచుత్తెతున్నారు. దీంతో చర్చకు దారి తీసింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) రిపోర్ట్ ప్రకారం పెళ్లి కాని యువతుల బేబీ బంప్‌తో ఫొటోషూట్ చైనాలో కొత్త ట్రెండ్‌గా మారింది. హునాన్ ప్రావిన్స్‌కు చెందిన జనరేషన్ Z ఇన్‌ఫ్లుయెన్సర్ “ మెయిజీజీ గెగే” అక్టోబర్ 13న తన మెటర్నిటీ ఫోటోషూట్‌ను షేర్ చేసింది. అదీ ఆమె సింగిల్‌గా(పెళ్లి కాకుండానే), స్లిమ్‌గా ఉన్నప్పుడే బేబీ బంప్‌తో ఫొటోషూట్ చేసింది. అంతేకాదు గర్భధారణ సమయంలో పొందే ఆనందాన్ని అనుభవించాను అంటూ ఆమె రాసుకొచ్చింది. దీంతో ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. 5.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లను ఆమె విపరీతంగా ఆకర్షించింది. ఈ ఫేక్ బేబీ బంప్ ఫోటోషూట్ ట్రెండ్ వేగంగా ఊపందుకుంటోంది
ఈ ధోరణి చైనాలో జననాలు, వివాహాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ మెటర్నిటీ ఫోటోషూట్‌లు విపరీతంగా షేర్ అవుతున్నాయి. 26 ఏళ్ల గ్రాడ్యుయేట్ తాను సింగిల్ అయినప్పటికీ 23 ఏళ్ల వయస్సులో తన ప్రసూతి ఫోటోలను తీసినట్లు వెల్లడించింది. మరో యువతి తన పెళ్లి ఫోటోలను 22 ఏళ్ల వయసులో తీశానని, “నాకు 30 ఏళ్లలోపు ముడతలు వస్తే” ఎలా అంటూ వ్యాఖ్యానించింది. ఇలా 20 ఏళ్ళ వయస్సున్న అమ్మాయిలుకూడా ఇలా ఫేక్ బేబీబంప్ ఫోటో షూట్ చేయించుకుంటుండటం గమనార్హం.
గర్భధారణ సమయంలో శరీర మార్పులు ఒళ్లు చేస్తే ఫొటోషూట్ నైస్‌గా అందంగా కుదరదని భావిస్తున్న యువతులు నాజూకైన శరీరం ఉండగానే ఫేక్ బెల్లీ ఫోటోలను తీయించుకుంటున్నారు. అయితే ఈ ట్రెండ్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
అటు పాత తరం కూడా ఇదేం చోద్యం అంటూ మెటికలు విరుస్తూ ఆశ్చర్యపోతున్నారట. తాము కూడా 70 ఏళ్ల పుట్టినరోజు, అంత్యక్రియల ఫొటోషూట్‌లు నిర్వహించుకొంటామంటూ మండి పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment