Single women
-
నయా ట్రెండ్ : పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్ రచ్చ!
ప్రస్తుతం మెటర్నిటీ ఫోటోషూట్ ట్రెండింగ్‌లో ఉంది. మాతృత్వ అనుభూతులను అందంగా, పదిలంగా దాచుకోవాలనే లక్ష్యంతో ఇది పాపులర్ అయింది. కానీ చైనాలో ప్రెగ్నెన్సీ ఫోటోలకు సంబంధించి ఒక నయా ట్రెండ్ విమర్శలకు తావిస్తోంది. చైనాలో ఒంటరి మహిళలు ఇప్పుడు నకిలీ బేబీ బంప్, మెటర్నీటి ఫోటోషూట్లకు సోషల్‌మీడియాను ముంచుత్తెతున్నారు. దీంతో చర్చకు దారి తీసింది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) రిపోర్ట్ ప్రకారం పెళ్లి కాని యువతుల బేబీ బంప్‌తో ఫొటోషూట్ చైనాలో కొత్త ట్రెండ్‌గా మారింది. హునాన్ ప్రావిన్స్‌కు చెందిన జనరేషన్ Z ఇన్ఫ్లుయెన్సర్ “ మెయిజీజీ గెగే” అక్టోబర్ 13న తన మెటర్నిటీ ఫోటోషూట్‌ను షేర్ చేసింది. అదీ ఆమె సింగిల్‌గా(పెళ్లి కాకుండానే), స్లిమ్‌గా ఉన్నప్పుడే బేబీ బంప్‌తో ఫొటోషూట్ చేసింది. అంతేకాదు గర్భధారణ సమయంలో పొందే ఆనందాన్ని అనుభవించాను అంటూ ఆమె రాసుకొచ్చింది. దీంతో ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. 5.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లను ఆమె విపరీతంగా ఆకర్షించింది. ఈ ఫేక్ బేబీ బంప్ ఫోటోషూట్ ట్రెండ్ వేగంగా ఊపందుకుంటోందిఈ ధోరణి చైనాలో జననాలు, వివాహాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ మెటర్నిటీ ఫోటోషూట్లు విపరీతంగా షేర్ అవుతున్నాయి. 26 ఏళ్ల గ్రాడ్యుయేట్ తాను సింగిల్ అయినప్పటికీ 23 ఏళ్ల వయస్సులో తన ప్రసూతి ఫోటోలను తీసినట్లు వెల్లడించింది. మరో యువతి తన పెళ్లి ఫోటోలను 22 ఏళ్ల వయసులో తీశానని, “నాకు 30 ఏళ్లలోపు ముడతలు వస్తే” ఎలా అంటూ వ్యాఖ్యానించింది. ఇలా 20 ఏళ్ళ వయస్సున్న అమ్మాయిలుకూడా ఇలా ఫేక్ బేబీబంప్ ఫోటో షూట్ చేయించుకుంటుండటం గమనార్హం.గర్భధారణ సమయంలో శరీర మార్పులు ఒళ్లు చేస్తే ఫొటోషూట్ నైస్‌గా అందంగా కుదరదని భావిస్తున్న యువతులు నాజూకైన శరీరం ఉండగానే ఫేక్ బెల్లీ ఫోటోలను తీయించుకుంటున్నారు. అయితే ఈ ట్రెండ్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు పాత తరం కూడా ఇదేం చోద్యం అంటూ మెటికలు విరుస్తూ ఆశ్చర్యపోతున్నారట. తాము కూడా 70 ఏళ్ల పుట్టినరోజు, అంత్యక్రియల ఫొటోషూట్లు నిర్వహించుకొంటామంటూ మండి పడుతున్నారు. -
ఒంటరి మహిళలే టార్గెట్.. వారితో చనువు పెంచుకుని.. హోటల్‌కు తీసుకెళ్లి..
విజయవాడ: ఒంటరి మహిళలను నమ్మించి.. వారి బంగారు ఆభరణాలు కాజేస్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 12 ఏళ్లుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎంతో మంది మహిళలను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక కమాండ్ కంట్రోల్ రూంలో గురువారం ఎన్టీఆర్ జిల్లా డెప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీ వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. చదవండి: కలిసి బతకలేమని.. చావులోనైనా ఒక్కటవ్వాలని.. ఒంటరిగానే జీవనం.. నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన చేవూరి చంద్ర అలియాస్ వెందేటి చంద్ర చిన్నతనంలోనే తల్లిదండ్రులను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. కొన్నాళ్లు గూడూరు, తిరుపతిలోని ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేశాడు. తిరుపతిలో పని చేస్తున్న రోజుల్లో జల్సాలకు అలవాటు పడి బస్టాండ్ చుట్టుపక్కల ఒంటరిగా జీవిస్తున్న మహిళలను టార్గెట్ చేశాడు. తాను ధనవంతుడినని, బంగారం వ్యాపారం చేస్తానని మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. చనువుగా ఉంటూ మహిళలను అదే ప్రాంతంలోని హోటల్‌కు తీసుకెళ్లి ముందుగానే తెచ్చుకున్న నిద్రమాత్రలు ఇచ్చి బంగారు ఆభరణాలు, డబ్బు తీసుకుని ఉడాయించేవాడు. 2010 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న నిందితుడిపై తిరుపతి, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, ఏలూరు పోలీస్స్టేషన్లలో 20 కేసులు నమోదయ్యాయి. పలు మార్లు జైలు జీవితం అనుభవించినా.. చంద్ర ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. విజయవాడలో మరోసారి.. ఈ ఏడాది జనవరిలో చివరిగా జైలు నుంచి బయటకు వచ్చిన చంద్ర విజయవాడలోని భవానీపురానికి చెందిన మహిళను టార్గెట్ చేశారు. ఆమె వద్ద నుంచి 36 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. జూలైలో కృష్ణలంకలో నివాసం ఉంటున్న మరో మహిళను ఇదే తరహాలో మోసం చేసి 61.5 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు. కృష్ణలంకకు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని స్థానిక పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద గురువారం అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 97.5 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న కృష్ణలంక సీఐ దుర్గారావు, క్రైం ఎస్ఐ కృష్ణబాబు, హెడ్‌కానిస్టేబుల్ సాంబయ్య, కాన్స్టేబుల్ బాబురావును డీసీపీ విశాల్ గున్నీ ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు. -
ఒంటరి మహిళలే టార్గెట్.. నమ్మించి నగ్న వీడియోలు తీసి..
బనశంకరి(కర్ణాటక): ఒంటరి, వితంతు మహిళలను మాయమాటలతో నమ్మించి నగ్నచిత్రాలు తీసి డబ్బు గుంజుతున్న మహిళతో పాటు నలుగురు ఖతర్నాక్ గ్యాంగ్‌ను ఆదివారం మహాలక్ష్మీ లేఔట్ పోలీసులు అరెస్ట్‌చేశారు. మంగళ, రవి, శివకుమార్, శ్రీనివాస్ ఆ ముఠా సభ్యులు. మంగళ, రవి దంపతులు కాగా శివకుమార్, శ్రీనివాస్‌తో కలిసి ముఠాగా అయ్యారు. ఒంటరి మహిళలను గాలించి మంగళ వారిని పరిచయం చేసుకునేది. చదవండి: ఒంటరిగా బతకలేను.. అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి మహిళలను కారులో ఎక్కించుకుని నిర్జన ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించి నగ్నచిత్రాలు వీడియో తీసేవారు. ఇక అప్పటినుంచి వారిని బెదిరించి డబ్బులు రాబట్టుకునేవారు. ఈ ముఠాపై మహాలక్ష్మీ లేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఓ బాధితురాలు కేసు పెట్టింది. తనను బెదిరించి బంగారుచైన్, నగలు, రూ.84 వేల నగదు దోచుకున్నారని తెలిపింది. దీంతో ముఠాను అరెస్ట్‌చేసి వీరి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన నగలు, రూ.70 వేల నగదు, కారు, మొబైల్, కత్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. -
Sreemoyee Piu Kundu: సింగిల్ ఉమెన్‌గా ఉండటానికి ఎన్నో కారణాలు.. అయితే
‘హాయ్ శైలి... ఇన్నాళ్ల తరువాత నిన్ను చూసే భాగ్యం కలిగింది. ఎలా ఉన్నావు?’ ‘నన్ను గుర్తు పట్టావా?’ ‘నాకు అక్కలాంటిదానివి నువ్వు. ఎందుకు గుర్తుపట్టను!’ ‘కొత్త ఇల్లు కొన్నందుకు శుభాకాంక్షలు భార్గవి. ఫొటోల్లో కంటే సన్నగా కనిపిస్తున్నావు. ఇలాగే బాగున్నావు’ ... ఇవి ఏ ఫంక్షన్ హాల్లోనో వినిపించిన మాటలు కాదు. ఈ హాల్లో వివాహ వేడుకలాంటిదేమీ జరగడం లేదు. అందరూ ఒకరికి ఒకరు బాగా తెలుసు. అయితే ఎప్పుడూ ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఈ సమావేశానికి వచ్చిన వాళ్లు సింగిల్ ఉమెన్. వారు సింగిల్ ఉమెన్‌గా ఉండడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అయితే వారందరిని ఒకటి చేసింది, ఒక కుటుంబంలా నిలిపింది స్టేటస్ సింగిల్. కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న సింగిల్ ఉమెన్స్ ఆన్లైన్ వేదికగా ఒక బృందంగా ఏర్పడ్డారు. కష్టాలు, సుఖాలు, సంతోషాలు, సలహాలు...ఒకరితో ఒకరు పంచుకునేవారు. తమ గ్రూప్‌ను మరింత బలోపేతం చేయడానికి ఆన్లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కు నడిచొచ్చారు. అందరూ దిల్లీలో సమావేశం అయ్యారు. ‘ఒకరినొకరం ప్రత్యక్షంగా కలుసుకోవడం చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది. కులం, మతం, ప్రాంతాలకు అతీతం గా మేమందరం ఒకే కుటుంబం అనే భావన కలిగింది’ అంటుంది రచయిత్రి, కాలమిస్ట్ శ్రీమోయి కుందు. అలా వచ్చిందే ఈ పుస్తకం.. ‘స్టేటస్ సింగిల్’ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించింది. ‘రియల్ అకేషన్’ ‘హ్యాపియర్ టైమ్’ ‘యువర్ బిగ్డే’... తన ప్రతి పుట్టిన రోజు వేడుకల్లో తరచు వినిపించే మాటలు ఇవి. ఈసారి తన పుట్టిన రోజును ఒక వేడుకలా జరుపుకోకుండా, గుర్తుండి పోయే పని ఒకటి చేయాలనుకుంది. అలా వచ్చిందే ఆమె రాసిన ‘స్టేటస్ సింగిల్’ అనే పుస్తకం. దీని కోసం 30–40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్బన్ ఉమెన్స్ మూడువందల మందిని ఇంటర్వ్యూ చేసింది. వారి అనుభవాలను రికార్డ్ చేసింది. ఈ పుస్తకం సింగిల్ ఉమెన్ కష్టాలు, కన్నీళ్లనే కాదు... వారి పోరాట పటిమనూ కళ్లకు కట్టింది. సింగిల్ ఉమెన్‌పై రకరకాల అపోహలు ఉన్నాయి. వారికి కోపం ఎక్కువని. ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుంటారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారని... ఇలాంటి ఎన్నో అపోహలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. ‘నేను రాసిన పుస్తకం సెల్ఫ్–హెల్ప్ బుక్లా ఉపయోగపడకపోవచ్చు. స్ఫూర్తిదాయక పుస్తకం కాకపోవచ్చు. కానీ ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే అంతకంటే సంతోషం ఏముంటుంది’ అని కుందు చెబుతున్నప్పటికీ ఎంతోమంది సింగిల్ ఉమెన్‌కు ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా, సెల్ఫ్–హెల్ప్ బుక్లా ఉపయోగపడుతుంది. తర్వాత ఏమిటి మరి? ఢిల్లీలోనే కాదు దేశం నలుమూలలా ‘స్టేటస్ సింగిల్’ సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరికొకరు అండగా నిలవాలనేది లక్ష్యం. వారి లక్ష్యం ఫలించాలని ఆశిద్దాం. చదవండి: Vaccine RJ Aswathy Murali: టీవీ కంటే రేడియో ద్వారానే.. అలా మా కమ్యూనిటీలో -
ఒంటరి తల్లులకు భరోసా ఏదీ?
‘నేను కేవలం స్త్రీని. నాకు పురుషుని తోడు అన్ని వేళలా అవసరం అని స్త్రీ అనుకుంటూ ఉంటే కనుక ఆమెకు స్వయం జీవనం కల్పించడంలో వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వ పథకాలు స్త్రీలకు ముఖ్యం గా ఒంటరి స్త్రీలకు లేదా ఒంటరి తల్లులకు తగిన భరోసా కల్పించడంలో విఫలమైనట్టే’ అని మొన్న శనివారం కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. దత్తత ఇచ్చిన తన బిడ్డను తిరిగి వెనక్కు తెచ్చుకోవడానికి ఒక మహిళ హైకోర్టును ఆశ్రయించగా ఆమె వాదనల సమయంలో న్యాయమూర్తులు ముహమ్మద్ ముష్టాక్, కౌసర్ ఎడప్పగత్ ఈ వ్యాఖ్య చేశారు. కేసు ఏమిటి? కేరళలో ఒక మహిళ తన సహచరునితో లివ్ - ఇన్ రిలేషన్లో ఉండేది. దానివల్ల వారికి సంతానం కలిగింది. అయితే ఆ తర్వాత వాళ్లు విడిపోయారు. ఆ సంతానం తల్లి దగ్గర ఉండిపోయింది. ఒంటరి తల్లిగా బిడ్డను పెంచడం ఈ సంఘంలో చాలా పెద్ద సవాలు అని భావించిన ఆ తల్లి ఆ బిడ్డను దత్తతకు ఇచ్చేసింది. ఇప్పుడు ఆ తండ్రి తిరిగి వచ్చాడు. వారు మళ్లీ కలిసి జీవించదలిచి దత్తత ఇచ్చిన బిడ్డ కోసం కోర్టు మెట్లెక్కారు. ఆ కేసు వాదనలు వింటూ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యానం చేశారు. ఇంత ఆందోళన ఎందుకు? ‘తన బిడ్డను దత్తత ఇచ్చే ముందు ఆ తల్లి ఒక సామాజిక కార్యకర్తతో చేసిన చాట్స్ చూశాం. అందులో ఆమె ఎంత ఒత్తిడికి లోనయ్యిందో తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా ఏ మద్దతు ఒంటరి తల్లులకు లభించదని, కనుక బిడ్డను పెంచలేనని ఆ తల్లి భావించింది. జన్మనిచ్చిన బిడ్డను దత్తత ఇచ్చేసింది. ఈ విధంగా చూసినట్టయితే ఒక ఒంటరి తల్లి ధైర్యంగా బతికేలా చేయడంలో ఈ వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వం సింగిల్ మదర్స్ కోసం ఏం ఆలోచనలు చేస్తున్నట్టు? వారు ఆర్థికంగా, సామాజికంగా తగిన గౌరవంతో బతకడానికి ఎటువంటి చైతన్యం కలిగిస్తున్నట్టు’ అని కోర్టు అంది. మగతోడు లేకుండా బతకలేమా? అయితే ఒక రకంగా చూస్తే ఇది ‘మధ్యతరగతి’ సమస్యా? అనిపిస్తుంది. ఆర్థికంగా దిగువ వర్గాల్లో ఒంటరి తల్లులు ధైర్యంగా బతకడం చూడొచ్చు. సంపన్న వర్గాల్లో పెళ్లిని నిరాకరించి మరీ సింగిల్ మదర్స్ అవుతున్నవారు ఉన్నారు. అందరికీ తెలిసిన ఉదాహరణలు ఏక్తా కపూర్, సుస్మితాసేన్. దీనికి చాలా ఏళ్ల ముందు సింగిల్ మదర్‌గా తాను జీవించగలనని నీనా గుప్తా నిరూపించింది. మరోవైపు దిగువ వర్గాల్లోగాని, ఉన్నత వర్గాల్లో కాని విడాకులు ఒక సమంజసమైన పరిష్కారంగా భావించి విడిపోయే జంటలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత పిల్లలతో మిగిలిన తల్లులు ధైర్యంగా బతకడం కనిపిస్తూనే ఉంటుంది. ఎటొచ్చి మధ్యతరగతి మర్యాదలలో ‘మగతోడు’ ఒక తప్పనిసరి సాంఘిక చిహ్నంగా, భద్రతగా, రక్షణగా భావించే పరిస్థితితులు ఉన్నాయి. మధ్యతరగతి సమాజం లిఖించుకున్న విలువలు చాలామటుకు స్త్రీని ప్రశ్నించే, నిలదీసే, సరిదిద్దడానికే ప్రయత్నించేలా ఉంటాయి. అందుకే విడాకులకు వెరచి గృహహింసను భరించే స్త్రీలు, ఒంటరి స్త్రీలుగా ఉంటూ పిల్లలను పెంచడానికి భయపడే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. చుట్టూ సవాళ్లు ఒకసారి భర్తతో లేదా సహజీవనం నుంచి విడిపోయాక స్త్రీలు ఒంటరిగా జీవించడానికే ఇష్టపడి తమ పిల్లలను ఒంటరిగానే పెంచుకుందామని అనుకున్నా వారికి సవాళ్లు చాలానే ఉంటాయి. ముఖ్యంగా వీరికి అద్దెకు ఇళ్లు దొరకడం ఒక సమస్య. ఇంటిపని, సంపాదన చూస్తూ పిల్లల అవసరాల గురించి సమయం పెట్టాలంటే వీలు కాదు. నమ్మకమైన బేబి సిట్టర్స్ దొరకడం ఒక సమస్య. సమాజం నుంచి మద్దతు దొరకదు. ఆర్థిక ఆలంబన ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఏమీ అందదు. మరో పెళ్లి చేసుకోమని సమాజం నుంచి వచ్చే వొత్తిడి. అవకాశంగా తీసుకుని అడ్వాన్స్ అయ్యే పురుషులతో సమస్య. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే బహుశా ఆ కేరళ తల్లి తన బిడ్డను దత్తతకు ఇచ్చి ఉండవచ్చు. కోర్టు ఈ వ్యాఖ్యానాలు చేయడం వెనుక ఈ నేపథ్యం అంతా ఉంది. సమాజంలో చట్ట పరిధికి లోబడి తమకు నచ్చిన రీతిలో బతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సింగిల్ మదర్‌గా ఎవరైనా జీవించదలిస్తే వారిని సమాజం లో భాగంగా చేసుకోవడం. గౌరవించడం, మద్దతు గా నిలవడం చేయవలసిన వ్యవస్థ సంపూర్ణంగా తయారు కాలేదని కేరళ ఉదంతం తెలియచేస్తోంది. - సాక్షి ఫ్యామిలీ -
కిటికీలో నుంచి కండోమ్ విసిరాడు
సాక్షి, బెంగళూరు: ఒంటరిగా నివాసముంటోన్న ఓ యువతి ఇంట్లోకి ఆగంతకుడు చొరబడేందుకు ప్రయత్నించడమే కాక కిటికీలో నుంచి కండోమ్ ప్యాకెట్లు విసిరి పారిపోయిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. అయితే పోలీసులు సైతం సహాయమందించలేకపోవడంతో ఆ రోజు ఆమెకు నిద్రలేని రాత్రే అయ్యింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన మనీషా(పేరు మార్చాం) అనే ఉద్యోగిని ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో జనవరి 30న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరో అదేపనిగా తలుపు తడుతున్న శబ్ధాలు వినిపించాయి. రానురానూ ఈ శబ్ధాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఉదయం 2 గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసింది. ఇంతలో దుండగుడు ప్రధాన ద్వారం దగ్గర ఉన్న కిటికీను తెరిచి అందులోనుంచి చేయి పోనిచ్చి తలుపు గొళ్లెం తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా అక్కడికి దగ్గర ఉన్న స్విచ్‌బోర్డుపై చేయి పడగా హాల్లోని లైట్లు వెలిగాయి. అంతే.. అతను భయంకరంగా మేడమ్, మేడమ్ అని అరుస్తూ లైట్లు ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ ఆమెను మరింత భయపెట్టేందుకు ప్రయత్నించాడు. మరోవైపు తలుపులపై బాదుతూ, కాలింగ్ బెల్ కొట్టాడు. ఇంతలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో వారిని గమనించిన దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా పోలీసులు ఆ రాత్రి తనకు రక్షణ కల్పిస్తారని భావించిన యువతికి నిరాశే ఎదురైంది. కేవలం ఒక ఫోన్‌నెంబర్ ఇచ్చి మళ్లీ ఏదైనా జరిగితే కాల్ చేయండని చెప్పారు. ‘అంటే మళ్లీ జరిగేవరకు నేను ఎదురు చూడాలా?’ అని అంటున్న మాటలను కూడా పట్టించుకోకుండా అక్కడ నుంచి నిష్క్రమించారు. అయితే పోలీసులు కనీసం ఇంటి చుట్టుపక్కల కూడా వెతక్కుండానే వెళ్లిపోయారు’’ అని ఆమె వాపోయింది. (అనూహ్య ఘటన: బలవంతంగా యువతికి తాళి కట్టాడు) కండోమ్స్ చూసి షాక్ ఎప్పటిలాగే ఆ తర్వాతి రోజు ఆఫీస్‌కు సిద్ధమవుతున్న మనీషా ఫ్రిడ్జ్ దగ్గరలో కనిపించిన కండోమ్స్ ప్యాకెట్స్ చూసి షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారమందించగా... వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇంటికి చేరుకుని ఏం పర్లేదని చెబుతూ దాన్ని అవతలకు పారేశారు. దీంతో యువతి ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంది. ఆ అపార్ట్మెంట్ యజమానిని సంప్రదించి సీసీటీవీ ఫుటేజీని సేకరించింది. అందులో దుండగుడిని ఒకటికి పదిమార్లు నిశితంగా పరిశీలించిన పిదప, తానెప్పుడూ అతన్ని చూడలేదని నిర్ధారించుకుంది. ఇక సీసీటీవీలో అతను మరో ఇంటివద్ద కూడా ఇలానే ప్రవర్తించడం రికార్డైంది. అక్కడ కూడా కిటికీ తలుపులు తెరుస్తూ, మూస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఎవరికీ పట్టింపు లేదు ఈ ఘటనపై మనీషా ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారు కండోమ్ ప్రస్తావన వదిలేయమన్నారు. దీనికి తాను ససేమిరా ఒప్పుకోకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ స్వీకరించలేదని ఆమె పేర్కొంది. తనకు పోలీసుల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో సామాజిక కార్యకర్త దీపిక నారాయణ్ భరద్వాజ్‌కు ట్విటర్లో తన గోడు వెళ్లబోసుకుంది. పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోలేదని వెల్లడించింది. దీనిపై సత్వర న్యాయం చేపట్టాలని ఆమె పోలీసు శాఖను కోరగా ఈ ఘటనపై విచారణ చేపట్టామని పోలీసు అధికారులు పేర్కొనటం గమనార్హం. మరోవైపు అపార్ట్మెంట్లో సెక్యురిటీ సిబ్బందిని నియమించాలన్న విజ్ఞప్తిని సైతం యజమాని కొట్టిపారేశాడు. వీరి నిర్లక్ష్యంతో విసుగు చెందిన మనీషా మూడేళ్లుగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేయడానికి సిద్ధపడింది. తనకు రక్షణ కల్పించే ఇంటి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. చదవండి: భార్యను భయపెట్టడానికి... -
సరోగసీకి దగ్గరి బంధువులే కానక్కర్లేదు
న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా బిడ్డల్ని కనిచ్చేందుకు దగ్గరి బంధువులే కానక్కర్లేదనీ, ఆరోగ్యవంతులైన స్త్రీలెవ్వరైనా అందుకు సమ్మతిస్తే సరోగసీ పద్ధతుల్లో బిడ్డని కనివ్వొచ్చనీ రాజ్యసభ సెలెక్ట్ కమిటీ తేల్చి చెప్పింది. 35–45 ఏళ్ల మధ్య వయస్కులైన ఒంటరి స్త్రీలు సరోగసీని ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేసింది. సరోగసీ తల్లులుగా దగ్గరి బంధువులే ఉండాలన్న నిబంధనను అద్దెగర్భాల తల్లులపై పరిమితులు సృష్టిస్తుందనీ, అందుకే దీన్ని తొలగించాలని కమిటీ సూచించింది. ఒంటరి స్త్రీలంతా సరోగసీకి అర్హులేననీ, భర్తలేకున్నా, భర్తతో విడిపోయినా, భర్త చనిపోయిన స్త్రీలకూ సంతానాన్ని పొందే అవకాశం ఉండాలని స్పష్టం చేసింది. భారతీయురాలైన 35–45 ఏళ్ల మధ్యవయస్సులో ఉన్న స్త్రీలు ఇందుకు అర్హులంది. అద్దెగర్భాన్ని వ్యాపారంగా మార్చొద్దని హెచ్చరించింది. లాభాపేక్షతో కాకుండా మాతృత్వపు విలువలను కాపాడేవిధంగా సరోగసీని అనుమతించాలని అభిప్రాయపడింది. సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు–2019ని నవంబర్ 21, 2019న రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశమైంది. కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ బుధవారం నివేదికను సమర్పించారు. 23 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ బృందం సరోగసీ రెగ్యులేషన్ బిల్లులో పలు మార్పులను సూచించింది. ► అదేవిధంగా సరోగసీ ద్వారా బిడ్డని కనాలనుకునే జంట పెళ్ళైన ఐదేళ్ళ పాటు భార్యాభర్తలు కలిసి ఉండీ పిల్లల్ని కనలేని పరిస్థితుల్లోనే అద్దెగర్భాన్ని ఆశ్రయించాలన్న నిబంధనను కూడా కమిటీ సడలించింది. సంతానలేమిని కొత్తగా నిర్వచించిన కమిటీ పిల్లల కోసం ఒక జంట ఐదేళ్ళపాటు ఎదురుచూడడం చాలా ఎక్కువ కాలం అవుతుందని పేర్కొంది. ► ఇష్టమైన ఏ స్త్రీ అయినా సరోగసీ ద్వారా బిడ్డలను కనే అనుమతినివ్వాలనీ, అయితే అందుకు సంబంధించిన అన్ని విషయాలూ సరోగసీ చట్టప్రకారమే జరగాల్సి ఉంటుందనీ తెలిపింది. అలాగే అద్దెగర్భం దాల్చే మహిళలకు గతంలో ఉన్న 16 నెలల ఇన్సూరెన్స్ కవరేజ్‌ను 36 నెలలకు పెంచాలని సూచించింది. ► పిల్లలు పుట్టని వారుసైతం సరోగసీ ద్వారా బిడ్డను పొందేందుకు ఐదేళ్ళు వేచి ఉండాలన్న నిబ«ంధనను తొలగించాలని అభిప్రాయపడిన కమిటీ పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలుంటాయని వివరించింది. కొందరికి పుట్టుకతోనే గర్భాశయం లేకపోవడం, లేదా గర్భాశయం పనిచేయకపోవడం, క్యాన్సర్‌కారణంగా గర్భాశయాన్ని తొలగించాల్సి రావడం, కొందరు స్త్రీలకు ఎప్పటికీ పిల్లలను కనే అవకాశంలేని అనారోగ్య స్థితిలో ఉన్న వారికి సరోగసీ ఒక ప్రత్యామ్నాయమని అభిప్రాయపడింది. ► బిడ్డలు కావాలనుకునేవారు ఎప్పుడైనా సరోగసీ ద్వారా బిడ్డలను కనొచ్చనీ, అయితే అందుకు వైద్యపరమైన ఆమోదం పొందాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. ► అలాగే భారతీయ సంతతికి చెందిన వారెవ్వరైనా సరోగసీ బోర్డు ద్వారా అనుమతిపొందిన తరువాత దేశంలో సరోగసీ ద్వారా బిడ్డలను పొందే వీలుండేలా బిల్లులో మార్పులు చేయాలని కమిటీ సూచించింది. -
ఆదుకునేవారేరీ
సాక్షి, బొమ్మెన భూమేశ్వర్(వరంగల్) : ఉపాధి కోసం షార్జా వెళ్లిన ఆ వ్యక్తి తోటి కార్మికునితో జరిగిన ఘర్షణలో చనిపోవడంతో అతని కుటుంబం దిక్కులేనిదైంది. అతని భార్య పెద్ద దిక్కును కోల్పోయి బాధను దిగమింగుకుంటూనే కుటుంబ భారాన్ని మోసింది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌కు చెందిన గోవర్దన్, జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట్‌కు చెందిన ధరూరి బుచ్చన్న ఒకే కంపెనీలో పనిచేస్తూ ఒకే గదిలో నివాసం ఉండేవారు. 2001లో నివాస గదిలో ఇద్దరి మధ్య క్షణికావేశంలో జరిగిన ఘర్షణలో గోవర్దన్ మరణించాడు. గోవర్దన్ మరణానికి బుచ్చన్నను కారకునిగా గుర్తించిన షార్జా పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరుచగా అతనికి అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. బుచ్చన్న 18 ఏళ్ల నుంచి షార్జా జైలులోనే మగ్గిపోతున్నాడు. కడసారి చూపు కూడా దక్కలేదు.. షార్జాలో మరణించిన గోవర్దన్ మృతదేహాన్ని ఆర్థిక, సాంకేతిక కారణాలతో భారత్‌కు పంపలేదు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అతని కుటుంబ సభ్యులు కడసారి చూపునకు కూడా నోచుకోలేదు. గోవర్దన్‌పై ఆధారపడిన భార్య రాధ, కొడుకు నవీన్, కూతురు రవళిలు పెద్ద దిక్కును కోల్పోయారు. రాధ బీడీలు చుడుతూనే తన పిల్లలను పోషించింది. తన రెక్కల కష్టంతో కూతురును, కొడుకును చదివించి పెంచి పెద్ద చేసింది. వారి పెళ్లిళ్లను జరిపించి తన బాధ్యతను నెరవేర్చుకున్న ఆమె.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోవర్దన్ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. పెద్ద మనసుతో క్షమాభిక్ష.. షార్జా జైలులో మగ్గుతున్న బుచ్చన్న కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. షరియా చట్టం ప్రకారం మృతుని కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే బుచ్చన్న షార్జా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. బుచ్చన్న సోదరులు లక్ష్మణ్, లింగన్న, మేనల్లుడు రాజేష్ ఇటీవల ముప్కాల్ గ్రామానికి వెళ్లి గ్రామపెద్దల సమక్షంలో గోవర్దన్ కుటుంబ సభ్యులను కలిసి క్షమాబిక్ష కోసం ప్రాధేయపడ్డారు. పెద్దమనసు చేసుకుని బుచ్చన్నకు క్షమాబిక్ష లేఖ ఇచ్చి, శిక్ష రద్దుకు సహకరించాలని వేడుకోగా.. ఎట్టకేలకు గోవర్దన్ భార్య రాధ ఒప్పుకుంది. పరిహారం కోసం ప్రయత్నాలు.. క్షమాభిక్ష లేఖతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు జైల్లో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు కొంత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బును షార్జా న్యాయస్థానంలో జమచేయడం గానీ, బాధిత కుటుంబ సభ్యులకు నేరుగా గానీ ఇవ్వాలి. అయితే, బుచ్చన్న కుటుంబ సభ్యులకు అంత ఆర్థిక స్థోమతలేదు. విరాళాలు సేకరించి గోవర్దన్ కుటుంబానికి చెల్లించి బుచ్చన్నను విడిపించడానికి కొన్ని దళిత సంఘాలు, కొందరు ప్రవాసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వలసదారుల హక్కుల మండలి అధ్యక్షుడు పి.నారాయణ స్వామి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం 2011 డిసెంబర్లో షార్జా జైలును సందర్శించి బుచ్చన్నను కలిసి వచ్చారు. గోవర్దన్ కుటుంబాన్ని ఆదుకోవాలని, బుచ్చన్నను జైలు నుంచి విడుదల చేయాలని నారాయణ స్వామి గతంలో హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. -
కదిలించిన కథనం.. స్పందించిన హృదయం
ఈ ఫొటోలో రామక్కకు రూ.10వేల నగదును అందజేస్తున్న వ్యక్తి ఓ రైతు. పేరు జూగప్ప గారి శివకుమార్. గుమ్మఘట్ట మండలం కేపీ.దొడ్డి గ్రామానికి చెందిన ఇతను ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం చూసి చలించిపోయారు. కరువు జిల్లాలో రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాంటిది తనకు ఉన్నదాంట్లో ఆ తల్లికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తన కుమారుడు సంతోష్‌తో కలిసి పరుగున కలుగోడు గ్రామానికి చేరుకున్నాడు. ఓ అన్నగా ఆమెకు ధైర్యం చెప్పి చిరు సహాయం ఆమె చేతికందించాడు. అంతటితో ఆయన మనసు కుదుట పడలేదు.. తన పొలంలో పండిన ధాన్యం గింజలతో పిల్లల ఆకలి తీరుస్తానంటూ కొండంత భరోసానివ్వడం విశేషం. ఈ రైతన్నకు ‘సాక్షి’ సలాం. రామక్క వేదనాభరిత జీవనం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. చిన్న వయస్సులో సంసార సాగరాన్ని ఒంటి చేత్తో ఈదుతున్న ఒంటరి మహిళకు మానవత్వం అండగా నిలుస్తోంది. భర్తను పోగొట్టుకొని.. ఆరుగురు ఆడపిల్లలతో పాటు అత్త పోషణ భారాన్ని భుజానికెత్తుకున్న ఆ తల్లికి జగమంత కుటుంబం భరోసానిస్తోంది. ‘సాక్షి’లో ఈనెల 13న ‘రామా.. కనవేమిరా!’ శీర్షికన ప్రచురితమైన కథనం మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపింది. ఓ అక్కగా.. చెల్లిగా.. కుటుంబ సభ్యురాలిగా ఓదార్చడంతో పాటు ఆమెను కష్టాల సాగరం నుంచి బయటపడేసేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. గుమ్మఘట్ట: భర్త చాటున పదమూడేళ్లు క్షణాల్లా గడిచిపోయాయి. ‘ఆయన’ అడిగిన ఒకే ఒక్క కోరిక తీర్చడంలో భాగంగా ఆరుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మగబిడ్డ కావాలనే ఆశ తీరకుండానే ఆ ఇంటి పెద్దదిక్కు కష్టాల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరై కాలం చేశాడు. ఏడాది కాలంగా ఆమె ఎదుర్కొంటున్న కష్టాలను చూస్తే కన్నీళ్లకే కన్నీళ్లొస్తాయి. గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన హనుమంతు భార్య రామక్క దీనగాథను ‘సాక్షి’ అక్షరీకరించింది. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ చేసి ఆమె వివరాలు సేకరించారు. కొందరు పత్రికలో ప్రచురితమైన ఆమె బ్యాంకు ఖాతా వివరాలు చూసి రూ. 40వేల నగదు సహాయం చేశారు. మరికొందరు స్వయంగా పరామర్శించి సాయమందించారు. వైఎస్సార్సీపీ అనంతపురం ఎంపీ అభ్యర్థి తలారి పీడీ రంగయ్య.. రాయదుర్గం, శింగనమల నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఎస్ఆర్ఐటీ అధినేత ఆలూరి సాంబశివారెడ్డి.. జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, రాయదుర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్రరెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు, మునిరత్నం ట్రావెల్స్ యజమాని శ్రీనివాసులు తదితరులు రామక్క కష్టాలపై ఆరా తీశారు. ఒకటి రెండు రోజుల్లో స్వయంగా కలిసి కష్టాల నుంచి గట్టెక్కిస్తామని భరోసానిచ్చారు. ‘సాక్షి’ రుణం తీర్చుకోలేనిది.. ఏడాది కాలంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నా. కూలి దొరికితే తప్ప పిల్లల కడుపు నింపలేని పరిస్థితి. ఎవరినీ నోరు తెరిచి అడగలేక నాలో నేను కుమిలిపోయేదాన్ని. ‘సాక్షి’ కథనం నాకు కొండంత అండగా నిలుస్తోంది. బంధుత్వం లేకపోయినా, ఎంతో మంది నాకు ధైర్యం చెబుతుండటం చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు. ‘సాక్షి’ రుణం తీర్చుకోలేనిది. – రామక్క బ్యాంకు ఖాతా వివరాలు పేరు: రామక్క మాదిగ ఊరు: కలుగోడు గ్రామం, గుమ్మఘట్ట మండలం బ్యాంక్ అకౌంట్ నెం. : 91029588843, ఏపీజీబీ గుమ్మఘట్ట బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్ :ఏపీజీబీ 0001018 -
ఆరుగురు కంటిపాపల ఆడ..బిడ్డ రామక్క
ఆమె పేరులో రాముడు.. ఆ తల్లి జీవితంలో ఆయనను మించిన కష్టాలు.పురుషోత్తమునికి పద్నాలుగేళ్ల వనవాసం..ఈ ఇల్లాలి జీవితమే కష్టాల సుడిగుండం.వారసుడు కావాలనే భర్త కోరికనిత్య ప్రసవ వేదనను మిగిల్చింది. ఆరుగురు ఆడ..బిడ్డల జన్మకు కారణమైంది. ‘ఆయన’ ఉన్నాడనే ధైర్యంతో..కన్నీళ్లను దిగమింగింది.ఈ ప్రయాణం ఎంతోదూరం సాగకనే..ఆ ‘తోడు’ ఒంటరిని చేసింది.కష్టాలకు ఎదురొడ్డి నిలవలేని భర్తలోకం వీడగా..కంటి పాపల తోడుగా ఆమె..ఒంటరి పోరాటం చేస్తోంది. అనంతపురం, గుమ్మఘట్ట : నాపేరు హెచ్.రామక్క. బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తికి చెందిన సవారప్పగారి కొల్లప్ప, రామాంజినమ్మలకు నేను రెండో సంతానం. 6వ తరగతి వరకు చదువుకున్నా. పదమూడేళ్ల కిందట గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన హరిజన హనుమంతుతో వివాహమైంది. అప్పటికి నా వయస్సు 18 ఏళ్లు. మొదట ఒక బాబు, పాప చాలని అనుకున్నాం. పెళ్లయిన ఏడాదిన్నరకే మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది. లక్ష్మీదేవి అని అందరూ సంతోషించారు. ఆ తర్వాత మళ్లీ పాపే. మూడో కాన్పులో కచ్చితంగా కొడుకు పుడతాడని అందరూ చెప్పడంతో మరో కాన్పుకు సిద్ధపడగా అప్పుడూ ఆడపిల్లే. ఇక చాలని.. వీళ్లనే బాగా చూసుకుందామని నెత్తీనోరు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. ‘తాతకు మా నాన్న ఒక్కడే.. మా నాన్నకు నేను ఒక్కడినే. వారసత్వం నాతోనే ఆగిపోతే ఎలా? నాకు కొడుకు కావాల్సిందే’ అని ఆయన పోరు పెట్టాడు. అలా నాలుగో కాన్పులోనూ ఆడబిడ్డే. అప్పటికి ససేమిరా అనడంతో మరో కాన్పుకు వెళ్లగా మళ్లీ అమ్మాయే. ఇక ఆపరేషన్ చేయించుకుంటానని కాళ్లావేళ్లా పడినా.. ఐదుగురి తర్వాత పుట్టేది మగబిడ్డేనని శాస్త్రాలు కూడా చెబుతున్నాయంటూ నమ్మబలికారు. చివరకు ఆరో కాన్పులోనూ ఆడపిల్లే కలిగింది. చిన్న కుటుంబంతో జీవితాన్ని సాఫీగా గడుపుదామని అనుకుంటే.. గంపెడు పిల్లలతో పోషణ భారమైంది. విధి వెన్నుపోటు ఉన్నంతలో మా ఆయన ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. స్థానికంగా పనుల్లేక మా అత్త లక్ష్మీదేవిని ఇంటి వద్ద తోడుగా పెట్టి బెంగళూరు, మంగళూరు, తుమకూరు, దావణగెర తదితర పట్టణాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. నెలకు రూ.12వేల నుంచి రూ.14 వేల వరకు వచ్చేది. సంసారం ఇలా సాగిపోతుండగా.. బెంగళూరులో కూలి పనులు చేస్తున్న సమయంలో ఆయనపై సిమెంట్ బస్తాలు మీద పడటంతో నడుము దెబ్బతినింది. ఏడాది పాటు మంచం దిగకూడదని వైద్యులుసలహా ఇవ్వడంతో కుమిలిపోయాడు. ఆ సమయంలో కుటుంబ పోషణ భారమైంది. పిల్లల ఆకలి బాధ చూసి ఆయన కలత చెందాడు. దిక్కుతోచని స్థితిలో 2018 జనవరి 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిద్రలేని రాత్రులు వరుస ప్రసవాలతో అనారోగ్యం పాలయ్యాను. ఇదే సమయంలో భర్త మరణించడంతో దిక్కులేని దాన్నయ్యా. ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా లేవు. బాడుగ ఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వ ఇల్లు మంజూరైనా నిర్మాణ దశలోనే ఆయన మమ్మల్ని వదిలేసి పోయాడు. ఆ తర్వాత సిమెంట్ బస్తా కూడా కొనలేని పరిస్థితి మాది. ఇప్పటికి ఏడాది అవుతోంది. ఆ ఇంటిని అలా వదిలేశాం. బిడ్డల దీనావస్థను తలుచుకొని గడిపిన నిద్రలేని రాత్రిళ్లు ఎన్నో. ఆరుగురూ ఆడపిల్లలే కావడంతో మా జీవితం ఏమవుతుందో తెలియట్లేదు. కూలీ పనులకు వెళ్తూ.. నేను పస్తులుంటూ పిల్లల కడుపు నింపుతున్నా. కూలీ దొరకని రోజుల్లో చుట్టుపక్క ఇళ్లలో బియ్యంలో రాళ్లు ఏరడం, నూకలు నేమడం ఇతరత్రా చిన్నాచితక పనులు చేస్తూ కాలం గడుపుతున్నా. రోజంతా కష్టపడినా రూ.150లు కూడా రాదు. మా అమ్మానాన్న కూడా నిరుపేదలే. వాళ్లను ఇబ్బంది పెట్టలేక నా జీవితం నేను నెట్టుకొస్తున్నా. తోడుగా పెద్ద కూతురు పిల్లల పోషణ భారం కావడంతో అనాథ ఆశ్రమంలో చేర్పిద్దామని తెలిసిన వాళ్లతో మాట్లాడినా. ఈ విషయాన్ని బిడ్డలతో చర్చిస్తే ఆకలినైనా భరిస్తాం కానీ, నిన్ను వదిలి వెళ్లమని ఒకటే ఏడుపు. వాళ్ల కన్నీళ్లు నాలో మరో ఆలోచన లేకుండా చేశాయి. కలుగోడు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విజయ 8వ తరగతి, శ్రీలక్ష్మి 5వ తరగతి, అను 3వ తరగతి, బేబి 2వ తరగతి చదువుతున్నారు. అవంతిక(6), స్రవంతిక(2) ఇంటి వద్దే ఉంటారు. పెద్ద పాపకు బీటీపీ వద్దనున్న కేజీబీవీలో సీటు వచ్చింది. ఇంటి వద్ద కష్టాన్ని చూసి తట్టుకోలేక నాతోనే ఉంటానని అవకాశాన్ని వదలుకుంది. ఇప్పుడు నాకు కాస్త చేదోడువాదోడుగా ఉంటోంది. ఓ దారి చూపండి పింఛను తప్పితే మరో ఆసరా లేదు. నా భర్త చేసినా, నేను చేసినా గంపెడు పిల్లలు కనడం తప్పే. ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు. పిల్లల జీవితం గాడిన పడితే అదే పదివేలు. వాళ్లకు మంచి బట్టలు కావాల, మిద్దెలు ఉండాలని అనుకోవట్లేదు. పూటకు ముద్ద అన్నం దొరికి, చదువు చెప్పించగలిగితే చాలనుకుంటున్నా. నా ప్రయత్నానికి సహకరించి దారి చూపాలని వేడుకుంటున్నా. పేరు : హెచ్.రామక్క ఊరు : కలుగోడు, గుమ్మఘట్ట మండలం బ్యాంకు అకౌంట్ : 91029588843,ఏపీజీబీ, గుమ్మఘట్ట ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఏపీజీబీ 00010118 -
ఎంపీ అండతో తెలుగు తమ్ముడి వీరంగం
పశ్చిమగోదావరి, నరసాపురం: తెలుగుదేశం ప్రజాప్రతినిధుల అండతో రాష్ట్ర మంతటా తెలుగు తమ్ముళ్లు అనేక ఆగడాలు చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా జంగారెడ్డిగూడెంలో ఓ ఒంటరి మహిళ ఆస్తిని కాజేయడమే కాకుండా ఆమెను కొడుతూ దౌర్జన్యం చేస్తున్నాడు ఓ తెలుగుదేశం చోటా నాయకుడు. వరుసకు అత్త అని కూడా చూడకుండా ఎకరాల కొద్దీ ఆస్తి ఉన్నా ఆమెను రోడ్డుపై పడేశాడు. ఎంపీ మాగంటి బాబు అండ ఉండటంతో పోలీసులు కనీసం అతనిపై కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో ఆమె మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. మంగళవారం నరసాపురంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేసింది. మహిళా కమిషన్ తరఫున చర్యలు తీసుకుంటామని రాజ్యలక్ష్మి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన ఆండ్రు సీతారామయ్యకు అదే ప్రాంతానికి చెందిన భూలక్ష్మితో 1974లో వివాహమైంది. అయితే వీరికి సంతానం లేకపోవడంతో సీతారామయ్య తన సోదరుడు కుమార్తె కనకదుర్గను పెంచుకుని, జంగారెడ్డిగూడెంకు చెందిన నందిని సతీష్‌తో వివాహం చేశాడు. అధికారికంగా కనకదుర్గను దత్తత తీసుకోనప్పటికీ ఆమెకు వివాహం చేయడంతో పాటు, వాటాగా కొంత ఆస్తి ముట్టజెప్పాడు. పెచ్చుమీరిన సతీష్ ఆగడాలు 2015లో సీతారామయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే సీతారామయ్య 2010లోనే రిజిస్టర్ వీలునామా రాశాడు. తను పెంచుకున్న కుమార్తెకు అంతా సెటిల్ చేశానని, ప్రస్తుతం ఉన్న ఆస్తి తన భార్యకు చెందుతుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం భూలక్ష్మి పేరుపై 18 ఎకరాల భూమి, ఫ్లాట్, ఇన్నోవా కారు ఉన్నాయి. అయితే వాటిని సతీష్ స్వాధీనం చేసుకుని వేధిస్తున్నాడని భూలక్ష్మి పేర్కొంది. నెలకు రూ.3 వేలు ఇస్తాను అని చెబుతున్నాడని, అదేంటని అడిగితే కొడుతున్నాడని ఫిర్యాదు చేసింది. ఎంపీ మాగంటి బాబు చెప్పడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయడం లేదంది. ఎస్పీ, డీఎస్పీ, జిల్లా కలెక్టర్ వద్దకు కూడా తిరిగినా ప్రయోజనం లేకపోయిందని వాపోయింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని మహిళా కమిషన్ సభ్యురాలకు వివరించింది. ఫిర్యాదుపై రాజ్యలక్ష్మి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ భూలక్ష్మికి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ అంశంపై మహిళా కమిషన్ అవసరమైన చర్యలు చేపడుతుందని వివరించారు. భూలక్ష్మి మాట్లాడుతూ పొలాల మీద సొసైటీల్లో అప్పులు అన్నీ తనపేరుమీదే ఉన్నాయని చెప్పింది. అప్పులు తీర్చుకోవడానికి కొంత పొలం అమ్ముకుందామన్నా, దౌర్జన్యం చేయిస్తున్నాడని వాపోయింది. 55 ఏళ్ల వయసులో తనను హింసిస్తున్నారని చెప్పింది. -
పెళ్లి వద్దన్నందుకు వితంతువుపై యాసిడ్ దాడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: భర్త మరణించగా ఇద్దరు పిల్లలతో ఒంటిచేతిపై జీవితాన్ని నెట్టుకొస్తున్న వితంతువుకు అండగా నిలిచాడు. ప్రేమ, పెళ్లి అంటూ ఒత్తిడి చేశాడు. నో చెప్పిందన్న కసితో ఆమెపై ఏకంగా యాసిడ్ కుమ్మరించాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది. కన్యాకుమారి జిల్లా తిరువట్టార్‌కు చెందిన మణికంఠన్ (47), గిరిజ (39) దంపతులకు మహిషమోల్ (14), అక్మిమోల్ (12) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మణికంఠన్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న క్రమంలో గిరిజకు అదే ప్రాంతానికి చెందిన జాన్‌రోస్ (29) అనే భవన నిర్మాణ కార్మికునితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమేణా వివాహేతర సంబంధానికి దారితీసింది. పిల్లలతో ఒంటరిగా ఉన్న గిరిజకు జాన్‌రోస్ అన్నివిధాల అండగా నిలిచేవాడు. అనారోగ్యకారణాలతో మణికంఠన్ తొమ్మిదేళ్ల క్రితం మరణించాడు. ఈ క్రమంలో ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. మనిద్దరం పెళ్లి చేసుకుందామని జాన్‌రోస్ తరచూ గిరిజపై ఒత్తిడితెచ్చేవాడు. అయితే తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నందున రెండో వివాహం ఇష్టం లేదని ఆమె నిరాకరించింది. ఇందుకు కోపగించుకున్న జాన్‌రోస్ గత ఏడాది ఏప్రిల్‌లో గిరిజపై తీవ్రంగా దాడిచేయడంతో పోలీసు కేసు పెట్టింది. ఈ కారణంగా గిరిజకు కొన్నాళ్లు దూరంగా ఉన్న జాన్‌రోస్ ఇటీవల మరలా ఇంటికి వస్తూ పెళ్లికి పట్టుబట్టగా ఆమె ససేమిరా అంది. తన ప్రేమను నిరాకరించిందని ఆమెపై కసిపెంచుకున్న జాన్‌రోస్ గురువారం రాత్రి 7.30 గంటలకు గిరిజ ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావనతేగా ఆమె బైటకు గెంటివేసింది. దీంతో మండిపడిన జాన్‌రోస్ తన వెంటతెచ్చుకున్న యాసిడ్‌ను ముఖం, ఒంటిపై కుమ్మరించాడు. యాసిడ్ బాధను తట్టుకోలేక ఆమె విలవిలలాడుతుండగా పరిసరాల ప్రజలు వచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె రెండుకళ్లు చూపు కోల్పోయినట్లు సమాచారం. కాగా, నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగా అక్కడికి సమీపంలోని ఒక తోటలో విషం తాగి పడి ఉన్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న జాన్‌రోస్ ను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. -
అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. నాలుగు గంటలు మాత్రమే
ముంబై: నేటి తరం ఆలోచనలు కాస్త వింతగానే ఉంటున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ యువకుడు రూపొందించిన యాప్ కూడా అలాంటిందే. భారత్‌లో తొలిసారిగా ‘రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్’ (అద్దెకు స్నేహితుడు) పేరుతో కౌశిక్ ప్రకాశ్ ఈ యాప్‌ను తీసుకువచ్చారు. వినడానికి కాస్త అదోలా ఉన్న.. ఇది మంచి సేవలనే అందజేస్తుందని కౌశిక్ అంటున్నారు. కొన్ని దేశాల్లో ఈ విధానం ఆచరణలో ఉంది. కానీ భారత్‌లో ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగం ఎవరూ చేయలేదు. ఒంటరి జీవితం గడిపే మహిళలకు, ఒత్తిడితో సతమతవుతున్నవారి జీవితాలకు భరోసా ఇచ్చేందుకు ఈ యాప్‌ను తీసుకువచ్చారు. ఇది శృంగారానికి సంబంధించిన యాప్ కాదు. పైగా అందరు పురుషులు ఇందులో సభ్యులుగా చేరలేరు. దీనికోసం కొన్ని పరీక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మాటతీరు, నడవడిక, బాడీ లాంగ్వేజ్, అతని శారీరక, మానసిక స్థితిగతులను పూర్తిగా పరీక్షించిన తరువాతే అతడిని ఎంపిక చేస్తారు. అలాగే ఆ వ్యక్తికి ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. అందుకు సంబంధించిన వివరాలు కూడా ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. సాధారణంగా మహిళలు యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న అద్దెకు స్నేహితులు 3 నుంచి 4 గంటలపాటు వారితో ఉంటుంటారు. వీరికి గంటకు ఇంతా అని చెల్లించాల్సి ఉంటుంది. అద్దెకు వచ్చే స్నేహితుడి ఖర్చు మహిళలే చెల్లించాలి. ఒకవేళ ఎక్కువ సమయం కావాలనుకుంటే ముందుగానే యాప్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. స్నేహితుడిగా ఉండాలనుకున్న వ్యక్తి సదరు మహిళను సంతోషపెట్టే పనులు మాత్రమే చేయాలి.. అంతేకాని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించకూడదు. ఒంటరితనంతో బాధపడుతున్న మహిళలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఒంటరి మహిళలకు ‘సఖి’ అండ
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలోని ఒంటరి మహిళలకు సఖి కార్యక్రమం అండగా నిలుస్తుందని మహిళా, శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి జి.శంకరాచారి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు ‘సఖి’ సేవల గురించి అవగాహన కల్పించారు. ఆడపిల్లలను, యువతులను ఆకతాయిలు, పోకిరీల నుంచి కాపాడడం కోసం సఖీ కేంద్రం పని చేస్తుందని తెలిపారు. ఎవరు వేధింపులకు పాల్పడినా 181కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సఖీ కేంద్రం అధికారి మంజుల, ప్రశాంతి, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వి.రాములుయాదవ్, ఆటోడ్రైవర్లు గోపాల్, ఎండీ మహబూబ్ అలీ, మహేష్‌కుమార్, ఎండీ ఫజిల్, ఎండీ రుక్నోద్దీన్, యాదగిరి, వెంకట్రాములు పాల్గొన్నారు. -
ఒంటరి మహిళలు లక్షన్నర లోపే!
- ఆర్థిక భృతికోసం ముగిసిన దరఖాస్తు గడువు - 50 వేలకు చేరువైన బీడీ కార్మికుల దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఆర్థిక భృతి పథకానికి దరఖాస్తు గడువు ఆదివారంతో ముగిసింది. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈనెల 8 నుంచి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఆదివారం వరకు 1,41,769 మంది ఒంటరి మహిళలు దరఖాస్తులు సమర్పించగా, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు 49 వేలమంది బీడీ కార్మికులు కూడా ఆర్థిక భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటరి మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రతినెలా రూ.వెయ్యి ఆర్థిక భృతిని అందజేస్తామని గత శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆర్థిక భృతి మొత్తాన్ని (రూ.రెండు వేలను) జూన్ 2న లబ్ధిదారు లకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇదిలా ఉంటే.. ఒంటరి మహిళలుగా అర్హత ఉన్నవారు తమకు అభయహస్తం పింఛన్ బదులు ఆర్థ్ధిక భృతిని ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 96 వేలమంది అభయహస్తం పెన్షనర్లు ఉండగా, వీరిలో సుమారు 10వేలమంది దాకా ఒంటరి మహిళలున్నట్లు సమాచారం. రాష్ట్రం లో ఒంటరి మహిళల ఆర్థిక భృతికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు దరఖాస్తులు అందవ చ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అందుకు భిన్నంగా 1,41,769 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. సర్కారు నిర్ణయం మేరకే! ప్రస్తుతం అభయహస్తం పథకం కింద నెలకు రూ.500 చొప్పున పింఛన్ పొందుతున్న వారిలో ఒంటరి మహిళలుగా ఆర్ధిక భృతి (రూ.1,000)ని పొందేందుకు అర్హత ఉన్న వారు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. అభయహస్తం బదులు ఆర్థిక భృతిని ఇచ్చే అంశంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు జూన్ 2న ఆర్థిక భృతిని అందజేస్తాం. – పౌసమి బసు, సెర్ప్ సీఈవో -
వయసు నిర్ధారణకు ఆధార్ ఓకే!
- ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పథకానికి మార్గదర్శకాలు జారీ - ఓటర్ కార్డు, స్కూల్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ ఉన్నా పర్లేదు - జూన్ 2న లబ్ధిదారులకు రెండు నెలల మొత్తం అందజేత సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఎంపిక లో కనీస వయసు నిర్ధారణకు ఆధార్/ఓటర్ కార్డు/స్కూల్ సర్టిఫికెట్/బర్త్ సర్టిఫికెట్ వంటి పత్రాల్లో ఏదో ఒకటి ఉన్నా పర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి కల్పించేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి లబ్ధిదారులకు నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక భృతి లభించనుంది. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రెండు నెలల మొత్తాన్ని ఒంటరి మహిళలకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 8 నుంచి ప్రారంభమై 25కల్లా ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిబంధనలపై పట్టుబట్టేది లేదు ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పథకానికి లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలపై పెద్దగా ఒత్తిడి చేసేది లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం సచివా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. అర్హత లేని వారికి లబ్ధి చేకూర్చిన అధికారులపై కఠిన చర్యలు చేపడతా మన్నారు. అలాగే ఆసరా పథకం కింద మరో 80 వేల మంది బీడీ కార్మికులకు ఆర్థిక భృతి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. గతంలో ఆసరా పింఛన్ పొందుతున్న వారి కుటుంబంలో బీడీ కార్మికులకు పింఛన్ వచ్చేది కాదని, అయితే ఈ నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులి చ్చిందన్నారు. బీడీ కార్మికులకు మే 1 నుంచి ఆర్థిక భృతిని వర్తింపజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన 10 రోజుల్లోగా ఆసరా లబ్ధిదారులకు చేరాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఆసరా పింఛన్లకు ప్రభుత్వం నిధుల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తోం దని విలేకరులు ప్రశ్నించగా.. జాప్యం జరుగు తున్నా నెలనెలా పింఛన్‌ను తప్పకుండా అందజేస్తున్నామన్నారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆర్థిక భృతితో ప్రభుత్వంపై ఏటా రూ.500 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. ఏడాదిపాటు వేరుగా ఉన్నా ఒంటరి మహిళే 18 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు ఏడాదికి పైగా భర్త నుంచి వేరుగా ఉండడం, భర్త వదిలేసి ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో వివాహం చేసుకోని 30 ఏళ్ల పైబడిన వారు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లకు పైగా వయసు కల వారిని ఒంటరి మహిళలుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు లోపు ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. నిబంధనల మేరకు అర్హులైన వారు వ్యక్తిగతంగా గ్రామ పంచాయతీ కార్యదర్శికి/ పట్టణాల్లోనైతే బిల్ కలెక్టర్‌కు/ హైదరాబాద్ పరిధిలో వీఆర్వో లకు దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తుపై తమ ఫోటోను అంటించడంతో పాటు వయసు నిర్ధారణ పత్రం, సేవింగ్స్ బ్యాంక్/పోస్టాఫీసు ఖాతా పుస్తకం, ఆహార భద్రతా కార్డు లేదా తహసీల్దారు జారీ చేసిన వార్షికాదాయ పత్రం జిరాక్స్ ప్రతులను జత చేయాలి. దరఖాస్తులను స్వీకరించిన అధికారులు గ్రామ, వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంటుంది. -
30 ఏళ్లు పైబడితేనే ఒంటరి మహిళలు!
♦ అవివాహితల కనీస వయస్సు నిర్ధారించిన సర్కారు ♦ ఏప్రిల్, మే ఆర్థికభృతి జూన్ 2 నుంచి చెల్లింపు ♦ రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం పథకానికి సంబంధించి అవివాహి తలను ఒంటరి మహిళలుగా పరిగణించేం దుకు కనీస వయస్సు 30 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. అలాగే భర్త వదిలేసిన, భర్త నుంచి వేరుగా ఉంటున్న మహిళల విషయం లో కనీస వయస్సును 18గా నిర్ణయించిన ప్రభుత్వం, ఏడాదికి పైగా వారు విడిగా ఉండాలని స్పష్టం చేసింది. ఆదరువు లేని ఒంటరి మహిళలకు ఆసరా పథకం కింద నెలకు రూ.1,000 ఆర్థిక భృతి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఆర్థికభృతి పథకానికి సంబంధించి ఉత్తర్వులు బుధవారం విడుదల కానున్నాయి. గురువా రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో దరఖాస్తుల స్వీకరణకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థిక భృతి పథకం ఏప్రిల్ 1 నుంచే వర్తింపజేస్తున్నప్పటికీ ఏప్రిల్, మే నెలల్లో అందాల్సిన భృతిని తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి అందజే యాలని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సమయం కావాలని జిల్లా కలెక్టర్లు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తహసీల్దారు ధ్రువీకరణ భర్త నుంచి ఏడాదికి పైగా వేరుగా ఉంటున్న మహిళలను స్థానిక విచారణ ద్వారా తహసీల్దారు ధ్రువీకరించాలి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలె క్టర్లతో దరఖాస్తుల పరిశీలన చేయించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారుల ఎంపికలో సమగ్ర కుటుంబ సర్వే, ఉన్నతి సర్వే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆర్థిక భృతి పొందుతున్న మహిళలు తిరిగి వివాహం చేసుకున్నా, మరణించినా.. సదరు సమాచారాన్ని గ్రామంలోని బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు వెంటనే జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేస్తే ఆర్థిక భృతి నిలిపేస్తారు. ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పంపిణీ ఆసరా పింఛన్లతో పాటే జరుగుతుంది. పథకం అమలుకు సంబంధించిన అంశాలను (సాఫ్ట్వేర్, సిబ్బంది, నిర్వహణ) గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారికి ప్రభుత్వం అప్పగించింది. ఆధార్ ఉంటేనే ఆర్థిక భృతి ఒంటరి మహిళల కేటగిరీలో ఆర్థికభృతికి దర ఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు ఆధార్ నంబ రు తప్పనిసరి కానుంది. వ్యక్తిగత దర ఖాస్తుతో పాటే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, వార్షికాదాయ పత్రం నకళ్లను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. కార్డున్న లబ్ధిదారుల ఆధార్ సంఖ్యను ఆధార్ ఇనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)లో వెంటనే నమోదు చేస్తారు. కార్డులేని వారు ఆధార్ పొందేందుకు స్థానిక అధికారులు సహాయం చేయాలని ప్రభుత్వం సూచించింది. వేలిముద్రలు లేదా ఐరిష్ ఆధారంగానే ఆర్థిక భృతి చెల్లించనున్న నేపథ్యంలో ఆధార్ నంబరు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. -
30 ఏళ్లు నిండి పెళ్లికాని మహిళలు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 30 ఏళ్లకు పైబడిన అవివాహిత ఒంటరి మహిళలు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో 36,659 అవివాహిత ఒంటరి మహిళలు రాజధానిలో ఉన్నట్లు తేలింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవివాహిత ఒంటరి మహిళలకు పెన్షన్ అందజేయాలని భావిస్తున్న నేపథ్యంలో చేపట్టిన ఈ సర్వేలో.. పట్టణ ప్రాంత జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఇలాంటి మహిళలు ఎక్కువగా ఉన్నారని వెల్లడైంది. హైదరాబాద్ తరువాతి స్థానాల్లో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు నిలిచాయి. ఈ పెన్షన్ పథకంలో గ్రామీణ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఎప్రిల్ నుంచి ఈ ప్రారంభించనున్న ఈ పెన్షన్ పథకానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని ఈ నెలాఖరు వరకు నిర్ణయించనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు పెళ్లి కన్నా.. కెరీర్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లు ఈ సర్వే ట్రెండ్స్ చెబుతున్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలు, వరకట్నం తదితర కారణాలతో మహిళలు అవివాహితులుగా ఉంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. జిల్లాల వారిగా ఉన్న 30 ఏళ్లకు పైబడిన అవివాహిత ఒంటరి మహిళల వివరాలు హైదరాబాద్ 36,659 మేడ్చల్ 16,112 రంగారెడ్డి 12,127 మహబూబ్ నగర్ 5,154 నిజామాబాద్ 5,141 వరంగల్ అర్బన్ 4,773 సంగారెడ్డి 4,336 నాగర్ కర్నూల్ 3,992 నల్లగొండ 3,950 యాదాద్రి 3,950 కరీంనగర్ 3,386 జగిత్యాల్ 2,746 పెద్దపల్లి 2,501 కామారెడ్డి 2,476 మంచిర్యాల్ 2,465 అదిలాబాద్ 2,412 సిద్ధిపేట్ 2,337 -
ఒంటరి మహిళలకు రూ. వెయ్యి జీవన భృతి
► సంపాదించే అండలేని నిరుపేద అతివల కోసం సర్కారు కొత్త పథకం ► అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన ► వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభం ► బడ్జెట్లో నిధుల కేటాయింపు ► మేనిఫెస్టోలో లేకున్నా మానవీయ కోణంలో నిర్ణయమని వెల్లడి సాక్షి, హైదరాబాద్: సంపాదించే అండ లేని ఒంటరి పేద మహిళలకు ఆర్థిక చేయూతనం దించే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒంటరి జీవితం గడుపుతున్న పేద మహిళలకు జీవన భృతిగా నెలకు రూ. వెయ్యి చొప్పున అందించాలని నిర్ణ యించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పథకం ప్రారంభమ వుతుందని, మార్చిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో పథకానికి నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది ఒంటరి మహిళలు ఉంటారన్న ప్రాథమిక అంచనా ఉందని, త్వరలో పూర్తి వివరాలు సేకరించి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించనప్పటికీ ఖజానాపై పడే భారాన్ని కూడా లెక్క చేయకుండా మానవీయ కోణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వివిధ వర్గాలకు లబ్ధి కలుగుతున్నప్పటికీ సంపాదన అండ లేని ఒంటరి మహిళలు తీవ్ర దుర్భర పరిస్థితులను గడుపుతున్నందున వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలన్న సూచ నలు అందిన దృష్ట్యా ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు సీఎం తెలిపారు. ‘‘రాజకీయ పార్టీలు చాలా వరకు మేనిఫెస్టోలోని అంశాల అమలుకే పరిమితమవుతాయి. కానీ మా ప్రభుత్వం పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టికి వచ్చిన వెంటనే మేనిఫెస్టోతో సంబంధం లేకుండా వాటి పరిష్కారం కోసం పనిచేస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నం. బీడీలు చుట్టి శ్రమిస్తున్నా కుటుంబానికి సరిపడా ఆదాయం పొందలేక ఇబ్బందులు పడుతున్న బీడీ కార్మికులకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి ప్రకటించినం. పేద కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేక కష్టపడుతుండటంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టినం. ఆ తరహాలోనే ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రకటించకున్నా ఒంటరి మహిళలను ఆదుకోవాలని నిర్ణయించినం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముందుగా అంచనా వేసుకుని సాధ్యాసాధ్యాలు గుర్తించి నిర్ణయం తీసుకోవాలనుకున్నం. కానీ పురుషులకన్నా పేదరికం మహిళలనే ఎక్కువగా వేధిస్తుంది. నిస్సహాయులైన ఒంటరి మహిళలకు నెలకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి చెల్లించి వారిని ఆదుకోవాలని నిర్ణయించినం. వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తున్నం. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు కేటాయిస్తం’’అని సీఎం ప్రకటించారు. వెంటనే వివరాల నమోదు ప్రారంభం... వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నందున అర్హులైన వారి వివరాలను వెంటనే నమోదు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఒంటరి మహిళలు వారి పేర్లను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అర్హులైన వారికి లబ్ధి కలిగేలా చూడాలని కేసీఆర్ సూచించారు. -
ఒంటరి మహిళలకు పెన్షన్: కేసీఆర్
-
ఒంటరి స్త్రీలకూ ‘ఆసరా’!
నేడు అసెంబ్లీలో సీఎం ప్రకటించే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒంటరి స్త్రీలకు కూడా ‘ఆసరా’పథకం కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శాసనసభలో విధానపరమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎటువంటి ఆదరణకు నోచుకోని జోగినులు, విడాకులు పొందిన వారు, పెళ్లికాని మహిళలు.. ఒంటరి స్త్రీల కేటగిరీలోకి వస్తారు. ఇటువంటి వారికి ఆసరా పథకాన్ని వర్తింపజేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నందున, గత కొన్ని నెలలుగా కసరత్తు చేసిన అనంతరం ప్రభుత్వం సాను కూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు ఒంటరి స్త్రీలు సుమారు 4లక్షల మంది వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. వీరందరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందిస్తే, ప్రస్తుతం ఆసరా పథకానికి వెచ్చిస్తున్న రూ.394కోట్లకు తోడు మరో రూ.40కోట్ల భారం పడనుందని అధికారులు లెక్కలు తేల్చారు. -
ఒంటరిగా ఉన్న మహిళలే వారి టార్గెట్
బంగారు గొలుసుల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్టు రూ.3లక్షల విలువైన సొత్తు స్వాధీనం క్రైంసీఐ శ్రీధర్ వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరధిలో ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో బంగారు గొలుసుల దొం గతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను ఆరెస్టు చేసినట్లు సీసీఎస్ సీఐ కె.శ్రీధర్ తెలిపారు. ఈసందర్భంగా నిందితుల నుంచి సుమారు రూ. మూడు లక్షల విలువైన 48గ్రాముల బంగారు అభరణాలు, నాలుగు మొబైల్ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం తో పాటు రూ.14వేల నగదును స్వా ధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల్లో గీసుకొండ మండ లం శాయంపేట గ్రామానికి చెందిన కోటగిరి సునీల్, ఆత్మకూరు మండ లం దుర్గంపేట గ్రామానికి చెందిన మేకల రాజు, మల్కపేట గ్రామానికి చెందిన మేకల మహేష్‌గా గుర్తించి నట్లు తెలిపారు. వ్యసనాలకు బానిసై.. వ్యసనాలకు బానిసైన సునీల్ గత ఏడాది మొబైల్ ఫోన్లు చోరీ చేసిన కేసులో ఇంతేజార్గంజ్ పోలీస్‌లకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈఏడాది మే నెలలో విడుదలైన సునీల్ కేయూ పరిధిలో సెల్ఫోన్లు దొంగతనం చేసి పోలీసులకు చిక్కగా మళ్లీ జైలు పాల య్యాడని తెలిపారు. ఈసారి జైలు నుంచి విడుదలైన సునీల్ సమీప బంధువులైన మేకల రాజు, మహేష్‌లతో ఒక ముఠాగా ఏర్పడి నగరంలో మూడు చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. ఎర్రగట్టుగుట్ట, వరంగల్ వాసవీకాలనీ తదితర ప్రాం తాల్లో జరిగిన దొంగతనాల్లో ఈ ము గ్గురు పాల్పడినట్లు సీఐ తెలిపారు. దొంగిలించిన బంగారు అభరణాలను అమ్మేందుకు ద్విచక్ర వాహనంపై వరంగల్ చౌరస్తాకు వస్తుండగా ఏసీపీ ఈశ్వర్రావుకు సమాచారం అందింది. ఆయన అదేశాల మేరకు నిందితులను పట్టుకున్నట్లు శ్రీధర్ వెల్లడిం చారు. నిందితులను పట్టుకున్న పోలీసులు, అధికారులను సీపీ సుధీర్‌భాబు అభినందించారు.