► పూటుగా తాగించే యత్నం
► దుకాణదారులకు అబ్కారీ శాఖ హుకుం
► బీరు కావాలంటే దారి మార్చండి
► పెరిగిన బీరు వినియోగంతో ఇక్కట్లు
ప్రజారోగ్యం ఎలా పోతే తమకేంటన్న ధోరణిలో పాలకులు ముందడుగు వేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఎండల తీవ్రత నేపథ్యంలో బీరుకు డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడింది. దీంతో బీర్లు కావాలంటే ఇతర మద్యం కొనుగోలు చే సి ఆదాయ లక్ష్యాన్ని పెంచుకునేందుకు అబ్కారీ శాఖ వినూత్నంగా ఆలోచించింది. బీరు కావాలంటే ఇతర మద్యం కూడా తీసుకోవాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. ఓ వైపు మండే ఎండల్లో బీరు కొరత ఏర్పడగా మరో వైపు యువత ఎక్కువగా బీరు మత్తులో మునిగి తేలుతుండడంతో ఇదే అదనుగా వ్యాపారాన్ని పరుగులెత్తించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...
శ్రీకాకుళం టౌన్/సిటీ : కొద్ది రోజుల కిందట రోను ప్రభావంతో రెండు మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తరువాత క్రమేణ మళ్లీ ఎండ తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. మద్యం ప్రియులు మరింత బేజారెత్తిపోతున్నారు. ఇదే అదనుగా తెగ తాగేస్తున్నారు. ఇదేమి తాగుడు ఇంకా తాగించండంటూ పరోక్షంగా ప్రభుత్వమే సంబంధిత అబ్కారీ శాఖ అధికారులను ప్రోత్సహిస్తుంది.
ఇదే అదను ఇంకా తాగించేయండి...ఆదాయ లక్ష్యాన్ని మరింత పెంచండంటూ హుకుంలు జారీ అవుతుండడంతో మద్యం ప్రియులు మరింత మత్తులో జోగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం, పలాస అబ్కారీ డివిజన్లను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 232 మద్యం దుకాణాలు, 18 బార్లు నడుస్తున్నారుు. వీటి పరిధిలో ప్రతి నెలా రూ.20 నుంచి 30 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నారు. మండే ఎండల నడుమ బీరుకు మరింత డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో వ్యాపారుల మధ్య అధికారులు పోటీ పెట్టి మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు వ్యూహాన్ని రూపొందించి వెంటనే అమలు చేశారు.
దుకాణదారులు ఇదే అదనుగా మద్యం అమ్మకాలను పెంచుకునేందుకు అవకాశం లేక బీర్లు పొంగించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. పెరిగిన బీర్ల వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్న నిల్వలన్నీ ఖాళీ కావడంతో కొద్దిపాటి నిల్వలకు తోడుగా మద్యం లిప్టు చేయడానికి ప్రయత్నించి సఫలమవుతున్నారు. ఈ సీజన్‌లో రూ.40 కోట్ల మేర మద్యం తాగించాలని జిల్లా అధికారులు నిర్ణయించి ఈ పోటీ పెట్టారని మద్యం వ్యాపారులే గుసగుసలాడుకుంటున్నారు. మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు జిల్లాలో అబ్కారీ శాఖ కొత్తగా బీరు కావాలంటే మందు కొనాల్సిందేనంటూ కొత్త నినాదం తీసుకొచ్చింది.
ఈ రకంగా మరింత మద్యం జిల్లాలో ఏరులై పారిస్తే తప్ప ప్రభుత్వ ఆదాయూన్ని పెంచుకోలేమని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా మద్యం వ్యాపారులతో మాట్లాడి అమ్మకాలపై మద్యంతర ఆదేశాలిచ్చారు.మద్యం లిప్టు చేయని దుకాణాలకు బీరు అమ్మబోమని తెగేసి చెప్పడంతో దుకాణదారులు బీరు కోసం బారులు తీరక తప్పడం లేదు. సిండికెట్లు రంగంలోకి దిగి ఇదే అదనుగా బీరుల ధరలు పెంచుకునేందుకు కొత్త రేట్లు నిర్ణరుుంచేశారు. దీంతో అబ్కారీ గోదాం వద్ద వ్యాపారులు బారులు తీరుతున్నారు.
టార్గెట్ రూ. 40 కోట్లు!
Published Fri, Jun 3 2016 10:48 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement
Advertisement