గూగుల్‌ ఫోటోస్‌లో ఉన్న ఫీచర్‌ ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ వన్‌డ్రైవ్‌లో..! | Microsoft OneDrive Brings Basic Photo Editing Tools Its Web Android Apps Rival Google Photos | Sakshi

గూగుల్‌ ఫోటోస్‌లో ఉన్న ఫీచర్‌ ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ వన్‌డ్రైవ్‌లో..!

Jun 23 2021 8:21 PM | Updated on Jun 23 2021 10:17 PM

Microsoft OneDrive Brings Basic Photo Editing Tools Its Web Android Apps Rival Google Photos - Sakshi

ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. యూజర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం వివిధ రకరకాల సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాయి. కాగా తాజాగా గూగూల్‌ ఫోటోస్‌ యాప్‌లో యూజర్లకు ఉండే ఎడిటింగ్‌ ఆప్షన్‌ను మైక్రో సాఫ్ట్‌ వన్‌డ్రైవ్‌లో అందుబాటులోకి తెచ్చింది. బేసిక్‌ ఎడిటింగ్‌ టూల్స్‌తో యూజర్లు తమ ఫోటోలను క్రాప్‌, రొటేట్‌, ఫ్లిప్‌ చేయడంతో పాటూ కలర్‌ అడ్జస్ట్‌ కూడా చేయవచ్చును.



ఈ ఆప్షన్‌ను వెబ్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో ఉండనుంది.  మైక్రో సాఫ్ట్‌ తన వినియోగదారులకు వన్‌డ్రైవ్‌తో 5 జీబీ వరకు క్లౌడ్‌ స్టోరేజీను అందిస్తోంది. రానున్న రోజుల్లో యూజర్లకు మరిన్ని సదుపాయాలను యూజర్లకు అందించడానికి మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది. వచ్చే సంవత్సరం వన్‌డ్రైవ్‌ ఐవోస్‌ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది.

చదవండి: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ వినియోగదారులకు శుభవార్త..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement