Memory
-
Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి..
మహాకుంభమేళా.. ప్రపంచాన్నంతటినీ ఆకట్టుకుంటున్న మహోత్సవం. దీనిలో పలు అద్భుతాలు, వింతలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం ఎంతో ఆసక్తిగొలుపుతోంది. 15 ఏళ్ల క్రితం కనుమరుగైన ఒక వ్యక్తి అత్యంత విచిత్ర పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ కథనం జార్ఖండ్‌లోని కోడర్మా జిల్లాకు చెందిన ప్రకాష్ మహతోకు సంబంధించినది.ఆ సమయంలో ప్రకాష్.. కోడర్మా మునిసిపల్ కార్పొరేషన్(Koderma Municipal Corporation)లో పనిచేసేవాడు. 2010లో ఒక రోజున డ్యూటీకి వెళ్లిన ప్రకాష్ ఇంటికి తిరిగి రాలేదు. మానసిక పరిస్థితి సరిగా లేనందున ఇంటికి వెళ్లే దారిని మరచిపోయాడు. ప్రకాష్ కుటుంబసభ్యులు తమకు తెలిసిన అన్నిచోట్లా వెదికినా ఫలితం లేకపోయింది. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎంత గాలించినా ప్రకాష్ ఆచూకీ తెలియరాలేదు.అయితే 15 ఏళ్ల తరువాత తాజాగా ప్రకాష్ మహతోను బీహార్‌లోని రాణిగంజ్(Raniganj in Bihar) ప్రాంతంలో హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆ హోటల్ యజమాని సుమిత్ అతనికి పహల్వాన్ అని పేరుపెట్టాడు. చాలాకాలంగా ప్రకాష్ అదే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల హోటల్లో కుంభమేళా ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రకాష్ తాను కుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నానని, అదే దారిలో తమ ఇల్లు ఉందని హోటల్ యజమాని సుమిత్‌కు చెప్పాడు. దీంతో సుమిత్ ఈ విషయాన్ని కోడర్మా పోలీసులకు ఫోనులో తెలియజేశాడు. వారు ప్రకాష్ అతనేనని నిర్థారించాక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.దీంతో ఎంతో ఆనందంతో ప్రకాష్ భార్య గీతాదేవి, కుమారుడు సుజల్, కుమార్తె రాణీ తదితరులు రాణిగంజ్ చేరుకున్నారు. భర్తను చూసిన గీతాదేవి, తండ్రిని చూసిన సుజల్, రాణి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకాలం గీతాదేవి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. 15 ఏళ్ల తరువాత ఇంటిపెద్ద కనిపిస్తాడని, వారెవరూ ఊహించలేదు. వారంతా కోడర్మాలోని తమ ఇంటికి చేరుకుని, ఇదంతా కుంభమేళా మహత్మ్యమేనని అందరికీ చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి? -
మనిషిలా తెలివి మీరుతున్న ఏఐ
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతికి ‘మెమోరీని ఏకీకృతం’ చేయడం కీలకంగా మారుతోంది. ఏఐ వ్యవస్థను నడిపించే ముఖ్య కారకాల్లో ఇది ప్రధానమైంది. సమస్యలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి మానవులు జ్ఞాపకశక్తిపై ఆధారపడినట్లే.. ఏఐ వ్యవస్థలు వాటి సామర్థ్యాలను మెరుగుపరచడానికి మెమరీని ఉపయోగించడం ఇప్పటికే ప్రారంభించాయి. ఈ మార్పు మరింత అధునాతనంగా, మానవ తరహా కృత్రిమ మేధకు మార్గం సుగమం చేస్తోంది.ఓహియో స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యూసు ఈ రంగంలో పరిశోధనలు చేస్తున్నవారిలో ప్రముఖంగా ఉన్నారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో చేరడానికి ముందు తాను మైక్రోసాఫ్ట్ సెమాంటిక్ మెషీన్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేశారు. అక్కడ తాను సంభాషణాత్మక ఏఐపై విధులు నిర్వహించారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెమరీ ఆగ్మెంటెడ్ ఏఐ సిస్టమ్స్ అభివృద్ధిలో పరిశోదనలు చేశారు.సందర్భానుసారం స్పందించే ఏఐఅత్యాధునిక సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడం కోసం గత సమాచారాన్ని గుర్తుంచుకుని, సందర్భానుసారం దాన్ని ఉపయోగించే ఏఐ వ్యవస్థలను సృష్టించడంపై దృష్టి సారించినట్లు యూసు తెలిపారు. భాషా అవగాహన, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి పనులకు ఈ విధానం కీలకమని చెప్పారు. కృత్రిమ మేధస్సులో మెమోరీని చేర్చడం ద్వారా సాంకేతిక పరిశోధకులు.. గత అనుభవాల నుంచి నేర్చుకోగల, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మరింత కచ్చితమైన ప్రతిస్పందనలను అందించే ఏఐ వ్యవస్థలను సృష్టించడంలో నిమగ్నమయ్యారు.మెమోరీతో ఉపయోగాలు..ఏఐ వ్యవస్థలో మెమోరీ ఆగ్మెంటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఆరోగ్య సంరక్షణలో, రోగి చరిత్రలు, చికిత్స ఫలితాలను గుర్తు చేసుకోవడం ద్వారా వ్యాధులను నిర్ధారించడంలో ఇది సహాయపడుతుంది. ఫైనాన్స్ విభాగంలో గత డేటాను విశ్లేషించడం ద్వారా మార్కెట్ ధోరణులను అంచనా వేయడంలో తోడ్పడుతుంది. రోజువారీ పనులను మరింత మెరుగ్గా చేసేందుకు ఉపయోగపడుతుంది. మరింత సహజంగా వినియోగదారు అవసరాలకు ప్రతిస్పందించేలా చేస్తుంది.ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..సమర్థమైన వ్యవస్థలు..కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సాంకేతిక పరిశోధకుల సహకారం మెరుగైన భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా ఏఐ వ్యవస్థలు మరింత తెలివైనవిగా, సమర్థవంతమైనవిగా మారుతున్నాయి. ఈ రంగంలోని ఆవిష్కరణలు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇదిలాఉండగా, ఎంత అడ్వాన్స్డ్ పీచర్లతో ఏఐ వ్యవస్థలు వచ్చినా మనిషి మెదడుతో పోటీ పడలేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
ఆ నంబర్ ఏ పేరుతో సేవ్ చేసుకున్నానబ్బా..!
అత్యవసర సందర్భాల్లో మొబైల్లో సన్నిహితులు, తెలిసిన వారి ఫోన్ నంబర్లు ఏ పేరుతో సేవ్ చేసుకున్నది ఎంత గింజుకున్నా గుర్తుకు రాదు. అంతెందుకు.. మన ఫోన్ నంబర్ తప్ప కుటుంబ సభ్యులందరి ఫోన్ నంబర్లు చెప్పలేని పరిస్థితి. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల పుట్టిన తేదీ ఎప్పుడన్నది గుర్తుండదు. చిన్న లెక్క వేయడానికి మెదడు గజిబిజిగా మారి సెల్ ఫోన్లోని క్యాల్క్యులేటర్ను ఓపెన్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇలాంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఇది తరచూ జరుగుతూ ఉంటే మాత్రం ‘డిజిటల్ డిమెన్షియా’ అయ్యుండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సాంకేతిక ఆధిపత్య యుగంలో మొబైల్ ఫోన్, ట్యాబ్, కంప్యూటర్, టీవీ ఇతర సాంకేతిక పరికరాల వినియోగం పెరిగిపోయింది. ఫలితంగా ఒకప్పుడు వృద్ధుల్లో సహజంగా కనిపించే డిమెన్షియా (చిత్త వైకల్యం) బారిన ఇప్పుడు చిన్న పిల్లలు, యువత పడుతున్నారు. దైనందిన జీవితంలో చాలా మంది మేల్కొని ఉండే సమయంలో 40 శాతం, ఆపై కూడా స్క్రీన్ చూడటానికి కేటాయిస్తున్నారు. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ముఖ్యంగా చిన్నారుల్లో విజ్ఞానం, సృజనాత్మకతను సెల్ఫోన్లు చిదిమేస్తున్నాయనే చెప్పాలి. – సాక్షి, అమరావతిడిమెన్షియా ప్రారంభ దశ సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో డిమెన్షియా వస్తుంటుంది. సాంకేతికతను అతిగా వినియోగించడం ద్వారా జ్ఞాపక శక్తిలో వచ్చే సమస్యలను డిజిటల్ డిమెన్షియా అని 2012లో జర్మన్ న్యూరో శాస్త్రవేత్తలు అభివర్ణించారు. దీన్ని డిమెన్షియాకు ప్రారంభంలో వచ్చే మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అని కూడా కొందరు వైద్యులు చెబుతున్నారు. డిజిటల్ డిమెన్షియా మీద ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ఆధారంగా ఎక్కువ సమయాన్ని స్క్రీన్కు కేటాయించడంతో జ్ఞాపక శక్తిపై ప్రభావం పడుతుందని తేలింది. మెదడు డీయాక్టివ్ సాధారణంగా రాయడం, చదవడం, ఇంకా మరేదైనా పనుల్లో ఉన్నప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. ఆ అంశాలను మెదడు యాక్టివ్‌గా పరిశీలిస్తూ ఉంటుంది. అదే మొబైల్ ఫోన్లో సోషల్ మీడియా, సినిమాలు చూడటం, వీడియో గేమ్స్ ఆడటం చేస్తున్నప్పుడు పూర్తిగా అందులోనే నిమగ్నం అవుతారు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించకుండా మెదడు డీ యాక్టివ్ అయిపోతుంటుంది. ఈ నేపథ్యంలో రోజూ గంటల తరబడి స్క్రీన్ చూడటంతో మెదడు పనితీరుపై ప్రభావం పడుతోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇక చిన్న పిల్లల్లో అయితే ఆటిజం వంటి తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతున్నట్టు వెల్లడిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా డిజిటల్ తరగతుల రూపంలో విద్యార్థుల్లో స్క్రీన్ వినియోగం గణనీయంగా పెరిగింది. పాఠశాలలు, కళాశాలల్లో సైతం ప్రాజెక్ట్ వర్క్‌ల పేరిట ఇంటర్నెట్లో శోధించే అంశాలనే పిల్లలకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు మెదడుకు పని చెప్పడం లేదు. ఇది కూడా జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపుతోంది. ఇలా నివారించొచ్చు.. » మొబైల్, ల్యాప్ ట్యాప్, ఇతర డిజిటల్ స్క్రీన్ వినియోగం తగ్గించాలి. సుదీర్ఘంగా స్క్రీన్‌పై ఉండాల్సి వచి్చనప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. » జ్ఞాపక శక్తి, మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపేలా వ్యాయామాలు చేయాలి. వ్యాయామంతో మెదడు కణాల ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్లు విడుదల అవుతాయి. వాకింగ్, జాగింగ్, ఏరోబిక్ వంటి వ్యాయామాలు మెదడులోని హిప్పో క్యాంపస్ భాగం వృద్ధికి తోడ్పడతాయి. » రోజుకు 7 నుంచి 8 గంటల తప్పనిసరిగా నిద్ర పోవాలి. తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి. » మద్యం సేవించడం, ధూమపానం విడనాడాలి. » గ్రీన్ టీ, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.మెదడు ఎదుగుదలపై ప్రభావం మాకు వస్తున్న 100 ఓపీల్లో 30–40 మొబైల్ అతి వినియోగం ద్వారా వచ్చిన సమస్యలవే ఉంటున్నాయి. సాధారణంగా చిన్న పిల్లల్లో ఐదున్నరేళ్ల వరకూ మెదడు ఎదుగుతుంది. ప్రస్తుత రోజుల్లో పిల్లలు అల్లరి చేస్తున్నారని తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చేస్తున్నారు. ఏడాదిలోపు నుంచే స్క్రీన్ చూడటం మొదలు పెట్టడం చిన్న పిల్లల్లో మెదడు ఎదుగు దల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫోన్, టీవీల్లో చూసే కార్టూన్లు, గేమ్‌లనే వాస్తవ ప్రపంచంగా పిల్లలు భావిస్తున్నారు. వయసుతో పాటు ఈ సమస్య పెరిగి చదవులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.. – డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్, ప్రొఫెసర్, చైల్డ్ సైకియాట్రి, మానసిక వైద్యశాల విశాఖపట్నం -
మెమరీ క్రిస్టల్లో మన జన్యుక్రమం
లక్షలాది ఏళ్ల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొనడంతో అంత పెద్ద డైనోసార్లే నామరూపాల్లేకుండా పోయినట్టు సైన్స్ చెబుతోంది. భవిష్యత్తులో అలాంటి ప్రళయమేదన్నా వచ్చి మానవాళిని అంతం చేస్తే? అలాంటిది జరిగినా మానవ సృష్టి క్రమం కొనసాగేందుకు బ్రిటన్ సైంటిస్టులు ఓ మార్గం ఆలోచించారు. మానవ జన్యు క్రమం మొత్తాన్నీ అత్యాధునిక 5డి మెమరీ క్రిస్టల్లో నిక్షిప్తం చేసి పెట్టారు. దాని సాయంతో మనిషిని తిరిగి సృష్టించవచ్చన్నమాట. సౌతాంప్టన్ వర్సిటీ ఆప్టోఎల్రక్టానిక్స్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఈ క్రిస్టల్‌ను అభివృద్ధి చేశారు. వందల కోట్ల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా దీన్ని తీర్చిదిద్దా రు. చూసేందుకు చిన్నగా ఉన్నా ఇందులో ఏకంగా 360 టెరాబైట్స్ సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చట! గడ్డకట్టించే చలి మొదలుకుని కాస్మిక్ రేడియేషన్, వెయ్యి డిగ్రీ సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రత దాకా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఈ క్రిస్టల్ అత్యంత మన్నికైన డిజిటల్ స్టోరేజ్ మెటీరియల్‌గా 2014లోనే గిన్నిస్ రికార్డులకెక్కింది. అంతరించిపోయే జాబితాలో చేరిన జంతు, వృక్ష జాతుల జన్యుక్రమాన్ని భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు కూడా ఈ క్రిస్టల్స్ ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 5డి మెమరీ ఎందుకంటే... అత్యంత వేగవంతమైన లేజర్ల సాయంతో 5డి పద్ధతిలో మానవ జన్యు డేటాను క్రిస్టల్లో భద్రపరిచారు. ‘‘తద్వారా సమాచారం పొడవు, ఎత్తు, వెడల్పుతో పాటు స్థితి, దిగి్వన్యాసం (ఓరియంటేషన్) అనే ఐదు విభిన్న డైమెన్షన్లలో క్రిస్టల్‌లోని సూక్ష్మనిర్మాణాల్లో నిక్షిప్తమై ఉంటుంది. తద్వారా అందులోని జన్యుక్రమాన్ని సుదూర భవిష్యత్తులో కూడా వెలికితీసి పునఃసృష్టి చేసేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలుండేలా జాగ్రత్త పడ్డాం’’ అని పరిశోధన సారథి ప్రొఫెసర్ పీటర్ కజాన్స్కీ అన్నారు. అయితే కోట్లాది ఏళ్ల తర్వాత ఈ జన్యుక్రమం ఎవరి చేతికి చిక్కుతుందన్నది ప్రస్తుతానికి అనూహ్యమే. కనుక క్రిస్టల్‌లోని సమాచారమంతా వారికి సులువుగా చిక్కేందుకు వీలుగా అందులో ఒక విజువల్ కీని కూడా ఏర్పాటు చేశారు. క్రిస్టల్లో ఉన్న డేటా స్వరూపం, దాన్నెలా వాడుకోవాలి వంటివన్నీ ఈ కీ ద్వారా సులువుగా అర్థమైపోతాయని కజాన్స్కీ చెప్పుకొచ్చారు. ఈ క్రిస్టల్‌ను ఆ్రస్టియాలో ‘మెమరీ ఆఫ్ మ్యాన్‌కైండ్ ఆరై్కవ్’ టైమ్ క్యాప్సూల్‌లో భద్రపరిచి ఉంచారు. ఇది నిజంగా అద్భుతమేనంటూ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌లో డీఎన్ఏ స్టోరేజ్ విభాగాధిపతి థామస్ హెయ్నిస్ ప్రశంసించారు. అయితే, ‘‘అంతా బాగానే ఉంది. కానీ మానవాళే అంతరించిపోతే ఈ క్రిస్టల్‌ను వాడేదెవరు? అందులోని జన్యుక్రమం సాయంతో మనిíÙని మళ్లీ సృష్టించేదెవరు?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు సంధించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘గుండె’ను వీడని గమనం ‘కంటి’ని వదలని జ్ఞాపకం
ఓ పాత సినిమా.. కంటిచూపు దెబ్బతిన్న ఒక యువకుడికి, అంతక్రితమే మరణించిన మరో వ్యక్తి కళ్లను అమర్చుతారు.. ఆపరేషన్ సక్సెస్.. యువకుడికి చూపు బ్రహ్మాండంగా వచ్చేస్తుంది.. కానీ తరచూ ఎవరో వచ్చి తనను కత్తితో పొడుస్తున్నట్టుగా కళ్ల ముందు ఏదో దృశ్యం తారాడుతూ ఉంటుంది.. నిజానికి ఆ కళ్లకు సంబంధించిన వ్యక్తి చనిపోవడానికి కారణమైన ఘటన అది.ఇదంతా జస్ట్ సినిమాటిక్ ఫిక్షన్, అవయవాల్లో అలా జ్ఞాపకాలేవీ నిక్షిప్తమయ్యే అవకాశమే లేదన్నది ఇటీవలి వరకు ఉన్న భావన. కానీ ఎవరి అవయవాలనైనా మరొకరికి అమర్చినప్పుడు.. వారి లక్షణాలు, అలవాట్లు కూడా వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధన చేశారు.సెల్యులార్ మెమొరీతోనే ఇదంతా! శరీరంలో అన్ని కణాలకు కొంత జ్ఞాపకశక్తి ఉంటుందన్న ‘సెల్యులార్ మెమొరీ’ సిద్ధాంతాన్ని కొలరాడో వర్సిటీ శాస్త్రవేత్తలు తెరపైకి తెస్తున్నారు. ప్రతి వ్యక్తికి సంబంధించి కిడ్నీలు, గుండె, కళ్లు... వంటి వాటిలో.. వారి శారీరక, మానసిక లక్షణాల జ్ఞాపకాలు ఉంటాయని చెప్తున్నారు. వేరేవారికి ఈ అవయవాలు అమర్చినప్పుడు వారిని ఈ ‘సెల్యులార్ మెమొరీ’ ప్రభావితం చేస్తుందని.. అందుకే వారిలో కొత్త లక్షణాలు, అలవాట్లు కనిపిస్తాయని అంటున్నారు. మన కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకుంటే కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వచ్చినట్టుగా.. దీనిని పోల్చుకోవచ్చని చెప్తున్నారు.అవయవ మార్పిడికి ముందు, తర్వాత..శాస్త్రవేత్తలు యూనివర్సిటీ పరిధిలోని ఆస్పత్రిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న 47 మందిని స్టడీకి ఎంచుకున్నారు. ఇందులో కిడ్నీ, లివర్ నుంచి గుండె మార్పిడి వరకు చేయించుకున్నవారు ఉన్నారు. వారిలో అవయవ మార్పిడికి ముందు, తర్వాత ఉన్న అలవాట్లు, లక్షణాలను నమోదు చేశారు. అవయవ మార్పిడి తర్వాత ఎదుర్కొన్న అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నో చిత్రమైన అంశాలు వెల్లడయ్యాయి.డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్‌ను నేరస్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేశారు. అతడి గుండెను ఓ యువకుడికి అమర్చారు. అవయవ మార్పిడి తర్వాత తరచూ తనను ఎవరో దగ్గరి నుంచి కాల్చేస్తున్నట్టుగా కలలు వస్తున్నాయని.. బుల్లెట్ తాకినట్టుగా నుదుటిపై తీవ్రంగా నొప్పికూడా వస్తోందని ఆ యువకుడు డాక్టర్లకు చెప్పాడు.ఓ మూడేళ్ల పిల్లాడికి పవర్ రేంజర్స్ బొమ్మలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాటితోనే ఆడుకునేవాడు. కానీ అతడికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశాక.. ఒక్కసారిగా ఆ బొమ్మలను దూరం పడేయడం మొదలుపెట్టాడు. చిత్రమేంటంటే.. అతడికి అమర్చిన గుండె ఓ ఏడాదిన్నర చిన్నారిది. పవర్ రేంజర్స్ బొమ్మలను అందుకోవడానికి ప్రయత్నిస్తూ.. కిటికీ నుంచి పడిపోయి చనిపోయాడు.ఇవే కాదు. ఆపరేషన్‌కు ముందు వరకు ఎంతో ప్రశాంతంగా ఉండే వ్యక్తి.. తర్వాత తీవ్రంగా కోపతాపాలకు, తీవ్ర భావోద్వేగాలకు గురవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మరోవైపు ఎప్పుడూ మూడీగా ఉండే కొందరు.. ఆపరేషన్ తర్వాత యాక్టివ్‌గా మారడం, అందరితో చనువుగా ఉండటాన్ని గుర్తించారు. ఒక్కసారిగా కొత్త అలవాట్లు రావడం, అప్పటివరకు ఇష్టంగా చేసిన పనులు అసలే నచ్చకపోవడం, ఆధ్యాత్మిక నమ్మకాల్లోనూ మార్పులు రావడం వంటివీ గమనించారు. -
గంజాయి గురించి పరిశోధనలో షాకింగ్ విషయాలు?!
మన దేశంలో గంజాయి తాగడం నిషిద్ధం. అంతేగాదు గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా చేస్తే జైలుకే పరిమితమవ్వుతారు. అలాంటి గంజాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరిచి, ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సహయపడుతుందని పరిశోధకులు గుర్తించారు. అసలు ఈ గంజాయి ఎలా మెమరీ నష్టాన్ని, ఒత్తిడిని నివారిస్తుందో సవివరంగా చూద్దామా..మత్తు కోసం గంజాయి లేదా గంజాయి మొక్కలోని ఎండిన ఆకులు పొగబెట్టడం లేదా నమలడం వంటివి చేస్తుంటారు. అందువల్లే దీన్ని మత్తు పదార్థంగా నిర్ణయించి ప్రభుత్వాలు నిషేధించడం జరిగింది. అయితే ఈ గంజాయి మెక్కలోని సైకోయాక్టివ్ పదార్థాల్లో కన్నాబినాయిడ్స్ ఉన్నాయి. వీటి నుంచి సీబీజీ, కన్నాబిడియోల్(సీబీడీ) ఉత్పన్నం అవుతాయట. అందువల్లే కొన్ని దేశాల్లో దీన్ని కీమోథెరపీ కారణంగా వచ్చే దీర్ఘకాలిక నొప్పి లేదా వికారం చికిత్సలో ఈ గంజాయిని వినియోగించడం జరుగుతుందట. ఇప్పుడు ఈ విషయమై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది కూడా. అంతేగాదు అధికా ఆదాయ దేశాలతో సహా అనేక దేశాల్లో ఈ గంజాయి ఔషధ వియోగం చట్టబద్ధమైనదే. దీనిపై పరిశోధనలో చేసిన వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ గంజాయిలోని సీబీజీని నిరంభ్యంతరంగా వినియోగించవచ్చని తేల్చి చెప్పారు. అందుకోసం పరిశోధకులు రెండు వర్చువల్ సమావేశాల్లో సుమారు 34 మంది వ్యక్తులపై అధ్యయనం చేశారు. వారందరికి దాదాపు 20 మిల్లీగ్రాముల సీబీజీ లేదా ప్లేసీబోను ఇచ్చారు. ఈ మత్తు ప్రభావంతో వారిలోని ఆందోళన, ఒత్తిడి మానసిక స్థితి ప్రాథమిక స్థాయిలను గుర్తించగా..చాలా ప్రభావవంతంగా వారిలో ఆందోళ, ఒత్తడి స్థాయిలు తగ్గాయి కూడా. అలాగే జ్ఞాపకశక్తిలో గణనీయమైన మెరుగుదల కనిపించిదని అన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో తక్కువ మత్తు, పొడి నోరు, నిద్రపోవడం, పెరిగిన ఆకలి వంటి మార్పులు కనిపించాయని చెప్పారు. ఈ గంజాయిలోని సీబీజీ ఓ అద్భుత ఔషధం అని చెప్పారు పరిశోధకులు. ఇక్కడ దీన్ని ఉపయోగించే పరిమితిని అర్థం చేసుకుంటేనే సత్ఫలితాలు పొందగలమని అన్నారు. దీనిపై కొనసాగుతున్న అధ్యయనాలు భవిష్యత్తులో సీబీజీ ప్రయోజనాలు, భద్రతపై సమగ్ర అవగాహన అందిస్తాయని నమ్మకంగా చెప్పారు శాస్త్రవేత్తలు. టైమ్స్‌నౌ న్యూస్ ప్రకారం ఈ అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.(చదవండి: ఈ మందులు ఉదయం కాఫీతో తీసుకుంటున్నారా..?) -
నల్లరాతి తాజ్‌మహల్ ఎక్కడుంది? దేనికి చిహ్నం?
ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా పేరుగాంచింది. యమునా నది ఒడ్డున ఉన్న ఈ అందమైన పాలరాతి భవనం ప్రేమలో మునిగితేలిన చక్రవర్తి కథను చెబుతుంది. షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడు. అయితే మన దేశంలో నల్లరాతి తాజ్ మహల్ కూడా ఉందనే సంగతి చాలామందికి తెలియదు. ఇంతకీ ఇదెక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏమిటి? ఇది ఏ భావోద్వేగానికి గుర్తు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నల్లరాతి తాజ్‌మహల్ మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్లో ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ నల్లరాతి తాజ్ మహల్‌ను చూశాకే.. ఆగ్రాలో పాలరాతి తాజ్ మహల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు. బుర్హాన్‌పూర్‌ను చాలా కాలం పాటు మొఘలులు పాలించారు. అందుకే ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్‌తో పాటు అనేక చారిత్రక కట్టడాలు కనిపిస్తాయి. బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున బ్లాక్ తాజ్ మహల్ నిర్మితమయ్యింది. ఇది ఆగ్రాలోని తాజ్ మహల్ కంటే కొంచెం చిన్నది. ఇది అబ్దుల్ రహీం ఖాన్ఖానా పెద్ద కుమారుడు షానవాజ్ ఖాన్ సమాధి. షానవాజ్ ఖాన్ కేవలం 44 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. అతనిని బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున ఖననం చేశారు. అతను మరణించిన కొంతకాలానికి అతని భార్య కూడా మృతి చెందింది. షానవాజ్ ఖాన్ సమాధి పక్కనే ఆమెను కూడా ఖననం చేశారు. వీరిదిద్దరి మరణం తరువాత మొఘల్ చక్రవర్తి జహంగీర్ 1622- 1623 మధ్య కాలంలో ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్‌ను నిర్మించాడు. ఈ నల్లరాతి తాజ్ మహల్ షానవాజ్ ఖాన్, అతని భార్య మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. నల్లరాళ్లతో నిర్మించిన ఈ తాజ్‌మహల్‌ను చూసేందుకు మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఈ బ్లాక్ తాజ్‌మహల్‌ను పురావస్తు శాఖ పర్యవేక్షిస్తోంది. దీని మినార్లు కూడా తాజ్ మహల్ మాదిరిగానే ఉంటాయి. -
మీకు తెలుసా? మైండ్లోనూ డిక్షనరీ ఉంటుదట!
డిక్షనరీ అనేది బుక్‌షెల్ఫ్‌లోనే కాదు మనలోనూ ఉంటుంది. దీన్ని మెంటల్ డిక్షనరీ అంటారు. ఫిజికల్ డిక్షనరీలాగే ఈ మెంటల్ డిక్షనరీలోనూ రకరకాల పదాలు, వాటికి సంబంధించిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మెంటల్ డిక్షనరీ విషయంలో ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య స్వల్ప తేడాలు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల కొందరి మెంటల్ డిక్షనరీలో పరిమితమైన పదసంపద మాత్రమే ఉండొచ్చు. కొందరి విషయంలో మాత్రం విద్య, కళలు, జీవితానుభవాలు...మొదలైన వాటి వల్ల పదసంపద ఎక్కువగా ఉంటుంది. 20 సంవత్సరాల అమెరికన్ ఇంగ్లీష్ స్పీకర్‌కు 40,000 పదాల వరకు తెలిసి ఉంటాయని, 60 ఏళ్ల వయసులో ఆ పదాల సంఖ్య 48,000లకు చేరుతుందని, కొందరి విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. కొన్ని సందర్భాలలో మనం ఉపయోగించాల్సిన పదం గురించి తెలిసినా గుర్తు రాకపోవచ్చు. ఈ పరిస్థితిని టిప్–ఆఫ్–ది–టంగ్ ఫినామినన్ అంటారు, వయసు పెరుగుతున్న కొద్దీ ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంది. (చదవండి: చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే.. మైమరచిపోవాల్సిందే) -
నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరచుకునేలా..
మనుషుల వికృత ప్రవర్తనలకు తగ్గట్టుగానే వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇదేం వ్యాధిరా బాబు అని ముక్కుమీద వేలేసుకునేలా ఉన్నాయి వాటి పేర్లు. కోపంతో మరో మనిషిని చంపడం ఒక తరహ అయితే..అదే చికాకు కోపంతో తనను తాను చంపేసుకునేలా ప్రేరేపిస్తుంది ఈ వ్యాధి. ఆ తర్వాత ఆ వ్యక్తికి తాను చేసిందేంది గుర్తుండదట. తనపై ఎవరో దాడి చేసినట్లు లేదా ప్రమాదం జరిగినట్లు భావిస్తారట. వాస్తవం వివరించిన వారికి అదేమీ గుర్తుండదట. చూడ్డానికి టీవీల్లో చూసే చేతబడి మాదిరిగా లేదా దెయ్యంలాంటి వ్యాధిలా ఉంటుంది. ఈ వింత వ్యాధి బారినపడ్డ మహిళ స్థితి గురించే ఈ కథనం!. బ్రిటన్‌కి చెందని 41 ఏళ్ల షార్లెట్ హెవిట్ ఉన్నటుండి ఆస్పత్రి పాలయ్యింది. ఆమె భర్త హుటాహుటినా ఆస్పత్రికి తీసుకురావడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. ఆ టైంలో ఆమె సుమారు ఒక వారం వరకు పూర్తి కోమాలో ఉంది. పైగా తాను ఎందుకు ఆస్పత్రిలో ఉన్నానని, ఏం జరిగిందని ఎదురు ప్రశ్నించడంతో ఆమె భర్తతో సహా వైద్యులు సైతం కంగుతిన్నారు. దీంతో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి ఆమెక హంటిగ్టన్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేల్చారు. ఈ వ్యాధి కారణంగా ఉన్నట్లుండి ఆమె ఒక విధమైన ఉద్వేగానికిలోనై తనను తాను హాని చేసుకునులా వింతగా ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇది మెదడులోని భాగాలను నెమ్మది నెమ్మదిగా పనిచేయకుండా నిలిపేసి మానిసికంగా దెబ్బతినేలా చేస్తుంది. ఒక విధంగా సైకోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ మేరకు ఆమె భర్త మాట్లాడుతూ..తన భార్య షార్లెట్ ఆరోజు సడెన్‌గా గదిలోపలకి వచ్చి గట్టిగా అరుస్తూ.. కత్తితో తనను తాను గట్టిగా పొడుచుకుందని చెప్పుకొచ్చాడు. ఈ హఠాత్పరిణామానికి తనకేం పాలిపోలేదని వాపోయాడు. కానీ ఇప్పుడేమో ఆమె తనకేమైందని ప్రశ్నిస్తుంటే చాలా గందరగోళంగా ఉందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఈ అసంఘటిత చర్య కారణంగా వైద్యులు ఆమెకు మూడుసార్లు సర్జరీ చేశారు. ఆమె పొట్టలోని ప్రేగుల్లో పావు వంతు దాక డ్యామేజ్ కాకుండా కాపాడారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈ హంటిగ్టన్స్ వ్యాధి అనేది వారసత్వంగా వచ్చే రుగ్మత. దీని వలన మెదడులోని కొన్ని భాగాల్లో నరాలు క్రమక్రమంగా విఛ్చిన్నమై పోతాయి. ఫలితంగా మెదడులోని ఇతర ప్రాంతాల్లోని కదలికలను నియంత్రించే అవయవాల పనితీరు మార్పు వచ్చి.. జ్ఞాపక శక్తిని కోల్పోవడం, నిరాశ నిస్ప్రుహలకు లోనై వికృతంగా మారిపోవడం జరుగుతుంది. ఇవే ఈ వ్యాధి ప్రదాన లక్షణాలు. ఈ వ్యాధి బారినపడ్డవారి శరీరంలో అసంకల్పిత కుదుపు లేదా చంచలమైన కదలికలు సడెన్‌గా వస్తాయి. షార్లెట్ తాను ఇలా 2014లో 23 ఏళ్ల వయసులో ఇలాంటి స్థితిలోనే ఉన్నాని చెప్పుకొచ్చింది. అయినప్పటకీ తాను జీవితాన్ని కొనసాగించగలిగానని, మళ్లీ ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నానని వాపోయింది. ఈ వ్యాధి కారణంగా కుక్కును పార్క్‌లో వదిలేయడం, గ్యాస్ ఆఫ్ చేయడం మరచిపోవడం తదితర ఎన్నో సంఘటనలు జరిగాయని, ఇవే తనను నిరాశలోకి నెట్టేసి తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేంపించాయని వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధికి ఎలాంటి నివారణ లేదు. కానీ రోగులు మానసిక ఆరోగ్యానికి సత్వరమే చికిత్స తీసుకుంటే నయం అవుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధి వస్తే తొలుత రోజు వారీ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. కానీ క్రమేణా సాధారణ పనులను సైతం సొంతంగా చేసుకోలేని ధీనస్థితికి వచ్చేస్తారు. ఈ వ్యాధికి గల కారణం.. ఈ వ్యాధిగ్రస్తుల డీఎన్ఏ ఈ హంటింగ్టిన్స్ ప్రోటీన్‌ని తయారు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని నిల్వ చేయదు. ఫలితంగా అవి అసాధారణ ఆకారంలో పెరిగా మెదడులోని న్యూరాన్లను నాశనం చేస్తాయి. దీంతో శరీర కదలికలను నియంత్రించే మెదడులోని బేసల్ గాంగ్లియాలో నరాలు నాశనం అవ్వడం జరుగుతుంది. ఫలితంగా ఆలోచన, నిర్ణంయ తీసుకోవడం, జ్ఞాపకశక్తి తదితర పనులు నిర్వహించే మెదడు పనితీరుని ప్రభావితం చేసి సడెన్గామనిషిని ఓ ఉన్మాదిలా మారుస్తుంది. (చదవండి: రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్ఐవీ ఫిజీషియన్ ఆయన!) -
భార్యాపిల్లలపై ప్రేమ.. రూ. 90 కోట్ల అదృష్టం తెచ్చిపెట్టింది!
అతను ఉద్యోగ రీత్యా భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. దీంతో తరచూ అతనికి భార్యాపిల్లలు గుర్తుకురాసాగారు. ఈ నేపధ్యంలో అతను చేసిన ఒకపని అతనిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. అదికూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా 90 కోట్లకు యజమానిగా మారిపోయాడు. ఈ విషయాన్ని అతను కుటుంబ సభ్యులు అతనికి తెలియజేసినప్పుడు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఉదంతం చైనాలోని హాంగ్ఝూలో చోటుచేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం 30 ఏళ్ల ఈ వ్యక్తి ఇంటికి దూరంగా ఉంటూ జాబ్ చేస్తుంటాడు. అతను ఇంటికి రావడం కూడా తక్కువే. దీంతో అతనికి భార్యాపిల్లలు తరచూ గుర్తుకొస్తుంటారు. ఈ నేపధ్యంలో అతను తన భార్యాపిల్లల డేట్ ఆఫ్ బర్త్ నంబర్లతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసేవాడు. ఈ వ్యవహారం చాలా రోజులుగా నడుస్తుండేది. అయితే ఇప్పుడు అతనికి అదృష్టం తన్నుకుంటూ వచ్చింది. ఆయన కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ ఇప్పుడు కోట్లు కొల్లగొట్టింది. ఆ అదృష్టవంతుని పేరు వెల్లడికానప్పటికీ హాంగ్ఝూకు చెందిన ఆ వ్యక్తి తన భార్యాపిల్లల డేట్ ఆఫ్ బర్త్ నంబరుతో కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ సిరీస్.. 77 మిలియన్ల యువాన్లు(రూ. 90 కోట్లకు పైగా మొత్తం) గెలుచుకుంది. ఆ వ్యక్తి ఈ నెల మొదట్లో రూ. 300 వెచ్చించి 15 లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు. 11న లాటరీ ఫలితాలు వెలువడగా, అతను 77.1 మిలియన్ల యువాన్లు గెలుచుకున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన పోస్టు చూసిన నెటిజన్లు అదృష్టం ఎప్ప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరన్నారు. ఇది కూడా చదవండి: ఆ నీలి కళ్ల చాయ్‌వాలా.. మోడలింగ్ తర్వాత లండన్‌లో మొదలెడుతున్న పని ఇదే.. -
అమ్మ కోసం తాజ్‌మహల్.. ఫిదా అవుతున్న జనం!
తమిళనాడుకు చెందిన ఒక కోటీశ్వరుడు తన తల్లికి గుర్తుగా మరో తాజ్‌మహల్ నిర్మించారు. ఇందుకోసం లెక్కలేనంత సొమ్ము ఖర్చు చేశారు. అమ్మే తన జీవిత సర్వస్వం అని అతను చెప్పుకొచ్చాడు. అమ్మ చనిపోయినప్పుడు ఎంతో కుమిలిపోయానని అన్నాడు. అమ్మ జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆయన పాల రాతితో మరో తాజ్‌మహల్ నిర్మించారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌పై తనకున్న ప్రేమకు ప్రతీకగా తాజ్‌మహల్ నిర్మించారు. ఇప్పుడు ఒక కుమారుడు తన తల్లికి గుర్తుగా కోట్లాది రూపాయలు వెచ్చించి తాజ్‌మహల్ ప్రతిరూపాన్ని నిర్మించారు. ఇది తమిళనాడులోని తిరువరూర్ జిల్లాకు చెందిన ఉదంతం. ఈ ప్రాంతానికి చెందిన అమ్రుద్దీన్ షేక్ దావూద్ తన తల్లిని గుర్తుచేసుకుంటూ తాజ్‌మహల్ తరహాలో ఒక అద్భుత నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. 2020లో అమ్రుద్దీన్ తల్లి జెలానీ బీవీ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అమ్రుద్దీన్ ఎంతగానో కుంగిపోయారు. తల్లి జ్ఞాపకాలు మరువలేక.. అమ్రుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం అతని తల్లి అతనికి శక్తి, ప్రేమలకు ప్రతీకలుగా నిలిచారు. 1989లో రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన తరువాత ఆమె తన ఐదుగురు పిల్లలను పెంచిపోషించారు. ఆ సమయంలో ఆమె వయసు 30 ఏళ్లు మాత్రమే. భర్తను కోల్పోయాక ఆమె మరో వివాహం చేసుకోలేదు. పిల్లలను పెంచి పోషించేందుకు ఎంతో కష్టపడ్డారు. తండ్రిలేడనే లోటును లేకుండా పిల్లలను చూసుకున్నారు. 2020లో అమృద్దీన్ తన తల్లి మరణానంతరం అతను తల్లి జ్ఞాపకాలను మరచిపోలేకపోయారు. ఆమె తమతోనే ఉందని భావించారు. తిరువూరులో వారికి గల భూమిలో తల్లిని ఖననం చేశారు. చదవండి: చిరుతతో పోరాడి.. రైతు ప్రాణాలు కాపాడిన ఆవు డ్రీమ్ బిల్డర్స్ సహాయంతో.. తరువాత డ్రీమ్ బిల్డర్స్‌ను సంప్రదించి, తాజ్‌మహల్ ప్రతిరూపాన్ని అక్కడ నిర్మించారు. ఒక ఎకరాభూమిలో 8 వేల చదరపు అడుగులలో నిర్మితమైన ఈ తాజ్‌మహల్ నిర్మాణం కోసం 200 మంది పనిచేశారు. ఈ నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాగా అతని తల్లి 5 కోట్ల రూపాయలను పొదుపు చేశారు. ఆ మొత్తంతో ఇంటిలోని వారి అనుమతి తీసుకుని, అమ్రుద్దీన్ తాజ్ మహల్ నిర్మించారు. ఈ తాజ్‌మహల్‌ను చూసినవారంతా అద్భుతంగా ఉందని అంటున్నారు. కాగా ఈ భవనాన్ని చిన్నారులకు విద్యనందించేందుకు, ముస్లింలు నమాజ్ పఠించేందుకు వినియోగించనున్నామని అమ్రుద్దీన్ తెలిపారు. ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ప్రారంభం -
60+ ‘సూపర్’ బ్రెయిన్.. మెదడుకు వృద్ధాప్యం లేదట!
సాక్షి, అమరావతి: వృద్ధాప్యంలో వెంటాడే ఆరోగ్య సమస్యలతో పాటు మెదడు పనితీరు మందగించి జ్ఞాపక శక్తి క్షీణిస్తుందన్న వాదనల్లో నిజం లేదని అమెరికాలోని జార్జి వాషింగ్టన్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి పెద్దల మెదడు ఎంతో ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుందని, 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకునే నిర్ణయాలు చాలా సృజనాత్మకంగా ఉంటాయంటున్నారు. వీరి మెదడులో కుడి, ఎడమ హెమిస్పియర్స్ చాలా చురుగ్గా ఉండటంతో సృజనాత్మక ఆలోచనలు విస్తరిçస్తున్నట్టు గుర్తించారు. చక్కటి జీవనశైలి, మానసికంగా చురుగ్గా ఉంటే మేధో సామర్థ్యాలు వయసుతో పాటు పెరుగుతాయే కానీ తగ్గవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడిన తర్వాత సృజనాత్మక కార్యకలాపాలను ప్రారంభించిన అనేక మందిపై ప్రయోగాలు నిర్వహించి ఈ ఫలితాలను రూపొందించారు. నియంత్రణలో భావోద్వేగాలు.. చిన్నతనంలో ఏదైనా వస్తువు పాడు చేసినప్పుడు మెదడు విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. యవ్వనంలో అదే పని చేసినప్పుడు కొంత కంగారు పడినా తక్కువ సమయంలోనే స్థిమితపడతారు. 60 ఏళ్లు దాటాక ఎలాంటి భావోద్వేగాలకైనా ఒకేలా స్థిరంగా స్పందిస్తారు. ఇక 70 ఏళ్ల వయసులో మేధో కార్యకలాపాలు గరిష్ట స్థాయికి చేరినట్లు నిర్ధారించారు. ముదిమి వయసులో మెదడులోని మైలిన్ (న్యూరాన్ల మధ్య సంకేతాలను వేగంగా పంపుతుంది) పరిమాణం పెరుగుతుంది. దీంతో సగటు యువకులతో పోలిస్తే 60 ఏళ్లు దాటిన వారిలో మేధో సామర్థ్యాలు 300 శాతం పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. తొట్రుపాటు లేకుండా.. 60 ఏళ్ల వయసు నుంచి వృద్ధులు నిర్ణయాలు తీసుకునేందుకు మెదడులోని రెండు హెమిస్పియర్స్ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ‘80–90 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి మెదడు తక్కువ శక్తిని వినియోగించుకుని గరిష్ట స్థాయిలో ఆలోచిస్తుంది. అనవసరమైన విషయాలను వదిలేసి అవసరమైన వాటికే స్పందిస్తుంది’అని మాంట్రియల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మోంచి తెలిపారు. అధ్యయనంలో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో విజయం సాధించేందుకు యువకులు చాలా గందరగోళానికి గురవగా 60 ఏళ్లు పైబడినవారు ఎలాంటి తొట్రుపాటు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. చికాగో నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలోని ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు వీరిని ‘సూపర్ ఏజెర్స్గా’అభివర్ణిస్తున్నారు. 80ల్లో ఉన్నవారు మేధోపరంగా చురుగ్గా ఉండేందుకు పెయింటింగ్, డ్యాన్స్, సంగీతం నేర్చుకోవడంతో పాటు స్నేహితులను కలుస్తూ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించు కోవడంలో ముందున్నారని, వారు అద్భుతాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
గుంజీలు శిక్ష కాదు.. సూపర్ బ్రెయిన్ యోగా! ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: గుంజీలు.. ఈ తరం పిల్లలకు పెద్దగా తెలియనప్పటికీ నిన్నటితరం వారికి మాత్రం ఈ పేరు చెప్పగానే బడిలో ఉపాధ్యాయులు విధించిన ‘శిక్ష’ గుర్తొస్తుంది. అయితే నాటి ‘దండన’ వెనకున్న శాస్త్రీయతను చాలా మంది అపార్థం చేసుకోవడంతో ఇదో పెద్ద పనిష్మెంట్‌గాగా ముద్రపడినా పాశ్చాత్య దేశాలు మాత్రం దీని అంతరార్థాన్ని, విద్యార్థులకు కలిగే ఉపయోగాలను గుర్తించాయి. దీన్ని ‘సూపర్ బ్రెయిన్ యోగా’గా పిలుస్తూ నిత్యం గుంజీలు తీయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు ఇది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పెంచే విధానమంటూ ఆధునిక పరిశోధకులు సైతం రుజువు చేశారు. జ్ఞాపకశక్తి.. ఏకాగ్రత పెరుగుతాయి.. చదువుపై శ్రద్ధ, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, సమస్య పరిష్కారం, అభ్యసన మెరుగవ్వడం గుంజీల వల్లే సాధ్యమని నిరూపించారు. కరోనా తర్వాత విద్యార్థుల్లో పరీక్షలంటే భయం, ఏకాగ్రత కోల్పోవడం, బోధన సమయంలో ధ్యాస లేకపోవడం వంటివి వేధించే సమస్యలు. గుంజీల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు పరిశోధకులు. గతంలోనే శాస్త్రీయంగా నిర్ధారణ... ఆలోచన శక్తికి కేంద్ర బిందువు మెదడే. చెవి కొనలు మెదడుకు రిమోట్ కంట్రోల్లా పనిచేస్తాయి. రెండు చెవి కొనలను పట్టుకొని లాగుతూ గుంజీలు తీయడం వల్ల నాడులు స్పందిస్తూ మెదడుకు సంకేతాలు వెళ్తాయి. గుంజీలు తీసేటప్పుడు తీసుకొనే శ్వాస, ఆక్యుప్రెషర్ క్రియల వల్ల మెదడు కుడి భాగాలు ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా పిట్యూటరీ గ్రంథి శక్తివంతమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పాల్ నోగియర్ గతంలోనే శాస్త్రీయంగా నిరూపించారు. గుంజీల వల్ల మెదడులోని ఆల్ఫా తరంగాలు క్రియాశీలత పెరిగి, భావోద్వేగ స్థిరత్వం, మానసిక స్పష్టత, మెరుగైన సృజనాత్మకతకు దోహదపడుతుందని, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తేల్చారు. పరిశోధనలేం చెప్పాయి? ► కాలిఫోరి్నయో రేడియాలజీ డాక్టర్ జోయ్ పి జోన్స్ పరిశోధన ప్రకారం... మెదడుకు చెందిన ఆక్యుప్రెషర్ బిందువులు చెవి భాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. గుంజీలు తీయడం వల్ల మెదడులోని నాడీ మార్గాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల మెదడు కుడి, ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) ద్వారా నిరూపించారు. ► ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌ కాక్ సూయ్ గుంజిలపై పరిశోధన ద్వారా... జీవం ఉన్న బ్యాటరీగా పిలిచే మెదడు గుంజీల ద్వారా రీచార్జ్ అవుతుందని తేల్చాడు. ► మైసూరు యూనివర్సిటీ, మహారాజ కాలేజీకి చెందిన శాస్త్రవేత్త శ్రీకాంత్, లాన్సీ 2017లో 6–18 ఏళ్ల వయసున్న 1,945 మంది పాఠశాల విద్యార్థులపై మూడు నెలలు గుంజీలపై పరిశోధన చేశారు. దీనివల్ల 86% మంది విద్యార్థుల్లో పరీక్షల భయం పోయిందని, 75.9% మంది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరిగిందని, 70.5% మందిలో ఏకాగ్రత గణనీయంగా పెరిగిందని తేల్చారు. గుంజీలకు గుర్తింపు కోసం తెలంగాణ బిడ్డ పోరుబాట నిజామాబాద్‌కు చెందిన అందె జీవన్‌రావు గుంజీలపై విస్తృత పరిశోధన చేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నప్పట్నుంచీ ‘సూపర్ బ్రెయిన్ యోగా’(గుంజీలు తీయడం)పై అనేక ప్రయోగాలు చేశారు. పదవీవిరమణ పొందినా బ్రెయిన్ ట్రైనర్‌గా దేశవ్యాప్తంగా గుంజీలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 150 విద్యా సంస్థల్లో విద్యార్థులకు గుంజీలు తీయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కేంద్రంలోని ఎన్సీఈఆర్టీ, రాష్ట్రంలోని ఎస్సీఈఆర్టీకి దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థి దశ నుంచి దీన్ని అమలులోకి తేవాలని ఆయన ఉద్యమిస్తున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 2 వరకూ అస్సాంలోని బోడోలాండ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో సూపర్ బ్రెయిన్ యోగాపై పరిశోధన పత్రాన్ని సమరి్పంచేందుకు సిద్ధమయ్యారు. శిక్షగా కాకుండా, విద్యార్థి వికాసానికి తోడ్పడే గుంజీల శాస్త్రీయతను ప్రభుత్వాలు గుర్తించాలని, అప్పటివరకూ అవిశ్రాంతంగా పోరాడతానని ఆయన ‘సాక్షి’ప్రతినిధికి చెప్పారు. చదవండి: బుర్ర బద్దలయ్యేలా పని చేస్తున్నారా? అంతొద్దు.. లాభమేమీ లేదు! -
CV Anand: ఆపాత మధురం.. ‘ఆనంద’ జ్ఞాపకం!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా ఉన్న కేఎస్ రవికి అరుదైన అనుభవం దక్కింది. 1997లో విద్యార్థిగా, 2022లో పోలీసు అధికారిగా సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ నుంచి ‘బహుమతులు’ అందుకున్నారు. ఈ రెండు ఫొటోలను రవి సోమవారం ట్విట్టర్లో పొందుపరిచారు. నిజామాబాద్‌కు చెందిన రవి తండ్రి పరమేశ్వర్ ఆ జిల్లా పోలీసు విభాగంలో ఆడ్మ్ రిజర్వ్ హెడ్–కానిస్టేబుల్‌గా పని చేశారు. 1996లో పదో తరగతి ఉత్తీర్ణుడైన రవి మంచి మార్కులు సాధించారు. 1998 జనవరి 1న ఆ జిల్లా ఎస్పీగా ఉన్న సీవీ ఆనంద్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఇలా అప్పట్లో ఆనంద్ నుంచి రవికి బహుమతి దక్కింది. పోలీసు విభాగంపై మక్కువ పెంచుకున్న రవి 2009లో నగర పోలీసు విభాగంలో సబ్–ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ హోదాలో చార్మినార్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు అదనపు డీజీ హోదాలో సిటీ కొత్వాల్‌గా ఉన్న ఆనంద్ న్యూ ఇయర్ డే నేపథ్యంలో ఆదివారం చార్మినార్ వద్దకు వెళ్లారు. అక్కడ కేక్ కట్ చేసిన కొత్వాల్ స్వయంగా రవికి తినిపించారు. ఇది కూడా తనకు బహుమతే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన ఇన్స్పెక్టర్ రవి రెండు ఫొటోలను ట్వీట్ చేశారు. ఇది పోలీసు విభాగంలో వైరల్‌గా మారింది. (క్లిక్ చేయండి: ఆ రెండు లైన్లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు) -
ఫొటోలు, వీడియోలతో ఫోన్ స్టోరేజ్ నిండిందా?
Full Phone storage Here's create more space: పండుగ టైంలో సరదాగా ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే స్టోరేజ్ సమస్య చాలామందికి ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. ఈ తరుణంలో ఫోన్లో ఫ్రీ స్పేస్ కోసం ఏం చేయొచ్చో తెలుసుకుందాం. ఫోన్ స్పేస్ ఫ్రీ చేయడం అంటే ఉన్న ఫొటోల్ని, వీడియోల్ని డిలీట్ చేయడం అనుకుంటారు చాలామంది. ఇందుకోసం వాటిని సెలక్ట్ చేసుకుంటూ.. టైం తీసుకుంటూ కుస్తీ పడుతుంటారు. కానీ, కింద చెప్పిన పద్ధతుల్లో వెళ్తే.. డివైజ్‌లో స్పేస్ కోసం అంత టైం పట్టదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. చాలామంది వాడే స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లే. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి.. అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ స్టోరేజ్ సెక్షన్లోకి వెళ్తే.. ఏ యాప్ ఎక్కువ రోజుల నుంచి నిరుపయోగంగా ఉందో.. ఏ యాప్‌వల్ల ఎక్కువ స్పేస్ పోతుందో స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా స్పేస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ & గూగుల్ ఫైల్స్ యాప్.. దాదాపు ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటోంది. అది ఓపెన్ చేయగానే అందులో .. ఇమేజెస్(ఫొటోలు), ఆడియో, వీడియోలు ఇతరాలు కనిపిస్తాయి. అక్కడ లార్జ్ ఫైల్స్‌లో అనవసరమైనవి ఎంపిక చేసుకుని డిలీట్ చేయొచ్చు. వాట్సాప్‌లో.. దాదాపు స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లందరి ఫోన్లలో ఉంటున్న యాప్. ఈ యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే డాటాను కొంతమంది క్లియర్ చేసినా.. స్టోరేజ్‌లో అలాగే ఉండిపోతాయని తెలుసా? అందుకే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటిని క్లియర్ చేస్తూ ఉండాలి. సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అండ్ డాటా ఆప్షన్‌ను క్లిక్ చేయగానే ‘మేనేజ్ స్టోరేజ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే ఎంత స్పేస్ అవసరం అనేది చూపిస్తుంది. అంతేకాదు అవసరం అనుకున్న ఫైల్స్‌ను అక్కడి నుంచి కూడా డిలీట్ చేసుకోవచ్చు. అక్కడ 5 ఎంబీ కంటే ఎక్కువ ఫైల్స్కనిపిస్తాయి కాబట్టి సులువుగా క్లియర్ చేసుకోవచ్చు కూడా. క్లౌడ్ సర్వీస్.. ఫొటోల్ని, వీడియోల్ని బ్యాక్అప్ చేసుకోవడం ద్వారా ఫోన్ స్పేస్ ఫ్రీ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా గూగుల్ ఫోటోస్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఫీచర్‌ని ఆన్‌లో పెట్టుకోవడమే. గూగుల్ ఫొటోస్ యాప్‌పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. హైక్వాలిటీ రెజల్యూషన్ ఎంచుకుంటే గూగుల్ ఫొటోస్ అన్లిమిటెడ్ స్టోరేజ్‌ను అందిస్తుంది. గూగుల్ ఫొటోస్‌తో పాటు గూగుల్ డ్రైవ్ లాంటి వాటిలో సేవ్ చేసుకుంటే సరి. ఇవికాగా.. యాప్స్ క్యాచెని తొలగించడం ద్వారా స్టోరేజ్ స్పేస్ వస్తుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే.. డాటానే పోయే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆవెంటనే ఏదైనా యాప్ మీద క్లిక్ చేసి, స్టోరేజ్ ఆపై క్లియర్ క్యాచెను క్లిక్ చేయాలి. డౌన్‌లోడ్స్‌పై లుక్. చాలావరకు మీకు అవసరం లేని ఫైల్స్ ఉంటాయి. అలాంటి వాటిని చూసి తొలగించండి. అలాగే పీడీఎఫ్ ఫైల్స్, హైడ్‌లో దాచిన ఫైల్స్ ఉంటే కూడా డిలీట్ చేయడం ద్వారా స్పేస్ దొరుకుతుంది. -
చిన్నారి అసాధారణ ప్రతిభ.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే
పలమనేరు: పట్టుమని రెండున్నరేళ్లు కూడా లేని చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తితో వేలాది వస్తువుల పేర్లు, జంతువులు, మానవదేహంలోని భాగాలు.. ఇట్టే గుర్తించి వాటి పేర్లను టుక్కున చెబుతూ దేశంలోని ప్రధాన రికార్డుబుక్కుల్లో ఒకటైన ఓఎంజీ(ఓ మై గాడ్ బుక్ ఆఫ్ ఇండియా)లో ఇండియన్ యంగెస్ట్ టాలెంటెడ్ గర్ల్‌గా రికార్డు సృష్టించింది. పలమనేరులో నివాసం ఉండే అమరనాథ్, హిమబిందు కుమార్తె వేద ఇవాంజెల్ అసాధారణ ప్రతిభ చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చదవండి: ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రంపైనే.. చిన్నారి ప్రతిభను చూసి.. 9 నెలల వయసు నుంచే చిన్నారి జ్ఞాపకశక్తిని గుర్తించిన తల్లి హిమబిందు తగు శిక్షణ ఇచ్చింది. గతనెల 13న చిన్నారి టాలెంట్‌కు సంబంధించిన వీడియోలతో ఓఎంజీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వారు లైవ్‌లో పరీక్షించిన జడ్జిలు ఇటీవలే ఇండియన్ యంగెస్ట్ టాలెంటెడ్ గర్ల్‌గా రికార్డులోకి ఎక్కించి వారి అధికారిక వెబ్సైట్లో ఫలితాలను ప్రకటించారు. రెండ్రోజుల క్రితం ముంబై నుంచి వేద ఇవాంజెల్కు కొరియర్లో ఓఎంజీ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ కమ్ సీఈఓ డా.దినేష్ కే గుప్త నుంచి మెడల్, షీల్డ్ అందాయి. చదవండి: నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లక్ష్యం.. తమ చిన్నారి టాలెంట్‌ను చూపి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నట్లు తల్లిదండ్రులు అమరనాథ్, హిమబిందు తెలిపారు. అయితే గిన్నీస్‌బుక్‌లోకి ఎక్కాలంటే అంతకుముందు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ తదితరాల్లో రికార్డులలోకి ఎక్కాల్సి ఉంటుదన్నారు. వాటి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా బాలిక తండ్రి బెంగళూరు సెయింట్‌జాన్స్ ఆస్పత్రి ప్రాజెక్టులో ఫీల్డ్ ఆఫీసర్‌గా, తల్లి గృహిణిగా ఉంటున్నారు. జాతీయస్థాయిలో పలమనేరుకు పేరు తెచ్చిపెట్టిన ఆ చిన్నారిని పట్టణవాసులు అభినందిస్తున్నారు. -
అచ్చం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోలా..
మీకు యాదుంది కదా...ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సీబీఐ ఆఫీసర్ అరుణ్‌ను చంపేస్తరు. ఎవరు చంపారు? ఎందుకు చంపారు....మొదలైన విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు న్యూరోసైంటిస్ట్ సారా (హీరోయిన్) సహాయంతో సీబీఐ ఆఫీసర్ ‘మెమోరీ’ని చిప్ రూపంలో కాంట్రాక్ట్ కిల్లర్ శంకర్ (మన హీరో) పుర్రెలో సెట్ చేస్తారు. క్రిమినల్ శంకర్ కాస్త í సీబీఐ సిన్సియర్ ఆఫీసర్ అరుణ్‌లా ప్రవర్తిస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. అది సినిమా కదా...ఇక నిజజీవితంలోకి వద్దాం. ‘కోతులు కూడా ఇక ముందు వీడియోగేమ్స్ ఆడతాయి’ అని ప్రకటించాడు స్పేస్ ఎక్స్ సీయివో ఎలాన్ మాస్క్. ఆయన స్టార్టప్ కంపెనీ ‘న్యూరోలింక్’ కోతి పుర్రెలో ‘చిప్’ను సెట్ చేయడానికి రెడీ అయింది. ఆతరువాత కోతిగారు మనలాగే వీడియో గేమ్స్ ఆడతారన్నమాట. (ఇది జస్ట్ ప్రారంభమేనట. ఇంకా చాలాచాలా చేస్తారట) ‘కంప్యూటర్ చిప్ కోతిపుర్రెలో ఉన్న ఆనవాలు ఏదీ ఎవరికీ కనిపించదు’ అంటున్నాడు మాస్క్. అదిసరే...కోతి ‘మెమోరీ’ చిప్‌ను మన పుర్రెలో సెట్ చేస్తే ఏందీ పరిస్థితి? నాయనా మాస్కు, మా మీద కాస్త దయచూపు! -
ఆ ‘అద్భుతం’ జరిగి రెండేళ్లు!
న్యూఢిల్లీ: ఒకే ఒక సిక్సర్‌తో హీరో అయిపోయాడు. సూపర్ ఇన్నింగ్స్‌తో దేశం పరువు కాపాడి అందరి మన్ననలు అందుకున్నాడు. ఇది జరిగి నేటికి రెండేళ్లు పూర్తయింది. ఆ హీరో ఎవరో కాదు ‘డీకే’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే దినేశ్ కార్తీక్. దాదాపు 16 ఏళ్ల క్రీడా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ‘డీకే’.. 2018, మార్చి 18న బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 నిదహస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడి సూపర్ హిట్ ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో చివరి బంతికి సిక్స్ బాది జట్టుకు విజయంతో పాటు సిరీస్‌ను అందించడంతో అతడి పేరు మార్మోగిపోయింది. (డీకే విధ్వంసం సాగిందిలా...) భారత్ గెలవాలంటే 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన డీకే వచ్చీరావడంతోనే విజృంభించాడు. రూబెల్ హొస్సేన్ వేసిన 19వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగి 6, 4, 6, 0, 2, 4 పరుగులు సాధించాడు. భారత్ గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు కావాలి. క్రీజులో దినేశ్ కార్తీక్ ఉన్నా టెన్షన్ తారాస్థాయిలో ఉంది. సౌమ్య సర్కార్ వేసిన బంతిని ఎక్స్ట్రా కవర్స్ మీదుగా ఫ్లాట్ షాట్ కొట్టగా అందరూ ఫోరు అనుకున్నారు. కానీ అది బౌండరీ అవతల పడింది. అంతే టీమిండియా ఆనందోత్సాహాల్లో మునిగిపోగా, బంగ్లా ఆటగాళ్లు మైదానంలో కుప్పకూలారు. టి20ల్లో టీమిండియాపై గెలిచే అవకాశాన్ని ‘డీకే’ దూరం చేయడంతో బంగ్లా ఆటగాళ్లు హతాశులయ్యారు. టీమిండియాకు ఘోర అవమానాన్ని తప్పించి పరువు కాపాడిన డీకేను సహచరులతో పాటు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. -
మరిచిపోని ‘రక్తచరిత్ర’
సాక్షి, పరకాల: స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోరుతూ .. భుమి కోసం.. భుక్తి కోసం బానిస బంధాల విముక్తి కోసం పోరాడి ఎందరో ఉద్యమకారుల వీర మరణంతో 1947 సెప్టెంబర్ 2న పోరాటాల గడ్డ పరకాల నేల రక్తసిక్తమైంది. వందలాది మంది మంది క్షతగాత్రులయ్యారు. నెత్తుటి ముద్రల తాలుకు గుర్తులు ఇంకా ఉద్యమకారుల స్మతి పథం నుంచి ఇంకా చెరిగిపోలేదు. మరో జలియన్‌వాలా బాగ్గా తెలంగాణ సాయుధ పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచింది. భారతదేశంలో జరిగిన పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందంటూ పరకాలలో జరిగిన పోరాటం చరిత్రకెక్కింది. అమరవీరుల స్మారకార్థం.. 1947 సెప్టెంబర్ 2న జరిగిన మరో జలియన్‌వాలాబాగ్ ఘటనను కళ్లకు కట్టినట్లు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్టు తరఫున వందలాది విగ్రహాలతో పరకాల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో రెండేళ్లుగా శ్రమించి 2003 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రోజున నిర్మాణం చేసిన అమరధామాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు ప్రస్తుతం పరకాల పట్టణంలో ఎలాంటి ఉద్యమ కార్యక్రమం జరిగిన ఇక్కడి నుంచి ప్రారంభం కావడం గొప్ప విశేషం. -
బ్రెయిన్ డైట్
మెదడుకు మనం చెబుతామా? మనకు మెదడు చెబుతుందా? ఇది పెద్ద పజిల్! మనం ఏమి తినాలో, ఏవి రుచిగా ఉంటాయో, ఏది హానికరమో, ఏది శ్రేష్ఠమో మనకు చెప్పేది బ్రెయినే! అయితే పరీక్షల టైమ్‌లో పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి వారు ఏమి తినాలో మెదడుకు ఎక్కించేదే ఈ కథనం. పిల్లల పరీక్షల సీజన్ ఇది. చదివిందంతా గుర్తుపెట్టుకోవాలని అటు పిల్లలకూ ఉంటుంది. ఇటు తల్లిదండ్రులదీ అదే కోరిక. ఎగ్జామ్స్‌లో వాళ్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలని కూడా అటు పిల్లలూ, ఇటు పేరెంట్స్ కోరుకుంటారు. చదివిందీ, విన్నదీ, చూసింది గుర్తుపెట్టుకోవలసిన విజ్ఞానానికి భాండాగారమే మెదడు. కేవలం అలా చదివేసి మెదడులో నిక్షిప్తం చేసుకుంటే చాలదు... అలా దాచుకున్నది కాస్తా అవసరమైనప్పుడు టక్కున స్ఫురించాలి. స్ఫురించింది పూర్తిగా వరుసగా గుర్తుకురావాలి. అప్పుడే గుర్తుకొచ్చిన ఆ విషయాలను పిల్లలు పరీక్ష పేపర్ మీద రాయగలుగుతారు. చురుగ్గా ఉన్న మెదడే ఇలా విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకోవడం... అలా చేసుకున్నదాన్ని అవసరమైనప్పుడు బయటకు తీయడం చేస్తుంది. మరి మన పిల్లల మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉండటానికి, దీర్ఘకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి వారు తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో మరో మాటగా చెప్పాలంటే పేరెంట్స్ వారికి పెట్టాల్సిన ఫుడ్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. ముందుగా మెదడు గురించి సంక్షిప్తంగా... మన శరీరం బరువులో మెదడు బరువు కేవలం 2 శాతం. కానీ ఒంటికి అందే ఆక్సిజన్‌లో దానికి 20 శాతం కావాలి. శరీరం వినియోగించే శక్తిలో 20 శాతం దానికే కావాలి. దాదాపు 1.3 కిలోల నుంచి 1.4 కిలోల బరువుండే మెదడులో 85 శాతం నీళ్లే. పిల్లలు మొదలుకొని మన వరకూ అందరమూ విజ్ఞానాన్నంతా మెదడు కణాల్లోనే నిక్షిప్తం చేసుకుంటాం. మనం చదివిందంతా బాగా గుర్తుండిపోవాలంటే మాటిమాటికీ మననం చేసుకుంటాం. అప్పుడది తాత్కాలిక జ్ఞాపకం నుంచి శాశ్వత జ్ఞాపకంలోకి మారిపోతుంది. మనం అప్పటికే ఏర్పరచుకున్న జ్ఞాపకాలతో మెదడులో ఒక లైబ్రరీ ఏర్పడుతుంది. ఏదైనా కొత్త విషయం వస్తే అది మదిలో పదిలంగా ఉందా లేదా అన్నది మెదడు చెక్ చేసుకుంటుంది. ఒకవేళ అది లేకపోతే ఆ లైబ్రరీలోని కొత్త పుస్తకంలా నిల్వ చేసుకుంటుంది. ఉన్నదే అయితే అది మరోసారి అప్డేట్ అవుతుంది. గుర్తుంచుకోవడం అంటే ఏమిటి? అదెలా జరుగుతుంది? ఏదైనా సంఘటననుగానీ, సమాచారాన్ని గాని... మెదడులో నిక్షిప్తం చేసుకోవడం, అవసరమైనప్పుడు దాన్ని మనసులోకి తెచ్చుకోవడాన్ని గుర్తుంచుకోవడం అంటాం. గుర్తుంచుకోవడం అన్నది మామూలుగానే జరుగుతుందని అనిపిస్తుంటుంది. కానీ చాలాకాలం గుర్తుంచుకోవాలంటే కొంత ధారణ అవసరం. ఒక సంఖ్య గానీ, పదం గానీ మనకు ఎప్పుడూ అవసరం అనుకోండి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవడం తప్పనిసరి అనుకోండి. అప్పుడు మనం దాన్ని కాస్త ప్రయత్నపూర్వకంగా మనసులో నిక్షిప్తమయ్యేలా చేస్తాం. అవసరాన్ని బట్టి కొద్ది నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు గుర్తుంచుకోగలం. దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. ఈపనిని మెదడులోని టెంపోరల్ లోబ్ ప్రాంతంలోని హిప్పోక్యాంపస్ అనే భాగం చేస్తుంది. ఒక సమాచారం చాలా సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉండేదయితే దాన్ని సుదీర్ఘకాల జ్ఞాపకం (లాంగ్ టర్మ్ మెమరీ) అంటాం. ఇలా లాంగ్ టర్మ్ మెమరీ అంటా మెదడులోని నియోకార్టెక్స్ అనే భాగంలో నిక్షిప్తమవుతుంది. అవసరమైనప్పుడు అక్కడినుంచి మనం గుర్తుతెచ్చుకుంటాం. ఇలా జ్ఞాపకం పెట్టుకోవడంతో పాటు అవసరమైనప్పుడు గుర్తుతెచ్చుకోవడానికి మెదడు చురుగ్గా ఉండటం అవసరం. ఆరోగ్యకరమైన మంచి ఆహారాలు మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి. మంచి ఆహారాలు అంటే సమతౌల్యంగా ఉండే అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మైక్రోన్యూట్రియెంట్ల వంటివి. చెడు ఆహారాలు మెదడును మందకొడిగా చేస్తాయి. జంక్‌ఫుడ్, కోలాడ్రింక్స్, పరిమితి దాటినప్పుడు కాఫీ, టీల వంటివి వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఆహారాలు... కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్: మెదడు చురుగ్గా సక్రమంగా పనిచేస్తూ దాని పనిలో సునిశితత్వం, వేగం ఉండాలంటే ముందుగా శరీరం నుంచి కనీసం 15 శాతం తీసుకునే దానికి శక్తినిచ్చే గ్లూకోజ్ సరిగా అందాలి. అందుకోసం మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహడ్రేట్స్. ఇవి మనకు పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు వంటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లలో మనం తీసుకోదగ్గ వాటిలో ప్రధానమైనవి. పొట్టుతీయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే... పొట్టుతీసిన ఆహారం నుంచి వచ్చిన గ్లూకోజ్ తక్షణం వినియోగితమైపోతుంది. ఆ తర్వాత మళ్లీ గ్లూకోజ్ అవసరమవుతుంది. కానీ పొట్టుతీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్ ఒక క్రమమైన పద్ధతిలో దీర్ఘకాలం పాటు మెదడుకు అందుతూ ఉంటుంది. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ (అత్యవసరమైన కొవ్వులు) కొవ్వులు పరిమిత మోతాదుకు మించితే ఒంటికీ, ఆరోగ్యానికీ మంచివి కాదన్న విషయం తెలిసిందే. కానీ మెదడు చురుగ్గా పనిచేయడానికి మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావాల్సిందే. అందుకే మెదడుకు అవసరమైన కొవ్వులను ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ అంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... సాంకేతికంగా చూస్తే మెదడు కణాలన్నీ ‘కొవ్వు’ పదార్థాలే! మెదడు బరువులో 60 శాతం పూర్తిగా కొవ్వే. ఇక మిగతా దానిలోనూ మరో 20 శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్‌ను నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్‌ను శరీరం తయారు చేసుకోలేదు. కాబట్టి వాటిని విధిగా ఆహారం నుంచి స్వీకరించాల్సిందే. ఎసెన్షియల్ ఫ్యాటీఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వాటితోపాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు చేపలు, గుడ్లు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి. ఏ కొవ్వులు మెదడుకు మంచిది కాదు? మెదడు సక్రమంగా చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు కావలసినా, మళ్లీ అన్ని కొవ్వులూ మెదడుకు మంచిది కాదు. కొన్ని కొవ్వులు దాన్ని మందకొడిగా చేస్తాయి. సాంకేతిక పరిభాషలో ట్రాన్స్‌ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజినేటెడ్ కొవ్వులు మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్‌ను అడ్డుకుంటాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కృత్రిమ నెయ్యిలో (వనస్పతిలో) ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారుచేసే కేక్‌లు, బిస్కెట్, తీపి పదార్థాలు మెదడును చురుగ్గా ఉంచలేవు. అలాగే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంచడం కోసం వాడే మార్జరిన్ వంటి కృత్రిమ నూనెలు మంచివి కాదు. తినుబండారాలు కొనే సమయంలో జాగ్రత్త: మనం మార్కెట్లో కొనే పదార్థాలపై ఉండే పదార్థాల జాబితా పరిశీలించి, అందులో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్/ఆయిల్స్ ఉంటే వాటిని కేవలం రుచికోసం పరిమితంగానే తీసుకోవాలి. మెదడుకు అవసరమైన కొవ్వులు (ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్) కోసం చేపలు ఎక్కువగా తినాలి. శాకాహారులు ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఆలివ్ ఆయిల్ వంటి నూనెలపై ఆధారపడవచ్చు. అమైనో యాసిడ్స్: మెదడులోని అనేకకణాల్లో ఒకదానినుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే మెదడులోని అంశాలను న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఇదెంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తున్నట్లు లెక్క. ఇందుకు దోహదపడేవే ‘అమైనో యాసిడ్స్’. మనకు ప్రోటీన్స్నుంచి ఈ అమైనో యాసిడ్స్ లభ్యమవుతాయి. ఇక ఈ న్యూరోట్రాన్స్‌మిటర్స్‌పైనే మనందరి మూడ్స్ ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు నిద్ర బాగా పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. ఈ ట్రిప్టోఫాన్ పాలలో పుష్కలంగా ఉంటుంది. అందుకే మంచి నిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. పిల్లలు చదివిందంతా షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి నిక్షిప్తం కావడమనే ప్రక్రియ నిద్రలోనే జరుగుతుంది. అందుకే పిల్లల్లో మంచి జ్ఞాపకశక్తి ఉండాలంటే, వారికి నిద్ర కూడా అవసరమైనంతగా ఉండాలి. అందుకు ట్రిఫ్టొఫాన్ బాగా దోహదం చేస్తుంది. అందుకే వారికి రాత్రి పడుకోబోయే ముందర గోరువెచ్చని పాలు ఇవ్వడం చాలా మంచిది. విటమిన్లు / మినరల్స్ (ఖనిజలవణాలు): మన మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు. ఇవి అమైనో యాసిడ్స్‌ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మార్చడంలోనూ విశేషంగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బీకాంప్లెక్స్‌లోని బి1, బి6, బి12 ప్రధానంగా అవసరమవుతాయి. ఇవి తాజాకూరగాయల్లో, ఆకుపచ్చని ఆకుకూరల్లో, పాలలో పుష్కలంగా ఉంటాయి. అయితే వీటన్నింటిలోనూ మెదడు చురుకుదనానికి దోహదం చేసే బి12 మాంసాహారంలోనే ఎక్కువ. అయితే ఇటీవల స్ట్రిక్ట్ వెజిటేరియన్ పదార్థాలు మాత్రమే తీసుకునే ఇండ్లలోని పిల్లలకు, ఎండకు సోకని చిన్నారుల్లో విటమిన్ ‘డి’ లోపించే అవకాశాలు ఎక్కువ. ఆధునిక జీవనశైలి వల్ల ఇప్పుడీ కండిషన్ చాలామందిలో చోటుచేసుకుంటోంది. ఇలాంటివారు విధిగా విటమిన్ డితో పాటు విటమిన్ బి12 పాళ్లను పెంచే సప్లిమెంట్లను బయటి నుంచి తీసుకోవాలి. ఇక విటమిన్–ఈ కూడా పిల్లల్లో నేర్చుకునే ప్రక్రియను చురుగ్గా జరిగేలా చేస్తుంది. నీళ్లు : మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయితే... మొత్తం మెదడును తీసుకుంటే అందులో ఉండేది 80 శాతం నీళ్లే. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. మీకు తెలుసా...? మనం మనమూత్రం ద్వారా, ఉచ్ఛాసనిశ్వాసల ద్వారా ఒక రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తాం. నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం అవసరం. దీనికోసం అంత నీటినీ తీసుకోవాలి. ఇక తక్కువ మోతాదులో నీళ్లు తీసుకునే వారైనా కనీసం 1.5 లీటర్లను తీసుకోవాలి. (మిగతాది మనం తీసుకునే ఘనాహారంలోంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటినుంచి భర్తీ అవుతుంది. రోజువారీ తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం తగ్గుతుంది. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది మన అందరి మూడ్స్‌పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రోజూ 6–8 గ్లాసుల నీళ్లతోపాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు (ఈ పండ్లరసాల్లో చక్కెర వేయడం సరికాదు. చక్కెర ఎక్కువైనా అది మెదడు చురుకుదనాన్ని మందకొడిగా మారుస్తుంది), రాగిజావ వంటివి మెదడును చురుగ్గా ఉంచే ద్రవాహారాలని గుర్తుపెట్టుకోండి. కాబట్టి... పిల్లలు తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకునేలా చూడండి. ఇది పిల్లలతోపాటు అందరికీ అవసరం. పరీక్షలకు వెళ్తున్న పిల్లలకు మరీ ఎక్కువ అవసరం. మంచి జ్ఞాపకశక్తి కోసం జింక్.... మంచి జ్ఞాపకశక్తి కోసం జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. దాంతోపాటు విటమిన్–బి6, విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా అవసరం. ఈ విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ప్రధానంగా తాజా పళ్లు అంటే... ద్రాక్ష, అన్ని నిమ్మజాతి (సిట్రస్) పళ్లు, యాపిల్స్, ప్లమ్స్, బెర్సీస్, దానిమ్మ వంటివి, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టు తీయని గోధుమ, రాగి, జొన్న, మొక్కజొన్న వంటి ధాన్యాలు, చిక్కుళ్లు, పాలు వంటి ఆహారంలో ఎక్కువగా ఉంటాయి. మాంసాహారంలోనూ ఇవి ఉంటాయి. ఇక జింక్ ఎక్కువగా మాంసాహారం, సీఫుడ్, గుడ్లు, పాలలో ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారు జింక్ కోసం పాలపై ఆధారపడవచ్చు. మెదడుకు మేలు చేసే ఆహారాలు: నేరుగా చెప్పాలంటే మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలనుకుంటే ఈ కిందివి వారు తినే ఆహారంలో ఈ కింది అంశాలు/పదార్థాలు ఉండేలా చేసుకోండి. పండ్లలో: మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీలు మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మంచివి. ఆకుకూరలు: కూరగాయల్లో పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచి, వాటిని అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి. వీటితోపాటు డార్క్/బిట్టర్ చాకొలెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి. చేపల్లో: పండుగప్ప, వంజరం, కనగర్తలు (మాకరెల్)... వీటిలో మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ. మెదడుకు హాని చేసే ఆహారాలు : టీ, కాఫీలు డీహైడ్రేషన్... అంటే శరీరం నుంచి నీళ్లను తొలగించే పనిని చేస్తుంటాయి. అందుకే అవి చాలా పరిమితంగా (రోజుకు రెండు కప్పులు) మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించితే అది మెదడును ముందుగా చురుగ్గా చేస్తుంది. అయితే ఈ చర్యవల్ల మెదడు వేగంగా అలసిపోతుంది. చక్కెర కలిపిన పానీయాలు, కార్బొనేటెడ్ సాఫ్ట్‌డ్రింక్స్‌వల్ల కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. ►ఉప్పు ఒంట్లోని నీటిని తొలగించి డిహైడ్రేషన్కు దారితీస్తుంది. కాబట్టి నిల్వ ఉంచిన ఉప్పటి పదార్థాలైన చిప్స్, టిన్న్‌డ్ సూప్స్ మెదడుకు హానికరం. కాబట్టి వాటిని చాలా పరిమితంగానే తీసుకోవాలి. ►మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యంతోపాటు మెదడుకూ అది చేటు చేస్తుంది. అది జ్ఞాపకశక్తిని, మెదడు చురుకుదనాన్ని మందకొడిగా మారుస్తుంది. కాబట్టి తక్కువ ఉప్పు తీసుకునేలా పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం మంచిది. ►కొవ్వుల్లో డాల్డా, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలనే తీసుకోవాలి. బటర్, క్రీమ్ కూడా పరిమితంగా తీసుకునేలా చూడాలి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బజారాహిల్స్,హైదరాబాద్ -
ఉయ్యాల ఊగితే..మాంచి నిద్ర!
రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఈ మధ్యకాలంలో జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోందా? అయితే ఒక పనిచేయండి. ఇంట్లో ఓ ఉయ్యాల వేయించుకోండి. ఎంచక్కా దానిపైనే ఊగుతూ నిద్రపోండి. మీ సమస్యలు ఉపశమించే అవకాశం ఉంది. అదెలా అని ఆశ్చర్యపోవద్దు. స్విట్జర్లాండ్, జెనీవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన రెండు వేర్వేరు అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఉయ్యాలపై ఊగడం నిద్రను ఎక్కువ చేయడం మాత్రమే కాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంపొందిస్తుందట. మాములు పరిస్థితుల్లో కూడా బాగా నిద్రపోయే వారు కొంతమందిని ఎన్నుకుని తాము ప్రయోగాలు చేశామని.. ఉయ్యాల ఊపులకు వీళ్లు చాలా తొందరగా నిద్రలోకి జారుకోవడమే కాకుండా.. ఎక్కువ సమయం దీర్ఘనిద్రలో ఉన్నట్లు తెలిసిందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లారెన్స్ బేయర్ తెలిపారు. అలాగే కొన్ని పదాలను గుర్తుపెట్టుకుని మళ్లీ చెప్పాల్సిందిగా కోరే పరీక్షలోనూ వీరు విజయం సాధించారని తద్వారా వారి జ్ఞాపకశక్తి మెరుగైనట్లు తాము ఒక అంచనాకు వచ్చామని వివరించారు. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లోనూ దాదాపు ఇదే ఫలితాలు రావడం విశేషం. ఎలుకలను నిద్ర పుచ్చేందుకు వీరు కదిలే పంజరాలను ఉపయోగించారు. -
జ్ఞాపకశక్తికి దగ్గర దారి.. గీతలే!
ఏ విషయాన్నైనా గుర్తుంచుకోవాలంటే బొమ్మలు గీయడానికి మించిన దగ్గర దారి లేదంటున్నారు వాటర్లూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. పదేపదే రాయడం ద్వారా బాగా గుర్తుండి పోతుందన్న విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ, బొమ్మలు గీయడమన్నది అంతకంటే మెరుగైన మార్గమని తాము ఇటీవల జరిపిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోందని మెలిస్సా మీడ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వయసు మళ్లిన తరువాత బొమ్మలు గీయడం అలవాటు చేసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి లోపాలు, అలై్జ్జమర్స్, మతిమరపు వంటి సమస్యలను అధిగమించవచ్చునని మెలిస్సా అంటున్నారు. 20 – 80 మధ్య వయసు వారు దాదాపు 50 మందిపై తాము ఈ అధ్యయనం చేశామన్నారు. రెండు గుంపులుగా విడదీసిన వీరికి వరుసగా కొన్ని పదాలు చూపినప్పుడు ఆ పదాన్ని, వివరణను రాయడంతో పాటు బొమ్మకూడా గీయాల్సి ఉంటుంది. కొంత సమయం తరువాత వాటిల్లో వీలైనన్ని పదాలను గుర్తు చేసుకోమని అడిగారు. యువకులు పదాలు బాగా గుర్తుపెట్టుకోగలిగారు. అది అసారణం కాకపోయినా బొమ్మలు గీసిన పదాలను అన్ని వర్గాల వారూ ఎక్కువగా గుర్తు పెట్టుకోవడం తమను ఆశ్చర్యం కలిగించిందని మెలిస్సా వివరించారు. ఒకేరకమైన సమాచారాన్ని పలు విధాలుగా చూపుతూండటం వల్ల బొమ్మలు ఎక్కువగా గుర్తుండిపోతున్నాయని, పైగా చేతులు కూడా తోడవడం వల్ల మెదడులో సమాచారం మరింత బాగా ముద్రపడిపోతుందని మెలిస్సా తెలిపారు. -
ఈ ఫాంట్‌తో మతిమరుపుకు చెక్!
మార్కెట్‌కు వెళ్లి మీరనుకున్న కొన్ని వస్తువులు కొనడం మర్చిపోయారా? పరీక్షకు చదవాల్సిన ముఖ్యమైన పాఠాలు చదవడం మరిచిపోయారా? ఇలాంటి మతిమరుపులు మనల్ని నిత్యం ఇబ్బందికి గురి చేస్తూంటాయి కదా! అయితే ఇకపై ఆ ఆందోళన అవసరం లేదు. మనం చెయ్యాల్సిన పనులు పక్కాగా గుర్తించుకునేలా ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ వర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త ఫాంట్‌ను సృష్టించారు. ‘శాన్స్ ఫర్‌గెటికా’అనే ఈ ఫాంట్లో నోట్స్ రాసుకుంటే మనం చెయ్యాల్సిన పనుల్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోమట! జ్ఞాపకశక్తిని ఎలా పెంచుతుంది ? మనం రోజూ పలు రకాల ఫాంట్లు వినియోగిస్తూంటాం. అందులో చూడడానికి అందంగా, కళ్లకి ఆహ్లాదంగా ఉండే ఫాంట్స్‌నే ఎంచుకుంటాం. అయితే మనం వాడే భాష, అవతలివాళ్లు ఏదైనా మాట్లాడితే మనం పెట్టే శ్రద్ధ, జ్ఞాపకశక్తి, అవగాహన, సృజనాత్మకత, ఆలోచన వంటి మానసిక సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని శాన్స్ ఫర్‌గెటికా ఫాంట్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ ఫాంట్లో ఏది రాసుకున్నా అంత తేలిగ్గా మర్చిపోకపోవడమే దీని ప్రత్యేకత! ఇతర ఫాంట్లతో పోల్చి చూసినా శాన్స్ ఫర్‌గెటికా ఫాంట్లో రాసింది చదవడం చాలా కష్టం. అలా కష్టపడి, కూడబలుక్కొని చదవడం వల్ల ఎవరూ తొందరగా మర్చిపోరు. ఇది నిర్ధారించడానికి 400 మంది వర్సిటీ విద్యార్థులపై అధ్యయనం చేశారు. ఇంగ్లిష్‌లో సాధారణంగా వాడే ఏరియల్ ఫాంట్లో రాసుకున్న విషయాలను 50 శాతం మంది గుర్తు పెట్టుకుంటే, అదే విషయాన్ని శాన్స్ ఫర్‌గెటికా ఫాంట్లో రాస్తే 57 శాతం మంది గుర్తుంచుకున్నారు. ఈ కొత్త ఫాంట్‌ను ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెట్టి డిజైన్ చేశారు. మొదటిది అక్షరాలు కాస్త వెనక్కి వంపు తిరిగి ఉండటం అంటే మ్యాప్‌లో నదుల్ని గుర్తించడానికి వాడే డిజైన్ లాంటిదన్నమాట. ఇక రెండోది అక్షరానికి అక్షరానికి మధ్య ఉండే దూరం. ఈ ఫాంట్లో ఉంటే ప్రత్యేకమైన వంపు, దూరం కారణంగా చదవడం కష్టమే అయినా.. అది మెదడులో నిక్షిప్తం చేసుకోవడం సులభమవుతుందని ఈ ఫాంట్ డిజైనింగ్‌కు నేతృత్వం వహించిన స్టీఫెన్ బన్హమ్ పేర్కొన్నారు. మన కంప్యూటర్లలోనూ ఈ ఫాంట్‌ని డౌన్లోడ్ చేసుకొని జ్ఞాపకశక్తిని ఎలా పెంచుతుందో మీరూ పరీక్షించండి! -
అల్జీమర్స్‌పై అవగాహన అవసరం: గవర్నర్
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటంతో మనుషుల జ్ఞాపకశక్తి తగ్గుతోందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని పినిక్స్ ఎరీనాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవెరథాన్ (బృహత్ జాగృతికరణ)ను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడటం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోల్పోతున్నారన్నారు. అవసరమైనంత వరకే టెక్నాలజీని వాడాలని సూచించారు. ప్రస్తుతం ఇండియాలో 40 లక్షల మంది అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని, ఈ వ్యాధి వారి దగ్గరి కుటుంబీకులు 12 లక్షల మందిపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. బంధిత రాజకీయ విధానాలను రూపొందించడానికి భారతదేశంలో ఇది ఒక ఆరోగ్య ప్రధానమైన విషయంగా పరిగణించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రోజుకు 50 మంది రోగులకు పైగా పరీక్షించగల సామర్థ్యంతో డెమోన్షియా కేర్ సెంటర్‌ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ, బెంగళూర్‌లోని నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ సంయుక్తంగా స్థాపించినట్లు రెడ్ క్రాస్ చైర్మన్ పాపారావు తెలిపారు. అల్జీమర్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు వివిధ సేవలు, విపత్తు, అత్యవసర పరిస్థితులలో సహాయాన్ని అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ రెడ్ క్రాస్ అని చెప్పారు. -
బహుభాషా లేఖిని
చేతిరాతను బట్టి మనిషి గుణగణాలను అంచనా వెయ్యొచ్చని అంటారు. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో చేతిరాతకు ప్రాధాన్యం తగ్గినప్పటికీరాత పరీక్షల్లో మాత్రం అందమైన చేతిరాతకు అదనపు విలువ తోడవుతుంది. అలాంటి చేతి రాత ఒకరి జీవిత గమనాన్ని మార్చింది. జెనెటిక్ ఇంజనీర్ అవుదామనే ఆలోచన నుంచి న్యూరో సైంటిస్ట్ కావాలనేలక్ష్యాన్ని నిర్దేశించింది. అలా చేతిరాతతో జీవితానికి చక్కటి బాటను దిద్దుకున్నారు సంగరాజు అశ్విని. తిరుపతిలోని ‘మేక్ మై బేబీ జీనియస్’(ఎంఎంబీజి) స్కూల్ యజమాని సంగరాజు భాస్కర రాజు కుమార్తె అశ్విని. తన లక్ష్యం మారడానికి వెనుక ఉన్న కారణాలను సాక్షితో పంచుకున్నారామె. సెలవుల్లో ఆలోచన మారింది ‘‘జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. అందుకు అనుగుణంగానే పదో తరగతి వరకు చదివాను. మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్లో ఎంబైపీసీ గ్రూపులో చేరాను. నాన్న చేతిరాత నిపుణులు కావడంతో వేసవి సెలవుల్లో చేతిరాతపై పిల్లలకు శిక్షణ శిబిరం నిర్వహించేవారు. అందమైన చేతి రాత కోసం నాన్న దగ్గరే శిక్షణ తీసుకున్నా. అయితే అందరిలా కాకుండా భిన్నంగా గుర్తింపు పొందాలనుకున్నా. అందమైన చేతిరాత కోసం నాన్న చాలా పరిశోధనలు చేశారు. అందులో నుంచి రూపుదిద్దుకున్నవే ప్యాటర్న్స్ (పలక లాంటి 8 పరికరాలు). ప్యాటర్న్స్‌లో రెండు చేతులతో రాయడం సాధన చేశాను. అదనంగా మిర్రర్ రైటింగ్, అప్ సైడ్ డౌన్ సాధన చేశాను. కుడి చేతితోనే కాకుండా ఎడమ చేతితో రాయడం కూడా సులభంగా నేర్చుకున్నా. రెండు చేతులతో 21 భాషలు ‘‘సాధారణంగా ఒకటి, రెండు లేక మూడు భాషల్లో రాయగలం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాయడాన్ని నేర్చుకున్నా. నాన్నకు చెప్పడంతో నాకు ప్రత్యేకంగా 18 భాషలకు సంబంధించిన పలకలు (ప్యాట్రెన్స్) చేయించారు. అందులో 18 భారతీయ భాషలు, మిగిలిన మూడు విదేశీ భాషలు. భారతీయ భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మరాఠీ, మైథిలి, మణిపురి, ఒరియా, పంజాబీ, సంస్కృతం, శాంథలి, సింధి, ఉర్దూలతోపాటు, విదేశీ భాషలు ఇంగ్లీషు, నేపాలి, అరబిక్‌లో రాయడం సాధన చేశాను. అలా మొత్తం 21 భాషల్లో కుడి, ఎడమ చేతులతో రాయగలను. మిర్రర్ రైటింగ్, అప్ సైడ్ డౌన్ రైటింగ్ కూడా వచ్చు. మిర్రర్ రైటింగ్ ఇండియాలో కొంతమంది రాయగలుగుతున్నప్పటికీ, అప్‌సైడ్ డౌన్ రైటింగ్ మాత్రం అసాధారణమే. డిజార్డర్ పిల్లలకు బోధన ‘‘చేతిరాతలో నిపుణులైన నాన్న మేక్ మై బేబీ జీనియస్ అనే పేరుతో పాఠశాలను నెలకొల్పారు. చదువులో వెనుకబడ్డ పిల్లలను, అటెన్షన్ డెఫిషిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), అటెన్షన్ డెఫిషిట్ డిజార్డర్(ఏడీడీ), ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్(ఏఎస్డీ) సమస్యలతో బాధ పడుతున్న పిల్లలకు బోధించడం ఈ స్కూల్ ప్రత్యేకత. సాధారణంగా ఇలాంటి పిల్లలను ఏ పాఠశాలలోనూ పెద్దగా పట్టించుకోరు. వారి సమస్యలు అర్థంకావు. వయసు పెరుగుతున్నా, తరగతులు మారుతున్నా చదువులో మాత్రం వెనుకంజలోనే ఉంటారు. ఇలాంటి పిల్లలకు మంచి చదువు అందించి సమాజంలో అందరిలా తీర్చిదిద్దాలన్నదే నాన్న కోరిక, నా లక్ష్యం కూడా అదే. దాని కోసం న్యూరో సైంటిస్టు కావాలనుకుంటున్నా. లక్ష్యం మార్చిన ఘటన ‘‘తిరుపతి భవానీనగర్‌లో నివాసముంటున్న మోహన్‌మురళి చంద్రగిరి పీహెచ్సీలో సూపర్వైజర్. ఆయన కుమారుడు దేవనాగ్కు అప్పుడు 16ఏళ్లు. పుట్టినప్పటి నుంచే దృష్టి, నత్తి. దీంతో చదువులో వెనుకబడ్డాడు. ఆ వయసుకు పదో తరగతి పూర్తయి ఉండాలి. కానీ అతను ఎనిమిదో తరగతి చదువుతున్నా కనీసం పదాలు, ఎక్కాలు, గుణింతాలు ఏవీ రావు. తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా మా పాఠశాలలో చేర్పించారు. వారి వేదన వర్ణనాతీతంగా ఉండేది. పిల్లవాడి సమస్యను గుర్తించి ఇక్కడ వివిధ రకాల శిక్షణ ఇచ్చాం. దీంతో అతను రెండేళ్లకే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సాధించాడు. ఈ సంవత్సరం ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి పరీక్ష రాసి పాసయ్యాడు. ప్యారడీ పాటలు రాస్తున్నాడు. సొంతంగా కథలు రాస్తున్నాడు. ఆ తల్లిదండ్రుల సంతోషం మాటల్లో వర్ణించలేం. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. మొదట్లో జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలనుకున్న నా లక్ష్యాన్ని మార్చుకోవడానికి కారణం ఈ ఘటనే. న్యూరో సైన్స్ చదివి న్యూరో సైంటిస్ట్ అవుదామని నిశ్చయించుకున్నా. నాన్నకు తోడుగా ఉంటూ సహకారం అందించాలనుకున్నాను. దీనికోసం ఇంటర్లో ఎంబైపీసీ తీసుకున్నా. డిగ్రీలో బయోటెక్నాలజీ తీసుకున్నా. డిగ్రీ మొదటి సెమిస్టర్ వరకు రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లాను. ఆ తరువాత పాఠశాలలోనే పిల్లలకు బ్రెయిన్ జిమ్‌లో శిక్షణ ఇస్తూ డిగ్రీ పూర్తి చేశాను. న్యూరో సైన్స్ కోర్సు ఇండియాలో లేదు. విదేశాలకు వెళ్లాలి. దీనికోసం ఇక్కడే సైన్స్‌కు అనుబంధంగా ఉన్న పీజీ కోర్సు చేసి, ఆ తరువాత న్యూరో సైన్స్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు అశ్విని. యంగ్ అచీవర్ అవార్డు చేతిరాతను సాధనం చెయ్యడం చదువులో రాణించడానికి తనకు చాలా దోహదపడిందని అంటారు అశ్విని. ‘‘రెండు చేతులతో విభిన్న భాషల్లో విభిన్నంగా రాయడంతో మల్టిపుల్ స్కిల్స్ పెరిగాయి. నాలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకతతోపాటు ఆత్మస్థైర్యం పెంపొందింది. అప్పటి వరకు గంట సమయంలో చదివి గుర్తు పెట్టుకునే అంశాలను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసేస్తున్నా. దీంతో చదువుకోవడానికి సమయం చాలా కలిసొచ్చింది’’ అన్నారు అశ్విని. విలక్షణమైన ఆమె చేతిరాతకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, రికార్డ్ హోల్డర్ రికార్డ్స్, అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్.. ఇలా ఆయా సంస్థలు అవార్డులను ప్రదానం చేశాయి. ఇటీవల విజయవాడలో యంగ్ అచీవర్ అవార్డును అందుకున్నారు. – ఎస్.శశికుమార్, సాక్షి, తిరుపతి -
పరి పరిశోధన
జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు కొత్త మార్గం! వయసుతోపాటు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మనలో అందరికీ ఎదురయ్యే సమస్యే. గుండెపోటుకు గురైనవారు లేదా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల బారిన పడినవారికీ అకస్మాత్తుగా జ్ఞాపకశక్తి మందగిస్తుంది. ఈ సమస్యలకు ఇప్పటివరకూ కచ్చితమైన పరిష్కారాలు లేవు. అయితే వేక్‌ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల తాజా ప్రయోగాల పుణ్యమా అని ఇకపై మాత్రం అవసరమైనప్పుడు మెదడు పనితీరును సూపర్ చార్జ్ చేసుకునేందుకు వీలేర్పడనుంది. ఎలాగంటారా? చాలా సింపుల్. కంప్యూటర్లలో ర్యామ్ పెంచుకున్నట్లే మన మెదడులోనూ ఓ చిప్లాంటిది ఉంచుకుంటే సరి అంటున్నారు రాబర్ట్ హాంప్సన్ అనే శాస్త్రవేత్త. ఇలాంటి పరికరాన్ని తాము ఇప్పటికే తయారు చేశామని.. ఇటీవలే కొందరి మెదళ్లలో ఈ పరికరాన్ని అమర్చి విజయవంతంగా పరీక్షలు కూడా పూర్తి చేశామని రాబర్ట్ తెలిపారు. అటు షార్ట్ టర్మ్ మెమరీతోపాటు, ఇటు లాంగ్‌టర్మ్ మెమరీ కూడా ఈ పరికరం ద్వారా మెరుగుపడినట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని చెప్పారు. వీడియోగేమ్‌లు ఆడుతున్న కొందరి మెదళ్లను పరిశీలిస్తూ.. హిప్పోకాంపస్ ప్రాంతంలో న్యూరాన్లు ఏ పద్ధతిలో చైతన్యవంతం అవుతున్నాయో గుర్తించి అదే పద్ధతిలో పనిచేసే పరికరాన్ని అభివృద్ధి చేశామని వివరించారు. మరిన్ని పరిశోధనలతో ఈ పరికరాన్ని మెరుగుపరిస్తే భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఎక్కువ జ్ఞాపకశక్తిని అందించే యంత్రాల తయారీకి వీలేర్పడుతుందని హాంప్సన్ తెలిపారు. నిద్రలేమి.. ఒత్తిళ్లతో ఊబకాయం! వేళాపాళా లేని తిండి, నిద్ర, రకరకాల ఒత్తిళ్లు... ఆరోగ్యానికి చేటని, బరువు పెరిగేందుకూ కారణమవుతాయనీ తెలుసు. అయితే స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా ఇందుకు గల కారణాలను స్పష్టంగా తెలుసుకోగలిగారు. మన శరీరంలో ఒక పద్ధతి ప్రకారం హెచ్చుతగ్గులకు గురయ్యే గ్లూకోకార్టికాయిడ్ హార్మోన్లతో ఈ చిక్కులన్నీ వస్తున్నాయని వీరు అంటున్నారు. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ కూడా గ్లూకో కార్టికాయిడ్ హార్మోన్ కావడం గమనార్హం. సాధారణంగా ఈ హార్మోన్లు ఒక రోజులో గరిష్టస్థాయికి చేరి... తగ్గిపోతూంటాయి. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అతితక్కువగా... ఉదయం 8 గంటలకు ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం, ఒత్తిడి లేదంటే కొన్నిరకాల మందుల ద్వారా అప్పుడప్పుడూ ఈ హార్మోన్ కొద్ది సమయం పాటు ఎక్కువవుతూంటుంది. అయితే ఈ పరిస్థితి దీర్ఘకాలంపాటు కొనసాగితే అది కొవ్వు పదార్థాలు జీర్ణమయ్యే ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం జరిపి ఈ హార్మోన్లు 12 గంటల్లోపు అత్యధిక, అత్యల్ప స్థాయిలకు చేరుకుంటే కొవ్వు కణాలు తొందరగా జీర్ణమవుతాయని గుర్తించారు. ఎలుకలకు ఈ హార్మోన్‌ను అందించినప్పుడు సహజమైన ప్రక్రియకు విఘాతం కలిగి కొవ్వు రెట్టింపు అయిందని తెలిసింది. ఈ పరిశోధన బరువు నియంత్రణకు ఉపయోగపడుతుందని అంచనా. పాలపుంత మధ్యలో బోలెడన్ని కృష్ణబిలాలు సౌరకుటుంబంతోపాటు కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలకు నెలవైన మన పాలపుంత మధ్యలో బోలెడన్ని కృష్ణబిలాలు ఉన్నట్లు కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలపుంత మధ్యలో సాగిట్టారిస్ పేరుతో అత్యంత భారీ కృష్ణబిలం ఉందని చాలాకాలంగా తెలుసు. అయితే దీన్ని గుర్తించేందుకు ఉపయోగించిన పద్ధతిలో కొన్ని మార్పులు చేసి పరిశీలించినప్పుడు ఆ భారీ కృష్ణబిలం పరిసరాల్లో కొన్ని వేల సంఖ్యలో కృష్ణబిలాలు ఉన్నట్లుగా తెలిసింది. ఇంత పెద్దస్థాయిలో కృష్ణబిలాలను ప్రత్యక్షంగా గుర్తించడం ఇదే తొలిసారి. నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని కొలంబియా విశ్వవిద్యాలయ ఖగోళశాస్త్రవేత్తలు చేపట్టారు. భారీ కృష్ణబిలం మింగేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు బుల్లి కృష్ణబిలాలు పొరుగునే ఉండే నక్షత్రాలతో లంకె ఏర్పరచుకుంటాయని ఈ క్రమంలో భారీ స్థాయిలో ఎక్స్‌రే కిరణాలు వెలువడతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ఛక్ హేలీ తెలిపారు. అయితే పాలపుంత మధ్యలో ఉండే భారీ కృష్ణబిలం చాలా దూరంగా ఉంది కాబట్టి.. ఎక్స్ కిరణాలను చూడటం సాధ్యం కాదని చెప్పారు. అందువల్ల తాము చంద్ర వేధశాల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ఎక్స్‌రే కిరణాలను గుర్తించి భారీ కృష్ణబిలం చుట్టూ చిన్న సైజులో ఉన్నవి పదివేల వరకూ ఉన్నట్లు గుర్తించామని వివరించారు. -
మెదడును దాచేసుకోండి!
మెమరీ కార్డు కానీ.. పెన్‌డ్రైవ్ కానీ కొన్నప్పుడు అది మొత్తం ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని సినిమాలు కానీ.. పాటలతో కానీ నింపేస్తే.. అందులో మన సమాచారం భద్రంగా ఉంటుంది. దీన్ని జీవితాంతం ఎలాగోలా దాచేసుకోవచ్చు. మరి చిన్నప్పటి నుంచి మన మెదడులో ఎంత సమాచారం చేరి ఉంటుంది. మరి ఈ సమాచారం జీవితాంతం దాచుకోవచ్చా.. అదెలా సాధ్యం మనం చనిపోయినప్పుడే ఆ మెదడు కూడా చనిపోతుంది. మరి ఆ సమాచారం.. ఇంకెక్కడి సమాచారం మనతోపాటే గాల్లో కలిసిపోతుంది. అయితే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ మాత్రం మీ మెదడును చాలా జాగ్రత్తగా దాచేస్తామని చెబుతోంది. భవిష్యత్తులో ఏదైనా కొత్త సాంకేతికత వచ్చినప్పుడు ఆ మెదడులోని సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కిస్తామంటోంది. మన మెదడులోని నాడులను, నెట్‌వర్క్‌ను అధ్యయనం చేసి అందులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తామని నెట్కాం అనే ఈ కంపెనీ స్పష్టం చేస్తోంది. అయితే ఇందులో ఓ తిరకాసు పెట్టింది ఆ కంపెనీ. ఏంటంటే మన మెదడును వారు తీసుకుని భద్రపరచాలంటే మనం చనిపోకముందే తీసుకుంటుందట. అమ్మో అదేంటి చనిపోయాక తీసుకోవచ్చు కదా అంటే సమాచారం‘బతికి’ఉండాలట. బతికి ఉండగానే మెదడులోకి ఎంబామింగ్ రసాయనాలు పంపి తాజాగా ఉంచుతారట. ఇప్పటికే ఓ పంది మెదడును ఈ ప్రక్రియతో భద్రపరిచారట. మరి ఎవరు మొదట తమ మెదడును భద్రపరుచుకుంటారో చూడాలి. -
బాల మేధావులు!
శ్రీరాంపూర్: వారు బాలమేధావులు. అమోఘమైన జ్ఞాపక శక్తి.. అబ్బురపరిచే మేధస్సు.. పిన్న వయస్సులోనే పదో తరగతి పాఠాలు కంఠస్థం. అయితే.. సరస్వతీ కటాక్షం లభించినప్పటికీ ప్రభుత్వ యం త్రాంగం మాత్రం కనికరించకపోవడం ఆ బాలమేధావులకు శాపంగా మారింది. 6వ, 4వ తరగతులు చదువుతున్న అక్కా, తమ్ముళ్లు విశేషప్రతిభతో వయసుకు మించి తరగతుల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు పరీక్షలు పెడితే పదో తరగతిలో 80 శాతం మార్కులతో పాసవుతామని ధీమాగా చెబుతున్నా విద్యాశాఖ ప్రోత్సహించడం లేదు. పరీక్షకు హాజరుకావడానికి వయసు అర్హత వారికి అడ్డంకిగా మారింది. గతంలో పిన్న వయస్సు పిల్లలను పదో తరగతి పరీక్షలకు అనుమతించిన ప్రభుత్వం.. వీరి పట్ల మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం తీగల్‌పహడ్‌కు చెందిన మూల విష్ణువర్దన్‌రెడ్డి, సరితారెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. వయసు రీత్యా కూతురు వర్షితారెడ్డి (11) 6వ తరగతి, కుమారుడు హర్షవర్దన్‌రెడ్డి (9) నాల్గవ తరగతి చదువుతుండాలి. కానీ వీరు ఇప్పటికే అన్ని తరగతులు చదివేసి పదో తరగతి సబ్జెక్టులో కూడా పట్టు సాధించారు. పిల్లల్లో ఉన్న తెలివితేటలు, ఐక్యూలెవల్స్ను వివరిస్తూ వారికి పదో తరగతి వార్షిక పరీక్షలకు అనుమతి ఇవ్వాలని తల్లిదండ్రులు విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ శాఖలోని అన్ని స్థాయిలోని అధికారుల వద్దకు పిల్లలను తీసుకెళ్లి వారిలో ఉన్న ప్రతిభను చూపెట్టారు. కానీ అధికారులు పదో తరగతి వార్షిక పరీక్ష రాయడానికి కనీస వయస్సు 14 సంవత్సరాలపైన ఉండాలని తోసిపుచ్చారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించగా.. స్పందించిన కోర్టు వారి మేధస్సును పరీక్షించేందుకు కొన్ని నిబంధనలు పెట్టింది. ముందుగా వారితో ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రీఫైనల్ పరీక్షలు రాయించాలని, అందు లో వారికి 50 శాతం మించి మార్కు లు వస్తే పరీక్షకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు గత విద్యా సంవత్సరం పరీక్ష నిర్వహించగా హర్షవర్దన్‌రెడ్డికి 61 శాతం, వర్షితరెడ్డికి 73 శాతం మార్కులు వచ్చాయి. అయితే పరీక్షల సమయం దగ్గర పడిందని, ఇప్పుడు వార్షిక పరీక్షలు నిర్వహించలేమని, మరికొన్ని కారణాలను కోర్టుకు చూపుతూ విద్యాశాఖ టెన్త్ పరీక్షలకు అనుమతించలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు సీఎం కేసీఆర్‌ను కూడా కలసి విన్నవించామని, ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసినా ఇంత వరకు అమలు జరగడం లేదని దంపతులు వాపోతున్నారు. సీఎం ఎలాగైనా తమ పిల్లల పరీక్షలకు అనుమతిస్తారని నమ్ము తున్నామని వారు పేర్కొన్నారు. శ్రీరాంపూర్ టూర్లో పిల్లలను గుర్తించి మాట్లాడిన సీఎం గతనెల 27న శ్రీరాంపూర్‌కు సీఎం కేసీఆర్ వచ్చారు. సింగరేణి గెస్టుహౌస్ వద్ద నుంచి నస్పూర్ కాలనీకి తన కాన్వాయ్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలో పిల్లలిద్దరు వారి తల్లి సరితారెడ్డితో కలసి రాయల్గార్డెన్ మూల మలుపు వద్ద ఫైలు పట్టుకొని ఉన్న విషయాన్ని గమనించారు. మూలములుపు వద్ద వాహనం స్లో కావడంతో సీఎం వారిని గుర్తుపట్టారు. ఒక్కసారిగా వాహనం ఆపి వారిని దగ్గరకు పిలుచుకొని మీ పని అయిపోతుందమ్మా అంటూ ఆశీర్వదించారు. -
పసుపుతో జ్ఞాపకశక్తికీ మేలే!
పసుపులోని కర్కుమిన్ పదార్థం జ్ఞాపకశక్తిని పెంచేందుకు మాత్రమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు దోహదపడుతుందని అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు. మతిమరుపు లేని... ఈ లక్షణాలతో కూడిన వ్యాధి అయిన అల్జైమర్స్ రోగులపై జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ అంచనాలకు రాగలిగామని శాస్త్రవేత్తలు చెప్పారు. భారతీయుల్లో అల్జైమర్స్ వ్యాధిగ్రస్తులు తక్కువగా ఉండేందుకు పసుపు వాడకం ఒక కారణం కావచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ గారీ స్మాల్ తెలిపారు. పరిశోధనల్లో భాగంగా తాము 50 –90 ఏళ్ల మధ్య వయసువారికి రోజూ 90 మిల్లీగ్రాముల కర్కుమిన్ రెండు సార్లు ఇచ్చామని.. కొందరికి ఉత్తుత్తి మాత్రలు ఇచ్చామని చెప్పారు. దాదాపు 18 నెలలపాటు కర్కుమిన్ అందించిన తరువాత వారి మెదడు పనితీరుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించామని.. ఆ తరువాత ఆరు నెలలకు ఒకసారి ఇవే పరీక్షలు నిర్వహించామని వివరించారు. ఫలితాలను పరిశీలించినప్పుడు కర్కుమిన్ తీసుకున్న వారి జ్ఞాపకశక్తి పెరిగినట్లు.. ఉత్తుత్తి మాత్రలు తీసుకున్న వారిలో లేనట్లు తెలిసిందని అన్నారు. అంతేకాకుండా కర్కుమిన్ తీసుకన్న వారి మూడ్‌లోనూ ఎన్నో సానుకూల మార్పులు కనిపించాయని చెప్పారు. మరింత విస్త్తృత స్థాయి పరిశోధనలు నిర్వహించడం ద్వారా ఈ ఫలితాలను ధ్రువీకరించుకుంటే.. జ్ఞాపకశక్తిని పెంచేందుకు పసుపు ఓ మంచి ఆయుధం కాగలదన్నమాట! -
మెదడు పనితీరును మాటలే చెప్పేస్తాయి
వయసు పెరుగుతున్న కొద్దీ చాలామందిలో జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం రెండూ తగ్గుతూ ఉంటాయి. ఈ మార్పును తొందరగా తెలుసుకోవడమెలా? మాట్లాడే మాటల్లో వచ్చే తేడాలను గుర్తిస్తే చాలంటున్నారు శాస్త్రవేత్తలు. మధ్యమధ్యలో విరామం ఇస్తూ పదాలు పలకడం.. కొన్ని పదాలను తరచూ పునరావృతం చేయడం మెదడు ఆలోచన సామర్థ్యం తగ్గిపోతోందనేందుకు తొలి సూచనలని విస్కాన్సిన్ మేడిసన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త స్టెర్లింగ్ జాన్సన్ జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ రకమైన పరిస్థితి అల్జీమర్స్ వ్యాధికి దారి తీయొచ్చని అంచనా. కొంతమందికి కొన్ని బొమ్మలు చూపి వాటిని వర్ణించాలని కోరారు. రెండేళ్ల తర్వాత అవే బొమ్మలను చూపగా వర్ణనకు వారు ఉపయోగించిన పదాల్లో ఎంతో మార్పు కనిపించింది. కొంతమంది తాము గతంలో వాడిన పదాలను తేలిగ్గా మరిచిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4.7 కోట్ల మంది మతిమరుపు వ్యాధితో బాధపడుతుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో ఈ సమస్యకు పరిష్కా రం లభించట్లేదు. ఈ నేపథ్యంలో సమస్యను వేగంగా గుర్తించేందుకు తమ పరిశోధన ఉపయోపడుతుందని స్టెర్లింగ్ జాన్సన్ చెబుతున్నారు. -
సోంఫ్‌తో శ్వాస తాజాగా...!
గుడ్‌ఫుడ్ ఎంత మంచి భోజనం అయినా అది తిన్న తర్వాత సోంఫ్ వేసుకుంటే గానీ ఆ భోజనపర్వం సంతృప్తిగా ముగిసినట్లు అనిపించదు కొందరికి. అందుకే చాలా మంచి భోజనం తర్వాత కాసింత సోంఫ్ వేసుకుంటారు. భోజనం ముగిశాక వేసుకునే సుగంధద్రవ్యంగానే కాకుండా సోంఫ్‌తో అంతకు మించి ప్రయోజనం ఉందంటున్నారు ఆహార నిపుణులు. వారు సోంఫ్ గురించి చెబుతున్న కొన్ని అంశాలివి... సోంఫ్‌లో కళ్లకు మంచి చేసే అంశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇవి గ్లకోమాను అరికట్టడంలో తోడ్పడతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. భోజనం తర్వాత కాసింత సోంఫ్ తినే వారిలో మతిమరపు వచ్చే అవకాశాలు ఉండవు. అవి మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాన్ని బలోపేతం చేయడం వల్ల డిమెన్షియా సమస్య రాదంటున్నారు పరిశోధకులు.సోంఫ్‌తో రక్తం బాగా శుద్ధి అవుతుందని పేర్కొంటున్నారు మరికొందరు అధ్యయనవేత్తలు. కాలుష్యం నిండి ఉండే నేటి రోజుల్లో చాలా సులభంగా రక్తంలో పేరుకుపోయే కాలుష్యాలను తొలగించుకునేందుకు ఇది చాలా సులభమైన మార్గంగా వారు చెబుతున్నారు. సోంఫ్ తినేవారిలో ఛాతీ పట్టేసే సమస్య నివారణ అవుతుంది. సోంఫ్‌లో ఉండే అనెథాల్, సినెయోల్ అనే రసాయనాలు శ్వాసనాళాలను వెడల్పుగా విప్పారేలా చేస్తాయి. అందుకే అలర్జీ లేదా ఆస్తమా లేదా బ్రాంకైటిస్ ఉన్నవారు కాస్తంత సోంఫ్ తీసుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. అన్నిటి కంటే ముఖ్యంగా... ఇది శ్వాసను తాజాగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది. అందరికీ తెలిసిన ప్రధాన ఉపయోగం ఇది. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్న సూత్రం సోంఫ్కూ వర్తిస్తుంది. అందుకే ఎంత రుచికరంగా ఉన్నా పరిమితంగా తీసుకోవడం అన్ని విధాలా మేలు. -
ఉడుతలకు జ్ఞాపకశక్తి ఎక్కువే..
ఆహారాన్ని మట్టిలో దాచిపెట్టుకుని.. అవసరమైనప్పుడు వెలికితీసి తినగల సామర్థ్యం ఉడుతలకు సొంతం. అయితే వీటి జ్ఞాపకశక్తి ఇక్కడికే పరిమితం కాలేదని.. సమస్యల పరిష్కారానికి ఉపయోగించిన పద్ధతులను ఇవి రెండేళ్ల వరకూ గుర్తు పెట్టుకోగలవని గుర్తించారు ఎక్స్‌టెక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఐదు ఉడుతలపై నిర్వహించిన ఓ ప్రయోగం ద్వారా ఈ విషయం తెలిసిందని పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ థో రాబర్ట్ తెలిపారు. ఎరగా ఉంచిన ఆహారాన్ని అందుకునేందుకు కొన్ని అడ్డంకులు సృష్టించిన శాస్త్రవేత్తలు.. ఉడుతలు ఆ అడ్డంకులను ఎలా అధిగమించాయో గమనించారు. మొదట్లో అవి 8 సెకన్ల సమయం తీసుకున్నా.. కొంతకాలం తర్వాత ఈ సమయం 2 సెకన్లకు తగ్గింది. దాదాపు 22 నెలల తర్వాత కొన్ని మార్పులతో ఇదే రకమైన ప్రయోగం చేసినప్పుడు ఆ ఉడుతలు ముందు కొంచెం తటపటాయించినా ఆ తర్వాత మూడు సెకన్ల వ్యవధిలో ఆహారాన్ని అందుకున్నాయని దీని ద్వారా అవి తమ పాత పద్ధతులను గుర్తుంచుకున్నట్లు అయిందని రాబర్ట్ వివరించారు. -
టీ – మతిమరపు ఢీ!
పరిపరిశోధన జీవితంలో మతిమరపు రాకూడదని తలుస్తున్నారా? జ్ఞాపకశక్తిని మెదడులోనే ఉండిపొమ్మని పిలుస్తున్నారా? మీ సంకల్పం నేరవేరుగాక. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండేందుకూ, మతిమరపు (డిమెన్షియా)ను నివారించేందుకు అవలంబించాల్సిన మార్గం చాలా రుచికరమైనదీ, ఇష్టమైనదీ! మరీ మాట్లాడితే రోగి కోరేదీ అదే, పరిశోధకుడు సూచించేదీ అదే! టీ కెటిల్ నుంచి వస్తున్న కమ్మని వాసనను ఆఘ్రాణిస్తూ... గుక్క గక్కనూ ఆస్వాదిస్తూ తాగండి. అది బ్లాక్ టీ గానీ, గ్రీన్ టీ లేదా సాధారణ చాయ్ గానీ.... క్రమం తప్పకుండా టీ తాగేవారిలో 50 శాతం మందికి డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువంటున్నారు పరిశోధకులు. టీ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, థియాఫ్లేవిన్స్ పోషకాల వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలతో మెదడులో వాస్క్యులార్ డ్యామేజీ, న్యూరోడీజెనరేషన్ తగ్గుతాయని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌నకు చెందిన డాక్టర్ ఫెంగ్ లీ పేర్కొంటున్నారు. సదరు యూనివర్సిటీ అధ్యయన ఫలితాలను ఇటీవలే ‘ద జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ ఏజింగ్’ అనే ఆరోగ్య పత్రికలోనూ అధికారికంగా ప్రచురించారట. అందుకే ఇకపై మతిమరపు, డిమెన్షియా, అలై్జమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వ్యాధులకు దూరంగా ఉండాలనుకునేవారు కాస్త చాయ్‌పై ప్రేమ పెంచుకుంటే అది మతిమరపును ‘ఛేయ్’ అంటూ దూరంగా తరమేస్తుందంటున్నారు ఈ పరిశోధలకు నేతృత్వం వహించిన డాక్టర్ ఫెంగ్ లీ! కాకపోతే ఒక షరతు.... ఈ చాయ్ జాయ్ హాయ్‌లు రోజుకు మూడు కప్పులకు మించకూడదంటూ పరిమితి పెడుతున్నాడు డాక్టర్ లీ!! -
బషీర్‌బాగ్ అమరవీరులకు నివాళి
కర్నూలు సిటీ: బషీర్ బాగ్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. సీపీఎం జిలా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నగర అద్యక్షులు గౌస్ దేశాయ్ అమరవీరుల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు అనుసరించిన విధానాల వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సీఎం విధానాలపై పోరాటాలు చేయడమే అమరులకు నిజమైన నివాళి అని అన్నారు. ప్రజా వ్యతిరేఖ విధానాల వల్ల పదేళ్లు అధికారానికి దూరమైనా చంద్రబాబు తీరులో మార్పు రాలేదని, ఇకపై టీడీపీ శాశ్వతంగా సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు రాధాకష్ణ, అంజిబాబు, రాముడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర జ్ఞాపకం
-
సెల్ఫ్ గిఫ్టెడ్ మెమోరీస్...
నిన్న మొన్నటిదాకా మనకు నచ్చిన ప్రతి సందర్భాన్ని కెమెరాలలో బంధించి, అల్బమ్లలో భద్రపరచుకోవడం... అవి ఎప్పుడో పండుగలకు, పబ్బాలకు బంధువులొచ్చినప్పుడు ఒక్కసారి దుమ్ము దులిపి పాత జ్ఞాపకాలను అలా నెమరువేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత సెల్ఫీలే ప్రపంచంగా కలిసిన ప్రతి ఒక్కరితో ఫొటోలు దిగుతూ వాటిని వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ సైట్స్‌లలో పోస్టు చేసుకుని బహిరంగంగా కామెంట్స్, షేర్స్లతో కాలం గడిపారు. ఇప్పుడు సెంటిమెంటల్‌గా చాలా సెంటిమెంట్స్‌ని ఫాలో అవుతూ ప్రతి క్షణాన్ని ఒక మరుపురాని క్షణంగా మలచుకోవాలనే దిశలో బిడ్డ కడుపులో పది పడగానే తీయించుకునే టెస్ట్‌లు, స్కానింగ్‌లు వంటి రిపోర్ట్‌లను సైతం ఎంతో జాగ్రత్తపరచుకుంటున్నారు. కడుపులోని బిడ్డ ఆడ, మగా అనే డౌట్ క్లియర్ అవ్వనంతవరకు ఒక చిన్ని పాప బట్టలతోనో, బాబు షూస్తోనో కలిపి స్పెషల్ ఫొటోషూట్ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత బిడ్డ ప్రతి కదలికలను గుర్తించే స్కాన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఆ బిడ్డ కదలికలతో కూడిన వీడియో స్కాన్ సీడీని సైతం అడిగి తీసుకుంటున్నారు. వాటిని ఇంటిల్లిపాది చూసుకుని మురిసిపోతున్నారు. అంతేకాదు బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ టచ్‌ని, ఫస్ట్ ఫొటోని, ఫస్ట్ డ్రెస్...అంతెందుకు పసిబిడ్డ వేలి ముద్రలు, కాళీ ముద్రలను సైతం అచ్చు తీసుకుని వాటిని ఫ్రేమ్ కట్టించుకుని మరీ ఇంటిలో భద్రపరుచుకుంటున్నారు. మరికొందరు పేరేంట్స్ అయితే కాస్టింగ్ అనే కొత్త టెక్నాలజీ పద్ధతిని ఫాలో అవుతూ పుట్టిన బిడ్డ చేతినే, కాలినో తమ చేతుల్లో పెట్టుకుని ఇంప్రింట్ వేయించుకుని బంగారు పూతను అడ్డహించి మరీ ఫ్రేమ్ కట్టించుకుంటున్నారు. ఇంకొందరు క్రియేటివ్ పేరేంట్స్ అయితే తమ పిల్లల పాదముద్రలను, చేతి అచ్చులను, తమ పిల్లల ముఖచిత్రాలను సైతం పచ్చబొట్టు వేసే నిపుణులతో ప్రత్యేకంగా టాటూ వేయించుకుని మురిసిపోతున్నారు. అక్కడితో ఆగట్లేదు. ప్రతి ఒక్క సిట్యువేషన్‌ని ఎంతో స్పెషల్‌గా భావించి తమ పిల్లలు వెళ్లే ఫస్ట్ డే స్కూల్ ఫొటో నుంచి ప్రతిరోజు ఏదో ఒక మధురజ్ఞాపకాన్ని భద్రపరచి అవి చూసుకుంటూ హ్యపీనెస్ని షేర్ చేసుకుంటూ తమ బంధాలను మరింత బలపరుచుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులైతే తమ పాల బుగ్గల పసి పిల్లల ముఖాలను బంగారంతో కూడిన త్రీడీ లాకెట్ రూపంలో తయారు చేయించుకుని హారంగా ధరిస్తున్నారు. మనస్సుకు ఎన్ని విధాలుగా వీలైతే అన్ని రకాలలో తమ క్రియేటివిటీని ఉపయోగిస్తూ ఈ బిజీ లైఫ్సై్టల్లో దొరికే టైంలోనే ప్రతి మొమోరీని కళ్ల ఎదుట ఉంచుకుని చూసుకుంటూ బంధాలని అనుబంధాల్ని రెట్టింపు చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు నగరవాసులు...పెరిగే పిల్లల ప్రతి జ్ఞాపకంతో పాటు ఉన్న మనుషుల విలువలను కాపాడుకునేందుకు ప్రతి క్షణం ఎంతో జాగ్రత్తగా భావించి మనిషి చిరాయువు తీరేదాకా బంధాలను పెంపోందించుకోవటానికి కృషి చేస్తున్నారు నేటి తరం జనం. చివరికి మనిషి ఆయువు తీరక కూడా తమకు ఇష్టమైన వాటినే తలచుకుంటూ తమ జ్ఞాపకాలలో జీవనం గడిపేందుకు సమాధులు సైతం మరణించిన వారికి ప్రియమైన వస్తువు రూపంలో తయారు చేయించి వారి ఆకాంక్షలకు ప్రాణం పోస్తున్నారు. -
వ్యాయామంతో జ్ఞాపకశక్తి
రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామనేది తెలిసిన విషయమే. అయితే దీనివల్ల మన జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందనే విషయం తెలుసా! అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది.వ్యాయామం ఫలితంగా మెదడులోని కీలక ప్రాంతంలో ఎప్పటికప్పుడు కొత్త నాడీకణాలు పుట్టుకొస్తాయని, దీంతో పాత విషయాలను గుర్తుం చుకునే సామర్థ్యం పెరుగుతుందని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త అశోక్ శెట్టి పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం తాము ఓ రకమైన ఎలుకలపై ప్రయోగాలు జరపగా, మెదడులోని హిప్పోకాంపస్ ప్రాంతంలో ఎక్కువ స్థాయిలో కొత్త నాడీ కణాలు ఏర్పడ్డాయని, అయితే ఆ ఎలుకలు అప్పటి వరకు నేర్చుకున్న అంశాలను మరిచిపోయినట్లు తమ పరిశోధనల్లో తేలిందని వివరించారు. దీంతో మరోరకమైన ఎలుకలపై ప్రయోగాలు చేయగా, వీటిల్లో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదని తెలిపారు. వ్యాయామాలు చేస్తే జ్ఞాపక శక్తి తగ్గుతుందనే వారికి తాజా పరిశోధనలు స్వాంతన చేకూరుస్తాయని వివరించారు. -
వ్యాయామంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది
రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని మనకు తెలుసు. అయితే దీనివల్ల మన జ్ఞాపకశక్తి కూడా పదికాలాల పాటు పదిలంగా ఉంటుందంటున్నారు టెక్సస్ ఎ అండ్ ఎం కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. వ్యాయామంతో మెదడులోని కీలకమైన ప్రాంతంలో ఎప్పటికప్పుడు కొత్తకొత్త న్యూరాన్లు పుట్టుకొస్తాయని, ఫలితంగా పాత జ్ఞాపకాలను మరచిపోకుండా ఉంటామని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న భారతీయ సంతతి శాస్త్రవేత్త అశోక్ శెట్టి అంటున్నారు. రెండేళ్ల క్రితం తాము ఒకరకమైన ఎలుకలపై ప్రయోగాలు జరిపినప్పుడు మెదడులోని హిప్పోకాంపస్ ప్రాంతంలో ఎక్కువ స్థాయిలో కొత్త న్యూరాన్లు ఏర్పడ్డాయని, అయితే ఆ తరువాత ఆ ఎలుకలు అప్పటివరకూ నేర్చుకున్న అంశాలను మరచిపోయాయని ఆయన తెలిపారు. దీంతో తాము మరోరకమైన ఎలుకలపై ప్రయోగాలు చేపట్టామని, దీంట్లో ఎలాంటి ప్రతికూల ఫలితాలూ రాలేదని తెలిపారు. గత పరిశోధనలను చూసి వ్యాయామం వల్ల జ్ఞాపకశక్తి నశిస్తుందనుకునే వారికి తాజా అంచనాలు సాంత్వన చేకూరుస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. -
రక్త ప్రసరణకు శీర్షాసనం
లైఫ్ రక్తాన్ని గుండెకు చేర్చడానికి రక్తశుద్ధి జరగడానికిఈ ఆసనం చాలా మంచిది. మనసుకి మంచి ఏకాగ్రతను అలవాటు చేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి ఒత్తిడి నుంచి దూరంగా ఉండటానికి లేదా ఉపశమించడానికి చాలా ఉపయోగకరమైనది ఈ ఆసనం. ఆసనాలన్నింటిలోకి ముఖ్యమైనది శీర్షాసనం. తలక్రిందులుగా చేసే ఆసనాలలో ఇది అత్యంత ప్రధానమైనది. ముందుగా మోకాళ్లు మడచి సీటు భాగం వెనుక పాదాల మీద ఆనేటట్లుగా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ మార్జాలాసనంలోకి వచ్చి (రెండు చేతులు మోకాళ్ల మీద వంగి) అక్కడ నుండి అర్థ అధోముఖ శ్వాసాసనం లోకి కావాలి. అటు నుంచి తలక్రిందకు ఉంచి అరచేతులు రెండూ (చేతి వేళ్లు లాక్ చేసి ఉంచి) తలకి వెనుక వైపుగా.. నేల మీద తలకి సపోర్ట్‌గా ఆనించాలి. అలాగే, వంగి ఉన్న మోకాళ్లను నెమ్మదిగా స్ట్రెయిట్‌గా చాపి లేదా అలానే కొంచెం మడిచి ఉన్న స్థితిలోనే ఉంచాలి. రెండు కాళ్లను ఒకేసారి నేల మీద నుండి గాలిలోకి పైకి లేపి.. కాళ్లు, నడుము భాగాలను కొంచెం కొంచెం నిటారుగా పైకి తీసుకువెడుతూ ఉండాలి. ఈ సమయంలో శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ పూర్తి స్థితిలోకి వెళ్ళాలి. పూర్తి ఆసన స్థితిలో రెండు లేదా ఐదు నిమిషాల పాటు ఉండటం వల్ల ఆసనం పూర్తి ఉపయోగాలు చేకూరుతాయి. పూర్తి ఆసన స్థితిలో సాధారణ శ్వాస తీసుకుంటూ మనసుకు సహస్రారం మీద, తల సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ కేంద్ర నాడీ మండల వ్యవస్థ మీద ఉంచాలి. దీంట్లో సాధకులు రెండు కాళ్లను పక్కలకు స్లిట్ చేయవచ్చు. లేదా ఒక కాలును నిటారుగా ఉంచి రెండవకాలుని వృక్షాసన స్థితిలో ఉంచవచ్చు. లేదా రెండు కాళ్లను బద్ధ కోణాసనంలో లాగా లేదా పద్మాసనంలో కాని ఉంచవచ్చు. ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చేటప్పుడు ఒక్కసారిగా శరీరాన్ని భూమి మీద పడవెయ్యకూడదు. వెనుకకు వచ్చేటప్పుడు కూడా చాలా నిదానంగా రావడం మంచిది. ఉపయోగాలు: శరీరం క్రింది భాగాల్లో స్టాగినెంట్ అయిన రక్తాన్ని గుండెకు చేర్చడానికి రక్తశుద్ధి జరగడానికి ఈ ఆసనం చాలా మంచిది. దీని వల్ల తల, మెదడు, కార్నివాల్ నెర్వస్ సిస్టమ్‌కి రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది. మాస్టర్ గ్లాండ్ అయిన పిట్యుటరీ గ్రంధిని ఉత్తేజపరచడం కారణంగా మిగిలిన ఎండోక్రైన్ గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది. కళ్లకు చాలా మంచిది. కోర్ మజిల్స్, భుజాలు, చేతులు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. లింఫటిక్ సిస్టమ్‌ని ఉత్తేజపరచడం వల్ల టాక్సిన్స్ ఎక్కువగా శరీరంలో నుంచి బయటకు పోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనసుకి మంచి ఏకాగ్రతను అలవాటు చేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి ఒత్తిడి నుంచి దూరంగా ఉండటానికి లేదా ఉపశమించడానికి చాలా ఉపయోగకరమైనది ఈ ఆసనం. వర్టిగో సమస్య ఉన్నవారు, స్పాండిలైటిస్ సమస్య వున్నవారు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది. శీర్షాసనం పూర్తి అయిన తరువాత శవాసనంలో విశ్రాంతి పొందాలి. లేదా ధ్యానంలో కూర్చొని వచ్చే మార్పులు గమనించాలి. జాగ్రత్తలు: ఇది కష్టమైన ఆసనం కనుక యోగనిపుణుల పర్యవేక్షణలో చేయాలి. మొదటిసారిగా సాధన చేసేవారు తోటి సాధకుల సపోర్ట్ తీసుకుని చేయడం మంచిది. గోడని ఆధారంగా చేసుకుని కూడా సాధన చేయవచ్చు. తలకింద ఒక కుషన్ (దిండు)ను ఉంచి సాధన చేస్తే కొంచెం తేలికగా ఉండి, ఒక వేళ బ్యాలెన్స్ తప్పి పక్కలకు కాని, వెనుకకు కాని పడిపోయినప్పటికీ ప్రమాదం అంతగా ఉండదు. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా మెడ, భుజ భాగాలకు గాయలు కావచ్చు. ముఖ్యగమనిక: పూర్తి ఆసనస్థితిలో ఉండగలిగినవారు అను నిత్యం సాధన చేసేవారు మాడు భాగాన్ని నేలమీద ఉంచడం కాకుండా నుదురుకి మాడు భాగానికి మధ్యలో ఉండే కపాల భాగం (ప్రీ పోర్షనల్ కార్టెక్స్ భాగాన్ని) నేల మీద ఉంచి అక్కడ లోడ్ పెట్టడం మంచిది. సమన్వయం: ఎస్. సత్యబాబు, సాక్షి ప్రతినిధి ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
గడుగ్గాయి
♦ రెండేళ్ల వయసులోనే అపార జ్ఞాపకశక్తి ♦ భక్త రామదాసు పది కీర్తనలు ఆలపిస్తూ.. ♦ రాష్ట్రాల రాజధానుల పేర్లు ఇట్టే చెబుతూ.. ♦ ఆకట్టుకుంటున్న చిన్నారి సౌమిత్ర ప్రశస్తి భద్రాచలం : ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనే సామెతకు ఆ చిన్నారి కరెక్టుగా సరిపోతుంది. రెండేళ్ల రెండునెలల వయసులోనే రాష్ట్రాలు- రాజధానుల పేర్లు గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తోంది. బుడిబుడి అడుగులు వేస్తూనే తన అపార జ్ఞాపకశక్తితో అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. భద్రాచలంలోని మెడికల్ కాలనీకి చెందిన గట్టు వెంకటాచార్య మనువరాలు సౌమిత్ర ప్రశస్తి దేశంలోని 25 రాష్ట్రాల పేర్లను చకచకా చెప్పేస్తోంది. ‘ముద్దుగారే యశోద..’ అంటూ కూనిరాగాలు కూడా తీస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. భక్తరామదాసు శ్రీ సీతారాములవారిపై భక్తిభావంతో రాసిన పది కీర్తనలనూ రాగయుక్తంగా ఆలపిస్తుంది. పరిశ్రమలశాఖలో ‘ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్’గా పనిచేస్తున్న ప్రశస్తి తల్లి శ్రీహరిణి.. పాపకు స్నానం పోయించేటప్పుడు లాలిపాటలు పాడుతుంది. వాటిని కూడా ఈ చిన్నారి ఇట్టే పట్టేసి ఆలపిస్తోంది. అన్నం తినిపించేటప్పుడు పాడిన శ్రీరామనామ కీర్తనలు, వాకింగ్ సమయంలో చెప్పిన రాష్ట్రాలు- రాజధానులు అన్నీ తన అపార జ్ఞాపకశక్తితో గుర్తు పెట్టుకొని చెబుతుంది. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల పేర్లు కూడా ప్రశస్తి దగ్గర ఓ నాలుగైదు సార్లు చెబితే చాలు... ఇట్టే వాటిని గుర్తుపెట్టుకొని ఎప్పుడు అడిగినా.. ఠక్కున సమాధానం ఇస్తుందని తల్లి శ్రీహరిణి తెలిపింది. చిన్నారి మేధా సంపత్తిని పలువురు అభినందిస్తున్నారు. గట్టువారి ఇంట గడ్డుగ్గాయి పుట్టిందని ప్రశంసిస్తున్నారు. -
జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా?
వాషింగ్టన్: మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే.. బూట్లు, చెప్పులు లేకుండా పరిగెత్తాల్సిందేనంటున్నారువర్సిటీ నార్త్ ఫ్లోరిడా ఫ్లోరిడా పరిశోధకులు. ‘ఈ విధంగా పరిగెడితే.. వారికి జ్ఞాపకశక్తి, కౌశలం బాగా పెరిగిన విషయాన్ని గుర్తించాం. ఇలా చేయటం వల్ల అరికాళ్లపై ఒత్తిడి పెరగటం, తగ్గటం జరుగుతుంది. ఇది మెదడులోని జ్ఞాపకశక్తి నాడులపై ప్రభావం చూపుతుంది’ అని పరిశోధన సారథి ట్రేసీ అలోవే తెలిపారు. -
మెదడుకు పదును పెట్టే ఆహారం
ఎగ్జామ్ టిప్స్ బ్లూ బెర్రీలు జ్ఞాపకశక్తిని పెంచడంతో బాటు ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడుకు సరిగా రక్తం సరఫరా అయ్యేలా చేసి చురుగ్గా పని చేసేలా చేస్తాయి. సాల్మన్ చేపలు - ఇందులోని ఒమెగా ఫ్యాట్స్ బ్రైస్ పవర్ పెంచి అల్జీమర్ వ్యాధి రాకుండా నివారిస్తాయి.అవిసెగింజలు: ఏయల్‌ఏ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు సెన్సరీ సందేశాలను మెదడుకు చేర్చి మెదడుకు పదును పెడతాయి.కాఫీ-కెఫీన్‌ను మితంగా తీసుకుంటే మతిమరుపును పోగొట్టి అల్జీమర్ వ్యాధి రాకుండా చేయడమే కాక అందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయి.మిశ్రమ నట్స్ - వేరుశనగ గింజలు, ఆక్రోట్, బాదం లాంటి నట్స్ నిద్రలేమిని పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇందులోని న్యూరోట్రాన్సిస్టర్స్ చదువుకోవాలనే మూడ్‌ను పెంచుతాయి. అవకాడో - ఇందులోని మేలు చేసే కొవ్వులు రక్త సరఫరా పెంచి మెదడును చురుగ్గా పనిచేయడమే కాక రక్తపోటును కూడా తగ్గిస్తాయి.గుడ్లు, గుడ్లలోని కొలిన్ అనే పోషకం వల్ల తెలివితేటలు వృద్ధి చెందుతాయి. తృణధాన్యాలు, ఓట్మీల్ లాంటి ముడిధాన్యాలు తక్షణ శక్తిని ఇచ్చి బ్రెయిన్ పవర్ పెంచుతాయి. ఇందులోని పీచు పదార్థాలు, విటమిన్లు, ఒమెగా కొవ్వులు వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు కూడా లభిస్తాయి.చాకొలెట్ చాలా రుచికరమైన బ్రెయిన్ ఫుడ్. ముదురు రంగులోని చాకోట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఏకాగ్రతని, అవగాహనా శక్తిని పెంచి విద్యార్థులలో స్పందన, గ్రాహ్యక శక్తిని కూడా పెంచును.{బకోలి జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా మెదడును చురుగ్గా చేస్తుంది. డా. కె. వాణిశ్రీ న్యూట్రిషన్ కన్సల్టెంట్ తన్వికా డైట్ఫిట్ -
బరువు పెరిగితే మతిమరుపు!
పరిపరి శోధన బరువు పెరిగితే జ్ఞాపకశక్తి క్షీణించి మతిమరుపు వస్తుందట! స్థూలకాయానికి, జ్ఞాపకశక్తికి విలోమానుబంధం ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని బ్రిటిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్థూలకాయులకు మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో పాటు మతిమరుపు కూడా తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. కేంబ్రిడ్జి వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 18-35 ఏళ్ల వయసు గల వారిపై విస్తృత అధ్యయనం నిర్వహించారు. వారిలో సాధారణ బరువుతో ఉన్నవారితో పోలిస్తే, స్థూలకాయుల్లో జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. స్థూలకాయానికి దారితీసే మానసిక కారణాలను విశ్లేషించడంలో తమ పరిశోధన దోహదపడగలదని వారు చెబుతున్నారు. -
రిమ్జిమ్.. బ్రెయిన్ జిమ్
దేహం ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కు వెళతాం.. మరి బ్రెయిన్ ఫిట్‌గా (చురుగ్గా) ఉండాలంటే..! ఇందుకు ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. వీటిని చేయించేందుకు ప్రత్యేక జిమ్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడ కేవలం జ్ఞాపకశక్తిని పెంచే వ్యాయామాలు మాత్రమే చేయిస్తారు. ఇప్పుడు సిటీలో వీటికి క్రేజ్ పెరిగింది. మలేషియాలో అంకురించిన బ్రెయిన్ జిమ్ కాన్సెప్ట్ ఇప్పుడు సిటీవాసులను అలరిస్తోంది. ఇన్నాళ్లు చదువుతో బిజీగా గడిపిన తమ పిల్లల్లో చురుకుదనాన్ని పెంచేందుకు దోహదపడుతున్న ఈ డిఫరెంట్ ఎక్సర్సైజులకు పిల్లల తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. సమ్మర్లో ఈ యాక్టివిటీని నేర్చుకునేందుకు పిల్లలను ఆయా శిక్షణ సంస్థల్లో చేర్పిస్తున్నారు. * శిక్షణకు క్యూ కడుతున్న పిల్లలు * జ్ఞాపకశక్తి పెంచే విభిన్న వ్యాయామాలు.. ఎల్కేజీ నుంచి తమ పిల్లలు చదువులో ముందుండాలనే తాపత్రయం నేటి తల్లిదండ్రుల్లో పెరిగింది. దగ్గరుండి మరీ సందేహలు తీరుస్తున్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక పోతున్నారు. లాస్ట్ బెంచ్ విద్యార్థులను సైతం ఫస్ట్ ర్యాంకర్స్లా తీర్చిదిద్దడానికి పుట్టుకొచ్చిందే బ్రెయిన్ జిమ్. పిల్లల మెదడుకు పదునుపెట్టి.. చురుగ్గా పనిచేసే కిటుకులను నేర్పిస్తోంది. అంతే కాదండోయ్ మెమొరీ గేమ్స్, డాన్స్, ఫన్ యాక్టివిటీస్, రిలాక్సేషన్ ఎక్సర్సైజులను పిల్లలకు నేర్పిస్తున్నారు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, గ్రాహకశక్తితో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతున్నారు. రెగ్యులర్‌కు భిన్నంగా.. పిల్లలను అన్ని పనుల్లో చురుగ్గా ఉంచేందుకు దోహదం చేసే ఈ బ్రెయిన్ జిమ్‌లో నిపుణుల మార్గదర్శనంలో ఐదేళ్ల నుంచి పదహరేళ్ల పిల్లలతో విభిన్నమైన ఆసనాలు వేయిస్తారు. సాధారణంగా మెడిటేషన్.. మానసిక ప్రశాంతతో పాటు ఏకాగ్రతను పెంచుతుంది. ‘మేం చెప్పే ఎక్సర్సైజు చేస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేయగలరు. ఒక్కముక్కలో చెప్పాలంటే అన్ని విషయాల్లో పిల్లలు చాలా చురుగ్గా, చాకచాక్యంగా ఉంటార’ని చెబుతున్నారు బ్రెయిన్ జిమ్ ఎక్స్పర్ట్స్. బ్రెయిన్ జిమ్‌లో కుడి, ఎడమ చేతులు ఒకేసారి పనిచేసేలా ఎక్సర్సైజులు ఉంటాయి. హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్ కోసం ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. అయితే రెగ్యులర్ వ్యాయామాలకు భిన్నంగా ఉండటంతో వీటిని చేసేందుకు చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. మెమొరీ గేమ్స్‌పై ఆసక్తి.. మెమొరీ గేమ్స్ పిల్లల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. ‘20 మంది పిల్లలకు మెమరీ గేమ్‌ను చూపెడతాం. పది మందిని గుర్తు పెట్టుకోమంటాం. ఏ పొజిషన్లో ఏమున్నాయో గుర్తు పెట్టుకొని వాళ్లు మళ్లీ చెప్పాలి. ఇలా ట్రయాంగిల్, సబ్ ట్రయాంగిల్లో నంబర్లు చూపెడతాం. ఇలా చేయడం వల్ల పిల్లలు చూసింది చూసినట్టు గుర్తు పెట్టుకోవడానికి అవకాశముంటుంది. దీన్ని ఫొటోగ్రఫిక్ మెమొరీ అని కూడా అంటారు’ అని చెబుతున్నారు ఎంబీఎం ఇన్స్ట్రక్టర్ సపర్ణ. అలాగే మైండ్ రిలాక్స్ కోసం చేయించే డాన్స్‌కు కూడా పిల్లల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్కూల్లో పుస్తకాలు, ఇంటికొచ్చాక వీడియో గేమ్స్, లేదంటే కంప్యూటర్ ముందు కాలం వెళ్లదీస్తున్న సిటీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ ఉండటం లేదు. అందుకే ఎంబీఎం నేర్పిస్తున్న మలేషియన్ డాన్స్ స్టెప్పులపై పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు సిటీ కిడ్స్. ఇంకా మ్యూజిక్, డిస్కషన్స్, ఆలోచనలు పంచుకోవడం లాంటి అంశాల్లోనూ పిల్లలు పరిణతి సాధించేలా చూస్తున్నారు నిపుణులు. కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, హబ్సిగూడలో ఎంబీఎం కేంద్రాలున్నాయి. ఈ సెంటర్స్‌లో పిల్లలతో పాటు అరవై ఏళ్ల వయసు వారిని కూడా ఒత్తిడి నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్, సెల్ఫ్ మోటివేటింగ్, క్రియేటివిటీ ఇంట్రెస్టు వంటివి కూడా నేర్పిస్తున్నారు. శిక్షణ తరగతులు... బ్రెయిన్ జిమ్, మెమొరీ ట్రైనింగ్, కాన్సంట్రేషన్ అటెన్షన్ ఇంప్రూవ్మెంట్, బిహేవియర్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంఫ్రూవ్‌మెంట్, క్రాఫ్ట్, హ్యాండ్ రైటింగ్‌లో క్లాసులు నిర్వహిస్తోంది మిడ్ బ్రెయిన్ మాస్టర్స్. చేరాలనుకునేవారు 81250 50015 నంబర్లో సంప్రదింవచ్చని సంస్థ నిర్వాహకులు తెలిపారు. -
మొబైల్ కొంటున్నారా?
శేఖర్ మొబైల్ ఫోన్ మార్చాలనుకున్నాడు. ఎలాగూ మారుస్తున్నాం కదా... చక్కని ఫీచర్లున్న బ్రాండెడ్ మొబైల్... అది కూడా కెమెరా, ర్యామ్, ప్రాసెసర్ అన్నీ బాగా అప్‌గ్రేడెడ్ అయి ఉంటే బాగుండుననుకున్నాడు. అందుకే... జీతంలోంచి నెలనెలా దాచిన మొత్తాన్ని తీసి దాదాపు రూ.50 వేలు పెట్టి కొత్త ఫోన్ తీసుకున్నాడు. ఇంతా చేసి పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజీ చేశాడు కానీ... దానికి గాను తగ్గించిన మొత్తం కేవలం రూ.3వేలు. కొన్నపుడేమో ఆ ఫోన్ కూడా దాదాపు 12 వేలు పెట్టి కొన్నదే. కాకుంటే ఏడాది వాడకానికే దాని ధర రూ.3 వేలకు పడిపోయింది. సరే! పోతే పోయిందని కొత్త ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లో తీసుకున్న శేఖర్ సంతోషం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇపుడు ఆఫీసులో అతనిదే లేటెస్ట్ ఫీచర్లున్న హై-ఎండ్ మొబైల్. నాలుగు నెలలు గడిచింది. ఆ రోజే కొన్న కొత్త ఫోన్‌ను తెచ్చి శేఖర్‌కు చూపించాడు రఘు. అందులో ఉన్న ఫీచర్లను వివరిస్తుంటే శేఖర్ బుర్ర తిరిగింది. ఎందుకంటే అన్నీ శేఖర్ ఫోన్‌కన్నా ఆధునిక ఫీచర్లే. కెమెరా నుంచి ర్యామ్, మెమరీ వరకూ అన్నీ ఎక్కువే. ధర మాత్రం కేవలం రూ.17,500. శేఖర్ కొన్న బ్రాండ్ కాకపోయినా అది కూడా మంచి బ్రాండే. శేఖర్‌కు ఆ రోజంతా నిద్రపట్టలేదు. తను రూ.50వేలు పెట్టి ఫోన్ కొని నిండా నాలుగు నెలలు కాలేదు. అంతకన్నా మంచి ఫోన్... అంతకన్నా చాలా తక్కువ ధరకే!! ఎలా సాధ్యం? మర్నాడు రఘుతో ఇదే మాటంటే తనేమన్నాడో తెలుసా? నువ్వు కొన్న ఫోన్ కూడా ఇపుడు రూ.30 వేలకే వస్తోందోయ్!! అని! గతేడాది భారతదేశ మార్కెట్లోకి 1,137 మోడళ్ల మొబైల్ ఫోన్లు విడుదలయ్యాయి. అంటే... రోజుకు 3.11 కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వచ్చి చేరాయన్న మాట. మరి ఎంత కొత్త ఫోనైనా ఇలాంటి మార్కెట్లో నెల తిరిగేసరికి పాతబడిపోతోందంటే వింతేముంది? ఇక స్మార్ట్ఫోన్లను చూస్తే గతేడాదికి అంతర్జాతీయంగా విడుదలైన 691 మోడళ్లలో 476 మోడళ్లు భారతీయ కంపెనీలవే. అంటే సగటున భారతీయ కంపెనీలు రోజుకు 1.3 స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయన్నమాట. మరి రోజుకో కొత్త ఫోను మార్కెట్లోకి వస్తున్నపుడు ఏ ఫోనైనా ఎన్నాళ్లు కొత్తగా ఉంటుంది చెప్పండి? అందుకే... ఫోన్లు కొనే టపుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ తరవాత బాధ పడాల్సిన అవసరం రాకపోవచ్చనేది నిపుణుల సలహా. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో * ఒక దాన్ని మించి మరొకదాన్లో ఫీచర్లు; ధరలోనూ పోటీ * విడుదల చేసిన ఐదారు నెలలకే ధరలు తగ్గిస్తున్న కంపెనీలు * అందుకే కొనేముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు అవసరాన్ని తెలుసుకోండి! * ఫోన్ కొనేముందు మీ అవసరమేంటో తెలుసుకోండి. కేవలం మాట్లాడటానికా? లేక గేమ్స్ ఆడటానికా? మంచి ఫొటోలు తీసుకోవటానికా? డిజిటల్ అసిస్టెంట్‌లా వివిధ అవసరాలకు వాడుకోవటానికా? ఇలా అవసరమేంటో తెలుసుకోవాలి. * ఫొటోలకోసం అనుకోండి. అప్పట్లో మార్కెట్లో అత్యధిక పిక్సెల్ కెమెరాతో ఏ ఫోన్ ఉంటే అది కొనుక్కునే ప్రయత్నం చేయాలి. గేమ్స్ కోసమనుకుంటే అధిక ర్యామ్ ఉండే ఫోన్‌ను, వీడియోల కోసం తీసుకునేవారు పెద్ద డిస్ప్లేను చూసుకోవాలి. ఇలా మన అవసరానికి తగ్గ ఫీచర్ హైఎండ్‌లో ఉన్నది చూసుకుని మిగతా విషయాల్లో రాజీ పడొచ్చు. అప్పుడు ఫోన్ తక్కువ ధరకే వస్తుంది. - కొన్నాళ్ల తర్వాత మరిన్ని ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లోకి వచ్చినా... మన అవసరానికి సంబంధించిన ఫీచర్ మాత్రం మరీ మారిపోయే అవకాశాలు తక్కువ. బాధేమీ ఉండదు. కొన్నాళ్లు వేచి చూడండి... ఫోన్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే కొనేసుకోవాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. తరవాత మరింత హైఎండ్ ఫోన్ వస్తే అది కూడా కొనేయొచ్చునని అనుకుంటారు. అలాంటి వాళ్ల విషయంలో ఇబ్బం దులేవీ ఉండవు. కానీ ఎప్పుడో ఒకసారి దాచుకున్న సొమ్మం తా పెట్టి కొత్త ఫోన్ కొనేవారు మాత్రం మార్కెట్లోకి రాగానే కొనేయటం సరికాదు. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చాకే ఆ ఫోన్ సత్తా ఏంటో తెలుస్తుంది. ఒకవేళ వినియోగదారులకు నచ్చకపోతే తయారు చేసిన స్టాకంతా విక్రయించాలి కనుక రేటు తగ్గించి అమ్మటానికి కంపెనీలు ప్రయత్నిస్తాయి. బాగా సక్సెస్ అయిన ఒకటిరెండు మోడళ్లు మినహా ఏ మోడల్ ధరైనా కొద్ది నెలలకే దాదాపు 30-40% తగ్గిపోవటానికి ప్రధాన కారణమిదే. అందుకని కాస్త వేచిచూస్తే బెటర్. హోంవర్క్ చేస్తే మంచిది... ఏదైనా ఫోన్ కొనాలనుకున్నపుడు దాని ఫీచర్లు, ధర ఇతరత్రా వివరాలు తెలుసుకుని... మార్కెట్లో అలాంటి ఫీచర్లున్న ఇతర ఫోన్ల ధరలు కూడా ఎంతున్నాయో తెలుసుకోవాలి. ఇపుడు చాలా దుకాణాలు ఇలాంటి కంపేరిజన్ను అందిస్తున్నాయి. ఇక ఆన్లైన్ సైట్లయితే చెప్పనే అక్కర్లేదు. ఏ ఈ-కామర్స్ వెబ్సైట్లోకి వెళ్లినా మూడు నాలుగు ఫోన్లను ఎంచుకుని వాటిలో ఫీచర్లను, ధరను పోల్చి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇలా కొన్ని ఫోన్లను పోల్చి చూసుకున్నాకే ఎంచుకుంటే, తక్కువ ధరకే నచ్చిన ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ధరలెందుకు తగ్గుతున్నాయంటే... కస్టమర్లు తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2013లో సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,118 ఉంటే, 2014లో ఈ ధర రూ.6,603కు వచ్చి చేరిందని 91 మొబైల్స్ సంస్థ ఒక నివేదికలో తెలియజేసింది. 2013, 2014 సంవత్సరాల గణాంకాలను బట్టి చూస్తే రూ.5,000-15,000 ధరలో కంపెనీలు అత్యధిక మోడళ్లను ప్రవేశపెట్టాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ వ్యయం రోజురోజుకూ తగ్గుతుండడమే. చిప్ తయారీ కంపెనీలు, సాంకేతిక సేవల సంస్థలు మొబైల్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ ధరకే విడిభాగాల్ని, టెక్నాలజీని అందిస్తున్నాయి. ధరలెందుకు తగ్గుతున్నాయంటే.. కస్టమర్లు తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2013లో సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,118 ఉంటే, 2014లో ఈ ధర రూ.6,603కు వచ్చి చేరిందని 91 మొబైల్స్ సంస్థ ఒక నివేదికలో తెలియజేసింది. 2013, 2014 సంవత్సరాల గణాంకాలను బట్టి చూస్తే రూ.5,000-15,000 ధరలో కంపెనీలు అత్యధిక మోడళ్లను ప్రవేశపెట్టాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ వ్యయం రోజురోజుకూ తగ్గుతుండడమే. చిప్ తయారీ కంపెనీలు, సాంకేతిక సేవల సంస్థలు మొబైల్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ ధరకే విడిభాగాల్ని, టెక్నాలజీని అందిస్తున్నాయి. -
ఒక్కో సమస్యకు ఒక్కో‘టీ’..
మూడ్ బాగాలే నప్పుడు, కాస్త అలసటగా, మరికాస్త చిరాగ్గా అనిపించి నప్పుడు వేడివేడి టీ తాగడం చాలామందికి అలవాటే. అయితే, ఒక్కోరకం సమస్యకు ఒక్కోరకం టీ తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని లండన్‌లోని భారత సంతతికి చెందిన తేనీటి నిపుణుడు అజిత్ మదన్ చెబుతున్నారు. ఆందోళనగా ఉన్నప్పుడు, శరీరం కాస్త వేడెక్కాలనుకున్నప్పుడు దాల్చినచెక్క టీ మంచిదని, ఒత్తిడిని జయించాలనుకున్నప్పుడు లెమన్ వెర్బనా టీ సత్వరమే సత్ఫలితాలిస్తాయని ఆయన అంటున్నారు. అలాగే, పరీక్షల ముందు జ్ఞాపకశక్తిని చురుగ్గా ఉంచుకోవాలనుకునే విద్యార్థులకు గ్రీన్ టీ అత్యుత్తమమైనదని చెబుతున్నారు. మనసు బాగా లేనప్పుడు సోంపుతో తయారు చేసిన టీ తాగితే మూడ్ మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. -
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచడం ఎలా?
మాక్సిమైజింగ్ ద మెమరీ మా పిల్లలు ఈ సమ్మర్లో టీవీ చూడటం, వీడియోగేమ్స్ ఆడటం మినహా ఏం చేయడం లేదు. వారికి జ్ఞాపకశక్తి పెరిగేలా ఏవైనా చిట్కాలు ఉంటే చెప్పగలరు. - మోహన్‌రావు, హైదరాబాద్ పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఎన్నో మేధోపరమైన వ్యాయామాలు ఉన్నాయి. ఉదాహరణకు జ్ఞాపకశక్తి పెంచే పజిల్స్‌ను సాల్వ్ చేయడం, గళ్లనుడికట్టు పజిల్స్ నింపడం, సుడోకు వంటి నెంబర్ల ప్రమేయంతో ఉండే ఆటలు ఆడటం ఒక మార్గం. వాటితో పాటు అనేక ఇతర అంశాలను ప్రాక్టీస్ చేయడం కూడా జ్ఞాపకశక్తిని పెంచడానికి దోహదపడతాయి. వాళ్లలో సమస్యను పరిష్కరించడం, సృజనాత్మక శక్తిని పెంచడం కోసం కొన్ని సామాజిక సమస్యలను వాళ్ల ముందు పెట్టి, సమాధానాలు కోరాలి. హాస్యరసభరితమైన సినిమాలు చూడటం: హాస్యపూరితమైన సినిమాలు చూసేప్పుడు పిల్లలు గట్టిగా నవ్వుతుంటారు. ఈ ప్రక్రియలో మెదడు కణాలకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంటుంది. దాంతో మెదడు కణాలు మరింత జీవశక్తిని పుంజుకుంటాయి.మంచి ఆహారం తీసుకోవడం: మంచి ఆహారం కూడా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదాహరణకు చేపలు, వాల్నట్స్, గుమ్మడిగింజలు, సోయాబీన్స్ వంటి ఆహారాల్లో ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు నిత్యం ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు తినడం, ఆయా సీజన్లలో లభ్యమయ్యే పండ్లను తీసుకోవడం కూడా జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు దోహదపడే అంశాలే. మంచి నిద్ర: పిల్లలు గాఢంగా నిద్రపోవడం అవసరం. దీంతో వాళ్లలో సమస్యను ఛేదించే శక్తి (ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్) పెరుగుతాయి. పైగా నిద్ర సమయంలోనే మనం జ్ఞాపకముంచుకోవాల్సిన విషయాలను మెదడు తన జ్ఞాపక కేంద్రాలలో సుస్థిరం చేసుకుంటుంది. ఆటలు : పిల్లలు తమ మెదడుకు రక్తసరఫరా బాగా జరిగేలా ఏరోబిక్స్ చేయడం, శరీరానికి శ్రమ కలిగించే ఆటలు ఆడటం వల్ల కూడా వారిలో జ్ఞాపకశక్తి మరింతగా పెంపొందుతుంది. ధ్యానం: నిత్యం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఏకగ్రతా, దృష్టికేంద్రీకరణశక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. చెస్ (చదరంగం) ఆడటం కూడా దాదాపు ధ్యానంతో సమానం. డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ మాక్సిమైజింగ్ ద మెమరీ -
అలా... వద్దండోయ్!
స్టడీ మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అనేది వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా ఉంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా మరచిపోవడం అనేది జరుగుతుంటుంది. జ్ఞాపకశక్తి లోపించడానికి చెప్పుకునే ‘నిర్దిష్టమైన కారణాలు’ జాబితాలో కొత్తవి కూడా చేరుతున్నాయి. తాజా విషయం ఏమిటంటే, జంక్ ఫుడ్ తినడం అనేది జ్ఞాపకశక్తిపై ప్రతికూలమైన ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనం తెలియజేస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ‘‘ప్రతి రోజు జంక్‌ఫుడ్ తినడం వల్ల... జస్ట్ ఒక వారం వ్యవధిలోనే దాని ప్రభావం జ్ఞాపకశక్తిపై ప్రతికూలంగా ఉంటుంది’’ అంటున్నారు పరిశోధకులు. కొన్ని ఎలుకలపై తమ ప్రయోగాన్ని నిర్వహించారు. కొసరు చైన్ స్మోకర్లు మాత్రమే కాదు... అప్పుడప్పుడూ సిగరెట్లు తాగే వారి జ్ఞాపకశక్తిపై కూడా పొగతాగడం అనేది ప్రతికూల ప్రభావం చూపుతుందని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధన చెబుతుంది. మెదడుకు చేరే ఆక్సిజన్ పరిమాణాన్ని ధూమపానం తగ్గించడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందంటున్నారు పరిశోధకులు. -
యకీన్ కా ధోఖా...
ఇది కంచే చేను మేసే సామెతను తలపించే సంఘటన.. బాల్యం చేదు జ్ఞాపకంగా మిగిలినా ముందున్న జీవితాన్ని అందంగా మలచుకోవాలనుకుంటున్న బాలిక కథ! ఆమె పేరు రష్మీ (పేరు మార్చాం). వయసు పదమూడేళ్లు! ..:: సరస్వతి రమ సబిత, మోహన్ (పేర్లు మార్చాం)లకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. స్వస్థలం ఒడిశా. పెద్ద కూతురికి ఎనిమిదేళ్లకే పెళ్లి చేశారు. ఆ పిల్ల అత్తగారి కుటుంబంతో కలసి వలస కూలీగా దేశమంతా తిరుగుతోంది (ఇంతకుమించిన వివరాలేమీ చెప్పలేదు సబిత). రెండో సంతానం కొడుకు. చదువు కోసం ఆ పిల్లాడిని తన తల్లి దగ్గరుంచి ఇటుక బట్టీ కూలీగా ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతూ నిజామాబాద్ చేరాడు మోహన్ చిన్న బిడ్డ రష్మీని, సబితను వెంటబెట్టుకొని. ఇది ఆరేళ్ల నాటి సంగతి. అప్పుడు రష్మీకి ఏడేళ్లు. ఆ చిట్టిచేతులూ ఇటుకలు మోసి కాయలు కాశాయి. అక్కడ కొన్నాళ్లున్నాక హైదరాబాద్ బయలుదేరింది ఆ కుటుంబం. ఇక్కడ.. తెలిసినవాళ్ల ద్వారా పాతబస్తీలో మకాం పెట్టారు. పక్కనే ఉన్న ముస్లిం పిల్లలతో పాటు రష్మీ గోట్లు (లక్కగాజులు) తయారుచేసే కార్ఖానాలో పనికి వెళ్లేది. ఆ బస్తీలోనే ఉన్న రెండు మార్వాడీ ఇళ్లల్లో పనిచేసి తనూ అదే కార్ఖానాలో పని చూసుకుంది సబిత. మొదట్లో ఏదో ఒక పని చేసే మోహన్ తర్వాతర్వాత తాగుడుకు బానిసయ్యాడు. కొన్నిరోజులకి నల్లమందూ అతని ఒంటికి పట్టింది. ఆ మత్తు విచక్షణను మింగేసింది. ఉదయం ఏడింటికి వెళ్లి మధ్యాహ్నం మూడింటికల్లా ఇంటికి వచ్చేది రష్మీ. సబితేమో ఆరుగంటలకల్లా వచ్చి మళ్లీ సాయంకాలం ఇళ్లల్లో పనికి వెళ్లేది. తల్లి ఇంటికొచ్చేదాకా నిద్రపోయేది ఆ పిల్ల. ఒకరోజు.. కార్ఖానా నుంచి బాగా అలసిపోయి వచ్చిందో ఏమో ఆదమరిచి నిద్రపోయింది రష్మీ. మత్తు నెత్తికెక్కిన మోహన్‌కి రష్మీ కూతురులా కనిపించలేదు. గాఢనిద్రలో పీడకల వచ్చినట్టుగా ఉలిక్కిపడి లేచిన రష్మీ.. తండ్రి రూపం చూసి భయంతో కేకలేసింది. గింజుకుంది, పారిపోయే ప్రయత్నం చేసింది. శక్తి చాలలేదు. రెండేళ్లు.. సబిత ఇంటికి వచ్చేటప్పటికి వాతావరణంలో తేడా కనిపించింది. బిడ్డ ఒంటిమీది బట్టలు చెదిరి సొమ్మసిల్లి పడి ఉంది. కూతురిని ఆ స్థితిలో చూసి నెత్తిపట్టుకొని ఏడ్చింది. బిడ్డను హాస్పిటల్‌కు తీసుకెళ్దామని తోడు కావాలని భర్తకోసం చూసింది. కనపడలేదు. పక్కింటి వాళ్ల సహాయంతో హాస్పిటల్‌కు వెళ్లింది. స్పృహలోకొచ్చిన రష్మీ మగమనిషిని చూస్తేనే వణికిపోసాగింది. ఈ లోకంలోకి రావడానికి రెండు రోజులు పట్టింది. అప్పుడు చెప్పింది జరిగిన విషయం.. తల్లి గుండెలో తలపెట్టి ఆమె పైటచెంగును గట్టిగా పిడికిలిలో బిగిస్తూ! ఇంటికి తీసుకొచ్చాక ఆ ఇంట్లో క్షణం కూడా ఉండలేకపోయిందా పిల్ల. తల్లిని వదిలితే ఒట్టు. బిడ్డ పరిస్థితి చూసి పక్కనే ఉన్న బ్యాంక్‌కాలనీలోని సునీత అనే టీచర్ సబితకు నచ్చచెప్పి రష్మీని తనింటికి తీసుకెళ్లింది. రష్మీని మామూలు మనిషిని చేయడానికి సునీతకి రెండేళ్లు పట్టింది. ఇప్పుడు.. రష్మీ 5వ తరగతి చదువుతోంది. సునీత దగ్గరే ఉంటోంది. ఓ ఏడాదిన్నర కిందట సబితకు మోహన్ జాడ తెలిసినా ఎవరకీ చెప్పలేదు.. అలాగని తనింటికి రానివ్వనూ లేదు. ఇప్పుడు ఆమెకు బిడ్డ క్షేమమే ముఖ్యం. ఆ బిడ్డకు చదువే లక్ష్యం. పాతగాయం.. అప్పుడప్పుడూ కలవరపెట్టినా భయపడట్లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. జిజియాబాయి, ఝాన్సీబాయిల కథలు ఇష్టంగా చదువుతుంది. ఎక్కువగా మాట్లాడదు.. పెదవులపై చిరునవ్వు చెరగనీయదు. ‘బాగా చదువుకోవాలి.. సావిత్రిబాయి పూలేలా మంచి టీచర్ కావాలి’ అంటుంది. -
పళ్లు శుభ్రంగా ఉంటే అల్జైమర్స్ దూరం!!
మీకు రోజూ చక్కగా బ్రష్ చేసుకుంటుంటారా? మీకు దీర్ఘకాలం పాటు జ్ఞాపకశక్తి పదిలంగా ఉంటుంది. అంతేకాదు... అల్జైమర్స్ వ్యాధికి గురయ్యే అవకాశాలూ తక్కువే. ఇది పరిశోధనలు చెప్పిన సత్యం. మతిమరపుతో బాధపడుతున్న కొందరి మెదడు ఫిల్ములనూ, అలాగే డిమెన్షియా (మతిమరపు), అల్జైమర్స్ లాంటి వ్యాధులు లేని ఆరోగ్యవంతుల మెదడు ఫిల్మలను పరిశీలించారు. దీనితో పాటు ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన వారి మెదడు నమూనాలనూ సేకరించి పరీక్షించారు. ఇందులో డిమెన్షియా (మతిమరపు)తో బాధపడుతున్న వారి మెదళ్లలో పార్ఫైరోమోనాస్ జింజివాలిస్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా పంటి చిగుర్లలో నివాసం ఉంటుంది. ఆహారం నములుతున్నప్పుడుగానీ, చిగురుకు దెబ్బతగిలి స్వల్ప రక్తస్రావం జరిగినప్పుడుగానీ ఆ బ్యాక్టీరియమ్... రక్తప్రవాహంతో కలిసి మెదడును చేరుతుంది. ఒక్కోసారి పంటిచికిత్స చేయించుకున్నవారిలో సైతం చికిత్స తర్వాత ఏర్పడే గాట్ల ద్వారా ఆ బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలిసి శరీరంలోని వేర్వేరు భాగాలకు చేరే అవకాశం ఉంది. అదే క్రమంలో మెదడునూ చేరి అక్కడి వ్యాధినిరోధక రసాయనాలను ప్రభావితం చేయవచ్చు. దాంతో నరాల చివరలు దెబ్బతినవచ్చు. ఫలితంగా అయోమయం, జ్ఞాపకశక్తి క్షీణించడం వంటి లక్షణాలు బయటపడతాయి. అంతేకాదు... పళ్లను శుభ్రంగా ఉంచుకోకపోతే అక్కడి బ్యాక్టీరియా గుండెను చేరి గుండె సంబంధ వ్యాధులనూ, డయాబెటిస్‌ను కలిగించవచ్చని ఇప్పటికే నిరూపితమైంది. బ్రిటిష్ పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో తేలిన ఈ విషయాలన్నీ ‘జర్నల్ ఆఫ్ అల్జైమర్స్ డిసీజ్’లో ప్రచురితమయ్యాయి. అందుకే రోజూ పళ్లు శుభ్రంగా తోముకుంటే కేవలం నోరు శుభ్రంగా ఉండటం మాత్రమే కాదు... గుండెజబ్బులూ, డయాబెటిస్తో పాటు మతిమరపు, అల్జైమర్స్ కూడా నివారితమవుతాయన్నమాట. - డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్, హైదరాబాద్ -
చాంప్స్ స్మృతి, సంస్కృతి
జూనియర్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఏస్టర్ మైండ్స్ జూనియర్ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్మృతి బాసిన్, సంస్కృతి సింగిల్స్ టైటిళ్లను చేజిక్కించుకున్నారు. బోయిన్‌పల్లిలోని పల్లవి స్కూల్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ టోర్నీలో బాలికల అండర్-12 టైటిల్‌ను స్మృతి, అండర్-14 టైటిల్‌ను సంస్కృతి గెలుచుకున్నారు. అండర్-12 ఫైనల్లో స్మృతి బాసిన్ 8-6తో సంస్కృతిపై గెలుపొందగా, అండర్-14 ఫైనల్లో సంస్కృతి 8-5తో లాస్యపై నెగ్గింది. అండర్-10 ఫైనల్లో తనుశిత రెడ్డి 8-3తో వేద వర్షితపై విజయం సాధించింది. బాలుర అండర్-10 ఫైనల్లో సుంకర రుషికేష్ 8-1తో ముకుంద్ రెడ్డిపై, అండర్-12లో ప్రీతమ్ 8-7 (7/4)తో అన్నే ఆకాశ్‌పై, అండర్-14లో హర్షిత్ కొసరాజు 8-7 (7/1)తో ప్రీతమ్‌పై గెలుపొందారు. చీఫ్ రిఫరీ ఎ.ఆర్.రావు, నిర్వాహకులు వెంకటరామన్ ట్రోఫీలు అందజేశారు. -
భలే ఆప్స్
డిజిఫై... ఇదో ఫైల్ షేరింగ్ అప్లికేషన్. డ్రాప్బాక్స్తో కలిసి పనిచేస్తుంది. మామూలుగానైతే డ్రాప్‌బాక్స్‌లోకి ఫైల్స్ వేసిన తరువాత వాటిని నియంత్రించలేము. డిజిఫైతో ఈ ఇబ్బంది ఉండదు. ఎవరెవరు ఫైల్స్ చూశారు... ఎవరు మార్పులు చేర్పులు చేశారు. ఎంతకాలంపాటు ఫైల్స్ డ్రాప్‌బాక్స్‌లో అందరికీ కనిపించేలా ఉంచాలి? వంటి ఫీచర్లను మీరు కంట్రోల్ చేయవచ్చు. వీటితోపాటు ఫైల్‌ను కొంతకాలం తరువాత తనంతట తానే నాశనమై పోయేలా కూడా చేయవచ్చు. అన్ క్లౌడెడ్... స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లలోని మెమరీతోపాటు క్లౌడ్ మెమరీ వాడకం కూడా పెరిగిపోతున్న రోజులివి. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల మెమరీ మాదిరిగానే క్లౌడ్ మెమరీని కూడా శుభ్రం చేసుకునేందుకు ఒక అప్లికేషన్ కావాలి. అన్ క్లౌడెడ్ అచ్చంగా ఇదే పని చేస్తుంది. క్లౌడ్ మెమరీలో ఎక్కువ మోతాదు ఉపయోగిస్తున్న ఫైల్స్ ఏవి? ఫోల్డర్లు ఎన్ని ఉన్నాయి? వాటిలోని ఫైళ్ల పరిస్థితి ఏమిటన్నది తెలుసుకునేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్లౌడ్ మెమరీకి సంబంధించినంతవరకూ ఇదో సెర్చ్ ఇంజిన్‌లా, ఫైల్స్ మేనేజర్లా, ఎక్స్ప్లోరర్లానూ పనికొస్తుంది ఈ అన్ క్లౌడెడ్ అప్లికేషన్. ‘డ్రాప్‌బాక్స్’ అప్డేట్ అయ్యింది..! ఐ డివైజ్‌ల రూపురేఖలను మార్చేసిన ఐఓఎస్8కి అనుగుణంగా అప్లికేషన్లు కూడా అప్డేట్ అవుతున్నాయి. ఐ డివైజ్‌లను వాడే వారికి ఎంతో సౌకర్యమైన డ్రాప్‌బాక్స్ అప్లికేషన్‌తో ఈ అప్డేషన్ మొదలైంది. ఫైల్‌షేరింగ్ విషయంలో సౌకర్యంగా ఉండే డ్రాప్‌బాక్స్ అప్లికేషన్‌ను ఐఓఎస్8 ఫీచర్లకు అనుగుణంగా మార్చారు. తాజాగా ఈ అప్లికేషన్లో కొత్త సదుపాయాలు రావడంతో పాటు నోటిఫికేషన్ల ఫీచర్‌ను కూడా మొదలు పెట్టారు. ఈ నోటిఫికేషన్ ఫీచర్ ద్వారా డ్రాప్బాక్స్కు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్‌లోని మార్పునకు అనుగుణంగా అప్లికేషన్లను కూడా అప్డేట్ చేసుకోవాలని భావించే వారు ఈ మార్పును స్వాగతించవచ్చు. -
మనసుల్ని తడిమిన ముద్దు!
ఫొటో స్టోరీ అనురాగాన్ని రుచి చూపించేందుకు, ప్రేమను తెలియబర్చేందుకు, ఇష్టాన్ని ప్రదర్శించేందుకు ముద్దు మంత్రాన్ని ఉపయోగిస్తాం మనం. కానీ ఈ ముద్దు అలాంటిది కాదు. అది ఓ వేదనకు చిహ్నం. ఓ విషాద జ్ఞాపకం! పెళ్లి అంటే ఏమిటో పూర్తిగా తెలియక ముందే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది ఇరాన్‌కు చెందిన సోమయే మెహ్రీ. భర్త ఆమిర్ ద్వారా పెళ్లి అంటే నరకం అన్న నిర్వచనాన్ని తెలుసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదామెకి. అతడు కొడితే భరించింది. తిడితే సహించింది. చిత్రహింసలు పెట్టినా ఓర్చుకుంది. చివరికి అతడు పోసిన యాసిడ్‌లో కాలి, కరిగి, ఇలా మిగిలింది. దురదృష్టమేమిటంటే... ఆమిర్ యాసిడ్ దాడి చేసినప్పుడు, సోమయే ఒడిలో చిన్నారి రానా ఉంది. యాసిడ్ తన ఒంటిని మండించిన బాధ కంటే... కడుపున మోసి కన్న బిడ్డ కళ్లముందు కాలిపోతున్నప్పుడు కలిగిన వేదనకే విలవిల్లాడింది సోమయే. కొన్ని నెలల నరక యాతన తరువాత మృత్యుకౌగిలి నుంచి బయట పడినా... ఈ లోకం తమ రూపాలను చూసి ముఖాలు తిప్పుకున్నప్పుడల్లా ఇంతకంటే మరణమే మేలని ఏడుస్తోందామె. ముఖ్యంగా తన బిడ్డని ఎవరైనా అసహ్యించుకుంటుంటే ఆమె తల్లి మనసు రగిలిపోతోంది. ఆ బాధతోనే ఆమె ఏడుస్తుంటే... తల్లి వేదన అర్థం కాని రానా... ఆమె బుగ్గమీద చిన్న ముద్దు ముద్ర వేసింది. ఆ దృశ్యం ఇరానియన్ ఫొటోగ్రాఫర్ ఇబ్రహీం నొరూజీ కంట పడింది. ప్రపంచ పొటో ఎగ్జిబిషన్లో ప్రదర్శితమైన ఈ ఫొటో పలు అవార్డులను గెలుచుకుంది. ఆ చిన్నారి ముద్దు... తన తల్లి చెంపతో పాటు కొన్ని లక్షల మంది మనసులను కూడా తడిమింది! -
మంచుకొండల్లో...పట్టపగలే పండు వెన్నెల
యాత్ర హిమాలయ పర్వతశ్రేణులలో విహారం... గడ్డకట్టిన సరస్సులో నడక.. పువ్వుల తివాచీ కప్పుకున్న కొండ ప్రాంతాలు... కార్గిల్ విజయ్‌ఘాట్‌లో వందనం.. ఇన్ని అద్భుతాలను చూసే అదృష్టం కలిసి వస్తే..! ఆ పర్యటన జీవితాంతం మరపురాని మధురానుభూతి. కార్గిల్, లడఖ్ ప్రాంతాల సందర్శన జీవితకాలపు జ్ఞాపకం అని వివరిస్తున్నారు హైదరాబాద్ వాస్తవ్యులు ముసునూరు రాజేశ్వరి... ‘ముంబయ్‌లో ఉంటున్న స్నేహితురాలి నుంచి కార్గిల్, లడఖ్ ప్రయాణ కబురు అందగానే నేనూ ‘గురుద్వారా గ్రూప్’లో మెంబర్‌గా చేరిపోయాను. అందులో భాగంగానే కిందటేడాది జూలై నెలలో హైదరాబాద్ నుంచి ముంబయ్ వెళ్లాను. అక్కడ నుంచి ‘గురుద్వారా గ్రూప్’ వంద మందితో కలిసి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్‌లో 26 గంటలు ప్రయాణించి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న చక్కీబాంక్ రైల్వేస్టేషన్లో దిగాను. జమ్మూ కన్నా ముందు రైల్వే స్టేషన్ అది. అక్కడ ముందే ట్రావెల్ ఏజెంట్స్ ఏర్పాటు చేసిన పది మినీ బస్సులలో మా గ్రూపు సభ్యులు సర్దుకున్నారు. అటు నుంచి గంట ప్రయాణించాక మధ్యలో భోజన ఏర్పాట్లు. ఆ ప్రదేశంలో... చుట్టూ మంచు కొండలు... వాటి మధ్య నుంచి నీటి పాయలు... చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. అక్కడ నుంచి బయల్దేరి జమ్మూకు 112 కిమీ దూరంలో ఉన్న పట్నీటాప్ చేరుకున్నాం. హోటల్లో బస. మర్నాడు ఉదయం లేచి చూస్తే... హిమాలయాల పర్వత శ్రేణి పొగమంచు తెరలు తెరలుగా కదిలిపోతోంది. పచ్చని చెట్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఆ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని ఆనందిస్తూనే బస్సులలో బయల్దేరాం. మధ్యలో అమరనాథ్ యాత్రికుల కోసం భోజనాలు పెట్టే గుడారాలు లెక్కలేనన్ని కనిపించాయి. అనంత్‌నాగ్ దాటి ఆ సాయంత్రానికి శ్రీనగర్ చేరాం. రాత్రి అక్కడే బస చేసి మరునాటి ఉదయం కార్గిల్‌కు బయల్దేరాం. మధ్యలో సోనామార్గ్ వద్ద ఆగాం. మంచు కొండలలో... సోనామార్గ్! ‘బంగారు మైదానం’గా సోనామార్గ్‌కు పేరుంది. దూరం నుంచి మంచు కొండలు వెండికొండల్లా మెరిసిపోతుండగా, కింద ప్రవహిస్తున్న సింధు నదిలో పడవలు పరుగులు పెడుతున్నాయి. సోనామార్గ్‌లో హిమాలయ సరస్సులు నాలుగుకు పైగా ఉన్నాయి. సరస్సులోని చల్లటి నీటిలోకి వెళ్లి కాసేపు, ఆ రాళ్లపై కాసేపు విహరిస్తూ ఫొటోలు తీసుకున్నాం. భోజనాల అనంతరం కార్గిల్‌కు మా ప్రయాణం సాగింది. బరువెక్కిన హృదయం... కార్గిల్ విజయ్‌ఘాట్! సాయంత్రం కార్గిల్‌కు వెళ్తుండగా, మధ్యలో విజయ్‌ఘాట్ వచ్చింది. ‘జూలై 26 - విజయ్ దివస్’ చేరువలో ఉండడంతో అక్కడ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అక్కడే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల ఫలకాలు వందల సంఖ్యలో కనిపించాయి. వాటిని చూస్తూ, బరువెక్కిన హృదయాలతో మేం కదులుతుండగా ‘ఆవేదన చెందకండి, మీ ఆశీర్వాదం మాకివ్వండి చాలు’... అంటున్న ఆ జవాన్లకు నమస్కరించాం. రెయిన్ బో కలర్స్ - పెంగ్విన్ లేక్ మరునాడు మధ్యాహ్నం లేహ్ సిటీకి చేరుకున్నాం. అక్కడ కాసేపు వర్షం, చలి, ఆ వెంటనే మండే ఎండ. రోజంతా వాతావరణం ఇలాగే ఉంటుంది. లేహ్‌కు 140 కిమీ దూరంలో ఉన్న పాంగాంగ్‌కు మరునాడు బయల్దేరాం. దీన్నే ‘పెంగ్విన్ లేక్’ అని కూడా అంటారు. చైనా, భారతదేశ సరిహద్దుల్లో ఈ సరస్సు ఉన్నందున తప్పనిసరిగా మన గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుంది. అయిదు గంటలు ప్రయాణించి పెంగ్విన్ లేక్ చేరుకున్నాం. అద్భుతం... సరస్సు ముందుభాగంలో ఐదు కిలోమీటర్ల వరకు మంచు గడ్డ కట్టుకుని ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మంచు నెమ్మదిగా కరుగుతుంది. మళ్లీ రాత్రి ఎనిమిది గంటల వరకు గడ్డకడుతుంది. కనుక, లేహ్ సిటీ నుంచి ఈ సరస్సుకు వెళ్లాలనుకునేవారు ఉదయం 4 - 5 గంటల మధ్యన బయలుదేరితే అటు మంచును, ఇటు రంగులు మారే నీటిని చూసి ఆనందించ వచ్చు. మే నుంచి సెప్టెంబర్ వరకు ఈ సరస్సు సందర్శనకు అనువైన సమయం అని గైడ్ తెలిపారు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత.. వలస పక్షులు. పెంగ్విన్ పక్షుల సందడి అబ్బురమనిపించింది. బహుశా వీటి వల్లే ఈ సరస్సుకు పెంగ్విన్లేక్ అని పేరు వచ్చి ఉంటుంది. లేహ్ - గురుద్వారా లే్‌హ సిటీకి పాతికమైళ్ల దూరంలో పత్తర్ సాహెబ్ గురుద్వారా ఉంది. ఆ గురుద్వారా కూడా మిలటరీ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. మూడోరోజు గురుద్వారాను దర్శించుకుని అక్కడ వారు పెట్టిన భోజనాన్ని స్వీకరించి, మళ్లీ కార్గిల్‌కు తిరుగు ప్రయాణమయ్యాం. కార్గిల్‌లో బ్రేక్ జర్నీ చేసి సోనామార్గ్ ద్వారా శ్రీనగర్‌కు వెళ్లాం. మరునాడు మళ్లీ శ్రీనగర్ నుంచి అమృతసర్‌కు ప్రయాణించి మూడో రోజు ముంబయ్ చేరుకున్నాం. అలా మొత్తం 20 రోజుల మా ప్రయాణానికి ముందుగా మేము చెల్లించిన రూ.18వేలు కాక, మరో ఆరు వేల రూపాయలు అదనంగా ఖర్చయ్యాయి. వెలకట్టలేని ప్రకృతి అందాలు, ప్రయాణానుభూతులు జీవితాంతం మిగిలిపోయే కానుకలయ్యాయి. పువ్వుల తివాచీ... గుల్మార్గ్! శ్రీనగర్ నుంచి 52 కిమీ దూరంలోని గుల్మార్గ్లోని కొండప్రాంతమంతా చామంతుల ను పోలి ఉండే తెల్లటి పువ్వులతో పట్టపగలే వెన్నెలను తలపించింది. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తై రెండో కేబుల్‌కార్‌లో కంగ్డూరీ పర్వతంపైకి వెళ్లాం. వెళ్తున్నంతసేపు మంచు నిండి ఉన్న కొండప్రాంతాల్లోని అందాలు కనువిందు చేశాయి. -
థైరాయిడ్ గ్రంథి
మన శరీరంలోని అత్యంత కీలకమైన గ్రంథుల్లో ఒకటి థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ హార్మోన్ అన్ని జీవ వ్యవస్థలపై పనిచేస్తుంది. బేసల్ మెటబాలిక్ రేట్ (బీఎమ్ఆర్), శ్వాసవ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ... ఇలా ఎన్నింటిపైనో థైరాయిడ్ ప్రభావం ఉంటుంది. హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్ వ్యవస్థలలో మార్పులు రావడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు సంభవించి హైపర్ థైరాయిడిజమ్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు వస్తాయి. హైపోథైరాయిడిజమ్: శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఇది ఇస్తుంది. ఏ వయసులో ఉన్నవారైనా హైపోథైరాయిడిజమ్‌కు గురికావచ్చు. పిల్లలు, స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు: పిల్లల్లో బుద్ధిమాంద్యం, ఎదుగుదలలో లోపం, జ్ఞాపకశక్తి లేకపోవడం, మలబద్దకం, చురుకుదనం లోపించడం, వయసుకు మించి లావుగా ఉండటం. యుక్తవయసువారిలో: బరువు పెరగడం, రుతుచక్రం ఆలస్యం కావడం, నెలసరిలో అధికరక్తస్రావం లేదా తక్కువ రక్తస్రావం, సంతానలేమి, చర్మం పొడిబారడం, వెంట్రుకలు రాలడం, బద్దకంగా ఉండి పనిచేయాలని అనిపించకపోవడం, చలిని తట్టుకోలేకపోవడం. ఆడవారిలో రోజూ వేసుకునే దుస్తులు, గాజులు బిగుతు కావడం, అల్వికేరియా అనే చర్మసంబంధిత వ్యాధులతో హైపోథైరాయిడిజమ్‌ను సులువుగా గుర్తించవచ్చు. హైపర్ థైరాయిడిజమ్: థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో థైరాక్సిన్ విడుదల చేయడంవల్ల వస్తుంది. లక్షణాలు: ఆహారం సరైన మోతాదులో తీసుకున్నా బరువు తగ్గడం, నిద్రలేమి, గుండెదడ, అధికంగా చెమటలు, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండటం, నెలసరి త్వరగా రావడం, రుతుచక్రమంలో అధిక రక్తస్రావం. హషిమోటోస్ థైరాయిడైటిస్ : ఇది జీవన క్రియల అసమతుల్యతల వల్ల వచ్చే సమస్య. దీనిలో థైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉత్పన్నమై, థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పనిచేయనివ్వవు. ఇందులో హైపో, హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. గాయిటర్: థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి కావడాన్ని గాయిటర్ అంటారు. కొన్ని సందర్భాల్లో దీని వాస్తవ పరిమాణం కంటే రెండింతల వాపు రావచ్చు. కారణాలు: అయోడిన్ అనే మూలకం లోపించడం. గ్రేవ్స్ డిసీజ్, పిట్యూటరీ గ్రంథి ట్యూమర్స్, థైరాయిడ్ క్యాన్సర్ కూడా దీనికి కారణాలు. లక్షణాలు: గొంతు కింద వాపు వచ్చి మింగడానికి కష్టంగా ఉంటుంది. స్వరంలో మార్పులు. ఎక్సా ఆఫ్తాల్మిక్ గాయిటర్ అంటే... కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా ఉండటం. చికిత్స : థైరాయిడ్ సమస్యలకు మందులు లేవనీ, జీవితాంతం థైరాక్సిన్ వాడటం తప్ప మరో మార్గం లేదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అయితే రోగి శరీర తత్వాన్ని బట్టి హోమియో చికిత్స విధానం ద్వారా వైద్యం అందిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
తెలివైనవాడే కానీ జ్ఞాపకశక్తి తక్కువ..?
మా బాబుకు ఏడేళ్లు. సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. వాడు బుద్ధిమంతుడే కానీ, స్కూల్లో ప్రతి చిన్న విషయం మర్చిపోతుంటాడని, చిన్న చిన్న పదాలకు కూడా ఎన్నిసార్లు చెప్పినా స్పెల్లింగ్స్ సరిగా రాయడని, బోర్డ్ మీద రాసిన వాటిని నోట్ చేసుకోమంటే నోట్ చేసుకోడని పేరెంట్స్ మీటింగ్స్‌లో టీచర్స్ కంప్లైంట్ చేస్తుంటారు. వాడు తెలివైనవాడే, వీడియో గేమ్స్ బాగా ఆడతాడు. అన్ని విషయాల్లోనూ యాక్టివ్గానే ఉంటాడు. మరి ఇలా ఎందుకు జరుగుతోందో మాకు అర్థం కావడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - బిందుమాధవి, హైదరాబాద్ మీ అబ్బాయిది నిజానికి అసలు పెద్ద సమస్య కానే కాదు. దీనిని ఒక స్పెషల్ కేస్ కింద పరిగణించవలసి ఉంటుంది. ఇతరత్రా ఏవైనా మానసిక సమస్యలుంటే తప్ప సాధారణంగా ఈ వయసు పిల్లలలో మతిమరపు తలెత్తే అవకాశమే లేదు. మీరు చెబుతున్న దానిని బట్టి మీ బాబులో ఐక్యూకి సంబంధించి కానీ, తెలివితేటలకు సంబంధించి కానీ ఎటువంటి సమస్యలూ లేవు. ఉన్నదల్లా ఎడిడి అంటే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. చెప్పే సమయంలో సరిగా వినకపోవటం, వారి మాటల మీద ఆసక్తి చూపించకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక తల్లిదండ్రులు వారిని ‘మొద్దబ్బాయి’ అని పిలవడం, దండించడం వంటివి చేస్తుంటారు. దానివల్ల నిజంగానే వారు తమను తాము మందకొడివారిగా, తెలివి తక్కువ వారిగా భావించుకుని, ఒక్క చదువు విషయంలోనే కాకుండా మిగతా అన్ని విషయాల్లోనూ వెనకడుగు వేస్తూ, స్తబ్దుగా ఉండిపోతారు. దాంతో భవిష్యత్తులో అది ఎన్నో రకాల ఇతర సమస్యలకు దారితీస్తుంది. మీరు మీ బాబు విషయంలో ఆందోళన చెందనవసరం లేదు. వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత దశలో అన్ని విధాలైన సమస్యలకూ మంచి వైద్యవిధానాలు, చికిత్సా విధానాలు ఉన్నాయి. మీరు వెంటనే మీ బాబును అనుభవజ్ఞుడైన చైల్డ్ సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి, ఐక్యూ, మెమరీ, కాన్సన్ట్రేషన్ టెస్ట్ చేయించండి. ఆ రిపోర్ట్‌ల ఆధారంగా మానసిక వైద్యుడు బాబుకు తగిన కౌన్సెలింగ్, శిక్షణ ఇస్తారు. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
అరణ్యం: చిట్టీ చిలకమ్మా... నీ గురించి చెప్పమ్మా...
{పపంచంలో మొత్తం 372 రకాల చిలుకలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం ఉష్టమండలాల్లోనే జీవిస్తున్నాయి! చిలుకలకు గ్రహణ శక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే మనుషుల మాటలను అవి త్వరగా గ్రహిస్తాయి. వాటిని గుర్తు పెట్టుకుని తిరిగి వల్లె వేస్తాయి. అయితే అన్ని జాతుల చిలుకలూ అలా చేయలేవు. కొన్నే చేయగలవు. మనుషుల స్వరాన్ని అనుకరించడంలో ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్దే ప్రథమస్థానం! సాధారణంగా పక్షులు నేల మీద ఉన్న ఆహారాన్ని ముక్కుతో పట్టి తినేస్తాయి. కానీ చిలుకలు మాత్రం కాళ్లతో తీసుకుని నోట్లో పెట్టుకుని తింటాయి! చాలా రకాల చిలుకలు దాదాపు ఎనభై ఏళ్ల వరకూ జీవిస్తాయి. కానీ కొన్ని జాతులు పదిహేనేళ్లు మాత్రమే బతుకుతాయి! చిలుకలు మహా సరదాగా ఉంటాయి. వాటికి ఆడుకో వడం చాలా ఇష్టం. వాటి ఆట ఎలా ఉంటుందో తెలుసా? చుట్టుపక్కల ఉన్న వస్తువులను కొరకడం, ముక్కుతో పొడవడం వంటివి చేస్తుంటాయి. అదే వాటి ఆట! చిలుకల ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. చిన్న దెబ్బలు కూడా వాటి ప్రాణాన్ని తీసేయగలవు! వీటిలో ఎడమ చేతి (కాలు) వాటం ఉంటుంది. ఏ కాలితో ఆహారాన్ని తీసి నోటితో పెట్టుకుంటాయో, వాటిది ఆ వాటం అన్నమాట! {పయత్నిస్తే చిలుకలకు పదిహేడు వందల మాటల వరకూ నేర్పవచ్చు. అవి అన్ని గుర్తుపెట్టుకోగలవు! తీయని కబుర్లు చెబుతాయన్న మాటే గానీ చిలుకలకు స్వర పేటిక ఉండదు. శ్వాసనాళంలోకి గాలిని బలంగా పీల్చి వదలడం ద్వారా అవి శబ్దాలను సృష్టిస్తాయి! పావురాల ప్రేమికుడు బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ జీవితం... తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలోని పేజీల నిండా ఎన్నో విజయాలు, ఎన్నో విషాదాలు, ఎన్నో వివాదాలు నిండి ఉంటాయి. చిన్న వయసులోనే పెద్ద పెద్ద కష్టాల్ని చవి చూశాడు టైసన్. అన్నీ తట్టుకున్నాడు. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. అయినా మొండిగా నిలబడ్డాడు. కానీ తన నాలుగేళ్ల కూతురి మరణం అతడిని నిలువునా కుదిపేసింది. బైపోలార్ డిజార్డర్ అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడతడికి ఎవరు కనిపించినా చంపెయ్యాలనిపించేదట. అలాంటప్పుడు వెళ్లి తన పెంపుడు పావురాలతో గడిపేవాడట. అప్పుడు మనసు కుదుటపడేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. టైసన్‌కి మొదట్నుంచీ పావురాలంటే ఎంతో ఇష్టం. చాలా ఉండేవి అతడి దగ్గర. బాక్సర్ కాకముందు పావురాలతో పందాలు కాసేవాడట. ఆ ఇష్టం అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. వాటి గురించి ఎప్పుడు మాట్లాడినా... అవి లేకపోతే నేనేమైపోయేవాడినో అంటుంటాడు!