
Parrots In Dreams: మనిషి నిద్రించే సమయంలో కలలు రావడం సర్వసాధారణం. కలలో మనుషులు, జంతువులు, పక్షులు, ఎత్తయిన శిఖరాలు, జలపాతాలు, లోయలు ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే కలలోకి కొన్ని రకాల పక్షులు వస్తే అదృష్టం, సంతోషం.. కొన్ని జాతుల పక్షులు కనిపిస్తే సమస్యలు ఎదురవుతాయని శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా రామచిలుకలు కలలోకి వస్తే ఆ మనిషి పంట పండినట్టేనట.
ఇలా జరగడం వల్ల వ్యాపార రంగాల్లో గుర్తింపు, గౌరవంతో పాటు ఆకస్మిక ధనలాభం, అధిక మొత్తంలో లాభాలు కలుగుతాయట. కాబట్టి కలలో రామచిలుకలు కనిపించడం శుభసూచకమేనని చాలామంది విశ్వసిస్తారు. అలాగే, పిచ్చుకలు, నెమలి, గరుడ పక్షి, కొంగ కనిపించడం కూడా శుభ సంకేతమేనట. ఈ పక్షులు కలలోకి వస్తే.. కష్టాలు తొలగిపోయి కుటుంబాల్లో ఆనందాలు నెలకొనడంతో పాటు సంపద వృద్ధి, వివాహం, సంతానప్రాప్తి కలుగుతాయట. అయితే, కలలో కాకి కనిపిస్తే మాత్రం దురదృష్టమని.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని కొందరు నమ్ముతారు.
చదవండి: విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..!