సింగపూర్ ఫ్యాషన్ టెక్నాలజీ కంపెనీ జిలింగో కో-ఫౌండర్, మాజీ సీఈవో అంకితి బోస్ మరోసారి తెరపైకి వచ్చారు. ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్, సీడెడ్ ఫండ్ సంస్థ కోఫౌండర్ మహేష్ మూర్తిపై రూ.800 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
మార్చి 1,2023న ఓ బిజినెస్ మ్యాగజైన్‌లో మహేష్ మూర్తి ఓ కథనం రాశారు. అయితే ఆ కథనంలో తన పేరును ప్రస్తావించినందుకు గాను మహేష్ మూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంకితి బోస్ న్యాయ సంస్థ సింఘానియా అండ్ కో ఎల్‌ఎల్‌పీ ఆధ్వర్యంలో బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
పలు నివేదికల ఆధారంగా
వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ఆధారంగా..పరువు నష్టం దావా కేసులో మూడేళ్లుగా స్టార్టప్‌లపై మహేష్ మూర్తి తీరును తప్పుబడుతూ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20న నమోదైన ఈ డిఫర్మేషన్ కేసు (పరువు దావా నష్టం) లో అంకితి బోస్ పిటిషనరేనని తేలింది.
మహేష్ మూర్తి కథనం ఏం చెబుతోంది?
మహేష్ మూర్తి రాసిన బిజినెస్ మ్యాగజైన్‌లో పేరు కంపెనీ, సీఈవో పేరు ప్రస్తావించకుండా ‘ఒక మహిళ (అంకితి బోస్) ప్రముఖ ఫ్యాషన్ పోర్టల్ (జిలింగో)ను నడుపుతుంది. జిలింగోలో పెట్టుబడిదారులైన సీక్వోయా క్యాపిటల్ నిధుల్ని దుర్వినియోగం చేశారు. న్యాయపరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందేలా ఆమె తన లాయర్లకు రూ. 70 కోట్లు ఫీజుగా చెల్లించేందుకు సంస్థ నిధుల్ని వినియోగించారని తెలిసింది. అంతేకాదు తానొక గ్లామరస్ సీఈవోగా ప్రపంచానికి తెలిసేలా ఓ పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రాజెక్ట్‌లో భాగంగా ఆమె సదరు పీఆర్ సంస్థకు సంవత్సరానికి రూ.10 కోట్లు చెల్లించారు. ఆ నిధులు సైతం జిలింగో నుంచి పొందారని తెలిపారు.
బోస్ స్పందన
మహేష్ మూర్తి రాసిన కథనంపై అంకితి బోస్ స్పందించారు. ఆ ఆర్టికల్‌లో 'అబద్ధాలు, వక్రీకరణలు, విషపూరిత వాదనలు' ఉన్నాయి. పబ్లిక్ డొమైన్లలో బాధ్యతాయుతంగా ఉండాలి. మహిళా వ్యవస్థాపకుల శక్తి సామార్ధ్యాలతో వారి సాధించాలనుకున్న లక్ష్యాల్ని నిరోధించేలా, లైంగిక ధోరణిలు ప్రతిభింభించేలా ఉన్నాయని ఆమె అన్నారు.
నిధుల దుర్వినియోగం
బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం..8 దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం..500మంది ఉద్యోగులు.. రూ7వేల కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు..ఇవన్నీ సాధించింది ఏ తలపండిన వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే! భారత్‌కు చెందిన 23 ఏళ్ల యువతి అంకితి బోస్. చిన్న వయసులోనే దేశం కానీ దేశంలో జిలింగో సంస్థను ఏర్పాటు చేసి ఇంతింతై వటుడింతై అన్న చందనా..ఆ సంస్థను ముందుండి నడిపించారు. కానీ గత ఏడాది రేపోమాపో యూనికార్న్ హోదా దక్కించుకోబోతున్న జిలింగో స్టార్టప్ పునాదులు కదిలిపోయాయి. నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో అవమానకర రీతిలో సంస్థ నుంచి బయటకు వచ్చారు.
చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్!
Comments
Please login to add a commentAdd a comment