గూగుల్‌ డ్రైవ్‌లు వాడొద్దు, ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం షాక్‌! | Central Bans Government Employees From Using Vpn,google Drive,dropbox | Sakshi
Sakshi News home page

గూగుల్‌ డ్రైవ్‌లు వాడొద్దు, ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం షాక్‌!

Published Fri, Jun 17 2022 9:22 PM | Last Updated on Fri, Jun 17 2022 10:15 PM

Central Bans Government Employees From Using Vpn,google Drive,dropbox - Sakshi

క్లౌడ్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు..ప్రైవేట్‌ సంస్థలకు చెందిన  థర్డ్‌ పార్టీ క్లౌడ్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌ గూగుల్‌ డ్రౌవ్‌, డ్రాప్‌ బాక్స్‌లను వినియోగించడానికి వీలు లేకుండా నిషేధం విధించింది. వీటితో పాటు వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌) విషయంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు విధించింది.    


భారత్‌ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని,లేదంటే భారత్‌ నుంచి శాస్వతంగా నిష్క్రమించుకోవచ్చని వీపీఎన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీపీఎన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు నార్డ్‌ వీపీఎన్‌, ఎక్స్‌ప్రెస్‌ వీపీఎన్‌లు భారత్‌లు వీపీఎన్‌ నెట్‌ వర్క్‌లను తొలగించాయి.  

 

ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త వీపీఎన్‌ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..వీపీఎన్‌ చట్టాలకు సంబంధించి నేషనల్‌ ఇన్ఫ్రమెటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) అన్నీ మంత్రిత్వ  శాఖలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని,ఈ కీలక ఉత్తర్వులపై మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆమోదం తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి.  

వీపీఎన్‌ సంస్థలకు కేంద్రం విధించిన నిబంధనలు ఇవే

గత మే నెలలో కేంద్రం వీపీఎన్‌ సంస్థలపై నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి సదరు సంస్థలు వ్యవహరించాలని ఆదేశించింది. లేదంటే భారత్‌ నుంచి కార్యకలాపాలు నిలిపి వేయాలని సూచించింది. ఇక కేంద్రం వీపీఎన్‌ సర్వీసుల విషయంలో విధించిన నిబంధనల్ని ఒక్కసారి పరిశీలిస్తే  

సబ్‌స్క్రయిబర్‌, కస్టమర్‌కు సంబంధించి సరైన పేరును ఇవ్వాలి

సేవలను ఎంత కాలం వినియోగించుకుంటారో స్పష్ట ఇవ్వాలి

యూజర్లకు ఐపీలను కేటాయించాలి

రిజిస్ట్రేషన్‌ టైంలో.. ఈ-మెయిల్‌, ఐపీ అడ్రస్‌,  టైమ్‌ స్టాంప్‌ వివరాలను పొందుపర్చాలి

అయితే వీపీఎన్‌ను ఎందుకు తీసుకుంటున్నారో.. కస్టమర్‌ తెలియజేయాలి. 

సరైన చిరునామా, కాంటాక్ట్‌ నెంబర్లు ఇవ్వాలి. 

► సబ్‌స్క్రయిబర్ల ఒనర్‌షిప్‌ ప్యాటర్న్‌ను సమర్పించాలి.

అంటూ కేంద్రం వీపీఎన్‌ సర్వీసు సంస్థల్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కొత్త చట్టాన్ని అమలు చేస్తుండగా.. తాజా కేంద్ర నిర్ణయంతో వీపీఎన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు భారీ నష్టం చేకూరనుంది. వీటితో పాటు క్లౌడ్‌ సర్వీసులైన గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌ బాక్స్‌ల వినియోగం నిలిపి వేయాలని కేంద్రం ఉద్యోగుల్ని ఆదేశించిందని వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌లు హైలెట్‌ చేస్తున్నాయి.

ఎనీడెస్క్ సైతం
వీపీఎన్‌, క్లౌడ్ స‌ర్వీసెస్‌తో టీమ్ వ్యూయ‌ర్‌, ఎనీడెస్క్‌, యామ్‌వీ అడ్మిన్‌లను సైతం వినియోగించొద్దంటూ కేంద్రం స్ప‌ష్టం చేసింది. అలాగే, విధులకు సంబంధించిన  కార్యకలాపాలపై జరిగిన ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను సైతం ప్ర‌భుత్వేత‌ర‌, థ‌ర్డ్ పార్టీ మెయిల్స్‌ వినియోగించొద్దని స్ప‌ష్టంచేసింది. రిమోట్‌, వ‌ర్చువ‌ల్ స‌మావేశాల థ‌ర్డ్ పార్టీ వీడియో కాన్ఫ‌రెన్సింగ్ సేవ‌లు పొంద‌వ‌ద్ద‌ని సూచించింది.

చదవండి👉 వీపీఎన్‌ సేవలపై కేంద్రం సంచలన ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement