చైనాకు చెందిన స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ రియల్‌మీ(Realme) వినూత్న ఉత్పత్తుల డిజైన్, విస్తృత శ్రేణి, రిటైల్ విస్తరణతో 2025లో భారతీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో 18 శాతం వాటా(market share)ను అందుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం ఉత్పత్తుల మెరుగైన పనితీరు, అత్యుత్తమ డిజైన్, మధ్య నుంచి అధిక–శ్రేణి ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని వెల్లడించింది.
కంపెనీకి భారత్ అతిపెద్ద విపణిగా ఉంది. 2024లో దేశీయ స్మార్ట్‌ఫోన్ విపణిలో రియల్‌మీ 12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. వచ్చే ఏడాది మార్కెట్ వాటాలో 50 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్, సీఎంవో చేస్ షూ వెల్లడించారు. 2025 ప్రారంభంలో విడుదల కానున్న రియల్‌మీ 14 ప్రో డిజైన్(Design)ను ఆవిష్కరించిన సందర్భంగా చేస్ మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి: మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?
ఆఫ్‌లైన్ కోసం ప్రత్యేకంగా..
భారత్‌లో కంపెనీ తీవ్ర పోటీని ఎదుర్కొంది. కానీ చాలా మంచి ఫలితాలతో 2024 ముగించాం అని చేస్ వివరించారు. ‘ధర సున్నిత అంశమైన భారతీయ మార్కెట్‌లో అమ్మకాలను పెంచడానికి ప్రధాన ఈ–కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాం. 2025లో ఫ్లిప్‌కార్ట్‌లో నంబర్ వన్‌గా, అమెజాన్ వేదికగా మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. యువ కస్టమర్లను ఆకట్టుకునేలా మరిన్ని కలర్ ఆప్షన్స్‌తో భారత్ కోసం ప్రత్యేక డిజైన్స్ తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఆఫ్‌లైన్ నెట్‌వర్క్, సర్వీస్ సెంటర్లను విస్తరిస్తాం. మార్కెట్ వాటాను పెంచడానికి ఆఫ్‌లైన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా మోడళ్లను తీసుకొస్తాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment