
ఎనర్జీ సొల్యూషన్స్ బిజినెస్ ద్వారా రానున్న మూడేళ్లలో రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధించాలని గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ ఆశిస్తోంది. ఇందుకు డేటా సెంటర్ల వృద్ధి, తదితర అంశాలు దోహదపడతాయని భావిస్తోంది. కంపెనీ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆర్డర్ బుక్ విలువ రూ.2,400 కోట్లకు చేరింది. ప్రధానంగా 400కేవీ, 765 కేవీ విభాగాలలో శుద్ధ ఇంధన విద్యుత్ ప్రసారంలో కంపెనీ నాయకత్వ స్థాయిని ఇది వెల్లడిస్తున్నట్లు గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది. ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలలో భారత్ వేగవంత మార్పులకు లోనవుతున్నట్లు తెలియజేసింది. ప్రధాన నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యం వార్షికంగా 30 శాతం చొప్పున వృద్ధి చెందనున్నట్లు అంచనా వేసింది. సస్టెయినబుల్ ఎనర్జీ సొల్యూషన్స్‌పై జాతీయస్థాయిలో దృష్టి పెట్టినట్లు పేర్కొంది.
యాక్సిస్ ఫైనాన్స్‌లో వాటాల విక్రయంపై యాక్సిస్ కసరత్తు
బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌పై దృష్టి
న్యూఢిల్లీ: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించే యాక్సిస్ ఫైనాన్స్‌లో మెజారిటీ వాటాలను విక్రయించాలని యాక్సిస్ బ్యాంక్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అడ్వైజరుతో కూడా బ్యాంకు కలిసి పని చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని, వాటాల విక్రయంపై నిర్ణయమేదీ తీసుకోలేదని పేర్కొన్నాయి. ఒకవేళ ముందుకెళ్లే పక్షంలో, యాక్సిస్ ఫైనాన్స్‌కి యాక్సిస్ బ్యాంక్ 900 మిలియన్ డాలర్ల నుంచి బిలియన్ డాలర్ల వరకు వేల్యుయేషన్ అడిగే అవకాశం ఉందని వివరించాయి. యాక్సిస్ ఫైనాన్స్ వృద్ధికి బ్యాంకు గణనీయంగా నిధులు సమకూర్చినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ జనవరిలో ఒక నివేదికలో తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్స్‌కి రూ.300 కోట్లు అందించినట్లు వివరించింది. యాక్సిస్ ఫైనాన్స్ ప్రధానంగా కార్పొరేట్, రియల్ ఎస్టేట్ రంగాలకు రుణాల సర్వీసులు అందిస్తోంది.
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ తాజాగా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నాన్–కన్వర్టబుల్ బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.1,100 కోట్లు సమీకరించింది. ఈ బాండ్లకు 5 శాతం కూపన్ రేటుతో 36 నెలల కాలపరిమితి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment