పైసా ఖర్చుపెట్టకుండా ఫొటోలు దాచుకోండిలా.. | Google Photos Try This Alternatives For Free Storage Space | Sakshi
Sakshi News home page

Google Photos: ఫోన్‌ స్టోరేజ్‌ నిండిందా? డోంట్‌ వర్రీ.. వీటిలో ట్రై చేయండి

Published Fri, Sep 17 2021 1:08 PM | Last Updated on Fri, Sep 17 2021 1:32 PM

Google Photos Try This Alternatives For Free Storage Space - Sakshi

సాధారణంగా ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఫోన్‌లలో యూజర్లు డాటాను దాచుకోవడానికి ఉచిత స్టోరేజ్‌ ఉంటుందనేది తెలిసిందే. గూగుల్‌  తరపున గూగుల్‌ ఫొటోస్‌ విషయానికొస్తే  15 జీబీ ఉచిత స్పేస్‌ ఉంటుంది. అది నిండితే మాత్రం మరికొంత స్పేస్‌ను కొనుక్కోవాల్సిందే. లేకుంటే కొత్తగా డాటా స్టోర్‌ కాకపోగా.. ఆల్రెడీ సేవ్‌ అయిన డాటా కూడా డిలీట్‌ అవుతుంది.  అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలతో(యాప్స్‌తో) ఫొటోల్ని, డాటాను దాచుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?..  


టెరాబాక్స్‌(డ్యూబాక్స్‌).. గూగుల్‌​ ఫొటోస్‌కు బెస్ట్‌ ప్రత్యామ్నాయం ఇది. ఈ యాప్‌లో 1టీబీ(వెయ్యి జీబీ) ఉచిత స్టోరేజ్‌ ఇస్తుంది. ఫైల్స్‌, ఫొటోస్‌, వీడియోలు, ఫోల్డర్‌లు ఏవైనా దాచుకోవచ్చు. అయితే వీడియోలు ఆటోమేటిక్‌గా బ్యాక్‌ప్‌లోకి వెళ్లాలంటే మాత్రం.. ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉండాల్సిందే. ఇక ఫొటోలను మాత్రం ఉచితంగా బ్యాకప్‌ చేసుకునేందుకు ఎనేబుల్‌ బటన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

జియోక్లౌడ్‌ (ఫ్రీ క్లౌడ్‌ స్టోరేజ్‌).. గూగుల్‌ ఫొటోస్‌కు ఇంకో ఉచిత ప్రత్యామ్నాయం ఇది. జియో ద్వారా క్లౌడ్‌ స్టోరేజ్‌ 50జీబీ ఉచిత స్టోరేజ్‌ ఇస్తుంది. రిఫరెన్స్‌, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఫ్రీ స్టోరేజ్‌ను పొందవచ్చు.

డెగూ.. ఫొటోలు దాచుకోవడానికి మంచి మార్గం ఇది. ఇది మూడు ప్లాన్‌లతో ఉంటుంది. మొదటి ప్లాన్‌లో 100 జీబీ ఫ్రీ స్టోరేజ్‌ వస్తుంది. ఒకవేళ ప్రో లెవల్‌కు వెళ్తే.. 500 జీబీ స్టోరేజ్‌ ఇస్తారు. 10 టీబీ స్టోరేజ్‌ ప్లాన్‌ కూడా ఉంది. వీటితో పాటు స్పాన్సర్డ్‌ యాడ్స్‌ను చూసినా.. ఇతరుల్ని ఇన్వైట్‌ చేసినా  అదనంగా మరికొంత ఫ్రీ స్టోరేజ్‌ ఇస్తారు.
 
అమెజాన్‌ ఫొటోస్‌ యాప్‌..  అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ కొందరు కస్టమర్లకే అందించే యాప్‌ ఇది. అదీ గూగుల్‌ప్లే స్టోర్‌లో కేవలం ఆండ్రాయిడ్‌ ఫోన్లకు మాత్రమే అందిస్తోంది. 5జీబీ వరకు వీడియోలను ఇందులో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫొటోలకు మాత్రం లిమిట్‌ ఉండదు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో.. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫ్రీ అన్‌లిమిటెడ్‌ స్టోరేజ్‌ సౌకర్యం ఉంది. ఇక అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకు రెగ్యులర్‌గా లభించే మిగతా ఆఫర్ల సంగతి చెప్పనక్కర్లేదు.

మైక్రోసాఫ్ట్ 365(వన్‌ డ్రైవ్‌)..  ఇది ఫ్రీ మాత్రం కాదు. యాపిల్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు ఏడాదికి 4,899రూ. చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు 1 టీబీ స్టోరేజ్‌ ఇస్తారు. ఇందులో 6,199రూ.లతో ఫ్యామిలీ ప్లాన్‌ కూడా ఉంటుంది. వర్డ్‌, పవర్‌పాయింట్‌, ఎక్సెల్‌, అవుట్‌లుక్‌ అప్లికేషన్స్‌ ప్రీమియం ప్రొడక్టులను కూడా పొందవచ్చు.

యాపిల్‌ వన్‌ ఇండియా ప్లస్‌..  యాపిల్‌ వన్‌ ఇండియా ప్లాన్స్‌ను మొత్తం కుటుంబం ఉపయోగించుకోవచ్చు. నెలకు 365రూ.లతో ఆరుగురు 200 జీబీ ఐక్లౌడ్‌ స్టోరేజ్‌ను వాడుకోవచ్చు.  యాపిల్‌ మ్యూజిక్‌, యాపిల్‌ టీవీ ఫ్లస్‌, యాపిల్‌ ఆర్కేడ్‌ సర్వీసులతో పాటు 50జీబీ ఐక్లౌడ్‌ స్టోరేజ్‌ కూడా దక్కుతుంది. కాకపోతే 195రూ. నెలవారీ ప్లాన్‌ తీసుకోవాలి. యాపిల్‌ రెగ్యులర్‌ యూజర్లు మాత్రం 177రూ. వరకు సేవ్‌ చేసుకోవచ్చు.|

గూగుల్‌ ఫొటోస్‌ గురించి ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement