elephant
-
ఇది ఏనుగు... కానీ కాదు!
కేరళ త్రిసూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయంలో ఒక ఏనుగు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే ఇది సజీవమైన ఏనుగు కాదు. లైఫ్–సైజ్ మెకానికల్ ఎలిఫెంట్. ప్రముఖ సితారిస్ట్ అనౌష్క శంకర్, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్(పెటా) కలిసి శ్రీకృష్ణస్వామి ఆలయానికి ఈ యాంత్రిక ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఇది మూడు మీటర్ల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుంది.‘ఈ రోబోటిక్ ఏనుగు వల్ల సజీవమైన ఏనుగులను గొలుసులతో బంధించి, ఆయుధాలతో నియంత్రిస్తూ బాధ పెట్టడం అనేది ఉండదు. రోబోటిక్ ఏనుగులు సజీవ ఏనుగులకు మానవీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి’ అంటోంది పెటా. రబ్బర్, ఫైబర్, మెటల్, ఫోమ్, స్టీల్‌తో రూపొందించిన ఈ యాంత్రిక ఏనుగు సజీవ ఏనుగులా భ్రమింపచేస్తుంది. తల, కళ్లు, చెవులు, తోక, తొండాలను కదిలిస్తుంది. తొండాన్ని పైకి లేపి నీళ్లు చల్లుతుంది. -
దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, 24మందికి గాయాలు
తిరువనంతపురం : కేరళలో విషాదం చోటు చేసుకుంది. పటాకుల శబ్ధానికి బెదిరిపోయిన ఏనుగులు భక్తుల్ని తొక్కి చంపినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించారు.పోలీసుల సమాచారం మేరకు.. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కోయిలాండి సమీపంలో కురవంగడ్‌లోని మనక్కులంగర భగవతి ఆలయ ప్రాంగణంలో వార్షిక ఉత్సవం జరిగింది. ఉత్సవం చివరి రోజున నిర్వాహకులు రెండు ఏనుగుల్ని తీసుకువచ్చారు.ఉత్సవ సమయంలో నిర్వాహకులు బాణసంచా పేల్చారు. దీంతో ఆ రెండు ఏనుగులు బెదిరిపోయాయి. భక్తుల్ని తొక్కుకుంటూ, దాడులు చేస్తూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా.. 24 మంది గాయపడ్డారు. ‘ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది. ఏనుగులను సాయంత్రం ఊరేగింపు కోసం ప్రదర్శిస్తుండగా, పటాకుల శబ్దం విన్న తర్వాత అకస్మాత్తుగా వాటిలో ఒక ఏనుగు బెదిరిపోయింది. మరో ఏనుగుతో ఘర్షణకు దిగింది. ఆ సమయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఏనుగులు ఒకదానికొకటి తోసుకోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు ఉత్సవ కార్యాలయం కూడా కూలిపోయింది’ అని కౌన్సిలర్ చెప్పారు.దేవాలయంలో దుర్ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రెండు ఏనుగుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్రాకర్ల శబ్దానికి ఏనుగులు బెదిరిపోవడం వల్లే విషాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలింది. కోయిలాండి ఎమ్మెల్యే కనాతిల్ జమీలా మీడియాతో మాట్లాడుతూ.. క్రాకర్ల శబ్ధానికి ఏనుగులు బెదిరిపోయాయి. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాయి. ఆ సమయంలో భక్తుల మధ్య తొక్కిసలాట, తోపులాట జరిగింది. గాయపడిన 24 మందిని ఆసుపత్రికి తరలించాము’ అని అన్నారు. -
కుంకీలతో కట్టడి సాధ్యమేనా
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య(elephant problem) దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో(elephant attack) జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్(Kunki Elephant) ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది. కౌండిన్యలో ఏనుగుల పరిస్థితి ఇదీ పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఉంది. కౌండిన్య అభయారణ్యంలో స్థిరంగా ఉన్న గుంపులు, వలస వచ్చిన గుంపులు కలిపి మొత్తం 120 వరకు ఏనుగులు సంచరిస్తున్నాయి. 1984లో ప్రభుత్వం ముసలిమొడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీని ఏర్పాటు చేసింది. ఇందులోకి తమిళనాడులోని మోర్థన ఫారెస్ట్నుంచి, ననియాల, కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి ఏనుగులు వస్తున్నాయి. ఏనుగులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు గతంలో రూ. 2.61 కోట్లతో బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కి.మీ మేర సోలార్‌ఫెన్సింగ్‌ను 40 కి.మీ మేర ట్రెంచ్‌లను ఏర్పాటుచేశారు. అయితే సోలార్‌ఫెన్సింగ్‌ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకువస్తున్నాయి. ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాశిరకంగా ఉండటంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్‌లను సైతం ఏనుగులు మట్టిని తోసి,రాళ్లున్న చోట సులభంగా అడవిని దాటి బయటికొస్తున్నాయి. ఈరెండూ విఫలమవడంతో గతేడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్‌ను పదికిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి ఆపై దీన్నీ వదిలేశారు.కుంకీల కోసం కర్ణాటకతో ఎంవోయూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కర్ణాటకతో ఎంవోయూ చేసుకొని అక్కడ శిక్షణపొందిన నాలుగు కుంకీ ఏనుగులను ఇక్కడికి తెప్పిస్తోంది. ఇందుకోసం రేంజి పరిధిలోని 20 మంది ఎలిఫెంట్ ట్రాకర్లను దుభారే ఎలిఫెంట్ క్యాంపునకు పంపి నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించారు. దీనికోసం ముసలిమొడుగు వద్ద రూ.12లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం కర్రలకంచెతో విడిది, మేతను సిద్దం చేసుకునే గదులు, చిన్నపాటి చెరువు, శిక్షణాస్థలం. క్రాల్స్( మదపుటేనుగులను మచ్చిక చేసుకొనే చెక్క గది) పనులు జరుగుతున్నాయి.మరో రూ.27 లక్షలతో హ్యాంగింగ్ సోలార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఉండగా గతంతో రామకుప్పం వద్ద నినియాలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులో రెండు ఏనుగులున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వెళుతున్నారేగానీ ఇవి అడవిలోని ఏనుగును కట్టడి చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అదే రీతిలో ఇక్కడ కుంకీలతో సమస్య తెగుతుందా? లేదా అనే సందేహం మాత్రం ఇక్కడి రైతులకు పట్టుకుంది. అసలే ఇక్కడున్న మదపుటేనుగులు (రౌడీ ఏనుగులు,పుష్పా) కుంకీ ఏనుగులపై దాడులు చేసే అవకాశం లేకపోలేదు.గుబులు రేపుతున్న ఒంటరి ఏనుగు.... పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో వందకు పైగా ఏనుగులు సంచరిస్తున్నా కేవలం ఓ ఒంటరి ఏనుగు రెండునెలలుగా జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం వ్యవసాయపొలాల వద్ద ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తోంది. ఆ ఇళ్ళలోని ధాన్యం, రాగులు హాయిగా ఆరగించి వెళుతోంది. దీంతోపాటు ఆఇళ్ల వద్ద ఉన్న మనుషులపై దాడులు చేస్తోంది.వారు దొరక్కపోతే ఆ ఇళ్ల వద్ద కట్టేసి ఉన్న ఆవులు, దూడలను చంపుతోంది. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లో పొలాలవద్ద కాపురాలుంటున్న వారు ఈ ఏనుగు భారినుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంగాక హడలిపోతున్నారు. కాగా గత పదేళ్లలో కరెంట్ షాక్‌లు, నీటిదొనల్లో పడి, మదపుటేనుగుల రభస కారణంగా 16 ఏనుగులు చనిపోయాయి. ఏనుగుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14మంది మృతి చెందగా 26 మందివరకు గాయపడ్డారు. అడవిని విడిచి ఎందుకొస్తున్నాయంటే... కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. ఓ ఏనుగుకు రోజుకి 900లీటర్ల నీరు, 10 హెక్టార్లలో ఫీడింగ్ అవసరం. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5మైళ్లదాకా సంచరిస్తుంటాయి. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీశాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి వీటిని మళ్లీ కౌండిన్య వైపుకు మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండటంలేదు. పొలాల్లోని చెరుకు, కొబ్బరి, మామిడి లాంటి ఆహారం కోసం ఒక్కసారి వచ్చే ఏనుగు తరచూ అదే మార్గంలో వస్తూనే ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.క్యాంప్ పనులు సాగుతున్నాయి పలమనేరులో కుంకీ ఎలిఫెంట్ క్యాంపుకోసం ఇప్పటికే పనులు సాగుతున్నాయి. మైసూరు సమీపంలోని దుబరే నుంచి నాలుగు కుంకీ ఏనుగులు త్వరలో రానున్నాయి. ఎలిఫెంట్ ట్రాకర్లకు ఇప్పటికే కుంకీ ట్రైనింగ్ ఇప్పించాం. ముఖ్యంగా మదపుటేనుగులు దాడులు చేయకుండా వాటికి శిక్షణనిస్తాం. దీంతో ఏనుగులను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. – భరణి, డీఎఫ్‌వో, చిత్తూరుకుంకీలతోనైనా సమస్య తీరితే చాలు.. గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే అదే పదివేలు. అయినా జనంపై దాడులు చేస్తూ యథేచ్ఛగా పంటపొలాలపై పడుతున్న మదపుటేనుగులను ఈ కుంకీ ఏనుగులు ఎంతవరకు అదుపు చేస్తాయనే విషయంపై అనుమానంగానే ఉంది. – ఉమాపతి, రైతుసంఘ నాయకులు, పలమనేరు -
‘‘వీళ్లు మనుషుల్రా..బాబూ..!’’ జేసీబీని ఎత్తికుదేసిన గజరాజు, వైరల్ వీడియో
సాధారణంగా సాధు జంతువులైనా, అడవి జంతులైనా వాటికి హాని కలుగుతుందన్న భయంతోనే ఎదుటివారిపై దాడి చేస్తాయి ఈ విషయంలో ఏనుగు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలా సహనం నశించి ప్రాణ భయంతో ఏనుగు తిరగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆహారం కోసం వచ్చి తనదారిన తాను పోతున్న అడవి ఏనుగును అనవసరంగా కావాలనే రెచ్చగొట్టారు తుంటరిగాళ్లు. వేలం వెర్రిగా వీడియోలను తీసుకుంటూ వేధించారు. ‘‘చూసింది.. చూసింది.. మనుషులురా..ఇక వీళ్లు.. మారరు.. అనుకున్నట్టుంది.. తనదైన శైలిలో ప్రతాపం చూపించింది. జేసీబీని ఎత్తి కుదేసింది. పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 1న జరిగిన ఈ సంచలన ఘటన సోషల్ మీడియా ఆగ్రహానికి కారణమైంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలోని డామ్‌డిమ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆహారం కోసం ఒక పెద్ద ఏనుగు అపల్‌చంద్ అడవి నుండి బయటకు వచ్చింది. స్థానికులు దానిని వెంటాడారు. ఏనుగును వేధించి వెంబడించారు. అక్కడ ఉన్న వారిలో ఒకరు ఏనుగు తోక పట్టుకొని లాగారు. సహనం నశించిన అది చుట్టూ మూగినవారిపై దాడి చేసింది.. నిర్మాణ సామగ్రిని,సమీపంలోని వాచ్‌టవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. జేసీబీపై తన ఆగ్రహాన్ని ప్రకటించింది. డ్రైవర్ ఎక్స్కవేటర్ బకెట్‌ను ఉపయోగించి దానిని ఎదుర్కొన్నాడు. దీంతో ఏనుగు పారిపోవడానికి అలా తిరిగిందో మళ్లీ జనం ఎగబడటం వీడియోలో రికార్డ్ అయింది. స్థానికులెవరికీ గాయాలు కాలేదు.కానీ ఏనుగుకి తొండంపై గాయాలైనాయి. దీంతో నెటిజనులు మండిపడుతున్నారు. ఏనుగుని గాయపర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. TRAGIC THIS: In search of food but disturbed by human noise, a wild elephant attacked a JCB and a watchtower in Damdim (Dooars) today. In the chaos, the tusker also sustained injuries. pic.twitter.com/ZKlnRixaFN— The Darjeeling Chronicle (@TheDarjChron) February 1, 2025వన్యప్రాణులతో సహజీవనం చేయాలని, వాటి పట్ల దయతో వ్యవహరించాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు చాలామంది. అలాగే అడవి జంతువులను కాపాడటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించిన వారిపైఅటవీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, లేకపోతే కొన్ని సంవత్సరాల్లో ఇవి పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. "ఏనుగులను ఏమీ అనకపోతే వాటిదారిన అవి పోతాయి, వేధిస్తేనే తిరగబడతాయని మరొకొరు పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!మరోవైపు జేసీబీ డ్రైవర్ , ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఏనుగును వేధించారనే ఆరోపణలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని బహుళ సెక్షన్ల కింద వన్యప్రాణి కార్యకర్త తానియా హక్‌తో పాటు, మరికొందరు ఫిబ్రవరి 2న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. అడవి ఏనుగును రెచ్చగొట్టాడనే ఆరోపణలతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.జేపీబీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. జేసీబీ క్రేన్‌తో ఏనుగును రెచ్చగొట్టి దాడి చేసినందుకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్ రే తెలిపారు. ఏనుగును అడవిలోకి వదిలేశామని అన్నారు.బెంగాల్ ప్రస్తుతం దాదాపు 680 ఏనుగులకు నిలయంగా ఉంది. అడవి ఏనుగులు తరచుగా ఆహారం కోసం జల్పైగురి, నక్సల్బరి, సిలిగురి , బాగ్డోగ్రా వంటి ప్రాంతాలలో తిరుగుతుంటాయి. సాధారణంగా, స్థానికులు సురక్షితమైన దూరంలో ఉంటూ, వారితో ప్రేమగా, శాంతియుతంగా ఉంటారు. అయినా పశ్చిమ బెంగాల్ అడవులలో మానవ-ఏనుగుల సంఘర్షణ చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. దీనివల్ల పెద్ద సంఖ్యలో మానవ మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జూలై 2024 నాటి డేటా ప్రకారం, 2023-24లో పశ్చిమ బెంగాల్లో మానవ-ఏనుగుల సంఘర్షణ కారణంగా 99 మానవ మరణాలు సంభవించాయి.ఇది ఒడిశా ,జార్ఖండ్లతో పాటు దేశంలోనే అత్యధిక మరణాలలో ఒకటి. 2022-2023 మంత్రిత్వ శాఖ డేటా ఆధారంగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో వేటాడటం, విద్యుదాఘాతం, విషప్రయోగం రైలు ప్రమాదాలు వంటి మానవ ప్రేరిత కారకాల వల్ల తక్కువ సంఖ్యలో ఏనుగుల మరణాలు నమోదయ్యాయి. ఇక్కడ 2023లో మొత్తం ఏడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. -
కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!
దేవాలయాల్లో దేవుళ్లను గజవాహనంతో ఊరేగించడం వంటివి చేస్తారు. అంతేగాదు కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే ఏనుగులపై దేవుడిని ఊరేగిస్తారు. అందుకోసం మావటి వాళ్లు తర్ఫీదు ఇచ్చి దైవ కైంకర్యాలకు ఉపయోగించడం జరుగుతుంది. దీని కారణంగా ప్రకృతి ఓడిలో హాయిగా స్వేచ్ఛగా బతకాల్సిన ఏనుగులు బందీలుగా ఉండాల్సిన పరిస్థితి. దీనివల్లే కొన్ని ఏనుగులు చిన్నప్పుడు వాటి తల్లుల నుంచి దూరమైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమస్య తలెత్తకుండా ఉండేలా లాభపేక్షలే జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఒక చక్కని పరిష్కారమార్గం చూపించింది. ఇంతకీ ఆ సంస్థ ఏం చేస్తోందంటే..గజారోహణ సేవ కోసం ఏనుగుల బదులుగా యాంత్రిక ఏనుగుల(ఛMechanical elephant)ను తీసుకొచ్చింది పెటా ఇండియా. ఏనుగులు సహజ ఆవాసాలలోనే ఉండేలా చేసేందుకే వీటిని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇలా యాంత్రిక ఏనుగులను ఉపయోగించడం ద్వారా నిజమైన జంబోలు తమ కుటుంబాలతో కలిసి ఉండగలవని, పైగా నిర్బంధం నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంది పెటా ఇండియా. అలాగే ఆయుధాలతో నియత్రించబడే బాధల నుంచి తప్పించుకుని హాయిగా వాటి సహజమైన ఆవాసంలో ఉంటాయని పేర్కొంది. ఇక ఈ యాంత్రిక ఏనుగులను రబ్బరు, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్ స్టీల్‌తో రూపొందించినట్లు తెలిపింది. ఇవి నిజమైన ఏనుగులను పోలి ఉంటాయి. ఈ యాంత్రిక ఏనుగు తల ఊపగలదు, తొండం ఎత్తగలదు, చెవులు, కళ్లను కూడా కదిలించగలదు. అంతేగాదు నీటిని కూడా చల్లుతుందట. ఇది ప్లగ్-ఇన్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుందట. దీనికి అమర్చిన వీల్‌బేస్ సాయంతో వీధుల గుండా ఊరేగింపులకు సులభంగా తీసుకెళ్లచ్చొట. తాజాగా ప్రఖ్యాత సితార్ విద్వాంసురాలు, ఈ ఏడాది గ్రామీ నామినీ అనౌష్కా శంకర్(Anoushka Shankar) పెటా ఇండియా(Peta India) సహకారంతో కేరళ త్రిస్సూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయాని(Kombara Sreekrishna Swami Temple)కి ఇలాంటి యాంత్రిక ఏనుగుని విరాళంగా సమర్పించారు. సుమారు 800 కిలోగ్రాముల బరువున్న ఈ ఏనుగును బుధవారం(ఫిబ్రవరి 05, 2025న ) ఆలయంలో ఆవిష్కరించారు. ఈ యాంత్రిక ఏనుగు పేరు కొంబర కన్నన్.ఇలా పెటా ఇండియా కేరళ(Kerala) ఆలయాలకి యాంత్రిక ఏనుగులను ఇవ్వడం ఐదోసారి. త్రిస్సూర్ జిల్లాలో మాత్రం రెండోది. ఇటీవల మలప్పురంలోని ఒక మసీదులో మతపరమైన వేడుకల కోసం కూడా ఒక యాంత్రిక ఏనుగును అందించింది. నిజంగా పెటా చొరవ ప్రశంసనీయమైనది. మనుషుల మధ్య కంటే అభయారణ్యాలలోనే ఆ ఏనుగులు హాయిగా ఉండగలవు. అదీగాక ఇప్పుడు ఏనుగుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి ప్రత్యామ్నాయం ప్రశంసనీయమైనదని జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Kombara Kannan, a 3-metre-tall mechanical elephant weighing 800 kilograms, was offered to Kombara Sreekrishna Swami Temple, in Thrissur district on Wednesday, by renowned sitarist Anoushka Shankar and PETA India.📹Thulasi Kakkat (@KakkatThulasi) pic.twitter.com/Cz0vD0NNHs— The Hindu (@the_hindu) February 5, 2025 (చదవండి: ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!) -
తిరుమలలో యాంకర్ శ్రీముఖి, గజరాజు ఆశీర్వాదం (ఫోటోలు)
-
‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం.... భూమాతకు తీరని శోకం!
భూమండలంపై అత్యంత భారీకాయంతో సంచరించే శాకాహార బాహుబలిగా ఏనుగు మనందరికీ చిరపరిచితం. ఆఫ్రికా ఖండంలోని పీఠభూముల్లో సర్వసాధారణంగా కనిపించే ‘సవన్నా’, ‘అటవీ’జాతి ఏనుగులు అత్యంత వేగంగా అంతర్థానమవుతున్నాయి. అటవీప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిన మానవ కార్యకలాపాలు, విస్తరిస్తున్న వ్యవసాయం, విజృంభిస్తున్న అక్రమ వేటతో ఏనుగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం గత యాభై సంవత్సరాల్లో.. సర్వేచేసిన ప్రాంతాల్లో సవన్నా జాతి ఏనుగుల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. ‘ఫారెస్ట్’జాతి ఏనుగుల సంఖ్య ఏకంగా 90 శాతం క్షీణించడం ఏనుగుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య పెరగడం ఒకింత ఉపశమనం కల్పిస్తోంది.అత్యంత తెలివి అత్యంత తెలివితేటలతోపాటు మానవునిలా సామూహికంగా జీవించే నైపుణ్యమున్న వన్యప్రాణిగా ఏనుగు పేరొందింది. 1964 నుంచి 2016 సంవత్సరం దాకా ఆఫ్రికా ఖండంలోని 37 దేశాల్లోని 475 భిన్న ప్రదేశాల్లో ఏనుగుల జాడపై విస్తృతస్థాయి గణన, పరిశోధన చేశారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇంతటి విస్తృత సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. సంబంధిత నివేదిక సోమవారం వెల్లడైంది. దీనిలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. సవన్నా, ఫారెస్ట్ జాతి ఏనుగుల సంఖ్య సగటున ఏకంగా 77 శాతం తగ్గిపోయింది. విడిగా చూస్తే సవన్నా జాతి 70 శాతం, ఫారెస్ట్ జాతి సంఖ్య 90 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు గుంపులగుంపులుగా కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అవి ఒక్కటికూడా లేవని సర్వేలో తేలింది. అయితే కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల పరిరక్షణ చర్యలతో వాటి సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘‘తగ్గిపోయిన సంఖ్యను ఎలాగూ పెంచలేము. ఉన్న ఏనుగుల సంఖ్యా వేగంగా క్షీణిస్తోంది. మాలి, చాద్, నైజీరియా వంటి దేశాల్లో మరీ దారుణంగా పడిపోయింది’’ అని కొలరాడో స్టేట్ వర్సిటీలో వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ విభాగ ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ చెప్పారు.కొన్ని చోట్ల మెరుగైన పరిస్థితులు ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతో శ్రమకోర్చి ఏనుగుల సంతతిని కాపాడుతున్నారు. ప్రభుత్వాల చొరవ, స్థానికుల అండతో ఏనుగుల సంఖ్య అక్కడ పెరిగింది. బొట్సావా, జింబాబ్వే, నమీబియాలో ఇప్పటికే వాటి సంఖ్య భారీగానే ఉంది. ‘‘కొన్ని చోట్ల మనం విజయం సాధించాం. ఈ విషయంలో మనకు మనం శెభాష్ చెప్పకోవాల్సిందే. అయితే ఇంకా ఏఏ ప్రాంతాల్లో విజయావకాశాలు ఉన్నాయో కనిపెట్టి కార్యసాధకులం కావాల్సిన తరుణమొచ్చింది’’అని ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ అన్నారు.ఏనుగు దంతాలపై మోజుతో.. చాలా పొడవుండే ఆఫ్రికన్ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. వీటి కోసమే వేటగాళ్లు ఏనుగులను చంపేస్తున్నారు. వేటగాళ్లను అడ్డుకోగలిగితే ఈ వన్యప్రాణులను కాపాడవచ్చని జంతుప్రేమికులు చెబుతున్నారు. అడవుల్లో పెరుగుతున్న వ్యవసాయం కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను, ఆహార వనరులను కోల్పోతున్నాయి. చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!‘‘అడవుల విస్తరణకు ఏనుగులు మూలాధారం. ఎన్నో రకాల చెట్ల కాయలు, పండ్లను తింటూ వాటి గింజలను జీర్ణంచేయకుండా వేర్వేరు చోట్ల విసర్జించి కొత్త మొక్కల అంకురార్పణకు ఆజ్యం పోస్తాయి. నిత్యం వనవృద్ధి కార్యం చేసే ఏనుగుల సంఖ్య తగ్గడం భూమాతకు తీరని శోకం’’ అని సౌత్ ఆఫ్రికాలోని నెల్సన్ మండేలా యూనివర్సిటీలోని ఆఫ్రికన్ కన్జర్వేషన్ ఎకాలజీ అధ్యయనకారుడు, నివేదిక సహరచయిత డేవ్ బల్ఫోర్ ఆందోళన వ్యక్తంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అనంత్ అంబానీ వంతారాకు కొత్త అతిధులు
అనంత్ అంబానీ స్థాపించిన 'వంతారా' (Vantara) గురించి అందరికి తెలుసు. జామ్‌నగర్‌లో ఉన్న ఈ వన్యప్రాణుల రెస్క్యూ కేంద్రానికి మూడు ఆఫ్రికన్ ఏనుగులు విచ్చేసాయి. ఇందులో రెండు ఆడ ఏనుగులు, మరొకటి మగ ఏనుగు. వీటి వయసు 28 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నట్లు సమాచారం.వంతారాను ట్యునీషియాలోని ఒక ప్రైవేట్ జంతుప్రదర్శనశాల అధికారులు సంప్రదించి, ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఏనుగుల పోషణ కష్టమైందని వెల్లడించింది. సుమారు 20ఏళ్ల క్రితం నాలుగు సంవత్సరాల వయసున్న 'అచ్తామ్, కనీ, మినా' అనే ఏనుగులు బుర్కినా ఫాసో నుంచి ట్యునీషియాలోని ఫ్రిగ్యుయా పార్కుకు వచ్చాయి. అప్పటి నుంచి అవి సుమారు 23 సంవత్సరాలు అక్కడి సందర్శకులను కనువిందు చేశాయి.ప్రస్తుతం ట్యునీషియాలో వాటి పోషణ భారమైంది. దీంతో భారతదేశంలోని వంతారాకు తరలించాలని నిశ్చయించారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఏనుగులను ప్రత్యేకమైన చార్టర్డ్ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా భారత్‌కు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వంతారాకు విచ్చేసిన ఆఫ్రికా ఏనుగులు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వెటర్నరీ అధికారులు వెల్లడించారు. ఏనుగులకు జుట్టు రాలడం, చర్మం సంబంధిత సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. అచ్తామ్కు స్ప్లిట్ టస్క్ & మోలార్ టూత్ ఇన్ఫెక్షన్ ఉంది. కని ఏనుగు గోళ్లు పగిలినట్లు చెబుతున్నారు. కాబట్టి వీటికి సరైన వైద్య చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఏనుగులకు ప్రత్యేకమైన వసతిని కూడా వంతారాలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
కలలో ఏనుగు కనిపిస్తే..? ఏమవుతుంది?
ఎవరికైనా సరే కలలు రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కలలో పర్వతాలు .. నదులు .. అడవులు .. జంతువులు కనిపిస్తూ ఉంటాయి. పులులు .. సింహాలు .. ఏనుగులు కనిపించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి జంతువులు కలలో కనిపించి నప్పుడు భయం కలుగుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ విషయాన్ని ఇతరులతో పంచుకుని, ఏం జరుగుతుందోననే ఆందోళనకి లోనవుతుంటారు. అయితే కలలో ఏనుగు కనిపిస్తే మంచిదేనని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఏనుగు కుంభస్థలం .. లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. అందువలన కలలో ఏనుగు దర్శనం వలన సంపదలు లభిస్తాయని అంటారు. ఏనుగును దర్శించుకోవడం వలన దారిద్య్రం .. దుఃఖం దూరమవుతాయని చెబుతారు. అదృష్టం .. ఐశ్వర్యం చేకూరతాయని నమ్ముతారు. ఆయా పుణ్య క్షేత్రాల్లో గజ వాహనంగా ఏనుగులు భగవంతుడి సేవలో తరిస్తుంటాయి. గజ ముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటూ ఉంటాడు .. అందరి విఘ్నాలను తొలగిస్తూ ఉంటాడు. అలాంటి ఏనుగును కలలోనే కాదు .. బయట చూసినా ఇలాంటి ఫలితాలే కలుగుతాయట. ఇదీ చదవండి : Diwali 2024 దీపావళి లక్ష్మీపూజ : మీ ఇల్లంతా సంపదే! -
ఏనుగుతో సెల్ఫీకి యత్నం..యువకుడి దుర్మరణం
నాగ్‌పూర్: సెల్ఫీ సరదా మరో నిండు ప్రాణం తీసింది. 23 ఏళ్ల ఓ యువకుడు ఏకంగా ఏనుగుతో అడవిలో సెల్ఫీ తీసుకునే సాహసం చేశాడు. ఇంకేముంది ఆ అడవి గజరాజుకు కోపం కట్టలు తెంచుకుది. శశికాంత్ రామచంద్ర అనే ఆ యువకుడిని తొండంతో కొట్టి కిందపడేసి కాళ్ల కింద తొక్కి నలిపేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం(అక్టోబర్ 24) జరిగింది. శశికాంత్ అతని స్నేహితులతో కలిసి అడవిలో కేబుల్ వేసే పని కోసం వెళ్లాడు. ఫారెస్ట్ సిబ్బంది ఎంత చెబుతున్నా వినకుండా ఏనుగులుండే ప్రదేశానికి వెళ్లి దానితో ఆటలాడి ప్రాణాలు కోల్పోయాడు. శశికాంత్ స్వస్థలం మహారాష్ట్రలోని చంద్రపూర్.ఇదీ చదవండి: ప్రాణం తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. వ్యక్తిని తొక్కి చంపిన అడవి ఏనుగు
ముంబై: ఓ వైపు ప్రాణాలు పోగుట్టుకుంటున్నా యువతకు సెల్ఫీ పిచ్చి మాత్రం వదలట్లేదు. ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో మరో సెల్ఫీ మరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అడవి ఏనుగుతోనే సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.శ్రీకాంత్ రామచంత్ర సాత్రే అనే 23 ఏళ్ల యువకుడు తన ఇద్దరు స్నేహితులలతో కలిసి గడ్చిరోలి జిల్లాలో కేబుల్ లేయింప్ పనికోసం వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం అబాపూర్ అడవుల్లో అడవి ఏనుగును చేసేందుకు వెళ్లారు. అక్కడ రోడ్డు మీద వెళ్తుండగా అడవి ఏనుగు కనిపించింది. ఇంకేముంది దానితో సెల్ఫీ దిగేందుకు ముగ్గురు ప్రయత్నించారు. ఇది గమనించిన ఏనుగు ఒక్కసారిగా ముగ్గురిని తరుముకుంటూ వచ్చింది. ఏనుగు దాడి నుంచి ఇద్దరు తృటిలో తప్పించుకోగా.. శ్రీకాంత్‌ను అడవి ఏనుగు దాడి చేసి చంపింది.అయితే రెండు రోజుల క్రితం చిట్టగాంగ్, గడ్చిరోలి అటవీ ప్రాంతం నుంచి అడవి ఏనుగు బయటకు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించింది. ముట్నూర్ అటవీ ప్రాంతంలోని అబాపూర్ అడవుల్లో ఏనుగు సంచరిస్తోందని గుర్తించారు. అదే సమయంలో శ్రీకాంత్అ తని ఇద్దరు స్నేహితులు పని నిమిత్తం ఆ ప్రాంతంలో ఉండటంతో. ఏనుగులను చూసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దూరం నుంచి ఏనుగుతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించగా..వెంటనే ఏనుగు అతనిపై దాడి చేసి ప్రాణాలు తీసింది. తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. -
'కుంకీ'లొచ్చేనా.. కలత తీర్చేనా?
సాక్షి, పార్వతీపురం మన్యం: కొన్నేళ్లుగా పార్వతీపురం మన్యం జిల్లాను కరి రాజులు వీడటం లేదు. ప్రస్తుతం జిల్లాలో 2 గుంపులు ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో 11 వరకు గజరాజులు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఏనుగుల కారణంగా ఇప్పటికే 12 మంది వరకు రైతులు, గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రూ.6 కోట్ల మేర పంటలకు, ఇతర ఆస్తులకు ధ్వంసం వాటిల్లినట్లు అంచనా. సరిహద్దులను దాటుకుంటూ ప్రవేశం..ఆరేళ్ల క్రితం సరిహద్దులను దాటుకుంటూ జిల్లాలోకి ప్రవేశించాయి గజరాజులు. అప్పటి నుంచి ఎక్కడికక్కడ దాడులు చేస్తూ గిరిజనుల ప్రాణాలు తీస్తున్నాయి. పంటలు ధ్వంసం చేస్తున్నాయి. మరోవైపు ప్రమాదాల బారిన పడి గజరాజులూ మృత్యువాత పడుతున్నాయి. గత జూన్‌లో గరుగుబిల్లి మండలం తోటపల్లి సరిహద్దుల్లో అనారోగ్యంతో ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. కొద్దిరోజుల క్రితం కొమరాడ మండలం వన్నాం గ్రామానికి చెందిన వాన శివున్నాయుడు(62) అనే వృద్ధుడిని ఏనుగులు తొక్కి చంపాయి. ఏళ్లుగా అటు అమాయక గిరిజనులతో పాటు.. ఇటు ఏనుగుల ప్రాణాలూ పోతున్నా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఆహార అన్వేషణలో మృత్యువాత..2018 సెప్టెంబరు 7న శ్రీకాకుళం జిల్లా నుంచి 8 ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలంలోకి ప్రవేశించింది. అదే నెల 16న అర్తాం వద్ద విద్యుదాఘాతానికి గురై ఒక ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత దుగ్గి సమీపంలోని నాగావళి ఊబిలో కూరుకుపోయి మరో ఏనుగు మృత్యువాత పడింది. అంతకు ముందు 2010 నవంబర్‌లో అప్పటి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం (ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా) మండలం కుంబిడి ఇచ్ఛాపురంలో 2 ఏనుగులు మృతి చెందాయి. గతంలో సాలూరు మండలంలో ఏనుగు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు వదిలింది. కొన్నాళ్ల క్రితం “హరి’ అనే మగ ఏనుగు గుంపు నుంచి తప్పిపోయింది. నెలలు గడిచినా దాని జాడ తెలియరాలేదు. గుంపులో కలవలేదు. గతేడాది మే లో జిల్లాలోని భామిని మండలం కాట్రగడ బీ వద్ద విద్యుదాఘాతంతో 4 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఏనుగులు గుంపు ఇక్కడికి వచ్చిన తర్వాతే మరో 4 ఏనుగు పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఆహార అన్వేషణలో భాగంగా అడవులను వదిలి, జనావాసాల మధ్యకు వస్తున్న ఏనుగులు.. విద్యుదాఘాతాలకు, రైతులు పంటల కోసం ఏర్పాటు చేసుకున్న రక్షణ కంచెలతో ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతున్నాయి. అటు ప్రాణ నష్టం..ఇటు పంట ధ్వంసంఏనుగులు దాడి చేయడంతో మనుషుల ప్రాణాలూ పోతున్నాయి. 2019 జనవరిలో కొమరాడ, జియ్యమ్మవలస మండలాలకు చెందిన నిమ్మక పకీరు, కాశన్నదొర ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో గజరాజుల ప్రవేశం నుంచి ఇప్పటి వరకు వాటి దాడిలో 11 మంది పైబడి మృతి చెందగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. వేలాది ఎకరాల పంటలను ఇవి ధ్వంసం చేశాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును ఒడిశా ప్రాంతానికి తరలించినా..తిరిగి జిల్లాకు చేరుకుని కొమరాడ, పార్వతీపురం , జియ్యమ్మవలస, భామిని, సీతంపేట, గరుగుబిల్లి తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల సంఖ్యను నిర్థారించేందుకు 3 రోజులపాటు అటవీ శాఖాధికారులు సర్వే చేపట్టారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో ఏడు, పాలకొండ డివిజన్ పరిధిలో 4 ఏనుగులు తిరుగుతున్నట్లు గుర్తించారు. జోన్‌తోనే సంరక్షణ! కరిరాజులు ఆహారం, నీరు కోసం తరచూ జనావాసాల మధ్యకు వస్తున్నాయి. దీంతో గిరిజనుల పంటలు ధ్వంసం కావడంతో పాటు, పలువురు ఏనుగుల దాడిలో ప్రాణాలూ కోల్పోతున్నారు. ఇవి జనావాసాల మధ్యకు రాకుండా సాలూరులో జంతికొండ, కురుపాం పరిధిలోని జేకేపాడులో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు 2020 డిసెంబర్లో అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. జంతికొండలో 526 హెక్టార్లు, జేకే బ్లాక్‌లో 661 హెక్టార్లలో అటవీ భూమిని గుర్తించారు. ఆ తర్వాత ఆ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. తర్వాత కూడా ఏనుగుల సంరక్షణకు పార్వతీపురం మండలం డోకిశీల, చందలింగి, కొమరాడ మండలం పెదశాఖ, పాత మార్కొండపుట్టి ప్రాంతాలను పరిశీలించారు. చివరకు సీతానగరం మండలం జోగింపేట అడవులను ఏనుగుల పునరావస కేంద్రం కోసం ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఒడిశా నుంచి జిల్లాలోకి...ఒడిశా రాష్ట్రం లఖేరి నుంచి తొలిసారిగా 1998 అక్టోబర్ 4న కురుపాం అటవీ ప్రాంతంలోకి ఏనుగులు ప్రవేశించాయి. వాటిని తరిమేసినా..1999 ఆగస్ట్‌లో కురుపాం, గుమ్మలక్ష్మీపురం కొండల్లోకి వచ్చాయి. మళ్లీ వాటిని వెనక్కి పంపారు. 2007–08 మధ్య గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, సీతంపేట, వీరఘట్టం ప్రాంతాల్లో పంటలను తీవ్రంగా నష్టపరిచాయి. ఆ సమయంలో వాటిని తరిమికొట్టేందుకు “ఆపరేషన్ గజ’ను చేపట్టారు. ఏనుగులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఒడిశా తరలిస్తుండగా రెండు మృతి చెందాయి. దీంతో ఆ ఆపరేషన్‌ను నిలిపివేశారు. అప్పట్లో ఉమ్మడి విజయనగరం– శ్రీకాకుళం జిల్లాల మధ్య ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినా గిరిజనుల వ్యతిరేకత నేపథ్యంలో నిలిచిపోయింది. కుంకీలను పంపేందుకు ఉప ముఖ్యమంత్రి హామీ చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కరిరాజుల వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కర్ణాటక నుంచి కుంకీలను తీసుకువచ్చేందుకు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా జిల్లాకూ కుంకీలను పంపుతామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఇవి వస్తే ఇక్కడున్న ఏనుగులతో సహవాసం చేసి, వాటిని తమకు అనుకూలంగా మలుచుకుంటాయి. జనారణ్యంలో తిరుగుతున్న గజరాజులను తిరిగి అరణ్యంలోకి వెళ్లేలా దిశానిర్దేశం చేస్తాయి. ఇదే సమయంలో కుంకీలను తీసుకువచ్చేందుకు జిల్లాలో అనువైన పరిస్థితులు లేవని అటవీ శాఖాధికారుల మాట. జిల్లాలో చిత్తూరు మాదిరి శిక్షణ పొందిన ఏనుగులను ఉంచేందుకు క్యాంపు లేదు. వాటి కోసం పని చేసేందుకు ప్రత్యేక సిబ్బంది లేరు. ఈ పరిస్థితుల్లో కుంకీల రాక ఉంటుందా, ఉండదా? అన్న సందేహాలు గిరిజన సంఘాల నుంచి నుంచి వ్యక్తమవుతున్నాయి. కుంకీలను రప్పించాలి.. కర్ణాటక నుంచి కుంకీలను త్వరగా జిల్లాకు రప్పించి ఇక్కడున్న ఏనుగులను అడవికిగానీ, సంరక్షణ కేంద్రానికి గానీ తరలించాలి. చాలా ఏళ్లుగా ఏనుగులు ఇక్కడే తిష్ట వేశాయి. 11 మందికిపైగా మృత్యువాత పడ్డారు. రూ.6 కోట్ల మేర పంట, ఆస్తి నష్టం సంభవించాయి. ఏనుగుల వెంట అటవీ శాఖాధికారులు తిరగడమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండటం లేదు. – కొల్లి సాంబమూర్తి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, పార్వతీపురంరైతులు, గిరిజనులు భయపడుతున్నారు..ఏనుగులు ఎప్పుడు ఏ ప్రాంతం మీద దాడి చేస్తున్నాయో అర్థం కావడం లేదు. అటవీ శాఖాధికారులు తిరగడం, ప్రభుత్వానికి నిధులు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండటం లేదు. రైతులు, గిరిజనులు పొలాలకు, ఇతర పనులకు వెళ్లడానికి భయపడుతున్నారు. కుంకీ ఏనుగులను తెప్పిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చి రెండు నెలలవుతున్నా.. ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. – హెచ్.రామారావు, గిరిజన సంఘం నాయకులు, పార్వతీపురం -
శంకర్ దయాళ్ శర్మకు ఏనుగు గిఫ్ట్.. అసలు ఆ కథేంటి?
ఢిల్లీ: ఢిల్లీ జూలో ఉన్న 29 ఏళ్ల ఆఫ్రికన్ ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం, గొలుసుల బంధీ నుంచి విడిపించడానికి కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆఫ్రికన్ ఏనుగు శంకర్ శుక్రవారం గొలుసుల నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు ఆ ఏనుగు జూలోని తన ఎన్‌క్లోజర్‌లో చురుకుగా తిరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘అక్టోబర్ 9న నేను జూని సందర్శించాను. ఆఫ్రికన్ ఏనుగు 'శంకర్'ను పరిశీలించాను. ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ, జామ్‌నగర్‌కు చెందిన ‘వంతరా’ బృందం, నిపుణులైన వెటర్నరీ వైద్యుల బృందం చేసిన కృషికి ధన్యవాదాలు. అందులో నీరజ్, యదురాజ్, దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్, ఫిలిప్పీన్స్‌కు చెందిన మైఖేల్ ఉన్నారు. శంకర్ ఆరోగ్యం, పరిశీలనకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతోంది’’ అని అన్నారు."Following my visit to the zoo on 9th October and meeting with 'Shankar', the lone African elephant, we brought together the Ministry of Environment, Team Vantara from Jamnagar and the expert veterinary doctors. I am happy to share that 'Shankar' is finally free from chains.… pic.twitter.com/AN3pVFU2hi— Kirti Vardhan Singh (@KVSinghMPGonda) October 11, 2024 ప్రస్తుతం జూలో ఉన్న మావటిలు.. శంకర్‌తో సులభంగా సంభాషించేలా శిక్షణ తీసుకుంటారని జూ అధికారులు తెలిపారు. ఏనుగు ‘శంకర్’ ప్రవర్తన , దినచర్యను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. శంకర్ పురోగతిని తనిఖీ చేయడానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన మావటి మైఖేల్‌తో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం శంకర్ గతంలో కంటే చాలా కనిపిస్తోందని జూ అధికారులు తెలిపారు.1996లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు జింబాబ్వే దౌత్య బహుమతిగా ఇచ్చిన ఈ ఏనుగు(శంకర్)ను సరిగా చూసుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (జూ) సభ్యత్వాన్ని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ (వాజా) ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. -
World Elephant Day 2024: గజరాజుల గమ్మతులు..
మనుషులకు మాలిమి అయిన జంతువుల్లో ఏనుగులు ప్రత్యేకమైనవి. రాచరికాలు వర్ధిల్లిన కాలంలో రాజ్య రక్షణ కోసం ఉపయోగపడే చతురంగ బలాల్లో గజబలం కీలకమైనది. భావోద్వేగాలను అనుభూతి చెందడంలోను, వాటిని ప్రకటించడంలోను ఏనుగుల ప్రవర్తన దాదాపుగా మనుషులను పోలి ఉంటుంది. సాటి ఏనుగుల పట్లనే కాదు, తమను మాలిమి చేసుకునే మనుషుల పట్ల కూడా ఏనుగులు భావోద్వేగాలను వ్యక్తం చేస్తాయి.ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. తమకు నేస్తాలుగా ఉన్న ఏనుగులను చూసినప్పుడు సంతోషంగా చెవులు విప్పార్చడం, తోక ఊపడం, శరీరాన్ని కదిలించడం వంటి చర్యల ద్వారా పలకరిస్తాయి. చాలాకాలం తర్వాత కనిపించినట్లయితే, పట్టరాని సంతోషంతో ఘీంకారనాదం చేస్తాయి.నేస్తాలైన ఏనుగులు ఎదురెదురుగా తారసపడినప్పుడు ఒకదానికొకటి తొండాలను పెనవేసుకుని తమ ఆత్మీయతను వ్యక్తం చేస్తాయి. వేర్వేరు దారుల్లో వెళుతున్న మగ ఏనుగులు తమ నేస్తాలను శరీరాన్ని తాకించుకుని పలకరించుకుంటాయి.ఏనుగులు ఒకదానితో మరొకటి సంభాషించుకుంటాయి. ఆకలి వేసినప్పుడు గున్న ఏనుగులు తమ చేష్టల ద్వారా తల్లులకు ఆ సంగతి చెబుతాయి. అల్లరిని వారించినప్పుడు అలుగుతాయి. గున్నటేనుగులు అలిగినప్పుడు ఎక్కడివక్కడే ఆగిపోయి, ఘీంకారంతో పిలిచే తల్లుల వెంట వెంటనే వెళ్లకుండా హఠం చేస్తాయి. తల్లి ఏనుగు మెల్లగా బుజ్జగిస్తేనే అవి మళ్లీ దారిలోకి వస్తాయి.ఈడొచ్చిన మగ ఏనుగులు తాము జతకట్టదలచుకున్న ఆడ ఏనుగులను ఆకర్షించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాయి. వాటితో సల్లాపాలడతాయి. ఏనుగులు జత కట్టిన తర్వాత కుటుంబాన్ని ఏర్పరచుకుంటాయి. కుటుంబాన్ని కాపాడుకునేందుకు గుంపుగా సంచరిస్తుంటాయి.వివిధ సందర్భాల్లో ఏనుగులు వ్యక్తం చేసే భావోద్వేగాలకు సంబంధించిన ప్రవర్తనలను తెలుసుకోవడానికి వియన్నా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రత్యేక అధ్యయనం చేపట్టారు. ఆఫ్రికా అడవుల్లో చేపట్టిన ఈ అధ్యయనంలో వారు ఏనుగుల భావోద్వేగ ప్రకటనలకు సంబంధించి 1,282 రకాల ప్రవర్తనలను గుర్తించారు.ఏనుగులు కూడా మనుషుల మాదిరిగానే ఆత్మీయులను కోల్పోయినప్పుడు దుఃఖిస్తాయి. ఏనుగులు తమ ఆత్మీయులను ఒక పట్టాన మరచిపోలేవు. మరణించిన ఏనుగు కళేబరం చుట్టూ చేరి మిగిలిన ఏనుగులు కన్నీరు కారుస్తూ రోదిస్తాయి. కళేబరాన్ని క్రూరజంతువులు పీక్కు తినకుండా కాపలాగా ఉంటాయి. చుట్టూ మట్టి ఉన్నట్లయితే, మరణించిన ఏనుగు కళేబరాన్ని మిగిలిన ఏనుగులు పూడ్చి పెడతాయని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు చెప్పుకొనే కథలు వాస్తవమేనని పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తేల్చారు. -
అనంత్ పెళ్లిలో హైలెట్‌గా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రూచ్..ఆ డిజైన్లోనే ఎందుకంటే..!
ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో వాళ్లు ధరించే దుస్తలు దగ్గర నుంచి డ్రస్‌లు, కార్లు అన్ని హైలెట్‌గా నిలిచాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే..ఆ వివాహ వేడుకలో అంబానీలంతా పైజామకు ధరించిన ఏనుగు ఆకారపు డైమండ్ పతకం అత్యంత హైలెట్‌గా నిలిచింది. ముఖేశ్‌తో సహా అనంత్, ఆకాశ్ అందరూ ఈ ఆకారపు ఆభరణాన్నే ధరించారు. దీని వెనుక దాగున్న ఆసక్తికర స్టోరీ ఏంటని అక్కడున్న వాళ్లందరూ చర్చించుకున్నారు. ఎందుకిలా వారంతా ఆ జంతువు ఆకృతిలో డిజైన్ చేసిన ఆభరణం ధరించారంటే..ఈ ఆభరణాన్ని కాంతిలాల్ ఛోటాలాల రూపొందించారు. అనంత్ అమిత జంతు ప్రేమికుడు. అతని వెంచర్ వంతారాలో వన్యప్రాణులు సంరక్షణ కోసం అనంత్ ఎంతగానో కేర్ తీసుకుంటాడు. అందుకు నిదర్శనంగా ఇలా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రోచ్‌లను సదరు ఆభరణాల వ్యాపారులు తయారు చేశారు. నీతా అంబానీ సూచన మేరకు ఇలా అంబానీ కుటుంబంలోని మగవాళ్లంతా ధరించేలా ఏనుగు ఆకారపు ఆభరణాలను రూపొందించారట. ఈ పతకం జామ్‌నగర్‌లోని వంటరా వద్ద వన్య ప్రాణుల సంరక్షణ కోసం అనంత్ చేస్తున్న కృషికి గుర్తుగా ఇలాంటి వజ్రాలతో రూపొందించిన ఏనుగు ఆకారపు బ్రోచెస్ తయారు చేసినట్లు ఆభరణ వ్యాపారులు చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఆభరణాన్ని రూపొందించడంతో నీతా కూడా తమకు సహకారం అందించినట్లు తెలిపారు. అనంత్‌కి మాత్రమే గాక ఆమె మనవడికి ఏనుగులంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇక్కడ అంబానీలు ధరించే బ్రూచ్ గంభీరమైన అరణ్యాన్ని ప్రదర్శించేలా పచ్చలు, వజ్రాలతో ఏనుగు ఆకృతిలో ఈ ఆభరణాన్ని అందంగా తీర్చిదిద్దారు. View this post on Instagram A post shared by Kantilal Chhotalal (@kantilalchhotalal)(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?) -
గజరాజులతో గస్తీ
పెద్దదోర్నాల: నల్లమల అడవుల పరిరక్షణకు ఏపీ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అమూల్యమైన వృక్షసంపద అక్రమ రవాణాను అరికట్టేందుకు.. అరుదైన వన్యప్రాణులను సంరక్షించి వేసవిలో అగ్నికీలల నుంచి అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఇప్పటికే బేస్ క్యాంప్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్, యాంటీ పోచింగ్ బృందాలను ఏర్పాటు చేసింది. దీంతోపాటు అభయారణ్యాల్లో ఇకపై గజరాజులతో గస్తీ చేపట్టాలని అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు అభయారణ్యాల పరిధిలో..మన రాష్ట్రంలోని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో 3,727.82 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్న అడవిని కేంద్ర ప్రభుత్వం 1983లో అభయారణ్యంగా ప్రకటించింది. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం శిఖరం వరకు రాజీవ్‌గాంధీ అభయారణ్యం.. మార్కాపురం, గిద్దలూరు, ఆత్మకూరు, నంద్యాల డివిజన్ల పరిధిలో గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం విస్తరించి ఉన్నాయి. వీటిలో పులులతోపాటు చిరుత, ఎలుగుబంటి, జింకలు, దుప్పులు, హైనా, నెమళ్లతోపాటు 70 రకాల క్షీరదాలు, సరీసృపాలు, ఎన్నోరకాల వృక్షాలు, ఔషధ మొక్కలు నల్లమల అభయారణ్యంలో ఉన్నాయి. ఇవన్నీ మారుమూల లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను సందర్శించి వాటిని సంరక్షించే బాధ్యత కత్తిమీద సాములా మారింది.మూలమూలల్నీ జల్లెడ పట్టేలా..మారుమూల ప్రాంతాల్లో సైతం వన్యప్రాణులు, వృక్షాలను సంరక్షించేందుకు వీలుగా అటవీ శాఖ ఉన్నతాధికారులు సుశిక్షితులైన సిబ్బంది నేతృత్వంలో ఏనుగులతో గస్తీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు తమకు శిక్షణ పొందిన 9 ఏనుగులు అవసరమవుతాయని గుర్తించారు. తమకు అవసరమైన 9 ఏనుగులను ఇవ్వాల్సిందిగా ఏపీ అటవీ శాఖ అధికారులు కర్ణాటక అటవీ శాఖకు లేఖ రాశారు.దీనిపై స్పందించిన కర్ణాటక అటవీ శాఖ అధికారులు శిక్షణ పొందిన ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు ఏనుగులను కట్టడి చేసేందుకు మావటిలను తయారు చేసేందుకు అటవీశాఖ తమ సిబ్బందిని కర్ణాటక రాష్ట్రానికి పంపనుంది. రాష్ట్రానికి చెందిన సిబ్బంది అక్కడికి వెళ్లి గజరాజుల ఆహారపు అలవాట్లు, వాటి కదలికలు, వాటి ఇతర అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణ పొందనున్నారు.6 ఏనుగులను రాజీవ్‌గాంధీ వన్యప్రాణుల అభయారణ్యానికి, మరో మూడు ఏనుగులను గుండ్లబ్రహ్మేశ్వరం అడవులకు పంపేలా చర్యలు చేపట్టన్నారు. ఏనుగుల్ని తీసుకొస్తే పెద్ద పులులు ఎక్కువగా సంచరించే లోతట్టు ప్రాంతాలైన నెక్కంటి, రేగుమానుపెంట, తూము గుండాలు, ఆలాటం తదితర ప్రాంతాల్లో సైతం ధైర్యంగా పెట్రోలింగ్ చేపట్టవచ్చని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.ఏనుగులతో గస్తీ నిర్వహించేలా చర్యలు అభయారణ్యంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. నడక మార్గంలో సిబ్బంది కొంతమేర వరకు మాత్రమే వెళ్లగలరు. అదే ఏనుగులతో అయితే సుదూర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించవచ్చు. పులులు సంచరించే ప్రదేశాల్లో సైతం భయం లేకుండా పెట్రోలింగ్ నిర్వహించవచ్చు. మనం చేసిన విజ్ఞప్తికి కర్ణాటక అటవీ శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో ఏనుగుల్ని నల్లమలకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – విశ్వేశ్వరరావు, ఫారెస్ట్ రేంజి అధికారి, పెద్దదోర్నాల -
థాయిలాండ్‌లో అద్భుతం
అయూథలా: గజరాజును అత్యంత పవిత్రంగా భావించే థాయిలాండ్‌లో ఒక అద్భుతం జరిగింది. అరుదుగా సంభవించే కవలల జననానికి వేదికైంది. కవలలకు ఏనుగు జన్మనివ్వడం అరుదైన విషయమయితే అందులోనూ 36 ఏళ్ల ఒక ఏనుగు ఒక ఆడ, ఒక మగ గున్నలకు ఒకేసారి జన్మనివ్వడం అత్యంత అరుదైన సందర్భమని వెటర్నరీ వైద్యులు ప్రకటించారు. థాయిలాండ్‌లోని అయూథలా ప్రావిన్స్‌లోని అయూథలా ఏనుగుల ప్యాలెస్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన వివరాలను అక్కడి సిబ్బంది వెల్లడించారు. 36 ఏళ్ల ఛామ్చూరీ శుక్రవారం ఒక మగ గున్నకు జన్మనిచ్చింది. ప్రసవం సాఫీగా జరిగిందనుకుని సంతోషపడి ఆ గున్నను నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా ఛామ్చూరీ మళ్లీ నొప్పులు పడటం అక్కడి మావటి, సిబ్బందిని ఆశ్చర్యంలో పడేసింది. అతి కష్టమ్మీద ఆడ గున్న బయటకురావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే మగ గున్నకు జన్మనిచ్చి బాగా నీరసించిపోయిన ఏనుగు వెంటనే మరో ఏనుగుకు జన్మనివ్వడంతో డీలాపడి కింద పడబోయింది. అప్పటికి ఆడ గున్నను కింద నుంచి తీయలేదు. ‘‘పెద్ద ఏనుగు మీద పడితే ఏమైనా ఉందా?. అందుకే వెంటనే ప్రాణాలకు తెగించి వెంటనే తల్లిఏనుగు కిందకు దూరి గున్న ఏనుగును బయటకు లాగేశా. కానీ అంతలోనే ఏనుగు పడిపోవడంతో నా కాలు విరిగింది. పసికూనను కాపాడాను అన్న ఆనందంలో నాకు కాలు విరిగిన బాధ కూడా తెలీలేదు. ఆస్పత్రికి వెళ్లాకే నొప్పి తెలిసింది’ అని 31 ఏళ్ల మావటి చరిన్ సోమ్‌వాంగ్ నవ్వుతూ చెప్పారు. ‘‘ నేనూ ఇదే ఏనుగుల ప్యాలెస్, రాయల్ ప్రాంగణంలో పుట్టి పెరిగా. కవలల జననాన్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇంతకాలానికి ఇలా కుదిరింది. ఏనుగుల్లో కవలల జననం కేవలం ఒక్క శాతం మాత్రమే. ఇక ఆడ,మగ ఒకేసారి జననం అత్యంత అరుదైన విషయం’’ అని అక్కడి వెటర్నరీ మహిళా డాక్టర్ లార్డ్థోంగ్టేర్ మీపాన్ చెప్పారు. డాక్టర్ మీపాన్కు కూడా కవల పిల్లలున్నారు. కవల గున్నల జననం వార్త తెలిశాక స్థానికులు తండోపతండాలుగా ఏనుగుల పార్క్‌కు క్యూ కట్టారు. 60 కేజీల మగ, 55 కేజీల ఆడ గున్నలతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. -
చిత్తూరు జిల్లాలో 110 ఏనుగులు!
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లాలో 90 నుంచి 110 వరకు ఏనుగులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని డీఎఫ్‌వో చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఏనుగుల గణన ప్రక్రియ శనివారంతో ముసిగింది. సర్వే వివరాలను డీఎఫ్‌వో సోమవారం మీడియాకు వెల్లడించారు. జిల్లాలోని 60కి పైగా బీట్ల నందు 150 మంది సిబ్బంది, సహాయకులు కలిసి సర్వే చేశారన్నారు. ప్రత్యక్షంగా 30కి పైగా ఏనుగులను గుర్తించారని, పరోక్షంగా 110 ఏనుగుల ఉన్నట్లు నమోదు చేశారని చెప్పారు. వీటిలో 15 వరకు చిన్న ఏనుగులు ఉన్నట్లు చెప్పారు.దక్షిణ భారతదేశంలో ప్రతి ఏటా మే నెలలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒకే సమయంలో సర్వే చేస్తారన్నారు. రాష్ట్రంలో 200 వరకు ఏనుగులు ఉంటే.. ఒక్క చిత్తూరు జిల్లాలో 100కు పైగా ఉన్నాయన్నారు. ప్రాథమిక నివేదికను కేంద్ర అటవీశాఖకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా పలమనేరు, పుంగనూరు, కుప్పం ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ షాక్, వాహనాలు ఢీకొని ప్రతి ఏటా 10 వరకు ఏనుగులు మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు. ఏనుగుల దాడిలో ఏడాదికి రూ.కోటి వరకు పంటలకు, ప్రజల ప్రాణాలకు నష్టపరిహారంగా చెల్లిస్తున్నట్లు వివరించారు. గజరాజుల దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
పెద్ద దంతాల గజేంద్రునికి మోక్షం
మైసూరు: అడవిలో ఓ గజరాజుకు దంతాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. తొండాన్ని దాటుకుని కొన్ని అడుగుల మేర ముందుకొచ్చాయి. అంత పెద్ద దంతాల గల ఏనుగును చూడడం పర్యాటకులకు, స్థానిక ప్రజలకు అద్భుతంగానే ఉన్నా ఆ ఏనుగు మాత్రం ఇబ్బందులు పడుతోంది. తొండం దంతాల మధ్య సాఫీగా కదలలేక కడుపు కాల్చుకుంటోంది. ఈ నేపథ్యంలో అటవీ అదికారులు ఏనుగు సమస్యను తీర్చారు. దాని దంతాలను కట్ చేశారు.రైతుల ఫిర్యాదుతో..వివరాలు.. చామరాజనగర జిల్లా బండీపుర అడవిలో ఒక ఏనుగుకు అడ్డదిడ్డంగా దంతాలు పెరిగాయి. దీంతో తొండం ఆ రెండు దంతాల మధ్య ఇరుక్కుపోయి అది సక్రమంగా ఆహారం తీసుకోలేకపోతోంది. పైకి తొండం పైకి ఎత్తలేక, నోరు సరిగ్గా తెరవలేక కష్టపడుతోంది. అది నిత్యం రైతుల పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ, ఆహారం తినేందుకు కష్టపడుతోందని గ్రామస్తులు అటవీ అధికారులకు తెలిపారు. దీని వల్ల అది బరువు కూడా తక్కువగానే ఉంది.మత్తు మందు ఇచ్చిఅధికారులు కొన్ని రోజులుగా ఈ సమస్యపై విశ్లేషణ చేసి అడ్డంగా పెరిగిన దంతాలను కత్తిరించాలని నిర్ణయించారు. అడవుల్లోని పెద్ద చెట్లు, కొమ్మలను తినేందుకు తొండం పైకి రాకపోవడం వల్ల అడవిని వదిలేసి పొలాల్లో పంటల మీదకు పడుతోందని తెలుసుకున్నారు. ఈ క్రమంలో భారీ క్రేన్ వాహనాన్ని రప్పించి ఏనుగును బంధించారు. దానికి మత్తు మందు ఇచ్చి యంత్రపు రంపంతో దంతాలను కొంతమేర కత్తిరించారు. కబిని బ్యాక్ వాటర్‌లో గుండ్రే అటవీ జోన్ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇప్పుడు అది మామూలు ఏనుగుల మాదిరిగా ఆహారం తీసుకోగలదని అధికారులు చెప్పారు. -
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల రెండవ కుమారుడు అనంత్ అంబానీకి జంతువుల పట్ల అమితమైన ప్రేమ ఉందని గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మరోసారి ఆయనకున్న జంతు ప్రేమను నిరూపించుకున్నారు.త్రిపురలోని కైలాషహర్ ప్రాంతంలో ఒక ఏనుగు అనారోగ్యంతో బాధపడుతోంది. దానికి సహాయం చేయాలని అనంత అంబానీని కోరారు. దీనికి సంబంధించిన వీడియో 'కుంతల సిన్హా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. దీనికి అనంత్ అంబానీ స్పందించారు.అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు సహాయం చేయడానికి అనంత్ అంబానీ.. వైద్యుల బృందాన్ని అక్కడకు పంపారు. వైద్యుల బృందం సుమారు 3500 కిమీ ప్రయాణించి అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు చికిత్స చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనంత్ అంబానీ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.Hats off to #AnantAmbani who acted promptly to save life of elephant and sent #Vantara medical team within 24 hours to Tripura.#Jamnagar #animallove pic.twitter.com/nvva96W6wm— AkashMAmbani (@AkashMAmbani) May 12, 2024 -
ఎండల ఎఫెక్ట్.. నీటి కోసం వచ్చి గుంటలో పడ్డ ఏనుగు
చెన్నై: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాల గొంతులు కూడా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎండల దెబ్బకు అడవుల్లో ఉండే సహజ నీటి వనరులన్నీ ఎండిపోయి అక్కడ నివసించే వన్యప్రాణులు దాహంతో అల్లాడిపోతున్నాయి. తమిళనాడులోని సత్యమంగళం అడవులపై కూడా ఎండల ఎఫెక్ట్ పడింది. అడవిలో దాహం తీర్చుకునేందుకు నీళ్లు లేకపోవడంతో ఓ ఆడ ఏనుగు అక్కడికి సమీపంలో ఉన్న పళనిచామి గుడి వద్దకు వచ్చింది. నీటి కోసం వెతుక్కుంటుండగా ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న గుంటలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించారు. ఏనుగు వద్దకు ఒక వెటర్నరీ డాక్టర్ నేతృత్వంలో మెడికల్ టీమ్‌ను పంపించారు. ఏనుగును గుంటలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదీ చదవండి.. దోమలు బాబోయ్ దోమలు -
హడలెత్తిస్తున్న ఏనుగు.. దాడిలో ఇద్దరి రైతుల విషాదం!
ఆదిలాబాద్: కుమురంభీం జిల్లా ప్రజలను గజరాజు హడలెత్తిస్తున్నాడు. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతులు ఏనుగు దాడిలో మృత్యువాత పడటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆచూకీ చిక్కకుండా తిరుగుతున్న ఏనుగు గ్రామీణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో దహెగాం, కొండపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరిని పెద్దపులి హతమార్చగా.. ఇప్పుడు ఏనుగు రూపంలో మృత్యువు వెంటాడుతోందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇద్దరు రైతుల మృతి.. బూరెపల్లి సమీపంలోని ప్రాణహిత నదిలో బుధవారం తెల్లవారుజామున ఏనుగును కొంతమంది గ్రామస్తులు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారాన్ని విశ్వసించని అటవీ అధికారులు ఏనుగును నియంత్రించకపోవడంతో అది నది దాటి చింతలమానెపల్లి మండలంలోకి ప్రవేశించింది. ఉదయం 11 గంటల సమయంలో బూరెపల్లి సమీపంలోని వ్యవసాయ భూముల వద్దకు వచ్చిన ఏనుగు అక్కడే మిరపతోటలో పని చేస్తున్న రైతు అల్లూరి శంకర్‌పై దాడి చేసి చంపేసింది. ఆందోళనకు గురైన గ్రామస్తులు ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు దానిని అనుసరించగా.. గంగాపూర్, ఖర్జెల్లి గ్రామాల పక్కన ఉన్న ప్రాణహి త చేవేళ్ల ప్రాజెక్టు కాలువ పక్క నుంచి రుద్రాపూర్ గ్రామం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి అధికారులు ఏనుగు కదలికలను గుర్తించలేదు. మళ్లీ గురువారం తెల్లవారుజామున పెంచికల్పేట్ మండలం కొండపెల్లి గ్రామానికి చెందిన కారు పోశన్న(60)పై దాడి చేసి చంపింది. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎల్కరి సుధాకర్‌ను వెంబడించగా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఏనుగు పలువురికి చెందిన తోటలు, పంటలు ధ్వంసం చేసింది. చింతలమానెపల్లి మండలం నుంచి బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో సంచరించింది. ఈమండలాలతో పాటు పక్కన ఉన్న కౌటాల, దహెగాం మండలాలు కలిపి రెండు రోజులుగా ఏనుగు ఐదు మండలాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని అటవీశాఖ ధ్రువీకరించడం లేదు. ఇప్పటివరకు కచ్చితమైన సమాచారం లేకపోవడంతో అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. కాగా గత మంగళవారం ఏనుగు బూరెపల్లి వద్ద ప్రాణహిత నదికి అవతలి వైపు ఉన్న చౌడంపల్లి అటవీ ప్రాంతంలో సంచరించినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. చింతలమానెపల్లి మండలానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని గడ్చిరోలి జిల్లా రేపన్‌పల్లి రేంజ్ పరిధిలోని కమలాపూర్‌లో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏనుగు అడవుల్లో సంచరించేది. దక్షిణ గడ్చిరోలి ప్రాంతంగా పిలిచే మాలెవాడ, మురుంగావ్ ప్రాంతం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అభయారణ్యం ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంతో కలిసి ఉంటుంది. కొన్నేళ్లుగా ఇక్కడి ప్రాంతంలో ఏనుగుల సంచారం ఉంది. మూడేళ్ల క్రితం మాలెవాడ అటవీ ప్రాంతానికి 25 నుంచి 30 ఏనుగుల బృందం వచ్చినట్లు అక్కడి అటవీ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలోని ఏనుగుల గుంపు నుంచే ఓ ఏనుగు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గడ్చిరోలి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనోరాలో ఈ ఏనుగుల గుంపు కొద్ది నెలలుగా తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఓ డ్రైవర్ సహా మరో ముగ్గురిపై దాడి చేసి చంపేశాయి. ఈ ఏనుగులు కర్ణాటక రాష్ట్రం నుంచి అటవీ ప్రాంతం గుండా గడ్చిరోలిలోని మాలెవాడ అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు వారు చెబుతున్నారు. అటవీశాఖపై విమర్శలు.. బూరెపల్లి వద్ద ఏనుగు సంచరిస్తున్న సమచారాన్ని అటవీశాఖకు చేరవేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సరైన సమయంలో స్పందించని కారణంగానే అల్లూరి శంకర్ ఏనుగు దాడిలో మరణించాడని ఆరోపిస్తున్నారు. ఒకరిపై దాడి చేసిన అనంతరం స్వయంగా జిల్లా అటవీ అధికారి పర్యవేక్షణలో ఉండగానే పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి వద్ద మరొకరు ఏనుగు దాడిలో మృతి చెందడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంలో అటవీశాఖ నిర్లక్ష్యం వహించిందని, గోప్యత పాటించడంతోనే ప్రమాదాలు పెరుగుతున్నాయని మండిపడుతున్నారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో కొన్ని నెలల క్రితం అటవీ అధికారుల నిర్లక్ష్యంతో రెండు పులులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధికారులను బాధ్యులు చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు పలువురిపై వేటు వేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. ఎస్పీ సురేశ్‌కుమార్, అటవీ కన్జర్వేటర్ శాంతారాం, జిల్లా అటవీ అధికారి నీరజ్ టోబ్రివాల్, డీఎస్పీ కరుణాకర్ స్వయంగా ఆయా మండలాలలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికారులు చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాలలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోడుపల్లి అడవుల్లోకి గజరాజు.. పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో గురువారం వేకువజామున రైతును చంపిన ఏనుగు మళ్లీ రాత్రి 8 గంటలకు బెజ్జూర్ నుంచి పెంచికల్పేట్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కొండపల్లి టర్నింగ్ వద్ద ఎదురొచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పీసీసీఎఫ్ శాంతారాం, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ ఏనుగు సంచారాన్ని నిర్ధారించారు. లోడుపల్లి అడవుల్లోకి వెళ్లిందని తెలిపారు. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై కొమురయ్య ఆధ్వర్యంలో పెంచికల్పేట్– సలుగుపల్లి రహదారిలో రాకపోకలను నిలిపివేశారు. నా వెంట పడింది.. ఉదయం పూట కొండప ల్లి సమీపంలో వాకింగ్‌కు వెళ్లా. ఏనుగు ఘీంకరించిన శబ్దం వినిపించింది. దూరంగా ఉన్న ఇద్దరు మిత్రులను అప్రమత్తం చేస్తూ అరవడంతో ఏనుగు నా వెంట పడడంతో పరుగెత్తి తప్పించుకున్నా. తర్వాత ఏను గు ఉన్న స్థలంలో చూడడానికి వెళ్లగా అక్కడ కారు పోశన్న మృతదేహం కనిపించింది. – ఎల్కరి సుధాకర్, పెంచికల్పేట్ -
జాతరలో గజరాజుల కొట్లాట.. పలువురికి గాయాలు
కోలాహలంగా జాతర జరుగుతుందనుకున్న టైంలో.. ఒక్కసారిగా అలజడి రేగింది. జనాలు ఉరుకులు పరుగులతో చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అందుకు కారణం.. రెండు గజరాజులు తలపడడమే!. కేరళ త్రిస్సూర్ జిల్లాలో తరక్కల్ ఆలయ ఉత్సవాల ముగింపు జాతరలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జాతర ముగింపు సమయంలో అమ్మవారిని ఉరేగిస్తున్న ఏనుగు.. ఒక్కసారిగా అలజడి సృష్టించింది. మావటి మీద మూడుసార్లు దాడికి యత్నించగా.. ఆయన స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఆ ఏనుగు అక్కడితో ఆగలేదు. అక్కడే ఉరేగింపు కోసం తీసు కొచ్చిన మరో ఏనుగుపై దాడికి దిగింది. ఈ క్రమంలో ఆ రెండు తలపడడంతో.. అక్కడ భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఆ ఏనుగుల మీద ఉన్నవాళ్లు కింద పడి గాయాలపాలయ్యారు. ఏనుగుల పోరాటంతో భయపడి.. ఉరుకులు పరుగులు పెట్టడంతో కిందపడి చాలా మందికి సైతం దెబ్బలు తగిలించుకున్నారు. అతికష్టం మీద మొదటి ఏనుగును మావటివాళ్లు నిలువరించగలిగారు. అయితే గాయపడ్డ ఏనుగు కిలోమీటర్ దూరం పరుగులు తీయగా.. అతికష్టం మీద మావటివాళ్లు దానిని పట్టుకోగలిగారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. An elephant which was brought for the arat ritual at #Mandarakadavu in connection with the #ArattupuzhaPooram in #Kerala's #Thrissur, attacked a fellow elephant. pic.twitter.com/6OXptgdjnl — Hate Detector 🔍 (@HateDetectors) March 23, 2024 -
గజరాజు ప్రతాపం : అమాంతం ఎత్తి పడేసింది! వీడియో వైరల్
సరదాగా సఫారీకి వెళ్లిన టూరిస్టులు చేదులో అనుభవం ఎదురైంది. తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఒక ఏనుగును దగ్గరినుంచి చూడాలనుకుని ముచ్చపట్టారు. అంతటితో ఆగకుండా ఫోటో తీయాలని ప్రయత్నించారు. అంతే క్షణాల్లో ఊహంచని పరిణామం ఎదురైంది. ఏనుగు సఫారీ ట్రక్కును అమాంతం దొర్లించేసింది. దక్షిణాఫ్రికాలోని పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. An elephant attacks a tourist truck in South Africa 🇿🇦 pic.twitter.com/BX8typkcUq — Africa In Focus (@AfricaInFocus_) March 19, 2024 అసలు ఏమైందంటే... ఏబీసీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో 22 సీటర్ ట్రక్కులో పర్యాటకులు సఫారీకి వెళ్లారు. ఇంతలో భారీ ఏనుగు కనిపించింది. పర్యాటకులు ఫోటోలు తీయడానికి ప్రయత్నించినపుడు ఏనుగు మరింత దగ్గరగా వచ్చింది. ఉన్నట్టుండి ట్రక్పైదాడి చేసింది. ఏనుగును ట్రక్కును అమాతం ఎత్తేసింది. ఇలా చాలా సార్లు పడేసింది. దీంతో ట్రక్ లోపల ఉన్నవాళ్లంతా భయంతో వణికి పోయారు. సీట్ల కింద దాక్కున్నారు. ఇంతలో డ్రైవర్ పో...ఫో గట్టిగా అదిలించాడు. ట్రక్‌పై కొడుతు పెద్దగా శబ్దం చేశాడు. దీంతో ఏనుగు భయపడిందో.. శాంతించిందో తెలియదు గానీ పక్కకు తొలగిపోయింది. దీంతో అందరూ బతుకు జీవుడా అనుకున్నారు. హెండ్రీ బ్లోమ్ ఈ సంఘటనను కెమెరాలో బంధించాడురు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏనుగు ట్రక్కు దగ్గరకు వచ్చిన సమయంలో పర్యాటకులు ఫోటోలు తీయాలనుకున్నందున అది దూకుడుగా ప్రవర్తించిందని పార్క్ అధికారి తెలిపారు ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదన్నారు. అయితే బాగా బెంబేలెత్తిపోయిన ఒక కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు టూర్ కంపెనీ మాంక్వే గేమ్ ట్రాకర్స్ వెల్లడించారు. మరోవైపు టూర్ గైడ్ సమయానుకూలంగా వ్యవహరించిన తీరును వన్యప్రాణి నిపుణులు ప్రశంసించారు. -
కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగు సఫారీ చేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
మరో గ్లోబల్ బ్రాండ్‌ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ
శ్రీలంక పురాతన పానీయాల బ్రాండ్‌ను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ భారత్‌కు తీసుకొస్తోంది. శ్రీలంకకు చెందిన పానీయాల తయారీ సంస్థ ఎలిఫెంట్ హౌస్‌తో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నూతన ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయనుంది. "భారతదేశం అంతటా ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ కింద పానీయాలను తయారు చేయడం, మార్కెట్ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం" ఈ భాగస్వామ్యం లక్ష్యం అని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. "ఈ భాగస్వామ్యం పెరుగుతున్న మా ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోకు అత్యంత ఇష్టపడే పానీయాలను జోడించడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా మా భారతీయ వినియోగదారులకు గొప్ప ఎంపికను కూడా అందిస్తుంది" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీవోవో కేతన్ మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రఖ్యాత గ్లోబల్ బ్రాండ్లను భారత్‌కు తీసుకొచ్చిన రిలయన్స్.. 150 ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన బేవరేజెస్ బ్రాండ్ ఎలిఫెంట్ హౌస్‌ను భారత్‌లో మరింత విస్తరించడానికి సన్నద్ధమైందని కేతన్ మోదీ తెలిపారు. కాగా రిలయన్స్ ఇప్పటికే క్యాంపా సొస్యో, రాస్కిక్ వంటి పానీయాల బ్రాండ్లను కలిగి ఉంది. -
వారికి అసలు మానవత్వం లేదా?: మహేశ్ బాబు పోస్ట్ వైరల్!
కొత్త ఏడాదిలో గుంటూరు కారంతో ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇక మహేశ్ బాబు తదుపరి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవలే బాలీవుడ్ భామ నిర్మాతగా వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పోచర్ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ వీక్షించిన మహేశ్ బాబు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఎలా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. వారికి మానవత్వం లేదా? అలాంటి పనులు చేసేటప్పుడు వారి చేతులు వణకవా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోచర్ వెబ్ సిరీస్ చూశాక తన మైండ్‌లో ఇలాంటి ప్రశ్నలే తిరుగుతున్నాయని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇలాంటి సున్నితమైన దిగ్గజాలను రక్షించమని కోరుతూ ఈ వెబ్ సిరీస్ ద్వారా పిలుపునిచ్చారని మహేశ్ బాబు పోస్ట్ చేశారు. కాగా.. ఎమ్మీ అవార్డు విన్నర్, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన మలయాళ ఫారెస్ట్ క్రైమ్ సిరీస్ పోచర్. ఏనుగు దంతాల స్మగ్లింగ్‌తో పాటు, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. కేరళ అడవుల్లో జరిగిన ఒక రియల్ స్టోరీని ఆధారంగా తీసుకోని ఈ చిత్రాన్ని రూపొందించారు. పోచర్‌లో నిమేషా సజయన్, రోషన్ మాథ్యూ కీలకపాత్రలు పోషించారు. కేరళ అడవుల్లో ఉన్న ఏనుగులను చంపి వాటి దంతాలతో కొందరు నేరస్థులు వ్యాపారం చేస్తుంటారు. అలాంటి నేరస్థుల ముఠాని పట్టుకోవడానికి కేరళ పోలీసులు, కొందరు ఎన్జీఓలో చేసిన ప్లానింగ్‌నే సిరీస్‌గా రూపొందించారు. ఈ సిరీస్‌కు అలియా భట్ నిర్మాతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
‘నాతో సెల్ఫీ మాములుగా ఉండదు’.. గజరాజు దెబ్బకు టూరిస్టుల పరుగో పరుగు
బెంగళూరు: గజరాజుతో ఫోటో దిగుదామని ఆశించిన ఇద్దరు టూరిస్టులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏనుగు వారిని వెంబడించడంతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. చివరికిఏనుగు బారి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర్‌లో ముత్తుంగ అడవిలో జరిగింది, కర్ణాటకు చెందిన కొందరు పర్యాటకులు బందీపూర్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ మీదుగా కేరళ వెళ్తున్నారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ముత్తుంగ సమీపంలో దారి మార్గంలో వారికి ఏనుగు కనిపించింది. దీంతో ఏనుగును సెల్ఫీ తీయాలనుకున్నారు. కారు దిగి బయటకు వచ్చి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా.. గమనించిన ఏనుగు వారి వైపు వేగంగా దూసుకువచ్చింది. ఇద్దరు వ్యక్తులను వెంబడించింది. ఈ ఘటనలో తీవ్ర భయాందోళనకు గురైన టూరిస్టులు.. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కిందపడిపోయాడు. అతన్ని కాలితో తన్నిన ఏనుగు.. వెనక్కి తిరిగి తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2 tourists were confronted by an elephant While traveling from #Karnataka to #Kerala through #Bandipur National Park & Tiger Reserve. #Elephant became aggressive when the tourists attempted to take a #selfie, chased them but fortunately, both managed to narrowly escape unharmed. pic.twitter.com/1uIzW7ITiY — Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) February 1, 2024 -
పార్వతిపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
-
కోర్టులోకి అడవి ఏనుగు ఎంట్రీ.. జనం హడల్!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఓ కోర్టులో అడవి ఏనుగు అలజడి సృష్టించింది. గేటును ఢీకొట్టి కోర్టు ప్రాంగణంలోకి ఏనుగు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హరిద్వార్ రోషనాబాద్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులో ఈ ఘటన జరిగింది. రాజాజీ టైగర్ రిజర్వ్ నుండి బయటికి వచ్చిన అడవి ఏనుగు.. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలోకి చొరబడింది. కోర్టు ఆవరణలో తిరుగుతూ గందరగోళం సృష్టించింది. కోర్టు గేట్లను తోసేసి గోడను కూడా ధ్వంసం చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. Watch this wild elephant's unexpected visit to a court in Haridwar and create a stir as it breaks through gates and wanders through the premises. #Uttarakhand pic.twitter.com/f9WmG8wt61 — India Rising Show (@IndiaRisingShow) December 28, 2023 Video Credits: India Rising Show ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏనుగు కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు కోర్టు ప్రధాన గేటును అమాంతం పక్కకు తోసేసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి వచ్చి ఆ ఏనుగును అడవిలోకి తరలించారు. ఇదీ చదవండి: హైదరాబాద్ నుంచే అయోధ్య రామ మందిర తలుపులు -
‘ఇక్కడ జంతువు ఎవరు? వారిని జంతు హంతుకులంటాం’
భారీ ఏనుగులను దగ్గర నుంచి చేస్తేనే.. సాధారణంగా భయమేస్తుంది! అయితే కొందరు ఓ భారీ ఏనుగును ఆటపట్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వీడియో వివరాల్లోకి వెళ్లితే.. ఓ భారీ గుంత పైభాగంలో ఉన్న ఏనుగును, కొందరు వ్యక్తులు గుంత పైకి ఎక్కి ఆటపట్టిస్తూ రెచ్చగొట్టారు. అందులో ఓ వ్యక్తి కాలి చెప్పుతో దాన్ని బెదింరించడానికి ప్రయత్నం చేశాడు. ఈ చర్యతో ఏనుగు కూడా అతనిపై దాడి చేయాడానికి ప్రయత్నించింది. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తి.. మరిసారి దానికి దగ్గర పోయి బెదిరించాడు. అయితే అతని చర్యలకు బెదిరిపోయిన ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. Identify the real animal here. Then these giants charge & we call them killers. Dont ever do this, it’s life threatening. Video is from Assam. pic.twitter.com/e1yltV4RQP — Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 7, 2023 ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడయోను ఎక్స్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఇక్కడ నిజమైన జంతువు ఎవరో గుర్తించండి. ఇటువంటి వారిని మేము జంతుహంతకులు అని పిలుస్తాం. జంతువులను ఎప్పుడు ఆటపట్టించకూడదు. ఇటువంటి చర్యలకు పాల్పడటం ప్రాణాంతకం కూడా’ అని ఆయన కాప్షన్ జత చేశారు. ఈ ఏనుగు వీడియో అస్సాంకు చెందినట్లు పర్వీన్ పేర్కొన్నారు. ఆ వ్యక్తి చేసిన పనికి నెటినట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘అసలు వారు ఏనుగును ఎందుకు ఆటపట్టిస్తున్నారు’, ‘ అతను చేసిన పని సరైంది కాదు’, ‘వారి జీవితాలను తీవ్ర ప్రమాదంలో పడవేసుకుంటున్నారు’, ‘వాడేమైనా బాహుబలినా చెప్పు చూపితే ఏనుగు భయపడటానికి.. దాడి చేస్తే తెలుస్తుంది ఎంటో?’ అని నెటిజనట్లు కామెంట్లు చేస్తున్నారు. -
'మాలి' ఇక లేదు!
పిలిప్పీన్స్ జూలో ఉన్న మాలి అనే వృద్ధ ఏనుగు చనిపోయింది. ఈ ఏనుగు ప్రంచంలోనే అత్యంత విషాదకరమైన ఏనుగుగా పేరుగాంచింది. ఐతే ఏనుగులు వృద్ధవి అయ్యి ఏదో ఒక రోజు చనిపోతాయి. ఇది సర్వసాధారణం. మరీ ఈ ఏనుగు మరణం, ఎందుకు? వార్తల్లో నిలిచింది. పైగా జంతు ప్రేమికులు, ప్రముఖులు దాని మరణానికి ఇంతలా స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి. ఏంటీ ఆ ఏనుగు ప్రత్యేకత అంటే... నాలుగా దశాబ్దాలు మనీలా జూలో ఆకర్షణగా నిలిచిన మాలి అనే వృద్ధ ఏనుగు మంగళవారమే మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయినట్లు జూ అధికారలు తెలిపారు. ఈ ఏనుగు ఫిలిప్పీన్స్ జూ అధికారులు ఒక కాంక్రీట్ ఎన్‌క్లోజర్‌లో బందించారు. దీన్ని చూసిని పలువురు జంతు హక్కులు కార్యకర్తలు చలించిపోయి అభయారణ్యంలో వదిలేయాలని పలు విజ్ఞప్తులు, ఆందోళనలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ మాలి అనే ఏనుగు పేరు వార్తల్లో నిలిచింది. దీని గురించి క్యాథలిక్ బిషప్‌లు, గ్లోబల్ పాప్ స్టార్, నోబెల్ గ్రహిత కోయెట్జీ వంటి ప్రముఖులు దాని విడుదల కోసం మద్దతు తెలుపుతూ ఆందోళనలు చేశారు. అంతేగాదు ఆ ఏనుగును థాయ్‌లాండ్ అభయారణ్యానికి తరలించాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి పలు సంతాకాలతో కూడిన లేఖలను కూడా రాశారు. అయితే మాలీని మనీలా జూలోనే ఉంచాలనే నిర్ణయాన్ని పట్టుబట్టింది ఫిలిప్పీన్స్ ప్రభుత్వం. దీన్ని సమర్థించారు మనీలా నగర మేయర్ హనీ లాకున కూడా. అదీగాక ఆ ఏనుగు చాలా కాలం బందీగా ఉన్న కారణంగా బయట జీవించడం అసాధ్యం అని పేర్కొంది జూ. దీంతో సుదీర్ఘకాలం ఏకాంతంగా బంధీగా ఉన్న ఏనుగుగా పేరుగాంచింది. అందువల్ల జంతుప్రేమికులు ఈ ఏనుగుకు ప్రంచంలోనే అత్యం విషాదకరమైన ఏనుగుగా పిలిచారు. ఎలా ఈ జూకి వచ్చిందంటే.. శ్రీలంక ప్రభుత్వం అప్పటి ఫిలిప్పీన్స్ ప్రథమ మహిళ ఇమెల్డా మార్కోస్‌కు 11 ఏళ్ల వయసులో ఉన్న ఈ చిన్న ఏనుగును బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ ఏనుగుని జూకి తరలించడానికి ముందు మలాకానాంగ్ ప్యాలెస్‌లో ఉంది. ఆ తర్వాత మనీలా జూలో మాలిని 'షిబా' అనే మరో ఆడ ఏనుగుతో ఒక ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. మాలి దూకుడుగా ప్రవర్తించడంతో షిబా అనే ఏనుగు మరణించింది. దీంతో జూ అధికారులు దీన్ని నిర్బంధించారు. ఇలా ఏకాంత నిర్బంధంలోనే దశాబ్దాలుగా మగ్గిపోయింది. దీంతో పలువురు ప్రముఖులు, జంతు ప్రేమికులు దీని విడుదల కోసం ఎంతగానో యత్నించి విఫలమయ్యారు. కనీసం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించమని కోరారు. అందుకు కూడా జూ అధికారులు ఒప్పుకోలేదు. అది ఇక్కడ ఇతర జంతువుల తోపాటు తమ కుటుంబంలో బాగమని స్పష్టం చేసింది జూ యాజమాన్యం. చనిపోవడానికి కారణం.. ఈ మాలి ఏనుగు బాగోగులు చూసుకోకపోవడం వల్లే చనిపోయిందంటూ విమర్శలు వెల్లువలా వచ్చాయి. అదెంత మాత్రం నిజం కాదని కొట్టి పారేశాడు జూ పశువైద్యుడు హెన్రిచ్ డొమింగో. ఆ ఏనుగు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లు వెల్లడించారు. జంతు ప్రేమికులు, సామజిక కార్యకర్తలు దాన్ని నిర్బంధించి భౌతికంగా ఎప్పుడో చంపేశారంటూ ఆరోపణలు చేశారు. కాగా, అంతేగాదు చనిపోయిన మాలి స్థానాన్ని భర్తీ చేసేలా శ్రీలంక అధికారులను మరో ఏనుగును ఇవ్వమని కోరింది. ఇక ఈ మాలి అస్థిపంజరాన్ని దాని గుర్తుగా జ్యూమ్యూజియంలో పెడతామని నగర మేయర్ లాకునా చెప్పారు. (చదవండి: ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది) -
తిరుపతి: ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతి ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతిచెందింది. చిత్తూరు జిల్లా మాదమరి మండలంలో పంటపొలాల విధ్వంసంలో ఏనుగుకు గాయాలవ్వగా అటవీశాఖ సిబ్బంది జూపార్క్‌కు తరలించారు. అటవీ ప్రాంతంలో పరుగులు పెట్టిన ఏనుగుకి గాయాలు కావడంతో జూపార్క్‌లో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఎస్వీ జూపార్కులో మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఏనుగు కళేబరానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మరోవైపు సదుం మండలం గంటా వారి పల్లి పంట పొలాలలో విద్యుత్ షాక్ తగిలి మరో ఏనుగు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. -
ఈ పాలు మాత్రం అస్సలు తాగకండి, చాలా డేంజర్
పాలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే. సాధారణంగా మనలో చాలామంది ఆవు లేదా గేదె పాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఓ జంతువు పాలు తాగితే మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రమాదరమట. ఇలాంటి పాలను అస్సలు తాగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాలల్లో కాల్షియం ఉంటుందని తెలుసు కానీ.. ఈ జంతువు పాలల్లో మాత్రం ఆల్కహాల్ ఉంటుందని మీకు తెలుసా? అవును. అడవిలో గజరాజుగా మనందరికి తెలిసిన ఏనుగు పాల గురించి ఈ చర్చంతా. ఏనుగు పాలల్లో బీర్, విస్కీ లేదా వైన్ కంటే ఎక్కువ శాతం ఆల్కహాల్ శాతం ఉంటుందట. అంతేకాకుండా ఏనుగు పాలు తాగడం వల్ల మత్తు రావడమే కాకుండా వెంటనే మూర్ఛపోతారట. అంత డేంజర్ మరి. ముఖ్యంగా ఆడ ఏనుగు పాలల్లో శాతం ఆల్కహాల్ లెవల్స్ ఉంటాయి.నిజానికి, ఏనుగు చెరకు తినడానికి ఇష్టపడుతుంది. చెరకులో పెద్ద మొత్తంలో ఆల్కహాల్-ఫార్మింగ్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయం తెలిసిందే.ఇదే ఏనుగు పాలలో ఆల్కహాల్ శాతం పెరగడానికి కారణమవుతుంది. ఏనుగు పాలు చాలా ప్రమాదకరం. వీటిలో ఉండే రసాయనాలు మనుషులకు హానీ చేస్తాయట. ఈ పాలల్లో బీటా కేసైన్ ఉంటుంది. దీని కారణంగా పాలలో అధిక స్థాయిలో లాక్టోస్ ఉంటుంది. ఆఫ్రికన్ ఆడ ఏనుగులలో అధిక స్థాయిలో లాక్టోస్, ఒలిగోశాచురైడ్లు ఉంటాయి. అందుకే మానవులు రెండు సిప్స్ తాగిన తర్వాత మూర్ఛపోతారని వైద్యులు హెచ్చరిస్తారు. ఈ పాలలోని కార్బోహైడ్రేట్ అధిక పరిమాణంలో ఉంటాయి. వీటి కారణంగా వీటిని తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. -
ఏనుగు పదవీ విరమణ...ఘనంగా వీడ్కోలు
-
లైవ్‌లో ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం చేస్తూ..ఓ యూట్యూబర్..
ఇటీవల యూట్యూబ్‌లో రకరకాల వైరైటీ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ తోపాటు పేరు తెచ్చుకుంటున్న యూట్యూబర్లకు కొదువే లేదు. కాకపోతే కొందరూ ఈ పిచ్చిలో కాస్త తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి లైవ్ వీడియోలు చేస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఆన్లైన్ క్రేజీ ఆరాటం ఎంత ఉన్నా కాస్త వ్యక్తిగతం ఏది ఎంత వరకు బెటర్ అన్నది బేరీజు చూసుకుని చేస్తేనే మంచిది. ఇక్కడొక యూట్యూబర్ కూడా అలానే ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అంటూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోయి అతడే మతితప్పి పడిపోయే సంకట పరిస్థితి ఎదురైంది. కొన్ని లైవ్ వీడియోలు సీరియస్‌గా మారి వారి ప్రాణాలనే ఉక్కిబిక్కరి చేసేంత భయానకంగా ఉన్నాయి. దయచేసి ఇలాంటివి చేయాలనుకునే ఔత్సాహిక యూట్యూబర్లు ముందుగా ట్రయల్స్ వేసిగానీ రిస్క్ వీడియోలు చేసే సాహసం చెయొద్దు. ఇంతకీ ఆ యూట్యూబర్ చేసిన ప్రయోగం ఏంటంటే ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం. జంబో రేంజ్లో టూత్ పేస్ట్‌లాంటి నురుగు పదార్థాన్ని తయారు చేయడం. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయకపోతే ఆ రసాయనాలు రియాక్షన్ ఇచ్చి వికటిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ యూట్యూబర్ కూడా అలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. లైవ్‌లో ఆ వింత ప్రయోగాన్ని చేస్తుండగా నురగలు కక్కుతూ పేస్ట్ వస్తూ ఓ విధమైన పొగ ఆ ప్రదేశం అంతా క్షణాల్లో ఆవిరించింది. సరిగ్గా సమయానికి అగ్నిమాక సిబ్బంది రంగంలోకి దిగి ఆ యూట్యూబర్‌ని కెమరామెన్ని వెంటనే ఆ గది నుంచి బయటకు తీసుకొచ్చి రక్షించే యత్నం చేశారు కాబట్టి సరిపోయింది. ప్రస్తుతం ఇద్దరికి కుత్రిమంగా ఆక్సిజన్ని అందిస్తున్నారు వైద్యులు. ఇంతకీ ఆ ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం ఏంటంటే.. ఇదొక శాస్త్రీయమైన ప్రక్రియ. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్, డ్రై ఈస్ట్, డిష్ సోప్ కలవగానే ఒక విధమైన నురుగు పదార్థాన్ని సృష్టిస్తారు. చూస్తే ఎక్కువ మొత్తంలో ఊహించని రేంజ్లో ఆ నురుగు వస్తుంది కాబట్టి దీన్ని ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అని పిలుస్తున్నారు. ఈ మూడు పదార్థాలు కలిసినపుడు రసాయనాలు ప్రతిస్పందించి ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి. అది మనం తట్టుకోలేనంతగా ఒక్కొసారి రావచ్చు దీంతో మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితికి దారితీస్తుంది. అంతేగాదు రాత్రి టైంలో మొక్కలు అధిక ఆక్సిజన్ విడుదల చేస్తాయనే కదా మన పెద్దవాళ్లు చెట్ల కింద పడుకోవద్దనేది. మోతాదుకి మించిన ఆక్సిజన్ని మనిషిని ఉక్కిరిబిక్కిరిచేసి ప్రాణాలను హరించేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడూ తస్మాత్ జాగ్రత్త..! (చదవండి: అపార్ట్మెంట్ విండోలో భారీ కొండచిలువ..చూస్తే హడలిపోతారు!) -
చిక్కిన మదపుటేనుగు..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా గుడిపాలలో భయోత్పాతం సృష్టించిన ఒంటరి మదపుటేనుగు ఎట్టకేలకు అధికారులకు చిక్కింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి వచ్చిన ఏనుగుల గుంపులో ఓ ఏనుగు తప్పిపోయి.. బుధవారం చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో వెంకటేశులు, సెల్వి అనే భార్యభర్తలను తొక్కి చంపిన ఏనుగు, కార్తిక్ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచింది. బుధవారం రాత్రి గుడిపాలలో అటవీప్రాంతాల్లోకి వెళ్లిపోయిన ఏనుగు తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున తమిళనాడు రాష్ట్రం పెరియ బోడినత్తం గ్రామంలోకి వెళ్లిపోయి అక్కడ వసంత (54) అనే మహిళను తొండంతో ఎత్తి కిందకేసి కాలితో తొక్కి చంపేసింది. ఒంటరి ఏనుగు బీభత్సంలో ఓ మేక కూడా చనిపోయింది. అక్కడి నుంచి మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చేరుకుంది. ఒంటరి ఏనుగు 197–రామాపురం గ్రామంలోకి రావడంతో మళ్లీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగు జాడ గుర్తించిన అటవీశాఖ అధికారులు అప్పటికే కుమ్కీ ఏనుగులతో సిద్ధంగా ఉంటూ మదపుటేనుగును వెంబడించి డప్పులు కొడుతూ, టపాకాయలు పేల్చుతూ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తిరుపతి జూ పార్కు నుంచి వచ్చిన వైద్యుల సాయంతో మదపుటేనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో అది కిందపడిపోయింది. తాళ్ల సాయంతో ఏనుగును బంధించి తిరుపతి జూ పార్కుకు తరలించారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో చిత్తూరు అటవీశాఖ అధికారి చైతన్యకుమార్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. మరోవైపు ఏనుగు దాడిలో మృతిచెందిన దంపతులకు అంత్యక్రియలు నిర్వహించగా, ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. -
చిత్తూరు: ఏనుగు బీభత్సం.. భార్యభర్తల మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: గుడిపాల మండలం ‘190 రామాపురం’లో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడి చేయడంతో ఇద్దరు మృతిచెందారు. మృతులను రామాపురం హరిజనవాడకు చెందిన దంపతులు వెంకటేష్, సెల్వీగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యభర్తలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పంలో సమీపంలో కూడా అడవి ఏనుగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: హైదరాబాద్‌లో ‘కంత్రీ’ బాబా.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి.. -
కరిరాజుకు కరెంట్ కాటు
కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీని నుంచి మేతకోసం అడవిని దాటి పంట పొలాల్లోకి వచ్చే ఏనుగులకు కరెంట్ పెద్ద శత్రువులా మారింది. ఇప్పటి వరకు కరెంట్ షాక్‌లతో 14 ఏనుగులు మృతిచెందగా.. తాజాగా బైరెడ్డిపల్లె మండలం నల్లగుట్లపల్లె వద్ద మరో ఆడ ఏనుగు కరెంటుకు బలైంది. వంటిపై దురద తీర్చుకోవడానికి కరెంటు స్థంభాలను రుద్దడం, తొండంతో విరగ్గొడుతుండడంతో తీగలు పైన పడుతున్నాయి. మరికొన్ని చోట్ల రైతుల పొలాల వద్ద తక్కువ ఎత్తులోని 12కేవీ కరెంటు వైర్లు తగిలి మృతిచెందుతున్నాయి. చిత్తూరు: కౌండిన్య అభయారణ్యంలో కరెంటుకు ఏనుగులు బలి అవుతున్నాయి. ఇప్పటి పలు ఘటనల్లో 20 ఏనుగులు మృతిచెందగా, ఇందులో 15 ఏనుగులు కరెంట్ తీగలు తగిలి చనిపోవడం బాధాకరం. అభయారణ్యంలో మొత్తం వందకుపైగా ఏనుగులున్నాయి. ఇవి గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ముసలిమొడుగు, జగమర్ల, మొగిలిఘాట్, నెల్లిపట్ల, వెంగంవారిపల్లి, తోటకనుమ ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్నాయి. మదపుటేనుగులు ఒంటరిగానే సంచరిస్తున్నాయి. కౌండిన్య అభయారణ్యం నుంచి ఏనుగులు బయటికి రాకుండా అటవీశాఖ నిర్మించిన ఎలిఫెంట్ ట్రెంచీలు, సోలార్‌ఫెన్సింగ్ పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. తెలివైన జంతువుగా పేరున్న గజరాజులు ట్రెంచీలను పూడ్చి, బండలను వాటిల్లోకి దొర్లించి, సోలార్ ఫెన్సింగ్‌ను విరగ్గొట్టి అడవి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఏనుగుల సమస్యకు శాశ్వతచర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో కౌండిన్యాలో ఏనుగుల జాడ కనుమరుగైయ్యే అకాకాశం ఉంది. బలమైన ఫెన్సింగ్ నిర్మాణంతోనే కట్టడి కౌండిన్యా అడవిలో 66 కిలోమీటర్ల మేర సోలార్ ఫెన్సింగ్‌ను గతంలో నిర్మించారు. ఇందులో కొన్ని చోట్ల సోలార్ ఫెన్సింగ్‌కు అమర్చిన డీసీ బ్యాటరీలు పనిచేయక విద్యుత్ ప్రసరించడం లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్‌లో మరీ తేలిగ్గా ఉన్న పైపులున్నచోట వీటిని ఏనుగులు తొక్కి నాశనం చేస్తున్నాయి. సోలార్ ఫెన్సింగ్తోబాటు కౌండిన్య అటవీప్రాంతంలో 12 చోట్ల 74 కిలోమీటర్లమేర ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచెస్ పనులను గతంలో చేపట్టారు. అయితే ట్రెంచికి మధ్యలో రాతి బండల కారణంగా అక్కడక్కడ గ్యాప్‌లున్నాయి. ట్రెంచి వెడల్పు మూడు మీటర్లుగానే ఉంది. ఏనుగులు కొన్ని చోట్ల గుంతలు ఉన్న గుట్టల గుండా, లేదా గుంతల్లోకి మట్టిని నింపి వెలుపలికి వస్తున్నాయి. కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఏనుగులు అడవిలోంచి బయటకు రాకుండా పాత రైలు పట్టాలకు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసినట్టు ఇక్కడా చేపట్టాలి. స్థానిక అడవిలో కొంతమేర ఇప్పటికే నిర్మించిన కర్ణాటక టైప్ వేలాడే ఫెన్సింగ్నైనా పూర్తిస్థాయిలో చేపట్టాలి. అడవికి ఆనుకుని ఉన్న బఫర్‌జోన్‌లో ముళ్లుకలిగిన కలిమిచెట్లు, గారచెట్లు, నిమ్మచెట్టు లాంటివి పెంచితే ముళ్లకు బయపడి ఏనుగులు రాకుండా ఉంటాయని రైతులు సూచిస్తున్నారు. అయితే కౌండిన్య అభయారణ్యం మూడు రాష్ట్రాల పరిధిల్లో ఉండడంతో మూడు రాష్ట్రాలు కలసి ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటు చేస్తేనే సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. సీఎం దృష్టికి తీసుకెళ్లా.. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఏనుగుల సమస్య ఉంది. గతంలో నిర్మించిన సోలార్ ఫెన్సింగ్ నాఽశిరకంగా ఉండడంతోనే ఏనుగులు సులభంగా అడవిలోంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇందుకోసం పటిష్టమైన సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. సీఎం ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. – వెంకటేగౌడ, ఎమ్మెల్యే, పలమనేరు కొత్త ఫెన్సింగ్‌కు ప్రతిపాదనలు పంపాం పాత, కొత్త సోలార్ ఫెన్సింగ్‌ల మధ్య నున్న గ్యాప్‌లతో పాటు పాత సోలార్ దెబ్బతిన్న చోట్ల మరమత్తులకు ఇప్పటికే రూ.28 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి నిధులందితే ఫెన్సింగ్ పనులు ప్రారంభిస్తాం. అడవిలోంచి బయటకొచ్చిన ఏనుగులు ఇలా కరెంట్షాక్లకు గురై మృతి చెందుతుండడం మా శాఖకు చాలా బాధగా ఉంది. – శివన్న, ఎఫ్ఆర్వో, పలమనేరు -
అవరోధాన్ని ఏనుగులా దాటండి.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్..
ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ తన ఫాలోవర్స్‌ను ఆలోచింపజేస్తూనే ఉంటారు. స్పూర్తిదాయకమైన పోస్టులతో తన అనుచరులను ఆలోచింపజేస్తుంటారు. వ్యాపారలావాదేవీలతో బీజీగా గడుపుతున్నప్పటికీ ఏదో ఒక విధంగా మంచి పోస్టులతో నెటిజన్లను మేల్కొలుపుతారు. తాజాగా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏనుగును చూసి ప్రతికూలతలను అధిగమించడం ఎలాగో నేర్చుకోండి అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ ఏనుగు కంచెను దాటుతుంది. ఫెన్సింగ్‌ను దాటడానికి అది అనుసరించిన విధానం అందరికీ ఆదర్శం అంటూ ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఆ ఏనుగు ఫెన్సింగ్ చాల చాకచక్యంగా దాటుతుంది. కంచెను కూలదోయడానికి అది అనసరించిన విధానం ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తుంది. ఫెన్సింగ్ బలంగా ఎక్కడుందో చూస్తుంది. బలహీనంగా ఎక్కడ ఉందో కూడా చెక్ చేసుకుంటుంది. అనంతరం ఫెన్సింగ్ వీక్‌గా ఉన్న ప్రదేశంలో కాలుతో కూలదోసి దర్జాగా వెళ్లిపోతుంది. A masterclass from a pachyderm on how to overcome obstacles: 1) Carefully test how strong the challenge really is & where it might have least resistance. 2) Slowly apply pressure at the point of greatest leverage of your own strength. 3) Walk confidently through… 😊 pic.twitter.com/SmYm8iRWKH — anand mahindra (@anandmahindra) August 4, 2023 ఈ వీడియోను పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ప్రతికూలతను దాటడానికి ముందు అది ఏ స్థాయిలో బలాన్ని కలిగి ఉందో ఏనుగులాగే చెక్ చేసుకోవాలి. అనంతరం బలాన్ని, బలహీనతల్ని గుర్తించాలి. సరైన బలంతో తక్కువ ప్రతికూలత ఉన్న ప్రదేశం నుంచి పనిచేయడం ప్రారంభించాలి. అనంతరం ధైర్యంగా నడుచుకుంటూ వెళ్లాలి అని రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెట్టారు. కేవలం నాలుగు గంటల్లోనే లక్షా ఇరవై నాలుగు వేల మంది వ్యూస్ వచ్చాయి. only legends like anand mahindra derive lessons from all walks of life 🙂 do you agree? (as always thank you sir for taking the time to share 🙏) — Swaroop D (@swaroopspaces) August 4, 2023 ఇదీ చదవండి: Viral Video: ఇదేం విచిత్రం! ఆవు, పాము రెండు అలా.. -
బస్సు వైపు దూసుకొచ్చిన ఏనుగు..అంతా చివరి రోజు అనుకున్నారు.. కానీ
మనం చేసే ప్రయాణాల్లో ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపాన వస్తాయో గ్రహించడం కష్టమే. అయితే కొందరు ఈ ప్రమాదాల బారిన పడగా.. మరికొందరు మాత్రం తృటిలో వీటి నుంచి తప్పించుకుని హమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకుంటారు. ఇటీవల ఓ ప్రయాణీకులతో నిండుగా ఉన్న బస్సు వైపు ఏనుగు కోపంగా దూసుకువస్తుంది అయితే చివరికి ప్యాసింజర్లకు హానికలిగించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మనం జంతువులను హాని కలిగించకపోతే అవి కూడా మనకు ఎటువంటి హాని కలిగించవు. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మాటను రుజువు చేసిందో ఘటన. ఓ వీడియోలో బస్ నిండుగా ప్రయాణికులతో రోడ్డుపై వెళ్తుంటుంది. అడవి ప్రాంతంలోకి వెళ్లగానే అకస్మాత్తుగా రోడ్డు పై ఓ ఏనుగు కనిపిస్తుంది. డ్రైవర్ కంగారు పడక... బస్సును రోడ్డు పక్కకు ఆపుతాడు. అంతలో ఆ ఏనుగు కోపంగా బస్సు వైపు దూసుకువచ్చింది. దీంతో బస్సులోని ప్రయాణికులంతా ఇదే చివరి రోజని అనుకుంటున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ ఏనుగు బస్సుకు లేదా ప్రయాణీకులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఏనుగు తమ పక్క నుంచి వెళుతుండగా బస్ డ్రైవర్‌తో పాటు ప్రయాణీకులు మౌనంగా ఉంటూ దాన్ని ప్రశాంతంగా వెళ్లనిచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. భయపడకండి.. ఆ ఏనుగు బస్‌లో ప్రయాణీకులను చెక్ చేయడానికి వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. When the tusker decided to check out passengers in the bus, everyone led by the bus driver displayed nerves of steel, a great sense of calm and understanding and everything went off well. Video - in Karnataka. Shared by a friend. #coexistence #peopleforelephants pic.twitter.com/OJG4uPRvoi — Supriya Sahu IAS (@supriyasahuias) July 24, 2023 చదవండి : UP Anju Facebook Love Story: ఇదో వింత ప్రేమ.. ఇద్దరు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి. -
పాపం.. ఏనుగులకు తప్పని పరీక్షలు
మైసూరు: ఈసారి మైసూరు దసరా మహోత్సవాలకు 14 ఏనుగులను సిద్ధం చేయాలని తీర్మానించినట్లు తెలిసింది. ఇదే క్రమంలో ఆడ ఏనుగులకు గర్భనిర్ధారణ పరీక్షలు చేయాలని తీర్మానించింది. గత ఏడాది దసరా ఉత్సవాల్లో రామాపుర క్యాంపులో లక్ష్మి అనే ఏనుగు మగ ఏనుగుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. గర్భిణి ఏనుగును దసరా మహోత్సవం కోసం చేసే ప్రాక్టీస్‌కు తీసుకురావడంపై గతంలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో గర్భధారణ పరీక్షలు చేయాలని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏనుగుల శిబిరంలో గర్భనిర్ధారణ పరీక్షల అనంతరం వాటిని దసరా మహోత్సవాల కోసం తీసుకెళ్లనున్నారు. -
పెళ్ళిలో ఏనుగులు హల్ చల్.. బైక్ మీద పారిపోయిన కొత్త జంట..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ జార్ గ్రామ్ గ్రామంలో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడైనా విందు భోజనం వాసన వస్తే చాలు ఇట్టే పసిగట్టి క్షణాల్లో వాలిపోయి మొత్తం ఆహారాన్ని లాగించేస్తున్నాయి. తాజాగా జార్ గ్రామ్ లో ఓ పెళ్ళిలో ఏనుగులు ఇలాగే హల్ చల్ చేయడంతో అతిథులంతా చెల్లాచెదురు కాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం బైక్ పైన ఉడాయించారు. ఇటీవలి కాలంలో జార్ గ్రామ్ గ్రామ సరిహద్దుల్లో ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఊళ్ళో ఎక్కడ భోజనం వాసన వచ్చినా వెంటనే వెళ్లి ఆవురావురుమంటూ లాగించేస్తున్నాయి. అందుకే స్థానికంగా ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా, ఫంక్షన్లు చేయాలన్నా వణికిపోతున్నారు. ఆదివారం జార్ గ్రామ్ సమీపంలోని జోవాల్ భంగా గ్రామంలో తన్మోయ్ సింఘా, మంపి సింఘా వివాహం జరుగుతుండగా వివాహ కార్యక్రమం అప్పుడే పూర్తై అతిధులు భోజనాలకు సిద్ధమవుతున్నారు. అంతలో రొయ్యలు, ఉలవచారు, బంగాళాదుంపల కుర్మాలతో కూడిన మెనూ వాసనలు వెదజల్లుతూ ఏనుగులను స్పృశించాయి. ఇంకేముంది ఆహ్వానం లేకుండానే పెళ్ళికి వచ్చి అతిధుల కంటే ముందే విందునారగించేందుకు తయారయ్యాయి. కళ్యాణ మండపంలో అవి చేసిన రాద్ధాంతానికి అతిథులంతా భయభ్రాంతులకు గురై చెల్లాచెదురుగా పారిపోయి చుట్టుపక్కల ఇళ్లలో నక్కారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం ఎలాగోలా బైక్ ఒకటి సంపాదించి దానిపైన పారిపోయారు. చాలా రోజులుగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు ఏనుగులకు భయపడి ఏ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఇక్కడి అభ్యర్థులు ఏనుగుల గుంపులు భయపడి ఆర్భాటాలు చేయకుండా బిక్కుబిక్కుమంటూ ప్రచారాన్ని నిర్వహించారు. ఇది కూడా చదవండి: తండ్రి మీద కోపంతో పిల్లలను కారుతో గుద్దించి.. -
రివర్స్ గేర్‌లో 2 కి.మీ.లు
మైసూరు: అటవీ ప్రాంతంలో ప్రసవం కోసం గర్భిణిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా అడవి ఏనుగు అడ్డువచ్చి దాడికి యతి్నంచింది. అంబులెన్స్ డ్రైవర్ చాకచక్యంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెనక్కు తీసుకెళ్లి గర్భిణిని కాపాడాడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోటెలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. జీఎం హళ్ళి గ్రామానికి చెందిన లంబాడి మహిళ సుచిత్ర నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అంబులెన్స్ వచ్చి హెచ్డికోటె ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో ఒక అడవి ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడింది. సుమారు 15 నిమిషాల పాటు గజరాజు కదలకుండా అలాగే ఉంది. డ్రైవర్ శరత్ అంబులెన్స్‌ను ముందుకు పోనివ్వగా ఏనుగు అంబులెన్స్ మీదకు దూసుకొచ్చింది. దీంతో డ్రైవర్ రివర్స్ గేర్ వేసి సుమారు 2 కిలోమీటర్ల దూరం వెనక్కు ప్రయాణించాడు. ఏనుగు కొంతదూరం వెంబడించి నిలిచిపోయింది. అంబులెన్స్‌లో ఉన్న ఆశా కార్యకర్త సావిత్రిబాయి గర్భిణికి కాన్పు చేసింది. తరువాత మరో మార్గంలో తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. -
బాహుబలి సీన్ రిపీట్.. ఏనుగును ఆపడానికి..
ఒక జంతు సందర్శనశాలలో ఏనుగులను చూడటానికి వచ్చిన పర్యాటకులకు షాకింగ్ సంఘటన ఎదురైంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భారీ గజరాజు ఒక్కసారిగా తమవైపు దూసుకొచ్చింది. అంతలో మావటివాడు సైగ చేయడంతో ఆగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. ఫారెస్ట్ సఫారీలో భాగంగా ఏనుగులను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు ఏనుగులను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్న మావటి వాడిని చూసి ఏనుగు ఘీంకరించి తనవైపు దాడి చేయడానికి వేగంగా పరుగు తీసింది. మొదట పరధ్యానంగా ఉన్న మావటి వాడు తర్వాత స్పందించి అలా చేతిని పైకెత్తాడు. అంతే మదమెక్కిన ఆ ఏనుగు సైతం అలా ఉన్నచోటనే నిలిచిపోయింది. అతనింకా చేయ దించక ముందే ఆ ఏనుగు వెనక్కి అడుగులు వేసుకుంటూ తోక ముడిచింది. ఈ సన్నివేశం ఇపుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అచ్చం బాహుబలిలో ప్రభాస్ మదపుటేనుగుని నియంత్రించిన సీన్ చూసినట్టే ఉందని కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు. Safari guide stopping a charging elephant with his hand. pic.twitter.com/U6f85rWYZD — Figen (@TheFigen_) June 29, 2023 ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి.. -
ప్రపంచ చరిత్రలో అత్యంత క్రూరమైన శిక్ష.. ఏనుగును క్రేన్‌కు బిగించి..
ప్రపంచంలోని పలు దేశాల్లో క్రూరమైన రాజుల పాలన సాగిందనే విషయం మనం చరిత్రలో చూసివుంటాం. వారు విధించే శిక్షలు వెన్నులో వణుకుపుట్టించేవని కూడా వినివుంటాం. అయితే అంతకన్నా అత్యంత క్రూరమైన యజమాని గురించి, అతను విధించిన హేయమైన శిక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏనుగును క్రేన్‌కు బిగించి, అందరి ముందు దానికి శిక్ష విధించాడంటే.. అతను ఎంత క్రూరమైనవాడో ఇట్టే గ్రహించవచ్చు. ఏనుగు ఏం తప్పు చేసిందని.. అత్యంత సాధు జంతువుగా పేరొందిన ఏనుగుకు శిక్ష విధించాడంటే అతని నిర్దయ ఏపాటితో ఇట్టే అర్థమవుతుంది. అది 1816, సెప్టెంబరు 13.. అమెరికాలో అత్యంత హేయంగా ఒక ఏనుగును క్రేన్‌కు వేలాడదీసి మరణశిక్ష విధించారు. ఆ ఏనుగు పేరు మేరీ. అది తన మావటివాడిని కాలితో తొక్కి చంపేసిందని దానికి ఇంత దారుణమైన శిక్ష విధించాడు. చరిత్ర అందించిన సమాచారం ప్రకారం ఆ ఏనుగు ఆకలితో అల్లాడిపోతూ అదుపుతప్పింది. దానిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన మావటివాడు దాని చెవిపై గట్టిగా కొట్టాడు. అంతే.. ఆ ఏనుగు కోపంతో.. ఒక్కసారిగా తన పాదంతో ఆ మావటివాడిని తొక్కి చంపేసింది. ఆ ఏనుగు ఒక సర్కస్‌లో పనిచేస్తుండేది. మావటివాడిని తొక్కి చంపేయడంతో ఆ ఏనుగుపై స్థానికులకు ఆగ్రహం కలిగింది. క్రేన్‌కు వేలాడదీసి.. జనాగ్రహాన్ని చూసిన సర్కస్ యజమాని అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఏనుగుకు మరణశిక్ష విధించాలనుకున్నాడు. దానిని చంపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాడు. ఇందుకోసం 100 టన్నుల బరువు ఎత్తగల ఒక ప్రత్యేకమైన క్రేన్ తెప్పించాడు. ఏనుగు మెడను తాడుతో కట్టేందుకు ఒక ప్రత్యేకమైన తాడును కూడా తెప్పించాడు. క్రేన్ సాయంతో ఏనుగు మెడకు ఉరితాడు బిగించి, దానికి బహిరంగంగా జనసమూహం మధ్యలో మరణశిక్ష విధించాడు. ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి.. -
గాయంతో బాహుబలి.. బరువు తగ్గిన అరిసి కొంబన్
సాక్షి, చైన్నె: నోటి వద్ద తీవ్రగాయంతో బాహుబలి ఏనుగు, బరువు తగ్గి కనిపిస్తున్న అరిసి కొంబన్ ఏనుగు ఆరోగ్యంపై అటవీశాఖ అధికారులు దృష్టి పెట్టారు. వైద్య పరిశోధనలు, చికిత్సలకు సిద్ధమయ్యారు. ముందుగా బాహుబలిని పట్టుకుని వైద్య చికిత్సలు అందించేందుకు రెండు కుంకీ ఏనుగులను శనివారం రంగంలోకి దించారు. బాహుబలి ఏనుగు కోయంబత్తూరు జిల్లాలోని అటవీ గ్రామాల ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పలుమార్లు దట్టమైన అడవుల్లోకి పంపించినా మళ్లీ గ్రామాల్లోకి వస్తోంది. ప్రస్తుతం మళ్లీ అటవీ గ్రామాల్లోకి వచ్చిన బాహుబలి ఏనుగుకు నోటి వద్ద తీవ్ర గాయం అయినట్టు అధికారులు గుర్తించారు. దానికి చికిత్స అందించేందుకు అటవీ అధికారులు, వైద్యులు సిద్ధమయ్యారు. శుక్రవారం రాత్రి నుంచి ఈ ఏనుగు కదలికలపై నిఘా పెట్టారు. మేట్టుపాళయం పరిసరాల్లో బాహుబలి ఉన్నట్టు గుర్తించారు. దీనిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ముదుమలై శరణాలయం నుంచి వశీం, విజయ్ అనే రెండు ఏనుగులను రంగంలోకి దించారు. ఈ ఏనుగుల ద్వారా బాహుబలిని మచ్చిక చేసుకుని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నోటి వద్ద గాయానికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. బరువు తగ్గిన అరిసి కొంబన్ తేని జిల్లాలోని అటవీ గ్రామాల ప్రజలను బెంబేలెత్తించిన అరిసి కొంబన్ ఏనుగును ఇటీవల పట్టుకున్న విషయం తెలిసిందే. దీన్ని కన్యాకుమారి జిల్లా కొచ్చియారు పరిధిలోకి తీసుకెళ్లి వదలి పెట్టారు. ఈ పరిసరాలలోనే అరిసి కొంబన్ తిరుగుతోంది. రేడియో కాలర్ అమర్చి దీని కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కొచ్చియారు తీరంలో తిరుగుతున్న ఈ ఏనుగు మరీ బరువు తగ్గి కనిపించడంతో ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. దీంతో దీని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. హఠాత్తుగా ఏనుగు బరువు తగ్గడం అనుమానాలకు దారి తీస్తోంది. గత ఏడాది కాలంగా ఈ ఏనుగు గ్రామాల్లోకి చొరబడి ఇష్టానుసారంగా తనకు చిక్కిన ఆహారాన్ని తింటోంది. ప్రస్తుతం అడవుల్లో లభించే ఆహారం మాత్రమే తీసుకుంటున్న దృష్ట్యా బరువు తగ్గి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
ఓ తల్లి కడుపుకోత.. దిక్కులు పిక్కటిల్లిపోయేలా ఆర్తనాదాలు
బతుకు పోరాటంలో ఒకరి కష్టం.. మరొకరికి నేత్రానందం కలిగించడం అంటే ఇదేనేమో!. ఓ తల్లి ఏనుగు ఆర్తనాదాలు చేస్తూ.. నీటి పాయలో దాని బిడ్డను అటూ ఇటూ కదిలిస్తూ లేపే ప్రయత్నం చేస్తున్న వీడియో ఒకటి నెటిజన్ల గుండెల్ని బద్ధలు చేస్తోంది. అది శాశ్వత నిద్రలోకి జారుకుందని తల్లడిల్లుతుంటే.. ఆ వీడియో మాత్రం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. జీవం లేని గున్న ఏనుగును రెండు కిలోమీటర్లు తీసుకెళ్లి మరీ నీటిలో వేసి లేపే ప్రయత్నం చేసిందట ఆ తల్లి ఏనుగు. ఎక్కడ.. ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు, ఆ గున్నేనుగు ఎలా మరణించిందో కారణం తెలియదుగానీ.. వన్యప్రాణులపై వీడియోలు పోస్ట్ చేసే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా (Susanta Nanda) ద్రవీభవించిన హృదయంతో ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. లే బిడ్డా.. లే అంటూ ఆ ఏనుగు ఘీంకారంతో చేసిన దిక్కులు పిక్కటిల్లిపోయేలా చేసిన ఆర్తనాదాలకు ఫలితం లేకుండా పోయింది. This broke my heart. The calf has died but mother doesn’t give up. Carries the dead baby for two KMs and tries to revive it by placing in water. And the mother’s cries ranting the air😭😭 Via @NANDANPRATIM pic.twitter.com/ufgPsYsRgE — Susanta Nanda (@susantananda3) June 15, 2023 -
ఏనుగు పిల్లని బలి ఇస్తారా?
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మక చిత్రం `పోయే ఏనుగు పోయే`. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై యూట్యూబ్‌లో మంచి వ్యూస్ రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 9న గ్రాండ్‌గా విడుదలవుతోంది. (ఇదీ చదవండి: చెప్పులు లేకుండా ఫ్యాన్స్‌ను ఎందుకు కలుస్తానంటే: అమితాబ్) ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ... 'బాహుబలి ప్రభాకర్ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. కొంత మంది నిధిని దక్కించుకోవడానికి ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ప్రతి సీన్ అడ్వెంచరస్‌గా ఆహ్లాదకరంగా ఉంటుంది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా సినిమాను తీర్చి దిద్దాము. ఈ నెల 9న విడుదలవుతోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అన్నారు. (ఇదీ చదవండి: శ్రీవారి ఆలయం ముందు హీరోయిన్‌కు ముద్దు పెట్టిన ఆదిపురుష్ డైరెక్టర్) -
రూ.7.19 కోట్ల విలువైన ఏనుగు దంతాలు పట్టివేత
సాక్షి, చెన్నై: చెన్నైలో ఏనుగు దంతాలను అక్రమంగా విక్రయించే ప్రయత్నం చేసిన వారిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)– చెన్నై అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.7.19 కోట్ల విలువైన 4.03 కేజీల బరువు కలిగిన రెండు దంతాలను సీజ్ చేశారు. వన్య ప్రాణుల రక్షణ చట్టం వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 2023 కింద తొలి కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... డీఆర్ఐ– చెన్నై అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు సెంట్రల్, టీ నగర్ పరిసరాల్లో ప్రత్యేక నిఘా బృందాలు కాపు కాశాయి. ఏనుగు దంతాలను టీ నగర్లో ఓ చోట విక్రయించే ప్రయత్నం చేసిన ఏడుగురిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలను స్వా«దీనం చేసుకున్నారు. ఓ వాహనం కూడా సీజ్ చేశారు. 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన వన్యప్రాణుల రక్షణ చట్టం తాజా సవరణ మేరకు.. నిషేధ వస్తువులను సీజ్ చేసే అధికారం కస్టమ్స్ అధికారులకు సైతం కలి్పంచారు. దీంతో ఈ చట్టం కింద చెన్నై డీఆర్ఐ అధికారులు తొలి కేసును నమోదు చేశారు. పట్టుబడ్డ ఏడుగురిని, ఏనుగు దంతాలు, వాహనాన్ని తమిళనాడు చీఫ్ వైల్డ్ లైఫ్ అధికారులకు అప్పగించారు. (చదవండి: ప్రమాదం జరిగి 4 రోజులు .. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు..) -
గల్లీలో ఐరావతం హల్ చల్
-
ముచ్చెమటలు పట్టిస్తున్న ‘అరి కొంబన్’
సాక్షి, చైన్నె: తమిళ అటవీ అధికారులను అరి కొంబన్ ఏనుగు ముప్పుతిప్పలు పెడుతోంది. దీనిని పట్టుకునేందుకు అధికారులు ఉరకులు.. పరుగులు తీస్తున్నారు. అయితే దీనికి మత్తు మందు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల ఈ ఏనుగును పట్టుకునే సమయంలో కేరళ అధికారులు అనేక డోస్‌లుగా మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో మరోసారి ఇచ్చేందుకు సంశయిస్తున్నారు. వివరాలు.. కేరళను వణికించిన అరి కొంబన్ఏనుగు ఆదివారం తమిళనాడు సరిహద్దులోని తేని జిల్లా కంబం పట్టణంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ ఏనుగు వీరంగం సృష్టిస్తుండడంతో దీనిని అడవిలోకి తరిమేందుకు వందలాదిగా అటవీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. కంబం పట్టణం ఈ ఏనుగు పుణ్యమా నిర్మానుష్యంగా మారింది. ఉదయాన్నే ఈ ఏనుగు కంబం నుంచి వీడి పొరుగున ఉన్న సురులి పట్టి గ్రామంలోకి ప్రవేశించింది. దీంతో గ్రామస్తులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఈ ఏనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి నిర్ణయించినా, చివరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇది వరకు ఈ ఏనుగును కేరళ అధికారులు పట్టుకునే క్రమంలో పలు డోస్‌లుగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు తేలింది. ప్రస్తుతం మళ్లీ ఇంజెక్షన్ ఇచ్చిన పక్షంలో ఏనుగు ఆరోగ్యానికి ఏదేని ముప్పు తప్పదేమో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మంత్రి సమీక్ష.. ఈ ఏనుగును అడవిలోకి తరిమి కొట్టడం లేదా, ఎలాగైనా పట్టుకునే విధంగా కుంకీలను రంగంలోకి దించారు. కోయంబత్తూరు జిల్లా ముదుమలై శరణాలయం నుంచి స్వయంబు అనే ఏనుగుతో పాటుగా మరో రెండు కుంకీలను రంగంలోకి దించారు. ఈ మూడు కుంకీలు సురులి పట్టి పరిసరాలల్లో తిష్ట వేశారు. అరి కొంబన్ను మచ్చి చేసుకునే విధంగా కుంకీలు ప్రయత్నాల్లో ఉన్నాయి. అరి కొంబన్ రూపంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించడంతో పాటుగా దానిని పట్టుకునేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక ఆపరేషన్‌పై అటవీ శాఖ మంత్రి మది వేందన్ దృష్టి పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం అటవీ, పోలీసు అధికారులు, కలెక్టర్లు, వైద్యులతో ఆయన సమావేశమయ్యారు. అరి కొంబన్ను ఎలాగైనా పట్టుకుని తీరాలని నిర్ణయించారు. అలాగే, ఈ ఏనుగు కారణంగా ప్రాణ హాని జరగకుండా ముందు జాగ్రత్త చర్యలను గ్రామంలో విస్తృతం చేశారు. -
ఆడపిల్ల పుట్టిందని ఏనుగును తెప్పించి... ఆ తండ్రి చేసిన పనికి ఊరంతా షాకయ్యారు!
ముంబై: గతంలో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించి తల్లి గర్భంలో ఉన్నప్పుడో లేదా పురిటిలోనే చంపిన ఘటనలు బోలెడు చూశాం. కాలం మారుతోంది.. ఇటీవల తమ ఇంట ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించి కుటుంబాలు వేడుకలు చేసుకుంటున్నాయి. తాజాగా తమ వంశంలో చాలా సంవత్సరాల తర్వాత ఆడపిల్ల పట్టిందని సంబరాలు చేసుకోవడంతో పాటు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఘనంగా స్వాగతం పలికింది ఓ కుటుంబం. దీన్ని చూసిన ఊరు ప్రజలంతా షాకయ్యారు. ఈ అరుదైన ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్‌గావ్‌లో చోటుచేసుకుంది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా... ఏనుగును పిలిపించి వివరాల్లోకి వెళితే.. పాచ్గావ్కు చెందిన గిరీష్‌పాటిల్, సుధ దంపతులకు ఐదు నెలల కిందట కుమార్తె పుట్టింది. ఆ చిన్నారికి ఆప్యాయంగా ‘ఐరా’ అని పేరు పెట్టారు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన తన భార్యను శనివారం తొలిసారిగా తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే గిరీష్ వంశంలో దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ ఆడపిల్ల పుట్టింది. ఈ ఆనందాన్ని ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఉండాలని ప్లాన్ చేశాడు. అందుకోసం తన భార్య, పాపను గుజరాత్‌లోని హత్తివరోన్ నుంచి పచ్‌గావ్‌కు తీసుకొచ్చి.. ఘనస్వాగతం పలికాడు. ఊరిపొలిమేర నుంచి డప్పువాయిద్యాలు ఏర్పాటు చేసి పట్టణ శివారు నుంచి ఏనుగుపై తన కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. చాలా ఏళ్ల తరవాత తమ ఇంట ఆడపిల్ల పట్టడంతో పాటిల్ కుటుంబసభ్యులు సంబరాలు జరుపుకున్నారు. గిరీశ్ పుణెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న గిరీశ్.. బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేశారు. కాగా గతేడాది కూడా మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఫ్యామిలీ సైతం ఏకంగా హెలికాప్టర్‌ను బుక్ చేసి ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. చదవండి: Viral Video: తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు.. -
గజరాజుల యుద్ధం మీరే చుడండి..!
-
Animatronic Elephant: స్కూల్‌కు ఏనుగొచ్చింది
ఏనుగు స్కూల్‌కి వస్తే? పిల్లలు దానిని భయం లేకుండా తాకి, నిమిరి ఆనందిస్తే? ఆ ఏనుగు కళ్లార్పుతూ, చెవులు కదిలిస్తూ మాట్లాడుతూ తన గురించి చెప్పుకుంటే? ‘ఎలీ’ అనే యానిమెట్రానిక్ ఏనుగు ఇకపై దేశంలోని స్కూళ్లకు తిరుగుతూ పిల్లలకు ఏనుగుల జీవనంలో ఏది ఇష్టమో, ఏది కష్టమో చెప్పనుంది. ‘పెటా’ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ‘ఎలీ’కి గొంతు ఇచ్చిన నటి దియా మిర్జా ఏనుగులపై జరుగుతున్న దాష్టీకాలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి నడుం కట్టింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమం పిల్లలు, తల్లిదండ్రులు, జంతు ప్రేమికులు తప్పక ఆహ్వానించదగ్గది. సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ ‘ఏనుగు డాక్టర్’ అనే కథ రాశారు. మదుమలై అడవుల్లో ఏనుగుల డాక్టర్‌గా పని చేసిన ఒక వ్యక్తి అనుభవాలే ఆ కథ. అందులో ఆ డాక్టర్ అడవుల్లో పిక్నిక్ల పేరుతో తిరుగుతూ బీరు తాగి ఖాళీ సీసాలను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విసిరేసే వాళ్ల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దానికి కారణం బీరు సీసా మీద ఏనుగు కాలు పెట్టగానే అది పగులుతుంది. ఏనుగు పాదంలో దిగబడి పోతుంది. ఇక ఏనుగుకు నడవడం కష్టమైపోతుంది. అది తిరగలేదు. కూచోలేదు. లేవలేదు. ఒక చెట్టును ఆసరా చేసుకుని నిలబడి పోతుంది. అలాగే వారం పదిరోజులు నిలబడి తిండి లేక కృశించి మరణిస్తుంది. ఇది ఎవరు జనానికి చెప్పాలి? ఎవరు ప్రచారం చేయాలి? ఎవరో ఒకరు లేదా అందరూ ఏదో ఒక మేరకు పూనుకోవాలి కదా. ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్’ (పెటా) నిన్న (శుక్రవారం) ఏనుగులతో జనం మైత్రి కోసం ముఖ్యంగా పిల్లల్లో అవగాహన కోసం ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టింది. అచ్చు నిజం ఏనుగులా కనిపించే యానిమెట్రానిక్ ఏనుగును తయారు చేయించి దాని ద్వారానే పిల్లల్లో చైతన్యం కలిగించనుంది. ఆ ఏనుగుకు ‘ఎలీ’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’లో అంబాసిడర్‌గా ఉన్న దియా మిర్జా తోడు నిలిచింది. ఆమె ఏనుగుకు తన కంఠం ఇచ్చింది. నేను... ఎలీని... నిజం ఏనుగులా అనిపించే ఎలీ ఇకపై ఊరూరా తిరుగుతూ స్కూల్‌కి వస్తుంది. అందులో రికార్డెడ్‌గా ఉన్న దియా మిర్జా కంఠంతో మాట్లాడుతుంది. ఇది యానిమెట్రానిక్ బొమ్మ కనుక కళ్లు కదల్చడం, చెవులు కదల్చడం లాంటి చిన్న చిన్న కదలికలతో నిజం ఏనుగునే భావన కలిగిస్తుంది. అది తన చుట్టూ మూగిన పిల్లలతో ఇలా చెబుతుంది. ‘నేను ఎలీని. నా వయసు 12 సంవత్సరాలు. నేను ఇంతకు ముందు ఒక సర్కస్‌లో పని చేసే దాన్ని. జనం నన్ను సర్కస్‌లో చూసి ఆనందించేవారు. కాని అలా ఉండటం నాకు ఆనందం కాదు. అడవిలో తిరిగే నన్ను కొందరు బంధించి సర్కస్‌కు అప్పజెప్పారు. సర్కస్ ఫీట్లు చేయడానికి నన్ను బాగా కొట్టేవారు. నన్ను గట్టి నేల మీద ఎప్పుడూ నిలబెట్టేవారు. అలా నిలబడితే నాకు కష్టంగా ఉంటుంది. అసలు జనం మధ్య తిరగడం, గోల వినడం ఇవన్నీ నాకు భయం. సర్కస్ లేనప్పుడు నన్ను గొలుసులతో కట్టేస్తారు. ఏనుగుల గుంపు నుంచి ఏనుగును విడదీస్తే అది ఎంతో బాధ పడుతుంది. కాని ఇప్పుడు నేను విముక్తమయ్యాను. నన్ను ఒక సంస్థ విడిపించి బాగా చూసుకుంటోంది. నేను హాయిగా ఉన్నాను’ అని తన కథను ముగిస్తుంది. కొనసాగుతున్న హింస ‘ఏనుగులు ప్రకృతిలో ఉండాలి. జనావాసాల్లో కాదు. ఒక తల్లిగా పిల్లలకు కొన్ని విషయాలు తెలియాలని కోరుకుంటాను. పెటాతో కలిసి బాలబాలికల్లో చైతన్యం కోసం పని చేయడం మూగజీవులకు, పిల్లలకు బంధం వేయడంగా భావిస్తాను’ అని దియా మిర్జా అంది. ఏనుగులను ఇవాళ్టికీ ఉత్సవాల్లో, పర్యాటక కేంద్రాల్లో, బరువుల మోతకు, వినోదానికి ఉపయోగిస్తున్నారు. మనుషుల ఆధీనంలో ఉన్న ఏనుగుకు ఎప్పుడూ కడుపు నిండా తిండి, నీరు దొరకవు. వాటిని గొలుసులతో బంధించి ఉంచడం వల్ల ఒక్కోసారి అవి అసహనానికి గురై మనుషుల మీద దాడి చేస్తాయి. ఎలిఫెంట్ సఫారీల వల్ల ఏనుగు వెన్ను సమస్యలతో బాధ పడుతుంది. ఇవన్నీ మన తోటి పర్యావరణ జీవులతో ఎలా మెలగాలో తెలియకపోవడం వల్ల జరుగుతున్న పనులేనని ‘పెటా’ వంటి సంస్థల ప్రతినిధులు, జంతు ప్రేమికులు తెలియచేస్తున్నారు. ‘ఎలీ’ వంటి ఏనుగులు ప్రతి ఊరు వచ్చి పిల్లలతో, పెద్దలతో సంభాషిస్తే లేదా ఇలాంటి సంభాషణను ప్రతి స్కూల్లో వీడియోల ద్వారా అయినా ప్రదర్శిస్తే మార్పు తథ్యం. -
నిదుర ఉండదు.. కుదురుగుండదు.. విడతల వారీగా రోజుకు రెండు గంటలే!
ఇప్పటివరకు ఆఫ్రికన్ బుష్ ఏనుగులు మాత్రమే అతి తక్కువ సమయం నిద్రించే జంతువులుగా గుర్తించబడ్డాయి. తాజాగా.. ఆ జాబితాలో సముద్ర జీవి ‘ఎలిఫెంట్ సీల్’ కూడా చేరిపోయింది. ఆఫ్రికన్ ఏనుగుల మాదిరిగానే ఎలిఫెంట్ సీల్స్ కూడా రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. – సాక్షి, అమరావతి ఏడాదిలో కనీసం ఏడు నెలల పాటు పసిఫిక్ సముద్ర జలాల్లో ప్రయాణించే భారీ క్షీరదాలైన ఎలిఫెంట్ సీల్స్ రోజంతా వేటలోనే నిమగ్నమై ఉంటాయట. గొరిల్లాలు రోజుకు 12 గంటలు, కుక్కలు 10 గంటలు, సింహాలు 20 గంటల వరకు నిద్రిస్తుంటే.. సీల్స్ నిద్ర సమయంలో చాలా వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఆడ సీల్స్ తలపై సెన్సార్లు అమర్చి.. ఎలిఫెంట్ సీల్స్ మెదడు, హృదయ స్పందన, కదలికలు, ప్రయాణించే లోతు, నిద్రించే సంకేతాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సెన్సార్లతో కూడిన వాటర్‌ఫ్రూఫ్ సింథటిక్ రబ్బరు టోపీలను ఉత్తర ప్రాంతంలోని ఆడ సీల్స్ తలలపై అమర్చి.. వాటి జీవన స్థితిని శాస్త్రవేత్తలు క్రోడీకరించారు. ఎందుకంటే ఆడ సీల్స్ మాత్రమే ఎక్కువ కాలం సముద్రంలో ప్రయాణిస్తాయి. మగ సీల్స్ ఒడ్డునే ఉంటూ ఆహారాన్ని తింటాయి. ఇవి 4,500 పౌండ్ల వరకు పెద్ద శరీర బరువును కలిగి ఉండటం.. సముద్రంలో ఎక్కువ కాలం మేత వెతకాల్సిన కారణంగా ఈ నిద్ర ప్రవర్తన అభివృద్ధి చేసుకున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మగ ఎలిఫెంట్ సీల్స్కు ఏనుగు మాదిరిగా చిన్న తొండం ఉంటుంది. అందుకే.. వీటిని ఎలిఫెంట్ సీల్స్‌గా పిలుస్తారు. అది కూడా విడతల వారీగానే.. ఇన్ట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ జర్నల్ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఎలిఫెంట్ సీల్స్ సముద్ర ఉపరితలం నుంచి సుమారు 377 మీటర్ల లోతు (1,237 అడుగులు)కు వెళ్లి నిద్రిస్తున్నట్టు కనుగొన్నారు. ఇవి ఏకబిగిన కాకుండా 20 నిమిషాల కంటే తక్కువ సేపు ‘క్యాట్నాప్’ (స్వల్పకాలిక) శ్రేణిలో మొత్తంగా 2 గంటలపాటు నిద్రిస్తున్నట్టు అంచనా వేశారు. ఎలిఫెంట్ సీల్స్ పెద్ద మొత్తంలో చేపల్ని వేటాడి తింటాయి. అయితే, ఇవి శత్రు జీవులైన సొర చేపలు, కిల్లర్ వేల్స్ దాడిలో మరణిస్తుంటాయి. ఇవి ఇతర మాంసాహార జీవుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు లోతైన జలాల్లోకి వెళ్లి కొద్ది నిమిషాలపాటు (ర్యాపిడ్ ఐ మూవ్మెంట్) నిద్ర అనుభవిస్తున్నట్టు నిర్ధారించారు. ఎక్కువసేపు నీటిలోనే.. వాస్తవానికి 10 నుంచి 30 నిమిషాల డైవ్‌లో కొద్దిసేపు మాత్రమే సముద్ర ఉపరితలంలో ఏనుగు సీల్స్ కనిపిస్తాయి. మిగిలిన సమయమంతా జలాల్లోనే ఈదుతూ ఆహార వేటను కొనసాగిస్తాయి. విచిత్రంగా ఈ క్షీరదాలు సంతానోత్పత్తి సమయంలో తీరంలో రోజుకు 10 గంటల సమయం నిద్రపోతాయి. ప్రతి 30 నిమిషాల పాటు సాగే డైవ్‌లో సీల్స్ తలకిందులుగా స్లో–వేవ్ స్లీప్ అని పిలిచే లోతైన నిద్ర దశలోకి వెళ్తున్నాయి. వివిధ జంతువులు నిద్ర సమయం ఇలా.. (రోజుకు గంటల్లో సుమారుగా) గుర్రం 2.9 గాడిద 3.1 ఏనుగు 3.9 జిరాఫీ 4.5 మేక 5.3 కుందేలు 11.4 చింపాంజీ 9.7 కుక్క 10.0 పులి 15.8 ఎలుక, పిల్లి 12.5 ఉడుత 14.9 చిరుత 18.0 సింహం 20 -
శివాలయంలోకి ఏనుగులు.. నిజంగా గుడిలోని గంట కొట్టాయా?
భామిని: మండలంలోని పక్కుడుభద్ర సమీపంలో జీర్ణోద్ధరణ జరుగుతున్న స్వయం భూ దేవాలయంలోకి గురువారం ఆరు ఏనుగుల గుంపు ప్రవేశించి ప్రత్యేకత చాటుకుంది. ఏనుగులు ప్రతి రోజూ ఆలయంలోకి ప్రవేశిస్తున్నాయని స్థానికులు చెబుతుంటారు. అయితే వాస్తవంగా స్వయం భూ దేవాలయంలోకి ఏనుగులు ప్రవేశించి గంట కొట్టాయని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. బత్తిలికి చెందిన శాసనపురి కుటుంబసభ్యులతో జీర్ణోద్ధరణ జరుగుతున్న ఆలయంలోకి ఏనుగులు ప్రవేశించడంపై విశేష ప్రచారం కొనసాగుతోంది. ఇంతవరకు పంట నష్టాలపై చెప్పుకునే రైతులు, ఇప్పుడు ఏనుగుల ఆలయ ప్రవేశంపై ప్రచారం చేస్తున్నారు. -
గజరాజులను చూసి తోకముడిచిన పులి: వీడియో వైరల్
సాధారణం పులి ఠీవిగా నడుచుకుంటూ వెళ్లిపోతుందే తప్ప సాధారణంగా తలవంచదు. దాని దారికి అడ్డంగా వస్తే హడలెత్తించి మరీ పరిగెట్టిస్తుంది. అలాంటిది పులి గజరాజులకు దారివ్వడమే గాక దూరంగా నక్కి ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో పులి అడవిలో అలు ఇటు తిరుగుతుంటుంది. ఇంతలో ఓ ఏనుగుల గుంపు అటుగా వచ్చాయి. దీంతో పులి దూరంగా వాటికి కనబడకుండా కిందకి కూర్చొంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఏనుగులు వెళ్లిపోతుంటాయి. ఇంతలో పులి నెమ్మదిగా లేచి ఆ ఏనుగుల వెళ్తున్న దారివైపు వరకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి తన దారిని వెళ్లేందుకు యత్నిస్తుంది. సరిగ్గా ఇంకో ఏనుగు దానికి ఎదురు పడుతుంది. అంతే ఒక్కసారిగా పులిరాజు భయంతో తత్తరపడి దానికి దారి ఇచ్చి మరీ వేగంగా వెళ్లిపోతుంది. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద 'అడవికి రాజు ఏనుగులకు దారి ఇచ్చింది' అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. బహుశా ఆ జంతువులు ఈ విధంగా తమ సామరస్యాన్ని చాటుకుంటాయి కాబోలు అని అన్నారు. వాస్తవానికి ఈ వీడియోని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ విజేత సింహ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదీగాక పులులు ఏనుగులను వేటాడే సందర్భాలు చాలా అరుదు. This is how animals communicate & maintain harmony… Elephant trumpets on smelling the tiger. The king gives way to the titan herd😌😌 Courtesy: Vijetha Simha pic.twitter.com/PvOcKLbIud — Susanta Nanda (@susantananda3) April 30, 2023 (చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..) -
పదేళ్లుగా అధికారులను అరిగోస పెట్టిన అరికొంబన్.. చివరకు
ఇడుక్కి(కేరళ): రేషన్ దుకాణాల్లోకీ, ఇళ్లలోకీ చొరబడి బియ్యాన్ని బొక్కేస్తున్న ఏనుగు అరికొంబన్(25)ను ఎట్టకేలకు కేరళ అటవీ అధికారులు పట్టుకుని, మరో చోటుకు తీసుకెళ్లి వదిలేశారు. అరికొంబన్ ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని, దానికి బిగించిన రేడియో కాలర్ ద్వారా టైగర్ రిజర్వులో ఎక్కడ ఉన్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు. అరికొంబన్ మళ్లీ జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం లేవన్నారు. ఇడుక్కి జిల్లా చిన్నకనల్, సంతన్‌పర కొండ ప్రాంతాల్లోని నివాసాల్లో దాదాపు దశాబ్ద కాలంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందీ గజరాజు. బియ్యం మాత్రమే స్వాహా చేస్తున్న ఈ గజరాజుకు అరి కొంబన్(మలయాళంలో అరి అంటే బియ్యం, కొంబన్ అంటే ఏనుగు)గా పేరు వచ్చింది. అరికొంబన్‌ను ఏం చేయాలన్న అంశం పలు వివాదాలకు దారితీసింది. అరికొంబన్‌ను పట్టుకుని, శిక్షణ ఏనుగు(కుమ్కి)గా మార్చేందుకు చేసిన ప్రయత్నాలను కేరళ హైకోర్టు అడ్డుకుంది. హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అరికొంబన్‌ను జనావాసాలకు దూరంగా పరాంబికులమ్ టైగర్ రిజర్వులో వదిలి వేయాలని సూచించింది. దీనిపైనా నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి కేరళ ప్రభుత్వం సూచనలతో.. ఆ ఏనుగును వదిలి వేసే ప్రాంతాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలన్న ప్రత్యామ్నాయం ఆచరణలోకి వచ్చింది. దీని ప్రకారం..అరికొంబన్‌కు మత్తిచ్చేందుకు శనివారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. లాభం లేకపోవడంతో అరికొంబన్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న మరో ఏనుగును తీసుకొచ్చాక సాయంత్రానికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడం సాధ్యపడింది. తర్వాత దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించి ర్యాంప్ మీదుగా వదిలిపెట్టినట్టు అధికారులు తెలిపారు. -
ఈ యువతికి ఏనుగు ఎలా జలక్ ఇచ్చిందో చూడండి!
-
పార్వతిపురం జిల్లా బందవలసలో ఏనుగుల బీభత్సం
-
‘పార్వతి’ కోసం స్విమ్మింగ్ పూల్
సాక్షి, చైన్నె : మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఏనుగు పార్వతి కోసం అతిపెద్ద స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు. రూ. 23 లక్షలతో 3,500 చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ పార్వతి ఆనంద తాండవం చేస్తూ జలకాలాటలో మునిగింది. వివరాలు.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆలయం ప్రవేశ మార్గంలో పార్వతి అనే ఏనుగు ప్రత్యేక ఆకర్షణతో కనిపిస్తుంటుంది. 2000 సంవత్సరంలో ఈ ఏనుగును ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. అమ్మవారి సేవలో నిమగ్నమైన ఈ ఏనుగు ఆరోగ్య సంరక్షణలో అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. పార్వతిలో మరింత ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపేవిధంగా ఆలయం తూర్పు గోపురం ప్రవేశ మార్గం సమీపంలోని స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ. 23 లక్షల వ్యయంతో 3,500 చదరపు అడుగుల స్థలంలో ఐదు అడుగుల లోతులో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. ఆదివారం జరిగిన పూజాది కార్యక్రమాలతో ఈ స్విమ్మింగ్ పూల్‌ను ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ ప్రారంభించారు. ఆలయ ఏనుగుకు ప్రత్యేకపూజలు , ఆహారం అందజేశారు. అనంతరం స్విమ్మింగ్ పూల్‌లోకి ఏనుగును పంపించారు. స్విమ్మింగ్ పూల్‌లో అటు ఇటు చక్కర్లు కొడుతూ ఆనంద తాండవంతో గజరాజు జలకాలాటలలో మునిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం రూ.కోటితో నిర్మించిన షెల్టర్‌ను మంత్రి ప్రారంభించారు. -
బిడ్డ జోలికి రాబోయింది.. నరకం చూపెట్టి ఉరికించింది
Elephant Viral Video: ప్రాణకోటిలో తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. ప్రశాంతతకు మారుపేరైన ఏనుగులు తమ గున్నేనుగుల్ని ఎంత భద్రంగా చూసుకుంటాయో.. వాటికి ఆపద ఎదురైనా, ఎదురవుతుందని తెలిసినా పట్టరాని ఆవేశం ప్రదర్శిస్తుంటాయి. ఎంతదాకా అయినా వెళ్తుంటాయి. తాజాగా.. అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. తల్లి పక్కనే ఉందనే భరోసాతో ఓ చిన్న నీటి మడుగులో గున్నేనుగు సేదతీరి ఉంటుంది. పక్కనే తల్లి ఏనుగు నీటిని జల్లుకుంటూ వేసవి తాపం చల్లార్చుకుంటుంది. ఇంతలో ఆ మడుగులో దాగి ఉన్న ఆపదను గుర్తించింది ఆ ఏనుగు. మొసలి ఒక్కసారిగా తల పైకెత్తడంతో.. వేగంగా స్పందించి కాలితో కసాబిసా మొసలిని తొక్కిపడేసింది. తల్లి చాటున భద్రత ఎరిగిన ఆ బిడ్డ.. అమ్మ పొత్తిళ్లలోకి చేరిపోయింది. నీళ్లలో ఉంటే ప్రాణం పోతుందనుకుందో ఏమో.. మొసలి బయటకు వచ్చి అపసోపాలు పడుతూ అక్కడి నుంచి పరారైంది. సోషల్ మీడియాలో నిత్యం ఈ తరహా వీడియోలు పోస్ట్ చేసే ఐఎఫ్ఎస్ సుశాంత నందా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఏనుగులు తమ బిడ్డలను రక్షించుకోవడంలో ఏ మేరకు ముందుకు వెళతాయన్నది మనసును కదిలించేది. ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. మొసలి లొంగిపోవలసి వచ్చింది’ అంటూ సందేశం ఉంచారాయన. ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదుగానీ ఆ వీడియోను మీరూ చూసేయండి. The extent to which elephants can go in protecting their calves is mind boggling. Here is a small incidence. The Crocodile had to surrender 👌 pic.twitter.com/ntbmBtZm9F — Susanta Nanda (@susantananda3) April 14, 2023 -
రోడ్డుపైకొచ్చిన ఒంటరి ఏనుగు.. గంటపాటు రాకపోకలకు అంతరాయం
పలమనేరు: మండలంలోని మొసలిమడుగు వద్ద పలమనేరు–గుడియాత్తం రహదారిపై శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ ఒంటరి ఏనుగు రోడ్డుపైకి వచ్చేసింది. దీంతో ఏనుగును చూసి రోడ్డుపై వాహనాలను దూరంగా ఆపేశారు. కొందరు ఆకతాయిలు ఏనుగు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. గురువారం ఏటిగడ్డ గ్రామ సమీపంలో హల్చల్ చేసిన ఒంటరి ఏనుగు కౌండిన్య నదిని దాటి శుక్రవారం మెయిన్ రోడ్డుపైకి వచ్చినట్టు స్థానికులు తెలిపారు. -
వైరల్ వీడియో: తల్లి ప్రేమ.. మొసలికే చక్కులు చూపించింది
-
అచ్చం మనిషిలానే తింటున్న ఏనుగు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఏనుగులు శాంతంగా ఉంటే ఎంత సరదాగా ఉంటాయో కోపమొస్తే గజరాజులా మారి అదే స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వీటికున్న ప్రత్యేకత ఏంటంటే మావాటి చెప్పేవి బుద్ధిగా వినడంతో పాటు వాటిని పాటిస్తాయి కూడా. వీటి ప్రవర్తన చూసి మనుషులు ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కవగా ఇష్టపడుతుంటారు. మరీ పిల్ల ఏనుగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా ఓ ఏనుగు అరటి పండు తినే తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. బెర్లిన్ జూలో ఉన్న ఓ ఏనుగు అరటి పండును తినే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. పంగ్ ఫా అనే ఆసియా ఏనుగు అరటి పండు ఇస్తుంటే.. ముందుగా అది అరటిపండు తొక్క తీసేసి ఆపై పండును మాత్రం తింటోంది. ఇది తినే తీరు చూస్తే అచ్చం మనిషిలానే తిన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉందండోయ్ పసుపు రంగులో బాగున్న అరటిపండ్లను మాత్రం తింటూ.. గోధుమ రంగు (సరిగా లేని) అరటి పండ్లను తినేందుకు ససేమిరా అంటోంది. దీన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ క్లిప్‌ను ఇప్పటివరకూ 32,000 మంది వీక్షించారు. -
ఆస్కార్ విజేతలను కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ
-
వదిలి వెళ్లొద్దంటూ యజమానిపై ఏనుగు ప్రేమ
-
గజరాజంటే ఆ మాత్రం భయం ఉండాలి
-
ఆస్కార్ అవార్డు చిత్ర నటుడు చెంతకు గున్న ఏనుగు
తమిళ సినిమా: ధర్మపురిలో తల్లికి దూరమై న ఓ పిల్ల ఏనుగును అటవీ శాఖ అధికారులు ఇటీవల ఆస్కార్ అవార్డును గెలుచుకున్న డాక్యుమెంటరీ చిత్ర నటుడు బొమ్మన్‌కు అప్పగించారు. వివరాలు.. ధర్మపురి జిల్లా ఒగెనకల్ సమీపంలోని అడవిలో సంచరించే ఏనుగు నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు పెన్నాగరం సమీపంలోని ఓ బావిలో పడిపోయిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న అధికారుల సహాయంతో గున్న ఏనుగును సురక్షితంగా బయటికి తీశారు. దాన్ని తన తల్లి ఏనుగు వద్దకు చేర్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే దాని ఆచూకీ కనుగొనడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరస్ చిత్ర నటుడు బొమ్మన్‌కు ఆ పిల్ల ఏనుగును తనకు అప్పగించవలసిందిగా అటవీ శాఖ అధికారులను కోరాడు. దీంతో అధికారులు ఆ పిల్ల ఏను గును లారీ ద్వారా ముదుమలై అడవి ప్రాంతంలోని ఏనుగుల సంరక్షణ శిబిరానికి చేర్చారు. అక్కడ ఆ పిల్ల వైద్య పరీక్షలు నిర్వహించి బొమ్మ న్కు అప్పగించారు కాగా ఇప్పటికే ఆయన ఆ శిబిరంలో రెండు గున్న ఏనుగులు ఉన్నాయి. -
ఏనుగుల గుసగుసలు విందామా?
ఏనుగులు తరాలుగా తమ జన్యువుల్లోకి చేరిన ప్రాచీన అరణ్య మార్గాల ఆధారంగా తిరుగుతాయి. ఈ మార్గాల్లో ఎన్నో ఇప్పుడు జనావాసాలుగా మారిపోయాయి. ఫలితంగా వాటి కదలికలకు చిక్కు ఏర్పడుతోంది. ఏటా 40– 50 ఏనుగులు కరెంట్ షాక్ కారణంగా చనిపోతున్నాయని అంచనా. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విద్యుదాఘాతానికి మూడు ఏనుగులు బలైన వారానికే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీకి అస్కార్ అవార్డు రావడం గమనార్హం. భారత వారసత్వ జంతువైన ఏనుగులను కాపాడుకునేందుకు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నది ఈ డాక్యుమెంటరీ ఇచ్చిన సందేశం. 2010లోనే ‘ఎలిఫెంట్ ఎక్స్పర్ట్ టాస్క్‌ఫోర్స్’ సమర్పించిన కార్యాచరణ ప్రణాళికనూ కలిసికట్టుగా అమలు చేయాలి. జంతువులేవైనా పసితనంలో అపురూప మైన ముగ్ధత్వాన్ని కలిగి ఉంటాయి. గున్న ఏనుగులైతే మరీనూ. ఒక అనాథ గున్న ఏనుగు కథ అందరినీ భావోద్వేగంతో కదిలించడంలో ఆశ్చర్యం లేదు. ఆ కథేమిటో చూడా లంటే కార్తికీ గోంజాల్వెజ్ తొలిసారి దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చూడాల్సిందే. ఆస్కార్ అవార్డు పొందిన ఈ చిన్న డాక్యుమెంటరీ ఓ అనాథ గున్న ఏనుగుకూ, వయసు మీదపడ్డ సంరక్షక దంపతులకూ మధ్య నడిచిన భావోద్వేగాల కథ. తమిళనాడు అటవీశాఖ నిర్వహిస్తున్న ఓ ఏనుగుల క్యాంపులో ఈ కథ నడుస్తుంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విద్యు దాఘాతానికి మూడు ఏనుగులు బలైన వారానికే ఈ డాక్యుమెంటరీకి అస్కార్ అవార్డు వచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ అయినది చూస్తే అందులో రెండు గున్న ఏనుగులు తల్లి, పిన్నిల దగ్గర నిలుచుని ఆ ఘటనా స్థలాన్ని వీడేందుకు అస్సలు ఇష్టపడలేదు. ఇలాంటి హృదయ విదారకమైన దృశ్యాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. పంట రక్షణ కోసం ఓ రైతు వేసుకున్న ముతక విద్యుత్తు కంచె (ఇది చట్ట వ్యతిరేకం) ఆ ఏనుగుల చావుకు కారణమైంది. సాధారణంగా ఏను గులు రాత్రుళ్లే గ్రామీణ జనావాసాలను దాటుతుంటాయి. ఆ డాక్యుమెంటరీలో చూపిన గున్న ఏనుగు రఘు కూడా విద్యు దాఘాతం వల్లనే తల్లిదండ్రులను కోల్పోయాడు. బలహీనంగా ఉన్నా డన్న కారణంగా మంద వదిలేసింది. సకాలంలో తమిళనాడు అటవీ శాఖ ఆదుకోవడం రఘు చేసుకున్న అదృష్టం. ఈ అదృష్టం దక్కని ఏనుగు పిల్లలు బోలెడున్నాయి. డాక్యుమెంటరీలో చూపిన బెల్లీ, బొమ్మన్ దంపతులు మధుమలై అటవీ ప్రాంతంలోని తెప్పకాడు ఏను గుల క్యాంపులో పనిచేస్తున్నారు. వీరు ఏనుగులకు తర్ఫీదునిచ్చే కుట్టనాయకన్ తెగకు చెందినవారు. ప్రాణాలు తీస్తున్న కరెంటు ‘స్ట్రైప్స్ అండ్ గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్ ’ వ్యవస్థాపకుల్లో ఒకరైన సాగ్నిక్ సేన్ గుప్తా సమాచార హక్కు చట్టం కింద తెలుసుకున్న సమాచారం ప్రకారం, 2012–13 నుంచి 2022–23 మధ్యకాలంలో దేశం మొత్త మ్మీద 630 ఏనుగులు విద్యుదాఘాతాల కారణంగా మరణించాయి. అత్యధికంగా అసోం (120), ఒడిశా (106), తమిళనాడు (89) ఇందులో ఉన్నాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. కొంతమంది నిపుణుల అంచనాల ప్రకారం ఏటా కనీసం 40– 50 ఏనుగులు కరెంట్ షాక్ కారణంగా చనిపోతున్నాయి. ‘నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్’ మాజీ అధ్యక్షుడు బిశ్వజీత్ మొహంతి ఒడిశాలో ఏనుగుల ఊచకోతలు, విద్యుదాఘాతాలపై చాలాకాలంగా గళమెత్తుతున్నారు. 2019–22 మధ్యకాలంలోనే ఈ రాష్ట్రంలో 245 ఏనుగులు హతమై నట్లు స్వయంగా ఆ రాష్ట్ర మంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విషయం ఇక్కడ గమనార్హం. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు దేశం మొత్తమ్మీద రాత్రిపూట వెలుగులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని ‘నాసా’ తయారు చేసే ‘నైట్ టైమ్ లూమినాసిటీ’ మ్యాపులు చెబుతున్నాయి. 2021–22 ఎకనమిక్ సర్వే పదకొండవ ఛాప్టర్లో వెల్లడించిన ప్రకారం, రాత్రి పూట ప్రకాశం అనేది పదేళ్ల క్రితంతో పోలిస్తే 40 శాతం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో ఈ కృత్రిమ విద్యుత్తు వెలుగులు ఎక్కువైన కొద్దీ ప్రకృతికి జరిగే నష్టం కూడా అంతే పెరుగుతోంది. వేలాడే విద్యుత్తు తీగలు జీవజంతువులకు కలిగించే నష్టం దీనికి అదనం. ఈ అనవసర ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఇన్సులేషన్‌తో కూడిన విద్యుత్తు తీగలను వాడాలనీ, లేదా భూగర్భ కేబులింగ్‌ను ఉపయోగించాలనీ 2019లోనే ‘నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్’ సూచించింది. దారి తప్పిస్తున్న పరిస్థితులు వాస్తవానికి ఏనుగులను ఒకచోట బంధించి, లేదా నియంత్రించి ఉంచడం సాధ్యం కాదు. అవి సంచారజాతికి చెందిన భారీ జీవాలు. తరాలుగా తమ జన్యువుల్లోకి చేరిన ప్రాచీన అరణ్య మార్గాల ఆధారంగా తిరుగుతూంటాయి. ఈ మార్గాల్లో ఎన్నో ఇప్పుడు జనావాసా లుగా మారిపోయాయి. ఫలితంగా వాటి కదలికలకు చిక్కు ఏర్పడింది. ఏనుగుల్లాంటి భారీ క్షీరదాలను కాపాడుకోవాలంటే అడవుల మధ్య అనుసంధానత చాలా కీలకం. మన అభివృద్ధి పనుల కారణంగా అటవీ ప్రాంతాలు తగ్గిపోతూండటంతో సమస్యలేర్పడుతున్నాయి. గత నెలలో హరిద్వార్ ప్రాంతంలో ఏనుగుల మంద ఒకటి, పిల్ల ఏనుగులతో కలిసి కాంక్రీట్ జనారణ్యాన్ని దాటేందుకు నానా తిప్పలు పడటం ఓ వీడియోలో బంధితమైంది. ఆసియా ఏనుగుల సంఖ్య దేశంలో సుమారు 27–30 వేల వరకూ ఉంటుందని అంచనా. అయితే అభయారణ్యాలు, జాతీయ పార్కుల్లో కంటే ఇతర ప్రాంతాల్లోనే చాలా ఏనుగులు ఉంటాయన్నది చాలామందికి తెలియదు. ఒక అంచనా ప్రకారం మొత్తం ఏనుగుల్లో సురక్షిత ప్రాంతాల బయట ఉన్నవి 70 – 80 శాతం. మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణ పెరుగుతూండటం; పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, ఒడిశా, తమిళనాడుల్లో వీటి సంరక్షణ కీలకమైన స్థితికి చేరుకోవడం ఆందోళనకరమైన అంశమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏనుగు తల ఉన్న వినా యకుడిని మనం ఇంట్లో పూజిస్తాం. కానీ అడవుల్లో నివసించే ఏనుగు లంటే మాత్రం ప్రేమ చూపం. వాతావరణ మార్పుల కారణంగా సహజసిద్ధంగా అడవుల్లో లభించే తిండి కూడా తగ్గిపోవడంతో ఇవి మనిషి పండించే పంటలకు అలవాటు పడిపోతున్నాయి. ఈ అటవీ ఏనుగుల సమస్య పరిష్కారమెలాగో అధికారులకూ అంతుపట్టడం లేదు. కొంతమంది నిపుణుల అంచనాల ప్రకారం, అటవీ ఏనుగుల జనాభా కూడా పెరుగుతోంది. వీటికి కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టడం గురించిన సాధ్యాసాధ్యాలపై ఒకవైపు చర్చ నడుస్తూండగా, వాటిని వధించాలన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కాగితాలకే పరిమితమైన సూచనలు మనుషుల్లాగే ఏనుగులూ కుటుంబాలతో కూడి ఉంటాయి. సున్నిత మైన మనస్తత్వంతో కూడిన తెలివైన జాతి అది. మనుషులతో ఘర్షణ సందర్భంలో విద్యుదాఘాతానికి గురై తల్లిదండ్రులను కోల్పోతే ఓ గున్న ఏనుగు ఎంత మానసిక ఇబ్బందికీ, ఆవేదనకూ గురవుతుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఏనుగు పిల్లలు ప్రతికూల వాతావరణంలో పెరిగితే ఎదురయ్యే పరిణామాలను ఊహించడం కూడా కష్టమేమీ కాదు. 2010లో ఎలిఫెంట్ టాస్క్‌ఫోర్స్ ‘గజ: సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఫర్ ఎలిఫెంట్స్ ఇన్ ఇండియా’ పేరుతో ఒక నివేదికను సమర్పించింది. చాలా సలహా సూచనలు చేసింది కానీ ఆసియా ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించడం ఒక్కటే అమల్లోకి వచ్చింది. తాజాగా ఏనుగుల ఆవాసాలున్న దేశాల నిపుణులు ‘11వ ఆసియన్ ఏలిఫెంట్ స్పెషలిస్ట్ గ్రూప్ మెంబర్స్’ సమావేశాలు ఇండియాలో జరపనున్నారు. అలాగే ఏప్రిల్ 6, 7 తేదీల్లో కాజీరంగా నేషనల్ పార్క్‌లో బ్రహ్మాండమైన ‘గజ్ ఉత్సవ్’ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏనుగుల సంరక్షణకు ఇవి సరిపో తాయా? ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ ఇస్తున్న సందేశం, సంకేతం ఒక్కటే. వేర్వేరు ప్రభుత్వ విభాగాల మధ్య అత్యవసరంగా సమన్వయం కుదరాలి. కలిసికట్టుగా జాతీయ వారసత్వ జంతువైన ఏనుగును కాపాడుకునేందుకు టాస్క్‌ఫోర్స్ నివేదికలోని సలహా సూచ నలు అమలు చేయాలి! వ్యాసకర్త రచయిత, వైల్డ్‌లైఫ్ కన్సర్వేషనిస్ట్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
విశ్వవేదికపై ఏనుగుఘీంకారం.. మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ?
ఏనుగుకి, మనిషికి మధ్య ఉండే భావోద్వేగ బంధం ప్రపంచాన్ని కదిలించింది. విశ్వవేదికపై ఏనుగుఘీంకారం ఆస్కార్ కుంభస్థలాన్ని కొట్టింది.డాక్యుమెంటరీలు తీసే వారికి ఎలిఫెంట్ విస్పరర్స్వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. మనిషికి, జంతువుకి, ప్రకృతికి మధ్య ఉండే గాఢానుబంధం మరోసారి చర్చకు వచ్చింది. మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ?ఏనుగుల సంరక్షణ ఏ విధంగా ఉంది ? ఏనుగంటే మనకి ఒక జంతువు కాదు. అంతకంటే ఎక్కువే. గణనాథుడి మారురూపంగా గజరాజుల్ని పూజిస్తాం.. ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు మంచినీళ్లు తాగింది ఏనుగూ అంటూ ఏనుగు మనకెంత ముఖ్యమైనదో చిన్నప్పట్నుంచి ఉగ్గుపాలతో నేర్పిస్తాం. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏనుగుని చూడడమంటే అదొక సంభ్రమం. కానీ ఏనుగుల్ని కాపాడుకోవడంలో మనం అంతగా శ్రద్ధ కనబరచడం లేదనే చెప్పాలి. ఏనుగు దంతాల కోసం వాటిని వేటాడడం, ఏనుగుల ఆవాసాలైనా కారిడార్లను ఆక్రమించుకోవడం, ఏనుగుల కారిడార్లలోనే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం వంటి చర్యలతో ఏనుగుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. సంరక్షణకి ఏం చేస్తున్నాం ? జీవవైవిధ్యానికి అత్యంత కీలకమైన ఏనుగుల్ని కాపాడుకోవడానికి 1992లో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ రిజర్వ్ ప్రాజెక్టు 30 ఏళ్లవుతున్నప్పటికీ అతీగతీ లేకుండా ఉంది. ఏనుగుల్ని కాపాడుకోవడానికి మనకి ప్రత్యేకంగా చట్టాలేమీ లేవు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం పరిధిలోకే ఏనుగులూ వస్తాయి. దీంతో ఏనుగులు ఆవాసం ఉండే కారిడార్లు, వాటి సంరక్షణకు ఏర్పాటు చేసిన రిజర్వ్‌ల నిర్వహణలన్నీ తూతూ మంత్రంగా జరిపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఏనుగులెంత కీలకమో గ్రహించిన కేంద్రం 2010లో ఏనుగుని జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించింది. ఏనుగుల సంరక్షణ విధానాలను సమీక్షించడానికి ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ (ఈటీఎఫ్)ని ఏర్పాటు చేసింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని మార్చాలని, ఏనుగుల సంరక్షణ కోసం జాతీయ ఏనుగుల పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అయితే నిధుల కొరతతో ఆ చర్యలేవీ కేంద్రం తీసుకోలేదు. ప్రతీ ఏడాది ఏనుగుల సంరక్షణ కోసం రూ.30–35 కోట్ల నిధుల్ని మాత్రమే కేటాయిస్తున్నారు. 2020లో వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో ఏనుగుల రిజర్వ్‌లను చేరుస్తూ సవరణలు చేశారు. 2022, ఆగస్టు 2న సవరణ బిల్లుని లోక్‌సభ ఆమోదించింది. అంతకు మించి ఏనుగుల రక్షణకు ప్రత్యేకంగా చర్యలేవీ తీసుకోలేదు.. ఏనుగులు, మనుషులకి మధ్య ఘర్షణ ఏనుగులకి, మనుషులకి మధ్య నిత్యం ఒక ఘర్షణ నెలకొని ఉంటుంది. మనిషి ఎప్పుడైతే అడవుల్ని కూడా ఆక్రమించడం మొదలుపెట్టాడో ఏనుగులు గుంపులు గుంపులుగా పంట పొలాలపైకి పడడం, రైతుల్ని తమ కాళ్ల కింద పడి తొక్కేసి ప్రాణాలు తీయడం వంటివి చేస్తున్నాయి. దీంతో రైతులు ఏనుగుల బారి నుంచి పంటల్ని కాపాడడానికి విద్యుత్ కంచెలు , కందకాలు ఏర్పాటు వంటివి చేయడంతో అవి చనిపోతున్నాయి. ఇక ఏనుగు దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉండడంతో వాటిని అక్రమంగా వేటాడుతున్న వారూ ఉన్నారు. ఏనుగుల కారిడార్లలో రైల్వే ట్రాక్‌లు ఉండడంతో అవి బలైపోతున్నాయి. 1987–2017 మధ్య కాలంలో రైల్వే ట్రాక్‌ల కింద పడి 265 ఏనుగులు మరణించాయి. ఏనుగులు జరిపే దాడుల్లో ఏడాదికి సగటున 500మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ప్రజల చేతుల్లో ఏడాదికి సగటున 100 గజరాజులు మరణిస్తున్నాయి. ఏనుగుల్ని మరింత సంరక్షించాలంటే, అవి ప్రజలు, పంట పొలాల జోలికి రాకుండా ఉండాలంటే ఏనుగులుండే కారిడార్లను పటిష్ట పరచాల్సి ఉంది. దేశంలో 110 ఏనుగు కారిడార్లు ఉన్నప్పటికీ 70% మాత్రమే వినియోగంలో ఉన్నాయి. 29% కారిడార్లు ఆక్రమణకి లోనయ్యాయి. 66% కారిడార్లలో జాతీయ రహదారుల వెంబడి వెళుతున్నాయి. 22 కారిడార్లలో రైల్వే లైన్లు ఉన్నాయి. ఏనుగుల తినే తిండి ఎక్కువ కావడంతో అవి ప్రతీ రోజూ చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. అవి సంచరించే మార్గాల్లో జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లు, మైనింగ్ తవ్వకాలు, కాలువలు, ఫెన్సింగ్‌లు ఉండడం వాటికి దుర్భరంగా మారింది. రైళ్లు, వాహనాల కింద పడి ప్రమాదవశాత్తూ మరణిస్తున్నాయి. అందుకే ఏనుగులు సంచరించే కారిడార్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల్లో ఏనుగుల సంచారం కోసమే ప్రత్యేకంగా వంతెనలు నిర్మించడం విశేషంగా చెప్పుకోవాలి - సాక్షి, నేషనల్ డెస్క్ -
అంబారీ ఎక్కి ఆస్కార్ వచ్చింది.. తొలిసారి భారత డాక్యుమెంటరీకి..
‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ నిడివి 39 నిమిషాలు. రెండు ఏనుగు పిల్లలు, నీలగరి అడవుల్లో ఉండే ‘కట్టు నాయకర్’ అనే తెగకు చెందిన ఆదివాసీ భార్యాభర్తలు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తారు. ఆ భార్యాభర్తల పేర్లు బొమ్మన్, బెల్లి. ఏనుగు పిల్లల్లో ఒకదాని పేరు రఘు, మరోదాని పేరు అమ్ము. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. అయితే డాక్యుమెంటరీలో ఎక్కువ భాగం రఘతో బొమ్మన్, బెల్లిలకు ఉండే అనుబంధం చూపుతుంది. అయితే నేపథ్యంలో అందమైన అడవులు, వాగులు, ఆదివాసీల క్రతువులు ఇవన్నీ దర్శకురాలు కార్తికి చూపడంతో డాక్యుమెంటరీకి ఒక సంపూర్ణత్వం వచ్చింది. బొమ్మన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఇప్పుడు రఘు, అమ్ములను అటవీ శాఖ వారు ‘ముడుమలై టైగర్ రిజర్వ్’కు మార్చారు. దాంతో రఘుతో ఆ దంపతుల బంధం తెగింది. విఘ్నాలు తొలగిపోయాయి. పూర్తిగా ఇండియాలో నిర్మితమైన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ అందింది. ఇది స్త్రీల ద్వారా జరిగింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది కార్తికి గోంజాల్వేజ్. నిర్మించింది గునీత్ మోంగా. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు అనే అనాథ ఏనుగు పిల్ల. ఆ ఏనుగు పిల్లను సాకిన ఆదివాసి దంపతులు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధం ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా వ్యక్తమైంది. అందుకే అంబారీ ఎక్కి వచ్చినట్టుగా మనకు ఆస్కార్ ఘనంగా దక్కింది. ఏనుగులు– మావటీలు మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నారు. కాని వారి మధ్య ఉన్నది ఒక రకమైన ప్రొఫెషనల్ స్నేహం. కాని కొన్ని సందర్భాలలో అనాథలైన ఏనుగు పిల్లలను కాపాడే పని ఆదివాసీలు తీసుకుంటారు. వారిది పెంచిన మమకారం. ఆ మమకారమే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కథాంశం. దర్శకురాలు కార్తికీది ఊటి. అక్కడే పుట్టి పెరిగింది. ఊటీకి అరగంట ప్రయాణ దూరంలో ‘తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్’ ఉంది. అక్కడ ఏనుగులను సంరక్షిస్తుంటారు. కార్తికి గోంజాల్వేజ్ చిన్నప్పటి నుంచి ఆ క్యాంప్‌కు వెళ్లి ఏనుగులను చూసేది. ఆ తర్వాత ఆమె పెరిగి పెద్దదయ్యి ఫొటోగ్రాఫర్‌గా మారినా, కెమెరా ఉమన్‌గా తనకున్న వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఇష్టం వల్ల యానిమల్ ప్లానెట్, డిస్కవరీ చానల్స్‌లో పని చేసినా ఎప్పుడూ తన ప్రాంత ఏనుగుల మీద ఏదైనా ఫిల్మ్ చేయాలని అనిపించలేదు. కాని 2017లో అందుకు బీజం పడింది. అతడు – ఆ ఏనుగు పిల్ల కార్తికి గోంజాల్వేజ్ 2017లో బెంగళూరు నుంచి కారులో ఊటీకి వెళుతోంది. ఊటీ చేరుకుంటూ ఉండగా ఒక మనిషి చిన్న ఏనుగు పిల్లను నడిపించుకుంటూ వెళుతూ ఆమె కంట పడ్డాడు. కార్తికి వెంటనే కారు ఆపి ఈ మనిషి ఈ ఏనుగు పిల్లను ఎక్కడకు తీసుకువెళుతున్నాడు అని వెంబడించింది. వారిద్దరూ దగ్గరిలోని ఏటికి వెళ్లారు. ఆ మనిషి ఆ ఏనుగు పిల్లకు చంటిపిల్లలకు మల్లే స్నానం చేయించాడు. దానితో ఎన్నో కబుర్లు చెప్పాడు. ‘అరె.. ఈ బంధం భలే ఉందే’ అనిపించింది కార్తికికి. అతణ్ణి పలకరించింది. పేరు బొమ్మన్. ఆ ఏనుగు పిల్ల పేరు రఘు. ఆ ఏనుగు పిల్ల ఇటీవలే అనాథ అయ్యింది. పంటలను కాపాడుకోవడానికి పెట్టిన కరెంటు తీగల బారిన పడి రఘు తల్లి మరణించింది. అనాథ అయిన రఘు తల్లి వియోగంతో కృశించి చావుకు దగ్గరగా ఉండగా బొమ్మన్‌కు కనిపించాడు. దానిని ఇంటికి తీసుకెళ్లాడు. బొమ్మన్ భార్య బెల్లి రఘుకు తల్లిలా మారింది. ఆ ముగ్గురు ఒక కుటుంబం అయ్యారు. ఇలాంటి అనుబంధాలు చూపితే మనిషి, జంతువు కలిసి మెలిసి మనుగడ సాగించాల్సిన అవసరాన్ని చూపినట్టు అవుతుందని కార్తికి అనుకుంది. వెంటనే డాక్యుమెంటరీ నిర్మించడానికి నెట్‌ఫ్లిక్స్‌ను సంప్రదించింది. నెట్‌ఫ్లిక్స్ తన కో ప్రొడ్యూసర్‌గా నిర్మాత మోంగాను సంప్రదించింది. అలా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ నిర్మాణం మొదలైంది. ఢిల్లీకి చెందిన గునీత్ దాదాపు పదేళ్లుగా అంతర్జాతీయ దృష్టి పడే సినిమాల నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. ఆమె నిర్మాణ భాగస్వామి అయిన ‘కవి’ (2010) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్‌లో ఆస్కార్ నామినేషన్ పొందగా, ‘పిరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ (2018) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌గా ఆస్కార్ అవార్డ్ పొందింది. అయితే ‘పిరియడ్’కు పని చేసిన సాంకేతిక నిపుణులు భారతీయులు కారు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ను తీయాలనుకుంటున్న కార్తికితో పని చేయడం వల్ల ఈసారి పూర్తి భారతీయ నిర్మాణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని గునీత్ భావించింది. అలా వీరిద్దరు కలిసి పూర్తి చేసిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 8, 2022న విడుదలైంది. ఇది డాక్యుమెంటరీ వేవ్ ‘ఇప్పుడు ఇండియాలో నడుస్తున్నది డాక్యుమెంటరీ వేవ్. ఫీచర్ ఫిల్మ్స్‌లో కన్నా డాక్యుమెంటరీలో భారతీయ దర్శక నిర్మాతలు వినూత్నమైన కథాంశాలను చెబుతున్నారు’ అంటుంది గునీత్. కార్తికి మాట్లాడుతూ– ‘ఏనుగులు ఎంత తెలివైనవో ఎంత భావోద్వేగంతో బంధంతో ఉంటాయో నా డాక్యుమెంటరీలో చూపించాను. ఇక మీదటైనా అవి వేరు మనం వేరు అనుకోకపోతే చాలు’ అంది. ‘నేను తీసే ఫిల్మ్స్ ఇకపై కూడా ఇలాంటి కథాంశాలతో ఉంటాయి’ అన్నారు. చదవండి: ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ -
అక్కడ ఏనుగులకు టోల్ ఫీజు ఇవ్వాల్సిందే! లేదంటే..
-
ఏనుగు ఘీంకారం! క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయేవే... ఆ పసిపాప ఏడవడంతో..
తిరువనంతపురం: కేరళలోని అన్నైకట్టి ప్రాంతంలో అడవిజంతువులకు తాగునీరు కరువవడంతో జనావాసాల్లోకి చొరబడి దాడులు చేస్తున్నాయి. ఈ ఘటనలను కట్టడిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో వన్యమృగాల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అన్నైకట్టిలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగుచూసింది. అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన భారీ ఏనుగు మంగళవారం ఉదయం 4 గంటలకు ఓ ఇంటి సమీపంలో ఘీంకరించింది. ఆ చప్పుడు విన్న బాలామణి అనే మహిళ ఏం జరిగిందో తెలుసుకుందామని తన తమ్ముడి కూతురిని కూడా వెంటేసుకుని పరుగున బయటకు వచ్చింది. ఒక్కసారిగా ఏనుగు వారివైపు తిరిగి.. ఆమెను కింద పడేసింది. బాలామణికి కొద్దిదూరంలోనే ఆ పసిపాప కూడా ఉంది. అది గనుక దాడిచేస్తే క్షణాల్లో ఆమె ప్రాణాలు గాల్లో కలిసేవే! అయితే, అదృష్టవశాత్తూ బాలామణి ప్రమాదం నుంచి బయటపడింది. భయానక ఘటనతో వణికిపోయిన ఆ పసిపాప బిగ్గరగా ఏడ్చింది. అది చూసిన ఆ ఏనుగు బాలామణికి హాని తలపెట్టకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అన్నైకట్టి కొండ ప్రాంతం. అయితే, అక్కడి వన్యప్రాణులకు తాగేందుకు సరిపడా నీరులేకపోవంతో అవి జనావాసాల్లోకి చొరబడి దాడులు చేయడం మామూలైపోయింది. ప్రభుత్వాలు తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. షాక్ తిన్నా! తర్వాత ఏమైందో తెలియదు ‘భారీ శబ్దం వినిపిస్తే ఏమైందో చూద్దామని బయటికి వెళ్లాను. నాతోపాటు నా తమ్ముడి కూతురు కూడా ఉంది. ఏనుగును చూసి అక్కడ నుంచి పరుగెత్తుకెళ్దామనే లోపే అది తన తొండంతో నన్ను కిందకు తోసేసింది. ఒక్కసారిగా షాక్ తిన్నా! తర్వాత ఏమైందో స్పృహ లేదు. కాసేపటికి మా చిన్నదాని ఏడుపు విని మెలకువ వచ్చింది. ఆ దేవుడే మమ్మల్ని రక్షించాడు’ అని బాలామణి చెప్పుకొచ్చింది. -
రోడ్డుపై ఏనుగు బీభత్సం.. బొలెరో వాహనాన్ని ఒక్కసారిగా ఎత్తిపడేసి..
-
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం
-
Viral Video : కారు ఎక్కి కూర్చున్న ఏనుగు
-
ఏనుగు విగ్రహం కింద ఇరుక్కొని నానా అవస్థలు
-
గుడిలోనే భక్తుడి కష్టాలు.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కొని నానా అవస్థలు
సాధారణంగా కష్టాలు తొలగించి మంచి జీవితాన్ని అందించమని దేవుడిని ప్రార్థిస్తుంటారు. దైవానుగ్రహం కోసం తరచుగా పుణ్యక్షేత్రాలను సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. దేవుడిని స్మరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే భగవంతుడి ఆశీస్సులు ఉండాలని గుడికి వెళ్లిన ఓ వ్యక్తికి దేవాలయంలోనే ఓ వింత కష్టం ఎదురైంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆలయంలో ఓ ఏనుగు విగ్రహం ఉండగా.. ఆచారంలో భాగంగాఆ విగ్రహం కింద నుంచి పడుకొని బయటకు వస్తే మంచి జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతుంటారు. ఆ వ్యక్తి కూడా అలాగే నమ్మి ఏనుగు విగ్రహం కిందకు వెళ్లాడు. కానీ ముందుకు వెనక్కి రాలేక విగ్రహం మధ్యలో చిక్కుకుపోయాడు. కొంత సేపటి వరకు అలాగే ఇరుక్కుపోయి నానా అవస్థలు పడ్డాడు. శరీరాన్ని ఇటు ఇటు తిప్పుతూ ఉక్కిరిబిక్కిరైపోయాడు. బయటకు రావడానికి చాలా ప్రయత్నించినా వీలు పడలేదు. అతని బాధలు చూసిన తోటి భక్తులు, పూజారి సలహాలు సూచనలు కూడా చేశారు. కానీ ప్రయోజనం లేదు. Any kind of excessive bhakti is injurious to health 😮 pic.twitter.com/mqQ7IQwcij — ηᎥ†Ꭵղ (@nkk_123) December 4, 2022 దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సదరు వ్యక్తి విగ్రహం నుంచి బయట పడేందుకు పడుతున్న కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చివరికి ఆ వ్యక్తి మరి విగ్రహం నుంచి బయటకు వచ్చాడా అనేది తెలియరాలేదు. వీడియో అక్కడికే ముగియడంతో సస్పెన్స్‌గా మిగిలిపోయింది. కాగా 2019లో అదే విగ్రహం కింద ఓ మహిళ ఇరుక్కుపోయింది. విగ్రహం నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరికి పలువురు ఆమెకు సాయం చేయడం ద్వారా సురక్షితంగా బయటపడింది. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. చదవండి: ఒకే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన కవలలు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్