ఒంటరి మహిళలకు పెన్షన్‌: కేసీఆర్‌ | CM KCR Announce Pension For Single Women | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 6 2017 12:06 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడి నిస్సహాయులైన(ఒంటరిగా ఉన్న) మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్‌ శాసనసభలో తెలిపారు. వారికి ప్రభత్వం నుంచి రూ.1000 పెన్షన్‌ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఈ పథకం అమలులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఇలాంటివారు సుమారు 3 లక్షల మంది ఉన్నట్లు అంచనా ఉందన్నారు. ఒంటరి మహిళలు స్థానిక అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సంక్షేమ రంగానికి పెద్ద పీట వేశామంటూ రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువ నిధులు సంక్షేమ రంగానికి కేటాయించామన్నారు. మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా పరిష్కరించామన్నారు. బీడీ కార్మికులకు నెలనెలా రూ.వెయ్యి జీవభృతి అందిస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement