అరణ్యం: చిట్టీ చిలకమ్మా... నీ గురించి చెప్పమ్మా...
{పపంచంలో మొత్తం 372 రకాల చిలుకలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం ఉష్టమండలాల్లోనే జీవిస్తున్నాయి!
చిలుకలకు గ్రహణ శక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే మనుషుల మాటలను అవి త్వరగా గ్రహిస్తాయి. వాటిని గుర్తు పెట్టుకుని తిరిగి వల్లె వేస్తాయి. అయితే అన్ని జాతుల చిలుకలూ అలా చేయలేవు. కొన్నే చేయగలవు. మనుషుల స్వరాన్ని అనుకరించడంలో ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్‌దే ప్రథమస్థానం!
సాధారణంగా పక్షులు నేల మీద ఉన్న ఆహారాన్ని ముక్కుతో పట్టి తినేస్తాయి. కానీ చిలుకలు మాత్రం కాళ్లతో తీసుకుని నోట్లో పెట్టుకుని తింటాయి!
చాలా రకాల చిలుకలు దాదాపు ఎనభై ఏళ్ల వరకూ జీవిస్తాయి. కానీ కొన్ని జాతులు పదిహేనేళ్లు మాత్రమే బతుకుతాయి!
చిలుకలు మహా సరదాగా ఉంటాయి. వాటికి ఆడుకో వడం చాలా ఇష్టం. వాటి ఆట ఎలా ఉంటుందో తెలుసా? చుట్టుపక్కల ఉన్న వస్తువులను కొరకడం, ముక్కుతో పొడవడం వంటివి చేస్తుంటాయి. అదే వాటి ఆట!
చిలుకల ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. చిన్న దెబ్బలు కూడా వాటి ప్రాణాన్ని తీసేయగలవు!
వీటిలో ఎడమ చేతి (కాలు) వాటం ఉంటుంది. ఏ కాలితో ఆహారాన్ని తీసి నోటితో పెట్టుకుంటాయో, వాటిది ఆ వాటం అన్నమాట!
{పయత్నిస్తే చిలుకలకు పదిహేడు వందల మాటల వరకూ నేర్పవచ్చు. అవి అన్ని గుర్తుపెట్టుకోగలవు!
తీయని కబుర్లు చెబుతాయన్న మాటే గానీ చిలుకలకు స్వర పేటిక ఉండదు. శ్వాసనాళంలోకి గాలిని బలంగా పీల్చి వదలడం ద్వారా అవి శబ్దాలను సృష్టిస్తాయి!
పావురాల ప్రేమికుడు
బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ జీవితం... తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలోని పేజీల నిండా ఎన్నో విజయాలు, ఎన్నో విషాదాలు, ఎన్నో వివాదాలు నిండి ఉంటాయి. చిన్న వయసులోనే పెద్ద పెద్ద కష్టాల్ని చవి చూశాడు టైసన్. అన్నీ తట్టుకున్నాడు. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. అయినా మొండిగా నిలబడ్డాడు. కానీ తన నాలుగేళ్ల కూతురి మరణం అతడిని నిలువునా కుదిపేసింది. బైపోలార్ డిజార్డర్ అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడతడికి ఎవరు కనిపించినా చంపెయ్యాలనిపించేదట. అలాంటప్పుడు వెళ్లి తన పెంపుడు పావురాలతో గడిపేవాడట. అప్పుడు మనసు కుదుటపడేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. టైసన్‌కి మొదట్నుంచీ పావురాలంటే ఎంతో ఇష్టం. చాలా ఉండేవి అతడి దగ్గర. బాక్సర్ కాకముందు పావురాలతో పందాలు కాసేవాడట. ఆ ఇష్టం అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. వాటి గురించి ఎప్పుడు మాట్లాడినా... అవి లేకపోతే నేనేమైపోయేవాడినో అంటుంటాడు!