- బంగారు గొలుసుల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్టు
- రూ.3లక్షల విలువైన సొత్తు స్వాధీనం
- క్రైంసీఐ శ్రీధర్
ఒంటరిగా ఉన్న మహిళలే వారి టార్గెట్
Published Sun, Aug 28 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరధిలో ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో బంగారు గొలుసుల దొం గతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను ఆరెస్టు చేసినట్లు సీసీఎస్ సీఐ కె.శ్రీధర్ తెలిపారు. ఈసందర్భంగా నిందితుల నుంచి సుమారు రూ. మూడు లక్షల విలువైన 48గ్రాముల బంగారు అభరణాలు, నాలుగు మొబైల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం తో పాటు రూ.14వేల నగదును స్వా ధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల్లో గీసుకొండ మండ లం శాయంపేట గ్రామానికి చెందిన కోటగిరి సునీల్, ఆత్మకూరు మండ లం దుర్గంపేట గ్రామానికి చెందిన మేకల రాజు, మల్కపేట గ్రామానికి చెందిన మేకల మహేష్‌గా గుర్తించి నట్లు తెలిపారు.
వ్యసనాలకు బానిసై..
వ్యసనాలకు బానిసైన సునీల్ గత ఏడాది మొబైల్ ఫోన్లు చోరీ చేసిన కేసులో ఇంతేజార్‌గంజ్ పోలీస్‌లకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈఏడాది మే నెలలో విడుదలైన సునీల్ కేయూ పరిధిలో సెల్‌ఫోన్లు దొంగతనం చేసి పోలీసులకు చిక్కగా మళ్లీ జైలు పాల య్యాడని తెలిపారు. ఈసారి జైలు నుంచి విడుదలైన సునీల్ సమీప బంధువులైన మేకల రాజు, మహేష్‌లతో ఒక ముఠాగా ఏర్పడి నగరంలో మూడు చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. ఎర్రగట్టుగుట్ట, వరంగల్ వాసవీకాలనీ తదితర ప్రాం తాల్లో జరిగిన దొంగతనాల్లో ఈ ము గ్గురు పాల్పడినట్లు సీఐ తెలిపారు. దొంగిలించిన బంగారు అభరణాలను అమ్మేందుకు ద్విచక్ర వాహనంపై వరంగల్ చౌరస్తాకు వస్తుండగా ఏసీపీ ఈశ్వర్‌రావుకు సమాచారం అందింది. ఆయన అదేశాల మేరకు నిందితులను పట్టుకున్నట్లు శ్రీధర్ వెల్లడిం చారు. నిందితులను పట్టుకున్న పోలీసులు, అధికారులను సీపీ సుధీర్‌భాబు అభినందించారు.
Advertisement
Advertisement