digvijaya singh
-
అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ యాదవ్‌పై వేటు తప్పదా?
న్యాయ్యవస్థలో అత్యంత కీలమైన వారు న్యాయమూర్తులు. రాగద్వేషాలకు అతీతంగా వీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కొంతమంది న్యాయమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) మద్దతుగా వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిచేందుకు కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రాజ్యసభలో అభిశంసన తీర్మానం పెట్టేందుకు యత్నిస్తున్నాయి.అసలేంటి వివాదం?ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం (డిసెంబర్ 8) అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై మాట్లాడుతూ.. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యమని అన్నారు. బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దేశంలోని పౌరులందరినీ సమానంగా చూడాలన్నదే యూసీసీ లక్ష్యమని చెప్పుకొచ్చారు.పదవి నుంచి తొలగించాల్సిందేజస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మతసామరస్యాన్ని భంగపరిచేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తాయి. న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను తప్పించేందుకు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ముందుగా ఈ ప్రతిపాదన చేయగా సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, వివేక్ తఖ్కా బలపరిచారు. రాజ్యసభలో విపక్ష సభ్యుల నుంచి బుధవారం నాటికి 38 మంది సంతకాలు సేకరించారు. న్యాయమూర్తులు రాజకీయ ప్రకటన చేయడం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైనారిటీల పట్ల వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తపరిచిన జస్టిస్ శేఖర్ యాదవ్.. తాను విచారించే కేసులలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని, ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు కూడా జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించింది. అలహాబాద్ హైకోర్టు నుంచి వివరణ కోరింది.అంత ఈజీ కాదు..హైకోర్టు జడ్జిని పదవీచ్యుతుడిని చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా పెద్ద వ్యవహారమే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, ఆర్టికల్ 218లో దీని ప్రస్తావన ఉంది. న్యాయమూర్తిని తొలగించాలన్న తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే 100 మంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేయాలి. ఈ పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌ను అందజేయాలి. పార్లమెంట్లో తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెడింతల మెజారిటీ తప్పనిసరి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తీర్మానాన్ని అదే సెషన్లో రాష్ట్రపతికి సమర్పించాలి. తర్వాత రాష్ట్రపతి ప్రకటన చేయడం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు.చదవండి: మందిర్- మసీదు పిటిషన్లపై ‘సుప్రీం’ సంచలన ఆదేశాలుఅయితే ఇదంతా మనం చెప్పుకున్నంత సులభమేమీ కాదు. పార్లమెంట్లో తీర్మానాన్ని చర్చకు అంగీకరించడానికి ముందు చాలా తతంగం ఉంటుంది. ఒకవేళ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరించిన పక్షంలో లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రముఖ న్యాయనిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదిక ఆధారంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానాన్ని చర్చకు పెడతారు. తర్వాత తీర్మానంపై ఓటింగ్ జరుపుతారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇంత సుదీర్ఘ ప్రక్రియ నిర్వహిస్తారు. తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగానే న్యాయమూర్తి పదవీత్యుడయ్యారనేలా ఈ వ్యవహారం సాగుతుంది. కాగా, తాజా వివాదం నుంచి జస్టిస్ శేఖర్ యాదవ్ బయటపడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అధికార ఎన్డీఏ కూటమి పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.గతంలోనూ తీర్మానాలుహైకోర్టు న్యాయమూర్తులపై గతంలోనూ పార్లమెంట్లో అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి. 1993లో జస్టిస్ వి రామస్వామికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోయింది.2011లో కలకత్తా హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ తీర్మానం ఆమోదించడంతో ఆయన రాజీనామా చేశారు. 2015లో రాజ్యసభ తీర్మానంతో గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా పదవీచ్యుతుడయ్యారు.2016-17లో ఏపీ-తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిపై రెండుసార్లు పెట్టిన తీర్మానం వీగిపోయింది. 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై పెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. -
మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్‌కు కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 లక్షణాలు కనిపించిన దరిమిలా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు. తన కోవిడ్ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని, వైద్యులు ఐదురోజుల పాటు తనను రెస్ట్ తీసుకోవాలని సూచించారని తెలిపారు. కోవిడ్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనను కలుసుకునేందుకు కొద్ది రోజులపాటు ఎవరూ రావద్దని దిగ్విజయ్ కోరారు. मेरा COVID test पॉजिटिव आया है। मुझे ५ दिनों के लिए आराम करने के लिये कहा गया है। इसलिए मैं कुछ समय के लिए नहीं मिल पाऊँगा। क्षमा करें। आप सभी भी COVID से बचने के लिए अपना ख़्याल रखें।— Digvijaya Singh (@digvijaya_28) August 20, 2024 -
‘ఆఖరి పోరాటం’లో దిగ్విజయ్‌కు పరాభవం?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ పలువురు సీనియర్ నేతల అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తనకు ఇవే చివరి ఎన్నికలంటూ మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచిపోటీకి దిగారు.భవిష్యత్‌లో తాను పోటీ చేయబోనని, యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పిస్తానని రాజ్‌నాథ్ తెలిపారు. పీపుల్స్ ఇన్సైట్, పోల్‌స్ట్రాట్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ డేటా దిగ్విజయ్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురుకానున్నదని చెబుతున్నాయి.మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క లోక్‌సభ సీటు కూడా దక్కదని పీపుల్స్ ఇన్సైట్, పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌లో 2019లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే వచ్చింది. రాజ్‌గఢ్ సీటు బీజేపీ ఖాతాలో పడింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి కూడా ఈ సీటును బీజేపీ కైవసం చేసుకోనుంది.దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ రోడ్మల్ నాగర్‌ను పోటీకి నిలబెట్టింది. 2014, 2019లలో రాజ్‌గఢ్ లోక్‌సభ ఎన్నికల్లో రోడ్మల్ విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈసారి కూడా రోడ్మల్‌కే విజయ సంకేతాన్ని చూపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. -
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో మూడో దశలో పోలింగ్ మే 7న జరగనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోని రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన ఇవి తన జీవితంలో చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు.దిగ్విజయ్ సింగ్ తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’ హ్యాండిల్లో రాజ్‌గఢ్ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. దానిలో ఆయన ‘నేను నా తండ్రి మరణించాక ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని రాజ్‌గఢ్ వచ్చాను. నాడు ఇక్కడి ప్రముఖుడు కస్తూర్ చంద్ జీ కఠారీని కలుసుకున్నాను. అప్పుడు ఆయన నాతో ప్రతీ వ్యక్తి జీవితంలో 12 లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. కుటుంబాన్ని పోషించేంతటి సంపాదన ప్రతీ వ్యక్తికి అవసరమని, అలాగే పొదుపు చేయాలని, నగలు కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. సొంత ఇంటిని నిర్మించుకోవాలని, ఇవన్నీ సమకూరితే అదృష్టవంతుడివని, అప్పుడు పేరు సంపాదించుకోవాలని వివరించారు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాగే ప్రయత్నించాను. అందులో నేను ఎంతవరకూ సక్సెస్ అయ్యానో నేనే అంచనా వేయలేను. సామాన్యులు మాత్రమే అలా చేయగలరు. ఇవి నా జీవితంలో చివరి ఎన్నికలు. వీటిలో నేను ఎంతవరకు విజయం సాధిస్తానో మీరే నిర్ణయిచాలి’ అని పేర్కొన్నారు.మే 7వ తేదీన రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దిగ్విజయ్ సింగ్ 10 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1980- 90వ దశకంలో రాజ్‌గఢ్ నుండి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత తన సొంత ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికలు దిగ్విజయ్ సింగ్ ప్రతిష్టకే కాదు, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ భవిష్యత్తుకు కూడా కీలకం కానున్నాయి. -
‘400 మందితో నామినేషన్ వేయిస్తా’
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించే మార్గాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ చెప్పారు. రాజ్‌గఢ్‌లోని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ఇక్కడి నుంచి 400 మంది నామినేషన్లు వేసేలా కృషి చేస్తున్నానని, తద్వారా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. రాజ్‌గఢ్‌లోని కచ్నారియా గ్రామంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. ‘ఇక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మీరు కోరుకుంటే ఒక మార్గం ఉంది . ఒక స్థానం నుండి 400 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు . దానికి నేను సిద్ధమవుతున్నాను’ అన్నారు. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ వివరాలను కూడా దిగ్విజయ్ సింగ్ తెలిపారు. "రిజర్వ్డ్ కేటగిరీకి చెందని వారు రూ. 25,000, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ. 12,500 డిపాజిట్ చేయాలి. ఇది దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగే ఒక సీటుకు దారి తీస్తుంది" అని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వంతో విసిగిపోయారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంపై దిగ్విజయ్ సింగ్ గతంలోనే అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలపై ప్రజల అనుమానాలపై 2018లోనే ఏఐసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు గత ఫిబ్రవరిలో దిగ్విజయ్ సింగ్ ఏఎన్ఐతో అన్నారు. -
కాంగ్రెస్ 4వ జాబితా
-
33 ఏళ్ల తర్వాత రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ!
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాజ్‌గఢ్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచి పోటీచేయాలని అధిష్ఠానం తనను ఆదేశించిందని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొదటి నుండి నిరాకరిస్తూనే వస్తున్నారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉందని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని గతంలో స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని 29 లోక్‌సభ స్థానాలకు బీజేపీ జాబితా విడుదల చేసినా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీలోని దిగ్గజ నేతలను రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపధ్యంలో రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ప్రకటనతో కాంగ్రెస్ మద్దతుదారులు బాణాసంచా కాల్చి, తమ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు దాదాపు 33 ఏళ్ల తర్వాత తిరిగి రాజ్‌గఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గమనార్హం. కాగా ఇవే ఆయనకు ఆఖరి ఎన్నికలు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
మోదీ ‘అన్యాయ్‌కాల్’కు కౌంట్‌డౌన్ మొదలైంది
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ హయాంలోని పదేళ్ల ‘అన్యాయ్‌కాల్’కు కౌంట్‌డౌన్ మొదలైందని, త్వరలోనే అది ముగుస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. మోదీ ఇచ్చిన హామీలు గత పదేళ్ల కాలంలో ఒక్కటి కూడా అమలు కాలేదని, కానీ వాగ్దానాలతో చేసిన ఆయన ప్రసంగాలు ఇంకా ప్రజల జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తున్నాయని దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన సందర్భంగా పంటలకు మద్దతు ధరపై చట్టబద్ధత కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీని రెండేళ్లయినా పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీలో రైతుల తాజా ఆందోళనను నిలువరించేందుకు డ్రో న్లు ఉపయోగించి గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో గ్యాస్ సిలెండర్ ధరలు రెండింతలు పెరిగాయని, దేశ అప్పులు మూడు రెట్లు పెరిగాయని, దేశంలోని ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరిన పఠాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన నీలం మధు గురువారం దీపాదాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆయనను దీపాదాస్మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
Video: పార్టీ కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతల ఘర్షణ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్ నాథ్ మద్దతుదారుల మధ్య వివాదం చెలరేగింది. నేతలు ఒకరిపై మరొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికార ప్రతినిధి షహర్యార్ ఖాన్, కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల విభాగం మాజీ అధ్యక్షుడు ప్రదీప్ అహిర్వార్ మధ్య వివాదం చెలరేగింది. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై దిగ్విజయ్ సింగ్‌ని ప్రదీప్ దుర్భాషలాడాడని షహర్వార్ ఖాన్ ఆరోపించారు. కార్యాలయంలోనే నేతలు వాగ్వాదానికి దిగారు. మాటలు తీవ్రస్థాయికి చేరాక ఘర్షణకు దిగారు. కుర్చీలతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఇతర నేతలు, సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. कमलनाथ जी समर्थक द्वारा दिग्विजय सिंह जी को गाली बकने को लेकर पीसीसी में जमकर चले लात-ठूँसे... कुर्सियाँ चली , जमकर एक दूसरे को गालियाँ बकी गई... बीचबचाव करने आये कमलनाथ समर्थक एक नेता को भी लात-ठूँसें पड़े... pic.twitter.com/wtWQ0sFsWp — Narendra Saluja (@NarendraSaluja) January 29, 2024 మధ్యప్రదేశ్‌లో గత నవంబర్ 17న ఎన్నికలు జరిగాయి. బీజేపీ గణవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్న కమల్ నాథ్ సారథ్యంలో దిగ్విజయ్ సింగ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఈడీ ముందు హాజరైన లాలూ కుమారుడు -
Madhya Pradesh: దిగ్విజయ్‌కు ఘోర పరాభవం..
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో 230 స్థానాలు ఉండగా ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ 163 సీట్లు గెలుచుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ 66 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు అయితే ఈ ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులలో చాలా మంది ఓటమిని చవిచూశారు. ఆయన సోదరుడు లక్ష్మణ్ సింగ్, మేనల్లుడు ప్రియవ్రత్ సింగ్ సహా చాలా మంది బంధువులు వారి వారి నియోజకవర్గాల్లో పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కొడుకు జైవర్ధన్ సింగ్ మాత్రమే రఘోఘర్ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఇక దిగ్విజయ్ మద్దతుదారులు అనేక మంది ఈ ఎన్నికల్లో మట్టికరిచారు. ముఖ్యంగా లహర్ నియోజకవర్గం నుంచి డాక్టర్ గోవింద్ సింగ్, రౌ నియోజకవర్గం జీతూ పట్వారీ ఓటమిపాలయ్యారు. ఎన్నికల ఫలితాలకు ముందు దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ గెలుపు పట్ల చాలా విశ్వాసంగా కనిపించారు. శివరాజ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి ఎలాగైనా గణనీయమైన స్థానాలు గెలుచుకుని అధికారాన్ని దక్కించుకోవాలని భావించినా ప్రజలు భిన్న తీర్పు ఇచ్చారు. రాష్ట్రంతోపాటు దేశంలో అత్యంత సీనియర్ నేత, మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్‌కు ప్రస్తుత ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయనే చెప్పుకోవాలి. -
Madhya Pradesh: ఇప్పుడా ద్రోహి లేడు.. దిగ్విజయ్ తీవ్ర వ్యాఖ్యలు
భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శనివారం ఆయన రాష్ట్ర రాజధాని భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ద్విగ్విజయ్ సింగ్ స్పందిస్తూ ‘మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా దగ్గర సింధియా లేడు. కాబట్టి ద్రోహి లేడు’ అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్‌లోని దాతియాలో ఇటీవల జరిగిన బహిరంగ ర్యాలీలో మాట్లాడుతూ సింధియాపై 'ద్రోహి' అంటూ విరుచుకుపడ్డారు. సింధియా తనతో ఎమ్మెల్యేలతో కలిసి 2020 మార్చిలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడా పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ 130 సీట్లకుపైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత, దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ కూడా తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పారు. -
ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు?
మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 17న పోలింగ్ పూర్తయింది. డిసెంబర్ 3న వెలువడే ఫలితాల కోసం అటు ప్రజానీకం, ఇటు రాజకీయ పార్టీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఫలితాలకు ముందే వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్‌పై సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైవిధ్యంగా ఉన్నాయని అన్నారు. దీని గురించి మేం ఇప్పుడే ఏమీ చెప్పలేమని, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 130కి పైగా సీట్లు వస్తాయని భావిస్తున్నామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనపై విసిగిపోయారని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో తమకు పోటీ లేదని, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అన్నారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశం, అమిత్ షా వ్యూహాలు, జేపీ నడ్డా నాయకత్వం, కార్యకర్తల కృషి, బీజేపీ ప్రభుత్వ పథకాలు.. మొదలైనవన్నీ రాష్ట్రంలో బీజేపీకి మెజారిటీ వస్తుందని స్పష్టం చేస్తున్నాయన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇండియా టీవి-సీఎన్ఎక్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 140 నుంచి 159 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇది కూడా చదవండి: ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ ధర! -
‘నాలుగు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ దాడులు’
భోపాల్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లో కూడా వచ్చే నాలుగు రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బృందాలు సోదాలు జరిపే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఇటీవలే రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా ఇంటిపై ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై సోదాలు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఆదివారం భోపాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ఈ దాడులను ప్రస్తావించారు. ఒకపక్క అధికారులను వేధిస్తున్న బీజేపీ నేతలు, మరోపక్క రాజస్తాన్ లో మాదిరిగా మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ సోదా లు జరిపిస్తారని అన్నారు. దాడులు జరగటానికి అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లను ఆయన పేర్కొన్నారు. -
దిగ్విజయ్–కమల్నాథ్లది జై– వీరూ బంధం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ల పాత్రపై మరోసారి చర్చ మొదలైంది. దిగ్విజయ్, కమల్‌నాథ్‌ల మధ్య రాజకీయ సమీకరణాలను.. బ్లాక్ బస్టర్ ‘షోలే’ చిత్రంలోని ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్లు పోషించిన జై, వీరూ పాత్రల మధ్య బంధంతో కాంగ్రెస్ పార్టీ పోల్చింది. రాష్ట్రంలో టిక్కెట్ల కేటాయింపులో ఇద్దరు నేతల మధ్య విభేదాల వార్తలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా శనివారం పైవ్యాఖ్యలు చేశారు. ‘షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్‌ల మధ్య విలన్ గబ్బర్ సింగ్ ఎలా గొడవ పెట్టలేకపోయాడో.. రాష్ట్రంలో గబ్బర్ సింగ్ వంటి బీజేపీ కూడా మధ్య విభేదాలను సృష్టించలేకపోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. -
Madhya Pradesh Election 2023: బరిలో డిగ్గీ సొంత సైన్యం!
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలపై తన పట్టును మాజీ రాజ కుటుంబీకుడు దిగ్విజయ్ సింగ్ మరోసారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది... న్యూఢిల్లీ: విపక్ష ‘ఇండియా’ కూటమిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోకుండా ఏకపక్షంగా 144 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడం పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కలిసి పని చేసే పరిస్థితి లేనప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపే అంశాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. తమతో వారి (కాంగ్రెస్) ప్రవర్తన లాగే వారితో తమ ప్రవర్తన ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను మోసగిస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 18 స్థానాల్లో ఈ రెండు పార్టీలు పరస్పరం బలంగా పోటీ పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార బీజేపీ లాభపడుతుందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్‌లో తమకు తగిన బలం ఉందని, గతంలో రెండో స్థానంలో నిలిచామని అఖిలేష్ యాదవ్ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆరు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, చివరకు మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇటీవల విడు దల చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయా లపై తన పట్టును మా జీ రాజ కుటుంబీకుడు దిగ్వి జయ్సింగ్ మరో సారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది...తొలి జాబితా చాలా కారణాలతో వార్తల్లో నిలిచింది. అయితే అందరినీ ఆకర్షించింది మాత్రం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుటుంబంలో ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం! వివాదాస్పదుడైన సోదరుడు లక్ష్మణ్‌సింగ్‌తో పాటు కుమారుడు జైవర్ధన్, అల్లుడు ప్రియవ్రత్, అదే వరుసయ్యే అజయ్‌సింగ్ రాహుల్ పేర్లకు జాబితాలో చోటు దక్కింది. అజయ్‌సింగ్ రాహుల్ 68 ఏళ్లు. దిగ్విజయ్‌కి వరసకు కోడలి భర్త. రక్త సంబంధీకుడు కాకున్నా డిగ్గీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ఐదుసార్లు ఎమ్మెల్యే. వింధ్య ప్రాంతంలో గట్టి పట్టున్న నాయకుడు. ముఖ్యంగా సిద్ధి జిల్లాపై పలు దశాబ్దాలుగా రాజకీయ పెత్తనం ఆయన కుటుంబానిదే. ‘మధ్యప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ ఇవ్వగలిగింది కేవలం కుటుంబ పాలన మాత్రమేనని దిగ్విజయ్ ఉదంతం మరోసారి నిరూపించింది. ఇది కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. నా కుమారుడు ఆకాశ్ తనకు టికెటివ్వొద్దని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఇవీ మా పార్టీ పాటించే విలువలు!’ – బీజేపీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్‌లో పార్టీ సీనియర్ నేత. లక్ష్మణ్‌సింగ్ 68 ఏళ్లు. దిగ్విజయ్ తమ్ముడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. 1990లో రాజకీయాల్లోకి వచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీనీ వదలకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు! 2004లో బీజేపీలో చేరి రాజ్‌గఢ్ నుంచి అసెంబ్లీకి గెలిచారు. 2010లో నాటి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని విమర్శించి బహిష్కారానికి గురయ్యారు. 2018లో రాష్ట్ర రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ప్రియవ్రత్‌సింగ్ 45 ఏళ్లు. దిగ్విజయ్ మేనల్లుడు. కిల్చీపూర్ సంస్థాన వారసుడు. ఆ స్థానం నుంచే 2003లో అసెంబ్లీకి వెళ్లారు. అభివృద్ధి పనులతో ఆకట్టుకుని 2008లో మళ్లీ నెగ్గారు. 2013లో ఓడినా 2018లో మంచి మెజారిటీతో గెలిచారు. కమల్‌నాథ్ మంత్రివర్గంలో ఇంధన శాఖ దక్కించుకున్నారు. జైవర్ధన్‌సింగ్ 37 ఏళ్లు. దిగ్విజయ్ కుమారుడు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో సింధియాల కంచుకోట లను చేజిక్కించుకోవడంపై ఈసారి దృష్టి సారించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి కేంద్ర మంత్రి పదవి పొందిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయుల్లో పలువురిని ఇటీవల కాంగ్రెస్ గూటికి చేర్చారు. డూన్ స్కూల్లో చదివిన ఆయన కొలంబియా వర్సిటీలో మాస్టర్స్ చేశారు. 2013లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమ మాజీ సంస్థానమైన రాఘవ్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి 59 వేల పైచిలుకు మెజారిటీతో నెగ్గారు. 2018లో దాన్ని 64 వేలకు పెంచుకోవడమే గాక కమల్ నాథ్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కించు కున్నారు. -
దిగ్విజయ్ సింగ్ రాజీనామా.. క్లారిటి
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాజీనామా లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. నకిలీ లేఖ అని పేర్కొంటూ పోలీసుకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు అభ్యర్థుల లిస్టు ప్రకటించిన వెంటనే దుష్ప్రచారం చేయడానికి ప్రతిపక్షాలు ఈ ఘటనకు పాల్పడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది. 'అబద్ధాలు అడటంలో బీజేపీకి మంచి పట్టుంది. 1971లో ఎలాంటి ఆశ లేకుండా కేవలం పార్టీ సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ సభ్యత్వాన్ని తీసుకున్నాను. చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటాను. రాజీనామాకు సంబంధించి నకిలీ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న 230 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 144 మంది అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. ఇందులో దిగ్విజయ్ సింగ్ కుమారుడితో సహా సిట్టింగ్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగి పేర్లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన రాజీనామా లేఖలో తన అనుచరులకు సీట్లు దక్కనందుకు దిగ్విజయ్ విచారం వ్యక్తం చేస్తూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు దుండగులు పేర్కొన్నారు. భారమైన హృదయంతో పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడానికి నిర్ణయించుకున్నట్లు లేఖలో ఉంది. కాంగ్రెస్ తన మొదటి లిస్టులో పార్టీ చీఫ్ కమల్‌నాథ్‌తో పాటు 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చింది. ఇదీ చదవండి: ప్రశ్నలడిగేందుకు లంచం తీసుకున్నారు -
మూడు నెలలకోసారి సైబర్ రిస్క్ మదింపు
న్యూఢిల్లీ: టెక్నాలజీ అత్యంత వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ సైబర్ రిస్కులను ఏడాదికోసారి కాకుండా మూడు నెలలకోసారి మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉందని డెలాయిట్ ఇండియా రిస్క్ అడ్వైజరీ పార్ట్నర్ దిగ్విజయసింహ చుదసమా తెలిపారు. కంపెనీలే కాకుండా ప్రజలు కూడా సైబర్ రక్షణ కోసం స్వీయ–మార్గదర్శకాలను రూపొందించుకోవాలని, కీలకమైన డేటాను షేర్ చేయడం వల్ల తలెత్తే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. హ్యాకర్లు మరింత అధునాతనమైన పద్ధతుల్లో సైబర్ దాడులకు దిగుతున్నందున ఈ తరహా రక్షణాత్మక చర్యలు అవసరమని చుదసమా వివరించారు. తమ ప్రయోజనాలను, తమ డేటాను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడే విధానాలను రూపొందించుకోవడంపై కంపెనీలు కసరత్తు ప్రారంభించాలని ఆయన సూచించారు. -
ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక: దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్: వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్. హైదరాబాద్‌లో రైతే రాజైతే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దిగ్విజయ్ సింగ్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ ముక్కుసూటి మనిషి.వైఎస్సార్‌తో నా అనుబంధం విడదీయరానిది. పార్టీ నిర్మాణంలో యుక్త వయస్సు నుంచే వైఎస్సార్ కీలకం గా పనిచేసారు. ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక. ఇందిరమ్మ ఇళ్ళు వైఎస్సార్ చలువే.. అవే విధానాలను జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారు. నక్సలైట్లతో చర్చలు జరిపి జనజీవన స్రవంతి లోకి తీసుకురావడంలో వైఎస్సార్ కీలక భూమిక పోషించారు. 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలయజ్ఞంకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ మరణించకుండా ఉంటే తెలుగు రాష్ట్రాలు మరోలా ఉండేవి. శత్రువులు కూడా మెచ్చేగుణం వైఎస్సార్‌కు ఉంది. రాజశేఖర్ రెడ్డి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. వైఎస్సార్ బతికి ఉంటే బీజేపీ తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో ధర్నా కు దిగేవాడు. వైఎస్సార్ లేకపోయి ఉంటే 2004,2009లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడకపోయేది. వైఎస్సార్ బతికి ఉంటే దేశంలో ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే వారు.’ అని తెలిపారు. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తో నేను రాజకీయంగా విభేదించొచ్చు. కానీ వైఎస్సార్ అమలు చేసిన ఆర్థిక, వ్యవసాయ విధానాలు అందరికీ ఆదర్శం. నేను హైకోర్టు జస్టిస్ గా ఉన్న సమయంలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా..రాజ్యాంగ వ్యవస్థ ల ఒత్తిడి చేయలేదు. సుధీర్ఘ కాలం పోరాడి సీఎం అయిన వ్యక్తి కాబట్టి.. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు. కాంగ్రెస్ అదిష్టానం పై ఒత్తిడి తీసుకొచ్చి మ్యానిఫెస్టో లో ఉచిత విద్యుత్ చేర్చారు. జాతీయ పార్టీ లకు ప్రాంతియ ప్రయోజనం అవసరం లేదా అనివైఎస్సార్ ప్రశ్నించారు.జాతీయ పార్టీ లో ఉన్నా ప్రాంతియ స్పృహ ఉన్న వ్యక్తి వైఎస్సార్’ అని కొనియాడారు. చదవండి: ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళి -
మధ్యప్రదేశ్‌లో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. దిగ్విజయ్ హాట్ కామెంట్స్
భోపాల్: ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక, మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. మాజీ సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికల కమిటీలో భాగమైన దిగ్విజయ్ సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత భజరంగ్ దళ్‌ను నిషేధించబోమని స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలో అల్లర్లను, హింసను ప్రేరేపించే వారిని మాత్రం విడిచిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇదేసమయంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. భజరంగ్ దళ్‌లో కొంతమంది మంచివాళ్లు కూడా ఉన్నారని అన్నారు. రామ మందిరం ఉద్యమం సమయంలో ఏర్పాటైన బజరంగ్ దళ్ అనేది విశ్వహిందూ పరిషత్ కు యువజన విభాగం. నేను కూడా హిందువునే. హిందువుగానే ఉంటాను. నేను హిందు మతాన్ని అనుసరిస్తూనే సనాతన ధర్మాన్ని పాటిస్తానని తెలిపారు. భారతదేశం అన్ని మతాలకు చెందుతుంది. దేశంలో శాంతిని నెలకొల్పడమే కావాలి అంటూ కామెంట్స్ చేశారు. 'MP में बनी कांग्रेस सरकार तो नहीं लगेगा बजरंग दल पर बैन' ◆ बजरंग दल को लेकर दिग्विजय सिंह का बड़ा बयान#BajrangDal | #DigvijayaSingh | @digvijaya_28 pic.twitter.com/VEm9N6E3Sm — News24 (@news24tvchannel) August 16, 2023 ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల సందర్భంగా కర్నాటకలో కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని వాగ్దానం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ! -
Digvijaya Singh: ర్యాష్ డ్రైవింగ్‌తో బైకర్‌ను ఢీ కొట్టి..
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కారు.. రోడ్డు ప్రమాదానికి కారణమైంది. గురువారం రాజ్‌గఢ్‌లో ఓ బైకర్‌ను వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్‌కు గాయాలు కాగా, దిగ్విజయ్ సింగ్ దగ్గరుండి మరీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేయించి.. అరెస్ట్ చేయించి, దగ్గరుండి మరీ ఆ వాహనాన్ని పోలీసులతో సీజ్ చేయించారాయన. గురువారం రాజ్‌గఢ్‌లోని కొడయాకా గ్రామంలో జిల్లా స్థాయి అధ్యక్షుల సమావేశం జరిగింది. దానికి హాజరైన దిగ్విజయ్ సింగ్ మధ్యాహ్నం తిరుగుపయనం అయ్యారు. ఆ సమయంలో జీరాపూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద బైకర్‌ను వేగంగా ఢీ కొట్టింది డిగ్గీ రాజా ప్రయాణిస్తున్న కారు. ఆ కొట్టడంలో పది అడుగుల దూరం వెళ్లి పడ్డాడు బైకర్. వెంటనే కార్యకర్తలతో పాటు ముందు సీటులో కూర్చున్న ఆయన కారు దిగి.. బాధితుడ్ని కార్యకర్తల సాయంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని పరవాలియాకు చెందిన రాంబాబు బాగ్రి(20)గా గుర్తించారు. ప్రమాదం అనంతరం ఆస్పత్రికి వెళ్లి అతని పరిస్థితి గురించి ఆరా తీసి, అతన్ని పరామర్శించారు దిగ్విజయ్ సింగ్. దేవుడి దయ వల్ల యువకుడికి తీవ్ర గాయాలు కాలేదని, అతని చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని మీడియాకు చెప్పారాయన. స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అతన్ని భోపాల్‌కు రిఫర్ చేశారు వైద్యులు. ఇదిలా ఉంటే.. తన కారు డ్రైవర్‌పై దగ్గరుండి పోలీసులతో కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించారు దిగ్విజయ్ సింగ్. అనంతరం వాహనాన్ని సైతం సీజ్ చేయించారు. జీరాపూర్ పోలీస్ వద్ద ఆ వాహనాన్ని వదిలేసి.. స్థానిక ఎమ్మెల్యే కారులో ఆయన వెళ్లిపోయారు. आज राजगढ़, एमपी में एक बाइक सवार युवक पूर्व मुख्यमंत्री @digvijaya_28 जी की कार से टकरा गया। दिग्विजय सिंह ख़ुद सबसे पहले कार से उतरे और घायल शख़्स को अस्पताल लेकर पहुँचे। सीसीटीवी से पता चलता है कि ग़लती बाइक सवार युवक की है, युवक फ़िलहाल ठीक है।#DigvijayaSingh #MadhyaPradesh pic.twitter.com/tNalWUfWNu — विवेक सिंह नेताजी (@INCVivekSingh) March 9, 2023 Disclaimer: పై వీడియో కేవలం సమాచార సంబంధిత పోస్ట్ మాత్రమే. ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదు.. -
ఫ్రూఫ్ అవసరం లేదు! దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తుందని తేల్చి చెప్పారు. తాము దిగ్విజయ్ సింగ్ అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తామని కరాఖండీగా చెప్పారు. తాను ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని చెప్పారు. అయినా సాయుధ దళాలు ఒక పనిని చాల అనుహ్యంగా చేయగలవు, వారి సామర్థ్యం గురించి కూడా తనకు తెలుసనని అన్నారు. దీనికి ఆర్మీ ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారణంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విమర్శలు రావడంతో రాహుల్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, దిగ్విజయ్ సింగ్ మాటిమాటికి సర్జికల్ స్ట్రైక్ జరిగింది ఇంతమందిని చంపాం అంటూ కేంద్రం కబుర్లు చెబుతోందే గానీ వాటికి ఆధారాలు చూపించలేకపోయిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. రాహుల్ సూచన మేరకే దిగ్విజయ్ సింగ్ అలా విషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు చేసింది. ఆర్మీపై గట్టి విశ్వాసం ఉండాలని, అది రాజకీయాలకు అతీతమైనదంటూ తిట్టిపోసింది బీజేపి. అయినా పదేపదే సర్జికల్ స్ట్రైక్ గరించి పూఫ్ అడుగుతున్నారు, అసలు ఆర్మీపై మీకు నమ్మకమే లేదనేది స్పష్టమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. అయినా కాంగ్రెస్‌కి ఇలా భాద్యతరహితమైన ప్రకటనలు ఇవ్వడం పరిపాటిగా మారిందంటూ మండిపడ్డారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేదే లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాహుల్, దిగ్విజయ్‌లకు నరేంద్ర మోదీ పట్ల ఉన్న ద్వేషం కళ్లకు కట్టినట్లు అర్థమవుతోందని బాటియా దుయ్యబట్టారు. (చదవండి: వాటికి ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు) -
వాటికీ ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పుల్వామా ఉగ్రదాడి, సర్జిక్ స్ట్రైక్‌లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో పుల్వామ ఉగ్రదాడిలో సుమారు 40 మంది భ్రదతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. "పుల్వామ ఉగ్రవాదానికి కేంద్రం, పైగా అక్కడ ప్రతి కారుని కూడా తనిఖీ చేస్తారు. అలాంటప్పుడూ రాంగ్‌సైడ్ నుంచి వచ్చిన స్కార్పియో కారుని ఎందుకు తనిఖీ చేయలేదు. అప్పుడే కదా ఈ స్కారిపియో కారు భద్రతా సిబ్బంది కాన్వాయ్‌ని ఢీ కొనడంతో అంతమంది జవాన్లు చనిపోయారు" అంటూ కేంద్రంపై విరుచకుపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సరైనా సమాధానం ఇవ్వలేదన్నారు. అదీగాక పార్లమెంటులో బహిరంగంగా ప్రధాని మోదీ పదేపదే సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడతారంటూ విమర్శించారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌తో ఇంతమందిని చంపాం అని ఏవో ప్రగాల్పాలు చెబుతుంటారని మండిపడ్డారు. వాటికి సంబంధించి ఇప్పటి వరకు సరైనా ఆధారాలను అందించలేకపోయిందంటూ కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్ జమ్మూలోని భారత్ జోడోయాత్రలో రాహుల్‌తో కలసి ఈ విషయాలు గురించి మాట్లాడారు. అంతేగాదు 300 కిలోల ఆర్డిఎక్స్ ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై కూడా పలు ప్రశ్నలను లేవనెత్తారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, వాస్తవానికి జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీలోని ఆర్మీ బేస్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో సుమారు18 మంది సైనికులు మరణించారు. దీంతో 2016లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభించింది.అయితే కాంగ్రెస్ పార్టీ పుల్వామా దాడి, వైమానిక దాడుల గురించి బీజేపీ కొంతకాలం వరకు ప్రశ్నలు సంధించింది. ఐతే బీజేపీ మన సైన్యాన్నే అనుమానిస్తున్నారా? అని గట్టి కౌంటర్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యింది. पुलवामा हादसे में आतंकवादी के पास ३०० किलो RDX कहॉं से आई? देवेंद्र सिंह डीएसपी आतंकवादियों के साथ पकड़ा गया लेकिन फिर क्यों छोड़ दिया गया? पाकिस्तान व भारत के प्रधानमंत्री के मैत्री संबंधों पर भी हम जानना चाहते हैं। pic.twitter.com/1wVbJEDPIC — digvijaya singh (@digvijaya_28) January 23, 2023 (చదవండి: వీడియో: అలాంటి వ్యక్తి దొరికితేనే పెళ్లి: మరోసారి స్పష్టం చేసిన రాహుల్ గాంధీ) -
దిద్దుబాటు ప్రారంభిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ట్రబుల్ షూటర్ దిగ్విజయ్‌సింగ్ తెలంగాణకు వచ్చి వెళ్లాక పార్టీలో ఏం జరుగుతుందనే ఆసక్తి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. టీపీసీసీలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం అధిష్టానం దూతగా వచ్చిన ఆయన ఏం చేస్తారన్నది ఇప్పుడు కాంగ్రెస్ కేడర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రానుంది. దిగ్విజయ్ పర్యటన అనంతరం హైలెవల్ కమిటీ ఆయనతో సమావేశమవుతుందని, ఆ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి రాష్ట్ర నేతలను ఒప్పించాకే దిద్దుబాటు చర్యలు ప్రారంభమవుతాయని సమాచారం. అయితే అందరినీ మూకుమ్మడిగా రమ్మంటారా? లేక విడివిడిగా పిలిచి మాట్లాడతారా? అన్నదానిపై స్పష్టత రాలేదు. మొత్తంమీద త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్‌లో దిద్దుబాటు చర్యలు ప్రారంభమవుతాయని, మొదటగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ స్థానంలో కొత్తగా సీనియర్ నాయకుడిని పంపిస్తారనే చర్చ జరుగుతోంది. ఆ మాటల ఆంతర్యమేంటో? కాంగ్రెస్ అధిష్టానం దిగ్విజయ్‌కు పెద్ద బాధ్యతే అప్పగించిందని ఆయన మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతోంది. ఎవరూ పార్టీ విషయాలను బహిరంగంగా మాట్లాడితే ఎంత పెద్ద నాయకుడినైనా ఉపేక్షించేది లేదని దిగ్విజయ్ హెచ్చరించడంపై పలు చర్చలు జరుగుతున్నాయి. సీనియర్లను కంట్రోల్ చేయడంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక పీసీసీ అధ్యక్ష పదవిని సమర్థంగా నిర్వహించడం గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవిని నిర్వర్తించడంలో వయసుతో పనిలేదని, అనుభవం లేకపోయినా అందరినీ కలుపుకొని వెళ్తే విజయవంతం కావచ్చని ఆయన ఇచ్చిన సలహా రేవంత్ వ్యవహారశైలిని ఉద్దేశించి చేసిందేనని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఉన్నతస్థాయి కమిటీకి దిగ్విజయ్ నివేదిక! తన రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులను అవగాహన చేసుకున్న దిగ్విజయ్‌సింగ్... పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. పలు రాష్ట్రాల్లోని అంతర్గత అంశాలను పరిష్కరించేందుకు ఏఐసీసీ ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థాయి కమిటీకి ఆయన నివేదిక ఇస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ రావడానికి ముందే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌తోపాటు ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ వచ్చాక 54 మందికిపైగా నేతలను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి దిగ్విజయ్ ఇచ్చిన నివేదికలో ఆయన పలు సిఫారసులు కూడా చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సిఫారసుల అమలుపై చర్చించడం కోసమే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులను త్వరలో ఢిల్లీకి పిలిచే అవకాశముందని తెలుస్తోంది. -
తెలంగాణలో సీనియర్ నేతలు సమన్వయం పాటించాలి
-
తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం.. డిగ్గీ రాజా హాట్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. దాన్ని చక్కదిద్దేందుకు హైకమాండ్ దిగ్విజయ్‌సింగ్‌ను బరిలోకి దింపడం.. ఆయన సుదీర్ఘంగా పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించడం ఉత్కంఠ రేపింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘తెలంగాణలో సీనియర్ నేతలు సమన్వయం పాటించాలి. పార్టీలో అంతర్గతంగా మాత్రమే చర్చించాలి. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దు. ఎంతపెద్ద నాయకులైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటాం’’ అని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకోవాలి. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలి. కాంగ్రెస్ నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండాలి.ఇప్పటికే రేవంత్‌రెడ్డి నన్ను కలిశారు. చిన్న వయస్సులో ఉన్నవారికి పీసీసీ ఇస్తే తప్పేంటి?. కొత్తవారికి పీసీసీ చీఫ్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి’’ అని ద్విగిజయ్ పేర్కొన్నారు. కేంద్రం అన్ని రంగాల్లో విఫలమయ్యిందని మోదీ పాలనలో మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ఈ స్థాయిలో ధరలు ఎప్పుడూ పెరగలేదన్నారు. ‘‘రాహుల్ యాత్రకు మంచి స్పందన వస్తోంది. దేశంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగింది.కార్పొరేట్ల సంస్థలకే మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది.ప్రత్యర్థులపై ప్రభుత్వ సంస్థలను ఉసిగొల్పుతున్నారు.ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు.మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతున్నారు. జోడో యాత్రను అడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు చేస్తోంది’ అని ద్విగిజయ్ అన్నారు. ‘‘ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలే తెలంగాణను సాధించారా?. ప్రజలకు హామీ ఇచ్చాం. తెలంగాణను ఏర్పాటు చేశాం. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారు. కాంగ్రెస్ నేతలను బెదిరిస్తున్నారు.తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోంది. అవినీతిపై తెలంగాణ రికార్డు సాధిస్తోంది.బీజేపీకి మద్దతు పలికేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేసింది. తెలంగాణలో మైనార్టీ రిజర్వేషన్లపై ఓవైసీ మౌనంగా ఎందుకున్నారు?. కేసీఆర్‌కు ఓవైసీ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?. బీజేపీని గెలిపించేందుకు ఓవైసీ పోటీ చేస్తున్నారు’’ అని ద్విగిజయ్ సింగ్ దుయ్యబట్టారు. -
గాంధీభవన్‌లో రచ్చ రచ్చ
-
గాంధీభవన్‌లో హైటెన్షన్.. అనిల్‌కుమార్‌పై ఓయూ నేతల దాడి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు గాంధీభవన్ సాక్షిగా బహిర్గతమయ్యాయి. హస్తం నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎదుటే కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. గాంధీభవన్‌లో ఒకరినొకరు కాలర్లు పట్టుకుని వాగ్వాదానికి దిగారు. వివరాల ప్రకారం.. గాంధీభవన్‌లో ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలతో అనిల్‌కుమార్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అనిల్‌కుమార్‌పై ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలు దాడికి యత్నించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డినే తిడతావా అంటూ అనిల్‌పై ఎన్ఎస్యూఐ నేతలు దాడి చేశారు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్.. సేవ్ కాంగ్రెస్, దొంగల నుంచి పార్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం, అనిల్ కుమార్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో, గాంధీభవన్‌లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. గాంధీభవన్‌లో ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ నేత మల్లురవి స్పందించారు. ఈ సందర్భంగా మల్లురవి మీడియాతో మాట్లాడుతూ.. అన్ని విషయాలు దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్తాము. ఓయూ విద్యార్థుల అంశాలు పార్టీ దృష్టిలో ఉన్నాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత దూషణలు చేయవద్దు. అన్ని సమస్యలపై కూర్చుని మాట్లాడుకుందాము అని కామెంట్స్ చేశారు. జానారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎవరూ లేరు. దిగ్విజయ్ సింగ్‌కు కొన్ని సలహాలు ఇచ్చాను. ఆయన కూడా మాకు కొన్ని సలహాలు ఇచ్చారు. అందరం కలిసి రెండు రోజుల్లో మీ ముందుకు వస్తాము. మేమంతా ఐకమత్యంతో ముందుకు వెళ్తాము అని వ్యాఖ్యలు చేశారు. -
ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదు: టీ కాంగ్ నేతలపై డిగ్గీ రాజా సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ జాతీయ స్థాయి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతర్గత కుమ్ములాటకు చెక్ పెట్టే దిశగా ఏఐసీసీ ఆయన్ని రాష్ట్రానికి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన గాంధీభవన్‌కు వెళ్లారు. పార్టీ నేతలతో విడివిడిగా మాట్లాడిన ఆయన.. వాళ్లను గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది. పార్టీలో జూనియర్, సీనియర్ పంచాయితీ మంచిది కాదని ఆయన నేతలకు సూచించారు. అంతేకాదు.. సమస్యలుంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎవరు ఏం పని చేస్తున్నారో అధిష్టానం అంతా గమనిస్తోంది. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే హైకమాండ్ చూస్తూ ఊరుకోదని వాళ్లకు ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు అసమ్మతి నాయకులతో విడివిడిగా మాట్లాడి.. వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. తర్వాత పీఏసీ సభ్యుల కమిటీ (22 మంది)తో చర్చలు జరిపారు. ఎంపీలు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీనియర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రేవంత్ ఏకపక్ష వైఖరి, మాణిక్యం ఠాగూర్ వ్యవహారశైలి, సీనియర్లను కోవర్టులుగా చిత్రీకరించేందుకు యత్నించడం, సోషల్‌మీడియాలో దుష్ప్రచారం సహా పలు అంశాలపై అసంతృప్తులు నివేదికలు సిద్ధం చేసుకుని.. దిగ్విజయ్ సింగ్‌కు సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటపై దిగ్విజయ్ సింగ్ పాత్రికేయ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. -
దిగ్విజయ్ సింగ్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
-
దిగ్విజయ్‌తో భేటీ.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గత 20 నెలలుగా జరుగుతున్న పరిణామాలను దిగ్విజయ్ కు వివరించినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి దిగ్విజయ్ బస చేసిన హోటల్‌కు వెళ్లి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ పరిస్థితుల్లో ఉందో దిగ్విజయ్‌కు చెప్పానన్నారు. అన్ని విషయాలూ మాట్లాడుకున్నామని, అందులో బయటకు చెప్పలేని విషయాలు కూడా ఉన్నాయన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కొన్ని సలహాలు ఇచ్చానని తెలిపారు. తాను గురువారం గాం«దీభవన్‌కు రాలేని పరిస్థితి కారణంగానే ముందే కలిశానని చెప్పారు. హోటల్లో రాజకీయాలు మాట్లాడను రాజకీయాలు హోటల్లో మాట్లాడేవి కావని, పార్టీ ఆఫీస్‌లో వాటి గురించి మాట్లాడతానని దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పార్టీలో వర్గాలు లేవని, అందరూ కాంగ్రెస్ సభ్యులేనని చెప్పారు. చదవండి: సర్దుకుపోదాం రండి!.. టీపీసీసీ నేతలతో దిగ్విజయ్ భేటీ -
సర్దుకుపోదాం రండి!.. టీపీసీసీ నేతలతో దిగ్విజయ్ భేటీ
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ నేతల అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు అధిష్టానం దూతగా సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ వచ్చారు. బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్ కుమార్, పార్టీ ముఖ్య నేతలు హర్కర వేణుగోపాల్‌రావు, సంగిశెట్టి జగదీశ్ తదితరులు స్వాగతం పలికారు. దిగ్విజయ్ నేరుగా తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయన్ను కలిశారు. కాగా గురువారం ఉదయం 11 గంటల నుంచి గాంధీభవన్‌లో దిగ్విజయ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో విడివిడిగా భేటీ కానున్నారు. పీసీసీ డెలిగేట్ల నియామకం నుంచి పీసీసీ కమిటీల ఏర్పాటు, రేవంత్ రెడ్డితో సీనియర్ల సమన్వయం, పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు గల కారణాలపై వారితో చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం నాలుగున్నర గంటల సమయంలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడనున్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సమాచార సేకరణ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు. హైదరాబాద్ బయలుదేరడానికి ముందే ఢిల్లీలో ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు నదీమ్ జావెద్, బోసురాజుతో సమావేశమయ్యారు. పార్టీలో విభేదాలకు గల కారణాలపై ఆరా తీశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సీనియర్లకు పొసగకపోవడానికి గల కారణాలు, పీసీసీ కమిటీపై సీనియర్ల అభ్యంతరాలు, వారి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. పీసీసీలో రేవంత్ వర్గంగా ఉన్న నేతల వివరాలు, వారి రాజీనామాల అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. రేవంత్‌కు, సీనియర్ల మధ్య సమన్వయానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రయత్నాల వివరాలను తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్‌కు వెళ్లిన దిగ్విజయ్.. మాణిక్యం ఠాగూర్‌తోనూ సమావేశమై పార్టీలో విభేదాలపై చర్చించారు. ఆ తర్వాతే హైదరాబాద్ బయలుదేరారు. వాదనలకు సిద్ధం: దిగ్విజయ్ ముందు తమ వాదనలు వినిపించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు సిద్ధమయ్యాయి. పార్టీ అభివృద్ధికి తాము కష్టపడిన తీరును, సీనియర్లతో సమన్వయం కోసం రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నాలను వివరించేందుకు రేవంత్ వర్గం సిద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు రేవంత్ ఏకపక్ష వైఖరి, మాణిక్యం ఠాగూర్ వ్యవహారశైలి, పీసీసీ పదవుల్లో పార్టీలోని పాతకాపులకు జరిగిన అన్యాయం, సీనియర్లను కోవర్టులుగా చిత్రీకరించేందుకు యత్నించడం, సోషల్‌మీడియాలో దుష్ప్రచారం తదితర అంశాలపై సీనియర్లు నివేదికలు సిద్ధం చేసుకున్నారు. ఇలావుండగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి గురువారం నాటి సమావేశానికి హాజరుకావడం లేదని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
‘దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారా?.. లాక్డౌన్ విధిస్తారా?’
కరోనా వైరస్ టెన్షన్ ఇంకా కొనసాగుతోంది. కొద్దిరోజులుగా డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో, చైనాలో ఇప్పటికే పలు పాంత్రాల్లో లాక్డౌన్ సైతం విధించి చైనీయులపై అక్కడి సర్కార్ ఆంక్షలు సైతం విధించింది. ఈ తరుణంలో కరోనా కేసులు విషయంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కాగా, కరోనా కేసులు పెరుగుతాయనే వైద్య నిపుణుల సూచనలు నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవీయా కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను సైతం వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగానే భారత్ జోడో యాత్ర.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చేసుకోవాలని, టీకా వేసుకున్న వారే ఈ యాత్రలో పాల్గొనాలని.. లేని పక్షంలో యాత్రను వాయిదా వేసుకోవాలని లేఖలో రాహుల్ కోరారు. ఇక, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాండవీయా లేఖపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విషయంలో దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారా?. దేశంలో బహిరంగ సభలు పెట్టకూడదనే షరతు ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ నేతలకు వర్తిస్తాయా?. దేశంలో మరోసారి కరోనా లాక్డౌన్ విధించబోతున్నారా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇదిలా ఉండగా.. రాబోయే రోజుల్లో వైరస్ కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో వైద్య నిపుణులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, కేసుల ట్రాకింగ్‌కు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. సీనియర్ సిటిజన్లు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించారు. ఇక, అంతకు ముందు.. పరిస్థితి ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అంటూ మాండవీయా ట్వీట్ చేశారు. ఇక కోవిడ్‌పై ప్రధానంగా జరిగిన హైలెవల్ రివ్యూలో మంత్రితో పాటు అధికారులంతా మాస్కులు ధరించి ఉండడం గమనార్హం. -
తెలంగాణ కాంగ్రెస్‌పై హైకమాండ్ ఫోకస్.. రంగంలోకి దిగ్విజయ్ సింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌పై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదాల పరిష్కారానికి అధిష్టానం దూతలు రంగంలోకి దిగారు. సంక్షోభ నివారణ బాధ్యతలు రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్‌కు అప్పజెప్పుతూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ మంగళవారం ఫోన్ చేశారు. సాయంత్రం సీనియర్ల సమావేశాన్ని వాయిదా వేయాలని దిగ్విజయ్ సూచించారు. ఈ మేరకు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నేతలతో దిగ్విజయ్ భేటీ కానున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని దిగ్విజయ్ చెప్పారని పేర్కొన్నారు. కాగా ముందస్తు నిర్ణయం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేశ్వర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్లు భేటీకావాల్సి ఉంది. అయితే దిగ్విజయ్ సింగ్ ఫోన్‌తో వారు వెనక్కి తగ్గారు. తాజా పరిణామాల నేపథ్యంలో సాయంత్రం జరగాల్సిన కాంగ్రెస్ సీనియర్ల సమావేశం వాయిదా పడింది. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మహేష్ గౌడ్, కోదండరెడ్డి భేటీ అయ్యారు. సాయంత్రం సీనియర్ల సమావేశం వాయిదా వేయాలని కోరారు. చదవండి: తెలంగాణ పీసీసీలో విభేదాలపై ప్రియాంక నజర్ -
భారత్ జోడో యాత్రిలతో దిగ్విజయ్ సింగ్ డ్యాన్స్
-
Bharat Jodo Yatra: యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూస్తారు
తురువుకెరె(కర్ణాటక): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐక్య భారతానికి ప్రతీకగా మారారని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అభివర్ణించారు. ఆదివారం దిగ్విజయ్ పీటీఐకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖాముఖిలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా కొనసాగే భారత్ జోడో యాత్ర సమాప్తమయ్యాక మరింత పటిష్టమైన నాయకత్వ లక్షణాలను సంతరించుకున్న రాహుల్‌ను చూస్తారు. ఆయన కొత్త అవతారం మొదలుకానుంది. యావత్ ప్రజానీకంలో కాంగ్రెస్ పట్ల మరింత సానుకూల వైఖరిని పాదయాత్ర పెంచుతుందనడంలో సందేహమే లేదు. చాన్నాళ్ల తర్వాత దేశంలోని ప్రతి పల్లెలోనూ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. తొలి నుంచీ కడదాకా యాత్రలో రాహుల్ మమేకమైన విధానం చూసి జనం బాగా మెచ్చుకుంటున్నారు. యాత్రతో పార్టీ మరింత బలాన్ని పుంజుకుంటుంది. మన దేశంలో త్యాగధనులందరికీ సరైన మన్నన దక్కుతుంది. ప్రధాని పదవిని సోనియా గాంధీ త్యజించారు. ఇప్పుడు రాహుల్ మండుటెండలో చెమటోడుస్తూ, హోరు వానలో తడుస్తూ, అబద్ధపు వార్తలు, ప్రతిష్ట దిగజార్చే వ్యాఖ్యలను ఎదుర్కొంటూ జనం కోసం ముందుకు సాగుతున్నారు. భారత్ జోడోకు సిసలైన సంకేతంగా నిలిచారు. యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూడటం ఖాయం. అనుకున్న లక్ష్యంగా కోసం రాహుల్ అవిశ్రాంతంగా కృషిచేస్తారు. సానుకూల దృక్పథమే స్ఫూర్తిగా పనిచేస్తారు’ అని దిగ్విజయ్ అన్నారు. ‘‘ క్రియాశీలక కార్యకర్తల సంఖ్య పరంగా చూస్తే బీజేపీ ‘ఆర్గనైజేషన్’ కంటే కాంగ్రెస్ కాస్త వెనుకబడిందనే చెప్పాలి. కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య సమన్వయం తగ్గింది. అయితే, ఇప్పుడు భారత్ జోడో యాత్ర ద్వారా లక్షలాది మంది స్వస్థలాలను వదిలి మరీ పాదయాత్రలో కదం తొక్కుతున్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. ఇలాంటి జనోద్యమాల ద్వారానే నాయకులు పుట్టుకొస్తారు’ అని వ్యాఖ్యానించారు. ‘‘పార్టీ ఘన గత చరిత్రతో పోలిస్తే ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలహీనంగా తయారై సమస్యలను ఎదుర్కొంటోంది. యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నాం. గ్రామాలు, పట్టణాలు ఇలా ప్రతిస్థాయిలో యాత్రలో సమన్వయం కోసం ప్రతీ రాష్ట్రంలో, జిల్లాలో సమన్వయకర్తలను నియమించాం. యాత్రలో కార్యకర్తలు మొదలుకొని నేతలంతా భాగస్వాములయ్యేలా చేశాం. ఇది పార్టీ క్షేత్రస్థాయి పటిష్టతకు బాటలుపరుస్తుంది. ఇంటింటికీ వెళ్లి అభిప్రాయాలు సేకరించాలని స్థానిక నేతలకు సూచించాం. యాత్రతో చేకూరిన మేలు ఏంటంటే.. అది మీడియా దృష్టిలో పడటం’ అని అన్నారు. -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రేసు నుంచి తప్పుకున్న డిగ్గీ రాజా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజున అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పోటీ చేస్తారని భావించిన దిగ్విజయ్ సింగ్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే పోటీ చేసున్నందునే తాను బరిలో నిలవడం లేదని చెప్పారు. ఖర్గేకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దిగ్విజయ్ సింగ్ నిర్ణయంతో ఇప్పుడు పోటీ శశిథరూర్, ఖర్గే మధ్యే ఉండనుంది. ఇద్దరు కాసేపట్లో అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ సమర్పిస్తారు. గాంధీ కుటుంబం విధేయుడిగా పేరున్న ఖర్గేనే విజయం సాధించే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అని మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్ జీ-23నేతలు బరిలో నిలవద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తానూ పోటీ చేస్తానని జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠి ప్రకటించారు. మధ్యాహ్నం నామినేషన్ సమర్పిస్తానని చెప్పారు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని సోనియా గాంధీ చెప్పారని పేర్కొన్నారు. ఈ సారి గాంధీ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వారు పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 1994లో పీవీ నరసింహారావు చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు శశిథరూర్, ఖర్గేలో ఎవరు గెలిచినా మరోసారి ఆ పదవి చేపట్టిన దక్షిణాది నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. వీవీ నరసింహారావు తర్వాత 1996-98 వరకు సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి 2017వరకు సోనియా గాంధీనే ఆ పదవిలో కొనసాగారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. చివరిరోజు తెరపైకి కొత్త పేరు -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. చివరిరోజు తెరపైకి కొత్త పేరు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి కొత్తపేరు వచ్చింది. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖేర్గే రేసులో ఉండనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లకు చివరి రోజున అనూహ్యంగా ఖర్గే బరిలోకి రావడం ఆసక్తికరంగా మారింది. హస్తం పార్టీ అధ్యక్ష పదవికోసం సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్‌లో ఊహించని పరిణామాల కారణంగా సీఎం అశోక్ గహ్లోత్ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో గాంధీ కుటుంబం విధేయుల్లో ఒకరైన ఖర్గేను బరిలోకి దింపాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆమె ఆమోదం తెలిపితే ఖర్గే వెంటనే నామినేషన్ దాఖలు చేస్తారని పేర్కొన్నాయి. ఈయన పోటీతో అధ్యక్షపదవికి త్రిముఖ పోరు ఉండనుంది. దిగ్విజయ్ డౌట్! మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిగ్విజయ్ సింగ్.. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఖర్గే నివాసానికి వెళ్లారు. పోటీలో ఉండాలంటే బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వీరు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. అయితే గాంధీల విధేయుడైన ఖర్గే బరిలో ఉండటంతో దిగ్వజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. దళిత వర్గానికి చెందిన ఖర్గే.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. 8 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు లోక్ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. హోంమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. జీ-23నేతల ఆయోమయం మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని జీ-23 నేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు సీనియర్ నేతలు పృథ్విరాజ్ చవాన్, భూపిందర్ హుడా, మనీశ్ తివారీలు ఆనంద్ శర్మ నివాసంలో భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై వీరు సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు పార్టీ సన్నిహత వర్గాలు పేర్కొన్నాయి. చాలా ఏళ్ల తర్వాత దక్షిణాది నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు శుక్రవారం(సెప్టెంబర్ 30) చివరి తేది. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ సారి గాంధీ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వారు పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 1994లో పీవీ నరసింహారావు చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు శశిథరూర్, ఖర్గే ఎవరు గెలిచినా మరోసారి ఆ పదవి చేపట్టిన దక్షిణాది నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. వీవీ నరసింహారావు తర్వాత 1996-98 వరకు సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి 2017వరకు సోనియా గాంధీనే ఆ పదవిలో కొనసాగారు. చదవండి: ‘గాంధీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యం’ -
Sakshi Cartoon 30-09-2022
-
‘గాంధీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యం’
భోపాల్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యమని నొక్కి చెప్పారు. మరోవైపు.. వివిధ రాష్ట్రాల్లో పార్టీలో తలెత్తిన సంక్షోభంపై మాట్లాడారు. ‘చాలా సార్లు పార్టీలో చీలికలు వచ్చాయి. కానీ 99 శాతం కాంగ్రెస్ నేతలు దేశానికి స్వంతంత్రానికి ముందు, తర్వాత సేవ చేసిన కుటుంబానికి మద్దుతుగానే నిలిచారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్‌కు గుర్తింపే లేదు.’ అని పేర్కొన్నారు. రాజస్థాన్ సంక్షోభం దురదృష్టకరం.. అశోక్ గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటంతో రాజస్థాన్‌లో సంక్షోభం తలెత్తిన పరిస్థితులు దురదృష్టకరమన్నారు దిగ్విజయ్ సింగ్. పార్టీ అధ్యక్ష పదవికి గెహ్లోట్ పోటీ చేస్తే.. ఆయన నిర్ణయాన్ని అధిష్టానం గౌరవించేదన్నారు. ‘ఇప్పటికీ, అశోక్ గెహ్లోత్ అధికారిక అభ్యర్థిగా భావిస్తున్నాం. ఆయన పోటీలో ఉంటే దానిని స్వాగతిస్తాం. ఆయన ఎల్లప్పుడూ కాంగ్రెస్‌కు విధేయుడిగానే ఉన్నారు. కానీ, రాజస్థాన్‌లో తలెత్తిన దురదృష్టకర పరిస్థితులతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.’ అని తెలిపారు దిగ్విజయ్ సింగ్. ఇదీ చదవండి: దిగ్విజయ్‌తో థరూర్ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు -
‘మా మధ్య ఫ్రెండ్లీ పోటీనే’.. డిగ్గీ రాజాతో పోరుపై థరూర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎన్నో మలుపులు, మీటింగ్‌లతో ఉత్కంఠ రేపుతున్నాయి. ముందు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రేసులో ముందు వరుసలో ఉంటారని భావించినప్పటికీ.. ఊహించని విధంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్ నేతలు శశి థరూర్, దిగ్విజయ్ సింగ్‌లు బరిలో నిలుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్ష పోటీపై ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇరువురు నేతలు ఆలింగనం చేసుకున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు శశి థరూర్. ‘ఇది ప్రత్యర్థుల మధ్య జరిగే పోటీ కాదు.. సహచరుల మధ్య జరిగే స్నేహపూర్వక పోటీ’ అని పేర్కొన్నారు. శశిథరూర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. శశి థరూర్ వ్యాఖ్యాలకు తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీ మతత్వత శక్తులకు వ్యతిరేకంగా జరుగుతోందని, తాము ఇరువురు గాంధీయన్, నెహ్రూవియన్ భావజాలాలను నమ్ముతామని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై శశిథరూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. ఇరువురు నేతలు తమ నామినేషన్ పత్రాలను శుక్రవారం దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. అధ్యక్ష పోటీలో నిలిచేందుకు నామినేషన్ పత్రాలను శశిథరూర్.. వారం రోజుల క్రితమే తీసుకోగా.. దిగ్విజయ్ సింగ్ గురువారం తీసుకున్నారు. Received a visit from @digvijaya_28 this afternoon. I welcome his candidacy for the Presidency of our Party. We both agreed that ours is not a battle between rivals but a friendly contest among colleagues. All we both want is that whoever prevails, @incIndia will win!✋🇮🇳 pic.twitter.com/Df6QdzZoRH — Shashi Tharoor (@ShashiTharoor) September 29, 2022 I agree @ShashiTharoor we are fighting the Communal Forces in India. Both believe in the Gandhian Nehruvian Ideology and shall fight them relentlessly come what may. Best wishes. @INCIndia @RahulGandhi @priyankagandhi @Jairam_Ramesh https://t.co/5KHn6P8Yug — digvijaya singh (@digvijaya_28) September 29, 2022 ఇదీ చదవండి: Congress President Elections: పోటీ నుంచి తప్పుకున్న అశోక్ గహ్లోత్ -
యస్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా
సాక్షి, ఢిల్లీ: గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ వీడింది. రేసులో ఎవరు తుది వరకు నిలుస్తారనే అనుమానాల నడుమ.. ద్విముఖ పోటీ ఖరారు అయ్యింది ఇవాళ. అశోక్ గెహ్లాట్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. దిగ్విజయ్ సింగ్ బరిలో నిలిచినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న్టట్లు అధికారికంగా ప్రకటించారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. తొలుత పోటీ విషయంలో ఊగిసలాట ప్రదర్శించిన ఆయన.. ఇవాళ(గురువారం) నామినేషన్ ఫామ్‌లు తీసుకున్నారు. అనంతరం మీడియాకు ఆ విషయాన్ని తెలియజేశారు. అవును.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. అందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలివే అని ఆయన చూపించారు. అనంతరం ఆయన సోనియా గాంధీ నివాసానికి వెళ్లి.. కాసేపు చర్చించారు. ఇక మరో సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఇదివరకే నామినేషన్ పత్రాలను తీసుకున్న విషయం తెలిసిందే. నామినేషన్లు వేసేందుకు చివరి రోజైన రేపు(సెప్టెంబర్ 30న).. ఈ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి, అశోక్ గెహ్లాట్.. పోటీ నుంచి తప్పుకున్నారు. సోనియా గాంధీతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన వివరాలను వెల్లడించారు. జరిగిన పరిణామాలపై అధిష్టానానికి క్షమాపణ చెప్పినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు.. అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్-దిగ్విజయ్‌సింగ్ మధ్యే పోటీ ఉంటుందని గెహ్లాట్ ప్రకటించారు. అశోక్ గెహ్లాట్.. అధిష్టానానికి ఇష్టుడిగా బరిలో దిగుతారని అంతా భావించారు. దీంతో ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక కావొచ్చనే చర్చ నడిచింది. అయితే ఒక్క వ్యక్తి.. ఒక్క పదవి కారణంతో ఆయన తనకు నచ్చిన వ్యక్తిని రాజస్థాన్ సీఎం చేయాలని భావించగా.. సచిన్ పైలట్ పేరు తెర మీదకు రావడంతో ఎమ్మెల్యేల తిరుగుబాటు అక్కడి రాజకీయం కలకలం రేపింది. ఈ క్రమంలో.. పరిణామాలపై వివరణ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వివరణ కోరగా.. ఇవాళ ఆయన ఆమె నివాసంలో భేటీ అయ్యారు. -
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్!
బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ధిక్కార స్వరం వినిపిస్తుండడంతో తాజాగా సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. అధ్యక్ష ఎన్నికలో దిగ్విజయ్ బరిలోకి దిగడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సోనియా గాంధీ బుధవారం సీనియర్ నాయకుడు, పార్టీకి విధేయుడైన ఏకే ఆంటోనీతో సమావేశయ్యారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి దింపాల్సిన అభ్యర్థిపై గంటన్నరకు పైగా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు అశోక్ గెహ్లాట్ గురువారం సోనియాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తన వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానంపై ప్రదర్శించిన ధిక్కార వైఖరి పట్ల సోనియాకు గెహ్లాట్ ఫోన్లో ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనక తన హస్తం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం. అది దిగ్విజయ్ వ్యక్తిగత నిర్ణయం దిగ్విజయ్ సింగ్ సాధ్యమైనంత త్వరగా ఢిల్లీకి చేరుకుంటారని, శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలన్నది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో పార్టీ నాయకత్వం ప్రమేయం లేదని వెల్లడించాయి. దిగ్విజయ్ ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా, తాను సైతం బరిలో ఉంటానని సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశీ థరూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నానని ఆయన ఇటీవలే తేల్చిచెప్పారు. అధినేత్రి సోనియాగాంధీ ఆదేశిస్తే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో దిగేందుకు పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) సిద్ధమని ఆయన సన్నిహితుడొకరు బుధవారం చెప్పారు. అధ్యక్ష బరిలో దిగేందుకు తనకు ఆసక్తి లేదని సీనియర్ నేత కమల్‌నాథ్ మరోసారి స్పష్టం చేశారు. తన దృష్టంతా ఏడాదిలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందన్నారు. -
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో డిగ్గీ రాజా.. ఏం జరుగుతుందో చూద్దాం!
భోపాల్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే రేసులో సీనియర్ నేత శశిథరూర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉండనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కీలక నేత దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఆయన సైతం ఉన్నారని, గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దిగ్విజయ్ సింగ్ పోటీలో నిలుస్తారా? లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో.. స్పష్టతనిచ్చారు సింగ్. భోపాల్‌లో ఓ విలేకరి ప్రశ్నించగా పలు విషయాలు వెల్లడించారు. ‘ఈ విషయంపై నేను ఎవరితోనూ చర్చించలేదు. పోటీలో నిలిచేందుకు అధిష్టానం అనుమతి ఇవ్వాలని కోరలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. నేను పోటీ చేస్తానా? లేదా అనేది నాకే వదిలేయండి.’ అని విలేకరుల సమావేశంలో తెలిపారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మద్దతు ఎమ్మెల్యేలు సుమారు 80కిపైగా రాజీనామాలు సమర్పించటం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాలనే డిమాండ్లు సైతం వచ్చాయి. కానీ, ఆయన పోటీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొనటం చేయటం గమనార్హం. మరోవైపు.. అశోక్ గెహ్లాట్ రేసు నుంచి తప్పుకుంటే దిగ్విజయ్ సింగ్‌కే అవకాశాలు ఉన్నాయని పార్టీలో వినిపిస్తోంది. ఇదీ చదవండి: ఇద్దరే పోటీ చేయాలా? అధ్యక్ష రేసులో నేనూ ఉన్నా.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు -
ఇద్దరు కాదు ముగ్గురు.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి కొత్త పేరు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది. ఇప్పటివరకు కేరళ ఎంపీ శశిథరూర్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ మధ్యే పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతుండగా.. రేసులో నేనూ ఉన్నా అని కీలక వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్. ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయకూడదా? అని ఓ జాతీయ ఛానల్‌తో ఇంటర్వ్యూలో అన్నారు. నన్నెందుకు పోటీ నుంచి తీసేస్తున్నారని ప్రశ్నించారు. నామినేషన్లకు చివరి తేదీ ఆయిన సెప్టెంబర్ 30న పోటీలో ఎవరెవరు ఉండేది తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే అశోక్ గహ్లేత్ కచ్చితంగా సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఒక్కరికి ఒకే పదవి అని ఉదయ్‌పూర్‌లో పార్టీ డిక్లరేషన్‌ను గుర్తు చేశారు. తాను ఒక్కటే కాదు.. మూడు పదవులనూ కూడా సమర్థంగా నిర్వహించగలనని అశోక్ గహ్లోత్ మీడియాతో మాట్లాడుతూ అన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా రాజస్థాన్ సీఎంగా కొనసాగుతానని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. దిగ్విజయ్ దీనిపైనే స్పందిస్తూ ఒక్కరికి ఒకే పదవి అని తేల్చి చెప్పారు. అంతేకాదు అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని దిగ్విజయ్ అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా బరిలో ఉండవచ్చన్నారు. పోటీ చేయొద్దనుకునే వారిని బలవంతం చేయవద్దని సూచించారు. అధ్యక్షుడు కాకపోతే పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా రాహుల్ నిర్వర్తిస్తారని దిగ్విజయ్ స్పష్టం చేశారు. గాంధీలు పదవుల్లో లేనప్పుడు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీని నడిపించిన విషయాన్ని గుర్తు చేసారు. పీవీ నరసింహా రావు, సీతారం కేసరి పేర్లను ప్రస్తావించారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు -
కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వచ్చే నెల 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో భారత్ జోడో యాత్ర లోగో, వెబ్‌సైట్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, యాత్ర నిర్వాహక కమిటీ దిగ్విజయ్ సింగ్ మీడియా సమావేశంలో ‘కలిసి నడుద్దాం..దేశాన్ని కలిపి ఉంచుదాం(మిలే కదమ్.. జుడే వతన్)’అనే నినాదంతో కూడిన జోడో యాత్ర నాలుగు పేజీల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర వెబ్‌సైట్‌ను ప్రారంభించారు కాంగ్రెస్ నేతలు. యాత్రలో పాల్గొనదలిచిన వారు వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాల్గొనే ప్రధాన యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని 5 నెలలపాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగి కశ్మీర్లో ముగియనుందన్నారు. ఇదీ చదవండి: రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ -
రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి.. క్యాడర్లో ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఒకౖవెపు ఆయన పార్టీని విడిచి వెళ్లకుండా అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గానికి చెందిన కొంతమంది అనుచరులు కూడా పార్టీని వీడొద్దని చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు పార్టీలోకి రావాలంటూ బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. అయితే ఆయన పార్టీ మారడానికే నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఆయన పార్టీ మారడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తథ్యమని తెలుస్తోంది. దిగ్విజయ్ ఫోన్ పార్టీ వీడే అంశంపై నియోజకవర్గ అనుచరగణంతో రాజగోపాల్‌రెడ్డి వరుస సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా.. పార్టీ వీడొద్దని కొంతమంది అనుచరులు చెప్పినట్లు తెలిసింది. ఆయన మాత్రం నాలుగైదేళ్లుగా పార్టీ నాయకత్వం ఏ విధంగా అవమానించిందన్న విషయాన్నే వివరించినట్లు సమాచారం. కాగా బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన రాష్ట్ర నేతలు.. రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తద్వారా అధిష్టానం బుజ్జగింపులకు ప్రయత్నిస్తుందనే సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఒకప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం రాజగోపాల్‌రెడ్డికి ఫోన్ చేయడం హైకమాండ్ ఆలోచనను స్పష్టం చేసింది. పార్టీ మారవద్దని సూచించడంతో పాటు ఏదైనా ఉంటే రెండురోజుల తర్వాత ఢిల్లీకి రావాల్సిందిగా దిగ్విజయ్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రేపు రాజగోపాల్‌తో భేటీ! మరోవైపు ఉదయం ఢిల్లీలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై రెండు గంటల పాటు చర్చించారు. ఆయన పార్టీలోనే ఉండేలా చూడాలని అధిష్టానం వీరికి సూచించినట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా శనివారం సాయంత్రం రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఒత్తిడి పెంచుతున్న బీజేపీ! మరోవైపు పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ వైపు నుంచి రాజగోపాల్‌పై ఒత్తిడి పెరిగి నట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని, శుక్రవారం బండి సంజయ్, ఈటల, కిషన్‌రెడ్డి తదితర నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన్ను ఎలాగైనా ఢిల్లీ తీసుకెళ్లాలని సంజయ్, ఈటల తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ క్యాడర్లో ఉత్కంఠ అధిష్టానం బుజ్జగింపులతో రాజగోపాల్ రెడ్డి శాంతిస్తారా? పార్టీని వీడే విషయంలో వెనక్కి తగ్గుతారా? లేక ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపుతారా? అనే విషయమై కాంగ్రెస్ క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి తాజా పరిణామాలకు ముందే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. తాజాగా అధిష్టానం రంగంలోకి దిగడంతో ఆయన వైఖరి ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. శనివారం నాటి సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అధిష్టానం బుజ్జగింపులు, అనుచరుల అభిప్రాయంతో రాజగోపాల్‌రెడ్డి కొంత సందిగ్ధంలో పడినా, ఏఐసీసీ దూతలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా.. బీజేపీలో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ ఫోన్
-
టార్గెట్ రాజగోపాల్ రెడ్డి.. కీలకంగా మారనున్న ఫోన్‌కాల్!
Komatireddy Raj Gopal Reddy.. తెలంగాణలో పాలిటిక్స్ శరవేగంగా మారుతున్నాయి. పొలిటికల్ లీడర్లు పార్టీలు మారుతుండటం రాజకీయంగా ప్రాధానత్యను సంతరించుకుంది. అధికార పార్టీ నేతలతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు జంపింగ్‌లు చేస్తున్నారు. తాజాగా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ అయిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం పార్టీ నేతల కదిలికలపై ఫోకస్ పెంచినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే పనిలోపడినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోమటిరెడ్డితో చర్చలు జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాజగోపాల్ రెడ్డితో చర్చించేందుకు మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని దూతగా పంపాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. రాజగోపాల్‌ను ఒప్పించే బాధ్యతలను ఉత్తమ్‌కు అప్పగించింది. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డితో ఉత్తమ్ శనివారం చర్చలు జరుపనున్నారు. మరోవైపు.. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడుతున్నారు. కాగా, గురువారం ఉదయం రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రోజుల్లో ఢిల్లీకి రావాలని కోరారు. పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చిద్దామని హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: గ్రేటర్‌లోనూ కమలం వల! ఆకర్ష ఆపరేషన్ -
కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు!
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో భోపాలీలంటే స్వలింగ సంపర్కులంటూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కామెంట్లు చేయడంపై దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే డిగ్గీ రాజా సీరియస్ అయ్యారు. వివేక్ అగ్నిహోత్రి గారు.. ఇది మీ వ్యక్తిగత అనుభవం కావచ్చు. అంతేగానీ భోపాల్ ప్రజలది కాదు. నేను 77 ఏళ్ల నుంచి భోపాల్, అక్కడి ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నా. కానీ నాకు ఏనాడూ అలాంటి అనుభవం ఎదురు కాలేదు. ఎక్కడున్నా.. మీ పక్కన ఉండేవాళ్ల ప్రభావమే దానికి కారణమై ఉంటుందని గుర్తించండి అంటూ ట్వీట్‌తో దిగ్విజయ్ సింగ్, వివేక్ అగ్నిహోత్రికి చురకలు అంటించారు. ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ‘‘నేను భోపాల్‌లో పెరిగినా, అనుబంధం ఉన్నా.. భోపాలీ అని పిలుచుకోవడానికి ఇష్టపడను. ఎందుకంటే.. ఆ పదానికి ఒక నిర్దిష్ట అర్థం జనాల మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. భోపాలీలు స్వలింగ సంపర్కులుగా భావించబడుతున్నారని, అందుకు బోఫాల్ నవాబీ నగరం కావడం, వాళ్ల కోరికలే కారణం అయి ఉండొచ్చు’ అని వివేక్ అగ్నిహోత్రి వెకిలి వ్యాఖ్యలు చేశాడు. इस दोयम दर्जे की मान्यता के लिए मेरी ओर से..#I_M_Sorry_Bhopal भोपाली होना होमोसेक्सुअल होना कैसे हो सकता है..? लखनऊ,हैदराबाद,मैसूर भी तो नवाबी शहर हैं..तो क्या वहां भी..! छि: अगर हम भी कहते फिरें कि तनु श्री दत्त आपको लेकर ऐसा बोलती है तो क्या आप मान लेंगे.!@vivekagnihotri pic.twitter.com/teh5fmixZ0 — Govind ਗੋਵਿੰਦ گووند गोविंद गुर्जर (@govindtimes) March 25, 2022 ఇదిలా ఉండగా.. ఈ కామెంట్లపై మీడియా వివేక్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. శుక్రవారం ఉదయం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ అగ్నిహోత్రిని మీడియా ప్రతినిధులు ‘హెమోసెక్సువల్స్’ కామెంట్లపై వివరణ అడగ్గా మౌనంగా వెళ్లిపోయారు. ఆయన వెంట ఉన్న బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వరిగ్యాను మీడియా అడ్డుకుని ‘నేను ఇండోర్వాసిని. అదేదో ఆయన్నే(వివేక్ అగ్నిహోత్రి) అడగొచ్చుగా’ అంటూ తప్పించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా ఈ వ్యవహారం ఆధారంగా బీజేపీపై సెటైర్లు సంధించారు. అగ్నిహోత్రి వ్యాఖ్యలపై నేనేం మాట్లాడను. కానీ, రాఘవ్ జీ భాయ్, ఆరెస్సెస్ ప్రచారక్ ప్రదీప్ జోషి వ్యవహారాలు(స్వలింగ సంపర్కులనే విషయం) వెలుగులోకి వచ్చాకే ఆయన(వివేక్ అగ్నిహోత్రి) స్పందించాడా? వాటి ఆధారంగానే భోపాల్ మొత్తాన్ని హోమోసెక్సువల్స్ అంటున్నాడా? ఇంతకీ అగ్నిహోత్రిపై వాళ్లు తీసుకోబోయే చర్యలేంటి? అంటూ మధ్యప్రదేశ్ హోంమంత్రిని ట్యాగ్ చేస్తూ మరీ ఓ సెటైరిక్ ట్వీట్ చేశాడు కేకే మిశ్రా. राघवजी भाई या संघ प्रचारक प्रदीप जोशी आदि के सामने आए प्रकरणों के बाद विवेक अग्निहोत्री ने कुछ कहा हो तो मैं खामोश हूं! पर समूचे भोपाल को समलैंगिकों का शहर बताना उचित है? @drnarottammisra जी,क्या अन्य फ़िल्म निर्माताओं के अनुरूप कार्यवाही होगी या हम सभी??कथित हिंदूवादी भी चुप? pic.twitter.com/6rFJXV2PEC — KK Mishra (@KKMishraINC) March 25, 2022 అంతేకాదు వివేక్‌పై చర్యలు తీసుకోలేని రాజకీయ నంపుసకత్వం అంటూ తీవ్ర వ్యాఖ్యలతో మరో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా.. వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలపై భోపాల్‌కు చెందిన జర్నలిస్టులు, ఉద్యమకారులు సోషల్ మీడియాలో అసంతృప్త నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
కాంగ్రెస్‌కు అవే చివరి ఎన్నికలు.. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
భోపాల్: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో 2023 ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి చివరి అసెంబ్లీ ఎన్నికలు అవుతాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. దిగ్విజయ్ సింగ్ శనివారం రత్లాం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అది జరగని పక్షంలో 2023 ఎన్నికలే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చివరి ఎలక్షన్స్ కావచ్చు అంటూ వారిని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు నిజాయితీగా లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయవద్దని సూచించారు. వారి వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అలాంటి వారికి కార్యకర్తలు మద్దతివ్వరూ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
దిగ్విజయ్ వ్యాఖ్యలపై స్పందించిన సింధియా.. ‘ఆ స్థాయి నాది కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా. దిగ్విజయ్ ఎన్ని మాటలు అన్నా.. సింధియా కుటుంబ స్థాయిని నిలబెట్టే విధంగా వ్యవహరిస్తానని ఆయన చెప్పారు. డిగ్గీ స్థాయికి దిగి తాను అలాంటి మాటలు అనలేనని సింధియా తేల్చి చెప్పారు. (చదవండి: మీరే నన్ను చంపేశారు.. నేనే బతికే ఉన్నానయ్య) ఇంతకీ దిగ్విజయ్ ఏం అన్నారంటే.. రఘోఘర్ లో శనివారం రాత్రి జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో జోతిరాధిత్య సింధియా ఓ ద్రోహి అంటూ దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా దోహులే అన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పుకొచ్చారు. దిగ్విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలపై మరుసటి రోజు సింధియా స్పందిచారు. 'అలా మాట్లాటడం ఆయనకు అలవాటే. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆయన స్థాయికి దిగజారి నేను మాట్లాడలేను' అని సింధియా పేర్కొన్నారు. కాగా, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి.. బీజేపీ సర్కారు ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు సింధియా. అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు వీలు చిక్కినప్పుడల్లా ఆయనపై విరుచుకుపడుతున్నారు. (చదవండి: బీజేపీపై సంచలన ఆరోపణలు: కేబినెట్ బెర్త్, డబ్బు ఇస్తామన్నారు!) -
మేము లేకుండా బీజేపీని ఓడించలేరు
న్యూఢిల్లీ: తమ పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. ‘యూపీఏ ఎక్కడుంది’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ భాగస్వామం లేకపోతే ఆత్మలేని శరీరంలా యూపీఏ ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పేర్కొన్నారు. విపక్షాలు ఏకధాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమెందని అభిప్రాయపడ్డారు. బీజేపీకి ప్రయోజనం కలిగేలా మమత బెనర్జీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. శరద్ పవార్ పరువు తీయడానికి ఆమె కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ మద్దతు లేకుండా బీజేపీని ఓడించగలమని కలలు కనడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. (చదవండి: యూపీఏ అన్నదే లేదు.. కాంగ్రెస్ పార్టీతో కలవలేం) కాంగ్రెస్ పార్టీ లేకుండానా? బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ... ‘మా పోరాటం అధికార పార్టీ (బీజేపీ)పైనే. మాతో చేతులు కలపాలనుకునే వారు మాతో రావాలి, మాతో చేరకూడదనుకునే వారు స్వేచ్ఛగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన రాజకీయ కూటమిలో కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యం లేకుండా ఉంటుందా?’ అని ప్రశ్నించారు. (చదవండి: మమత బెనర్జీ వ్యూహమేంటి? ప్రత్యామ్నాయం అవుతారా?) బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలపాలి: ఖర్గే కాంగ్రెస్ తలపెట్టిన వివిధ సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని భాగస్వామి చేయడానికి ప్రయత్నించామని రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ప్రతిపక్షాలు విడిపోయి తమలో తాము పోరాడుకోకుండా.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ చేతులు కలపాలని ఆయన కోరుకున్నారు. -
కాంగ్రెస్ టార్గెట్ 2024; వ్యూహాలు సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: నిరంతరం ప్రజల్లో ఉంటూ మోదీ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 2024లో అధికారమే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటానికి చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళికలను కాంగ్రెస్ సిద్ధం చేసింది. జాతీయ సమస్యలపై నిరంతర ఆందోళన కార్యక్రమాల కోసం ఇటీవల సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన 9మంది సభ్యుల కమిటీ మంగళవారం తొలిసారి భేటీ అయ్యింది. దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో చేపట్టబోయే అంశాలపై ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వార్ రూంలో 2 గంటల పాటు కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు... కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మనీశ్ ఛత్రాత్, బీకే హరిప్రసాద్, రిపున్ బోరా, జుబేర్ ఖాన్, రాగిణి నాయక్, ఉదిత్ రాజ్‌లు పాల్గొని అభిప్రాయాలను వెల్లడించారు. 10 అంశాలపై పోరాటం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్, వ్యవసాయ చట్టాలు, పెగాసస్, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు, రాజద్రోహం చట్టాలు, కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం, కుల జనగణన, ఈవీఎంల రద్దు, 60 నుంచి 80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి 10 అంశాలపై దిగ్విజయ్ నేతృత్వంలోని కమిటీ ఒక ప్రణాళికను రూపొందించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా పలు వ్యూహాలను దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ రూపొందించింది. దేశవ్యాప్తంగా దళితులను తిరిగి పార్టీకి దగ్గర చేయడంతో పాటు, 10 లక్షల బూత్‌లకు పార్టీ చేరుకొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కమిటీ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు గంటల పాటు జరిగిన కమిటీ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించామని, ఏ ప్రజా సమస్యలను చేపట్టి ఏ విధంగా ఆందోళనలు చేపట్టాలి అనే అంశంపై చర్చ జరిగిందని తెలిపారు. 2024 వరకు ప్రజా సమస్యలపై ఆందోళనలు కొనసాగుతాయని మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ తెలిపారు. 2014లో ధరలు ఎలా ఉన్నాయి... ఇప్పుడెలా ఉన్నాయో ప్రజలకు తెలియచేసేలా దేశవ్యాప్తంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తామన్నారు. రెండు, మూడు రోజుల్లో కమిటీ నివేదికను చైర్మన్ దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అందిస్తారని ఉదిత్‌రాజ్ వెల్లడించారు. -
మహిళలపై ఆర్ఎస్ఎస్, తాలిబన్ అభిప్రాయం ఒక్కటే!
భోపాల్: ఉద్యోగాలు చేసే మహిళల విషయంలో మన దేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ల అభిప్రాయం ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, తాలిబన్లు వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోనంత వరకూ ఇదే నిజమని భావించాల్సి వస్తుందని చెప్పారు. 2013లో మోహన్ భగవత్ మాట్లాడినట్లు చెబుతున్న ఓ వీడియోను దిగ్విజయ్ ప్రస్తావించారు. పెళ్లి అనేది ఒక కాంట్రాక్టు, పెళ్లయిన మహిళలు ఇళ్లల్లోనే ఉండాలి, ఇంటి పనులు చూసుకోవాలి అని మోహన్ భగవత్ అన్నారని గుర్తుచేశారు. అఫ్గాన్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదని తాలిబన్లు తేల్చిచెబుతున్నారని వెల్లడించారు. దిగ్విజయ్ ట్వీట్‌ను మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వి.డి.శర్మ తప్పుపట్టారు. దిగ్విజయ్‌తోపాటు కాంగ్రెస్ నాయకత్వం తాలిబన్ల మద్దతుదారులని ఆరోపించారు. -
ఆర్టికల్ 370 రచ్చ.. దిగ్విజయ్‌పై విమర్శల వర్షం
న్యూఢిల్లీ: ఒకవేళ తాము అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ను రద్దుపై పునరాలోచన చేస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఓ పాక్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ ఒకవేళ కేంద్రంలో మేం అధికారంలోకి వస్తే.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంపై తమ పార్టీ పునరాలోచన చేస్తుందన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నాయకులు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం ఏంటో దిగ్విజయ్ వ్యాఖ్యలతో పూర్తిగా వెల్లడయ్యింది. కశ్మీర్ లోయలో కాంగ్రెస్ వేర్పాటువాద బీజాలు నాటుతోంది.. పాక్ డిజైన్లను అమలు చేస్తోంది అంటూ బీజేపీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. దాంతో పాటు బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాల్వియా చేసిన వీడియోని పోస్ట్ చేశారు. In a Club House chat, Rahul Gandhi’s top aide Digvijaya Singh tells a Pakistani journalist that if Congress comes to power they will reconsider the decision of abrogating Article 370… Really? यही तो पाकिस्तान चाहता है… pic.twitter.com/x08yDH8JqF — Amit Malviya (@amitmalviya) June 12, 2021 ఈ వీడియోలో దిగ్విజయ్ ‘‘వారు(బీజేపీ) ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం లేదు. అందరిని జైల్లో పెట్టారు. సెక్యూలరిజం అన్న దానికి కశ్మీరియత్ అనేది మూలం. ఎందుకంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో హిందూ రాజు పాలన చేశాడు. ఇద్దరు కలసికట్టుగా పని చేశారు. కశ్మీర్ పండిట్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాం. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోవడం చాలా విచారకరమైన నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలనుకుంటుంది" అన్నారు దిగ్విజయ్. దిగ్విజయ్ ఇంటర్వ్యూ అనంతరం సోషల్ మీడియాలో ఆర్టికల్ 370 ట్రెండ్ కావడంతో పలువురు బీజేపీ నాయకులు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు సంబిత్ పాత్ర ‘‘దిగ్విజయ్‌ని ఇలాంటి ప్రశ్న అడిగిన పాక్ విలేకరికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ పేరు మార్చాలని నేను కోరుకుంటున్నాను. భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ) బదులు యాంటీ నేషనల్ క్లబ్ హౌస్ అని మార్చితే బాగుటుంది. దీనిలోని వారంతా మోదీని, భారతదేశాన్ని ద్వేషిస్తున్నారు’’ అని విమర్శించారు. తనపై వస్తోన్న విమర్శలపై దిగ్విజయ్ స్పందించారు. ‘‘లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల సానుభూతిపరులు, బీజేపీ, మోదీ-షా పాలనను వ్యతిరేకిస్తున్న వారందరూ ఈ వినాశకరమైన పాలనను (సిక్) తొలగించడానికి ఓటు అనే ఆయుధంతో పోరాడతారు" అని ట్విట్ చేశారు. It may look delusional to Shefali but Millions of Congress Workers Sympathisers and all those who are opposed to BJPModiShah regime would fight every inch to vote out this disastrous regime. https://t.co/OmZdv5r4Wj — digvijaya singh (@digvijaya_28) June 12, 2021 "బహుశా, నిరక్షరాస్యులకు 'తప్పక', పరిగణించాలి' మధ్య వ్యత్యాసం అర్థం కాలేదు," అని దిగ్విజయ్ హిందీలో మరొక ట్వీట్లో పేర్కొన్నారు. -
దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. ఎంఐఎం నాయకుడు హుస్సేన్ అన్వర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. 2016లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన దిగ్విజయ్ సింగ్ ఎంఐఎం నేతలపై పలు ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ ఆ పార్టీ నాయకుడు హుస్సేన్ అన్వర్ స్థానిక కోర్టులో పరువ నష్టం దావా వేశారు.ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన్నప్పటికీ పలుమార్లు ఉల్లంఘించారు. దీంతో తాజాగా అరెస్ట్ వారెంట్‌జారీ అయ్యింది. అనారోగ్యం కారణంతో నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా దిగ్విజయ్‌సింగ్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తొసిపుచ్చింది. విచారణను మార్చి 8కి వాయిదా వేసింది. -
అయోధ్య: ఊహించని వ్యక్తి నుంచి విరాళం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు విరాళం అందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఓ నాయకుడు రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష 11 వేల 111 విరాళం ఇవ్వడం గమనార్హం. ఆయనే డిగ్గీ రాజాగా పేరొందిన దిగ్విజయ్ సింగ్. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో మత కలహాలకు వ్యతిరేకం కానీ.. ఆలయ నిర్మాణానికి కాదని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ ఆపాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ హిందూవుల పార్టీ అని విమర్శించిన డిగ్గీ రాజా ఇప్పుడు రామ మందిర నిర్మాణానికి విరాళం ప్రకటించడం విశేషం. గతంలో ఆయన ఆలయ నిర్మాణంపై విమర్శలు కూడా చేశారు. అలాంటి వ్యక్తి నుంచి విరాళం రావడం ఆశ్చర్యమేస్తోంది. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ 44 రోజుల పాటు విరాళాల సేకరణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. -
ఈవీఎంలతోనే బీజేపీ గట్టెక్కింది : దిగ్విజయ్ సింగ్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్ధానాలను బీజేపీ కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. కాషాయ పార్టీ విజయంతో రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఈవీఎంల మాయాజాలంతోనే బీజేపీకి భారీ విజయం దక్కిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. చిప్‌తో కూడిన ఎలాంటి మిషన్‌ను అయినా హ్యాక్ చేయవచ్చని వ్యాఖ్యానించారు. అగ్రదేశాలు సైతం బ్యాలెట్ పేపర్లనే వాడుతున్నాయని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోందని దిగ్విజయ్ పేర్కొన్నారు. విపక్షాలు సాధించిన విజయాలు చూపుతూ ఈవీఎంల పనితీరును బీజేపీ సమర్ధించుకుంటోందని, ఈవీఎంలను ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే తారుమారు చేస్తారని తాను చెప్పగలనని ఆయన ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ప్రజలను వంచించారని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ మండిపడ్డారు. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇప్పటివరకూ 9 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ మరో పదిస్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, కేవలం ఒక స్ధానంలో విజయం సాధించిన కాంగ్రెస్ మరో ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. మొరెనా స్ధానంలో బీఎస్పీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా తన పట్టును నిలుపుకున్నారు. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలంతా గెలుపు దిశగా పయనిస్తున్నారు. కాగా తమ పార్టీ నేతల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. చదవండి : ఉప ఎన్నికల్లో బీజేపీ హవా -
‘అయోధ్యలో భూమి పూజ ఆపండి’
న్యూఢిల్లీ: అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదన్నారు. కార్యమానికి హాజరుకావల్సిన ముఖ్యనేతలు, పూజారులు సైతం కరోనా బారినపడ్డారని తెలిపారు. బుధవారం జరగాలల్సిన ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రధాని నరేంద్రమోదీని దిగ్విజయ్ కోరారు. మోదీ రామ మందిర నిర్మాణ ‘భూమి పూజ’ ఆచారాలతో ఎంత మందిని ఆస్పత్రులకు పంపాలనుకుంటున్నారని తీవ్రంగా ప్రశ్నించారు.(అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను) ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ కూడా పరిశీలించాలన్నారు. అదే విధంగా ప్రధానితో చర్చించి భూమి పూజను ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన పూజారులు, యూపీ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కూడా కరోనా సోకిందన్నారు. ఇటువంటి సంక్లిష్టమైన సమయంలో సీఎం యోగి, ప్రధాని మోదీ కూడా 14రోజుల పాటు హోం కార్వటైన్‌కు పరిమితం కావాలన్నారు. ‘భూమి పూజ’ కార్యక్రమానికి ఏమాత్రం అనుకూలం కాని తేదీని నిర్ణయించారని మండిపడ్డారు. వేల ఏళ్లనాటి హిందువుల విశ్వాసం కంటే మోదీకి సౌకర్యమైన రోజు నిర్ణయించడం గొప్పదా అని ట్విటర్లో మండిపడ్డారు. -
డిగ్గీ రాజా సలహా : కాంగ్రెస్‌లో గగ్గోలు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీ తిరిగి పార్టీపగ్గాలు చేపట్టాలని సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నేతలు కోరారు. రాహుల్ కుటుంబ నేపథ్యంపై వీడియోతో ఆయనను పార్టీ సారథిగా చూడాలనుకుంటున్నామని నేతలు పేర్కొన్నారు. రాహుల్ పునరాగమనంపై పార్టీ నేతల డిమాండ్ నేపథ్యంలో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన సూచనలు దుమారం రేపాయి. రాహుల్ గాంధీ పార్లమెంట్లో మరింత క్రియాశీలకంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. రాజకీయాలను భిన్నంగా నడపాలనే రాహుల్ అవగాహనను తాను అర్ధం చేసుకోగలనని, శరద్ పవార్ సూచించిన విధంగా ఆయన దేశమంతా చుట్టిరావాలని, ప్రజలతో మమేకమయ్యేందుకు యాత్రలు కీలకమని డిగ్గీరాజా ట్వీట్ చేశారు. ఇక దిగ్విజయ్ సింగ్ సూచనలపై యువ నేతలు భగ్గుమన్నారు. రాహుల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు వందసార్లు కాలినడక యాత్రలు చేశారని తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత, లోక్‌సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్ గుర్తుచేశారు. పార్టీలో ఉన్నతస్ధాయిలో ఉన్న నేతలు రాహుల్‌కు అండగా నిలవాలని, వెనుకనుంచి విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. రాహుల్ పార్టీ పగ్గాలను తిరిగి చేపట్టాలని కోరుతున్న యువనేతలంతా పార్టీ పతనానికి సీనియర్ నేతలే కారణమని మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా నిష్ర్కమణకు దిగ్విజయ్ సింగ్‌తో పాటు కమల్‌నాథ్‌లు కారణమని వారు ఆరోపిస్తున్నారు. సింథియా తిరుగుబాటుతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడానికి సీనియర్ నేతల నిర్వాకమే కారణమని యువనేతలు నిందిస్తున్నారు. రాజస్తాన్‌లో సచిన్ పైలట్ తిరుగుబాటు కూడా పార్టీలో యువనేతల నిర్లక్ష్యానికి పరాకాష్టగా పేర్కొంటున్నారు. కాగా, గురువారం జరిగిన పార్టీ అంతర్గత భేటీలోనూ కాంగ్రెస్ సీనియర్, యువ నేతల విభేదాలకు వేదికగా నిలిచింది. కరోనా మహమ్మారి, ఆర్థిక మాంద్యం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలను సొమ్ము చేసుకోవడంలో విపక్షంగా విఫలమయ్యామని దీనిపై పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సీనియర్లు పేర్కొన్నారు. ఈ అంశాలపై రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు, వీడియోలతో బీజేపీపై సమర్ధంగా పోరాడుతున్నారని సీనియర్ల విమర్శలను యువనేతలు తోసిపుచ్చారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రులు కార్యకర్తలను ఎందుకు విస్మరించారని, మహారాష్ట్ర, ఢిల్లీలో పార్టీ ఎందుకు పతనమైందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ భేటీలో 45 ఏళ్ల రాజ్యసభ ఎంపీ రాజీవ్ సతవ్ పేర్కొన్నారు. చదవండి : ‘ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడమే’ -
‘నా చుట్టూ గద్దలు తిరుగుతున్నాయి’
భోపాల్: బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ కొత్త కేబినెట్లో తన అనుచరులకు సముచిత స్థానం లభించిన నేపథ్యంలో.. ‘టైగర్ అభీ జిందా హై’ అంటూ జ్యోతిరాదిత్య గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదే విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ వాగ్గాదానాలు మరిచిన విషయం ప్రజలకు తెలుసునంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో జ్యోతిరాదిత్య వ్యాఖ్యలను తిప్పికొడుతూ ‘‘ఏ పులి బతికి ఉంది’’ అని కమల్‌నాథ్ ఎద్దేవా చేయగా.. ‘‘నిజమైన పులి వ్యక్తిత్వం ఏంటో తెలుసా’’ అంటూ డిగ్గీరాజా ట్విటర్ వేదికగా స్పందించారు. (టైగర్ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య) ‘‘వేటపై నిషేధం లేని సమయంలో నేను, మాధవరావు సింధియా(జ్యోతిరాదిత్య తండ్రి) పులులను వేటాడేవాళ్లం. అయితే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకువచ్చిన తర్వాత నుంచి కేవలం కెమెరాలో షూట్ చేస్తున్నా. నిజమైన పులి క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అడవిలో అదొక్కటే ఉంటుంది’’ అంటూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఈ ఇద్దరు నేతల వ్యంగ్యాస్త్రాలకు జ్యోతిరాదిత్య శుక్రవారం ధీటుగా బదులిచ్చారు.(‘ఏ పులి బతికుంది పేపర్ మీదా? సర్కస్ లోనా?’) బీజేపీ వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ‘‘నా చుట్టూ ఎన్నో గద్దలు తిరుగుతూ ఉంటాయి. దాడి చేస్తూ ఉంటాయి. మాంసం ఉన్న వాళ్ల చుట్టే పక్షులు ఆహారం కోసం తిరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కమల్‌నాథ్, దిగ్విజయ సింగ్‌కు మరోసారి గుర్తు చేస్తున్నా. టైగర్ అభీ జిందాహై’’ అంటూ విమర్శలు తిప్పికొట్టారు. కాగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సింధియా.. మార్చిలో కమల్‌నాథ్‌తో విభేదాలు తలెత్తిన క్రమంలో.. 22 ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జ్యోతిరాదిత్య బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
టైగర్ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య
భోపాల్: ‘‘కమల్‌నాథ్ లేదా దిగ్విజయ్ సింగ్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 15 నెలల్లో వారు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. వారి స్వప్రయోజనాల కోసమే వారు పనిచేశారు. ఒకసారి గతంలో వారు చేసిన వాగ్దానాలు, వాటిని విస్మరించిన చరిత్రను పరిశీలించుకోవాలి. అయితే నేను వాళ్లకు ఓ మాట చెప్పాలనుకుంటున్నా. ‘టైగర్ అభీ జిందా హై’ (పులి ఇంకా బతికే ఉంది)’’ అంటూ బీజేపీ ఎంపీ జోత్యిరాదిత్య సింధియా కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తమ ప్రభుత్వంలో అర్హుడైన ప్రతీ పౌరుడికి అన్ని విధాలా లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు గురువారం కేబినెట్ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో కొత్తగా 28 మందికి మంత్రులుగా పనిచేసే అవకాశం లభించింది. వీరిలో అత్యధికులు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన జ్యోతిరాదిత్య సింధియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేబినెట్ కేవలం నాయకుల బృందం మాత్రమే కాదు. ఇది ప్రజల కోసం పనిచేసే టీం. వాళ్లు మంత్రులు కాదు.. ప్రజాసేవకులు. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అట్టడుగు వర్గాలకు కూడా సంక్షేమ ఫలాలు అందుతాయి. 100 రోజుల పాలనలో శివరాజ్ సింగ్ ప్రభుత్వం కరోనాతో సమర్థవంతంగా పోరాడింది. సాధ్యమైనంత వరకు రైతులకు అండగా నిలబడింది. వచ్చే నాలుగేళ్లలో మరింత సమర్థవంతంగా పాలన కొనసాగుతుంది’’ అని చెప్పుకొచ్చారు. (కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!) ఇక సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సింధియా.. మార్చిలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బయటకు రావడంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలగా.. బలం నిరూపించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సింధియా ఎంపీగా ఎన్నికకాగా.. ఆయన మద్దతుదారులు ఈరోజు మంత్రులుగా అవకాశం దక్కించుకోవడం గమనార్హం. కాగా సింధియా కరోనా బారిన పడి కోలుకున్న విషయం విదితమే. -
ఎగువసభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్
న్యూఢిల్లీ: గుజరాత్, మణిపూర్‌లు మినహా మిగిలిన రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాల్లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ నాలుగు స్థానాల్లోనూ ఘనవిజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్, బీజేపీ నుంచి జ్యోతిరాధిత్య సింధియా, జార్ఖండ్ నుంచి షిబు సోరెన్ వంటి వారు సులువుగా ఎగువ సభకు ఎన్నికయ్యారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిపారు. కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ ఒక్క స్థానంలో గెలుపొందింది. జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం) ఒక సీటు సాధించుకుంది. బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది. గుజరాత్లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా, ఇద్దరు బీజేపీ అభ్యర్థుల ఓట్లను తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం అయ్యింది. విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. మేఘాలయలోని ఒక స్థానాన్ని మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్ అభ్యర్థి వాన్వే రాయ్ ఖర్లుకి విజయం సాధించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూనే శాసనసభ్యులకు థర్మల్ స్క్రీనింగ్ చేయడం, మాస్క్‌లు ధరించడంలాంటి అన్ని జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని తొమ్మిది మంది సభ్యులు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభంలో పడిన మణిపూర్‌లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుని కాంగ్రెస్ అభ్యర్థి టి. మంగిబాబు పై బీజేపీకి చెందిన లీసెంబా సనజోబా గెలుచుకున్నారు. -
సీఎం ఎడిటెడ్ వీడియో పోస్ట్ .. దిగ్విజయ్‌పై కేసు
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు సంబంధించి ఎడిటెడ్ వీడియోను షేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై భోపాల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. (కరోనా భయం : ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య) సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఒక తప్పుడు వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఆయన షేర్ చేసినట్లు పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన భోపాల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద దిగ్విజయ్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. లిక్కర్‌కు సంబంధించి మాట్లాడిన పాత వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశారని, వీడియో శివారాజ్ సింగ్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని బీజేపీ పేర్కొంది. ‘బుదిన్నిలోని గిరిజనులను శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏజెంట్లు రూ.450కోట్లమేర మోసగించారు. ఆ సమయంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఆ సంఘటనపై చర్యలు తీసుకోకపోతే ఆయన ఇంటి ముందే నిరసన చేపడతానని లేఖ వ్రాశాను. ఇది బీజేపీని కలవరపరిచింది. వీడియోను ఎవరు ఎడిట్ చేశారో తనిఖీ చేయాల్సి ఉంది’ అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. (24 గంటల్లో 11,502 పాజిటివ్ కేసులు) -
అమృతహల్లి పోలీస్ స్టేషన్లో దిగ్విజయ్ సింగ్
-
దిగ్విజయ్, శివకుమార్ అరెస్ట్!
బెంగళూరు : మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తక్షణమే విశ్వాస పరీక్ష జరపాలన్న విషయంపై వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా బెంగళూరులో మకాం వేసిన 21మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రమాడ హోటల్లో తలదాచుకున్న రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బెంగళూరు వెళ్లారు. కర్ణాటక కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు శివ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారు హోటల్ దగ్గరకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లటానికి వీళ్లేదంటూ బయటే ఆపేశారు. దీంతో ఆగ్రహించిన దిగ్విజయ్ హోటల్ బయట ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్, శివకుమార్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలను అమృతహల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ( రిసార్టు రాజకీయాలకు కేరాఫ్ కర్ణాటక ) అంతకు క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిని. ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి. మా ఎమ్మెల్యేలను ఇక్కడ దాచేశారు. వాళ్లు నాతో మాట్లాడాలనుకుంటున్నారు. వారి ఫోన్లను లాక్కున్నారు. పోలీసులు కూడా నన్ను వారితో మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారు. వాళ్లు వెనక్కు తిరిగి వస్తారని అనుకున్నాం. కానీ, వాళ్లను వెనక్కు రానీయటంలేదు. వారి కుటుంబసభ్యుల దగ్గరినుంచి సందేశాలు వస్తున్నాయి. నేను ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడాను. వారిని నిర్భందంలో ఉంచారని చెప్పారు. సెల్ఫోన్లు దొంగలించారట! ప్రతి రూము దగ్గర పోలీసు బందోబస్తు ఉంది. ప్రతి నిమిషం వారి వెన్నంటే ఉంటున్నార’’ని చెప్పారు. ( బలపరీక్షపై వైఖరేంటి? ) -
అధికారమంటే మానవత్వమే: దిగ్విజయ్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. కొందరు రాజకీయ నాయకులకు విశ్వసనీయత, భావజాలం కంటే అధికారమే ముఖ్యమని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి, గ్వాలియర్ రాజవంశస్తుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కేబినెట్ పదవి కోసం కాంగ్రెస్ మాజీ నేత సింధియా పార్టీ మారుతారని తాను ఊహించలేదని ట్విటర్ వేదికగా తెలిపారు. ట్విటర్లో ఆయన స్పందిస్తూ.. గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని కాదని ప్రధానీ నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని రాజ్యసభ, కేబినెట్ పదవి కోసం సింథియా పార్టీ మారతారని తాను అనుకోలేదని అన్నారు. బీజేపీని తాను వ్యతిరేకిస్తాను కానీ భావజాలం పట్ల వారి నిబద్దతను గౌరవిస్తానని తెలిపారు. మోదీని తాను విమర్శిస్తాను, కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని దేశాన్ని సంఘటితం చేయడానికి తాను ఉపయోగించే తీరు అద్భుతమని తెలిపారు. తాను చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని.. తనను మొదట్లో ఆర్ఎస్ఎస్లో చేరమని అడిగినా తిరస్కరించానని అన్నారు. తనకు విశ్వసనీయత, సిద్ధాంతాలు ముఖ్యమని స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనుకుంటే తాను రాజ్‌ఘర్ స్థానం నుంచి సునాయసంగా గెలిచేవాడినని, పార్టీ ఆదేశాల మేరకు తాను పోటీ చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేశానని పేర్కొన్నారు. తన దృష్టిలో అధికారం అంటే మానవత్వంతో సేవ చేయడమే అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. -
జ్యోతిరాదిత్యపై డిగ్గీరాజా సెటైర్లు..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టినందునే జ్యోతిరాదిత్య సింధియా బీజేపీకి దగ్గరయ్యారనే వాదనను ఆ పార్టీ తోసిపుచ్చింది. జ్యోతిరాదిత్యను పార్టీ ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. గ్వాలియర్ ప్రాంతంలో ఏ కాంగ్రెస్ నేతను అడిగినా అక్కడ గడిచిన 16 నెలల్లో సింథియా అనుమతి లేకుండా ఏ పనీ జరగదని చెబుతారని అన్నారు. మన బ్యాంకులు కుప్పకూలుతూ, మన రూపాయి దిగజారుతూ, ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు రేగుతూ, సామాజిక సామరస్యం దెబ్బతింటున్న వేళ ఆయన (జ్యోతిరాదిత్య) మోదీ, షాల నేతృత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారని డిగ్గీరాజా వ్యంగ్యోక్తులు విసిరారు. మోదీ, షాల ప్రాపకంలో చల్లగా ఉండు మహరాజ్ అంటూ జ్యోతిరాదిత్యను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు జ్యోతిరాదిత్యకు మద్దతుగా 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాను ఆమోదిస్తే మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. జ్యోతిరాదిత్య తోడ్పాటుతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోవైపు బెంగళూర్‌లో బస చేసిన రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పలువురు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చదవండి : ‘సింధియాకు స్వైన్ ప్లూ వచ్చింది’ -
‘సింధియాకు స్వైన్ ప్లూ వచ్చింది’
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరిస్తే.. వారికే జనమే బుద్ధి చెబుతారని దిగ్గీ రాజా పేర్కొన్నారు. నిజమైన వ్యక్తులే పార్టీలో ఉంటారని.. మిగతా వారు కాంగ్రెస్‌ను వీడి వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు. పరోక్షంగా తాజా సంక్షోభానికి కారణమని భావిస్తున్న ఆ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.17 మందిఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తోన్న సింధియాను కలిసేందుకు తాము ప్రయత్నించామని.. కానీ, అతను అందుబాటులోకి రాలేదని తెలిపారు. సింధియాకు స్వైన్ ప్లూ ఉన్నట్టుంది.. అందుకే తమతో మాట్లాడటం వీలుకావడం లేదు అని తనదైనశైలిలో సెటైర్ వేశారు. (చదవండి : కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు) ‘ఎవరైతే మధ్యప్రదేశ్ ఓటర్ల తీర్పును ధిక్కరిస్తారో.. వారికి ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పటికీ పార్టీలోనే ఉంటారు. మధ్యప్రదేశ్‌లో పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. సింథియాను కలిసేందుకు ప్రయత్నించాం. కానీ ఆయనకు స్వైన్ ప్లూ సోకినట్లు చెప్పారు. అందుకే ఆయన మాతో మాట్లాడలేకపోతున్నారు’ అని దిగ్విజయ్ అన్నారు. కాగా, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్యా సింధియా, ఆరుగురు మంత్రులు సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో సోమవారం బెంగళూరుకు వచ్చి, రోడ్డు మార్గంలో బెంగళూరు రాజానుకుంటె సమీపంలో ఉన్న ఓ రిసార్టుకు వెళ్లారు. వీరిని సంప్రందించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారు టచ్‌లోకి రావడంలేదు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. -
‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు’
న్యూఢిల్లీ/భోపాల్: రాజ్యసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచాలన్న ఆత్రుత బీజేపీలో ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. అందుకే మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 14 ఎమ్మెల్యేలను వలలో వేసుకునేందుకు యత్నించిందని ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నేతలు కుట్రతో మా ఎమ్మెల్యేలను హరియాణా రాష్ట్రం మనేసర్‌లోని ఓ హోటల్లో నిర్బంధించారు. అయితే, ఆ ఎమ్మెల్యేలందరూ వారంతట వారే వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరిగి మద్దతు పలికారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా బీజేపీ దాడులు, బెదిరింపులకు పాల్పడుతోంది. బీజేపీలో చేర్చుకోవడం లేదా అనుకూలంగా మార్చుకోవడం ద్వారా మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోంది’ అని ఆరోపించారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరచాలన్న తొందర కాషాయ నేతల్లో ఎక్కువైందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీన పరిచేందుకు కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని గతంలో 15 ఏళ్లపాటు వ్యవహారాలు నడిపిన మాఫియా ముఠా ఇంకా క్రియాశీలకంగానే ఉంది. ఆ ముఠాయే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేందుకు కుట్ర పన్నుతోంది. ఎమ్మెల్యేలను తరలించేందుకు చార్టర్ విమానాన్ని ఎవరు పంపారు? స్టార్ హోటళ్లలో బసకు డబ్బు ఎవరు చెల్లించారు? అని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా బీజేపీకి చెందిన ఐదుగురు నేతలు తమ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘వీరి కుతంత్రాలు సఫలం కావు. మా ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, బీజేపీకి తాము అమ్ముడుపోయామని, తమను నిర్బంధించారంటూ వచ్చిన వార్తలు అబద్ధమని మధ్యప్రదేశ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు రామ్ బాయి, సంజీవ్ సింగ్ కుష్వాహా, రాజేశ్ శుక్లా భోపాల్‌లో అన్నారు. (చదవండి: మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆపరేషన్ కమలం?) -
'మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు'
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న కాంగ్రెస్ ఆరోపణలతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమ ప్రభుత్వంలోని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు బలవంతంగా తీసుకెళ్లి హర్యానాలోని ఒక హోటల్లో నిర్భందించారని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి జితూ పట్వారీ పేర్కొన్నారు. 'మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, మంత్రులు నరోత్తం మిశ్రా, భూపేంద్ర సింగ్, రామ్‌పాల్ సింగ్ సహా మరికొంత మంది సీనియర్ బీజేపీ నేతలు కలిసి మా పార్టీకి చెందిన నలుగురు, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇద్దరు, సమాజ్‌వాది నుంచి ఒకరు, మరొక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను హర్యానాలోని ఒక హోటల్‌కు తరలించారు. కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు.తీసుకెళ్లొద్దని చెప్పినా వినకుండా మమ్మల్ని హోటల్‌కు తరలించారని ఒక ఎమ్మెల్యే మాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారిని వెంటనే వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.ఇప్పటికే నలుగురు తిరిగొచ్చారు' అని పట్వారీ పేర్కొన్నారు. (ప్రభుత్వాన్ని కూలిస్తే ఎమ్మెల్యేకు రూ.45కోట్లు) అంతకుముందు మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. అధికార కూటమిలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను బీజేపీ నాయకులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారని ఆరోపించారు. కుట్రలో భాగంగా బారీ మొత్తంలో నగదు ఇవ్వజూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను తిరిగి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు హరియాణాలోని హోటల్‌కు వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడి పోలీసులు అడ్డుకున్నట్లు వార్తలు వచ్చినట్లు తెలిసింది. (ప్రధాని మోదీకి ఎంపీ ముఖ్యమంత్రి సవాల్!) కాగా దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పందించారు. మధ్యప్రదేశ్‌లో మా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వల వేస్తుందని, తమకు ఫ్రీ మనీ వస్తోందని ఎమ్మెల్యేలు తనతో చెబుతున్నారని ఆయన అన్నారు. ఎవరు పార్టీలో నుంచి వెళ్లిపోయినా మా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంలేదని కమల్‌నాథ్ పేర్కొన్నారు. #WATCH Haryana: Madhya Pradesh Ministers&Congress leaders Jitu Patwari&Jaivardhan Singh leave from ITC Resort in Gurugram's Manesar,taking suspended BSP MLA Ramabai with them.8 MLAs from MP are reportedly being held against their will by BJP at the hotel,Ramabai being one of them pic.twitter.com/VUivVHsaA4 — ANI (@ANI) March 3, 2020 -
ప్రభుత్వాన్ని కూలిస్తే ఎమ్మెల్యేకు రూ.45కోట్లు
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ భారతీయ జనతా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25కోట్ల నుంచి రూ.45కోట్ల లంచం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రా వ్యూహాలు పన్నుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండడం ఇష్టం లేక బహిరంగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని దిగ్విజయ్ పేర్కొన్నారు. చదవండి: పొత్తులపై క్లారిటీ.. నితీష్‌ను టార్గెట్ చేసిన ప్రశాంత్ అయితే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఇప్పటికిప్పుడు రూ.5కోట్లు.. బలనిరూపణ సమయంలో మిగిలిన డబ్బును అందించనున్నట్లు బీజేపీ సంప్రదింపులు జరిపిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని దిగ్విజయ్ తెలిపారు. అయితే మధ్యప్రదేశ్‌ని కర్ణాటకలా మార్చాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 109, కాంగ్రెస్ 114 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చదవండి: ఢిల్లీ అల్లర్లపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు -
భోపాల్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగురవేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, వారిని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు తరలిస్తోంది. మొత్తం 44 మంది ఎమ్మెల్యేలను విమానం ద్వారా పంపేందుకు సిద్ధం అయింది. మధ్యప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్‌కు చెందిన కమల్ నాథ్ ఉండడంతో భోపాల్ సరైన రక్షణ ప్రాంతమని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ వ్యవహారాలను కమల్‌నాథ్‌తో పాటు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కూడా పరిశీలిస్తున్నారు. -
కాషాయ రేపిస్ట్: ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు!
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడిని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఇటీవల ‘కాషాయ దుస్తులు ధరించిన రేపిస్టు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా దిగ్విజయ్‌ను సీరియస్‌గా తీసుకోదని, అలాంటిది ఆయన గురించి తానెందుకు స్పందించాలని జవదేకర్ పేర్కొన్నారు. ముంబై పేలుళ్ల తర్వాత చేసిన వ్యాఖ్యలతో ఆయన మనస్తత్వం ఏమిటనేది బయటపడిందని, అప్పటి నుంచి ఆయన ఇదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద తనపై అత్యాచారం చేశారంటూ ఓ వైద్య విద్యార్థిని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దిగ్విజయ్ స్పందిస్తూ.. ‘ఈ రోజుల్లో కొంతమంది కాషాయ దుస్తులు ధరించి మరీ అత్యాచారాలు జరుపుతున్నారు. ఆలయాల లోపల కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇదేనా మన మతం? మన సనాతన ధర్మాన్ని అవమానించిన వారిని దేవుడు క్షమించబోడు’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కాషాయం మాటున అత్యాచారాలు
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు తొడుక్కున్న వారు అత్యాచారాలు చేస్తున్నారని, అవి దేవాలయాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ చర్యలతో సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని మంగళవారం వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి కుటుంబం నుంచి వేరయ్యాక సాధువుగా మారతారని, ఆధ్యాత్మికతను సంతరించుకుంటారని అన్నారు. అయితే ఇప్పుడు కాషాయ వస్త్రం ధరించిన వాళ్లు నకిలీ ద్రవాలను అమ్ముతున్నారన్నారు. ఈ కాషాయ వస్త్రాల మాటునే దేవాలయాల్లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి చర్యలు క్షమార్హం కానివని, దేవుడు కూడా వారిని క్షమించడని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో స్వామి చిన్మయానంద్ మీద ఓలా విద్యార్థిని అత్యాచార ఆరోపణలు చేయగా, ఈ ఘటనను ఉద్దేశించే దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం రేగడంతో సాయంత్రం ఒక ట్వీట్ చేశారు. ‘హిందూ సాధువులు మన ఆధ్యాత్మిక విశ్వాసానికి గుర్తు. అందుకే వారి నుంచి మంచితనాన్ని ఆశిస్తాం. సనాతన ధర్మాన్ని కాపాడడం మన విధి’ అని ట్వీట్లో పేర్కొన్నారు. -
‘వారు ఆలయాల్లో అత్యాచారాలు చేస్తారు’
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు ధరించి.. పొడులమ్ముకునేవారు.. ఆలయాల్లో అత్యాచారాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ని ఉద్దేశిస్తూ.. దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సమాగమ్ కార్యక్రమానికి దిగ్విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ.. ‘పురాతన సనాతన ధర్మాన్ని విస్మరించే వారిని దేవుడు కూడా క్షమించాడు. ప్రస్తుత సమాజంలో కాషాయ వస్త్రాలు ధరించి పొడులమ్ముకునే వారు కొందరు ఆలయాల్లో అత్యాచారాలు చేస్తున్నారు. అలానే కొందరు వ్యక్తులు జై శ్రీ రాం నినాదాన్ని హై జాక్ చేశారు. రాముడి పేరిట నినాదాలు చేసే వీరు సీతను ఎందుకు మర్చిపోతున్నారు’ అని దిగ్విజయ్ ప్రశ్నించారు. దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ వేదిక మీదనే ఉండటం విశేషం. అలానే ఈ కార్యక్రమానికి హాజరైన కంప్యూటర్ బాబా సాధువుల తరఫున మాట్లాడుతూ.. ఆలయాలకు ప్రభుత్వ భూముల్ని కేటాయించాలని.. వాటికి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని.. అంతేకాక సాధువులుకు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. #WATCH Digvijaya Singh, Congress in Bhopal: Today, people are wearing saffron clothes and raping, rapes are happening inside temples, is this our religion? Those who have defamed our 'Sanatan Dharma', not even god will forgive them. pic.twitter.com/psAQcd1R7p — ANI (@ANI) September 17, 2019 -
ఆ 40 లక్షల అక్రమ వలసదారులేరి?
ఇండోర్: అసోంలో దాదాపు 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో పలుసార్లు చెప్పారని, ఆ 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఎక్కడ ఉన్నారో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇటీవల అసోంలో జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 19 లక్షలమందికి భారతీయ పౌరసత్వానికి సంబంధించిన సరైన పత్రాలు లేవని ఎన్నార్సీ తేల్చింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై దిగ్విజయ్ ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ ప్రచారం చేస్తోందని, అసోంలోని 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఎక్కడున్నారో అమిత్ షా లేదా ఆయన నంబర్ టు కైలాశ్ విజయ్వార్గియా చెప్పాలని డిమాండ్ చేశారు. మతం పేరిట రాజకీయాలు చేస్తూ దేశంలో సందేహాలు రేకెత్తించడం బీజేపీకి పాత అలవాటేనని దిగ్విజయ్ ఎద్దేవా చేశారు. -
‘పీవోకే మనదే.. దేవుడిని ప్రార్థిద్దాం’
భోపాల్: జమ్మూ కశ్మీర్ పౌరుల అభిప్రాయం తెలుసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో కశ్మీర్ అంశాన్ని ఎలా చూడాలంటూ మీడియా మంగళవారం ఆయన్ను ప్రశ్నించింది. అందుకు ఆయన ‘కశ్మీర్ భారత్‌కే చెందాలి అనుకుంటున్నా.. పీవోకే కూడా భారత్‌దే. జమ్మూ కశ్మీర్లో సౌభ్రాతృత్వ భావన వేలాది ఏళ్లుగా ఉంది. ఇప్పుడు దేవుడిని ప్రార్థించడం ఒక్కటే మిగిలింది. కశ్మీరీలతో సోదరభావం కొనసాగాలని, అక్కడంతా శాంతి నెలకొనాలని ప్రార్థనలు చేద్దాం’ అన్నారు. జమ్మూ కశ్మీర్ విషయంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి విధానాలను నరేంద్ర మోదీ తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. 1998-2004 మధ్య కాలంలో వాజపేయి ప్రధానిగా ఉండగా కశ్మీర్ సంస్కృతి, మానవత్వం, ప్రజాస్వామ్యం అనే మూడు అంశాల ప్రతిపాదికన కశ్మీర్ విధానం ఉండేదని గుర్తు చేశారు. దీనికి పూర్తి విరుద్ధంగా మోదీ సర్కారు వ్యవహరించిందని దుయ్యబట్టారు. కశ్మీర్‌పై పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. కశ్మీర్ అంశాన్ని హిందూ-ముస్లిం కోణంలో చూడరాదని అభిప్రాయపడ్డారు. -
సమాధి అవుతా.. సహకరించండి!
భోపాల్: సజీవ సమాధి అయ్యేందుకు అనుమతించాలని మధ్యప్రదేశ్‌కు చెందిన స్వామి వైరాగ్యానంద ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దిగ్విజయ్ సింగ్ విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. డిగ్గీరాజా గెలవకుంటే సజీవ సమాధి అవుతానని ఆయన ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్ చేతిలో దిగ్విజయ్ 3.60 లక్షల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో వైరాగ్యానందను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆయన సజీవ సమాధికి అనుమతి కోరుతూ భోపాల్ కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. ‘ప్రస్తుతం నేను కామాఖ్యధామంలో ఉంటున్నాను. మాట నిలబెట్టుకునేందుకు జూన్ 16న మధ్యాహ్నం 2.11 గంటలకు సజీవ సమాధిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. స్థానిక యంత్రాగం నాకు సహకరిస్తుందని నమ్ముతున్నాను’ అని దరఖాస్తులో వైరాగ్యానంద పేర్కొన్నారు. దీనికి అనుమతి ఇవ్వొద్దని తాను భోపాల్ డీఐజీకి లేఖ రాసినట్టు కలెక్టర్ తరుణ్‌కుమార్ పిథోడ్ తెలిపారు. వైరాగ్యానందను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. కంప్యూటర్ బాబాగా గుర్తింపుపొందిన నామ్‌దేవ్ దాస్ త్యాగి కూడా ఎన్నికల సమయంలో దిగ్విజయ్ సింగ్‌కు మద్దతుగా యజ్ఞయగాదులు, రోడ్‌షోలు నిర్వహించారు. దిగ్విజయ్ స్వయంగా వీటిల్లో పాల్గొన్నారు. -
మట్టికరిచిన మాజీ సీఎంలు
తాజా లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఊహించని రాజకీయ సునామీ సృష్టించారు. దశాబ్దాల అనుభవమున్న హేమాహేమీలైన నేతలు, మాజీ ముఖ్యమంత్రులతోపాటు, ఒక మాజీ ప్రధాని సైతం ఈ సునామీలో కొట్టుకుపోయారు. ఈ రాజకీయ విలయం ధాటికి 12 మంది మాజీ ముఖ్యమంత్రులు మట్టికరిచారు. వీరిలో ఎనిమిది మంది కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖులే కావడం గమనార్హం..! ఒక ప్రధాని అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుని వరుసగా రెండోసారి మళ్లీ అధికారం చేపట్టడం దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే సంభవించింది. ఒకటి ఇందిరాగాంధీ హయాంలోదైతే.. రెండోది తాజాగా నరేంద్ర మోదీ హయాం! అదే సమయంలో ఒక ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో మాజీ ముఖ్యమంత్రులు ఓడిపోవడం కూడా ఇదే ప్రథమం. దేశ రాజధాని ఢిల్లీని ఒకప్పుడు ఏలిన షీలాదీక్షిత్ ఢిల్లీ(ఈశాన్య) లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా 3.16 లక్షల ఓట్ల తేడాతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక మాజీ ప్రధాని, కర్ణాటక ముఖ్యమంత్రి కూడా అయిన హెచ్.డి.దేవెగౌడ తుముకూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి చేతిలో కేవలం 13 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఒక్కళిగలు, లింగాయత్‌ల మధ్య సమరంగా పరిగణించిన తుముకూరు ఎన్నికల్లో 87 ఏళ్ల దేవెగౌడ పోటీ చేయడంపై తొలి నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా మాండ్య, హాసన్‌ల నుంచి పోటీ చేసే గౌడ కుటుంబం ఈసారి తుముకూరుకు రావడం స్థానికులకు పెద్దగా రుచించలేదు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం జేడీఎస్‌కు కేటాయించడంపై కాంగ్రెస్‌లోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కాంగ్రెస్ నేత ముద్దె హనుమేగౌడ నుంచి సహకారం అంతంతమాత్రమే అయింది. దీంతో దేవెగౌడ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. దిగ్విజయ్ పరాజయం... మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ వివాదాస్పద బీజేపీ నేత, మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. రాజ్గర్ నుంచి బరిలోకి దిగాలని ప్రజ్ఞా సింగ్ ఆలోచించినా.. చివరకు పార్టీ నిర్ణయం ప్రకారం భోపాల్ బరిలోకి దిగి ఏకంగా 8.6 లక్షల ఓట్లు సాధించగా.. దిగ్విజయ్‌కు మాత్రం ఐదు లక్షల ఓట్లే పడ్డాయి. మహారాష్ట్రలో ఇద్దరికి ఓటమి... మహారాష్ట్ర ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు లోక్‌సభ బరిలో చతికిలపడ్డారు. నాందేడ్‌లో అశోక్ చవాన్ బీజేపీ అభ్యర్థి ప్రతాప్ రావు చికాలికర్ చేతిలో 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే సీనియర్ కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే షోలాపూర్ స్థానంలో లక్షకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి బరిలోకి దిగడంతో సంప్రదాయ ఓటర్లు చీలిపోయి అది కాస్తా బీజేపీ అభ్యర్థి సిద్దేశ్వర్ శివాచార్యకు ఉపకరించిందని అంచనా. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మునిమనుమడు ప్రకాశ్ అంబేడ్కర్‌కు 5.24 లక్షల ఓట్లు దక్కాయి. ఉత్తరాఖండ్, మేఘాలయాల మాజీ ముఖ్యమంత్రులు హరీశ్ రావత్, ముకుల్ సంగ్మాలతోపాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ చిక్కబళాపురం నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. భూపీందర్ హుడా (హరియాణా), మెహబూబా ముఫ్తీ (జమ్మూకశ్మీర్), బాబూలాల్ మరాండి (జార్ఖండ్), శిబూ సోరెన్ (జార్ఖండ్)లు కూడా ఓటమిపాలైన మాజీ సీఎంల జాబితాలో ఉన్నారు. -
వాళ్లు పోలీసులు కాదు : ఈసీ
భోపాల్ : భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్, కంప్యూటర్ బాబాతో కలిసి నిర్వహించిన రోడ్‌షోలో మహిళా పోలీసులు పాల్గొన్నారని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. అవన్నీ అసత్య ఆరోపణలేనని తేల్చింది. డిగ్గీరాజా రోడ్‌షోలో పాల్గొన్నది పోలీసులు కాదని స్పష్టం చేసింది. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దిగ్విజయ్ సింగ్ గత బుధవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు కాషాయ రంగు గల స్టోల్స్ ధరించి ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడి సభలో కాషాయ రంగు మెరవడం మీడియా ప్రతినిధుల దృష్టిని ఆకర్షించింది. దీంతో వెంటనే అక్కడున్న మహిళలను ప్రశ్నించగా.. వారిలో కొంతమంది తాము పోలీసులమని చెప్పగా.. మరికొందరు మాత్రం తమను తాము ఎండ నుంచి కాపాడుకోవడానికి స్టోల్స్ ధరించామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా జాతీయతకు ఈ రంగు చిహ్నమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులను తన రోడ్‌షో కోసం వాడుకుంటున్న దిగ్విజయ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై ఈసీ కలెక్టర్‌ను నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నది పోలీసులు కాదని, బీజేపీ నేతల ఆరోపణలు అసత్యమని భోపాల్ కలెక్టర్, సీఈవో నివేదిక ఇచ్చారు. ఇక మధ్యప్రదేశ్ డీఐజీ ఇష్రాద్ వలీ..దిగ్విజయ్ సింగ్ రోడ్‌షోలో పాల్గొన్న మహిళలను తాము రిక్రూట్ చేసుకోలేదని.. వారు పోలీసులు కాదని స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా తన ప్రత్యర్థి అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్(బీజేపీ)ను బలంగా ఢీకొట్టేందుకు డిగ్గీరాజా తన ప్రచారంలో హిందూవాదాన్ని ప్రధానంగా హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కంప్యూటర్ బాబాగా పేరుపొందిన సాధూ నామ్‌దేవ్ త్యాగి ఆధ్వర్యంలో ఆయన.. ఆసనాలు వేస్తూ ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు వివిధ సాధువులు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. ఇక కంప్యూటర్ బాబాకు అప్పటి బీజేపీ ప్రభుత్వం నర్మదా పరిశుభ్రత ప్యానెల్లో సహాయ మంత్రి హోదా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం బీజేపీపై అసంతృప్తిగా ఉన్న ఆయన అధికార పార్టీకి చేరువయ్యారు. -
ఓటు వేయని డిగ్గీ రాజా.. కారణం ఇదే
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భోపాల్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. సకాలంలో పోలింగ్ కేంద్రానికి చేరుకోలేకపోవడం వల్ల ఓటు వేయలేకపోయినట్లు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లని రాజ్‌ఘర్ ఓటర్ల జాబితాలో దిగ్విజయ్ సింగ్ పేరు ఉంది. అది ఆయన స్వస్థలం. భోపాల్ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌ఘర్‌కు డిగ్గీ రాజా చేరుకోలేకపోయారు. సాయంత్రం వరకూ దిగ్విజయ్ సింగ్ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ భోపాల్‌లోనే ఉండిపోయారని, సాయంత్రం రాజ్‌ఘర్‌కు బయలుదేరినప్పటికీ.. సకాలంలో పోలింగ్ కేంద్రానికి చేరుకోలేకపోయారని పార్టీ నాయకులు చెబుతున్నారు. చదవండి : ముగిసిన ఆరో విడత పోలింగ్ కాకాఓటు వేయలేకపోవడం పట్ల దిగ్విజయ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేయలేకపోయినందుకు క్షమించాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల నాటికి తన ఓటును రాజ్‌ఘర్ నుంచి భోపాల్‌కు మార్చుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంతి తన ఓటు హక్కును తాను వినియోగించుకోకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ నాయకులు దిగ్విజయ్‌పై విమర్శల దాడికి దిగారు. ఇలాంటి వారిని పెట్టుకుని రాహుల్ గాంధీ ఏం సాధిస్తారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 63.48 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్‌లో పశ్చిమబెంగాల్ (80.35 %)మరోసారి అగ్రస్థానంలో నిలవగా, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బిహార్, యూపీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. -
కంప్యూటర్ బాబా పూజలు; ఈసీ ఆదేశాలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భోపాల్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ నామ్‌దేవ్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా హఠ యోగ నిర్వహించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్ ఠాకూర్ ఓటమిని ఆకాంక్షిస్తూ మూడు రోజుల పాటు తలపెట్టిన ఈ కార్యక్రమంలో సుమారు ఏడు వేల మంది సాధువులు పాల్గొన్నారు. అదే విధంగా దిగ్విజయ్ సింగ్‌కు ఓటు వేయాలంటూ వందల మంది సన్యాసులు ప్రజలను కోరుతారని కంప్యూటర్ బాబా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్యూటర్ బాబా కార్యకలాపాలపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. భోపాల్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల కమిషనర్‌కు ఈ విషయమై లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీచేసింది. ఈ పూజా కార్యక్రమాలకు కంప్యూటర్ బాబాకు అనుమతి ఎవరు ఇచ్చారు.. తన విజయం కోసం దిగ్విజయ్ సింగే సాధువులను ఆహ్వానించారా... ఏ పార్టీ కోసం బాబా ప్రచారం చేస్తున్నారు.. అందుకు ఎంత మొత్తం అంతదుకుంటున్నారు.. పూజా కార్యక్రమాలకు అయ్యే ఖర్చు ఎంత తదితర అంశాలపై విచారణ చేపట్టాల్సింగా పేర్కొంది. కాగా మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్న సమయంలో మంత్రి హోదాను అనుభవించిన కంప్యూటర్ బాబా..ప్రస్తుతం అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్ గెలుపు కోసం పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి వందలాది సన్యాసులతో భోపాల్‌లోని సైఫియా కాలేజ్ మైదానంలో ఆయన ఈ పూజలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామ మందిరం నిర్మించలేదని, మందిర్ లేకుండా నరేంద్ర మోదీ కూడా ఉండటానికి వీల్లేదని కంప్యూటర్ బాబా మండిపడ్డారు. కాషాయ వస్ర్తాలను ధరించినందుకే ప్రజ్ఞా సింగ్‌ను సాధ్విగా పిలవడం తగదని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలతో ఆమెకు సంబంధం ఉందని, హత్య కేసులోనూ ఆమె నిందితురాలని కంప్యూటర్ బాబా ఆరోపించారు. -
ముల్లును ముల్లుతోనే...
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాషాయపక్షాన్ని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ సైతం అదే కాషాయాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. పదేళ్ళ పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ని ఓడించాలని బీజేపీ, ఎలాగైనా విజయతీరాలకు చేరాలని సీనియర్ కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్ సింగ్ ప్రచారానికి కాషాయాన్ని జోడించారు. భోపాల్‌లో మే 12న జరిగే ఆరోదశ లోక్‌సభ పోలింగ్‌లో నియోజకవర్గంలో దిగ్విజయ్‌సింగ్ వర్సెస్ ప్రగ్యాసింగ్ ఠాకూర్ల మధ్య పోల్వార్ హోరు పూజలూ, యజ్ఞాలతో రంజుగా మారింది. ఈ ఇరువురూ భోపాల్‌లో గెలుపుకోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ని కట్టడి చేయడం కోసం మాలెగాం కేసులో జైలుపాలై అనారోగ్యం పేరుతో బెయిలుపై బయటకు వచ్చిన సాధ్వి ని బరిలోకి దింపింది. అదే కాషాయ సిద్ధాంతాన్ని ఎదుర్కొనేందుకు ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న కాంగ్రెస్ ప్రగ్యాసింగ్‌కి ప్రతిగా దిగ్విజయ్ సింగ్ తరఫున కంప్యూటర్ బాబాని స్క్రీన్‌పైకి తెచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రగ్య, వివాదాస్పద కార్యక్రమాలతో దిగ్విజయ్‌సింగ్ ఇరువురూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో భోపాల్ ఎన్నికల ప్రచారం కాషాయంతో కలగాపులగంగా మారింది. ఏది బీజేపీ యజ్ఞమో, ఏది కాంగ్రెస్ ప్రచారమో తెలుసుకోలేనంతగా ఇప్పుడు భోపాల్‌లో పరిస్థితి తారుమారయ్యింది. ఇటీవలే కంప్యూటర్ బాబా దిగ్విజయ్ విజయం కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో 5000 మంది సాధువులతో భారీ యాగాన్ని నిర్వహించారు. దీనికి ప్రతిగా ప్రగ్యా ఠాకూర్ అక్షయ తృతీయ సందర్భంగా పరశురామ్ జయంతి పూజలు భారీగా నిర్వహించడం గమనార్హం. ఒకప్పుడు బీజేపీతో ఉన్న నామ్‌దేవ్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ గెలుపుకోసం విస్తృ తంగా ప్రచారం చేస్తున్నారు. దిగ్విజయ్ తరఫున యజ్ఞాలతో పాటు ప్రచారం కూడా చేస్తోన్న బాబా ప్రగ్యని ఉద్దేశించి బీజేపీ నాయకులు ప్రగ్యని బలిపశువుని చేశారని వ్యాఖ్యానిస్తే, సాధ్వి ప్రగ్య మాత్రం ఒకప్పుడు రాముడే మిథ్య అన్న వారు ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నారనీ, అంతకు మించిన అచ్చాదిన్ ఏముంటాయంటూ తనపై విమర్శలను తిప్పి కొడుతున్నారు. -
కాంగ్రెస్ ప్రచారంలో ‘కాషాయ’ స్కార్ఫులు!
భోపాల్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భోపాల్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ రోడ్‌షోలో మహిళా పోలీసలు కాషాయ రంగు స్కార్పులు ధరించడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిగ్గీ రాజా బుధవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు కాషాయ రంగు గల స్టోల్స్ ధరించారు. కాంగ్రెస్ నాయకుడి సభలో కాషాయ రంగు మెరవడంతో మీడియా ప్రతినిధుల దృష్టిని ఆకర్షించింది. దీంతో వెంటనే అక్కడున్న మహిళలను ప్రశ్నించగా.. వారిలో కొంతమంది తాము పోలీసులమని చెప్పగా.. మరికొందరు మాత్రం తమను తాము ఎండ నుంచి కాపాడుకోవడానికి స్టోల్స్ ధరించామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా జాతీయతకు ఈ రంగు చిహ్నమని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. పోలీసులను తన రోడ్‌షో కోసం వాడుకుంటున్న దిగ్విజయ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విఙ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మాత్రం ఈ ఘటనను చిన్నదిగా చూపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీంతో ఇరుపార్టీల నాయకులు విమర్శల యుద్ధానికి దిగారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్ డీఐజీ ఇష్రాద్ వలీ.. సదరు మహిళలను తాము రిక్రూట్ చేసుకోలేదని.. వారు పోలీసులు కాదని స్పష్టతననిచ్చారు. వారు కేవలం వాలంటీర్లు మాత్రమేనని, డ్యూటీలో ఉన్న పోలీసులెవరూ కాషాయం ధరించరని పేర్కొన్నారు. కాగా తన ప్రత్యర్థి అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్(బీజేపీ)ను బలంగా ఢీకొట్టేందుకు గత కొన్నిరోజులగా డిగ్గీరాజా హిందూవాదాన్ని ప్రధానంగా హైలెట్ చేస్తున్నారు. కంప్యూటర్ బాబాగా పేరుపొందిన సాధూ నామ్‌దేవ్ త్యాగి ఆధ్వర్యంలో ఆయన..మంగళవారం ఆసనాలు వేస్తూ ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు వివిధ సాధువులు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. ఇక కంప్యూటర్ బాబాకు అప్పటి బీజేపీ ప్రభుత్వం నర్మదా పరిశుభ్రత ప్యానెల్లో సహాయ మంత్రి హోదా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. -
దిగ్విజయ్‌కు కంప్యూటర్ బాబా మద్దతు
భోపాల్: భోపాల్ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్‌సింగ్ విజయాన్ని కాంక్షిస్తూ వందలాది మంది సాధువులు మంగళవారం భోపాల్ చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. కంప్యూటర్ బాబాగా పేరుపొందిన సాధూ నామ్‌దేవ్ త్యాగి ఆధ్వర్యంలో వారు మంగళవారం ఆసనాలు వేస్తూ ప్రచారం నిర్వహించారు. కంప్యూటర్ బాబాకు అప్పటి బీజేపీ ప్రభుత్వం నర్మదా పరిశుభ్రత ప్యానెల్లో సహాయ మంత్రి హోదా కట్టబెట్టింది. అయితే, ఆయన ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వపనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. -
డిగ్గీ రాజా గెలుపు కోసం కంప్యూటర్ బాబా పూజలు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్న సమయంలో మంత్రి హోదాను అనుభవించిన కంప్యూటర్ బాబా తాజాగా భోపాల్ కాంగ్రెస్ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్ గెలుపుకోసం హఠ యోగా నిర్వహించారు. వందలాది సన్యాసులతో భోపాల్‌లోని సైఫియా కాలేజ్ మైదానంలో ఆయన ఈ పూజలు జరిపారు. బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామ మందిరం నిర్మించలేదని, మందిర్ లేకుండా నరేంద్ర మోదీ కూడా ఉండటానికి వీల్లేదని కంప్యూటర్ బాబా మండిపడ్డారు. బీజేపీకి చెందిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై దిగ్విజయ్ సింగ్ విజయాన్ని కాంక్షిస్తూ మూడు రోజుల పాటు ఏడు వేల మంది వరకూ సాధువులు పూజలు చేయనున్నారు. దిగ్విజయ్ సింగ్‌కు ఓటు వేయాలని కోరుతూ వందల మంది సన్యాసులు భోపాల్‌లో ఆటపాటలతో ప్రజలను కోరతారని కంప్యూటర్ బాబాగా పేరొందిన నామ్‌దేవ్ దాస్ త్యాగి చెప్పారు. కాషాయ వస్ర్తాలను ధరించినందుకే ప్రజ్ఞా సింగ్‌ను సాధ్విగా పిలవడం తగదని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలతో ఆమెకు సంబంధం ఉందని, ఆమె హత్య కేసులోనూ నిందితురాలని కంప్యూటర్ బాబా ఆరోపించారు. -
‘హిందువులు హింసావాదులు కాదని ఎవరన్నారు?’
భోపాల్ : హిందువులు హింసాత్మకంగా ఉండరని ఎలా చెబుతారంటూ సీపీఎం కేంద్ర ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరెస్సెస్ ప్రచారక్‌లను ప్రశ్నించారు. రామాయణ, మహాభారతాల్లోని ఘట్టాలు హిందువులు కూడా హింసకు పాల్పడతారని నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆవుల రక్షణ కోసమంటూ ప్రైవేట్ ఆర్మీని పెంచి పోషిస్తున్నారంటూ ఆరెస్సెస్‌ను విమర్శించారు. ‘ రామాయణ, మహాభారతాల్లో యుద్ధాలు, హింసకు సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి. ఆరెస్సెస్ ప్రచారకులై ఉండి ఈ పురాణాలను బాగానే చెబుతారు గానీ.. ఈ హింస గురించి ఎందుకు మాట్లాడారు. హిందువులు హింసాత్మకంగా వ్యవహరించరు అని ఎందుకు చెబుతారు. వేరే మతాలకు మాత్రమే హింసను ఆపాదిస్తూ.. హిందువులు అసలు అలాంటివి చేయరు అని ప్రచారం చేయడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి’ అని మండిపడ్డారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు.. సీతారాం ఏచూరితో పాటు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఆరెస్సెస్, బీజేపీలకు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాలరాసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జాతిపిత మహాత్మా గాంధీ గౌరవాన్ని కేవలం కళ్లద్దాలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం జరిగే ఎన్నికలు వ్యక్తుల మధ్య కాకుండా సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటమని పేర్కొన్నారు. -
‘భోపాల్’లో భూపాలుడు ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా తయారయింది. కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందో తెలుసుకోవడమే ప్రశ్న, ఇదే విషయమై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడు బాబూలాల్ గౌర్ (88)ను భోపాల్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కలుసుకొని ప్రశ్నించింది. ‘దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు. పైగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. ఇక బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ రాజకీయాలకు కొత్త. వీరిద్దరి మధ్య ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పడం కష్టం. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఉన్నారు, క్యాడర్ లేరు. బీజేపీకి క్యాడర్ ఉంది. ఆరెస్సెస్ కార్యకర్తలు కూడా వచ్చి బూత్ స్థాయిలో పనిచేస్తారు. ఈ విధంగా చూసుకుంటే ఇరువురి మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ప్రజ్ఞాసింగ్ అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. లేకపోయినట్లయితే ఆమె విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి’ అని బాబూలాల్ గౌర్ చెప్పారు. దిగ్విజయ్ సింగ్‌కు వ్యతిరేకంగా, ఎన్కౌంటర్లో మరణించిన ఐపీఎస్ అధికారికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రజ్ఞాసింగ్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ 72 గంటలపాటు నిషేధం విధించడం, దాంతో ఆమె ప్రస్తుతం గుళ్లూ గోపురాలు తిరుగుతున్న విషయం తెల్సిందే. ప్రజ్ఞాసింగ్ తరఫున ఇతర రాష్ట్రాలకు చెందిన ఠాకూర్లు కూడా వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, వారితోపాటు ఆరెస్సెస్, బజరంగ్ దళ్, దుర్గా వాహిణి, ఏబీవీపీ కార్యకర్తలు వచ్చి ప్రచారం చేస్తున్నారని గౌర్‌ను కలుసుకోవడానికి వచ్చిన ప్రజ్ఞాసింగ్ ఎన్నికల ప్రచార సమన్వయ కర్త జస్వంత్ సింగ్ హడా అత్యుత్సాహంగా చెప్పారు. ఢిల్లీలోని పార్టీ అధిష్టానం కూడా భోపాల్ ఎన్నికల ప్రచారంపై దృష్టిని కేందీకరించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారని ఆయన తెలిపారు. 1989 నుంచి బీజేపీ వరుసగా గెలుచుకుంటూ రావడంతో భోపాల్ సీటు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగ మారింది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో సానుభూతి పవనాల కారణంగా బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ్ శర్మపై కాంగ్రెస్ అభ్యర్థి కేఎన్ ప్రధాన్ విజయం సాధించారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుశీల్ చంద్ర వర్మ విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఓటమి లేదు. ఇక నరేంద్ర మోదీ ప్రభంజనం దేశవ్యాప్తంగా వీచిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీసీ శర్మపై బీజేపీ అభ్యర్థి అలోక్ సంజార్ ఏకంగా 3,70,000 మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు. ఈసారి భోపాల్‌పైగానీ, మధ్యప్రదేశ్‌లోగానీ నరేంద్ర మోదీ హవా కనిపించడం లేదని, ప్రజ్ఞాసింగ్ గెలిస్తే స్థానిక బలిమితోనే గెలవాలని బాబూలాల్ గౌర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సింగ్‌కు దీటైన అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఐదు వారాలు తాత్సారం చేయడమే బీజేపీకి ఈసారి భోపాల్‌లో ఎంత బలం ఉందో అర్థం అవుతుంది. దిగ్విజయ్‌ను ఎలాగైన ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో బీజేపీ, ప్రజ్ఞాసింగ్ పార్టీలో చేర్చుకొని మరీ టిక్కెట్ ఇచ్చింది. -
ఇమ్రాన్ ఖాన్ మోదీ ఫ్రెండేగా..ఏం లాభం?
భోపాల్ : పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. విషయంలో ఎన్నో ఏళ్లుగా మోకాలడ్డుతున్న చైనా.. అగ్రదేశాల ఒత్తిడులకు ఎట్టకేలకు తలొగ్గక తప్పలేదు. దీంతో భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. ఫలితంగా, అజార్ ఆస్తులను స్తంభింపజేసేందుకు, అతడి ప్రయాణంపై నిషేధం విధించేందుకు, ఆయుధాలు సమకూర్చుకునే వీలు లేకుండా చేసేందుకు ఐరాసకు సత్వరం వీలు కలిగింది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్నేహితుడిగా ఉన్నంతకాలం ఐరాస నిషేధం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని ఆయన ప్రశ్నించారు. చదవండి : అజహర్ అంతర్జాతీయ ఉగ్రవాదే భోపాల్‌లో ఓ కార్యక్రమంలో డిగ్గీరాజా మాట్లాడుతూ... ‘ పాక్ ప్రధాని ఇమ్రాన్ మోదీజీతో స్నేహం కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి సమయంలో మసూద్ అజహర్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది. దావూద్ ఇబ్రహీం, మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులను వెంటనే భారత్‌కు అప్పగించాలని భారత్ డిమాండ్ చేయాలి. అదొక్కటే సరైన మార్గం అని వ్యాఖ్యానించారు. ఇక మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించటాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. యూపీఏ హయాంలో లష్కర్ ఏ తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తలపై రివార్డు ప్రకటించినట్లుగా.. అజహర్ తలపై కూడా భారీ రివార్డు ప్రకటించాలని డిమాండ్ చేసింది. కాగా కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళం కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది చేసిన దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయడం, ఈ క్రమంలో భారత పైలట్ పాక్ ఆర్మీకి చిక్కడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఉగ్రదాడులకు కారణమైన మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అగ్ర దేశాలను కోరిన భారత్.. చివరకు బుధవారం దౌత్యపరంగా పెద్ద విజయం సాధించింది. -
500 ఏళ్లు పాలించారు.. ఒక్కరికీ హాని చేయలేదు!
భోపాల్ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీరిద్దరు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రచార ర్యాలీలో డిగ్గీరాజా.. ప్రఙ్ఞాసింగ్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన ప్రసంగిస్తూ... ‘ దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే.. తన శాపం కారణంగానే ఉగ్రకాల్పుల్లో మరణించారని ప్రఙ్ఞా ఠాకూర్ చెబుతున్నారు. నిజంగా ఆమె శాపనార్థాలకు అంత బలమే ఉంటే మసూద్ అజహర్(జైషే మహ్మద్ చీఫ్)ను శపించవచ్చు కదా. అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవసరమే ఉండేది’ కాదు అని ఎద్దేవా చేశారు. 500 ఏళ్లు పాలించారు.. ఏమైనా అయ్యిందా? పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన మెరుపుదాడులను ప్రస్తావిస్తూ.. ‘ కలుగులో దాక్కున్నా సరే ఉగ్రవాదులను వెదికి అంతమొందిస్తామని మోదీ అంటున్నారు. మరి పుల్వామా దాడి జరిగినపుడు ఆయన ఎక్కడున్నారు. పటాన్‌కోట్, యురీల్లో దాడులు జరిగినపుడు ఆయన ఏం చేస్తున్నారు. హిందువాదాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను విభజించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ వాళ్లకు నేను ఒక్కటే చెబుతున్నా వినండి. దాదాపు 500 ఏళ్ల పాటు ముస్లింలు భారతదేశాన్ని పరిపాలించారు. కానీ ఏ మతస్థులకు కూడా వారు ఎలాంటి హానీ చేయలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అని దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అనే తేడాలేవీ లేవని అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారని పేర్కొన్నారు. కాగా మే 12న భోపాల్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. -
‘ఇక్కడ ప్రమోషన్లు.. డిమోషన్లు ఉండవు’
ముంబై : ఈ సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్‌లో పోరు రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ తరఫున రెండు సార్లు సీఎంగా పని చేసిన వ్యక్తి బరిలో దిగితే.. అతనికి పోటీగా బీజేపీ ఓ సాధ్విని నిలబెట్టడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో భోపాల్‌లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఓ ఆంగ్లపత్రికతో ముచ్చటించారు. ఆ వివరాలు.. ప్రస్తుతం భోపాల్.. కాంగ్రెస్‌కు చాలా ప్రతికూల నియోజకవర్గమని తెలిపారు. ఇలాంటి బలహీన ప్రాంతంలో పోటీ చేసి గెలవడాన్ని తాను ఓ సవాలుగా స్వీకరిస్తానన్నారు. తాను తొలుత తన స్వస్థలం రాజ్‌గఢ్ నుంచి పోటీ చేయాలి అనుకున్నాను అని తెలిపారు. కానీ కమల్ నాథ్, రాహుల్ గాంధీ తనను భోపాల్ నుంచి నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారమే తాను భోపాల్ నుంచి బరిలో దిగానని దిగ్విజయ్ తెలిపారు. రెండు సార్లు సీఎంగా పని చేసిన వ్యక్తి ఇప్పుడు లోక్‌సభ బరిలో నిలవడం ప్రమోషనా.. డిమోషనా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో ఇలాంటివి ఉండవని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఎవరైనా సరే పార్టీ అవసరాలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2011లో బురారిలో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో ప్రణబ్ ముఖర్జీ తనను ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించమని కోరారన్నారు. అప్పుడు తాను యువకులకు ఆ అవకాశం ఇవ్వాలని చెప్పడంతో.. ఆ బాధ్యతలు రాహుల్ గాంధీకి ఇచ్చారని దిగ్విజయ్ గుర్తు చేశారు. ఇకపోతే సాధ్వి ప్రజ్ఞా సింగ్.. దిగ్విజయ్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘సాధ్వి ప్రజ్ఞా సింగ్ అలా ఎందుకు మాట్లాడుతుందో నాకు తెలీదు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమెని ఇబ్బంది పెట్టిన వ్యక్తి శివరాజ్ సింగ్. రెండు సార్లు అతను.. సాధ్వీని అరెస్ట్ చేయించి జైలులో పెట్టాడ’ని తెలిపారు. ఇక బీజేపీ తనపై చేస్తోన్న హిందూ ఉగ్రవాద ఆరోపణలపై దిగ్విజయ్ స్పందిస్తూ.. తాను హిందు మతాన్ని ఆచరిస్తానని తెలిపాడు. ఈ పదాన్ని సృష్టించిన వ్యక్తి ఆర్కే సింగ్ అని పేర్కొన్నారు. కానీ మోదీ అతనికి టికెట్ ఇచ్చి మంత్రిని చేశారని దిగ్విజయ్ ఎద్దేవా చేశారు. సాధ్విపై పోటీ చేయడం తెలీకా.. కష్టమా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనన్నారు దిగ్విజయ్. కానీ తాను ఎప్పటిలానే విజయం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. అంతేకాక ప్రస్తుతం దేశంలో ప్రధాన సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కశ్మీర్ అంశాలను వదిలేసి.. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని దిగ్విజయ్ మండి పడ్డారు. -
డిగ్గిరాజాకు యువకుడి దిమ్మతిరిగే షాక్..!
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్‌కు గట్టి షాక్ ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీచేస్తున్న భోపాల్‌లో జరిగిన ఓ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రూ. 15 లక్షలు మీ ఖాతాల్లోకి వచ్చాయా? అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వేదిక మీదకు వచ్చి చెప్పండి అంటూ జన్నాన్ని ఉత్సాహ పరిచారు. ఓ యువకుడు చేయి ఎత్తడంతో అతన్ని స్టేజీ మీదకు పిలిచి.. ‘మీ అకౌంట్లోకి 15 లక్షలు వచ్చాయా? ప్రజలకు చెప్పు’ అంటూ దిగ్విజయ్ ప్రశ్నించగా.. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఆ యువకుడు బదులిచ్చాడు. ‘మోదీజీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపి.. ఉగ్రవాదులను చంపేశాడు’ అంటూ అతను బదులివ్వడంతో డిగ్గిరాజాతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. వెంటనే ఆ యువకుడిని వేదిక మీద నుంచి తరిమేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూల్‌గా వేదిక మీదకు వచ్చి.. ఏమాత్రం తడబడకుండా తాపీగా మోదీ మీద ప్రశంసల జల్లు కురిపించిన ఓ యువకుడిని ఓ వైపు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు దిగ్విజయ్‌కు ఆ యువకుడు గట్టిగా బుద్ధి చెప్పాడని, ఆయనకు తగిన బదులు దొరికిందని విమర్శనాస్త్రలు సంధిస్తున్నారు. -
సంఘ్ ఆశీస్సులతో సమరానికి సాధ్వి
మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులే కరువవుతున్నారా? పదిహేనేళ్లపాటు అధికారం చెలాయించినా.. ఈసారి సీట్ల ఎంపికలోనూ పార్టీ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ఎస్) ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి ఉందా?. సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ను మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌పై పోటీకి పెట్టడం సత్ఫలితాల నిస్తుందా? బీజేపీతో పాటు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కూడా తొలిచేస్తున్న ప్రశ్నలివి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి నాలుగు దశల్లోనూ పోలింగ్ జరుపుకోనున్న మధ్యప్రదేశ్‌లో సీట్ల ఎంపిక ఆర్ఎస్ఎస్ నిర్ణయాల మేరకే జరిగినట్లు తెలుస్తోంది. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను భోపాల్ స్థానం నుంచి బరిలోకి దింపడం బీజేపీ కార్యకర్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పార్టీ ఎన్నికల వ్యూహం ఏమిటన్నది అర్థం కాక మద్దతుదారులూ తలలు పట్టుకుంటున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తుండటాన్ని బట్టి చూస్తే.. రాజకీయాల కంటే తన హిందుత్వ ఎజెండాకే ఆర్ఎస్ఎస్ పెద్ద పీట వేస్తోందన్న అంచనాలున్నాయి. సాధ్వికి ఎంత అనుకూలం? మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి ఒకప్పుడు భోపాల్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అక్కడి నుంచి వివాదాస్పద ప్రజ్ఞా ఠాకూర్ పోటీ చేస్తున్నారు. ‘దిగ్విజయ్ సింగ్ హిందూ వ్యతిరేకి. హిందువులు ఉగ్రవాదులని కించపరిచారు’ అని ప్రజ్ఞా ఇటీవలే వ్యాఖ్యానించడాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. ఈ కారణంగానే తాను భోపాల్ నుంచి బరిలోకి దిగుతున్నానని, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మద్దతు తనకే ఉందని ప్రజ్ఞా అంటున్నారు. అయితే రాష్ట్ర పరిస్థితులు, సమస్యలపై ఈమెకు ఉన్న అవగాహన ఏమిటి? నిరుద్యోగం మొదలుకొని సాగు, తాగునీటి సమస్యలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రజ్ఞా ఆధ్యాత్మిక గురువు అవధేశానంద గిరి తన శిష్యురాలికి దూరంగా జరగడం. ప్రజ్ఞా తరఫున ప్రచారం కూడా చేయకపోవడం. కీలక స్థానాల్లో ఆర్ఎస్ఎస్ మాటే చెల్లుబాటు ఇండోర్‌తోపాటు భోపాల్, గ్వాలియర్, విదిశ, ఖజురహో లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థులను పరిశీలిస్తే.. పార్టీ మాటకన్నా ఆర్ఎస్ఎస్ మాటే ఎక్కువగా చెల్లుబాటైందన్న అభిప్రాయం కలగకమానదు. పార్టీ ప్రచారంలోనూ గ్రామీణ ప్రాంతాల్లోని అసంతృప్తి, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి వంటి అంశాలకు తక్కువ ప్రాధాన్యం లభిస్తున్నాయి. శివరాజ్‌సింగ్ చౌహాన్, కైలాశ్ విజయ్ వర్గియా, ఉమాభారతి వంటి సీనియర్ నేతలను కూడా పోటీ పెట్టలేని పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటోంది. ఇండోర్ నుంచి ప్రజలకు పెద్దగా పరిచయం లేని శంకర్ లాల్వానీని నిలబెట్టారు. సీనియర్ నేత, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఈ స్థానం టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో అటు సుమిత్ర.. ఇటు ఆమె ప్రత్యర్థి కైలాశ్ విజయ్ వర్గియాలు ఇద్దరూ శంకర్ లాల్వానీకి మద్దతిచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ కారణంగా పెట్టని కోట లాంటి ఇండోర్‌లో బీజేపీ ఈసారి గట్టిపోటీని ఎదుర్కొంటోంది. ఖజురహో విషయాన్ని తీసుకుంటే ఈ స్థానం అభ్యర్థి విష్ణుదత్ శర్మ కూడా ఆర్ఎస్ఎస్ ఎంపికే. ముందు భోపాల్ స్థానానికి ఈయనను ఎంపిక చేసినా బీజేపీ సభ్యుల వ్యతిరేకతతో ఖజురహో స్థానాన్ని కేటాయించారు. అయితే ఆయన ఈ స్థానంలోనూ పార్టీ కార్యకర్తల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజ్ఞాకు టికెట్‌పై సీనియర్ల గుర్రు భోపాల్‌లో ప్రజ్ఞాకు టికెట్ ఇవ్వడంపై కూడా సీనియర్లు బాబూలాల్ గౌర్, ఉమాశంకర్ గుప్తా గుర్రుగానే ఉన్నారు. స్థానికులకు కాకుండా బయటివారికి ఎలా టికెట్ ఇస్తారన్న ధిక్కార స్వరాలు ఇక్కడ వినపడుతున్నాయి. అయితే హిందూ ఓటర్లను తమ వైపునకు మళ్లించేందుకు ప్రజ్ఞా అభ్యర్థిత్వం ఉపయోగపడుతుందని.. అదే సమయంలో నియోజకవర్గంలో ఉన్న దాదాపు 4.5 లక్షల ఠాకూర్ ఓట్లను కూడా ప్రజ్ఞా చీలుస్తుందని మరికొందరు అంటున్నారు. దాదాపు 18 లక్షల ఓటర్లు ఉన్న భోపాల్ నుంచి 1984లో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గెలవగా ఆ తరువాత అంటే 1989 నుంచి బీజేపీ అభ్యర్థులే ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఎత్తులు.. పై ఎత్తులు హిందూ వ్యతిరేకిగా బీజేపీ నేతల విమర్శలకు గురవుతున్న దిగ్విజయ్ సింగ్ ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. కొంతకాలం క్రితమే ఈయన నర్మద నదీ తీరం వెంబడి దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. అంతేకాకుండా తరచూ దేవాలయాలను సందర్శిస్తూ తాను హిందూ వ్యతిరేకిని కాదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో విజయం వరిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. ఆమె నామినేషన్ సందర్భంగా, ‘ప్రజ్ఞాను పోటీకి ఆహ్వానిస్తున్నాను. ఆమె కోసం కూడా ప్రార్థిస్తా’ అని చేసిన ఒక ట్వీట్ కూడా దిగ్విజయ్‌పై ఉన్న చెడు అభిప్రాయాన్ని తగ్గించేదే. ప్రజ్ఞా ఎంపిక బీజేపీ కార్యకర్తల్లోనూ కొంత అయోమయం సృష్టిస్తోంది. భోపాల్‌ను హిందూత్వ భావజాలానికి ఒక పరీక్షా వేదికగా ఆర్ఎస్ఎస్ పరిగణిస్తుంటే.. అధికారం కోసం రామమందిర అంశాన్ని కూడా పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్న బీజేపీ ప్రజ్ఞా ఎంపికను జీర్ణించుకోలేకపోతోంది. కానీ ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆర్ఎస్ఎస్ వ్యూహాలను 130 ఏళ్ల పార్టీ గమనించకుండా ఉంటుందా? అన్నది ప్రశ్న. మాయావతి, యోగీ ఆదిత్యనాథ్, ఆజంఖాన్ వంటి వారికి ఎన్నికల కమిషన్ కూడా కళ్లాలు వేస్తున్న ఈ తరుణంలో ప్రజ్ఞా లాంటి వారు ఏదైనా విద్వేషపూరిత ప్రసంగం చేస్తే అడ్డుకోకుండా ఉంటుందా?. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సహాయకులపై ఐటీ దాడులు భారీ మొత్తంలో నగదు పట్టుబడటం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్థానిక బీజేపీ నేతలపై కన్నేసి ఉంచామన్న సంకేతాలు పంపింది. ఈ– టెండర్ల స్కామ్‌ను తిరగదోడి విచారణ ప్రారంభించింది. ఇందులో కొంతమంది బీజేపీ పార్లమెంటు సభ్యులపై కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌమ్యా నాయుడు, డేట్లైన్ – ఇండోర్ -
బీజేపీలో చేరిన సాధ్వి ప్రజ్ఞాసింగ్
భోపాల్ : మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ బుధవారం కాషాయ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ప్రజ్ఞాసింగ్ భోపాల్‌లోని బీజేపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా ప్రభాత్ ఝా, నరోత్తమ్ మిశ్రా, రామ్ లాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను అధికారికంగా బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. మంగళవారమే తాను బీజేపీలో ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నట్లు చెప్పిన ఆమె పార్టీ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమన్నారు. తాను పోటీ చేయడం ఖాయమని, గెలుస్తానని కూడా ప్రజ్ఞాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రజ్ఞాసింగ్ లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే బీజేపీ అధిష్టానం ఆమె పేరును అధికారికంగా ప్రకటించమే మిగిలి ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌పై ప్రజ్ఞాసింగ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2008 సెప్టెంబర్ 29వ తేదీన ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెగావ్‌లో మోటార్ సైకిల్‌కు అమర్చిన రెండు బాంబులు పేలి ఏడుగురు మరణించారు, మరో వందమంది గాయపడ్డారు. ఈ కేసులో అదే సంవత్సరం అక్టోబర్‌లో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ను అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేనందున సాధ్వి ప్రజ్ఞ సహా మరో ఐదుగురిపై ఆరోపణలను జాతీయ దర్యాప్తు సంస్థ ఉపసంహరించుకుంది. సుమారు ఎనిమిదేళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఆమె ఈ కేసులో ఇటీవలే నిర్దోషిగా విడుదలయ్యారు. -
దిగ్విజయ్ సింగ్ వర్సెస్ సాధ్వి ప్రజ్ఞా సింగ్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను బరిలో దింపాలని బీజేపీ యోచిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్, విదిశ, గుణ లోక్‌సభ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసిన కాషాయ పార్టీ భోపాల్‌లో డిగ్గీరాజాకు దీటైన అభ్యర్ధిని పోటీలో నిలపాలని భావిస్తోంది. కాగా,పార్టీ ఆదేశిస్తే తాను భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమని సాధ్వి ప్రగ్యా స్పష్టం చేశారు. తాను జాతీయవాదినని, దిగ్విజయ్ సింగ్ మాత్రం తరచూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని డిగ్గీరాజాను దుయ్యబట్టారు. తనకు దిగ్విజయ్ సింగ్ ఎంతమాత్రం పోటీ కాదని అన్నారు. -
డిగ్గీ రాజా ఈజ్ బ్యాక్
మధ్యప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. భారతీయ జనతా పార్టీకి కంచుకోటలైన స్థానాల్లో పాగా వేయాలని వ్యూహాలను పన్నుతోంది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ను భోపాల్ బరిలోంచి దింపుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్లో, నాయకుల్లో వర్గాలకు అతీతంగా అందరితోనూ సత్సంబంధాలున్న ఒకే ఒక్క నాయకుడు దిగ్విజయ్ సింగ్. 30 సంవత్సరాలుగా భోపాల్, ఇండోర్, విదిష, దామో నియోజకవర్గాలు బీజేపీకి కంచుకోటగా ఉన్నాయి. అలాంటి స్థానాల్లో గట్టి అభ్యర్థుల్ని బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రతిపాదనల మేరకే దిగ్విజయ్ సింగ్ పోటీకి అంగీకరించారు. వాస్తవానికి ఆయన రాజ్‌గఢ్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ భోపాల్ వంటి చోట దిగితేనే బీజేపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చన్న కమలనాథ్ సూచనకు సరేనన్నారు. వివాదాలకు మారుపేరు కాంగ్రెస్ శ్రేణులు ‘డిగ్గీ రాజా’గా పిలుచుకునే దిగ్విజయ్‌సింగ్.. వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. గతంలో ఆయన చేసిన ఎన్నో వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. 2003 ఎన్నికల్లో ఓడిపోతే పదేళ్ల పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి.. చివరకు ఆ మాట మీదే నిలబడ్డారు. 2003లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యాక తెరవెనక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయననే లోక్‌సభ బరిలోకి దింపడం ద్వారా పార్టీలో వర్గపోరును కొంతైనా తగ్గించవచ్చన్న వ్యూహంతో పార్టీ ముందుకు వెళుతోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బలం మూడు మాత్రమే. చింద్వారా, గుణ, రత్లాం లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. అందుకే ఈసారి అభ్యర్థుల ఎంపికలో గట్టి కసరత్తే చేస్తోంది. అంతర్గతంగా సర్వే చేయించి మరీ అభ్యర్థుల్ని పోటీకి దింపుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రత్లాం స్థానాన్ని కోల్పోయింది. పీసీసీ మాజీ చీఫ్ కాంతిలాల్ భూరియా ఆ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. సింధియాను గ్వాలియర్‌కు పంపుతారా? జ్యోతిరాధిత్య సింధియా ప్రస్తుతం గుణ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడ సింధియాకు వ్యతిరేకంగా అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయనను గ్వాలియర్ బరిలో దింపే యోచనలో అధిష్టానం ఉంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న జైఆదివాసీ యువ సంఘటన్ (జయాస్) నాలుగు గిరిజన స్థానాలను కావాలని పట్టుబడుతోంది. అందులో రత్లాం కూడా ఉంది. కాంగ్రెస్ ఆ పార్టీకి రెండుకి మించి సీట్లు కేటాయించే అవకాశాల్లేవు. అదే జరిగితే రత్లాం బరిలో మళ్లీ భూరియానే దింపుతారు. ఇక ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత తొమ్మిదిసార్లుగా ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తన సీఎం సీటులో కొనసాగాలంటే అసెంబ్లీకి ఎన్నిక కావాలి. ఆయన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చింద్వారా నుంచే పోటీ చేస్తున్నారు. అందుకే కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్‌ను చింద్వారా లోక్‌సభ బరిలో కాంగ్రెస్ అధిష్టానం దింపనుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్ కుమారుడు అజయ్ సింగ్ గత ఎన్నికల్లో సాత్నా నియోజకవర్గం నుంచి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు అజయ్‌ను సిధి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపనున్నారు. కుమ్ములాటలు కొలిక్కి? అంతర్గత కుమ్ములాటలతోనే మధ్యప్రదేశ్‌లో పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దిగ్విజయ్‌సింగ్ స్వయంగా రాష్ట్రమంతటా తిరిగి పార్టీలో ముఠా తగాదాలను తీర్చి అందరినీ కలిపే ప్రయత్నం చేశారు. 2017 సెప్టెంబర్ 30 నుంచి ఆరు నెలల పాటు నర్మద యాత్ర నిర్వహించారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత మతపరమైన యాత్రగా ప్రకటించిన ఆయన నర్మద తీర ప్రాంతంలోని 90 నియోజకవర్గాలను చుట్టారు. దిగ్విజయ్ సింగ్‌కు బీజేపీలో ఉన్న సన్నిహితులు కూడా ఈ యాత్రను హర్షించి ఆయనకు స్వాగత సత్కారాలు చేయడం విశేషం. డేట్లైన్–భోపాల్ సౌమ్య నాయుడు -
‘దిగ్విజయ్ వర్సెస్ శివరాజ్ చౌహాన్’
భోపాల్ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టున్న భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను బరిలో దింపడంతో ఆయనకు దీటైన అభ్యర్థిగా బీజేపీ నుంచి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పోటీలో నిలపాలని భావిస్తోంది. వీరిద్దరూ ప్రత్యర్ధులుగా తలపడితే ఇద్దరు మాజీ సీఎంల నడుమ బ్యాలెట్ పోరు ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు దిగ్విజయ్ సింగ్‌పై పోటీకి మాలెగావ్ పేలుళ్ల కేసులో అభియోగాలు ఎదుర్కొని ఇటీవలే న్యాయస్ధానం నుంచి ఊరట పొందిన సాధ్వి ప్రగ్య ఠాకూర్ ఆసక్తి కనబరుస్తున్నారు. భోపాల్ స్ధానాన్ని గత మూడు దశాబ్ధాలుగా బీజేపీ కైవసం చేసుకుంటోంది. 1984లో చివరిసారిగా కాంగ్రెస్ నేత శంకర్ దయాళ్ శర్మ ఆ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. అప్పటినుంచి భోపాల్ బీజేపీ ఖాతాలోనే కొనసాగుతోంది. 1989 నుంచి బీజేపీకి చెందిన సుశీల్ చంద్ర వర్మ వరుసగా మూడుసార్లు భోపాల్ నుంచి ఎన్నికయ్యారు. 1999లో భోపాల్ నుంచి నెగ్గిన ఉమా భారతి సీఎం పగ్గాలు చేపట్టిన అనంరతం పార్లమెంట్ స్ధానం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం భోపాల్ నుంచి బీజేపీ సభ్యుడు అలోక్ సంజార్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు భోపాల్ నుంచి దిగ్విజయ్ సింగ్ బరిలో దిగడం, లోక్‌సభ పరిధిలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటంతో దీటైన అభ్యర్ధివైపే బీజేపీ మొగ్గుచూపుతోంది. భోపాల్ నుంచి పోటీ చేసేందుకు మేయర్ అలోక్ శర్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి వీడీ శర్మలను పరిశీలిస్తున్న బీజేపీ దిగ్విజయ్ రాకతో దిగ్గజ నేతనే బరిలో దింపాలని యోచిస్తోంది. -
టఫెస్ట్ సీటు నుంచి దిగ్విజయ్ పోటీ!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అత్యంత పోటీ ఉండే లోక్‌సభ స్థానం (టఫెస్ట్ సీటు) నుంచి పోటీ చేయాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ విసిరిన చాలెంజ్‌ను దిగ్విజయ్ సింగ్ నాలుగు రోజుల కిందట స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను భోపాల్ నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపింది. గట్టి పోటీ ఉండే స్థానం నుంచి పోటీ చేయాలన్న తన సవాలును దిగ్విజయ్ స్వీకరించడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సీఎం కమల్‌నాథ్ శనివారం విలేకరులకు తెలిపారు. ‘చాలెంజ్‌లు స్వీకరించడం నా అలవాటు. 1977లో జనతా పార్టీ ప్రభంజనం వీచినప్పటికీ.. రాంగఢ్ నియోజకవర్గం నుంచి నేను గెలుపొందాను. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన స్థానంలో పోటీకి సిద్ధంగా ఉన్నాను’ అని దిగ్విజయ్ ట్విటర్లో తెలిపారు. భోపాల్ మధ్యప్రదేశ్‌లో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అలోక్ సంజార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భోపాల్‌తోపాటు ఇండోర్, విదిశా నియోజకవర్గాల్లో గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్‌లో కాంగ్రెస్ నుంచి మాజీ రాష్ట్రపతి దివంగత శంకర్ దయాల్ శర్మ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో భోపాల్ నుంచి దిగ్విజయ్‌ను కమల్‌నాథ్ బరిలోకి దింపుతున్నారు. కమల్‌నాథ్ సీఎం పదవి చేపట్టిన తర్వాత దిగ్విజయ్‌తో ఆయనకు విభేదాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు రానున్న ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. -
హిట్లర్, ముస్సోలినీ, మోదీ వంటి నేతలు మనకొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ప్రపంచ నియంతృత్వ నేతలు అడాల్ఫ్ హిట్లర్, ముస్సోలినితో పోల్చుతూ దిగ్విజయ్ సింగ్ శనివారం విమర్శలు గుప్పించారు. ప్రపంచ శాంతిని కోరుకునే నేతలు కావాలని, కానీ జాతి విద్వేశాలు రెచ్చగొట్టే నేతలు వద్దంటూ ఆయన ట్వీట్ చేశారు. "మనకు మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారు కావాలి. అంతేగానీ, హిట్లర్, ముస్సోలినీ, మోదీ వంటి వారు కాదు’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. న్యూజిలాండ్‌లో నరమేధం న్యూజిలాండ్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటనై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను ఆయన రీట్వీట్ చేస్తూ దిగ్విజయ్ ఈ విధంగా స్పందించారు. ‘నేను రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. సనాతన ధర్మంతో పాటు గౌతమ బుద్ధుడు, మహావీర్ వంటి వారు ప్రచారం చేసిన శాంతి, జాలి, దయా వంటి సిద్ధాంతాలు ప్రపంచానికి కావాలి. అంతేగానీ, విద్వేషం, హింస రేపే భావజాలం కాదు'' అని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. కాగా, న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మృతులకు సంతాపం తెలుపుతూ శుక్రవారం రాహుల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాదానికి చెందిన నీచపు చర్య. ఇటువంటి చర్యను పూర్తిగా ఖండించాలి. ఇటువంటి వాటిని అర్థం చేసుకుంటూ వీటికి వ్యతిరేకంగా ప్రపంచం నిలబడుతోంది. ప్రత్యేక భావజాలంతో, విద్వేషంతో కూడిన ఈ తీవ్రవాదం ఉండడానికి వీల్లేదు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. -
‘పుల్వామా పెద్ద ప్రమాదం’; ఇప్పుడు ఏమంటారు మోదీజీ?!
లక్నో : పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ప్రధాని మోదీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మోదీ కావాలనే ఇలాంటి చర్యలకు దిగారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పుల్వామా ఉగ్రదాడి కాదు.. ఒక ప్రమాదం మాత్రమే అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రధాని మోదీ సహా అధికార పార్టీ నేతలు డిగ్గీ రాజాపై విమర్శల దాడి మొదలుపెట్టారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన పార్టీ నేతల తీరు.. వాళ్ల మెంటాలిటీ ఇదీ అంటూ మోదీ.. దిగ్విజయ్ సింగ్‌పై విరుచుకుపడ్డారు.(‘పుల్వామా ఉగ్రదాడి కాదు ప్రమాదం మాత్రమే’) ఈ నేపథ్యంలో బుధవారం దిగ్విజయ్ సింగ్ రీట్వీట్ చేసిన ఓ వీడియో బీజేపీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఫిబ్రవరి 21న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య విలేకరులతో మట్లాడుతూ..‘పుల్వామా ఉగ్రదాడి పెద్ద ప్రమాదం మాత్రమే. ఇందులో భద్రతా వైఫల్యం ఏమీ లేదు. అయితే ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో తన అనుమతి లేకుండానే చర్యలు తీసుకునేలా వారిని ప్రోత్సహించారు అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన డిగ్గీ రాజా... ‘ మౌర్యాజీ మాటలపై ఇప్పుడు మోదీ, ఆయన మంత్రులు ఏం సమాధానం చెబుతారు. అమర జవాన్ల పట్ల బీజేపీ వైఖరి ఏంటో స్పష్టమైంది’ కదా అని విమర్శలను తిప్పికొట్టారు. उत्तरप्रदेश के उपमुख्यमंत्री केशव प्रसाद मौर्य ने पुलवामा हमले को बड़ी 'दुर्घटना' बताया। तो क्या अब मौर्य जी भी देशद्रोही कहे जाएंगे? मीडिया ने दिग्विजय सिंह जी के बयान पर जो हंगामा किया वैसा ही हंगामा अब मचाएंगे या बिल में घुस जाएंगे। @digvijaya_28 pic.twitter.com/M83JLlGDrh — Yogendra Singh Parihar (@Yogendra_INC) March 5, 2019 -
దమ్ముంటే అరెస్టు చేయ్.. మోదీకి సవాల్!
న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రవాద దాడి ఘటనను ‘ప్రమాదం’గా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఘాటుగా ట్వీట్ చేశారు. పూల్వామా ట్వీట్ నేపథ్యంలో దమ్ముంటే ప్రధాని మోదీ తనపై కేసు పెట్టి విచారణ జరపాలని సవాల్ విసిరారు. ‘నేను చేసిన ట్వీట్‌తో నేను పాకిస్థాన్ మద్దతుదారుడినని, దేశద్రోహినని మీరు, మీ మంత్రులు ముద్ర వేస్తున్నాను. నేను ఈ ట్వీట్‌ను ఢిల్లీలో చేశాను. ఢిల్లీలో పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నారు. మీకు దమ్ముంటే నాపై కేసు పెట్టండి’ అని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. పూల్వామా ప్రమాదం తర్వాత భారత్ జరిపిన వైమానిక దాడులపై విదేశీ మీడియా అనుమానాలు వ్యక్తం చేసిందంటూ దిగ్విజయ్ మంగళవారం చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 40మందికి పైగా జవాన్లను పొట్టనబెట్టుకున్న పూల్వామా ఉగ్రవాద దాడిని కేవలం ప్రమాదంగా అభివర్ణిస్తూ దిగ్విజయ్ ట్వీట్ చేశారంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఆయనపై మండిపడ్డారు. -
పుల్వామా ఉగ్రదాడి కాదు.. ఓ యాక్సిడెంట్ : బీజేపీ నేత
న్యూఢిల్లీ : పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో దిగ్విజయ్ పాకిస్తాన్ మద్దతుదారుడంటూ బీజేపీ సీనియర్ మంత్రులు ఆయనపై విమర్శల వర్షం కురింపించారు. ఈ వివాదం సద్దుమణగకముందే.. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదు.. ఓ యాక్సిడెంట్ మాత్రమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీని ఇరుకున పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేసిన దిగ్విజయ్.. ‘ఇప్పుడేమంటారు మోదీ’ అంటూ ప్రశ్నించారు. దిగ్విజయ్.. ‘పుల్వామా ఉగ్ర దాడిని నేను ప్రమాదవశాత్తు జరిగింది అంటే నా మీద విరుచుకుపడ్డారు. ఓ ముగ్గురు కేంద్ర మంత్రులైతే.. ఏకంగా నాపై పాకిస్తాన్ మద్దతుదారుడిగా ముద్ర వేశారు. మరి ఇప్పుడు మీ పార్టీ నాయకుడు.. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య కూడా పుల్వామా ఉగ్ర దాడిని ఓ యాక్సిడెంట్ అని స్పష్టం చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి.. మినిస్టర్‌పై మీరు తీసుకోబోయే చర్యలేంటి మోదీజీ’ అంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు. पुलवामा आतंकी हमले को मैंने “दुर्घटना” कह दिया तो मोदी जी से ले कर ३ केंद्रीय मंत्री जी मुझे पाकिस्तान समर्थक बताने में जुट गये। उत्तर प्रदेश में भाजपा के उप मुख्य मंत्री जी केशव देव मौर्य जी का बयान कृपया सुनें। मोदी जी व उनके मंत्रीगण मौर्य जी के बारे में कुछ कहना चाहेंगे? — digvijaya singh (@digvijaya_28) March 6, 2019 తీవ్ర దుమారం రేపిన ఈ వీడియోలో కేశవ ప్రసాద్ మౌర్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగింది ఉగ్ర దాడి కాదు. భద్రతా లోపం వల్ల కూడా జరగలేదు. ఇది కేవలం ఓ యాక్సిడెంట్ మాత్రమే. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. దాంతో మోదీ బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇక ఇప్పుడు బలగాలకు ఏది మంచిదనిపిస్తే దాన్నే ఆచరిస్తాయ’ని తెలిపారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ సీనియర్‌నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. उत्तर प्रदेश के उपमुख्यमंत्री @kpmaurya1 ने भी #पुलवामा हमले को सुरक्षा में चूक नहीं "दुर्घटना" कहा है। भक्तों इनको देशद्रोही कब घोषित कर रहे हो? या सेना के नाम पर केवल चुनावी रोटियां सेंकनी है? @brajeshabpnews @jarariya91 @AdityaMenon22 @shahnawazk @anandrai177 pic.twitter.com/FYTQzMnuN5 — Anshul Trivedi (@anshultrivedi47) March 5, 2019 -
‘పుల్వామా ఉగ్రదాడి కాదు ప్రమాదం మాత్రమే’
సాక్షి,న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి, భారత వైమానిక దళాల దాడులపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధాని మోదీయే టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని వ్యాఖ్యానించారు. దాని ద్వారా బీజేపీ ప్రభుత్వం లబ్ధిపొందాలని ప్రయత్నిస్తోందని దిగ్గిరాజా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.(ఆధారాలు కావాలా.. బాలాకోట్ వెళ్లండి!) బాలాకోట్‌లో భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల సంఖ్యను ప్రధాని మోదీ అధికారికంగా ఎందుకు విడుదల చేయలేదని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. బీజేపీలో ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య ప్రకటిస్తున్నారని అన్నారు. మెరుపు దాడుల్లో 250 మంది ఉగ్రదాదులను అంతంచేశామని అమిత్ షా, 500 మంది అని యోగి ఆదిత్యానాథ్ చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ ఇంతవరకు కేంద్రం మాత్రం ప్రకటించలేదని అన్నారు. ఈమేరకు బుధవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ సీనియర్‌నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. हमें हमारी सेना पर उनकी बहादुरी पर गर्व है व सम्पूर्ण विश्वास है। सेना में मैंने मेरे अनेकों परिचित व निकट के रिश्तेदारों को देखा है किस प्रकार वे अपने परिवारों को छोड़ कर हमारी सुरक्षा करते हैं। हम उनका सम्मान करते हैं। — digvijaya singh (@digvijaya_28) 5 March 2019 -
దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్).. రాయని డైరీ
దేశ పౌరులు రాత్రి పూట హాయిగా నిద్రపోతున్నారంటే దేశ ప్రధాని మెలకువగా ఉన్నట్టు. దేశ పౌరులంతా నిద్రకు తూలుతూ కూడా నిద్రను ఆపుకుంటూ కూర్చుంటున్నారంటే దేశ ప్రధాని పగటి పూట కూడా నిద్రపోతున్నట్టు. మోదీకి నిద్రెలా పడుతోందో కొద్ది రోజులుగా నాకు అంతుచిక్కడం లేదు. ఇంకొక అంతుచిక్కని ప్రశ్న కూడా ఈ వయసులో నన్ను అమితంగా వేధిస్తోంది. మోదీ ఛాతీని ఎవరు కొలిచి ఉంటారు! ఆయనకై ఆయనే కొలుచుకుని తన ఛాతీ యాభై ఆరు అంగుళాలు ఉందని తెలుసుకుని ఉంటారా, లేక అమిత్‌షా ఆయన దగ్గరికి వచ్చి, ఛాతీ చుట్టూ టేప్ పెట్టి కొలిచి, ‘అరవైకి కేవలం కొన్ని అంగుళాలే తక్కువ మోదీజీ’ అని గొప్ప పరవశంతో చెప్పి ఉంటారా? అరవై కన్నా తక్కువ అనడంలో తనని తను తగ్గించుకుని ఎక్కువ చేసుకోవడం ఉంటుంది. ఎక్కువా తక్కువా కాకుండా కచ్చితంగా ఒక మెజర్మెంట్.. యాభై అయిదనో, యాభై ఆరు అనో చెప్పడంలో.. తన ఛాతీ ఇంకా పెరిగేందుకు స్కోప్ ఉందనే హెచ్చరికను పంపడానికి అవకాశం ఉంటుంది. మోదీ ఛాతీ ఏ క్షణానైనా మరికొన్ని అంగుళాలు పెరిగే ప్రమాదం ఉందంటే ప్రతిపక్షాలకు ఉండే భయం వేరు, మోదీ ఛాతీ మరికొన్ని అంగుళాలు పెరగడానికి ఇంకా సమయం ఉందని ప్రతిపక్షాలు అనుకుంటే వారికి వచ్చే ధైర్యం వేరు అని మోదీ తనకు తాను అనుకుని ఉండాలి. ప్రతిపక్షాలను నిరంతరం భయ కంపనంలో ఉంచదలచుకుని.. ‘నా ఛాతీ అరవైకి నాలుగు అంగుళాలే తక్కువ’ అని కాకుండా, ‘నా ఛాతీ యాభై ఆరు అంగుళాల వద్ద కేంద్రీకృతమై ఉంది’ అని ఆయన చెప్పదలచుకున్నారని నాకు అర్థమౌతోంది. పెరగవలసిన సమయంలో ఒక్క అంగుళమైనా పెరగకుండా ఛాతీ యాభై ఆరుంటేనేం, అరవై ఆరుంటేనేం? కశ్మీర్లో నలభై మంది జవాన్లు చనిపోయినా కూడా మోదీ ఛాతీ యాభై ఆరు దగ్గరే ఉండిపోయింది! ప్రతిపక్షాలకు చూపించుకోడానికేనా ఆ ఛాతీ! పాకిస్తాన్‌కి చూపించడానికి కాదా! సౌదీ నుంచి క్రౌన్ ప్రిన్స్ వచ్చారు. ‘టెర్రర్ ఎటాక్ తర్వాత ఎలా ఉన్నారు?’ అని ఆయన అడగలేదు. ‘టెర్రర్ ఎటాక్ తర్వాత ఎలా ఉంటాం?’ అని ఈయనా అనలేదు. ప్రిన్స్ గారిని రాష్ట్రపతి భవన్‌కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ హౌస్‌కి వెంటబెట్టుకొచ్చారు. ‘వియ్ ఆర్ ఫ్రెండ్స్’ అన్నారు ప్రిన్స్‌గారు. ‘అవునవును వియ్ ఆర్ ఓల్డ్ ఫ్రెండ్స్’ అన్నారు పీఎం గారు. ‘ఎస్.. ఎస్.. సెంచరీస్ ఓల్డ్ ఫ్రెండ్షిప్’ అన్నారు ప్రిన్స్‌గారు. ‘మీ కంట్రీ మా కంట్రీ ఒకేలా ఉంటాయి. మీ కల్చర్, మా కల్చర్ ఒకేలా ఉంటాయి. కొన్నాళ్ల క్రితం మేం మీ దేశానికి వచ్చాం. ఇన్నాళ్లకు మీరు మా దేశానికి వచ్చారు’ అన్నారు పీఎం గారు. జాయింట్ స్టేట్మెంట్ రాసుకున్నారు. స్టేట్మెంట్లో ఉగ్రవాదం అనే మాట ఉంది. ఇండియా–పాకిస్తాన్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి అనే వాక్యం ఉంది. పుల్వామా అనే మాట లేదు. జైషే అనే పేరు లేదు! ఇండియా, పాకిస్తాన్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని ప్రిన్స్‌గారు, పీఎం గారు సంతకాలు పెట్టారు కానీ.. ఇండియా, పాకిస్తాన్ ఎందుకు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలో స్టేట్మెంట్లో రాసుకోలేదు! ఇండియాలోని ఉగ్రవాదులు పాకిస్తాన్ మీద టెర్రర్ ఎటాక్ చేయకుండా ఇండియా పాకిస్తాన్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సౌదీ ప్రిన్స్ వచ్చి మోదీకి చెప్పి వెళ్లినట్లు ప్రచారం చెయ్యడానికి చైనా లాంటి దేశాలకు ఆ స్టేట్మెంట్ కాపీ ఒకటి చాలదా! -
‘సిద్ధూ..ఇమ్రాన్ భాయ్‌కు అర్థమయ్యేలా వ్యవహరించండి’
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిపై ఓ దేశాన్ని (పాకిస్తాన్) నిందించడం తగదని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తగా, తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం సిద్ధూను ట్రోల్ చేశారు. పాక్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుండగా పాక్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను అనుకూలంగా సిద్దూ వ్యాఖ్యలున్నాయని నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని భారత్ భావిస్తున్న క్రమంలో సిద్దూ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిద్ధూపై తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నవజోత్ సింగ్ సిద్ధూజీ..మీ స్నేహితుడు ఇమ్రాన్ భాయ్‌ను పరిస్థితిని అర్ధం చేసుకునేలా వ్యవహరించండ’ని ఆయన ట్వీట్ చేశారు. ‘ఇమ్రాన్ వల్లే మీరు విమర్శలు ఎదుర్కొంటున్నా’రని మరో ట్వీట్లో వ్యాఖ్యానించారు. కాగా ఈ నెల 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
బీజేపీ మాజీ సీఎంకు టికెట్ ఆఫర్ చేసిన కాంగ్రెస్
భోపాల్ : రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీని గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం మరింత ఉత్సాహంగా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బాబులాల్ గౌర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్.. తనను భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయమని కోరినట్లు బాబులాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ నన్ను కలిశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున భోపాల్ నుంచి పోటి చేయమని కోరిన’ట్లు బాబులాల్ తెలిపారు. అయితే ఈ విషయం గురించి ఇప్పుడే ఏమి చెప్పలేనని.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని దిగ్విజయ్‌తో చెప్పినట్లు తెలిపారు బాబులాల్. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో భంగపడిన బీజేపీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త వ్యూహాలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్లను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిస్తోంది. -
‘ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రూ.100 కోట్ల ఆఫర్’
భోపాల్ : కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు.. బీజేపీ వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి... సబల్‌ఘర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ నేత బాజీనాథ్ కుశ్వాహను కలిశారు. అనంతరం ఆయనను ఓ దాబాకు తీసుకువెళ్లారు. అక్కడే బీజేపీ మాజీ మంత్రులు నరోత్తమ్ మిశ్రా, విశ్వాస్ సారంగ్ బాజీనాథ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆయనకు ఆశ జూపారు. అలాగే వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెడతామని ఆయనకు చెప్పారు. కానీ బాజీనాథ్ వీటిని తిరస్కరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఇలా దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది’ అని డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు. కాగా దిగ్విజయ్ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. అబద్ధాలు ప్రచారం చేయడం దిగ్విజయ్‌కు అలవాటేనని, ఆయనో ‘గాసిప్ మాంగర్’ అని విమర్శించారు. ఈ విషయానికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఉంటే తప్పకుండా విచారణ జరిపించాలని, అధికారంలో ఉన్నది వాళ్ల పార్టీయే కాబట్టి మీటింగ్ జరిగిందని చెబుతున్న దాబాకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీలు తెచ్చి వీటిని నిరూపించాలని సవాల్ విసిరారు. తమకు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో కమల్‌నాథ్ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో 15 సంవత్సరాల సుదీర్ఘ బీజేపీ పాలనకు తెరపడింది. -
దిగ్విజయ్ సింగ్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. దిగ్విజయ్‌కు నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఒవైసిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు దిగ్విజయ్ సింగ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ దిగ్విజయ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన హైకోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించిన దిగ్విజయ్ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. కేవలం భయపెట్టి డబ్బులు వసూలు చేసుకోడానికే ఎంఐఎం పార్టీని కొన్ని రాష్ట్రాల్లో అసదుద్దిన్ బరిలోకి దింపాడంటూ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దమారం రేపాయి. ఈ వ్యాఖ్యల వల్ల తమ పార్టీకి, అధినేత పరువుకు భంగం కలిగిందంటూ ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రటరీ హుస్సేన్ అన్వర్ నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా దిగ్విజయ్ హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఎన్నిసార్లు పిలిచినా అతడు విచారణకు హాజరు కానందుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు వెలువరించింది. -
మావోల లేఖల్లో దిగ్విజయ్ నంబర్
పుణె: ఎల్గార్ పరిషత్ కేసు విచారణలో భాగంగా తమకు లభించిన లేఖల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌దిగా భావిస్తున్న ఫోన్ నంబర్ ఉందని పుణె పోలీసులు వెల్లడించారు. దాంతో చార్జిషీట్లో దానిని చేర్చామన్నారు. సెప్టెంబర్ 25, 2017న సురేంద్ర గాడ్లింగ్ అనే మానవహక్కుల కార్యకర్తకు మావోయిస్టు నేత నుంచి వచ్చిన ఒక లేఖలో దిగ్విజయ్ సింగ్‌దిగా భావిస్తున్న ఫోన్ నెంబర్ ఉందని తెలిపారు. ‘విద్యార్థుల సహకారంతో దేశవ్యాప్త నిరసనలను మనం మరింత తీవ్రతరం చేయాలి. సాధారణంగా పోలీసులు విద్యార్థులతో కఠినంగా వ్యవహరించలేరు. అది మనకు అనుకూలత. మన ఉద్యమాలకు సహకరించేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెంబర్లో మన మిత్రుడిని సంప్రదించగలరు’ అని ఆ లేఖలో ఉందన్నారు. ఆ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌దేనని పోలీసులు భావిస్తున్నారన్నారు. ఆ నంబర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లోనూ ఉందని ఒక పోలీసు అధికారి చెప్పారు. దిగ్విజయ్ స్పందిస్తూ.. ధైర్యముంటే తనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌లకు సవాల్ విసిరారు. -
దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించనున్న పూణే పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ : అర్బన్ నక్సల్స్ కేసుకు సంబంధించి పూణే పోలీసులు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న లేఖలో స్నేహితుడి నెంబర్‌గా పేర్కొన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌కు చెందినదిగా పోలీసుల విచారణలో వెల్లడైందని డీసీపీ సుహాస్ బావ్చే చెప్పారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, దీనిపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని పూణే పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థుల ద్వారా దేశవ్యాప్త నిరసనలకు సహకరించేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖంగా ఉన్నారని కామ్రేడ్ సురేంద్రకు కామ్రేడ్ ప్రకాష్ రాసినట్టుగా చెబుతున్నఈ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల అరెస్ట్ అయిన కార్యకర్తలకు మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయనే ఆధారాల కోసం పూణే పోలీసులు ఈ లేఖను కోర్టులో సమర్పించారు. కాగా లేఖలో పేర్కొన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌దేననే వార్తల నేపథ్యంలో దీంతో తనకెలాంటి సంబంధం లేదని దిగ్విజయ్ తోసిపుచ్చారు. -
‘నేను మాట్లాడితే కాంగ్రెస్‌కు ఓట్లు పడవు’
భోపాల్ : తాను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాకుండా పోతాయంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్. మంగళవారమిక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న ఎన్నికల ర్యాలీలో తాను పాల్గొనకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ తన శాయశక్తుల ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తోంది. అయితే దిగ్విజయ్ సింగ్ ఈ ప్రచార కార్యక్రమాలకు వేటికి హాజరు కావడం లేదని సమాచారం. ఈ విషయం గురించి దిగ్విజయ్‌ని ప్రశ్నించగా.. ‘నేను ఏమన్నా మాట్లాడితే అది వివాదాస్పదం అవుతోంది. అందుకే ఎన్నికలు ముగిసే వరకూ నేను ఏం మాట్లకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను మాట్లాడితే దాని వల్ల మా పార్టీకి ఓట్లు పడవు. అందుకే ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. ర్యాలీల్లో కూడా పాల్గొనటం లేదు. కానీ నా కార్యకర్తలకు ఓ విషయం చెప్పదల్చుకున్నాను. పార్టీ నిర్ణయమే మనందరికి శిరోధార్యం. మనకు నచ్చని వాళ్లు ఎన్నికల బరిలో ఉన్నప్పటికి కూడా మనం పార్టీని దృష్టిలో పెట్టుకుని వారి కోసం పని చేయాలి. వారిని గెలిపించాలి’ అని కోరారు. అయితే బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం దిగ్విజయ్ సింగ్‌కి ఇష్టం లేదని.. అందువల్లే ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో దిగ్విజయ్ కూడా కాంగ్రెస్, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. -
‘డిగ్గి.. యూపీలో తెలుగు మాట్లాడతారా..?’
న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయం అయితే చాలు.. అది నిజమో కాదో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఆనక అది కాస్తా తప్పుడు సమాచారం అని తెలడంతో విమర్శల పాలవ్వడం పరిపాటి అయ్యింది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కి. తాజాగా మరోసారి నెటిజన్ల చేతిలో విమర్శల పాలవుతున్నారు దిగ్విజయ్ సింగ్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం కాస్తా రివర్సవ్వడంతో తలపట్టుకున్నారు డిగ్గి రాజా. విషయం ఏంటంటే దిగ్విజయ్ సింగ్ తన ట్విటర్లో నిరుపయోగంగా పడి ఉండి శిథిలావస్థకు చేరుకున్న 108 వాహనాల ఫోటోను షేర్ చేశారు. ఫోటోతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశిస్తూ ‘యోగి జీ.. మీరు ఉత్తరప్రదేశ్‌కు ఏం చేశారు..? అఖిలేశ్ యాదవ్ హాయాంలో ప్రారంభించిన 108, 102 వాహనాలను మీరు ఇలా నిరుపయోగం చేసి దుమ్ము కొట్టుకుపోయే స్థితికి తీసుకోచ్చారు. ప్రజల ఆరోగ్యానికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత ఇదేనా’ అంటూ ట్వీట్ చేశారు. ये उत्तर प्रदेश की हालत क्या कर दी योगी जी ने, अखिलेश यादव जी द्वारा चलवाई गई 108,102 एम्बूलेंस खड़ी जंग खा रही है और जनता अपने बीमार परिजनों को ठेलो पर अस्पताल ले जा रही है॥ #वाह_योगी_जी_वाह# #बेशरमी_की_भी_हद_होती_है# रजत यादव pic.twitter.com/zWJr8CugHY — digvijaya singh (@digvijaya_28) October 3, 2018 కానీ అసలు విషయం ఏంటంటే ఈ అంబులెన్స్‌లు ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. తొలుత రజత్ యాదవ్ అనే వ్యక్తి షేర్ చేసిన ఈ ఫోటోను కాస్తా దిగ్విజయ్ సింగ్ కాపీ చేసి తన ట్విటర్లో షేర్ చేశారు. యోగి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకుని ఆయనే నవ్వుల పాలయ్యారు. దిగ్విజయ్ ట్వీట్ చేసిన ఫోటో చూసిన నెటిజన్లు ‘ఉత్తరప్రదేశ్‌లో తెలుగు మాట్లాడతారా డిగ్గి’ అంటూ కామెంట్ చేశారు. అంతేకాకా ‘దిగ్విజయ్ ఒక అబద్దాల కోరు’ అంటూ విమర్శిస్తున్నారు. గతంలో కూడా దిగ్విజయ్ సింగ్ పగుళ్లు వచ్చిన ఓ మెట్రో పిల్లర్ ఫోటోను షేర్ చేస్తూ ‘భోపాల్ రైల్వే బ్రిడ్జి పరిస్థితి ఇది’ అంటూ ట్వీట్ చేశారు. ఆనక అది కాస్తా పాకిస్తాన్‌కు చెందిన మెట్రో పిల్లర్‌గా తెలడంతో తన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. -
తెలంగాణ స్పెల్లింగ్ తెలుసుకో: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద బఫూన్ అంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దిగ్విజయ్‌సింగ్ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించడం కన్నా ముందు దిగ్విజయ్‌సింగ్ తెలంగాణకు స్పెల్లింగ్ తెలుసుకోవాలని చురకలంటించారు. ఈ మేరకు కేటీఆర్ శనివారం ట్వీట్ చేశారు. దిగ్విజయ్‌సింగ్ చేసిన ట్వీట్లో తెలంగాణను ఆంగ్లంలో ’'Telengana'’ అని రాయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. -
కేసీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. అనేక అడ్డంకులను ఎదుర్కొని కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందని, అలాంటి కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని శనివారం ఆయన ట్వీట్ చేశారు. కృతజ్ఞత మరిచిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు. -
నకిలీ ఎన్కౌంటర్లే గుజరాత్ నమూనా
సాక్షి, భోపాల్ : తనను నక్సల్స్‌తో సంబంధాలున్నట్లు రుజువైతే తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సవాలు విసిరారు. అతనపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, తనను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు నక్సల్స్‌తో సంబంధాలున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంభిత్ పాత్ర ఇటీవల పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ మంగళవారం మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ సందర్భంగా తనపై చేస్తున్న ఆరోపణలు నిజమైతే తనను వెంటనే అరెస్ట్ చేయాలని కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. అర్బన్ నక్సల్స్ పేరుతో పలువురు ప్రజా సంఘాల నేతల అరెస్ట్‌లపై ఆయన స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసుకునే గుజరాత్ నమూనా పాలన అంటే ఇదేనని వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్లో నకిలీ ఎన్కౌంటర్లు జరిపారని.. మోదీని హత్యచేస్తారన్న అర్బన్ నక్సల్స్‌పై ఆరోపణలు కూడా నకిలీవే అని అన్నారు. -
‘హిందూ మతం కేవలం వ్యక్తిగతం’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని మాజీ కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఓ వార్త సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. బీజేపీ అనుసరిస్తున్న హిందుత్వ భావానికీ హిందూ మతానికి సంబంధం లేదని అన్నారు. మతం అనేది పూర్తిగా వ్యక్తిగత అంశమని, దానిని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం సరికాదన్నారు. ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిందని, తాను మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో సిమి, భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేదించానని గుర్తుచేశారు. భవిష్యత్తు ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సిద్ధాంతపరమైన పోటీ నెలకొంటుందని పేర్కొన్నారు. హిందూత్వాన్ని వీర్సావార్కర్ భారతదేశానికి పరిచయం చేశారని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి రాజకీయ గురువు మీరే అన్న ప్రశ్నకు స్పందిస్తూ... రాహుల్ గాంధీ చాలా కాలం నుంచి రాజకీయల్లో ఉన్నారని, ఆయనకు రాజకీయ గురువులు అవసరం లేదన్నారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేయలేదన్న దిగ్గి.. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి మాత్రం పోటీ చేయట్లేదని తేల్చిచెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా లౌకిక శక్తులతో కలిసి పనిచేయడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. -
నా మాటల్ని వక్రీకరించారు; దిగ్విజయ్ సింగ్
మధ్యప్రదేశ్ : ‘మీడియా నా మాటల్ని తప్పుగా అర్ధం చేసుకుంది. నేను మాట్లాడింది ‘సంఘ్ టెర్రరిజమ్’ గురించి. కానీ మీడియా మాత్రం దాన్ని ‘హిందూ టెర్రరిజమ్’ అని ప్రచారం చేసిందం’టూ వివరణ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్. మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ఏక్తా యాత్ర సందర్భంగా శుక్రవారమిక్కడ నిర్వహించిన మీడియ సమావేశంలో పాల్గొన్నారు దిగ్విజయ్ సింగ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో చేసిన ‘సంఘ్ టెర్రరిజమ్’ గురించి వివరణ ఇచ్చారు. నేను మాట్లాడింది ‘సంఘ్ టెర్రరిజమ్’ గురించి..కానీ మీడియా మాత్రం ‘హిందూ టెర్రరిజమ్’ అంటూ ప్రచారం చేసిందన్నారు. అంతేకాక తీవ్రవాద కార్యకలపాలను మత ప్రతిపాదికను వేరు చేసి చెప్పలేమని, ఏ మతం కూడా తీవ్రవాదాన్ని సమర్ధించదన్నారు. అంతేకాక ‘సంఘ్ టెర్రరిజమ్’ గురించి తాను గతంలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని బలపరుస్తూ ‘మాలేగావ్, మక్కా మసీదు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్, దర్గా షరీఫ్ పేలుళ్ల’కు పాల్పడ్డ వారు ‘సంఘ్ భావజాలం’ నుంచి స్ఫూర్తి పొందే ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ‘సంఘ్ టెర్రరిజమ్’... గతంలో దిగ్విజయ్ ‘ఆర్ఎస్ఎస్’ ప్రచారం చేస్తున్న హింసాకాండ గురించి ‘హింస, ద్వేషం గురించి ప్రచారం చేసే ఈ సంస్థ తీవ్రవాదాన్ని కూడా ప్రచారం చేస్తుంద’ని విమర్శించారు. అంతేకాక ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను ‘సంఘ్ టెర్రరిజమ్’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కానీ మీడియ మాత్రం దిగ్విజయ్ ‘హిందూ టెర్రరిజమ్’ అంటూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని ప్రచారం చేసింది. బీజేపీ పార్టీ కూడా దిగ్విజయ్ చేసిన ‘సంఘ్ టెర్రరిజమ్’ వ్యాఖ్యలను హిందూ టెర్రరిజమ్ అంటూ ప్రచారం చేసింది. సంఘ్ కార్యకర్తలందరూ హిందువులేనని తెలిపింది. ‘సంఘ్ టెర్రరిజమ్’ అంటే ‘హిందూ టెర్రరిజమే’నంటూ దిగ్విజయ్ హిందువులైన సంఘ్ కార్యకర్తలను ఉగ్రవాదులతో పోల్చి వారి మనోభావాలను దెబ్బతీసారని మండిపడింది. -
‘భయ్యూజీ మరణానికి కారణం అదే...’
భోపాల్ : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్ ఆత్మహత్య చేసుకోవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం నర్మదా నది తీరంలో చేపట్టిన అక్రమ తవ్వకాల గురించి భయ్యూజీ ప్రశ్నించేవారని.. అయితే తమ అవినీతి గురించి నోరు విప్పకుండా ఉండేందుకు ఆయనకు మంత్రి పదవి ఆశ చూపినా లొంగలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం గురించి భయ్యూజీ తనతో ఫోన్లో మాట్లాడారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించడం వల్లే ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపించారు. కాగా భయ్యూజీ మహారాజ్ మంగళవారం ఇండోర్‌లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన గదిలో ఓ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని, కుటుంబ బాధ్యతలను ఎవరైనా తీసుకోవాలని భయ్యూజీ నోట్లో రాశారు. నోట్లోని దస్తూరీ మహారాజ్‌దే అని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు. -
సీఎం రేసులో లేను : డిగ్గీ రాజా
భోపాల్ : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, అందుకోసం ప్రాంతీయ పార్టీలతో దోస్తీ కట్టేందుకు సిద్ధంగా ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రచార ఇన్చార్జి జ్యోతిరాదిత్య సింధియా, సీనియర్ నేత కమల్ నాథ్‌ల మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తల్ని ఆయన కొట్టిపడేశారు. వారిద్దరు కలిసి కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో పదిహేనేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉందన్న దిగ్విజయ్ సింగ్.. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీని ఏవిధంగా అధికారంలోకి తీసుకురావడంపైనే తాము దృష్టిసారించామన్నారు. బీజేపీ పాలనలో ప్రజలు విసుగుచెందారని, వచ్చే ఎన్నికల్లో మరో పార్టీకి అవకాశం ఇవ్వాలనే భావన వారిలో స్పష్టంగా కనబడుతోందని వ్యాఖ్యానించారు. సీఎం అభ్యర్థిని కాను.. సీఎం అభ్యర్థిగా తాను పోటీపడుతున్నానంటూ వస్తోన్న వార్తల్ని దిగ్విజయ్ ఖండించారు. మధ్యప్రదేశ్‌కు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు మరోసారి ఆ పదవి చేపట్టాలనే ఆశ లేదన్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి అధిష్టానం సానుకూలంగా ఉందని తెలిపారు. బీఎస్పీతో పొత్తు విషయమై కమల్ నాథ్ జరుపుతున్న చర్చలు సఫలమైతే పార్టీకి అదనపు బలం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయంగా లబ్ది పొందేందుకే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆరెస్సెస్ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించిందని దిగ్విజయ్ విమర్శించారు. లౌకిక వాది అయిన ప్రణబ్ దాదాను ఆహ్వానించడం ద్వారా ఆరెస్సెస్ తమ మీద ఉన్న మతతత్వ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేసింది గానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. 1952 సార్వత్రిక ఎన్నికల నుంచే కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఆరెస్సెస్ ప్రయత్నిస్తోంది గానీ ఆ ప్రయత్నాలేవీ సఫలం కావన్నారు. -
మరో వారసుడి పొలిటికల్ ఎంట్రీ..!
భోపాల్ : మధ్యప్రదేశ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచార కమిటీ ఇన్చార్జి జ్యోతిరాదిత్య సింధియా తనయుడు మహానార్యమన్ రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. రాజవంశానికి చెందిన మహానార్యమన్ డెహ్రాడూన్‌లో హై స్కూల్ విద్యనభ్యసించారు. ప్రస్తుతం అమెరికాలో ఎంబీఏ చేస్తున్న మహానార్యమన్ వేసవి సెలవుల నిమిత్తం మధ్యప్రదేశ్‌కు వచ్చారు. తరతరాలుగా గ్వాలియర్- చంబల్ ప్రాంతంలో సింధియాల కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తనయుడిని సైతం రాజకీయాల్లోకి తీసుకురావాలని జ్యోతిరాదిత్య భావిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ ప్రచార కార్యక్రమాలకు తనతో పాటు కుమారుడిని కూడా వెంట తీసుకువెళ్తున్నారు. శివపురి నియోజక వర్గంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరైన మహానార్యమన్ తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగే తండ్రి హాజరుకాలేని కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజలతో మమేకమయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. రాజవంశీకుడు అయినప్పటికీ ఎంతో నిరాడంబరంగా ఉండే మహానార్యమన్ ఎక్కడికి వెళ్లినా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాడంటూ.. ఇది అతడి రాజకీయ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని సింధియా కుటుంబ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్ సంఘ్ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్థాన్ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు. గ్వాలియర్- చంబల్ ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో సుమారు 34 అసెంబ్లీ స్థానాల్లో సింధియా కుటుంబ సభ్యులు, వారి అనుచరులు గెలుపొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వారి బాటలోనే.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు రాజకీయ నాయకుల వారసులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తనయుడు జైవర్థన్ సింగ్ గత ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కమల్ నాథ్ కుమారుడు నకుల్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కొడుకు కార్తికేయ కూడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జ్యోతిరాదిత్య కూడా వారసుడి రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నాలిక కరుచుకున్న డిగ్గీ రాజా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పప్పులో కాలేశారు. పాత ఫోటో ఒకదానిని సోషల్ మీడియాలో ట్వీట్ చేసి ట్రోలింగ్‌ను ఎదుర్కున్నారు. పాత ఫోటోకు, అసలు ఫోటోకు ఆ మాత్రం తేడా తెలీదా అంటూ కొందరు ఆయన పరువు తీసేస్తున్నారు. విషయం ఏంటంటే భోపాల్ రైల్వే బ్రిడ్జి ఫోటో పరిస్థితి అంటూ డిగ్గీ రాజా శనివారం ఓ ట్వీట్ చేశారు. ‘పౌరుల భద్రత కోసం బీజేపీ తెగ శ్రమిస్తున్నట్లు చెబుతోంది. కానీ, ఇది పరిస్థితి. వారణాసిలో 18 మంది మృతి చెందిన ఘటన వాళ్లకు గుర్తుండే ఉంటుంది’ అంటూ సందేశం ఉంచారు. అయితే అది గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన పాక్ మెట్రో పిల్లర్(విరిగిపోయిన) ఫోటో. ఫేక్ న్యూస్‌లపై అసలు గుట్టును విప్పే ఓ ప్రముఖ పత్రిక దిగ్విజయ్ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ కథనం ప్రచురించింది. దిగ్విజయ్ క్షమాపణలు.. ఆ కథనం చూసిన దిగ్విజయ్ సింగ్ తన తప్పు ఒప్పుకున్నారు. ‘తప్పు నాదే. క్షమించండి. నా స్నేహితుడొకరు ఆ ఫోటోను నాకు పంపారు. దానిని పరీశించకుండా నేను పోస్ట్ చేశా’ అంటూ ఆయన రీట్వీట్ చేశారు. यह है सुभाष नगर रेल्वे फाटक भोपाल पर बन रहे रेल्वे ओवर ब्रिज का एक पोल,जिसमें आ गई दरारे/क्रैक इसकी गुणवत्ता पर सवाल उठाती हैं,अभी तो पुल भी नही बना ।एक भाजपा नेता के मार्ग दर्शन निर्माण में हो रहा है ,फिर यह सब क्यों और कैसे ? वाराणसी की दुर्घटना यहॉं भी ना हो जाये। pic.twitter.com/oycXREebp0 — digvijaya singh (@digvijaya_28) 10 June 2018 గతంలోనూ ఇదే ఫోటో... అన్నట్లు రెండేళ్ల క్రితం తెలంగాణలో ఇదే ఫోటో హాట్ టాపిక్‌గా మారింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఫోటో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ‘హైదరాబాద్ మెట్రో పిల్లర్ ప్రమాదకరంగా ఉందంటూ... ఫోటో వైరల్ కాగా, స్వయానా తెలంగాణ మంత్రి కేటీఆర్ అది ఫేక్ అని, రావల్పిండి(పాక్) ఫోటో అంటూ స్పష్టత ఇచ్చేశారు. This is not in Hyderabad neither in Metro nor in PVNR. Actually it's in Rawalpindi, Pakistanhttps://t.co/q8wilsOq0T https://t.co/WKGrXmn8rf — KTR (@KTRTRS) 3 August 2016 సోషల్ మీడియాలో గతంలో ఇలాంటి ఉదంతాలే చాలానే వెలుగు చూశాయి. దిగ్గజ నటి షబానా అజ్మీ ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. మన రైల్వే శాఖ మురికి నీటిలో పాత్రలను శుభ్రం చేస్తోందంటూ ఓ సందేశం ఉంచారు. అయితే ఈ వీడియోపై విచారణ చేపట్టిన రైల్వే శాఖ అది మలేషియాలోది అని తేల్చగా.. చివరకు ఆమె క్షమాపణలు చెప్పారు. -
శిక్షణ ఇచ్చి హత్యలు చేయమని ప్రోత్సహిస్తారా?
రాజ్గర్హ్, మధ్య ప్రదేశ్ : మధ్య ప్రదేశ్‌లోని రాజ్‌గర్హ్‌లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మారణాయుధాల వినియోగ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో బీజేపీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్‌కు మరో అవకాశం దొరికినట్లు అయింది. హిందూవుల రక్షణ పేరుతో భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషద్ ఈ నెల 3 నుంచి జూన్ 1 వరకూ రాజ్‌గర్హ్‌లోని బవారాలో స్థానిక యువతకు తుపాకీ వంటి ఆయుధాలను ఎలా వాడాలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన వీడియోలను భజరంగ్ దళ్ జిల్లా కన్వినర్ దేవి సింగ్ సోందియా సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాక ‘1984 నుంచి మేము ఈ శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. దేశ విద్రోహక శక్తులు, లవ్ జిహాద్ వంటి వాటి నుంచి హిందూవులకు రక్షణ కల్పించడానికి యువతకు శిక్షణ ఇస్తున్నట్లు’ తెలిపారు. ఈ వీడియోలు, ఫోటోలు బీజేపీ పై దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి మంచి ఆయుధాలుగా మారాయి. ఈ విషయం గురించి ‘మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ శిక్షణా కార్యక్రమానికి అనుమతిచ్చిందా..?. డీజీపీ కానీ, రాజ్గర్హ్ ఎస్పీ కానీ ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారా..? అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. అలానే దిగ్విజయ్ సింగ్ కుమారుడు, రాఘోగర్హ్ ఎమ్మెల్యే జైవర్ధన్ ‘జాతీయవాదం పేరుతో భజరంగ్ దళ్ యువతకు మారణాయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చి హత్యలు చేయమని ప్రేరేపిస్తుంది. ఈ ఫొటోలు చూసి నేను షాకయ్యాను’ అని ట్వీట్ చేశాడు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి రజ్నిష్ అగ్రావాల్ స్పందిస్తూ... ఎవరైనా స్వీయ రక్షణ శిక్షణా తరగతులు నిర్వహించుకోవచ్చు. కానీ దానికి ఎవరు అనుమతిచ్చారనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది అన్నారు. -
దిగ్విజయ్ ఔట్.. ఏపీ ఇన్చార్జ్గా ఊమెన్ చాందీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ను తొలగించింది. ఆయన స్థానంలో మరో సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఏపీ పీసీసీ పర్యవేక్షక బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీగా ఊమెన్ చాందీని వెంటనే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న దిగ్విజయ్‌సింగ్ ప్రశంసనీయమైన సేవలు అందించారని, ఆయన వెంటనే ఆ పదవి నుంచి దిగిపోతారని తెలిపింది. -
ఎంపీలో ‘ఐ’క్యతా రాగం!
సాక్షి, భోపాల్ : నగరంలో మంగళవారం ప్రచండ భానుడు మండిపోతున్నాడు. 42 డిగ్రీల ఎండలో కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకుడు కమల్‌నాథ్‌కు ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఏమాత్రం వెరవలేదు. నాయకుడితోపాటు ఆరు గంటల రోడ్ షోలో అలుపెరగకుండా పాల్గొన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా నియమితులై రాష్ట్రానికి తిరిగొస్తున్న తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎగబడ్డారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాలోని ‘జయహో’ ట్రాక్‌లో పార్టీ పాట హోరెత్తుతుండగా, అందంగా అలంకరించిన ఒంటెలు, గుర్రాలతో పార్టీ కార్యకర్తలు మేళతాళాల మధ్య డాన్సులు చేశారు. ఛింద్వారా నియోజకవర్గానికి తొమ్మిదోసారి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న కమల్ నాథ్ మోటార్ వాహనంపై వస్తుండగా, ఆయన పక్కన పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను స్వీకరించనున్న కాంగ్రెస్ యువ నాయకుడు జ్యోతిరాదిత్య వెన్నంటి వచ్చారు. కార్యకర్తలు అందించిన కొబ్బరి బోండంను ఆయన స్వయంగా కమల్‌నాథ్‌తో తాగించారు. విమానాశ్రయం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ఈ స్వాగత యాత్ర సాగింది. సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో దారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ అభిమానులు పూల వర్షం కురిపిస్తూ వచ్చారు. ఎంతో మంది రైతులు కూడా తమ ఎండ్ల బండ్లతో ర్యాలీలో భాగంగా కదిలి వచ్చారు. బీజేపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రైతులు రాష్ట్రంలో పలుసార్లు సమ్మెలు చేసిన విషయం తెల్సిందే. కమల్‌నాథ్ ర్యాలీ పార్టీ కార్యాలయానికి చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత కమల్‌నాథ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య ప్రసంగించారు. తామంతా ఐక్యంగానే ఉన్నామన్న సందేశం ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఇంకా నాయకత్వం కోసం గొడవలు ఉన్నాయంటే నమ్ముతారా? అని ఓ కాంగ్రెస్ నాయకుడు ప్రేక్షకులనుద్దేశించి ప్రశ్నించగా, ‘లేదు లేదు. అదంతా గతం’ అంటూ ప్రజలు స్పందించారు. ఈ ముగ్గురు నాయకుల మధ్యనున్న కుమ్ములాటల వల్ల రాష్ట్రంలో అధికారానికి కాంగ్రెస్ 15 ఏళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఐక్యత పైకి కనిపించేదేనా, నిజంగా వారిమధ్య ఐక్యత కుదిరిందా అన్నది ఇప్పుడే స్పష్టం చేయలేం గానీ, ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న కాంక్ష వారిలో కనిపించింది. ‘హమ్ ఆపస్ మే లడ్ గయేతో దేశ్‌కు ఖౌన్ బచాయేగా!’ నినాదాల మధ్య సమావేశం ముగిసింది. -
‘ఆయన’ తిరిగొచ్చారు
భోపాల్ : ఆయన తిరిగొచ్చారు. ఆరు నెలల క్రితం ‘నర్మద పాదయాత్ర’ పేరిట ఆయన చేపట్టిన రాజకీయేతర యాత్ర సోమవారం నాడు ముగిసింది. ఆయన తన యాత్రను రాజకీయేతర యాత్రగా అభివర్ణించుకున్నప్పటికీ అందులో రాజకీయం లేకపోలేదు. ప్రజలతో పోయిన సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు, పార్టీలో పోయిన పరువును తిరిగి తెచ్చుకునేందుకు ఆయన ఈ యాత్రను చేపట్టారు. ప్రతిపక్షాలనే కాకుండా స్వపక్షాన్ని కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి ఇబ్బందిపెట్టే తత్వం ఆయనది. అలా అని బోలా మనిషి కాదు. కనిపించని కపట నాయకుడు. దివంగత కాంగ్రెస్ నేత అర్జున్ సింగ్ శిశ్యరికంలో రాజకీయంగా ఎదిగిన వారు. ఆయనే దిగ్విజయ్ సింగ్. స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఆరు నెలల తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొచ్చారు. ‘నేను ఇదివరకటిలా రాజకీయ కార్యకర్తను కాను. ఇప్పుడు పరిపాలనాదక్షుడిన’ ని మీడియా ముందు చెబుతూ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. తాను పార్టీలో ఏ బాధ్యతలు నిర్వహించాలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే నిర్ణయిస్తారని లౌక్యం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పదవి పట్ల మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా, అది ఇరువైపుల పదునున్న కత్తిలాంటిదని చెప్పారు. ప్రతిపక్షంలో భయం పుట్టించగలదని, స్వపక్షంలో చీలికలకు కారణం కాగలదనే ఉద్దేశంతోనే ఆయన ఇరువైపుల పదునున్న కత్తితో పోల్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో దిగ్విజయ్ సింగ్‌తోపాటు కమల్ నాథ్ బృందం, జ్యోతిరాధిత్య సింధియా బృందం అంటూ మూడు వర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో 70 ఏళ్లు దాటిన వారిని పోటీకి నిలబెట్టరాదని రాహుల్ గాంధీ బలంగా భావిస్తున్నందున 71 ఏళ్ల దిగ్విజయ్ సింగ్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం లేకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆయన కమల్‌నాథ్‌ను సమర్థించేందుకు సిద్ధంగా ఉన్నారు. జ్యోతిరాధిత్యను ఆయన మొదటి నుంచి దూరం పెడుతున్నారు. 2003లో దిగ్విజయ్ సింగ్ స్వరాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కేంద్ర పార్టీ కార్యకలాపాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. మొన్నటి వరకు గోవా, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. గోవా ఎన్నికల్లో అధిక సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకరావడంలో దిగ్విజయ్ సింగ్ విఫలం కావడంతో ఆయన బాధ్యతలను కుదించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు. ఇప్పుడు దిగ్విజయ్ తిరిగి రావడంతో ఆయన గురించి పార్టీ వర్గాల్లో ‘ఆయన తిరిగొచ్చారు’ అని నర్మగర్భంగా కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలు విసిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతం ప్రజలు దుర్భర దారిద్య్ర పరిస్థితులతో మగ్గుతున్నారు. ఇసుక మాఫియా వ్యవహారాలు పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం పరువు తీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిగ్విజయ్, కమల్‌నాథ్, సింధియాలు ఒక్కటయితే కాంగ్రెస్‌కు విజయం పెద్ద కష్టం కాదు. -
మాజీ సీఎం భార్యను ‘ఐటెం’ అంటూ...
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ భార్య అమృత రాయ్‌పై బీజేపీ నేత ఒకరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమృతను ఐటెం అని సంభోదిస్తూ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గురువారం బీజేపీ చేపట్టిన నిరాహార దీక్షలో బీజేపీ ఎంపీ మనోహర్ ఉన్‌త్వల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా దిగ్విజయ్ సింగ్ మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయలేకపోయారు. కానీ, ఢిల్లీ నుంచి ఓ ఐటెంను మాత్రం తీసుకొచ్చారు. ఈ మధ్య ఆయనగారు నర్మద యాత్ర అంటూ ఏదో హడావుడి చేశారు. ఆయనకు ఇప్పుడు సాధువులతో కూడా సమస్యలు వస్తున్నాయంట. వారికి ఎర్రబుగ్గ కారులు ఎందుకిచ్చారంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఆయన వ్యవహారాలేంటో అస్సలు అర్థం కావట్లేదు’ అంటూ ఉన్‌త్వల్ ప్రసంగించారు. అయితే నేరుగా అమృత పేరును ప్రస్తావించకపోయినా.. ఐటెం వ్యాఖ్యలు ఆమెను ఉద్దేశించి చేసినంటూ కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఉన్‌త్వల్ మళ్లీ స్పందించారు. ‘దిగ్విజయ్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను నర్మద యాత్రను ఉద్దేశించి ఢిల్లీ నుంచి తీసుకొచ్చారని వ్యాఖ్యలు చేశా. అంతేగానీ.. ఆయన భార్యను నేనేం అనలేదు’ అని వివరణ ఇచ్చుకున్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై పోలీసు ఫిర్యాదు చేసేందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు సిద్ధమైపోతున్నారు. కొంత కాలం రిలేషన్లో దిగ్విజయ్ సింగ్(71)-టీవీ యాంకర్ అమృతా రాయ్(46)ల ప్రైవేట్ ఫోటోలు లీక్ కావటం.. అవి దిగ్విజయ్‌పై విమర్శలకు దారితీయటం.. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో దిగ్విజయ్. అమృతను వివాహం చేసుకోవటం తెలిసిందే. -
‘ముఖ్యమంత్రి రేసులో లేను’
సాక్షి, భోపాల్ : మరో ఆరునెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాను సీఎం రేసులో లేనని మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. నర్మదా నది పరిరక్షణ కోసం ఆరు నెలల పాటు 3,100 కిలోమీటర్ల మేర ఆయన చేపట్టిన యాత్ర ఇటవల ముగిసింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సమైక్యంగా పోరాడాలని అందుకు తాను చొరవ చూపుతానని చెప్పారు. నర్మదా పరిక్రమ యాత్రను ఆయన ఓంకారేశ్వర్ ఆలయంలో ముగించారు. నర్మదా ఘాట్లలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ తాను సీఎం రేసులో లేనని తేల్చిచెప్పారు. రెండు సార్లు తాను పూర్తికాలం సీఎం పదవిని చేపట్టానని..మరోసారి సీఎం కావాలన్న ఆకాంక్ష తనకు లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చూడాలని భావిస్తున్నానన్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏ బాధ్యత అప్పగించినా దాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో పార్టీ వర్గాలను ఏకతాటిపై నడిపించి, బీజేపీకి దీటుగా పోటీ ఇవ్వడమే తన అభిమతమని అన్నారు. -
3300 కి.మీ. పాదయాత్ర చేసిన డిగ్గీ రాజా
భోపాల్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేపట్టిన ‘నర్మదా యాత్ర’ సోమవారంతో ముగిసింది. దేశంలో పురాతన నదిగా పేరొందిన నర్మదా నది తీరంలో ఇసుక మాఫియా చేస్తున్న దురాగతాల వల్ల నది కలుషితమవుతుందంటూ డిగ్గీ రాజా ఆరు నెలల క్రితం నర్మదా యాత్ర చేపట్టారు. గతేడాది సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ పాదయాత్ర 3300 కిలోమీటర్ల మేర సాగింది. బర్మన్ ఘాట్‌కి చేరుకున్న దిగ్విజయ్, ఆయన భార్య అమృత కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఆయన భార్య అమృత, మాజీ ఎంపీలు రామేశ్వర్ నీఖ్రా, నారాయణ్ సింగ్, ఆయన అనుచరగణం కూడా పాల్గొన్నారు. కాగా ఆద్యంతం మతపరమైన, సాంస్కృతిక యాత్రగా సాగిన ఈ పాదయాత్ర మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవినీతి చిట్టాను బయటపెట్టేందుకు సాక్ష్యాలు సేకరించడానికి దోహదపడిందని, ఆ వివరాలు త్వరలోనే బహిర్గతం అవుతాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
దిగ్విజయ్ కామెంట్స్.. మరింత రెచ్చిపోతారేమో
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మద్దతిచ్చారు. ఓ మతాన్నిగాని, కులాన్నిగానీ కించపరిచే ఏ సినిమాలను కూడా అసలు విడుదల కానివ్వొద్దంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి చిత్రాన్ని అసలు తీయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. పద్మావత్ చిత్రం తమ మనోభావాలను దెబ్బకొట్టిందంటూ గత కొద్ది రోజులుగా శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా వారు హింసాత్మకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో దిగ్విజయ్ వారికి మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశం అయింది. అంతేకాదు.. ఈ ఆందోళన మొత్తానికి కూడా ప్రధాని నరేంద్రమోదీ, ఆయన పార్టీ బీజేపీ అని ఆరోపించారు. గుర్గావ్లో పాఠశాల బస్సుపై జరిగిన దాడిని గురించి స్పందన తెలియజేస్తూ 'మొత్తం దేశాన్ని బీజేపీ మంటల్లోకి నెడుతోంది' అంటూ తీవ్రంగా విమర్శించారు. -
నేను బలమైన అభ్యర్థిని కాను !
సాక్షి, జబల్పూర్ : నేను ముఖ్యమంత్రి పదవికి రేసులో లేను... నేనిప్పుడు బలమైన బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మధ్య ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు దిగ్విజయ్ సింగ్.. దసరా పండగ రోజున 3,300 కిలోమీటర్ల మేర నర్మదా పరిక్రమ్ పాదయాత్రను ఆరంభించనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా,. జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ మరో సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రకటన చేశారు. కమల్‌నాథ్ ప్రకటన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ తాను రేసులో లేనంటూ ప్రకటన చేయడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
'నాకో టాయిలెట్, అంబులెన్స్ ఇవ్వండి'
న్యూఢిల్లీ : నర్మదా నది తీరం చుట్టూ దాదాపు ఆరు నెలలపాటు ప్రయాణించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వచ్చే శనివారం నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి పెట్టుకున్నారు. తనకు ఒక మొబైల్ టాయిలెట్‌ను, అదనపు భద్రతను, అంబులెన్స్‌ను ఇవ్వాలని కోరారు. అయితే, అంబులెన్స్, భద్రతను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల తన యాత్ర గురించి దిగ్విజయ్ మాట్లాడుతూ తన యాత్రలో 'కాంగ్రెస్ జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు, నినాదాలు ఉండవని స్పష్టం చేశారు. నర్మద పరిక్రమ పేరిట తాను పాదయాత్ర నిర్వహించాలని 1998లో ఒకసారి నర్మదా నది ఒడ్డు నుంచి అనుకున్నానని చెప్పారు. ఈ పాదయాత్ర ద్వారా దాదాపు 230 అసెంబ్లీ నియోజవర్గాల్లో దిగ్విజయ్ పర్యటించనున్నారు. ఇది పార్టీ అజెండా కాదని, తాను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. మొత్తం 3,400కిలో మీటర్లు ఆయన యాత్ర చేయనున్నారు. -
బాబా రాందేవ్‌పై డిగ్గీరాజా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అనుచరులను మరీ ముఖ్యంగా ఆయన భక్తులుగా అభివర్ణించుకునే వారిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఇటీవల ఓ పోస్ట్ పెట్టిన దిగ్విజయ్.. తాజాగా యోగా గురువు బాబా రాందేవ్ ను దొంగ బాబా అని పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం 14 మంది దొంగ బాబాల పేర్లను వెల్లడించింది. కానీ బాబా రాందేవ్ పేరును దొంగ బాబాల జాబితాలో చేర్చకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తూ.. నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా నకిలీ బాబేనని దిగ్విజయ్ అన్నారు. మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మికవేత్తగా ఉన్న వ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్ ను అడిగారు. అదేవిధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ పరిషత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. 14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం వారి జాబితా విడుదల చేసింది. ఇందులో ఆశారాం బాబు, రాధేమా, సచ్‌దరంగి, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఓం బాబా, నిర్మల్ బాబా, విశ్వానంద్, స్వామి అశ్మిదానంద్, ఓం నమః శివాయ్, నారాయణ్ సాయి రాంపాల్‌లు ఉన్నారు. దీనిపై స్పందించిన దిగ్విజయ్.. నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరు లేకపోవడం విచారకరమన్నారు. -
మోదీపై డిగ్గీరాజా అనుచిత పోస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో మరోసారి మంటపెట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఓ అనుచిత ఫోటో(మెమె)ను శుక్రవారం దిగ్విజయ్ పోస్ట్ చేశారు. మోదీ, ఆయన అనుచరులను మరీ ముఖ్యంగా ఆయన భక్తులుగా అభివర్ణించుకునే వారిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఓ రెండు వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. ఇది తన పోస్ట్ కాదంటూనే ఆయన చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. రాజ్యసభ ఎంపీ అయిన దిగ్విజయ్ సింగ్ గతంలో తెలంగాణ ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. Not mine but couldn't help posting it. My apologies to the person concerned. He is the best in the "Art of Fooling!" pic.twitter.com/6BGz3lFtcf — digvijaya singh (@digvijaya_28) September 8, 2017 -
ఆయన ఓ హిందువు కాబట్టే...
హైదరాబాద్: మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కున్న లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కేవలం హిందువు అయిన కారణంగానే పురోహిత్‌కు బెయిల్ లభించిందని ఒవైసీ వ్యాఖ్యానించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ హిందూ నేరస్థులపై సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నారు. అందుకే పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న పురోహిత్‌కు బెయిల్ దక్కింది’ అని ఒవైసీ తెలిపారు. హైదరాబాద్ లో ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పటి పలు కేసుల్లో హిందువులు మాత్రమే బయటకు వస్తున్నారని చెప్పారు. బెయిల్ అనేది ఇండియాలో ఉన్న ప్రతీ పౌరుడి హక్కు అని, కానీ, ముస్లిం, దళిత మరియు గిరిజన ప్రజలకు మాత్రం అది దక్కటం లేదని ఒవైసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. టెర్రిరిజం మతం నుంచి పుట్టదన్న ఆయన, కొందరు దానిని మతానికి ఆపాదిస్తున్నారని చెప్పుకొచ్చారు. పురోహిత్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఆయనకు నిర్దోషిగానే పరిగణింపబడుతున్నారని ఒవైసీ చెబుతున్నారు. కాగా, బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చి సుప్రీంకోర్టు పురోహిత్‌కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ కుట్రలో పురోహిత్ బలయ్యారంటూ ఆయన తరపున హరీశ్ సాల్వే బలమైన వాదనలు వినిపించారు. వాదనతో ఏకీభవించిన కోర్టు 9 ఏళ్ల అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, 2008 మాలెగావ్ పేలుళ్లలో నలుగురు మృత్యువాత పడగా, 79 మంది గాయపడ్డారు. ఆ సమయంలో పురోహిత్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించగా, సాధ్వీ ప్రగ్యాతోపాటు నిందితుడిగా పురోహిత్ ఆరోపణలు ఎదుర్కున్నారు. పురోహిత్ ఓ ఆర్ఎస్ఎస్ వాది: దిగ్విజయ్ మాలెగావ్ కేసులో నిందితులను రక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ నేతలు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. పురోహిత్ కూడా ఆ వర్గానికి చెందిన వారే. అందుకే ఆయనకు బెయిల్ లభించిందని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిరణ్ రిట్జూ మీడియాకు తెలిపారు. -
డిగ్గీ రాజా ఔట్.. కుంతియా ఇన్
► దిగ్విజయ్ స్థానంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జిగా నియమించిన సోనియా ► రెండో ఇన్చార్జిగా కర్ణాటకకు చెందిన సతీశ్ జర్కిహోలి సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియా నియామకమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రస్తుతం తెలంగాణ పార్టీ ఇన్చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ను తొలగించి.. రెండో ఇన్చార్జిగా ఉన్న కుంతియాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ మంగళవారం ప్రకటించారు. రెండో ఇన్చార్జిగా కర్ణాటకకు చెందిన సీనియ ర్ నేత సతీశ్ జర్కిహోలిని నియమించినట్లు వెల్లడించారు. వాస్తవానికి దిగ్విజయ్‌సింగ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతల నుంచి తప్పిస్తారని కొంతకాలంగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అక్టోబర్ నెలాఖరునాటికి ఏఐసీసీలో సంస్థాగతంగా మార్పులు చేయాలన్న యోచనతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల నుంచి దిగ్విజయ్‌ను తప్పించినట్టుగా పార్టీ సీనియర్లు చెబుతున్నారు. విభజనకు ముందు నుంచీ.. దిగ్విజయ్ సింగ్ 2004 నుంచి మూడేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జిగా పనిచేశారు. అనంతరం 2013లో తిరిగి ఈ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపీలకు ఇన్చార్జిగా కొనసాగారు. వీటితోపాటు ఇటీవలి వరకు గోవా, కర్ణాటకల రాష్ట్రాల బాధ్యతలూ చూశారు. మార్చిలో గోవా బాధ్యతలను, మేలో కర్ణాటక రాష్ట్ర ఇన్చార్జి పదవి నుంచి తొలగించగా... తాజాగా తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆయన ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఉత్తమ్ మాటే నెగ్గిందా! దిగ్విజయ్‌సింగ్‌ను రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించడానికి ఉత్తమ్ కారణమని పార్టీ వర్గాల్లో వాదన వినిపిస్తోంది. మరికొందరు నేతలు మాత్రం ఈ మార్పుకు, రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు సంబంధం లేదని చెబుతున్నారు. వాస్తవానికి వచ్చే అక్టోబర్ నాటికి టీపీసీసీ చీఫ్ మారతారని.. వచ్చే ఎన్నికల కోసం కొత్త సారథిని నియమిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్‌ను తొలగించాలని డిమాండ్ చేసే నేతలకు దిగ్విజయ్ సహకరిస్తున్నారనే ప్రచారమూ ఉంది. పలు అంశాల్లో దిగ్విజయ్‌కు, ఉత్తమ్‌కు మధ్య సఖ్యత సరిగా లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో నేరుగా సంబంధాలున్న ఉత్తమ్‌ను తొలగించడానికి వారు సిద్ధపడలేదని.. అందువల్ల దిగ్విజయ్‌నే రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించారని కొందరు నేతలు వాదిస్తున్నారు. దీంతో రాష్ట్ర పార్టీలో ఉత్తమ్ మాటే చెల్లుబాటు అవుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం దిగ్విజయ్ మార్పునకు, రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేదని అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం అయిన దిగ్విజయ్‌సింగ్‌కు ఆ రాష్ట్రంలో రానున్న ఎన్నికలు కీలకమని.. అక్కడ పూర్తికాలం పనిచేయాల్సి ఉన్నందునే తెలంగాణ వ్యవహారాల నుంచి ఉపశమనం కలిగించారని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాన ని.. అందువల్ల తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలని దిగ్విజయ్ అధిష్టానాన్ని కోరార ని వారు అంటున్నారు. మరోవైపు దీర్ఘకాలం పాటు పార్టీ వ్యవహారాల బాధ్యతల్లో ఉన్న దిగ్విజయ్‌ను తప్పించడం వల్ల రాష్ట్రంలో పార్టీకి లాభమా, నష్టమా అన్న దానిపై పార్టీ ముఖ్యులు విశ్లేషించుకుంటున్నారు. సౌత్‌జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా జె.గీతారెడ్డి ఏఐసీసీలో నూతన విభాగంగా ఏర్పాటు చేసిన ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ సౌత్‌జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా జె.గీతారెడ్డి నియమితులయ్యారు. వైస్ చైర్మన్, వెస్ట్‌జోన్ కో–ఆర్డినేటర్‌గా మిలింద్ దేవ్రా, ఈస్ట్ జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా గౌరవ్ గొగోయ్, నార్త్ జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా సల్మాన్ సోజ్ నియమితులైనట్టు జనార్దన్ ద్వివేదీ ప్రకటించారు. -
కాంగ్రెస్ ఇన్చార్జిగా దిగ్విజయ్ తొలగింపు
- తెలంగాణ పర్యవేక్షకుడిగా కుంతియాకు బాధ్యతలు న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ను మంగళవారం ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మరో సీనియర్ నేత, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అయిన రామచంద్ర కుంతియా(ఆర్.సి. కుంతియా)ను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమిస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఒక ప్రకటనను విడుదల చేసింది. కుంతియాకు సెక్రటరీగా మరోనాయకుడు సతీశ్ నియమితులయ్యారు. తన పదవీ కాలంలో దిగ్విజయ్ సింగ్.. పని తీరుతో కంటే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఐసిస్ సానుభూతిపరుల విషయంలో, ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ కేసులోనూ డిగ్గీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో పార్టీ సైతం ఇరుకున పడేలా వ్యవహించిన ఆయను ఉన్న పళంగా తప్పించడం వెనుక కారణాలు ఏమిటనేది తెలియాల్సిఉంది. దీనిపై స్థానిక కాంగ్రెస్ నేతలు స్పందించాల్సిఉంది. -
కాంగ్రెస్ ఇన్చార్జిగా దిగ్విజయ్ తొలగింపు
-
డ్రగ్స్ కేసులో కొందరిని రక్షిస్తున్నారు
టీఆర్ఎస్ నేతలపై దిగ్విజయ్ ఆరోపణ సాక్షి, న్యూఢిల్లీ: డ్రగ్స్ కేసులో కొంతమంది ప్రముఖులను టీఆర్ఎస్ నేతలు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. సోమవారం ఆయన పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగాన్ని తీవ్రమైన అంశంగా పరిగణిం చాలని, ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. -
డిగ్గీ ‘కూత’.. కేటీఆర్ వాత
-
డిగ్గీ ‘కూత’.. కేటీఆర్ వాత
⇒ డ్రగ్స్ వ్యవహారంలో టీఆర్ఎస్ వారసుడి సన్నిహితులున్నారంటూ దిగ్విజయ్ ట్వీట్ ⇒ మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ కేటీఆర్ చురకలు సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, మంత్రి కె.తారకరామారావు మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. తొలుత డ్రగ్స్ వ్యవహారంలో టీఆర్ఎస్ వారసుడి స్నేహితులు ఉన్నారంటూ దిగ్విజయ్ ట్వీటర్లో ట్వీట్ చేయగా.. ఇందుకు మంత్రి కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. వీరిద్దరి మధ్య గతంలో ఐసిస్ అంశంలోనూ ట్వీటర్ యుద్ధం జరగడం గమనార్హం. తెలంగాణలో భారీ డ్రగ్ కుంభకోణం బయటపడింది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ వారసుడి సన్నిహితులకు సంబంధం ఉంది. మరి వారిని విచారిస్తారా? రక్షించుకుంటారా..? వేచిచూద్దాం.. – దిగ్విజయ్‌సింగ్ మీరు పూర్తిగా ఓడిపోయారు. ఇక మీరు విశ్రాంతి తీసుకోవాలి. మీ వయసుకు తగిన పనులు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా తెలంగాణ పదాన్ని సరిగ్గా రాయగలిగారు.. చాలా సంతోషం. – మంత్రి కేటీఆర్ -
‘డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ వారసుడి ఫ్రెండ్స్’
-
‘డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ వారసుడి ఫ్రెండ్స్’
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ వారసుడి స్నేహితులకు ఈ వ్యవహరంతో సంబంధ ఉందని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణలో పెద్ద డ్రగ్స్ స్కామ్ జరిగింది. ఇందులో టీఆర్ఎస్ వారసుడి మిత్రులు ఉన్నట్టుగా కనబడుతోంది. వీరిని విచారిస్తారో, కాపాడతారో చూడాలి’ అంటూ దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా పట్టుబడడంతో సినీ ప్రముఖులను ప్రత్యేక పోలీసు బృందం(సిట్) విచారిస్తున్న నేపథ్యంలో దిగ్విజయ్ తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో స్పందించారు. ‘మీరు పూర్తిగా విచక్షణ కోల్పోయారు. గౌరవంగా రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. మీ వయసుకు తగ్గట్టుగా నడుచుకోండి. తెలంగాణ స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయడం నేర్చుకున్నందుకు సంతోషమ’ని కేటీఆర్ ట్వీట్ చేశారు. దిగ్విజయ్ సింగ్ గతంలో ట్విటర్లో తెలంగాణ స్పెల్లింగ్‌ను తప్పుగా రాసిన సంగతి తెలిసిందే. Huge Drug Scam in Telangana. Influential friends of TRS heir apparent involved. Let's see if they would be saved or prosecuted. Let's see. — digvijaya singh (@digvijaya_28) 20 July 2017 You've completely lost it sir. Time to retire gracefully & do something worth your age. Glad that you've finally learnt to spell 'Telangana' https://t.co/1lozaMpEN6 — KTR (@KTRTRS) 20 July 2017 -
‘కేటీఆర్‌కు ఇదే మొదటిసారి కాదు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ మీడియాపై విరుచుకుపడటం, బెదిరించడం ఇదే మొదటిసారి కాదని.. గతంలోనూ ఇలాంటి జరిగాయని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. మీడియా సంస్థలు రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నాయని, జర్నలిజం దిగజారిందని, సంచలనం కోసం ఆర్టికల్స్ రాస్తున్నాయని కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారని వివరించారు. అవసరం కోసం బెదిరించడం.. టీవీల ప్రసారాలను ఆపలేదా అని ప్రశ్నించారు. భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపితే బండారం బయట పడుతుందని, ప్రభుత్వం కూలిపోతుందని భయపడుతున్నారా అని నిలదీశారు. భూకుంభకోణంలో సీఎం పేషీ పాత్ర ఉందని ఆరోపణ చేసినా.. ఎస్కే సిన్హా నివేదికను ఎందుకు బయటపెట్టలేదన్నారు. గత ప్రభుత్వాలు తప్పుచేస్తే సరి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక ఆర్డినెన్సు తెచ్చి గజం భూమిని కాపాడగలిగారా, చెప్పండి అని నిలదీశారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదని ఇంద్రసేనారెడ్డి ఎద్దేవా చేశారు. భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ ఆపడానికే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది అని ఆయన అనడం దారుణమన్నారు. -
29న టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాహుల్‌గాంధీ సందేశ్ యాత్ర నిర్వహణ, రిజ ర్వుడు నియోజకవర్గా ల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఈ నెల 29న టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం సూర్యాపేటలో జరుగనుంది. రాష్ట్రపార్టీ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో పాటు టీపీసీసీ ముఖ్యులంతా ఈ భేటీలో పాల్గొననున్నారు. అలాగే పార్టీ అంతర్గత అంశాలు, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. ఢిల్లీకి టీపీసీసీ నేతలు.. రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి టీపీసీసీ నేతలంతా మంగళవారం ఢిల్లీకి బయలుదేరనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, షబ్బీర్ అలీతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలంతా ఢిల్లీకి వెళ్తున్నారు. అలాగే ఈ నెల 28న మియాపూర్ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయడానికి అఖిలపక్షనేతలను కూడా ఇప్పటికే ఉత్తమ్ ఆహ్వానించారు. అఖిలపక్షాలతో కలసి కేంద్ర హోంమంత్రికి ఈ భూముల కుంభకోణంపై ఫిర్యాదు చేయనున్నారు. -
‘అందరూ కలిసి యోగా చేయడం హానికరం’
న్యూఢిల్లీ: ఆయన 40 ఏళ్లుగా యోగా చేస్తున్నారు. పైగా నిపుణుల సలహా,శిక్షణ తీసుకొని మరి ఆ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. కానీ, అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు(జూన్ 21)న మాత్రం యోగా మానేశారు. పొద్దున్నే కూర్చుని నెట్టింట్లో అడుగుపెట్టి ట్విట్టర్లోకి వెళ్లారు. ప్రధాని నరేంద్రమోదీ, యోగా గురువు రాందేవ్ బాబా యోగాలో నిమగ్నమై ఆసనాలు వేస్తుండగా ఆయన మాత్రం వారిపై సెటైర్లు వేయడం, ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. వారి యోగా విధానాన్ని విమర్శిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఆయన ఎవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్. అందరినీ ఒకే చోట చేర్చి పెద్ద మొత్తంలో యోగా చేయించవల్ల మంచికంటే చెడే ఎక్కువగా జరుగుతుందని అన్నారు. ప్రధాని మోదీ, రాందేవ్ బాబా అలా భారీ స్థాయిలో యోగా నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అందుకే తాను భారీ యోగా క్యాంపులను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. తాను 40 ఏళ్లుగా యోగా చేస్తున్నానన్న ఆయన అది ప్రత్యేక నిపుణుల సలహాల ద్వారా మాత్రమే చేయాలని అన్నారు. ‘మోదీ చేస్తున్న భారీ యోగా కాంపుల వెనుక అసలు ఉద్దేశం అర్ధం కావడం లేదా? మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నాటకాలు చేస్తుంటారు’ అని విమర్శించారు. యోగా అనేది వ్యక్తిగతంగా, ప్రత్యేక ప్రాంతంలో నిపుణుల సలహాతో మాత్రమే చేయాలిగానీ, అలా అందరూ ఒక చోట చేయడం హాని కలిగిస్తుందని చెప్పారు. -
సంఘ్ శక్తులే ఉగ్రవాదులని ఒప్పుకున్నారు
- బీజేపీ మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యలకు దిగ్విజయ్ కౌంటర్ న్యూఢిల్లీ: ఉగ్రదాడులకు పాల్పడేది ముస్లింలేనని, హిందువుల్లో ఉగ్రవాదులు ఉండరన్న బీజేపీ(హరియాణ) మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఘాటుగా సమాధానమిచ్చారు. సంఘ్‌పరివార్ ఉగ్రవాద సంస్థే అన్న నిజాన్ని అనిల్ తన వ్యాఖ్యల ద్వారా మరోసారి నిరూపించారని దిగ్విజయ్ అన్నారు. ‘పరివార్ ఉగ్రద సంస్థని ఆయన(అనిల్ విజ్) అధికారికంగా ప్రకటించుకున్నారు. మేం(కాంగ్రెస్) చెబుతున్నది కూడా అదే. హిందువులు ఉగ్రవాదులు కారు.. సంఘ్ శక్తులు మాత్రమే టెర్రరిస్టులు’ అని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. హరియాణ మంత్రి అనిల్ విజ్ బుధవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఉగ్రదాడులకు పాల్పడుతున్నది ముస్లింలేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. (ముస్లింలే టెర్రరిస్టులు.. హిందూ ఉగ్రవాదం మిథ్య) -
బీజేపీకి లొంగిపోయి హోదాను పక్కన పెట్టారు
-
దిగ్విజయ్‌పై పరువు నష్టం దావా
- క్రిమినల్ కేసు పెడతా: మంత్రి తలసాని - కుటుంబ పాలన మొదలైంది కాంగ్రెస్ నుంచే.. - ఉద్యమం నుంచే కేటీఆర్, కవిత వచ్చారు - కుటుంబ పాలన అనడం తగదని హితవు సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లోని భూముల కబ్జాల విషయంలో తన ప్రమేయం ఉందంటూ ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావాతోపాటు క్రిమినల్ కేసు పెట్టను న్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన సచివాలయం లో విలేకరులతో మాట్లాడుతూ.. పదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్లు కేంద్రమంత్రిగా పనిచేసి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దిగ్విజయ్ బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవుపలికారు. ఎవరో చోటామోటా నాయకుల మాటలు నమ్మి తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 25 ఏళ్ల నుంచి రాజకీ యాల్లో కొనసాగుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసినందుకు దిగ్విజయ్‌పై దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు. లాయర్ల ద్వారా ఆయనకు లీగల్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. పరువు నష్టం దావాలో రూ.10 కోట్లు వస్తే ఏం చేస్తారని ఒక విలేకరి ప్రశ్నించగా ఏదో ఒక ట్రస్టుకు ఇస్తానని పేర్కొన్నారు. మంత్రి పదవిలో ఉన్న తనపై వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునేం దుకు తప్పుడు ఆరోపణలు గుప్పించడం దిగ్విజయ్ స్థాయికి తగదన్నారు. కాంగ్రెస్ నుంచే ప్రారంభం రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై విలేకరుల ప్రశ్నకు తలసాని జవాబిస్తూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీనే కుటుంబ పాలనను ప్రారంభించిందని విమర్శించారు. పనిగట్టుకొని సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం తగదన్నారు. కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చాక పదవులు పొందలేదని, తెలంగాణ ఉద్యమంలోనే కేటీఆర్, కవిత పాల్గొన్న విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన భార్య ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేదా అని ప్రశ్నించారు. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు రాజకీయాల్లో, పదవుల్లో లేరా అని ప్రశ్నించారు. -
దిగ్విజయ్‌పై పరువునష్టం వేస్తా: తలసాని