ఎవరికైనా సరే కలలు రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కలలో పర్వతాలు .. నదులు .. అడవులు .. జంతువులు కనిపిస్తూ ఉంటాయి. పులులు .. సింహాలు .. ఏనుగులు కనిపించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి జంతువులు కలలో కనిపించి నప్పుడు భయం కలుగుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ విషయాన్ని ఇతరులతో పంచుకుని, ఏం జరుగుతుందోననే ఆందోళనకి లోనవుతుంటారు. అయితే కలలో ఏనుగు కనిపిస్తే మంచిదేనని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
ఏనుగు కుంభస్థలం .. లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. అందువలన కలలో ఏనుగు దర్శనం వలన సంపదలు లభిస్తాయని అంటారు. ఏనుగును దర్శించుకోవడం వలన దారిద్య్రం .. దుఃఖం దూరమవుతాయని చెబుతారు. అదృష్టం .. ఐశ్వర్యం చేకూరతాయని నమ్ముతారు. ఆయా పుణ్య క్షేత్రాల్లో గజ వాహనంగా ఏనుగులు భగవంతుడి సేవలో తరిస్తుంటాయి. గజ ముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటూ ఉంటాడు .. అందరి విఘ్నాలను తొలగిస్తూ ఉంటాడు. అలాంటి ఏనుగును కలలోనే కాదు .. బయట చూసినా ఇలాంటి ఫలితాలే కలుగుతాయట.
ఇదీ చదవండి : Diwali 2024 దీపావళి లక్ష్మీపూజ : మీ ఇల్లంతా సంపదే!
Comments
Please login to add a commentAdd a comment