Google Photos: Top 4 Important Things You Should Know - Sakshi
Sakshi News home page

Google Photos: ఫొటోలను స్టోర్‌ చేస్తే ఇవి తెలుసుకోండి

Published Mon, Aug 16 2021 11:39 AM | Last Updated on Mon, Aug 16 2021 12:27 PM

Google Photos App Users Should Aware These Important Things - Sakshi

గూగుల్‌ ఫొటోస్‌.. ఫొటోలు, వీడియోల బ్యాకప్‌ కోసం ఉపయోగిస్తున్న గూగుల్‌ బేస్డ్‌ ఫ్రీ యాప్‌. చాలామంది ఇందులో ఫొటోలు, వీడియోలను భద్రంగా ఉన్నాయనుకుంటారు. ఆటోమేటిక్‌గా ఫొటోలు అందులోకి వెళ్తున్నాయని భావిస్తుంటారు. కానీ, గూగుల్‌ ఫొటోస్‌కూ ఓ పరిమితి అంటూ ఉంటుంది. అది దాటినా.. లేదంటే ఫుల్‌ మొమరీతో ఎక్కువ కాలం నడిపించినా.. ఆ మొత్తం ఫొటోలు, వీడియోలు ఎగిరిపోతాయని మీకు తెలుసా?. కాబట్టి, గూగుల్‌ ఫొటోస్‌కు సంబంధించి ఈ విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడండి. 
 

గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ కోసం ప్రతీ గూగుల్‌ అకౌంట్‌కు ఉచితంగా కొంత స్పేస్‌ ఇస్తుంది గూగుల్‌. ఇందులో ఎక్స్‌ప్రెస్‌, స్టోరేజ్‌ సేవర్‌, ఒరిజినల్‌ క్వాలిటీ అనే ఆప్షన్లు ఉంటాయి. ఒకవేళ ఒరిజినల్‌ క్వాలిటీని గనుక క్లిక్‌ చేయకపోతే.. ఫొటోలు, వీడియోలు మంచి క్వాలిటీతో సేవ్‌ కావు. అప్పుడు ఫొటోలు తక్కువ సైజులో సేవ్‌ అయ్యి.. ఆ ఫొటోలు, వీడియోలు బ్లర్‌గా గూగుల్‌ ఫొటోల్లో కనిపిస్తుంటాయి. చాలామంది గూగుల్‌ ఫొటోస్‌లో స్పేస్‌ కోసం తక్కువ క్వాలిటీకే ప్రయారిటీ ఇస్తారు. కానీ, క్వాలిటీ ఫొటోల్ని దాచుకోవాలనుకుంటే.. ఒరిజినల్‌ క్వాలిటీ ఆప్షన్‌ను క్లిక్‌ చేయకతప్పదు. 

స్టోరేజ్‌ మించితే.. 
గూగుల్‌ అకౌంట్‌ స్టోరేజ్‌లో గూగుల్‌ డ్రైవ్‌ మాదిరిగానే.. గూగుల్‌ ఫొటోస్‌కి కూడా 15 జీబీ స్పేస్‌ ఇస్తుంది గూగుల్‌. ఈ పరిమితి దాటిపోతే.. తర్వాతి నుంచి తీసే ఫొటోలు, వీడియోలు గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌లో ఆటోమేటిక్‌గా సేవ్‌ కావు. అప్పుడు ఆల్రెడీ సేవ్‌ అయి ఉన్న డాటాపై(ఆల్రెడీ ఉన్న ఫొటోలు, వీడియోపై) ప్రభావం పడే ఛాన్స్‌ ఉంది. కాబట్టి, గూగుల్‌ వన్‌ సబ్ స్క్రిప్షన్  ద్వారా అదనపు స్టోరేజ్‌ను గూగుల్‌ ఫొటోస్‌ కోసం కొనుక్కోవచ్చు.
 

ఒకవేళ కొనుక్కోకపోతే.. 
గూగుల్‌ ఫొటోస్‌ పూర్తి కోటా అయిపోయినా(15 జీబీ పూర్తి కావడం), లేకుంటే అదనపు స్టోరేజ్‌ను కొనుక్కోకపోయినా.. ఆ తర్వాతి ఫొటోలు, వీడియోలు గూగుల్‌ ఫొటోస్‌ బ్యాకప్‌కు వెళ్లవు. అంటే.. స్టోర్‌ కావన్నమాట. ఒకవేళ ఓవర్‌ కోటాతో అలాగే గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ను 24 నెలలపాటు నడిపిస్తే.. ఆల్రెడీ అందులో ఉన్న ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, గూగుల్‌ ఫొటోస్‌ మొమరీ ఫుల్‌ అయితే గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ను ఉపయోగించడం ఆపేయాలి(సెట్టింగ్స్‌ ద్వారా). 

గూగుల్‌ చెబుతుంది
జీమెయిల్‌గానీ, గూగుల్‌ ఫొటోస్‌గానీ, గూగుల్‌ డ్రైవ్‌గానీ(గూగుల్‌ డాక్స్‌, షీట్స్‌, స్లైడ్స్‌, డ్రాయింగ్స్‌, ఫామ్స్‌, జామ్‌బోర్డ్‌, సైట్స్‌ ఫైల్స్‌) ఏదైనా సరే.. రెండేళ్లపాటు ఉపయోగించకుండా ఉంటే అందులో ఉండే మొత్తం కంటెంట్‌, డాటా ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతుంది. అయితే అలా చేయడానికి కంటే ముందు ఈ-మెయిల్స్‌, నోటిఫికేషన్స్‌ ద్వారా గూగుల్‌ తన యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది కూడా. ఇక డిలీట్‌ చేయడానికి మూడు నెలల ముందు యూజర్‌ను మరోసారి అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు ఆ టైంలో కంటెంట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. 

ఒకవేళ జీమెయిల్‌, డ్రైవ్‌ల విషయంలో యాక్టివ్‌గా ఉండి.. గూగుల్‌ ఫొటోస్‌ను రెండేళ్లపాటు పట్టించుకోకుండా ఉన్నారనుకోండి. గూగుల్‌ ఫొటోస్‌లో ఉన్న కంటెంట్‌ మొత్తాన్ని గూగుల్‌ తొలగిస్తుంది. 


డేటా డిలీట్‌ కాకుండా ఉండాలంటే.. 
తరచూ గూగుల్‌ అకౌంట్‌కు లాగిన్‌ అయ్యి.. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ద్వారా జీమెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ ఫొటోలను చెక్‌ చేస్తూ ఉండాలి(వెబ్‌ లేదా యాప్‌లో అయినా సరే). అవసరం లేని ఫొటోలు, వీడియోలు, కంటెంట్‌ను తీసేస్తూ.. ఫ్రీ స్పేస్‌ను మెయింటెన్‌ చేస్తూ ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చాలామంది ఒకే ఫోన్‌లో రెండు, మూడు గూగుల్‌ అకౌంట్లను మెయింటెన్‌ చేస్తుంటారు. కాబట్టి, అన్ని అకౌంట్‌లకు సంబంధించిన ఫొటోస్‌, డ్రైవ్‌, జీమెయిల్‌ అకౌంట్లను తప్పనిసరిగా వెరిఫై చేస్తూ ఉండాలి.

ఇదీ చదవండి: ఇంట్లో కరెంట్‌ బోర్డు సమస్యలను ఇలా గుర్తించొచ్చు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement