defamation case
-
వైఎస్ జగన్ పరువు నష్టం కేసు విచారణ వాయిదా
ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తనపై తప్పుడు కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై వేసిన పరువునష్టం కేసు విచారణ జూలై 16వ తేదీకి వాయిదా పడింది. అమెరికాలో ఆదానీ గ్రూపు పై దాఖలైన కేసులో భాగంగా వైఎస్ జగన్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతిలు తప్పుడు కథనాలు ప్రచురించాయి. దీనిపై వైఎస్ జగన్ రూ. 100 కోట్ల పరువు నష్టం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా, ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదని ఉషోదయ పబ్లికేషన్స్ అప్లికేషన్ దాఖలు చేసింది. ఆ అప్లికేషన్ కు కౌంటర్ దాఖలు చేస్తామని వైఎస్ జగన్ తరుపు న్యాయవాది దయ కృష్ణన్ హైకోర్టుకు తెలిపారు. దాంతో తదుపరి విచారణ జూలై 16 కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. -
నాగార్జున పరువు నష్టం కేసు.. కోర్టుకు మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. గతంలో తన కుటుంబ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలకుగానూ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఇవాళ స్పెషల్ జడ్జి ముందు ఆమె హాజరై వివరణ ఇవ్వనున్నారు.ఈ పిటిషన్‌కు సంబంధించి ఇప్పటికే నాగార్జున కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం సేకరించింది కోర్టు. గత వాదనల్లో.. కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు.బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని వాదించారు. అయితే తన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ చెప్పిన విషయాన్ని సురేఖతరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేకుండా ఉందని అశోక్ రెడ్డి వాదించారు.ఈ క్రమంలో ఇరువైపులా వాదనల అనంతరం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు పలుమార్లు మంత్రికి సమన్లు జారీ చేసింది. అయితే పలు ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఆమె వివరణ ఇస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవాళ ఆమె కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. -
ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం ఆతిశికి బిగ్ రిలీఫ్..
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్‌కు ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఎన్నికల వేళ ఆప్ సీనియర్ మహిళా నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశికి ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఒక్క వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆమె మాట్లాడలేదని.. మొత్తం పార్టీని ఉద్దేశించే వ్యాఖ్యానించారని న్యాయస్థానం పేర్కొంది. కాగా, గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందు మంత్రిగా వ్యవహరించిన ఆతిశి.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీలో చేరకపోతే.. ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఆప్ నేతలను అరెస్టు చేస్తుందని కొందరు బీజేపీ నేతలు బెదిరించారంటూ ఆమె ఆరోపించారు. దీంతో ఆతిశి వ్యతిరేకంగా బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో పాటు ఆమెపై న్యాయస్థానంలో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్‌ను కొట్టేసింది.మరో వైపు, దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. కమలం పార్టీ అక్కడ 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు సీట్లనూ గెలుస్తూ వస్తున్నా అసెంబ్లీ బరిలో మాత్రం పట్టు చిక్కడమే లేదు. ఈ సారి ఎలాగైనా హస్తిన గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు పరివర్తన్ (మార్పు) నినాదాన్ని నమ్ముకుంటోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. అవినీతిరహిత పాలన కోసం తమనే గెలిపించాలని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు మరో 15 గ్యారంటీలను ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదలచేసిన ఆప్ సోమవారం మరో అదనపు మేనిఫెస్టోను విడుదలచేసింది. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, మెట్రో ఛార్జీలో 50 శాతం రాయితీ వంటి పలు హామీలను ఇందులో చేర్చింది.ఇదీ చదవండి: ఢిల్లీ ప్రజలకు ఆప్ మరో 15 గ్యారంటీలు -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. రాహుల్‌పై పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్ గాం«దీని రాంచీలోని మెజిస్టీరియల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జార్ఖండ్ ప్రభుత్వానికి, బీజేపీ నేత నవీన్ ఝాకు నోటీసు జారీ చేసింది. రాహుల్ దాఖలు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కింది కోర్టులో రాహుల్‌పై విచారణ నిలిపివేయాలని తేల్చిచెప్పింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. -
పరువు నష్టం కేసులో రాజీ.. ట్రంప్‌కు రూ.127 కోట్లివ్వనున్న ఏబీసీ
న్యూయార్క్: పరువు నష్టం కేసులో కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఏబీసీ న్యూస్ ఛానల్ రాజీ కుదుర్చుకోనుంది. ఇందులో భాగంగా సుమారు రూ.127 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తమ వెబ్సైట్లో ఒక నోట్‌ను ఉంచేందుకు ముందుకొచ్చింది. ట్రంప్ తనపై అత్యాచారం చేశారంటూ రచయిత్రి జీన్ కరోల్ కోర్టు కెక్కారు. గతేడాది విచారణ చేపట్టిన న్యాయస్థానం లైంగిక దాడి, ప్రతిష్టకు భంగం కలిగించడం వంటి నేరాలకు రూ.42 కోట్లు ఆమెకు చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది. ఇదే కేసులో ఈ ఏడాది జనవరిలో మరికొన్ని ఆరోపణలపై మరో రూ.700 కోట్ల చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ కోర్టు రేప్ అనే మాటను ఎక్కడా పేర్కొనలేదు. అయితే, ఏబీసీ న్యూస్ ఛానెల్ ప్రముఖ యాంకర్ జార్జి స్టెఫనోపౌలోస్ మార్చి 10వ తేదీన కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ మేస్తో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా జీన్ కరోల్‌ను ట్రంప్ రేప్ చేసినట్లు రుజువైందంటూ పదేపదే వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. -
నాగార్జున పరువునష్టం కేసు.. మంత్రి కొండా సురేఖ గైర్హాజరు!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 12న వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఇవాళ విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయస్థానం ఈ నెల 19కి విచారణను వాయిదా వేసింది. అసలేంటి వివాదం..గతంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్ చేసింది. దీంతో తమ పరువుకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారణకు అనుమతించింది. -
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడేలపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడేలకు హైకోర్టు సమన్లు
-
వైఎస్ జగన్ అల్టిమేటం.. తప్పుడు వార్తలపై పరువు నష్టం దావా
-
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో.. తన పేరు ఉందన్న ప్రచారంపైనా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది ఉత్త మూర్ఖపు ప్రచారమేనని, కొంతమంది కావాలని చేస్తున్న రాద్ధాంతమని కుండబద్ధలు కొట్టారాయన. అలాగే తనపై తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి డెడ్‌లైన్ విధించారాయన.‘‘సీఎంలు పారిశ్రామిక వేత్తలను కలుస్తారు. నేను ఐదేళ్ల కాలంలో అదానీని కలిశాను. వాటికి విద్యుత్ ఒప్పందాలకు ముడిపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో థర్డ్ పార్టీ ఎవరూ లేరు. ఇది ఏపీ ప్రభుత్వానికి, డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వానికి(సెకి) మధ్య జరిగిన ఒప్పందం. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై పరువు నష్టం దావా వేస్తా. .. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలు. వాస్తవాల్ని వకక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయి. ఆ కేసులో నా పేరు ఎక్కడా లేదు. కానీ, ఆ రెండు మీడియా సంస్థలు నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయి. వాటికి లీగల్ నోటీసులు పంపిస్తా. వాటికి 48 గంటల ఇస్తున్నా. ఆ లోపు క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.ఇదీ చదవండి: సంపద సృష్టించిన జగన్.. ఆవిరి చేస్తున్న చంద్రబాబు! ఎలాగంటే.. -
పరువు నష్టం కేసు.. మంత్రిపై క్రిమినల్ చర్యలకు డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరో నాగార్జునపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని నాగార్జున మంత్రిపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌ను నాగార్జున తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టు ముందు చదువు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని.. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని ఆయన వాదించారు. ఇలాంటి కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబ సభ్యులు మానసికంగా ఎంతో కుంగిపోయారని న్యాయమూర్తికి విన్నవించారు.కొండాసురేఖ లాయర్ వేసిన కౌంటర్‌పై నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కొండ సురేఖ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. నాగార్జున ఫ్యామిలీని కించ పరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని అన్నారు. కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.ట్విటర్లో క్షమాపణలు..అయితే తన కామెంట్స్‌పై మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌ను కూడా కోర్టు ముందు నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి చదివి వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన కామెంట్స్ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే మంత్రి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరింది. 'నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ.. మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా.. అన్యద భావించవద్దు' అంటూ కొండా సురేఖ ట్విట్ చేసింది. -
బుల్లితెర నటిపై తీవ్ర ఆరోపణలు.. దెబ్బకు వీడియో డిలీట్!
బాలీవుడ్లో బుల్లితెర స్టార్ రూపాలీ గంగూలీ అందరికీ సుపరిచితమే. బుల్లితెర నటుల్లో రిచెస్ట్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమె సవతి కూతురు ఇషా నటిపై సంచలన కామెంట్స్ చేసింది. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది.అయితే ఈషా కామెంట్స్‌పై నటి రూపాలీ గంగూలీ పరువునష్టం దావా వేసింది. తన పరువుకు భంగం కలిగించేలా ఇషా మాట్లాడిందంటూ రూ.50 కోట్లకు నోటీసులు పంపించింది. ఈ నోటీసులు అందుకున్న ఇషా వెంటనే అప్రమత్తమైంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను సైతం డిలీట్ చేసింది. అంతేకాకుండా తన ఇన్‌స్టా అకౌంట్‌ను ప్రైవేట్‌గా మార్చేసింది. పరువు నష్టం కేసు నోటీసులు రావడంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు)డిలీట్ చేసిన వీడియో ఇషా మాట్లాడుతూ..'ఇప్పుడు నేను నా రౌడీలకు వ్యతిరేకంగా నిలబడ్డా. నా జీవితంలో వాళ్లిద్దరే రౌడీలు. వారు నేను ప్రేమించే నా తల్లిని ఇబ్బంది పెట్టడమే కాదు.. నన్ను బాధపెట్టాలని చూశారు. వారు నన్ను విమర్శించడానికి నా బలహీనతలను ఎంచుకున్నారు. వారు నాకు బహిరంగంగా, వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నన్ను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని" మాట్లాడింది. పరువు నష్టం నోటీసులు రావడంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. కాగా.. అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. -
పరువు నష్టం దావా ఏస్తనంటున్న రాజేషు
-
కేటీఆర్ పరువునష్టం పిటిషన్: విచారణ ఈ నెల 30కి వాయిదా
హైదరాబాద్, సాక్షి: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ (బుధవారం) నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిపింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈనెల 30న కౌంటర్ ఫైల్ చేస్తామని మంత్రి కొండా సురేఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం వకాలత్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. మరోవైపు నాగార్జున.. కొండా సురేఖపై వేసిన పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నాగార్జున స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసింది. చదవండి: కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్ -
కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదంటూ.. కొండా సురేఖపై పరువు నష్టం దావా అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వంపైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్.. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇప్పటిదాకా ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా, ఇక పైన మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ప్రజల తాలూకు అంశాలకే తాను ప్రాధాన్యత ఇచ్చాను. ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదు’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.రాజకీయ విమర్శలపేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖపై వేసిన రూ. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలి. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం నాకున్నది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్ -
కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖపై పరువు నష్టం కేసులో నేడు నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో కేటీఆర్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరుపు న్యాయవాది కోర్టుకు అందజేశారు.బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 356 కింద చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ పిటిషన్లో కోరారు. కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రావణ్ స్టేట్మెంట్లను న్యాయస్థానం రికార్డు చేయనుంది. హీరో నాగార్జున పిటిషన్‌పై మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ కేటీఆర్ ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారించిన కోర్టు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను నేడు (శుక్రవారం) నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. -
కేటీఆర్ పరువునష్టం పిటిషన్.. విచారణ 18వ తేదీకి వాయిదా
హైదరాబాద్, సాక్షి: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేట్టింది. ఈ పిటిషన్‌పై విచారణ చేట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ నెల 18న పిటిషనర్ కేటీఆర్‌తో పాటు.. నలుగురు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తామని కోర్టు వెల్లడించింది. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీర్ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు లాయర్లు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌లను పటిషన్ సాక్షులుగా చేర్చారు. మంత్రి కొండా సురేఖ తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
రాజకీయ లబ్ధికి మా పరువు తీశారు
సిటీ కోర్టులు: రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలేనని.. వాటిలో ఎలాంటి నిజం లేదన్నారు. మంత్రిపై వేసిన క్రమినల్ పరువునష్టం కేసు విచారణలో భాగంగా మంగళవారం నాగార్జున తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజి్రస్టేట్ ఎక్సైజ్ కోర్టుకు హాజరయ్యారు. జడ్జి ఎస్.శ్రీదేవి ఎదుట ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా గౌరవప్రదంగా జీవిస్తున్నాఅక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాల గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిసున్నానని నాగార్జున కోర్టుకు తెలిపారు. నటుడిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా, స్టూడియో యజమానిగా తాను, తన కుటుంబం ప్రజల ఆద రాభిమానాలు పొందుతున్నామన్నారు. తన కుమారుడు నాగచైతన్య సైతం సినీ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నాడ న్నారు. కానీ తన కుమారుడి వైవాహిక జీవితాన్ని ఉద్దేశించి కొండా సురేఖ మాట్లాడిన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించాయని పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలు, పేపర్ క్లిప్పింగ్‌ల వల్ల తమ కుటుంబం పరువు పోయిందని.. తాము ఎంతో కలత చెందామని చెప్పారు. అందుకే మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకుని తమ కుటుంబ పరువు కాపాడాలని కోరారు. నాగార్జునతోపాటు ఆయన తరఫు సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది. అనంతరం నాగార్జున తరుఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కొండా సురేఖ మాట్లాడిన వీడియోతో కూడిన పెన్‌డ్రైవ్, పేపర్ క్లిప్పింగ్‌లను మెమోతోపాటు కోర్టుకు సమరి్పంచారు. సాక్షుల స్టేట్మెంట్ సమయంలో కొండా çసురేఖ తరుఫు న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ, సురేఖ కూడా హాజరయ్యారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. -
నేడు నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున
సాక్షి,హైదరాబాద్:మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటిషన్‌పై మంగళవారం(అక్టోబర్8) నాంపల్లికోర్టులో విచారణ జరగనుంది. నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఆయన కోర్టుకు హాజరుకానున్నారు.నాగార్జున వేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పిటిషన్లో నాగార్జున పేర్కొన్నారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు.కాగా, ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించడంలో భాగంగా నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కొండాసురేఖపై సోషల్‌మీడియాలో విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి: సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు -
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు
పుణె: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ వినాయక్ దామోదర్ సావర్కర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న హాజరుకావాలని కోరుతూ రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. సత్య సావర్కర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆరోపణలకు వ్యతిరేకంగా సమన్లు జారీ చేసినట్లు తెలిపారు. పరువు నష్టంపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 500 ప్రకారం రాహుల్ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.ఇదీ చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్లకు మరో దావా వేస్తా
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ తమ కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల ఉదంతం గురించి సినీ హీరో నాగార్జున మరోసారి స్పందించారు. మంత్రిపై ఇప్పటికే క్రిమినల్ పరువునష్టం కేసు వేశామని.. ఆమెపై రూ. 100 కోట్లకు మరో పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతు న్నామని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. మంత్రి కొండా సురేఖ కేవలం సమంతపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పారని.. కానీ తనకు, తన కుటుంబానికి మాత్రం ఒక్క ముక్క క్షమాపణ కూడా చెప్పలేదని నాగార్జున మండిపడ్డారు. ఒకవేళ ఇప్పుడు తనకు, తన కుటుంబానికి ఆమె క్షమాపణ చెప్పినా దావా విషయంలో వెనక్కి తగ్గబోనని తేల్చిచెప్పారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులను సున్నిత లక్ష్యాలుగా చేసుకోవడాన్ని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ‘కొంతకాలంగా ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇదే చివరిదని అనుకున్నా. కానీ దైవానికి ఇంకేవో ప్రణాళికలు ఉన్నట్లు అనిపిస్తోంది. అయినా పరవాలేదు. నేనెప్పుడూ బలమైన వ్యక్తిత్వంగల వాడినని నమ్ముతా. నా కుటుంబాన్ని కాపాడే విషయంలో నేను ఓ సింహాన్ని. అదృష్టవశాత్తూ మొత్తం తెలుగు సినీ పరిశ్రమంతా మాకు అండగా నిలిచింది. ఇదంతా మా నాన్న మంచితనం, ఆశీర్వాదమేనని భావిస్తున్నా’ అని నాగార్జున పేర్కొన్నారు. -
నాగార్జున పిటిషన్ పై నేడు విచారణ జరపనున్న నాంపల్లి కోర్టు
-
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సీనీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశాడు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయింంచారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కేసు కూడా నమోదు చేశాడు. (చదవండి: కొండా సురేఖ చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేశ్ బాబు)కాగా, నాగార్జున ఫ్యామిలీపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాయి. టాలీవుడ్ ప్రముఖులంతా మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ అక్కినేని ఫ్యామిలీకి మద్దతుగా నిలిచారు. బాధ్యత గల పదవిలో ఉండి ఒక మహిళ గురించి తప్పుగా ప్రస్తావించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: మంత్రి కొండా సురేఖ Vs టాలీవుడ్.. ఎవరెవవరు ఏమన్నారంటే..?)pic.twitter.com/8VHcJYC7kn— chaitanya akkineni (@chay_akkineni) October 3, 2024 -
పరువునష్టం కేసులో అతిషి, కేజ్రీవాల్‌కు ఊరట
న్యూఢిల్లీ: క్రిమినల్ పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీలో ఓటర్ల జాబితా నుంచి పలువురు పేర్లను తొలిగించారంటూ ఆరోపిస్తూ దిగువ కోర్టులో దాఖలైన క్రిమినల్ పరువునుష్టం కేసు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.కాగా ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించారంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేజ్రీవాల్, అతిషి, ఆప్ నేతలు సుశీల్ కుమార్ గుప్తా, మనోజ్ కుమార్లపై పరువునష్టం కేసు దాఖలైంది.ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్, అతిషి సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు.దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు, ఫిర్యాదుదారు, బీజేపీ నేత రాజీవ్ బబ్బర్‌కు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం అరవింద్ కేజ్రీవాల్, అతిషిపై దిగువ కోర్టులో విచారణపై స్టే ఇచ్చింది. -
పరువునష్టం దావాకు సిద్ధం కండి: హరీశ్‌రావు వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: తనపై తప్పుడు ఆరోపణలు, బురద జల్లే ప్రయత్నాలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసినవారు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని సోమవారం(సెప్టెంబర్30) ఎక్స్(ట్విటర్)లో చేసిన ఒక పోస్టులో హెచ్చరించారు.‘ప్రజా సమస్యలపై పోరాడుతున్న నా పై బురద చల్లె వికృత రాజకీయాలకి తెరలేపినట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత ను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లున్నారు.గోల్కొండ కోట, చార్మినార్‌లో కూడా హరీశ్‌రావుకు వాటాలు ఉన్నాయి అని అంటారేమో?అబ్బద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీస్ పంపుతున్నా.బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’అని హరీశ్‌రావు ట్వీట్లో పేర్కొన్నారు.కాగా, ఆనంద కన్వెన్షన్ సెంటర్లో హరీశ్‌రావుకు వాటాలున్నాయని, దానిని కూల్చకుండా అడ్డుకోవడానికే పేద ప్రజలను అడ్డం పెట్టుకుని వారిని రెచ్చగొడుతున్నారని రాజ్యసభ ఎంపీ అనిల్‌యాదవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి కౌంటర్‌గా హరీశ్‌రావు పరువునష్టం దావా పోస్టు పెట్టారు. -
Sanjay Rajaram Raut: పరువు నష్టం కేసు.. ఎంపీ సంజయ్‌రౌత్‌కు బిగ్ షాక్
-
పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలు
ముంబై: శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సంజయ్‌రౌత్‌కు ముంబై కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. ఆయనకు రూ.25 వేలు జరిమానా కూడా విధిస్తున్నట్లు వెల్లడించింది.మేధ సోమయ్య ముంబైలోని రుయా కళాశాలలో ఆర్గానిక్ కెమెస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె యువ ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్నారు. అయితే తన ఎన్జీవతో కలిసి ఆమె రూ.100 కోట్ల మరుగుదొడ్ల కుంభకోణానికి పాల్పడినట్లు రౌత్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. చదవండి: ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపువీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టును ఆశ్రయించారు. 2022 నుంచి రౌత్ తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, అవి పలు పత్రికలు, ఎలక్ట్రానిక్‌తోపాటు సోషల్ మీడియాలోనూ ప్రచురితమయ్యాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనతోపాటు తన భర్తపై సంజయ్ రౌత్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని చెబుతూ.. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు సంజయ్ రౌత్ న్యాయవాది, ఆయన సోదరుడు సునీల్ రౌత్ మాట్లడుతూ.. బెయిల్ పిటిషన్ వేస్తామని తెలిపారు. అలాగే ఈ ఉత్తర్వులపై ముంబై సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. -
పరువు నష్టం కేసు.. విచారణకు సీఎం రేవంత్ గైర్హాజరు
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డిపై పరువునష్టం కేసు విచారణ వాయిదా పడింది. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు వేసిన పరువు నష్టం కేసు విచారణను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు అక్టోబర్16కు వాయిదా వేసింది.పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని రేవంత్ ప్రచారం చేశారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసులో సెప్టెంబర్ 25వ తేదీన విచారణకు హాజరు కావాలని రేవంత్‌రెడ్డికి కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసింది.అధికారిక కార్యక్రమాల్లో సీఎం తీరిక లేకుండా ఉన్నారని రేవంత్‌రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పర్సనల్ బాండ్, రూ.15వేల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.ఇదీ చదవండి: మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్: సీఎం రేవంత్ -
ఫేక్ వార్తలు ప్రచారం.. టీవీ ఛానెల్‌కు పెద్దిరెడ్డి పరువు నష్టం నోటీసులు
సాక్షి, తిరుపతి: తనపై నిరాధార వార్తలు వేసినందుకు బిగ్ టీవీకి పరువు నష్టం నోటీసులు ఇచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డిపై బిగ్ టీవీ తప్పుడు వార్తలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి చర్యలకు దిగారు.కాగా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం చేసిన మరో మీడియా సంస్థకు నోటీసులు వెళ్లాయి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పరువు నష్టం వేసేందుకు బిగ్ టీవీకి ఇప్పటికే పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు నోటీసులు పంపించారు. ఇక, తాజాగా బిగ్ టీవీకి పరువు నష్టం కింద రూ.50కోట్లకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై నిరాధారంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై న్యాయపరంగా బుద్ధి చెబుతామని పెద్దిరెడ్డి హెచ్చరించారు.ఇక, గతంలో ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్‌కు పరువు నష్టం కింద 100 కోట్ల రూపాయలు చెల్లించాలని పెద్దిరెడ్డి నోటీసులు ఇచ్చారు. తనపై తప్పుడు వార్తలు రాసిన కారణంగా ఈనాడు, ఈటీవీకి రూ.50కోట్లు.. మహా న్యూస్‌కు రూ.50కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
Rahul Gandhi: బీజేపీ చౌకబారు ప్రచారం కోసమే!
సుల్తాన్పూర్(యూపీ): కేవలం చౌకబారు ప్రచారం కోసమే బీజేపీ నేతలు తనపై పరువు నష్టం వేశారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ–ఎమ్మెల్యే కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. తాను ఎవరిపైనా పరువు నష్టం కలిగించేంతటి ఆరోపణలు చేయలేదని జడ్జి శుభమ్ వర్మ ఎదుట తెలిపారు. దీంతో, జడ్జి కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అదే రోజు రాహుల్ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని చెప్పారు. రాహుల్ కోర్టుకు రానవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం కోర్టు వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు చౌకబారు ప్రచారం కోసమే తనపై కేసు వేశారన్నారు. రాహుల్ కొత్త చిరునామా..!న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సునహరీ బాగ్ రోడ్‌లోని ఐదో నంబర్ బంగ్లాకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేతకు నిబంధనల ప్రకారం టైప్–8 బంగ్లాను కేటాయించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీకి సునహరీ బాగ్‌లోని ఐదో నంబర్ బంగ్లాను కేటాయించినట్లు హౌస్ కమిటీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. -
అమిత్‌షాపై వ్యాఖ్యలు.. యూపీ సుల్తాన్పూర్ కోర్టుకు రాహుల్
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ కోర్టుకు హాజరయ్యారు. కేంద్రమంత్రి అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ బీజేపీ నేత విజయ్ మిశ్రా దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించిన విచారణ నేపథ్యంలో ఆయన నేడు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ తరపు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, రాజకీయ దురుద్దేశంతో, తన ప్రతిష్టను దెబ్బతిసేందుకు ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. కోర్టు అడిగిన ప్రశ్నలకు రాహుల్ తన స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. వాదనల అనంతరం కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది. ఆగస్టు 12న రాహుల్ మరోసారికి కోర్టుకు హాజరై సాక్ష్యాలను సమర్పించనున్నారు.#WATCH | Sultanpur, Uttar Pradesh: Advocate Kashi Prasad Shukla, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi's lawyer says, "...Rahul Gandhi recorded his statement in the court and said that all the allegations are false and the complaint has been filed due to political… pic.twitter.com/ne8YUWvI3O— ANI (@ANI) July 26, 2024 కాగా 2018 కర్ణాటక ఎన్నికల సమయంలో బెంగళూరులో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొని కేంద్రమంత్రి అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. అప్పటి సుల్తాన్పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయ్ మిశ్రా అదే ఏడాది ఆగస్టు 4 జిల్లా కోర్టులో రాహుల్ పై పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఓ హత్య కేసులో అమిత్ షా నిందితుడు అని రాహుల్ వ్యాఖ్యానించినట్లు విజయ్ మిశ్రా ఆరోపించారు.రాహుల్ ఆ ర్యాలీలో..‘బీజేపీ అధ్యక్షుడు ఓ హత్యకేసులో నిందితుడనే విషయాన్ని దేశంలోని ప్రజలు మర్చిపోతున్నారు. అదే నిజం. నిజాయితీ, మర్యాద, గురించి మాట్లాడే పార్టీకి.. హత్య ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారు. అమిత్ షాపై హత్యా ఆరోపణలు వచ్చాయి, కాదా? సుప్రీంకోర్టు జడ్జి లోయా కేసును ప్రస్తావించింది. కాబట్టి అమిత్ షాకు పెద్దగా క్రెడిబిలిటీ లేదు. ఆయన హత్య నిందితుడని మర్చిపోవద్దు. ”అని రాహుల్ వ్యాఖ్యానించారు. -
బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!
'కల్కి' హిట్ కావడం ఏమో గానీ బాలీవుడ్ మాఫియాకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. తెలుగు సినిమాల వల్ల ఎప్పటికప్పుడు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే 'బాహుబలి'తో టాలీవుడ్ గ్రాఫ్ పెరగడం ఏమో గానీ బాలీవుడ్ పతనం మాత్రం అప్పటినుంచే మొదలైంది. ప్రభాస్ సినిమా హిట్ అయితే చాలు నార్త్ బ్యాచ్ అంతా దెప్పిపొడవడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే 'కల్కి' వసూళ్ల గురించి నోటికొచ్చింది మాట్లాడి చిక్కులో పడ్డారు!(ఇదీ చదవండి: 'కల్కి' ఖాతాలో నెవ్వర్ బిఫోర్ రికార్డ్.. బలైపోయిన షారూఖ్)'బాహుబలి' సినిమాల తర్వాత టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది. అప్పటివరకు ఇండియన్ మూవీ అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునేవాళ్లు. కానీ ప్రభాస్ వల్ల తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలిసింది. ఇది బాలీవుడ్ హీరోలకు, అక్కడి క్రిటిక్స్‌కి మాత్రం పంటికింద రాయిలా మారింది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభాస్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా 'కల్కి'కి రూ.1000 కోట్లు వస్తే.. అవి ఫేక్ వసూళ్లని చెప్పి ట్వీట్స్ చేశారు.దీంతో 'కల్కి' నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సీరియస్ అయింది. సుమిత్ కడేల్, రోహిత్ జైశ్వాల్ అనే ఇద్దరు బాలీవుడ్ క్రిటిక్స్‌పై పరువు నష్టం దావా వేసింది. కలెక్షన్స్ ఫేక్ అని చేసిన ట్వీట్స్ అసలు ఎవరు చెబితే వేశారు? ఫేక్ అని ఫ్రూప్ ఏంటి? అనేది బయటపెట్టాలని.. లేదంటే రూ.25 కోట్లు ఇవ్వాలని 'కల్కి' టీమ్ వీళ్లకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అసలే సినిమా హిట్ అయిందనే షాక్‌లో ఉన్న బాలీవుడ్ మాఫియాకు.. ఇప్పుడు దావా అంటే దెబ్బ మీద దెబ్బే! మరీ క్రిటిక్సే ఈ ట్వీట్స్ వేశారా? లేదంటే వీళ్ల వెనక ఎవరైనా హిందీ హీరోలు ఉన్నారా అనేది అనుమానం!(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ) -
మేధా పాట్కర్‌కు 5 నెలల జైలు
న్యూఢిల్లీ: సామాజిక వేత్త, నర్మదా బచావో ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం ఐదు నెలల సాధారణ కారాగార శిక్ష విధించింది. గుజరాత్‌లోని ఒక ఎన్జీవోకు సారథి, ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 23 ఏళ్ల క్రితం పాట్కర్‌పై వేసిన కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ గత నెల ఏడో తేదీన ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ తీర్పు చెప్పారు. అయితే శిక్ష ఖరారును రిజర్వ్‌చేసి సోమవారం తీర్పును వెలువరించారు. పరువునష్టం కింద సక్సేనాకు రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని పాట్కర్‌ను కోర్టు ఆదేశించింది. తీర్పును పాట్కర్ పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు అవకాశం కలి్పస్తూ నెలరోజులపాటు శిక్ష అమలును నిలిపివేస్తూ న్యాయమూర్తి రాఘవ్ శర్మ ఉత్తర్వులిచ్చారు. అయితే శిక్ష ప్రస్తుతానికి నిలుపుదల చేసిన నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని పాట్కర్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆనాడు సక్సేనాను పిరికిపంద అంటూ పాట్కర్ దూషించిన అంశం కోర్టులో రుజువుకావడంతో ఆమెను దోషిగా తేల్చారు. హవాలా లావాదేవీల్లో సక్సేనా హస్తముందంటూ పాట్కర్ చేసిన ఆరోపణల్లో నిజంలేదని, పాట్కర్ కారణంగా ఆయన పరువుకు నష్టం కలిగిందని కోర్టు అభిప్రాయపడిన విషయం విదితమే. 2000 సంవత్సరంలో అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ‘కౌన్సిల్ ఫర్ సివిల్ లిబరీ్టస్’ అనే స్వచ్ఛంద సంస్థకు వీకే సక్సేనా అధ్యక్షునిగా ఉండేవారు. తనకు, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమానికి వ్యతిరేకంగా సక్సేనా ప్రకటనలు ఇచ్చారని ఆయనపై పాట్కర్ తొలిసారిగా ఫిర్యాదుచేశారు. -
టీఎంసీ ఎంపీకి షాక్.. రూ. 50 లక్షలు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సాకేత్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. లక్ష్మీ పురికి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. క్షమాపణలను ప్రముఖ జాతీయ వార్తాపత్రికలో ప్రచురించాలని, ఆరు నెలల పాటు సోషల్ మీడియాలో కూడా ఉంచాలని సూచించింది. ఎనిమిది వారాల్లోగా ఈ ఉత్తర్వును పాటించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.కాగా, 2021 జూన్ 13, 26న సాకేత్ గోఖలే వివాదస్పద ట్వీట్లు పోస్ట్ చేశారు. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి తన ఆదాయానికి మించి స్విట్జర్లాండ్‌లో ఆస్తిని కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆమె భర్త, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురించి కూడా ఆ ట్వీట్లలో ప్రస్తావించారు.ఈ నేపథ్యంలో అదే ఏడాది లక్ష్మీ పురి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలేపై పరువునష్టం దావా వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. -
ఢిల్లీ మంత్రి అతిషిపై పరువు నష్టం కేసు..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత, ఢిల్లీ మంత్రి అతిషిపై శనివారం పరువు నష్టం కేసు నమోదైంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణను జూలై 23వ తేదీకి లిస్ట్ చేసింది. చిరునామా తప్పుగా ఉన్నందున సమన్లు అందజేయలేదని కోర్టు పేర్కొంది. కోర్టులో ఉన్న ఆమె న్యాయవాదికి ఫిర్యాదు కాపీని అందించారు.ఈ కేసులో మంత్రి అతిషి తరఫున లాయర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. బీజేపీ నేత తరఫున న్యాయవాది శౌమేందు ముఖర్జీ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలకు డబ్బులు ఆశ చూపినట్లుగా తప్పుడు ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. ఆప్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ప్రవీణ్ శంకర్ కపూర్ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం.. ఓ సమావేశంలో మంత్రి అతిషి మాట్లాడుతూ.. బీజేపీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.25కోట్ల ఆఫర్ చేస్తూ.. నేతలను కొనేందుకు ప్రంయత్నిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నం చేస్తుందని.. ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఆప్ చేసిన ఆరోపణలను బీజేపీ కొట్టిపడేసింది.ఆ తర్వాత కూడా అతిషి మళ్లీ ఆరోపణలు చేశారు. తన సన్నిహితుల ద్వారా బీజేపీ తనను సంప్రదించిందని.. తనను బీజేపీలో చేరాలని కోరారని చెప్పారు. పార్టీ మారితేనే తన రాజకీయ జీవితం నిలబడుతుందని అన్నారని.. పార్టీ మారకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను ఒక నెలలోగా అరెస్టు చేస్తుందని బెదించారని ఆరోపించారు. ఈ కేసులో బీజేపీ పరువు నష్టం కింద నోటీసులు పంపింది. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. -
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు.. జూలై 2న హాజరవ్వాలని ఆదేశం
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని ప్రజాప్ర్తినిధుల కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్‌పై జూలై 2న తమ ఎదుట హాజరుకావాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్ గాంధీని కోరింది. కేసు తదుపరి విచారణ జూలై 2న జరగనుంది.వివరాలు.. జూలై 15న కర్ణాటక రాజధాని బెంగళూరులో హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సుల్తాన్పూర్ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్, బీజేపీ నేత విజయ్ మిశ్రా ఆగస్టు 4, 2018లో రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు వేశారు.2018తో పాటు గతేడాది నవంబర్ 27న కోర్టు కాంగ్రెస్ నేతను విచారణకు పిలిచింది. ఏడాది ఫిబ్రవరి 20న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరై బెయిల్‌ను పొందారు. అయితే, అప్పటి నుంచి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.ఇదిలా ఉండగా.. ఈ నెల 7న కొత్వాలి నగర్‌కు చెందిన రామ్ ప్రతాప్ అనే వ్యక్తి ఈ కేసులో తనను పార్టీగా మార్చాలని కోర్టును కోరారు. దీనిని బీజేపీ నేత విజయ్ మిశ్రా తరఫు న్యాయవాది సంతోష్ పాండే వ్యతిరేకించారు. కేసును జాప్యం చేసేందుకు పిటిషన్ దాఖలు చేశారని ఆరోపించారు. అనంతరం పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హజరు కావాలని కోర్టు ఆదేశిసస్తూ సమన్లు జారీ చేసింది. విచారణను జూలై 2వ తేదీకి వాయిదా వేసింది. -
పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీకి బెయిల్
బెంగళూరు: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీకి బెంగళూరు లోకల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం స్పెషల్ మెజిస్ట్రేట్ కేఎన్ శివకుమార్ రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేశారు. గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2019-2023 పాలనలో రాష్ట్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రతీ పనిలోనూ 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపణలు చేశారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ కేశవ్ ప్రసాద్.. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం న్యాయమూర్తి ఎదుట రాహుల్‌గాంధీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరు ప్రత్యేక కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. తర్వాత ఈ కేసు విచారణను జులై 30వ తేధీకి వాయిదా వేసింది. -
పరువు నష్టం కేసులో సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు బెయిల్
బెంగళూరు: ప్రజా ప్రతినిధుల కోర్టులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివుకుమార్‌లకు ఊరట లభించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశవ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి వీళ్లిద్దరికి ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. కాగా గత బీజేపీ ప్రభుత్వం అన్నీ పనుల్లో 40 శాతం కమీషన్ వసూలు చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్లలో ప్రకటనలు ఇచ్చింది. ‘40 శాతం కమీషన్ ప్రభుత్వం’ పేర్కొంటూ పూర్తి పేజీ ప్రకటన ప్రచురించింది. వివిధ పనుల కోసం గత సర్కార్ అవినీతి రేటు కార్డులు నిర్ణయించిందంటూ ఆరోపిస్తూ పోస్టర్లను కూడా ముద్రించింది.అయితే అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని బీజేపీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు సిద్దరామయ్య, శివకుమార్‌తోపాటు రాహుల్ గాంధీలపై బీజేపీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై నేడు విచారణ సందర్భంగాసిద్ధరామయ్య, శివకుమార్ 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. అనంతరం సిద్దరామయ్య,, శివకుమార్‌లకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. -
పరువు నష్టం కేసు.. మేధాపాట్కర్ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: ‘నర్మదా బచావో’ ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన మేధాపాట్కర్ను పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఈకేసులో ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది. పాట్కర్ దోషిగా తేలిన పరువు నష్టం కేసును ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతంలో ఫైల్ చేశారు. అప్పట్లో సక్సేనా అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు నేతృత్వం వహించేవారు. పాట్కర్ గుజరాత్లో ‘నర్మదా బచావో’ ఆందోళన్‌కు నాయకత్వం వహించేవారు.ఈ క్రమంలోనే పాట్కర్, సక్సేనా ఒకరిపై ఒకరు తరచూ కోర్టులకెక్కేవారు. తనపై పాట్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సక్సేనా క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. ఈ కేసులోనే ప్రస్తుతం ఢిల్లీ సాకేత్ కోర్టు పాట్కర్‌ను దోషిగా తేల్చింది. -
2018లో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా
లక్నో : 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం దావా కేసు విచారణ ఏప్రిల్ 22కి వాయిదా పడింది. ప్రత్యక కోర్టు న్యాయమూర్తి సెలువులో ఉన్న కారణంగా కేసు వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ.. హోమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్ పూర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత విజయ్ మిశ్రా సుల్తాన్ పూర్ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. మిశ్రా తరపు న్యాయవాది సంతోష్ పాండే మాట్లాడుతూ.. పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేశామన్నారు. కానీ న్యాయమూర్తి సెలవులో ఉన్నందున విచారణ జరగలేదని, ఏప్రిల్ 22కి వాయిదా వేసినట్లు తెలిపారు. 2018 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ.. అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలను విశ్వసిస్తుందని చెబుతున్నప్పటికీ, హత్య కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారని అన్నారు. అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆగస్టు 4, 2018న రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతుంది కాగా, ఈ కేసులో గతేడాది డిసెంబర్లో రాహుల్ గాంధీపై కోర్టు వారెంట్ జారీ చేసింది. తదనంతరం, రాహుల్ గాంధీ ఫిబ్రవరి 20న అమేథీలో భారత్ జోడో న్యాయ్ యాత్రను నిలిపివేసి, కోర్టు నుంచి బెయిల్ పొందారు. -
రాజకీయ నాయకుడు అసభ్యకర కామెంట్స్.. త్రిష కీలక నిర్ణయం!
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్స్‌పై పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ విషయంలో త్రిష చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే వెల్లడించింది. తన లీగల్ టీం దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తుందని తెలిపింది. తాజాగా ఏవీ రాజు కామెంట్స్‌పై త్రిష టీం చర్యలకు దిగింది. ఆయనపై త్రిష పరువునష్టం దావా కేసు వేశారు. దీనికి సంబంధించిన నోటీసులను తన ట్విటర్లో పంచుకున్నారు. తన లీగల్ టీం ద్వారా ఏవీ రాజుకు నోటీసులు పంపించారు. కాగా.. గతంలో త్రిషపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అసభ్యకర కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు త్రిషను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన కామెంట్లను కోలీవుడ్ సినీ తారలంతా మూకుమ్మడిగా ఖండించారు. త్రిషకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గతంలో ఓ ఎమ్మెల్యే త్రిషకు డబ్బులిచ్చి రిసార్ట్‌కు తీసుకొచ్చారంటూ ఏవీ రాజు చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. pic.twitter.com/DmRXHibIYx — Trish (@trishtrashers) February 22, 2024 -
పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట
ఉత్తరప్రదేశ్ న్యాయస్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 2018 పరువు నష్టం కేసులో రాహుల్‌కు సుల్తాన్పూర్ ప్రత్యేక కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ఎన్నికల సమయంలో 2018 మే 8న బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ.. హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా అనే వ్యక్తి అదే ఏడాది ఆగస్టు 4న పరువు నష్టం కేసు వేశాడు. ఓ పక్క బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలకు కట్టుబడి ఉందని ప్రకటిస్తూనే మరో పక్క ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన సమయంలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నారు. #WATCH | Uttar Pradesh: Congress leader Rahul Gandhi leaves from Sultanpur Court. The court granted him bail in a 2018 defamation case. pic.twitter.com/IZbyNsfyP5 — ANI (@ANI) February 20, 2024 రాహుల్ వ్యాఖ్యలను తప్పుబడుతూ మిశ్రా కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై సుల్తాన్ పూర్ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. కేసు విచారణకు నేడు రాహుల్ కూడా హాజరయ్యారు. ఈ మేరకు ఇరుపక్ష వాదనలు విన్న న్యాయస్థానం.. రాహుల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చదవండి: క్యా సీన్ హై.. వధువుకి పాదాభివందనం చేసిన వరుడు #WATCH | Sultanpur, UP: On Congress Leader Rahul Gandhi being granted bail by District Court, Advocate Santosh Pandey says, "He (Rahul Gandhi) surrendered in the court today. He surrendered and the court took him into custody for 30-45 minutes. After that, his bail application… pic.twitter.com/tgxdOKlbnb — ANI (@ANI) February 20, 2024 ఈ సందర్భంగా రాహుల్ న్యాయవాది సంతోష్ పాండే విలేకరులతో మాట్లాడుతూ.. పరువు నష్టం కేసులో రాహుల్ నేడు కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. కోర్టు నాయన్ను 30-45 నిమిషాల పాటు విచారించిందన్నారు. తర్వాత రాహుల్ బెయిల్ దరఖాస్తు సమర్పించబడంతో కోర్టు ఆమోదించిందని తెలిపారు. తదుపవరి విచారణ తేదీని ఇంకా ప్రకటించలేదని, ఈ కేసులో రాహుల్ నిర్దోషి అని, పరువు నష్టం కలిగించే విధంగా ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. కాగా రాహుల్ చేపట్టిన భారత్‌జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోనే కొనసాగుతుండటం గమనార్హం. నేటి ఉదయం కోర్టుకు హాజరు కావడంతో యాత్ర తాత్కాలికంగా ఆపేశారు. మధ్యాహ్నం మధ్యాహ్నం 2 గంటలకు అమేథీలోని ఫుర్సత్గంజ్ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. -
US Court: ఆమెకు రూ.692 కోట్లు చెల్లించండి
న్యూయార్క్: పాత్రికేయురాలు, రచయిత్రి ఇ.జీన్ కరోల్‌కు పరువు నష్టం కలిగించినందుకు జరిమానాగా ఆమెకు దాదాపు రూ.692 కోట్లు(8.33 కోట్ల డాలర్లు) చెల్లించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా కోర్టు శనివారం ఆదేశించింది. 1996లో మాన్హాటన్లోని బెర్గ్‌డోర్ఫ్ గుడ్‌మ్యాన్ అవెన్యూ షాపింగ్‌మాల్ ట్రయల్రూమ్లో ట్రంప్ తనను రేప్ చేశారంటూ కరోల్ కేసు వేసింది. లైంగికదాడి జరిగిందని నిర్ధారించిన కోర్టు, ఆమెకు 41.56 కోట్లు చెల్లించాలంటూ 2023 మే లో ట్రంప్‌ను ఆదేశించింది. తనపై లైంగికదాడి వివరాలను న్యూయార్క్ మేగజైన్ వ్యాసంలో, తర్వాత పుస్తకంలో కరోల్ పేర్కొన్నారు. రచనల అమ్మకాలు పెంచుకునేందుకు అసత్యాలు రాస్తున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇవి తన పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ ఆమె మరో దావా వేశారు. ఈ కేసు తుది తీర్పును మన్హాటన్ ఫెడరల్ కోర్టు శనివారం వెలువరించింది. కరోల్‌కు 1.83 కోట్ల డాలర్ల పరిహారంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు హెచ్చరికగా మరో 6.5 కోట్ల డాలర్లు ఇవ్వాలని ట్రంప్‌ను ఆదేశించింది. పై కోర్టుకు వెళతా: ట్రంప్ కోర్టు తీర్పు హాస్యాస్పదమని ట్రంప్ దుయ్యబట్టారు. ‘‘న్యాయ వ్యవస్థ చేయి దాటి పోయింది. ప్రభుత్వం దాన్నో ఆయుధంగా వాడుతోంది. పై కోర్టుకు వెళతా’ అని తీర్పు తర్వాత వ్యాఖ్యానించారు. గురువారం ఈ కేసు విచారణ మధ్యలోనే ట్రంప్ కోర్టులో నుంచి లేచి బయటికొచ్చారు. దీనిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ లాయర్ వైఖరిని సైతం బాగా తప్పుబట్టారు. సరిగా ప్రవర్తించకుంటే మీరు జైలుకెళ్తారని లాయర్‌ను తీవ్రంగా మందలించారు కూడా. -
అవతలి పక్షంతో సంప్రదింపులా?
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పరువు నష్టం కేసులో అవతలి పక్షంతో సంప్రదింపులకు దిగినందుకు ఆమె తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణన్‌ను ఢిల్లీ హైకోర్టు మందలించింది. దాంతో ఆయన కేసు నుంచి తప్పుకున్నారు. లోక్‌సభలో పారిశ్రామికవేత్త అదానీ గ్రూపుపై ప్రశ్నలడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, సుప్రీంకోర్టు లాయర్ జై అనంత్ దేహద్రాయ్ తదితరులు ఆరోపించడం తెలిసిందే. వారిపై ఆమె పరువు నష్టం దావా వేశారు. లాయర్ నారాయణన్ గురువారం తనకు ఫోన్ చేసి, ఆమెపై దాఖలు చేసిన సీబీఐ ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని కోరినట్టు దేహద్రాయ్ హైకోర్టుకు తెలిపారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా ఆగ్రహించారు. ‘‘ఇది విని నేను నిజంగా షాక య్యాను. ఇలా మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయ త్నిస్తే ఈ కేసులో వాదించేందుకు మీరెలా అర్హుల వుతారు?’’అని ప్రశ్నించారు. దేహద్రాయ్, మహువా కొంతకాలం పాటు సహజీవనం చేసినట్టు తృణమూల్ వర్గాలు చెబుతుంటాయి. ఆయన తమ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అసభ్యకర మెసేజీలు పంపుతున్నారని, చోరీకి యత్నించారని గత ఆర్నెల్లలో మహువా పలు కేసులు పెట్టారు. -
రేవంత్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామేశ్వర్రావు దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో కింది కోర్టు ఇచ్చిన కాగ్నిజెన్స్ ఆర్డర్‌ను రద్దు చేశారు. 2014లో డీఎల్ఎఫ్ భూములకు సంబంధించి టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల్లో రేవంత్ చేసిన కొన్ని ప్రకటనల వల్ల తన పరువుకు భంగం వాటిల్లిదంటూ మేజిస్టేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిని కింది కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడంపై రేవంత్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. హైదరాబాద్ మేజిస్ట్రేట్ కోర్టు కాగ్నిజెన్స్ ఉత్తర్వులను జస్టిస్ లక్ష్మణ్ కొట్టేస్తూ తీర్పు చెప్పారు. విధానపరమైన లోపాలను గుర్తించి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరువు నష్టం కేసును తిరిగి విచారణ చేపట్టాలని కింది కోర్టును ఆదేశించారు. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కాగ్నిజెన్స్‌కు కింది కోర్టు అనుమతిచ్చిందని చెప్పారు. కారణం ఏమిటో స్పష్టం చేయకుండా కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడం చెల్లదన్నారు. రేవంత్‌రెడ్డి భూముల అన్యాక్రాంతంపైన మాత్రమే మాట్లాడారని, దీనివల్ల రామేశ్వర్‌రావుకు నష్టం కలగలేదన్నారు. ఏ మాత్రం పట్టించుకోకుండా అనేక చేతులు మారిన తర్వాత రామేశ్వరరావు కంపెనీకి చేరిందని మాత్రమే ఆరోపించారని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, మేజి్రస్టేట్ కోర్టు జారీచేసిన కాగ్నిజెన్స్ ఆదేశాలను రద్దు చేసింది. తిరిగి తాజాగా విచారణ చేసేందుకు కింది కోర్టుకు అనుమతిచ్చింది. -
కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: ప్రధాని డిగ్రీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాకిచ్చింది సుప్రీంకోర్టు. ప్రధాని డిగ్రీకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ హైకోర్టు పరువు నష్టం చర్యలు తీసుకోకుండా స్టే విధించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రధాని డిగ్రీకి సంబంధించి తమ యూనివర్సిటీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు మరో ఆప్ నేత సంజయ్ సింగ్‌లపై గుజరాత్ యూనివర్సిటీ రిజిష్ట్రార్ పీయూష్ పటేల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మధ్యంతర స్టే విధించాల్సిందిగా మొదట గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు గుజరాత్ హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున దీనిపై తాము ఎటువంటి నోటీసులు ఇవ్వలేమని చెబుతూ సంజీవ్ ఖన్నా, ఎస్విఎన్ భట్టిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అరవింద్ కేజ్రీవాల్, గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టుకు వివరణ ఇవ్వాలని తెలిపింది. అంతకు ముందు ప్రధాని డిగ్రీపై వ్యంగ్యంగానూ అవమానకరంగానూ వ్యాఖానించినందుకు వీరిరువురికీ గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా కేజ్రీవాల్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. పరువు నష్టం కేసు ట్రయల్‌పై మధ్యంతర స్టే విధించాలన్న వారి రివిజన్ అప్లికేషన్‌ను సెషన్స్ కోర్టు కూడా తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టులో ఆగస్టు 29న ఈ కేసు విచారణకు రానుంది. Supreme Court refuses to grant relief to Delhi’s Chief Minister Arvind Kejriwal in the criminal defamation case filed by the Gujarat University over his comments in connection with the Prime Minister’s degree. Supreme Court notes that Kejriwal’s plea to stay the trial is pending… pic.twitter.com/oPUFC3pR2J — ANI (@ANI) August 25, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: ఢిల్లీలో మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు -
పరువునష్టం కేసులో డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన కోర్టు
వాషింగ్టన్: అమెరికా మ్యాగజైన్ కాలమిస్ట్ ఇ. జీన్ కరోల్పై డోనాల్డ్ ట్రంప్ వేసిన పరువు నష్టం దావాను న్యూయార్క్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం చాలా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. వరుసగా తనపై నమోదవుతున్న కేసులతో పాటు అంతకుముందు నమోదైన కేసుల్లో తీర్పులు ఆయనకు ఊపిరి ఆడనివ్వడంలేదు. ఒకపక్క తాను వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేయాలని చూస్తుండగా మరోపక్క కేసుల వలయం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో అమెరికా మ్యాగజైన్ కాలమిస్ట్ ఇ. జీన్ కరోల్పై లైంగిక వేధింపుల కేసులో డోనాల్డ్ ట్రంప్ ను నేరస్తుడిగా పరిగణిస్తూ ఆమెకు నష్టపరిహారంగా 5 మిలియన్ డాలర్ల చెల్లించాల్సిందిగా సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ కేసులో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరానికి మాత్రమే శిక్ష విధించినట్లు అత్యాచార నేరానికి కాదని కోర్టు మే నెలలో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. అయినా కూడా జీన్ కరోల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తాను లైంగిక వేధింపుల తోపాటు అత్యాచారం కూడా జరిపినట్లు ప్రతి సందర్భంలోనూ మీడియాతో చెబుతుండడంతో డోనాల్డ్ ట్రంప్ ఆమెపై పరువునష్టం దావా వేశారు. సోమవారం ఈ కేసుపై జిల్లా కోర్టు న్యాయమూర్తి లూయిస్ కప్లాన్ స్పందిస్తూ కరోల్‌ను డోనాల్డ్ ట్రంప్ అత్యాచారం చేశారన్నది వాస్తవమేనని అందుకే కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో దారుణం.. తండ్రిని చంపినట్టే కుమారుడిని కూడా.. -
రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని ఆ పార్టీ నేత ఆధిర్ రంజన్ ఛౌధురి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పరువు నష్టం కేసులో కోర్టు తీర్పుతో రాహుల్‌ను లోక్‌సభకు అనర్హుడిగా ప్రకటించినంత వేగంగానే సభ్యత్వాన్ని కూడా తిరిగి పునరుద్ధరించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరామన్నారు. ఇందుకు అవసరమైన పత్రాలను సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే శుక్రవారం రాత్రి అందజేశామని, శనివారం ఉదయం కూడా మరికొన్నిటిని ఆయనకు పంపించామని వివరించారు. సోమవారం లోక్‌సభ సమావేశం ప్రారంభమయ్యేటప్పటికి రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నామన్నారు. పరువు నష్టం కేసులో రాహుల్‌కు సూరత్ సెషన్స్ కోర్టు శిక్ష విధించిన 26 గంటల్లోనే ఆయన్ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ నోటిఫికేషన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గుర్తు చేశారు. ఆ శిక్ష అన్యాయమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు కూడా 26 గంటలు గడిచాయన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ పాల్గొంటారని ప్రభుత్వం భయపడుతోందా అని జైరాం రమేశ్ ప్రశ్నించారు. -
సుప్రీం తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్ పార్టీ
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యం మెరుగై రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా మోదీ ఇంటి పేరు వివాదంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చి రాహుల్ గాంధీకి ఊరటనివ్వడంతో లాలూ రాహుల్ గాంధీని తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆహ్యానించారు. విందులో బీహార్ స్పెషల్ చంపారన్ మటన్ తెప్పించి స్వయంగా తానే వండి వడ్డించారు. రాహల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసులో అమలు కావాల్సిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరైన రాహుల్ గాంధీని లాలూ మొదట పుష్పగుచ్ఛమిచ్చి అభినందించి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కొద్దిసేపు రాజకేయాలు మాట్లాడుకుని తర్వాత ఇద్దరూ విందులో పాల్గొన్నారు. విందులో రాహుల్ కోసం లాలూ స్వయంగా మటన్ వండటం విశేషం. లాలూ చేసిన ప్రత్యేక వంటకాన్ని రాహుల్ చాలా ఆస్వాదించారు. దీని కోసం లాలూ బీహార్ నుండి ప్రత్యేకంగా చంపారన్ దేశీయ మటన్ తెప్పించి బీహార్ స్టైల్లో దాన్ని తానే స్వయంగా వండారు. రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు భారీ ఉపశమనం ఇవ్వడంతో ఆయన పార్లమెంటులో తిరిగి అడుగు పెట్టడానికి మార్గం సుగమమైంది. అయితే దానికి ఎంత సమయం పడుతుంది, ప్రభుత్వంపై జరగనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొంటారా లేదా అన్నదే తేలాల్సి ఉంది. మోదీ ఇంటిపేరు వివాదంలో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేయగా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే విధించింది. आज @RahulGandhi जी ने RJD अध्यक्ष @laluprasadrjd जी से उनके दिल्ली स्थित निवास पर मुलाकात की। pic.twitter.com/NMXa4jP8hi — Congress (@INCIndia) August 4, 2023 ఇది కూడా చదవండి: కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి -
Defamation Case: సత్యమే జయిస్తుంది
న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో సుప్రీం తీర్పుతో విపక్ష కూటమి ఇండియాలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. రాహుల్ గాంధీ ఎంపీగా కొనసాగడానికి అవకాశం ఏర్పడడంతో కేరళలో ఆయన నియోజకవర్గం వయనాడ్‌లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టారు. మా నాయకుడు తిరిగి వస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. విద్వేషంపై ప్రేమ సాధించిన విజయమని నాయకులు వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు వెలువడిన కొద్ది సేపటికి రాహుల్ గాంధీ ఏఐసీసీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. సత్యమేవ జయతే అంటూ పార్టీ శ్రేణులు రాహుల్‌కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘నిజమే ఎప్పుడూ గెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపు, లేదంటే ఆ మర్నాడు. నాకు మద్దతుగా ఉన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు. నేను ఎలా ముందుకెళ్లాలో నాకు తెలుసు. నా కర్తవ్యం ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు. నాకు సాయం చేసిన, ప్రేమ పంచిన వారందరికీ నా ధన్యవాదాలు’’ అని రాహుల్ చెప్పారు. అంతకు ముందు ఒక ట్వీట్లో ఏది ఏమైనా తన కర్తవ్యాన్ని తాను వీడనని దేశ సిద్ధాంతాలు, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడమే తన బాధ్యతని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ విజయం రాహుల్ గాంధీది మాత్రమే కాదని, ఈ దేశ ప్రజలది, ప్రజాస్వామ్యానిదని అన్నారు. సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన 24 గంటలు తిరగక ముందే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని, ఇప్పుడు దానిని ఎత్తేయడానికి ఎంత సమయం తీసుకుంటారో చూడాలని వ్యాఖ్యానించారు. ఆ మూడు ఎక్కువ కాలం దాగవు రాహుల్ గాంధీ తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టనుండడంతో సోదరి ప్రియాంక ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఆమె తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గౌతమ బుద్ధుని కొటేషన్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సూర్యుడు, చంద్రుడు, నిజం.. ఈ మూడింటిని ఎక్కువ కాలం దాచలేరు అంటూ గౌతమ బుద్ధుడు చెప్పిన మాటల్ని ట్వీట్లో రాసిన ప్రియాంక సత్యమేవ జయతే అంటూ ముగించారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో రాజకీయ పార్టీలన్నీ సుప్రీం తీర్పుని స్వాగతించాయి. పార్లమెంటులోకి తిరిగి రాహుల్ అడుగు పెట్టే రోజు కోసం చూస్తున్నామని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. న్యాయపోరాటం కొనసాగిస్తా : పూర్ణేశ్ మోదీ రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సుప్రీం కోర్టు తీర్పుని స్వాగతించారు. సుప్రీం తీర్పుని తాము గౌరవిస్తామని, అయితే సెషన్స్ కోర్టులో న్యాయపోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. సోదరుడు రాహుల్‌గాంధీ జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించడం హర్షణీయం. ఈ తీర్పుతో మన న్యాయ వ్యవస్థ మీద , ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ మీద మరింతగా విశ్వాసం పెరిగింది. – ఎం.కె.స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి సుప్రీం కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను. ప్రజా స్వామ్యం, న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని ఈ తీర్పు బలపరుస్తోంది. రాహుల్‌కి, వయనాడ్ ప్రజలకి నా శుభాకాంక్షలు. – ఎ.కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం రాహుల్ గాంధీ మళ్లీ సభలోకి అడుగు పెట్టనుండడం ఎంతో శుభవార్త. దీంతో ఇండియా కూటమి మరింత బలోపేతమవుతుంది. మాతృభూమి కోసం విపక్షాల పోరాటం మరింత ఐక్యంగా సాగి విజయం సాధించి తీరుతాం. – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం -
Defamation Case: మళ్లీ ఎంపీగా రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడానికి కారణమైన 2019 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాం«దీకి భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇచి్చన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా లోక్‌సభ సభ్యత్వం మళ్లీ పొందడానికి రాహుల్‌కు అవకాశం లభించింది. ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ స్పీకర్ స్వయంగా పునరుద్ధరించవచ్చు లేదా సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం సభ్యత్వం తిరిగి పొందడానికి రాహుల్ గాంధీ న్యాయ పోరాటం చేయొచ్చు. ఈ తీర్పుతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి రాహుల్ గాంధీకి ఇక అడ్డంకులు తొలగిపోయినట్లే. ప్రజాజీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి పరువు నష్టం కేసులో తనకు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచి్చన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ తొలుత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పునిచి్చంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన త్రిసభ్య సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ‘‘పరువు నష్టం కేసులో రాహుల్‌కు గరిష్ట శిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఎలాంటి కారణం చూపలేదు. అందుకే దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపివేయాలి. అలాగే ఈ తరహా(పరువుకు నష్టం కలిగించే) వ్యాఖ్యలు మంచివి కావు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రజాజీవితంలో ఉన్నవారు బహిరంగ సభల్లో ఆచితూచి మాట్లాడాలని ప్రజలంతా ఆశిస్తారు’’ అని స్పష్టం చేసింది. రాహుల్‌ను దోషిగా నిర్ధారించడం అనేది కేవలం ఆయనపైనే కాకుండా ఆయనను తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ఓటర్ల హక్కుపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఐపీసీ సెక్షన్ 499(పరువు నష్టం) కింద రాహుల్‌కు గరిష్ట శిక్ష విధించడంపైనా ధర్మాసనం సంశయం వ్యక్తం చేసింది. శిక్షాకాలం ఒక్కరోజు తగ్గినా ఆయనపై ఎంపీగా అనర్హత వేటు పడేది కాదని ఉద్ఘాటించింది. సమాజ వ్యతిరేక వ్యాఖ్యలు కావవి రాహుల్ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపించారు. తన క్లయింట్ కరడుగట్టిన నేరçస్తుడు కాదని చెప్పారు. ఆయనపై బీజేపీ కార్యకర్తలు ఎన్నో కేసులు పెట్టారని, అయినా ఏ ఒక్క కేసులోనూ దోషిగా తేలలేదని గుర్తుచేశారు. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన పూర్ణేష్ మోదీ ఇంటిపేరు అసలు మోదీయే కాదని పేర్కొన్నారు. ఈ విషయం ఆయనే చెప్పారని గుర్తుచేశారు. రాహుల్ వ్యాఖ్యలు సమాజానికి వ్యతిరేకంగా చేసినవి కావని వివరించారు. ఇది అపహరణ, హత్య, అత్యాచారం వంటి నేరం కాదని, అయినప్పటికీ రెండేళ్ల జైలు విక్ష విధించారని ఆక్షేపించారు. రాహుల్ నిర్దోíÙగా విడుదల కావడానికి, పార్లమెంట్‌కు హాజరు కావడానికి, వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇదే చివరి అవకాశమని అన్నారు. ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీ తరఫున సీనియర్ అడ్వొకేట్ మహేష్ జెఠ్మలానీ వాదించారు. రాహుల్ తప్పు చేశారనడానికి చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం చివరకు రాహుల్‌కు విధించిన జైలు శిక్షపై స్టే వి«ధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏమిటీ కేసు? 2019 ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘దొంగలందరి ఇంటి పేరు మోదీ అని ఎందుకుంటుంది?’’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌పై క్రిమినల్, పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు 2023 మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేలి్చంది. రెండేళ్లపాటు జైలు శిక్ష విధించింది. మరుసటి రోజే రాహుల్‌పై లోక్‌సభ స్పీకర్ అనర్హత వేటు వేశారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది. మాజీ ఎంపీగా మారారు. అంతేకాకుండా ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి, బయటకు వెళ్లిపోవాల్సి వచి్చంది. ఇప్పుడేం జరుగుతుంది? పరువు నష్టం కేసులో రాహుల్ గాం«దీకి సుప్రీంకోర్టు ఊరట కలిగించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారన్న దానిపై చర్చ ప్రారంభమైంది. అధికారిక ప్రక్రియ ప్రకారం.. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటే రాహుల్ తొలుత లోక్‌సభ సెక్రటేరియట్‌కు విజ్ఞాపన పత్రం సమరి్పంచాల్సి ఉంటుంది. రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచి్చందని తెలియజేయాలి. సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని అభ్యరి్థంచాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వు కాపీని కూడా సమరి్పంచాలి. అన్నీ సక్రమంగా ఉన్నట్లు భావిస్తే సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్లు లోక్‌సభ సెకట్రేరియట్ ఒక అధికారిక ప్రకటన జారీ చేస్తుంది. ఇటీవల నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ) ఎంపీ మొహమ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి రెండు నెలలు పట్టడం గమనార్హం. కోలార్ నుంచి కోర్టుల వరకు.. నాలుగేళ్ల క్రితం కర్ణాటక ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారమే సృష్టించి చివరికి ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల దగ్గర్నుంచి అత్యున్నత న్యాయస్థానం తీర్పు వరకు పరిణామ క్రమాన్ని చూద్దాం. ఏప్రిల్ 12, 2019: కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దొంగలందరికీ ఇంటి పేరు మో దీయే ఎందుకు ఉంటుంది ? నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 15, 2019: గుజరాత్ సూరత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. జూలై 7, 2019: సూరత్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట రాహుల్ గాంధీ మొదటిసారిగా హాజరయ్యారు. మార్చి 23, 2023: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ కోర్టు ఆయనకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రాహుల్ అప్పీలు చేసుకోవడానికి వీలుగా నెల రోజుల పాటు తీర్పుని సస్పెండ్ చేసింది. మార్చి 24, 2023: ఒక క్రిమినల్ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పార్లమెంటు సభ్యుడిగా ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం ఒక నోటీసు జారీ చేసింది. ఏప్రిల్ 3 2023: మెట్రోపాలిటన్ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ రాహుల్ సూరత్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. తీర్పుపై స్టే విధించాలని కోరారు ఏప్రిల్ 20, 2023: తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సెషన్స్ కోర్టు రాహుల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఏప్రిల్ 25, 2023: రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించారు. తన శిక్షను నిలుపదల చేయాలని పిటిషన్ వేశారు. జూలై 7, 2023: గుజరాత్ హైకోర్టులో రాహుల్‌కి ఎదురు దెబ్బ తగిలింది. శిక్షపై స్టే విధించడానికి నిరాకరించిన కోర్టు రాహుల్ పిటిషన్‌ను తిరస్కరించింది. జూలై 15, 2023: హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకెక్కారు. జూలై 21, 2023: ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 4, 2023: రాహుల్‌కి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో కింద కోర్టు గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్షని విధించడానికి కారణాలు కనిపించలేదని వ్యాఖ్యానించింది. సుప్రీం తీర్పుతో రాహుల్ పార్లమెంటు సభ్యత్వం తిరిగి పొందడానికి ఆస్కారం ఏర్పడింది. -
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట
న్యూఢిల్లీ: మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రెండేళ్ల జైలు శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో రాహుల్‌పై లోక్‌సభ అనర్హత వేటు తొలగిపోయే అవకాశం ఉంది. కాగా కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్‌సభలో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్ కోర్టు విధించిన శిక్షపై రాహుల్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట దక్కపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను నిర్దోషినని. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. Why Supreme Court stayed conviction of Rahul Gandhi in criminal defamation case for his remark on Modi surname#RahulGandhi #SupremeCourtofIndia Read more here: https://t.co/FZbhIigF8k pic.twitter.com/rodF2N462z — Bar & Bench (@barandbench) August 4, 2023 ఈ పిటిషన్‌పై జస్టిస్‌లు బీఆర్ గవాయి,పీఎస్ నరసింహ, సంజయ్‌కుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రాహుల్ తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. పరువు నష్టం కేసి వేసిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు ‘మోదీ కాదని, ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారని కోర్టుకు తెలిపారు. రాహుల్ గాంధీ నిర్ధోషిగా నిరూపించుకునేందుకు ఇది ఆఖరి అవకాశమని తెలిపారు. పార్లమెంటుకు హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్న వ్యక్తులలో ఒక్కరు కూడా తనపై దావా వేయలేదని పేర్కొన్నారు. కేసు వేసింది కేవలం బీజేపీ నేతలేనని పేర్కొన్నారు. గతంలోనూ ఆయనపై అనేక కేసులు వేసినప్పటికీ.. ఏ కేసులోనూ శిక్ష పడలేదని తెలిపారు. గాంధీ కరుడు గట్టిన నేరస్థుడు కాదని, ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి కాదంటూ రెండేళ్ల జైలు శిక్ష ఎలా విధిస్తారని వాదించారు. చదవండి: హర్యానా ఘర్షణలు.. నుహ్ జిల్లాలో బుల్డోజర్ చర్యకు దిగిన ప్రభుత్వం రెండేళ్ల శిక్షకు కారణాలను ట్రయల్ కోర్టు చెప్పలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. పరువు నష్టం కేసు తీవ్రమైంది కాదని, బెయిల్ ఇచ్చే కేసని తెలిపింది. రాహుల్‌ను ఎన్నుకున్న ప్రజలతోపాటు.. ఆయన రాజకీయ జీవితంపైనా ప్రభావం పడుతుందని వెల్లడించింది. ఈ అంశాలన్నీ మేం పరిగణలోకి తీసుకొని ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేస్తున్నామని తెలిపింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో రాహుల్ జాగ్రత్తగా మాట్లాడాలని సుప్రీంకోర్టు సూచించింది. #WATCH | Congress MP Adhir Ranjan Chowdhury raises slogans of victory as Supreme Court stays Rahul Gandhi's conviction in 'Modi' surname remark case pic.twitter.com/oamHnEEgl2— ANI (@ANI) August 4, 2023 మరోవైపు సుప్రీంకోర్టుతో తీర్పుతో సోమవారం నుంచి రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని అభిషేక్ సింఘ్వీ తెలిపారు. స్టే వెంటనే అమలవుతోందని, రాహుల్ అనర్హతను లోక్ సభ సెక్రటేరియట్ తొలగించాల్సి ఉంటుందన్నారు. -
జనసేనానిపై మహిళల న్యాయపోరాటం
-
ఇవాళ కోర్టులో పవన్ పై డిఫమేషన్ కేసు విచారణ
-
‘పవన్ మానసికంగా వేధించాడు’
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మహిళా వలంటీర్.. విజయవాడ సివిల్ కోర్టులో పవన్‌పై డిఫమేషన్ కేసు వేశారు. కాగా, వలంటీర్ ఇచ్చిన కేసును న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఈ సందర్బంగా తమపై పవన్ అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైనట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని మహిళా వలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ కేసుపై మహిళా వలంటీర్ తరఫున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాఫికింగ్ ఆధారాలు కోర్టుకు ఇవ్వాలి.. అనంతరం.. న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ.. ‘బాధితురాలు పవన్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురైంది. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్‌కు కోర్టు నోటీసులు ఇస్తుంది. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు కోర్టు తీసుకుంటుంది. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి. వలంటీర్లలో అధిక శాతం మహిళలు ఉన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్‌కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్‌కు చెప్పి ఉంటే ఆ ఆధారాలు కోర్టుకు వెల్లడించాలి. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదు. పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉంది. పవన్ వెనుక ఎవరున్నారో స్పష్టం చేయాలి. అబద్ధపు వదంతులు, వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టి వలంటీర్లపై తిరగబడేలా వ్యాఖ్యలు చేసిన పవన్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరాం’ అని తెలిపారు. పవన్ వ్యాఖ్యలు బాధించాయి.. ఈ సందర్బంగా మహిళా వలంటీర్ మాట్లాడుతూ.. పవన్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాం. పవన్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఆయన తప్పుడు ఆరోపణలు చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు అవాస్తవం. నేను భర్త చనిపోయి పిల్లలతో జీవిస్తున్నాను. పవన్ వ్యాఖ్యల తర్వాత నన్ను చుట్టుపక్కల వారు ప్రశ్నించారు. ట్రాఫికింగ్ అంశాలపై కొందరు నన్ను ప్రశ్నించారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న మాపై నిందలు వేసి పవన్ తప్పు చేశారు. పవన్‌ను చట్టపరంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: ‘పేదల ఇళ్లకు చంద్రబాబు, దత్తపుత్రుడు అడుగడుగునా అడ్డుపడ్డారు’ -
మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల కేసు
న్యూఢిల్లీ: మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో తనకి పడిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయడానికి నిరాకరించిన హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ కేసులో ప్రతివాదులైన గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలను నోటీసులు పంపింది. దీనిపై రెండు వారాల్లోగా స్పందించాలని ఆదేశించిన జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ పి.కె. మిశ్రాలతో కూడిన సుప్రీం బెంచ్ తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. రాహుల్ గాంధీ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వి గత 111 రోజులుగా రాహుల్ ఎంతో వ్యధ అనుభవిస్తున్నారని, ఇప్పటికే ఒక పార్లమెంట్ సెషన్‌కు దూరమయ్యారని కోర్టుకు చెప్పారు. రాహుల్ గాం«దీపై అనర్హత వేటు పడడంతో ఎంపీగా ఆయన కోల్పోయిన వయనాడ్ నియోజకవర్గం ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా రావచ్చునని, అందుకే త్వరితగతిన ఈ కేసుని విచారించాలని కోరారు. -
చేతలు తక్కువ.. మాటలు ఎక్కువ
-
పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటీషన్
-
రాహుల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీం ఓకే
సాక్షి, ఢిల్లీ: పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ నెల 21న విచారణ చేపడతామని మంగళవారం రాహుల్ గాంధీ తరపున న్యాయవాదికి సీజేఐ బెంచ్ స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో నిర్వహించిన ర్యాలీలో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకుగానూ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ ఈశ్వర్‌బాయ్ మోదీ సూరత్‌కోర్టులో దావా వేశారు. ఈ ఏడాది మార్చిలో ఆయన్ని దోషిగా తేలుస్తూ తీర్పు వెలువడగా.. ఆపై శిక్ష రద్దు/స్టే కోరుతూ సెషన్స్ కోర్టుకు వెళ్లారు. కానీ, కోర్టు అందుకు అంగీకరించలేదు. దీంతో.. గుజరాత్ హైకోర్టుకు వెళ్లగా.. జులై 7వ తేదీన హైకోర్టు ఆయనకు ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది. ఇక చివరగా.. గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఒకవేళ శిక్ష గనుక రద్దు అయితే.. ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయ్యే ఛాన్స్ ఉంది. లేకుంటే ఆరేళ్ల దాకా ఆయన ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాం«దీకి ఎదురు దెబ్బ తగిలింది. గుజరాత్లో కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ శుక్రవారం తోసిపుచ్చారు. ఆ శిక్షను నిలుపుదల చేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని అన్నారు. ‘‘రాహుల్ గాం«దీపై 10కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పరువు నష్టం కేసులో రాహుల్ గాం«దీకి కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేయడానికి తగిన కారణాలు ఏమీ లేవు’’అని జస్టిస్ హేమంత్ వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు రాహుల్ గాం«దీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. రాహుల్ గొంతు నొక్కేయడానికి కొత్త టెక్నిక్కులు : కాంగ్రెస్ గుజరాత్ హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాహుల్ అన్నీ నిజాలు మాట్లాడుతూ ఉండడంతో ఆయన గొంతు నొక్కేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నిక్కులు ఉపయోగిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. గుజరాత్ హైకోర్టు రాహుల్ పిటిషన్‌ను కొట్టేయడం తీవ్ర అసంతృప్తికి లోను చేసిందని, కానీ తాము ఊహించిన తీర్పే వచి్చందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీ రాజకీయ కుట్రలకు ఎవరూ భయపడడం లేదన్నారు. పార్లమెంటులో రాహుల్ గొంతు నొక్కేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించిన ఖర్గే రాహుల్ గాంధీ న్యాయం కోసం , నిజం కోసం తన పోరాటం కొనసాగిస్తారని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఇలాంటి తీర్పు రావడం పట్ల తమకు ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాత్ వంటి రాష్ట్రం నుంచి న్యాయం జరుగుతుందని మేము ఎలా భావిస్తాం. ఈ తీర్పులు రాసేవారు, కోర్టుల్లో పిటిషన్లు వేసేవారంతా ఒక్కటి గుర్తు ఉంచుకోవాలి. రాహుల్ లాంటి నాయకుడిని ఏ తీర్పులు , అనర్హత వేటులు ఆపలేవు’’అని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకం చేసే మిషన్ నుంచి రాహుల్‌ని అడ్డుకునే శక్తి దేనికీ లేదన్నారు. పరువు తీయడం కాంగ్రెస్‌కు అలవాటే: బీజేపీ గుజరాత్ హైకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతించింది. ఇతరుల పరువు తీయడం , వారిని దూషించడం కాంగ్రెస్‌కు తరతరాలుగా వస్తున్న ఒక అలవాటేనని ఆరోపించింది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై క్షమాపణ కోరడానికి రాహుల్ నిరాకరించడం ఆయనకున్న అహంకారాన్ని సూచిస్తుందని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ఇలాగే ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. రాహుల్ గాం«దీకి విధించిన శిక్ష అత్యంత కఠినమైనదని అంటున్న వారంతా అంత కఠినమైన నేరాన్ని ఆయన ఎందుకు చేశారో సమాధానం ఇవ్వాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. -
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
-
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురయింది. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వడానికి తగిన కారణాలు కనిపించలేదని హైకోర్టు పేర్కొంది. "దొంగలందరి ఇంటిపేరు మోదీయే" అంటూ వ్యాఖ్యానించిన కేసులో తనకు శిక్ష నిలుపుదల చేయాలని రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించగా, ఈ తీర్పును రాహుల్.. హైకోర్టులో సవాలు చేశారు. మే 2న విచారణ పూర్తి చేసిన గుజరాత్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగానే ఉందన్న జడ్జి.. రాహుల్ పిటిషన్‌ను కొట్టేశారు. సావర్కర్‌ను కించపరిచారని ఆయన మనవడు వేసిన పిటిషన్‌ను ప్రస్తావించిన న్యాయస్థానం.. రాహుల్‌పై 10 పరువు నష్టం కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. ‘దొంగలందరి ఇంటిపేరు మోదీయే’ ఎందుకంటూ.. ప్రశ్నించారు. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో రెండోసారి కూడా కాంగ్రెస్సేనా?.. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తం చేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావావేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తన వాదనను వినిపించారు. విచారణ అనంతరం కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న ఆయనను దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసులో నేడు గుజరాత్ హైకోర్టు తీర్పు
-
పరువునష్టం దావా.. రాజస్థాన్ సీఎంకు సమన్లు
సాక్షి, ఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ సమన్లలో పేర్కొంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గెహ్లాట్‌పై వేసిన పరువు నష్టం దావా ఆధారంగా ఈ సమన్లు జారీ అయ్యాయి. సుమారు 900 కోట్ల రూపాయలకు సంబంధించి గెహ్లాట్ చేసిన ఆరోపణలకుగానూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ దావా వేశారు. సంజీవని స్కామ్‌పై చేసిన వ్యాఖ్యలతో గెహ్లాట్ తన పరువు తీశారంటూ కోర్టుకెక్కారు కేంద్ర మంత్రి. అయితే.. నేరపూరిత పరువు నష్టం కేసులో సీఎంకు సమన్లు పంపాలా? వద్దా? అని తర్జనభర్జనలు చేసి.. ఆ ఉత్తర్వులను ఇదివరకే రిజర్వ్ చేసింది కోర్టు. ఇక ఇవాళ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ హజ్రీత్ సింగ్ జస్పాల్ ఇవాళ సీఎం గెహ్లాట్‌కు సమన్లు జారీ చేశారు. ఇంతకు ముందు మోదీ ఇంటి పేరు వ్యవహారంలో పరువు నష్టం దావా ద్వారా కోర్టు కేసు ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దోషిగా తేలి రెండేళ్ల శిక్ష పడడంతో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: కాళ్లు కడిగి మరీ క్షమాపణలు కోరిన సీఎం -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు గాందీకి ఊరట.. ‘చర్యలు వద్దు’
రాంచీ: గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరు వ్యవహారంలో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట కలిగించింది. ఈ కేసు విచారణ కోసం వ్యక్తిగతంగా రాంచీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మినహాయింపు ఇచి్చంది. ప్రస్తుతానికి రాహుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే ద్వివేదీ ఆదేశాలు జారీ చేశారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ రాంచీ ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ఇచి్చన ఉత్తర్వును సవాలు చేస్తూ రాహుల్ వేసిన పిటిషన్‌పై జార్ఖండ్ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. 2019 ఏప్రిల్‌లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రదీప్ మోదీ అనే వ్యక్తి రాంచీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. -
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ కీలక నేతలకు సమన్లు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ కీలక నేతలకు మరో షాక్ తలిగింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో బుధవారం కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు సైతం సమన్లు జారీ అయిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓ పేపర్ ప్రకటనే ఇందుకు కారణమైంది. మే 5వ తేదీన పబ్లిష్ అయిన పత్రికల్లో కాంగ్రెస్ పార్టీ ఓ యాడ్ ఇచ్చింది. బీజేపీని 40 శాతం అవినీతి పార్టీగా ఎద్దేవా చేస్తూ.. అందులో గత నాలుగేళ్లలో బీజేపీ లక్షన్నర కోట్ల డబ్బు దోచుకుందని ఆరోపించింది. ఈ ప్రకటన ఆధారంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేశవప్రసాద్ మే 9వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్.. రాహుల్ గాంధీతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు సైతం సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చేసిన మోదీ వ్యాఖ్యలు.. పరువు నష్టం దావాకి దారి తీయగా, ఈ ఏడాది మొదట్లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ఆ శిక్ష కారణంగానే ఆయన తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది కూడా. ఇదీ చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీం! -
Imran Khan: నా పరువు పోయింది.. పరిహారం కట్టండి!
ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ భారీ పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోకు ఈ మేరకు నోటీసులు సైతం పంపించారు. గత నెల జరిగిన తన అరెస్ట్ వల్ల తన ప్రతిష్ఠ తీవ్ర భంగం వాటిల్లిందని, అందుకుగానూ 1,500 కోట్ల రూపాయలు(పాకిస్తానీ రూపీ) చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారాయన. తన అరెస్ట్ వారెంట్ ప్రభుత్వ సెలవు రోజున జారీ అయిందని, దానిని ఎనిమిది రోజుల పాటు రహస్యంగా ఉంచారని, ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో విచారణను మార్చుతున్నట్లుగా తనకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తనను అరెస్ట్ చేయడానికి పాకిస్థాన్ రేంజర్లను ఉపయోగించారని తెలిపారు. అరెస్ట్ వారెంట్ అమలు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు పేర్కొన్నదని గుర్తు చేశారు. ఎన్ఏబీ చైర్మన్‌కు నోటీసులు పంపించారాయన. ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో నా అరెస్ట్ నా ప్రతిష్ఠకు భంగం కలిగించడమే. నేను అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యానని ప్రపంచానికి చూపించాలనుకున్నారు. ప్రతీ ఏడాది నా చారిటీ కోసం పది బిలియన్ల పాకిస్థానీ రూపాయల్ని విరాళంగా అందుకుంటున్నా. కానీ, ఏనాడూ నా నిజాయతీపై ఎప్పుడూ ప్రశ్న ఎదురు కాలేదు. అయితే ఈ మధ్య జరిగిన నా అరెస్ట్.. బోగస్. దాని వల్ల నా ప్రతిష్ఠకు భంగం వాటిల్లింది. నా హక్కుల్లో భాగంగా పరువు నష్టం దావా ప్రక్రియను ప్రారంభించా అని ఒక ప్రకటన విడుదల చేశారాయన. -
బీబీసీపై రూ.10 వేల కోట్ల పరువు నష్టం కేసు
న్యూఢిల్లీ: ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంట్ రూపొందించిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)పై ఓ ప్రభుత్వేతర సంస్థ ఢిల్లీ హైకోర్టులో రూ.10 వేల కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ డాక్యుమెంట్లో ప్రధాని మోదీ, భారత న్యాయవ్యవస్థపై తప్పుడు ఆరోపణలతో బీబీసీ భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపించింది. గుజరాత్‌కు చెందిన జస్టిస్ ఆన్ ట్రయల్ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. బీబీసీ (యూకే)తోపాటు బీబీసీ(ఇండియా)కు సమన్లు ఇచ్చింది. సెప్టెంబర్ 25న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. పిటిషన్‌దారు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. నష్ట పరిహారంతోపాటు తమ సంస్థకు ఇతర ఆదాయ మార్గాలు లేనందున కోర్టు ఫీజులు తదితరాల కోసం రూ.10 వేల కోట్లు చెల్లించాలని కోరారు. -
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. యూట్యూబర్‌పై మంత్రి కన్నెర్ర
సాక్షి,చైన్నె: యూట్యూబర్ ఎస్ శంకర్‌పై విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ కన్నెర్ర చేశారు. ఆయనపై ఏకంగా నాలుగు పరువు నష్టం దావాలను సోమవారం సైదాపేట కోర్టులో దాఖలు చేశారు. శంకర్ తనకు వ్యతిరేకంగా పదే పదే వీడియోలను విడుదల చేస్తూ వస్తున్నారని ఆ పిటిషన్లలో మంత్రి వివరించారు. మహారాష్ట్ర తరహాలో తమిళనాడులో ప్రభుత్వాన్ని కూల్చేందుకు తానేదో కుట్ర చేస్తున్నట్లుగా శంకర్ ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నా రు. అలాగే, తాను టాస్మాక్బార్లను నిర్వహిస్తున్నట్లు ఆరోపించారని తెలిపారు. ఆధార రహిత ఆరోపణలు చేయడమే కాకుండా డీఎంకే అధిష్టానం తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తప్పుడు సమాచారం ప్రజలకు అందజేస్తూ వస్తున్నాడని వివరించారు. తన పేరుకు, పరు వుకు కలంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ మేరకు కోర్టును కోరారు. -
మల్లికార్జున ఖర్గేకు షాక్.. పంజాబ్ కోర్టు సమన్లు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో జులై 10 న న్యాయస్థానం ముందు హాజరు కావాలని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బజరంగ్ దళ్ సంస్థను నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడంతో వివాదానికి దారితీసింది. దీనిపై బజరంగ్ దళ్ కోర్టును ఆశ్రయించింది. విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ ఫౌండర్ హితేష్ భరద్వాజ్ సంగ్రూర్ కోర్టులో పిటిషన్ కేసు దాఖలు చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా భజరంగ్‌దళ్‌ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఖర్గేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు. దీనిపై సినీయర్ డివిజన్ బెంజ్ విచారణ చేపట్టింది. మల్లికార్జున ఖర్గేను జులై 10 న కోర్టుకు హాజరు కావాలని సివిల్ జడ్జి రమణదీప్ కౌర్ ఏఐసీసీ అధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భజరంగ్ దళ్‌ను దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని భరద్వాజ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే ఆ సంస్థను నిషేధిస్తామని కూడా హామీ ఇచ్చిందని తెలిపారు. చదవండి: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు -
Annamalai: డీఎంకే ఫైల్స్‌తో చిక్కుల్లో బీజేపీ చీఫ్
చెన్నై: బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనున్నాడు. డీఎంకే ఫైల్స్‌తో రాజకీయ కాక రేపుతున్న ఆయన్ని కోర్టుకు లాగబోతోంది తమిళనాడు సర్కార్. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరువుకు భంగం కలిగించే విధంగా అన్నామలై యత్నిస్తున్నారంటూ ఆరోపణలకు దిగిన ప్రభుత్వం.. ఈ మేరకు ఇవాళ అన్నామలై మీద పరువు నష్టం దావా కూడా వేసింది. చెన్నై మెట్రో కాంట్రాక్ట్ కోసం 2011లో 200 కోట్ల ముడుపులను ఎంకే స్టాలిన్ అందుకున్నారంటూ.. అన్నామలై సంచలన ఆరోపణలకు దిగాడు. అంతేకాదు.. డీఎంకే నేతల ఆస్తుల విలువ 1.34 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని, అదంతా అవినీతి సొమ్మని, పైగా దుబాయ్‌కు చెందిన ఓ కంపెనీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా.. ఆ కంపెనీలో స్టాలిన్ కుటుంబ సభ్యులు రహస్య డైరెక్టర్లుగా ఉన్నారంటూ వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో డీఎంకే లీగల్ నోటీసులు కూడా పంపింది. అయినా ఆయన తగ్గట్లేదు. తమిళనాడు రాజకీయాలను డీఎంకే ఫైల్స్ పేరుతో అన్నామలై చేస్తున్న సోషల్ మీడియాలో పోస్టులు వేడెక్కిస్తున్నాయి. అందులోభాగంగా.. ఆర్థిక మంత్రి పళనివేళ్ థైగరాజన్ పేరిట విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్ తమిళనాట పెను సంచలనంగా మారింది. స్వయానా సీఎం స్టాలిన్ తనయుడు, ఆయన అల్లుడు సబరీసన్‌లు ఏడాదికి 30 వేల కోట్లను అవినీతి మార్గంలో సంపాదించారంటూ అందులో పళనివేళ్.. వేరేవరికో చెబుతున్నట్లు ఉంది. అంతేకాదు ఐదు రోజులు గ్యాప్‌తో పళనివేళ్‌కు సంబంధించిన మరో ట్విటర్ ఆడియో క్లిప్‌ను సైతం విడుదల చేశాడు అన్నామలై. అయితే పళనివేళ్ సహా డీఎంకే నేతలంతా ఆ క్లిప్ ఎడిట్ చేసిందంటూ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ క్రమంలో విమర్శలతో పేట్రేగిపోతున్న అన్నామలై నోటికి తాళం వేయాలని డీఎంకే సర్కార్ భావించింది. అందుకే పరువు నష్టం దావా వేసింది. Listen to the DMK ecosystem crumbling from within. The 2nd tape of TN State FM Thiru @ptrmadurai. Special Thanks to TN FM for drawing a proper distinction between DMK & BJP! #DMKFiles pic.twitter.com/FUEht61RVa — K.Annamalai (@annamalai_k) April 25, 2023 డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎళన్‌గోవన్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏ తప్పు చేయకున్నా అనర్హత వేటు ఎదుర్కొంటున్నారు. అలాంటిది అన్నామలై లాంటి వాళ్లు అంతలా చేస్తున్నప్పుడు.. వాళ్ల మీద దావా వేయడానికి కారణం సరిపోతుంది కదా. అన్నామలైను శిక్షించేందుకు ఇదే మంచి సమయం అంటూ పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. డీఎంకే లీగల్ నోటీసులు పంపినా కూడా క్షమాణలు చెప్పడానికి అన్నామలై నిరాకరిస్తున్నారు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని చెప్తున్నాడు. ఏప్రిల్ 14వ లేతఅన డీఎంకే నేతల ఆస్తులని పేర్కొంటూ ఓ పెద్ద లిస్ట్‌ను విడుదల చేశౠరాయన. అందులో స్టాలిన్ తనయుడు.. క్రీడా శాఖ మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్‌తో పాటు మరికొందరు మంత్రుల పేర్లు సైతం ఉన్నాయి. అయితే డీఎంకే ఇదంతా జోక్‌గా కొట్టిపారేసింది. ఇదీ చదవండి: త్వరలో చిన్నమ్మతో భేటీ -
కర్నాటకలో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలకు షాకిచ్చిన బీజేపీ
బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. రేపు(బుధవారం) అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. ఇక, ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జాతీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ప్రచారంలో అధికార బీజేపీపై కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ స్థానిక, జాతీయ పత్రికల్లో ‘అవినీతి రేటు కార్డు’ అంటూ ప్రకటనలు ఇచ్చింది. దీంతో, ఈ విషయాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. దీనికి సంబంధించిన ఆధారాలను చూపించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సిద్ద రామయ్య, డీకే శివ కుమార్‌కు బీజేపీ.. క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేసింది. అయితే, మే 5వ తేదీన పలు దినపత్రికల్లో బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు(40 శాతం కమీషన్ సర్కార్) చేస్తూ కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చింది. అలాగే, బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ప్రజల నుండి రూ. 1,50,000 కోట్లకు పైగా దోచుకుంది అని తెలిపారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ.. ముగ్గురు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ, ప్రకటనలను ఉపసంహరించుకోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా కాంగ్రెస్ నాయకులపై క్రిమినల్ పరువు నష్టం వేసింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ప్రకటనలపై బీజేపీ నేత ఓం పాఠక్.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రకటనలు తమ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఓటర్లను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఫైరయ్యారు. ఈ ప్రకటనలకు సంబంధించి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. BJP files defamation case against Rahul Gandhi, Shivakumar, Siddaramaiah over 'corruption rate card' ads. (@nabilajamal_ )#News #Karnataka #ITVideo pic.twitter.com/k4AF0xS2EQ — IndiaToday (@IndiaToday) May 9, 2023 ఇది కూడా చదవండి: మీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి -
గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్‌కు నిరాశే!
గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్‌కు నిరాశే! -
గుజరాత్ హైకోర్టులో రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. తుది తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు వేసవి సెలవుల అనంతరం(జూన్ 4 తర్వాత) ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. దీంతో పరువు నష్టం కేసులో హైకోర్టు ఆర్డర్ వచ్చే వరకు తన శిక్షపై స్టే విధించాలని రాహుల్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాగా 2019 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీ దోషిగా తేలడంతో సూరత్ కోర్టు రేండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అలాగే దీన్ని పైకోర్టులో సవాల్ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇస్తూ అప్పటి వరకు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్‌పై ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. అయితే ట్రయల్ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందంటూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును.. రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ రాహుల్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ ముంజూరు చేసింది. అనంతరం ఏప్రిల్ 20న రాహుల్ అభ్యర్థనను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇదే కేసులో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గత బుధవారం గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ గీతా గోపి ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవడంతో జస్టిస్ హేమంత్ ప్రచ్చక్‌కి విచారణను అప్పగించారు. చదవండి: నేను రాహుల్ అభిమానిని..కాంగ్రెస్ ర్యాలీలో కన్నడ సూపర్ స్టార్ -
మోదీ ఇంటి పేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట..
పట్నా: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట లభించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ.. 2019లో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు రాహల్‌ను ఏప్రిల్ 12న కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. అయితే తాను సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసే పనిలో ఉన్నానని, కోర్టుకు హాజరుకాలేనని రాహుల్ చెప్పారు. దీంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. ఏప్రిల్ 25న హాజరుకావాలని చెప్పింది. అయితే మోదీ ఇంటిపేరు కేసుకు సంబంధించి ఇప్పటికే సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దీంతో ఓకే కేసుకుసంబంధించి రెండు కోర్టుల్లో విచారణ జరగడం చట్టవిరుద్ధమని, సుషీల్ మోదీ పిటిషన్‌ను కొట్టివేయాలని రాహుల్ పట్నా హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం మే 15 వరకు దిగువ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. కాగా.. 2019లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. దేశంలో దొంగల ఇంటి పేరు మోదీ అనే ఎందుకు ఉందని రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సూరత్ కోర్టులో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పరువునష్టం పిటిషన్ వేశారు. రాహుల్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం రాహుల్ ఎంపీ పదవి కూడా పోయింది. ఆయనపై లోక్‌సభ సెక్రెటేరియెట్ అనర్హత వేటు వేసింది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను కూడా ఖాళీ చేయించింది. చదవండి: కమెడియన్ మునావర్ ఫరూకీకి ఊరట.. ఇండోర్‌కు అన్ని కేసులు బదిలీ -
మహేష్ మూర్తిపై రూ.800 కోట్ల పరువు నష్టం దావా వేసిన అంకితి బోస్!
సింగపూర్ ఫ్యాషన్ టెక్నాలజీ కంపెనీ జిలింగో కో-ఫౌండర్, మాజీ సీఈవో అంకితి బోస్ మరోసారి తెరపైకి వచ్చారు. ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్, సీడెడ్ ఫండ్ సంస్థ కోఫౌండర్ మహేష్ మూర్తిపై రూ.800 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మార్చి 1,2023న ఓ బిజినెస్ మ్యాగజైన్లో మహేష్ మూర్తి ఓ కథనం రాశారు. అయితే ఆ కథనంలో తన పేరును ప్రస్తావించినందుకు గాను మహేష్ మూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంకితి బోస్ న్యాయ సంస్థ సింఘానియా అండ్ కో ఎల్ఎల్పీ ఆధ్వర్యంలో బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. పలు నివేదికల ఆధారంగా వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ఆధారంగా..పరువు నష్టం దావా కేసులో మూడేళ్లుగా స్టార్టప్‌లపై మహేష్ మూర్తి తీరును తప్పుబడుతూ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20న నమోదైన ఈ డిఫర్మేషన్ కేసు (పరువు దావా నష్టం) లో అంకితి బోస్ పిటిషనరేనని తేలింది. మహేష్ మూర్తి కథనం ఏం చెబుతోంది? మహేష్ మూర్తి రాసిన బిజినెస్ మ్యాగజైన్లో పేరు కంపెనీ, సీఈవో పేరు ప్రస్తావించకుండా ‘ఒక మహిళ (అంకితి బోస్) ప్రముఖ ఫ్యాషన్ పోర్టల్ (జిలింగో)ను నడుపుతుంది. జిలింగోలో పెట్టుబడిదారులైన సీక్వోయా క్యాపిటల్ నిధుల్ని దుర్వినియోగం చేశారు. న్యాయపరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందేలా ఆమె తన లాయర్లకు రూ. 70 కోట్లు ఫీజుగా చెల్లించేందుకు సంస్థ నిధుల్ని వినియోగించారని తెలిసింది. అంతేకాదు తానొక గ్లామరస్ సీఈవోగా ప్రపంచానికి తెలిసేలా ఓ పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రాజెక్ట్‌లో భాగంగా ఆమె సదరు పీఆర్ సంస్థకు సంవత్సరానికి రూ.10 కోట్లు చెల్లించారు. ఆ నిధులు సైతం జిలింగో నుంచి పొందారని తెలిపారు. బోస్ స్పందన మహేష్ మూర్తి రాసిన కథనంపై అంకితి బోస్ స్పందించారు. ఆ ఆర్టికల్‌లో 'అబద్ధాలు, వక్రీకరణలు, విషపూరిత వాదనలు' ఉన్నాయి. పబ్లిక్ డొమైన్లలో బాధ్యతాయుతంగా ఉండాలి. మహిళా వ్యవస్థాపకుల శక్తి సామార్ధ్యాలతో వారి సాధించాలనుకున్న లక్ష్యాల్ని నిరోధించేలా, లైంగిక ధోరణిలు ప్రతిభింభించేలా ఉన్నాయని ఆమె అన్నారు. నిధుల దుర్వినియోగం బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం..8 దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం..500మంది ఉద్యోగులు.. రూ7వేల కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు..ఇవన్నీ సాధించింది ఏ తలపండిన వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే! భారత్‌కు చెందిన 23 ఏళ్ల యువతి అంకితి బోస్. చిన్న వయసులోనే దేశం కానీ దేశంలో జిలింగో సంస్థను ఏర్పాటు చేసి ఇంతింతై వటుడింతై అన్న చందనా..ఆ సంస్థను ముందుండి నడిపించారు. కానీ గత ఏడాది రేపోమాపో యూనికార్న్ హోదా దక్కించుకోబోతున్న జిలింగో స్టార్టప్ పునాదులు కదిలిపోయాయి. నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో అవమానకర రీతిలో సంస్థ నుంచి బయటకు వచ్చారు. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్! -
రాహుల్ గాంధీ పిటిషన్ ను కొట్టేసిన సూరత్ సెషన్స్ కోర్టు
-
పరువునష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేత
గుజరాత్ కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ సెషన్స్ గురువారం కోర్టు కొట్టివేసింది. దీంతో ఇదే కేసులో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. కాగా 2019 కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని, రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసు కాదంటూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్టకు నష్టంం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్ పిటిషన్‌పై గత గురువారం వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మొగేరా.. తీర్పును నేటికి రిజర్వు చేశారు. తాజాగా రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలన్న రాహుల్ అభ్యర్థనను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. చదవండి: భారీగా నమోదైన కోవిడ్ మరణాలు.. ఒక్క కేరళలోనే 11 మంది మృతి రాహుల్‌పై నమోదైన కేసు ఏంటి? 2019 ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ మాట్లాడుతూ.. ‘దొంగలంతా మోదీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారు?’ అని అన్నారు. ఈ మేరకు నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ అంటూ పలు పేర్లను ఉదహరించారు. దీనిపై సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్‌పై పరువు నష్టం కేసు వేయగా.. గత నెలలో సూరత్ దిగువ కోర్టు విచారణ జరిపి దోషిగా నిర్ధారించింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ, పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. ఈ తీర్పు వెలువరించిన మరుసటి రోజే రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని లోక్ సభ సచివాలయం రద్దుచేసింది. చదవండి: అతీక్ హత్య కేసులో ఐదుగురు పోలీసుల సస్పెన్షన్ -
Defamation Case: రాహుల్‌కి పరువు నష్టం కేసులో ఉపశమనం!
ఓ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని భివండీ కోర్టు ఉపశమనం కల్పించింది. ఈ మేరకు భివండీ కోర్టు రాహుల్‌కి విచారణకు హాజరుకాకుండా ఉండేలా శాశ్వత మినహాయింపు ఇచ్చింది. రాహుల్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన కోర్టు ఆయన శాశ్వత మినహాయింపుకు అర్హుడని పేర్కొంది. అంతేగాదు పరువు నష్టం కేసులో సాక్ష్యాధారాలను నమోదు చేయడానికి ఈ కేసును జూన్ 3కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మహాత్మ గాంధీ హత్యను ఆర్ఎస్ఎస్కి ముడిపెడుతూ.. రాహుల్ పలు ఆరోపణలు చేశారు. దీంతో థానే జిల్లాలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ వ్యాఖ్యలు తమ ప్రతిష్టను కించపరిచేలా ఉందని పేర్కొంటూ.. రాహుల్‌పై రాజేష్ కుంతే అనే ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త 2014లో భివండీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయమై 2018 జూన్‌లో రాహుల్ కోర్టు ముందు హాజరయ్యారు కూడా. తాను ఢిల్లీ వాసినని, లోక్‌సభ సభ్యుడిగా తన నియోజకవర్గంలో పర్యటనలు చేయాల్సి ఉంటుందన పేర్కొంటూ కోర్టులో హాజరు నుంచి మినహాయింపు కోరారు. అలాగే అవసరమైనప్పుడూ విచారణలో బదులుగా తన తరుఫున న్యాయవాదిని అనుమతించాలని కోరారు. ఈ క్రమంలోనే భివాండీ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిందితుడు(రాహుల్ గాంధీ)కి కోర్టులో హజరు నుంచి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విచారణ తేదీల్లో రాహుల్ తరుఫు న్యాయవాది క్రమం తప్పకుండా హాజరు కావాలని, కోర్టు ఆదేశించినప్పుడూ నిందితుడు(రాహుల్) కూడా హాజరు కావాలని షరతులు విధించింది. కాగా, ఇటీవలే సూరత్ కోర్టులో 2019లో నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్‌ని దోషిగా నిర్ధారిస్తూ..రెండేళ్లు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటుకి గురయ్యారు. (చదవండి: కర్ణాటక ఎన్నికలు: ఏం మాట్లాడతారో?.. రాహుల్ గాంధీ కోలార్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి) -
సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’
సూరత్: మోదీ ఇంటి పేరును అనుచితంగా వాడారనే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరఫున ఆయన న్యాయవాదులు గురువారం సూరత్ కోర్టులో వాదనలు వినిపించారు. ‘ నేర నిరూపణ విధానం సవ్యంగా లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టు జడ్జి అసమతుల్య సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని తీర్పు చెప్పారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో మొత్తం కేసు ఆధారపడింది. రాఫెల్ కేసులో రాహుల్ చెప్పిన బేషరతు క్షమాపణ అంశాన్ని ఈ కేసుకు సంబంధంలేకున్నా ఇందులో జతచేశారు. మరీ ఇంత పెద్ద శిక్షా ?. ఈ కేసులో గరిష్ట శిక్షను అమలుచేయాల్సిన అవసరం లేదు’ అని అదనపు సెషన్స్ జడ్జి ఆర్పీ మొగెరా ముందు రాహుల్ లాయర్ ఆర్ఎస్ ఛీమా వాదించారు. శిక్షను నిలుపుదల చేయాలని కోరారు. ‘ దొంగలందరి ఇంటి పేరు మోదీ అనే ఎందుకుంది? అనే ప్రసంగం చేసే నాటికి రాహుల్ దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. దేశ ప్రజలపై ఆయన ప్రసంగ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రసంగాన్ని సంచలనం చేయాలనేది ఆయన ఉద్దేశ్యం. ఇలాంటి పరువునష్టం కేసులు ఆయన వేర్వేరు చోట్ల చాలా ఎదుర్కొంటున్నారు. రాఫెల్ కేసులో అనుచిత వ్యాఖ్యలు, ఆనక క్షమాపణల తర్వాతా ఆయన ఇలాంటి ప్రసంగాలు చేశారు’ అని పరువునష్టం కేసు వేసిన పూర్ణేశ్ మోదీ తరఫు లాయర్ హర్షిత్ తోలియా వాదించారు. తర్వాత జడ్జి తీర్పును 20వ తేదీకి వాయిదావేశారు. -
ట్రయిల్ కోర్టులో నాకు అన్యాయం జరిగింది..
-
మోదీ ఇంటిపేరు వివాదం.. రాహుల్‌కు మరో కోర్టు సమన్లు
పట్నా: మోదీ ఇంటిపేరు వివాదంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వేసిన పరువునష్టం కేసులో ఏప్రిల్ 25న కోర్టు ఎదుట హాజరవ్వాలని రాహుల్‌గాంధీని బిహార్ కోర్టు బుధవారం సూచించింది. ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో వేసిన పిటిషన్ విచారణను బుధవారం కోర్టు ప్రత్యేక జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆది దేవ్ చేపట్టారు. ఏప్రిల్ 12వ తేదీనే హాజరవ్వాలని గత నెల 18న ఆయన ఆదేశాలివ్వడం తెల్సిందే. హాజరుపై రాహుల్ తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. సూరత్ కోర్టు కేసులో రాహుల్ తరఫు లాయర్ల బృందం తలమునకలైనందున రాహుల్ హాజరవాల్సిన తేదీని మార్చాలని కోరారు. అందుకు అంగీకరించిన మేజిస్ట్రేట్ రాహుల్‌ను 25వ తేదీన హాజరుకావాలంటూ సమన్లు జారీచేశారు. మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు విధించడం, ఎంపీగా అనర్హత వేటు పడటం తెలిసిందే. -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బెయిల్
గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ అప్పీల్ దాఖలు చేశారు. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తనను దోషిగా తేల్చూతు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరారు. అలాగే తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కూడా కొట్టివేయాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. రాహుల్ గాంధీ ఈ కేసులో ఏప్రిల్ 13 వరకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను అదే రోజు చేపడతామని చెప్పింది. దీంతో తీర్పుపై స్టే వస్తుందనుకున్న రాహుల్‌కు నిరాశే ఎదురైంది. రాహుల్ గాంధీ అభ్యర్థన మేరకు తీర్పుపై స్టే విధిస్తే ఆయనపై ఎంపీగా అనర్హత వేటు తాత్కాలికంగా తొలగిపోనుంది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా.. సూరత్ కోర్టకు రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వెళ్లారు. ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు కూడా రాహుల్‌తో పాటు ఉన్నారు. #WATCH | Gujarat: Congress leader Rahul Gandhi, accompanied by senior Congress leaders and CMs arrives in Surat. pic.twitter.com/jNbFe1KF8u — ANI (@ANI) April 3, 2023 2019లో కర్ణాటకలో ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగల ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాహుల్‌పై సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అనంతరం 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రెటేరియేట్ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ అనర్హత వేటు వేసింది. దీంతో దేశంలోని ప్రతిపక్షాలన్ని ఆయనకు సంఘీభావం తెలిపాయి. చదవండి: కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి.. స్టేజీ కుప్పకూలి ఒక్కసారిగా కిందపడ్డ నాయకులు.. -
Defamation Case: న్యాయ పోరాటానికి రాహుల్ సై!
పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సిద్దమయ్యినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన మంగళవారం (ఏప్రిల్ 03, 2023న) సూరత్ సెషన్స్ కోర్టులో తన శిక్షను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తన పిటిషన్లో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరనున్నట్టు తెలుస్తోంది. అలాగే దీనిపై తీర్పు వెలువడేంత వరకు మధ్యంతర ఉత్తర్వులు విధించాలని సెషన్స్ కోర్టుని అభ్యర్థించనున్నారు. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి పరువు నష్టం కేసులో రాహుల్‌గాందీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలసింది. ఆ తదుపరి వెంటనే ఎంపీగా లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. ఆ వెను వెంటనే అధికారిక నివాసాన్ని సైతం ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో న్యాయపరంగా ఎదుర్కొనేందుకు రాహుల్ ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడైంది. (చదవండి: కాఫీ షాప్ పార్కింగ్ ఆఫర్..రూ 60 కోసం పదేళ్లు పోరాడి గెలిచాడు) -
ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం
న్యాయమూర్తి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై సంతకం పెట్టిన వెంటనే ‘అనర్హత’ అమల్లోకి వచ్చేస్తుందని మాజీ అటార్నీ జనరల్ ఒకరు అన్నారు. విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చరిల్లుతున్న ఈ తరుణంలో రెండేళ్ల జైలుశిక్ష పడగల ఐపీసీ సెక్షన్ 153(ఎ), సెక్షన్ 505 పరీక్షకు ఎంతమంది రాజకీయ నేతలు నిలబడగలరు? ఈ రెండు సెక్షన్లూ దేని గురించో తెలుసా? మతం, భాషల ఆధారంగా సమాజంలో శత్రుత్వాన్ని పెంపొందించడం! కాబట్టి,కొంతమంది ఎంపీలను ఎంపిక చేసుకుని మరీ సభ్యత్వాలను రద్దు చేసే ప్రయత్నం ఎందుకు? ప్రజాస్వామ్యం పచ్చగా ఉండాలంటే ప్రతిపక్షం తప్పనిసరి అన్నది గుర్తుంచుకోవాలి. పరువునష్టం కేసుల విషయంలో చట్టాలను సమీక్షించేందుకు ఇదే సరైన తరుణం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయిపోయింది. న్యాయపరంగా, రాజకీయంగా దీని పరిణామాలు ఎలా ఉండనున్నాయన్న ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చలా మణీలో ఉన్న ప్రశ్నలతోపాటు సభ్యత్వ రద్దుతో రాగల ముఖ్యమైన సరికొత్త సందేహాలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. స్థూలంగా చెప్పాలంటే, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఏమిటన్నది తరచిచూద్దాం. సూరత్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మార్చి 23న పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.15,000 జరిమానా విధించారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 499, 500ల కింద దోషిగా నిర్ధారించారు. శిక్ష అమలును నెల రోజుల పాటు స్తంభింపజేసి, పైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా బెయిల్ ఇచ్చారు. అయితే న్యాయమూర్తి తీర్పు వెలువరించిన మరుసటి రోజే లోక్‌సభ కార్యాలయం రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళ నలకు దిగిన విషయం తెలిసిందే. ఇందుకు బదులు కాంగ్రెస్ నేతలు శిక్ష రద్దును కోరుతూ పైకోర్టును ఆశ్రయించి ఉండాల్సింది. ఈ సమస్యకు పరిష్కారం న్యాయస్థానాల్లోనే లభిస్తుంది కానీ వీధుల్లో కాదు. పైకోర్టులు శిక్షను నిలిపివేయడం లేదా రద్దు చేయడం వల్ల మాత్రమే రాహుల్ గాంధీ మళ్లీ లోక్‌సభ సభ్యుడు కాగలరు. 2013 నాటి లిలీ థామస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏదైనా ఒక కేసులో శిక్ష ప్రకటించిన వెంటనే లోక్‌సభ సభ్యత్వం దానంతటదే రద్దయిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ సహా దాదాపు 20 మంది తమ సభ్యత్వాలను కోల్పోయిన విషయం ప్రస్తావనార్హం. లోక్‌సభ కార్యాలయం తొందరపాటు? రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేసే విషయంలో లోక్‌సభ కార్యాలయం తొందరపడిందా? మాజీ అటార్నీ జనరల్ ఒకరు చెప్పిన దాని ప్రకారం, లోక్‌సభ కార్యాలయానికి ఇంతకు మించిన ప్రత్యా మ్నాయం లేదు. న్యాయమూర్తి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై సంతకం పెట్టిన వెంటనే ‘అనర్హత’ అమల్లోకి వచ్చేస్తుందని తెలిపారు. అయితే లక్షద్వీప్ ఎంపీ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. హత్యాయత్నం చేశాడన్న ఆరోపణలపై కేరళ కోర్టు ఒకటి మహమ్మద్ ఫైజల్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు రోజుల తరువాత ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. లక్షద్వీప్ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ 2023 జనవరి 18న ప్రకటించింది కూడా. అయితే వారం రోజుల తరువాత కేరళ హైకోర్టు మహమ్మద్ ఫైజల్ శిక్షపై స్టే విధించింది. దీంతో సుప్రీంకోర్టు ఉప ఎన్నికను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జనవరి 25 నుంచి మార్చి 29వ తేదీ వరకూ మహమ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడం! ఉన్నత న్యాయ స్థానం శిక్షపై స్టే విధించిన వెంటనే లోక్‌సభ్య సభ్యత్వం దానంతటదే పునరుద్ధరింపబడుతుందా, లేదా అన్న స్పష్టత మాజీ అటార్నీ జన రల్ ఇవ్వలేకపోయారు. (అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చేందుకు కొన్ని గంటల ముందు ఫైజల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే.) చట్టాల్లోని ఈ లోపం ఎంపిక చేసిన వారిపై వేగంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్న వాదన ఉంది. కోర్టుల తీర్పుల అమలును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం కోర్టు ధిక్కారం కిందకు రాదా? 2018లో ఎన్నికల కమిషన్ , లోక్ ప్రహరీ మధ్య జరిగిన ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ... అప్పీలు పెండింగ్‌లో ఉండి ఉన్నత న్యాయస్థానాలు శిక్షపై స్టే విధిస్తే, శిక్ష పరిణామంగా అమల్లోకి వచ్చే సభ్యత్వ రద్దు పనిచేయదని విస్పష్టంగా తెలిపింది. రాహుల్ కేసులో ఎన్నో సందేహాలు... రాహుల్ గాంధీపై సూరత్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన కేసుపై ఎన్నో సందేహాలున్నాయి. కేసు పిటిషనర్ గత ఏడాదే హైకోర్టు నుంచి విచారణపై ఎందుకు స్టే తెచ్చుకున్నారన్నది ఒక ప్రశ్న. దీని ఫలితంగా కేసు విచారణ దాదాపు 12 నెలల పాటు ఆలస్యమయ్యేందుకు పిటిష నర్ కారణమయ్యారు. అదనపు సాక్ష్యాలేవీ వెలుగులోకి రాని నేపథ్యంలో ఈ ఏడాది స్టే ఎత్తేయించుకునేందుకు ఏ రకమైన పరిణామాలు కారణమాయ్యాయన్నదీ అస్పష్టమే. పైగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సూరత్ కోర్టు మేజిస్ట్రేట్ ఎందుకు మారారు? కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు క్రిమినల్ డిఫమేషన్ కిందకు వస్తాయా? లేక సివిల్ డిఫమేషన్ పరిధి లోకా? 2019 ఏప్రిల్ 13న ఎన్నికల ర్యాలీ సందర్భంగా రాహుల్ అన్నది ఇదీ: ‘‘ఒక చిన్న ప్రశ్న... ఈ దొంగలందరి ఇంటిపేర్లు మోదీ, మోదీ, మోదీ అనే ఎందుకుంది? నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ...’’ ఈ వ్యాఖ్య పైనే పరువు నష్టం కేసుల్లో గరిష్ఠంగా విధించ గల రెండేళ్ల జైలు శిక్ష విధించవచ్చా? పార్లమెంటు సభ్యత్వం రద్దయ్యేందుకు కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడాలన్నది ఇక్కడ కాకతాళీయమేనా? అన్నింటికంటే ముఖ్యంగా మనలాంటి దేశంలో, విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చరిల్లుతున్న ఈ తరుణంలో రెండేళ్ల జైలుశిక్ష పడగల ఐపీసీ సెక్షన్ 153(ఎ), సెక్షన్ 505 పరీక్షకు ఎంతమంది రాజకీయ నేతలు నిలబడగలరు? ఈ రెండింటిలో దేని కిందనైనా శిక్ష పడితే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 కింద చట్టసభల సభ్యత్వం రద్దయిపోతుంది. ఈ రెండు సెక్షన్లూ దేని గురించో తెలుసా? మతం, భాషల ఆధారంగా సమాజంలో శత్రుత్వాన్ని పెంపొందించడం! కాబట్టి, కొంతమంది ఎంపీలను ఎంపిక చేసుకుని మరీ వారి సభ్యత్వాలను రద్దు చేసే ప్రయత్నం ఎందుకు? అధికార పక్షంలో ఉంటూ పైన చెప్పిన సెక్షన్ల పరిధిలోకి రాగలవారిని చూసీచూడనట్లు వదిలేయడం ఎందుకు? అధికార పక్షం స్వయంగా చెబుతున్నట్లుగా చట్టం అందరికీ సమానమే, అందరూ చట్టం ముందు సమానులే కావాలి కదా? సమీక్షకు ఇదే తరుణం... నా దృష్టిలో పరువునష్టం కేసుల విషయంలో చట్టాలను సమీక్షించేందుకు ఇదే సరైన తరుణం. యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, శ్రీలంక తదితర దేశాల్లో ఇప్పటికే పరువు నష్టం దావాల ‘డీక్రిమినలైజేషన్ ’ జరిగింది. ఆయా దేశాల్లో ఇప్పుడు పరువు నష్టం అనేది క్రిమినల్ నేరం కాదు. భారత్ కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. చివరిగా ఇకపై ఇలాంటి వ్యవహారాలు తగిన పద్ధతి ఆధారంగా న్యాయస్థానాల ద్వారా మాత్రమే జరగాలి. సభ్యత్వ రద్దుపై తీర్పు అనేది వీధుల్లో చర్చించే అంశం కానే కాదు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వ రద్దు తాలూకు రాజకీయ పరిణామాలు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తెలుస్తున్నాయి. ఇవి ఎక్కడికి దారితీస్తాయన్నది వేచి చూడాల్సిన అంశం. ఇంకో ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది. న్యాయపరంగా లేదా రాజకీయాల్లో ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అందరూ అంగీకరించా ల్సిన విషయం ఒకటి ఉంది... ప్రజాస్వామ్యం పచ్చగా ఉండాలంటే ప్రతిపక్షం తప్పనిసరి అన్నది అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతిపక్షా లను చంపేసే ప్రయత్నాలకు ఫుల్స్టాప్ పడాల్సిందే! ఎస్.వై. ఖురేషీ వ్యాసకర్త కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
క్షమాపణ చెప్పే ప్రసక్తే లే
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఆయన ఇచ్చానని చెబుతున్న నోటీసును లీగల్‌గానే ఎదుర్కొంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంచేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ లీగల్ నోటీస్ ఇచ్చినట్లు తాను కూడా పత్రికల్లోనే చూశానని అన్నారు. ఇలాంటి ఉడుత బెదిరింపులకు బెదిరిపోయేది లేదని లీగల్ నోటీసుపై న్యాయపరంగానే పోరాడతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ స్కాం మొదలు పేపర్ లీకేజ్ దాకా ఐటి శాఖ మంత్రే బాధ్యత వహించాలి. నాలాలో పడి పిల్లలు చనిపోయిన దగ్గర నుండి కుక్కల దాడిలో పసిపిల్లల చావు వరకు మున్సిపాలిటీ శాఖ మంత్రే బాధ్యత వహించి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. నీ పరువు సరే.. వారి భవిష్యత్‌కు మూల్యమేంటి కేటీఆర్ పరువు విలువ రూ.100 కోట్లయితే తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ వారి పాలనలో ప్రశ్నార్థమైందని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ‘సిట్ విచారణ అంశాలు అసలు కేటీఆర్‌కి ఎలా లీక్ అవుతున్నాయి. మొదట ఇద్దరు మాత్రమే నిందితులన్న కేటీఆర్ పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదు? ఇద్దరు మాత్రమే దోషులంటూ కేసును నీరుగార్చేందుకు యత్నించిన కేటీఆర్‌పై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ప్రశ్నాపత్రాలు పత్రాల లీకేజీ విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్న ఆయనకు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదో జవాబివ్వకుండా తప్పిదాలను ప్రశ్నిస్తున్న మాపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తారా? సిట్ బెదిరింపులకు బెదిరేది లేదు’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల ఫోటోలు మార్ఫింగ్.. 8 మంది అరెస్ట్ కేటీఆర్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయ్? తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాలో ఉద్యోగ స్థాయి నుంచి నేడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘పేపర్ లీకేజీతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు,. కేటీఆర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దాకా, నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పన పరిహారం అందించే వరకు బీజేపీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం’అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..‘ప్రధాని స్థాయిని, వయసును కూడా చూడకుండా విమర్శించడం కేసీఆర్ కొడుకు కుసంస్కారానికి నిదర్శనం. ప్రశ్నాపత్రాలు లీకేజీ అంశాన్ని ఒక సాధారణ అంశంగా మలిచేందుకు మంత్రులంతా ప్రయత్నం చేస్తున్నారు’అని మండిపడ్డారు. ‘కేటీఆర్ ఓ ఒక స్వయం ప్రకటిత మేధావి. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే అపరజ్ఞానిలా భావిస్తున్నాడు. ప్రశ్నిస్తే తట్టుకోలేని మూర్ఖుడు. పాలనలోని తప్పులను ఎత్తిచూపితే సహించలేని అజ్ఞాని’అని సంజయ్ ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్ కుట్రలో రాహుల్ గాంధీ బాధితుడా? కేంద్ర మంత్రి సెటైర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయమై విపక్షాలన్ని ఏకమై వ్యతిరేకిస్తూ..నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఠాకూర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..పరువు నష్టం కేసులో రాహుల్‌ని అనర్హుడిగా ప్రకటించినప్పుడూ కాంగ్రెస్‌కి చెందిన ప్రముఖ న్యాయవాది ఎవరూ ఎందుకు సహాయం చేసేందుకు ముందుక రావడం లేదని ప్రశ్నించారు. గాందీని వదులుగా ఉండే ఫిరంగిలాంటి వారిని, నేరస్తుడని విమర్శించారు. రాహుల్‌పై వివిధ కోర్టలలో దాదాపు ఏడు పరువు నష్టం కేసులు ఉన్నాయన్నారు. అలాగే ఆయనపై అనర్హత వేటు పడటంలో ప్రభుత్వం ప్రమేయం గానీ, లోక్ సభ సచివాలయ పాత్ర గానీ లేదని తేల్చి చెప్పారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడి, ఆ వెంటనే రాహుల్ అనర్హతకు గురయ్యారని ఠాకూర్ అన్నారు. ఈ కేసులో రాహుల్‌కి కాంగ్రెస్‌కి సంబంధించిన ప్రముఖ న్యాయవాదులెవరూ ఎందుకు సాయం చేయలేకపోయారని అడిగారు. ఒక వేళ ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగిందా? లేదా కాగ్రెస్ కుట్రలో భాగమా? అని ప్రశ్నించారు. పవన్ ఖేరాను రక్షించడానికి కేవలం గంట వ్యవధిలోనే మొత్తం న్యాయవాదులందరూ రావడం జరిగింది. మరీ రాహుల్‌కి మద్దతుగా ఏ కాంగ్రెస్ నాయకుడు కోర్టుని ఆశ్రయించలేదే, అంటే దీనినిబట్టి రాహుల్‌పై కుట్ర పన్నుతుంది ఎవరూ అని కేంద్ర మంత్రి గట్టిగా నిలదీశారు. ఆయన సుప్రీంకోర్టుకి వ్రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వంటి సంఘాలు, వ్యక్తులు, సంస్థలపై పరువువ నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం కొనసాగించారన్నారు. విలేకరుల సమావేశంలో ఓ జర్నలిస్టుతో కూడా రాహుల్ పరుషంగా మాట్లాడరన్నారు. తను పరుషంగా మాట్లాడతాడని కూడా చాలామందికి తెలియదని, గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అతని తప్పులను కవర్ చేసుకుంటూ వస్తోందని విమర్శులు గుప్పించారు. పైగా ఇలాంటి వ్యక్తి మళ్లా పత్రికా స్చేచ్ఛగా మాట్లాడతుంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కుటుంబ ప్రభావం నుంచి బయటకు రాలేకపోతున్నారని అన్నారు. అలాగే అదానీ విషయంలో బీజేపీ డిఫెన్స్ ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. విదేశీ గడ్డపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పట్టుబడుతూ.. ఇలా రాహుల్ విషయంలో వ్యవహరిస్తోందన్న ఆరోపణలను సైతం ఖండించారు. అలాగే అదానీ అంశం గురించి ఆర్థిక మంత్రి నిర్శలా సీతీరామన్ కూడా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో దాచడానికి ఏమి లేదన్నారు. తమ సంస్థలు బలంగా ఉన్నాయని, వాటిని విశ్వసించమని నొక్కిచ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశ న్యాయవ్యవస్థ, పార్లమెంట్ కార్యకలాపాలు, ప్రజలు వీటిన్నికంటే గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తోందంటూ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. -
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్దాలను మాట్లాడుతున్నారన్నారు. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వీరికి లేదని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసులో కేటీఆర్ ప్రస్తావించారు. చదవండి: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. ఘాటైన లేఖ -
'రాహుల్‌కు 19 రాజకీయ పార్టీల మద్దతు..దాని గురించి బాధ లేదు..'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నెల రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. జై భారత్ సత్యాగ్రహ పేరుతో మంగళవారం సాయంత్రం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇక నెల రోజుల పాటు కాంగ్రెస్ శ్రేణులు బ్లాక్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమం కేవలం రాహుల్ గాంధీ కోసమే కాదని, ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఢిల్లీలో 'సేవ్ డెమొక్రసీ' పేరుతో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు మొదలవుతున్నట్లు చెప్పారు. అలాగే రాహుల్ గాంధీకి 19 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినట్లు జైరాం వివరించారు. అనర్హత వేటు, బంగ్లా ఖాళీ చేయాలని ఇచ్చిన నోటీసులపై ఆయనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. ఉద్దవ్ బాలాసాహెబ్ థాక్రే సేన కూడా రాహుల్‌కు ఈ విషయంలో మద్దతుగానే ఉందని పేర్కొన్నారు. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా ప్రకటించిన 24 గంటల్లోనే ఆయను ఎంపీ పదవి నుంచి తొలగించారని, ఆ తర్వాత ఆయన ప్రెస్‌మీట్ పెట్టిన 24 గంటల్లోనే ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని జైరాం గుర్తు చేశారు. లోక్‌సభ సెక్రెటేరియెట్ జెట్ స్పీడు చూసి తమకు ఆశ్చర్యం వేసిందని సెటైర్లు వేశారు. కానీ రాహుల్ గాంధీకి వీటి గురించి ఎలాంటి ఆందోళన లేదని వాళ్లకు తెలియదన్నారు. అలాగే సూరత్ కోర్టు తీర్పును రాహుల్ సవాల్ చేసే విషయంపైనా జైరాం రమేశ్ వివరణ ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ అప్పీల్ చేయాలో తమకు తెలుసునని, న్యాయ నిపుణులతో దీనిపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేసేందుకు రాహుల్‌కు 30 రోజుల వరకు గడువుంది. దేశంలో దొంగల ఇంటి పేరు మోదీనే అని ఎందుకు ఉందని 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే దీనిపై పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత 24 గంటల్లోనే రాహల్‌పై ఎంపీగా అనర్హత వేటు పడటం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. చదవండి: రాహుల్ గాంధీకి మరో షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు.. -
‘మిస్టర్ గాంధీ కేసును గమనిస్తున్నాం’
రాహుల్ గాంధీపై కోర్టు కేసు, అనర్హతవేటు తదితర పరిణామాలపై అమెరికా స్పందించింది. రాహుల్ గాంధీ కేసును తమ దేశం గమనిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛతో సహా ప్రజాస్వామ్య విలువలకు భాగస్వామ్య నిబద్ధత విషయంలో భారత ప్రభుత్వంతో అమెరికా ఎప్పుడూ నిమగ్నమై ఉంటుందని పేర్కొంది. రాహుల్ గాంధీని అనర్హత వేటు పరిణామంపై అమెరికా అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్‌కు సోమవారం(అక్కడి కాలమానం ప్రకారం) మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. చట్టబద్ధమైన పాలన, న్యాయ స్వాతంత్ర్యం పట్ల గౌరవం ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభం. భారత దేశంలోని కోర్టులలో మిస్టర్ గాంధీ (రాహుల్ గాంధీని ఉద్దేశించి) కేసును మేము గమనిస్తూనే ఉన్నాం.. భావ స్వేచ్ఛ ప్రకటన సహా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు భారత్‌తో కలిసి మేం ముందుకు నడుస్తాం. ఇరు దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు.. కీలకమైన మానవ హక్కుల పరిరక్షణను(భావ స్వేచ్ఛ ప్రకటనసహా), ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తూనే వస్తున్నాం అని తెలిపారాయన. అయితే.. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో గానీ, రాహుల్ గాంధీతో గానీ అమెరికా ఏమైనా సంప్రదింపులు జరిపిందా? అని ప్రశ్నించగా.. అలాంటిదేం జరగలేదని ఆయన బదులిచ్చారు. కాగా, కాగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటి పేరు’(2019లో చేసినవి) వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో దోషిగా తేలిడంతో.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ఆపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఆయనపై లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడింది. బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని ఖండించాయి. ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. విపక్షాలన్నింటిని ఏకం చేసుకుని కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. (చదవండి: యూఎస్ టేనస్సీ: స్కూల్లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి) -
Sankalp Satyagraha: మోదీ పిరికిపంద
న్యూఢిల్లీ: ‘‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రధాని రాజీవ్‌గాంధీ కుమారుడు రాహుల్. దేశ ఐక్యత కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అలాంటి వ్యక్తి దేశాన్ని ఎందుకు అవమానిస్తారు?’’ అని ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ‘‘బీజేపీ నేతలు రాహుల్‌ను మీరు జాఫర్ అంటూ ఎగతాళి చేశారు. జాతి వ్యతిరేక శక్తి అని నిందించారు. మా తల్లిని అవమానించారు. నెహ్రూ ఇంటిపేరు ఎందుకు పెట్టుకోలేదంటూ మమ్మల్ని ఎద్దేవా చేశారు. మా కుటుంబాన్ని, కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని ఆక్షేపించారు. అయినా వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? జైలు శిక్షలు విధించలేదు?’’ అని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన రాహుల్‌ను ‘పప్పు’ అని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆయన పప్పు కాదని బీజేపీ నాయకులకు తెలిసిపోయింది. అందుకే పార్లమెంటు నుంచి బయటికి పంపించారు’’ అంటూ దుయ్యబట్టారు. రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ఆదివారం దేశవ్యాప్తంగా ‘సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్షలు చేపట్టింది. ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద దీక్షలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర అగ్ర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ‘‘మోదీ ఉత్త పిరికిపంద. అధికారం వెనుక దాక్కుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అహంకారపూరిత మోదీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పించడం తథ్యమన్నారు. అరాచక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మా కుటుంబం ధారపోసిన రక్తం దేశ ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు. ఇకపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘మోదీ’లను విమర్శిస్తే నొప్పెందుకు: ఖర్గే ‘‘ఒక వ్యక్తిని కాపాడడానికి మొత్తం ప్రభుత్వం, కేబినెట్ మంత్రులు, ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. అసలు అదానీ ఎవరు? ప్రభుత్వం ఆయనకు ఎందుకు అండగా ఉంటోందో చెప్పాలి’’ అని ప్రియాంక నిలదీశారు. ‘‘ప్రజల హక్కుల కోసం రాహుల్ పోరాడుతున్నారు. జోడో యాత్రలో ఆయన వెంట లక్షల మంది నడిచారు’’ అన్నారు. అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ, లలిత్ మోదీలను విమర్శిస్తే బీజేపీ ప్రభుత్వానికి నొప్పి ఎందుకని ఖర్గే ప్రశ్నించారు. సత్యాగ్రహం పేరిట కాంగ్రెస్ దీక్ష చేయడం సిగ్గుచేటని బీజేపీ దుయ్యబట్టింది. దానికి ఆ అధికారమే లేదని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ‘అనర్హత వేటు పడిన ఎంపీ’ ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేసిన రాహుల్ లోక్‌సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో రాహుల్ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేశారు. బయోడేటాను ‘అనర్హత వేటుపడిన ఎంపీ’గా మార్చారు. తన అధికారిక వయనాడ్ ట్విట్టర్ ఖాతాలోనూ ‘డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ’ అని రాశారు. -
అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది: శశి థరూర్
సాక్షి, న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్షపడి, అనర్హత వేటు పడగానే ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ అన్నారు. ఈ మేరకు శశి థరూర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఒకరంగా ఇది అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థిగా భావించే ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉండటమే చూశాం మనం. కానీ నేడు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డాయి ఆయా పార్టీలు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్‌లోని మమతా బెనర్జీ, హైదరాబాద్‌లో చంద్రశేఖర్ తోసహా అందరూ రాహుల్‌కి మద్దతుగా నిలిచారు. గతంలో కాంగ్రెస్‌తో ఈ పార్టీలన్నీ ఏవిధంగానూ సంబంధం కలిగి లేవు. బీజేపీ చర్య అనాలోచిత పరిణామాల చట్టల పరిధిలో తొలిస్థానంలో ఉంది. ఆయా పార్టీ ముఖ్యమంత్రులందరూ రాహుల్ పేరు ప్రస్తావించకుండానే ఈ చర్యను ఖండించారు. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ముక్త కంఠంతో వ్యాఖ్యానించారు. అంతేగాదు కాంగ్రెస్‌తో మాకు విభేదాలు ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో ఇరికించడం అనేది సరి కాదని అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అదీగాక పారపోయిన వ్యాపారవేత్తలు లలిత్ మోదీ, నీరవ్ మోదీ, ఇద్దరూ వెనకబడినవారు కానందున రాహుల్‌పై వచ్చిన అభియోగాలు అర్థరహితమైనవి. వారంతా తమ అక్రమ సంపాదనను విదేశాలకు తరలించి విలాసవంతంగా జీవిస్తున్నారు. వారిని వెనుకబడిన తరగతుల వారుగా చెబుతూ..ఓబీసీలపై దాడి అని వ్యాఖ్యనించి చెబుతున్న వారి ఇంగితజ్ఞానం విస్మయానికి గురి చేస్తోంది. అని ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు థరూర్ కూడా రాహుల్‌పై కోర్టు విధించిన శిక్ష పట్ల అభ్యంతరం చెబుతూ..ఈ కేసు బలహీనంగా ఉంది. మాకు మంచి న్యాయవాదులు ఉన్నారు. ఫిర్యాదుదారుడికి బలహీనమైన కేసు ఇది అని అన్నారు. అలాగే కేసు పెట్టిన నాల్గవ మోదీ..పూర్ణేశ్ మోదీ తనను ఏ రకంగా టార్గెట్ చేశారని నిరూపించగలడు అని శశి థరూర్ అన్నారు. కాగా రాహుల్ గాంధీ తరుఫు న్యాయవాది కోర్టు కార్యకలాపాలు ఆది నుంచి లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. రాహుల్ తన ప్రసంగంలో మోదీని లక్ష్యంగా చేసుకున్నందున ఫిర్యాదుదారునిగా ప్రధాని మోదీ ఉండాలి కానీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కాదని ఆయన వాదించారు. (చదవండి: ట్వీట్ దుమారంపై స్పందించిన ఖుష్బు! మరిన్ని తీయండి అంటూ కౌంటర్) -
ఎంపీగా అనర్హత.. ట్విటర్ బయోను వినూత్నంగా మార్చిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో జైలు శిక్ష ఖరారు, ఎంపీ పదవికి ఎసరు రావడంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. కాషాయ దళం కావాలని తమ నాయకుడిని టార్గెట్ చేసిందని హస్తం పార్టీ నేతలు ఆందోళనలు, నిరసనలకు పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాహుల్ గాంధీ తన ట్విటర్ హ్యాండిల్ బయోను మార్చారు. అంతకుముందు ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్’ ఉన్నచోట ‘డిస్ 'క్వాలిఫైడ్ ఎంపీ’ (Dis'Qualified MP) అని అప్డేట్ చేశారు. కాగా, ప్రధాని మోదీపై విమర్శలు చేసే క్రమంలో రాహుల్ గాంధీ ఓ వర్గాన్ని కించపరిచారంటూ దాఖలైన పరువునష్టం దావాలో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మరునాడే లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌ని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం ఖాళీగా ఉందని ప్రకటించింది. తీర్పు వెలువడ్డ ఈ నెల 23వ తేదీ (గురువారం) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. నిజానికి అప్పీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొంది. అయినా లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! ఇదిలాఉండగా, పరువునష్టం కేసులో జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఎగువ న్యాయస్థానాలను ఆశ్రయించనుంది. (చదవండి: ఆ ఎమ్మెల్యే ఇంటిపేరు మోదీ కాదు, భూత్వాలా) దేశవ్యాప్త ఆందోళనలు.. రాహుల్‌పై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా పార్టీ కీలక నేతలు ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో ‘సంకల్ప్ సత్యాగ్రహ దీక్ష’కు చేపట్టారు. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అణగారిన వర్గాల కోసం రాహుల్ గాంధీ పనిచేస్తుంటే బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని ఖర్గే ధ్వజమెత్తారు. రాహుల్ కర్ణాటక ఎన్నికల ర్యాలీలో మాట్లాడితే కేసు గుజరాత్‌కు వెళ్లిందని విమర్శించారు. కర్ణాటకలోని బీజేపీ సర్కార్‌కు ఆ రాష్ట్రంలో కేసు వేసేంత దమ్ము లేదా? అని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని బీజేపీ శ్రేణులు కావాలనే కించపరుస్తున్నారని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: Defamation Case: రాహుల్‌పై అనర్హత వేటు) -
Rahul Gandhi Case: ఆ ఎమ్మెల్యే ఇంటిపేరు మోదీ కాదు, భూత్వాలా
అహ్మదాబాద్: పరువు నష్టం కేసుతో రాహుల్‌గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడేందుకు కారణమై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందో’ అన్న వ్యాఖ్యలతో మోదీ ఇంటి పేరు ఉన్నవారందరినీ రాహుల్ అవమానించారంటూ ఆయన కేసు పెట్టారు. ఇంతా చేస్తే పూర్ణేశ్ ఇంటి పేరు మోదీ కాదు, భూత్వాలా! వాదనల సందర్భంగా ఈ విషయాన్ని రాహుల్ లాయర్ కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి కౌంటర్‌గా తమ కులం పేరు మోదీ ఘాంచీ అని పూర్ణేశ్ చెప్పారు. ‘‘మేం గుజరాత్లో నూనె తయారీ వ్యాపారంలో ఉన్నాం. మా సామాజిక వర్గానికి చెందిన వారు దేశంలో పలు ఇంటి పేర్లతో 13 కోట్ల మంది దాకా ఉన్నారు. వారిని రాజస్థాన్‌లో ఘాంచీ, గుజరాత్లో మోదీ అని పిలుస్తారు. మేం చేసే పనిని బట్టి లప్సీవాలా, దాల్వాలా, చోంఖ్వాలా, ఖాదీవాలా ... ఇలా మా ఇంటిపేరు వస్తుంది. మా పూర్వీకులు సూరత్‌లో భూత్ సేరిలో నివాసముండటంతో భూత్వాలా అని ఇంటి పేరు వచ్చింది. 1988లో దాన్ని మోదీగా మార్చుకున్నా’’ అన్నారు! (చదవండి: Defamation case: పోరాడుతూనే ఉంటా) -
Defamation case: పోరాడుతూనే ఉంటా..నా పేరు సావర్కర్ కాదు...!
న్యూఢిల్లీ: అధికార బీజేపీ ఆగడాల మీద మరింత దూకుడుగా పోరాడతానని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తేల్చి చెప్పారు. ‘‘కావాలంటే నాపై జీవిత కాలం పాటు వేటు వేయండి. జైల్లో పెట్టుకోండి. మీరేం చేసినా నన్నాపలేరు. సత్యం కోసం, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. అందుకోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడను’’ అని ప్రకటించారు. ‘‘దేశ పౌరుల ప్రజాస్వామిక గళాన్ని పరిరక్షించేందుకే నేనున్నా. ఇలాంటి హెచ్చరికలు, అనర్హతలు, ఆరోపణలు, జైలు శిక్షలతో నన్నెప్పటికీ బెదిరించలేరు. వాటికి ఎంతమాత్రం వెరవబోను. వీళ్లకు నేనింకా అర్థం కాలేదు. అదానీ అవినీతిపై ఎక్కడ నిజాలు బయటికొస్తాయోనని బీజేపీ సర్కారు నిలువెల్లా భయంతో కంపించిపోతోంది. నా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా విపక్షాలకు చేజేతులారా అతి పెద్ద అస్త్రాన్ని అందించింది’’ అన్నారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన 24 గంటల్లోపే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారి రాహుల్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై వేటును కేవలం అదానీ ఉదంతం నుంచి దృష్టి మళ్లించేందుకు ఆడిన గేమ్‌గా అభివర్ణించారు. ‘‘అదానీ గ్రూప్ అవకతవకలపై పార్లమెంటులో నా తర్వాతి ప్రసంగంలో ఏం మాట్లాడతానోనని ప్రధాని నరేంద్ర మోదీ వణికిపోయారు. అదానీతో ఆయన బంధం పూర్తిగా బయట పడిపోతుందని కలవరపాటుకు లోనయ్యారు. ఆ భయాన్ని మోదీ కళ్లలో నేను స్పష్టంగా చూశా’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘అందుకే నా ప్రసంగాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నారు. నాపై ఆరోపణలు, అనర్హత వేటు తదితరాలతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు’’ అని ఆరోపించారు. ‘‘కానీ అదానీతో మోదీ బంధం బయట పడితీరుతుంది. దాన్నెవరూ ఆపలేరు. అప్పటిదాకా అదానీ అవినీతిపై ప్రశ్నలు సంధిస్తూనే ఉంటా. అదానీ షెల్ సంస్థల్లో రూ.20 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టిందెవరు? అదానీతో మోదీ సంబంధమేమిటి? సమాధానాలు దొరికేదాకా వీటిని లేవనెత్తుతూనే ఉంటా’’ అన్నారు. అదానీ వంటి అవినీతిపరున్ని ప్రధాని ఎందుకు కాపాడుతున్నారన్న ప్రశ్నే ఇప్పుడు ప్రజలందరి మనసుల్లోనూ మెదులుతోందన్నారు. ప్రజాస్వామ్యానికి పాతర బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిపోయిందని రాహుల్ అభిప్రాయపడ్డారు. బీజేపీ సర్కారు దృష్టిలో అదానీ అంటే దేశం, దేశమంటే అదానీ అంటూ ఎద్దేవా చేశారు. తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నారా అని ప్రశ్నించగా, తానలా కనిపిస్తున్నానా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ‘‘నిజానికి నాకెంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉంది. అనర్హత వేటు బహుశా వాళ్లు నాకివ్వగలిగిన అత్యుత్తమ కానుక!’’ అన్నారు. ‘‘బ్రిటన్‌లో నేను ఎక్కడా భారత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరలేదు. కానీ కేంద్ర మంత్రులు దీనిపై పార్లమెంటులో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాటిపై స్పందించాలనుకుంటే అవకాశమివ్వలేదు. పైగా ఓబీసీలను అవమానించానంటూ నాపై తప్పుడు ఆరోపణలతో అదానీ అవినీతి నుంచి అందరి దృష్టీ మళ్లించజూస్తోంది. తప్పు చేసిన వాళ్లు ఇలాగే వ్యవహరిస్తారు. దొంగ అడ్డంగా దొరికినా తానేమీ తప్పు చేయలేదనే అంటాడు. ‘అదుగో, అటు చూడండి’ అంటూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. కానీ బీజేపీని వదిలిపెట్టబోను. విపక్షాలన్నీ కలసికట్టుగా మోదీ–అదానీ బంధాన్ని బయట పెట్టి తీరతాయి’’ అన్నారు. ..సభ్యత్వం ముఖ్యం కాదు తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆశ పడటం లేదని ఒక ప్రశ్నకు బదులుగా రాహుల్ చెప్పారు. ‘‘దానితో నిమిత్తం లేకుండా నా విధి నేను నిర్వర్తిస్తూనే ఉంటా. శాశ్వతంగా వేటు వేసినా, నా సభ్యత్వాన్ని పునరుద్ధరించినా ఈ విషయంలో తేడా ఉండదు. పార్లమెంటులో ఉన్నా, బయట ఉన్నా నా తపస్సు కొనసాగుతుంది’’ అన్నారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల గొంతుకను కాపాడటం. ప్రధానితో సాన్నిహిత్యాన్ని దుర్వినియోగం చేస్తున్న అదానీ వంటివారి గురించి ప్రజలకు నిజాలు చెప్పడం. ఆ పని చేసి తీరతాం’’ అని స్పష్టం చేశారు. నా పేరు సావర్కర్ కాదు...! ‘బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై మీ క్షమాపణకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై కోర్టులో విచారం వ్యక్తం చేసుండాల్సిందని భావిస్తున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని రాహుల్బదులిచ్చారు. ‘‘నా పేరు సావర్కర్ కాదు, గాంధీ. గాంధీ ఎవరికీ ఎప్పుడూ క్షమాపణలు చెప్పడు’’ అన్నారు. ‘‘వీటిపై లోక్‌సభలో మాట్లాడతానని స్పీకర్‌కు రెండుసార్లు లేఖ రాసినా అవకాశమివ్వలేదు. తానలా చేయలేనంటూ నవ్వి చాయ్ ఆఫర్ చేశారు. ఆయన మరింకేం చేయగలరు? ఇక బహుశా మోదీనే అడగాలేమో. కానీ ఆయనా నాకు మాట్లాడే అవకాశమివ్వరు’’ అన్నారు. విపక్షాలన్నీ ఏకమవ్వాలి వేటును నిరసిస్తూ తనకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించిన విపక్షాలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. భయాందోళనలతో మోదీ తీసుకున్న ఈ వేటు నిర్ణయం విపక్షాలకు చెప్పలేనంత మేలు చేస్తుందని జోస్యం చెప్పారు. ‘‘దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందాం. విపక్షాలు ఒక్కతాటిపైకి రావడం తక్షణావసరం. అందరమూ కలసికట్టుగా పని చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆందోళనలు మోదీ దిష్టి బొమ్మ దగ్ధం రాహుల్‌పై వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శనివారం ఆందోళనలకు దిగింది. ఆయన ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంతో సహా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనంచేశారు. మరోవైపు బీజేపీ కూడా సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ముంబైలో ఆందోళనకు దిగింది. ఓబీసీలను అవమానించే ప్రయత్నాలను సహించబోమని పార్టీ నేతలు హెచ్చరించారు. వేటును సొమ్ముచేసుకునే యత్నం: బీజేపీ పరువు నష్టం కేసు, అనర్హత వేటు తదితరాలు అదానీ ఉదంతం నుంచి జనం దృష్టి మళ్లించేందుకేనన్న రాహుల్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. జైలు శిక్ష నేపథ్యంలో రాహుల్‌పై వేటును కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోందని పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. అందుకే వేటు పడకుండా ముందస్తు చర్యలేవీ చేపట్టలేదని ఆరోపించారు. ఓబీసీలను రాహుల్ అవమానించిన తీరును దేశమంతటా ప్రచారం చేస్తామన్నారు. -
Defamation Case: రాహుల్‌పై అనర్హత వేటు
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం! పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది! ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొంది. తీర్పు వెలువడ్డ ఈ నెల 23వ తేదీ (గురువారం) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. నిజానికి అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొనడం తెలిసిందే. అయినా లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ అనర్హుడవుతారు! శుక్రవారం ఉదయం మామూలుగానే లోక్‌సభ సమావేశానికి హాజరైన ఆయన, లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. రాహుల్‌పై అనర్హత వేటును కాంగ్రెస్ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఆయనకు బాసటగా నిలిచాయి. దీనిపై ‘జనాందోళన్’ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బీజేపీ మాత్రం వేటు చట్టప్రకారమే జరిగిందని పేర్కొంది. రాహుల్‌కు చట్టం వర్తించదా అని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన, అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ‘నేరాలకు పాల్పడడం రాహుల్‌కు అలవాటే. పార్లమెంట్‌కు, ప్రభుత్వానికి, దేశానికి అతీతుడినని ఆయన భావిస్తున్నారు. తమకు ప్రత్యేక భారత శిక్షాస్మృతి ఉండాలని, తమను ఎవరూ నేరస్తులుగా నిర్ధారించవద్దని, శిక్షలు విధించవద్దని కాంగ్రెస్, ప్రధానంగా నెహ్రూ–గాంధీ కుటుంబం కోరుకుంటోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కానీ దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు’’ అన్నారు. వయనాడ్ ఖాళీ లోక్‌సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయినట్టు లోక్‌సభ వెబ్సైట్ పేర్కొంది. ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై హత్యా యత్నం నేరం రుజువై పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్, కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతితో జలంధర్ (పంజాబ్) స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. 2019లో వయనాడ్‌తో పాటు గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి చూవిచూశారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం వేటును నిరసిస్తూ విపక్షాల ర్యాలీ అదానీ అంశంపై జేపీసీతో దర్యాప్తు చేయించాలని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ నిరసన ర్యాలీ చేపట్టిన 40 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు నిర్బంధించారు. పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్‌కు ర్యాలీగా వెళ్లిన ప్రముఖుల్లో కేసీ వేణుగోపాల్, ఆధిర్ రంజన్ చౌధురి, కె.సురేశ్, మాణిక్కం ఠాగోర్æ తదితరులు ఉన్నారు. వీరంతా నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని పోలీసులు చెప్పారు. సెక్షన్ 144ను ఉల్లంఘించి ర్యాలీ చేపట్టిన 40 మంది ఎంపీలను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. అంతకుముందు విజయ్‌చౌక్ వద్ద కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితర నేతలు మాట్లాడారు. ర్యాలీలో కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, శివసేన ఉద్ధవ్ వర్గం, జేడీయూ, ఆప్ నేతలు పాల్గొని ‘వుయ్ డిమాండ్ జేపీసీ’, ‘సేవ్ ఎల్ఐసీ’, ‘డెమోక్రసీ ఇన్ డేంజర్’ అన్న ప్లకార్డులను ప్రదర్శించారు. రాహుల్ నోరు నొక్కేందుకే: కాంగ్రెస్ సోనియా సహా అగ్ర నేతల అత్యవసర భేటీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దీనిపై దేశవ్యాప్తంగా ‘జనాందోళన్’కు పిలుపునిచ్చింది. రాహుల్ సభ్యత్వంపై వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ వెలువడగానే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా శక్రవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. రాహుల్ నోరు నొక్కేందుకే అధికార బీజేపీ ఇలా వాయు వేగంతో చర్యలకు దిగిందని తీర్మానించారు. వేటుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని, మోదీ సర్కారు నిరంకుశ వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, మండల విభాగాలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నాయి. రాహుల్‌కు విపక్షాల సంఘీభావాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ స్వాగతించింది. ‘‘దీనిపై ఐక్యంగా పోరాడదాం. ఆందోళనల్లో మీరు కూడా కలిసి రండి’’ అంటూ ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చింది. భేటీలో ప్రియాంక, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, చిదంబరం తదితరులు పాల్గొన్నారు. స్పందనలు ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజు ‘ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. నిజాలు మాట్లాడుతున్నందుకు, ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నందుకే రాహుల్‌పై అధికార బీజేపీ కక్షగట్టింది. ఆయన గొంతు నొక్కడమే ఉద్దేశం. నిజాలను రాహుల్ బహిర్గతం చేయడం బీజేపీకి ఇష్టం లేదు, రాహుల్‌పై వేటు పడినా అదానీ అక్రమాలపై జేపీసీ విచారణ డిమాండ్‌పై తగ్గేది లేదు. మమ్మల్ని జైలుకు పంపించినా పోరాడుతూనే ఉంటాం’’ – మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు ‘‘మోదీ భారత్‌లో విపక్ష నాయకులే లక్ష్యంగా మారారు. నేర చరితులైన బీజేపీ వారికి మంత్రి పదవులు. విపక్ష నేతలపై అనర్హత వేటు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత హీనమైన పరిస్థితి!’’ మమత బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘రాహుల్‌పై అనర్హత వేటు దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశంలో ఒకే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని అనుకుంటున్నారు. బ్రిటీష్ పరిపాలన కంటే ప్రమాదకరంగా ప్రధాని మోదీ పాలన మారింది. ఇది కేవలం ఒక్క కాంగ్రెస్ చేసే పోరాటం కాదు. దేశాన్ని రక్షించుకోవడానికి 130 కోట్ల మంది భారతీయులు ఏకం కావాలి’’ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మోదీ స్నేహితుడైన పారిశ్రామికవేత్త (అదానీ) అంశాల నుంచి దృష్టి మరల్చే బీజేపీ ఎత్తుగడ ఇది. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కుట్రలు పన్ని, తప్పుడు కేసులు పెట్టి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజమ్‌ఖాన్ సహా ఎందరిపైనో అనర్హత వేటు వేసింది’’ అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ‘‘రాహుల్‌గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగం ప్రాథమిక సిద్ధాంతాలకే వ్యతిరేకం. ప్రజాస్వామ్య విలువలన్నీ మంటగలుపుతున్నారు. ఇలాంటి చర్యల్ని పూర్తిగా ఖండించాలి’’ శరద్ పవార్, ఎన్సీపీ అధినేత ‘‘రాహుల్‌పై అనర్హత ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులపై జరిగిన దాడి. ఇదొక ఫాసిస్టు చర్య. ఒక జాతీయ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడుకి కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరిచే ప్రజాస్వామ్య హక్కు లేదని ఇలాంటి చర్యల ద్వారా భయపెడుతున్నారు’’ ఎంకె స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ‘‘ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేయడానికి పరువు నష్టం మార్గాన్ని బీజేపీ ఎంచుకోవడాన్ని ఖండించాలి. వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటి నిరంకుశ దాడుల్ని ప్రతిఘటించాలి, ఓడించాలి’’ సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ‘‘అబద్ధాలు, వ్యక్తిగత నిందలు, ప్రతికూల రాజకీయాలు రాహుల్‌లో ఒక అంతర్భాగంగా మారాయి. ఒబిసి సామాజిక వర్గాన్ని దొంగలతో పోల్చి రాహుల్ తనకున్న కుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకి ప్రజలు ఇంతకంటే పెద్ద శిక్ష విధిస్తారు.’’ జె.పి. నడ్డా, బీజేపీ అధ్యక్షుడు తలవంచం.. ఏం చేసుకుంటారో చేసుకోండి ‘‘దేశ ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తం ధారపోసింది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రాణత్యాగం చేసిన ప్రధాని కుమారుడైన రాహుల్ గాంధీని ‘మీర్ జాఫర్’ అంటూ మోదీ మనుషులు కించపర్చారు. మా కుటుంబాన్ని దూషించారు. రాహుల్ తండ్రెవరని బీజేపీ ముఖ్యమంత్రి ఒకరు ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని పాటిస్తూ తలపాగా ధరిస్తే దాన్నీ తప్పుపట్టారు. తద్వారా పండిట్ల సామాజిక వర్గాన్ని అవమానించారు. నెహ్రూ ఇంటి పేరు ఎందుకు పెట్టుకోలేదని పార్లమెంట్లో మీరు (మోదీ) మమ్మల్ని ప్రశ్నించారు. మమ్మల్ని దారుణంగా అవమానించినా ఏ జడ్జి కూడా మీకు రెండేళ్ల జైలు శిక్ష విధించలేదు. పార్లమెంట్ నుంచి అనర్హత వేటు వేయలేదు. రాహుల్ నిజమైన దేశ భక్తుడు. అందుకే అదానీ గ్రూప్ సాగించిన లూటీపై ప్రశ్నించాడు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ బాగోతాలపై నిలదీశాడు. మీ మిత్రుడు గౌతమ్ అదానీ పార్లమెంట్ కంటే గొప్పవాడా? అధికార దాహమున్న వ్యక్తుల ముందు మేం తలవంచే ప్రసక్తే లేదు. ఏం చేసుంటారో చేసుకోండి!’’ – ప్రియాంకాగాంధీ వాద్రా, కాంగ్రెస్ నాయకురాలు భారత్ గొంతుక కోసమే నా పోరాటం ‘‘భారతదేశ గొంతుక కోసం పోరాటం సాగిస్తున్నా. ఈ విషయంలో ఎలాంటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నా’’ – రాహుల్ గాంధీ ట్వీట్ -
ప్రధాని మోదీపై పరువునష్టం కేసు వేస్తా: రేణుకా చౌదరి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పరువు నష్టం కేసు వేస్తానని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తెలిపారు. 2018లో పార్లమెంట్లో ప్రధాని ప్రసంగిస్తుండగా ఓ విషయంపై తాను నవ్వానని, మోదీ తన నవ్వును శూర్పణఖ నవ్వుతో పోల్చారని ఆమె పేర్కొన్నారు. సభలో అందరిముందు అవమానిస్తూ మోదీ మాట్లాడిన మాటలు తనను బాధించాయని, అందుకు మోదీపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు కోర్టులు ఎంత వేగంగా పనిచేస్తాయో చుద్దాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈమేరకు మోదీ పార్లమెంట్లో ప్రసంగించిన వీడియోను ఆమె ట్వీట్ చేశారు. ఇందులో.. రామాయణం సీరియల్ ప్రసారం అయిన కొన్ని రోజుల తర్వాత అలాంటి నవ్వు వినిపించినందున రేణుకా చౌదరి నవ్వును కొనసాగించడానికి అనుమతించాలని నరేంద్ర మోడీ రాజ్యసభ ఛైర్మన్‌ను కోరినట్లు కనిపిస్తుంది. కాగా ‘దొంగలందరి ఇంటిపేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద రాహుల్‌ను దోషిగా నిర్ధారించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్.హెచ్.వర్మ.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన అనంతరం బెయిల్ మంజూరు చేశారు. ఈ ఆదేశాలపై కోర్టులో అప్పీలుకు వీలుగా జైలు శిక్షను 30 రోజులపాటు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించడాన్ని విపక్షాలన్నీ ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ తనను శూర్పణఖతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళతానని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ విషయంలో కోర్టులు చాలా వేగంగా స్పందించాయని చెబుతూ.. ఈ కేసు విచారణను ఎంత వేగంగా పూర్తి చేస్తాయో చూడాలని ఆమె అన్నారు. చదవండి: ‘దొంగల ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై... రాహుల్‌కు రెండేళ్ల జైలు This classless megalonaniac referred to me as Surpanakha on the floor of the house. I will file a defamation case against him. Let's see how fast courts will act now.. pic.twitter.com/6T0hLdS4YW — Renuka Chowdhury (@RenukaCCongress) March 23, 2023 -
రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష
-
‘దొంగల ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై... రాహుల్‌కు రెండేళ్ల జైలు
సూరత్/ఢిల్లీ: ‘దొంగలందరి ఇంటిపేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద రాహుల్‌ను దోషిగా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్.హెచ్.వర్మ నిర్ధారించారు. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన అనంతరం బెయిల్ మంజూరు చేశారు. పై కోర్టులో అప్పీలుకు వీలుగా జైలు శిక్షను 30 రోజులపాటు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్ కోర్టులోనే ఉన్నారు. ‘‘ఈ కేసులో దోషి పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఏం మాట్లాడినా అది దేశ ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే కేసు తీవ్రత పెరిగింది. దోషికి తక్కువ శిక్ష విధిస్తే ప్రజలకు తప్పుడు సంకేతం పంపించినట్లు అవుతుంది. ఎవరైనా ఇతరులను ఇష్టారాజ్యంగా దూషించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో రాహుల్ గతంలో క్షమాపణ చెప్పారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు’’ అని న్యాయస్థానంలో తన తీర్పులో పేర్కొంది. కించపర్చే ఉద్దేశం లేదు విచారణ సందర్భంగా రాహుల్ తన వాదన వినిపించారు. తనకు ఎవరిపైనా ఎలాంటి వివక్ష లేదని, దేశ ప్రజలందరినీ అభిమానిస్తానని చెప్పారు. ఎవరినీ కించపర్చే ఉద్దేశం లేదన్నారు. ‘‘ప్రజాప్రయోజనాల కోణంలోనే ఎన్నికల ప్రచారంలో ప్రసంగించా. అది నా విధి’’ అని తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, నిందితుడు గతంలో ఏ కేసులోనూ దోషిగా తేలలేదని, ఎవరి నుంచీ క్షమాభిక్ష కోరలేదని, ఆయనకు తక్కువ శిక్ష విధించాలని రాహుల్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనను ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది ఖండించారు. రాహుల్‌ను గతంలో సుప్రీంకోర్టు మందలించిందని గుర్తుచేశారు. ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. చట్టప్రకారం పోరాడతాం: కాంగ్రెస్ సూరత్ కోర్టు తీర్టుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అప్పీల్ దాఖలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘పిరికిపంద, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై, ప్రతిపక్షాలపై కక్షగట్టింది. ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తున్నందుకు, అదానీపై అంశంపై జేపీసీ నియమించాలని డిమాండ్ చేస్తున్నందుకు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటోంది. రాజకీయ ప్రసంగాలపై కేసులు పెట్టడం చాలా దారుణం. ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే నాలుగు వేళ్లు తమవైపే చూపిస్తాయని బీజేపీ నేతలు తెలుసుకోవాలి. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించాం. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. చట్ట ప్రకారమే పోరాడుతాం’’ అని ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్ భయపడే ప్రసక్తే లేదు: ప్రియాంక తన సోదరుడు రాహుల్ గొంతును నొక్కేయడానికి మోదీ ప్రభుత్వం సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తోందని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వాద్రా మండిపడ్డారు. రాహుల్ గతంలో ఏనాడూ భయపడలేదని, భవిష్యత్తులోనూ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సత్యమే మాట్లాడుతాడని ట్వీట్ చేశారు. దేశ ప్రజల కోసం గొంతెత్తుతూనే ఉంటారని పేర్కొన్నారు. రాహుల్‌కు కేజ్రీవాల్ మద్దతు రాహుల్‌ను పరువు నష్టం కేసులో ఇరికించడం దారుణమని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. బీజేపీయేతర నాయకులు, పార్టీలపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ట్వీట్ చేశారు. వారిని కేసుల్లో ఇరికించడం ద్వారా నిర్మూలించడమే ఉద్దేశమన్నారు. సత్యమే నా మార్గం: రాహుల్ సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ స్పందిం చారు. ‘‘సత్యం, అహింసపైనే నా మతం ఆధారపడి ఉంటుంది. సత్యమే నా దైవం. ఆ దైవాన్ని చేరుకొనే మార్గమే అహింస’’ అంటూ మహాత్మాగాంధీ చెప్పిన సూక్తిని ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర యోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు. సత్యం, ధైర్యసాహసాలే ఆలంబనగా మాతృదేశం కోసం నిర్భయంగా పోరాడడాన్ని ఆ మహనీయుల నుంచి నేర్చుకున్నామన్నారు. క్షమాపణ చెప్పాలి: బీజేపీ రాహుల్ గాంధీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేïపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇతరులను దూషిస్తే శిక్ష తప్పదని చెప్పారు. రాహుల్‌కు జైలుశిక్ష విధించడంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఎవరినైనా దూషించడానికి రాహుల్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందా? అని ప్రశ్నించారు. ఇతరుల పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. అమిత్ షాకు సమన్లు ఇవ్వండి సీబీఐ డైరెక్టర్‌కు జైరాం రమేశ్ లేఖ న్యూఢిల్లీ: ‘‘మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా సర్కారు దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సమన్లు జారీ చేయండి. అవినీతికి సబంధించిన వివరాలు ఆయన నుంచి సేకరించండి’’ అని సీబీఐని కాంగ్రెస్ పార్టీ కోరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ సుబోధ్ జైస్వాల్‌కు లేఖ రాశారు. ‘‘సంగ్మా ప్రభుత్వ అవినీతి గురించి తెలిసే షా ఆరోపణలు చేశారు. దానిపై చర్యల నిమిత్తం వివరాలు సేకరించండి’’ అని కోరారు. ఏమిటీ కేసు? 2019 ఏప్రిల్ 13న కర్నాటకలోని కోలార్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పించారు. ‘దొంగలందరి ఇంటి పేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అని అన్నారు. మోదీ సామాజికవర్గం పరువుకు రాహుల్ నష్టం కలిగించారంటూ గుజరాత్‌లోని సూరత్ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ విజ్ఞప్తి మేరకు విచారణ సూరత్‌లో జరగకుండా విధించిన స్టేను గుజరాత్ హైకోర్టు గత ఫిబ్రవరిలో తొలగించింది. అనర్హత వేటు పడుతుందా? ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన రాజకీయ నాయకుడిపై శిక్ష ఖరారైన తేదీ నుంచి మిగిలిన పదవీ కాలమంతా అనర్హత వేటు పడుతుంది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడు. అయితే, అనర్హత వేటు వెంటనే పడదని సుప్రీంకోర్టు లాయర్ మహేష్ జెఠ్మలానీ చెప్పారు. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం మూడు నెలల గడువు ఇవ్వొచ్చని తెలిపారు. ఈ సమయంలో నేరారోపణ లేదా శిక్షపై అప్పిలేట్ కోర్టు స్టే ఇస్తే అప్పీల్‌పై విచారణ ముగిసే దాకా అనర్హత వేటు కూడా ఆగిపోతుందని వివరించారు. మూడు నెలల్లోగా నేరారోపణ లేదా శిక్ష రద్దు కాకపోతే దోషిపై అనర్హత వేటు వేయొచ్చని పేర్కొన్నారు. శిక్షను రద్దు చేసే అధికారం శిక్ష విధించిన కోర్టుకు కాకుండా అప్పిలేట్ కోర్టుకే ఉంటుందన్నారు. రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షను అప్పిలేట్ కోర్టు రద్దు చేయొచ్చని, అదే జరిగితే అప్పీల్‌పై విచారణ ముగిసేదాకా ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసే అవకాశం లేదని మహేష్ జెఠ్మలానీ వెల్లడించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే శిక్షను అప్పిలేట్ కోర్టు రద్దు చేయడమో లేదంటే నేరారోపణపై స్టే విధించడమో జరగాలని సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది చెప్పారు. రాహుల్ గాంధీకి అప్పిలేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. 2013 నాటి లిలీ థామస్, 2018 నాటి లోక్ ప్రహరి కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఆయన గుర్తుచేశారు. ప్రజాప్రతినిధుల శిక్ష రద్దయితే అనర్హత వేటు కూడా రద్దవుతుందని అప్పట్లో న్యాయస్థానం తేల్చిచెప్పిందని వివరించారు. -
రాహుల్ గాంధీకి పదవీ గండం తప్పదా?
సాక్షి వెబ్‌డెస్క్: ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో.. మోదీ ఇంటి పేరును ప్రస్తావించి చేసిన వ్యాఖ్యలు అంతిమంగా రాహుల్ గాంధీకి చిక్కులు తెచ్చిపెట్టాయి. నాలుగేళ్ల కిందట ఆయనపై నమోదైన పరువు నష్టం కేసులో(Criminal Defamation Case) .. ఇవాళ(గురువారం) రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది గుజరాత్ సూరత్ కోర్టు. అయితే ఆ వెంటనే బెయిల్ మంజూరు చేయడంతో పాటు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసుకునేందుకు ఆయనకు 30 రోజుల గడువు ఇచ్చి కాస్త ఊరట అందించింది. ఇక తీర్పు వెలువడిన వెంటనే మహాత్మా గాంధీని ప్రస్తావిస్తూ.. సత్యమే నా దేవుడు, అహింస దానిని పొందే సాధనం అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. అలాగే.. కాంగ్రెస్ కీలక నేతలు, పార్టీ శ్రేణులు సైతం రాహుల్ గాంధీకి సంఘీభావంగా స్టేట్మెంట్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. ఏం జరగనుందంటే.. బెయిల్ దక్కించుకున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ముప్పై రోజుల్లోగా తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయొచ్చు. అయితే.. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం.. పార్లమెంట్ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష పడితే మాత్రం.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. ఈ లెక్కన రాహుల్ గాంధీకి పదవీ గండం పొంచి ఉందనే చెప్పొచ్చు. మరోవైపు ఐపీసీ సెక్షన్ 499 ప్రకారం.. క్రిమినల్ డిఫమేషన్ కేసు( నేరపూరిత పరువునష్టం దావా) కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడడం అనేది చాలా అరుదైన సందర్భమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ తనకు పడిన శిక్షకు అప్పీల్‌కు గనుక వెళ్లపోతే ఆయన ఎంపీ పదవినీ కోల్పోవాల్సి వస్తుంది. అయితే.. పరిస్థితి అంతదాకా రాదని, ఆయన తీర్పును అప్పీల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించినా.. ఆదేశాల(జైలు శిక్ష విధింపు) నిలుపుదలకు నిరాకరించినా సరే.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఏం జరిగిందంటే.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. కర్ణాటక కోలార్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నీరవ్ మోదీ, లలిత్ మోదీ పేర్లను సైతం ప్రస్తావిస్తూ.. మోదీ ఇంటి పేరుతో ఉన్నవాళ్లంతా.. అంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ, సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో నాలుగేళ్ల పాటు వాదనలు కొనసాగగా.. గత వారం ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది సూరత్ కోర్టు. ఇక ఇవాళ(గురువారం) రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుకుగానూ స్టేట్మెంట్ రికార్డు కోసం మధ్యలో 2021 అక్టోబర్‌లో రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు కూడా. రాహుల్ టార్గెట్ చేసుకుంది ప్రధాని నరేంద్ర మోదీని అని, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీని కాదని, కాబట్టి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది వాదించారు. అయితే చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ మాత్రం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని, పూర్ణేశ్ పరువుకు భంగం కలిగించేవని తేల్చి.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. ఇదీ చదవండి: అప్పటిదాకా పోటీచేయను! -
మాజీ భార్య పరువు తీస్తుంది.. టీమిండియా స్టార్ క్రికెటర్ ఆవేదన, కోర్టు అక్షింతలు
టీమిండియా స్టార్ క్రికెటర్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ కోర్టు మెట్లెక్కాడు. అతని మాజీ భార్య అయేషా ముఖర్జీ తన పరువుకు భంగం కలిగించేలా విష ప్రచారం చేస్తుందని న్యూఢిల్లీలోని పటియాలా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన స్నేహితులు, క్రికెట్‌కు సంబంధించిన వ్యక్తులు అలాగే ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహించే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి అయేషా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తుందని ఆధారాలతో సహా కోర్టులో సమర్పించాడు. తన పరువుకు భంగం కలిగించే సమాచారాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తుందని వాపోయాడు. ధవన్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు అయేషాను మందలించింది. ధవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అలాగే అతని పరువుకు భంగం కలిగేలా ఎలాంటి సమాచారాన్ని మీడియాతో కానీ అతని స్నేహితులు, బంధువులతో కానీ మరే ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై కానీ షేర్ చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ధవన్ సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నత వ్యక్తి అని, అంతేకాక అతను భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుడని, అతని రెప్యుటేషన్ దెబ్బతినే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. Delhi court restrains estranged wife of Shikhar Dhawan from making defamatory allegations against the cricketer report by @NarsiBenwal #ShikharDhawan @SDhawan25 https://t.co/5MWVV4gEUe — Bar & Bench (@barandbench) February 4, 2023 భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన అయేషా తన వాదనలను వినిపించేందుకు ఇది సరైన మార్గం కాదని, ఒకవేళ అలాంటివేవైనా ఉంటే రెండు దేశాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. కాగా, ధవన్ 2012లో అస్ట్రేలియాకు చెందిన అయేషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కుమారుడు (జోరావర్) జన్మించాడు. అయేషాకు ధవన్‌తో పెళ్లికి ముందే వివాహం జరిగింది. వారికి రియా, ఆలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనస్పర్ధల కారణంగా ధవన్-అయేషా 2021లో విడిపోయారు. కోర్టు వీరికి విడాకులు కూడా మంజూరు చేసింది. కోర్టు తీర్పు మేరకు ధవన్ మెయింటెనెన్స్ సరిగ్గా చల్లించట్లేదని అయేషా ప్రస్తుతం ఆరోపిస్తుంది. కాగా, టీమిండియాలో కీలక సభ్యుడైన శిఖర్ ధవన్ ఇప్పటివరకు 34 టెస్ట్‌లు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. ఇందులో 2315 టెస్ట్ పరుగులు (7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు), 6793 వన్డే పరుగులు (17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు), 1759 టీ20 పరుగులు (11 హాఫ్ సెంచరీలు) ఉన్నాయి. ధవన్ పలు మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. -
పరువు నష్టం కేసు.. సిసోడియాకు సుప్రీం హెచ్చరికలు
న్యూఢిల్లీ: ఆప్ ముఖ్య నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ గువాహతి హైకోర్టును సిసోడియా ఆశ్రయించారు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎస్కే కౌల్, ఏఎస్ ఓకా నేతృత్వంలోని బెంచ్ సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. వాదనల సమయంలో ‘‘బహిరంగ చర్చను ఈ స్థాయికి తగ్గిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అంటూ ఈ సందర్భంగా సిసోడియా న్యాయవాది ఏఎం సింఘ్వీని ఉద్దేశించి బెంచ్ వ్యాఖ్యానించింది. కరోనా లాంటి కష్టకాలంలో.. దేశం ఎదుర్కొన్న పరిస్థితులను చూసి కూడా, పిటిషనర్(మనీశ్ సిసోడియాను ఉద్దేశించి..) తీవ్ర ఆరోపణలు చేశాడంటూ బెంచ్ అభిప్రాయపడింది. దీంతో సింఘ్వీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడంటూ బెంచ్ హెచ్చరించింది. కరోనా మొదటి వేవ్ సమయంలో.. మార్కెట్ రేట్ల కంటే ఎక్కువ ధరకు పీపీఈ కిట్స్‌ను నేషనల్ హెల్త్ మిషన్‌కు సరఫరా చేయడం ద్వారా భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ హిమంత బిస్వా శర్మపై సిసోడియా ఆరోపణలు గుప్పించారు. ఆ సమయంలో శర్మ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని, ఆయన భార్యకు చెందిన కంపెనీకి ఆర్డర్లు కట్టబెట్టారంటూ సిసోడియా ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను కొట్టిపారేసిన శర్మ.. స్థానిక కోర్టులో(అసోం) క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేశారు. ఆ కేసును కొట్టేయాలంటూ గువాహతి హైకోర్టులో సిసోడియా ఒక పిటిషన్ దాఖలు చేయగా.. నవంబర్ 4వ తేదీన కోర్టు సిసోడియా పిటిషన్‌ను తిరస్కరించింది. ఆప్ నేత ఎక్కడా కూడా డబ్బులు తీసుకున్నట్లు పేర్కొనలేదని సుప్రీంలో సీనియర్ న్యాయవాది సింఘ్వీ పేర్కొన్నారు. అయితే చర్చను ఈ స్థాయికి తగ్గిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు మందలించడంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారాయన. -
పరువు నష్టం కేసులో రాయపాటి, కన్నా రాజీ
గుంటూరు లీగల్: పరువు నష్టం కేసులో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావులు రాజీ అయ్యారు. మంగళవారం నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు ఇందుకు వేదికైంది. 2010లో రాయపాటి సాంబశివరావు పలు ఆరోపణలు చేస్తూ కన్నా లక్ష్మీనారాయణను విమర్శించారు. అవి తన పరువుకు నష్టం కలిగించాయంటూ కన్నా కోర్టులో పరువు నష్టం దావా చేశారు. పరిహారంగా రూ.కోటి చెల్లించడంతోపాటు భవిష్యత్‌లో మళ్లీ ఏవిధమైన ఆరోపణలు చేయకుండా ఉండేలా పర్మినెంట్ ఇంజెంక్షన్ ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. ఇప్పటికే కన్నా తరఫున సాక్ష్యాలు కోర్టుకు సమర్పించగా.. ప్రస్తుతం రాయపాటి తరఫున సాక్ష్యాలు సమర్పించే దశలో కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జడ్జి ఇరు పార్టీలను మంగళవారం కోర్టుకు పిలిపించి, వారి న్యాయవాదుల సమక్షంలో రాజీ చర్చలు జరిపారు. తాను చేసిన ఆరోపణలను ఉపసహరించుకుంటున్నట్టు రాయపాటి చెప్పగా, దానికి కన్నా అంగీకరించారు. ఇరువర్గాల వారు స్నేహ పూర్వకంగా కేసు రాజీ పడేందుకు అంగీకరించి కోర్టులో ఉమ్మడి మెమో దాఖలు చేశారు. దీంతో కేసును కొట్టి వేస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
సల్మాన్ ఖాన్ పరువు నష్టం కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముంబై సిటీ సివిల్ తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ముంబైలోని పన్వేల్‌లో ఉన్న సల్మాన్ ఫామ్‌హౌస్‌లో సినీనటుల శవాలు ఖననం చేశారంటూ ఎన్ఆర్ఐ కేతన్ కక్కడ్ చేసిన వ్యాఖ్యల పట్ల పరువునష్టం దావా వేశారు బాలీవుడ్ హీరో. కేతన్ కక్కడ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలను తొలగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మార్చిలో సల్మాన్ ఖాన్ ముంబై సివిల్ కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సల్మాన్ ఖాన్ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. విచారణ సందర్భంగా సల్మాన్ ఖాన్ తరఫున న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనానికి వాదనలు వినిపించారు. కక్కడ్ అప్లోడ్ చేసిన వీడియోలు పరువునష్టం కలిగించడమే కాదు.. అవమానకరంగా ఉన్నాయని తెలిపారు. ఇవీ మతపరమైన ఘర్షణలు రెచ్చగొట్టేలా ఉన్నాయని న్యాయస్థానానికి వివరించారు. దీనిపై కక్కడ్ తరఫున వాదిస్తూ పన్వేల్‌లోని భూమి కోసం పోరాటాన్ని విరమించుకోవాలని ఒత్తిడి పెంచేందుకే సల్మాన్ ఖాన్ పరువు నష్టం కేసు దాఖలు చేశారని ధర్మాసనానికి తెలిపారు. కాగా.. సల్మాన్‌కు పన్వేల్‌లో 100 ఎకరాల పొలం ఉండగా.. దాని పక్కనే కేతన్ కక్కడ్ చెందిన ఆస్తులు ఉన్నాయి. -
పరువు నష్టం కేసులో ఆంధ్రజ్యోతికి ఎదురుదెబ్బ
తిరుపతి లీగల్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దాఖలు చేసిన పరువు నష్టం దావాలో ఆంధ్రజ్యోతికి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పరువుకు భంగం కలిగేలా, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కథనాలు ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతిపై టీటీడీ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ వ్యాజ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి టీటీడీ తరపున వాదించడానికి గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలంటూ ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ఇతర ప్రతివాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరుపతి 10వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస శివరామ్ కొట్టివేశారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక 2019 డిసెంబర్ 1న టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా రెండు కథనాలను ప్రచురించింది. దీనిపై ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ, మరో నలుగురిపై టీటీడీ తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో గత ఏడాది మార్చిలో పరువు నష్టం దావా దాఖలు చేసింది. ఈ కేసులో టీటీడీ తరపున ఎంపీ సుబ్రమణ్యస్వామి, మరో ఇద్దరు న్యాయవాదులు వాదనలు వినిపించడానికి టీటీడీ కోర్టు అనుమతి కోరింది. ఇందుకు అనుమతి ఇస్తూ కోర్టు గత ఏడాది మే 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఇతర ప్రతివాదులు పిటిషన్‌ను వేశారు. టీటీడీకి న్యాయవాదిని నియమించుకునే శక్తి ఉందని ఆంధ్రజ్యోతి తరపు న్యాయవాది ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎంపీ సుబ్రమణ్యస్వామి అడ్వొకేట్ యాక్ట్ సెక్షన్ 32 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వ్యక్తిగత ఆసక్తితో కేసును వాదిస్తున్నారని అన్నారు. కేసు వాదించడానికి కోర్టు ఇచ్చిన అనుమతిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఆయన న్యాయవాది కాదని, కోర్టులో ఎలా వ్యవహరించాలో తెలియదని అన్నారు. దీనిపై సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ తనకు చట్టాలపై అవగాహన ఉందని, ఉచితంగా కేసు వాదిస్తున్నానంటూ వాదనలు వినిపించారు. ఆంధ్రజ్యోతి కథనాలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నందునే ఈ కేసు వాదిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. న్యాయవాది కానివారు కూడా కోర్టులో వాదించడానికి అర్హత ఉందన్నారు. సుబ్రమణ్యస్వామి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆంధ్రజ్యోతి పిటిషన్‌ను కొట్టివేసింది. -
స్మృతి ఇరానీ కూతురు బార్ కేసులో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలకు షాక్
Smriti Irani Defamation Case.. గోవాలో బార్ వ్యవహారంలో దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. అయితే, కాంగ్రెస్ నేతల ఆరోపణలు నిరాధారమైనవని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి పరువు నష్టం దావా వేశారు. కాగా, శుక్రవారం ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్ నేతలకు భారీ షాకిచ్చింది. ముగ్గురు హస్తం నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు నోటీసులు జారీ చేసింది. పరువునష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఆగస్టు 18వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అలాగే, గోవాలో బార్ సంబంధించి చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా డిలీట్ చేయాలని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. స్మృతి ఇరానీ వేసిన దావాను కోర్టులోనే ఛాలెంజ్ చేస్తామని కౌంటర్ ఇచ్చారు. అసలు వాస్తవాలను కోర్టుకు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. గోవాలో బార్ల విషయంలో తన కూతురుపై ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ విషయాన్ని లీగల్ నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. అలాగే, రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని మంత్రి స్మృతి ఇరానీ తన పరువు నష్టం దావాలో డిమాండ్ చేశారు. Smriti Irani defamation case: Delhi HC directs three Congress leaders to remove social media posts #SmritiIrani #DelhiHighCourt #Congress https://t.co/2YnwX7jPHD — Lagatar English (@LagatarEnglish) July 29, 2022 ఇది కూడా చదవండి: బెంగాల్ స్కామ్.. నటి అర్పితా ముఖర్జీ కేసులో ఊహించని పరిణామం -
Kangana Ranaut: ముంబై కోర్టుకు కంగన
ముంబై: బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అక్తర్(76) వేసిన పరువు నష్టం కేసులో నటి కంగనా రనౌత్ సోమవారం అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరయ్యారు. కంగన నిర్దోషి అని ఆమె తరఫు లాయర్ పేర్కొన్నారు. మీడియా జోక్యం వద్దంటూ కంగన చేసిన వినతి మేరకు విచారణ సమయంలో లాయర్లు, మీడియా సిబ్బందిని బయటకు వెళ్లాలని మేజిస్ట్రేట్ ఆర్ఎన్ షేక్ విచారణ ఆదేశించారు. అనంతరం, ఇరు పక్షాల లాయర్ల సమక్షంలో కంగన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఓ టీవీ షోలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి జావెద్ అక్తర్ తదితరుల కోటరీయే కారణమంటూ కంగనా చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ట దెబ్బతిందని కోర్టులో ఫిర్యాదు చేశారు. అనంతరం కంగన అదే కోర్టులో.. ఇంటికి పిలిపించుకుని తనపై దౌర్జన్యానికి పాల్పడి, బెదిరించారంటూ జావెద్ అక్తర్‌పై ఫిర్యాదు చేశారు. చదవండి: (బింబిసార.. అందమైన చందమామ కథ) -
గూగుల్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా కోర్టు
కాన్బెర్రా: యూట్యూట్ వీడియోలు తన కెరీర్‌ను పాడు చేశాయంటూ ఓ మాజీ రాజకీయ నాయకుడు వేసిన పరువు నష్టం కేసులో ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. యూట్యూట్ మాతృసంస్థ గూగుల్‌కు 7.15 లక్షల ఆస్ట్రేలియా డాలర్ల (సుమారు రూ.4 కోట్లు) జరిమానా విధించింది. న్యూసౌత్‌వేల్స్ స్టేట్ మాజీ డిప్యూటీ ప్రీమియర్‌గా జాన్ బరిలరో పనిచేశారు. జాన్ బరిలరో పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా 2020 సెప్టెంబర్–అక్టోబర్ మధ్య కాలంలో జోర్డాన్ షాంక్స్ అనే కమెడియన్ పలు వీడియోలు యూట్యూట్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోల కారణంగా బరిలరో రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. సదరు వీడియోలను తొలగించాలంటూ పలుమార్లు ఆయన రాసిన లేఖలను గూగుల్ సంస్థ పట్టించుకోలేదు. దీంతో బరిలరో కోర్టును ఆశ్రయించారు. -
జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి
Actress Amber Heard Cries At Court: ప్రముఖ హాలీవుడ్ హీరో జానీ డేప్ తన మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్‌పై వేసిన పరువు నష్టం దావా కేసుపై ప్రస్తుత కోర్టులో విచారణ జరుగుతోంది. వారు కలుసున్నపుడు జానీ డేప్ తరచూ కొడుతుండేవాడని, తాను గృహహింస బాధితురాలిని అంటూ అంబర్ హెర్డ్ ఇటీవల తను రాసిన ఓ వ్యాసంలో వెల్లడించింది. దీంతో తనపై అంబర్ తప్పుడు ఆరోపణలు చేసిందని పేర్కొంటూ జానీ ఏప్రిల్ 20న మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాలుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. చదవండి: త్వరలో హీరోతో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి, హింట్ ఇచ్చేసిందిగా! ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన హియరింగ్‌లో అంబర్, జానీ డేప్పై సంచలన ఆరోపణలు చేసింది. జానీ తనను తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించింది అంబర్. ‘మా కొద్దిపాటి వైవాహిక జీవితంలో జానీ తరచూ కొట్టేవాడు. అంతేకాదు అసభ్యపదజాలంతో దూషించేవాడు. మొదటి సారి తన టాటూను చూసి నవ్వానని కొట్టాడు. ఆయన శరీరంపై చెదిరిన ఉన్న టాటూ ఏంటని అడగ్గా విన్నో(జానీ డేప్ మాజీ ప్రియురాలు విన్నోనా రైడర్ పేరు) అని సమాధానం ఇచ్చాడు. అది జోక్ అనుకుని నవ్వేశాను. దీంతో నా చెంపపై కొట్టి నీకు ఇది సరదాగా ఉందా? అంటూ అభ్యంతరకర పదం(బీ..) వాడాడు’ అని పేర్కొంది. చదవండి: సినిమాలకు హీరోయిన్ కాజల్ గుడ్‌బై చెప్పనుందా? ఆ సమయంలో తనకు ఏం అర్థం కాలేదని, షాక్‌తో అతనివైపే ఉండిపోయాను’ అని చెప్పింది. అంతేగాక జానీ తనపై పలుమార్లు దాడి చేశాడని, మద్యం, మాదకద్రవ్యాల మత్తులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ భౌతికంగా గాయపరిచేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఇతర యువతుల పట్ల సన్నిహితంగా ఉన్న సంఘటనలు గురించి తరచూ తన దగ్గర ప్రస్తావించేవాడని పేర్కొంది. ఈ క్రమంలో ఓ రోజు తన జీవితంలో అంత్యంత చేదు సంఘటన చోటుచేసుకుందని, ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేని చెప్పింది. ఓ రోజు సాయంత్రం డ్రగ్స్ తీసుకుని ఫుల్ మత్తులో ఉన్న జానీ తన బట్టలు చించి, శరీరా భాగాల్లో కోకైన్ కోసం వేతికాడంటూ నాటి చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అంబర్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'కంగనా సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఆమె ఓ కేసులో నిందితురాలు'
Kangana Ranaut Permanent Exemption Appeal Rejected In Javed Akhtar Case: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె పలు విమర్శలపాలైంది. కంగనా మాట ధోరణి చూసి ఆమెకు అభిమానులు అయిన వారు కూడా లేకపోలేదు. అయితే తాజాగా కంగనాకు ముంబై కోర్టులో చుక్కెదురైంది. బీటౌన్ ఫైర్బ్రాండ్పై ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ పరువు నష్టం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు హాజరు నుంచి 'శాశ్వత మినహాయింపు' కోసం దరఖాస్తు పెట్టుకుంది. కంగనా పెట్టుకున్న ఆ దరఖాస్తును ముంబై కోర్టు తిరస్కరించింది. చదవండి: కోట్లలో ఆస్తులున్న కంగనా రనౌత్.. వాటి విలువ ఎంతంటే? బాలీవుడ్ చిత్రసీమలో స్టార్ హీరోయిన్లలో తాను ఒకరినని, వృత్తిపరంగా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటూ వ్యక్తిగత హాజరుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కంగనా అభ్యర్థించింది. 'కంగనా వృత్తిపరంగా చాలా బిజీగా ఉండొచ్చు.. కానీ, ఆమె ఒక కేసులో నిందితురాలు. ఆ విషయాన్ని ఆమె మర్చిపోవద్దు.' అని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ స్పష్టం చేశారు. కేసు విచారణకు కంగనా సహకరించకుండా, నిబంధనలకు విరుద్ధంగా, తనకు ఇష్టం వచ్చిన పద్దతిలో కంగనా వ్యవహరిస్తోందని కోర్టు తెలిపింది. చదవండి: మీరు చాలా హాట్‌గా ఉన్నారు.. మాకు కోచింగ్ ఇవ్వండి: కంటెస్టెంట్‌తో కంగనా ఆమె సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఒక నిందితురాలిగా కోర్టు నిబంధనలు పాటించక తప్పదని వెల్లడించింది. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరడం హక్కు కాదనే విషయాన్ని తెలుసుకోవాలని కోర్టు సూచించింది. బెయిల్ బాండ్ కోసం చట్టపరంగా ఉన్న నియమనిబంధనలను పాటించాలని ఆదేశించింది. నవంబర్ 2020లో ఓ ఇంటర్వ్యూలో కంగనా తనపై అనుచితి వ్యాఖ్యలు చేసిందని జావేద్ అక్తర్ పరువునష్టం దావా వేశారు. చదవండి: కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు: కంగనా -
స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట.. 18 కేసులు రద్దు
సాక్షి, చెన్నై: పరువు నష్టం దావా కేసుల నుంచి సీఎం స్టాలిన్‌కు ఊరట లభించింది. 18 కేసుల్ని రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. అన్నాడీఎంకే హయాంలో ప్రభుత్వాన్ని, సీఎంను, సీనియర్ అధికారులు, మంత్రులపై అప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్ అనేక ఆరోపణలు చేశారు. దీంతో ఆయన మీద అన్నాడీఎంకే పాలకులు 18 పరువు నష్టం దావా కేసులు నమోదు చేశారు. విమర్శలు, ఆరోపణలు చేసే హక్కు ప్రతిపక్ష నేతగా తనకు ఉందని, ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ అప్పట్లో స్టాలిన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. అదే సమయంలో డీఎంకే అధికారంలోకి రావడం, సీఎంగా స్టాలిన్ పగ్గాలు చేపట్టడంతో కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో పిటిషన్ విచారణను ముగించిన న్యాయమూర్తి నిర్మల్‌కుమార్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకున్న దృష్ట్యా 18 కేసుల్ని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. చదవండి: (సినీ నటి ఇంట్లో చోరీ.. ధనుష్ అరెస్ట్) -
కూకట్పల్లి కోర్టులో సమంతకు ఊరట
Samantha Defamation Case Judgment: కూకట్పల్లి కోర్టులో సమంతకు భారీ ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, యూట్యూబ్ ఛానెల్స్ వెంటనే అలాంటి కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్‌ని కూడా తొలగించాలని హితవు పలికింది. సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కూకట్పల్లి కోర్టు విచారించింది. సమంత ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యవహరించిన రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని కూకట్ పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కూకట్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్లో పేర్కొంది. -
సమంత పిటిషన్ తీర్పును రేపటికి వాయిదా వేసిన కోర్టు
మూడు యూట్యూబ్ ఛానళ్లపై స్టార్ హీరోయిన్ సమంత వేసిన పరువునష్టం దావా కేసు విచారణ కూకట్పల్లి కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తన పరువుకు నష్టం కలిగేవిధంగా వ్యక్తిగత విషయాలపై సదరు యూట్యూబ్ ఛానళ్లు అభ్యంతరకర వార్తలు రాశాయని గత బుధవారం సమంత పటిషన్ దాఖలు చేశారు. దీతో తన క్లయింట్ పరువుకు నష్టం కలిగించేలా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వ్యవహరించాయని సమంత తరపు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు. భావప్రకటనా స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితుటుంటాయని, సమంతకు తన భర్త నాగచైతన్యతో విడాకులు మంజూరు కాకముందే సదరు యూట్యూబ్ ఛానళ్లు ఆమె వ్యక్తిగత, వృత్తిపర జీవితానికి ఇబ్బంది కలిగించాయని, తక్షణమే ఈ కేసును విచారించాలని కోరారు. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత దీంతో ఏకీభవించిన న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించి సోమవారం(అక్టోబర్ 25’వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సమంత పిటిషన్‌ను పూర్తిగా విచారించిన కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. సమంత తరపు న్యాయవాది వాదనలను పూర్తిగా విన్న న్యాయమూర్తి, తీర్పును రేపు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. కాగా సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కూకట్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్లో పేర్కొంది. చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు.. -
యూట్యూబ్ ఛానల్స్‌పై సమంత కేసు.. తీర్పు వాయిదా
Samantha Defamation Petition : మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై నటి సమంత వేసిన పరువు నష్టం దావా కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. మరోసారి వాదనలు విన్న తర్వాత తీర్పు ప్రకటిస్తామని కూకట్పల్లి కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కూకట్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్లో పేర్కొంది. చదవండి: 'పరువునష్టం దావా వేసే బదులు ఆ పని చేయొచ్చు కదా'.. బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత -
యూట్యూబ్ చానళ్లపై సమంత ఇన్‌జంక్షన్ పిటిషన్
కూకట్పల్లి (హైదరాబాద్): వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారంటూ యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తోన్న సుమన్ టీవీ, తెలుగుపాపులర్ టీవీ, డాక్టర్ సీఎల్ వెంకట్రావులపై సినీనటి సమంత గురువారం కూకట్పల్లి కోర్టులో ఇన్‌జంక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. సమంత తరఫు న్యాయవాది బాలాజీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తాము విడిపోతున్నామంటూ సమంత, నాగచైతన్య దంపతులు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అనంతరం సుమన్ టీవీ, తెలుగుపాపులర్ టీవీ, డాక్టర్ సీఎల్ వెంకట్రావులు సమంత పరువుకు నష్టం కలిగించేలా వీడియోలు అప్లోడ్ చేయడంతో పాటు వ్యాఖ్యలు కూడా చేశారని తెలిపారు. వెంటనే వీటిని తొలగించాలని, సమంత పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన వీరు క్షమాపణ చెప్పాలని కోరుతూ కోర్టులో పర్మినెంట్ ఇన్‌జంక్షన్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వులో పెట్టినట్లు ఆయన తెలిపారు. -
సమంత డబ్బుల కోసం కేసులు వేయలేదు : లాయర్
Samantha Defamation Petition: సోషల్‌మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత వేసిన పిటిషన్‌పై కూకట్పల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. పరువు నష్టం దావా వేసే బదులు..వారి నుంచి క్షమాపణ అడగొచ్చు కదా అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 'సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టేది వారే.. పరువుకు నష్టం కలిగింది అనేది వారే' కదా అని కోర్టు పేర్కొంది. తీర్పును రేపటికి వాయిదా వేసింది. చదవండి : బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత అయితే విడాకులు తీసుకోకుండానే సమంత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆమె తరపు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. సమంత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆమెను టార్గెట్ చేసి వార్తలు రాశారని ఈ సందర్భంగా ఆయన కోర్టుకు వివరించారు. సమంత డబ్బు కోసం కేసులు వేయలేదని, రాజ్యాంగం తన హక్కులను కాలరాస్తున్నారని, వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.చదవండి సరిగ్గా తింటున్నావా? ఆర్యన్‌ను ప్రశ్నించిన షారుక్ యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను డిలీట్ చేయడమే కాకుండా, అన్కండిషనల్గా క్షమాపణ చెప్పాల్సిందిగా ఆమె తరపు లాయర్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆమెపై కానీ ఆమె కుటుంబం పై కానీ ఎటువంటి దుష్ప్రచారం చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన కోర్టుకు వివరించారు. చదవండి : షారుక్ కుమార్తె సుహానా ఖాన్‌కు డ్రగ్ డీలర్లతో లింకులు? ఘనంగా వైవా హర్ష వివాహం..ఫోటోలు వైరల్ -
కోర్టును ఆశ్రయించిన సమంత
Samantha Files Defamation Case On 3 Youtube Channels: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై బుధవారం కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, మరో చానల్‌తో పాటు సీఎల్ వెంకట్రావు అనే అడ్వకేట్‌పై సమంత కోర్టులో పిల్ దాఖలు చేశారు. తన వ్యక్తి గత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటి వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లుతోందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక సమంత పిటిషన్‌పై నేడు కూకట్పల్లి కోర్టులో విచారణ జరుగనుంది. సమంత తరుపున హైకోర్టు న్యాయవాది బాలాజీ మరికాసేపట్లో కోర్టులో వాదనలు వినిపించనున్నారు. చదవండి: వీకెండ్ ఇలా అద్భుతంగా గడిచింది: సమంత కాగా ఇటీవల సమంత, నాగ చైతన్యతో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సామ్, చై నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సమంత తన విడాకుల విషయం ప్రకటించినప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తన పరువు ప్రతిష్టలను నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించిన మూడు యూట్యూబ్ చానల్స్‌పై సమంత కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! -
కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: రేవంత్‌కు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణలో డ్రగ్స్‌పై అధికార, ప్రతిపక్షాల సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అయితే తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు న్యాయ పోరాటానికి దిగారు. ఈ సందర్భంగా నిన్న సోమవారం పరువునష్టం దావా వేయగా వివరాలు సక్రమంగా లేవని చెప్పడంతో మంగళవారం మరోసారి మంత్రి కేటీఆర్ దావా వేశారు. చదవండి: యువతకు గుడ్‌న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే.. సిటీ సివిల్ కోర్టులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువు నష్ట దావా పిటిషన్ వేయగా ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సిటీ సివిల్ కోర్ట్ మూడో అదనపు సీనియర్ న్యాయమూర్తి ఆ పిటిషన్‌పై విచారణ చేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్‌రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసు, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు సూచించింది. అక్టోబర్ 20వ తేదీకి విచారణ వాయిదా వేసింది. చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం -
డ్రగ్స్ వార్: రేవంత్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా
డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో లేదా ఆయా కేసులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా రేవంత్‌రెడ్డి దురుద్దేశంతో పదేపదే నా పేరును ప్రస్తావిస్తున్నారు. ఆయన దుష్ప్రచారం వల్ల నాకు సంభవించిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించేలా ఆదేశించాలి. క్రిమినల్ ప్రొసీడింగ్స్ సైతం ప్రారంభించాలి. – కోర్టులో వేసిన దావాలో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్ రాష్ట్రంలో రాజకీయ రచ్చకు తెరలేపింది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘డ్రగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్’ అంటూ రేవంత్ చేస్తున్న ఆరోపణలతో మొదలైన వివాదం సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీసింది. నేతల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రం చేసింది. రాహుల్ గాంధీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరుల పేర్లు ‘వైట్ చాలెంజ్ బరి’లో ప్రస్తావనకు వచ్చేలా చేసింది. ఈ అంశంలో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రకటనలు, పేలుతున్న మాటల తూటాలు ఆసక్తికరంగా మారాయి. ట్వీట్లతో మొదలైన వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. రేవంత్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా దాఖలు చేయడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అమరుల సాక్షిగా తేల్చుకుందాం: రేవంత్ రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రీన్ చాలెంజ్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం గురించే చాలా మందికి తెలుసు.. తాజాగా వైట్ చాలెంజ్ చర్చనీయాంశమయ్యింది. టాలీవుడ్‌తో ముడిపడిన డ్రగ్స్ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా రేవంత్ ఆరోపణల నేపథ్యంలో.. శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించేందుకు చేసే రక్తం, వెంట్రుకల పరీక్షలకు తాను సిద్ధమని కేటీఆర్ రెండురోజుల క్రితం ప్రకటించారు. దీంతో డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి మచ్చా లేదని నిరూపించుకోవాలంటూ.. కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రేవంత్ వైట్ చాలెంజ్ విసిరారు. దేశంలో డ్రగ్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ఈ చాలెంజ్ విసురుతున్నానని అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన చాలెంజ్‌ను స్వీకరించారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరుల స్థూపం వద్ద కేటీఆర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోసం ఎదురుచూస్తానని ప్రకటించారు. దీనిపై కేటీఆర్ సామాజిక మాధ్యమ వేదిక ‘ట్విట్టర్’లో తీవ్రంగా స్పందించారు. నా ప్రతిష్ట దిగజార్చుకోలేను: కేటీఆర్ ‘ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏ తరహా పరీక్షకైనా నేను సిద్ధం. రాహుల్ గాంధీ కూడా ఇష్టమైతే నాతో పాటు పరీక్షలు చేయించుకోవచ్చు. చర్లపల్లి జైలు మాజీ ఖైదీతో కలిసి పరీక్షలు చేసుకోవడం ద్వారా నా ప్రతిష్టను దిగజార్చుకో దలుచుకోలేదు. నేను పరీక్షలు చేసుకుని ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వస్తే క్షమాపణ చెప్పి, నీ పదవికి రాజీనామా చేస్తావా? ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నావా..?’ అని రేవంత్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని, అయితే సహారా, ఈఎస్ఐ కుంభకోణాల్లో కూడా లై డిటెక్టర్ టెస్టులకు వస్తారా? అని ప్రతి సవాల్ చేశారు. దురుద్దేశంతో దుష్ప్రచారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దురుద్దేశంతో గత కొంతకాలంగా తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో కానీ, ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినా రేవంత్‌రెడ్డి దురుద్దేశంతో పదే పదే తన పేరును ప్రస్తావిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన దుష్ప్రచారం వల్ల తనకు సంభవించిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను సైతం ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. కాగా ట్విట్టర్లో ‘రాహుల్ డ్రగ్ టెస్ట్’ హ్యాష్‌ట్యాగ్‌ను వేలాది మంది రీ ట్వీట్ చేయడంతో పొలిటికల్ న్యూస్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. రాహుల్ గాంధీ కూడా ఎయిమ్స్‌లో డ్రగ్ టెస్ట్‌కు ముందుకు రావాలని పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు, ఇతర నేతలు, నెటిజన్లు ట్వీట్ చేశారు. కేటీఆర్ ఆవేశానికి గురై బెదిరిస్తున్నారు.. డ్రగ్స్ విషయంలో రక్త పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమని మంత్రి కేటీఆర్ చెప్పిన తర్వాతే తాను ఆయన్ను సవాల్ చేశానని రేవంత్ పేర్కొన్నారు. తన సవాల్‌కు జవాబు చెప్పాల్సింది పోయి ఆవేశానికి గురై బెదిరించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. కోర్టుకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కేటీఆర్‌కు వైట్ చాలెంజ్ విసిరిన రేవంత్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తన అనుచరులతో కలిసి గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడిన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కొంతసేపు బైఠాయించారు. అనంతరం మాట్లాడుతూ..కేటీఆర్‌తో పాటు కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కూడా చాలెంజ్ విసిరానని, ఆయన వచ్చినా కేటీఆర్ రాలేదని ఎద్దేవా చేశారు. తాను చేసిన చాలెంజ్‌కు కౌంటర్ పేరుతో తన స్థాయి గురించి కేటీఆర్ మాట్లాడడం సబబుగా లేదన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందే తాను ఎమ్మెల్సీనని చెప్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఉన్నానని, జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని చెప్పారు. స్థాయి గురించి మాట్లాడకుండా కేటీఆర్ ఎప్పుడు వచ్చినా ఇదే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు తాను సిద్ధమని, గంట ముందు తనకు సమాచారం ఇస్తే చాలునని రేవంత్ చెప్పారు. ఈ రోజు రాహుల్ రావాలని అంటున్న కేటీఆర్ రేపు ఇవాంకా ట్రంప్ రావాలని అడుగుతారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి కాలనీలో డ్రగ్స్ కారణంగానే అనుచిత ఘటన జరిగిందని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మంత్రుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు పబ్‌లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసేవారంతా టెస్ట్ చేయించుకోవాలి: కొండా రేవంత్ విసిరిన వైట్ చాలెంజ్‌ను స్వీకరించి గన్‌పార్క్ వద్దకు వచ్చిన విశ్వేశ్వర్‌రెడ్డి.. ఈ చాలెంజ్ సమాజానికి మంచిదని వ్యాఖ్యానించారు. రేవంత్ సవాల్‌ను స్వీకరించి ఇక్కడకు వచ్చి ఉంటే కేటీఆర్ స్థాయి మరింత పెరిగేదని అన్నారు. రాజకీయ నాయకులు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారంతా డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని, ఆ తర్వాతే వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించాలని కోరారు. రేవంత్ విసిరిన వైట్ చాలెంజ్‌కు ఓ సామాజిక కార్యకర్తగా, తండ్రిగా ప్రతిస్పందిస్తున్నానంటూ.. తన వంతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్లకు వైట్ చాలెంజ్ విసిరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బాగా బలిసినోడు డ్రగ్స్ తీసుకుంటాడు: బండి సంజయ్ విశ్వేశ్వర్‌రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. ‘కాంగ్రెస్‌లో రాజీ రాజకీయాలు నచ్చకే విశ్వేశ్వర్‌రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. ఆయన విసిరిన చాలెంజ్‌ను స్వీకరిస్తున్నా. అక్టోబర్ 2న నా తొలి విడత పాదయాత్ర పూర్తయిన వెంటనే వారు కోరిన చోటుకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటా. బాగా బలిసినోడు, బలుపెక్కినోడే డ్రగ్స్ తీసుకుంటాడు. పేదోడికి అవి అవసరం లేదు’ అంటూ ప్రతి స్పందించారు. చంద్రబాబు, లోకేశ్‌కు కూడా విసరండి వైట్ చాలెంజ్ పేరిట రేవంత్‌రెడ్డి తెలంగాణ అమరుల స్థూపాన్ని అపవిత్రం చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దిన్ నేతృత్వంలో టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు అమరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తొత్తులా రేవంత్ వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు రేవంత్‌రెడ్డి వైట్ చాలెంజ్ విసరాలని డిమాండ్ చేశారు. -
కోర్టుపై నమ్మకం పోయింది: కంగనా రనౌత్
ముంబై: బెయిల్ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని, లేదంటే వారెంట్లు పంపుతానంటూ కోర్టు పరోక్షంగా బెదిరిస్తోందని, కోర్టుపై నమ్మకం పోయిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఓ ఇంటర్వ్యూలో నటుడు హృతిక్ రోషన్, ప్రముఖ గీత రచయిత జావెద్ అక్తర్లను పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్లో కోటరీ వ్యవస్థ వేళ్లూనుకుంది’ అని కంగన అన్నారు. దీంతో కంగనపై జావెద్ అక్తర్ గతంలో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో తమ ముందు హాజరుకావాలంటూ ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కంగనకు ఫిబ్రవరి నుంచి పలుమార్లు సమన్లు జారీచేశారు. దీంతో ఎట్టకేలకు సోమవారం కంగన కోర్టుకొచ్చారు. బెయిల్ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిందే, లేదంటే వారెంట్ జారీచేస్తామని కోర్టు రెండుసార్లు పరోక్షంగా బెదిరించిందని ఆమె వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తు తమకు వ్యతిరేకంగా సాగుతోందని, వేరే కోర్టుకు కేసును బదలాయించాలని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఆమె సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు అక్టోబర్ ఒకటిన విచారించనుంది. -
‘ఫ్యామిలీమ్యాన్’పై విమర్శలు.. కేఆర్కేకు షాకిచ్చిన నటుడు
Manoj Bajpayee- Kamaal Rashid Khan: సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే విమర్శకుడు కమాల్ రషీద్‌ఖాన్ (కేఆర్కే)కు విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి గట్టి షాకిచ్చాడు. కేఆర్కేపై పరువు నష్టం దావా వేశాడు. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోరాడు. ఈ మేరకు మనోజ్ బాజ్‌పేయి తరఫు న్యాయవాది పరేశ్ ఎస్ జోషి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కాగా మనోజ్ నటించిన ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఎంతగా హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కేఆర్కే మాత్రం అదొక సాఫ్ట్‌పోర్న్ సిరీస్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ అతడిని ఉద్దేశించి.. ‘‘ఒక్క అడల్ట్ సీన్ ఉన్నందుకే సిరీస్‌ను సాఫ్ట్ పోర్న్ అంటావా. నువ్వొక క్రిటిక్. ఇదో పెద్ద జోక్’’ అంటూ విమర్శించాడు. ఇందుకు బదులుగా.. ‘‘నేనేమీ చెత్త పనులు చేయను. కాబట్టి వెబ్ సిరీస్‌లు చూడను. కాబట్టి సునీల్ పాల్ లాంటి వాళ్లను నువ్వు ఇలాంటి విషయాలు అడగాలి. అయినా, చార్సీ, గంజేదీ(ఎప్పుడూ గంజాయి మత్తులో జోగే) మనోజ్‌ను ఎలా చూడగలుతారో? మత్తు బానిసల వల్ల బాలీవుడ్‌ను ద్వేషించే వాళ్లు.. అలాంటి అందరి వ్యక్తులను ద్వేషించాలి కదా’’ అని కేఆర్కే ట్విటర్ వేదికగా స్పందించాడు. గత నెల 26న చేసిన ఈ ట్వీట్‌పై మనోజ్ బాజ్‌పేయి.. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 500 కింద పరువు నష్టం దావా దాఖలు చేశాడు. ఈ విషయం గురించి మనోజ్ లాయర్ పరేశ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే మనోజ్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. సెప్టెంబరు 4న తదుపరి విచారణ జరుగనుంది’’ అని పేర్కొన్నారు. ఇక కేఆర్కేకు కేసులేమీ కొత్త కాదు. గతంలో సల్మాన్ ఖాన్ రాధే మూవీ రివ్యూలో భాగంగా.. హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అతడి లీగల్ టీం కేఆర్కేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే విధంగా.. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మృతి నేపథ్యంలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... ఫ్యామిలీమ్యాన్ సిరీస్‌లో.. ‘‘భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్, మైనర్ బాలికకు బాయ్‌ఫ్రెండ్, చిన్న పిల్లాడు తన వయసుకు మించి ప్రవర్తించడం.. ఓ కుటుంబం అంటే ఇలాగే ఉంటుందా? ఇవా మీరు చూపించేది? మనోజ్ సభ్యత లేని వాడు’’ అంటూ కమెడియన్ సునీల్ పాల్ విమర్శించిన సంగతి తెలిసిందే. చదవండి: Manoj Bajpayee: నేను పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు -
కంగనాకు ఊరట: జావేద్ అక్తర్‌కు ఎదురుదెబ్బ!
సాక్షి,ముంబై: వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కోర్టులో ఊరట లభించింది. ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ కంగనాపై దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ విచారణకు బొంబాయి హైకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ సందర్బంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడో పక్షం మధ్యంతర దరఖాస్తులను అనుమతించలేమనీ, ఎవరైనా కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా ఫిర్యాదుదారు, లేదా న్యాయవాదిని అడుగుతామని తెలిపింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యానికి కోర్టు అనుమతిస్తే సంబంధిత పిటిషన్లు వరదలా వచ్చి పడతాయని కోర్టు వ్యాఖ్యానించింది. కంగనాపై క్రిమినల్ కేసులు ఉన్న నేపథ్యంలో ఆమె పాస్‌పోర్టు రెన్యువల్ నిలిపివేయాలంటూ జూలై 1న అక్తర్ మధ్యంతర పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. అలాగే జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు సింగిల్‌బెంచ్‌ను ఆశ్రయించాలని కంగనాకు కోర్టు సూచించింది. కంగనాపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం కేసులేవీ లేవని తప్పుడు ప్రకటన చేశారని జావేద్ అక్తర్ ఆరోపించారు. ఇందుకు కంగన తరపు కౌన్సిల్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అథారిటీకి తప్పుడు పత్రాలు అందించిందంటూ ఆయన మధ్యంతర పిటీషన్ దాఖలు చేశారు. కోర్టులో తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని రనౌత్ చేసిన ప్రకటన అబద్ధమని, ఇది కోర్టును తప్పుదోవ పట్టించేదని జావేద్ అక్తర్ న్యాయవాది బృందా గ్రోవర్ వాదించారు. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి జస్టిస్ ఎస్ ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమదార్లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఇలాంటి పిటీషన్లను స్వీకరించలేమని జస్టిస్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తామని జావేద్ అక్తర్ న్యాయవాది భరద్వాజ్ తెలిపారు. "కంగనాకు పాస్‌పోర్టు జారీ చేయబడినప్పటికీ, అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో ఆమెపై ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించలేదనే అంశాన్ని పాస్‌పోర్టు కార్యాలయ దృష్టికి తీసుకెడతామని భరద్వాజ్ చెప్పారు. రెండు ఎఫ్ఐఆర్లలో పేరున్నప్పటికీ ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు పెండింగ్‌లో లేదని కంగనా న్యాయవాది వాదించారు. సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళవలసి ఉన్న కారణంగా తన పాస్ట్ పోర్టును రెన్యువల్ చేయాలని కోరుతూ జూన్ 28 న ప్రత్యేక డివిజన్ బెంచ్‌ముందు కంగన పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ మునావర్ అలీ సయ్యద్ కంగనా, ఆమె సోదరి రంగోలిపై నమోదు చేసిన దేశద్రోహం కేసును రద్దు చేయాలని కోరుతూ కంగనా దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 11 వ తేదీకి వాయిదా వేసింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి అనంతరం(జూలై, 2020లో) వివిధ న్యూస్ ఛానళ్లలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ కంగనాపై పరువు నష్టం దావా వేశారు జావేద్ అక్తర్. దీంతో ఫిబ్రవరి 2021లో కోర్టు కంగనాకు నోటీసులు ఇచ్చింది. కానీ కంగన కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆమెకు మార్చిలో బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్
గుజరాత్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ గురువారం సూరత్ కోర్టుకు చేరుకున్నారు. పరువు నష్టం కేసు విషయంలో రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు. 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తి చేసిన సూరత్ బీజేపీ ఎమ్మెల్యే ఆయనపై పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసు విచారణ నిమిత్తం 2019 అక్టొబర్‌లోనే మొదటి సారి రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలో ఎటువంటి తప్పులేదని కోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. చదవండి: పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా -
మాజీ ప్రధాని దేవెగౌడకు భారీ జరిమానా
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పరువు నష్టం కేసులో రూ.2 కోట్లు చెల్లించాలని దేవెగౌడను ఆదేశించింది. 2011 జూన్‌లో ఓ కన్నడ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజ్‌పై దేవెగౌడ వ్యాఖ్యలు చేశారు. పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ సదరు సంస్థ ప్రతినిధులు కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం.. నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 2కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కాగా, నష్టపరిహారంగా దేవెగౌడ నుంచి రూ.10 కోట్లు ఎన్ఐసీఈ కంపెనీ డిమాండ్ చేసింది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజ్‌పై ఇంటర్వ్యూలో చేసిన తన వాదనను ధృవీకరించడంలో దేవెగౌడ విఫలయ్యారని కోర్టు తేల్చింది. ప్రాజెక్టు కోసం అవసరమైన దానికంటే ఎక్కువ భూమిని వినియోగించిందని దేవెగౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు. చదవండి: గోడను బద్దలు కొట్టి.. రూ.55 లక్షలు దోపిడీ -
కర్ణాటకలో పరువు హత్య
మైసూరు: కులమౌఢ్యానికి యువతి బలైంది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని ఓ తండ్రి తన కుమార్తెను కత్తితో పొడిచి అంతమొందించాడు. ఈ దారుణ ఘటన మైసూరు జిల్లా పిరియా పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణంలోని మహాదేశ్వర దేవాలయం రోడ్డులో జయరాం అనే వ్యక్తి తన కు టుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈయన కుమార్తె గాయత్రి(21) ఇదే పట్టణానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడిని ప్రేమిస్తోంది. అతన్నే పెళ్లి చేసుకుంటానని గాయత్రి చెబుతుండేది. అయితే రాఘవేంద్రది వేరే కులం కావడంతో తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈక్రమంలో శుక్రవారం వ్యవసాయ తోటలో ఉన్న తండ్రి జయరాంకు కుమార్తె గాయత్రి భోజనం తీసుకెళ్లింది. అక్కడ మరో మారు పెళ్లి విషయంపై ప్రస్తావన వచ్చింది. విచక్షణ కోల్పోయిన జయరాం గాయత్రిని కత్తితో పొడిచి చంపాడు. అనంతరం పిరియూ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. -
తస్లీమాపై పరువు దావా నష్టం వేయనున్న మొయిన్ అలీ
ముంబై: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ''మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడంటూ'' ట్విటర్లో సంచలన కామెంట్స్ చేసింది. తస్లీమా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. మొయిన్ అలీపై తస్లీమా చేసిన వ్యాఖ్యలపై పలువురు క్రికెటర్లతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ క్రికెటర్లు జోప్రా ఆర్చర్, శామ్ బిల్లింగ్స్‌తో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా మొయిన్ అలీకి మద్దతుగా నిలుస్తూ ఆమెను ఉతికారేశారు. తాజాగా తస్లీమా నస్రీన్ వ్యాఖ్యలపై మొయిన్ అలీ పరువు నష్టం దావా వేయనున్నట్లు సమాచారం. ''మొయిన్ అలీపై తస్లీమా నస్రీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలు అలీ పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని.. అందుకే లీగల్ పద్దతిలో మా లాయర్‌తో చర్చించి కోర్టును ఆశ్రయించనున్నాం. ఒక వ్యక్తిని కించపరిచేలా మాట్లాడినందుకు తస్లీమాపై పరువు నష్టం దావా వేయనున్నాం.''అంటూ అలీ మేనేజ్మెంట్ కంపెనీ ఎసెస్ మిడిల్ ఈస్ట్ తన ట్విటర్లో రాసుకొచ్చింది. అయితే మొయిన్ అలీ తస్లీమా వ్యాఖ్యలపై స్పందించలేదు.. అయితే ఈ విషయాన్ని తన మేనేజ్మెంట్ చూసుకుంటుందని అలీ భావించి ఉంటాడని సమాచారం. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో మెయిన్ అలీ సీఎస్కేకు ఆడనున్న సంగతి తెలిసిందే. కాగా వేలంలో సీఎస్కే అలీని రూ.7 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సీఎస్కే ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్10న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. చదవండి: ‘అతను క్రికెటర్ కాకపోయుంటే టెర్రరిస్ట్ అయ్యేవాడు ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్కే For the record - we are consulting our lawyers with regards the defamatory tweet made by @taslimanasreen in regards to Moeen Ali and will look at the possible angles for legal proceedings - one mustn’t be allowed to utter such nonsense and be allowed to get away with it — Aces Middle East (@Aces_sports) April 6, 2021 -
ఆలియా భట్‌కి షాకిచ్చిన ముంబై కోర్టు
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ‘గంగూభాయ్ కతియావాడీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ముంబై రెడ్ లైట్ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూరా కథ తిరగనుంది. గంగూబాయ్ కతియావాడి టైటిల్ రోల్లో ఆలియాభట్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కథాంశం తన తల్లిని కించపరిచేలా ఉందని ఆమె నలుగురు దత్తపుత్రుల్లో ఒకరైన బాబూజీ రాజీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. సినిమా కథాంశం చనిపోయిన తన తల్లి గోప్యత హక్కును హరించేలా ఉందని షా తన పిటిషన్లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన కోర్టు..ఆలియా భట్, దర్శకుడు భన్సాలీతో పాటు మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబైఅనే పుస్తకాన్ని రచించిన హుస్సేన్ జైదీలకు సమన్లు జారీ చేసింది. దీనిపై మార్చి 21 లోగా సమాధానం చెప్పాలని ముంబై కోర్టు ఆదేశించింది. మాఫియా క్వీన్‌గా పేరు పొందిన ముంబయ్‌లోని కామాటిపురా ప్రాంత వేశ్యలకు నాయకురాలిగా వ్యవహరించిన గంగూబాయ్ కోఠేవాలీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముంబయ్ ఫిల్మ్‌సిటీలో కామాటిపురా సెట్ వేశారు.గంగూబాయ్ పాత్రను ఆలియా చేస్తున్నారు. అయితే ఈనెల ప్రారంభంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా సోకడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయనకు కోవిడ్ నెగిటివ్ వచ్చినందున మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. చదవండి : గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో.. పాట కోసం బ్రేక్ -
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేశా
-
ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) గురించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. టీటీడీ పరువుకు భంగం కలించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తిరుపతిని సందర్శించిన సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘తిరుమల స్వామి వారి ఆలయం గురించి ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు తమను కాపాడతారన్న భావనలో ఆంధ్రజ్యోతి ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిది ఒక మాట.. కానీ, బాబు ఓడిన తర్వాత ఆ మాట మార్చింది. చంద్రబాబుకు ప్రజల మద్దతు లేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు. కుట్రపూరితంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు పరువునష్టం దావా వేశా. నా జీవితంలో ఎప్పుడూ పరువు నష్టం దావా కేసు ఓడిపోలేదు’’ అని ఆంధ్రజ్యోతి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరును విమర్శించారు. చదవండి: వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: బీజేపీ ఎంపీ -
దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. ఎంఐఎం నాయకుడు హుస్సేన్ అన్వర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. 2016లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన దిగ్విజయ్ సింగ్ ఎంఐఎం నేతలపై పలు ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ ఆ పార్టీ నాయకుడు హుస్సేన్ అన్వర్ స్థానిక కోర్టులో పరువ నష్టం దావా వేశారు.ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన్నప్పటికీ పలుమార్లు ఉల్లంఘించారు. దీంతో తాజాగా అరెస్ట్ వారెంట్‌జారీ అయ్యింది. అనారోగ్యం కారణంతో నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా దిగ్విజయ్‌సింగ్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తొసిపుచ్చింది. విచారణను మార్చి 8కి వాయిదా వేసింది. -
మీటూ కేసు : రామాయణం ప్రస్తావన
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా కేసు నుంచి జర్నలిస్టు ప్రియారమణికి విముక్తి లభించింది. 2018లో మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంజే అక్బర్ తనని లైంగికంగా వేధించారంటూ ప్రియారమణి చేసిన ఆరోపణలపై అక్బర్ కోర్టుకెక్కారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే ప్రియారమణికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎంజే అక్బర్ వేసిన దావాను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలకి దశాబ్దాల తర్వాత కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వేదికలోనైనా తనకు జరిగింది వెల్లడించే హక్కు ఉందని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాంజే స్పష్టం చేశారు. తీర్పుని వెలువరించే సమయంలో న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘంలో హోదా ఉన్న వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పలేమని అన్నారు. ‘‘లైంగిక వేధింపులపై తమ గళం విప్పిన మహిళల్ని శిక్షించలేము. ఒక వ్యక్తి పరువు తీశారని ఫిర్యాదులు వచ్చినా మహిళల్ని శిక్షించడానికి వీల్లేదు. మహిళల మర్యాదని పణంగా పెట్టి సంఘంలో మరో వ్యక్తి పరువుని కాపాడలేము’’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘లైంగిక వేధింపులతో మహిళల ఆత్మగౌరవం, మర్యాదకి భంగం వాటిల్లుతుంది. తనపై జరిగిన నేరంతో ఆమె తీవ్రమైన మానసిక సమస్యలనెదుర్కొంటుంది. నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనలపై ఒక్కోసారి ఆమె పెదవి విప్పలేకపోవచ్చు. ఒక్కో సారి ఆమెకి అన్యాయం జరిగిందని కూడా బాధితురాలికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే లైంగిక వేధింపులకు గురైన మహిళలు దశాబ్డాల తర్వాత కూడా బయట ప్రపంచానికి వెల్లడించవచ్చు’’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.‘‘లైంగిక వేధింపులతో బాధితురాలు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుందో సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి కూడా మిగిలిన వారిలాగే మన సమాజంలో కలిసిపోతారు. అతనికీ కుటుంబం, బంధువులు, స్నేహితులు ఉంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలోనే ఉంటారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించుకోవాలి’’ అని మేజిస్ట్రేట్ రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. మహిళల్ని గౌరవించాలంటూ రామాయణ, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలు రాసిన నేలపై వారి పట్ల జరుగుతున్న అకృత్యాలు సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. మహిళలు ఇక మాట్లాడాలి ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పట్ల ప్రియారమణి హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపు మరెందరో మహిళల్ని పెదవి విప్పేలా ప్రోత్సహిస్తుందని ప్రియారమణి వ్యాఖ్యనించారు. ‘‘నేను చేస్తున్న పోరాటం నా ఒక్కదాని కోసం కాదు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలందరి తరఫున పోరాడుతున్నాను. కేవలం మాట్లాడానని నన్ను ఈ కేసులోకి లాగారు. ఒక బాధితురాలినైన నన్ను ముద్దాయిగా బోనులో నిలబెట్టారు. సమాజంలో పలుకుబడి ఉందని, శక్తిమంతులమని బావించే మగవాళ్లు బాధిత మహిళల్ని కోర్టుకీడ్చడానికి ఇకపై ముందు వెనుక ఆలోచిస్తారు’’ అని ప్రియారమణి అన్నారు. ఈ కేసులో తాను విజయం సాధించేలా శ్రమించిన తన లాయర్లకి ప్రియారమణి ధన్యవాదాలు తెలిపారు. -
మీటూ : కేంద్రమాజీ మంత్రికి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : చిత్ర పరిశ్రమలోనే కాక దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మీటూ ఉద్యమం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారంటూ జర్నలిస్ట్ ప్రియా రమణి చేసిన అరోపణలు అప్పట్లో సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. తనపై ప్రియా తప్పుడు ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగంకలిగే విధంగా వ్యాఖ్యలు చేశారని ఎంజే అక్బర్ కోర్టును ఆశ్రయించారు. ప్రియా రమణిపై ఢిల్లీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం కీలక తీర్పునిచ్చింది. బాధితురాలిపై ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ఎప్పుడైనా బయటకు చెప్పుకోవచ్చని స్పష్టం చేసింది. ఎంజే అక్బర్ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం.. ఆమె వ్యాఖ్యలతో పిటిషనర్‌కు పరువు నష్టం జరిగిందని భావించేమని పేర్కొంది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ప్రియా రమణికి న్యాయస్థానంలో ఊరట లభించింది. గత ఏడాది అక్టోబర్‌లో 20 ఏళ్ల క్రితం అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. దీనిని తాజాగా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. కాగా ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు ప్రధానంగా రాజకీయ రంగంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రియా రమణి మొదలు పలువురు మహిళలు అక్బర్‌పై తీవ్రమైన ఆరోపణలతో మీటూ అంటూ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు. -
గర్ల్‌ఫ్రెండ్ సోదరుడికి షాకిచ్చిన బెజోస్!
లాస్ఏంజెల్స్: కోర్టు ఖర్చుల నిమిత్తం తనకు 1.7 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందిగా ఇ- కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ తన గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ సోదరుడు మైకెల్ శాంచెజ్‌కు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విషయాలను బహిర్గం చేసినందుకు భారీ మొత్తం పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్ వేసిన జెఫ్ బెజోస్.. లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్టుకు తన అభ్యర్థన గురించి విన్నవించారు. తమ వ్యక్తిగత వివరాలను 2 లక్షల డాలర్లకు అమ్ముకోవడమే గాకుండా, తనపైనే పరువునష్టం దావా వేశాడని ఆరోపించారు. సోదరి లారెన్తో పాటు మైఖేల్ తనకు నమ్మకద్రోహం చేశాడన్నారు. కాగా లారెన్ శాంచెజ్‌తో బెజోస్‌కు సంబంధం ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు కారకులైన వారి గురించి తాను తెలుసుకునేందుకు ప్రయత్నించగా, కొంతమంది అజ్ఞాత వ్యక్తులు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారని బెజోస్ 2019లో ఆరోపించారు. కాగా అప్పటికే భార్య మెకాంజీతో విభేదాలు తలెత్తగా విడాకులు తీసుకునేందుకు ఆయన సిద్ధపడ్డారు. బెజోస్ వివాహేతర సంబంధం కారణంగానే మెకాంజీ ఆయన నుంచి విడిపోయారని అప్పట్లోవార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉండగా.. తన సోదరికి చెందిన నగ్న ఫొటోల లీకేజీ వెనక జెఫ్ బెజోస్ హస్తం ఉందని మైఖేల్ శాంచెజ్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఓ సంస్థకు ఆయన ఇచ్చిన కొన్ని ఫొటోలను ఆధారాలుగా చూపిస్తూ గతేడాది ఫిబ్రవరిలో లాస్ ఏంజెల్స్‌లోని కౌంటీ సుపీరియర్ కోర్టులో పరువునష్టం దావా వేశారు.(చదవండి: మొత్తంగా 6 బిలియన్ డాలర్ల విరాళాలు!) ఈ క్రమంలో నవంబరులో ఈ పిటిషన్‌ను విచారించిన జడ్జి సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక (యాంటీ- స్లాప్ లా ప్రకారం) ప్రతివాది కోర్టు ఖర్చులు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు మిలియన్ డాలర్లకు పైగా పరిహారం ఇవ్వాల్సిందిగా బెజోస్ కోరారు. ఈ విషయంపై స్పందించిన మైఖేల్ తరఫు న్యాయవాది.. ‘‘బెజోస్ కోర్టు ఫీజు కోరడం అనైతికంగా, అత్యంత వికారంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఇక ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా, బెజోస్ రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. -
పరువు నష్టం: సారీ చెప్పిన సీనియర్ నేత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడికి క్షమాపణలు చెప్పారు. దోవల్ కుమారుడు వివేక్ దోవల్‌పై జైరాం రమేశ్ 2019 జనవరిలో ఓ మేగజైన్లో వచ్చిన ఆర్టికల్‌ను అనుసరించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు పత్రికా ప్రకటనల్లోనూ అదే తరహా విమర్శలు గుప్పించారు. దీంతో తమపై నిరాధార ఆరోపణలు చేసిన జైరాం రమేశ్‌పైనా, సదరు మేగజైన్ నిర్వాహకులపైనా వివేక్ పరువు నష్టం దావా వేశారు. ఉన్నత స్థానంలో ఉన్న తన తండ్రిని అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారని కోర్టుకు విన్నవించారు. తాజాగా దావాకు సంబంధించి జైరాం రమేశ్ స్పందించారు. ఎన్నికల ప్రచార వేడిలో అప్రయత్నంగా వివేక్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా భంగపరిచి ఉంటే దానికి చింతిస్తున్నానని ప్రకటనలో పేర్కొన్నారు. వివేద్ దోవల్‌కు, అతని కుటుంబ సభ్యులకు సారీ చెబుతున్నానని అన్నారు. గతంలో వివేక్‌పై తన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రకటనలు ఏవైనా ఉంటే అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ను కోరారు. కాగా, రమేశ్ క్షమాపణల్ని అంగీకరిస్తున్నామని వివేక్ దోవల్ ఓ జాతీయ మీడియాతో అన్నారు. రమేశ్‌పై వేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. అయితే, తప్పుడు వార్తలు రాసిన కారవాన్ మేగజైన్‌పై మాత్రం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
ప్రముఖ టీవీ ఛానెల్‌పై రూ.200 కోట్ల దావా
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు, బాలీవుడ్ నిర్మాత సందీప్ సింగ్ రిపబ్లిక్ టీవీ ఛానల్‌పై 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఈమేరకు రిపబ్లిక్ టీవీ కార్యాలయానికి, ఆ ఛానల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి బుధవారం నాడు నోటీసులు పంపించారు. ఛానల్ టీఆర్పీ పెంచుకోవడం కోసం తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార కథనాలను ప్రచారం చేశారని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. సుశాంత్ కేసులో తనను కీలక సూత్రధారిగా, హంతకుడిగా పరిగణించారని మండిపడ్డారు. (చదవండి: సుశాంత్ కేసు : సీబీఐ ఎదుట యూటర్న్) వెంటనే వారు తనకు లిఖితపూర్వకంగా లేదా వీడియో సందేశం ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నిజానిజాలు సైతం వెల్లడించాలని కోరారు. దాంతో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వార్తలను ఛానల్ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. కాగా సుశాంత్ కేసు పాట్నా నుంచి సీబీఐ విచారణకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణం బాలీవుడ్‌ను అతలాకుతలం చేస్తోంది. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు బాలీవుడ్‌ను చీల్చి చెండాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ బాలీవుడ్ నిర్మాతలు.. రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసిన విషయం విదితమే. (చదవండి: మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి) -
‘హనీ ట్రాప్’ కథనంపై కలెక్టర్ల ఆగ్రహం
-
‘హనీ ట్రాప్’ కథనంపై కలెక్టర్ల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ‘‘హనీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ’’ పేరుతో ఓ దినపత్రిక ప్రచురించిన నిరాధార వార్తా కథనంపై జిల్లా కలెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ల వ్యవస్థపై జరిగిన ఉద్దేశపూర్వక దాడిగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లంతా కలిసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వార్తా కథనం ప్రచురించిన వారిని కోర్టుకు ఈడ్చాలని, పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో, వినూత్న నిర్ణయాలతో ప్రజలకు అత్యంత చేరువగా పాలన అందించడం ద్వారా ఏపీలో ఏపీ కలెక్టర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శంగా తయారైంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రజలను ఆదుకునేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. అంతేగాక కరోనా లాంటి విపత్కర సమయంలో ఈ పథకాల ద్వారా అనేక వర్గాలను ఆదుకున్నారు. అర్హులకు వీటిని అందించడంలో, అవినీతిలేకుండా పారదర్శకంగా పథకాలను అమలు చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో కలెక్టర్లందరికీ కూడా ప్రజల్లో మంచి పేరు వచ్చింది. అలాంటి వ్యవస్థపై కుట్రపూరిత ఆలోచనతో, కలెక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి కథనాలను వండివారస్తున్నారని కలెక్టర్లు మండిపడుతున్నారు. తమ కుటుంబాల్లో కూడా ఈ కథనాలపై విస్తృతమైన చర్చ నడుస్తోందని, దీని వల్ల తమ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అసత్య కథనాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని పిల్లలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు ఇన్ని గంటలు కష్టించి పనిచేస్తున్నా.. తమపై ఈ రాతపూర్వక దాడి ప్రేరేపిత చర్య అని, ఆధారాలు లేకుండా, అనైతిక ఆలోచనలతో మసాలా వార్తలు వండి ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి తీరు గర్హనీయమన్నారు. పరిధులు దాటి, విశృంఖల కోణంలో ఈ కథనాలున్నాయి. కలెక్టర్లను మానసికంగా దెబ్బతీసి కొందరికి ఇతోధిక ప్రయోజనాలు కల్పించాలన్న కోణం ఇందులో కనిపిస్తోంది. వీటిని చూస్తూ ఊరుకుంటే... కలెక్టర్లు స్వేచ్ఛగా పనిచేయలేరు. అందుకే చట్టప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
శశి థరూర్‌పై కోర్టు ఆగ్రహం, జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు జరిమానా విధించింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు రాజీవ్ బబ్బర్ దాఖలు చేసిన దాఖలైన పరువు నష్టం కేసులో పదేపదే హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆయనకు రూ. 5వేల జరిమానా విధించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణకు హాజరుకావాలని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విశాల్ పహుజా ఆయనను ఆదేశించారు. కాగా 2018లో బెంగళూరు సాహిత్య ఉత్సవంలో శశి థరూర్ ఈ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని శివలింగంపై తేలులా ఆరెస్సెస్ వారు భావిస్తుంటారు. ఆ తేలును చేత్తో తీసేయలేం. చెప్పుతో కొట్టలేం అనుకుంటుంటారు. ఈ విషయం ఆరెస్సెస్‌లోని ఒక వ్యక్తి ఓ జర్నలిస్ట్‌కు చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. చదవండి : మోదీ.. శివలింగంపై తేలు! -
నగ్న ఫోటోల లీకేజీ వివాదంలో ప్రపంచ కుబేరుడు
వాషింగ్టన్ : ప్రపంచ అపర కుబేరుడు, అమెజాన్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి జెఫ్ బెజోస్ చిక్కుల్లో పడ్డారు. ఆయన గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ సోదరుడు మైకెల్ శాంచెజ్... జెఫ్ బెజోస్పై పరువునష్టం దావా వేశారు. తన సోదరికి చెందిన నగ్న ఫొటోల లీకేజీ వెనక జెఫ్ బెజోస్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ సంస్థకు ఆయన ఇచ్చిన... కొన్ని ఫొటోలను ఆధారాలుగా చూపించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి... లాస్ ఏంజెల్స్‌లోని కౌంటీ సుపీరియర్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఐతే... బెజోస్ తరపున పనిచేస్తున్న సెక్యూరిటీ కన్సల్టెంట్ గావిన్ డి బెకెర్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. మైకెల్ శాంచెజ్.. ఆధారాలుగా సమర్పించిన ఫొటోల్లో ఉన్నది జెఫ్ బెజోస్ కాదనీ.. అవి గ్రాఫిక్ న్యూడ్ ఫొటోలని ఆయన అంటున్నారు. దీనిపై త్వరలోనే బెజోస్ కోర్టుకు వివరణ ఇస్తారని ఆయన తరపు లాయర్ విలియం తెలిపారు. కాగా జనవరిలో జెఫ్ బెజోస్‌కి చెందిన కొన్ని వ్యక్తిగత వివరాలను ఓ మీడియాసంస్థ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. -
టాటాపై వాడియా కేసు వెనక్కి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలువురిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను బాంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. రూ. 3,000 కోట్ల నష్టపరిహారం దావా కూడా వీటిలో ఉంది. వాడియా ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశమేదీ తమకు లేదంటూ టాటా సహా మిగతా వర్గాలు న్యాయస్థానానికి తెలియజేశారు. హైకోర్టు విచారణలో కూడా ఇదే తేలినందున పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవడానికి వాడియాను అనుమతిస్తూ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. 2016లో టాటా గ్రూప్ కంపెనీ బోర్డుల నుంచి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ రతన్ టాటాతో పాటు టాటా సన్స్‌లోని పలువురు డైరెక్టర్లపై వాడియా క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై 2018 డిసెంబర్ 15న ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు.. టాటా, తదితరులకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశమేదీ లేదంటూ టాటా, తదితరులు ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. దీన్ని సవాల్ చేస్తూ వాడియా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, ఇరు వర్గాలు కూర్చుని విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ జనవరి 6న సుప్రీం కోర్టు సూచించింది. దీనికి అనుగుణంగా వాడియా తాజాగా కేసును ఉపసంహరించుకున్నారు. -
రాహుల్‌పై పరువునష్టం దావా!
-
రాహుల్‌పై పరువునష్టం దావా!
సాక్షి, ముంబై: ‘నా పేరు రాహుల్ గాంధీ. రాహుల్ సావర్కర్ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూవులు దైవంతో సమానంగా పూజించే సావార్కర్‌ను కించపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యానించారని మండిపడుతున్నారు. దీనిపై తాజాగా వీర్ సావార్కర్ మనవడు రంజిత్ సావార్కర్ స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు. అలాగే దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కూడా చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండించాలని ఠాక్రేను కోరనున్నట్లు ఆయన ప్రకటించారు. (నా పేరు రాహుల్ సావర్కర్ కాదు) ఆదివారం ముంబైలో నిరసన ర్యాలీని చేపట్టిన రంజిత్ ఆ సమావేశంలో ప్రసంగించారు. శివసేన హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని, కాంగ్రెస్‌తో స్నేహానికి ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు. ఠాక్రే మంత్రివర్గంలోని కాంగ్రెస్ మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాట యోధులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. రాహుల్ ‘సావర్కర్’ వ్యాఖ్యలపై శివసేన ఇదివరకే స్పందించింది. హిందుత్వ సిద్ధాంతాల విషయంలో తమ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ‘వీర్ సావర్కర్ మహారాష్ట్రకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి ఆదర్శనీయమైన వ్యక్తి. నెహ్రూ, గాంధీలకు లాగానే సావర్కర్ కూడా దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. అలాంటి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’అని ట్వీట్ చేశారు. -
విచారణకు రాకుంటే.. వారంటు జారీ చేస్తాం!!
ముంబై: ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అవకతవకల కేసుకు సంబంధించి యాక్సిస్ బ్యాంక్, స్టాన్‌చార్ట్ బ్యాంకుల సీఈవోల తీరుపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 16న జరిగే కేసు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని, రాని పక్షంలో నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి, స్టాన్‌చార్ట్ ఇండియా సీఈవో జరీన్ దారువాలా ఈ కేసు విచారణకు ఇప్పటిదాకా హాజరుకాకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
నేను ఏ తప్పూ చేయలేదు: రాహుల్ గాంధీ
సూరత్: పరువునష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. తాను ఏ తప్పూ చేయలేదని విచారణ సందర్భంగా కోర్టుకు రాహుల్ తెలిపారు. న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేకుండా శాశ్వత వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ అభ్యర్థనపై నిర్ణయాన్ని డిసెంబర్ 10న తెలియజేస్తామన్న కోర్టు.. ఆ రోజు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రాహుల్‌కు మినహాయింపు ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దొంగలంతా మోదీలే ఎందుకవుతారని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరు సహజంగా ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువునష్టం దావా వేశారు. -
మళ్లీ గెలిచిన గేల్
సిడ్నీ: వెస్టిండీస్ క్రికెట్ స్టార్ క్రిస్ గేల్ న్యాయపోరాటంలో మరోసారి గెలిచాడు. పరువు నష్టం కేసులో గేల్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పును సవాల్ చేసిన ఫెయిర్ ఫ్యాక్స్ మీడియాకు కోర్టులో చుక్కెదురైంది. గేల్‌కు 3 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ. కోటీ 45 లక్షలు) పరిహారంగా చెల్లించాల్సిందేనని తాజాగా న్యూసౌత్‌వేల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే పరిహారాన్ని మరింత పెంచాలంటూ గేల్ చేసిన మరో అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. 2015 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఒక మహిళతో గేల్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె ముందు నగ్నంగా నిలబడ్డాడని గేల్‌పై 2016లో పత్రికలో వరుస కథనాలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టిపారేసిన గేల్ కోర్టును ఆశ్రయించాడు. తనకు చెడ్డపేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కథనాలు ప్రచురించారని, అలాంటి ఘటన ఏదీ జరగలేదని అతను వాదించాడు. ఫెయిర్ ఫ్యాక్స్ తన వార్తలకు సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో కోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ అతనికి పరిహారం చెల్లించాలని మీడియా సంస్థను ఆదేశించింది. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. ఈ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం మెట్రపాలిటన్ కోర్టు న్యాయమూర్తి రాహుల్‌ను నేరాన్ని మీరు అంగీకరిస్తారా అని అడగ్గా తాను నేరగాడ్ని కాదని ఆయన బదులిచ్చారు. అహ్మదాబాద్ మెట్రపాలిటన్ కోర్టులో జరిగిన కేసు విచారణకు రాహుల్ స్వయంగా హాజరయ్యారు. రూ 15,000 పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నోట్ల రద్దు జరిగిన అయిదు రోజుల తర్వాత అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్‌లో రూ 745.59 కోట్ల నల్ల ధనాన్ని అసలైన నోట్లతో మార్చుకున్నారని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ బ్యాంక్ డైరెక్టర్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకరు కావడం గమనార్హం. ఈ కేసులో వీరిద్దరిపై ప్రాధమిక సాక్ష్యాధారాలు లభించడంతో ఈ ఏడాది ఏప్రిల్ 9న వీరికి కోర్టు సమన్లు జారీ చేసింది. తమ బ్యాంక్‌పై కాంగ్రెస్ నేతలు నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసి తమ ప్రతిష్టకు భంగం కలిగించారని బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది. -
వ్యతిరేకించినందుకే వేటాడుతోంది
పట్నా: తమ విధానాలను వ్యతిరేకించే వారిని మోదీ ప్రభుత్వం వేటాడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వ విధానాలు, బీజేపీ–ఆరెస్సెస్ వైఖరికి వ్యతిరేకంగా గొంతు విప్పినందుకే తనపై కక్ష కట్టి కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన పోరాటాన్ని కొనసాగిస్తానని శనివారం నాడిక్కడ విలేకరులకు స్పష్టం చేశారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ ఇక్కడి మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు.కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. బెయిలు పొందాకా బయటకు వచ్చిన రాహుల్ కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ‘దేశంలో పేదలు, రైతులు, కార్మికుల తరఫున పోరాడాలని నిర్ణయించుకున్నా. వారికి సంఘీభావం తెలియజేయడం కోసమే ఇక్కడికి వచ్చాను. మోదీ ప్రభుత్వం,బీజేపీ,ఆరెస్సెస్‌లకు వ్యతిరేకంగా గొంతెత్తే వారందరినీ కోర్టు కేసులతో ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని ఇబ్బందులొచ్చినా నా పోరాటం కొనసాగుతుంది’ అని రాçహుల్ గాంధీ స్పష్టం చేశారు. తనను వేధించడాని కి, భయపెట్టడానికే బీజేపీ, ఆరెస్సెస్‌ల్లో ఉన్న తన రాజకీయ ప్రత్యర్థులు ఈ పరువు నష్టం కేసులు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీ అనే ఎందుకుంటుందో’అని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యకు నిరసిస్తూ సుశీల్‌కుమార్ ఆయనపై పరువునష్టం దావా వేశారు. రాహుల్ తన నేరాన్ని ఒప్పుకోకపోవడంతో జడ్జి కేసు విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేశారు. -
ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎంపీకి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చడంపై దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు రూ.20 వేలు చెల్లించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. గతేడాది అక్టోబర్‌లో బెంగళూరు వేదికగా జరిగిన లిటరేచర్ ఫెస్టివల్లో శశిథరూర్ మాట్లాడుతూ.. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ మాటను మోదీ వినే పరిస్థితుల్లో లేరని అర్ధం వచ్చేలా శశిథరూర్ విమర్శలు చేశారు. ‘మోదీ శివలింగంపై కూర్చున్న తేలు వంటివారు. చేత్తో తొలగించలేరు, చెప్పుతోనూ కొట్టలేరు’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఈమేరకు బీజేపీ నేత రాజీవ్ బబ్బార్ ఆయనపై పరువునష్టం కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరైన శశిథరూర్.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
దివ్య స్పందన కేసులో 50 లక్షల ఫైన్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ఎంపీ, కన్నడ సినీ నటి దివ్య స్పందన (రమ్య)కు పరువు నష్టం కేసులో 50 లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా ఆసియా నెట్ టీవీ ఛానెల్, దాని అనుబంధ సంస్థ సువర్ణ న్యూస్‌ను బెంగళూరు కోర్టు ఇటీవల ఆదేశించింది. 2013లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆమెను తప్పుగా ఇరికించినట్లు కోర్టు తీర్పు చెప్పింది. ఇక ముందు సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఐపీఎల్ ఫిక్సింగ్ స్కామ్‌తో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి వార్తలు ప్రసారం చేయరాదని కూడా ఆదేశించినట్లు ‘బార్ అండ్ బెంచ్’ వెబ్సైట్ బుధవారం వెల్లడించింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐపీఎల్ జట్టుకు దివ్య స్పందన బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. అయితే ఆమె 2013 ఐపీఎల్ ఎడిషన్‌కు పనిచేయలేదు. అప్పుడు జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇద్దరు కన్నడ నటీమణుల హస్తం ఉందంటూ పేర్లు వెల్లడించకుండా దివ్వ స్పందనను చూపిస్తూ ఓ వార్తా కథనం ఆసియానెట్ ఛానెల్‌తోపాటు సువర్ణ న్యూస్ ఛానెల్లో ప్రసారం చేశారు. ఎవరి పేర్లను ప్రస్తావించనందున దివ్వ స్పందన పరువుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఛానెళ్లు వాదించాయి. స్పందనను చూపినందున ఆమెకు నష్టం జరిగిందని కోర్టు భావించింది. -
#మీటూ : ప్రియా రమణికి బెయిల్
న్యూఢిల్లీ : బాలీవుడ్లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమాల్లో, రాజకీయాల్లో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారి ముసుగులు తొలగించింది. ఎంజే అక్బర్ ఏకంగా మంత్రి పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన మీద ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ ప్రియా రమణి మీద అక్బర్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేస్తూ పటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ప్రియా రమణి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ఇక ఇప్పుడు నా వంతు.. నా కథను ప్రపంచానికి వినిపించే సమయం వచ్చింది. నిజమే నా ఆయుధం’ అని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో 20 ఏళ్ల క్రితం అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. (#మీటూ : అక్బర్ అత్యాచార పర్వం..వైరల్ స్టోరీ) -
పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ సహచరుడు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ రాజకీయ కార్యదర్శి పవన్ ఖేరా దాఖలు చేసిన పరువు నష్టం కేసు నుంచి కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం విముక్తి కల్పించింది. షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో 2012 అక్టోబర్‌లో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఖేరా పరువునష్టం దావా వేశారు. షీలా దీక్షిత్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తాను ఆమె రాజకీయ సహాయకుడిగా ఉన్నందున తన గౌరవాన్ని మంటగలిపేలా ఉన్నాయని ఖేరా ఈ కేసులో పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలు నేరుగా ఖేరాను ఉద్దేశించి లేనందున ఆయన ప్రతిష్టకు నిర్ధిష్టంగా ఎలాంటి భంగం వాటిల్లలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో ఫిర్యాదుదారుపై నిందితుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ప్రాధమిక ఆధారాలు లేవని, ఫిర్యాదుదారు దాఖలు చేసిన పరువునష్టం దావాను కొనసాగించలేమని స్పష్టం చేసింది.