నిన్న మొన్నటిదాకా మనకు నచ్చిన ప్రతి సందర్భాన్ని కెమెరాలలో బంధించడం ఒక ఫ్యాషన్.
సెల్ఫ్ గిఫ్టెడ్ మెమోరీస్...
Published Wed, Aug 24 2016 5:29 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
నిన్న మొన్నటిదాకా మనకు నచ్చిన ప్రతి సందర్భాన్ని కెమెరాలలో బంధించి, అల్బమ్‌లలో భద్రపరచుకోవడం... అవి ఎప్పుడో పండుగలకు, పబ్బాలకు బంధువులొచ్చినప్పుడు ఒక్కసారి దుమ్ము దులిపి పాత జ్ఞాపకాలను అలా నెమరువేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత సెల్ఫీలే ప్రపంచంగా కలిసిన ప్రతి ఒక్కరితో ఫొటోలు దిగుతూ వాటిని వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ సైట్స్‌లలో పోస్టు చేసుకుని బహిరంగంగా కామెంట్స్, షేర్స్‌లతో కాలం గడిపారు. ఇప్పుడు సెంటిమెంటల్‌గా చాలా సెంటిమెంట్స్‌ని ఫాలో అవుతూ ప్రతి క్షణాన్ని ఒక మరుపురాని క్షణంగా మలచుకోవాలనే దిశలో బిడ్డ కడుపులో పది పడగానే తీయించుకునే టెస్ట్‌లు, స్కానింగ్‌లు వంటి రిపోర్ట్‌లను సైతం ఎంతో జాగ్రత్తపరచుకుంటున్నారు. కడుపులోని బిడ్డ ఆడ, మగా అనే డౌట్ క్లియర్ అవ్వనంతవరకు ఒక చిన్ని పాప బట్టలతోనో, బాబు షూస్‌తోనో కలిపి స్పెషల్ ఫొటోషూట్ చేయించుకుంటున్నారు.
ఆ తర్వాత బిడ్డ ప్రతి కదలికలను గుర్తించే స్కాన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఆ బిడ్డ కదలికలతో కూడిన వీడియో స్కాన్ సీడీని సైతం అడిగి తీసుకుంటున్నారు. వాటిని ఇంటిల్లిపాది చూసుకుని మురిసిపోతున్నారు. అంతేకాదు బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ టచ్‌ని, ఫస్ట్ ఫొటోని, ఫస్ట్ డ్రెస్...అంతెందుకు పసిబిడ్డ వేలి ముద్రలు, కాళీ ముద్రలను సైతం అచ్చు తీసుకుని వాటిని ఫ్రేమ్ కట్టించుకుని మరీ ఇంటిలో భద్రపరుచుకుంటున్నారు. మరికొందరు పేరేంట్స్ అయితే కాస్టింగ్ అనే కొత్త టెక్నాలజీ పద్ధతిని ఫాలో అవుతూ పుట్టిన బిడ్డ చేతినే, కాలినో తమ చేతుల్లో పెట్టుకుని ఇంప్రింట్ వేయించుకుని బంగారు పూతను అడ్డహించి మరీ ఫ్రేమ్ కట్టించుకుంటున్నారు. ఇంకొందరు క్రియేటివ్ పేరేంట్స్ అయితే తమ పిల్లల పాదముద్రలను, చేతి అచ్చులను, తమ పిల్లల ముఖచిత్రాలను సైతం పచ్చబొట్టు వేసే నిపుణులతో ప్రత్యేకంగా టాటూ వేయించుకుని మురిసిపోతున్నారు. అక్కడితో ఆగట్లేదు. ప్రతి ఒక్క సిట్యువేషన్‌ని ఎంతో స్పెషల్‌గా భావించి తమ పిల్లలు వెళ్లే ఫస్ట్ డే స్కూల్ ఫొటో నుంచి ప్రతిరోజు ఏదో ఒక మధురజ్ఞాపకాన్ని భద్రపరచి అవి చూసుకుంటూ హ్యపీనెస్‌ని షేర్ చేసుకుంటూ తమ బంధాలను మరింత బలపరుచుకుంటున్నారు.
కొందరు తల్లిదండ్రులైతే తమ పాల బుగ్గల పసి పిల్లల ముఖాలను బంగారంతో కూడిన త్రీడీ లాకెట్ రూపంలో తయారు చేయించుకుని హారంగా ధరిస్తున్నారు. మనస్సుకు ఎన్ని విధాలుగా వీలైతే అన్ని రకాలలో తమ క్రియేటివిటీని ఉపయోగిస్తూ ఈ బిజీ లైఫ్‌సై్టల్‌లో దొరికే టైంలోనే ప్రతి మొమోరీని కళ్ల ఎదుట ఉంచుకుని చూసుకుంటూ బంధాలని అనుబంధాల్ని రెట్టింపు చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు నగరవాసులు...పెరిగే పిల్లల ప్రతి జ్ఞాపకంతో పాటు ఉన్న మనుషుల విలువలను కాపాడుకునేందుకు ప్రతి క్షణం ఎంతో జాగ్రత్తగా భావించి మనిషి చిరాయువు తీరేదాకా బంధాలను పెంపోందించుకోవటానికి కృషి చేస్తున్నారు నేటి తరం జనం. చివరికి మనిషి ఆయువు తీరక కూడా తమకు ఇష్టమైన వాటినే తలచుకుంటూ తమ జ్ఞాపకాలలో జీవనం గడిపేందుకు సమాధులు సైతం మరణించిన వారికి ప్రియమైన వస్తువు రూపంలో తయారు చేయించి వారి ఆకాంక్షలకు ప్రాణం పోస్తున్నారు.
Advertisement
Advertisement