ఏంటీ మొద్దు ఫొటో? ఇంత పెద్దగా పెట్టారు అనుకుంటున్నారా? అది మొద్దు కాదండి బాబు.. ఏనుగు దంతం. 5 లక్షల ఏళ్ల కిందటి ఈ ఏనుగుదంతం ఇజ్రాయెల్‌లో తవ్వకాల్లో బయటపడింది. 4 లక్షల ఏళ్ల కిందటే అంతరించిపోయిన అరుదైన ఏనుగు దంతం ఇది. సాధారణంగా ఆఫ్రికాలోని అతి పెద్ద ఏనుగుల దంతం సగటున ఐదు నుంచి ఆరడుగుల పొడవు, 25 నుంచి 30 కిలోల బరువు ఉంటుంది.
కానీ.. ఎనిమిదన్నర అడుగుల పొడవు, 150 కిలోల బరువు ఉంది. దాని పక్కనే ఆ కాలంలో ఆదిమ మానవుడు జంతువులను, పెద్ద పెద్ద ఏనుగులను సైతం కోసేందుకు ఉపయోగించిన రాతి వస్తువు కూడా దొరికింది. దంతం సైజును బట్టి... ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్న ఏనుగుల కంటే ఆ ఏనుగులు చాలా పెద్దవై ఉంటాయని చరిత్రకారులు చెబుతున్నారు. సాధారణంగా తినడానికి, నిల్వ చేసుకోవడానికైనా చిన్నచిన్న జంతువులను వేటాడతారు. ఇంత పెద్ద ఏనుగును వేటాడి ఆ మాంసం నిల్వ చేయడం కష్టసాధ్యమైన పని. అదో పెద్ద సామూహిక ఉత్సవం కోసం జరిగిన వధ అయి ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment