Gmail users
-
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్...! ఈ లింకుల పట్ల జాగ్రత్త..! లేకపోతే..
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్..! గూగుల్ డాక్యుమెంట్స్,గూగుల్ స్లైడ్స్ ద్వారా హానికరమైన లింక్‌లతో వ్యక్తిగత డేటాను సేకరించి, బ్లాక్‌మెయిల్‌కు గురిచేస్తూన్నట్లు అమెరికన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఎక్కువగా వారే..! స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హ్యాకర్లు హానికరమైన లింక్‌లను పంపుతున్నట్లుగా..అందులో ఎక్కువ ఔట్లుక్ యూజర్లు ఉన్నట్లుగా యూఎస్ సైబర్ సెక్యూరిటీ సంస్థ అవనన్ తెలిపింది. సెక్యూరిటీ టూల్స్‌ను కూడా తప్పించుకుని గూగుల్ డాక్యుమెంట్స్, సైడ్స్ ద్వారా యూజర్లకు హానికరమైన లింక్‌లను పంపుతున్నట్లు అవనన్ పరిశోధకులు గుర్తించారు. ఈ దాడులపై గత ఏడాది జూన్‌లోనే అవనన్ నివేదించింది. ఆయా లింక్స్‌తో ఫిషింగ్ వెబ్సైట్ల సహాయంతో వ్యక్తిగత వివరాలను, బ్యాంకు అకౌంట్ వివరాలను హ్యకర్లు సంపాదిస్తున్నారని అవనన్ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్ 2021 నుంచి ఔట్లుక్ యూజర్లను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరస్తులు ఎక్కువగా దాడిచేస్తున్నట్లు అవనన్ రీసెర్చర్ జెరెమీ ఫుచ్స్ చెప్పారు. ఈ రకమైన దాడులపై అవనన్ జనవరి 3 న గూగుల్‌కు కూడా నివేదించింది. ఈ నివేదికపై గూగుల్ ఇంకా స్పందించలేదు. అంతేకాకుండా ఈ సమస్యకు గూగుల్ ఇంకా పరిష్కరం చూపలేదని తెలుస్తోంది. ఇలా చేస్తే బెటర్..! ఆయా యూజర్లకు వచ్చే గూగుల్ డాక్స్, సైడ్స్ లింక్స్ పట్ల జాగ్రత్త వహించాలని అవనన్ పేర్కొంది. హ్యకర్లు పంపే ఈమెయిల్ చిరునామాలను క్రాస్ చెక్ చేయాలని తెలిపింది. గూగుల్ డాక్స్‌లో పంపే లింక్‌లను అసలు ఒపెన్ చేయకూడదని హెచ్చరించింది. చదవండి: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..! వెంటనే ఇలా చేస్తే మేలు..! -
ఇకపై జీ మెయిల్ ఓపెన్ చేయాలంటే ఇవి తప్పనిసరి.. అమల్లోకి కొత్త రూల్స్
Google two step Verification: సోషల్ మీడియా, క్లౌడ్ స్టోరేజీ, వర్చువల్ వరల్డ్ మన జీవితంలో భాగంగా మారిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఈ అకౌంట్లను రెగ్యులర్ టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయా అకౌంట్ల భద్రత ఎంతో ముఖ్యమైన వ్యవహరంగా మారింది. ఈ క్రమంలో తన యూజర్ల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. టూ స్టెప్ వెరిఫికేషన్ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం అ జాగ్రత్తగా ఉన్నా మోసాలు చేస్తున్నారు. సోషల్ మీడియా సైట్లు, బిజినెస్ మెయిల్స్‌లోకి దూరి వ్యక్తిగత సమాచారం లూటీ చేస్తున్నారు. దీంతో యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని గూగుల్ సంస్థ మరోసారి టూ స్టెప్ వెరిఫికేషన్ (2ఎఫ్ఏ, టూ ఫ్యాక్టర్ అథెంటీకేషన్)ను అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై జీ మెయిల్ ఓపెన్ చేయాలంటే కేవలం పాస్వర్డ్ ఒక్కటి ఎంటర్ చేస్తే సరిపోదు. దాంతో పాటు మరో అథెంటీకేషన్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ ఉండాల్సిందే టూ స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి యూజర్ సెట్ చేసుకున్న పాస్వర్డ్ తర్వాత మొబైల్ ఫోన్‌ని రెండో ప్రామాణీకంగా గూగుల్ తీసుకుంటోంది. దీంతో ఇకపై జీ మెయిల్ ఓపెన్ చేయాలంటే పాస్‌వర్డ్‌తో పాటు ఫోన్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేయల్సి ఉంటుంది. కాబట్టి జీ మెయిల్ ఓపెన్ చేసేప్పుడు మీ ఫోన్‌ని పక్కనే ఉంచుకోవాలంటూ సూచన చేస్తోంది గూగుల్. మొదలైన ప్రక్రియ టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియను జీ మెయిల్ వేగవంతం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీ మెయిల్ యూజర్లకు అలెర్ట్ మెసేజ్‌లు పంపిస్తోంది గూగుల్. తొలి దశలో 15 కోట్ల అకౌంట్లకు టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను అమలు చేయనున్నారు. నవంబర్ 8 నుంచి ఎంపిక చేసిన యూజర్లను ఈ టూ స్టెప్ పరిధిలోకి తీసుకువస్తోంది గూగుల్. 2022 చివరికి గతంలో కూడా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను అమలు చేయాలని గూగుల్ ప్రయత్నించినా యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. అయితే ఈసారి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతూ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో కేవలం పది శాతం యూజర్లకే దీన్ని పరిమితం చేసింది. 2022 చివరి నాటికి యూజర్లందరికి వర్తింప చేయాలనే వ్యూహంతో ఉంది. చదవండి:గూగుల్ ప్లే స్టోర్‌లో అలజడి..! భారీగా నిషేధం..! -
ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు
ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి వివిద రకాలుగా యూజర్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను సైబర్ నెరగాళ్లు టార్గెట్ చేశారు. ఇటీవల కనుగొన్న ఈ-మెయిల్ స్కామ్ వినియోగదారులకు నకిలీ బహుమతి కార్డులను ఆఫర్ చేస్తోంది. అయితే, వాస్తవానికి ఎలాంటి బహుమతులు పంపబడవు. యూజర్లు గనుక ఆ లింకు క్లిక్ చేస్తే వినియోగదారులు డబ్బు, మీ సున్నితమైన డేటాను కోల్పోతారు. వాస్తవానికి, ఈ మోసపూరిత ఈమెయిల్స్ లోపల లింక్ లను వినియోగదారులు క్లిక్ చేయడానికి బ్రాండింగ్ పేరుతో ఈమెయిల్స్ పంపుతున్నట్లు తెలుస్తుంది. నేడు అత్యంత ప్రజాదరణ పొందిన ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్లలో జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను హ్యాకర్లు టార్గెట్ చేశారు. నకిలీ ఈ మెయిల్స్ పేరుతో విలువైన బహుమతులు ప్రముఖ కంపెనీల పేరుతో పంపిస్తున్నారు. వాస్తవానికి వారు ఎలాంటి బహుమతులు పంపరు. కానీ, ఈ గిఫ్ట్ కార్డులను 'క్లెయిం' చేసుకోవడానికి వినియోగదారులు మొదట ఒక చిన్న సర్వేలో పాల్గొనాలని ఆ లింకు సూచిస్తుంది.(చదవండి: అర్ధ శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!) దురదృష్టవశాత్తు, ఆ లింక్‌లపై క్లిక్ చేసే యూజర్లు వేరే వెబ్ సైట్ యాక్సెస్ చేస్తారు. అయితే, చివరకు వారికి ఎలాంటి బహుమతులు లేదా గిఫ్ట్ కార్డులు ఇవ్వబడవు. ఎక్స్ ప్రెస్ యుకె ప్రకారం.. మొదటి ఈ స్కామ్ మూడు నెలల క్రితం జూన్ లో గుర్తించారు. సర్వేలో పాల్గొన్న తర్వాత వారి సున్నితమైన వివరాలు హ్యాకర్లు కోరుతారు. మీరు గనుక ఆ లింకు క్లిక్ చేసి వివరాలు సమర్పించారో ఇక మీ పని అంతే. మీ ఖాతాలోని డబ్బులు కాజేయడంతో పాటు మిమ్మల్ని మరింత డబ్బు కోసం బ్లాక్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇలా.. తెలియని లింకులపై వినియోగదారులు అసలు క్లిక్ చేయవద్దు. తెలియని వెబ్సైట్లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయవద్దు. ఈమెయిల్, బ్యాంకు కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎక్కడ నమోదు చేయవద్దు. (మరి ముఖ్యంగా సర్వేలో పాల్గొనాల్సి వస్తే) -
ఫొటోలను గూగుల్ ఫొటోస్‌లో స్టోర్ చేస్తున్నారా?
గూగుల్ ఫొటోస్.. ఫొటోలు, వీడియోల బ్యాకప్ కోసం ఉపయోగిస్తున్న గూగుల్ బేస్డ్ ఫ్రీ యాప్. చాలామంది ఇందులో ఫొటోలు, వీడియోలను భద్రంగా ఉన్నాయనుకుంటారు. ఆటోమేటిక్‌గా ఫొటోలు అందులోకి వెళ్తున్నాయని భావిస్తుంటారు. కానీ, గూగుల్ ఫొటోస్‌కూ ఓ పరిమితి అంటూ ఉంటుంది. అది దాటినా.. లేదంటే ఫుల్ మొమరీతో ఎక్కువ కాలం నడిపించినా.. ఆ మొత్తం ఫొటోలు, వీడియోలు ఎగిరిపోతాయని మీకు తెలుసా?. కాబట్టి, గూగుల్ ఫొటోస్‌కు సంబంధించి ఈ విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడండి. గూగుల్ ఫొటోస్ యాప్ కోసం ప్రతీ గూగుల్ అకౌంట్‌కు ఉచితంగా కొంత స్పేస్ ఇస్తుంది గూగుల్. ఇందులో ఎక్స్‌ప్రెస్, స్టోరేజ్ సేవర్, ఒరిజినల్ క్వాలిటీ అనే ఆప్షన్లు ఉంటాయి. ఒకవేళ ఒరిజినల్ క్వాలిటీని గనుక క్లిక్ చేయకపోతే.. ఫొటోలు, వీడియోలు మంచి క్వాలిటీతో సేవ్ కావు. అప్పుడు ఫొటోలు తక్కువ సైజులో సేవ్ అయ్యి.. ఆ ఫొటోలు, వీడియోలు బ్లర్‌గా గూగుల్ ఫొటోల్లో కనిపిస్తుంటాయి. చాలామంది గూగుల్ ఫొటోస్‌లో స్పేస్ కోసం తక్కువ క్వాలిటీకే ప్రయారిటీ ఇస్తారు. కానీ, క్వాలిటీ ఫొటోల్ని దాచుకోవాలనుకుంటే.. ఒరిజినల్ క్వాలిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయకతప్పదు. స్టోరేజ్ మించితే.. గూగుల్ అకౌంట్ స్టోరేజ్‌లో గూగుల్ డ్రైవ్ మాదిరిగానే.. గూగుల్ ఫొటోస్కి కూడా 15 జీబీ స్పేస్ ఇస్తుంది గూగుల్. ఈ పరిమితి దాటిపోతే.. తర్వాతి నుంచి తీసే ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఆటోమేటిక్‌గా సేవ్ కావు. అప్పుడు ఆల్రెడీ సేవ్ అయి ఉన్న డాటాపై(ఆల్రెడీ ఉన్న ఫొటోలు, వీడియోపై) ప్రభావం పడే ఛాన్స్ ఉంది. కాబట్టి, గూగుల్ వన్ సబ్ స్క్రిప్షన్ ద్వారా అదనపు స్టోరేజ్‌ను గూగుల్ ఫొటోస్ కోసం కొనుక్కోవచ్చు. ఒకవేళ కొనుక్కోకపోతే.. గూగుల్ ఫొటోస్ పూర్తి కోటా అయిపోయినా(15 జీబీ పూర్తి కావడం), లేకుంటే అదనపు స్టోరేజ్‌ను కొనుక్కోకపోయినా.. ఆ తర్వాతి ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్ బ్యాకప్‌కు వెళ్లవు. అంటే.. స్టోర్ కావన్నమాట. ఒకవేళ ఓవర్ కోటాతో అలాగే గూగుల్ ఫొటోస్ యాప్‌ను 24 నెలలపాటు నడిపిస్తే.. ఆల్రెడీ అందులో ఉన్న ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, గూగుల్ ఫొటోస్ మొమరీ ఫుల్ అయితే గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఉపయోగించడం ఆపేయాలి(సెట్టింగ్స్ ద్వారా). గూగుల్ చెబుతుంది జీమెయిల్గానీ, గూగుల్ ఫొటోస్గానీ, గూగుల్ డ్రైవ్గానీ(గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్, డ్రాయింగ్స్, ఫామ్స్, జామ్బోర్డ్, సైట్స్ ఫైల్స్) ఏదైనా సరే.. రెండేళ్లపాటు ఉపయోగించకుండా ఉంటే అందులో ఉండే మొత్తం కంటెంట్, డాటా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. అయితే అలా చేయడానికి కంటే ముందు ఈ-మెయిల్స్, నోటిఫికేషన్స్ ద్వారా గూగుల్ తన యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది కూడా. ఇక డిలీట్ చేయడానికి మూడు నెలల ముందు యూజర్‌ను మరోసారి అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు ఆ టైంలో కంటెంట్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఒకవేళ జీమెయిల్, డ్రైవ్‌ల విషయంలో యాక్టివ్‌గా ఉండి.. గూగుల్ ఫొటోస్ను రెండేళ్లపాటు పట్టించుకోకుండా ఉన్నారనుకోండి. గూగుల్ ఫొటోస్‌లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని గూగుల్ తొలగిస్తుంది. డేటా డిలీట్ కాకుండా ఉండాలంటే.. తరచూ గూగుల్ అకౌంట్‌కు లాగిన్ అయ్యి.. ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోలను చెక్ చేస్తూ ఉండాలి(వెబ్ లేదా యాప్‌లో అయినా సరే). అవసరం లేని ఫొటోలు, వీడియోలు, కంటెంట్‌ను తీసేస్తూ.. ఫ్రీ స్పేస్‌ను మెయింటెన్ చేస్తూ ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చాలామంది ఒకే ఫోన్లో రెండు, మూడు గూగుల్ అకౌంట్లను మెయింటెన్ చేస్తుంటారు. కాబట్టి, అన్ని అకౌంట్లకు సంబంధించిన ఫొటోస్, డ్రైవ్, జీమెయిల్ అకౌంట్లను తప్పనిసరిగా వెరిఫై చేస్తూ ఉండాలి. ఇదీ చదవండి: ఇంట్లో కరెంట్ బోర్డు సమస్యలను ఇలా గుర్తించొచ్చు! -
యూట్యూబ్ కొత్త అప్ డేట్స్, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్రియేటర్స్
కరోనా కారణంగా ఆన్ లైన్ మనీ ఎర్నింగ్స్ కోసం పెద్దసంఖ్యలో జనాలు యూట్యూబ్ ను ఆశ్రయిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్సే కాకుండా టెక్నాలజీపై అవగాహన, అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ను ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు. అందుకే యూట్యూబ్ సైతం తన క్రియేటర్స్ కు అనుగుణంగా మార్పులు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మే నెలలో కొన్ని అప్ డేట్స్ ను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో ప్రధానమైంది. గూగుల్ అకౌంట్ ఛేంజ్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ నేమ్ తో పాటు ప్రొఫైల్ నేమ్ మార్చుకునే సౌలభ్యం.వాస్తవానికి జీమెయిల్ అకౌంట్ సాయంతో యూట్యాబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం. అదే అకౌంట్ ను ఇతర యాప్స్ లలో వినియోగించడం ద్వారా హ్యాకర్స్, వ్యక్తిగత డేటా భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ కొత్త అప్ డేట్ ను పరిచయం చేసింది. ఈ అప్ డేట్ వల్ల నార్మల్ క్రియేట్స్ కంటే వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్న ఛానల్స్ క్రియేటర్స్ ఇబ్బంది పడుతున్నారు. యూట్యూబ్ వెరిఫైడ్ అకౌంట్ అంటే? యూట్యూబ్ లో క్రియేటర్స్ లక్షమంది సబ్ స్కైబర్స్ ను సొంతం చేసుకుంటే యూట్యూబ్ టిక్ మార్క్ తో వెరిఫైడ్ అకౌంట్ అందిస్తుంది. అయితే తాజా అప్ డేట్ తో వెరిఫైడ్ అకౌంట్స్ ను కోల్పోవాల్సి వస్తుంది. చదవండి : YouTube Shorts: చేస్తున్నారా.. పర్సు నిండుతుందిలెండి! కొత్త అప్ డేట్ ఏంటంటే? జీమెయిల్ అకౌంట్ మార్చకుండా ఛానల్ నేమ్ మార్చుకోవచ్చు. దీని వల్ల నార్మల్ క్రియేటర్స్ కు పెద్ద నష్టం లేదు. కానీ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉన్న క్రియేటర్లు ఛానల్ పేరు మార్చుకుంటే, ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోల్పోవాల్సి ఉంటుంది. ఛానల్ పేరు మార్చిన తరువాత బ్యాడ్జి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇలాంటి యూట్యూబ్ యూజర్లు కొత్త అప్డేట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ పేరును ఎలా మార్చాలి? • యూట్యూబ్ ఛానల్ పేరు మార్చుకునేందుకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. డెస్క్ టాప్ అవసరం లేదు. • ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఫోటో పై ట్యాప్ చేయాలి • ట్యాప్ చేసిన తరువాత ఛానల్ లో ఎడిట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. • ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్లిన తరువాత ఛానల్ కొత్త నేమ్‌ను ఎంటర్ చేసి సేవ్ చేయాలి. • దీంతో ఛానల్ నేమ్ మారిపోతుంది. ఛానల్ తో పాటు ఫోటో మార్చుకోవచ్చు. ఫోటో మార్చాలంటే ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేస్తే న్యూ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది ఆ న్యూ ఫోటో ఆప్షన్ ను క్లిక్ చేసి ఫోటో అప్ లోడ్ చేయాలి. ఆ పై సేవ్ చేస్తే ఫోటో కూడా మారిపోతుంది -
గూగుల్ మీట్ ఫ్రీ వీడియో కాల్స్ గడువు పొడిగింపు
గూగుల్ మీట్ తన ఉచిత అన్లిమిటెడ్ వీడియో కాల్ల సేవలను(24 గంటలు) జూన్ 2021 వరకు పొడిగించింది. గూగుల్ మీట్ ద్వారా వీడియో కాల్స్ చేసే జి-మెయిల్ వినియోగదారులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఇంతకముందు వరకు గూగుల్ మీట్ వీడియో కాల్స్ ఉచిత సేవలు 2021 మార్చి 31 వరకు మాత్రమే జి-మెయిల్ వినియోగదారులకు లభించేవి. ఈ పొడిగింపును గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించారు. 2020 కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఉద్యోగులు, విద్యార్థులు ఆన్లైన్ వీడియో వినియోగం పెరగడంతో గూగుల్ మీట్ పేరుతో కొత్త సేవలను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్విట్టర్‌లోని అధికారిక గూగుల్ వర్క్‌స్పేస్ ఖాతా ద్వారా 'అన్లిమిటెడ్' గూగుల్ మీట్ కాల్ సేవలను పొడగిస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది గూగుల్ హ్యాంగ్ అవుట్‌ను గూగుల్ మీట్‌గా రీ బ్రాండ్ చేసింది. కోవిడ్‌కు ముందు దీని ద్వారా 60 నిమిషాల వరకు వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఆ తరువాత లాక్డౌన్లో ఇంటి నుంచి పనిచేసేవారి సంఖ్య పెరగడంతో పరిమితిని పెంచింది. 24 గంటలూ వీడియో కాల్స్, మీటింగ్స్ నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. 100 మందిని మీటింగ్‌లో యాడ్ చేసే ఆప్షన్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఇంతకు మించి సబ్‌స్క్రైబర్స్‌ను మీటింగ్స్‌కు యాడ్ చేయాలంటే గూగుల్ వర్క్ స్పేస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: స్పేస్ఎక్స్ కు ఇండియాలో ఎదురుదెబ్బ -
జీ మెయిల్: స్పామ్ మెసేజ్ రాకుండా..
జీ మెయిల్ గురించి తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నెటిజన్లు జీ మెయిల్ వినియోగదారులే. అయితే ఇప్పుడు జీ మెయిల్లో ఓ సమస్య అందరికి తలనొప్పిగా మారింది. అదే స్పామ్. మన ప్రమేయం లేకుండానే మన అకౌంట్లోకి కుప్పులు తెప్పలుగా మెయిల్స్ వస్తూనే ఉంటాయి. జీ మెయిల్ ఇప్పటికే అనవసర మెయిల్స్‌ను విభజించి వాటిని స్పామ్ ఫోల్డర్‌కు పంపుతుంది. అవి 30 రోజుల తర్వాత డిలీట్ అవుతాయి. అయితే అన్ని అనవసర మెయిల్స్‌ను స్పామ్ ఫోల్డర్‌కు పంపడం సాధ్యం కాదు. కొన్నిసార్లు స్పామ్ మెయిల్స్ డైరెక్ట్ ఇన్‌బాక్స్‌లోకే వచ్చేస్తుంటాయి. గత వారం నుంచి ఈ సమస్య మరింత తీవ్రతరం అవడంతో గూగుల్ ఆ సమస్యకు పరిష్కారం కనుగొంది. వీటిని మనం రాకుండా ఉండేందుకు కొన్ని రకాల టిప్స్ ఇక్కడున్నాయి. (జీమెయిల్ ద్వారా కూడా వీడియో కాల్స్) 1. రిపోర్టు, బ్లాక్ .మనకు కొన్ని అకౌంట్ల నుంచి ఎక్కువగా స్పామ్ మెయిల్స్ వస్తుంటాయి. వాటని రిపోర్ట్ లేదా బ్లాక్ చేయడం ద్వారా మళ్లీ ఆ మెయిల్స్ రాకుండా ఉంచవచ్చు. ఇందుకు సంబంధిత మెయిల్‌ను ఓపెన్ చేసి కుడి వైపు పైన కనిపించే మూడు చుక్కల బటన్‌ను నొక్కి అక్కడ ఉండే స్పామ్ రిపోర్టును నొక్కితే చాలు. అలాగే పంపించిన వారిని బ్లాక్ చేసినా సరిపోతుంది. (గూగుల్ సెర్చ్ హెడ్‌గా ప్రభాకర్ రాఘవన్) 2. మెసేజ్‌లను ఫిల్టర్ చేయడం మెయిల్‌ను స్పామ్‌గా రిపోర్ట్ చేయకూడదనుకుంటే, లేదా పంపినవారిని బ్లాక్ చేయకపోతే అలాంటి మెసేజ్‌లను ఫిల్టర్ చేయవచ్చు. దీని ద్వారా భవిష్యత్తులో మీ ఇన్‌బాక్స్‌లోకి ఇలాంటి మెసేజ్‌లు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. దీనికి కూడా ముందుగా చెప్పినట్లు కుడి వైపు కనిపించే మూడు చుక్కల బటన్‌ను నొక్కి ఫిల్టర్ మెసేజెస్ లైక్ దిస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. కాగా ఫిల్టర్ కోసం కొన్ని పదాలు, సైజ్, అటాచ్మెంట్స్ వంటి మరిన్ని వివరాలను కూడా మెయిల్స్‌కు జోడించవచ్చు. ఆ తర్వాత ఈ ఫిల్టర్ చేసిన మెయిల్స్‌ను ఆర్కైవ్ చేయడం, డిలీట్ చేయడం , పొటెన్షియల్ స్పామ్‌గా లేబుల్ చేయడం చేయవచ్చు. -
90 శాతం జీమెయిల్ అకౌంట్లకు హ్యాకర్ల ముప్పు
శాన్ఫ్రాన్సిస్కో : ప్రపంచవ్యాప్తంగా అధునాతన హ్యాకర్ల ముప్పు పెరుగుతున్నప్పటికీ, జీమెయిల్ అకౌంట్ యూజర్లు మాత్రం అసలు జాగ్రత్తగా లేరని తెలిసింది. దాదాపు 90 శాతం జీమెయిల్ అకౌంట్ యూజర్లకు సైబర్ దాడి పొంచుకుని ఉందని గూగుల్ తెలిపింది. 10 శాతం మంది కంటే తక్కువ మంది జీమెయిల్ యూజర్లు మాత్రమే హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు రెండు దశల ప్రమాణీకరణను కలిగి ఉన్నారని చెప్పింది. యూజర్ల అకౌంట్ల యాక్సస్‌ను పొందడానికి హ్యాకర్లకు అత్యుత్తమ మార్గం పాస్‌వర్డ్‌లని, ముఖ్యంగా వ్యాపారవేత్తలు హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని, వెంటనే రెండు దశల ప్రమాణీకరణను అమలు చేసుకోవాలని గూగుల్ ఇంజనీర్లు తెలిపారు. కేవలం 12 శాతం మంది అమెరికన్లు మాత్రమే తమ అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవడానికి పాస్వర్డ్ మేనేజర్‌ను కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన న్యూస్ వెబ్సైట్ టెక్ రిపబ్లిక్ రిపోర్టు చేసింది. అకౌంట్లు హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు, పాస్‌వర్డ్‌లను కాపాడుకోవడానికి రెండు దశల ప్రమాణీకరణ ఎంతో ముఖ్యమని తెలిపింది. 2011లో తొలిసారి గూగుల్ ఈ రెండు దశల ప్రమాణీకరణను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పటివరకు ఈ సురక్షిత చర్యలను ఎక్కువ మంది పాటించడం లేదు. లాగిన్ అయిన కొన్ని సెకన్లకే ఈ ఫీచర్ యాడ్ అవుతుంది. కానీ ఈ ఫీచర్‌ను గూగుల్ యూజర్లందరికీ తప్పనిసరి చేయలేదు. ఇటీవల కాలంలో యూజర్ల భద్రతను మెరుగుపరుచేందుకు గూగుల్ పలు చర్యలను తీసుకుంటోంది. -
యూజర్లకు గూగుల్ వార్నింగ్!
న్యూఢిల్లీ: మెసెజింగ్ సర్వీస్ జీమెయిల్ యూజర్లకు సెర్చింగ్ దిగ్గజం గూగుల్ కొన్ని సూచనలు చేసింది. వచ్చే ఫిబ్రవరి 13 నుంచి జీమెయిల్ యూజర్లు జావా స్ర్కిప్ట్ ఫైళ్లను రిస్ట్రిక్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. కొన్ని రకాల వైరస్ ల కారణంగా జీమెయిల్ యూజర్లను ఇందుకు సంబంధించిన ఫైళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఫిబ్రవరి 13 తర్వాత నుంచి జావా స్క్రిప్ట్ ఫైళ్లను సెండ్ చేస్తే మెస్సేజ్ ఈజ్ బ్లాక్డ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అని డైలాగ్ బాక్స్ వస్తుందని సంస్థ తెలిపింది. యూజర్లకు సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని, వైరస్ల నుంచి ఇన్‌బాక్స్, సెంట్ మెయిల్స్, ఇతరత్రా డాటాను సెక్యూర్ చేయడానికి ఈ చర్యను తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం జీమెయిల్ నుంచి .exe, .msc, and .bat ఫైళ్లను, వీటికి సంబధించిన ఫైల్ అటాచ్‌మెంట్స్‌ను పంపడాన్ని నిషేధిస్తుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో .జేఎస్ (జావా స్క్రిప్ట్) ఫైళ్లను వేరే యూజర్లను పంపాల్సి వస్తే అందుకు గూగుట్ డ్రైవ్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, ఇతర స్టోరేజ్ సౌకర్యం ఉన్న సర్వీసు నుంచి నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చునని గూగుల్ వివరించింది. జీమెయిల్ సర్వీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.