outlook
-
స్టాక్ మార్కెట్లకు ఈ వారం.. ఇవే కీలకం!
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు దిక్సూచిగా నిలిచే అవకాశముంది. దేశీయంగా టోకు ధరల ద్రవ్యోల్బణం, వాణిజ్యం తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ఆ దేశ కేంద్ర బ్యాంకు పరపతి విధాన సమీక్ష కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు.వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఇటీవల దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే. వెరసి విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురువారం(19న) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణం మందగించడం, ఉపాధి మార్కెట్ పటిష్టత నేపథ్యంలో వడ్డీ రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత నెల 7న చేపట్టిన పాలసీ మినిట్స్ సైతం ఇందుకు మద్దతిస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు.ఇక ఇదే రోజున ఈ ఏడాది మూడో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు విడుదలకానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం యూఎస్ జీడీపీ 2.8 శాతం పుంజుకుంది. నేడు నవంబర్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు వెల్లడికానున్నాయి. రేపు(17న) యూఎస్ రిటైల్ సేల్స్, 18న జపాన్ వాణిజ్య గణాంకాలు తెలియనున్నాయి. వారాంతాన(20న) నవంబర్ ద్రవ్యోల్బణ రేటును జపాన్ ప్రకటించనుంది.ఆర్థిక గణాంకాలునేడు(16న) దేశీయంగా నవంబర్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ 2.36 శాతం పెరిగింది. ఇదే రోజు వాణిజ్య గణాంకాలు సైతం విడుదల కానున్నాయి. అక్టోబర్‌లో వాణిజ్య లోటు 24.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ బాటలో హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ, సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్‌లో త యారీ పీఎంఐ 57.5కు చేరగా, సర్వీసుల పీఎంఐ 58.5ను తాకింది. గత వారమిలా శుక్రవారం(13)తో ముగిసిన గత వారం దేశీ స్టాక్ ఇండెక్సులు భారీ ఆటుపోట్ల మధ్య స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ నికరంగా 424 పాయింట్లు(0.5 శాతం) పుంజుకుని 82,133 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లు(0.4 శాతం) మెరుగై 24,768 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.2 శాతం బలపడితే.. స్మాల్ క్యాప్ ఇదేస్థాయిలో నీరసించింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో 5 కంపెనీలు బలపడగా.. మరో 5 దిగ్గజాలు నీరసించాయి.దీంతో వీటి మార్కెట్ విలువ నికరంగా రూ. 1.13 లక్షల కోట్లమేర బలపడింది. ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 47,837 కోట్లు, ఇన్ఫోసిస్ విలువ రూ. 31,827 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ. 11,888 కోట్లు చొప్పున ఎగసింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ విలువకు రూ. 11,761 కోట్లు, టీసీఎస్‌కు రూ. 9,805 కోట్లు చొప్పున జమయ్యింది. అయితే ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ. 52,032 కోట్లు, ఎల్ఐసీ విలువ రూ. 32,068 కోట్లు, హెచ్‌యూఎల్ విలువ రూ. 22,561 కోట్లు చొప్పున క్షీణించింది. -
వచ్చే వారం ఏమౌతుందో.. పసిడి ప్రియుల్లో టెన్షన్!
దేశంలో బంగారం ధరలు గత సంవత్ సంవత్సరంలో విశేషమైన వృద్ధిని సాధించాయి. గత దీపావళి నుండి దాదాపు 32 శాతం పెరిగాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేటు తగ్గింపుల అంచనా, స్థిరమైన డాలర్ ఇండెక్స్, ప్రపంచ ఆర్థిక మందగమన సంకేతాలు, సెంట్రల్ బ్యాంకుల నుండి బలమైన డిమాండ్ వంటి అనేక కారణాల వల్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి.వచ్చే వారం బంగారం ధర అంచనావచ్చే వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే రెండు కీలక పరిణామాలు ఉన్నాయి. నవంబర్ 5న అమెరికా ఎన్నికలు జరగనుండగా నవంబర్ 6న ఫెడ్ పాలసీ నిర్ణయం వెలువడనుంది. వీటి ప్రభావంతో బంగారం ధరలు వచ్చే వారం అధిక అస్థిరతను చూపవచ్చని మార్కెట్ పరిశీలకులు, నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులుప్రస్తుతం ఇలా..అంతే లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు పండుగ తర్వాత కాస్త శాంతించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం (నవంబర్ 2) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,800 వద్ద ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ. 80,550 వద్ద ఉంది. వచ్చే వారం బంగారం ధరల్లో భారీ అస్థిరతలు ఉంటాయన్న అంచనాలు కొనుగోలుదారులను మరింత భయపెడుతున్నాయి. -
వచ్చేవారం మార్కెట్ ఎలా ఉంటుందంటే..
మార్కెట్ ఇప్పటికే ఆల్‌టైమ్‌హైలో ఉంది. ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి పెరుగుతుందా.. ఫెడ్ కీలక వడ్డీరేట్లు తగ్గించనుందనే సంకేతాలతో రానున్న రోజుల్లో మార్కెట్ ఎలా స్పందిస్తుంది.. వచ్చేవారం మార్కెట్ వైఖరి ఎలా ఉండబోతుంది.. వంటి అంశాలపై ప్రముఖ స్టాక్‌మార్కెట్ అనలిస్ట్ కారుణ్యరావు మాట్లాడారు. మార్కెట్ ఆల్‌టైమ్‌హైను చేరింది. దాంతో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు కొంత ఆందోళన చెందుతారు. కానీ చాలా కాలంగా మార్కెట్లో ఉంటున్నవారు అంతగా కంగారుపడి ఇక్కడి నుంచి మార్కెట్ తగ్గుతుందేమోనని స్టాక్లను విక్రయించే ప్రయత్నం చేయరు. అయితే నిజంగా మార్కెట్ ఇంతలా పెరిగినపుడు కొంత కరెక్షన్ రావొచ్చు. కానీ గతంలోలాగా చాలా తగ్గిపోతుందనే సంకేతాలు మాత్రం ప్రస్తుతానికి లేవు. నిజంగా మార్కెట్లు తగ్గుతాయనే లాజిక్ ఉంటే కొనుగోలు, విక్రయంపై నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎలాంటి అవగాహన లేకుండా, సరైన కారణం లేకుండా మార్కెట్లో పొజిషన్ తీసుకోవడంతో నష్టపోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్కెట్లు భారీగా పెరిగాయి. నిఫ్టీ దాదాపు 18 శాతం పుంజుకుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 2024లో మార్కెట్లు కొంత కన్సాలిడేషన్‌లో ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే గత కొన్నేళ్లుగా జనవరిలో మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఈసారి నష్టాల్లో కాకుండా లాభాల్లోకి మారుతాయానే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో తీవ్ర అనిశ్చితులు లేకపోవడం, దేశీయ మార్కెట్లో సానుకూలత వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తాయని తెలుస్తుంది. ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ కీలక వడ్డీరేట్లు తగ్గుస్తుందనే సంకేతాలు ప్రధానంగా ఐటీ కంపెనీలకు బలం చేకూర్చాయి. దాంతో ఐటీ స్టాక్ల్లో భారీగా ర్యాలీ కనిపిస్తోంది. ఇది మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈసారి కూడా కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు ఊహించిన ఫలితాలు ప్రకటించకపోవచ్చు. దాంతో కంగారుపడి మంచి కంపెనీ స్టాక్‌లు అమ్మేయకుండా పడిన ప్రతిసారి ఎస్ఐపీ విధానంలో కొంతమేర కొనుగోలు చేయాలి. కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్న తరుణంలో మార్కెట్ వర్గాలు పబ్లిక్ ఇష్యూలపై కన్నేయోచ్చు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. అధిక వాల్యుయేషన్లు, ఎల్‌నినో ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక మందగమనం పరిణామాల నేపథ్యంలో స్వల్ప కాలం పాటు స్టాక్ సూచీలు రికార్డు స్థాయిల వద్ద స్థిరీకరణకు లోనవచ్చు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
2024 గ్లోబల్ బ్యాంకింగ్‌పై నెగటివ్ అవుట్‌లుక్: మూడీస్
న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకుల కఠిన ద్రవ్య విధానాల వల్ల పలు దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తగ్గే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దీనివల్ల 2024కి సంబంధించి ప్రపంచ బ్యాంకుల అవుట్‌లుక్ ప్రతికూలంగా (నెగటివ్) ఉందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపు (ప్రొవిజనింగ్స్) వ్యయాలు తగ్గే అవకాశాలు, దేశ చక్కటి వృద్ధి రేటు వల్ల భారత్ బ్యాంకుల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ అంచనావేయడం గమనార్హం. అధిక నిధుల సమీకరణ వ్యయాలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ భారత్ బ్యాంకింగ్ సవాళ్లను తట్టుకుని నిలబడుతుందన్న అభిప్రాయాన్ని నివేదిక వ్యక్తం చేసింది. ‘‘లిక్విడిటీ తగ్గడం (ద్రవ్య లభ్యత), రుణ చెల్లింపుల నాణ్యత పడిపోవడం వల్ల ప్రపంచంలోని పలు దేశాల బ్యాంకుల అసెట్ నాణ్యత దెబ్బతింటుంది’’ అని మూడీస్ తన గ్లోబల్ బ్యాంకింగ్ అవుట్‌లుక్ నివేదికలో పేర్కొంది. కఠినమైన ద్రవ్య విధానాల వల్ల బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులు క్షీణిస్తాయని అభిప్రాయపడింది. ప్రధాన కేంద్ర బ్యాంకులు రేట్లు తగ్గించడం ప్రారంభించినప్పటికీ, కఠిన ద్రవ్య పరిస్థితులే 2024లో కొనసాగుతాయని, ఇది ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై ప్రభావం చూపుతుందని మూడీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పర్యావరణ సవాళ్లు ఆందోళనకు గురిచేస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యయాలు తగ్గడం, బలహీన ఎగుమతులు, ప్రాపర్టీ మార్కెట్ దిద్దుబాటు కారణంగా చైనా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు చైనా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడే వీలుందని అంచనావేసింది. -
మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ - కొత్త ఫీచర్స్‌తో సరికొత్త ఎక్స్పీరియన్స్..
Microsoft Outlook Lite: ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఔట్లుక్ లైట్లో కొత్త ఫీచర్లను పరిచయం చేయడంతో పాటు, భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇమెయిల్ అండ్ ఎస్ఎమ్ఎస్ యాప్ పరిచయం చేసింది. వీటి గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ (Microsoft Outlook Lite) అనేది భారతదేశంలోని వినియోగదారుల కోసం కంపెనీ రూపొందించిన ఒక ప్రత్యేకమైన యాప్. ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడానికి అనుకూలంగా ఇది స్థానిక భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఇది 3G, 4G, 5G లాంటి ఏ నెట్‌వర్క్‌లో అయినా చాలా వేగంగా పనిచేస్తుంది. ప్రాంతీయ భాషల్లో.. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ భారతదేశంలో విభిన్న భాషా వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల కమ్యూనికేషన్ మరింత సులభమవుతుంది. ఇందులో వాయిస్ టైపింగ్, ట్రాన్స్లేషన్ వంటివి మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషల్లో ఇమెయిల్ చదవడం వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని లేటెస్ట్ ఫీచర్స్ ద్వారా వినియోగదారుడు తమ మాతృభాష లేదా ప్రాధాన్య భాషలో ఇమెయిల్‌లను కంపోజ్ చేసుకోవచ్చు, తద్వారా సులభంగా చదువుకోవచ్చు. అంతే కాకుండా ఒక భాషలో ఈ కంటెంట్ టైప్ చేసి దాన్ని తమకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. హిందీలో ఇమెయిల్ టైప్ చేసి, దాన్ని ఆటోమాటిక్‌గా ఇంగ్లీష్‌లో లేదా ఇతర భాషల్లోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఔట్లుక్ లైట్ సహాయపడుతుంది. ప్రస్తుతం ఇది హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ వంటి ఐదు భాషలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఇది మరిన్ని భాషలు, మాండలికాల్లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ ఎస్ఎమ్ఎస్.. ఇక ఎస్ఎమ్ఎస్ మెసేజింగ్ విషయానికి వస్తే, ఔట్లుక్ లైట్ కేవలం ఇమెయిల్స్‌కి మాత్రమే కాకుండా.. ఎస్ఎమ్ఎస్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ట్రాన్స్లేషన్, ప్రమోషనల్ ఇన్ఫర్మేషన్ వంటి వాటి కోసం సంస్థ 'స్మార్ట్ ఇన్‌బాక్స్' అందిస్తుంది. ఇది సమాచారాన్ని సులభతరం చేయడమే కాకుండా.. సంబంధిత సందేశాలను ఒకే చోట చూడటానికి అవకాశం కల్పిస్తుంది. అంతే కాకుండా ముఖ్యమైన అపాయింట్మెంట్లు, ట్రావెల్ బుకింగ్స్, బిల్ పేమెంట్స్, గ్యాస్ బుకింగ్ వంటి వాటిని గుర్తు చేయడానికి ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఔట్లుక్ లైట్ భారతీయ ప్రాంతీయ భాషల్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది, కంపెనీ త్వరలోనే ఈ ఫెసిలిటీని కూడా అందించే అవకాశం ఉంది. ఆ తరువాత వినియోగదారుడు తనకు నచ్చిన భాషల్లో మెసేజస్ చదువుకోవచ్చు. నచ్చిన భాషలో అనువాదం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ ఫీచర్స్ పరిచయం చేసిన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ & మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, ఇండియా గ్రూప్ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ 'రాజీవ్ కుమార్' మాట్లాడుతూ.. భారతదేశం టెక్నాలజీలో దూసుకెళ్తున్న తరుణంలో డిజిటల్ అనుభవాలను పెంపొందించడంలో ఔట్లుక్ లైట్ ఫీచర్స్ ఉపయోగపడతాయని, వినియోగదారుల మధ్య బలమైన కమ్యూనికేషన్ పెంపొందించడం సహాయపడతాయని వెల్లడించారు. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ప్రతి వ్యక్తి లేదా వినియోగదారుడు తన ప్రాధాన్య భాషతో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, రోజువారీ పరస్పర చర్యలను సులభతరం చేయడంలో ఇది సహకరిస్తుందని చెబుతూ.. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఫీచర్స్ తీసుకురావడంలో కంపెనీ కృషి చేస్తుందని వివరించారు. -
కమోడిటీ, చమురు మార్కెట్లకు ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక
మిడిల్ఈస్ట్ దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణల వల్ల ప్రపంచ కమోడిటీ, ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇప్పటివరకు పరిమిత ప్రభావం ఉన్నప్పటికీ, ఇంధన మార్కెట్, ఆహార భద్రతపై కూడా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం చూపుతుందని తెలిపింది. ప్రపంచబ్యాంక్ తాజా కమోడిటీ మార్కెట్లకు సంబంధించి ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. ప్రస్తుత త్రైమాసికంలో చమురు ధరలు సగటున బ్యారెల్‌కు 90 యూఎస్ డాలర్లు ఉంటుందని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించడంతో వచ్చే ఏడాది బ్యారెల్‌కు సగటున 81 డాలర్లకు తగ్గుతుంది. ప్రపంచ చమురు సరఫరా రోజుకు 20లక్షల నుంచి 5లక్షల బ్యారెళ్లకు తగ్గుతుందని దాంతో ధరలు 3-13 శాతం పెరుగుతాయని నివేదిక తెలిపింది. వచ్చే ఏడాది మొత్తం కమోడిటీ ధరలు 4.1 శాతం తగ్గుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రానున్న కాలంలో సరఫరా పెరగడంతో వ్యవసాయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి. మూల లోహాల ధరలు 2024లో 5 శాతం తగ్గుతాయని తెలిసింది. అయితే 2025లో మాత్రం వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయని సమాచారం. మిడిల్ఈస్ట్ దేశాల్లో 1970 తర్వాత తాజా యుద్ధ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇందర్మిత్గిల్ అన్నారు. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
భారత్ వృద్ధి అంచనాకు ఏడీబీ కోత
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–24మార్చి) జీడీపీ వృద్ధి రేటు తొలి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్వల్పంగా తగ్గించింది. 2023 ఏప్రిల్ అవుట్‌లుక్ 6.4 శాతం అంచనాలను తాజాగా 10 బేసిస్ పాయింట్లు తగ్గి స్తున్నట్లు తెలిపింది. దీనితో ఈ అంచనా 6.3 శాతానికి తగ్గినట్లయ్యింది. ఎగుమతుల్లో మందగమనం, తగిన వర్షపాతం లేక వ్యవసాయంపై ప్రభావం వంటి అంశాలు తమ అంచనాల కోతకు కారణ మని తన 2023 సెపె్టంబర్ అవుట్‌లుక్‌లో తెలిపింది. కాగా 2024–25 అంచనాలను 6.7 శాతంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడులు, దేశీయ వినియోగం, ప్రభ్తువ మూలధన వ్యయాలు వృద్ధికి భరోసాను ఇస్తున్నట్లు తెలిపింది. 5.9 శాతం నుంచి 6.2 శాతానికి అప్: ఇండియా రేటింగ్స్ మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5.9 శాతం వృద్ధి అంచనాలను 6.2 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ మూలధన పెట్టుబడులు పెరగడం, బ్యాంకులు, కార్పొరేట్ల మెరుగైన బ్యాలెన్స్ షీట్లు, గ్లోబల్ కమోడిటీ ధరలు తగ్గడం, ప్రైవేటు పెట్టుబడుల్లో ఉత్తేజం తన రేటింగ్ మెరుగుదలకు కారణమని ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ఇండియా రేటింగ్స్ ప్రధాన ఎకనమిస్ట్ సునిల్ కుమార్ పేర్కొన్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) మన ఎకానమీకి ఢోకా లేదు: అషీమా గోయెల్ ఇదిలావుండగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ చక్కని పనితీరు ప్రదర్శిస్తోందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధన కమిటీ (ఎంపీసీ) సభ్యుల్లో ఒకరైన అషీమా గోయెల్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్చలు, ఆర్బీఐ విధానాలు దేశ ఎకానమీకి తగిన బాటన నడుపుతున్నట్లు వివరించారు. -
మహేష్ మూర్తిపై రూ.800 కోట్ల పరువు నష్టం దావా వేసిన అంకితి బోస్!
సింగపూర్ ఫ్యాషన్ టెక్నాలజీ కంపెనీ జిలింగో కో-ఫౌండర్, మాజీ సీఈవో అంకితి బోస్ మరోసారి తెరపైకి వచ్చారు. ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్, సీడెడ్ ఫండ్ సంస్థ కోఫౌండర్ మహేష్ మూర్తిపై రూ.800 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మార్చి 1,2023న ఓ బిజినెస్ మ్యాగజైన్లో మహేష్ మూర్తి ఓ కథనం రాశారు. అయితే ఆ కథనంలో తన పేరును ప్రస్తావించినందుకు గాను మహేష్ మూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంకితి బోస్ న్యాయ సంస్థ సింఘానియా అండ్ కో ఎల్ఎల్పీ ఆధ్వర్యంలో బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. పలు నివేదికల ఆధారంగా వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ఆధారంగా..పరువు నష్టం దావా కేసులో మూడేళ్లుగా స్టార్టప్‌లపై మహేష్ మూర్తి తీరును తప్పుబడుతూ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20న నమోదైన ఈ డిఫర్మేషన్ కేసు (పరువు దావా నష్టం) లో అంకితి బోస్ పిటిషనరేనని తేలింది. మహేష్ మూర్తి కథనం ఏం చెబుతోంది? మహేష్ మూర్తి రాసిన బిజినెస్ మ్యాగజైన్లో పేరు కంపెనీ, సీఈవో పేరు ప్రస్తావించకుండా ‘ఒక మహిళ (అంకితి బోస్) ప్రముఖ ఫ్యాషన్ పోర్టల్ (జిలింగో)ను నడుపుతుంది. జిలింగోలో పెట్టుబడిదారులైన సీక్వోయా క్యాపిటల్ నిధుల్ని దుర్వినియోగం చేశారు. న్యాయపరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందేలా ఆమె తన లాయర్లకు రూ. 70 కోట్లు ఫీజుగా చెల్లించేందుకు సంస్థ నిధుల్ని వినియోగించారని తెలిసింది. అంతేకాదు తానొక గ్లామరస్ సీఈవోగా ప్రపంచానికి తెలిసేలా ఓ పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రాజెక్ట్‌లో భాగంగా ఆమె సదరు పీఆర్ సంస్థకు సంవత్సరానికి రూ.10 కోట్లు చెల్లించారు. ఆ నిధులు సైతం జిలింగో నుంచి పొందారని తెలిపారు. బోస్ స్పందన మహేష్ మూర్తి రాసిన కథనంపై అంకితి బోస్ స్పందించారు. ఆ ఆర్టికల్‌లో 'అబద్ధాలు, వక్రీకరణలు, విషపూరిత వాదనలు' ఉన్నాయి. పబ్లిక్ డొమైన్లలో బాధ్యతాయుతంగా ఉండాలి. మహిళా వ్యవస్థాపకుల శక్తి సామార్ధ్యాలతో వారి సాధించాలనుకున్న లక్ష్యాల్ని నిరోధించేలా, లైంగిక ధోరణిలు ప్రతిభింభించేలా ఉన్నాయని ఆమె అన్నారు. నిధుల దుర్వినియోగం బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం..8 దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం..500మంది ఉద్యోగులు.. రూ7వేల కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు..ఇవన్నీ సాధించింది ఏ తలపండిన వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే! భారత్‌కు చెందిన 23 ఏళ్ల యువతి అంకితి బోస్. చిన్న వయసులోనే దేశం కానీ దేశంలో జిలింగో సంస్థను ఏర్పాటు చేసి ఇంతింతై వటుడింతై అన్న చందనా..ఆ సంస్థను ముందుండి నడిపించారు. కానీ గత ఏడాది రేపోమాపో యూనికార్న్ హోదా దక్కించుకోబోతున్న జిలింగో స్టార్టప్ పునాదులు కదిలిపోయాయి. నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో అవమానకర రీతిలో సంస్థ నుంచి బయటకు వచ్చారు. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్! -
విమానయానం భవిష్యత్ సుస్థిరం
న్యూఢిల్లీ: రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా దేశీ విమానయాన రంగం ఔట్‌లుక్‌ను స్థిరత్వానికి ఎగువముఖంగా సవరించింది. గతంలో ప్రకటించిన ప్రతికూల రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య(ట్రాఫిక్) వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ రంగం భవిష్యత్‌పట్ల ఆశావహంగా స్పందించింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో విమానయాన రంగం నష్టాల అంచనాలు రూ. 11,000 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు తగ్గించింది. వచ్చే ఏడాది(2023–24)కి సైతం తొలుత వేసిన నష్టం రూ. 7,000 కోట్ల అంచనాలలోనూ రూ. 5,000 కోట్లకు కోత పెట్టింది. వచ్చే ఏడాదిలోనూ ప్రయాణికుల ట్రాఫిక్ కొనసాగనున్నట్లు తాజా నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. దీంతో విమానయాన కంపెనీలు టికెట్ ధరల నిర్ణయంలో మరింత శక్తివంతంగా వ్యవహరించేందుకు వీలు చిక్కగలదని పేర్కొంది. ఇది మెరుగుపడుతున్న ఈల్డ్స్ ద్వారా ప్రతిఫలిస్తున్నట్లు తెలియజేసింది. 2022 జూన్‌లో గరిష్టానికి చేరిన వైమానిక ఇంధన(ఏటీఎఫ్) ధరలు క్రమంగా తగ్గుతుండటం, విదేశీ మారక రేట్లు స్థిరంగా ఉండటం లాభదాయకతకు సహకరించనున్నట్లు అంచనా వేసింది. 8–13 శాతం వృద్ధి: ఏప్రిల్ నుంచి ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్యాసింజర్ ట్రాఫిక్ 8–13 శాతం స్థాయిలో పురోగమించనున్నట్లు నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. ఈ ఏడాది 55–60 శాతం వృద్ధి తదుపరి వచ్చే ఏడాదిలో ప్రయాణికుల సంఖ్య 14.5–15 కోట్లకు చేరగలదని అంచనా వేసింది. కరోనా మహమ్మారికి ముందుస్థాయికంటే ఇది అధికంకావడం గమనార్హం! దేశీ విమానయాన కంపెనీల ద్వారా విదేశీ ప్రయాణికుల సంఖ్య సైతం వృద్ధి బాటలో సాగుతున్నట్లు ఇక్రా పేర్కొంది. 2022 మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి మొదలుకావడంతో ఈ ఏడాది తొలి 9 నెలల్లో (ఏప్రిల్–డిసెంబర్) కోవిడ్–19 ముందుస్థాయికంటే కేవలం 2.4 శాతం తక్కువగా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ నమోదైనట్లు వెల్లడించింది. వార్షికంగా చూస్తే దేశీ కంపెనీల అంతర్జాతీయ ట్రాఫిక్ 10–15 శాతం ఎగసినట్లు తెలియజేసింది. గతేడాది 125–130 వృద్ధి తదుపరి ఇది అధికమేనని స్పష్టం చేసింది. -
మైక్రోఫైనాన్స్ రంగానికి మంచి రోజులు
ముంబై: సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) కరోనా సమయంలో తగిలిన గట్టి ఎదురుదెబ్బ నుంచి బయటకు వచ్చాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి క్రెడిట్ వ్యయాలు తక్కువ స్థాయికి చేరుకుంటాయని, ప్రస్తుతం ఇవి మంచి వృద్ధిని చూస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తన తాజా నివేదికలో తెలిపింది. మైక్రోఫైనాన్స్ రంగానికి అవుట్‌లుక్‌ను తటస్థం నుంచి ‘మెరుగుపడుతున్నట్టు’గా మార్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) స్థిరమైన రేటింగ్ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ రుణ పరిశ్రమ 20–30 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సమసిపోవడంతో మరింత మంది రుణాల కోసం ముందుకు వస్తున్నట్టు తెలిపింది. రుణ వసూళ్లు మెరుగుపడడం, రుణ వితరణలు పెరగడం, క్రెడిట్ వ్యయాలు 15–5 శాతం నుంచి 1–3 శాతానికి దిగి రావడం అనుకూలించే అంశాలుగా పేర్కొంది. సూక్ష్మ రుణ సంస్థలు కరోనా మహమ్మారికి సంబంధించి ప్రతికూలతలను దాదాపుగా డిసెంబర్ త్రైమాసికానికి సర్దుబాటు చేసుకున్నట్టు వివరించింది. రుణ వితరణలు పెరుగుతుండడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి నమోదు కావచ్చని తెలిపింది. రెండు రిస్క్‌లు వచ్చే 12–18 నెలల కాలంలో సూక్ష్మ రుణ పరిశ్రమ ముందు రెండు కీలక రిస్క్‌లు ఉన్నట్టు ఇండియా రేటింగ్స్ నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణం, ఎన్నికలను ప్రస్తావించింది. ఈ రెండు అంశాలు 2023–24తోపాటు, 2024–25 మొదటి ఆరు నెలలు రుణ గ్రహీతల ఆదాయంపై ప్రభావం చూపించొచ్చని అంచనా వేసింది. రుణాల ఎగవేతలు, క్రెడిట్ వ్యయాలు సాధారణ స్థాయికి వస్తా యని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థల రుణాల్లో అధిక శాతం కరోనా మహమ్మారి తర్వాత జారీ అయినవేనని, వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని వివరించింది. మొత్తం మీద క్రెడిట్ వ్యయాలు 2022– 23లో 1.5–5 శాతం మధ్య ఉంటే, 2023–24లో 1–3 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. ముఖ్యంగా ఎంఎఫ్‌ఐల రుణ గ్రహీతల్లో 65 శాతం నిత్యావసర వస్తువులు, సేవల్లోనే ఉపాధి పొందుతున్నందున, వీరిపై ద్రవ్యోల్బణం ప్రభావం అధికంగా పడుతుందని, వారి ఆదాయం, వ్యయాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. -
ప్రపంచ ఆర్థిక పరిణామాలపై జాగరూకత
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిణామాలు వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అవుట్‌లుక్‌ను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్వే నివేదిక శుక్రవారం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నవంబర్ నెలవారీ నివేదిక హెచ్చరించింది. అయితే కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాస) కట్టడిలోనే ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. బలమైన సేవల ఎగుమతులు, దేశానికి వచ్చే రెమిటెన్సులు ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు 100 బిలియన్ డాలర్లకు తాకే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్ పేర్కొన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. -
వృద్ధి అవుట్‌లుక్‌కు భౌగోళిక ఉద్రిక్తతలే అవరోధం
న్యూఢిల్లీ: భారతదేశ వృద్ధి అవుట్‌లుక్‌కు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడమే అతిపెద్ద ప్రమాదకరంగా తయారయ్యిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యులు జయంత్ ఆర్ వర్మ ఉద్ఘాటించారు. ప్రత్యేకించి ఈ ఉద్రిక్తతలు ఆసియా ప్రాంతానికి వ్యాపిస్తే దేశ ఎకానమీకి మరింత సమస్యలు వచ్చిపడతాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది ఎకానమీకి మేలు చేకూర్చే అంశం. దేశంలో ఈ ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఈ సమస్య కొనసాగదని భావిస్తున్నా. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత 6 స్థాయిలోపునకు తీసుకురావడానికి ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం కట్టుబడి ఉంది. ► ఎకానమీ పట్ల ఆశావహ పరిస్థితే ఉంది. పలు రంగాలు, పరిశ్రమలలో రికవరీ అసమానంగా ఉన్నప్పటికీ, వినియోగ డిమాండ్ కోలుకోవడం ప్రారంభమైంది. ఇది హర్షణీయ పరిణామం. ► పరిశ్రమ, వివిధ రంగాల సామర్థ్య వినియోగం పెరుగుతోంది. ఇప్పుడు వ్యాపార విస్తరణ కోసం మూలధన వ్యయాల పెంపుపై పలు రంగాలు వ్యూహ రచన చేస్తున్న సంకేతాలు ఉన్నాయి. ► పలు కీలక అంశాలు దేశీయ మారకపు రేటు కదలికలకు కారణాలుగా ఉంటాయి. అందులో ద్రవ్యోల్బణం ఒక కారణం. ప్రస్తుత రూపాయి పతనంపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. -
మూడీస్ నివేదిక: సామాన్యులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: పెరుగుతున్న రుణ వ్యయాలు, సుదీర్ఘమైన రష్యా–ఉక్రెయిన్ వివాదం, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి కారణాలతో ప్రపంచంలో రుణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం పేర్కొంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఇంధనం, ఆహార వ్యయాల పెరుగుదలతోపాటు గృహాల కొనుగోలు శక్తిని ఈ పరిణామాలు బలహీనపరుస్తున్నాయని తెలిపింది. దీనితోపాటు కంపెనీలకు ముడి పదార్థాల వ్యయాలు పెరుగుతున్నాయని, పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింటోందని వివరించింది. ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ►సావరిన్ డెట్ ఇష్యూయర్స్‌కు సంబంధించి రుణ వ్యయాలు పెరిగేకొద్దీ ఈ ఇన్‌స్ట్రమెంట్ల స్థిరత్వం సవాలుగా ఉంటుంది. ఇప్పటికీ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కోవిడ్–19 మహమ్మారి సంక్షోభం నుండి పూర్తిగా కోలుకోని పరిస్థితుల్లో రుణ సమీకరణలో క్లిష్ట పరిస్థితులు మరింత ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. ►గ్లోబల్ క్రెడిట్ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయి. పెరుగుతున్న రుణ వ్యయాలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ సైనిక వివాదం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఇంధనం– వస్తువుల ధరలు పెరగడం వంటి అంశాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో సరఫరాల సమస్య తీవ్రతరంగా ఉంది. ఆర్థిక మార్కెట్ అస్థిరత పెరిగింది. ►అనేక దేశాల్లోని కేంద్ర బ్యాంకులు అధిక ద్రవ్యోల్బణానికి ప్రతిస్పందనగా వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించడంతో, ఆర్థిక మార్కెట్ పరిస్థితులు అంతర్జాతీయంగా క్లిష్టంగా మారాయి. వడ్డీరేట్ల పెంపు కొనసాగే అవకాశాల నేపథ్యంలో కఠిన ఫైనాన్షియల్ పరిస్థితులు నెలకొన్నాయి. ►ఆర్థిక వృద్ధికి ప్రతికూలతలు అసాధారణంగా తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. స్థూలంగా ఎకానమీ అవుట్‌లుక్‌ను మరింత దిగజార్చేందుకు అనేక పరిణామాలు పొంచిఉన్నాయి. ► వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం, దీర్ఘకాలిక సప్లై చైన్ అంతరాయాలు, చైనా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే తీవ్ర మందగమనంలో కొనసాగే అవకాశాలు, కోవిడ్–19 యొక్క కొత్త, మరింత ప్రమాదకరమైన వేరియంట్ల అవకాశాలు, దీనిపై నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలు ప్రపంచాన్ని మరికొంతకాలం సవాళ్ల వలయంలోనే ఉంచే అవకాశం ఉంది. ► ఈ అసాధారణమైన అధిక అనిశ్చితి తదుపరి ఆరు నుండి ఎనిమిది నెలల్లో ఇంధప ధరల తీవ్ర ఒడిదుడుకులు, ఫైనాన్షియల్ మార్కెట్ల అనిశ్చితికి దారితీసే అవకాశం ఉంది. ► మేనెల్లో మూడీస్ జీ–20 ఆర్థిక వ్యవస్థల ఎకానమీ వృద్ధి అంచనాను ఈ ఏడాదికి 3.1 శాతానికి, వచ్చే ఏడాదికి 2.9 శాతానికి తగ్గించింది. అంతక్రితం ఈ అంచనాలు వరుసగా 3.6 శాతం, 3 శాతంగా ఉన్నాయి. -
హమ్మయ్యా!! బ్యాంక్ రుణాలు రికవరీ అవ్వనున్నాయ్, కారణం ఇదే?!
ఇదిలాఉండగా, భారత్ బ్యాంకింగ్ అవుట్‌లుక్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. పటిష్ట రుణ డిమాండ్, బ్యాలన్స్ షీట్స్ అంచనాలు తమ విశ్లేషణకు కారణమని తెలిపింది. బ్యాంకింగ్ రుణ వృద్ధి 10 శాతంగా నమోదయ్యే వీలుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటును 8.4 శాతంగా అభిప్రాయపడింది. రుణాల్లో స్థూల మొండి బకాయిల నిష్పత్తి 6.1 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మూలధన నిల్వలు అందుబాటులో ఉంటాయని అభిప్రాయపడింది. అన్ని రంగాల్లో వృద్ధి, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో రుణ రికవరీలు కూడా మెరుపడే వీలుందని తెలిపింది. ఇక రుణాలు, డిపాజిట్ల విషయంలో దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల మార్కెట్ వాటా పెరుగుతుందని అంచనా వేసింది. మూలధనం, పోర్ట్‌ఫోలియో నిర్వహణల విషయంలో ప్రైవేటు బ్యాంకులు మంచి పనితీరును కనబరిచే అవకాశం ఉందని విశ్లేషించింది. కాగా, కార్పొరేట్ ఎన్పీఏలు 2020–21లో 10.8%గా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10.4 శాతానికి తగ్గే వీలుందని అభిప్రాయపడింది. 2022–23లో రిటైల్ రంగంలో ఒత్తిడిలో ఉన్న రుణాలు 4.9 శాతానికి తగ్గుతాయని, ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లో ఈ పరిమాణం 16.7 శాతానికి పెరుగుతుందన్నది సంస్థ అంచనా. కార్పొరేట్ రంగం విషయంలో ఈ రేటు 10.3 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. -
భారత్ కార్పొరేట్ అవుట్‌లుక్... పాజిటివ్
న్యూఢిల్లీ: భారత్ కంపెనీల అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో నెలకొన్న పటిష్ట డిమాండ్, విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ ఇందుకు దోహదపడుతున్న అంశాలని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వివరించింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, అధిక ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు వినియోగం పెరుగుతుండడం కూడా కంపెనీల సానుకూల అవుట్‌లుక్‌కు కారణమని పేర్కొంది. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మార్చి 2022తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.3 శాతం ఉంటుందని అంచనా. ఆ తర్వాత 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ► స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణకు వీలుగా భారత కంపెనీలకు క్రెడిట్ ఫండమెంటల్స్ సానుకూలంగా ఉన్నాయి. పటిష్ట వినియోగదారుల డిమాండ్, అధిక కమోడిటీ ధరల కారణంగా రేటెడ్ కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ► వ్యాక్సినేషన్ విస్తృతి, స్థిరమైన వినియోగదారుల విశ్వాసం, తక్కువ వడ్డీ రేట్లు, అధిక ప్రభుత్వ వ్యయం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సానుకూల క్రెడిట్ ఫండమెంటల్స్ బలాన్ని అందిస్తున్నాయి. ► ఆయా అంశాలు భారతదేశ వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలలో స్థిరమైన పునరుద్ధరణకు దోహదపడుతున్నాయి. ఆంక్షల సడలింపు తర్వాత వినియోగదారుల డిమాండ్, వ్యయం, తయారీ కార్యకలాపాలు కోలుకుంటున్నాయి. అధిక కమోడిటీ ధరలతోసహా ఈ పోకడలు రాబోయే 12–18 నెలల్లో రేటెడ్ కంపెనీల స్థూల ఆదాయాల్లో గణనీయమైన వృద్ధిని పెంచుతాయి. ► మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఉక్కు, సిమెంట్ డిమాండ్లను పెంచుతుంది. మరోవైపు పెరుగుతున్న వినియోగం, దేశీయ తయారీ పురోగతికి కేంద్రం తోడ్పాడు, నిధుల లభ్యత సజావుగా ఉండడానికి చర్యలు కొత్త పెట్టుబడులకు తగిన పరిస్థితులను సృష్టిస్తాయి. మూడవవేవ్ వస్తే మాత్రం కష్టమే... ఎకానమీకి మూడవ వేవ్ సవాళ్లూ ఉన్నాయి. ఇదే జరిగితే తాజా లాక్డౌన్ల ప్రకటనలు జరుగుతాయి. ఇది వినియోగ సెంటిమెంట్ పతనానికి దారితీస్తుంది. ఇలాంటి వాతావరణం ఆర్థిక క్రియాశీలతను, వినియోగ డిమాండ్‌ను పడగొడుతుంది. కంపెనీల స్ళూల ఆదాయాలూ పడిపోతాయి. కరోనా మూడవ వేవ్ పరిస్థితుల్లో– స్థూల ఆదాయాలు వచ్చే 12 నుంచి 18 నెలల్లో 15 నుంచి 20 శాతం పతనం అయ్యే వీలుంది. దీనికితోడు ప్రభుత్వ వ్యయంలో జాప్యం, పారిశ్రామిక ఉత్పత్తిని తగ్గించే తరహాలో చోటుచేసుకునే ఇంధన కొరత, ధరా భారం, డిమాండ్ పెంపునకు వస్తువుల ధరలను తగ్గించడం వంటి అంశాలు కంపెనీల ఆదాయాలను తగ్గిస్తాయి. ద్రవ్యోల్బణం సవాళ్లు... ప్రస్తుతం దేశ తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. నిధుల సమీకరణ వ్యయాలను తగ్గిస్తున్నాయి. డిమాండ్ పెరిగేకొద్దీ కొత్త మూలధన పెట్టుబడికి మద్దతు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుదల వాతావరణం కనిపిస్తోంది. ఇది వడ్డీ రేటల్లో ఊహించిన దానికంటే వేగవంతమైన పెరుగుదలకు దారితీయవచ్చు. ఇలాంటి ధోరణి వ్యాపార పెట్టుబడులపై అధిక భారాన్ని మోపుతుంది. -
ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు
ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి వివిద రకాలుగా యూజర్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను సైబర్ నెరగాళ్లు టార్గెట్ చేశారు. ఇటీవల కనుగొన్న ఈ-మెయిల్ స్కామ్ వినియోగదారులకు నకిలీ బహుమతి కార్డులను ఆఫర్ చేస్తోంది. అయితే, వాస్తవానికి ఎలాంటి బహుమతులు పంపబడవు. యూజర్లు గనుక ఆ లింకు క్లిక్ చేస్తే వినియోగదారులు డబ్బు, మీ సున్నితమైన డేటాను కోల్పోతారు. వాస్తవానికి, ఈ మోసపూరిత ఈమెయిల్స్ లోపల లింక్ లను వినియోగదారులు క్లిక్ చేయడానికి బ్రాండింగ్ పేరుతో ఈమెయిల్స్ పంపుతున్నట్లు తెలుస్తుంది. నేడు అత్యంత ప్రజాదరణ పొందిన ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్లలో జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను హ్యాకర్లు టార్గెట్ చేశారు. నకిలీ ఈ మెయిల్స్ పేరుతో విలువైన బహుమతులు ప్రముఖ కంపెనీల పేరుతో పంపిస్తున్నారు. వాస్తవానికి వారు ఎలాంటి బహుమతులు పంపరు. కానీ, ఈ గిఫ్ట్ కార్డులను 'క్లెయిం' చేసుకోవడానికి వినియోగదారులు మొదట ఒక చిన్న సర్వేలో పాల్గొనాలని ఆ లింకు సూచిస్తుంది.(చదవండి: అర్ధ శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!) దురదృష్టవశాత్తు, ఆ లింక్‌లపై క్లిక్ చేసే యూజర్లు వేరే వెబ్ సైట్ యాక్సెస్ చేస్తారు. అయితే, చివరకు వారికి ఎలాంటి బహుమతులు లేదా గిఫ్ట్ కార్డులు ఇవ్వబడవు. ఎక్స్ ప్రెస్ యుకె ప్రకారం.. మొదటి ఈ స్కామ్ మూడు నెలల క్రితం జూన్ లో గుర్తించారు. సర్వేలో పాల్గొన్న తర్వాత వారి సున్నితమైన వివరాలు హ్యాకర్లు కోరుతారు. మీరు గనుక ఆ లింకు క్లిక్ చేసి వివరాలు సమర్పించారో ఇక మీ పని అంతే. మీ ఖాతాలోని డబ్బులు కాజేయడంతో పాటు మిమ్మల్ని మరింత డబ్బు కోసం బ్లాక్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇలా.. తెలియని లింకులపై వినియోగదారులు అసలు క్లిక్ చేయవద్దు. తెలియని వెబ్సైట్లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయవద్దు. ఈమెయిల్, బ్యాంకు కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎక్కడ నమోదు చేయవద్దు. (మరి ముఖ్యంగా సర్వేలో పాల్గొనాల్సి వస్తే) -
వీటి పనితీరు ఎలా ఉందో? తయారీ, సేవల రంగాలపై ఆర్బీఐ కన్ను!
ముంబై:తయారీ, సేవల రంగాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం రెండు కీలక సర్వేలను ఆవిష్కరించింది. క్లుప్తంగా వీటిని పరిశీలిస్తే...తయారీ రంగం పనితీరును మదింపు చేయడానికి త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) పారిశ్రామిక అవుట్‌లుక్ సర్వే (ఐఓఎస్) ప్రారంభమైంది. ►సేవలు, మౌలిక రంగాలకు సంబంధించి ప్రస్తుత త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) పనితీరును తెలుసుకునేందుకు సేవలు, మౌలికరంగ అవుట్‌లుక్ సర్వే (ఎస్‌ఐఓఎస్)ను ఆర్బీఐ ప్రారంభమైంది. ► సేవలు, తయారీ, మౌలిక రంగాలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో ఏ విధంగా పనితీరును కనబరుస్తున్నాయి?, వ్యాపార సెంటిమెంట్ ఎలా ఉంది?, డిమాండ్, ఫైనాన్షియల్, ఉపాధి అవకాశాలు, ధరల పరిస్థితి ఏమిటి? వంటి అంశాలపై ఈ సర్వే ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తద్వారా మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) పరిస్థితిపై ఒక అంచనాలకు వస్తుంది. ► కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో సేవలు, తయారీ, మౌలిక రంగాలు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్న సంగతి తెలిసిందే. ►భారత్ మొత్తం ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ)లో సేవల రంగం వాటా దాదాపు 55 శాతంకాగా, తయారీ రంగం వాటా దాదాపు 15 శాతం. చదవండి: ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి, కారణం ఇదేనా -
Indian Economy: ఆందోళన కలిగిస్తున్న సెకండ్‌వేవ్
న్యూఢిల్లీ: భారత్‌లో సెకండ్‌వేవ్ అందోళన కలిగిస్తోందని బుధవారం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 2021 అవుట్‌లుక్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీకి ఇది అడ్డంకిగా మరుతోందని తెలిపింది. అయితే 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం ఎకానమీ వృద్ధి నమోదవుతుందని అంచనావేస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు జరుగుతుండడం, రానున్న నెలల్లో ఈ కార్యక్రమం మరింత విస్తృతం కావడానికి చర్యలు తన వృద్ధి అంచనాలకు కారణమని పేర్కొంది. మనీలా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ ఏడీబీ తాజా ‘అవుట్‌లుక్’ లో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ►మౌలిక రంగంలో పెట్టుబడులు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, గ్రామీణ ఆదాయాలకు చేయూత వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. దేశీయ డిమాండ్ మెరుగ్గానే ఉంది. ఆయా అంశాలు ఆర్థిక రంగాన్ని పట్టాలు తప్పనీయకపోవచ్చు. అయితే వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ అవుతుందని, తద్వారా సెకండ్‌వేవ్ కట్టడి జరుగుతుందన్న అంచనాలే తాజా అవుట్‌లుక్‌కు ప్రాతిపదిక. కాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంలో లోపాలు ఉన్నా, మహమ్మారి కట్టడిలో అది విఫలమైనాకోవిడ్–19 కేసుల పెరుగుదల ఆందోళనకరంగా మారుతుంది. ►దీనికితోడు అంతర్జాతీయ ఫైనాన్షియల్ పరిస్థితులు మరింత కఠినతరంగా మారే అవకాశం ఉండడం భారత్‌కు ఆందోళకరం. ఆయా అంశాలు దేశీయ మార్కెట్ వడ్డీరేట్ల పెరుగుదలకు దారితీస్తుంది. ఇదే జరిగితే ఆర్థికరంగం సాధారణ స్థితికి చేరుకోవడానికి అడ్డంకులు ఏర్పడతాయి. ►2021–22లో 11 శాతం వృద్ధి అంచనాకు బేస్ ఎఫెక్ట్ (2020–21లో తక్కువ స్థాయి గణాంకాల)ప్రధాన కారణం. బేస్ ఎఫెక్ట్‌ను పరిగణనలోకి తీసుకోకపోతే 7 శాతం వృద్ధి ఉంటుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. ►ఆరోగ్యం, నీటి సరఫరా, పారిశుధ్యం వంటి రంగాల్లో ప్రభుత్వ వ్యయాలు పెరగాలి. దీనివల్ల భవిష్యత్తులో తలెత్తే మహమ్మారి సంబంధ సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, తగిన రుణ పరిస్థితులు ఉండడం ప్రస్తుతం దేశానికి తక్షణ అవసరం. ►ద్రవ్యోల్బణం వార్షిక సగటు 6.2 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గవచ్చు. తగిన వర్షపాతం, పంట సాగు, సరఫరాల చైన్ మెరుగుపడే అవకాశాలు దీనికి కారణం. ►ఇక దక్షిణ ఆసియా పరిస్థితిని పరిశీలిస్తే, 2021 క్యాలెండర్ ఇయర్లో ఉత్పత్తి వృద్ధి 9.5 శాతంగా ఉండే వీలుంది. 2022లో ఇది 6.6 శాతానికి తగ్గవచ్చు. ఆసియా మొత్తంగా వృద్ధి ధోరణి మెరుగుపడుతున్నప్పటికీ, కోవిడ్–19 కేసుల పెరుగుదల రికవరీకి ఇబ్బందిగా మారుతోంది. ►ఒక్క చైనా విషయానికివస్తే, ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. గృహ వినియోగంలో రికవరీ క్రమంగా పెరుగుతోంది. 2021లో చైనా ఎకానమీ 8.1 శాతం వృద్ధిని నమోదుచేసుకునే వీలుంది. 2022లో ఇది 5.5 శాతానికి తగ్గవచ్చు. ►సెంట్రల్ ఆసియా, తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, పసిఫిక్ ప్రాంత దేశాలుసహా ఏడీబీలో ప్రస్తుతం 46 సభ్య దేశాలు ఉన్నాయి. -
హెచ్‌సీయూ @2
రాయదుర్గం(హైదరాబాద్): నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘనతల్లో మరొకటి చేరింది. ఔట్లుక్–ఐసీఏఆర్ఈ ఇండియా యూని వర్సిటీ ర్యాంకింగ్స్–2020లో రెండో స్థానం పొం దింది. ర్యాంకుల జాబితాను ఆదివారం ప్రకటిం చారు. ప్రథమ స్థానంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నిలిచింది. మొత్తం 1,000కి గాను జేఎన్‌యూ 931.67 స్కోర్ పొందింది. 887.78 స్కోర్‌తో హెచ్‌సీయూ ద్వితీయస్థానం సాధించింది. దేశంలోని అత్యుత్తమ టాప్–25 వర్సిటీలతో ఈ జాబితా వెలువడింది. ఇందులో రాష్ట్రం నుంచి హెచ్‌సీయూతోపాటు మరో వర్సిటీ ‘మనూ’చోటు దక్కించుకోవడం విశేషం. ‘మనూ’24వ ర్యాంకులో నిలిచింది. ప్రధానం గా అకడమిక్, రీసెర్చ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ ఇంటర్ఫే స్, ప్లేస్మెంట్, వసతులు, గవర్నెన్స్, అడ్మిషన్లు, డైవర్సిటీ, ఔట్రీచ్ వంటి పరిమితులలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ‘మనూ’కు 24వ స్థానం ఔట్లుక్–ఐసీఏఆర్ఈ ఇండియా ర్యాంకింగ్స్– 2020లో రాష్ట్రం నుంచి చోటు దక్కించుకున్న మరో వర్సిటీ మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ). జాబితాలో ‘మనూ’ 24వ స్థానం పొందింది. మొత్తం 1,000 స్కోరుకు గాను 436.88 సాధించింది. ప్రపంచస్థాయి గుర్తింపే లక్ష్యం.. దేశంలోని 25 ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ రెండో స్థానం పొందడం గర్వంగా ఉంది. ఇది సమష్టి కృషికి నిదర్శనం. వర్సిటీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తాం. దీనికోసం వ్యవస్థీకృత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తింపు పొందడంతోనే మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి దోహదం చేస్తోంది. విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు కలసి కృషి చేస్తే సాధించలేనిది లేదు. –ప్రొఫెసర్ పొదిలె అప్పారావు, హెచ్‌సీయూ ఉపకులపతి. -
లాభాల స్వీకరణే శ్రేయస్కరం
మార్కెట్ ఓవర్‌బాట్ కండీషన్లో ఉందని ఈ తరుణంలో తాజా కొనుగోళ్లు చేయవద్దని, లాభాల స్వీకరణే శ్రేయస్కరమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. వచ్చేవారం స్టాక్ మార్కెట్ కదలికలపై సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమోదీ తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు. సూచీలు ఈ వారంలో భారీగా ర్యాలీ చేశాయి. నిఫ్టీ ర్యాలీ కాంట్రిబ్యూషన్లో షేర్ల పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉందని గమనించవచ్చు. ఇప్పటి వరకు వెల్లడైన కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు బాగున్నాయి. అయితే ప్రముఖ కంపెనీల నుంచి ఫలితాలు ఇంకా రాలేదు. బహుశా వాటి ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపరచవచ్చు. ఇప్పటి వరకు ఫలితాను ప్రకటించిన బ్యాంకులు, ఐటీ, ఎఫ్ఎంజీసీ, ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీ ప్రదర్శన బాగుంది. ఐటీ కంపెనీలు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోగలిగాయి. ఎన్పీఏ వర్గీకరణ ఆలస్యం కావడంతో ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యాపారాలకు వెసులుబాటును కల్పించింది. లాక్డౌన్ కొనసాగింపుతో ప్రజలు ఇంటిలోపల ఉండిపోవడంతో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కోవిడ్-19 ఎఫెక్ట్‌తో ఇన్సూరెన్స్ పాలసీలు పెరగాయి అలాగే ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ పట్ల ఆసక్తి చూపడం ఫైనాన్స్ సర్వీస్‌లు కంపెనీలకు కలిసొచ్చింది. అయితే ఈ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగే అవకాశం లేదు. కోవిడ్-19 తర్వాత సాధారణ జీవితం ప్రారంభమై వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మార్కెట్ ప్రస్తుత లాభాల్ని కోల్పోయే అవకాశం ఉంది. మార్కెట్ స్వల్పకాలిక సంఘటనలపై అతిగా స్పందించే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్వల్పకాలిక, మిడ్‌టర్మ్‌కు ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసెస్‌లు షేర్లు రాణిస్తాయని భావించడం అవివేకం అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ లేదా తాజా కొనుగోళ్లకు దూరంగా ఉండటం విశేషం. ఎఫ్‌పీఐలు మార్కెట్ పతనం నుంచి ఏప్రిల్, మే, జూన్‌లో విపరీతమైన అమ్మకాలు జరిపారు. కోటక్ బ్యాంక్ క్యూఐపీ, ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూ, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్ ఇష్యూల్లో వాటా కొనుగోళ్ల తప్ప మిగిలిన సెకండరీ మార్కెట్లో ఎలాంటి కొనుగోళ్లు జరపలేదు. గడచిన 9ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీ మార్కెట్లో రూ.5413 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. చారిత్రాత్మకంగా పరిశీలిస్తే మార్కెట్ టాప్‌లో ఉన్నప్పుడు ఎఫ్‌పీఐలు కొనుగోళ్లు జరుపుతారు. బాటమ్‌లో ఉన్నప్పుడు అమ్మకాలు జరుపుతారని తెలుస్తోంది. టెక్నికల్ అవుట్‌లుక్: ఈ వారం నిఫ్టీ గ్యాప్‌తో ప్రారంభమై, అధిక స్థాయి వద్ద ముగిసింది. నిఫ్టీకి ఇది వరుసగా 6వ వారం లాభాల ముగింపు కావడం విశేషం. కోవిడ్-19 వాక్సిన్స్ ట్రయల్ విజయవంతమయ్యానే వార్తలు వెలుగులోకి రావడంతో పాటు ఐటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్ సెక్టార్లకు చెందిన హెవీ వెయిటేజీ షేర్లు మార్కెట్ ర్యాలీకి మద్దతునిచ్చాయి. అయితే బ్యాంక్‌నిఫ్టీ అప్‌ట్రెండ్ మూమెంటంను కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లో బేరీష్ ప్యాట్రన్ ఏర్పడింది. అయితే వారాంతాని కల్లా ఇండెక్స్ పాజిటివ్‌గా ముగిసింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల మధ్య వ్యత్యాసం గత మూడు వారాలుగా కొనసాగుతోంది. నిఫ్టీపై జాగురతతో కూడిన బుల్లిష్ అవుట్‌లుక్‌ను కలిగి ఉన్నాము. నిఫ్టీకి తక్షణ మద్దతు 11000గానూ, కీలక నిరోధస్థాయి 11,240గానూ కేటాయిస్తున్నాము. 10,900 స్థాయిని కోల్పోతే నిఫ్టీ స్వల్పకాలిక బలహీనతకు దారితీయవచ్చు వచ్చేవారం మార్కెట్ అవుట్‌లుక్: వచ్చేవారంలో మార్కెట్‌కు కార్పోరేట్ ఫలితాలు, జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ గడువు గురువారం(30న) ముగింపు కీలకం కానున్నాయి. ఇక అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తే... అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. మంగళవారం ప్రారంభంకానున్న పరపతి సమావేశాలు బుధవారం(29న) ముగియనున్నాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మార్కెట్ గమనానికి కీలకం కానున్నాయి. వీటితో పాటు కోవిడ్ వ్యాక్సిన్ వార్తలు, కరోనా కేసుల పెరుగుదల, రూపాయి, ముడిచమురు ధరల ప్రభావంతో పాటు స్టాక్-ఆధారిత ట్రేడింగ్ మార్కెట్‌కు దిశానిర్దేశాన్ని చేయనున్నాయి. -
9బ్యాంకుల రేటింగ్ డౌన్‌గ్రేడ్: ఫిచ్ రేటింగ్స్
ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ భారత్‌కు చెందిన 9 బ్యాంకుల రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తితో భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటుందని అంచనా వేస్తూ ఈ 9బ్యాంకులకు సంబంధించి గతంలో కేటాయించిన ‘‘స్థిరత్వం’’ రేటింగ్‌ను ‘‘నెగిటివ్’’కు డౌన్‌గ్రేడ్ చేసింది. ఎస్బీఐ బ్యాంక్‌తో పాటు, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. ఇదే రేటింగ్ సంస్థ గతవారంలో (జూన్ 18న) భారత్ అవుట్‌లుక్‌ను ‘‘బిబిబి(-)’’ నుంచి ‘‘నెగిటివ్’’కి డౌన్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి తర్వాత వ్యవస్థలో ఏర్పడిన సవాళ్లతో ఆర్థిక కొలమానాల్లో గణనీయమైన క్షీణతతో పాటు ఇటీవల భారత్ సార్వభౌమ రేటింగ్ తగ్గింపుతో బ్యాంకులకు ప్రభుత్వం మద్దతు ఇచ్చే సామర్థ్యం తగ్గుతుంది.’’ ఫిచ్ రేటింగ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐకు అండగా ప్రభుత్వం: వ్యక్తిగత బ్యాంకులను పరిగణలోకీ తీసుకుంటే.., వ్యూహాత్మక ప్రాధాన్యత కారణంగా అవసరమైతే ఎస్బీఐకు ప్రభుత్వం నుంచి మంచి మద్దతు లభిస్తోందని రేటింగ్ సంస్థ తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఆస్తులు, డిపాజిట్లలో దాదాపు 25% మార్కెట్ వాటా కలిగి ఉంది. ఎస్బీలో 57.9 శాతం వాటా ప్రభుత్వం చేతిలో ఉంది. అలాగే తన సహచర బ్యాంకుల కంటే చాలా విస్తృత విధాన పాత్రను కలిగి ఉంది.ఐడీబీఐ బ్యాంక్ ఇష్యూయర్ డీఫాల్ట్ రేటింగ్ ను బీబీ(+)గా ధృవీకరించింది. అయితే అవుట్‌లుక్ మాత్రం నెగిటివ్‌గా కొనసాగింది. పిచ్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసినప్పటికీ.., ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్‌సెషన్ సమయానికి.... ఎస్బీఐ బ్యాంక్ షేరు 3శాతం లాభంతో రూ.189.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 2శాతం ర్యాలీ చేసి రూ.370.40 వద్ద ట్రేడ్ అవుతోంది. యాక్సిస్ బ్యాంక్ షేరు 3శాతం పెరిగి రూ.430 వద్ద ట్రేడ్ అవుతోంది. -
మార్కెట్‌కు దూరంగా ఉండండి: జీమిత్ మోదీ
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఇన్వెసర్లను మైమరిపిస్తున్న ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండటం ఉత్తమని మార్కెట్ విశ్లేషకులు జిమిత్‌మోదీ అంటున్నారు. అయితే ఆశాహన అంచనాలకు కలిగి ఉండే ఇన్వెసర్లు ప్రైవేట్ బ్యాంక్స్, అటో, మెటల్ షేర్లలో చిన్న పరిమాణంలో కొనుగోలు చేయడం ఉత్తమమని ఆయన సలహానిస్తున్నారు. రాబోయే 3-6 నెలల్లో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయననే ‘ఆశలు’ మార్కెట్లను నడిపించే ఏకైక అంశం అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఆయా కంపెనీల యాజమాన్య వ్యాఖ్యలను పరిశీలిస్తే.., జూన్ క్వార్టర్ గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవచ్చనే విషయం అవగతమవుతోందని మోదీ తెలిపారు. దురదృష్టవశాత్తు మార్కెట్ ఇప్పటికే ఈ అంశాన్ని డిస్కౌంట్ చేసుకుందని, ఈ జూన్ క్వార్టర్ మార్కెట్ చరిత్రలో చీకటి త్రైమాసికంగా మిగిలిపోవచ్చని ఆయన తెలిపారు. త్రైమాసిక ఫలితాల ప్రకటన తరువాత కంపెనీలు టాప్ లైన్, బాటమ్ లైన్ గణాంకాల్లో భారీ క్షీణతతో మార్కెట్లు కరెక్షన్ గురికావచ్చు. ఈ పతన సమయంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడం ఉత్తమం. అందువల్ల కంపెనీల ఎఫ్వై 2021 మొదటి త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యే వరకు స్టాక్మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా స్టాక్ మార్కెట్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వారం ప్రధాన ఈవెంట్ జియో ఫ్లాట్‌ఫామ్‌లో వాటా విక్రయం, రైట్స్ ఇష్యూ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అతికొద్ది సమయంలో రూ.1.70లక్షల కోట్లను సమీకరించగలిగింది. ఫలితంగా రిలయన్స్ షేరు ఈ వారంలో సరికొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసి భారీ లాభాల్ని అర్జించింది. నిఫ్టీ ఇండెక్స్‌లో ఆర్ఐఎల్ అధిక వెయిటేజీ కలిగిన షేరు కావడంతో మార్కెట్ ఓవరాల్ సెంటిమెంట్ పాజిటివ్‌గా మారింది. అలాగే సెనెక్స్, నిఫ్టీలను లాభాలతో ముగిసేలా చేసింది. కాబట్టి ఆర్ఐఎల్ ఈ వారం ఎక్చ్సేంజీలు నష్టపోకుండా కాపలాదారుగా వ్యవహరించిందని చెప్పువచ్చు. ఆర్ఐఎల్ ఈవెంట్ లేకపోతే తక్కువ ధరలు, నెగటివ్ సెంటిమెంట్లతో సూచీలు నష్టాలను మూటగట్టుకునేవి. నిఫ్టీ టెక్నికల్ అవుట్‌లుక్ వారం ప్రారంభంలో నిఫ్టీ ఒడిదుడుకులను చవిచూసినప్పటికీ.., వారాంతాన్ని లాభంతో ముగించింది. ఇప్పడు ఈ ఇండెక్స్ 3వారాల ట్రేడింగ్ శ్రేణి అప్పర్ ఎండ్‌పై కదలాడుతుంది. వరుసగా 2వారాల పాటు పొడవైన షాడో సంభవించడంతో ఈ జోన్లో అమ్మకందారులు అందుబాటులో ఉన్నారనడానికి సంకేతంగా నిలిచింది. రానున్న రోజుల్లో నిఫ్టీ ర్యాలీకి 10,100-10,500 పరిధి అత్యంత కీలకమైన నిరోధం అవుతోంది. అప్‌సైడ్ ట్రెండ్‌లో ఈ విస్తృత పరిధిలో కదలాడే అవకాశం ఉంది. ఇక డౌన్‌సైడ్‌లో 9,550 వద్ద కీలకమైన మద్దతు స్థాయి ఉంది. వచ్చేవారం అంచనాలు జాతీయ, అంతర్జాతీయంగా మార్కెట్ ప్రభావితం చేసే కీలక సంఘటనలు ఏవీ లేకపోవడంతో వచ్చే వారంలో సూచీలు కన్సాలిడేట్ కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ పరిమితుల సడలింపుతో నెలకొన్న డిమాండ్... ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఎలా సహాయపడుతుందో అనే అంశాన్ని డీ-కోడ్ చేయడానికి మార్కెట్లు ప్రయత్నిస్తున్నాయి. ఏదేమైనా, ప్రస్తుత తీరుతెన్నులను పరిశీలిస్తే రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు నెలకొనవచ్చు. -
భారత వృద్ధిరేటు : ఐఎంఎఫ్ కోత
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత వృద్ధిరేటు అంచనాలో మరోసారి కోత పెట్టింది. జూలైలో 7 శాతం అంచనా వేసిన సంస్థ 2020 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 90 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.1 శాతంగా ఉండనుందని తెలిపింది. దేశీయ డిమాండ్ ఊహించిన దానికంటే బలహీనమైన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని ఐఎంఎఫ్ వ్యాఖ్యానించింది. జూలైలో 7.2 శాతంగా ఉన్న అంచనాను 20 బిపిఎస్ పాయింట్లు (7 శాతం) తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం, ఆర్థిక ఉద్దీపన, వాణిజ్యయుద్ధం, డీగ్లోబలైజేషన్పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే మాంద్యం ఏర్పడిందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అయితే భారతదేశంలో ద్రవ్య విధాన సడలింపు, ఇటీవలి కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపులు వృద్ధికి తోడ్పడతాయని ఐఎంఎఫ్ పేర్కొంది. అలాగే గ్రామీణ వినియోగానికి తోడ్పడే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వృద్ధికి తోడ్పడతాయని చెప్పింది. -
‘స్థిరం’గానే ఆర్థిక వ్యవస్థ..
భారతఖ రేటింగ్ అవుటఖలుక్పై ఫిచ్ ‘బీబీబీ-’ గ్రేడ్ కొనసాగింపు... ‘జంక్’ స్థాయికి ఒకమెట్టే ఎక్కువ 2015-16లో వృద్ధి రేటు 7.5%గా అంచనా న్యూఢిల్లీ: భారతఖ ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌కు సంబంధించి తమ ‘అవుటఖలుక్’ యథాతథమని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ప్రకటించింది. భారతఖకు ఇప్చడున్న ‘బీబీబీ-’ రేటింగ్‌ను కొనసాగించింది. అవుటఖలుక్ను ‘స్థిరం’గానే ఉంచుతున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రస్తుత రేటింగ్ పెట్టుబడులకు సంబంధించి అత్యంత కనిష్ట స్థాయిది కావడం గమనార్హం. జంక్ (చెత్త) హోదాకు ‘బీబీబీ-’ ఒక మెట్టు ఎక్కువ. అనుకూల-ప్రతికూల అంశాలు రెండూ సమతౌల్యంగా ఉన్నట్లు ఈ అవుటఖలుక్ సూచిస్తుంది. మధ్య కాలికంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి పటిష్టత, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, కరెంటఖ అకౌంటఖ లోటు (?ఫఐఐ,?ఫడీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీపోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిధుల మధ్య వ్యత్యాసం) తగిన స్థాయిల్లో ఉండడం సానుకూలతలుగా పేర్కొంది. ప్రభుత్వ అధిక రుణ భారాలు, ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయ- వ్యయాల మధ్య వ్యత్యాసం), అననుకూల వ్యాపార పరిస్థితులు వంటి బలహీన వ్యవస్థీకృత అంశాలు సవాళ్లుగా వివరించింది. అయితే ఇదే సమయంలో వ్యాపార పరిస్థితులకు సంబంధించి వాతావరణం మెరుగుపడుతున్నటూ ఫిచఖ పేర్కొనడం విశేషం. భారతఖ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాజా ఫిచఖ రేటింగ్స్ ప్రకటనలో ముఖ్యాంశాలు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారతఖ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనా 7.5%. 2016-17లో ఈ రేటు 8 %కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం, వ్యవస్థీకృత సంస్కరణల ఎజెండాను క్రమంగా అమలుచేయడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు. గడచిన ఆర్థిక సంవత్సరం భారతఖ వృద్ధి రేటు 7.3%. భారతఖ జీడీపీ వృద్ధి అవుటఖలుక్ పటిష్టంగా కనిపిస్తోంది. 2015లో రిజర్వ్ బ్యాంక్ ?ఫ ఇండియా 1.25 శాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.75 శాతం) కోత కూడా జీడీపీ వృద్ధి రేటు బలోపేతానికి దోహదపడుతున్న అంశం. రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్ పూర్తిగా వినియోగదారుకు బదలాయించనప్పటికీ వృద్ధి పటిష్టత విషయంలో ప్రతికూలత ఏదీ లేదు. 1.25 శాతం రెపో కోతలో 0.60 శాతం ప్రయోజనాన్ని మాత్రమే బ్యాంకింగ్ రుణ గ్రహీతకు బదలాయించింది. బ్యాంకింగ్‌లో 2015-16లో మొండి బకాయిల భారం 4.9 %కి చేరే అవకాశం ఉంది. 2018-19కల్లా బాసెలఖ 3 నిబంధనలకు అనుగుణంగా కొత్త మూలధనం కల్పన అంశంలో... బ్యాంకింగ్ అంతర్గత నిధుల సమీకరణకు ఇది ఇబ్బందికరమైన అంశం. ప్రభుత్వ రుణ భారాలు తగ్గడం, ఆర్థిక సంస్కరణల ద్వారా మెరుగుపడిన వాణిజ్య వాతావరణ పరిస్థితులు, అధిక వృద్ధి రేటు, పెట్టుబడులు, పూర్తి అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు మున్ముందు రేటింగ్ మరింత మెరుగుదలకు దోహదపడే అంశాలు. అయితే ద్రవ్యలోటు లక్ష్యం దారితప్పడం, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల భారం పెరగడం, అధిక ద్రవ్యోల్బణం, కరెంటఖ అకౌంటఖ లోటు కట్టుతప్పడం ప్రతికూల రేటింగ్ చర్యలకు దారితీస్తాయి. సంస్కరణల వల్ల వ్యాపార సానుకూల పరిస్థితులు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే మౌలికరంగంలో ఇబ్బందులు, పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఒక్క రాత్రిలో పరిష్కారమయిపోవన్నది గుర్తించాలి. ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలు ద్రవ్యలోటు లక్ష్య (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 3.9 శాతం) సాధన అవకాశాలపై అనుమానాలు సృష్టిస్తోంది. అదనపు ఆదాయం సమకూరనిదే ద్రవ్యలోటు లక్ష్య సాధన కష్టంగా కనబడుతోంది. కేంద్రం, రా?ాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతం ఉండే అవకాశం ఉంది. ‘బీబీబీ’ రేటింగ్ ఉన్న దేశాల సగటు 2.8 శాతంకన్నా ఇది అధికం. విద్యుతఖ పంపిణీ కంపెనీల ఆర్థికభారం ప్రధానంగా రా? ప్రభుత్వాలపై పడుతోంది. 2014-15లో ప్రభుత్వ రుణ భారం జీడీపీలో 66.8 శాతం ఉంటే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 68.8 శాతానికి ఎగసే పరిస్థితి ఉంది. ‘బీబీబీ-’ శ్రేణి దేశాలకు సంబంధించి అధిక ప్రభుత్వ రుణ భారం ఉన్న దేశాల్లో భారతఖ ఒకటి. వస్తు సేవల పన్నుసహా పెద్ద సంస్కరణల అమలులో రాజ్యసభలో మద్దతు పొందడం ప్రభుత్వానికి కీలక అంశం. ఏకాభిప్రాయ సాధన సంస్కరణల అమలులో ముఖ్యమైనది. అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు దిగువ స్థాయిలో ఉండడం దేశానికి లాభిస్తున్న అంశం. 2015-2016లో సగటున బేరలఖ ధర 55 డాలర్లు ఉంటుంది. 2017లో ఇది 65 డాలర్లకు పెరిగే వీలుంది. రాజకీయ ఇబ్బందులు, సామాజిక అనిశ్చితి, ప్రత్యేక ఉద్యమాలు, తీవ్రవాదం, నక్సలైట్ల వంటి తిరుగుబాటు కార్యకలాపాల వల్ల ఆర్థిక క్రియాశీలతకు తీవ్ర విఘాతం ఏదీ కలగదు. ఏమిటీ రేటింగ్స్..? విదేశీ ఇన్వెస్టర్లు, ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు ఒక దేశంలో పెట్టుబడులు పెట్టడానికి తరచూ ఫిచఖ, ?సఅండ్పీ, మూడీ?స వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల ‘రేటింగ్స్’ను పరిగణనలోకి తీసుకుంటాయి. ?సఅండ్పీ రేటింగ్ కూడా భారతఖకు సంబంధించి ‘బీబీబీ-’స్టేబులఖగా ఉంది. పాజిటివఖ అవుటఖలుక్తో ‘బీఏఏ3’ రేటింగ్‌ను మూడీ?స ఇస్తోంది. -
'స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వలేం'
సాక్షి, హైదరాబాద్: 'ఔట్లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు నోటీసులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత దశలో ఆమెకు నోటీసులు అవసరం లేదని పేర్కొంది. నోటీసులు జారీ చేయాల్సిన తరుణం వచ్చిందని తాము భావిస్తే అప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. 'ఔట్లుక్' కథనంపై స్మితా సబర్వాల్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన పోలీసుల కేసును కొట్టేయాలంటూ ఆ ప్రతిక ప్రతినిధులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసినందున, ప్రస్తుత కేసును నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్లుక్ వ్యవహారంలో న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం స్మితా సబర్వాల్‌కు రూ.15 లక్షలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి వాదనలు విన్నది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. స్మితా సబర్వాల్ వ్యవహారంలో ప్రభుత్వం ఈ విధంగా ప్రజాధనాన్ని వెచ్చించడం సరికాదన్నారు. అయితే పిటిషనర్ల వాదనతో ధర్మాసనం విభేదించింది. ఐఏఎస్‌ల ప్రతిష్టే ప్రభుత్వ ప్రతిష్టని పేర్కొంది. ఈ సమయంలోనే ఔట్లుక్ ప్రతినిధులపై కేసు కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చర్చ రాగా.. ఆ పిటిషన్‌పై వాదనలు ముగిశాయని, తీర్పు రిజర్వులో ఉందని న్యాయవాదులు తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అయితే ఈ తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామని, ఆ తరువాత ఈ వ్యాజ్యాలపై విచారణ చేపడుతామని తెలిపింది. దీనికి సత్యంరెడ్డి స్పందిస్తూ, స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేయాలని కోరారు. ఈ దశలో నోటీసులు అవసరం లేదని, అవసరమనుకున్నప్పుడు తాము తప్పక జారీ చేస్తామంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.