Google Photos service
-
మే 15 నుంచి ‘గూగుల్ ఫొటోస్’లో మార్పులు
మొబైల్ కొనేముందు ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ, స్క్రీన్ సైజ్‌తోపాటు ప్రధానంగా కెమెరా గురించి తెలుసుకుంటారు. అందులో ప్రత్యేక ఫీచర్లు ఉంటే మరింత ఆసక్తి చూపుతారు. కొన్ని మొబైల్ తయారీ సంస్థలు ఇంటర్నల్‌గా ఫోన్ కెమెరా టూల్లోనే ఏఐ ఆధారిత ఫీచర్లును వాడుతున్నాయి. దానికితోడు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న చాలా ఫొటో ఎడిటింగ్ యాప్‌లు సైతం ఏఐను వినియోగిస్తున్నాయి. వాటికి ధీటుగా ‘గూగుల్ ఫోటోస్’ యాప్‌లోనూ కొన్ని మార్పులు చేస్తున్నట్లు గూగుల్ తాజాగా ప్రకటించింది. ఈ మార్పులు మే 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. గూగుల్ తన వినియోగదారులకు మెరుగైన ఫొటో ఫీచర్లను అందించేందుకు ఎడిటింగ్ ఆప్షన్లలో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. గూగుల్ ఫొటోస్ యాప్‌లో మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్‌తోపాటు ఫోటో బ్లర్, పోట్రైట్ లైట్ వంటి ఇతర ఏఐ టూల్స్‌ను అందించనున్నట్లు చెప్పింది. గూగుల్ సంస్థ ఇప్పటికే ఈ టూల్స్‌ను కొన్ని మొబైల్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023 మేలో వీటిని పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పరిచయం చేసింది. మే 15, 2024 తర్వాత ఈ ఏఐ ఆధారిత ఫొటో ఎడిటర్ టూల్స్‌ను గూగుల్ ఫొటోస్ వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరూ వినియోగించవచ్చని తెలిపింది. ఇదీ చదవండి: ‘వాటిలో పెట్టుబడి పెడితే రూ.కోట్లే..’ యూజర్లు ఈ ఫీచర్లును వాడుకోవాలంటే మాత్రం ఆండ్రాయిడ్ 8.0, ఐఓఎస్ 15 సహా ఆపై వచ్చిన ఓఎస్‌లనే ఇన్స్టాల్ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. దాంతోపాటు మొబైల్ ర్యామ్ 3జీబీ కంటే ఎక్కువ ఉండాలని చెప్పింది. -
ఫొటోలు, వీడియోలతో ఫోన్ స్టోరేజ్ నిండిందా?
Full Phone storage Here's create more space: పండుగ టైంలో సరదాగా ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే స్టోరేజ్ సమస్య చాలామందికి ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. ఈ తరుణంలో ఫోన్లో ఫ్రీ స్పేస్ కోసం ఏం చేయొచ్చో తెలుసుకుందాం. ఫోన్ స్పేస్ ఫ్రీ చేయడం అంటే ఉన్న ఫొటోల్ని, వీడియోల్ని డిలీట్ చేయడం అనుకుంటారు చాలామంది. ఇందుకోసం వాటిని సెలక్ట్ చేసుకుంటూ.. టైం తీసుకుంటూ కుస్తీ పడుతుంటారు. కానీ, కింద చెప్పిన పద్ధతుల్లో వెళ్తే.. డివైజ్‌లో స్పేస్ కోసం అంత టైం పట్టదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. చాలామంది వాడే స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లే. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి.. అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ స్టోరేజ్ సెక్షన్లోకి వెళ్తే.. ఏ యాప్ ఎక్కువ రోజుల నుంచి నిరుపయోగంగా ఉందో.. ఏ యాప్‌వల్ల ఎక్కువ స్పేస్ పోతుందో స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా స్పేస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ & గూగుల్ ఫైల్స్ యాప్.. దాదాపు ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటోంది. అది ఓపెన్ చేయగానే అందులో .. ఇమేజెస్(ఫొటోలు), ఆడియో, వీడియోలు ఇతరాలు కనిపిస్తాయి. అక్కడ లార్జ్ ఫైల్స్‌లో అనవసరమైనవి ఎంపిక చేసుకుని డిలీట్ చేయొచ్చు. వాట్సాప్‌లో.. దాదాపు స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లందరి ఫోన్లలో ఉంటున్న యాప్. ఈ యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే డాటాను కొంతమంది క్లియర్ చేసినా.. స్టోరేజ్‌లో అలాగే ఉండిపోతాయని తెలుసా? అందుకే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటిని క్లియర్ చేస్తూ ఉండాలి. సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అండ్ డాటా ఆప్షన్‌ను క్లిక్ చేయగానే ‘మేనేజ్ స్టోరేజ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే ఎంత స్పేస్ అవసరం అనేది చూపిస్తుంది. అంతేకాదు అవసరం అనుకున్న ఫైల్స్‌ను అక్కడి నుంచి కూడా డిలీట్ చేసుకోవచ్చు. అక్కడ 5 ఎంబీ కంటే ఎక్కువ ఫైల్స్కనిపిస్తాయి కాబట్టి సులువుగా క్లియర్ చేసుకోవచ్చు కూడా. క్లౌడ్ సర్వీస్.. ఫొటోల్ని, వీడియోల్ని బ్యాక్అప్ చేసుకోవడం ద్వారా ఫోన్ స్పేస్ ఫ్రీ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా గూగుల్ ఫోటోస్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఫీచర్‌ని ఆన్‌లో పెట్టుకోవడమే. గూగుల్ ఫొటోస్ యాప్‌పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. హైక్వాలిటీ రెజల్యూషన్ ఎంచుకుంటే గూగుల్ ఫొటోస్ అన్లిమిటెడ్ స్టోరేజ్‌ను అందిస్తుంది. గూగుల్ ఫొటోస్‌తో పాటు గూగుల్ డ్రైవ్ లాంటి వాటిలో సేవ్ చేసుకుంటే సరి. ఇవికాగా.. యాప్స్ క్యాచెని తొలగించడం ద్వారా స్టోరేజ్ స్పేస్ వస్తుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే.. డాటానే పోయే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆవెంటనే ఏదైనా యాప్ మీద క్లిక్ చేసి, స్టోరేజ్ ఆపై క్లియర్ క్యాచెను క్లిక్ చేయాలి. డౌన్‌లోడ్స్‌పై లుక్. చాలావరకు మీకు అవసరం లేని ఫైల్స్ ఉంటాయి. అలాంటి వాటిని చూసి తొలగించండి. అలాగే పీడీఎఫ్ ఫైల్స్, హైడ్‌లో దాచిన ఫైల్స్ ఉంటే కూడా డిలీట్ చేయడం ద్వారా స్పేస్ దొరుకుతుంది. -
గుడ్ న్యూస్: ఇకపై ఫొటోలు, వీడియోల 'లీకు'ల బెడద తప్పనుంది
ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న పర్సనల్ ఫొటోలు, వీడియోలు భద్రంగా ఉంటాయా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. సైబర్ నేరస్తులు మాల్ వేర్ సాయంతో ఫోన్లలో ఉన్న పర్సనల్ డేటాను లీక్ చేస్తున్నారు.డార్క్ వెబ్‌లో అసాంఘిక కార్యకలపాల కోసం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఈ బాధ మీకు తొలగనుంది. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్ వినయోగదారులకు లీకుల బెడద తప్పనుంది. తొలుత 'గూగుల్ ఫిక్సెల్' వినియోగదారుల కోసం ఫొటో, వీడియో ఫోల్డర్‌కి లాక్ వేసే ఫీచర్ ఆప్షన్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పెరుగుతున్న టెక్నాలజీతో పొంచి ఉన్న ప్రమాదం నుంచి గూగుల్ ఫిక్సెల్ ఫోన్ వినియోగదారుల్ని రక్షించేందుకు ఈ ఏడాది జూన్‌లో గూగుల్ లాక్ ఫీచర్‌ను విడుదల చేసింది. అయితే ఆ ఫీచర్‌ను మరింత అప్డేట్ చేసి త్వరలో విడుదల చేయనుందని టెక్ న్యూస్ వెబ్సైట్ 'ది వెర్జ్' ఓ కథనాన్ని ప్రచురించింది. ది వెర్జ్ రిపోర్ట్ ప్రకారం..గూగుల్ ఫిక్సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0 యూజర్లు తమ ఫోన్లో ఉన్న ఫొటోలు, వీడియోలు సురక్షితంగా ఉండేందుకు లాక్ పెట్టుకోవచ్చు.గూగుల్ ఫోటోస్ నుంచి వచ్చే నోటిఫికేషన్ సాయంతో పాస్‌వర్డ్‌ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ లాక్ ఫీచర్‌ను వినియోగిస్తే ప్రమాదకరమైన థర్డ్ పార్టీ యాప్స్ ఫోన్లో ఉన్న ఫొటోల్ని, వీడియోల డేటాను సేకరించ లేవు. ఆ యాప్స్‌కు చిక్కకుండా ఈ లాక్ ఫీచర్ వాటిని హైడ్ చేస్తుంది. వీటితో పాటు గుర్తు తెలియని వ్యక్తులు రహస్యంగా ఫోన్లో ఉన్న ఫొటోల్ని బ్యాకప్ తీసుకోవడానికి లేదా షేర్ చేసే అవకాశం ఉండదు. తప్పనిసరిగా పాస్‌వర్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. గూగుల్ ఫొటోస్' నుంచి వచ్చే నోటిఫికేషన్‌తో ఫోల్డర్‌కి లాక్ చేయడం వల్ల సురక్షితంగా ఉండొచ్చని వెర్జ్ తన కథనంలో పేర్కొంది. చదవండి: గూగుల్ మ్యాప్స్: ఓ గుడ్ న్యూస్-ఓ బ్యాడ్ న్యూస్ -
పైసా ఖర్చుపెట్టకుండా ఫొటోలు దాచుకోండిలా..
సాధారణంగా ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో యూజర్లు డాటాను దాచుకోవడానికి ఉచిత స్టోరేజ్ ఉంటుందనేది తెలిసిందే. గూగుల్ తరపున గూగుల్ ఫొటోస్ విషయానికొస్తే 15 జీబీ ఉచిత స్పేస్ ఉంటుంది. అది నిండితే మాత్రం మరికొంత స్పేస్‌ను కొనుక్కోవాల్సిందే. లేకుంటే కొత్తగా డాటా స్టోర్ కాకపోగా.. ఆల్రెడీ సేవ్ అయిన డాటా కూడా డిలీట్ అవుతుంది. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలతో(యాప్స్‌తో) ఫొటోల్ని, డాటాను దాచుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?.. టెరాబాక్స్(డ్యూబాక్స్).. గూగుల్ ఫొటోస్‌కు బెస్ట్ ప్రత్యామ్నాయం ఇది. ఈ యాప్‌లో 1టీబీ(వెయ్యి జీబీ) ఉచిత స్టోరేజ్ ఇస్తుంది. ఫైల్స్, ఫొటోస్, వీడియోలు, ఫోల్డర్లు ఏవైనా దాచుకోవచ్చు. అయితే వీడియోలు ఆటోమేటిక్‌గా బ్యాక్‌ప్‌లోకి వెళ్లాలంటే మాత్రం.. ప్రీమియం మెంబర్షిప్ ఉండాల్సిందే. ఇక ఫొటోలను మాత్రం ఉచితంగా బ్యాకప్ చేసుకునేందుకు ఎనేబుల్ బటన్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. జియోక్లౌడ్ (ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్).. గూగుల్ ఫొటోస్‌కు ఇంకో ఉచిత ప్రత్యామ్నాయం ఇది. జియో ద్వారా క్లౌడ్ స్టోరేజ్ 50జీబీ ఉచిత స్టోరేజ్ ఇస్తుంది. రిఫరెన్స్, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఫ్రీ స్టోరేజ్‌ను పొందవచ్చు. డెగూ.. ఫొటోలు దాచుకోవడానికి మంచి మార్గం ఇది. ఇది మూడు ప్లాన్లతో ఉంటుంది. మొదటి ప్లాన్‌లో 100 జీబీ ఫ్రీ స్టోరేజ్ వస్తుంది. ఒకవేళ ప్రో లెవల్‌కు వెళ్తే.. 500 జీబీ స్టోరేజ్ ఇస్తారు. 10 టీబీ స్టోరేజ్ ప్లాన్ కూడా ఉంది. వీటితో పాటు స్పాన్సర్డ్ యాడ్స్‌ను చూసినా.. ఇతరుల్ని ఇన్వైట్ చేసినా అదనంగా మరికొంత ఫ్రీ స్టోరేజ్ ఇస్తారు. అమెజాన్ ఫొటోస్ యాప్.. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కొందరు కస్టమర్లకే అందించే యాప్ ఇది. అదీ గూగుల్‌ప్లే స్టోర్‌లో కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందిస్తోంది. 5జీబీ వరకు వీడియోలను ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫొటోలకు మాత్రం లిమిట్ ఉండదు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో.. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫ్రీ అన్లిమిటెడ్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు రెగ్యులర్‌గా లభించే మిగతా ఆఫర్ల సంగతి చెప్పనక్కర్లేదు. మైక్రోసాఫ్ట్ 365(వన్ డ్రైవ్).. ఇది ఫ్రీ మాత్రం కాదు. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్లు ఏడాదికి 4,899రూ. చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు 1 టీబీ స్టోరేజ్ ఇస్తారు. ఇందులో 6,199రూ.లతో ఫ్యామిలీ ప్లాన్ కూడా ఉంటుంది. వర్డ్, పవర్‌పాయింట్, ఎక్సెల్, అవుట్‌లుక్ అప్లికేషన్స్ ప్రీమియం ప్రొడక్టులను కూడా పొందవచ్చు. యాపిల్ వన్ ఇండియా ప్లస్.. యాపిల్ వన్ ఇండియా ప్లాన్స్‌ను మొత్తం కుటుంబం ఉపయోగించుకోవచ్చు. నెలకు 365రూ.లతో ఆరుగురు 200 జీబీ ఐక్లౌడ్ స్టోరేజ్‌ను వాడుకోవచ్చు. యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ఫ్లస్, యాపిల్ ఆర్కేడ్ సర్వీసులతో పాటు 50జీబీ ఐక్లౌడ్ స్టోరేజ్ కూడా దక్కుతుంది. కాకపోతే 195రూ. నెలవారీ ప్లాన్ తీసుకోవాలి. యాపిల్ రెగ్యులర్ యూజర్లు మాత్రం 177రూ. వరకు సేవ్ చేసుకోవచ్చు.| గూగుల్ ఫొటోస్ గురించి ఈ జాగ్రత్తలు తెలుసుకోండి! -
Google: గూగుల్ నుంచి బంపరాఫర్
వర్క్‌ఫ్రమ్ హోం ఇతరత్ర కారణాలతో డేటా స్టోరేజ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది గూగుల్. కొత్తగా క్లౌడ్ స్టోరేజ్ ప్లాన్లను ప్రకటించింది. అందులో 5టీబీ స్టోరేజ్ ప్లాన్‌ను మంత్లీ, ఇయర్లీ ప్యాకేజీవారీగా తక్కువ ధరకే అందిస్తుండడం విశేషం. గూగుల్ సర్వీస్‌లోని జీమెయిల్, గూగుల్ ఫొటోస్‌లోని ఇమేజెస్, వీడియోస్, గూగుల్ డ్రైవ్‌లో ఏదైనా డాటా స్టోర్ చేసుకోవడానికి ఒక లిమిట్(15 జీబీ) అంటూ ఉంది కదా. ఒకవేళ ఆ పరిధి దాటి ఉపయోగించుకోవాల్సి వస్తే.. స్టోరేజ్‌ను మంత్లీ/ఇయర్లీ ప్యాకేజీల వారీగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా గూగుల్ వన్ యాప్ ప్రకటన ప్రకారం.. తక్కువ ధరలో 5 టీబీ స్టోరేజ్ కోసం నెలకు 1,649రూ. అందిస్తుండగా, ఏడాది ప్లాన్‌కు 15, 900రూ. చెల్లించాల్సి ఉంటుంది. మిగతావి ఇలా.. ఇక 5టీబీ స్టోరేజ్‌ను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి పంచుకునే వీలు కూడా ఉంది. అంతేకాదు భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో గూగుల్ వీపీఎన్ సర్వీస్ సైతం ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించనుంది గూగుల్. గత ప్లాన్ల ప్రకారంగానే స్టోరేజ్ ప్యాకేజీలను గూగుల్ యూజర్లకు అందిస్తోంది. 100 జీబీ స్టోరేజ్ కోసం నెలకు రూ.130 చెల్లిస్తే.. , ఏడాదికి 1,300రూ. చెల్లించాలి. 200జీబీ ప్లాన్ కోసం నెలకు 210రూ., ఏడాదికి 2,100రూ. చెల్లించాలి. 2 టీబీ స్టోరేజ్ కోసం నెలకు 650రూ., ఏడాదికి రూ.6,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్లాన్స్ కూడా గూగుల్ వన్ వెబ్సైట్, యాప్ ద్వారా సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు. క్లిక్: గూగుల్ ‘చిప్’.. అంతా బిల్డపేనా? రేటు ఎక్కువే.. అయితే 2 టీబీ స్టోరేజ్ కంటే మించి ప్లాన్స్ మాత్రం యాప్ ద్వారానే సబ్ స్క్రయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో 10 టీబీ ప్లాన్ నెలకు రూ.3,249రూ. కాగా, 20 టీబీ స్టోరేజ్‌కు నెలకు 6,500రూ. చెల్లించాల్సి ఉంటుంది. ఇక టాప్ టైర్ ప్లాన్‌గా చెప్పుకునే 30టీబీ స్టోరేజ్ కోసం నెలకు 9,700రూ. చెల్లించాల్సి ఉంటుంది. ఇక 100 జీబీ, 200జీబీ, 2టీబీ ప్లాన్స్ గూగుల్ వన్ వెబ్సైట్ కంటే యాప్‌లో అత్యధిక రేటుకు అందజేయడం కొసమెరుపు. గూగుల్ ఫోటోస్ నుంచి అపరిమిత డేటా స్టోరేజ్ సౌకర్యాన్ని ఈ ఏడాది మొదట్లో గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. అంతకు ముందు నుంచే గూగుల్ డ్రైవ్ విషయంలో ఇది అమలు అవుతోంది. ఇక 15 జీబీ డాటా స్టోరేజ్ దాటితే.. కచ్చితంగా స్టోరేజ్ కొనుగోలు చేయాలని, లేకుంటే కొత్తగా డాటా స్టోర్కాదని, పైగా ఆల్రెడీ స్టోరేజ్‌పై ప్రభావం పడి డిలీట్ అయ్యే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది కూడా. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
మీ స్మార్ట్ఫోన్లలో డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి...!
Recover Deleted Photos and Videos From Google Photos: గడిచిన కాలాన్ని గుర్తుచేసే తీపి జ్ఞాపకాలు ఫోటోస్ ..! బ్లాక్ అండ్ వైట్, ఫిల్మ్ ఫోటోల నుంచి నేటి స్మార్ట్ఫోన్ల వరకు ఫోటోల పరిణామ క్రమం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఫోటో స్టూడియోలకు వెళ్లి ఫోటోగ్రాఫర్ మన ఫోటోలను తీయించుకునేవాళ్లము. మారుతున్న కాలంతో పాటు ఫోటో పరిణామ క్రమంలో భారీ మార్పులే వచ్చాయి. నేటి సాంకేతికతతో ఫోటోలను స్మార్ట్‌ఫోన్ కెమెరాలను ఉపయోగించి మన ఫోన్లలో ఆయా సందర్బపు క్షణాలను బంధిస్తున్నాం. చదవండి: Gmail: జీమెయిల్ యూజర్లకు గుడ్‌న్యూస్...! మన స్మార్ట్ఫోన్లలో దించిన ఫోటోలను ఎప్పటికప్పుడు గూగుల్ ఫోటోస్‌తో సింక్ చేయడంతో మన ఫోన్ల నుంచి డిలీట్ఐనా ఆయా ఫోటోలు గూగుల్ ఫోటోస్ సహాకారంతో తిరిగి పొందవచ్చును. స్మార్ట్ఫోన్లలో డిలీట్ఐనా ఫోటోలను గూగుల్ ఫోటోస్ ద్వారా పొందే సౌలభ్యం ఉంది. మరి అదే గూగుల్ ఫోటోస్ నుంచి డిలీట్ ఐనా ఫోటోలను లేదా వీడియోలను పొందడం ఏలా అని వాపోతున్నారా...! కంగారు పడే అవసరమే లేదు..! గూగుల్ ఫోటోస్ నుంచి డిలీట్ ఐనా ఫోటోలను మళ్లీ తిరిగి పొందవచ్చును. గూగుల్ ఫోటోస్ నుంచి డిలీటైనా ఫోటోలు లేదా వీడియోలు 60 రోజుల వ్యవధి దాటితే వాటిని తిరిగి పొందలేము.. గూగుల్ ఫోటోస్ నుంచి డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి. ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ టాబ్లెట్, ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో ఫోటో లేదా వీడియోలను తిరిగి పొందడం కోసం మీ ఫోన్లో ఉన్న గూగుల్ ఫోటోస్ యాప్‌ను ఓపెన్ చేయండి. దిగువన ఉన్న లైబ్రరీపై క్లిక్ చేయండి. తరువాత ట్రాష్ బిన్ సింబల్‌పై క్లిక్ చేయండి. మీరు తిరిగి పొందాలనుకున్న ఫోటో లేదా వీడియోలకోసం చూడండి. మీరు ఎంచుకున్న ఫోటో లేదా వీడియోపై హోల్డ్ చేసి ప్రెస్ చేయండి. ఫోటో లేదా వీడియోపై ప్రెస్ చేసిన వెంటనే మీకు దిగువన రిస్టోర్ అనే అప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే తిరిగి ఆయా ఫోటోలను లేదా వీడియోలను తిరిగి గూగుల్ ఫోటోస్‌లో పొందవచ్చును. ఒక వేళ కంప్యూటర్ నుంచి పొందాలనుకుంటే... బ్రౌజర్నుపయోగించి మీ జీ మెయిల్ ఖాతాలోకి సైన్ ఇన్ అవ్వండి. నెక్ట్స్ ట్యాబ్‌లో photos.google.comను సెర్చ్ చేయండి. మీకు మీ గూగుల్ ఫోటోస్ ఉన్నఅకౌంట్ ప్రత్యక్షమౌతుంది. విండోకు ఎడమ వైపున ఉన్న ట్రాష్ బిన్ ఫోల్డర్‌పై క్లిక్ చేయండి. మీరు తిరిగి పొందాలనుకుంటున్న ఫోటో లేదా వీడియోపై కర్సర్‌ను ఉంచి, ఎగువ కుడి వైపున, ఉన్న రిస్టోర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి . క్లిక్ చేసిన వెంటనే తిరిగి ఆయా ఫోటోలను లేదా వీడియోలను పొందవచ్చును. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
ఫొటోలను గూగుల్ ఫొటోస్‌లో స్టోర్ చేస్తున్నారా?
గూగుల్ ఫొటోస్.. ఫొటోలు, వీడియోల బ్యాకప్ కోసం ఉపయోగిస్తున్న గూగుల్ బేస్డ్ ఫ్రీ యాప్. చాలామంది ఇందులో ఫొటోలు, వీడియోలను భద్రంగా ఉన్నాయనుకుంటారు. ఆటోమేటిక్‌గా ఫొటోలు అందులోకి వెళ్తున్నాయని భావిస్తుంటారు. కానీ, గూగుల్ ఫొటోస్‌కూ ఓ పరిమితి అంటూ ఉంటుంది. అది దాటినా.. లేదంటే ఫుల్ మొమరీతో ఎక్కువ కాలం నడిపించినా.. ఆ మొత్తం ఫొటోలు, వీడియోలు ఎగిరిపోతాయని మీకు తెలుసా?. కాబట్టి, గూగుల్ ఫొటోస్‌కు సంబంధించి ఈ విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడండి. గూగుల్ ఫొటోస్ యాప్ కోసం ప్రతీ గూగుల్ అకౌంట్‌కు ఉచితంగా కొంత స్పేస్ ఇస్తుంది గూగుల్. ఇందులో ఎక్స్‌ప్రెస్, స్టోరేజ్ సేవర్, ఒరిజినల్ క్వాలిటీ అనే ఆప్షన్లు ఉంటాయి. ఒకవేళ ఒరిజినల్ క్వాలిటీని గనుక క్లిక్ చేయకపోతే.. ఫొటోలు, వీడియోలు మంచి క్వాలిటీతో సేవ్ కావు. అప్పుడు ఫొటోలు తక్కువ సైజులో సేవ్ అయ్యి.. ఆ ఫొటోలు, వీడియోలు బ్లర్‌గా గూగుల్ ఫొటోల్లో కనిపిస్తుంటాయి. చాలామంది గూగుల్ ఫొటోస్‌లో స్పేస్ కోసం తక్కువ క్వాలిటీకే ప్రయారిటీ ఇస్తారు. కానీ, క్వాలిటీ ఫొటోల్ని దాచుకోవాలనుకుంటే.. ఒరిజినల్ క్వాలిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయకతప్పదు. స్టోరేజ్ మించితే.. గూగుల్ అకౌంట్ స్టోరేజ్‌లో గూగుల్ డ్రైవ్ మాదిరిగానే.. గూగుల్ ఫొటోస్కి కూడా 15 జీబీ స్పేస్ ఇస్తుంది గూగుల్. ఈ పరిమితి దాటిపోతే.. తర్వాతి నుంచి తీసే ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఆటోమేటిక్‌గా సేవ్ కావు. అప్పుడు ఆల్రెడీ సేవ్ అయి ఉన్న డాటాపై(ఆల్రెడీ ఉన్న ఫొటోలు, వీడియోపై) ప్రభావం పడే ఛాన్స్ ఉంది. కాబట్టి, గూగుల్ వన్ సబ్ స్క్రిప్షన్ ద్వారా అదనపు స్టోరేజ్‌ను గూగుల్ ఫొటోస్ కోసం కొనుక్కోవచ్చు. ఒకవేళ కొనుక్కోకపోతే.. గూగుల్ ఫొటోస్ పూర్తి కోటా అయిపోయినా(15 జీబీ పూర్తి కావడం), లేకుంటే అదనపు స్టోరేజ్‌ను కొనుక్కోకపోయినా.. ఆ తర్వాతి ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్ బ్యాకప్‌కు వెళ్లవు. అంటే.. స్టోర్ కావన్నమాట. ఒకవేళ ఓవర్ కోటాతో అలాగే గూగుల్ ఫొటోస్ యాప్‌ను 24 నెలలపాటు నడిపిస్తే.. ఆల్రెడీ అందులో ఉన్న ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, గూగుల్ ఫొటోస్ మొమరీ ఫుల్ అయితే గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఉపయోగించడం ఆపేయాలి(సెట్టింగ్స్ ద్వారా). గూగుల్ చెబుతుంది జీమెయిల్గానీ, గూగుల్ ఫొటోస్గానీ, గూగుల్ డ్రైవ్గానీ(గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్, డ్రాయింగ్స్, ఫామ్స్, జామ్బోర్డ్, సైట్స్ ఫైల్స్) ఏదైనా సరే.. రెండేళ్లపాటు ఉపయోగించకుండా ఉంటే అందులో ఉండే మొత్తం కంటెంట్, డాటా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. అయితే అలా చేయడానికి కంటే ముందు ఈ-మెయిల్స్, నోటిఫికేషన్స్ ద్వారా గూగుల్ తన యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది కూడా. ఇక డిలీట్ చేయడానికి మూడు నెలల ముందు యూజర్‌ను మరోసారి అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు ఆ టైంలో కంటెంట్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఒకవేళ జీమెయిల్, డ్రైవ్‌ల విషయంలో యాక్టివ్‌గా ఉండి.. గూగుల్ ఫొటోస్ను రెండేళ్లపాటు పట్టించుకోకుండా ఉన్నారనుకోండి. గూగుల్ ఫొటోస్‌లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని గూగుల్ తొలగిస్తుంది. డేటా డిలీట్ కాకుండా ఉండాలంటే.. తరచూ గూగుల్ అకౌంట్‌కు లాగిన్ అయ్యి.. ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోలను చెక్ చేస్తూ ఉండాలి(వెబ్ లేదా యాప్‌లో అయినా సరే). అవసరం లేని ఫొటోలు, వీడియోలు, కంటెంట్‌ను తీసేస్తూ.. ఫ్రీ స్పేస్‌ను మెయింటెన్ చేస్తూ ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చాలామంది ఒకే ఫోన్లో రెండు, మూడు గూగుల్ అకౌంట్లను మెయింటెన్ చేస్తుంటారు. కాబట్టి, అన్ని అకౌంట్లకు సంబంధించిన ఫొటోస్, డ్రైవ్, జీమెయిల్ అకౌంట్లను తప్పనిసరిగా వెరిఫై చేస్తూ ఉండాలి. ఇదీ చదవండి: ఇంట్లో కరెంట్ బోర్డు సమస్యలను ఇలా గుర్తించొచ్చు! -
గూగుల్ నుంచి ఆ ఫొటోలూ డిలీట్ చేయొచ్చు
గూగుల్ సెర్చ్ బార్లో ఓసారి మీ పేరు టైప్ చేసి చూడండి. గూగుల్ ఇమేజ్‌ల్లో మీ ఫొటో కనిపించే అవకాశం లేకపోలేదు. సోషల్ మీడియా కనెక్టివిటీ అయితేనేం.. ట్యాగ్ చేసినవి అయితేనేం.. రివెంజ్‌తో అప్లోడ్ చేసేవి అయితేనేం.. ఇతరత్ర డేటా వల్ల అయితేనేం.. గూగుల్‌లో మన ఫొటోలు కనిపించడం షరామామూలు అయ్యింది. అయితే ఇష్టం లేకున్నా.. అభ్యంతరాలున్నా మీ ఫొటోల్ని డిలీట్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్న గూగుల్.. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని పిల్లల కోసమూ తీసుకురాబోతోంది. ఈ మధ్య కాలంలో పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడకం సర్వసాధారణం అయ్యింది. ఈ తరుణంలో 13-18 ఏళ్లలోపు వయసున్న పిల్లల కోసం ఈ కొత్త పాలసీని తీసుకొచ్చింది గూగుల్. 18 ఏళ్లలోపు యూజర్లుగానీ, వాళ్ల తల్లిదండ్రుల విజ్ఞప్తి మీద గూగుల్ ఇమేజెస్‌లో కనిపించే ఫొటోల్ని డిలీట్ చేసే వీలును గూగుల్ కల్పిస్తోంది. ఇలాంటి ఆప్షన్ పెద్దల కోసం ఇదివరకే ఉంది. అయితే ఈ వ్యవహారంలో అశ్లీల కంటెంట్, వేధింపులతో ఎక్కువగా బాధితులు అవుతోంది పిల్లలే. అందుకే ఇప్పుడు కీలక ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఆ ఏజ్ గ్రూప్ యూజర్లు, పేరెంట్స్, సంరక్షకులు ఎవరైనా సరే సంబంధిత ఫీడ్‌బ్యాక్‌ను(కారణం) చెప్పి.. ఆ ఫొటోను తొలగించొచ్చు. ఈ నెలాఖరులో ఈ సౌకర్యాన్ని తీసుకురాబోతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి పేరెంట్ గైడ్‌లైన్స్ వివరాలను ఉంచింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోం.. ఉద్యోగులకు భారీ షాక్! ఇక 13 ఏళ్లలోపు పిల్లలకు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని మరోసారి స్పష్టం చేసింది టెక్ దిగ్గజం. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడ పెద్ద మెలిక కూడా ఉంది. గూగుల్ తన ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ నుంచి మాత్రమే ఫొటోను తొలగిస్తామని స్పష్టత ఇచ్చింది. అంటే.. గూగుల్ ఇమేజ్‌ల నుంచి ఫొటో పోయినా.. ఇంటర్నెట్ డేటా(మిగతా వెబ్ బ్రౌజర్ల) నుంచి మాత్రం ఆ ఫొటో పోతుందన్న గ్యారెంటీ లేదు. -
గూగుల్ ఫోటోస్‌లో ఉన్న ఫీచర్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్‌లో..!
ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. యూజర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం వివిధ రకరకాల సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాయి. కాగా తాజాగా గూగూల్ ఫోటోస్ యాప్‌లో యూజర్లకు ఉండే ఎడిటింగ్ ఆప్షన్‌ను మైక్రో సాఫ్ట్ వన్‌డ్రైవ్‌లో అందుబాటులోకి తెచ్చింది. బేసిక్ ఎడిటింగ్ టూల్స్‌తో యూజర్లు తమ ఫోటోలను క్రాప్, రొటేట్, ఫ్లిప్ చేయడంతో పాటూ కలర్ అడ్జస్ట్ కూడా చేయవచ్చును. ఈ ఆప్షన్‌ను వెబ్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. మైక్రో సాఫ్ట్ తన వినియోగదారులకు వన్‌డ్రైవ్‌తో 5 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజీను అందిస్తోంది. రానున్న రోజుల్లో యూజర్లకు మరిన్ని సదుపాయాలను యూజర్లకు అందించడానికి మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది. వచ్చే సంవత్సరం వన్‌డ్రైవ్ ఐవోస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది. చదవండి: మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులకు శుభవార్త..! -
ఫొటోలు, వీడియోలు దాచుకోండి గూగుల్‌లో...
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. రోజుకో కొత్త సర్వీసుతో ఆశ్చర్యపరిచే గూగుల్ తాజాగా మీ డిజిటల్ ఫొటోలన్నింటినీ తానే భద్రపరుస్తానని హామీ ఇస్తోంది. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత సెల్ఫీలు, కెమెరా క్లిక్, వీడియోలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. వీటిని ఎప్పటికప్పుడు డెస్క్టాప్లలోకి లేదంటే ఇతర మెమరీ డివెజైస్లోకి సింక్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ఫొటోస్ సర్వీసుతో ఈ ఇబ్బంది తప్పనుంది. డిజిటల్ ఫొటోలు, వీడియోలను గూగుల్ తన క్లౌడ్ సర్వర్లలో స్టోర్ చేస్తుంది. ఫొటోలు, వీడియోల సంఖ్య, మెమరీలపై పరిమితులేమీ లేని ఈ సర్వీసు ఉచితంగానే లభిస్తోంది. అయితే మీరు తీసిన ఫొటో రెజల్యూషన్ ఎంతున్నప్పటికీ గూగుల్ ఫొటోస్‌లో 16 మెగాపిక్సెళ్ల స్థాయి వరకూ మాత్రమే స్టోర్ చేస్తారు. పూర్తిస్థాయి రెజల్యూషన్ కావాలంటే మాత్రం గూగుల్ డ్రైవ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీంట్లో దాదాపు 15 జీబీల స్టోరేజీ ఉచితం కాగా, ఆ తరువాత ఒక టీబీ సమాచారం కోసం నెలకు రూ.650 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ ఫొటోస్‌లో ఫొటోలను గుర్తించడం, వాటిని ఒక క్రమపద్ధతిలో అమర్చడం వంటి పనులన్నీ ఆటోమెటిక్‌గా జరిగిపోతాయి. కొన్ని కీవర్డ్స్ ఆధారంగా ఫొటోలనూ సెర్చ్ చేయగలగడం ఈ సర్వీసుకున్న మరో ప్రత్యేకత.