target
-
క్రికెట్ యాడ్స్ ద్వారా రూ.6,000 కోట్లు టార్గెట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ 2025 ద్వారా రూ.6,000 కోట్ల వరకు ప్రకటనల ఆదాయాన్ని ఆర్జించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా పార్ట్నర్ జియో స్టార్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రూ.1,500 కోట్లు, ఐపీఎల్ నుంచి రూ.4,500 కోట్లు సంపాదించాలని యోచిస్తోంది.ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాధాన్యతకంపెనీ నిర్ణయించుకున్న టార్గెట్ చేరుకోవడానికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జియో స్టార్ ఇప్పటికే వివరణాత్మక ప్రకటన రేటు కార్డులను విడుదల చేసింది. ఐపీఎల్ ప్రకటన రేట్ల కోసం త్వరలో చర్చలు జరుగుతాయని కంపెనీ తెలిపింది. జియో స్టార్ యాడ్ సేల్స్ టీమ్ ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్వెంటరీకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రకటనదారులతో ఒప్పందాలను పొందేందుకు పని చేస్తున్నట్లు పేర్కొంది.ఆఫర్ చేస్తున్న ధరలు ఇలా..ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు, ఐపీఎల్ 2025 మార్చి 23 నుంచి మే 25 వరకు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జియో స్టార్ కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్షిప్ కోసం రూ.55 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్షిప్ కోసం రూ.44 కోట్లు, పార్ట్నర్ స్పాన్సర్ల నుంచి రూ.28 కోట్లు కోరుతోంది. భారత్ మ్యాచ్‌లకు టీవీ స్పాట్ రేట్ 10 సెకన్లకు రూ.28 లక్షలుగా నిర్ణయించారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో జియో స్టార్ కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్ల నుంచి రూ.55 కోట్లు, పవర్ బై స్పాన్సర్ల నుంచి రూ.45 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్ల నుంచి రూ.25 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులుఆచితూచి వ్యవహరిస్తున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలుయాడ్ మార్కెట్లో ప్రస్తుతం కొంత మందగమనం ఉన్నప్పటికీ, తన ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంపై జియో స్టార్ ఆశాజనకంగా ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్స్ వంటి రంగాలు వృద్ధి అవకాశాలను చూపిస్తున్నాయి. దాంతో ఆయా కంపెనీలు యాడ్ల కోసం ఖర్చు చేస్తాయని జియో స్టార్ భావిస్తుంది. అయితే భారీగా టీవీ ప్రకటనలకు దోహదం చేసే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఈ విభాగంలో చేసే ఖర్చులపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. స్టార్ ఇండియా, వయాకామ్ 18ల విలీనం వల్ల జియో స్టార్ యాడ్ మార్కెట్ పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
వర్రా రవీందర్ కేసులో నిందితుల లిస్ట్ ని పెంచేస్తున్న పోలీసులు
-
భారత్‌లో భారీ వృద్ధి లక్ష్యం
చైనాకు చెందిన స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ రియల్మీ(Realme) వినూత్న ఉత్పత్తుల డిజైన్, విస్తృత శ్రేణి, రిటైల్ విస్తరణతో 2025లో భారతీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో 18 శాతం వాటా(market share)ను అందుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం ఉత్పత్తుల మెరుగైన పనితీరు, అత్యుత్తమ డిజైన్, మధ్య నుంచి అధిక–శ్రేణి ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని వెల్లడించింది.కంపెనీకి భారత్ అతిపెద్ద విపణిగా ఉంది. 2024లో దేశీయ స్మార్ట్‌ఫోన్ విపణిలో రియల్మీ 12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. వచ్చే ఏడాది మార్కెట్ వాటాలో 50 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని రియల్మీ వైస్ ప్రెసిడెంట్, సీఎంవో చేస్ షూ వెల్లడించారు. 2025 ప్రారంభంలో విడుదల కానున్న రియల్మీ 14 ప్రో డిజైన్(Design)ను ఆవిష్కరించిన సందర్భంగా చేస్ మీడియాతో మాట్లాడారు.ఇదీ చదవండి: మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?ఆఫ్‌లైన్ కోసం ప్రత్యేకంగా..భారత్‌లో కంపెనీ తీవ్ర పోటీని ఎదుర్కొంది. కానీ చాలా మంచి ఫలితాలతో 2024 ముగించాం అని చేస్ వివరించారు. ‘ధర సున్నిత అంశమైన భారతీయ మార్కెట్లో అమ్మకాలను పెంచడానికి ప్రధాన ఈ–కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాం. 2025లో ఫ్లిప్‌కార్ట్‌లో నంబర్ వన్‌గా, అమెజాన్ వేదికగా మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. యువ కస్టమర్లను ఆకట్టుకునేలా మరిన్ని కలర్ ఆప్షన్స్‌తో భారత్ కోసం ప్రత్యేక డిజైన్స్ తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఆఫ్‌లైన్ నెట్వర్క్, సర్వీస్ సెంటర్లను విస్తరిస్తాం. మార్కెట్ వాటాను పెంచడానికి ఆఫ్‌లైన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా మోడళ్లను తీసుకొస్తాం’ అని వివరించారు. -
వైపస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలే టార్గెట్.. కుట్ర వెనుక ముఖ్య నేత..
-
అన్నపై ద్వేషం?.. జగన్ ను ఎదుర్కోవడానికి శత్రువుల చేతికి షర్మిల ఆయుధాలు ఇచ్చినట్టేనా?
-
బాబు కుట్ర బాణం.. సొంత అన్న టార్గెట్ గా షర్మిల అడుగులు
-
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. యూపీ కార్మికునికి తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈసారి పుల్వామాలో ఉగ్రవాదులు కాశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆర్మీ అధికారులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గల ట్రాల్ ప్రాంతంలో గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికునిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రీతమ్ సింగ్‌ను ఆర్మీ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత వారం రోజులుగా కశ్మీర్లో స్థానికేతర కార్మికులపై దాడులు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గందర్‌బాల్‌లోని శ్రీనగర్-లేహ్ హైవేపై సోనామార్గ్ సమీపంలోని గగాంగిర్ ప్రాంతంలో టన్నెల్ నిర్మిస్తున్న కంపెనీకి చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక వైద్యునితో సహా ఆరుగురు కార్మికులు మృతిచెందారు.మరణించిన కార్మికులలో కశ్మీరీలతోపాటు కశ్మీరేతరులు ఉన్నారు. కశ్మీర్లో వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు ఇక్కడి ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లకు చెందిన కార్మికులు కశ్మీర్‌లోని యాపిల్ తోటలు, పలు నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్టులలో పనులు చేస్తున్నారు. 2021లో కూడా వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ కశ్మీర్లో ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: బాలికపై లైంగిక వేధింపులు.. మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత -
టార్గెట్ నెతన్యాహూ!
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా డ్రోన్ల దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. మధ్యధర సముద్ర తీర ప్రాంతంలోని కెసారియా పట్టణంలో ఉన్న నెతన్యాహూ ఇంటిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం లెబనాన్ భూభాగం నుంచి డ్రోన్లు దూసుకొచ్చినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. వాటిని తమ సైన్యం కూల్చేసినట్లు ప్రకటించింది. ఆ సమయంలో నెతన్యాహూ, ఆయన భార్య ఇంట్లో లేరని పేర్కొంది. లెబనాన్ సరిహద్దు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెతన్యాహూ నివాసంపైకి డ్రోన్లు దూసుకొస్తుండగా ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగాయి. దాంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పదుల సంఖ్యలో డ్రోన్లను కూల్చేసినట్టు సైన్యం తెలియజేసింది. డ్రోన్ల శకలాలు తగిలి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడని, 13 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ మెడికల్ సరీ్వసు అధికారులు చెప్పారు. అయితే ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థకు అందకుండా అతి తక్కువ ఎత్తులో వచ్చిన ఒక డ్రోన్ నెతన్యాహూ నివాసాన్ని ఢీకొన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో అది ఇజ్రాయెల్ హెలికాప్టర్‌కు అతి సమీపం నుంచి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇటీవల హెజ్బొల్లా, హమాస్ అధినేతలు మరణించడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా మిలిటెంట్లు నెతన్యాహూను లక్ష్యం చేసుకొని డ్రోన్ దాడులకు ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. మాది ఉనికి పోరు: నెతన్యాహు హమాస్‌తో యుద్ధాన్ని గెలిచి తీరతామని నెతన్యాహూ ప్రకటించారు. తన నివాసంపై దాడి అనంతరం ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇజ్రాయెలీలను ఉద్దేశించి ఇంగ్లిష్, హీబ్రూ భాషల్లో మాట్లాడారు. ‘‘ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా హమాస్‌ను తుడిచిపెట్టకుండా నన్ను ఆపలేరు’’ అని తన నివాసంపై దాడులనుద్దేశించి స్పష్టం చేశారు. లక్ష్యసాధనలో ఇజ్రాయెల్ సైనిక దళాలు అద్భుత ప్రగతి కనబరుస్తున్నాయంటూ ప్రస్తుతించారు. వారిని చూసి గరి్వస్తున్నట్టు చెప్పారు. ‘‘మా వాళ్లను కిరాతకంగా పొట్టన పెట్టుకోవడం, మా మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, మా చిన్నారులను సజీవంగా బుగ్గి చేయడం వంటి దారుణ అకృత్యాల్లో యాహ్యా సిన్వర్ (హమాస్ చీఫ్)ది కీలకపాత్ర. రెండ్రోజుల క్రితమే అతన్ని మట్టుబెట్టాం. మాది ఉనికి పోరాటం. దీన్ని తుదకంటా కొనసాగిస్తాం. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న ఇతర ఉగ్ర సంస్థలపైనా రాజీలేని పోరు సాగిస్తాం’’ అని ప్రకటించారు. హెజ్బొల్లా అగ్రనేత హతం హెజ్బొల్లా మరో అగ్రనేతను కోల్పోయింది. సంస్థ డిప్యూటీ కమాండర్ నాసర్ రషీద్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ లెబనాన్‌లోని బింట్ బెయిల్ పట్టణంలో శనివారం జరిపిన బాంబు దాడుల్లో అతను మరణించినట్టు వెల్లడించింది.సిన్వర్ లేకపోయినా హమాస్ సజీవం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పష్టికరణ టెహ్రాన్: హమాస్ అధినేత యాహ్వా సిన్వర్ ప్రాణత్యాగం ప్రశంసనీయమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. సిన్వర్ భౌతికంగా లేకపోయినా హమాస్ ఎప్పటికీ ఉంటుందని తేలి్చచెప్పారు. పాలస్తీనా ప్రజల కోసం ఆ సంస్థ పోరాటం సాగిస్తూనే ఉంటుందని తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో బుధవారం సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఖమేనీ తాజాగా స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశారు. సిన్వర్‌ను కోల్పోవడం హమాస్‌కు కొంత నష్టమే అయినప్పటికీ ఆ సంస్థ మనుగడకు ముప్పేమీ లేదని వెల్లడించారు. హమాస్ సజీవంగా ఉందని, ఇకపైనా ఉంటుందన్నారు. పోరాటంలో సిన్వర్ ఒక ధ్రువతార అని ఖమేనీ కొనియాడారు. క్రూరమైన శత్రువుపై అలుపెరుగని పోరాటం సాగించారని, అంకితభావంతో పని చేశారని చెప్పారు. పలు సందర్భాల్లో శత్రువుకు గుణపాఠం చెప్పారని వివరించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై చేసిన దాడి ద్వారా సిన్వర్ చరిత్ర సృష్టించారని, ఘనమైన వారసత్వాన్ని వదిలివెళ్లారని ఉద్ఘాటించారు. -
Bangladesh: హిందూ టీచర్ల బలవంతపు రాజీనామాలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి, హిందూ ఉపాధ్యాయులు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేయవలసి వస్తోంది. నిరసనకారులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చి పలు నినాదాలు చేస్తూ హిందూ ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని కోరుతూ వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపధ్యంలో 50 మంది హిందూ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టారు.బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపిన వివరాల ప్రకారం ఆగష్టు 29న కొందరు విద్యార్థులు బరిషల్లోని బకర్గంజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శుక్లా రాణి హల్డర్ కార్యాలయాన్ని ముట్టడించి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె కొద్దిసేపు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ఖాళీ కాగితంపై నేను రాజీనామా చేస్తున్నాను అని అని రాసి, వారికి ఇచ్చారు.ఆగస్ట్ 18న అజింపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల, కళాశాలకు చెందిన 50 మంది బాలికలు ప్రిన్సిపాల్ గీతాంజలి బారువా, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గౌతమ్ చంద్ర పాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ షహనాజా అక్తర్లను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డైలీ స్టార్ వార్తాపత్రికతో బారువా మాట్లాడుతూ 'ఆగస్టు 18కి ముందు వారు ఎప్పుడూ నా రాజీనామాను అడగలేదు. ఆ రోజు ఉదయం వారు నా కార్యాలయంలోకి చొరబడి నన్ను అవమానించారు’ అని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలలో ఉపాధ్యాయులను విద్యార్థులు చుట్టుముట్టడం, రాజీనామా లేఖలపై బలవంతంగా సంతకం చేయించడం కనిపిస్తుంది.కబీ నజ్రుల్ యూనివర్శిటీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ స్టడీస్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ షంజయ్ కుమార్ ముఖర్జీ మీడియాతో మాట్లాడుతూ తాను డిపార్ట్మెంట్ హెడ్ పదవికి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్ మైనారిటీ హిందువులకు మద్దతుగా మాట్లాడారు. బంగ్లాదేశ్‌లోని ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ఈ అంశంపై స్పందించడం లేదన్నారు. -
కూటమి ప్రభుత్వ కక్ష.. బలవంతంగా రాజీనామా..
-
Pakistan: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో వరుస ఉగ్రదాడులు
పాకిస్తాన్లో వరుస ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. వాయువ్య పాకిస్తాన్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో స్టేషన్ ఇన్ఛార్జ్తో సహా ఇద్దరు పోలీసులు మరణించారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని లక్కీ మార్వాట్ జిల్లాలోగల బర్గాయ్ పోలీస్ స్టేషన్‌పై సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు.మీడియాకు పాక్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఒక పోలీసు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వాయువ్య పాకిస్థాన్‌లో జరిగిన మరో దాడిలో, ఉగ్రవాదులు ఫ్రాంటియర్ కానిస్టేబులరీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని మద్ది ప్రాంతంలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు.ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కి చెందిన ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తమను టార్గెట్ చేశారంటున్న బాధితులు
-
సీఎం యోగిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు?
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశల ఓటింగ్ పూర్తయ్యింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరంతరం విమర్శల దాడులను చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీని పక్కనపెట్టి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సీఎం యోగిని టార్గెట్ చేశారు. జూన్ 4 తర్వాత బీజేపీ సీనియర్ నేతలందరి పాస్‌పోర్ట్‌లను జప్తు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.. ‘వాళ్లంతా పారిపోతారు. రాహుల్ గాంధీ గానీ, భారత కూటమిలోని సభ్యులు గానీ ఎన్నడూ పారిపోరు. దేశానికి అండగా నిలుస్తారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం చేశారు. దేశం కోసం ఏ బీజేపీ నేత అయినా బలిదానం చేశారా? వీళ్లంతా వ్యాపారస్తులు, భయపడతారు. ఆ వ్యాపార వలయంలో చిక్కుకుపోయానని యోగి గ్రహించాలి’ అని నానా పటోలే అన్నారు.అరవింద్ కేజ్రీవాల్ కూడా మీడియా సమావేశంలో సీఎం యోగిపై పలు వ్యాఖ్యానాలు చేశారు. యోగి ఢిల్లీకి వచ్చి తనపై దుర్భాషలాడారని ఆరోపించారు. అయితే ఆయనకు అసలు శత్రువులు బీజేపీలోనే ఉన్నారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎం యోగిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేశారు. యూపీలో పరిస్థితి గందరగోళంగా ఉన్నందున సీఎం యోగి అక్కడే ఉండాలని అన్నారు. యూపీలో పరిస్థితి కనిపించిన దానికి భిన్నంగా ఉందన్నారు.ఉత్తరప్రదేశ్‌లో పదేళ్లుగా అధికారంలో ఉంటూ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో పలు మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే మరోమారు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాపంగానూ ఆయన స్థాయి పెరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం యోగి పేరు ఉంది. ఆయన ఎన్నికల ప్రచారానికి అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బీజేపీ 400 లక్ష్యానికి ఈ 32 సీట్లు కీలకం!
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒకవైపు బీజేపీ మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఇండియా కూటమి.. బీజేపీని ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి గెలిస్తే, వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేసినట్లవుతుంది. నెహ్రూ 1951–52, 1957, 1962లో వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని, అందులో బీజేపీకి కనీసం 370 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ఇప్పటికే నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కమలదళం 2019లో తొలిసారిగా గెలిచిన 32 లోక్‌సభ స్థానాలను తిరిగి గెలుచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కీలకమైన సీట్లలో పశ్చిమ బెంగాల్ నుంచి 16, హర్యానా నుంచి 3, కర్ణాటక నుంచి 3, ఒడిశా నుంచి 3, తెలంగాణ నుంచి 2, త్రిపుర నుంచి 2 సీట్లు ఉన్నాయి. ఒక సీటు అస్సాం నుండి, ఒక సీటు మహారాష్ట్ర నుండి, ఒక సీటు మణిపూర్ నుండి కూడా గెలుచుకోవాల్సివుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారిగా 16 సీట్లు గెలుచుకుంది. అలాగే హర్యానాలోని సిర్సా, హిసార్, రోహ్తక్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదే విధంగా కర్ణాటకలోని చామరాజనగర్, చిక్కబల్లాపూర్, కోలార్ స్థానాలను కూడా గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ మొదటిసారి మూడు స్థానాలను గెలుచుకుంది. 2019లో తొలిసారిగా తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్‌లో పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది త్రిపుర పశ్చిమ, త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ తన ఖాతా తెరవడంలో విజయం సాధించింది. 2019లో తొలిసారిగా అసోంలో బీజేపీ 9 సీట్లు గెలుచుకుంది. 2019లో తొలిసారిగా మహారాష్ట్రలో మాధాలో బీజేపీ విజయం సాధించింది. ఇన్నర్ మణిపూర్ సీటును గెలుచుకోవడం ద్వారా, బీజేపీ 2019లో మొదటిసారి మణిపూర్‌లో తన ఖాతాను తెరిచింది. -
టీఎంసీలో వర్గపోరు.. కీలక నేత రాజీనామా?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో కీలక నేత కునాల్ ఘోష్ రాజీనామా చేశారు. కునాల్‌కు అదే పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. దాని పరిణామం ఇప్పుడు బయటపడింది. మార్చి 10న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మమతా బెనర్జీ మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సన్నాహాలు చేసేందుకు సుదీప్ ఇటీవల కోల్‌కతాలో టీఎంసీ నేతలతో సమావేశమయ్యారు. అయితే దీనికి ఆయన కునాల్ ఘోష్‌ను ఆహ్వానించలేదు. దీంతో కునాల్ ఘోష్.. సుదీప్ పేరు ప్రస్తవించకుండా ట్విట్టర్లో ఆయనపై విమర్శల దాడి చేసారు. ‘ఆ నేత అసమర్థుడు. గ్రూపులను నడిపే నేత, స్వార్థపరుడు. ఏడాది పొడుగునా చిల్లర రాజకీయాలు చేసి, ఎన్నికలకు ముందు ‘దీదీ అభిషేకం’ పేరుతో, పార్టీ కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది. మరెలాంటి ప్రయోజనం ఉండదు’ అని పేర్కొన్నారు. 2017లో రోజ్ వ్యాలీ యజమాని నుంచి రూ.27 లక్షలు తీసుకున్న ఆరోపణలపై సీబీఐ సుదీప్‌ను అరెస్ట్ చేసి భువనేశ్వర్ జైలుకు పంపింది. నెలరోజుల పాటు జైలులో ఉన్నాక అతనికి బెయిల్ వచ్చింది. 2018లో జరిగిన ఈ కుంభకోణంలో ఈడీ రూ.130 కోట్లను స్వాధీనం చేసుకుని, సుదీప్‌ను విచారించింది. కాగా కునాల్ ఘోష్ తన రాజీనామాకు ముందే తన ట్విట్టర్ ప్రొఫైల్ నుండి టీఎంసీ అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ తదితర పోస్ట్‌లను తొలగించి, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అని రాశారు. -
20 దేశాలను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు..? కీలక పత్రాలు లీక్..
చైనాకు చెందిన హ్యాకర్లు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. ఇండియాతోపాటు ఇతర దేశాలకు చెందిన గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని దొంగలించినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. చైనా ప్రభుత్వం మద్దతున్న ఓ హ్యాకింగ్ సంస్థకు చెందిన కీలక పత్రాలు ఇటీవల లీకయ్యాయి. ఆ డాక్యుమెంట్లలో సంచలన విషయాలు బయటపడినట్లు కథనాలు వెలువడ్డాయి. సాఫ్ట్వేర్ లోపాలతో.. విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు అందులో తేలింది. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్‌కు చెందిన సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో లోపాలను ఉపయోగించుకుని ఈ దాడులు చేసినట్లు తెలిసింది. గతవారం గిట్‌హబ్‌లో లీకైన పత్రాలు షాంఘై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసూన్ అనే కంపెనీకి చెందినవని సమాచారం. చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్ పార్టీ హ్యాకింగ్ సేవలు అందిస్తోంది. 20 దేశాలు టార్గెట్.. ఇతర దేశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేలా సైబర్ దాడులకు పూనుకునేలా చైనా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది. భారత్, యూకే, తైవాన్, మలేషియాతోపాటు మొత్తం 20 దేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అందులో ఉంది. అయితే ఈ పత్రాల లీక్‌కు ఎవరు బాధ్యులో కనుగొనేందుకు చైనా పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..? ఏం చేశారంటే.. హ్యాకర్ల నుంచి లీకైన పత్రాల ద్వారా తెలిసిన సమాచరం ప్రకారం కథానాల్లో వెలువడిన వివరాలు ఇలా ఉన్నాయి.. భారత్ నుంచి 100 గిగాబైట్ల(జీబీ) ఇమిగ్రేషన్ డేటాను సేకరించారు. హ్యాకర్లు వివిధ దేశాల్లోని 80 టార్గెట్ల నుంచి డేటాను దొంగలించారు. దక్షిణ కొరియా టెలికాం ప్రొవైడర్ నుంచి 3 టెరాబైట్ల(టీబీ) కాల్ లాగ్స్ సమాచారాన్ని సేకరించారు. దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించలేదు. -
‘ఆదిత్య ఎల్-1’ ఎక్కడివరకూ వచ్చింది? ఏ పరికరాలు ఏం చేస్తున్నాయి?
చంద్రయాన్ 3 విజయంతో భారత ఇస్రో ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. చంద్రునిపై కాలిడిన దేశాల సరసన భారత్ చేరింది. ఈ విజయానంతరం కొద్దిరోజుల వ్యవధిలోనే ఇస్రో మరో ఘనమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సూర్యుని కక్ష్యలోకి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించింది. ఈ అంతరిక్ష నౌక భూమి నుంచి అంతరిక్షంలో 125 రోజుల పాటు ఒక మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన తరువాత సూర్యునికి అత్యంత సమీపంలోని లాగ్రేంజియన్ పాయింట్లో ప్రవేశిస్తుంది. కాగా ఈ మిషన్ తాజా అప్డేట్స్ వివరాలను ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ మీడియాకు వెల్లడించారు. 2024 జనవరి 6వ తేదీనాటికి ఆదిత్య ఎల్- 1 మిషన్ నిర్దేశిత, తుది లక్ష్యానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు ఇస్రో ఛైర్మనన్ సోమనాధ్ పేర్కొన్నారు. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగించిన తొలి మిషన్ ఆదిత్య ఎల్- 1. జనవరి 7, 2024 నాటికి ఈ మిషన్ ప్రక్రియ పూర్తి కానుంది. సూర్యుని కక్ష్యలో చేరిన తరువాత నిర్దేశించిన కార్యకపాలు నెరవేరుస్తూ, శాస్త్రీయ ప్రయోగాలకు అవసరమయ్యేలా మిషన్ ఆదిత్య ఎల్- 1 సూర్యుని చిత్రాలను తీసి పంపిస్తుంది. సౌర కుటుంబం అంతటికీ తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యునిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వదిలిన బాణం ఆదిత్య-ఎల్1 లక్ష్యం వైపు దూసుకెళుతోంది. ఇది తన నాలుగు నెలల ప్రయాణంలో 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ (వేధశాల) భూమితోపాటు సూర్యుని ఆకర్షణ శక్తి లేని లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకోనుంది. ఇంతకీ ఆదిత్య-ఎల్-1లో ఏఏ పరికరాలున్నాయి? వాటితో సాగించే ప్రయోగాలేమిటి? దీనితో మనకొచ్చే ప్రయోజనాలేమిటి? ఆదిత్య-ఎల్-1లో మొత్తం ఏడు శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. వీటిలో నాలుగు సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగపడుతుండగా, మిగిలిన మూడు లగ్రాంజ్ పాయింట్ దగ్గరే వేర్వేరు ప్రయోగాలు చేయనున్నాయి. ఒక్కో పరికరం చేసే పనేమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫ్ (వీఈఎల్సీ): సూర్యుడు నిజానికి ఓ మహా వాయుగోళం. హైడ్రోజన్ అణువులు ఒకదానిలో మరొకటి కలిసిపోతూ (కేంద్రక సంలీన ప్రక్రియ) అపారమైన శక్తిని విడుదల చేస్తూండే ప్రాంతమే సూర్యుడు. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫొటోస్ఫియర్ అని అంటారు. దీని దిగువన ఉన్న మరో పొరను క్రోమోస్ఫియర్ అని, దాని దిగువన ఉన్న ఇంకో పొరను కరోనా అని పిలుస్తారు. వీఈఎల్సీ అనేది ఈ కరోనా పొరకు సంబంధించిన ఛాయాచిత్రాలను తీస్తుంది. దీనికితోడు వేర్వేరు కాంతుల్లో (పరారుణ, అతినీలలోహిత, ఎక్స్-రే) కరోనాను పరిశీలిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇస్రోలు కలిసి రూపొందించిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తిమంతమైన కణాల ప్రవాహాన్ని (కరోనల్ మాస్ ఎజెక్షన్)కూడా గుర్తిస్తుంది. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ల కారణంగా వెలువడే శక్తిమంతమైన ఫొటాన్లు భూ వాతావరణం, వానల తీరుతెన్నులపై ప్రభావం చూపగలవని అంచనా. సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్‌యూఐటీ): వీఈఎల్సీ కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తూంటే ఈ ఎస్యూఐటీని ఫొటో స్ఫియర్, క్రోమోస్ఫియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అతినీలలోహిత కాంతి మాధ్యమం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్ (నిర్దిష్ట ప్రాంతంలో పడే రేడియోధార్మిక శక్తి మొతాదు)ను కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పుణేలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ పరికరాన్ని రూపొందించింది. సోలార్‌లో ఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్), హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (హీలియోస్) సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల పరిశీలనకు ఈ రెండు పరికరాలను ఉపయోగిస్తారు. అయితే సోలెక్స్ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్ ఎక్కువ శక్తిగల వాటిపై దృష్టి సారిస్తుంది. ఈ రెండు పరికరాలను బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ఎస్పెక్స్): పేరులో ఉన్నట్లే ఇది సౌరగాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతలు మొదలైనవాటిని గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి? ఎలా వేగం పుంజుకుంటున్నాయన్న విషయాలు తెలుస్తాయి. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది కూడా చదవండి: అమెరికాలో దోపిడీకి గురైన భారత సంతతి జంట -
బ్యాంకు చిన్నదే.. కానీ టార్గెట్ పెద్దది!
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో విలీనవుతున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1 లక్ష కోట్ల డిపాజిట్లతో సంవత్సరాన్ని ముగించాలని భావిస్తోంది. జైపూర్ కేంద్రంగా ఉన్న ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించి 2027 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా 2027 మార్చి నాటికి రూ. 2 లక్షల కోట్ల డిపాజిట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకు వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఎప్పటిలాగే రిటైల్ రుణాలు కొనసాగిస్తూనే భవిష్యత్తులో యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 2023 సెప్టెంబర్ నాటికి రూ. 75,000 కోట్లకు పైగా డిపాజిట్లను కలిగి ఉంది. ఇక ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వద్ద రూ. 10,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తాము 28-30 శాతం స్థిరమైన వృద్ధితో ఎదిగామని, ఇదే వృద్ధితో కొనసాగితే 2027 నాటికి డిపాజిట్లను రూ. 2 లక్షల కోట్లకు పెంచుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడేళ్లలో రూ.లక్ష కోట్ల డిపాజిట్లను సాధించడం ఏ బ్యాంకుకు అయినా వేగవంతమైన వృద్ధిరేటు అవుతుందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ బ్యాంకుల మాదిరిగా కాకుండా తాము ఆస్తి విభాగంలో ఇతర బ్యాంకుల కంటే ప్రధానంగా ఎన్బీఎఫ్సీలతో పోటీ పడుతున్నామని, కానీ డిపాజిట్ల విషయానికి వస్తే తాము అన్ని బ్యాంకులతో పోటీ పడతామని వివరించారు. -
10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. కారణం ఇదే..!
కంపెనీలో పనిచేస్తున్న చిరుద్యోగి మొదలు నాయకత్వ స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిపై పనిఒత్తిడి ఉంటుంది. కానీ అది వారి స్థాయులను బట్టి మారుతోంది. కంపెనీ దానికి సంబంధించిన రంగంలో దూసుకుపోతుంటే ఇంకా మార్జిన్లు పెంచాలనే ధోరణి కనిపిస్తోంది. ఒకేవేళ మార్కెట్లో కంపెనీ స్థానాన్ని కోల్పోతే తిరిగి పునరుద్ధరించే దిశగా పనిచేయాలని ఒత్తిడి ఉంటుంది. ఏటా పెరుగుతున్న టార్గెట్లు, పనితీరులో అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం, ప్రతిభ కోసం పాకులాట వంటి వివిధ ఒత్తిళ్ల కారణంగా కంపెనీలోని అగ్రశ్రేణి నాయకత్వంలో పని చేస్తున్న వారి రాజీనామాలు పెరుగుతున్నాయి. గడిచిన పది నెలల్లో ఏకంగా 110 మంది సీఈవోలు వారి పదవుల నుంచి వైదొలిగినట్లు సమాచారం. కొవిడ్ తర్వాత భారతదేశంలోని కంపెనీలు సీఈవో, ఎండీ స్థాయి ఉద్యోగులు రాజీనామా చేస్తున్న ధోరణి గణనీయంగా పెరిగింది. 2023 మొదటి 10 నెలల సమయంలో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో పనిచేస్తున్న 110 మంది మేనేజింగ్ డైరెక్టర్లు లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తమ పదవుల నుంచి వైదొలిగారు. 2023లో నమోదైన పదవుల నిష్క్రమణలో అధికంగా రాజీనామాల వల్లే జరిగినట్లు డేటా వెల్లడిస్తోంది. అగ్రనాయకత్వంపై కంపెనీల్లో పెరిగిపోతున్న అంచనాలు, ఆ అంచనాలు అందుకోకపోతే వారి పనితీరుపై అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం వంటి వివిధ ఒత్తిళ్లతో అగ్రశ్రేణి రాజీనామాలు హెచ్చవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? మహమ్మారి సమయంలో కంపెనీలు మారితే ఆ స్థాయిలోని వారిని ఇతర సంస్థలు వెంటనే తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. దాంతో అప్పుడు ఎక్కువ రాజీనామాలు జరగలేదు. కొవిడ్‌తో దాదాపు ఏడాదికిపైగా కంపెనీలు ఆర్థిక అనిశ్చుతులు ఎదుర్కొన్నాయి. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్లు, టార్గెట్లు పెంచి ఎండీ/ సీఈఓలపై ఒత్తిడి పెంచుతుండడంతో ఈ రాజీనామాలు అధికమవుతున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు అదే రంగంలోని ఇతర కంపెనీలు నైపుణ్యాలు ఉన్న అగ్రశ్రేణి నాయకత్వానికి మంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఈవోల రాజీనామాలు పెరుగుతున్నాయి. -
నుక్భా ఫైటర్స్ ఎవరు? హమాస్‌తో సంబంధం ఏమిటి?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీనిలో చాలా మంది ఇజ్రాయిలీలు మృతి చెందారు. లెక్కకు మించిన యూదులు బందీలుగా మారారు. హమాస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌ను శ్మశానవాటికగా మార్చివేసింది. అలాగే హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో పడింది. ఈ యుద్ధం నేపధ్యంలో నుక్భా ఫైటర్స్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ వీరు ఎవరు? హమాస్‌తో వారికి సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హమాస్ ఒక పెద్ద విభాగం. దీనిలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన గ్రూపు పేరు ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్. నుక్భా ఈ బ్రిగేడ్‌కు చెందిన అత్యంత క్రూరమైన పోరాట యోధులు. వారిలో మానవత్వం మచ్చుకైనా ఉండదు. ఎదురుగా ఏది అడ్డుపడినా, ధ్వంసం చేసుకుంటూ, ముందుకు వెళ్లడమే వారి లక్ష్యం. నుక్భా ఫైటర్స్ చాలా ప్రమాదకరమైనవారు. వారు పిల్లలను, వృద్ధులను కూడా విడిచిపెట్టరు. నుక్భా ఫైటర్స్ ఇజ్రాయెల్‌కు నిరంతరం సవాల్‌గా నిలుస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ చాలాకాలం నుంచి వారితో పోరాడుతూనే ఉంది. వారిని వెతికి పట్టుకుని మరీ మట్టుపెడుతూ వస్తోంది. నుక్భా ఫైటర్లు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడంలో నిష్ణాతులు. వారు గెరిల్లా యుద్ధాన్ని అనుసరిస్తుంటారు. హమాస్ తన సైన్యాన్ని ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ద్వారా రిక్రూట్ చేస్తుంది. వీరి శిక్షణ సమయంలో బలంగా ఉండే కొంతమంది యువకులను గుర్తిస్తారు. వారిని నుక్భా ఫైటర్స్‌గా తీర్చిదిద్దుతారు. ఇది కూడా చదవండి: ఆదివాసీల ‘జలియన్‌వాలాబాగ్’ ఘటన ఏమిటి? ఖర్సవాన్లో ఏం జరిగింది? -
హఠాత్తుగా నాగుపాము తిరగబడితే... రోమాలు నిక్కబొడిచే వీడియో!
ఎటువంటి కర్మకు అటువంటి ఫలితమే వస్తుందని అంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వీడియో దీనికి రుజువుగా మారింది. వీడియోలోని దృశ్యం ప్రకారం.. కారులో కూర్చున్న ఒక వ్యక్తి వినోదం కోసం రివాల్వర్‌తో నాగుపాముకు గురిపెట్టి కాల్పులు జరుపుతాడు. అయితే గురి తప్పి, ఆ నాగుపాము తృటిలో తప్పించుకుంటుంది. అయితే ఆ మరుసటి క్షణంలో కారులో కూర్చున్న వ్యక్తికి ప్రాణాలు పోయినంత పని అవుతుంది. వీడియో ప్రారంభంలో ఒక కింగ్ కోబ్రా(నాగు పాము) మట్టి రహదారిపై ఉండటాన్ని గమనించవచ్చు. అదే సమయంలో ఒక కారు ఆ కోబ్రా ముందు ఆగి ఉంటుంది. ఇంతలో కారులో ఉన్న వ్యక్తి తన రివాల్వర్ని తీసి, కోబ్రాపై కాల్పులు జరుపుతాడు. ఆ వ్యక్తి పలుమార్లు నాగుపాముపై కాల్పులు జరుపుతాడు. అయితే ప్రతిసారీ గురి తప్పుతుంది. ఆ నాగుపాము కోపంతో తన పడగ విప్పి, ఆ వ్యక్తిపై దాడికి ఉపక్రమిస్తుంది. దీంతో ఆ వ్యక్తి గట్టిగా అరవడం వీడియోలో వినిపిస్తుంది. దీంతో వీడియో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్లో @Instantregretss అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు లెక్కకు మించిన వీక్షణలు దక్కాయి. ఈ వీడియోను ఐదు వేల మందికి పైగా లైక్ చేశారు. ఇది కూడా చదవండి: చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా? Don't bring a gun to a cobra fight! 🐍 pic.twitter.com/qGshAWdjHu — Klip Entertainment (@klip_ent) December 16, 2022 -
గాజాపై భూతల యుద్ధం!
జెరూసలేం/వాషింగ్టన్: చుట్టూ ఎటు చూసినా శిథిలాలు.. వాటి కింద చిక్కుకున్న మృతదేహాలు, కడుపులో మంటలు రేపుతున్న ఆకలి, తాగునీరు కూడా లేక తడారిపోతున్న గొంతులు, రాత్రయితే కరెంటు లేక చిమ్మచీకటి, మరోవైపు మృత్యువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడతాయో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న భయాందోళన. గాజాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ. ఆహారం కోసం జనం దుకాణాలు, బేకరీల ముందు బారులు తీరుతున్నారు. చాలావరకు అవి ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో తిండిగింజలు, నిత్యావసరాలు ఎప్పుడో నిండుకున్నాయి. గాజా ప్రజలకు ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గాజా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా జనం ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ఆరో రోజు గురువారం కూడా కొనసాగింది. ఇరుపక్షాల మధ్య పోరు ఉధృతంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగించింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపించారు. ఇరువర్గాల మధ్య యుద్ధంలో మృతుల సంఖ్య 2,600కు చేరింది. గాజాలో 1,350 మందికిపైగా జనం మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. తమ దేశంలో 222 మందిసైనికులు సహా 1,300 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ పదాతి దళాలు సన్నద్ధం హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇక భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గాజాలో అడుగుపెట్టి, ప్రతి ఇల్లూ గాలిస్తూ మిలిటెంట్లను ఏరిపారేయడానికి మిలటరీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమ దేశ భద్రతకు సవాలు విసురుతున్న మిలిటెంట్లను సమూలంగా నిర్మూలించడమే ఆశయంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తమ పదాతి దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే మిగిలి ఉందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. గ్రౌండ్ ఆపరేషన్ కోసం 3.60 లక్షల మంది రిజర్వ్ సైనికులను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లోని యూదుల కాలనీలను ఖాళీ చేయించింది. యూదులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భూతల దాడుల వల్ల గాజాలో మరణాలు భారీగా పెరుగుతాయని, సామాన్య ప్రజలు బలైపోతారని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. సిరియా ఎయిర్‌పోర్టులపై ఇజ్రాయెల్ దాడులు సిరియాలోని రెండు విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ సైన్యం గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. రాజధాని డమాస్కస్‌తోపాటు అలెప్పీలోని ఎయిర్‌పోర్టులపై ఈ దాడులు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హమాస్‌కు సిరియా అండగా నిలుస్తున్న సంగతి విదితమే. సిరియా భూభాగం నుంచి కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు జరుగుతున్నాయి. సిరియాకు చేరుకోవాల్సిన ఇరాన్ విమానాన్ని ఇజ్రాయెల్ దాడుల కారణంగా టెహ్రాన్‌కు మళ్లించారు. ఈ విమానంలో ఇరాన్ దౌత్యవేత్తలు ఉన్నట్లు సమాచారం. బందీలను విడుదల చేస్తేనే.. 40 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న గాజాలో 20 లక్షల మందికిగా జనం నివసిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు. గాజాకు ఆహారం, తాగునీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను ఇజ్రాయెల్ ఇప్పటికే పూర్తిగా నిలిపివేసింది. కరెంటు లేక ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరులను విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. బందీలను విడుదల చేసేంత వరకు గాజాకు ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ గురువారం హెచ్చరించారు. బందీలంతా విడుదలై, క్షేమంగా ఇళ్లకు చేరుకున్న తర్వాతే గాజాకు ఆహారం, నీరు, కరెంటు అందుతాయని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మిలిటెంట్ల చేతిలో 150 మందికిపైగా బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. హమాస్‌ను నలిపేస్తాం: నెతన్యాహూ పాలస్తీనా సాయుధ తిరుగుబాటు సంస్థ ‘హమాస్’ను నలిపి పారేస్తామని, పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రతినబూనారు. తమ దేశంపై దాడి చేసి, ప్రజల ప్రాణాలను బలిగొన్న హమాస్‌పై ఆయన నిప్పులు చెరిగారు. హమాస్‌లోని ప్రతి సభ్యుడికి ఇక చావే గతి అని తేలి్చచెప్పారు. నెతన్యాహూ బుధవారం రాత్రి టీవీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌లో శనివారం హమాస్ మిలిటెంట్లు సాగించిన రాక్షసకాండను వివరించారు. అంతకుముందు ఆయనతో ఇజ్రాయెల్ ప్రధాన ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్ సమావేశమయ్యారు. హమాస్‌పై యుద్ధాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి వీలుగా వార్–టైమ్ కేబినెట్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. ఈ కేబినెట్‌కి నెతన్యాహూ నేతృత్వం వహిస్తారు. అండగా ఉంటాం: బ్లింకెన్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తనను తాను కాపాడుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందన్నారు. బ్లింకెన్ శుక్రవారం పాలస్తీనా అధినేత మహమ్మద్ అబ్బాస్, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో సమావేశం కానున్నారు. పాలస్తీనియన్లకు చట్టబద్ధమైన ఆకాంక్షలు ఉన్నాయని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. -
లక్ష్యం సాధిస్తే రూ.40 వేల కోట్ల టర్నోవర్
గోదావరిఖని: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోందని, మిగిలిన ఆర్నెల్లలో రోజూ కనీసం 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నిఏరియాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేఏడాది మార్చి చివరికల్లా 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లలో వర్షాలతో కొంతఇబ్బంది కలిగినా అన్నిఅవరోధాలు అధిగమిస్తూ గతేడాది బొగ్గు రవాణాలో 12 శాతం వృద్ధి, ఉత్పత్తిలో 7శాతం, ఓవర్‌బర్డెన్ తొలగింపులో 15 శాతం వృద్ధి సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆర్నెల్లు కీలకమని పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్నిఏరియాలకు అవసరమైన యంత్రాలు, అనుమతులు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చామన్నారు. ఇకపై వర్షప్రభావం ఉండే అవకాశం లేదన్నారు. ఓపెన్‌కాస్ట్‌ల్లో నిలిచిన నీటిని బయటకు తోడేయాలని, బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యాలు సాధిస్తే రూ.3,500కోట్ల లాభాలు ఈఏడాది నిర్దేశిత 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే.. లక్ష్యానికి అనుగుణంగా రవాణా చేసే అవకాశం ఉందని సీఎండీ తెలిపారు. తద్వారా రూ.40 వేల కోట్ల టర్నోవర్, సుమారు రూ.3,500 కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. అంకిత భావంతో పనిచేయాలి సింగరేణి ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేదఫా రూ.1,750 కోట్ల వేజ్‌బోర్డు ఎరియర్స్ చెల్లించామని, సీఎం ప్రకటించినట్లు 32శాతం లాభాల బోనస్ రూ.711 కోట్లు కూడా దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. దీపావళి బోనస్‌ను పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. కంపెనీపై విశ్వాసం, విధుల్లో అంకితభావంతో కార్మిక, అధికారులు, సమష్టిగా కృషి చేయాలని కోరారు. లక్ష్యాల అధిగమించిన సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి నిర్దేశిత లక్ష్యాలు సాధించిందని శ్రీధర్ అన్నారు. ఈ ఏడాది బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా 330 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి, 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. గతేడాది ఇదే సమయం కన్నా 12శాతం అధికమని పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఎన్.బలరాం, సత్యనారాయణరావు, వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు సరేంద్రపాండే, అల్విన్, ఎం.సురేశ్, రమేశ్ పాల్గొన్నారు. -
92 శాతం కౌలురైతులకు సీసీఆర్సీలు
సాక్షి, అమరావతి: కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు పంట సాగుదారుల హక్కుల కార్డు (సీసీఆర్సీ)ల జారీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ప్రభుత్వం 92 శాతం లక్ష్యాన్ని సాధించింది. కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వడంతోపాటు వారికి బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించడంపై ప్రత్యేకదృష్టి సారించింది. భూ యజమానులకు, కౌలురైతులకు మధ్య అవగాహన ఒప్పందాలను కుదిర్చి భూ యజమానులకు నష్టం లేకుండా కౌలురైతులకు మేలుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే కౌలురైతులకు సీసీఆర్సీలు జారీచేసి వీలైనంతమందికి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ప్రతి వారం కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్నారు. కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడంపై సీఎస్ ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 8.81 లక్షలమంది కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 8.10 లక్షలమందికి (92 శాతం) కార్డులు జారీచేశారు. 13 జిల్లాల్లో లక్ష్యానికి మించి ఈ కార్డులు జారీచేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా లక్ష్యాలను సాధించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించడంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్డులున్న వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల కోసం లోన్ చార్జ్ క్రియేష్ మాడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఈ–క్రాప్‌తో కౌలురైతుల రుణ ఖాతాలను అనుసంధానించనున్నట్లు చెప్పారు. బ్యాంకులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.948.77 కోట్ల మేర కౌలురైతులకు రుణాలిచ్చాయని తెలిపారు. మరింతమంది కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. బ్యాంకర్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, బ్రాంచీల స్థాయిలో మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ యజమానులకు ఎటువంటి హాని కలగకుండానే కౌలురైతులకు రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విషయంపై భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలురైతులకు సహకరించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. -
ఆస్కార్ టార్గెట్ గా తెరకెక్కుతున్న సినిమాలు