Parrots
-
రామ్మా చిలుకమ్మా..
‘సత్యం సుందరం’ సినిమాలో అరవింద్ స్వామి.. ప్రతిరోజూ తమ ఇంటి టెర్రస్ మీద వందల కొద్ది చిలుకలకు దాణా వేస్తూ వాటితో ఆత్మీయానుబంధాన్ని అల్లుకుంటాడు! అలాంటి వ్యక్తులు రియల్ లైఫ్‌లోనూ ఉన్నారు. వాళ్లే నూర్‌బాషా బాబావలీ, లాల్‌బీ దంపతులు!ఆంధ్రప్రదేశ్, తెనాలిలోని గాంధీనగర్, ఎన్వీఆర్ కాలనీలో నివాసముంటారు నూర్‌బాషా బాబావలీ దంపతులు. వృత్తిరీత్యా నూర్‌బాషా టైలర్. తమ మేడ మీదకొచ్చి అరిచే కాకుల గుంపు కోసం నూర్‌బాషా భార్య లాల్‌బీ.. కాసిన్ని బియ్యం చల్లి.. ఓ గిన్నెలో నీళ్లనుంచడం మొదలుపెట్టింది. కాకులు ఆ దాణా తిని, నీళ్లు తాగి ఎగిరిపోయేవి. కొన్నాళ్లకు కొన్ని చిలుకలూ వచ్చి వాలాయి ఆ మేడ మీద.. ఇంచక్కా ఓ పక్క బియ్యం, మరోపక్క మంచి నీళ్లు కనిపించేసరికి సంతోషంగా బియ్యం గింజలు తిని, మంచినీళ్లు తాగి ఎగిరిపోయాయి. మర్నాడు మరిన్ని చిలుకలను వెంటబెట్టుకొచ్చి.. ఆ దాణాను ఆరగించసాగాయి. క్రమంగా అది వాటికి రోజువారీ కార్యక్రమం అయింది. వాటి సంఖ్యా వందల్లోకి పెరిగింది. ఒక్కపూట కాస్త రెండుపూటలకు మారింది. ప్రకృతి పంపుతున్న ఆ అతిథులను చూసి నూర్‌బాషా, లాల్‌బీ దంపతులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వాటికోసం ఉదయం, సాయంకాలం రెండుపూటలా దాణా చల్లుతూ చక్కటి ఆతిథ్యమివ్వసాగారు. క్రమంగా అది ఆత్మీయానుబంధంగా బలపడింది. ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య, సాయంకాలం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య చిలుకలు ఆ మేడ మీద వాలి.. దాణా తిని, నీళ్లు తాగి ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కొన్ని చిలుకలు దాణా తింటున్నప్పుడు మరికొన్ని గుంపులు గుంపులుగా అక్కడున్న దండేల మీద, లేదంటే పక్కనే ఉన్న చెట్ల కొమ్మల మీద వేచి చూస్తుంటాయి. తమ వంతు రాగానే టెర్రస్ ఫ్లోర్ మీద వాలి విందును ఆరగిస్తాయి. ఏటా గురు పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి దాకా ఇలా ఆ చిలుకలు నూర్‌బాషా కుటుంబమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాయి. అవి బియ్యం గింజల్ని తింటున్నప్పుడు నూర్‌బాషా కుటుంబీకులు కాక కొత్తవారెవరు కనిపించినా రివ్వున ఎగిరిపోతాయి. వీటి కోసం ఉదయం మూడు కిలోలు, సాయంత్రం రెండు కిలోల చొప్పున రోజుకు అయిదు కిలోల బియ్యాన్ని ఆహారంగా పెడుతోందా కుటుంబం. అంటే నెలకు 150 కిలోలు. చిలుకలను ఇంత ప్రేమగా ఆదరిస్తున్న నూర్‌బాషా, లాల్‌బీ దంపతులను చూసి ముచ్చటపడిన లాల్‌బీ స్నేహితురాలు అంజమ్మ .. నెలకు 20 కిలోల బియ్యాన్ని తన వంతు సాయంగా అందిస్తోంది. ‘ఇప్పుడు కాకులు, చిలుకలతోపాటు పావురాలు కూడా వచ్చి దాణా తినిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి తర్వాత చిలుకల సంఖ్య బాగా తగ్గుతుంది. మళ్లీ గురు పౌర్ణమి నుంచి వాటి సంఖ్య పెరుగుతుంది. అలా కొన్ని వందల చిలుకలు మా మేడ మీద వాలుతుంటే భలేగా ఉంటుంది!’ – నూర్‌బాషా బాబావలీ. -
ఏసీ చల్లదనానికి.. రామ చిలుకల సేద!
అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నా పగటి ఉష్టోగ్రతల్లో పెద్దగా మార్పు రావడం లేదు. వేడిగాలులతో జనం అల్లాడుతున్నారు. కూలర్లు, ఏసీలు లేకుండా ఉండలేకపోతున్నారు. ఇక్కడ మనుషులే కాదు, ఇతర ప్రాణులు కూడా ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాయనడానికి ఈ చిత్రమే ఉదాహరణ. అదేంటొో చూసేయండి..కరీంనగర్ భాగ్యనగర్‌లోని అపార్ట్మెంట్లో ఒక గదికి ఏసీ అమర్చబడి ఉండడంతో.. ఆ గోడ రంధ్రంలోంచి చల్లటి గాలి వీస్తుంది. వాతావరణ వేడిని తట్టుకోలేని రామచిలుకలు ఏసీ రంధ్రం వద్ద అలరిస్తూ కనిపించాయి. అవి వంతులవారీగా, ఒకదాని తరువాత మరొకటి.. ఆ రంధ్రంలో దూరుతూ.. ఏసీ నుంచి వస్తున్న చల్లటి గాలికి సేదతీరుతూ ఉన్నాయి. వెంటనే ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ఇవి చదవండి: ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..! -
ప్యారెట్స్..పేరెంట్స్.. 650 చిలుకలు,100 పిచ్చుకల ఆకలి తీరుస్తూ..
సాక్షి, ఏలూరు: ఉదయం, సాయంత్రం వేళల్లో రామచిలుకలు, పిచ్చుకల కిలకిలరావాలతో ఆ వీధి ఆహ్లాదకరంగా మారుతుంది. వందల సంఖ్యలో అక్కడి విద్యుత్ తీగలపై వాలి ఆహారం కోసం నిరీక్షిస్తుంటాయి. ఉదయం 7.30, సాయంత్రం 4 గంటలకు ఠంచనుగా ఈశ్వరరావు, పార్వతి దంపతులు అందించే మేతను ఆరగిస్తాయి. ఐదేళ్లుగా రామచిలుకలు, పిచ్చుకల ఆకలి తీరుస్తూ పక్షులపై తమ ప్రేమను చాటుతున్నారు కైకలూరుకు చెందిన ఈశ్వరరావు, పార్వతి దంపతులు. ప్రతి రోజూ సుమారు 650 రామచిలుకలు, 100 బంగారు రంగు పిచ్చుకలకు ఆహారాన్ని అందిస్తున్నారు. కైకలూరులోని వైఎస్సార్ నగర్లో ఉంటున్న ఈశ్వరరావు ఇంటి సమీపంలో ఉండే విద్యుత్ తీగలపై వాలి పచ్చటి తోరణాలను తలపిస్తాయి. పూటకు పది కేజీల చొప్పున బియ్యాన్ని కడిగి డాబాపై నాలుగు వరుసల్లో చిన్న చిన్న ముద్దలుగా ఉంచుతారు. పిచ్చుకలు తిన్న తరువాత ఒక్కసారిగా రామచిలుకలు గుంపుగా వచ్చి మేతను ఆరగిస్తాయి. గతంలో ముఠా పనిచేసి కొంతకాలంగా టీమాస్టర్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు ఇటీవల వైఎస్సార్ నగర్లో ఇంటిని నిర్మించుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు కాగా, వీరి సాయంతో రోజూ రూ.200 ఖర్చుతో చిలుకలకు ఆహారంగా ఒక్కో రోజు బియ్యంతో పాటు కొర్రలు, జామకాయలు అందిస్తున్నారు. చిలుక జాతులలో మూడింట ఒక వంతు అంతరించే ప్రమాదంలో ఉందని ఇటీవల అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి రెడ్‌లిస్టులో వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామచిలుకలకు ప్రతిరోజూ మేతను అందిస్తున్న ఈశ్వరరావు, పార్వతి దంపతుల సేవను పలువురు అభినందిస్తున్నారు. చిలుకలను దేవతలుగా భావిస్తాం అరుణాచలం దేవాలయానికి వెళ్లినప్పుడు రెండు చిలుకలు మా తలలపై తిరిగాయి. మా మామ మరణించే చివరి ఘడియల్లో గోడపై చిలుక బొమ్మ ముద్రించారు. ఈ ఘటనలతో చిలుకలను దేవతలుగా భావిస్తూ రోజూ మేతను అందిస్తున్నాం. వాటి సవ్వడులు మాకు ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతిరోజూ 20 కేజీల బియ్యాన్ని సమకూర్చడం కష్టతరమవుతోంది. దాతలు బియ్యం అందించి సహకరించాలి. బియ్యం, మేత సాయం చేసే దాతలు 63048 72868, 93818 93450 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. – కొల్లి ఈశ్వరరావు, పార్వతి దంపతులు చదవండి: లేటు వయసులోనూ నీట్ రాశారు.. పేదలకు వైద్య సేవలు అందించాలని 69 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ సంకల్పం.. -
చిలుక సాక్ష్యంతో నిందితుడికి జీవిత ఖైదు!
హత్య జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత నిందితుడి జైలు శిక్ష విధించింది కోర్టు. అదీకూడా ఒక చిలుక సాక్ష్యం ఆధారంగా ఈ కేసు చిక్కుముడి వీడి నిందితుడికి శిక్ష పడేలా జరగడం ఈకేసులో మెయిన్ ట్విస్ట్. ఇలాంటి విచిత్రమైన కేసు ఇదే ప్రపథమం కాబోలు. అసలేం జరిగిందంటే..ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ విజయ్ శర్మ భార్య నీలం శర్మ ఫిబ్రవరి 20. 2014న హత్యకు గురయ్యారు. ఐతే ఆరోజు అతడి భార్య, పెంపుడు కుక్క హత్యకు గురవ్వడమే కాకుండా ఆ ఇంట్లో చోరీ కూడా జరిగింది. వాస్తవానికి ఆరోజు విజయ్ శర్మ తన కొడుకు రాజేష్, కుమార్తె నివేదితతో కలిసి ఫిరోజాబాద్‌లోని ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఐతే అతడి భార్య నీలం మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. అదేరోజు అర్థరాత్రి విజయ్ శర్మ, పిలల్లు ఇంటికి తిరిగి వచ్చి చూడగా..తన భార్య, కుక్క మృతదేహాలను చూసి అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. దీంతో వారు పోలీసులును ఆశ్రయించగా..వారిని నిందితుడు పదునైనా ఆయుధంతో గాయపరిచినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. ఐతే ఈ ఘటన జరిగిన రోజు తమ పెంపుడు చిలుక చేస్తున్న అరుపులకు అనుమానం వచ్చి తన మేనల్లుడిని ఆశుని ప్రశ్నించాల్సిందిగా అభ్యర్థించాడు. ఈ క్రమంలో పోలీసులు చిలుక ముందు అనుమానితులు ఒక్కొక్కటి పేరు చెబుతున్నప్పుడూ..అశుకి భయపడి అషు.. అషు అని పిలవడం ప్రారంభించింది. దీంతో అశుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన తర్వాత పక్షి సైలెంట్ అయిపోయి తినడం తాగడం మానేసిందని ఆరునెలల తర్వాత చనిపోయిందని విజయ్ శర్మ కూతురు నివేదిత చెప్పింది. ఈ కేసు ఆద్యాంతం చిలుక కీలక సాక్ష్యం ఆధారంగా ఉండటంతో..నిందితుడి జీవిత ఖైదు విధించింది కోర్టు. అదికూడా హత్య జరిగిన తొమ్మిదేళ్లకు శిక్ష పడింది. ఈలోగా నివేదిత తండ్రి విజయ్ శర్మ కూడా కరోనా మహమ్మారి సమయంలో నవంబర్ 14, 2020న చనిపోయారు. తమ కుటుంబం అంతా ఆశుకి శిక్ష పడాలని కోరుకున్నామని నివేదిత ఆవేదనగా చెబుతోంది. ఈ మేరకు నివేదిత మాట్లాడుతూ..ఆశు తమ ఇంటికి తరుచుగా వచ్చి వెళ్లేవాడని, తన ఎంబీఏ చదువుకు కూడా తన నాన్న రూ. 80 వేలు ఇచ్చాడని తెలిపింది. ఆశుకి తమ ఇంట్లో ఆభరణాలు, డబ్బు ఎక్కడ ఉంటాయో తెలుసనని కాబట్టే చాలా పక్కగా ప్లాన్ చేసి చంపగలిగాడని కన్నీటిపర్యంతమైంది. (చదవండి: వధువు అలంకరణ చూసి..పెదాలు చప్పరించకుండా ఉండలేరు) -
వీడియో: ఆ తల్లి కుక్కలా చేయలేదు.. పాముతో పోరాడి చిలుకలు..
మనుషులైనా జంతువులైనా సరే ఐకమత్యంతో ఉంటే కొన్ని సందర్భాల్లో ఆపదల నుంచి తప్పించుకోవచ్చు అని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తాజాగా కొన్ని చిలుకలు ఐకమత్యంతో ఉండి.. పాము తరమిమేసి తమ ప్రాణాలను నిలుపుకున్నాయి. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, జిల్లాలోని పెనుగొండలో ఓ కొబ్బరిచెట్టుపై కొన్ని చిలుకలు గూడుకట్టుకున్నాయి. కాగా, చిలుకల గూడును ఎక్కడి నుంచి పసిగట్టిందో ఏమో ఓ పాము వాటిని చినేందుకు చెట్టుపైకి ఎగబాకింది. ఆ సమయంలో పాము రాకను గమనించిన చిలుకలు తమ ప్రాణాలను కాపాడుకునేందు సర్వశక్తులొడ్డాయి. ఐకమత్యంతో పోరాటం చేశాయి. చెట్టుపై ఉన్న పాము బుసలుకొడుతూ చిలుకలను కాటువేసేందుకు ప్రయత్నించగా అక్కడున్న చిలుకలన్నీ ఐకమత్యంతో పామును ఎదుర్కొన్నాయి. పాముపై చిలుకలన్నీ కలిసి ముప్పెటదాడి చేశాయి. దీంతో, చేసేదేమీ లేక పాము తోకముడిచింది. కాగా, చిలుకల ఐకమత్యంపై నెటిజన్లు స్పందిస్తూ.. కలిసి పోరాడితే ఎంతటి కష్టానైనా జయించవచ్చని నిరూపించాయంటూ ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: పెద్దగా బుసలు కొడుతూ.. బయటకు లాక్కొచ్చి మరీ కాటేసింది! -
చిలుకలన్నీ కలిసి పాము పై దాడి..
-
రామ్మా చిలుకమ్మా.. ప్రేమా మొలకమ్మా ..!
సీతమ్మధార(అనకాపల్లి): కాంక్రీట్ జంగిల్లా మారుతున్న నగరంలో పచ్చని రామచిలుకలు ఒకట్రెండు కనిపించడమే చాలా అరుదు. చిలక జోస్యం చెబుతామంటూ తిరిగేవారి పంజరంలో తప్ప కనిపించని రోజుల్లో చిలుకల సామ్రాజ్యంగా మారింది ఆ ఇల్లు. ఉదయం ఆరు గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఏ చిలుక ఎక్కడ ఉన్నా.. నగరంలోని భానూనగర్లోని ఆయన ఇంటి మేడపైకి రావాల్సిందే. రామచిలుకల కిలకిలలతో ఆ ప్రాంతమంతా ప్రకృతి నిలయంగా మారిపోతోంది. కృష్ణాకాలేజీ సమీపంలోని భానూనగర్లో నివాసముంటున్న లక్ష్మీనారాయణరెడ్డి ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. భార్య శైలజ టీచర్‌గా పని చేస్తున్నారు. దాదాపు పదేళ్ల క్రితం లక్ష్మీనారాయణరెడ్డి మేడపైన పెంచుతున్న పూలమొక్కల వద్దకు రెండు రామచిలకలు వచ్చాయి. వాటిని చూసి ముచ్చటపడిన లక్ష్మీనారాయణరెడ్డి వాటికి గింజల్ని వేశారు. తర్వాత అవి ఒకొక్కటి పెరగసాగాయి. ఇప్పుడవి 200కిపైగా వస్తున్నాయి. ఆ ఇంటికి ఆత్మీయ అతిథులుగా మారిపోయాయి. యాదృచ్ఛికంగా మొదలైన ఈ కుటుంబం, రామచిలుకల బంధం.. విడదీయరానిదిగా అల్లుకుపోయింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు రామచిలుకలు సవ్వడి చేస్తూ వారి మేడమీదకి వచ్చేస్తాయి. మధ్యాహ్నం 1 గంటకు పావురాల కువకువలు వినిపిస్తాయి. మళ్లీ సాయంత్రం 4 గంటలకు రామచిలుకలు అతిథుల్లా పలకరిస్తాయి. ఇది ప్రతి రోజూ దినచర్యగా మారిపోయింది. వీటి కోసం ప్రతి రోజూ దాదాపు 10 కిలోలకు పైగా బియ్యం, ఇతర ఆహార గింజలు ఆహారంగా వేస్తున్నారు. నెలకు సుమారు రూ.4 వేలకు పైగా ఖర్చవుతున్నా.. తమ కుటుంబ సభ్యుల కోసమే కదా అన్నట్లుగా ఈ భార్యభర్తలు చిలుకలను ప్రేమగా సాకుతున్నారు. 2014లో హుద్‌హుద్ ముందు వరకూ 700కి పైగా రామచిలుకలు వచ్చి సందడి చేసేవి. హుద్‌హుద్ సమయంలో గూళ్లు దెబ్బతినడంతో చిలుకల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం 300 వరకూ రామచిలుకలు, 100 వరకూ పావురాలు, గోరింకలు వస్తున్నాయనీ.. ప్రతి రోజూ వాటికి సమయానికి ఆహారం అందించడం మాకు దినచర్యగా మారిపోయిందని భార్యభర్తలు లక్ష్మీనారాయణరెడ్డి, శైలజ చెబుతున్నారు. తమ పిల్లల మాదిరిగానే రామచిలుకలను అపురూపంగా చూసుకుంటున్నామన్నారు. చిలుకల పందిరిలా మారిపోయిన ఈ మేడను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు రామచిలుకలు వచ్చే సమయం కోసం ప్రతి రోజూ ఎదురు చూస్తుండటం విశేషం. -
Parrots: ప్రేమ సరాగాల్లో పచ్చని చిలుకలు..
పచ్చని చిలుకలు ప్రేమ సరాగాల్లో మునిగిపోయాయి. చిలుక పలుకులతో కువకువలాడాయి. ఈ జంట ప్రేమ ముచ్చట్లు స్థానికుల మనసు దోచుకున్నాయి. విజయవాడ సింగ్‌నగర్ సమీపంలో తాటి చెట్లపై గురువారం సాయంత్రం వేళ కనిపించిన ఈ దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి. -పవన్, సాక్షి, ఫొటోగ్రాఫర్, విజయవాడ ఆ.. ఏంటి? ఓ ముద్దిద్దూ..! ఇదిగో.. ఉమ్మ.. -
పంచదార చిలుకలు.. తియ్యటి వేడుక చేసుకుందాం..
కశింకోట (అనకాపల్లి)/విశాఖ జిల్లా: పంచదార చిలుకలు తీపిని పంచుతాయి. పిల్లలు మొదలుకొని పెద్దలను సైతం ఆకర్షిస్తాయి. ఆత్మీయత, అభిమానాన్ని పంచుతాయి. పంచదార చిలుకలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి ఉత్సవాలు, తీర్థాలు జరగవనే చెప్పాలి. కొందరు వివాహాలు, ఉపనయనాలలో కూడా వీటిని సంప్రదాయంగా సారె గాను, బంధువర్గానికి పంపిణీకి వినియోగిస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పంచదార చిలుకల తయారీకి మండల కేంద్రం కశింకోట ప్రసిద్ధి. ఇక్కడి వడ్డి వీధిలో ఏళ్ల తరబడి పంచదార చిలుకల తయారీయే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన వడ్డెర కులానికి చెందిన సుమారు 20 కుటుంబాలు పంచదార చిలుకలను తయారు చేసి జీవనం సాగించేవారు. అయితే ఆధునికంగా రంగుల స్వీట్లు ప్రవేశించడంతో వీటికి క్రమేపి ఆదరణ తగ్గింది. దీంతో కొంతమంది పత్యామ్నాయ పనులకు వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగు కుటుంబాల వారు మాత్రమే వీటిని తయారు చేస్తున్నారు. తమ తాతల కాలం నుంచి కొనసాగిస్తున్న వృత్తిని మానుకోలేక, మరో పని చేతకాక ఇదే వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నామని తయారీదారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని బుచ్చియ్యపేట మండలం వడ్డాది, యలమంచిలి మండలం కొప్పాక, పాయకరావుపేట, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో కూడా వీటిని తయారు చేస్తారు. ప్రధానంగా సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు, తీర్థాల్లో వీటికి గిరాకీ ఉంటుంది. దీంతో ఉత్సవాలకు ముందు వీటిని తయారు చేసి సిద్ధం చేసుకుంటారు. సంక్రాంతి, ఆ తర్వాత జిల్లాలో జరిగే తీర్థాలు, ఉత్సవాలకు తీసుకెళ్లి విక్రయిస్తారు. పంచదార చిలుకలను ఆకర్షణకు వివిధ రకాలుగా తయారు చేస్తారు. తాజ్‌మహాల్, పన్నీరు బుడ్డీ, ఆలయ గోపురాలు తదితర ఆకారాల్లో తయారు చేస్తారు. వీటిలో ఎక్కువగా రామచిలుకల ఆకారంలోనే తయారు చేస్తారు. రూ.10 నుంచి వంద రూపాయల వరకు వీటిని విక్రయిస్తారు. పంచదార చిలుకల తయారీలో నిమగ్నం చిలుకల తయారీ... చిలుకల తయారీకి ఎక్కువ సరుకులు అవసరం లేదు. పంచదార, ఆకర్షణకు రంగు ఉంటే చాలు. పంచదారను సరిపడిన నీరు పోసి పాకం వచ్చే వరకు మరిగించాలి. ఆకర్షణ కోసం రంగు వేసి పాకాన్ని ముందుగా చెక్కలతో తయారు చేసిన కావలసిన పరిమాణం, ఆకారంలో ఉన్న అచ్చుల్లో పోస్తారు. కొంతసేపు అచ్చుల్లోనే ఆరిన తర్వాత అచ్చుల నుంచి బయటకు తీసి అమ్మకానికి సిద్ధం చేస్తారు. కిలో చిలుకల తయారీకి రూ.85 ఖర్చు అవుతుంది. దీనిలో పంచదార, రంగు, కట్టెలు లేదా గ్యాస్ ఖర్చులు పోనూ రూ.40 వరకు మిగులుతుంది. పాకం సరిగా లేకపోతే చిలుకలు తయారు కావు. ముక్కలు అవుతాయి. దీంతో వాటిని మళ్లి మరిగించి పాకం సిద్ధం చేసి చిలుకలు తయారు చేయవలసి వస్తుంది. దీనివల్ల తరుగు ఏర్పడి పాకం తగ్గిపోయి నష్టం వస్తుంది. సంక్రాంతి స్పెషల్ చిలకలు సంక్రాంతి సంబరాలు, తీర్థాల రోజుల్లోనే పంచదార చిలుకలను తయారు చేస్తాం. కిలో చిలుకల తయారీకి రూ.85 అవుతుంది. జిల్లాలో జరిగే ఉత్సవాలు, తీర్థాలకు తీసుకెళ్లి విక్రయిస్తాం. ఖర్చులు పోనూ రూ.40 వరకు మిగులుతుంది. సంక్రాంతి రోజుల్లోనే తమకు ఆదాయం సమకూరుతుంది. మిగిలిన రోజుల్లో ప్రత్యామ్నాయం పనులు వెతుక్కొవలసి వస్తోంది. –శ్రీకాకుళపు కుమార్, పంచదార చిలుకల తయారీదారు, కశింకోట. -
రామ చిలుకలు కలలోకి వచ్చాయా.. మీ పంట పండినట్టే..!
Parrots In Dreams: మనిషి నిద్రించే సమయంలో కలలు రావడం సర్వసాధారణం. కలలో మనుషులు, జంతువులు, పక్షులు, ఎత్తయిన శిఖరాలు, జలపాతాలు, లోయలు ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే కలలోకి కొన్ని రకాల పక్షులు వస్తే అదృష్టం, సంతోషం.. కొన్ని జాతుల పక్షులు కనిపిస్తే సమస్యలు ఎదురవుతాయని శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా రామచిలుకలు కలలోకి వస్తే ఆ మనిషి పంట పండినట్టేనట. ఇలా జరగడం వల్ల వ్యాపార రంగాల్లో గుర్తింపు, గౌరవంతో పాటు ఆకస్మిక ధనలాభం, అధిక మొత్తంలో లాభాలు కలుగుతాయట. కాబట్టి కలలో రామచిలుకలు కనిపించడం శుభసూచకమేనని చాలామంది విశ్వసిస్తారు. అలాగే, పిచ్చుకలు, నెమలి, గరుడ పక్షి, కొంగ కనిపించడం కూడా శుభ సంకేతమేనట. ఈ పక్షులు కలలోకి వస్తే.. కష్టాలు తొలగిపోయి కుటుంబాల్లో ఆనందాలు నెలకొనడంతో పాటు సంపద వృద్ధి, వివాహం, సంతానప్రాప్తి కలుగుతాయట. అయితే, కలలో కాకి కనిపిస్తే మాత్రం దురదృష్టమని.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని కొందరు నమ్ముతారు. చదవండి: విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..! -
Color Mystery: కనిపించేదంతా ‘బ్లూ’ కాదు!
సాక్షి సెంట్రల్ డెస్క్: ఈ సీతాకోక చిలుక ఏ రంగులో ఉంది. అదేమిటి నీలి రంగులోనే కదా అంటారా? అక్కడే తప్పులో కాలేశారన్న మాట. అది మనకు నీలి రంగులో కనిపించడం అంతా మన దృష్టి భ్రమ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదే కాదు జంతుజాలంలో 99 శాతం జీవుల్లో వేటిలోనూ నీలి రంగు అనేదే లేదని అంటున్నారు. మరి మన కళ్లముందు కనిపిస్తున్నా అది నీలి రంగు కాదనడం ఏంటి? అసలు ఏమిటీ రంగు మిస్టరీ అని సందేహాలు వస్తున్నాయా.. ఇదేంటో తెలుసుకుందామా? అప్పుడు కళ్లు లేవు.. కలర్ సమస్య లేదు! భూమ్మీద జీవం ఆవిర్భవించి వందల కోట్ల ఏళ్లు అవుతోంది. సుమారు 60 కోట్ల ఏళ్ల కిందటి వరకు ప్రాథమిక దశలోనే ఉన్న జీవులు వేటికీ కళ్లు లేవు. అప్పుడు జంతుజాలానికి రంగుల సమస్యే లేదు. ఆ తర్వాత జంతుజాలం అభివృద్ధి చెంది కళ్లు ఏర్పడ్డాయి. అందంగా కనబడేందుకు, తోడును ఆకట్టుకునేందుకు, కొన్నిసార్లు శత్రు జీవులను భయపెట్టేందుకు, లేదా వాటికి దొరక్కుండా తప్పించుకునేందుకు.. ఇలా వాటి అవసరానికి తగినట్టుగా రంగులు, డిజైన్లను సంతరించుకోవడం మొదలైంది. జంతుజాలంలో ఒక శాతమే.. సీతాకోక చిలుకలు సహా పలు రకాల జంతువులు మనకు నీలి రంగులో కనిపిస్తుంటాయి. కానీ చాలా వరకు నిజమైన నీలిరంగు కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం జంతుజాలంలో ఒక శాతం కంటే తక్కువ మాత్రమే నీలి రంగులో ఉంటాయి. మరి ఎందుకిలా..? ‘నీలి రంగు’ సమస్యేంటి? ప్రతి రంగుకు సంబంధించి కొన్నిరకాల రసాయనాలు ఉంటాయి. వాటినే కలర్ పిగ్మెంట్స్ అంటారు. వీటిపై కాంతి పడినప్పుడు సంబంధింత రంగులను ప్రతిఫలిస్తాయి. దాంతో ఆ రంగు మన కంటికి కనిపిస్తుంది. జంతువుల్లోగానీ, మొక్కల్లోగానీ ఏవైనా భాగాల్లో ఏ రంగు పిగ్మెంట్స్ ఉంటే.. ఆ రంగు కనిపిస్తుంది. అన్ని జంతువులకు కూడా కలర్ పిగ్మెంట్స్ అవి తినే ఆహారం ద్వారానే అందుతాయి. జంతువులు ఏవైనా ప్రాథమిక ఆహారం మొక్కల నుంచే వస్తుంది. (మాంసాహార జీవులైనా కూడా అవి తినే జంతువుల ఆహారం మొక్కలే). ఇక్కడే అసలు తిరకాసు ఉంది. మొక్కల్లో నీలి రంగు పిగ్మెంట్స్ అత్యంత అరుదు. దాంతో జంతుజాలానికి ఆహారం నుంచి నీలి రంగు అందే అవకాశాల్లేవు. రంగే లేనప్పుడు.. ఎలా కనిపిస్తుంది? నీలం రంగు పిగ్మెంట్స్ అరుదు కావడంతో జంతుజాలం.. వాటిని సేకరించుకోవడం మానేసి, దృష్టి భ్రమపై ఆధారపడ్డాయి. కొన్ని రంగులు, రంగుల మిశ్రమాలను కొన్ని కోణాల్లో చూసినప్పుడు వేరే రంగులుగా భ్రమ కలుగుతుంది. ఈ తరహాలోనే నీలి రంగు కనిపించేలా కొన్ని జంతువులు ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. సీతాకోకచిలుక చేసే ట్రిక్ ఏంటి? నీలి రంగు రెక్కలు, అంచుల్లో నలుపు రంగుతో ‘బ్లూ మార్ఫో’ రకం సీతాకోకచిలుక చాలా అందంగా కనిపిస్తుంది. నిజానికి ఇది నీలి రంగులో ఉండదు. దీని రెక్కల్లో అత్యంత సన్నగా ఎగుడు, దిగుడు నిర్మాణాలు ఉంటాయి. ఈ రెక్కలపై పడిన కాంతి అక్కడికక్కడే ప్రతిఫలించి.. ఒక్క నీలి రంగు కాంతి మాత్రమే బయటికి కనబడేలా ఏర్పాటు ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే.. వేర్వేరు కోణాల్లో చూసినప్పుడు ఈ సీతాకోకచిలుక రెక్కలు రంగులు మారుతుంటాయి. మనం బాగా ఇష్టపడే నెమలి ఈకలు కూడా ఇలా మామూలుగా చూస్తే నీలి రంగులో మెరుస్తుంటాయి. కాస్త అటూ ఇటూ తిప్పితే వేర్వేరు రంగులు కనిపించడం మనకు తెలిసిందే. మరి అసలైన నీలి రంగు ఏది? ఏ వైపు నుంచి చూసినా కచ్చితంగా ఒకే స్థాయిలో నీలం రంగు కనిపిస్తే.. అది అసలైన నీలి రంగు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలైన రంగు పిగ్మెంట్స్ ఉన్నప్పుడు.. ఒకేస్థాయిలో రంగు కనిపిస్తుందని.. లేతగా, ముదురుగా మారడం కూడా ఉండదని వివరిస్తున్నారు. ఈ ‘ది ఓబ్రినా ఆలివ్‌వింగ్’ రకం సీతాకోక చిలుకలపై ఉండే నీలి రంగు పక్కా ఒరిజినల్ అని తేల్చారు. చదవండి: Harish Rao Birthday: వినూత్న బహుమతి -
అయ్యో... రామ... చిలుకలు
సాక్షి, గోకవరం :రామచిలుక ఇంటి ఆవరణలో అరిస్తే చాలు ఆహ్లాదం ... ఇక కనుముందు కదలాడితే కనువిందే...అలాంటిది గాలివానకు చెట్టుపై నుంచి కింద పడి విలవిల్లాడుతూ గిలగిలా కొట్టుకుంటూ చనిపోతే...చూసినవారి మనసు చివుక్కుమంటుంది. అదే జరిగింది గోకవరం మండలంలో...బుధవారం కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి రామచిలుకల జంట మృత్యువాతపడ్డాయి. ఓ భారీ వృక్షం కొమ్మ తొర్రలో నాలుగు రామచిలుకలు తలదాచుకుంటుండగా చెట్టు కొమ్మ విరిగి పడటంతో రెండు రామ చిలుకలు మృత్యువాత పడ్డాయి. మరో రెండు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానిక యువకులు గుర్తించి సంరక్షించారు. -
చిలుకా.. క్షేమమా!
బంజారాహిల్స్: రామచిలుక ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసని దాని అందమంతా గులాబీ రంగులో ఉండే దాని ముక్కులోనే ఉంటుందని అలాంటి అందమైన పక్షిని కాపాడుకుందాం అంటూ సినీ హీరో రాంచరణ్‌తేజ్ సతీమణి ఉపాసన రామచిలుకతో ఉన్న తన ఫొటోతో ట్వీట్ చేశారు. ఇలాంటి అందమైన పక్షి జాతిని సంరక్షించుకునే ఉద్దేశంతోనే ఉపాసన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రామచిలుకను బంధించడం నేరమని ఇందుకు ఆరేళ్ల జైలు శిక్ష పడుతుందని ఆమెపేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పక్షి రామచిలుక అంటూ దాన్ని అందంగా వర్ణించారు. -
పచ్చని చిలకలు తోడుంటే!
పచ్చని చిలకలు, పాడే కోయిలలు, నృత్యాల పిచ్చుకలు... హర్సుఖ్భాయ్ దొబరియ ఇల్లు, ఇల్లుగా కనిపించదు... ఆనందాల హరివిల్లులా కనిపిస్తుంది! గుజరాత్‌లోని జూనగఢ్ జిల్లా కేంద్రానికి చెందిన హర్సుఖ్భాయ్ మొదటి నుంచి పక్షి ప్రేమికుడేమీ కాదు... అయితే ఒకానొక రోజు ఆయన జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చింది. సుమారు పదిహేడు సంవత్సరాల క్రితం హర్సుఖ్భాయ్కి చిన్న యాక్సిడెంటై కాలికి గాయమైంది. ఆ సమయంలో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకరోజు కాస్త దూరంగా ఉన్న ఒక చిలకను చూసి, వరండాలో సజ్జగింజలు చల్లాడు. ఆ చిలక పరుగెత్తుకు వచ్చింది. అలా మొదలైంది ఆ ఇంటికి చిలకల రాక! రోజు రోజుకూ... హర్సుఖ్భాయ్ ఇంటికి వచ్చే చిలకల సంఖ్య పెరుగుతూ పోయింది. అలా ఒకటి కాదు... రెండు కాదు... ఆయన ఇంటికి 250 నుంచి 300 వరకు చిలకలు వచ్చేవి. అయితే ఈ పక్షులకు స్థలం సమస్యగా మారింది. దీంతో పాతపైపులను ఏర్పాటు చేసి, వాటికి రంధ్రాలు చేసి సజ్జకంకులు పెట్టడం మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడి నుంచో గుంపులుగా వచ్చే చిలకలను చూస్తుంటే చూడముచ్చటగా ఉండేది. ఈ చిలకలు అంటే హర్సుఖ్భాయ్కి మాత్రమే కాదు... ఆయన కుటుంబసభ్యులకు కూడా ఎంతో ఇష్టం. ‘‘చిలకల వల్ల ఇల్లంతా మురికి పేరుకుపోతుంది కదా... మీకేమీ ఇబ్బందిగా అనిపించదా?’’ అని అడిగితే హర్సుఖ్ మనవడు కృపాల్ ఇలా అంటాడు...‘‘చిలకలకు తిండిగింజలు పెట్టడం అనేది మా అందరికీ ఇష్టమైన విషయం. మనం బ్రాండెడ్ దుస్తులను ఇష్టపడతాం. అవి మురికైనప్పుడు ఉతికి శుభ్రం చేసుకొని తిరిగి ధరిస్తాం తప్ప... వాటిని వదులుకోలేం కదా! చిలకలు కూడా అంతే. అవంటే మాకు ఎంతో ఇష్టం. అవి మురికి చేస్తాయని వాటికి దూరంగా జరగలేం కదా’’ఇల్లు ఇరుకు అవుతుందని హర్సుఖ్ తన మకాంను నగర శివార్లలోకి మార్చాడు. ఇప్పుడైతే పక్షులకు ఆ ఇల్లు స్వర్గధామంగా మారింది. చిలకల ఆహార ఏర్పాట్లకు హర్సుఖ్కు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది. కొందరు అనవసర ఖర్చు అంటారు. కొందరు అనవసర శ్రమ అంటారు. హర్సుఖ్భాయ్కు మాత్రం ఇది అవసరమైన ప్రేమ. అవసరమైన ఖర్చు. అందుకే ఆయన ఇలా అంటారు... ‘‘పక్షుల వల్ల నా జీవితంలో ఎంతో మంచి జరిగింది. ఈ సంగతి ఎలా ఉన్నా... పక్షులు, జంతువుల సంరక్షణకు మనవంతుగా పాటుపడాలి’’ -
చిలకలా ఉండేందుకు చెవులు కోసుకున్నాడు...
లండన్: బ్రిటన్‌లోని బ్రిస్టల్ నగరానికి చెందిన టెడ్ రిచర్డ్స్ అనే 56 ఏళ్ల ప్రబుద్ధిడికి రామ చిలకలంటే ప్రాణమే కాదు, వల్లమాలిన పిచ్చి. ఆ పిచ్చికాస్త ఈ మధ్య మరీ ప్రకోపించింది. దాంతో తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న రామ చిలకల్లాగా తన ముఖం కూడా ఉండాలని భావించాడు. అంతే...తన రెండు చెవులను సర్జరీతో తీసేయించుకున్నాడు. రామ చిలక రంగులను తలపించేలా ముఖానికి దాదాపు 150 రంగు రంగుల టాట్టులను వేయించుకున్నాడు. అంతటితో సంతృప్తి పడలేదు. జుట్టును కత్తిరించుకొని తల ముందుభాగాన ముచ్చటగా మూడు చిన్నపాటి కొమ్ములను తగిలించుకున్నాడు. ముక్కు కొసన ఓ రింగ్, బుగ్గలపై మెరిసే మెటల్ వస్తువులను తగిలించుకునేందుకు ఏకంగా 150 రంధ్రాలు చేయించుకున్నాడు. నాలుక కొసను రెండుగా చీల్చుకున్నాడు. చిలుకను పోలిన ముక్కును సాధించేందుకు ముక్కు సర్జరీ కోసం ముస్తాబవుతున్నాడు. తనకిష్టమైన ఎల్లి, టీకా, తిమ్నేహ్, జేక్, బూబీ అంటూ ముద్దుగా పిలుచుకునే రామ చిలకలతో ఆడుకుంటూ మురసిపోతున్నాడు. ‘ఇప్పుడు నిజంగా నేను గొప్పగా కనిపిస్తున్నాను. ఇది నాకెంతో ఆనందంగా ఉంది. నా సంతోషానికి అవధులు లేవు. అద్దంలో చూసుకోకుండా ఒక్క క్షణం ఉండలేక పోతున్నానంటే ఒట్టు. ముద్దొచ్చే నా చిలకల్లా సాధ్యమైనంత వరకు ఉండాలన్నదే నా తాపత్రయం’ అని తన వింత చేష్ట గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఓ చెప్పుల కంపెనీలో పనిచేసి రిటైరయిన రిచర్డ్స్కు బాడీ పెయింటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. దానికి ఇప్పుడు వెర్రి వేషాలు తోడయ్యాయి. తన ఎడమ భుజం మీద శాంతి చిహ్నం చెక్కించేందుకు 750 సెంటిగ్రేడ్ డిగ్రీల వద్ద వేడిచేసిన ఇనుప కడ్డీలను ఉపయోగించాడు. ఇప్పుడు తాను బయటకు ఎక్కడికెళ్లినా తనవైపు పిన్నా, పెద్దలందరూ వింతగా చూస్తున్నారని, అది తనకెంతో థ్రిల్లింగా ఉందని రిచర్డ్స్ తెలిపాడు. తాను ముదటి నుంచి ఇతరులకన్నా భిన్నంగా ఉండాలని, తనలా ఎవరూ ఉండకూడదని భావించే వాడినని ఇప్పుడు తనకా కోరిక తీరిందని చెప్పాడు. అంతా బాగానే ఉన్నప్పటికీ చిన్న ఇబ్బంది మాత్రం తప్పడం లేదని వాపోయాడు. చెవులులేక పోవడం వల్ల కళ్లజోడు పెట్టుకోవడం కష్టమవుతోందని అన్నాడు. -
‘చిలకమ్మ’కు గిరాకీ లేదు..!
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : చిలుక ముక్కున కరుచుకుని పక్కన పెట్టే కార్డులో రాసి ఉన్న దాన్నిబట్టి చిలక జ్యోతిష్కులు మన జాతకాన్ని గడగడా చెప్పేస్తారు. ఇది నిజమని నమ్మినా, భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న కుతూహలాన్ని తీర్చుకునే చిరుసరదా అనుకున్నా.. అయితే ప్రస్తుతం పుష్కరాల్లో చిలక జ్యోతిష్కుల జాతకం ఏమంత బాగాలేదన్నది నిజం. ఆకలేసిన చిలుక జామకాయ కోసం ఆరాటపడ్డట్టు.. రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌లోని ఈ చిలక జ్యోతిష్కుల వారు జాతకం చెప్పించుకునే వారి కోసం నిరీక్షిస్తున్నారు. కంప్యూటర్ జ్యోతిష్కాల కాలం కదా.. చిలుక ముక్కుతో కార్డును తీయించడం కాక.. కీ బోర్డును ఆపరేట్ చేయించి, జాతకం చెప్పిస్తే గిరాకీ పెరుగుతుందేమో! -
చిలకమ్మా..చెప్పవే రామయ్యకు వస్తున్నామని
రాజానగరం: భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులకు రామచిలుకలతో ‘పిలుపును’ అందించే కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలో గురువారం జరిగింది. శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో 4 రామచిలుకలను 4 వేదాలుగా పూజిస్తూ ‘శ్రీరామ’ నామాన్ని జపించారు. ప్రత్యేకంగా ముద్రించిన రామయ్య కల్యాణోత్సవ ఆహ్వాన శుభలేఖలను చిలుకలకు కట్టి పూజించారు. కోటి తలంబ్రాలతో భద్రాద్రికి పయనమవుతున్న సమాచారాన్ని రామయ్యకు తెలియజే యాలని కోరుతూ చిలుకలను గాలిలోకి విడిచారు. - రాజానగరం -
అవకాశం దొరికింది.
కడుపు నింపుకునేందుకు చక్కని అవకాశం దొరికింది. ఇప్పుడు వదిలేశామా మళ్లీ ఇలాంటి అవకాశం మాకు దక్కదని అనుకున్నాయో ఏమో ఎక్కడెక్కడినుంచి వచ్చిన పక్షులు తమ నోటికి పని పెట్టాయి. నగరంలోని ఓ ప్రాంతంలో మంగళవారం ధాన్యం తింటున్న చిలుకలు, పావురాళ్లు, ఓ ఉడుత -
అరణ్యం: చిట్టీ చిలకమ్మా... నీ గురించి చెప్పమ్మా...
{పపంచంలో మొత్తం 372 రకాల చిలుకలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం ఉష్టమండలాల్లోనే జీవిస్తున్నాయి! చిలుకలకు గ్రహణ శక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే మనుషుల మాటలను అవి త్వరగా గ్రహిస్తాయి. వాటిని గుర్తు పెట్టుకుని తిరిగి వల్లె వేస్తాయి. అయితే అన్ని జాతుల చిలుకలూ అలా చేయలేవు. కొన్నే చేయగలవు. మనుషుల స్వరాన్ని అనుకరించడంలో ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్దే ప్రథమస్థానం! సాధారణంగా పక్షులు నేల మీద ఉన్న ఆహారాన్ని ముక్కుతో పట్టి తినేస్తాయి. కానీ చిలుకలు మాత్రం కాళ్లతో తీసుకుని నోట్లో పెట్టుకుని తింటాయి! చాలా రకాల చిలుకలు దాదాపు ఎనభై ఏళ్ల వరకూ జీవిస్తాయి. కానీ కొన్ని జాతులు పదిహేనేళ్లు మాత్రమే బతుకుతాయి! చిలుకలు మహా సరదాగా ఉంటాయి. వాటికి ఆడుకో వడం చాలా ఇష్టం. వాటి ఆట ఎలా ఉంటుందో తెలుసా? చుట్టుపక్కల ఉన్న వస్తువులను కొరకడం, ముక్కుతో పొడవడం వంటివి చేస్తుంటాయి. అదే వాటి ఆట! చిలుకల ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. చిన్న దెబ్బలు కూడా వాటి ప్రాణాన్ని తీసేయగలవు! వీటిలో ఎడమ చేతి (కాలు) వాటం ఉంటుంది. ఏ కాలితో ఆహారాన్ని తీసి నోటితో పెట్టుకుంటాయో, వాటిది ఆ వాటం అన్నమాట! {పయత్నిస్తే చిలుకలకు పదిహేడు వందల మాటల వరకూ నేర్పవచ్చు. అవి అన్ని గుర్తుపెట్టుకోగలవు! తీయని కబుర్లు చెబుతాయన్న మాటే గానీ చిలుకలకు స్వర పేటిక ఉండదు. శ్వాసనాళంలోకి గాలిని బలంగా పీల్చి వదలడం ద్వారా అవి శబ్దాలను సృష్టిస్తాయి! పావురాల ప్రేమికుడు బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ జీవితం... తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలోని పేజీల నిండా ఎన్నో విజయాలు, ఎన్నో విషాదాలు, ఎన్నో వివాదాలు నిండి ఉంటాయి. చిన్న వయసులోనే పెద్ద పెద్ద కష్టాల్ని చవి చూశాడు టైసన్. అన్నీ తట్టుకున్నాడు. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. అయినా మొండిగా నిలబడ్డాడు. కానీ తన నాలుగేళ్ల కూతురి మరణం అతడిని నిలువునా కుదిపేసింది. బైపోలార్ డిజార్డర్ అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడతడికి ఎవరు కనిపించినా చంపెయ్యాలనిపించేదట. అలాంటప్పుడు వెళ్లి తన పెంపుడు పావురాలతో గడిపేవాడట. అప్పుడు మనసు కుదుటపడేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. టైసన్‌కి మొదట్నుంచీ పావురాలంటే ఎంతో ఇష్టం. చాలా ఉండేవి అతడి దగ్గర. బాక్సర్ కాకముందు పావురాలతో పందాలు కాసేవాడట. ఆ ఇష్టం అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. వాటి గురించి ఎప్పుడు మాట్లాడినా... అవి లేకపోతే నేనేమైపోయేవాడినో అంటుంటాడు!