Full Phone storage Here's create more space: పండుగ టైంలో సరదాగా ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే స్టోరేజ్ సమస్య చాలామందికి ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. ఈ తరుణంలో ఫోన్‌లో ఫ్రీ స్పేస్ కోసం ఏం చేయొచ్చో తెలుసుకుందాం.
ఫోన్ స్పేస్ ఫ్రీ చేయడం అంటే ఉన్న ఫొటోల్ని, వీడియోల్ని డిలీట్ చేయడం అనుకుంటారు చాలామంది. ఇందుకోసం వాటిని సెలక్ట్ చేసుకుంటూ.. టైం తీసుకుంటూ కుస్తీ పడుతుంటారు. కానీ, కింద చెప్పిన పద్ధతుల్లో వెళ్తే.. డివైజ్‌లో స్పేస్ కోసం అంత టైం పట్టదు.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి..
చాలామంది వాడే స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్‌లే. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి.. అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ స్టోరేజ్ సెక్షన్‌లోకి వెళ్తే.. ఏ యాప్ ఎక్కువ రోజుల నుంచి నిరుపయోగంగా ఉందో.. ఏ యాప్‌వల్ల ఎక్కువ స్పేస్ పోతుందో స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయడం ద్వారా స్పేస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
ఫైల్ మేనేజర్ & గూగుల్ ఫైల్స్ యాప్..
దాదాపు ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటోంది. అది ఓపెన్ చేయగానే అందులో .. ఇమేజెస్(ఫొటోలు), ఆడియో, వీడియోలు ఇతరాలు కనిపిస్తాయి. అక్కడ లార్జ్ ఫైల్స్‌లో అనవసరమైనవి ఎంపిక చేసుకుని డిలీట్ చేయొచ్చు.
వాట్సాప్‌లో..
దాదాపు స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లందరి ఫోన్‌లలో ఉంటున్న యాప్. ఈ యాప్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయ్యే డాటాను కొంతమంది క్లియర్ చేసినా.. స్టోరేజ్‌లో అలాగే ఉండిపోతాయని తెలుసా? అందుకే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటిని క్లియర్ చేస్తూ ఉండాలి. సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అండ్ డాటా ఆప్షన్‌ను క్లిక్ చేయగానే ‘మేనేజ్ స్టోరేజ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే ఎంత స్పేస్ అవసరం అనేది చూపిస్తుంది. అంతేకాదు అవసరం అనుకున్న ఫైల్స్‌ను అక్కడి నుంచి కూడా డిలీట్ చేసుకోవచ్చు. అక్కడ 5 ఎంబీ కంటే ఎక్కువ ఫైల్స్‌కనిపిస్తాయి కాబట్టి సులువుగా క్లియర్ చేసుకోవచ్చు కూడా.
క్లౌడ్ సర్వీస్..
ఫొటోల్ని, వీడియోల్ని బ్యాక్‌అప్ చేసుకోవడం ద్వారా ఫోన్ స్పేస్ ఫ్రీ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా గూగుల్ ఫోటోస్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఫీచర్‌ని ఆన్‌లో పెట్టుకోవడమే. గూగుల్ ఫొటోస్ యాప్‌పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. హైక్వాలిటీ రెజల్యూషన్ ఎంచుకుంటే గూగుల్ ఫొటోస్ అన్‌లిమిటెడ్ స్టోరేజ్‌ను అందిస్తుంది. గూగుల్ ఫొటోస్‌తో పాటు గూగుల్ డ్రైవ్ లాంటి వాటిలో సేవ్ చేసుకుంటే సరి.
ఇవికాగా.. యాప్స్ క్యాచెని తొలగించడం ద్వారా స్టోరేజ్ స్పేస్ వస్తుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే.. డాటానే పోయే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆవెంటనే ఏదైనా యాప్ మీద క్లిక్ చేసి, స్టోరేజ్ ఆపై క్లియర్ క్యాచెను క్లిక్ చేయాలి.
డౌన్‌లోడ్స్‌పై లుక్. చాలావరకు మీకు అవసరం లేని ఫైల్స్ ఉంటాయి. అలాంటి వాటిని చూసి తొలగించండి. అలాగే పీడీఎఫ్ ఫైల్స్, హైడ్‌లో దాచిన ఫైల్స్ ఉంటే కూడా డిలీట్ చేయడం ద్వారా స్పేస్ దొరుకుతుంది.
Comments
Please login to add a commentAdd a comment