
వాషింగ్టన్ డీసీ: అమెరికా(America) మరోమారు యెమెన్ పై దాడి చేసింది. ఈ దాడిని హౌతీ మీడియా ధృవీకరించింది. దీనికిముందు కూడా అమెరికా యెమెన్‌పై దాడికి పాల్పడింది. ఆ దాడిలో 54 మంది మృతి చెందారు. తాజాగా సోమవారం యెమెన్‌పై అమెరికా మరోమారు దాడికి దిగింది. ఈ దాడిలో ప్రాణనష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు.
#BREAKING Huthi media report new US strikes in Yemen pic.twitter.com/gpccecuehV
— AFP News Agency (@AFP) March 17, 2025
యెమెన్ రాజధాని సనా(Yemen's capital Sanaa)లో రాత్రిపూట అమెరికా జరిపిన దాడుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా 53 మంది మృతిచెందారు. హౌతీలకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడుల్లో 100 మందికి పైగా జనం గాయపడ్డారు. యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడులను ముమ్మరం చేసింది. శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాకు సంఘీభావం ప్రకటిస్తూ అంతర్జాతీయ నౌకలపై దాడి చేసే తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు.
యెమెన్ రాజధాని సనా, ఇతర ప్రాంతాలలో అమెరికా జరిపిన అనేక దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి యెమెన్‌లోని అనేక లక్ష్యాలపై అమెరికా రాత్రిపూట వైమానిక దాడులు నిర్వహించింది. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై హౌతీలు దాడులను ఆపాలని ట్రంప్(Trump) కోరారు. లేనిపక్షంలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా వారు దాడులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
ఇరాన్ మద్దతుగల మిలీషియాలు అంతర్జాతీయ షిప్పింగ్‌పై దాడి చేసే సామర్థ్యాన్ని కోల్పోయే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. హౌతీ యోధులు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని రెండు నౌకలను ముంచేశారు. గత 18 నెలల్లో హౌతీలు అమెరికా నావికాదళంపై 174 సార్లు ప్రత్యక్షంగా దాడి చేశారని, గైడెడ్ ప్రెసిషన్ యాంటీ-షిప్ ఆయుధాలను ఉపయోగించి, 145 సార్లు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్నారని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Amritsar: ఆలయంపై గ్రనేడ్ విసిరిన వ్యక్తి ఎన్‌కౌంటర్