స్వామి అసలు టార్గెట్ జైట్లీ:దిగ్విజయ్
Published Wed, Jun 22 2016 5:22 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామిపై కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ రేసులో ఉన్న ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యంను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న స్వామి అసలు టార్గెట్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ.. స్వామికి ఆర్థికమంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేశారని అందుకే స్వామి అరవింద్ సుబ్రమణ్యంను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని సింగ్ వ్యాఖ్యలు చేశారు. మోదీకి స్వామికి మధ్య జరిగిన క్విడ్ ప్రోకో ఒప్పందంలో భాగంగానే స్వామి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. స్వామి అసలు టార్గెట్ రఘురాం రాజన్, అరవింద్ సుబ్రమణ్యంలు కాదని అరుణ్ జైట్లీ అని దిగ్విజయ్ స్పష్టం చేశారు.
అమెరికా ఫార్మా ప్రయోజనాలను కాపాడాలంటే భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అమెరికా కాంగ్రెస్కు 2013లో సూచించారని, జీఎస్టీ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీకి అరవింద్ సుబ్రమణ్యం చెప్పారని స్వామి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement