ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు | Gmail, Outlook users hit by email scams | Sakshi
Sakshi News home page

ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు

Published Mon, Oct 11 2021 5:14 PM | Last Updated on Mon, Oct 11 2021 5:15 PM

Gmail, Outlook users hit by email scams - Sakshi

ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి వివిద రకాలుగా యూజర్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను సైబర్  నెరగాళ్లు టార్గెట్ చేశారు. ఇటీవల కనుగొన్న ఈ-మెయిల్ స్కామ్ వినియోగదారులకు నకిలీ బహుమతి కార్డులను ఆఫర్ చేస్తోంది. అయితే, వాస్తవానికి ఎలాంటి బహుమతులు పంపబడవు. యూజర్లు గనుక ఆ లింకు క్లిక్ చేస్తే వినియోగదారులు డబ్బు, మీ సున్నితమైన డేటాను కోల్పోతారు. 

వాస్తవానికి, ఈ మోసపూరిత ఈమెయిల్స్ లోపల లింక్ లను వినియోగదారులు క్లిక్ చేయడానికి బ్రాండింగ్ పేరుతో ఈమెయిల్స్ పంపుతున్నట్లు తెలుస్తుంది. నేడు అత్యంత ప్రజాదరణ పొందిన ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్లలో జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను హ్యాకర్లు టార్గెట్ చేశారు. నకిలీ ఈ మెయిల్స్ పేరుతో విలువైన బహుమతులు ప్రముఖ కంపెనీల పేరుతో పంపిస్తున్నారు. వాస్తవానికి వారు ఎలాంటి బహుమతులు పంపరు. కానీ, ఈ గిఫ్ట్ కార్డులను 'క్లెయిం' చేసుకోవడానికి వినియోగదారులు మొదట ఒక చిన్న సర్వేలో పాల్గొనాలని ఆ లింకు సూచిస్తుంది.(చదవండి: అర్ధ శాస్త్ర విభాగంలో నోబెల్‌ బహుమతి విజేతలు వీరే..!)

దురదృష్టవశాత్తు, ఆ లింక్లపై క్లిక్ చేసే యూజర్లు వేరే వెబ్ సైట్ యాక్సెస్ చేస్తారు. అయితే, చివరకు వారికి ఎలాంటి బహుమతులు లేదా గిఫ్ట్ కార్డులు ఇవ్వబడవు. ఎక్స్ ప్రెస్ యుకె ప్రకారం.. మొదటి ఈ స్కామ్ మూడు నెలల క్రితం జూన్ లో గుర్తించారు. సర్వేలో పాల్గొన్న తర్వాత వారి సున్నితమైన వివరాలు హ్యాకర్లు కోరుతారు. మీరు గనుక ఆ లింకు క్లిక్ చేసి వివరాలు సమర్పించారో ఇక మీ పని అంతే. మీ ఖాతాలోని డబ్బులు కాజేయడంతో పాటు మిమ్మల్ని మరింత డబ్బు కోసం బ్లాక్ చేసే అవకాశం ఉంది. 

మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇలా..

  • తెలియని లింకులపై వినియోగదారులు అసలు క్లిక్ చేయవద్దు.
  • తెలియని వెబ్‌సైట్‌లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయవద్దు.
  • ఈమెయిల్, బ్యాంకు కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎక్కడ నమోదు చేయవద్దు. (మరి ముఖ్యంగా సర్వేలో పాల్గొనాల్సి వస్తే)
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement