‘మీ టైమ్‌ అయిపోయింది’.. వారికి ట్రంప్‌ హెచ్చరిక | USA Donald Trump Sensational Comments On Houthis | Sakshi
Sakshi News home page

‘మీ టైమ్‌ అయిపోయింది’.. వారికి ట్రంప్‌ హెచ్చరిక

Mar 16 2025 10:31 AM | Updated on Mar 16 2025 10:50 AM

USA Donald Trump Sensational Comments On Houthis

సానా: యెమెన్‌లో హౌతీలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. హౌతీలపై అమెరికా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 24 మంది మరణించారు. ఈ నేపథ్యంలో దాడులపై ట్రంప్‌ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌతీల టైమ్‌ ముగిసిపోయింది. దాడులకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశారు.

హౌతీలు బలంగా ఉన్న యెమెన్ రాజధాని సానాపై అమెరికా దళాలు దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా బాంబు దాడులతో సానా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. భారీ మొత్తంగా బాంబు దాడులు చేయడంతో 24 మంది చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాడులపై ట్రంప్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ట్రంప్‌.. ‘హౌతీ ఉగ్రవాదులందరికీ హెచ్చరిక. వారి సమయం ముగిసింది. ఈ రోజు నుంచీ మీ దాడులకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే. కాదంటే గతంలో ఎన్నడూ చూడనంతగా నరకాన్ని చూస్తారు’ అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్‌ను కూడా ట్రంప్‌ హెచ్చరించారు. హౌతీలకు మద్దతు తక్షణం ఆపాలని చెప్పారు.


 

 ఈ నేపథ్యంలో అమెరికా దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని  ఆరోపించింది. ఈ దాడులకు సమాధానం చెప్పేందుకు యెమెన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. ఇక, 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత దాని తీరంలోని ఓడలపై హౌతీలు దాడులు ప్రారంభించారు. ఇది ప్రపంచ వాణిజ్యానికి ఆటంకంగా మారింది. 2023 నుంచి హౌతీలు 174 సార్లు అమెరికా యుద్ధ నౌకలపై, 145 సార్లు వాణిజ్య నౌకలపై దాడిచేసినట్టు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement