బంబుల్, ఓక్‌కుపిడ్, గ్రైండర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సిస్కో టీమ్స్, వైబర్ వంటి ప్రముఖ డేటింగ్, ట్రావెల్, వీడియో కాలింగ్ యాప్స్ లలో ఇటీవల ఒక పెద్ద బగ్ గుర్తించినట్లు చెక్‌పాయింట్ పరిశోధకులు తెలిపారు. ఈ సమస్య అనేది గూగుల్ కోర్ లైబ్రరీ(జీపీసీ)కి చెందిన రెండు యాప్స్ మాత్రమే కాకుండా ఇతర యాప్స్ లలో గుర్తించినట్లు తెలిపారు. డెవలపర్‌ల నిర్లక్ష్యం కారణంగా ఈ బగ్ బయటపడింది. దీనిని 2020 ఏప్రిల్‌లో గూగుల్ గుర్తించి పరిష్కరించింది. ఈ బగ్ కి CVE-2020-8913 అని పేరు పెట్టబడింది. (చదవండి: గూగుల్ పేలో డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌లు)
ఈ బగ్ ద్వారా సైబర్ క్రీమినల్స్ కి మీ మొబైల్ యొక్క డెవలపింగ్ కోడ్ అనేది పొందటానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు హ్యాకర్స్ మీ మొబైల్ లో ఉన్న సెక్యూరిటీ కోడ్ ని మార్చడంతో పాటు వారు మరో హానికరమైన కోడ్‌ను మొబైల్ లో ఇంజెక్ట్ చేయవచ్చు. ఇటువంటి హానికర యాప్స్ ద్వారా వినియోగదారులకు తెలియకుండా వ్యక్తిగత సమాచారంతోపాటు సున్నితమైన బ్యాంక్ వివరాలు, సోషల్ మీడియా వివరాలు తెలుసుకుంటారు. ఈ సమస్య 2020 ఏప్రిల్‌లో గుర్తించబడింది. ఇది గూగుల్ ప్లే కోర్ లైబ్రరీకి సంబంధించినది కనుక గూగుల్ పరిష్కరించింది. అయితే చాలా మంది యాప్ డెవలపర్లు ఇప్పటికీ పాతబడిపోయిన గూగుల్ ప్లే కోర్ లైబ్రరీ (జీపీసీ)నే వాడుతున్నారు. ఇందులోనే ఈ బగ్‌ను కనుగొన్నారు. ఈ జీపీసీ ద్వారానే డెవలపర్లు తమ అప్‌డేట్స్‌ను యూజర్లకు చేరవేస్తారు.
2020 సెప్టెంబర్ నెలలో గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని ప్రముఖ యాప్స్‌ను చెక్ పాయింట్ పరీక్షించింది. ఇప్పటికి 13 శాతం డెవలపర్లు పాత గూగుల్ ప్లే కోర్ లైబ్రరీని వాడుతున్నట్లు గుర్తించింది. 8 శాతం మంది బగ్ ముప్పు ఎక్కువగా ఉన్న వెర్షన్‌నే వాడుతున్నారని ఇందులో తేలింది. ఇంకా ఈ సమస్యను గూగుల్ పూర్తిగా పరిష్కారించలేదు. గ్రైండర్, వైబర్, ఓక్‌కుపిడ్, బంబుల్, సిస్కో జట్లు, ఎడ్జ్, యాంగో ప్రో, ఎక్స్‌రేకార్డర్ మరియు పవర్ డైరెక్టర్ లాంటి ప్రముఖ యాప్స్ లో లోపం ఉన్నట్లు చెక్‌పాయింట్ నిపుణులు తెలిపారు. అందుకని మీ మొబైల్ ఇలాంటి యాప్స్ ఉంటె వెంటనే డిలీట్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment