
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. ఎంఐఎం నాయకుడు హుస్సేన్ అన్వర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. 2016లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన దిగ్విజయ్ సింగ్ ఎంఐఎం నేతలపై పలు ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ ఆ పార్టీ నాయకుడు హుస్సేన్ అన్వర్ స్థానిక కోర్టులో పరువ నష్టం దావా వేశారు.ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన్నప్పటికీ పలుమార్లు ఉల్లంఘించారు. దీంతో తాజాగా అరెస్ట్ వారెంట్‌జారీ అయ్యింది. అనారోగ్యం కారణంతో నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా దిగ్విజయ్‌సింగ్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తొసిపుచ్చింది. విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment