Google Drive
-
గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో పనిచేసే ‘బార్డ్’ చాట్‌బాట్‌ను గూగుల్‌కు చెందిన మ్యాప్స్, డాక్స్, డ్రైవ్ వంటి మరిన్ని యాప్స్‌తో అనుసంధానం చేస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ (Google) వెల్లడించింది. అలాగే మరిన్ని దేశాల్లో, మరిన్ని భాషల్లో క్వెరీల ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. జీమెయిల్, డాక్స్, గూగుల్ డ్రైవ్ వ్యాప్తంగా గల వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి యూజర్లు అడిగే ప్రశ్నలకు బార్డ్ సమాధానాలు ఇవ్వగలదు. ఈ ఎక్స్టెన్షన్స్ డీఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటాయని, కావాలంటే వాటిని ఎప్పుడైనా డిజేబుల్ చేయొచ్చని గూగుల్ తెలిపింది. ఓపెన్ సోర్స్ జెన్ఏఐ ప్లాట్‌ఫాం చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను గూగుల్ రూపొందించింది. -
గూగుల్ డ్రైవ్‌లు వాడొద్దు, ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం షాక్!
క్లౌడ్ ఫ్లాట్ ఫామ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు..ప్రైవేట్ సంస్థలకు చెందిన థర్డ్ పార్టీ క్లౌడ్ ఫ్లాట్ ఫామ్స్ గూగుల్ డ్రౌవ్, డ్రాప్ బాక్స్‌లను వినియోగించడానికి వీలు లేకుండా నిషేధం విధించింది. వీటితో పాటు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) విషయంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు విధించింది. భారత్ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని,లేదంటే భారత్ నుంచి శాస్వతంగా నిష్క్రమించుకోవచ్చని వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లు నార్డ్ వీపీఎన్, ఎక్స్‌ప్రెస్ వీపీఎన్‌లు భారత్‌లు వీపీఎన్ నెట్ వర్క్‌లను తొలగించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త వీపీఎన్ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..వీపీఎన్ చట్టాలకు సంబంధించి నేషనల్ ఇన్ఫ్రమెటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అన్నీ మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని,ఈ కీలక ఉత్తర్వులపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆమోదం తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. వీపీఎన్ సంస్థలకు కేంద్రం విధించిన నిబంధనలు ఇవే గత మే నెలలో కేంద్రం వీపీఎన్ సంస్థలపై నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి సదరు సంస్థలు వ్యవహరించాలని ఆదేశించింది. లేదంటే భారత్ నుంచి కార్యకలాపాలు నిలిపి వేయాలని సూచించింది. ఇక కేంద్రం వీపీఎన్ సర్వీసుల విషయంలో విధించిన నిబంధనల్ని ఒక్కసారి పరిశీలిస్తే ► సబ్స్క్రయిబర్, కస్టమర్‌కు సంబంధించి సరైన పేరును ఇవ్వాలి ► సేవలను ఎంత కాలం వినియోగించుకుంటారో స్పష్ట ఇవ్వాలి ► యూజర్లకు ఐపీలను కేటాయించాలి ► రిజిస్ట్రేషన్ టైంలో.. ఈ-మెయిల్, ఐపీ అడ్రస్, టైమ్ స్టాంప్ వివరాలను పొందుపర్చాలి ► అయితే వీపీఎన్‌ను ఎందుకు తీసుకుంటున్నారో.. కస్టమర్ తెలియజేయాలి. ► సరైన చిరునామా, కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వాలి. ► సబ్స్క్రయిబర్ల ఒనర్షిప్ ప్యాటర్న్‌ను సమర్పించాలి. అంటూ కేంద్రం వీపీఎన్ సర్వీసు సంస్థల్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కొత్త చట్టాన్ని అమలు చేస్తుండగా.. తాజా కేంద్ర నిర్ణయంతో వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లకు భారీ నష్టం చేకూరనుంది. వీటితో పాటు క్లౌడ్ సర్వీసులైన గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్‌ల వినియోగం నిలిపి వేయాలని కేంద్రం ఉద్యోగుల్ని ఆదేశించిందని వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. ఎనీడెస్క్ సైతం వీపీఎన్, క్లౌడ్ సర్వీసెస్‌తో టీమ్ వ్యూయర్, ఎనీడెస్క్, యామ్వీ అడ్మిన్లను సైతం వినియోగించొద్దంటూ కేంద్రం స్పష్టం చేసింది. అలాగే, విధులకు సంబంధించిన కార్యకలాపాలపై జరిగిన ఇంటర్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థను సైతం ప్రభుత్వేతర, థర్డ్ పార్టీ మెయిల్స్ వినియోగించొద్దని స్పష్టంచేసింది. రిమోట్, వర్చువల్ సమావేశాల థర్డ్ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు పొందవద్దని సూచించింది. చదవండి👉 వీపీఎన్ సేవలపై కేంద్రం సంచలన ప్రకటన -
వాట్సాప్ డేటాను ఎలా బ్యాకప్ తీసుకోవాలో మీకు తెలుసా!
ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ నుంచి మీకు కావాల్సిన ఫోటోస్‌ని, చాట్స్ సింపుల్ టెక్నిక్స్‌తో బ్యాకప్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఆ బ్యాకప్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వాట్సాప్ చాట్ హిస్టరీ, వాయిస్ మెసేజ్,ఫోటోల్ని,వీడియోల్ని గూగుల్ డ్రైవ్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ పూర్తయితే రీస్టోర్ చేసుకునే సదుపాయం ఉంటుంది. వాట్సాప్ డేటా బ్యాకప్ ఎలా అంటే! స్టెప్1: ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి డ్యాష్ బోర్డ్‌లో త్రీ డాట్స్ మీద క్లిక్ చేయాలి. స్టెప్2: అనంతరం సెట్టింగ్ ఆప్షన్‌లోకి వెళ్లాలి స్టెప్3: సెట్టింగ్‌లో చాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి స్టెప్4: చాట్‌లో చాట్ బ్యాకప్ ఆప్షన్ కనిపిస్తుంది స్టెప్5: చాట్ బ్యాక్ ఆప్షన్లో మీకు గూగుల్ డ్రైవ్ సెట్టింగ్ తో పాటు వీడియో ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్యాకప్ తీసుకోవచ్చు. దీంతో మీ వాట్సాప్ డేటా అంతా మీ మొబైల్‌కు లింకై ఉన్న గూగుల్ అకౌంట్ డ్రైవ్‌లో స్టోర్ అవుతుంది. -
వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..! అదే జరిగితే మీ జేబులు గుల్లే..!
ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు క్లౌడ్ స్టోరేజ్‌ను పరిమితం చేస్తూ గూగుల్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా యూజర్లు కేవలం 15 జీబీ వరకు మాత్రమే డేటాను క్లౌడ్‌లో స్టోర్చేసేందుకు గూగుల్ అనుమతిస్తుంది. అంతకుమించి క్లౌడ్ స్టోరేజ్ కావాలంటే కచ్చితంగా కొంత రుసమును చెల్లించాల్సిందే. ఇప్పుడు గూగుల్ మరో ఎత్తుగడతో వాట్సాప్ యూజర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇకపై పరిమిత స్టోరేజ్...! వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్‌లోని ఫోటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లను బ్యాకప్ చేసుకొనే సౌకర్యాన్ని యూజర్లకు వాట్సాప్ యాప్ కల్పిస్తోంది. వాట్సాప్ యూజర్లకు బ్యాకప్ విషయంలో నియంత్రణను కల్పించేలా కొత్త బ్యాకప్ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. బ్యాకప్‌పై నియంత్రణ ఉంచడంతో యూజర్లకు నచ్చిన వాటిని బ్యాకప్ చేసుకొనే వీలు ఉంటుంది. వాట్సాప్ బ్యాకప్ డేటా పూర్తిగా యూజర్ సంబంధిత గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అవుతుంటుంది. బ్యాకప్ విషయంలో పరిమిత స్టోరేజ్‌ను వాట్సాప్ త్వరలోనే ప్రవేశ పెట్టనుంది. ఛార్జీలు ఇలా..! గత ఏడాది అక్టోబర్‌లోనే వాట్సాప్ చాట్ బ్యాకప్ డేటా పెయిడ్ స్టోరేజ్‌పై కథనాలు వచ్చాయి. అయితే అపరిమిత వాట్సాప్ బ్యాకప్ డేటాకు త్వరలోనే కాలం చెల్లనుంది. వాట్సాప్ ట్రాకర్ WABetaInfo ప్రకారం...వాట్సాప్ చాట్స్ బ్యాకప్స్‌లో భాగంగా పలు మార్పులు త్వరలోనే రానున్నట్లు పేర్కొంది. ‘బ్యాకప్ లిమిట్’, గూగుల్ డ్రైవ్ బ్యాకప్ చేజింగ్, గూగుల్ డ్రైవ్ అల్మోస్ట్ ఫుల్, గూగుల్ డ్రైవ్ లిమిట్ రిచ్డ్ వంటి నోటిఫికేషన్స్‌తో యూజర్లను వాట్సాప్ అలర్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే వాట్సాప్ చాట్ బ్యాకప్ పెయిడ్‌స్టోరేజ్‌పై ఎలాంటి సమాచారం లేదు. అయితే గూగుల్ డ్రైవ్‌లో అందించినట్లుగానే 15 జీబీ వరకు ఉచితంగా తరువాత స్టోరేజ్ కోసం 100 జీబీకు నెలకు రూ. 130 వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: వాట్సాప్ యూజర్లకు భారీ అలర్ట్.. ఆ యాప్ వెంటనే డిలీట్ చేయండి! -
ఫొటోలు, వీడియోలతో ఫోన్ స్టోరేజ్ నిండిందా?
Full Phone storage Here's create more space: పండుగ టైంలో సరదాగా ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే స్టోరేజ్ సమస్య చాలామందికి ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. ఈ తరుణంలో ఫోన్లో ఫ్రీ స్పేస్ కోసం ఏం చేయొచ్చో తెలుసుకుందాం. ఫోన్ స్పేస్ ఫ్రీ చేయడం అంటే ఉన్న ఫొటోల్ని, వీడియోల్ని డిలీట్ చేయడం అనుకుంటారు చాలామంది. ఇందుకోసం వాటిని సెలక్ట్ చేసుకుంటూ.. టైం తీసుకుంటూ కుస్తీ పడుతుంటారు. కానీ, కింద చెప్పిన పద్ధతుల్లో వెళ్తే.. డివైజ్‌లో స్పేస్ కోసం అంత టైం పట్టదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. చాలామంది వాడే స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లే. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి.. అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ స్టోరేజ్ సెక్షన్లోకి వెళ్తే.. ఏ యాప్ ఎక్కువ రోజుల నుంచి నిరుపయోగంగా ఉందో.. ఏ యాప్‌వల్ల ఎక్కువ స్పేస్ పోతుందో స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా స్పేస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ & గూగుల్ ఫైల్స్ యాప్.. దాదాపు ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటోంది. అది ఓపెన్ చేయగానే అందులో .. ఇమేజెస్(ఫొటోలు), ఆడియో, వీడియోలు ఇతరాలు కనిపిస్తాయి. అక్కడ లార్జ్ ఫైల్స్‌లో అనవసరమైనవి ఎంపిక చేసుకుని డిలీట్ చేయొచ్చు. వాట్సాప్‌లో.. దాదాపు స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లందరి ఫోన్లలో ఉంటున్న యాప్. ఈ యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే డాటాను కొంతమంది క్లియర్ చేసినా.. స్టోరేజ్‌లో అలాగే ఉండిపోతాయని తెలుసా? అందుకే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటిని క్లియర్ చేస్తూ ఉండాలి. సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అండ్ డాటా ఆప్షన్‌ను క్లిక్ చేయగానే ‘మేనేజ్ స్టోరేజ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే ఎంత స్పేస్ అవసరం అనేది చూపిస్తుంది. అంతేకాదు అవసరం అనుకున్న ఫైల్స్‌ను అక్కడి నుంచి కూడా డిలీట్ చేసుకోవచ్చు. అక్కడ 5 ఎంబీ కంటే ఎక్కువ ఫైల్స్కనిపిస్తాయి కాబట్టి సులువుగా క్లియర్ చేసుకోవచ్చు కూడా. క్లౌడ్ సర్వీస్.. ఫొటోల్ని, వీడియోల్ని బ్యాక్అప్ చేసుకోవడం ద్వారా ఫోన్ స్పేస్ ఫ్రీ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా గూగుల్ ఫోటోస్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఫీచర్‌ని ఆన్‌లో పెట్టుకోవడమే. గూగుల్ ఫొటోస్ యాప్‌పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. హైక్వాలిటీ రెజల్యూషన్ ఎంచుకుంటే గూగుల్ ఫొటోస్ అన్లిమిటెడ్ స్టోరేజ్‌ను అందిస్తుంది. గూగుల్ ఫొటోస్‌తో పాటు గూగుల్ డ్రైవ్ లాంటి వాటిలో సేవ్ చేసుకుంటే సరి. ఇవికాగా.. యాప్స్ క్యాచెని తొలగించడం ద్వారా స్టోరేజ్ స్పేస్ వస్తుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే.. డాటానే పోయే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆవెంటనే ఏదైనా యాప్ మీద క్లిక్ చేసి, స్టోరేజ్ ఆపై క్లియర్ క్యాచెను క్లిక్ చేయాలి. డౌన్‌లోడ్స్‌పై లుక్. చాలావరకు మీకు అవసరం లేని ఫైల్స్ ఉంటాయి. అలాంటి వాటిని చూసి తొలగించండి. అలాగే పీడీఎఫ్ ఫైల్స్, హైడ్‌లో దాచిన ఫైల్స్ ఉంటే కూడా డిలీట్ చేయడం ద్వారా స్పేస్ దొరుకుతుంది. -
కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..!
ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు క్లౌడ్ స్టోరేజ్‌ను పరిమితం చేస్తూ గూగుల్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా యూజర్లు కేవలం 15 జీబీ వరకు మాత్రమే డేటాను క్లౌడ్‌లో స్టోర్చేసేందుకు గూగుల్ అనుమతిస్తుంది. అంతకుమించి క్లౌడ్ స్టోరేజ్ కావాలంటే కచ్చితంగా కొంత రుసమును చెల్లించాల్సిందే. ఇప్పుడు గూగుల్ మరో ఎత్తుతో యూజర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చదవండి: చైనాలో ఆంక్షలు..! వారికి ఆశాదీపంలా ఎయిరిండియా-టాటా డీల్..! వాట్సాప్‌లో పరిమిత సేవలు...! వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్‌లోని ఫోటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లను బ్యాకప్ చేసుకొనే సౌకర్యాన్ని యూజర్లకు వాట్సాప్ యాప్ కల్పిస్తోంది. వాట్సాప్ యూజర్లకు బ్యాకప్ విషయంలో నియంత్రణను కల్పించేలా కొత్త బ్యాకప్ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. బ్యాకప్‌పై నియంత్రణ ఉంచడంతో యూజర్లకు నచ్చిన వాటిని బ్యాకప్ చేసుకొనే వీలు ఉంటుంది. వాట్సాప్ బ్యాకప్ డేటా పూర్తిగా యూజర్ సంబంధిత గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అవుతుంటుంది. గూగుల్ డ్రైవ్‌లో అపరిమితంగా వాట్సాప్ డేటాను బ్యాకప్ చేసుకోవచ్చును. తాజాగా వాట్సాప్ నిర్ధిష్ట బ్యాకప్ డేటాకు మాత్రమే ఆలో చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అపరిమిత వాట్సాప్ బ్యాకప్ డేటాకు త్వరలోనే కాలం చెల్లనుంది. రానున్న రోజుల్లో వాట్సాప్ అపరిమిత బ్యాకప్ డేటా వాడకం కోసం గూగుల్ ఛార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు వాట్సాప్ బ్యాకప్ డేటా పై 2000ఎమ్బీ వరకు పరిమితిని గూగుల్ విధించనుంది. కాగా ప్రస్తుతం వస్తోన్న వార్తలపై వాట్సాప్, గూగుల్ స్పందించలేదు. వాట్సాప్ బ్యాకప్ డేటా పరిమితిపై రానున్న రోజులే నిర్ణయించనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: దేశీయ విమాన ప్రయాణీకులకు ఊరట -
పైసా ఖర్చుపెట్టకుండా ఫొటోలు దాచుకోండిలా..
సాధారణంగా ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో యూజర్లు డాటాను దాచుకోవడానికి ఉచిత స్టోరేజ్ ఉంటుందనేది తెలిసిందే. గూగుల్ తరపున గూగుల్ ఫొటోస్ విషయానికొస్తే 15 జీబీ ఉచిత స్పేస్ ఉంటుంది. అది నిండితే మాత్రం మరికొంత స్పేస్‌ను కొనుక్కోవాల్సిందే. లేకుంటే కొత్తగా డాటా స్టోర్ కాకపోగా.. ఆల్రెడీ సేవ్ అయిన డాటా కూడా డిలీట్ అవుతుంది. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలతో(యాప్స్‌తో) ఫొటోల్ని, డాటాను దాచుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?.. టెరాబాక్స్(డ్యూబాక్స్).. గూగుల్ ఫొటోస్‌కు బెస్ట్ ప్రత్యామ్నాయం ఇది. ఈ యాప్‌లో 1టీబీ(వెయ్యి జీబీ) ఉచిత స్టోరేజ్ ఇస్తుంది. ఫైల్స్, ఫొటోస్, వీడియోలు, ఫోల్డర్లు ఏవైనా దాచుకోవచ్చు. అయితే వీడియోలు ఆటోమేటిక్‌గా బ్యాక్‌ప్‌లోకి వెళ్లాలంటే మాత్రం.. ప్రీమియం మెంబర్షిప్ ఉండాల్సిందే. ఇక ఫొటోలను మాత్రం ఉచితంగా బ్యాకప్ చేసుకునేందుకు ఎనేబుల్ బటన్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. జియోక్లౌడ్ (ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్).. గూగుల్ ఫొటోస్‌కు ఇంకో ఉచిత ప్రత్యామ్నాయం ఇది. జియో ద్వారా క్లౌడ్ స్టోరేజ్ 50జీబీ ఉచిత స్టోరేజ్ ఇస్తుంది. రిఫరెన్స్, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఫ్రీ స్టోరేజ్‌ను పొందవచ్చు. డెగూ.. ఫొటోలు దాచుకోవడానికి మంచి మార్గం ఇది. ఇది మూడు ప్లాన్లతో ఉంటుంది. మొదటి ప్లాన్‌లో 100 జీబీ ఫ్రీ స్టోరేజ్ వస్తుంది. ఒకవేళ ప్రో లెవల్‌కు వెళ్తే.. 500 జీబీ స్టోరేజ్ ఇస్తారు. 10 టీబీ స్టోరేజ్ ప్లాన్ కూడా ఉంది. వీటితో పాటు స్పాన్సర్డ్ యాడ్స్‌ను చూసినా.. ఇతరుల్ని ఇన్వైట్ చేసినా అదనంగా మరికొంత ఫ్రీ స్టోరేజ్ ఇస్తారు. అమెజాన్ ఫొటోస్ యాప్.. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కొందరు కస్టమర్లకే అందించే యాప్ ఇది. అదీ గూగుల్‌ప్లే స్టోర్‌లో కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందిస్తోంది. 5జీబీ వరకు వీడియోలను ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫొటోలకు మాత్రం లిమిట్ ఉండదు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో.. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫ్రీ అన్లిమిటెడ్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు రెగ్యులర్‌గా లభించే మిగతా ఆఫర్ల సంగతి చెప్పనక్కర్లేదు. మైక్రోసాఫ్ట్ 365(వన్ డ్రైవ్).. ఇది ఫ్రీ మాత్రం కాదు. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్లు ఏడాదికి 4,899రూ. చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు 1 టీబీ స్టోరేజ్ ఇస్తారు. ఇందులో 6,199రూ.లతో ఫ్యామిలీ ప్లాన్ కూడా ఉంటుంది. వర్డ్, పవర్‌పాయింట్, ఎక్సెల్, అవుట్‌లుక్ అప్లికేషన్స్ ప్రీమియం ప్రొడక్టులను కూడా పొందవచ్చు. యాపిల్ వన్ ఇండియా ప్లస్.. యాపిల్ వన్ ఇండియా ప్లాన్స్‌ను మొత్తం కుటుంబం ఉపయోగించుకోవచ్చు. నెలకు 365రూ.లతో ఆరుగురు 200 జీబీ ఐక్లౌడ్ స్టోరేజ్‌ను వాడుకోవచ్చు. యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ఫ్లస్, యాపిల్ ఆర్కేడ్ సర్వీసులతో పాటు 50జీబీ ఐక్లౌడ్ స్టోరేజ్ కూడా దక్కుతుంది. కాకపోతే 195రూ. నెలవారీ ప్లాన్ తీసుకోవాలి. యాపిల్ రెగ్యులర్ యూజర్లు మాత్రం 177రూ. వరకు సేవ్ చేసుకోవచ్చు.| గూగుల్ ఫొటోస్ గురించి ఈ జాగ్రత్తలు తెలుసుకోండి! -
Google: గూగుల్ నుంచి బంపరాఫర్
వర్క్‌ఫ్రమ్ హోం ఇతరత్ర కారణాలతో డేటా స్టోరేజ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది గూగుల్. కొత్తగా క్లౌడ్ స్టోరేజ్ ప్లాన్లను ప్రకటించింది. అందులో 5టీబీ స్టోరేజ్ ప్లాన్‌ను మంత్లీ, ఇయర్లీ ప్యాకేజీవారీగా తక్కువ ధరకే అందిస్తుండడం విశేషం. గూగుల్ సర్వీస్‌లోని జీమెయిల్, గూగుల్ ఫొటోస్‌లోని ఇమేజెస్, వీడియోస్, గూగుల్ డ్రైవ్‌లో ఏదైనా డాటా స్టోర్ చేసుకోవడానికి ఒక లిమిట్(15 జీబీ) అంటూ ఉంది కదా. ఒకవేళ ఆ పరిధి దాటి ఉపయోగించుకోవాల్సి వస్తే.. స్టోరేజ్‌ను మంత్లీ/ఇయర్లీ ప్యాకేజీల వారీగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా గూగుల్ వన్ యాప్ ప్రకటన ప్రకారం.. తక్కువ ధరలో 5 టీబీ స్టోరేజ్ కోసం నెలకు 1,649రూ. అందిస్తుండగా, ఏడాది ప్లాన్‌కు 15, 900రూ. చెల్లించాల్సి ఉంటుంది. మిగతావి ఇలా.. ఇక 5టీబీ స్టోరేజ్‌ను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి పంచుకునే వీలు కూడా ఉంది. అంతేకాదు భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో గూగుల్ వీపీఎన్ సర్వీస్ సైతం ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించనుంది గూగుల్. గత ప్లాన్ల ప్రకారంగానే స్టోరేజ్ ప్యాకేజీలను గూగుల్ యూజర్లకు అందిస్తోంది. 100 జీబీ స్టోరేజ్ కోసం నెలకు రూ.130 చెల్లిస్తే.. , ఏడాదికి 1,300రూ. చెల్లించాలి. 200జీబీ ప్లాన్ కోసం నెలకు 210రూ., ఏడాదికి 2,100రూ. చెల్లించాలి. 2 టీబీ స్టోరేజ్ కోసం నెలకు 650రూ., ఏడాదికి రూ.6,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్లాన్స్ కూడా గూగుల్ వన్ వెబ్సైట్, యాప్ ద్వారా సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు. క్లిక్: గూగుల్ ‘చిప్’.. అంతా బిల్డపేనా? రేటు ఎక్కువే.. అయితే 2 టీబీ స్టోరేజ్ కంటే మించి ప్లాన్స్ మాత్రం యాప్ ద్వారానే సబ్ స్క్రయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో 10 టీబీ ప్లాన్ నెలకు రూ.3,249రూ. కాగా, 20 టీబీ స్టోరేజ్‌కు నెలకు 6,500రూ. చెల్లించాల్సి ఉంటుంది. ఇక టాప్ టైర్ ప్లాన్‌గా చెప్పుకునే 30టీబీ స్టోరేజ్ కోసం నెలకు 9,700రూ. చెల్లించాల్సి ఉంటుంది. ఇక 100 జీబీ, 200జీబీ, 2టీబీ ప్లాన్స్ గూగుల్ వన్ వెబ్సైట్ కంటే యాప్‌లో అత్యధిక రేటుకు అందజేయడం కొసమెరుపు. గూగుల్ ఫోటోస్ నుంచి అపరిమిత డేటా స్టోరేజ్ సౌకర్యాన్ని ఈ ఏడాది మొదట్లో గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. అంతకు ముందు నుంచే గూగుల్ డ్రైవ్ విషయంలో ఇది అమలు అవుతోంది. ఇక 15 జీబీ డాటా స్టోరేజ్ దాటితే.. కచ్చితంగా స్టోరేజ్ కొనుగోలు చేయాలని, లేకుంటే కొత్తగా డాటా స్టోర్కాదని, పైగా ఆల్రెడీ స్టోరేజ్‌పై ప్రభావం పడి డిలీట్ అయ్యే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది కూడా. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్
వాట్సాప్.. పర్సనల్ మెసేజింగ్ యాప్. ఇద్దరి మధ్యగానీ, గ్రూపులోగానీ సంభాషణలకు, వ్యక్తిగత కాల్స్‌కు ఇంటర్నెట్ స్వేచ్ఛతో అనుమతించ్చే యాప్. అయితే వాట్సాప్‌లో యూజర్ భద్రత గురించి బోలెడు అనుమానాలు ఉన్నాయి. దీనికితోడు ఈమధ్య కాలంలో ఫేస్బుక్ స్వయంగా వాట్సాప్ యూజర్ల డాటాపై కన్నేసిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో యూజర్ల కోసం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది వాట్సాప్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ చాట్ డాటాకు భద్రత భరోసా ఇస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో ప్రైవసీ అప్డేట్ ఇచ్చింది. చాట్ బ్యాకప్ల విషయంలోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వర్తిస్తుందని ప్రకటించింది. ‘‘ఒకవేళ ఎవరైనా వాట్సాప్ హిస్టరీని బ్యాక్ అప్ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కోరుతుంది. అది కేవలం వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. సంబంధిత డ్రైవ్‌లోని సమాచారాన్ని ఎవరూ అన్‌లాక్ చేయలేరు’’ అని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ గురువారం వెల్లడించాడు. క్లిక్: ఫేస్బుక్ వల్లే న్యూడిటీ ప్రమోషనా? అయితే సంబంధిత డ్రైవ్‌ల్లో(ఐక్లౌడ్స్ లేదంటే గూగుల్ డ్రైవ్) ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కీ’ సాయంతో యాసెస్కి అనుమతి ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్ యూజర్‌కు అందుబాటులో రానుంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే.. ఇది డిఫాల్ట్‌గా ఆన్ కాదు. పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసుకోవడం గానీ, 64 డిజిట్ ఎన్క్రిప్షన్ కీ మీద యూజర్ ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ గనుక మర్చిపోతే.. అకౌంట్ రికవరీకి వాట్సాప్ కూడా ఎలాంటి సాయం అందించలేదు. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మందికి పైగా వాట్సాప్‌ను ఉపయోగిస్తుండగా.. భారత్‌లో యూజర్ల సంఖ్య 40 కోట్లకు పైనే అని ఓ అంచనా. చదవండి: ఫేస్బుక్ కాదు.. పక్కా ఫేక్ బుక్ -
గూగుల్ డ్రైవ్ వాడుతున్నారా? ఇది మీకోసమే..
ఫొటోలు, వీడియోస్, పీడీఎఫ్-వర్డ్ డాక్యుమెంట్స్, ఇతరత్రా ఫైల్స్‌ను స్టోర్ చేసుకోవడానికి గూగుల్ అందిస్తున్న ఉచిత క్లౌడ్ స్టోరేజ్ .. గూగుల్ డ్రైవ్. తాజాగా గూగుల్ డ్రైవ్ సేవలను ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చని యూజర్లకు గూగుల్ తెలిపింది. ఈ మేరకు యూజర్స్ తమ డ్రైవ్‌లోని ఫైల్స్‌ను.. ఇంటర్నెట్నెట్ కనెక్షన్ లేకున్నా యాక్సెస్ చెసుకోవచ్చని తెలిపింది. ► యూజర్స్ డ్రైవ్‌లో ఫైల్స్‌ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ► తర్వాత ఫైల్ ఓపెన్ చేసి.. కుడివైపు ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ► అక్కడ ఆఫ్‌లైన్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే సదరు ఫైల్.. ఆఫ్‌లైన్ మోడ్‌కు వెళ్తుంది. అంటే ఎప్పుడైనా ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఆఫ్‌లైన్ సెక్షన్లో కనిపిస్తుంది. ► నిజానికి ఇదేం కొత్త ఆప్షన్ కాదు. 2019లోనే గూగుల్ ఈ ఫీచర్‌ను టెస్టింగ్ కోసం తెచ్చింది. ► గూగుల్ డ్రైవ్ వెబ్ ఉపయోగిచేప్పుడు కొన్ని రకాల ఫైల్స్‌ని యాజర్స్ మార్క్ చేసుకునేందుకు అనుమతించింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో యూజర్స్‌కి ఆఫ్‌లైన్ ఫీచర్‌ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం డ్రైవ్‌ను ప్లేస్టోర్‌లో తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ► ఇక యూజర్స్ మ్యాక్, విండోస్ కంప్యూటర్లలో గూగుల్ డ్రైవ్ డెస్క్‌టాప్ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఇందులో డ్రైవ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సపోర్టెడ్ ఫైల్స్‌పై రైట్ క్లిక్ చేస్తే ఆఫ్‌లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. డ్రైవ్ వెబ్ యాప్ ఓపెన్ చేస్తే అందులోని ఫైల్స్ మీకు ఆఫ్‌లైన్‌లో కనిపిస్తాయి. ► ఈ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్ ఖాతాదారులతోపాటు క్లౌడ్ ఐడెంటిటీ ఫ్రీ, క్లౌడ్ ఐడెంటిటీ ప్రీమియమ్, జీ సూట్ బేసిక్, జీ సూట్ బిజినెట్, సాధారణ ఖాతాదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. డేటా ఫుల్ అయితే.. ప్రస్తుతం 15జీబీ స్టోరేజ్ డేటాను ఉచితంగా అందిస్తుంది. అంతకుమించి ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందే. నెలకు 100జీబీ స్టోరేజ్ కోసం రూ. 130 చెల్లించాల్సి ఉంటుంది. అలానే 200జీబీ స్టోరేజ్‌కి రూ. 200, 2టీబీ స్టోరేజ్‌కి రూ. 650 చెల్లించి కొనుగోలు చేసుకోవాలి. ► డ్రైవ్ నుంచి పొరపాటున ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ డిలీట్ అవ్వొచ్చు. లేదంటే డిలీట్ చేయొచ్చు. అలాంటి వాటిని తిరిగి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ట్రాష్‌లో ఆ ఫొటోలు ఉంటాయి. వాటిని రీస్టోర్ గునక కొడితే తిరిగి.. డ్రైవ్ ఫోల్డర్లోకి వచ్చేస్తాయి. ► ఒకవేళ అలా జరగకపోతే.. గూగుల్‌ను సంప్రదించవచ్చు. అప్పుడు టెక్నిషియన్స్, ఎక్స్పర్ట్స్ ద్వారా వాటిని రికవరీ చేయిస్తారు. ► డిలీట్ చేసిన ఫొటోల్ని.. అవసరమైతే పర్మినెంట్‌గా డిలీట్ చేసేయొచ్చు. ► మల్టీ సెలక్షన్లో ఫొటోల్నిగానీ, ఇతర ఫైల్స్‌ను గానీ డ్రైవ్‌లో స్టోర్ చేసేటప్పుడు.. పూర్తిగా అప్లోడ్ అయ్యేదాకా ఆగాలి. లేకుంటే ఆ ఫైల్స్ డ్రైవ్‌లో స్టోర్ కావు. -
ఫొటోలను గూగుల్ ఫొటోస్‌లో స్టోర్ చేస్తున్నారా?
గూగుల్ ఫొటోస్.. ఫొటోలు, వీడియోల బ్యాకప్ కోసం ఉపయోగిస్తున్న గూగుల్ బేస్డ్ ఫ్రీ యాప్. చాలామంది ఇందులో ఫొటోలు, వీడియోలను భద్రంగా ఉన్నాయనుకుంటారు. ఆటోమేటిక్‌గా ఫొటోలు అందులోకి వెళ్తున్నాయని భావిస్తుంటారు. కానీ, గూగుల్ ఫొటోస్‌కూ ఓ పరిమితి అంటూ ఉంటుంది. అది దాటినా.. లేదంటే ఫుల్ మొమరీతో ఎక్కువ కాలం నడిపించినా.. ఆ మొత్తం ఫొటోలు, వీడియోలు ఎగిరిపోతాయని మీకు తెలుసా?. కాబట్టి, గూగుల్ ఫొటోస్‌కు సంబంధించి ఈ విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడండి. గూగుల్ ఫొటోస్ యాప్ కోసం ప్రతీ గూగుల్ అకౌంట్‌కు ఉచితంగా కొంత స్పేస్ ఇస్తుంది గూగుల్. ఇందులో ఎక్స్‌ప్రెస్, స్టోరేజ్ సేవర్, ఒరిజినల్ క్వాలిటీ అనే ఆప్షన్లు ఉంటాయి. ఒకవేళ ఒరిజినల్ క్వాలిటీని గనుక క్లిక్ చేయకపోతే.. ఫొటోలు, వీడియోలు మంచి క్వాలిటీతో సేవ్ కావు. అప్పుడు ఫొటోలు తక్కువ సైజులో సేవ్ అయ్యి.. ఆ ఫొటోలు, వీడియోలు బ్లర్‌గా గూగుల్ ఫొటోల్లో కనిపిస్తుంటాయి. చాలామంది గూగుల్ ఫొటోస్‌లో స్పేస్ కోసం తక్కువ క్వాలిటీకే ప్రయారిటీ ఇస్తారు. కానీ, క్వాలిటీ ఫొటోల్ని దాచుకోవాలనుకుంటే.. ఒరిజినల్ క్వాలిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయకతప్పదు. స్టోరేజ్ మించితే.. గూగుల్ అకౌంట్ స్టోరేజ్‌లో గూగుల్ డ్రైవ్ మాదిరిగానే.. గూగుల్ ఫొటోస్కి కూడా 15 జీబీ స్పేస్ ఇస్తుంది గూగుల్. ఈ పరిమితి దాటిపోతే.. తర్వాతి నుంచి తీసే ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఆటోమేటిక్‌గా సేవ్ కావు. అప్పుడు ఆల్రెడీ సేవ్ అయి ఉన్న డాటాపై(ఆల్రెడీ ఉన్న ఫొటోలు, వీడియోపై) ప్రభావం పడే ఛాన్స్ ఉంది. కాబట్టి, గూగుల్ వన్ సబ్ స్క్రిప్షన్ ద్వారా అదనపు స్టోరేజ్‌ను గూగుల్ ఫొటోస్ కోసం కొనుక్కోవచ్చు. ఒకవేళ కొనుక్కోకపోతే.. గూగుల్ ఫొటోస్ పూర్తి కోటా అయిపోయినా(15 జీబీ పూర్తి కావడం), లేకుంటే అదనపు స్టోరేజ్‌ను కొనుక్కోకపోయినా.. ఆ తర్వాతి ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్ బ్యాకప్‌కు వెళ్లవు. అంటే.. స్టోర్ కావన్నమాట. ఒకవేళ ఓవర్ కోటాతో అలాగే గూగుల్ ఫొటోస్ యాప్‌ను 24 నెలలపాటు నడిపిస్తే.. ఆల్రెడీ అందులో ఉన్న ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, గూగుల్ ఫొటోస్ మొమరీ ఫుల్ అయితే గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఉపయోగించడం ఆపేయాలి(సెట్టింగ్స్ ద్వారా). గూగుల్ చెబుతుంది జీమెయిల్గానీ, గూగుల్ ఫొటోస్గానీ, గూగుల్ డ్రైవ్గానీ(గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్, డ్రాయింగ్స్, ఫామ్స్, జామ్బోర్డ్, సైట్స్ ఫైల్స్) ఏదైనా సరే.. రెండేళ్లపాటు ఉపయోగించకుండా ఉంటే అందులో ఉండే మొత్తం కంటెంట్, డాటా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. అయితే అలా చేయడానికి కంటే ముందు ఈ-మెయిల్స్, నోటిఫికేషన్స్ ద్వారా గూగుల్ తన యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది కూడా. ఇక డిలీట్ చేయడానికి మూడు నెలల ముందు యూజర్‌ను మరోసారి అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు ఆ టైంలో కంటెంట్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఒకవేళ జీమెయిల్, డ్రైవ్‌ల విషయంలో యాక్టివ్‌గా ఉండి.. గూగుల్ ఫొటోస్ను రెండేళ్లపాటు పట్టించుకోకుండా ఉన్నారనుకోండి. గూగుల్ ఫొటోస్‌లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని గూగుల్ తొలగిస్తుంది. డేటా డిలీట్ కాకుండా ఉండాలంటే.. తరచూ గూగుల్ అకౌంట్‌కు లాగిన్ అయ్యి.. ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోలను చెక్ చేస్తూ ఉండాలి(వెబ్ లేదా యాప్‌లో అయినా సరే). అవసరం లేని ఫొటోలు, వీడియోలు, కంటెంట్‌ను తీసేస్తూ.. ఫ్రీ స్పేస్‌ను మెయింటెన్ చేస్తూ ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చాలామంది ఒకే ఫోన్లో రెండు, మూడు గూగుల్ అకౌంట్లను మెయింటెన్ చేస్తుంటారు. కాబట్టి, అన్ని అకౌంట్లకు సంబంధించిన ఫొటోస్, డ్రైవ్, జీమెయిల్ అకౌంట్లను తప్పనిసరిగా వెరిఫై చేస్తూ ఉండాలి. ఇదీ చదవండి: ఇంట్లో కరెంట్ బోర్డు సమస్యలను ఇలా గుర్తించొచ్చు! -
మీ డాక్యుమెంట్లు భద్రమేనా...
ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనంలో ఆర్థిక లావాదేవీల పాత్ర మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి. వ్యక్తుల ఆర్జనా శక్తి పెరిగినందున.. అవసరాలు, ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ప్రాపర్టీలు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, బీమా పాలసీలు, బ్యాంకు ఖాతాలు.. లిస్ట్ పెద్దగానే ఉంటుంది. కానీ, వీటికి సంబంధించి డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకుంటున్నామా? తప్పకుండా ఉంచుకోవాలి. వీటికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను ఎక్కడ నిల్వ చేస్తున్నారు? సాధారణంగా ఈ డిజిటల్ డాక్యుమెంట్లు మెయిల్ బాక్స్‌లకు వస్తుంటాయి. స్టాక్స్‌లో లావాదేవీలకు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఏ రోజుకారోజు మెయిల్ బాక్స్‌కు వస్తుంటాయి. బీమా కంపెనీలు అయితే ప్రస్తుతం ఈ పాలసీ పత్రాలను రిజిస్టర్డ్ ఈ మెయిల్ అడ్రస్‌లకు పంపిస్తున్నాయి. పాలసీ ప్రీమియం సర్టిఫికెట్లను కూడా మెయిల్‌కు పంపిస్తున్నాయి. ఇలా భారీగా వచ్చే డిజిటల్ డాక్యుమెంట్లను ‘డిలీట్’ కొట్టేసేవారూ ఉన్నారు. కానీ, వేటి అవసరం ఎంత మేరకు అన్నది తెలుసుకోకుండా డిలీట్ చేయవద్దు. ప్రతీ డాక్యుమెంట్‌ను ఎంత కాలం పాటు ఉంచుకోవాలన్నది తెలిస్తే.. అప్పుడు వాటి నిర్వహణ సులువవుతుంది. ఐటీ... ఏటా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడంతో పని అయిపోయిందని భావిస్తే అది తప్పే అవుతుంది. ఆదాయపన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆదాయం, పెట్టుబడులు, ఇతరత్రా వనరుల సమాచారానికి సంబంధించిన ఆధారాలు కూడా మీ వద్ద భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ‘‘పన్ను చెల్లింపుదారు తన పన్ను వివరాలను, ఇందుకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు, ఆధారాలను కనీసం ఏడేళ్లపాటు ఉంచుకోవాలి. ఏడేళ్ల వరకు ఏదేనీ ఆసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను తిరిగి విచారించే అధికారం ఆదాయపన్ను శాఖా అధికారులకు ఉంటుంది’’అని ఎన్ఏ షా అసోసియేట్స్ పార్ట్నర్ గోపాల్ బోహ్రా తెలిపారు. ఒకవేళ గత కాలానికి సంబంధించి రిటర్నుల విషయమై ఏదైనా వివాదం ఆదాయపన్ను శాఖతో నెలకొని ఉంటే.. అది పరిష్కారం అయ్యే వరకు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పకుండా ఉంచుకోవాలని సూచించారు. ‘‘పన్ను చెల్లింపుదారుల ప్రాంగణాల్లో ఆదాయపన్ను శాఖా సోదాలు నిర్వహించినట్టయితే.. ఆ సందర్భంగా రూ.50 లక్షలకు మించి ఆస్తి లేదా ఆదాయాన్ని అసెసింగ్ అధికారి గుర్తించితే, అప్పుడు 10 ఏళ్ల నాటి పాత రికార్డులను కూడా తిరిగి విచారించే అధికారం కలిగి ఉంటారు’’ అని బోహ్రా వివరించారు. విదేశీ మార్గంలో ఆదాయాన్ని కలిగి ఉంటే లేదా విదేశీ ఆస్తి కలిగి ఉంటే సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 17 ఏళ్ల పాటు ఆయా ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆదాయాన్ని దాచిపెట్టినట్టు పన్ను అధికారులు భావిస్తే.. సంబంధిత అసెస్మెంట్ను తిరిగి తెరిచేందుకు చట్ట ప్రకారం వారికి 17 ఏళ్ల పాటు అధికారం ఉంటుంది. ► బ్యాంకు పత్రాలు రుణాలు తీసుకుని, చెల్లింపులు పూర్తయిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ‘‘రుణాన్ని పూర్తిగా చెల్లించేసినప్పటి నుంచి కనీసం ఎనిమిదేళ్ల పాటు డాక్యుమెంట్లను అలాగే ఉంచుకోవాలి. ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఆధారంగా ఇంతకాలం పాటు వాటిని భద్రపరుచుకుంటే సరిపోతుంది’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి సూచించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కూడా బ్యాంకులు ఐదు నుంచి ఎనిమిదేళ్ల పాటు పత్రాలను నిల్వ చేయాల్సి ఉంటుంది. కనుక ఇంత కాలం పాటు రుణాన్ని తీర్చివేసిన ఆధారాలను ఉంచుకుంటే సరిపోతుంది. భద్రత ఎక్కడ..? డాక్యుమెంట్లను నిల్వ చేసుకునేందుకు పలు మార్గాలున్నాయి. మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో పదిలపరుచుకోవచ్చు. లేదంటే పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌లు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో క్లౌడ్ స్టోరేజీ సదుపాయాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ముఖ్యమైన పత్రాలను తమ ఈ మెయిల్ బాక్స్‌లోనే ఉంచేస్తుంటారు. ‘‘ఈ మెయిల్లో నిల్వ చేయడం అన్నది భద్రతా పరంగా సురక్షితమైనది కాదు. ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు పాస్‌వర్డ్‌తో వాటికి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. బిట్లాకర్ను ఇందుకు వినియోగించుకోవచ్చు’’ అని ఇన్ఫ్రాసాఫ్ట్ టెక్ ప్రొడక్ట్, ఇన్నోవేషన్ హెడ్ మనోజ్ చోప్రా తెలిపారు. బిట్లాకర్లో ఎన్క్రిప్షన్ సదుపాయం ఉంటుంది. దీంతో ఇందులో నిల్వ చేసుకునే డాక్యుమెంట్లకు రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా క్లౌడ్ రూపంలోనూ డాక్యుమెంట్లను భద్రపరచుకునే అవకాశం ఉంది. గూగుల్ డాక్యుమెంట్స్, ఐక్లౌడ్, డ్రాప్‌బాక్స్ ఇటువంటివే. స్కాన్ చేసిన డాక్యుమెంట్లను వీటిల్లో స్టోర్ చేసుకుని ఎక్కడి నుంచి అయినా తిరిగి పొందొచ్చు. ముఖ్యమైన, అవసరమైన డాక్యుమెంట్లను లోకల్‌గా (కంప్యూటర్లు, డిస్క్‌లు) స్టోర్ చేసుకోవడంతోపాటు.. వాటి బ్యాకప్ తీసుకుని కనీసం రెండు క్లౌడ్ వేదికల్లో అయినా పదిలం చేసుకోవాలని చోప్రా సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజీ లాకర్ కూడా ఇందుకు చక్కని వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ బీమా పాలసీ డాక్యుమెంట్‌తోపాటు, కట్టిన ప్రీమియం రసీదులను కూడా భద్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. దీనివల్ల భవిష్యత్తులో క్లెయిమ్ పరంగా ఎటువంటి సమస్యలు ఎదురైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ‘‘పన్ను మినహాయింపులు పొందాలని భావిస్తే అందుకు ప్రీమియం చెల్లింపుల రసీదులను సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో అవసరమైతే రిటర్నులతోపాటు జత చేయడానికి వీలుంటుంది’’ అని పాలసీఎక్స్ డాట్ కామ్ సీఈవో నావల్ గోయల్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరి, అందుకు అయ్యే చికిత్సా ఖర్చులను తిరిగి పొందినట్టయితే అందుకు సంబంధించిన పత్రాలను, కారు మరమ్మతులకు చేసుకునే బీమా క్లెయిమ్ ఆధారాలను కూడా దీర్ఘకాలం పాటు భద్రంగా ఉంచుకోవడం అవసరమని గోయల్ సూచించారు. పోర్టబిలిటీ సమయంలో ఇవి ఉపయోగపడతాయన్నారు. బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ఇన్సూరెన్స్ అకౌంట్‌ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ‘‘మీ కుటుంబం, మీకు సంబంధించిన బీమా పత్రాలను ఇందులో భద్రంగా నిల్వ చేసుకోవచ్చు’’ అని చెప్పారు. ► మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో మీకున్న పెట్టుబడుల వివరాలన్నింటినీ ఒకే నివేదిక రూపంలో క్రోడీకరించి ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థలు కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్) పేరుతో ప్రతీ త్రైమాసికానికి ఇస్తుంటాయి. వీటిని కుటుంబ సభ్యుల్లో ఒకరితో పంచుకునేందుకు గాను ఆటో ఫార్వార్డ్‌ను ఎంచుకోవాలి. ఒక్క మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి అయితే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (క్యామ్స్) నుంచి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ను తీసుకుంటే చాలు. వేతన జీవులు అయితే తమ స్టాక్, మ్యూచువల్ ఫండ్ ఖాతాల స్టేట్మెంట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్వయం ఉపాధిలో ఉన్న వారు అయితే వీటిని కనీసం ఆరేళ్ల వరకు పదిలంగా ఉంచుకోవడం అవసరం. ► ఇవి చాలా కీలకం ఆస్తుల కొనుగోలు, అమ్మకాల పత్రాలను లావాదేవీ జరిగిన నాటి నుంచి కనీసం ఏడేళ్ల వరకు అయినా ఉంచుకోవడమే మంచిది. ఎందుకంటే ఆదాయపన్ను శాఖ ఏడేళ్లలోపు ఎప్పుడైనా తిరిగి పరిశీలించే చర్య తీసుకోవచ్చు. ‘‘పన్ను చెల్లింపుదారులు తప్పకుండా డాక్యుమెంట్లను అట్టిపెట్టుకోవాల్సిందే. ఆభరణాల కొనుగోళ్ల రసీదులు, అలాగే పెయింటింగ్, ఇళ్ల మరమ్మతులు, నవీకరణకు చేసే ఖర్చులకు సంబంధించిన ఆధారాలను కూడా ఉంచుకోవాలి. దీంతో ఆయా ఆస్తుల విక్రయం తర్వాత పన్ను తగ్గింపులను ఆదాయపన్ను శాఖ తిరస్కరించదు’’ అని బోహ్రా తెలియజేశారు. ► డిజీలాకర్ ఉచితంగా మీ డాక్యుమెంట్లను స్టోర్ చేసుకునే వేదిక ఇది. దీంతో భౌతికంగా పత్రాలను ఉంచుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఇందులో స్టోర్ చేసే డేటా, డాక్యుమెంట్లు అంతా క్లౌడ్ రూపంలోనే ఉంటాయి కనుక ఎక్కుడి నుంచి అయిన వాటిని పొందే వెసులుబాటు ఉంటుంది. పీడీఎఫ్, జేపీఈజీ, పీఎన్జీ రూపాల్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై ఈసైన్(ఎలక్ట్రానిక్ రూపంలో సంతకం) చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇవి సెల్ఫ్ అటెస్టేషన్ కాపీలుగా పనికి వస్తాయి. డిజిలాకర్‌లో అకౌంట్ కోసం మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది. ఆధార్ డేటా బేస్‌లో నమోదైన మొబైల్ నంబర్‌ను కూడా వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలను జ్టి్టpట://ఛీజీజజీ ౌఛిజ్ఛుట.జౌఠి.జీn/ వెబ్ సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. -
వచ్చే జూన్ నుంచి గూగుల్ కొత్త పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారుల సౌలభ్యం కోసం వారి ఖాతాలో జీ మెయిల్, గూగుల్ డ్రైవ్‌లోని క్రియా రహితంగా, పరిమితికి మించి ఉన్న వాటి కోసం టెక్ దిగ్గజం గూగూల్ కొత్త పాలసీ తీసుకురానుంది. దీనిలో భాగంగా వచ్చే ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న గూగుల్ కొత్త పాలసీతో డాక్స్, షీట్లు, సైడ్లు, డ్రాయింగ్లు, జూమ్‌బోర్డు ఫైల్స్, ఫొటో పరిశ్రమలకు సేవలు ఇక నుంచి సాధారణ పద్ధతులతో మరింత మెరుగ్గా ఉంటాయని గూగుల్ తెలిపింది. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనటైతే మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్ తొలగించనుంది. అదేవిధంగా మీ స్టోరేజీ పరిమితి రెండేళ్లు దాటినట్లయితే జీమెయిల్, డ్రైవ్, ఫోటోల్లో కంటెంట్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. మేమేదైనా కంటెంట్ తొలగించడానికి ముందు మీకు చాలా సార్లు సమాచారం ఇస్తామని పేర్కొంది. అందువల్ల మీరు ఆలోపే స్పందించే అవకాశం ఉంటుందని గూగుల్ వెల్లడించింది. మీ ఖాతాను చురుగ్గా ఉంచడానికి మీరు ఎప్పటికప్పుడు జీమెయిల్, డ్రైవ్, ఫొటోలను చూస్తూ ఉండాలని సూచించింది. సైన్ ఇన్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ చేశారని గూగుల్ ఒక రికార్డు చేసుకుంటుందని తెలిపింది. ఇనాక్టివ్ అకౌంట్ మేనేజర్ నిర్ధిష్ట కంటెంట్‌ను నిర్వహించడానికి మీకు సహయ పడుతుందని పేర్కొంది. -
వాట్సాప్ డేటా హ్యాకింగ్‌ను అడ్డుకోండిలా..
న్యూఢిల్లీ: సైబర్ ప్రపంచాన్ని హ్యాకర్లు హడలెత్తిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను సైతం హ్యాకర్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందని వాట్సాప్ డెవలపర్లు చెబుతున్నా ఆ ఫీచర్.. పేరుకే పరిమితమవుతోంది. మనం చేసే మెసేజులు, పంపించే వీడియోలు మూడో వ్యక్తి కంటపడవని వాట్సాప్ ప్రకటిస్తున్నా హ్యాకర్లు ఈజీగా తమ పని కానిచ్చేస్తున్నారు. (చదవండి: ఢిల్లీ అల్లర్లు: 'వాట్సాప్ గ్రూప్'పై కేసు) ఇటువంటి తరుణంలో వాట్సాప్ సెట్టింగ్స్‌లో చిన్నచిన్న మార్పులు చేస్తే ఇక మీ చాటింగ్ మొత్తం సురక్షితంగా ఉంచుకోవచ్చు. వాట్సాప్‌లోని చాటింగ్ డేటా డిఫాల్ట్‌గా ప్రతిరోజూ గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంటుంది. గూగుల్ డ్రైవ్‌లోని సమాచారానికి కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందని చెబుతున్నా ఇక్కడి నుంచే ఎక్కువగా యూజర్ల డేటా లీక్ అవుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. చాట్ డేటా బ్యాకప్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలి. దీని కోసం ఏం చేయాలంటే... ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ 'ఆప్షన్' క్లిక్ చేయాలి. ఇప్పుడు మరో మెనూ ఓపెన్ అవుతుంది. అందులో డార్క్ కలర్లో కనిపించే 'బ్యాకప్'పై క్లిక్ చేయాలి. మొత్తం ఐదు ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. అందులో 'never' లేదా 'only when i tap backup' ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే ఇకపై ఆటోమేటిక్‌గా బ్యాకప్ ప్రాసెస్ జరగదు. చాటింగ్ డేటా కూడా గూగుల్ డ్రైవ్‌లోకి అప్లోడ్ అవదు. ఒకవేళ ఎప్పుడైనా చాటింగ్ డేటా బ్యాకప్ తీసుకోవాలనుకున్నా వైఫై ద్వారా కాకుండా మొబైల్ డేటా ద్వారానైతే హ్యాకర్ల బారిన పడకుండా నిరోధించవచ్చు. -
జీమెయిల్ డౌన్ కలకలం : యూజర్లు గగ్గోలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్ సేవలకు తీవ్ర అంతరాయం కలగడం కలకలం రేపింది. జీమెయిల్ సేవల్లో మరోసారి సమస్యలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది, ప్రధానంగా భారతీయ యూజర్లు ఇబ్బందులు పాలయ్యారు. కొంతమంది వినియోగదారులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. జీమెయిల్ డౌన్ అన్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. జీమెయిల్‌తోపాటు గూగుల్ డ్రైవ్ కూడా పనిచేయడం మానేశాయి. జీమెయిల్ లాగిన్ కాలేకపోవడంతోపాటు, లాగిన్ అయినా, ఫైల్స్ అప్లోడ్, డౌన్లోడ్ నిలిచిపోవడం లాంటి సమస్యలను నివేదించారు. భారత్ సహా జపాన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోని యూజర్లు జీమెయిల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారని డౌన్ డిటెక్టర్ సంస్థ తెలిపింది. గూగుల్ మీట్, గూగుల్ వాయిస్, గూగుల్ డాక్స్‌తో కూడా సమస్యలు తలెత్తడంతో గూగుల్ స్పందించింది. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. కాగా రెండు నెలల్లో జీమెయిల్ షట్‌డౌన్ అవ్వడం ఇది రెండోసారి. జూలై నెలలో సాంకేతిక సమస్యకారణంగా జీమెయిల్ సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. User reports indicate Gmail is having problems since 1:12 AM EDT. https://t.co/pTPsDoNKxQ RT if you're also having problems #Gmaildown — Downdetector Canada (@downdetectorca) August 20, 2020 Gmail is down for more than an hour. Can't send attachments. Aaaaaaaaaaaahhhhhh#Gmail #gmaildown pic.twitter.com/hQSMNizX3K — Sourav Bhunia (@souravbhunia415) August 20, 2020 How long before its set right @gmail? #GmailDown pic.twitter.com/j1OQ8lz7AZ — Prashanth ಪ್ರಶಾಂತ್ 🇮🇳 (@pvaidyaraj) August 20, 2020 After 1 Hour #Gmail Down all employment person 😤😖😫😭😬 But, Unemployment Persons to cooooooolllll✌️🤞✌️ pic.twitter.com/1tumoosd8B — Karthi Durai (@akkmrc12) August 20, 2020 -
గూగుల్ సెర్చ్ హెడ్‌గా ప్రభాకర్ రాఘవన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ సంస్థలో మరో భారతీయుడు కీలక పదవిని అలంకరించారు. భారతీయ అమెరికన్ అయిన ప్రభాకర్ రాఘవన్ గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్ ప్రాజెక్టుల హెడ్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న బెన్‌గోమ్ నూతన బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. ప్రభాకర్ ఐఐటీ మద్రాస్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేయగా, యూసీ బెర్క్లే నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ అందుకున్నారు. ప్రభాకర్ రాఘవన్ గూగుల్‌లో 2012లో చేరగా, 2018లో గూగుల్ అడ్వర్టయిజింగ్ అండ్ కామర్స్ విభాగ హెడ్‌గా ఎంపికయ్యారు. అంతకుముందు గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్‌కు వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. జీమెయిల్, గూగుల్ డ్రైవ్ వృద్ధిలో ప్రభాకర్ పాత్ర కూడా ఉంది. ‘మన ఉత్పత్తుల విభాగాల్లో చాలా వాటిల్లో ఆయన పనిచేయడం వల్ల వాటి మధ్య అంతరాలను కచ్చితంగా గుర్తించగలరు. గూగుల్‌తో ఆయన అనుబంధం గూగుల్‌ను ముందుంచుతుంది’ అంటూ ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో గూగుల్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. -
విద్యార్థినుల అశ్లీల ఫొటోలు.. గూగుల్ డ్రైవ్‌లో పెట్టి
కోల్‌కతా: దేశ వ్యాప్తంగా ‘‘బాయ్స్ లాకర్ రూం’’ ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీ విద్యార్థులు సైతం ఇదే తరహా అకృత్యాలకు ఒడిగట్టిన విషయం బయటపడింది. ఐయూబ్రోస్ పేరిట ట్విటర్ ఖాతా నిర్వహిస్తున్న ఓ మహిళ సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ(జేయూ)కి చెందిన ఎస్ అనే వ్యక్తి గూగుల్ డ్రైవ్‌లో అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలు పెట్టి.. తన తోటి విద్యార్థులు, స్నేహితులకు వాటిని వీక్షించే వెసలుబాటు కల్పించాడని పేర్కొన్నారు. తోటి విద్యార్థినులతో పరిచయం పెంచుకుని వారితో సన్నిహితంగా మెలుగుతూ ఫొటోలు పంపించాలని ఒత్తిడి చేసేవాడని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ కావడంతో సదరు ఎస్ తమను కూడా ఇలాగే వేధించాడని పలువురు యూనివర్సిటీ విద్యార్థినులు సోషల్ మీడియాలో తమ అనుభవాలు పంచుకున్నారు. 2016లో క్రియేట్ చేసిన ఆ గూగుల్ డ్రైవ్‌ను.. అతడు ఓపెన్ సీక్రెట్‌గా మార్చేశాడని చెప్పుకొచ్చారు. (బాయ్స్ లాకర్ రూం.. డర్టీ ఛాట్) ఈ విషయం గురించి ఐయూబ్రోస్ ట్విటర్ యూజర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 2015లో ఎస్ అనే వ్యక్తితో తనకు స్నేహం ఏర్పడిందని.. యూనివర్సిటీ డిబేటింగ్ క్లబ్లో తామిద్దరం కలిసి పాల్గొనేవాళ్లమని తెలిపారు. ఈ క్రమంలో అతడు తరచూ చాటింగ్ చేసే వాడని.. ఓ రోజు పర్సనల్ ఫొటోలు పంపాలని కోరాడన్నారు. వెంటనే డెలీట్ చేస్తానని చెప్పాడని.. అతడి ఒత్తిడి భరించలేక ఫొటో షేర్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే 2018లో తనకు సంబంధించిన అశ్లీల ఫొటోలను ఎస్ గూగుల్ డ్రైవ్‌లో చూశానని ఓ వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురయ్యానని.. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.(ఫొటోలు పెట్టి.. తప్పు చేశానా అమ్మా?) ఈ క్రమంలో తమ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని తన మీటూ స్టోరీని బహిర్గతం చేయడంతో.. ఆమె కూడా తనలాగే ఎస్ అకృత్యాలకు బలైన విషయం గురించి తెలుసుకున్నానన్నారు. ఎస్ జూనియర్ విద్యార్థినులు కూడా అతడి వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఎస్ తమను లైంగికంగా వేధించాడని.. అయినప్పటికీ అతడికి లొంగకపోవడంతో అందరితో తమ ఫొటోలు షేర్ చేసుకున్నాడని పేర్కొన్నారు. తమ ఫొటోలు ఇప్పటికే జేయూ సర్క్యూట్లో ఉండటం షాకింగ్‌గా ఉందని.. అయితే అందులో కొంతమంది ఫొటోలు మాత్రమే ఉన్నట్లు అతడి స్నేహితుడు చెప్పాడని పేర్కొన్నారు. వ్యక్తిగత విషయం.. ఎలా జరిగిందో తెలియదు ఈ విషయం గురించి సదరు మీడియా ప్రతినిధులు ఎస్‌ను ప్రశ్నించగా.. తాను గూగుల్ డ్రైవ్‌లో సదరు అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలు స్టోర్ చేసిన మాట వాస్తవేమనని... అయితే అది తన వ్యక్తిగత అంశమని పేర్కొన్నాడు. కానీ తాను ఎన్నడూ వాటిని బయటపెట్టలేదని.. తన ఫోన్ పోగొట్టుకున్న కారణంగా ఈ విధంగా జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ థర్డ్‌పార్టీ తన ఫొటోలు ఎలా చూశారో అర్థం కావడం లేదని వాపోయాడు. 2018లో తన ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని కోల్‌కతాను వీడి వెళ్లినట్లు పేర్కొన్నాడు.(‘ఇన్‌స్టా’లో ‘బాయిస్’ బీభత్సం) ఇక ఈ విషయంపై స్పందించిన ఐయూబ్రోస్ ట్విటర్ యూజర్ ఎస్తో పాటు ‘ఏ’ కూడా ఇందులో భాగ్వస్వామ్యమయ్యాడని.. సెమినార్లు జరుగుతున్న సమయంలో అమ్మాయిల ఫొటోలు తీసి ముఖభాగం మార్ఫ్ చేసేవాడని పేర్కొన్నారు. బాయ్స్ లాకర్ రూం తరహాలో అనేక మంది అబ్బాయిలు.. తమ తోటి విద్యార్థినుల గురించి అసభ్య కామెంట్స్ చేస్తూ.. వారి అశ్లీల చిత్రాలను షేర్ చేసి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఇది కేవలం ఢిల్లీ, కోల్‌కతాకే పరిమితం కాదని.. అనేక విద్యా సంస్థల్లో ఇలాంటి వారు ఉన్నారని పేర్కొన్నారు. అమ్మాయిలు ఇలాంటి విషయాల గురించి బయట చెప్పుకోలేరనే భావనతో అకృత్యాలకు ఒడిగడుతున్నారని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే అంశంపై ఆమె స్పష్టతనివ్వలేదు. -
డేటా స్టోరేజీపై.. వాట్సాప్ గుడ్ న్యూస్
కాలిఫోర్నియా : ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌లు డేటా స్టోరేజీ విషయంలో కొత్త అప్డేట్ తీసుకొచ్చాయి. వాట్సాప్ డేటా స్టోరేజీ విషయంలో తమ యూజర్లకు ఇబ్బందులు కలగకుండా వాట్సాప్, గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. కొత్త అప్డేట్తో గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ డేటాను బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోని స్టోరేజీని వాడుకోదు. వాట్సాప్ బ్యాకప్ డేటా మొత్తం గూగుల్ డ్రైవ్‌లో ప్రత్యేకంగా సేవ్ అవుతాయి. ఒక్కో అకౌంట్‌కు గూగుల్ డ్రైవ్‌లో 15 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్ డ్రైవ్‌ను వాట్సాప్ బ్యాకప్‌కి వాడితే ఈ 15 జీబీలో నుంచే స్టోరేజీని వాడేసుకునేది. ఈ ఏడాది నవంబర్ 12 నుంచి రానున్న కొత్త అప్డేట్తో వాట్సాప్ బ్యాకప్‌కి గుగుల్ డ్రైవ్‌లోని స్టోరేజీని వాడకుండా, ప్రత్యేకంగా వాట్సప్ డేటా స్టోర్ అవుతుంది. దీనికి సంబంధించి గూగుల్ డ్రైవ్‌తో వాట్సాప్ ఒప్పందం చేసుకుంది. వాట్సాప్ డేటాని గుగుల్ డ్రైవ్‌లో బ్యాకప్‌కి వాడితే ఎంత మేర డేటాను ఉచితంగా స్టోరేజీకి వాడుకొవొచ్చు అనే విషయంలో స్పష్టత రావాల్సిఉంది. అయితే కొత్త మార్పులతో ఏడాది, లేదా అంత కన్నా ఎక్కువ కాలం బ్యాకప్ అప్షన్ వాడనట్టయితే గూగుల్ డ్రైవ్‌లో ఇంతకు ముందు సేవ్ చేసిన వాట్సాప్ డేటా ఆటోమెటిక్‌గా డెలీట్ చేయనున్నట్టు వాట్సాప్ తెలిపింది. డేటా డెలీట్ కాకుండా ఉండాలంటే అక్టోబర్ 30 లోపు మ్యానువల్‌గా వాట్సప్ బ్యాకప్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది. గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ బ్యాకప్ ఎలా చేయాలంటే.. ► ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి ► మెనూలో క్లిక్ చేయాలి. ► సెట్టింగ్స్‌లో చాట్స్‌పై క్లిక్ చేయండి ►చాట్ బ్యాకప్ క్లిక్ చేయండి ► చాట్ హిస్టరీని సేవ్ చేయాలనుకున్న గూగుల్ అకౌంట్‌ని సెలక్ట్ చేసుకోండి(వీడియోలు కూడా బ్యాకప్ కావాలను కుంటే ఇన్క్లూడ్ వీడియోస్ క్లిక్ చేయండి) ► బ్యాకప్ నొక్కితే మీ వాట్సాప్‌లోని డేటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది. వాట్సప్ డేటా బ్యాకప్ రెగ్యులర్‌గా చేసుకోవాలనుకుంటే అక్కడే అప్షన్స్(డెయిలీ, వీక్లీ, మంథ్లీ) కూడా ఉంటాయి. -
వాట్సాప్ చాట్..ఇక గూగుల్ డ్రైవ్‌లో
న్యూఢిల్లీ: ఎలాంటి మొబైల్ అప్లికేషన్‌కు అయినా ఏదో ఒక అవరోధం ఉంటుంది. అదే మాదిరిగా వాట్సాప్‌కు కూడా ఒక అడ్డంకి ఉంది. ఇప్పటివరకు వాట్సాప్‌లో వచ్చిన వీడియోలు, సంక్షిప్త సమాచారం, ఫొటోలతో స్మార్ట్‌ఫోన్ మెమరీ నిండిపోతే వాటిని అయిష్టంగా తొలగించాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ఇప్పటినుంచి వాట్సాప్ వినియోగదారులకు ఈ తిప్పలు తప్పనున్నాయి. వాట్సాప్ కంటెంట్‌కు గూగుల్ డ్రైవ్ త్వరలో బ్యాక్ అప్ సౌకర్యాన్ని కల్పించనుంది. అతి కొద్ది నెలల్లోనే మీ వాట్సాప్ చాట్ హిస్టరీ, మల్టీమీడియా కంటెంట్‌ను డ్రైవ్‌లో బ్యాక్అప్ చేసుకోవచ్చని గూగుల్ డ్రైవ్ డెరైక్టర్ స్కాట్ జాన్సస్టన్ తన బ్లాగ్‌లో చెప్పారు. కానీ ఈ అవకాశం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే గూగుల్ అందిస్తుందని వెల్లడించారు. -
వాట్సప్ మెసేజ్‌లు 'డ్రైవ్'లో బ్యాకప్!
ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వాట్సప్ మెసెజ్ హిస్టరీని బ్యాకప్ (నిల్వ) చేసుకోవాలంటే చాలా కష్టమైన పనే. దీనికి పెద్ద మాన్యువల్ ప్రాసెస్సే కావాలి. మీ మొబైల్ ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి.. ఫోన్ మెమరీలోని వాట్సప్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ సిస్టంలోకి సేవ్ చేసుకోవాలి. ఈ జంఝాటం అంతా లేకుండా వాట్సప్ మెసెజ్‌లు, వీడియోలు, ఫొటోలు నేరుగా గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసుకొనే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఐ-ఫోన్లో వాట్సప్ మెసెజ్‌లను బ్యాకప్ చేసుకోవడానికి ఐ-క్లౌడ్ పేరిట ఒక ఆప్షన్ ఉంది. ఇదే తరహాలో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ బ్యాకప్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. తమ భాగస్వామ్యంలో త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని గూగుల్, వాట్సప్ ఇటీవల ప్రకటించాయి. -
షార్ట్‌ఫిల్మ్ ఫైల్‌ను షేర్లో ఉంచడం మరవొద్దు!
‘పూరి జగన్నాథ్ డెరైక్టర్ హంట్’కు తాము రూపొందించిన షార్ట్‌ఫిల్మ్స్‌ను అనేకమంది యువదర్శకులు సాక్షి మెయిల్ ఐడీకి పంపిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే గూగుల్ డ్రైవ్ ద్వారా పంపుతున్న వీడియోఫైల్ను సాక్షి మెయిల్ ఐడీకి షేర్ చేయవలసి ఉంటుంది. ఇలా షేర్ చేసిన వీడియోలను మాత్రమే నిర్ణేతలు డౌన్లోడ్ చేసుకొని చూడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే గూగుల్‌డ్రైవ్ ద్వారా పంపినవారు కూడా తమ వీడియోఫైల్స్ను షేరింగ్‌లో ఉంచారో లేదో గమనించాలి. అప్లోడ్ చేయడానికి నేడే చివరి రోజు! -
షార్ట్‌ఫిల్మ్ ఫైల్‌ను షేర్లో ఉంచడం మరవొద్దు!
‘పూరి జగన్నాథ్ డెరైక్టర్ హంట్’కు ఔత్సాహికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. పూరి ఇచ్చిన కాన్సెప్టులతో తాము రూపొందించిన షార్ట్‌ఫిల్మ్స్‌ను అనేకమంది యువదర్శకులు సాక్షి మెయిల్ ఐడీకి పంపిస్తున్నారు. తక్కువ పరిమాణంతో ఉన్న ఈ షార్ట్ఫిలిమ్ఫైల్స్ను జీమెయిల్ ద్వారా పంపవచ్చు. పరిమాణం విషయంలో జీమెయిల్ పరిధిని దాటితే జీమెయిల్‌తోనే అనుసంధానం అయిన గూగుల్‌డ్రైవ్ ద్వారా ఉచితంగానే పంపవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే గూగుల్ డ్రైవ్ ద్వారా పంపుతున్న వీడియోఫైల్ను సాక్షి మెయిల్ ఐడీకి షేర్ చేయవలసి ఉంటుంది. ఇలా షేర్ చేసిన వీడియోలను మాత్రమే నిర్ణేతలు డౌన్లోడ్ చేసుకొని చూడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే గూగుల్‌డ్రైవ్ ద్వారా పంపినవారు కూడా తమ వీడియోఫైల్స్ను షేరింగ్‌లో ఉంచారో లేదో గమనించాలి. గడువు ఫిబ్రవరి 14 వరకే! అంటే... రేపే చివరి రోజు! (వివరాల కోసం జనవరి 2 నుంచి 11ల మధ్యన వచ్చిన సాక్షి ‘ఫ్యామిలీ’ సంచికలు చూడండి) -
క్లౌడ్ స్టోరేజ్‌లో బెస్ట్, బెటర్...
క్లౌడ్ డ్రైవ్స్లేని టెక్ జీవితం కష్టతరంగా మారింది. ఇవి అందుబాటులోకి రాకముందు డాటాను సెండ్ చేసుకోవడంలో ఎన్ని కష్టాలు పడినా... ఇప్పుడు మాత్రం వీటిని ఉపయోగించుకోవడం సులభం. డాటా మొత్తాన్ని ఆన్లైన్లో సేవ్ చేసుకుని అవసరమైనప్పుడు, అవసరమైనచోట వాటిని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే ‘క్లౌడ్ స్టోరేజ్’ ఇచ్చే సదుపాయం. హార్డ్ డిస్క్ ఉన్నట్టుండి క్రాష్ అయినా, పీసీ అందుబాటులో లేకపోయినా, ఫార్మాట్ అయినా, పొరపాటున డిలీట్ అయినా, క్లౌడ్ స్టోరేజ్‌లో డాటాను దాచి ఉంచడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్, అప్లికేషన్ల రూపంలో అందుబాటులో ఉన్న క్లౌడ్‌స్టోరేజ్ సర్వీసుల గురించి... బెస్ట్ ఆఫ్ ఓవరాల్ డ్రైవ్స్.. జీ మెయిల్ ద్వారా కొంచెం ఎక్కువ డాటాను పంపాలంటే.. వెంటనే పలకరించే పరిమితులు పోయాయి. 25 ఎమ్బీ ని మించిన డాటాను పంపాలంటే.. అవకాశమే లేదు అనే రోజులు పోయాయి... టక్కున గూగుల్ డ్రైవ్ ప్రత్యక్షం అవుతోంది. డోంట్ వర్రీ. మీరు గూగుల్‌డ్రైవ్ ద్వారా డాటాను పంపండి... అనే సజెషన్ వస్తుంది. జీమెయిల్ ద్వారా అవసరమైన డాటాను పంపడానికి అవకాశం దొరుకుతోంది. ఇదంతా క్లౌడ్ స్టోరేజ్ పుణ్యమే. ఫైల్స్‌ను ముక్కలుగా చేసి పంపేరోజులు పోయి, ఒకేసారి మొత్తంగా పంపడానికి అవకాశముంది. జీమెయిల్, గూగుల్ ప్లస్‌ల విషయంలో గూగుల్ డ్రైవ్ ఉపయోగకరంగా ఉంది. వీటి ద్వారా డాటాను పంపడానికి, డాటాను సేవ్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్ సాయమందిస్తుంది. 15 జీబీ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తుంది. గూగుల్ డ్రైవ్‌ను విండోస్ ఫోన్ కోసం అప్‌గ్రేడ్ చేయలేదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లపై పనిచేస్తుంది. విండోస్ విషయంలో బెస్ట్.. మైక్రోసాఫ్ట్ అందిస్తున్న సేవ ఇది. విండోస్ - 8 ఆపరేటింగ్ సిస్టమ్స్ లుక్ అండ్ ఫీల్‌ను మార్చేసిన ఫీచర్ ఇది. బిల్ట్ ఇన్ అప్లికేషన్‌గా ఇది విండోస్ - 8 ను ప్రభావితం చేసింది. 7 జీబీ వరకూ ఉచిత స్టోరేజీకి అవకాశం ఉంటుంది. విండోస్ ఓఎస్ పై పనిచేసే డెస్క్టాప్ను వాడేవారికి, ఫోన్ వాడేవారికి ఉపయోగకరమైనది. ఉచిత పరిమితి దాటిపోతే, తక్కువ ధరలోనే ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది స్కై డ్రైవ్. విండోస్ ఓఎస్ విషయంలో బెస్ట్ స్కై డ్రైవ్. బెస్ట్ ఆఫ్ ఫ్రీ సర్వీస్.. వెబ్‌సైట్స్ నడిపేవారికి ఇది బెస్ట్ ఫ్రీ సర్వీస్. 50 జీబీ డాటాను అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సైట్ లో లింక్ ఇచ్చి డాటాను నెట్లో అందుబాటులో పెట్టడానికి అవకాశం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మెచ్చిన క్లౌడ్ స్టోరేజీ సేవ డ్రాప్‌బాక్స్. వేరు వేరు డివెజైస్లలో, వేరు వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేస్తుంది డ్రాప్ బాక్స్. డ్రాప్ బాక్స్ ద్వారా మల్టీ యూజర్లు డాటాను షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రైవేట్‌గా కూడా ఉంచుకోవచ్చు. డాటాను డ్రాప్ బాక్స్‌లో పడేసి కంప్యూటర్, ఫోన్స్, టాబ్లెట్ల ద్వారా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ విండోస్, మ్యాక్ ఓఎస్ఎక్స్, లైనక్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, బ్లాక్‌బెర్రీ ఓఎస్‌లపై పనిచేస్తుంది డ్రాప్‌బాక్స్. టెక్ట్స్ఫైల్స్, ఫోటోలు వేటినైనా... కాన్ఫిడెన్స్‌తో షేర్ చేసుకోండి అని హామీ ఇస్తోంది డ్రాప్ బాక్స్. 2 జీబీ వరకూ స్టోరేజ్‌కు అవకాశం ఉంటుంది. - జీవన్‌రెడ్డి. బి